ఆఫీస్‌ అమ్మేసిన సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు | Salman Khan Brother Sohail Khan Sells Office Space For Rs 5 9 Crore In Mumbai | Sakshi
Sakshi News home page

ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్‌ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Apr 2 2026 2:38 PM | Updated on Apr 2 2026 3:02 PM

Salman Khan Brother Sohail Khan Sells Office Space For Rs 5 9 Crore In Mumbai

సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే కొందరు అవకాశం వచ్చినప్పుడు స్థలాలు, భూములు, ఇల్లు కొనుగోలు చేసి.. తమకు అవసరం వచ్చినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఉన్న ఒక కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని విక్రయించారు.

రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. సోహైల్ ఖాన్ రూ. 5.90 కోట్లకు ఆఫీస్ స్పేస్ విక్రయించారు. ఇది లింక్ రోడ్‌లోని ఆర్క్ వన్ భవనంలో 1559 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని బిల్కిష్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు.

ఈ లావాదేవీ మార్చి 27, 2026న నమోదయ్యాయి. దీనికి గాను రూ.35.40 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. 2025 అక్టోబర్‌లో, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ. 22 కోట్లకు విక్రయించారు. సద్గురు డెవలపర్స్ అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కార్పెట్ భవనంలో ఉన్న ఈ ఆస్తి, సుమారు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దీనిని శివాయ సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement