breaking news
mumbai
-
Mumbai: 75 అడుగుల ఫ్లైఓవర్ నుంచి కిందపడిన కారు వీడియో వైరల్
-
ద్వారక థీమ్‌లో నీటి అడుగున వినాయకుడు.. భారీగా జనం క్యూ..
ముంబై: ముంబైలోని ప్రసిద్ధ గణేశ మండపాల్లో ఒకటైన శివ్డీ చా రాజా (Shivdi Cha Raja).. ఈ వినాయక చవితికి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు నీటి అడుగున కొలువైన పురాతన ద్వారకా నగరం థీమ్‌తో భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. గత 75 ఏళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన కమిటీ నిర్వాహకులు ఈ ఏడాది భక్తులకు సరికొత్త అనుభూతిని అందించాలనే సంకల్పంతో ఈ వినూత్న మండపాన్ని తీర్చిదిద్దారు. #WATCH | Mumbai: Immersive visual details of the underwater Dwarka theme created at the 'Shivdi Cha Raja' pandal in Mumbai.Marking its 75th anniversary, the mandal has crafted a unique subaquatic experience featuring the Ganpati idol amidst artificial marine ruins and sea life.… pic.twitter.com/QotxTWc7HK— ANI (@ANI) September 20, 2026గోమతి నది, అరేబియా సముద్రం మధ్య నీటి గర్భంలో మునిగిపోయిన పౌరాణిక ద్వారకా నగరాన్ని తలపించేలా ఈ మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వినాయక విగ్రహంతో పాటు కృత్రిమ సముద్ర జీవులు, జలచరాలు, చారిత్రక శిథిలాల నమూనాలను ఏర్పాటు చేసి నీటి అడుగున ఉన్న వాతావరణాన్ని కళ్లకు కట్లినట్లు ఏర్నాటు చేశారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈ విభిన్నమైన విజువల్ సెట్టింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని ఈ వేదిక భక్తులకు కల్పిస్తోంది.#WATCH | Mumbai: Shivdi Cha Raja Mandal president Shrikant Jadhav said, "This year marks the 75th anniversary of 'Shivdi Cha Raja'. Over these 75 years, through the 'Raja Mandal', we have undertaken numerous social initiatives annually. This year, we decided to do something… https://t.co/0HAxxgXXWR pic.twitter.com/LmsYnaATpv— ANI (@ANI) September 21, 2026శివ్డీ చా రాజా దర్శనంతో పాటు ఈ ప్రత్యేక ద్వారకా నగరం ప్రదర్శనను తిలకించేందుకు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా మొత్తం 11 రోజుల పాటు ఈ వినాయకుడి ప్రతిమ మండపంలోనే పూజలందుకుంటుంది. ద్వారకా నమూనా ప్రత్యేక ప్రదర్శనను ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం సుమారు 6:00 లేదా 7:00 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంచుతున్నారు.ఈ నీటి అడుగున ద్వారకా ప్రదర్శన రూపకల్పనకు కమిటీ నిర్వాహకులు ఎంతో కష్టపడ్డారు. ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు సరికొత్త అనుభూతిని పంచాలన్న పట్టుదలతో ఈ సవాలును స్వీకరించామని, శివ్డీ చా రాజా ఆశీస్సులతో ఈ భారీ ప్రాజెక్ట్ విజయవంతమైందని కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ జాదవ్ తెలిపారు.ఇదీ చదవండి: ఎల్ నినోకు చెక్.. గణపయ్యల నిమజ్జనానికి సరికొత్త విధానం! -
బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు
ముంబై: ముంబై కోస్టల్ రోడ్డుపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బీఎండబ్ల్యూ కారు మెరైన్ డ్రైవ్ నుంచి హాజీఅలీ వైపు కోస్టల్ రోడ్డుపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కారు ముందుగా బ్రిడ్జి గోడను ఢీకొట్టి.. అక్కడి నుంచి కిందకి పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్ల పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రమాదంపై తెల్లవారుజామున 5:20 గంటల సమయంలో కోస్టల్ రోడ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. కారులో ఉన్న నలుగురినీ వెంటనే నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు.మృతులను షనాయ్ గజ్జల్(21), ధైర్య దర్శన్ సేథ్(17), ఆదిత్య జకాస్నియా(19)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్(23)కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Three killed, one injured as speeding BMW crashes on Coastal Road in Mumbai.#Mumbai #BMWcrash pic.twitter.com/Mt0fXslLdN— Ravinder Singh (@ravindraJourno) September 20, 2026ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే.. -
ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు
-
గణేశ్ మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి
ముంబై: గణేశ్ ఉత్సవాల వేళ ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలాచౌకీ ప్రాంతంలోని మహాగణపతి ఉత్సవ మండపం వద్ద విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ, ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 12 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలాచౌకీ ప్రాంతంలోని మహాగణపతి ఉత్సవ మండపం వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మంచినీటి స్టాల్ వద్ద విద్యుత్ ప్రవాహం ఉన్నట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ అధికారులు గుర్తించారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని మూసివేశారు. గణపతి మండపం వద్ద విద్యుత్ షాక్ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రభావితమయ్యారు. వారిలో సుజాత (33), ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందగా.. కిరణ్ అక్బర్ నాయక్ (19), తన్వి నరేశ్ హండే (19), సాహిల్ సందీప్ తారే (19) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 12 ఏళ్ల బాలిక తీవ్ర పరిస్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.భారీ రద్దీతో వెనక్కి వచ్చిన కుటుంబంమృతిచెందిన చిన్నారి బంధువు కిష్మతి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చారు. రద్దీ తగ్గే వరకు వేచి ఉండాలని భావించి మండపం పక్కనే ఉన్న దుకాణం వద్ద ఆగారు. మండపం సమీపంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారని, భారీగా భక్తులు వస్తున్నప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన కవరింగ్ నుంచి నీరు పడటంతో విద్యుత్ లైట్ కూడా సమీపంలోని వారిపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ తగిలిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో తన పిల్లలు కల్పన, నేహా విద్యుత్ ప్రవాహానికి గురయ్యారని తెలిపారు.VIDEO | Maharashtra: Two persons, including an eight-year-old girl, were killed and several others injured in an electrocution incident near a Ganapati pandal in Mumbai's Lalbaug area early Sunday.The incident occurred near the Kalachowki Vibhag Sarvajanik Ustav Mandal on… pic.twitter.com/Tn1n7kpcxi— Press Trust of India (@PTI_News) September 20, 2026తన పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు తానూ విద్యుత్ షాక్‌కు గురైనట్లు కిష్మతి యాదవ్ చెప్పారు. మండపం నిర్వాహకులు, సంబంధిత అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన అనంతరం గణేశ్ ఉత్సవాల వేళ తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్ల భద్రతపై ఆందోళన నెలకొంది. విద్యుత్ షాక్‌కు ఖచ్చితమైన కారణం, బాధ్యులపై తదుపరి చర్యలపై అధికారుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.మండపాల వద్ద భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..1. విద్యుత్ తీగలు, స్విచ్‌బోర్డులకు దూరంగా ఉండండి. బయటకు కనిపించే వైర్లు, తెగిన తీగలు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తాకవద్దు. పిల్లలను వాటి దగ్గరకు వెళ్లనివ్వకండి.2. నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి. వర్షపు నీరు నిలిచిన చోట్ల, విద్యుత్ పరికరాలు లేదా వైర్లు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దు. తడిసిన వైర్లు, లోహపు స్తంభాలను తాకవద్దు.3. రద్దీ ఎక్కువగా ఉంటే వేచి ఉండండి. మండపంలోకి వెళ్లేందుకు తొందరపడవద్దు. తోపులాట చేయకుండా, నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూల్లోనే వెళ్లండి. రద్దీ పెరిగితే కొంతసేపు దూరంగా ఉండండి.4. అత్యవసర మార్గాలను ముందే గుర్తించండి. మండపంలోకి వెళ్లినప్పుడు బయటకు వెళ్లే మార్గాలు, అత్యవసర ద్వారాలు ఎక్కడున్నాయో గమనించండి. ప్రవేశ ద్వారాల వద్ద గుమిగూడవద్దు.5. విద్యుత్ ప్రమాదం కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. తీగలు కిందపడటం, స్పార్కులు రావడం లేదా విద్యుత్ షాక్ తగిలినట్లు కనిపిస్తే వాటిని స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించవద్దు. నిర్వాహకులు, విద్యుత్ సిబ్బంది లేదా అత్యవసర సేవలకు వెంటనే తెలియజేయండి.ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే ఏం చేయాలి?విద్యుత్ సరఫరా నిలిపివేసే వరకు బాధితుడిని నేరుగా తాకవద్దు. తడిగా ఉన్న నేలపై నిలబడి బాధితుడిని లాగేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ సరఫరా నిలిపివేయాలని వెంటనే విద్యుత్ సిబ్బందికి, అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వండి. విద్యుత్ సంబంధం పూర్తిగా తెగిందని నిర్ధారించిన తర్వాతే సురక్షితంగా సహాయం చేయాలి. బాధితుడికి వెంటనే వైద్య సహాయం అందించాలి. శ్వాస లేకపోతే, శిక్షణ ఉన్నవారు అత్యవసర సహాయం CPR ప్రారంభించాలి. -
Mumbai: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు.. గణపతి మండపం వద్ద ఇద్దరు మృతి!
ముంబై: ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ముంబై పోలీసుల సమాచారం మేరకు.. మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు కోస్టల్ రోడ్డు మీదుగా బీఎండబ్ల్యూ కారు అత్యంత వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో లాలా కాలేజీ ఎదురుగా, లోటస్ జెట్టీ సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి వంతెన పైనుంచి ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 5:20 గంటల ప్రాంతంలో కోస్టల్ రోడ్డు కంట్రోల్ రూమ్‌కు ఈ ప్రమాదంపై సమాచారం అందింది.ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవగా, ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించారు. మృతుల్లో 21 ఏళ్ల షనాయ్ గజ్జల్, 17 ఏళ్ల ధిర్యా సేఠ్‌తో పాటు 25 ఏళ్ల గుర్తుతెలియని యువకుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 20 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిని సమీపంలోని ఆసుపత్రిలోని ట్రామా వార్డుకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. VIDEO | Maharashtra: Early Sunday, two individuals including an eight-year-old girl—lost their lives and several others sustained injuries after being electrocuted near a Ganapati pandal in Mumbai's Lalbaug area.Morning Visuals from Spot.(Full video available on PTI Videos -… pic.twitter.com/sOe36jnlVl— Press Trust of India (@PTI_News) September 20, 2026మరో ఘటనలో విద్యుదాఘాతంతో ఇద్దరి మృతిముంబైలోని కాలాచౌకీ ప్రాంతంలో ఆదివారం వేకువజామున మరో విషాదం చోటుచేసుకుంది. దత్తారామ్ లాడ్ మార్గ్‌లోని మహాగణపతి ఉత్సవ మండపం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక తాగునీటి స్టాల్లో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలిక రాగిణి ఘనశ్యామ్ యాదవ్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.ఇదీ చదవండి: వైష్ణోదేవి హెలిపాడ్‌లో మంటలు.. తప్పిన ముప్పు -
ఆ గణపయ్య హుండీ తెరవగానే.. కళ్లు చెదిరే కానుకలు!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోని అత్యంత ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణేష్ మండలికి ఉత్సవాలు ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే భక్తుల నుంచి నగదు, బంగారం, వెండి రూపంలో మొత్తం రూ.3.18 కోట్ల విలువైన విరాళాలు అందాయి. ట్రస్ట్ నిర్వాహకుల లెక్కల ప్రకారం, భక్తులు హుండీలో రూ.1.9 కోట్ల నగదుతో పాటు యూఎస్ డాలర్ల వంటి విదేశీ కరెన్సీని కూడా సమర్పించారు.వీటితో పాటు రూ.98.9 లక్షల విలువైన 647.47 గ్రాముల బంగారం, రూ.30.35 లక్షల విలువైన 12,389 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయి. విరాళాల్లో బంగారు గాజులు, గొలుసులు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా చెక్కిన వెండి పెన్నులు, వెండి క్రికెట్ బ్యాట్లు కూడా ఉన్నాయి. రోజువారీ సేకరణను పరిశీలిస్తే మొదటి రోజున రూ.48.5 లక్షల నగదు, 66.77 గ్రాముల బంగారం, 2,806 గ్రాముల వెండి లభించగా, రెండో రోజైన సెప్టెంబర్ 16న అత్యధికంగా రూ.88.9 లక్షల నగదు, 226.12 గ్రాముల బంగారం, 5,516 గ్రాముల వెండి సమకూరాయి. In the first three days of Ganeshotsav, Mumbai’s iconic Lalbaugcha Raja Ganesh Mandal has received donations worth Rs 3.18 crore in cash, including US dollars, gold, and silver jewellery. 🔗https://t.co/cdXdGhEfS2 https://t.co/wCNQHvBzPy— The Indian Express (@IndianExpress) September 18, 2026ఇక మూడో రోజున రూ.53 లక్షల నగదు, 354.58 గ్రాముల బంగారం, 4,067 గ్రాముల వెండిని లెక్కించారు. రోజూ పూజాదికాలు ముగిసిన అనంతరం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విరాళాల మొత్తాన్ని బ్యాంకులో భద్రపరిచి, ట్రస్ట్ ద్వారా ఏడాది పొడవునా నిర్వహించే వివిధ సామాజిక సేవా, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించనున్నారు.ఇదీ చదవండి: హైతీల గుప్పిట్లో ‘బాబ్ అల్ మందబ్’.. చిక్కుల్లో భారత్, చైనా! -
మన దగ్గరా ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘మూడు కెమెరాలు, అప్‌గ్రేడ్ చేసిన అనేక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో పాటు షో ఆఫ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. పైగా యాపిల్ అనేది చాలా పెద్ద బ్రాండ్ కూడా. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీ–బుక్ చేసుకుంటే 18 ఉదయం 8.15 గం.కి మొదటి స్లాట్ దొరికింది. మొత్తానికి మొదటి ఫోన్ అందుకున్నా‘ అని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది. -
క్రిస్టోఫర్ నోలన్ సందర్శించిన కేఫ్‌కు అధికారులు షాక్! లైసెన్స్ సస్పెండ్!
ముంబై: ముంబై: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలే గుర్తుకొస్తాయి. జూలైలో ముంబైకి వచ్చిన నోలన్.. ఓ పాత ఇరానీ కేఫ్‌లో చాయ్, బన్ మస్కా రుచి చూశారు. అయితే కొద్ది రోజులకే అదే కేఫ్ ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన కారణాలతో వార్తల్లోకి వచ్చింది.ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, నటులు మాట్ డేమన్, టామ్ హాలండ్ చాయ్, బన్ మస్కా తిన్న ముంబైలోని ప్రముఖ ఇరానీ కేఫ్ ‘ఒలింపియా కాఫీ హౌస్’కు తాజాగా షాక్ తగిలింది. కొలాబాలో ఉన్న 108 ఏళ్ల నాటి ఈ కేఫ్ ఫుడ్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సెప్టెంబర్ 16న తక్షణమే సస్పెండ్ చేసింది. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ‘సేఫ్ ఫుడ్ సేఫ్ మహారాష్ట్ర’ కార్యక్రమం కింద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని న్యూస్18 కూడా తన కథనంలో పేర్కొంది.ఎఫ్‌డీఏ తనిఖీల్లో ఆహార పదార్థాలు నిల్వ చేసే ప్రాంతంలోనే యూరినల్ ఉండటం, రిఫ్రిజిరేటర్లో మాంసం రక్తపు అవశేషాలు కనిపించడం, కేఫ్ పరిసరాల్లో బొద్దింకలు, ఈగల సమస్య ఉండటం వంటి అంశాలు గుర్తించినట్లు తనిఖీ నివేదికలో పేర్కొన్నారు. ఆహార పదార్థాలను నేలపైనే ఉంచి నిర్వహించడం, ఆహార తయారీలో పరిశుభ్రంగా లేని నీటిని ఉపయోగించడం, మాంసాహార–శాకాహార ముడి పదార్థాలను సరిగా వేరు చేయకపోవడం వంటి లోపాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పరిశుభ్రత లేని చెక్క కటింగ్ బోర్డులను ఉపయోగించడం, ఆహారం తయారు చేసే సిబ్బంది రక్షణ దుస్తులు ధరించకపోవడం వంటి అంశాలను కూడా గుర్తించారు.మొత్తం 35 మంది ఆహార సిబ్బందిలో 34 మందికి ఫుడ్ సేఫ్టీపై సరైన శిక్షణ లేదని అధికారులు పేర్కొన్నారు. నీటి నాణ్యత పరీక్షలు, పారిశుద్ధ్యానికి సంబంధించిన తప్పనిసరి రికార్డులు కూడా తనిఖీ సమయంలో అందుబాటులో లేవని తెలిపారు. ఈ లోపాలు ఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో లోపాలను పూర్తిగా సరిచేసే వరకు కేఫ్‌లో ఆహారం కొనుగోలు, తయారీ, నిల్వ, విక్రయాలు, పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది. మళ్లీ తనిఖీ నిర్వహించి పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిన తర్వాతే కేఫ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.కాగా, ‘ది ఒడిస్సీ’ ముంబై ప్రీమియర్‌కు ముందు జూలైలో క్రిస్టోఫర్ నోలన్, మాట్ డేమన్, టామ్ హాలండ్ తదితర చిత్ర బృందం అనుకోకుండా ఒలింపియా కాఫీ హౌస్‌కు వెళ్లింది. అక్కడ వారు చాయ్, బన్ మస్కా తీసుకున్నారు. దీంతో 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఇరానీ కేఫ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తాజాగా ఎఫ్‌డీఏ చర్యతో అదే కేఫ్ పరిశుభ్రత, ఆహార భద్రత అంశంలో చర్చనీయాంశంగా మారింది. లైసెన్స్ సస్పెన్షన్‌పై కేఫ్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.ఇదీ చదవండి: వాళ్లు స్టార్ హీరోలే కావొచ్చు! కానీ చట్టాన్ని ఉల్లంఘించారు -
దురంధర్ ని మించిన మూవీ తో వస్తోన్న RGV
-
ఆడంబరాలకు దూరంగా.. వందేళ్ల 32 గణేశ మండపాలు
ముంబై: ముంబైలో గణేశోత్సవం అంటే భారీ విగ్రహాలు, వైభవంగా కనిపించే అలంకరణలు, లక్షలాది భక్తుల సందడే గుర్తుకొస్తుంది. అయితే ఈ వేడుకల మూలాలు మాత్రం నిశ్శబ్దంగా సాగే సామాజిక ఉత్సవాల్లో ఉన్నాయి. నగరంలోని వందేళ్లకు పైబడిన కొన్ని గణేశ మండపాలు ఇప్పటికీ తమ పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలు, సంప్రదాయ పూజలు, కుటుంబసభ్యులు, స్థానికులతో కలసి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ముంబైలో వందేళ్ల చరిత్ర కలిగిన 32 గణేశ మండపాలు ఉన్నాయని, వాటిలో 24 గిర్గావ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయని నగరంలో పర్యటనలు నిర్వహించే ‘ఖాకీ టూర్స్’ తెలిపింది.గిర్గావ్లోని వీపీ రోడ్డులో ఉన్న 105 ఏళ్ల అంగ్రేవాడి గణేశోత్సవ మండల్లో ఈసారి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. నితిన్ గాడ్రే, స్వాతి జోషి అనే ఇద్దరు స్థానికులు గత నెల కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల అనంతరం వారు గల్లంతైన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవారని కమిటీ సభ్యుడు మిలింద్ పోంక్షే తెలిపారు.అంగ్రేవాడిలో గతంలో సుమారు 100 మరాఠీ కుటుంబాలు గణేశోత్సవంలో పాల్గొనేవి. 1971లో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో నాటకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంత్ర పఠనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ 30-40 మరాఠీ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ 2.5 అడుగుల విగ్రహంతో 10 రోజులపాటు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 8-10 మంది పూజారులు మంత్ర పఠనం, హారతి నిర్వహిస్తున్నారు. గణేశుడికి సంస్కృత స్తుతితోపాటు ప్రసాదంగా ఉసల్ తయారు చేసే సంప్రదాయం కొనసాగుతోంది.ఖాదిల్కర్ రోడ్డులోని కేశవ్జీ నాయక్ చాల్‌లోని శ్రీ సార్వజనిక గణేశోత్సవ సంస్థ 133వ ఏడాదిని జరుపుకొంటోంది. 1901లో లోకమాన్య తిలక్ ఈ చాల్ను సందర్శించి అక్కడ ఆతిథ్యం స్వీకరించినట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇక్కడ రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి, లౌడ్స్పీకర్లు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనే పరిమితమైన గణేశోత్సవాన్ని స్వాతంత్య్ర యోధుడు తిలక్ ప్రజా ఉద్యమంగా మార్చారు. బ్రిటిష్ పాలనలో రాజకీయ సమావేశాలపై ఆంక్షలు విధించిన సమయంలో, ప్రజలను ఒకచోట చేర్చేందుకు, స్వరాజ్య సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు.కింగ్స్ సర్కిల్లో 1925లో ఏర్పడిన దక్షిణీ బ్రాహ్మణవాడి మండల్ రెండు రోజుల గణపతి ఉత్సవాన్ని నిర్వహించింది. స్థానికుల నుంచి కొద్దికొద్దిగా ధాన్యం సేకరించి, మహాప్రసాదం ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయం. వివాహం అనంతరం ఈ ప్రాంతం విడిచి వెళ్లిన మహిళలు సైతం పూజల్లో పాల్గొనేందుకు ఇక్కడికి తిరిగి వస్తుంటారు. మరాఠీ నాటకాలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.ఇదీ చదవండి: 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఒంటరి మెదడు’ హెచ్చరిక? -
బిచ్చగాడు రీల్ కాదు రియల్!
కోటీశ్వరుడైన అరుల్ తల్లి చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు అతడికి ఒక స్వామీజీ.. ‘నలభై ఎనిమిది రోజులు ఎవరికీ తెలియకుండా బిచ్చగాడిగా దీక్ష చేస్తే నీ తల్లి కోలుకుంటుంది’ అని సలహా ఇస్తాడు. స్వామిజీ సలహాను అనుసరించి నలభై ఎనిమిది రోజులు బిచ్చగాడిగా అవతారం ఎత్తి అష్టకష్టాలు పడతాడు అరుల్. అయితే ఇది ‘బిచ్చగాడు’ అనే సూపర్ హిట్ సినిమా కథ. ఇంచుమించు ఇలాంటి ఘటనే ముంబైలో జరిగి సంచలనం సృష్టించింది...మహారాష్ట్రలోని అత్యంత సంపన్న శాసన సభ్యులలో పరాగ్ షా ఒకరు. ఈయన ఘాట్కోపర్ తూర్పు నియోకవర్గ శాసనసభ్యుడు, వ్యాపారవేత్త. జైన సంప్రదాయంలోని ఒక ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు ముంబైలోని ఘాట్కోపర్ వీధుల్లో ఒకరోజు బిచ్చగాడి వేషధారణలో గడిపాడు షా. దీని కోసం భద్రతా సిబ్బందిని దూరం పెట్టాడు. ఖరీదైన వస్తువులు, వాహనాలను విడిచి పెట్టాడు. ప్రజలు తనను గుర్తు పట్టకుండా ఉండడానికి ప్రత్యేకంగా మేకప్ వేసుకొని రోజంతా భిక్షాటన చేస్తూ గడిపాడు.ఆ బీదలు దయాగుణ సంపన్నులు!‘ సమోసాలు అమ్మే వ్యక్తి పేదవాడు అయినప్పటికీ ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా నాకు సమోసాలు ఇచ్చాడు. ముంబై నగరం ఎలాంటిదంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు’ అని ఆ అనుభవాన్ని గుర్తు తెచ్చుకున్నాడు షా. కోటీశ్వరుడైన షా భిక్షాటన చేయడమే కాకుండా, రోడ్డు పక్కన కూర్చొని బిచ్చగాడిలాగే తిన్నాడు. ఆ తరువాత తన మేకప్‌ను తీసేసుకొని, తాను ఇంతకు ముందు వెళ్లిన వారి దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యక్తులతో మాట్లాడాడు. కృతజ్ఞతలు తెలియజేశాడు. బిచ్చగాడిగా తన అనుభవాలను సన్నిహితులతో, గురువుతో పంచుకున్నాడు. రియల్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన షా మొదట కార్పొరేటర్‌గా గెలిచాడు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్–2024 కోసం సమర్పించిన అఫిడవిట్లో రూ.3,383 కోట్లకు పైగా విలువైన ఆస్తులు తనకు ఉన్నట్లు ప్రకటించాడు. తద్వారా రాష్ట్రంలో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇలా అందరూ చేస్తే!బిచ్చగాడిగా షా వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘ఒక్క రోజో, రెండు రోజులో... ప్రతి ఒక్కరు బిచ్చగాడిగా మారితే మనకు కొత్త వెలుగు తప్పకుండా కనిపిస్తుంది’ అని ఒక నెటిజనుడు అభి్రపాయపడ్డాడు. ‘వాస్తవం’ అంటూ అతడితో చాలామంది ఏకీభవించారు.జీవన వాస్తవం‘ఈ అనుభవం నాకు జీవన వాస్తవికతను కళ్లకు కట్టింది. రోజూ కనిపించే గౌరవ మర్యాదలు లేవు. నన్ను కలవడానికి ప్రజలు క్యూ కడతారు. అదే ప్రజల దగ్గరికి నేను వెళ్లినప్పుడు వారు నా కంటే ఉన్నతమైన వారిగా, ఎక్కువ హోదా కలిగిన వారిగా కనిపించారు. అదే జీవనవాస్తవికత. ముంబై ప్రజలలోని సహజ దయాగుణం కూడా తెలిసింది’ అంటున్నాడు షా.ఒక వ్యక్తి షాకు ఇరవై రూపాయలు ఇచ్చి... ‘వెళ్లి భోజనం చెయ్ బాబా’ అన్నాడు. ఆ ఇరవై రూపాయలు తీసుకొని సమోసాలు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లాడు షా. ‘నా దగ్గర డబ్బులేవీ లేవు’ అని సమోసాలు అమ్మే వ్యక్తికి చె΄్పాడు. ఆయన విసుక్కోకుండా చిరునవ్వుతో సమోసాలు ఇచ్చాడు. -
అంబానీ ఇంట పూజ.. ప్రత్యేక ఆకర్షణగా సారా, సానియా.. వీడియో
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలోని సచిన్ నివాసంలో అందమైన అలంకరణలో బుజ్జి గణేశుడు కొలువుదీరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది.‘‘మోదకాలు, హారతి, నైవేద్యాలు, కుటుంబం, స్నేహితులు.. ఇంట్లో గణపతి బప్పా.. ఇంతకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. అందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు’’ అంటూ సారా తాజాగా ఫొటోలు పంచుకుంది.PC: Instagram View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar)అంబానీ ఇంట పూజఇదిలా ఉంటే... భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముంబైలోని అంబానీల నివాసం యాంటిలియాలో కొలువుదీరిన గణనాథుని పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భార్య అంజలి, కుమార్తె సారా, కుమారుడు అర్జున్, కోడలు సానియాతో కలిసి సచిన్ అంబానీ నివాసానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.PC: Instagramఇక అంబానీ ఇంట పూజకు అంజలి, సారా, సానియా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ముగ్గురూ చీరలు కట్టుకుని ముచ్చటగా కనిపించారు. కాగా అక్క సారా కంటే అర్జున్ ముందుగా పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ముంబైలోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియా చందోక్‌ను ఈ ఏడాది మార్చి 5న అర్జున్ వివాహమాడాడు. కాగా సానియా- సారా ప్రాణ స్నేహితులు. ఇక సచిన్‌తో పాటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ సతీమణులతో కలిసి అంబానీ ఇంట పూజకు విచ్చేశారు. చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్... ఆస్తి విలువ ఎంతంటే? View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
వినాయకుని దర్శనానికి 15 గంటలు
ముంబై: గణపతి ఉత్సవాల్లో భాగంగా ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణేశోత్సవం 93వ సంవత్సరం వేడుకలు సెప్టెంబరు 14న ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల తొలిరోజే లక్షలాది మంది భక్తులు లాల్‌బాగ్‌లోని గణేశ్ మండపానికి తరలివచ్చారు. అర్ధరాత్రి కూడా భక్తుల రాక కొనసాగింది. భారీగా క్యూలు ఏర్పడ్డాయి. ముంబైతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూశారు.భారీ రద్దీ కారణంగా క్యూలలో తోపులాటలు చోటుచేసుకున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. కొందరు భక్తులు 15-16 గంటలపాటు క్యూలో వేచి ఉన్నట్లు పోస్టులు పెట్టారు. అదే సమయంలో వీఐపీలకు సులభంగా దర్శనం లభిస్తుండటంపై చర్చ మొదలైంది. సాధారణ భక్తులకు కూడా గౌరవప్రదమైన, దర్శన సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. తొలిరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ లాల్బాగ్చా రాజాను దర్శించుకుని పూజలు చేశారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి మండపానికి వచ్చారు.సాధారణ దర్శనం ఉచితమేనని, భక్తుల కోసం అధికారికంగా ఎలాంటి చెల్లింపు పాస్‌లు లేవని నిర్వాహకులు స్పష్టం చేశారు. రద్దీ నియంత్రణ, భద్రత కోసం మండపం పరిసరాల్లో పోలీసులను మోహరించారు. ఏఐ ఆధారిత కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. మండపానికి రాలేని భక్తుల కోసం 24 గంటల ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంది.భారీ రద్దీ నేపథ్యంలో ముంబై పోలీసులు లాల్బాగ్, కాలాచౌకీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. సెప్టెంబరు 14 నుంచి 25 వరకు పరిస్థితిని బట్టి అవసరమైన చోట 24 గంటలపాటు రహదారుల మూసివేత కొనసాగనుంది. లాల్బాగ్చా రాజా ఉత్సవాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నప్పటికీ, భారీ రద్దీని సురక్షితంగా నిర్వహించడం నిర్వాహకులు, అధికారులకు సవాలుగా మారింది.ఇదీ చదవండి: ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే.. -
మేయర్ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు!
ముంబై: గణేశ్ చతుర్థి సందర్భంగా ముంబై మేయర్ రితు తావ్డే తన నివాసంలో పర్యావరణహిత మట్టి గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నగరంలో నిర్వహించే గణేశోత్సవ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ విగ్రహాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందిన ప్రభాదేవి మున్సిపల్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న రితిక్ పాస్వాన్ స్వయంగా తయారు చేశారు.రితిక్ తన చేతులతో తయారుచేసిన మట్టి గణేశుడి విగ్రహాన్ని మేయర్‌కు అందించారు. విద్యార్థి కళాత్మక ప్రతిభను, భక్తి భావాన్ని గౌరవిస్తూ తావ్డే ఆ విగ్రహాన్ని తన నివాసంలో ప్రతిష్ఠించారు. గణేశ్ పూజకు రితిక్, అతని తల్లిని కూడా ఆహ్వానించారు. మేయర్ నివాసంలో ఒకటిన్నర రోజుల గణేశోత్సవం సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. పూలు, ఇతర పర్యావరణహిత వస్తువులతో అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా తావ్డే మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్ర పండుగైన శ్రీ గణేశోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ముంబై నగర ప్రజలకు ఆనందం, సౌభాగ్యం, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు.ఇదీ చదవండి: లండన్‌లో గంగా హారతి.. చరిత్రలో తొలిసారి! -
అత్యంత సంపన్న గణపతి మండపం.. రూ.703 కోట్ల బీమా
ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ప్రతిష్ఠించిన జీఎస్బీ మహాగణపతి విగ్రహానికి ఈ ఏడాది రూ.703.27 కోట్ల బీమా కల్పించారు. దేశంలోనే అత్యంత సంపన్న గణపతి మండపాల్లో ఒకటిగా పేరున్న జీఎస్బీ సేవా మండల్ ఈ బీమా తీసుకుంది. గత ఏడాది రూ.474 కోట్ల బీమా తీసుకోగా.. ఈ ఏడాది మొత్తం పెరిగింది.ఈ మహాగణపతి విగ్రహాన్ని 66 కిలోలకు పైగా బంగారం, 335 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. విలువైన రత్నాలను కూడా విగ్రహానికి అలంకరించారు. ఈ ఆభరణాల్లో చాలా వరకు భక్తులు, సేవకులు విరాళంగా ఇచ్చినవేనని నిర్వాహకులు తెలిపారు.జీఎస్బీ అంటే గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్. ఈ మండల్ ఈ ఏడాది 72వ గణేశోత్సవాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు 5 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. మహాగణపతి విగ్రహాన్ని పర్యావరణహితంగా తయారు చేశారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ 40,000 మందికి పైగా అన్నదాన సేవ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 5 రోజుల వ్యవధిలో 2 లక్షల మందికి పైగా ప్రసాదం అందుకోనున్నట్లు చెప్పారు.వేద సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం పలు పూజలు, సేవలు నిర్వహించనున్నారు. కాగితపు వృథాను తగ్గించేందుకు సంప్రదాయ ముద్రిత రశీదుల స్థానంలో డిజిటల్ రశీదులను కూడా ప్రవేశపెట్టారు. -
విధి ఆడిన వింత.. భారత్‌లో బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్!
ఇద్దరూ భారత్‌లోనే పుట్టారు.. వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లారు.. కట్ చేస్తే.. నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు దగ్గర్లోనే పెరిగారు. టీనేజ్‌లో తొలిసారి కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఒకే ముక్కు.. ఒకే నవ్వు.. ఒకే రకమైన హావభావాలు. అందుకే అప్పట్లోనే ఒకరినొకరు సరదాగా ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. కానీ వాళ్లు నిజంగానే అక్కాచెల్లెళ్లని మాత్రం దాదాపు 30 ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. చివరకు ఓ డీఎన్ఏ టెస్ట్ వాళ్ల జీవితాలనే మార్చేసింది.ముంబైలోని వేర్వేరు అనాథాశ్రమాల నుంచి 1980ల ప్రారంభంలో కొన్ని నెలల వ్యవధిలో మీనా గెల్టింక్, మినాల్ టిజ్సెన్ వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తత వెళ్లారు. ఇద్దరూ నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు సమీపంలో పెరిగారు. టీనేజ్‌లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు వారి స్నేహితులే ఇద్దరి పోలికలను గుర్తించారు. అద్దంలో చూసుకుంటే ఒకేలా కనిపిస్తున్నారని చెప్పడంతో మీనా ఆశ్చర్యపోయింది. ఒకే ముక్కు, ఒకే నవ్వు ఉండటాన్ని గమనించింది.ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. స్కూల్, స్నేహితులు, ప్రేమ, డ్యాన్స్, క్రీడలు, సంగీతం.. ఇలా ఎన్నో విషయాలను ఒకరికొకరు లేఖల ద్వారా పంచుకునేవారు. ఇద్దరికీ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ అంటే ఇష్టమని కూడా తెలుసుకున్నారు. రక్తసంబంధం ఉందన్న చిన్న అనుమానం కూడా లేకపోయినా.. ఒకరినొకరు ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. మినాల్ ఫ్రాన్స్‌కు వెళ్లగా.. మీనా తన మొదటి బిడ్డకు తల్లి కావడంతో కుటుంబ బాధ్యతల్లో బిజీ అయిపోయింది.డీఎన్ఏ టెస్ట్.. ఇంతలో 2017లో మీనా భారత్ నుంచి దత్తత తీసుకున్నవారి సమావేశానికి హాజరైనప్పుడు డీఎన్ఏ టెస్టింగ్ గురించి తెలుసుకుని పరీక్ష చేయించుకుంది. కానీ ఎలాంటి సరిపోలిక కనిపించలేదు. ఈ ఏడాది ఫోన్ స్టోరేజ్ సమస్యతో ఆమె ఆ యాప్‌ను కూడా డిలీట్ చేసింది. ఇంతలో మే 20న మినాల్ ఫేస్బుక్లో మీనాకు మెసేజ్ చేసింది. తాను ఏప్రిల్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల స్క్రీన్ షాట్‌ను పంపింది. మీనాకు మొదట నమ్మశక్యం కాలేదు. యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసి ఫలితాలను చూసిన ఆమెకు షాక్ తగిలింది. ఇద్దరి డీఎన్ఏ 100 శాతం మ్యాచ్ అయింది. వారు కేవలం చిన్ననాటి స్నేహితులు కాదు.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పూర్తి సోదరీమణులని తేలింది.మినాల్‌కు కూడా తొలుత తన డీఎన్ఏ మ్యాచ్ ఎవరిదో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో పాత ఫొటోలు చూసిన తర్వాత విషయం తెలిసింది. చిన్నప్పుడు తనను ఆప్యాయంగా పట్టుకున్న అదే అమ్మాయి మీనా అని గుర్తించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పడిన స్నేహం వెనుక ఇంత పెద్ద రక్తసంబంధం ఉందని తెలుసుకుని ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టులో మళ్లీ కలుసుకున్న ఇద్దరూ కన్నీళ్లు, నవ్వులు, కౌగిలింతల మధ్య తమ అనుబంధాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఒకరి కుటుంబాలను మరొకరు కలుసుకున్నారు. ఇద్దరి మాట తీరు, నడక, హావభావాలు ఇప్పటికీ ఒకేలా ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారు.ముంబై కోరిక.. తమ జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఒకరి అవసరం మరొకరికి ఉందని మీనా చెబుతోంది. తండ్రిని కోల్పోయినప్పుడు, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సోదరి తన పక్కన ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురైంది. ఇప్పుడు ఇద్దరి కోరిక ఒక్కటే.. తమ బంధం మొదలైన ముంబైకి కలిసి వెళ్లి, తాము పుట్టిన నేలను మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ‘సిస్టర్’ అని పిలుచుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు డీఎన్ఏ ద్వారా తాము నిజంగానే సోదరీమణులమని తెలుసుకున్న ఈ కథ నిజజీవితంలో జరిగిన ఓ సినిమా ట్విస్ట్‌ను తలపిస్తోంది.Çocukluk arkadaşları, yıllar sonra yaptırdıkları DNA testiyle aslında kardeş olduklarını öğrendi! 👯♀️💞📌 Bebekken Hindistan'daki yetimhanelere bırakılan ve farklı Hollandalı aileler tarafından evlat edinilen Meena Geltink ile Minal Tijssen, ilk kez 1996 yılında evlat edinilmiş… pic.twitter.com/NyMrp7DBu0— Mynet (@mynet) August 17, 2026Video Credit: Mynet. -
గణేశ్ మండపం వ్యర్థాలతో ఇంధనం
ముంబై: ఈ ఏడాది ముంబైలోని ప్రఖ్యాత లాల్బాగ్చా గణేశ్ మండపం వద్ద ఏర్పడే ప్రసాద వ్యర్థాలు మొత్తం ఇంధనంగా మారనుంది. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన ‘ప్రసాద్ టు ఎనర్జీ’ కార్యక్రమంలో భాగంగా ప్రసాదం తయారీ, పంపిణీల సమయంలో పుట్టుకొచ్చే సుమారు 80 టన్నుల వ్యర్థాలను బయోమెథనైజేషన్ ద్వారా వంట గ్యాస్‌గా మార్చనున్నారు. ఈ గ్యాస్‌తో ఉత్పత్తి అయ్యే 7700 యూనిట్ల విద్యుత్తును ముంబైలోని నాలుగు మున్సిపల్ ఆసుపత్రుల్లో వాడనున్నారు. సెలెబ్రిటీలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే లాల్బాగ్చా రాజా మండల్ సాయంతో తామీ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంసీ ప్రకటించింది. సోమవారంతో మొదలై మొత్తం పదకొండు రోజులపాటు జరిగే గణేశ్ ఉత్సవాల్లో రోజూ కనీసం 8 నుంచి పది టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూంటుందని బీఎంసీ అంచనా వేస్తోంది. ఈ చెత్తను అక్కడికక్కడే వేరు చేసి ప్రత్యేక వాహనాల ద్వారా నాయర్, కస్తూర్బా, జీటీబీ, సియాన్ ఆసుపత్రుల్లోని బయోమెథనైజేషన్ ప్లాంట్లకు తరలిస్తారు. ఈ ప్లాంట్లు ఒకొక్కటి రోజుకు రెండు టన్నుల వరకూ చెత్తను గ్యాస్‌గా మార్చగలవు. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మాత్రం చెత్తను బట్టి మారిపోతూంటుంది. ఆసుపత్రుల్లోని విద్యుత్తు దీపాలను వెలిగించేందుకు ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడతామని బీఎంసీ తెఇపింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి అప్పగించామని తెలిపింది. తడిచెత్త సాయంతో విద్యుత్తు ఉత్పత్తి చేసి చెత్త సమస్యను పరిష్కరించవచ్చునన్న సందేశాన్ని అందరికీ పంపేందుకే తామీ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది. -
‘‘మేము చోటా రాజన్ మనుషులం.. రూ.32 కోట్లు ఇస్తావా? చస్తావా?’’
ముంబై పశ్చిమ శివారు ప్రాంతాల్లో చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టు కేంద్రంగా ఓ వసూళ్ల కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ డెవలపర్‌ను హత్య చేస్తామని, ఇతర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి తొలుత రూ.32 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ మొత్తం రూ.11 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ గాలింపు చేపట్టింది. వీరిలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎన్జీవో నిర్వాహకుడు కూడా ఉన్నారు.ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్టార్షన్ సెల్ ఈ వసూళ్ల యత్నంపై దర్యాప్తు చేస్తోంది. పనులు కొనసాగిస్తే డెవలపర్ సిబ్బందికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, ప్రభుత్వ సంస్థలు, పౌర అధికారులకు ఫిర్యాదులు చేసి పనులను అడ్డుకుంటామని, చివరకు చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఎఫ్ఐఆర్లో ఎనిమిది మంది నిందితులతో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయి. వీరిలో చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్‌కు చెందిన రాజ్‌లక్ష్మి సంస్థ పేరు ఉంది. ఎన్జీవో నిర్వాహకుడు క్లెమెంటినస్ ఫారో, టోనీ అనే మరో నిందితుడి పేర్లు కూడా ఉన్నాయి. ఫారో, టోనీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసు బాంద్రా వెస్ట్‌లోని ఓ ఆస్తికి సంబంధించినది. ఈ ఆస్తి బాంబే ఆర్చ్డియోసిస్కు చెందినది. సుమారు 50 ఏళ్లుగా అక్కడ ఆస్తి ఉంది.ఈ ప్రాపర్టీ వల్లే..బాంద్రా వెస్ట్‌లోని పెరీరా రోడ్డులో ఉన్న ఆస్తి పునరాభివృద్ధికి బాంబే ఆర్చ్డియోసిస్ టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో దిల్జయ్ ప్రాపర్టీస్ అత్యధిక ధరను ప్రతిపాదించింది. అవసరమైన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఛారిటీ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు పొందిన తర్వాత ఆర్చ్డియోసిస్ యాజమాన్యం ఆస్తిని పునరాభివృద్ధి కోసం దిల్జయ్ ప్రాపర్టీస్‌కు అప్పగించింది.సుమారు 50 ఏళ్ల నాటి ఈ ఆస్తి శిథిలావస్థకు చేరుకుంది. 2024లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దీనిని సీ-1 కేటగిరీ ప్రమాదకర భవనంగా ప్రకటించింది. సురక్షితంగా కూల్చివేసేందుకు వీలుగా మొత్తం ఆస్తికి విద్యుత్, నీటి సరఫరాను పౌర సంస్థ నిలిపివేసింది.ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, వారి కుటుంబ సభ్యుల్లో కొందరు ఆ ఆస్తిలో అక్రమంగా నివసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2026 జూన్ నాటికి భవనం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. బీఎంసీ ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది సమక్షంలో అధికారిక తనిఖీ నిర్వహించారు. దీనిని పంచనామా అంటారు. ఆ తర్వాత కేర్‌టేకర్ ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, టోనీ కుటుంబ సభ్యుల వస్తువులను అక్కడి నుంచి తొలగించారు. నిర్దేశిత విధానాల ప్రకారం ప్రమాదకర భవనాన్ని కూల్చివేశారు.కూల్చివేత తర్వాత బెదిరింపులుభవనం కూల్చివేసిన తర్వాత ఎథెల్, డేనియల్ కుటుంబ సభ్యులు నేర చరిత్ర ఉన్న వ్యక్తులుగా పేర్కొన్న కొందరితో కలిసి తరచూ ఆ ప్రాంతానికి రావడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు ప్రకారం.. చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెంబూర్, కుర్లా ప్రాంతాలకు చెందిన గ్యాంగ్ సభ్యులు వారితో కలిసి వచ్చేవారు. డెవలపర్‌కు చెందిన భద్రతా సిబ్బంది, ఇతర ఉద్యోగులపై దాడి చేసి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనలపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. 2026 జూలై 11న ఎఫ్ఐఆర్ నంబర్ 1393, జూలై 29న ఎఫ్ఐఆర్ నంబర్ 1564 కింద 2 కేసులు నమోదయ్యాయి. ప్లాట్ వద్ద భద్రతా కంచె ఏర్పాటు పనులు చేపడుతున్న సమయంలోనూ బెదిరింపులు కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎథెల్, డేనియల్ తమ సహచరులతో కలిసి అక్కడికి వచ్చి ఎలాంటి పనిని కొనసాగించనివ్వబోమని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.రూ.32 కోట్ల డిమాండ్చెంబూర్లో చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్, కుర్లాకు చెందిన అబ్దుల్లా ఖాన్, బాంద్రాకు చెందిన రెమీ, నజీర్‌లతో తమకు సంబంధాలు ఉన్నాయని నిందితులు డెవలపర్‌కు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరితో లేదా అందరితో కలిసి డెవలపర్ ప్రతినిధులను చంపుతామని బెదిరించారు.“పని కొనసాగించి ప్రాణాలు కాపాడుకోవాలంటే మాకు రూ.32 కోట్లు చెల్లించండి” అని నిందితులు డెవలపర్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు ఆస్తి వద్దకు పదేపదే వచ్చి బెదిరింపులకు పాల్పడటంతో బాంద్రా పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు నమోదైంది. 2026 ఆగస్టు 24న నిందితులు కంపెనీ బాంద్రా కార్యాలయానికి వెళ్లి దిల్జయ్ ప్రాపర్టీస్ డైరెక్టర్ గగన్ శర్మను కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తుది హెచ్చరిక అని చెప్పి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కంపెనీపై ఒత్తిడి తెచ్చారు.ఆ తర్వాత రూ.11 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1న తొలి విడతగా రూ.25 లక్షలు ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని తదుపరి 4 వారాల్లో చెల్లించాలని నిందితులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించిన డెవలపర్ఈ వ్యవహారం మరింత తీవ్రమై ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భయపడిన డెవలపర్ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించాడు. రికార్డింగ్‌లు, ఫొటోలు, గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రతులతో అధికారులు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ అనిల్ కుంభారేను కలిసి అధికారిక ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఈ వ్యవహారాన్ని సున్నితమైన కేసుగా పరిగణించి దర్యాప్తును యాంటీ ఎక్స్టార్షన్ సెల్‌కు అప్పగించారు.పోలీసుల వలలో ఐదుగురు సెప్టెంబర్ 1న ఎథెల్, డేనియల్, వారి సహచరులు రూ.25 లక్షల తొలి విడతను తీసుకునేందుకు డెవలపర్ బాంద్రా కార్యాలయానికి వచ్చారు. దీంతో యాంటీ ఎక్స్టార్షన్ సెల్ వల పన్ని, డబ్బు తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేసింది. వలలో భాగంగా ఏర్పాటు చేసిన డబ్బులో ఎక్కువ భాగం పిల్లలు ఆడుకునే నకిలీ కరెన్సీ. దీని విలువ రూ.24.95 లక్షలు. దాని పైన అసలైన రూ.500 నోట్లు రూ.5,000 విలువ మేర ఉంచారు.ఆ తర్వాత పోలీసులు ఎథెల్ స్టీవెన్, డేనియల్ స్టీవెన్, నసీర్ షేక్, అబ్దుల్లా ఖాన్, రెమీ ఫెర్నాండెజ్‌లను అరెస్ట్ చేశారు. వల పన్నిన సమయంలో ముగ్గురు నిందితులు పట్టుబడగా, ఆ చర్యకు సంబంధించి మరో ఇద్దరిని తర్వాత అరెస్ట్ చేశారు. ఎన్జీవో నిర్వాహకుడు, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.ఎఫ్ఐఆర్లో 8వ నిందితుడిగా పేర్కొన్న ఎన్జీవో నిర్వాహకుడు క్లెమెంటినస్ ఫారో, టోనీ కోసం క్రైమ్ బ్రాంచ్ గాలింపు చేపట్టింది. అభివృద్ధి ప్రాజెక్టులో అడ్డంకులు సృష్టిస్తామని బెదిరించి తన ఎన్జీవో కోసం రూ.కోటి వసూళ్లుగా ఫారో డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చోటా రాజన్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్విందర్ సింగ్‌కు చెందిన రాజ్‌లక్ష్మి సంస్థ పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. నిందితులకు ఇతర వ్యక్తులు, గ్యాంగ్‌లతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న సంబంధాలపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన 'డ్రెస్'!
ముంబై: ఇతరుల డ్రెస్ వేసుకోవడం, వారి వస్తువులను వాడుకోవడమంటే కొందరికి చెడ్డ చిరాకు. అలాగే, చెప్పకుండానే ఇతరులు తమ డ్రెస్‌ను వేసుకోవడాన్ని, వస్తువులు వాడుకోవడాన్ని ఏమాత్రం సహించలేరు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఆగ్రహంతో కొట్లాడుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.సూరజ్ శంకర్ ధోలె(26), బాబా సాహెబ్ అలియాస్ సుబోధ్ భీమ్రావ్ వాంఘ్మారేలు గోరెగావ్‌లోని ఓ పెట్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. అయితే, ధోలె తరచుగా వాంఘ్మారే డ్రెస్‌లు వేసుకోవడం, అతడి వస్తువులను వాడుకోవడం చేస్తున్నాడు. ఇది వాంఘ్మారేకు ఏమాత్రం నచ్చడం లేదు.తన అనుమతి లేకుండానే ధోలె ఇలా చేయడంపై వాంఘ్మారేకు కోపంగా ఉంది. దీనిపై శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో వాంఘ్మారే చేతిలో ధోలె ప్రాణాలు కోల్పోయాడు. ధోలె తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో ఉన్న వాంఘ్మారే కోసం గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: గుజరాత్‌కు ఎందుకు తరలించారు? -
గణపతి ఉత్సవాలకు కార్పొరేట్ హంగులు
ముంబై: మహానగరం ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలకు కార్పొరేట్ సంస్థల సహకారం అంతకంతకు పెరుగుతోంది. ముంబయిలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా, చించ్పోక్లీచా చింతామణి మండపాలు ఈ వరుసలో ముందున్నాయి. ఈ ఏడాది చించ్పోక్లీచా చింతామణికి అదానీ గ్రూప్ సహకారం అందిస్తున్నది. గత ఏడాది అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా మండలిలో అధికారికంగా చేరారు. ప్రముఖ మండపాలతో అనుబంధం ద్వారా కార్పొరేట్ కంపెనీలు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.లాల్బాగ్చా రాజా మండపానికి ఉన్న విస్తృత ప్రజాదరణ, ప్రముఖుల సందర్శనలను తమ ప్రచారానికి అనువుగా కార్పొరేట్ కంపెనీలు మలచుకుంటున్నాయి. అదానీ గ్రూప్ నుంచి రూ.3.5 కోట్లు పొందిన చింతామణి మండపం మరింత వ్యవస్థీకృత విధానాన్ని అనుసరిస్తోంది. అర కిలోమీటరు పొడవైన ప్రత్యేక ప్రచార ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, సొంత మార్కెటింగ్ బృందాన్ని నియమించింది. తొలిసారిగా ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేసింది. ఉత్సవానికి ముందే చింతామణి విగ్రహం ఆగమన్‌కు పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయడంతో భారీగా జనం తరలివచ్చారు.లాల్బాగ్చా రాజా వద్ద సర్దార్ హోటల్ నుంచి కాలాచౌకీ పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రహదారులపై బ్రాండింగ్ కేంద్రీకృతమైంది. భారీగా భక్తులు వచ్చే ప్రాంతాల్లో స్పాన్సర్ల బ్రాండింగ్‌ను ఏర్పాటు చేశారు. చింతామణి మండపంలో నిర్వాహకులే ప్రచార సందేశాలు, కంటెంట్‌ను నిర్వహిస్తూ భక్తుల భాగస్వామ్యం, స్పాన్సర్లకు కనిపించే స్థాయికి ప్రాధాన్యమిస్తున్నారు. చింతామణితో అనుబంధం తమకు గౌరవప్రదంగా ఉందని అదానీ ప్రతినిధి తెలిపారు. భక్తుల భద్రత, జనసమూహాల నిర్వహణపైనే తమ దృష్టి ఉందని, అదే సమయంలో చింతామణి సంప్రదాయాలను గౌరవిస్తూ, పరిరక్షిస్తున్నామని చెప్పారు.విగ్రహాల వద్దకు వెళ్లే రహదారులు, సందులు కూడా ప్రకటనల స్థలాలుగా మారుతున్నాయి. గణేశోత్సవ సమయంలో లక్షలాది భక్తుల కోసం ప్రత్యేక దర్శన మార్గాలు, బ్యారికేడ్లు, ప్రజలకు అందుబాటులో ఉండే మార్గాలకు అనుమతులు తీసుకుంటారు. ఈ మార్గాల్లోని బ్యారికేడ్లు, స్వాగత తోరణాలు, బ్యానర్లు, దిశానిర్దేశక బోర్డులు తదితరాలు స్పాన్సర్‌షిప్‌లో భాగమవుతున్నాయి. క్యూల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ప్రకటనదారులకు ఒకే చోట లభించే వినియోగదారులుగా మారుతున్నారని, జనసందోహం పెరిగే కొద్దీ ఈ ప్రాంతాల వాణిజ్య విలువ కూడా పెరుగుతోందని స్పాన్సర్‌షిప్‌తో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు.స్పాన్సర్ల ప్రాధాన్యం పెరుగుతుండటంపై ఉత్సవ నిర్వాహకుల్లో చర్చ మొదలైంది. వాణిజ్య భాగస్వామ్యం ఉత్సవ స్వభావాన్ని మార్చడం లేదని, భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు ఇది అవసరమని నిర్వాహకులు చెబుతున్నారు. అయినప్పటికీ సంప్రదాయానికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని, ఆచారాలు, పూజా విధానాలు, ఉత్సవ నిర్ణయాలు సంప్రదాయాలు, విలువల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.ఇదీ చదవండి: నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం -
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్‌లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..! -
‘ఫస్ట్‌లుక్’లో లాల్బాగ్చా రాజా.. జనం క్యూ..
