ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే.. | US Man Finds Rs 57 Crore Lottery Ticket Days Before Expiry Goes Viral | Sakshi
Sakshi News home page

ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..

May 20 2026 10:10 AM | Updated on May 20 2026 11:27 AM

US Man Finds Rs 57 Crore Lottery Ticket Days Before Expiry Goes Viral

ఒక్కోసారి లక్కు ఎలా ఉంటుందో చెప్పలేం. మనం అంతగా పట్టించుకోకపోయినా..ఎవరో అపరిచిత వ్యక్తలు ద్వారా అయినా అదృష్టం తన్నుకుంటూ వచ్చేస్తుంది. మనం మర్చిపోయినా..రేయి ఈ సొమ్ము నీదే రా అంటూ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలాంటి సంఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. 

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన వ్యక్తి గతేడాది మే నెలలో లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. ఆ విషయాన్ని ఒక ఏడాది పాటు పూర్తిగా మర్చిపోయాడు. అయితే ఒక రోజు తరుచుగా వెళ్లే గ్యాస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చాడు. అక్కడ ఒక లాటరీ టికెట్‌ జాక్‌పాట్‌ గెలుచుకున్నా..ఎవరు క్లైయిమ్‌ చేసుకోలేదని, గడవు ముగియనుందంటూ ఓ ప్రకటన కనిపించింది  అది ఈ వ్యక్తి కంట పడింది. దాని గురించి అక్కడి లాటరీ అధికారులను ఆరా తీయగా. 

అది పిక్‌ -6 లాటరీ టికెట్‌ అని రెగ్యులర్‌ కస్టమర్లు మాత్రమే దీన్ని ఎంచుకుంటారని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఆ విషయం ఈ వ్యక్తికి గుర్తొచ్చి వెంటనే ఇంట్లోని ప్రతి అణువు గాలించాడు. అప్పుడే పాత ఫ్యాంటు జేబులో నలిగిపోయిన లాటరీ టికెట్‌ అతడి కంటపడింది. జాక్‌పాట్‌ గెలుచుకున్న లాటరీ టికెట్‌ నెంబర్‌తో సరిపోల్చుకుంటే ఆ టికెట్‌ అదే అని తేలడంతో ఏకంగా రూ. 57 కోట్లు డబ్బు దక్కించుకున్నాడు. 

ఒక వేళ్ల తేలిగ్గా తీసుకుంటే అంత భారీ సోమ్ము త్రటిలో చేజారిపోయేది. ఇది మాములు లక్కు కాదు కదా..!. అదృష్టం ఉంటే అది ఎలాగైన మన తలుపు తడుతుందంటే ఇదే కదూ.!. చాలామంది విజేతలు ఇలానే తమ లాటరీ టికెట్ల గురించి మర్చిపోవడం వల్ల చాలామటుకు అలానే క్లైయిమ్‌ చేసుకోకుండా ఉండిపోతాయని చెబుతున్నారు అధికారులు.

(చదవండి: బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement