ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! | Oracle India Layoffs And What Employees Say They Received as Severance | Sakshi
Sakshi News home page

ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

Apr 2 2026 5:37 PM | Updated on Apr 2 2026 6:24 PM

Oracle India Layoffs And What Employees Say They Received as Severance

చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇదేబాటలో దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా అడుగులువేసింది. ఈ ప్రభావం ఏకంగా 30వేలమంది ఎంప్లాయిస్ మీద పడుతుంది. ఇందులో 12000 ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వారికి లభించే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒరాకిల్ తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. లేఆఫ్స్ ప్రక్రియలో అనేక మంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ సిస్టమ్ యాక్సెస్ కోల్పోయి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జాబ్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. ఇందులోనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కూడా వివరించారు.

''కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా.. వాడని సెలవుల మొత్తాన్ని నగదుగా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి తొలగింపు సమయంలో నోటీస్ పీరియడ్‌కు బదులుగా ఒక నెల జీతం కూడా అందజేస్తారు. ఉద్యోగి అర్హత ఉన్నట్లయితే గ్రాచ్యుటీ కూడా లభిస్తుంది. ఇంకా.. తొలగింపు తేదీ వరకు ఉన్న పెండింగ్ జీతం కూడా పూర్తిగా చెల్లిస్తారు'' అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.

కంపెనీ నుండి రెండు నెలల అదనపు ఎక్స్‌గ్రేషియా (ప్రత్యేక పరిహారం) కూడా లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం పొందడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం అనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన షరతుగా కనిపిస్తోంది. అలాగే సుమారు రూ.20,000 వరకు ఇన్సూరెన్స్, ఒక నెల గార్డెనింగ్ లీవ్ జీతం లేదా దానికి సమానమైన పరిహారం కూడా ఇవ్వనున్నట్లు మరికొందరు ఉద్యోగులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్‌ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Advertisement
 
Advertisement
Advertisement