ముంబై: గణేశ్ చతుర్థి వేడుకలకు ముందుగా ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా 2026 తొలి దర్శనాన్ని శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఆవిష్కరించారు. లాల్బాగ్చా రాజా గణేశోత్సవ మండల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంతో నగరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గణేశోత్సవ వేడుకల సందడి ప్రారంభమైంది. లాల్బాగ్చా రాజా ముంబయిలో అత్యంత ప్రసిద్ధి చెందిన గణేశ విగ్రహాల్లో ఒకటి. కళాత్మక నైపుణ్యంతో రూపొందించే ఈ విగ్రహం కేవలం ప్రతిమ మాత్రమే కాకుండా భక్తి, కళా వైభవం, ముంబై ఉత్సాహభరిత స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ మండపాన్ని, గణేశుడిని దర్శించుకుంటారు.2026లో గణేశ్ చతుర్థి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్నాయి. లాల్బాగ్చా రాజా తొలి దర్శనం ముంబై గణేశోత్సవానికి ముందు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టాల్లో ఒకటిగా ఉంది. లాల్బాగ్-పరేల్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం సింహాసనంపై ఆసీనుడై ప్రశాంతమైన, దయామయమైన, ప్రేమపూర్వక రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. లాల్బాగ్చా రాజా గణపతి విగ్రహం పుట్లాబాయి చాల్లో ఉన్న లాల్బాగ్చా రాజా గణేశోత్సవ మండల్‌కు అనుబంధంగా ఉంది. ఈ పూజా స్థలాన్ని 1934లో స్థాపించారు. అప్పటి నుంచి ఇది ముంబయి గణేశ్ చతుర్థి వేడుకల్లో అంతర్భాగంగా మారింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా ఈ గణపతి విగ్రహ సంరక్షణ బాధ్యతలను కాంబ్లీ కుటుంబం కొనసాగిస్తోంది. #WATCH | Mumbai, Maharashtra: First look of Lalbaugcha Raja unveiled ahead of Ganesh Chaturthi on September 14. https://t.co/WZurtiJ7wf— ANI (@ANI) September 11, 2026భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున ప్రారంభమయ్యే గణేశ్ చతుర్థి ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయి. చతుర్థితో ప్రారంభమై అనంత చతుర్దశితో ముగుస్తుంది. వినాయక చతుర్థి, వినాయక చవితి పేర్లతోనూ దీనిని పిలుస్తారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు ఇళ్లలో గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి, సంప్రదాయ వంటకాలు తయారు చేసి, మండపాలను సందర్శించి పూజలు చేస్తారు. పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెరుగుతోంది. గత దశాబ్దంగా ముంబైకి చెందిన ఓ కళాకారుడు మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు బదులుగా పర్యావరణహిత కాగితంతో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు.ఇదీ చదవండి: గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి? -
12వ తరగతిలో 95.7% మార్కులు.. అయినా ఆత్మహత్య
ముంబై: కోరుకున్న విద్యాసంస్థలో ప్రవేశం లభించకపోవడంతో ఓ 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని థానే నగరం, ఘోడ్‌బందర్ రోడ్డులోని హీరానందాని ఎస్టేట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షిబ్‌పూర్‌లో బీఎస్-ఎంఎస్ డ్యుయల్ డిగ్రీ చదవాలని అతడు అనుకున్నాడు. ఆ బాలుడు ఇటీవల 12వ తరగతి పరీక్షలు పూర్తి చేసి 95.7% మార్కులు సాధించాడు. అయితే ప్రవేశ పరీక్షలో 10,474 ర్యాంకు రావడంతో తాను కోరుకున్న విద్యాసంస్థలో సీటు పొందలేకపోయాడు.కుటుంబానికి మెసేజ్ పంపిన బాలుడుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 4న రాత్రి 7.30 గంటల సమయంలో సైకిల్ తొక్కేందుకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సుమారు 45 నిమిషాల తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు కుటుంబ వాట్సాప్ గ్రూపులో సందేశం పెట్టాడు.కుటుంబ సభ్యులు ఆ సందేశాన్ని గమనించి అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కాసర్వడవలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు నివాస సముదాయం పరిసరాల్లో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.అయితే కుటుంబ సభ్యులు, పోలీసులు జోక్యం చేసుకునేలోపే నివాస భవనంలోని 22వ అంతస్తు నుంచి బాలుడు కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అపార్ట్మెంట్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై బాలుడు పడి ఉన్నట్లు తర్వాత గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అతడిని థానే సివిల్ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తాను కోరుకున్న విద్యాసంస్థలో ప్రవేశం పొందలేకపోవడం వల్ల బాలుడు తీవ్ర విద్యాపరమైన ఒత్తిడికి గురయ్యాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
లగ్జరీ ఏరియాలో రూ. 63 లక్షల కొత్త ఇల్లు కొన్న ఖుషీ కపూర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, దివంగత నటి శ్రీదేవి-నిర్మాత బోనీ కపూర్ ల చిన్నకుమార్తె ఖుషీ కపూర్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోకు కొత్త ఆస్తిని జోడించింది. ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.CRE మ్యాట్రిక్స్‌కు లభించిన ఆస్తి రికార్డుల ప్రకారం బాలీవుడ్ ప్రముఖులు నివాసముండే పాపులర్ ఏరియా, బాంద్రా వెస్ట్‌లోని 25వ రోడ్డులో ఉన్న సమతాదీప్ బిల్డింగ్‌లో ఈ అపార్ట్మెంట్ ఉంది. దీని ధర సుమారు రూ. 63 లక్షలు. ఈ లావాదేవీ సెప్టెంబర్ 1 అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ కింద రూ. 3.15 లక్షలు చెల్లించినట్టు సమాచారం.కార్పెట్ ఏరియా 180 చదరపు అడుగులు ఈ ఫ్లాట్‌ను ఫారూఖ్ ఛాగ్లా అనే వ్యక్తి నుంచి ఈ ప్రాపర్టీని ఆమె కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.కాగా 2023లో జోయా అక్తర్ దర్శకత్వం వహించిన 'ది ఆర్చీస్' (The Archies) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందిఖుషీకపూర్. ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి 'నాదానియాన్', జునైద్ ఖాన్‌తో కలిసి 'లవ్యాపా' చిత్రాల్లో నటించారు. తన తల్లి శ్రీదేవి నటించిన హిట్ చిత్రం 'మామ్' (Mom - 2017) కి సీక్వెల్‌గా వస్తున్న 'మామ్ 2' (Mom 2) లో ఖుషీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో జిష్షూ సేన్‌గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌లో ఖుషీ అత్యంత బలమైన, ఆకట్టుకునే నటనను కనబరచనున్నట్లు సమాచారం.అటు ఖుషీ సోదరి జాన్వీ కపూర్‌కూడా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుఇదీ చదవండి: రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ -
‘సీఎస్ఎంటీ–కుర్లా’ రైల్వేప్రాజెక్టులో భారీమార్పులు
ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ)–కుర్లా స్టేషన్ల మధ్య నిర్మించనున్న ఐదు, ఆరో లేన్ల ప్రాజెక్టులో స్దలం కొరత కారణంగా భారీ మార్పులు చేయాలని ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్వీసీ) యోచిస్తోంది. అందుకు సంబంధించిన కొత్త ప్రతిపాదన రూపొందించడం, అధ్యయనం చేసే పనిలో ఎంఆర్వీసీ అధికారులు నిమగ్నమయ్యారు.సీఎస్ఎంటీ–పరేల్ స్టేషన్ల మధ్య మసీద్బందర్, శ్యాండ్రస్ట్‌రోడ్, బైకళ, చీంచ్పోక్లీ, కరీ రోడ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇందులో భైకళ మినహా మిగత స్టేషన్లలో ఫాస్ట్ మార్గంలో ప్లాట్‌ఫారాలు లేవు. దీంతో కేవలం భైకళ స్టేషన్‌ను మాత్రం భూగర్భంలో నిర్మించాలని ప్రతిపాదించనున్నారు. అధ్యయనం పనులు కోసం జపాన్‌కు చెందిన ఇంజినీర్లను, అలాగే మౌలికసదుపాయాల కోసం ఓ ప్రైవేటు సంస్ధను సలహాదారులుగా నియమించింది. ఇరు కంపెనీలు సాంకేతిక సమస్యలు పరిష్కరించడం తోపాటు ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, భూగర్భ మార్గం, బైకళ స్టేషన్ రూపురేఖలపై మ్యాపును రూపొందిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.జపాన్ సంస్థకు బాధ్యతలు.. సీఎస్ఎంటీ–కల్యాణ్ జంక్షన్ల మధ్య ఒకప్పుడు నాలుగు రైల్వే లేన్లు ఉండేవి. వీటిలో రెండింటిని స్లో రైళ్లకు, రెండు ఫాస్ట్ రైళ్లకు కేటాయించారు. కానీ దూరప్రాంతాల రైళ్లకు ప్రత్యేకంగా లేన్లు లేకపోవడంతో మూడు, నాలుగో ఫాస్ట్ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు లేన్ల మీదుగా ఇటు లోకల్ రైళ్లు, అటు దూర ప్రాంతాల రైళ్లు రాకపోకలు సాగించడంవల్ల వాటిపై అదనపు భారం పడుతోంది.కొత్త రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం కూడా లేకపోవడంతో దూరప్రాంతాల రైళ్లు నడిపేందుకు ప్రత్యేకంగా ఐదు, ఆరో రైల్వే లేన్లు వేయాలని సుమారు మూడు దశాబ్ధాల కిందటే ప్రతిపాదన సిద్ధమైంది. స్ధలం అనుకూలంగా ఉన్న కుర్లా–కల్యాణ్ మధ్య ఐదు, ఆరో లేన్ల పనులు పూర్తిచేశారు. దీంతో కుర్లా–కల్యాణ్ స్టేషన్ల మధ్య మూడు, నాలుగో రైల్వే లేన్లపై పడుతున్న భారం కొంతమేర తగ్గింది. కానీ సీఎస్ఎంటీ–కుర్లా స్టేషన్ల మధ్య స్ధలం లేకపోవడంతో ఈ ప్రతిపాదన గత రెండు దశాబ్ధాలుగా పెండింగులో పడిపోయింది.సీఎస్ఎంటీ–కుర్లా స్టేషన్ల మధ్య 17.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో పరేల్ నుంచి కుర్లా వరకు స్ధలం కొంత అనుకూలంగా ఉంది. కానీ సీఎస్ఎంటీ–పరేల్ మధ్య స్ధలం కొరత ప్రధాన సమస్య కావడంతో ఐదు, ఆరో రైల్వే లేన్లు వేయడానికి వీలుపడలేదు. ఇప్పుడు కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులో పెను మార్పులు చేశారు. సీఎస్ఎంటీ–పరేల్ మధ్య 7.4 కిలోమీటర్ల దూరం ఉంది.ఇదీ చదవండి: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలుఐదు, ఆరో లేన్లు వేయాలంటే పట్టాలకు అనుకుని అనేక నివాస భవనాలు, వ్యాపార సంస్ధలు, స్కూళ్లు, కాలేజీ భవనాలు అడ్డువస్తున్నాయి. వీరందరికి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం చెల్లించడం రైల్వేకు పెద్ద సవాలుగా మారనుంది. కానీ ఇప్పుడు కొత్తగా నియమించిన జపాన్ ఇంజినీర్లు, ప్రైవేటు సలహదారుల సంస్ధ ఇచ్చే నివేదికపై ఈ ప్రాజెక్టు భవిత ఆదారపడి ఉంది. ఒకవేళ నివేదిక అనుకూలంగా వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ భారాన్ని భరించే ఆర్ధిక స్థోమత ముంబై లోకల్ రైల్వే బోర్డుకు ఉందా అనేది వేచిచూడాల్సిందే. -
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్షా సమావేశం గురువారం ముంబైలో జరిగింది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం మీటింగ్‌కు రాలేదు. కాగా యూకే పర్యటనలో టీమిండియా ఘోర పరాభవాలు చవిచూసిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లలో ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ 1-2తో ఓటమిపాలైంది.రోహిత్ విషయంలో మరోసారి వదంతులుఈ నేపథ్యంలో జూలైలోనే సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. శ్రీలంక పర్యటన కారణంగా వాయిదా పడింది. అయితే, గురువారం జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌లోనే టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ భవితవ్యంపై కూడా చర్చ జరుగనుందనే వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఊహాగానాలు వినిపించాయి. రిటై ర్మెంట్ తీసుకునేలా అతడిపై ఒత్తిడి పెరిగిందనే రూమర్లు వినిపించాయి.ఆజ్యం పోయాలనుకోవడం లేదుఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. వదంతులకు నేను ఆజ్యం పోయాలనుకోవడం లేదు. అతడు అన్ని మ్యాచ్‌లలోనూ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు.ఇంతకంటే ఇంకేం కావాలి? చివరగా లార్డ్స్‌లో ఆడిన వన్డేలో అతడు 130-140 పరుగులు సాధించాడు. అయినా ఇంకా ఎందుకీ ప్రచారం? వదంతులు వ్యాప్తి చేసే వారికి నేను ఊతం ఇవ్వాలని అనుకోవడం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు. అయితే, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రోహిత్‌ను కచ్చితంగా ఆడిస్తామని మాత్రం సైకియా చెప్పలేకపోయారు. దీంతో యాజమాన్యం తీరుపై అభిమానులలో మరోసారి సందేహాలు రేకెత్తాయి. ఇదిలా ఉంటే.. అజిత్ అగార్కర్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కూడా సైకియా స్పందించారు. మీటింగ్ గురించి ముందుగా సమాచారం ఇవ్వలేకపోయామని.. అందుకే అగార్కర్ రాలేదని పేర్కొన్నారు. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా
Abhishek Agarwal Success story ముంబైకి చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు అభిషేక్ అగర్వాల్ జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనుభవించిన కష్టాల గురించి పంచుకున్న వివరాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు అనుభవించి తీరాలనీ, కడుపు మాడే కష్టాల్లోంచే ఎదగాలనే కసి పుట్టుకొస్తుందని, జీవితంలో అట్టడుగు స్థాయికి పడిపోయినప్పుడు మాత్రమే ఒక రకమైన ధైర్యం వస్తుందన్న ఆయన వ్యాఖ్యలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి.అభిషేక్ అగర్వాల్ లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆయన 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వరుసగా 7 రోజుల పాటు కనీసం తినడానికి తిండికి డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో కేవలం బ్రెడ్ తింటూ, నీళ్లు తాగుతూ పొట్ట నింపుకున్న వైనాన్నిగురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిని ఎదుర్కోవాల్ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ డబ్బుల్లేకపోవడం అంటే సరదాగా టూర్లకు వెళ్లకపోవడం లేదా షాపింగ్ చేయకపోవడం కాదనీ కనీసతినడానికి కూడా డబ్బులు లేని పేదరికమని స్పష్టం చేశారు.కాలే కడుపు నేర్పిన పాఠంఆ 7 రోజుల ఆకలి కంటే, ఆ సమయంలో కలిగిన 'నిస్సహాయత' తన మనసుపై తీవ్రమైన ముద్ర వేసిందని చెప్పారు. ఒకప్పుడు అత్యంత కష్టకాలంగా భావించిన ఆ రోజులు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితం పట్ల తన దృక్పథాన్ని తీర్చిదిద్దిన అనుభవాలలో ఒకటిగా మారాయన్నారు. అయితే జీవితంలో అత్యంత దిగువ స్థాయికి పడిపోయినా, తాను దానిని తట్టుకుని బ్రతకగలననే నమ్మకం, ధైర్యం తనకు ఆ సందర్భంలోనే పుట్టిందన్నారు.ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారుఅంతేకాదు ఆ అనుభవం ఇచ్చిన ధైర్యమే ఆ తర్వాత వ్యాపారంలో ఎదురైన నష్టాలు, రిస్కులు, ఓటములను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసిందని తెలిపారు. అయితే, కష్టాల నుండి స్థైర్యాన్ని నేర్చుకోవడానికి, పేదరికాన్ని ఆదర్శంగా భావించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించారు.పేదరికాన్ని లేదా బాధలను గొప్పగా చూపించడం తన ఉద్దేశం కాదని, కానీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లను తట్టుకునే శక్తి మనకు ఉందనే విషయం అట్టడుగుకి పడిపోయినప్పుడే తెలుస్తుందని వివరించారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలునెటిజన్ల స్పందనఅగర్వాల్ పోస్ట్‌పై అనేకమంది నెటిజన్లు స్పందించారు. గొప్ప పోస్ట్. కొన్నిసార్లు అత్యంత కఠినమైన క్షణాలు, విజయం ఎప్పటికీ నేర్పలేని ఒక విషయాన్ని మనకు నేర్పిస్తాయి: మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ తట్టుకోగలమని ఒకరు, తమ జీవితాల్లో కూడా ఇలాంటి కష్ట సమయాలను ఎదుర్కొన్నామని, ఆ రోజులు ఇచ్చిన ధైర్యమే తమను ఇప్పుడు ఏ సమస్యనైనా ఎదుర్కొనేలా చేస్తోందని మరొకరు కామెంట్స్ చేశారు.'దివాలా' అనే పదానికి నిర్వచనాన్ని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు ఫన్నీగా స్పందించారు.ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు -
గణేశ్ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు
ముంబై: రాబోయే గణేశ్ ఉత్సవాల్లో ఆరు అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వినాయక విగ్రహాలను తప్పనిసరిగా కృత్రిమ చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ).. కోర్టు తీర్పు మేరకు ఆదేశించింది. సెప్టెంబర్ 14 నుంచి పది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రభుత్వ అధికారులు, గణేశ్ మండపాల ప్రతినిధులు, విగ్రహ తయారీదారుల సమీక్షా సమావేశం అనంతరం బీఎంసీ ఈ వివరాలను వెల్లడించింది.హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తుది తీర్పు వచ్చే వరకు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ముంబై వ్యాప్తంగా 281 కృత్రిమ చెరువులు, 44 బీచ్‌లు/జెట్టీలు, 23 సహజ సరస్సులతో కలిపి మొత్తం 348 నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేశారు. కృత్రిమ చెరువుల వివరాలను క్యూఆర్ కోడ్లు, గూగుల్ మ్యాప్స్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచనున్నారు. భద్రత కోసం 1,132 మంది లైఫ్‌గార్డులు, 85 అంబులెన్స్‌లు, 34 క్రేన్లు, 10 మోటార్ బోట్లను రంగంలోకి దించుతున్నారు. వీటితో పాటు 498 చెత్త సేకరణ డబ్బాలు, 326 డంపర్లు, 6,052 ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.విగ్రహాల రవాణా మార్గాల్లోని 506 రహదారులపై ఉన్న 4,279 గుంతలను, 171 డ్రైనేజీ మూతలను బీఎంసీ మరమ్మతు చేసింది. 281 చోట్ల అడ్డంకిగా ఉన్న కేబుళ్లను తొలగించి, 515 ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను కత్తిరించింది. పర్యావరణహిత వేడుకల కోసం తయారీదారులకు 858 టన్నుల మట్టి, 25,400 లీటర్ల ఎకో-ఫ్రెండ్లీ రంగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1,136 మంది విగ్రహ తయారీదారులకు అనుమతులు మంజూరయ్యాయి.ఉత్సవాల సందర్భంగా ‘శ్రీ గణేశ ఆరోగ్యచ’ పేరిట మండళ్ల వద్ద ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ముంబై మేయర్ రీతు తావ్డే తెలిపారు. వీటిలో సాధారణ ఆరోగ్య, నేత్ర పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడతారు. భక్తులకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని, రద్దీ ఉండే ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేక గదులు, మరుగుదొడ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ‘డాడీ గుర్తొస్తున్నావ్..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్‌స్టా పోస్ట్! -
లేస్ నుంచి మ్యాగీ వరకు.. అసలేం జరుగుతుందంటే?
మీరు షాపుల్లో కొనుగోలు లేస్, కుర్కురే, మ్యాగీ ప్యాకెట్‌పై తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ నిజమేనని నమ్ముతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! నవీ ముంబైలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్యాకెట్లపై ఉన్న అసలు తేదీలను చెరిపేసి.. కొత్త తేదీలతో స్టిక్కర్లు అంటించి, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం కలకలం రేపుతోంది. అధికారుల దాడుల్లో ఏకంగా రూ.75 లక్షలకు పైగా విలువైన సరుకు పట్టుబడింది.మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), నవీ ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో లేస్, కురుకురే, మ్యాగీ, నార్, రసోయ్, హెల్మాన్స్, థమ్స్ అప్, లిమ్కా వంటి శీతల పానీయాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 24 నుంచి 29 మధ్య టర్బే పారిశ్రామిక ప్రాంతాలలో సాధనా ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో ఈ దాడులు నిర్వహించారు.ఆహార ప్యాకేజింగ్‌పై ముద్రించిన తేదీలను తొలగించి వాటిపై వేరే తేదీలను ముద్రిస్తున్నారు. అసలు తయారీ సమాచారాన్ని చెరిపివేయడానికి ఇంక్జెట్ ప్రింటర్లు, థిన్నర్లు, ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్కర్లను ఉపయోగిస్తున్నట్లు ఎఫ్‌డీఐ అధికారులు గుర్తించారు. పదార్థాలు, పోషకాహార విలువలకు సంబంధించిన వివరాలున్న లేబుళ్లను తొలగించి.. వాటి స్థానంలో కొత్త స్టిక్కర్లను అతికించినట్లు తేలింది. ముంబైతో పాటు ఢిల్లీ, నోయిడాకు చెందిన ఎగుమతి-దిగుమతి కంపెనీలకు కూడా ఈ మోసంలో ప్రమేయం ఉన్నట్లు సమాచారం. -
అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి ఆయన్ని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది.అహింసా పద్ధతుల్లో.. శాంతియుత మార్గాల్లో అన్నా హజారే గతంలో పలు సత్యాగ్రహాలు చేశారు. ఇప్పటిదాకా ఆయన 22 సార్లు నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇండియా అగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) మాత్రం ఆయనకు బాగా పేరొచ్చింది. ఆ తర్వాత రైతు చట్టాలు సహా అనేక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవలి నీట్ నిరసనలపై ఆయన స్పందించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు సంఘీభావంగా జూలై 23న రెండు గంటలపాటు మౌన దీక్ష కూడా చేపట్టారు.89 ఏళ్ల హజారే.. వైరల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలతో.. తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. రాలేగావ్ సిద్ధిలో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. బాంబే ఆస్పత్రిలో వైద్యుడు గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హజారే ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.కేజ్రీవాల్‌తో కలిసి..2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జనలోక్‌పాల్ బిల్లును బలంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించడంతో ప్రభుత్వం జనలోక్‌పాల్ బిల్లుపై చర్చలకు దిగింది. ఈ ఉద్యమంలో సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు హజారేకు కీలక సహచరులుగా ఉన్నారు. హజారే ఉద్యమానికి కేజ్రీవాల్ బలమైన మద్దతు ఇవ్వడంతో ఇద్దరి పేర్లు అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. అనంతరం అదే ఉద్యమం నేపథ్యంలో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.ఇదీ చదవండి: బీజేపీ సర్కార్‌కు ఆరేళ్ల పిల్లాడి వార్నింగ్! -
ముంబైలో పాలు మరింత ప్రియం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు
ముంబై నగరవాసులకు పాలు మరింత ప్రియం కానున్నాయి. స్థానిక పశువుల షెడ్లు, డెయిరీల నుంచి నేరుగా సరఫరా చేసే ‘టబెలా’ పాల టోకు ధరను పెంచాలని ముంబై మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (MMPA) నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి లీటర్ టోకు ధరను ప్రస్తుతం ఉన్న రూ.93 నుంచి రూ.102కు పెంచనుంది. అంటే లీటర్‌పై రూ.9 పెరుగుదల. ఈ ధరలు 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటాయి.టోకు ధర పెరగడంతో వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సుమారు రూ.100కు లభిస్తున్న ఈ పాలు.. కొత్త ధరల అమలుతో రిటైల్ మార్కెట్లో లీటర్‌కు దాదాపు రూ.110 వరకు చేరొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.ఎందుకు పెంచారంటే..పశువుల పెంపకం, పాల ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు భారీగా పెరగడమే ధరల సవరణకు ప్రధాన కారణమని అసోసియేషన్ వెల్లడించింది. పశుదాణాలో ఉపయోగించే ధాన్యాలు, చుని, శనగ చుని, మొక్కజొన్న, నూనెగింజల పిండి (ఆయిల్ కేక్స్), పచ్చి గడ్డి వంటి వాటి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. కొన్ని దాణా పదార్థాల ధరలు ఏడాది వ్యవధిలో దాదాపు 25 శాతం వరకు పెరిగినట్లు అసోసియేషన్ పేర్కొంది. పశువుల నిర్వహణ, రవాణా తదితర ఖర్చులు కూడా పెరగడంతో పాత ధరలకు పాలు విక్రయించడం కష్టంగా మారిందని తెలిపింది.పండుగల వేళ మరింత భారంసెప్టెంబర్లో గణేశ్ చతుర్థి సహా పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు రావడం గమనార్హం. ఈ సమయంలో పాలు, పెరుగు, స్వీట్లు, లస్సీ, ఇతర పాల ఉత్పత్తులకు డిమాండ్ సాధారణంగా పెరుగుతుంది. దీంతో పాలు మాత్రమే కాకుండా పాల ఆధారిత ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. -
చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదే.. మహిళకు వింత అనుభవం
ముంబైలో ఓ యువతి పదో అంతస్తు నుంచి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు’ అన్న చందంగా.. నేలను తాకాల్సిన ఆమె భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ‘బతికితే బలుసాకు తినవచ్చు’ అన్న సామెతను గుర్తు చేసేలా.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమెకు ఆ చెట్టే ప్రాణరక్షకంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ముంబైలోని భాండూప్ వెస్ట్ తుల్షెట్పాడ ప్రాంతంలోని సన్‌షైన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతీక్ష హివ్రాలే(26) సన్‌షైన్ బిల్డింగ్‌లోని పదో అంతస్తు ఫ్లాట్ కిటికీ నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. పదో అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమె నేరుగా నేలను తాకకుండా.. భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. దీంతో చెట్టుపై సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయి వేలాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.A woman fell from the 10th floor of a residential building at #Bhandup , #Mumbai, but was miraculously saved as she stuck to a tree. Later on, the fire brigade rescued her safely and had her admitted to a hospital. pic.twitter.com/WdhAiGj80o— Hiren Antani (@HirenAntani) August 26, 2026సమాచారం అందిన వెంటనే ఉదయం 9.32 గంటలకు ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుక్ ల్యాడర్ సహాయంతో చెట్టు వద్దకు చేరుకున్న సిబ్బంది.. ఎంతో జాగ్రత్తగా ప్రతీక్షను కిందకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె ఎడమ కాలికి గాయం అయినట్లు తేలింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం సియాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.చదవండి: నేపాల్‌కు అత్యవసర సాయం పంపిన భారత్పోలీసుల వివరాల ప్రకారం ప్రతీక్షకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆమె పదో అంతస్తు నుంచి ఎందుకు దూకింది? అసలు ఏం జరిగింది? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రస్తుతం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. వైద్యుల నుంచి మెడికల్ ఎండార్స్మెంట్ తీసుకున్నారు. ఆమె కోలుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
కుంభమేళా బడ్జెట్లో 0.1% చాలు.. 100 ప్రభుత్వ స్కూళ్లకు పునర్జన్మ!
ముంబై: మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో జరిగిన ఒక పాఠశాల వేడుకలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి. వరాళే ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులపై వెచ్చించే నిధులలో అత్యంత స్వల్ప భాగం కేటాయిస్తేనే రాష్ట్రంలో మూతపడుతున్న ఎన్నో పాఠశాలలను రక్షించవచ్చని ఆయన హితవు పలికారు.మహారాష్ట్ర ప్రభుత్వం నాసిక్-సింహస్థ (కుంభ్) మేళా కోసం అత్యంత భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తోందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.32వేల కోట్ల నుంచి రూ.34వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రస్తావించారని తెలిపారు. అలాగే మరో కారిడార్ ప్రాజెక్ట్ నిమిత్తం రూ.11వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన ఆయన.. ఈ భారీ కేటాయింపులలో కేవలం 0.1 శాతం (సుమారు రూ. 32 కోట్లు) విద్యా రంగానికి వెచ్చించినా, రాష్ట్రవ్యాప్తంగా మూతపడే దశలో ఉన్న 100 నుంచి 125 మరాఠీ మీడియం పాఠశాలలను సులభంగా కాపాడగలిగేవాళ్లమని గణాంకాలతో సహా వివరించారు.కాలక్రమేణా విద్యా రంగానికి కేటాయించే బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా మౌలిక వసతులు, బడ్జెట్ పెరగకపోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక నేల మీద పడుకున్న ముగ్గురు బాలికలు, పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేస్తూ.. అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యారంగంలో ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. -
ఐఫోన్ ఈఎంఐ మరణాల కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు గుట్టు విప్పిన పోలీసులు
ముంబై: ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మృతుడు కునాల్ పిన్ని పల్లవి పాటిల్ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎలాంటి ఫోన్ ఈఎంఐ వ్యవహారం లేదని, దయచేసి తప్పుడు ప్రచారాలు ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా తీస్గావ్లో ఆగస్టు 21న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల కునాల్ చంద్‌గుడే ఈఎంఐ పద్ధతిలో యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించలేక కుటుంబ సభ్యుల సహాయం కోరాడు. ఈ చిన్న విషయమే కుటుంబంలో వివాదానికి దారితీసింది.ఆవేశంతో ఖావడ్యా కొండపైకి వెళ్లిన కునాల్, తాను కొండపై నుంచి దూకేస్తానని బెదిరించాడు. కొండ అంచున ఉన్న కునాల్‌ను కాపాడేందుకు తండ్రి మురళీధర్ ప్రయత్నించగా.. ఇద్దరూ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి 400 నుంచి 500 అడుగుల లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. భర్త, కుమారుడు కళ్లెదుటే లోయలో పడిపోవడాన్ని తట్టుకోలేక తల్లి సంగీత కూడా అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.ఐఫోన్ ప్రచారంపై పిన్ని ఆవేదన కుటుంబ సభ్యుల అస్థికలను ఇంటికి తీసుకొచ్చే సమయంలో పల్లవి పాటిల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే వారు ప్రాణాలు తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవం. మా కుటుంబం గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేసి మమ్మల్ని మరింత వేదనకు గురిచేయవద్దు. వృద్ధులైన మా తల్లిదండ్రులకు ఈ సోషల్ మీడియా ప్రచారాలు తెలిస్తే తట్టుకోలేరు’ అంటూ ఆమె కన్నీటిపర్యమంత అయ్యారు.భార్యాభర్తల మధ్య విభేదాలే కారణమా?మరోవైపు,ఐఫోన్ ఈఎంఐ కట్టలేకే కునాల్ ప్రాణాలు తీసుకున్నారనే అంశంలో వాస్తవం లేదని పోలీసులు సైతం గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని సేకరించారు. ఆ ఆధారాల్లో కునాల్ తండ్రి మురళీధర్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, సంగీత గృహిణి. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో పెద్ద కుమారుడిని కోల్పోవడం వల్ల వీరి కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు విడివిడిగా ఉంటున్నారు. గత మూడు నెలలుగా దూరంగా ఉన్న మురళీధర్.. ఘటనకు రెండు రోజుల ముందే ఇంటికి రావడంతో గొడవలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీతకు సంబంధించిన ఒక పాత వీడియో పోలీసులకు లభించింది. ‘ఆస్తి కోసం నాకు, నా కొడుక్కి దక్కాల్సిన హక్కును నిరాకరించారు. నా సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేశారు. దీనికి కారణమైనవారు రాబోయే ఏడు తరాలు మూల్యం చెల్లించుకుంటారు’ అంటూ ఆ వీడియోలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలోని అంతరార్థంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కునాల్ తల్లి సంగీత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలిస్తే.. ఈ కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. (👉ఇదీ చదవండి: నీ తల్లికోసమైనా బ్రతకాల్సింది కదరా!) -
ఇకనుండి భారత్ లో నేరుగా మొబైల్‌కే శాటిలైట్ ఇంటర్నెట్!
-
గణేశ్ ఆగమన యాత్రలో గుడ్లతో దాడి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మజ్గావ్ పరిధిలో వినాయక విగ్రహాన్ని తీసుకువస్తున్న క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గణపతి మండలి డిప్యూటీ సెక్రటరీ వివేక్ రాణే వివరాల ప్రకారం గణేశుడి ఆగమన శోభాయాత్రను నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మండపం నుంచి సుమారు 30 నుంచి 40 మీటర్ల దూరంలో ఉన్న ఒక భవనం పైనుంచి కొందరు శోభాయాత్రపై గుడ్లు విసిరారు. విగ్రహంపై గుడ్లు పడ్డాయన్న వార్త వ్యాపించడంతో వెంటనే హిందూ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆ భవనం ఎదుట గుమిగూడారు. ఈ చర్య అత్యంత అభ్యంతరకరమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అనుమానిత భవనం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.ముంబైలో 10,000కు పైగా గణేశ మండపాలుమహారాష్ట్రలో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ముంబయిలో సుమారు 10,600 పబ్లిక్ గణేశ్ మండళ్లు ఉండగా, దాదాపు 2,500 మండళ్లు 10 రోజుల ఉత్సవాలకు ఇప్పటికే అనుమతులు పొందాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28 లక్షల గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు అంచనా.పండల్ అనుమతుల కోసం ముంబయిలో ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా బీఎంసీతో పాటు స్థానిక పోలీసు, ట్రాఫిక్ విభాగాల నుంచి ఎన్వోసీలను ఆన్లైన్లో పొందవచ్చు. దరఖాస్తులకు సెప్టెంబర్ 13 వరకు గడువు ఉంది. ఈసారి పలు పందిళ్లో ఆకర్షణీయమైన థీమ్‌లను తీర్చిదిద్దుతున్నారు.ఇది కూడా చదవండి: ‘సిల్క్యారా’లో మళ్లీ ప్రమాదం.. 2023ను గుర్తుకు తెస్తూ.. -
దావూద్ నేర సామ్రాజ్యానికి పునాది.. ఈ మహిళనే!
ముంబై నేర చరిత్రలో ఎందరో క్రూరమైన గ్యాంగ్స్టర్లు ఉన్నారు. అయితే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సైతం తలవంచి, కన్నతల్లిలా భావించి భయభక్తులతో నడుచుకున్న ఏకైక మహిళ ఒకరు ఉన్నారు.. ఆమె మాటే దావూద్‌కు వేదవాక్కు.. ముంబై అక్రమ మద్యం సామ్రాజ్యాన్ని శాసించి, పోలీసులతో పాటు అండర్‌వరల్డ్ డాన్లందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ మహిళే ‘జేనాబాయి దారువాలీ’. ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్ట్ ఎస్. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా వెలుగులోకి వచ్చిన ఆమె సంచలనాత్మక జీవిత ప్రస్థానం ఇది.పేదరికం నుంచి స్వతంత్ర సమరం వరకుజేనాబాయి అసలు పేరు జైనబ్. ఆమె 1920లో ముంబైలోని ఒక ముస్లిం మెమన్ హలాయ్ కుటుంబంలో జన్మించారు. తండ్రి విక్టోరియా గుర్రపు బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆరుగురు తోబుట్టువులతో కలిసి డోంగ్రీ ప్రాంతంలోని ఒక చిన్న గదిలో ఆమె బాల్యం గడిచింది. 14 ఏళ్ల వయసులోనే కలప వ్యాపారి మహమ్మద్ షా దర్వేశ్తో వివాహం జరిగింది. 1920-30ల నాటి స్వాతంత్రోద్యమంలో జేనాబాయి.. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై పోరాటాల్లో పాల్గొన్నారు. దేశ విభజనకు ముందు ముంబైలో జరిగిన మత ఘర్షణల్లో హిందువులకు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఆమె భర్త చేతిలో దెబ్బలు కూడా తిన్నారు.దేశ విభజన.. ఒంటరి పోరాటం1947లో దేశ విభజన జరిగినప్పుడు జేనాబాయి భర్త దర్వేశ్ పాకిస్థాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమెను కూడా రావాలని ఒత్తిడి చేసినప్పటికీ, జేనాబాయి భారతదేశాన్ని వీడటానికి ససేమిరా అంగీకరించలేదు. తన ఐదుగురు సంతానంతో కలిసి ముంబైలోనే ఉండిపోయారు. కుటుంబ పోషణ కోసం నగరంలో నెలకొన్న తీవ్ర ఆహార కొరతను అవకాశంగా మలుచుకున్నారు. హోల్‌సేల్ వ్యాపారులకు, బ్లాక్ మార్కెట్లో విక్రయించే దుకాణదారులకు మధ్య మధ్యవర్తిగా మారి బియ్యం వ్యాపారం ప్రారంభించారు. మెమన్ వర్గానికి చెందినది కావడంతో గుజరాతీ వ్యాపారులతో సులభంగా సంబంధాలు నెరిపారు. అలా ఆమె ‘జేనాబాయి చావలాలీ’గా గుర్తింపు పొందారు.అక్రమ మద్యం సామ్రాజ్యంలోకి ప్రవేశంతదనంతర కాలంలో ఆమె ఇక్బాల్ గాంధీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోవడంతో, పేదలకు సహాయం చేసే వరదరాజన్ ముదలియార్‌ను కలిశారు. ఆ సమయంలో బొంబాయిలో మద్యపాన నిషేధం అమల్లో ఉండటంతో వరదరాజన్ ముఠా అక్రమ మద్యం తయారీలో ఉండేది. వరదా సలహాతో జేనాబాయి మద్యం వ్యాపారంలోకి దిగారు. అనతికాలంలోనే భారీగా మద్యం అమ్ముతూ ‘జేనాబాయి దారువాలీ’గా మారారు. ఈ క్రమంలోనే వరదరాజన్ ద్వారా హాజీ మస్తాన్, కరీం లాలాలతో ఆమెకు బలమైన పరిచయాలు ఏర్పడ్డాయి.దావూద్ కుటుంబంతో బంధంఅక్రమ మద్యం వ్యాపారంతో విపరీతమైన సంపదను ఆర్జించిన జేనాబాయి, అండర్‌వరల్డ్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1962లో ఆమె ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో మద్యం నిల్వలు దొరకడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌ను కలిసి తన పేదరికాన్ని వివరించినట్లు కథనాలు వచ్చాయి. తదనంతరం ఆమె పోలీసులకు కీలక ఇన్ఫార్మర్గా మారారు. ఈ క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కాస్కర్, ఆయన భార్య అమీనాలతో జేనాబాయికి సాన్నిహిత్యం పెరిగి కుటుంబ సభ్యురాలిగా మారారు. వారి కుమారుడే దావూద్ ఇబ్రహీం.దావూద్‌ను కాపాడిన మహిళా గాడ్మదర్చిన్నతనంలో దావూద్ గ్యాంగ్ వార్స్‌లో తిరుగుతూ తండ్రికి తలనొప్పిగా మారేవాడు. ఒకసారి మనీష్ మార్కెట్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హమీద్ ‘చూహా’పై దావూద్ తీవ్ర దాడి చేయడంతో అతను ఐసీయూ పాలయ్యాడు. కొడుకు ఆగడాలతో విసిగిపోయిన కానిస్టేబుల్ ఇబ్రహీం కాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దావూద్ వారం రోజుల పాటు ఇంటికి దూరంగా దాక్కున్నాడు. ఆ సమయంలో జేనాబాయి రంగంలోకి దిగి దావూద్ తల్లిదండ్రులను శాంతింపజేయడమే కాకుండా, పోలీసు అధికారులతో మాట్లాడి కేసు నుంచి దావూద్‌ను రక్షించారు. నాటి నుంచి దావూద్ ఆమెను కన్నతల్లిలా గౌరవించేవాడు.రక్తపాతానికి ముగింపు.. గ్యాంగ్స్టర్ల మధ్య సంధిదావూద్ ఇబ్రహీంకు, ఇతర ముస్లిం గ్యాంగ్‌లకు మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తున్న సమయంలో జేనాబాయి కీలక మధ్యవర్తిత్వం వహించారు. పఠాన్ గ్యాంగ్ లీడర్ కరీం లాలా, హాజీ మస్తాన్‌లతో దావూద్‌కు సమావేశం ఏర్పాటు చేశారు. జేనాబాయి చొరవతో కరీం లాలా వర్గం, దావూద్, అతని సోదరుడు సాబిర్, మాజిద్ కాలియా, హుస్సేన్ సోమ్జీ తదితరులు చేతులు కలిపారు. పరస్పరం కొట్టుకు చచ్చే ముఠాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, ముంబై అండర్‌వరల్డ్‌లో సరికొత్త నేర సిండికేట్‌ను నడిపించిన ఘనత జేనాబాయికే దక్కింది.ఇది కూడా చదవండి: బెంగాల్ విభజనకు తావులేకుండా గూర్ఖాలాండ్‌కు పరిష్కారం -
ఏకంగా 360 కంటైనర్లతో.. భారతీయ రైల్వే చర్రితలోనే..
భారతీయ రైల్వే రవాణా రంగంలో మరొక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారతీయ రైల్వే తన మొదటి 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలును నడిపింది. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి గుజరాత్‌లోని వడోదర డివిజన్ పరిధిలో ఉన్న వర్ణామ వరకు రైల్వే శాఖ తొలిసారిగా భారీ 'డబుల్ స్టాక్ లాంగ్ హాల్' కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది.ఈ రైలు ఆగస్టు 21, 2026 రాత్రి 7 గంటలకు జేఎన్పీటీ నుంచి బయలుదేరి.. 360 టీఈయూల (కంటైనర్లు) సరుకును మోసుకెళ్ళింది. జీసీటీ టెర్మినల్ చేరుకోవడానికి ఇది సుమారు 422 కి.మీ దూరం ప్రయాణించింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ రవాణా కోసం రెండు డబల్-స్టాక్ రాక్లను కలిపి ఒకే లాంగ్-హాల్ రైలుగా ఏర్పాటు చేశారు. ప్రతి రాక్ 180 టీఈయూలను మోసుకెళ్ళింది. దీంతో రైలు మొత్తం సామర్థ్యం 360 టీఈయూలకు చేరింది.ఇదీ చదవండి: ఆ విషాదానికి ఒక్కరోజు ముందు తల్లి సంచలన వీడియోఈ లాంగ్-హాల్ రైలులో రెండు డబల్-స్టాక్ రాక్లు ఉన్నాయి. జెఎన్పీటీ నుండి వడోదర వరకు వెళ్లిన ముందు రాక్ 45+1 లోడ్‌ను కలిగి ఉంది, దీనిని 60311 లోకోమోటివ్ లాగింది. దీని బరువు 1,817 టన్నులు. అలాగే జెఎన్పీటీ-వడోదర మధ్యే నడిచిన వెనుక రాక్ కూడా 45+1 లోడ్‌ను కలిగి ఉంది. దీనిని 24690 లోకోమోటివ్ లాగింది. ఇది 2,105 టన్నుల బరువును మోసుకెళ్ళింది. ఒకే రైలులో ఎక్కువ కంటైనర్లను రవాణా చేయడం ద్వారా ఓడరేవుల నుండి కంటైనర్లను త్వరగా తరలించడంతో టెర్మినళ్ల వద్ద రద్దీని తగ్గించవచ్చు. 📢 First Long Haul (1.3 km) Double Stack container train on Western Dedicated Freight Corridor JNPT, Mumbai -> Vadodara, Gujarat pic.twitter.com/CY9kWabvrM— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 22, 2026డబల్-స్టాక్ రైలు ఆపరేషన్ల ద్వారా కంటైనర్లను ఒకదానిపై ఒకటి ఉంచి రవాణా చేయవచ్చు.. తద్వారా ఒకే ప్రయాణంలో ఎక్కువ సరుకును రవాణా చేయడానికి వీలవుతుంది. ఈ రైలు విద్యుత్ ద్వారా నడుస్తోంది కాబట్టి.. డీజిల్‌తో నడిచే రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు ఒకే లాంగ్-హాల్ డబల్-స్టాక్ కంటైనర్ రైలు భారీ సంఖ్యలో ట్రక్కులు అవసరమయ్యే సరుకును సులభంగా రవాణా చేయగలదని జాతీయ రవాణా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. -
వినాయక ఆగమన్‌లో విషాదం.. ఇద్దరు మృతి!
ముంబై: మహానగరం ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ‘భులేశ్వర్‌చా రాజా’ వినాయక విగ్రహ ఆగమన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ విగ్రహం రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు.#WATCH | Mumbai, Maharashtra | Two dead and five injured after a massive Ganesh Idol of Bhuleshwar Cha Raja fell during its arrival procession at the Balaram Merchant Road in the Bhuleshwar area. The names of the deceased are Sanket Nevshe, 33 years, and Brijesh Hemant Joshi,… pic.twitter.com/QMOC0Y1oLr— ANI (@ANI) August 22, 2026ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 9:51 గంటల సమయంలో భులేశ్వర్లోని జై అంబే చౌక్, కబూతర్‌ఖానా సమీపంలో విగ్రహాన్ని తీసుకొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న వెంటనే బీఎంసీ సిబ్బంది, ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బంది సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని జీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతులను సంకేత్ నేవ్శే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిలో ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ‘భులేశ్వర్‌చా రాజా’ వేడుకల కోసం భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: పర్షియన్ గల్ఫ్‌లో ‘మంటలు’.. యూఎస్ వైఖరిపై ధ్వజం -
వడాపావ్‌కు అరవయ్యేళ్లు
‘ఇండియన్ బర్గర్’గా, ‘బాంబే బర్గర్’గా పేరుపొందిన ‘వడాపావ్’ పుట్టి నేటికి అరవయ్యేళ్లవుతోంది. ముంబైలో పుట్టిన ఈ సత్వరాహార పదార్థం అనతి కాలంలోనే ముంబై ప్రజల ఆహార సంస్కృతిలో భాగంగా మారింది. అంతటితోనే ఆగిపోకుండా, శరవేగంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. అసలు వడాపావ్ ఆవిష్కరణే ఒక ఆసక్తికరమైన చరిత్ర. అవసరమే ఆవిష్కరణకు పునాదిఎటు చూసినా, నిరంతర జనసమ్మర్దంతో కిటకిటలాడే మహానగరం ముంబై. అరవయ్యేళ్ల కిందట ముంబై కార్మికవర్గం ఎక్కువగా ఉదయం చపాతీలు తినేవారు. చపాతీలతో పాటు ఉడికించిన బంగాళ దుంపలను ముద్దలా చిదిమేసి, కాస్త వేయించి, మసాలాలు కలిపిన కూరను నంజుకునేవారు. హడావుడి పనివేళల్లో వీటిని తినడం కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ముంబై నడిబొడ్డులోని దాదర్ ప్రాంతానికి చెందిన అశోక్ వైద్య అనే పాకనిపుణుడు 1966లో ‘వడాపావ్’ను ఆవిష్కరించాడు.బన్ రొట్టెను అడ్డంగా చీల్చి, అందులో మసాలాలు దట్టించి, వేపిన బంగాళదుంపల ముద్దను కూరి, నంజుకోవడానికి వేపిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి చేర్చిన కొబ్బరి చట్నీతో పాటు వడ్డించడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా తినడానికి సులువుగా ఉండటమే కాకుండా, అతి రుచిగా ఉండటంతో వడపావ్ ముంబై జనాలను ఆకట్టుకుంది. అశోక్ వైద్య దాదర్ రైల్వేస్టేషన్ ఎదుట తన వడాపావ్ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. డెబ్బయిల ప్రారంభంలోనే ఇలాంటి స్టాల్స్ పదుల సంఖ్యలో ముంబై నలుమూలలా ఏర్పడ్డాయి. ప్రస్తుతం కేవలం ముంబై నగరంలోనే ఏకంగా ఇరవైవేలకు పైగా వడాపావ్ స్టాల్స్ ఉన్నాయి. వీటికి తోడు స్టార్ హోటళ్లు కూడా వడాపావ్‌ను వడ్డిస్తున్నాయి. తొంభైల నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నింటితో పాటు విదేశాల్లోని భారతీయ రెస్టరెంట్లకు కూడా వడాపావ్ విస్తరించింది.వడాపావ్ ఒక సాంస్కృతిక ప్రతీకఒకప్పుడు ముంబైలో ఎక్కువగా ఉడుపి హోటళ్లు ఉండేవి. ముంబై కార్మికుల్లో ఎక్కువమంది కాటన్ మిల్లుల్లో పనిచేసేవారు. అరవైల కాలంలో కాటన్ మిల్లులు మూతపడటంతో చాలామంది కార్మికులు ఉపాధి పోగొట్టుకున్నారు. అప్పటి శివసేన అధినేత బాల్ ఠాక్రే స్థానికంగా చిరువ్యాపారాలు సొంతగా ప్రారంభించి, ముంబై కార్మికులు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే అశోక్ వైద్య వడాపావ్‌ను ఆవిష్కరించి, సొంత వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపార విజయం స్ఫూర్తితో మరింతమంది ఈ రంగంలోకి వచ్చారు. వడాపావ్ ప్రపంచవ్యాప్తంగా ఉనికి చాటుకోవడంతో దీని గౌరవార్థం ఏటా ఆగస్టు 23న ‘ప్రపంచ వడపావ్ రోజు’గా జరుపుకోవడాన్ని 2001 నుంచి ప్రారంభించారు. -
‘సింగం’ తుకారాం రాజకీయాల్లోకి వస్తారా? కుండబద్దలుకొట్టిన అధికారి
ముంబై: మహారాష్ట్ర ఆహార, ఔషధాల కమిషనర్ తుకారాం ముండే(2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి)కు ప్రజల నుంచి వచ్చిన ప్రశంసలు మరే ఇతర ఎఫ్‌డీఏ కమిషనర్‌కూ ఇప్పటివరకూ దక్కలేదనే చెప్పుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఈటరీ కేంద్రాల్లో అపరిశుభ్రతపై కఠిన చర్యలు తీసుకోవడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. నిబంధనలను కఠినంగా అమలు చేసే తీరుతో తరచూ “ఐఏఎస్ సింగం”గా ముండేను పిలుస్తారు. ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించే తీరుతో తన కెరీర్లో పలువురు రాజకీయ నాయకులతో తరచూ విభేదించారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. రాజకీయాల్లోకి వస్తారా? అని ఆయనను అడిగారు. దీనికి కూడా ఆయన నిజాయితీగా, సూటిగా సమాధానం ఇచ్చారు.“అసలు లేదు. దానికి దాని సొంత అవసరాలు ఉంటాయి. నేను సూటిగా మాట్లాడే వ్యక్తిని, చాలా బహిరంగంగా, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. రాజకీయాలకు ఈ లక్షణాలు నచ్చుతాయో లేదో నాకు తెలియదు” అని ముండే అన్నారు. ప్రజాసేవలో ఉండాల్సిన విధానానికి రాజకీయాల్లో ఎదురయ్యే సవాళ్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.బ్యూరోక్రాట్‌గా తాను అన్ని పనులు చేసినట్టే రాజకీయాల్లోనూ కొత్త ఒరవడిని సృష్టించగలరా? అని ముండేను అడగగా.. ఆయన స్పందిస్తూ.. “నేను ఒక విషయంలో మంచిగా ఉంటే, దానినే కొనసాగించాలి” అని చమత్కరించారు. మహారాష్ట్ర ఎఫ్‌డీఏగా బాధ్యతలు చేపట్టి కేవలం 3 నెలలే అయినా, రాష్ట్రంలోని రెస్టారెంట్లు, గోదాములు, ఆహార దుకాణాలపై కఠిన చర్యలతో ముండే అందరి దృష్టిని ఆకర్షించారు.నాకు నేనే సవాలు విసురుకుంటా.. వంటగదుల్లో బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు కనిపించడంతో డొమినోస్, పిజ్జా హట్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. ముంబైలో చాలా కాలంగా కొనసాగుతున్న ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను కొంతకాలం నిలిపివేశారు. బ్లింకిట్, జెప్టోకు చెందిన డార్క్ స్టోర్లలో నిర్వహించిన దాడుల్లో బల్లులు, బొద్దింకలు, గడువు ముగిసిన ఉత్పత్తులు బయటపడ్డాయి. బాంబే హైకోర్టు క్యాంటీన్లలోనూ తనిఖీలు నిర్వహించడానికి ఆయన వెనుకాడలేదు. జూలై 31 నాటికి తన విభాగం 3,000 తనిఖీలు నిర్వహించిందని, రూ.55 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుందని, 165 సంస్థల లైసెన్సులను నిలిపివేసిందని ముండే తెలిపారు.కఠిన పరిపాలనా నిర్ణయాలు తీసుకునే అధికారిగా ముండేకు ఉన్న పేరుతో 21 ఏళ్లలో ఆయన దాదాపు 25 సార్లు బదిలీ అయ్యారు. సవాళ్లు విసరడం ఇష్టమా? అని ఆయనను అడగగా.. ముండే వెంటనే స్పందిస్తూ.. “నాకు నేనే సవాలు విసురుకుంటాను” అని చెప్పారు.కాగా, బీడ్‌లోని ఓ గ్రామంలో సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి మహారాష్ట్ర ఎఫ్‌డీఏగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ముండే చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఆయన పలువురు ముఖ్యమంత్రుల కింద పనిచేశారు. ఎవరైనా తనకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఉన్నారా? అని అడగగా ముండే చమత్కరిస్తూ “అందరూ నాకు ఇష్టమైనవారే” అని అన్నారు.ఇదీ చదవండి: ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ -
ముంబై లోకల్ స్టేషన్ లో విద్యుత్ షాక్.. క్షణాల్లో కుప్పకూలిన వ్యక్తి
-
ముంబై 3.0: 124 గ్రామాలతో కొత్త నగరం!
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక నగరాల్లో ముంబై ఒకటి. ఈ నగరం ఒకప్పుడు పెరిగినంతగా.. ఇప్పుడు పెరగడానికి కావలసినంత స్థలం లేకుండా పోయింది. భూమి పరిమితంగా ఉంది, ఆస్తుల ధరలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా.. రోడ్లు, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముంబై నగర భవిష్యత్ విస్తరణకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ముంబై 3.0'గా పిలుస్తున్న కర్నాల-సాయి-చిర్నేర్ (KSC) న్యూ టౌన్‌ను అభివృద్ధి చేయాలని చూస్తోంది.ఈ కొత్త నగరం రాయగఢ్ జిల్లాలోని ఉరాన్, పన్వెల్, పెన్ తాలూకాల్లోని 124 గ్రామాలను కలుపుకుని సుమారు 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి కానుంది. ఈ ప్రాంతానికి 'ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ' (MMRDA)ను న్యూ టౌన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమించారు. అంటే.. ఇది సాధారణంగా ఏర్పడే కొత్త నివాస ప్రాంతం కాదు.. ముందస్తు ప్రణాళికతో నిర్మించే ఒక పెద్ద నగరమన్నమాట.ముంబై 3.0 ఎందుకు అవసరం?ముంబై ఇప్పటికే తన అసలు ప్రాంతాన్ని దాటి విస్తరించింది. ఆ తర్వాత నవి ముంబై ఒక ప్రధాన ప్రత్యామ్నాయ నగరంగా అభివృద్ధి చెందింది. కానీ.. నవి ముంబైలో కూడా భూమికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల భవిష్యత్తులో పెరిగే జనాభా, ఉద్యోగాలు, పరిశ్రమలు, గృహ అవసరాలను తీర్చడానికి మరో పెద్ద పట్టణ కేంద్రం అవసరమైంది.ముంబై 3.0 ప్రాజెక్టులో కేవలం కొత్త భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా.. ఉద్యోగాలు, నివాసాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం, టెక్నాలజీ, లాజిస్టిక్స్ వంటి అన్ని రంగాలను ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసి, సమగ్ర నగరంగా రూపొందించాలని భావిస్తున్నారు.ప్రణాళిక ప్రకారం.. సుమారు 104 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో.. గ్రీన్ జోన్లు, అడవులు, గ్రామీణ ప్రాంతాలను కూడా రక్షించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడే ప్రయత్నం జరుగుతోంది.ముంబై 3.0కి ప్రధాన బలంఈ కొత్త నగరానికి ఉన్న అతిపెద్ద ప్రయోజనం కనెక్టివిటీ. ముంబై-నవి ముంబై మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేసిన అటల్ బిహారీ వాజ్‌పేయీ సెవ్రీ-న్హావా శేవా అటల్ సేతు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకం. అదే విధంగా.. నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పన్వెల్-కర్జత్ రైల్వే కారిడార్, విరార్-అలీబాగ్ మల్టీమోడల్ కారిడార్, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే వంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతాన్ని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించనున్నాయి.దీని వల్ల భవిష్యత్తులో.. ముంబై 3.0 ప్రాంతం ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఆరోగ్య సేవలు, విద్య, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.రియల్ ఎస్టేట్‌పై ప్రభావంముంబై 3.0 అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సాధారణంగా వాటి చుట్టుపక్కల కొత్త నివాస, వాణిజ్య ప్రాంతాల అభివృద్ధికి దారితీస్తాయి.అటల్ సేతు, కొత్త విమానాశ్రయం, రైల్వే, మల్టీమోడల్ కారిడార్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే.. ఈ ప్రాంతంలో కొత్త రియల్ ఎస్టేట్ మైక్రో-మార్కెట్లు ఏర్పడవచ్చు. ఉద్యోగాలు పెరిగితే.. వాటికి అనుగుణంగా ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అయితే.. దీని ప్రయోజనాలు వెంటనే కనిపించవు. ఇలాంటి భారీ నగర ప్రాజెక్టులు పూర్తిగా అభివృద్ధి చెందడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. కాబట్టి.. దీనిని తక్షణ రియల్ ఎస్టేట్ బూమ్‌గా కాకుండా దీర్ఘకాలిక నగర అభివృద్ధి ప్రణాళికగా చూడాలి.భారీ పెట్టుబడులుముంబై 3.0 ప్రాజెక్టుకు ప్రభుత్వ స్థాయిలో కూడా గణనీయమైన ప్రాధాన్యం లభిస్తోంది. 2026-27 సంవత్సరానికి MMRDA సుమారు రూ.4,000 కోట్లను కర్నాలా-సాయి-చిర్నేర్ న్యూ టౌన్ అభివృద్ధికి కేటాయించింది.ఇదే సమయంలో భూముల విషయంలో 124 గ్రామాల భూస్వాములతో వ్యవహరించడం కూడా కీలకమైన అంశం. భూస్వాములకు నగదు పరిహారం, డెవలప్మెంట్ రైట్స్, ల్యాండ్ పూలింగ్ వంటి వివిధ మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు విజయవంతం కావాలంటే భూసేకరణ, స్థానిక ప్రజల ప్రయోజనాలు, పునరావాసం వంటి అంశాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది.ముంబై 3.0 భవిష్యత్తుముంబై 3.0 అనేది ఒక్కరోజులో ఏర్పడే నగరం కాదు. ప్రణాళిక, భూమి సంబంధిత ప్రక్రియలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, పెట్టుబడులు, పరిశ్రమల రాక వంటి అనేక దశల తర్వాతే ఇది పూర్తిస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు తొలి దశ ఈ దశాబ్దం చివరి భాగంలో రూపుదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తం నగర వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. -
ఆటో, ట్యాక్సీ ప్రయాణికులకు అలర్ట్
దాదర్ (మహారాష్ట్ర): ముంబైకర్లపై త్వరలో ఆటో, ట్యాక్సీ చార్జీల భారం పడనుంది. అందుకు అవసరమైన ప్రతిపాదన సిద్ధమైంది. దీంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎమ్మెమ్మార్) పరిధిలో తిరుగుతున్న ట్యాక్సీ, ఆటో చార్జీలు పెరగనున్నాయి. ట్యాక్సీలకు కనీసం రూ.రెండు లేదా మూడు, ఆటోలకు కనీసం రూపాయి చొప్పున చార్జీలు పెరగనున్నాయి. ఆ ప్రకారం ట్యాక్సీలకు 1.5 కిలోమీటరు దూరానికి ఇదివరకు కనీస చార్జీలు రూ.31 ఉండగా ఇకనుంచి రూ.33 లేదా 34 చొప్పున, అలాగే ఆటోలకు కనీస చార్జీలు రూ.26 ఉండగా ఇక నుంచి రూ.27 చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఆ తరువాత దూరాన్ని బట్టి అదనంగా చార్జీలు పెరుగుతాయని ఆటో, ట్యాక్సీ చాలక్, మాలక్ సంఘటన చీఫ్ థంపీ కురియన్ చెప్పారు.చార్జీల పెంపు ప్రతిపాదనను ఇటీవలే రవాణాశాఖ కార్యాలయం నుంచి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఎమ్మెమ్మార్టీఏ)కు పంపించారు. ఎమ్మెమ్మార్టీఏ ఆమోదం లభించగానే కొత్తచార్జీలు అమలులోకి వస్తాయి. అయితే ట్యాక్సీ, ఆటో ఎల్రక్టానిక్ మీటర్లను ఆధీకృత మెకానిక్‌ల ద్వారా రీకాలిబ్రేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకు కొంత సమయం పడుతుంది. ఇందుకోసం ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) కొన్ని రోజుల గడువు ఇస్తుంది. ఆ లోపు మీటర్లలో మార్పులు చేసుకోవల్సి ఉంటుంది. లేదంటే ట్యాక్సీ, ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకుంటారు. కొద్ది రోజుల కిందట మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఎమ్మెస్సార్టీసీ) 14.95 శాతం చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆటో, ట్యాక్సీల చార్జీలు కూడా పెరగనున్నాయి. దీంతో ప్రయాణికులపై ఆర్థికభారం మరింత అదనం కానుంది.ఈశాన్య దేశాలలో జరుగుతున్న యుద్దం కారణంగా భారత దేశంలో తరుచూ డీజీల్, పెట్రోల్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు పెరుగుతున్నాయి. గత నాలుగైదు నెలల కాలవ్యవధిలో ఏకంగా మూడు, నాలుగుసార్లు ఇంధనం చార్జీలు పెరిగాయి. తరుచూ పెరుగుతున్న సీఎన్జీ ధరలతో చార్జీలు పెంచకుండా నడపడం డ్రైవర్లకు, యజమానులకు గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు రోడ్లన్నీ పాడైపోవడంవల్ల నిర్వహణ భారం కూడా పెరిగిపోయింది. దీంతో ఆటో, ట్యాక్సీల చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని యూనియన్ ప్రతినిధులు ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు.చదవండి: పెరగనున్న గణేశ్ విగ్రహాల ధరలుదీనిపై విచారించిన ఆర్టీఓ చార్జీల పెంపు ప్రతిపాదనను ఎమ్మెమ్మార్టీయే ఆమోదం కోసం పంపించింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వడమే కాదు వారి ప్రవర్తనలో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని ముంబైకర్లు అంటున్నారు. సమీప కిరాయిలు నిరాకరించడం, ఎక్కువ చార్జీలు వసూలు చేయడం, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, లోకల్ రైల్వే, మెట్రో స్టేషన్ల బయట ఆటోలు, ట్యాక్సీలు ఇష్టమున్నట్లు పార్క్‌చేసి కృత్రిమ ట్రాఫిక్ జామ్ సృష్టిస్తున్నారు. వీటిన్నిటిని అరికట్టేవిధంగా నియమాల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు. -
‘‘మా శవాలను తీసుకెళ్లండి’’ : భార్యాబిడ్డల్ని హతమార్చి, నావికుడు సూసైడ్
సాక్షి, ముంబై : ముంబైలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని నావీ నగర్‌లోని తమ నివాసంలో ఒక ఇండియన్ నావీ నావికుడు (Navy sailor) తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం వచ్చి మా డెడ్‌బాడీలను తీసుకెళ్లండి అంటూ తల్లికి పంపిన మెసేజ్‌తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇండియన్ నావీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.పురాన్మల్ శంభులాల్ మెహ్రా (30) అనే నావికుడు, భార్య ఓమా (28), మూడేళ్ల కుమారుడు యష్, ,రెండు నెలల పసిపాప ఇంట్లోనే మృతిచెంది కనిపించారు. ప్రాథమిక వివరాల ప్రకారం, మెహ్రా మొదట కుటుంబ భార్యాబిడ్డలకు విషం ఇచ్చి ఆ తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 14 రాత్రి దాదాపు 11 గంటలకు మెహ్రా తన తల్లికి వాట్సాప్‌లో "వచ్చి మా మృతదేహాలను తీసుకెళ్లండి" అని సందేశం పంపారు. మరుసటి రోజు ఉదయం తల్లి ఆ సందేశం చూసి కంగారుపడి కుమారుడికి ఫోన్ చేసింది. అటు నుంచి సమాధానం రాకపోవడంతో కంగారు పడిన తండ్రి శంభులాల్ మెహ్రా నావీ కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేశారు.వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది వారి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.భార్య బిడ్డలను హత్య చేయడానికి ముందు మెహ్రా తన మరియు తన భార్య మొబైల్ ఫోన్ల డేటాను ఫార్మాట్ (డిలీట్) చేశాడు. ఈ సంచలనాత్మక ఘటనకు ముందు, మెహ్రా తన , తన భార్య మొబైల్ ఫోన్లను ఫార్మాట్ (డేటా తొలగింపు) చేశాడు. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు.తొలగించిన డేటాను రికవర్ చేయడానికి పోలీసులు సైబర్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి విషపదార్థం ఇచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు మెడికల్, ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తున్నారు. అలాగే సహోద్యోగులు, పొరుగువారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.కుటుంబ కలహాలే కారణమా? రాజస్థాన్‌కు చెందిన మెహ్రా తీవ్రమైన కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాగే డిప్రెషన్ సమస్యతో ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని దర్యాప్తులో తేలింది. మృతుల వైద్య, ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తున్నారు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
అనంత్ అంబానీ ఔదార్యం.. ఇక్బాల్‌కు కొత్త ఆశలు!
చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఇక్బాల్ జీవితం ఎంతో కష్టంగా మారింది. దాదాపు ఐదేళ్లుగా అతడికి చెరువులో ఉండటమే కొంత ఉపశమనాన్ని ఇచ్చేది. దీంతో సాధారణంగా పిల్లలు గడిపే బాల్యం, కుటుంబంతో ఉండే సమయం అన్నీ అతడికి దూరమయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఇక్బాల్ పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత అతడి కుటుంబంలోనూ ఆందోళన పెరిగింది.ఇక్బాల్ పరిస్థితి గురించి.. విషయం వెలుగులోకి రావడంతో వైద్య నిపుణుల బృందం అతడి కేసును పరిశీలించింది. అతడికి ఉన్న అనారోగ్య పరిస్థితి, ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు, అవసరమైన చికిత్స వంటి అంశాలను నిపుణులు పరిశీలించారు. ప్రత్యేక వైద్య సేవలు అందిస్తే ఇక్బాల్‌కు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని భావించారు.ఈ విషయం తెలిసిన అనంతరం అనంత్ అంబానీ సూచనలతో ఇక్బాల్‌ను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించే ఏర్పాట్లు చేశారు. అతడిని ఎయిర్‌లిఫ్ట్ చేసి సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్య నిపుణులు అతడి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, అవసరమైన ప్రత్యేక చికిత్స అందించనున్నారు.ఇప్పటివరకు దాదాపు ఐదేళ్ల పాటు చెరువులోనే ఉపశమనం వెతుక్కుంటూ గడిపిన ఇక్బాల్.. ఇప్పుడు దేశంలోని ప్రముఖ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అతడి కుటుంబానికి కూడా ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం. ఇక్బాల్‌కు మెరుగైన వైద్యం అందడంతో అతడి పరిస్థితి మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.After spending 5 years in a pond seeking relief from his debilitating ailment, young Iqbal's case was reviewed. On Anant Ambani’s instructions, he has now been airlifted to Mumbai’s Reliance Foundation Hospital for specialized treatment — bringing new hope for Iqbal & his family. pic.twitter.com/9CrxaIHpgL— Mradubhashi (@mradubhashi1) August 17, 2026 -
భారీ అగ్నిప్రమాదం.. ఇన్‌కం ట్యాక్స్ భవనంలో మంటలు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుంది. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పే యత్నం చేస్తుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ముంబై: నేవీ ఉద్యోగి కుటుంబం అనుమానాస్పద మృతి!
ముంబై: ముంబైలోని నేవీ నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన ఒక నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు తమ నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నావికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే ఇంట్లో రెండు నెలలు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలు కూడా లభించాయి. ప్రాథమిక పరిశోధనలో పిల్లలు విషప్రయోగం వల్ల మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు వస్తేనే నిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు, ఇతర సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలు లియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇండియన్ నేవీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొలాబాలోని నేవీ నగర్లో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో నావికుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తునకు నావికాదళం పూర్తిగా సహకరిస్తున్నదని పేర్కొంది.ఇది కూడా చదవండి: కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో! -
సింగిల్ మదర్, రెండు జాబ్‌లు..!
మహిళలుగా మనం సాధించగల దానికి పరిమితి లేదు అని అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అని సదా నొక్కి చెబుతుంటారామె. అది నిజం అనేలా..మూసధోరణి పద్ధతులను చేధించి ముందుకు దూసుకుపోతున్న ఎన్నో స్ఫూర్తిదాయక కథలు మన కళ్లముందు కదలాడుతున్నాయి. అలాంటి స్ఫూర్తిదాయ కథే ఈ సింగిల్ మదర్ స్టోరీ. ఒక ప్రయాణికురాలు, మహిళా క్యాబ్ డ్రైవర్ మధ్య సాగిన సరదా సంభాషణా వీడియో కాస్తా..శక్తిమంతమైన మహిళా శక్తికి నిర్వచనంగా, స్ఫూర్తిదాయకంగా మారింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వీడియోని నటి ఆయుషి లాహిరి షేర్ చేసుకున్నారు. ఆయుషి ఒక క్యాబ్‌ని బుక్ చేసుకోగానే 'హైలైట్ ఆఫ్ ది డే' అనే శీర్షికతో ఒక ప్రముఖ క్యాబ్ డ్రైవర్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ ప్రకారం, క్యాబ్ డ్రైవర్ ఒక మహిళ అని ఆశ్చర్యపోతుందామె. ఆ తర్వాత వారి మధ్య సరదాగా సంభాషణ సాగుతుంది. ఆ మహిళ క్యాబ్ డ్రైవర్ తన పేరు శోభనా అవస్థి అని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయుషి ఎప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నారని ప్రశ్నించగా జూన్ నెల నుంచి అని సమాధానమిస్తుంది. అయితే తాను కేవలం క్యాబ్ డ్రైవర్ని మాత్రమే కాదని తాను ప్రముఖ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్‌ని అని కూడా చెబుతుంది. అయితే ప్రతిరోజు మేకప్ పని దొరకదని, పైగా తాను ఒంటరి తల్లినని పేర్కొంటుంది. తన కుటుంబాన్ని, పిల్లలను చూసుకునేందుకు ఇలా రెండు వృత్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక తనకు డ్రైవింగ్ అంటే మహా ఇష్టమని, తాను 15 ఏళ్ల వయసులోనే తండ్రి వద్ద నేర్చుకున్నానని, చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ఎస్‌యూవీలతో సహా సుమారు 80 కార్లను నడిపినట్లు పేర్కొంది. ఆ నటి ఈ హృద్యమైన వీడియోకి "నా రోజులోని ముఖ్యాంశం" అనే క్యాప్షన్‌ని జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిజానికి పురుషాధిక్య రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోవడానికి మహిళలు ఎంతగా కష్టపడగలరో ఈ ఘటన నిరూపిస్తుంది. అందులోనూ ఒక సింగిల్ మదర్‌గా అటు మాతృత్యం ఇటు వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతున్న ఆమె నిజంగా సూపర్ విమెన్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Aayushi Lahiri (@aayushmatibhava)(చదవండి: 'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..) -
‘టాటా’ సామ్రాజ్యానికి గుండెకాయ.. ‘బాంబే హౌస్’
ముంబై ఫోర్ట్ ప్రాంతంలోని ప్రశాంతమైన హోమి మోడీ వీధిలో కనిపించే నాలుగు అంతస్తుల చారిత్రక భవనం.. బయటకు చూస్తే సాధారణ కార్యాలయ భవనంలానే అనిపిస్తుంది. కానీ అదే ‘బాంబే హౌస్’. దాదాపు శతాబ్ద కాలంగా టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి ఇది ప్రధాన కార్యాలయం మాత్రమే కాదు.. కీలక నిర్ణయాలకు సాక్షిగా నిలిచిన కార్పొరేట్ చరిత్రకు చిరునామా. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు (2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత) ప్రకటించడంతో మరోసారి బాంబే హౌస్‌పై ఆసక్తి పెరిగింది.1924లో మొదలైన ప్రయాణంబాంబే హౌస్ కథ 1920లో ప్రారంభమైంది. టాటా సన్స్ రెండో చైర్మన్ సర్ దొరాబ్జీ టాటా.. బాంబే మునిసిపాలిటీ నుంచి ఫోర్ట్ ప్రాంతంలో సుమారు 21,285 చదరపు అడుగుల విస్తీర్ణంలోని రెండు స్థలాలను కొనుగోలు చేశారు. అనంతరం భవనం నిర్మాణ బాధ్యతలను అసోసియేటెడ్ బిల్డింగ్ కంపెనీకి అప్పగించారు.స్కాటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్ దీనికి రూపకల్పన చేశారు. ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం (ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ) వంటి ప్రముఖ నిర్మాణాల రూపకల్పనతో విట్టెట్ అప్పటికే పేరు సంపాదించారు. బాంబే హౌస్ నిర్మాణం 1924లో పూర్తయి జూలై 1న తలుపులు తెరుచుకుంది.ఈ భవనానికి ‘టాటా హౌస్’ అని పేరు పెట్టకుండా ‘బాంబే హౌస్’ అని పిలవడం వెనుక కూడా ప్రత్యేక భావన ఉంది. టాటా గ్రూప్ ఎదుగుదలకు కేంద్రంగా నిలిచిన బొంబాయి నగరంతో సంస్థకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు పెట్టారు.ఎడ్వర్డియన్ అందం.. భారతీయ వారసత్వంబాంబే హౌస్ నిర్మాణం ఎడ్వర్డియన్ నియో-క్లాసికల్ శైలిని ప్రతిబింబిస్తుంది. మలాడ్ రాతితో నిర్మించిన ముఖభాగం, సమతుల్య ఆకృతి, పెద్ద జార్జియన్ తరహా కిటికీలు, అలంకార కార్నిస్‌లు ఈ భవనానికి ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. మొదట భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు పై అంతస్తులతో నిర్మించారు. 1941-42లో నాలుగో అంతస్తును చేర్చారు. ప్రస్తుతం ఇదే అంతస్తులో చైర్మన్ కార్యాలయం, బోర్డు రూమ్ ఉన్నాయి.బయటి రూపాన్ని దాదాపు యథాతథంగా కాపాడుకుంటూనే లోపలి భాగాలను కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. పాత కళాఖండాలు, ఫర్నిచర్, జ్ఞాపికలు, చారిత్రక బోర్డు రూమ్ వంటి అంశాలు భవనానికి పాతకాలపు ప్రత్యేకతను కొనసాగిస్తున్నాయి.టాటా సామ్రాజ్యంలోని కీలక నిర్ణయాలకు వేదికబాంబే హౌస్‌లో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్ చరిత్రలో అనేక మలుపులకు దారి తీశాయి. ఒకప్పుడు టెక్స్టైల్స్, హోటళ్లు, ఉక్కు, విద్యుత్ వంటి నాలుగు ప్రధాన వ్యాపారాల కేంద్రంగా ఉన్న ఈ భవనం.. తర్వాత విస్తరిస్తూ వచ్చిన టాటా సామ్రాజ్యానికి నాడీ కేంద్రంగా మారింది.జేఆర్డీ టాటా కాలంలో విమానయాన రంగంలో టాటా గ్రూప్ అడుగులు వేయడానికి సంబంధించిన కీలక ఆలోచనలు కూడా ఈ సంస్థాగత వాతావరణంలోనే రూపుదిద్దుకున్నాయి. దశాబ్దాల తర్వాత 2007లో టాటా స్టీల్.. కోరస్‌ను సుమారు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన భారీ అంతర్జాతీయ ఒప్పందం వంటి వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా బాంబే హౌస్ కీలక కేంద్రంగా నిలిచింది.2017లో చంద్రశేఖరన్ తీసుకున్న కీలక నిర్ణయంబాంబే హౌస్ దాదాపు 94 ఏళ్ల చరిత్రలో 2017 వరకు పెద్ద స్థాయి సమగ్ర పునరుద్ధరణకు దూరంగానే ఉంది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భవనాన్ని పూర్తిగా ఆధునీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.ఆర్కిటెక్ట్, అర్బన్ కన్జర్వేషన్ నిపుణురాలు బృందా సోమయ్య నేతృత్వంలోని బృందం ఈ ప్రాజెక్టును చేపట్టింది. కేవలం తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసి 2018 జూలై 29న జేఆర్డీ టాటా జయంతి సందర్భంగా బాంబే హౌస్‌ను తిరిగి ప్రారంభించారు. రతన్ టాటా ఈ పునరుద్ధరించిన భవనాన్ని ప్రారంభించారు.పునరుద్ధరణలో భవనం చారిత్రక రూపాన్ని కాపాడుతూ ఆధునిక కార్యాలయ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఓపెన్ వర్క్‌స్పేస్‌లు, సహకార ప్రాంతాలు, డిజిటల్ మీటింగ్ రూమ్‌లు, టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. పాత బోర్డు రూమ్‌కు కూడా ఆధునిక సాంకేతిక సదుపాయాలు జోడించారు.వీధి కుక్కలకు వెల్కమ్!బాంబే హౌస్ ప్రత్యేకతల్లో అత్యంత ఆసక్తికరమైనది అక్కడి వీధి కుక్కల సంప్రదాయం. దశాబ్దాలుగా భవనానికి వచ్చే కుక్కలను ఉద్యోగులు, సంస్థ ఆహ్వానితుల్లానే ఆదరిస్తున్నారు. 2018 పునరుద్ధరణలో వాటి కోసం ప్రత్యేక కెన్నెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. నిద్రించే ప్రదేశం, సౌకర్యవంతమైన వాతావరణం, ఆహారం, వైద్య సంరక్షణ వంటి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. టాటా గ్రూప్ స్వయంగా పేర్కొన్నట్టుగా, ఈ కుక్కలకు బాంబే హౌస్‌లోకి ప్రవేశించేందుకు ఉద్యోగుల మాదిరిగా యాక్సెస్ కార్డు అవసరం లేదు.నేటికీ అదే చిరునామా2024లో బాంబే హౌస్ తన శతాబ్దిని పూర్తి చేసుకుంది. టాటా గ్రూప్ అధికారిక చరిత్ర ప్రకారం, ఈ భవనం నేటికీ గ్రూప్‌నకు గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌గా కొనసాగుతోంది. వందేళ్లలో టాటా గ్రూప్ నాలుగు ప్రధాన వ్యాపారాల నుంచి అనేక రంగాల్లో విస్తరించిన బహుళజాతి వ్యాపార సమూహంగా మారినా.. దాని సంస్థాగత హృదయం మాత్రం బాంబే హౌస్‌గానే ఉంది. అంతేకాదు, వారసత్వ భవనంగా ఉన్నప్పటికీ సుస్థిరత చర్యలకు గుర్తింపుగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన తొలి భారతీయ హెరిటేజ్ భవనంగా ఇది నిలిచింది.ఇప్పుడు చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే ఆ నాయకత్వ మార్పు ఎక్కడి నుంచి సాగుతుంది అంటే.. సమాధానం మాత్రం ఇప్పటికీ అదే.. ముంబైలోని ఈ చారిత్రక ‘బాంబే హౌస్’ నుంచే. -
127 శాతం లాభంతో ఫ్లాట్ అమ్మిన మాధురీ దీక్షిత్!
బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నెనె దేశంలోనే అత్యంత ఖరీదైన ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి తమ పెట్టుబడి వ్యూహాన్ని చాటుకున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన జుహు ప్రాంతంలో ఉన్న తమ అపార్ట్‌మెంట్‌ను రూ.4.40 కోట్లకు విక్రయించారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేటా విశ్లేషణ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ అందించిన అధికారిక సమాచారం ప్రకారం జులై 3న ఈ లావాదేవీ నమోదు పూర్తయింది.విక్రయ వివరాలుమిలిటరీ రోడ్‌లోని ‘ది డీప్ వర్షా కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ పరిధిలోని ఐరిస్ పార్క్ భవనంలో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం 774 చదరపు అడుగులు. ఈ ఆస్తిని సచిన్ శేఖర్ శెట్టి అనే కొనుగోలుదారుడు సొంతం చేసుకున్నారు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కింద రూ.26.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా రూ.30,000 చెల్లించారు. కాగా, ఈ ఫ్లాట్‌కు సంబంధించిన కార్ పార్కింగ్ స్థలాన్ని వీరు గతేడాది డిసెంబర్లోనే వేరే వ్యక్తికి వేరుగా విక్రయించడం గమనార్హం.14 ఏళ్లలో 127 శాతం లాభం2012 జూన్ 4న మాధురి దంపతులు ఈ ఫ్లాట్‌ను రూ.1.94 కోట్లకు కొనుగోలు చేశారు. దాదాపు 14 ఏళ్ల పాటు దీనిని తమ వద్దే ఉంచుకుని ఇప్పుడు రూ.4.40 కోట్లకు విక్రయించడం ద్వారా 127 శాతానికి పైగా క్యాపిటల్ అప్రిసియేషన్ (మూలధన లాభం) సాధించారు.గత ఎనిమిది నెలల్లో మూడో విక్రయంమాధురీ దీక్షిత్ గత ఎనిమిది నెలల కాలంలో ముంబైలో ఆస్తులను విక్రయించడం ఇది మూడోసారి. డిసెంబర్ 2025లో ఇదే జుహు భవనంలో ఉన్న మరొక 780 చ.అడుగుల ఫ్లాట్‌ను రూ.3.90 కోట్లకు విక్రయించారు (99.22% లాభం). జూన్ 2026లో అంధేరి వెస్ట్‌లోని 1,594 చ.అడుగుల కమర్షియల్ ఆఫీస్ స్పేస్‌ను రూ.4.85 కోట్లకు అమ్మేశారు. 18 ఏళ్ల క్రితం రూ.52.5 లక్షలకు కొన్న ఈ ఆఫీసుపై ఏకంగా 824% రాబడి రావడం విశేషం. -
సాహస రైడ్ సరదా తీరకముందే..
బైక్ రైడ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే తరచూ సాహస యాత్రలు చేసే ఆమె.. మరో ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. కానీ ఆ సాహస యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఆమె బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బైకింగ్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ముంబైకి చెందిన 24 ఏళ్ల యువ బైకర్ రిద్ధి థక్కర్(Riddhi Thakkar) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్ ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రిద్ధి.. వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే.. బస్తర్ టూర్‌కు వెళ్లిన మహిళా బైకర్ల బృందంలో ఉన్న ఆమె అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీంతో.. బైకింగ్ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఢీ కొట్టి.. ఆపై ఈడ్చుకెళ్లి..ముంబై కందివలీ వెస్ట్‌కు చెందిన రిద్ధి థక్కర్.. దాదాపు 23 మంది మహిళా బైకర్ల బృందంతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. రాయ్‌పూర్ నుంచి కాంకేర్ వైపు వెళ్తుండగా ధమ్తరి జిల్లా మార్కటోలా ఘాట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ల బృందంలోని పలువురు ముందుకు వెళ్లిపోగా, రిద్ధి మరికొందరు వెనుక వస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన భారీ ట్రైలర్ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రిద్ధి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణంప్రమాదాన్ని గమనించిన తోటి బైకర్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి రిద్ధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ధమ్తరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పరారీలో డ్రైవర్.. కొనసాగుతున్న దర్యాప్తుప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ వాహనం, డ్రైవర్‌ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. రిద్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధమ్తరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెతో కలిసి ప్రయాణించిన ఇతర బైకర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ధమ్తరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. -
ముంబైలో ఘోర విషాదం.. ఐదుగురు మృతి
-
11వ అంతస్తులో మంటలు.. ముంబైలో విషాదం
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే వెస్ట్‌లోని ఓ 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.భవనంలోని 11వ అంతస్తులో రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.02 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా.. తొలుత ప్రమాదాన్ని లెవల్-1గా ప్రకటించారు. మంటలు తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవల్-2కు పెంచారు. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.విద్యుత్ వైరింగ్ నుంచి మంటలు?అగ్నిప్రమాదంలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్, ఏసీ యూనిట్, ఫర్నిచర్, సోఫా, బెడ్, ఫాల్స్ సీలింగ్, వంటగది సామగ్రి భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.చిన్నారి సహా ఇద్దరి మృతిప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని కూపర్ ఆసుపత్రికి, మరో ఆరుగురిని నానావతి ఆసుపత్రికి తరలించారు. నానావతి ఆసుపత్రిలో రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.గాయపడిన వారిలో ఫైర్‌మ్యాన్ మనోజ్ సోనావానే (30), శివమ్ ద్వివేది (29) చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో నలుగురు పార్థ్ (32), హిరెన్ (64), యశస్వి (33), అభిషేక్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో యశస్వి, అభిషేక్ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. Watch: A fire broke out at Shanta Bhavan Building in Mumbai's Vile Parle area. After receiving information about the incident, 10 fire brigade vehicles reached the spot and began efforts to bring the fire under control. No injuries have been reported so far. Firefighters are… https://t.co/PaDkqJiRcZ pic.twitter.com/qvUdBe9Mkn— IANS (@ians_india) August 11, 2026 -
కూరగాయల కొట్టు నుంచి అండర్‌వరల్డ్ సింహాసనం వరకు..
ముంబై అండర్‌వరల్డ్ చరిత్రలో ఒకప్పుడు భయానక వాతావరణం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అమర్ నాయక్ ప్రస్థానం ఒక కూరగాయల వ్యాపారిగా మొదలయ్యింది. తరువాత అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం, అరుణ్ గావ్లీ లాంటి ఉద్దండులకే సవాళ్లు విసిరే స్థాయికి చేరింది. ఒక సాధారణ కూరగాయల వ్యాపారి మోస్ట్ వాంటెడ్ డాన్‌గా మారడం.. తరువాత అథఃపాతాళానికి చేరడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 1980లలో దాదర్ మార్కెట్లో ప్రారంభమైన అతని మనుగడ ఎలాంటి సంచలనాలకు తెరలేపిందనేది ఈ కథనంలో చూద్దాం.బలవంతపు వసూళ్లపై తిరుగుబాటుముంబైలోని దాదర్ కూరగాయల మార్కెట్ ఆ కాలంలోనే కోట్లలో వ్యాపారం జరిగే ప్రధాన కేంద్రం. అజిత్ నాయక్ అనే వ్యక్తి అక్కడ కూరగాయల దుకాణం నడిపేవాడు. అజిత్ సోదరుడైన అమర్ నాయక్ చాలా కోపిష్టి, ఎవరికీ తలవంచని స్వభావం కలవాడు. ఆ సమయంలో మార్కెట్లో చెలరేగుతున్న ‘పోటియా ముఠా’ వ్యాపారుల నుండి బలవంతంగా వారపు డబ్బులు వసూలు చేసేది. ఈ వసూళ్లను అమర్ నాయక్ తీవ్రంగా వ్యతిరేకించి, ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో అండర్‌వరల్డ్‌తో అసలు పోరు మొదలైంది.అన్నపై దాడితో రగిలిపోయిన అమర్ఒకరోజు పోటియా ముఠా సభ్యులు అమర్ సోదరుడు అజిత్‌పై దాడి చేసి అమర్ ఆచూకీ చెప్పాలని వేధించారు. ఈ విషయం తెలుసుకున్న అమర్ తన మనుషులతో కలిసి వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ భీకర ఘర్షణలో పోటియా ముఠాకు చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మిగతావారు ప్రాణభయంతో పారిపోయారు. ఈ ఒక్క సంఘటనతో దాదర్ మార్కెట్లో అమర్ నాయక్ పేరు మారుమోగడం ప్రారంభమైంది. అతని ఖ్యాతి క్రమంగా పెరుగుతూ వచ్చింది.తమ్ముడి అపహరణ హైడ్రామా.. తన ఆధిపత్యం తగ్గిపోతోందని గ్రహించిన పోటియా ముఠా కుట్ర పన్ని, అమర్ తమ్ముడు అశ్విన్‌ను అపహరించింది. బదులుగా అమర్‌ను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన అమర్ తన బృందాన్ని ఘర్షణలకు సిద్ధం చేశాడు. ఇంతలో అశ్విన్ వారి చెరనుండి చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. ఈ ఘటనతో పోటియా ముఠా బలహీనపడింది. అండర్‌వరల్డ్‌లో అమర్ నాయక్ రాజ్యానికి పునాది పడింది.దావూద్, గౌలీలకే ముచ్చెమటలుఅప్పట్లో డాన్ దావూద్ ఇబ్రహీం దుబాయ్ నుండి తన సామ్రాజ్యాన్ని నడిపిస్తూ, ముంబైలో చోటా రాజన్‌ను ఇన్చార్జ్గా ఉంచాడు. మరోవైపు అరుణ్ గావ్లీ సెంట్రల్ ముంబై నుండి తన గ్యాంగ్‌ను నడిపేవాడు. సరిగ్గా ఇదే ప్రాంతం నుండి అమర్ నాయక్ తన కార్యకలాపాలను సాగిస్తూ వీరిద్దరికీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగాడు. ఒకే ప్రాంతంలో ఇద్దరు డాన్లు ఉండకూడదనే నియమం ప్రకారం గావ్లీ వర్గానికి, నాయక్ వర్గానికి మధ్య తీవ్రమైన రక్తపాతంతో కూడిన గ్యాంగ్‌వార్ చెలరేగింది.పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ..అమర్ నాయక్ కేవలం ప్రత్యర్థులకే కాదు, పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. అతని ముఖం ఎలావుంటుందననేది అప్పట్లో ఎవరికీ స్పష్టంగా తెలియదు. విదేశాలకు వెళ్లేందుకు అతనికి ఏకంగా ఐదు వేర్వేరు పాస్‌పోర్ట్‌లు ఉండేవి. ఒకసారి సాక్షాత్తు పోలీసుల ఎదురుగా వచ్చి వారితో సాధారణంగా మాట్లాడి వెళ్లిపోయినా, అది అమర్ నాయక్ అని గుర్తించలేనంత చురుగ్గా, పోలీసుల కంట పడకుండా అతను తన సామ్రాజ్యాన్ని ఏలాడు.క్రూరత్వంతో 'రావణ్' బిరుదుముంబైలోని బట్టల మిల్లులు మూతపడటంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన నిరుద్యోగ యువకులను అమర్ నాయక్ తన గ్యాగ్లోకి చేర్చుకున్నాడు. తన శత్రువులపట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించడం వల్ల అండర్‌వరల్డ్ వర్గాలు అతన్ని ‘రావణ్’ అని పిలవడం మొదలుపెట్టాయి. ముంబైలో సంచలనం సృష్టించిన అనేక హత్యల్లో, ముఖ్యంగా ఖటావ్ మిల్లు యజమాని సునీత్ ఖటావ్ హత్యలో అమర్ నాయక్ పేరు ప్రముఖంగా వినిపించింది.ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో హతంఅమర్ నాయక్ నేర సామ్రాజ్యం రోజురోజుకూ పెరిగిపోవడంతో ముంబై పోలీసులు అతనిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి డాన్ అరుణ్ గావ్లీని అరెస్ట్ చేసి జైలులో పెట్టగా, అతని గ్యాంగ్‌ను నిర్వీర్యం చేశారు. చివరకు 1995లో మదన్‌పురా ప్రాంతంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్ నేతృత్వంలోని పోలీసు బలగాలు అమర్ నాయక్‌ను చుట్టుముట్టాయి. అర్ధరాత్రి జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ‘రావణ్’ హతమవడంతో అతని అండర్‌వరల్డ్ అధ్యాయం ముగిసింది.ఇది కూడా చదవండి: 79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్? -
పెరగనున్న గణేశ్ విగ్రహాల ధరలు
ముంబై: పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇంధన ధరలతోపాటు ఈసారి గణేశ్ విగ్రహాల ధరలు కూడా ఏకంగా 20–30 శాతం పెరిగే అవకాశముండటంతో గణేశ్ భక్తులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. గణేశోత్సవాలు సమీపిస్తుండటంతో వర్క్ షాపుల్లో వినాయకుని విగ్రహాల తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్మంగా రాయ్‌గడ్ జిల్లా పేణ్ తాలూకాలో తయారైన చిన్న, పెద్ద విగ్రహాలు విదేశాలకు ఏప్రిల్‌లోనే రవాణా అయ్యాయి. ప్రస్తుతం ముంబై, థానే, న్యూ ముంబై, కల్యాణ్, రాయ్‌గడ్, నాసిక్, పుణే తదితర నగరాలకు అవసరమయ్యే విగ్రహాల తయారీ పనులు జోరందుకున్నాయి. అయితే అనేక కారణాల వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వివిధ రకాల విగ్రహాల ధరలు 30 శాతం వరకు పెంచకతప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు.అదనపు ఆర్థిక భారానికి కారణాలివీ..పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (íపీఓపీ) తో తయారయ్యే విగ్రహాలకు స్వస్తి చెప్పాలని ఇదివరకే ప్రభుత్వం, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేశాయి. దీంతో వర్క్ షాపు యజమానులు బంక మట్టితో విగ్రహాలు తయారు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మట్టి ధరలు, వర్క్ షాపుల్లో పనిచేసే కార్మికులు, శిల్పకారుల వేతనాలు, విగ్రహాల తయారికి వినియోగించే ఇనుప చువ్వలు, రంగులు, షెడ్డు నిర్మాణానికి అవసరమైన వెదురు బొంగులు, ప్లాస్టిక్ పేపర్లు, వివిధ రకాల రంగులు, స్ధలం అద్దె, బీఎంసీ అనుమతి చార్జీలు కూడా పెరిగాయి.నీటి కొరతతో దెబ్బఅదేవిధంగా ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకూ ఆశించిన స్థాయి వర్షపాతం లేదు. గత నెలలో మినహా భారీ వర్షాలు మళ్లీ కురవలేదు. వర్షాలు అనుకున్నంతమేర కురవకపోవడంతో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ నీటికోత అమలులోనే ఉంది. కొని చోట్ల రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. దీంతో గణేశ్ విగ్రహాలు తయారుచేసే అనేక వర్క్‌షాపులు, షెడ్ల యజమానులు వాటర్ ట్యాంకర్లపై ఆధార పడాల్సిన పరిస్ధితి వచ్చింది.ఎండిపోయిన బంక మట్టిని విగ్రహాల తయారీకి అనుగుణంగా మెత్తగా పిసకాలంటే నీటి వినియోగం ఎక్కువ మోతాడులో అవరమైతుంది. దీన్ని అదనుగా చేసుకున్న వాటర్ ట్యాంకర్ యజమానులు చార్జీలు పెంచేశారు. ఇది కూడా విగ్రహాల తయారీదారులకు అదనపు ఆర్థిక భారంగా పరిణమించింది. ఇలా అనేక కారణాలతో విగ్రహాల ధరలను 20–30 శాతం వరకు పెంచాల్సిన పరిస్ధితి వచ్చిందని తయారీదారులంటున్నారు. ముఖ్యంగా గత నాలుగైదు నెలలుగా పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధం కారణంగా విదేశాల నుంచి దిగుమతి కావల్సిన కొన్ని ముడి సరుకులు సకాలంలో రవాణా కావడం లేదు.చదవండి: ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్ముఖ్యంగా విగ్రహాలకు అమర్చాల్సిన నకిలీ ముత్యాలు, పగడాలు, రంగురాళ్లు, కిరీటాలు, గిల్టు నగలు సమయానికి అందలేదు. సముద్ర మార్గం మీదుగా సామగ్రి రవాణాకు చాలా తక్కువగా ఖర్చవుతుంది. అదే విమానాల్లో దిగుమతి చేసుకుంటే నాలుగు రెట్లకుపైనే రవాణా చార్జీలు చెల్లించాల్సిఉంటుంది. దీంతో గత్యంతరం లేక ఎక్కువ ధర చెల్లించి విమానాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా ఖర్చులు పెరగడంతో 20–30 శాతం వరకు ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులంటున్నారు. -
జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు.కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు.2024లో చివరిగా టీమిండియా తరఫునఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు.సాయి సుదర్శన్ స్థానంలోదేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్‌కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్‌తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. జై గోహిల్‌కు అవకాశం‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్‌ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు.కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆగష్టు 23 నుంచి సెప్టెంబరు 10 వరకు దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. టీమిండియా- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.దులిప్ ట్రోఫీ 2026 సీజన్‌కు వెస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములాని (వైస్ కెప్టెన్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జైమీద్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్దార్థ్ దేశాయ్, జై గోహిల్, ముషీర్ ఖాన్, అతీత్ షేత్, ముకుశ్ చౌదరి, తనుశ్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే.చదవండి: నా కాబోయే భర్త అలా ఉండాలి: సారా టెండుల్కర్ -
ముంబైలో మార్మోగుతున్న ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు
ముంబై : మహారాష్ట్రలోని ముంబై నగరంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ 14న ఘనంగా గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముంబైలోని ప్రముఖ లాల్బాగ్-పరేల్ ప్రాంతంలో ఘన స్వాగత వేడుకలతో నగరమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.సంప్రదాయ వాయిద్యాలు, కాషాయ పతాకాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల మధ్య భక్తులు తొలి ప్రతిమలను అత్యంత వైభవంగా స్వాగతించారు. ఈ ఏడాది ముంబైలో తయారైన పలు వినాయక ప్రతిమలు గుజరాత్‌కు తరలివెళ్తుండటం విశేషం. గుజరాత్‌లోని సూరత్, భరూచ్ తదితర ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకులు ముంబై నుంచి విగ్రహాలను తీసుకెళుతుంటారు. ఆగస్టులోని ప్రతి వారాంతంలో ఇలాంటి భారీ ఊరేగింపులు జరుగుతుంటాయి.ఇది కూడా చదవండి: హరిద్వార్-ఢిల్లీ మార్గంలో కన్వర్ యాత్రికుల కోలాహలం! -
ఆ సినిమాకు ఆస్కార్ రావాల్సిందే! లేకుంటే..
ఓ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే ఆస్కార్ చర్చకు దారితీసింది. ఆ సినిమా అవార్డుల బరిలో నిలవకపోతే తాను నిరాశ చెందుతానంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఆయన ఆ స్థాయిలో ఎందుకు ప్రశంసించారు? ఆ సినిమాపై ఆయనకున్న అంచనాలు ఏంటి?..ఆ సినిమా మరేదో కాదు.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆస్కార్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.🚨BIG: Maharashtra CM Devendra Fadnavis on #Ramayana "I'll be VERY disappointed if Ramayana doesn't win an Oscar." pic.twitter.com/ylrzro3xE7— Daily Bollywood (@Bollywooz) August 6, 2026ముంబైలో ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘రామాయణం’కు ఆస్కార్ రాకపోతే అకాడమీ జ్యూరీపై తాను నిరాశ చెందుతానని అన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం “దశాబ్దపు సినిమా కాదు.. సహస్రాబ్దపు చిత్రం” అని ప్రశంసించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రం భారతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గతంలోనూ ‘రామాయణం’ విజువల్స్, సాంకేతిక ప్రమాణాలను ఆయన ప్రశంసించారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2026 నవంబర్ 6న దీపావళికి ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళి సమయంలో విడుదల కానుంది.ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మొన్నీమధ్యే అధికారికంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. విశ్లేషణతో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్‌నూ వదిలారు. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
యాక్షన్‌కి సై
యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధం అవుతున్నారట సల్మాన్ ఖాన్. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో మాధవన్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ వారంలో ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రెడీ చేయిస్తున్నారని, ఈ సెట్లోనే సల్మాన్ ఖాన్–నయనతార పాల్గొనగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తీసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలిసింది. యాక్షన్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలనూ తెరకెక్కించనున్నారట. ఇక ఈ చిత్రం కోసం దాదాపు 16 కేజీల బరువు తగ్గారట సల్మాన్ ఖాన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘మాతృభూమి’ విడుదలకు సిద్ధం అవుతోంది. -
ముగిసిన ప్రదీప్ రావత్ అంత్యక్రియలు.. సినీ ప్రముఖుల నివాళులు
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని గోరెగావ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.కాగా..గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. భివండిలోని ఒక ఆసుపత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన మరణాన్ని 'లగాన్' సహనటుడు యశ్పాల్ శర్మ ధృవీకరించారు. ప్రదీప్ మృతి పట్ల అఖిల భారత సినీ కార్మికుల సంఘం సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.రావత్ కెరీర్..కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. -
మనుషుల్ని ఇలా ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది?
ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్లో పని చేసే ఉద్యోగికి పుట్టినరోజు వేడుక నిర్వహించి విద్యార్థులు ఆశ్చర్యపరిచారు. ఆ విద్యార్థులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. దయ చూపాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని, చిన్న మంచి పని చేసినా చాలని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన పూర్వ విద్యార్థులు కూడా కళాశాల కాంటీన్తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అజింక్య భుజ్‌బల్ అనే యూజర్ షేర్ చేశారు. "ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచి వస్తాను" అని పేర్కొన్నారు.వీడియోలో కేల్కర్ కళాశాల విద్యార్థులు కాంటీన్ భయ్యా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ "హ్యాపీ బర్త్‌డే" పాట పాడారు. ఊహించని ఈ వేడుక చూసి ఆయన ఆప్యాయంగా చిరునవ్వు చిందించారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఆయన భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.వీడియోలో... "మా కాంటీన్ భయ్యా పుట్టినరోజు జరిపాం. #స్ప్రెడ్ లవ్ ఎఫ్టీ కేల్కరైట్స్" అని రాసి ఉంది. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో విద్యార్థుల ఆలోచనను చాలామంది ప్రశంసించారు. "అందరి ప్రేమను పొందిన వ్యక్తి.. అజాత శత్రువు" అని ఓ యూజర్ పేర్కొన్నారు. "భీమ్రాజ్ ఎంత ముద్దుగా ఉన్నాడు" అని మరో వ్యక్తి అనన్నారు. "ఈ కాంటీన్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి" అని ఇంకొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Ajinkya Bhujbal (@bhujbal_ajinkya18) -
జెన్‌జీ టెన్షన్?.. CJI కార్యక్రమం వాయిదా!
విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టమైన కాన్వొకేషన్ వేడుక. అలాంటి వేడుకకు దేశ ప్రధాన న్యాయమూర్తి హాజరు కావడంపై వాళ్లు ఒకింత ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యారు. తల్లిదండ్రుల కోసం టికెట్లు.. హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుని కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలోనే అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడడంతో వందలాది మంది నిరాశకు లోనయ్యారు.మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) తన 86వ కాన్వొకేషన్ వేడుకను ఆకస్మికంగా వాయిదా వేసింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకను “అనుకోని పరిస్థితులు” కారణంగా వాయిదా వేస్తున్నట్లు TISS రిజిస్ట్రార్ విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక భద్రతా కారణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.కాక్రోచ్ నిరసనల భయమేనా?TISS అధికారికంగా కారణాలను వెల్లడించకపోయినా.. క్యాంపస్‌లో భద్రతాపరమైన ఆందోళనలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి సంబంధించిన నిరసనలు కాన్వొకేషన్ సమయంలో చోటుచేసుకునే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వేడుకను వాయిదా వేసినట్లు సమాచారం.CJIతో పాటు పలువురు ప్రముఖులు.. ఈ కాన్వొకేషన్‌కు జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అలాగే బాంబే హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమం కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాన్వొకేషన్ వాయిదాకు నిరసనలే కారణమని TISS అధికారికంగా ప్రకటించలేదు. భద్రతా పరిస్థితులు, అనుకోని పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే సంస్థ వెల్లడించింది.టికెట్లు బుక్.. చివరికి వాయిదాకాన్వొకేషన్ కోసం విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విమాన టికెట్లు, మరికొందరు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్ గదులు కూడా రిజర్వ్ చేసుకున్నారు. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో ప్రయాణ ఖర్చులు, వసతి కోసం చేసిన ఖర్చులు వృథా అయ్యాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆందోళన కూడా నెలకొంది.ఆర్థిక నష్టంపై పరిశీలనవిద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన TISS.. ఆర్థిక నష్టంపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని తెలిపింది. అవసరమైన వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు అందిస్తామని, కొత్త కాన్వొకేషన్ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.బొద్దింకల వ్యాఖ్యలతోనే..అప్పట్లో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారని ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే.. కాక్రోచ్ జనతా పార్టీని మహారాష్ట్రకే చెందిన అభిజిత్ దీప్కే ప్రారంభించాడు. అది.. నీట్ నిరసన ఉద్యమంతో ఎంత పని చేసిందో అందరికీ తెలిసిందే. అయితే.. తాను యువతను ఉద్దేశించి అలా అనలేదని, నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లనే అన్నానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తరచూ వివరణ ఇస్తూ వస్తున్నారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ మొన్నీమధ్యే ఆవేదన వ్యక్తం చేశారు. అంతెందుకు.. జంతర్ మంతర్ నిరసనల పిటిషన్‌ను కూడా ఆయన బెంచే ఇప్పుడు విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ తరుణంలో.. CJI హాజరు కావాల్సిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అలాంటి నిరసనలు జరుగుతాయనే అనుమానంతో చివరి నిమిషంలో వాయిదా పడటం కొత్త చర్చకు దారితీసింది. -
నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్ చెప్పాల్సిందే..
ఎలాంటి ఫలాప్రేక్ష లేకుండా నిస్వార్థంగా చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి ఒక్కో పద్ధతి. కొందరు దానధర్మాలు చేస్తే..ఇంకొందు సేవా మార్గం ఎంచుకుంటారు. అలాకాకుండా రోజువారీ సాదాసీదా విషయాల్లో తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని భావించడమే గ్రేట్ అనుకుంటే..అందుకోసం సమయం కేటాయిస్తూ..నిస్వార్థంగా సేవ చేయడం అంటే మాటలు కాదుకదా..!. అలాంటి సేవతత్పతరతనే అందిస్తున్నాడు ఈ వ్యక్తి.ఆ మహానుభావుడే ముంబైకి చెందిన నరేంద్ర పాటిల్. లోకల్రైళ్లుపై ఆధారపడే ముంబై వంటి నగరాల్లో రైల్వే స్టేషన్లో ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట గమ్యం తెలియక ఇబ్బంది పడుతున్నవాళ్లకు దారిచూపుతాడు ఆయన. చాలా ఓపిగ్గా నవ్వుతూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..మార్గనిర్దేశం చేస్తుంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మానవ సూచికగా అభివర్ణించొచ్చు. ఆయన ప్రతిరోజూ దాదర్ వంతెనపై రెండు గంటలు నిలబడి, గందరగోళానికి గురైన రైలు ప్రయాణికులను సరైన ప్లాట్‌ఫారమ్‌లకు మార్గనిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ ఎక్కాలో లేదా మారాలో తెలియని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా సాయం అందిస్తారు. అందుకోసం రోజు రెండు గంటలపాటు అక్కడ ఉంటారు. పాటిల్ ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య అక్కడ నిలబడి ప్రయాణికులకు గైడెన్స్ ఇస్తుంటారు. ఉదయం రద్దీ తగ్గిన తర్వాత, పాటిల్ కూడా ఎవరినీ ఏమీ అడగకుండా తన పని ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆయన ఏమి ఆశించకుండా నవ్వుతూ చేస్తారు ఈ పనిని. కొందరు ప్రయాణికులు ఆయన్ను గుర్తుపట్టి చేయి ఊపి వెళ్లిపోతుంటారు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాంటి నిశ్శబ్ద వీరులకు పెద్ద సెల్యూట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Trainmerijaan (@_trainsofindia_) (చదవండి: హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..) -
ప్రపంచ వ్యాప్తంగా వైరలైన ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు..
ముంబై: ఇటీవల జరిగిన జెన్-జీ ప్రొటెస్ట్‌లో ముంబైలో ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని నిరసనకు ప్రతీకగా నిలిచిన మోడల్ రియా అహిర్ ఇప్పుడు తనపై ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న ఘటన తర్వాతి నుంచి బెదిరింపులు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని, తన పోస్టులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై విద్వేష ప్రచారం సాగుతోందని, ఇందులో పరువునష్టం, బెదిరింపులు, మహిళలపై ద్వేషపూరిత దూషణలు, డీప్‌ఫేక్ వీడియోలు ఉన్నాయని కూడా ఆరోపించారు.వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. పరువునష్టం కలిగించే పోస్టుల స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్లు, ఇతర ఆధారాలను కూడా సమర్పించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.జూలై 22న ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ సమీపంలో రియా అహిర్ పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను ఆ వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు.బూడిద రంగు హూడీ ధరించి, పోలీసు వ్యాన్ బానెట్‌పై చేయి ఉంచి ధైర్యంగా నిలబడ్డ ఆమె దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తాను సహజసిద్ధంగా స్పందించానని రియా అహిర్ చెప్పారు."పోలీసులు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టే నేను అలా చేయగలిగాను. మీ హక్కుల గురించి మీకు తెలుసుండాలి" అని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనది సహజ స్పందన మాత్రమేనని, కానీ ప్రజలు దాన్ని అసాధారణ ఘటనగా చూడటం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. -
పెరిగిన ఎయిడ్స్ మరణాలు
ముంబై: ప్రాణాంతక హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిని నిర్ములించేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వ్యాధి పీడితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన నాలుగేళ్లలో ఎయిడ్స్‌తో మృతిచెందినవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గత రెండేళ్లలో వేయికిపైగా రోగులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.ఆ నివేదిక ప్రకారం కేవలం ముంబైలోనే 2022–23లో 958 మంది మృతి చెందగా, 2023–24లో 986 మంది, 2024–25లో 1,148 మంది, 2025–26లో 1,068 మంది మరణించారు. 2022–23తో పోలిస్తే 2025–26లో ఎయిడ్స్‌తో మృతి చెందిన రోగుల శాతం 19.83గా నమోదైంది. హెచ్ఐవీ, ఎయిడ్స్ మృతుల సంఖ్యను నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అవగాహనా, ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేసింది. అయినా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) వెల్లడించింది.అందరి సహకారంతోనే నియంత్రణ సాధ్యం: డా. విజయ్ కరంజ్కర్ఒకప్పుడు హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి సోకిందంటే రోగులు ప్రాణాల మీద ఆశ వదులుకునే వారు. ఇక తాము కొద్ది రోజులు మాత్రమే జీవిస్తామనే ధోరణితో బతుకీడుస్తుండేవారు. కానీ ఇప్పుడు అనేక కొత్త కొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. జీవితాంతం మందులు వాడితే ప్రాణాలు నిలబడతాయి. ఇలాంటి రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు అనేక సేవా, స్వయం సేవా సంస్ధలు కృషిచేస్తున్నాయి. ఏఆర్టీ కేంద్రం అందులో ఒకటి. ఈ కేంద్రం ఎయిడ్స్ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంటుంది. కానీ అనేక నెలలుగా రోగులు పరీక్షలు చేయించుకునేందుకుగాని, మందులు తీసుకునేందుకుగాని ఈ కేంద్రానికి రాలేదు. దీంతో వీరంతా ఎక్కడున్నారు..? ఏమయ్యారు.ఫాలో అప్‌కు ఎందుకు రావడం లేదన్న సందేహంతో గత రెండేళ్లుగా అంటే 2024, 2025 నుంచి ముంబై ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆధ్వర్యంలో ‘లాస్ట్ టూ ఫాలో అప్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈమేరకు ఫోన్ ద్వారా రోగులు లేదా వారి బంధువులతో సంప్రదించడం, స్వయంగా ఇళ్లకు వెళ్లి వారినుంచి వివరాలను సేకరించడంతో రోగుల్లో అనేకమంది మరణించారని, వీరి వివరాలు ఏఆర్టీ కేంద్రంలో నమోదు కాలేదని తెలిసింది.చదవండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు ఇలా రెండేళ్లలో మృతిచెందిన వారిగురించి తెలిసిందని ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు సంచాలకుడు డా.విజయ్ కరంజ్కర్ తెలిపారు. ఉచితంగా పరీక్షలు, మందులు పంపిణీ చేసినప్పటికీ హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు కేంద్రానికి రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని కరంజ్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారం ఉంటేనే ఎయిడ్స్ నియంత్రణలోకి వస్తుందని అన్నారు. -
ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి విమానంలోని కార్గో ఏరియా నుంచి పొగలు రావడంతో, సోమవారం రోజున గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.మొత్తం 194 మంది సిబ్బందితో దుబాయ్ నుండి ముంబైకి బయలుదేరిన IGO 1452 విమానంలో మధ్యాహ్నం2:45 గంటలకు ఎయిర్‌లైన్ సిబ్బంది పొగను గుర్తించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించగా, రాజ్‌కోట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించారు. మధ్యాహ్నం 3:27 గంటలకు విమానం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. లోపల ఉన్న 194 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పాల్చుకున్నారు.రాజ్‌కోట్ విమానాశ్రయ డైరెక్టర్ దిగంత బోరా, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.పి. తరేతియా ఈ ఘటనపై స్పందిస్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదనీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిప్రమాదం ఏమీ లేదుముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారని అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ టెక్నికల్ టీమ్ వెంటనే విమానాశ్రయానికి చేరుకుని విమానాన్ని తనిఖీ చేసింది. తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి మంటలు (Fire) చెలరేగలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి : రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ,1.69 లక్షల కంపెనీ!ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
ముంబైలో ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ జాప్కీ.కామ్ ప్రకారం.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. దీనికి సంబంధించి జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. దీని కోసం కోహ్లీ దంపతులు రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. కాగా ముంబైలోని వర్లీలో ఇప్పటికే వీరికి లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఫ్యామిలీ ఎక్కువగా లండన్‌లో ఉంటుంది. అక్కడ కూడా విలాసవంతమైన ఇంటిని కోహ్లి కొనుగోలు చేశాడు.చివరగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత తరపున బరిలోకి దిగిన కింగ్ కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌తో జరగనున్న వన్డేలో కోహ్లి తిరిగి భారత జెర్సీలో కనిపించనున్నాడు. -
నిరసన జ్వాలకు నిలువుటద్దం!
‘‘ఏదైనా సరిగా లేదు అనిపించింది అనుకోండి.. న్యాయంగా, ధర్మంగా లేవని తోచిందనుకోండి... దానిపై గొంతెత్తాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. చేయాలి’’ అమెరికా పౌర హక్కుల నేత, జార్జియా ప్రజాప్రతినిధి (1940– 2020) జాన్ లూయిస్ చేసిన వ్యాఖ్య ఇది. దీన్ని రియా ఆహిర్ అక్షరాలా చేసి చూపించింది. ఆ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై విద్యార్థుల ఉద్యమానికి జంతర్ మంతర్ కేంద్రబిందువైనప్పటికీ.. జెన్–జీ చైతన్యానికి, ఆ మాటకొస్తే ఉద్యమం మొత్తానికి సాక్షిభూతంగా నిలిచింది మాత్రం పోలీసు వ్యాన్‌ను ఆపుతూ నిలిచిన రియా ఆహిర్ ఫొటోనే అంటే అతిశయోక్తి కాదు. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన 27 ఏళ్ల రియా ముంబైకర్. మోడల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా. ముంబైలో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో వెళుతున్న వ్యాన్‌కు ఎదురెళ్లి రెండు చేతులతో అడ్డుకోవడం కేవలం ప్రతీకాత్మకమైన విషయం కానేకాదు. తప్పనిపిస్తే ఎవరినైనా నిలదీస్తాం. నిగ్గదీస్తాం అన్న జెన్–జీ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం! ‘‘కుడోస్ రియా ఆహిర్’’ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష
ఆన్లైన్ షాపింగ్ షాకింగ్ అనుభవాన్నిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖరీదైన గాడ్జెట్లు ఆర్డర్ ఇస్తే.. ఇటుకలు, సోప్‌లు వచ్చిన సంఘటనలు గతంలో అనేకం చూశాం. అయితే జరిగిన మోసం పట్ల సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం చాలా మంచిదని చాటి చెప్పే సంఘటన ఇది. అలా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కు భారీ షాక్ తగిలింది.అసలు ఏం జరిగిందంటే...ఆన్లైన్ ద్వారా ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) ఆర్డర్ చేస్తే దానికి బదులుగా Beard Growth Oil పార్శిల్ పంపింది ఫ్లిప్‌కార్ట్. ముంబైలోని పవాయ్కు చెందిన వినియోగదారుడు 2023 ఏప్రిల్ 22న ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,11,793 విలువైన 'ఆపిల్ ఐఫోన్ 14 ప్రో (128 GB)'ను నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) ద్వారా ఆర్డర్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఫోన్‌కు బదులుగా గడ్డం పెరిగే నూనె సీసా ఉంది.తొలుత పట్టించుకోని ఫ్లిప్‌కార్ట్ దీనిపై కస్టమర్ కేర్‌కు పదే పదే ఫిర్యాదు చేసినా, అవసరమైన ఆధారాలు అందించినా సమస్య పరిష్కరించకుండానే ఫ్లిప్‌కార్ట్ ఆ కస్టమర్ కంప్లైంట్‌ను రిసాల్వ్డ్ అని క్లోజ్ చేస్తూ వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా క్లోజ్ చేయడంపై వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ముంబైలోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమీషన్ కోర్టు వస్తువు విక్రయించాక ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేవని తేల్చి చెప్పింది. అతనికి తగిన పరిహారం చెల్లించాలని ఆదేశించింది.పరిహారం ఎంతంటే:ఫోన్ ధర రూ. 1,11,793కు 2023 నుంచి ఏప్రిల్ 22 నుండి 9శాతం వార్షిక వడ్డీతో కలిపి వెనక్కి చెల్లించాలి. అలాగే మానసిక వేదనకు గాను రూ. 50,000 బాధితుడికి చెల్లించాలి. ఇంకా కోర్టుల ఖర్చుల కింద కేసు ఖర్చుల కింద రూ. 20వేలు చెల్లించాలని ఆదేశించింది మొత్తంగా ఫ్లిప్‌కార్ట్ , సెల్లర్ ఉమ్మడిగా రూ. 1.81 లక్షల పైచిలుకు పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీఈ కేసులో ఆపిల్ ఇండియా (Apple India) ను కూడా కస్టమర్ బాధ్యులను చేస్తూ చేర్చారు. అయితే, తమ ఉత్పత్తులను స్వతంత్ర డీలర్ల ద్వారా విక్రయిస్తామని, ప్యాకింగ్ లేదా డెలివరీలో తమ పాత్ర ఏమీ ఉండదని ఆపిల్ వాదించింది. ఈ వాదనను అంగీకరించిన వినియోగదారుల ఫోరమ్ ఆపిల్ ఇండియాపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసి, లోపమంతా ఫ్లిప్‌కార్ట్, సెల్లర్‌దేనని తీర్పు ఇచ్చింది.ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం -
నిరసనలో మహిళపై పురుష పోలీసు అసభ్య ప్రవర్తన
-
డ్రగ్స్ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్ బెదిరింపు వీడియో వైరల్
సాక్షి, ముంబై: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అనే ప్రధాన డిమాండ్లతో సీజేపీ పోరాటానికి రోజు రోజుకు యువత నుంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలోని జంతర్ వంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. భాష్ప వాయువు ప్రయోగించిన వైనం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ధర్నాలు ర్యాలు ఉదృతంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబైలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శివాజీ పార్క్, చెంబూర్ , ఆజాద్ మైదాన్‌తో సహా నగరంలోని కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పౌరులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు తీరుపై, ముంబై కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో కొత్త వివాదానికి దారితీసింది. దీనికి ప్రకారం ఒక పోలీసు అధికారి నిరసన ప్రదేశం నుండి అదుపులోకి తీసుకున్న విద్యార్థుల బృందాన్ని నిరసనల్లో పాల్గొంటే అక్రమ మాదకద్రవ్యాల కేసులోఇరికిస్తానని బెదిరించడం కనిపిస్తుంది. అంతేకాదు నిరసనకు తిరిగి రావద్దని, మళ్లీ ఇక్కడ కనిపిస్తే, మీ బ్యాగుల్లో 50-50 గ్రాముల పౌడర్ (మాదక ద్రవ్యం) పెడతాను, దాంతో మీ జీవితం నాశనమైపోతుంది అంటూ ఆ పోలీసు అధికారి విద్యార్థులతో అనడం వీడియోలో ఉంది. (కిచిడీ ఫెయిల్, అంతరిక్ష వంటకాల్లో మూడింటికే చోటు : ఎందుకో?)ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చMumbai Police are threatening students" If you come to Protest again, I will frame you all in drug case and you'll spend your whole life in Jail.I'm a very bad guy,don't test me, I'll throw u all in Jail" This is what goons in uniform look like, Hope the Nation is watching…— 🪳Against Corruption (@akashuchani08) July 23, 2026 ఈ వీడియో వైరల్ కావడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసులు, దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులపై విచారణను ప్రారంభించారు. విచారణ పూర్తయ్యే వరకు, వీడియోలో యూనిఫాంలో కనిపించిన సదరు అధికారిని ప్రస్తుత విధి నిర్వహణ నుండి తప్పించారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ -
దురదృష్టమని వదిలేస్తే.. అదే ఇప్పుడు రూ.450 కోట్లు అయ్యింది!
ఒకప్పుడు సొంత ఇల్లు కొనడం ఓ కల మాత్రమే. చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించిన ఓ యువ నటుడు.. ఆ తర్వాత నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంగ్లా కొనుగోలు చేశాడు. కానీ ఆ కలల ఇల్లు కొన్నాళ్లకే అతడికి ఆందోళనకు కారణమైంది. వరుస పరాజయాలతో ఆ బంగ్లా తనకు కలిసి రావడం లేదని భావించి వదిలేశాడు. అయితే కాలం గడిచాక అదే ఆస్తి అతడి జీవితంలోనే అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆ కథ ప్రముఖ నటుడు జీతేంద్రది.ముంబైలోని చాల్ జీవితం నుంచి స్టార్డమ్ వరకు ఎదిగిన జీతేంద్ర.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద కల నెరవేర్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. పాలి హిల్‌లోని తన బంగ్లాను విక్రయించేందుకు ముందుకొచ్చారు. జీతేంద్ర తండ్రితో చర్చించిన తర్వాత ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ఆస్తి ధర కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లా అప్పట్లోనే ఎంతో విలువైన ఆస్తి.కొన్నాకే మొదలైన కష్టాలు..బంగ్లాలోకి మారిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదని జీతేంద్ర గుర్తు చేసుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆ ఇంటి వల్లే తనకు దురదృష్టం వెంటాడుతోందని ఆయన భావించారు. “భరత్ భూషణ్ ఈ ఇంటిని వదిలేశారు.. ఇప్పుడు నా వంతు వచ్చినట్లు అనిపించింది. ఇలాగే కొనసాగితే నా కెరీర్ మొదలయ్యేలోపే ముగిసిపోతుందేమో అనుకున్నాను” అని జీతేంద్ర గతాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బంగ్లాను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అన్‌లక్కీ అనుకున్నదే అదృష్టంగా మారిందిఏళ్లు గడిచిన తర్వాత అదే ఆస్తి విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ బంగ్లాను పునర్నిర్మించాలని నిర్ణయించిన సమయంలో ఆసక్తికర విషయం బయటపడింది. పాత భవనాన్ని కూల్చినప్పుడు అందులో ఉపయోగించిన బర్మా టీక్ కలపకే రూ.11.5 లక్షలు వచ్చాయని జీతేంద్ర తెలిపారు. అంటే.. మొత్తం బంగ్లాను కొనుగోలు చేసిన ధర కంటే కలప ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ కావడం విశేషం.రూ.85కు అమ్మిన ఫ్లాట్లు.. ఇప్పుడు రూ.85 వేల ధరతర్వాత ఆ స్థలంలో జీతేంద్ర గౌతమ్ అపార్ట్మెంట్స్ నిర్మించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై సందేహంతో ఫ్లాట్లను చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున విక్రయించారు. కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు చదరపు అడుగు ధర దాదాపు రూ.85 వేల వరకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ వెల్లడించారు.రూ.4.25 లక్షల ఆస్తి.. రూ.450 కోట్ల విలువఒకప్పుడు దురదృష్టానికి కారణమని భావించిన ఆ బంగ్లా.. ఇప్పుడు జీతేంద్ర జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ భవనం ఉన్న స్థలం విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఓ ఆస్తిని చూసే దృష్టి కాలంతో ఎలా మారిపోతుందో జీతేంద్ర బంగ్లా కథ చెబుతోంది. అప్పట్లో భయంతో వదిలేసిన ఇల్లు.. ఇప్పుడు కోట్ల విలువైన సంపదగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సినీ తారలకు రియల్ ఎస్టేట్ కలిసి వచ్చిన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తెలుగు సినీ దిగ్గజం శోభన్‌బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి భారీ సంపదను సృష్టించారు. అప్పట్లో భూములపై ముందుచూపుతో పెట్టిన పెట్టుబడులు.. తర్వాత కాలంలో కోట్ల విలువైన ఆస్తులుగా మారాయి. జీతేంద్ర బంగ్లా కథ కూడా ఇలాంటి దూరదృష్టికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్‌గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
రూ. 84 కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరో
సినిమా హీరోలు తమ డబ్బులకు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతుంటారు. పారితోషికంగా సంపాదించిన డబ్బులతో బంగ్లాలు కొనుగోలు చేసి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రూ. 84 కోట్లతో విలాసవంతమైన బంగ్లాను ఆయన కొనుగోలు చేశాడు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం, ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14న పూర్తయింది. ఈ కొనుగోలుకు గాను ఆయన సుమారు రూ. 5.04 కోట్ల రూపాయలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు సమాచారం.ఈ ఆస్తి మొత్తం 1,017.60 చదరపు మీటర్ల ఫ్లాట్‌లో విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్‌హౌస్ కూడా ఉంది. ముంబైలో ప్రముఖ సినీ తారలు - విఐపిలు నివసించే ప్రైమ్ లొకేషన్లలో బాంద్రా వెస్ట్ ఒకటి. ఇక్కడ స్వంత స్థలంతో ఉన్న బంగ్లాలు దొరకడం అత్యంత అరుదు కావడం వల్ల జాన్ చేసిన ఈ రూ. 84 కోట్ల బిగ్ డీల్ ప్రస్తుతం సినీ, బిజినెస్ వర్గాల్లో వైరల్‌గా మారింది.జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 2023లో కూడా ముంబైలోని ఖార్ ఏరియాలో రూ. 70.83 కోట్ల విలువైన బంగ్లాను ఆయన సొంతం చేసుకున్నారు.ఇక సినీ కెరీర్ విషాయానికొస్తే.. ఇటీవల 'ది డిప్లొమాట్', 'తెహ్రాన్' వంటి వైవిధ్యమైన యాక్షన్- పొలిటికల్ థ్రిల్లర్లతో అలరించాడు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్‌తో పాటు తన కెరీర్లో సూపర్ హిట్ అయిన యాక్షన్ ఫ్రాంచైజ్ 'ఫోర్స్' మూడో భాగం -ఫోర్స్ 3 లో నటిస్తున్నాడు. ఈ రెండింటిలోనూ జాన్ అబ్రహం పోలీసులు ఆఫీసర్‌గా అలరించబోతున్నాడు. -
కార్పొరేటర్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. మళ్లీ జైలుకి!
ముంబై: వైద్యులు, ఇతర సిబ్బందిపై శివసేన( (ఏకనాథ్ షిండే వర్గం) ) కార్పొరేటర్ రమేష్ మహాత్రే జరిపిన దాడిని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కార్పొరేటర్ రమేష్ మహత్రే బెయిల్‌ను రద్దు చేసింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.జూలై 6వ తేదీన డోంబివిలిలోని మున్సిపల్ శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, నర్సులపై కార్పొరేటర్ రమేష్ మహాత్రే, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. దిగువ కోర్టు తీర్పు: ఈ కేసులో అరెస్టయిన రమేష్ మహాత్రేకు జూలై 14న కల్యాణ్ లోని స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. వారి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. రమేష్ మహాత్రేపై గతంలో హత్య, హత్యాయత్నం వంటి సుమారు 18 నేరారోపణ కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. వాటిలో 17 కేసులలో అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బెయిల్ ఇచ్చేటప్పుడు అతని నేర చరిత్ర తీవ్రతను మేజిస్ట్రేట్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే వారి బెయిల్‌ను రద్దు చేసి తిరిగి పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల వైద్యులపై ఇలాంటి దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రమేష్ మహాత్రే నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోయినా, పరారైనా ఆయన స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు చట్టపరమైన తదుపరి చర్యలకు తీసుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ ఘటనకు నిరసనగా జూలై 22 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన వైద్యులను ఆ సమ్మెను విరమించుకోవాలని కోరింది హైకోర్టు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ సమ్మెను విరమించుకోవాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. కాగా, వైద్యులపై దాడికి సంబంధించి జూలై 8వ తేదీన అరెస్టైన సదరు కార్పొరేటర్.. జూలై 14వ తేదీన బెయిల్‌పై బయటకొచ్చాడు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 22వ తేదీన మహారాష్ట్ర అంతటా ఆస్పత్రుల్లో 24 గంటల షట్‌డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది. -
లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం.. వీడియో వైరల్
ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కలకలం సృష్టించింది. ముగ్గురు మహిళలపై దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని 'శేత్ ఐరీన్' టవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.లిఫ్ట్‌లో అప్పటికే ముగ్గురు యువతులు ఉండగా.. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లోపలికి ప్రవేశించింది. లిఫ్ట్ తలుపులు మూసుకున్న కొద్దిసేపటికే.. ఆ కుక్క మూతికి మాస్క్ ఉన్నప్పటికీ.. ఒకస్కారిగా దూసుకెళ్తూ.. వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కుక్క ఒక్కసారిగా దాడికి దిగడంతో యజమాని కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఆ కుక్క యువతులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే యువతులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, మరో యువతి మాత్రం లోపలే చిక్కుకుపోయింది. ఆమెపైకి కుక్క మరింత అగ్రెసివ్‌గా దూసుకెళ్లింది.CCTV from Mumbai Malad West lift: Pet dog suddenly lunges aggressively at 3 young girls. Owner struggles to restrain it on leash as kids panic. No serious injuries, but sparks debate on pet control in shared spaces. pic.twitter.com/wvzhIwAM0y— Ghar Ke Kalesh (@gharkekalesh) July 17, 2026చివరకు లిఫ్ట్ నిర్దేశిత ఫ్లోర్‌కు చేరుకోగానే ఆ యువతి కూడా వేగంగా బయటకు వచ్చి తప్పించుకుంది. ఈ ఘటనపై మలాడ్ పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో బాలికలకు ఎలాంటి గాయాలు కాలేదని.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. సదరు నివాసికి తన పెంపుడు జంతువును లిఫ్ట్‌లో తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఈ సీసీటీవీ వీడియో బయటకు రావడంతో అపార్ట్మెంట్ వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు
సాక్షి,ముంబై: ఇప్పటిదాకామనం అమెరికా వైద్య ఖర్చులు గురించిన కథనాలు చదివాం. ఇపుడు మన దేశంలోనే ఒక మామూలు ఆపరేషన్ కోసం ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు గురించి తెలుసుకుంటూ ఔరా అనాల్సిందే. భారతదేశంలోని మెట్రో నగరాల్లో సామాన్యుడికి వైద్యం ఎంత భారంగా మారుతుందో, అలాగే మెడికల్ బిల్లింగ్ విధానంలో పారదర్శకత ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది. ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో సాధారణ హెర్నియా శస్త్రచికిత్స (Hernia Surgery) చేయించుకున్న ఒక రోగికి ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 'నిఖిల్ ఝా' అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వివరాల ప్రకారం ఫాలోవర్ ఒకరు ముంబైలో 'ఇంగువినల్ హెర్నియా' సర్జరీ చేయించుకున్నారని అంటూ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇతర వివరాలను పంచుకున్నారు. కేవలం నాలుగు రోజులు(జూలై 6 నుంచి 10 వరకు)ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్నారు. ఈ ఆపరేషన్ కోసం ఆసుపత్రి బిల్లు అక్షరాలా రూ. 11,04,100. ఇందులో ఇన్సూరెన్స్ సెటిల్మెంట్: రూ. 4,64,000 మాత్రమే క్లెయిమ్ వచ్చింది. దీంతో అవాక్కవ్వడం వారి వంతైంది.ఒక చిన్న హెర్నియా సర్జరీకే ఇంత ఖర్చయితే, పెద్ద పెద్ద సర్జరీల పరిస్థితి ఏంటి? ముంబైలో ఆసుపత్రిలో చేరడం నేరమా? అంటూ ప్రశ్నించారు. నాణ్యమైన వైద్యం కేవలం ధనవంతులకు మాత్రమేనా? అటూ నిఖిల్ ఝా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ A follower messaged us yesterday about their hernia surgery at a top Mumbai hospital.The total cost=11.04LYes, 11.04L for a hernia surgery,We were shocked and stunned by the cost,If this is the cost for a small hernia surgery,What will be the cost for bigger surgeries?… pic.twitter.com/RUfAOy5UVL— Nikhil Jha (@NIKHILLJHA) July 15, 2026నెటిజన్లు ఏమన్నారంటే? ఈ పోస్ట్‌పై నెటిజన్లు, వైద్యులు రకరకాలుగా స్పందించారను. ఒక వైద్యుడు స్పందిస్తూ, "హెర్నియా సర్జరీకి రూ. 11 లక్షలా? ఇందులో ఏమైనా హెలికాప్టర్ పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం కూడా ఉందా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సూరత్‌లో రూ. 1.5 లక్షలకే అయ్యే ఈ సర్జరీకి, ముంబైలో రూ. 11 లక్షలు వసూలు చేయడంపై ఒకరు మండిపడ్డారు. మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న వైద్య ఖర్చుల వల్ల అందరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం ఈ ఒక్క మెసేజ్ చూసి నిర్ధారణకు రాలేమని, రోగికి ఏ రకమైన రూమ్ కేటగిరీ ఇచ్చారు? ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఐసీయూలో ఉంచారా? వంటి వివరాలు 'డిశ్చార్జ్ సమ్మరీ' ,'ఆపరేషన్ నోట్స్' చూస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్ -
‘నేను భర్తగా భావించే సాయే నా అంత్యక్రియలు చేయాలి’
సాక్షి, ప్రకాశం: సోషల్ మీడియా పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తాను భర్తగా భావించిన వ్యక్తికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపినేని సాయి సుమంత్, కీర్తి అనే ఇద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సుమంత్ దుబాయ్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా, కీర్తి ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు.అయితే, కీర్తికి తెలియకుండా సుమంత్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయమై కీర్తి అతడిని నిలదీయగా.. సుమంత్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి ఆత్మహత్య చేసుకుంది. తనువు చాలించే ముందు ఆమె ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే సాయి సుమంత్ చేతుల మీదుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలన్నదే తన ఆఖరి కోరికని ఆ లేఖలో పేర్కొంది.కీర్తి మరణానంతరం ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి నివాసానికి తీసుకువచ్చారు. చనిపోయిన కీర్తి మెడలో సాయి తాళి కట్టాలని, ఆమె అంత్యక్రియలను అతడే జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో సాయి సుమంత్ తల్లిదండ్రులు కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించి, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు -
ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?
హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు ఇండియాలోనూ క్రేజ్ ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన ఓపెన్ హైమర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. అదే ఊపులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన దర్శకత్వలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ది ఒడిస్సీ. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ముంబయిలో సందడి చేశారు. తన టీమ్‌తో కలిసి ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంబయి వీధుల్లో క్రిస్టోఫర్ నోలన్ ఎంజాయ్ చేశారు. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ నటించిన ఈ మూవీ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.భారీగా టికెట్ రేట్లు..అదే సమయంలో ఈ మూవీ క్రేజ్ దృష్ట్యా టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. ముంబయిలోని ఐమ్యాక్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలో రిక్లైనర్ సీట్ రేటు ఏకంగా రూ. 3,100 గా ఫిక్స్ చేశారు. ఇక ఢిల్లీ విషయానికొస్తే పీవీఆర్, సెలెక్ట్ సిటీ వాక్ లాంటి మల్టీప్లెక్సుల్లో రిక్లైనర్ టికెట్ ధరలు ఏకంగా రూ.2,500 వరకు ఉన్నాయి. అదే థియేటర్లలో సాధారణ సీట్స్ కూడా రూ.1,000 నుంచి రూ. 2,100 వరకు రేట్లు నిర్ణయించారు. ఇంతలా భారీ రేట్లు చూసిన ఆడియన్స్ టికెట్లు కొనేందుకు కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.చెన్నైలో చాలా తక్కువ..ముంబయి, ఢిల్లీ నగరాలను మినహాయిస్తే బెంగళూరు, చెన్నైలో, కోల్‌కతా, హైదరాబాద్‌లో టికెట్ ధరలు కాస్తా తక్కువగానే ఉన్నాయి. బెంగళూరులోని మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ రూ. 1,200 నుంచి రూ. 1,950 మధ్య ఉండగా.. కోల్‌కతాలో రూ.1,100 - 1,240 వరకు పెంచేశారు. చెన్నైలో మాత్రం ఐమాక్స్‌లో కూడా గరిష్టంగా రూ. రూ.508కే ది ఒడిస్సీ టికెట్లు లభిస్తున్నాయి. -
ముంబయి వీధుల్లో హాలీవుడ్ స్టార్స్ సందడి.. వీడియో వైరల్
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ది ఓడిస్సీ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ది ఒడిస్సీ ప్రీమియర్ షో కోసం ముంబయికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ ముంబయిలోని ఒలింపియా కాఫీ హౌస్‌లో సందడి చేశారు.ముంబయి నగరంలోని స్థానిక కొలాబాలో ఉన్న 108 ఏళ్ల పురాతనమైన ప్రసిద్ధ ఒలింపియా కాఫీ హౌస్‌కు విచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ టీమ్.. అదే కాఫీ హౌస్‌లో టీ తాగి, బన్ మస్కాను రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఈ సందర్భంగా క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్, మాట్ డామన్‌లను కాఫీ హౌస్‌లో చూడగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అందరూ వెంటనే తమ ఫోన్లు తీసి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. ఈ హాలీవుడ్ అగ్రతారలు ముంబయిలో బన్ మస్కా ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా కనిపించారు. View this post on Instagram A post shared by Universal Pictures India (@universalpicturesindia) -
పవన్‌కు ముంబైలో సర్జరీ పూర్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కుడి భుజానికి (రొటేటర్ కఫ్) జరిగిన ఈ సర్జరీ సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య బృందం తెలిపింది.ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కల్యాణ్ రెండు భుజాల కండరాలు (రొటేటర్ కఫ్) తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. అయితే రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, తొలిదశలో కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించారు. మరో భుజానికి దాదాపు రెండు నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నట్లు సమాచారం.పవన్ కల్యాణ్‌కు ఈ గాయాలు ఒక్కసారిగా ఏర్పడినవి కావని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ 'గబ్బర్ సింగ్' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు భుజానికి గాయమైంది. అనంతరం 2019లో రాయలసీమ పర్యటనలో, ఎన్నికల టైంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా కూడా భుజాలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఫిజియోథెరపీతో పాటు పునరావాస చికిత్స కొనసాగనుంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.@PawanKalyan— N Chandrababu Naidu (@ncbn) July 11, 2026 -
ఎల్ నినో ఉన్నా ముంబైలో కుండపోత వర్షాలు ఎలా?
-
నాలుగు ఫ్లాట్లకు రూ. 180 కోట్లు : ఈ డీల్ ఎవరిదో తెలుసా?
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగిన భారీ డీల్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆస్క్ (ASK) వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ డైరెక్టర్ భారత్ షా కుటుంబం ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్లీ ప్రాంతంలో నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'కల్పతరు వన్' (Kalpataru One) ప్రాజెక్ట్‌లో జరిగిన ఈ డీల్ మొత్తం విలువ దాదాపు రూ. 180 కోట్లు. రియల్ ఎస్టేట్ విక్రయాల వృద్ధి నెమ్మదించిందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, ముంబై, ఢిల్లీ NCR వంటి ప్రధాన నగరాల్లోని లగ్జరీ ప్రాజెక్టులలో భారీ లావాదేవీలు,ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద నివాస ప్రాపర్టీ లావాదేవీలలో ఇది ఒకటిగా నిలిచింది.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'జాప్కీ' (Zapkey) సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భరత్ షా భార్య ప్రీతి షా, కుమార్తె కిన్నారి షా లిస్టెడ్ డెవలపర్ కల్పతరు లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లోని 34వ, 35వ అంతస్తులలోని అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. రెరా (RERA) నిబంధనల ప్రకారం ఈ నాలుగు ఫ్లాట్ల మొత్తం కార్పెట్ ఏరియా 17,689 చదరపు అడుగులు (అంటే ఒక్కో అపార్ట్మెంట్ దాదాపు 4,422 చదరపు అడుగులు). చదరపు అడుగు ధర సుమారు రూ. 1.01 లక్షలుగా పలికింది.రూ. 9 కోట్ల స్టాంప్ డ్యూటీమహిళల పేరిట ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1శాతం రాయితీ లభించినప్పటికీ, ఈ డీల్ కోసం రూ. 8.97 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ ఇళ్లతో పాటు 16 కార్ పార్కింగ్ స్లాట్లు కూడా కేటాయించబడ్డాయి. అంతేకాదు ఈ-క్లినికల్ వర్క్స్ (eClinicalWorks) సీఈఓ గిరీష్ నవాని భార్య రాధి నవాని, వర్లీ సీ ఫేస్‌లోని 'నమన్ క్షానా' ప్రాజెక్ట్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను రూ. 162 కోట్లకు కొనుగోలు చేశారు. ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి! -
ముంబై జలమయం..పౌరుల నిర్లక్ష్యమే కారణం : బాంబే హైకోర్టు
ముంబై: నగరంలో ప్రతి ఏటా వర్షాలకు రోడ్లు చెరువులను తలపించడం అనేది పౌరులు స్వయంగా కొనితెచ్చుకున్న సంక్షోభమేనని బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు భూములను ఆక్రమించడం, మురుగు కాలువలను పూడ్చివేయడం, ప్రభుత్వ మౌలిక వసతులను దుర్వినియోగం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు పేర్కొంది .తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర వి. ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రజలు మురుగు కాలువలలో చెత్త వేయడం,నడిచే దారులను అక్రమ పార్కింగ్ స్థలాలుగా మార్చడం, ఫుట్‌పాత్‌లను ఫుడ్ స్టాళ్లతో ఆక్రమించడం వల్లే ముంబై నగరం మునిగిపోవడానికి కారణమవుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది .హైకోర్టు వెలుపల ఉన్న ఫుట్‌పాత్‌లను సైతం అక్రమ దుకాణాలతో ఆక్రమించేశారని జస్టిస్ ఘుగే ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన మాతృభూమిని మనమే దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాం. అక్రమంగా భూములను ఆక్రమించుకోవడం, ఆ తర్వాత కూల్చివేత నోటీసులు వచ్చినప్పుడు మాత్రమే చట్ట పుస్తకాలను వెతకడం సరికాదు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఇల్లు మారాలనుకున్నారు : అంతలోనే కుటుంబం సజీవ సమాధి
దేశ వాణిజ్య నగరం ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక అక్రమ భవనం కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబైలోని మాన్‌ఖుర్ద్ పరిధిలో గల మండాలా (జనతా నగర్) ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఒక నాలుగు అంతస్తుల అక్రమ కట్టడం పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. వారంతా ఆ మర్నాడే ఇల్లు మారాలనుకున్నారు. ఇంతలోనే మృత్యువు వారిని వెంటాడింది.ప్రమాదాన్ని ముందే ఊహించినారోజువారీ కూలిగా పనిచేసే మొయినుద్దీన్ వాజిద్ అలీ షా, ఆయన భార్య అక్తర్ జహాన్ తమ నలుగురు పిల్లలతో కలిసి ఒక రేకుల ఇట్లో నివసిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న భవనం వర్షాలకు దెబ్బతిని, కూలిపోయేలా ఉందని వారు ముందే ప్రమాదాన్ని పసిగట్టారు. ఆదివారం నాడే ఆ ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు.. మనం బతికిపోతాం అని భార్యాబిడ్డలతో చెప్పాడు. ఫుడ్ తీసుకు రావడానికి అలా బయటికి వెళ్లాడో.. లేదో 10 నిమిషాల్లో అంతా ముగిసిపోయింది.శనివారం రాత్రి అక్తర్ జహాన్ ఇల్లు మారడానికి సామాన్లు ప్యాక్ చేసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా వారి ఇంటిపై కూలిపడింది. మొయినుద్దీన్ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందే బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఇంట్లోనే ఉన్న భార్య, నలుగురు పిల్లలు శిథిలాల క్రింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు చిన్న పిల్లలే ఉన్నారు. ఇందులో పొరుగింట చిన్నారి కూడా ఉంది. భవనం కూలిపోవడానికి కొన్ని గంటల ముందే అందులో స్పష్టమైన మార్పులు కనిపించాయని స్థానికులు తెలిపారు. గోడలకు పగుళ్లు రావడం, టైల్స్ ఊడిపడటం, భవనం ఒక పక్కకు వంగిపోవడంతో ఆ బిల్డింగ్‌లో ఉంటున్న కుటుంబాలు ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. అలా వారు ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, ఆ భవనం పక్కనే ఉన్న పేదల రేకుల షెడ్లపై పడటంతో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసింది. కూలిపోయిన ఆ అక్రమ కట్టడం యజమానిని, దానిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను పోలీసులుఅరెస్ట్ చేశారు. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముంబై మున్సిపల్ అధికారులు కూడా అది అనధికారిక కట్టడమేనని ధృవీకరించారు. మరోవైపు ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానిక మున్సిపల్ సిబ్బంది రాత్రంతా శ్రమించి శిథిలాల కింద ఉన్నవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా బిగ్‌బీ అమితాబ్ రూ. 15 కోట్ల ల్యాండ్ డీల్ -
వరుణుడు ఉగ్రరూపం మునిగిన ముంబై
-
ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కుండపోత వర్షాలు, బలమైన గాలుల మధ్య అంబానీ భద్రతా కాన్వాయ్ ముందు ఒక చెట్టు కూలిపోవడంతో, కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాపిక్‌లో కొద్దిసేపు ఆగిపోవాల్సి వచ్చింది. అంబానీ కుటుంబం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహ వేడుకకు వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
ఆకాశానికి చిల్లు పడిందా? ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
-
125 ఏళ్ల ‘డబ్బావాలా’ సేవలకు బ్రేక్
ముంబై: ముంబైలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల కారణంగా నగరానికి జీవనాడి లాంటి ముంబయి ‘డబ్బావాలా’ల సేవలు సోమవారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. పలు ప్రాంతాలు జలమయం కావడం, డబ్బావాలాల రవాణాకు ప్రధాన ఆధారమైన సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో డెలివరీలను నిలిపివేయాల్సి వచ్చింది. తమ సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్బావాలా అసోసియేషన్ తెలిపింది.డబ్బావాలా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉల్హాస్ ముకే మాట్లాడుతూ, విరార్-వసాయి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పలువురు డబ్బావాలాల ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక రైల్వే స్టేషన్లలో కూడా నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు సేవలను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ తాత్కాలిక అంతరాయానికి వినియోగదారులకు అసోసియేషన్ క్షమాపణలు తెలిపింది.భారీ వర్షాల కారణంగా వెస్ట్రన్ రైల్వే పరిధిలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అసోసియేషన్ పేర్కొంది. ప్రతిరోజూ వేలాది లంచ్ బాక్సులను రవాణా చేయడానికి డబ్బావాలాలు ముంబయి సబర్బన్ రైల్వే నెట్వర్క్పైనే ఎక్కువగా ఆధారపడతారు. రైళ్లు ఆలస్యం కావడం వల్ల సకాలంలో డెలివరీలు చేయడం కష్టమవుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.గడిచిన 125 ఏళ్లకు పైగా ముంబయి ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ, తమ కార్మికుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యత అని డబ్బావాలా అసోసియేషన్ తెలిపింది. ‘మాకు 125 సంవత్సరాల సుదీర్ఘ సంప్రదాయం ఉన్నప్పటికీ, మా ఉద్యోగుల భద్రతే మాకు అన్నింటికంటే ముఖ్యం. అందువల్ల, ముందస్తు జాగ్రత్తగా ఈరోజు సేవలను నిలిపివేస్తున్నాం’ అని అసోసియేషన్ తెలిపింది.ముంబై డబ్బావాలాలు తమ అత్యంత సమర్థవంతమైన లంచ్ బాక్స్ డెలివరీ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రతి పనిదినం నగరవ్యాప్తంగా వేలాది ఇంటి భోజన డబ్బాలను ఎంతో ఖచ్చితత్వంతో వీరు చేరవేస్తారు. వీరి లాజిస్టిక్స్ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు అధ్యయనం చేశాయి. ఇది అత్యుత్తమ సప్లై చైన్ సిస్టమ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముంబైలో అత్యంత నమ్మకమైన సేవగా పేరొందిన డబ్బావాలాల వ్యవస్థ నిలిచిపోవడం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది. -
ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తూర్పు ముంబై పరిధిలో భవనం కూలి ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలగడంతో పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. VIDEO | At least six persons were killed and one sustained injuries when a three-storey chawl (row tenement) collapsed in Mumbai’s Mankhurd area amid heavy rains on Sunday night, officials said. Rescue operation is going on. Visuals are from the spot.#Mumbai #Mankhurd pic.twitter.com/IHXyvlRdyP— Press Trust of India (@PTI_News) July 5, 2026భారీ వర్షాల కారణంగా ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను నిలిపివేసి, రహదారిని మూసివేశారు. టన్నెల్ పైభాగం నుండి వర్షపు నీరు జలపాతంలా కిందకు పడటం, రహదారిపై రోడ్డు నిర్మాణ శిథిలాల చరియలు విరిగిపడిన దృశ్యాలు స్థానిక టెలివిజన్ ఛానళ్లలో ప్రసామవుతున్నాయి. రహదారి రవాణాతో పాటు విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంబై-పూణె మధ్య నడిచే దూరప్రాంత రైళ్లను సైతం అధికారులు రద్దు చేశారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత నెల చివర నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి నగరంలో చెట్లు విరిగిపడి ఇప్పటివరకు మరో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముంబై నగరంలో సగటున 100 మిల్లీమీటర్ల (3.9 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 161 మిల్లీమీటర్ల (6.3 అంగుళాలు) వరకు వర్షం కురిసింది. ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం చాలా చోట్ల చాలా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఇది కూడా చదవండి: రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం! -
రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉధృత రూపం దాల్చాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగగా.. కేరళ, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.ముంబైలో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే కార్యకలాపాలను గంటపాటు నిలిపివేశారు. దీనివల్ల విమానాల రాకపోకల్లో సగటున 30 నుంచి 75 నిమిషాల ఆలస్యం చోటుచేసుకుంది. నగరంలో 24 గంటల్లో గరిష్టంగా 200 నుంచి 300 మి.మీ వర్షపాతం నమోదైంది.మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఒడిశాలోని అన్ని జిల్లాలను యంత్రాంగం అప్రమత్తం చేసింది. కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్నూర్, కాసరగోడ్ సహా పలు ఉత్తర జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. జాతీయ రాజధాని ఢిల్లీ, జార్ఖండ్‌లలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.ఇది కూడా చదవండి: ‘కలల నగరం’ కథలే వేరు.. -
‘కలల నగరం’ కథలే వేరు..
దేశ ఆర్థిక రాజధాని, మాయానగరిగా పేరొందిన ముంబై కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది కోట్ల మంది కలల నిలయం. హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్)కు కేంద్ర బిందువైన ఈ నగరం, దశాబ్దాలుగా ఎంతో మంది దర్శకులకు అద్భుతమైన కథా వేదికగా నిలిచింది. ఇక్కడి లోకల్ రైళ్లు, రద్దీగా ఉండే గల్లీలు, ఆకాశహర్మ్యాలు, మురికివాడలు.. సినిమా స్క్రిప్ట్‌లలో కీలక పాత్రలుగా మారిపోయాయి. ముంబై నగర జీవన విధానాన్ని, అక్కడి విభిన్న పార్శ్వాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించిన బాలీవుడ్ చిత్రాలివే..నగర జీవితాల అంతర్లీన బంధాలుఅనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఇన్ ఎ... మెట్రో' సినిమా ముంబై ఆధునిక జీవన విధానానికి అద్దం పడుతుంది. నగర జీవితంలో మనుషుల మధ్య ఉండే సంబంధాలు, ఆకాంక్షలు, వారు ఎదుర్కొనే సవాళ్లను విభిన్న కథల ద్వారా ఇందులో చూపించారు. కిక్కిరిసిన లోకల్ రైళ్లు, నైట్ లైఫ్, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత కోసం సామాన్యులు పడే తాపత్రయాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. అదేవిధంగా, హన్సల్ మెహతా తెరకెక్కించిన ‘సిటీలైట్స్’ చిత్రం ఒక గ్రామీణ కుటుంబం మెరుగైన జీవితం కోసం ముంబైకి వలస వచ్చి ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులను, వారి భావోద్వేగాలను ఆవిష్కరించింది.లోకల్ రైళ్లు.. డబ్బావాలాల మ్యాజిక్ముంబై లైఫ్ లైన్ అనదగ్గ లోకల్ రైళ్ల నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘ఏక్ చాలీస్ కీ లాస్ట్ లోకల్’. అర్ధరాత్రి వేళ లోకల్ ట్రైన్ మిస్సయిన ఇద్దరు వ్యక్తులు నగర వీధుల్లో ఎదుర్కొన్న ఊహించని, నవ్వు తెప్పించే సంఘటనలను ఈ డార్క్ కామెడీ చిత్రంలో చూపించారు. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ‘ది లంచ్ బాక్స్’ సినిమా ముంబైలోని ‘డబ్బావాలా’ వ్యవస్థ ఆధారంగా రూపొందింది. ఒక లంచ్ బాక్స్ డెలివరీ తారుమారు కావడం వల్ల ఇద్దరు ఒంటరి వ్యక్తుల మధ్య చిగురించిన పరిచయం, నగరంలోని యాంత్రిక జీవితంలో మానవీయ బంధాల విలువను చాటిచెప్పింది.విషాదం నుండి కోలుకున్న ముంబై స్పిరిట్ముంబై నగరంపై జరిగిన దాడులు, అక్కడి ప్రజల మనోధైర్యాన్ని చాటే చిత్రాలు కూడా బాలీవుడ్లో వచ్చాయి. 2006 ముంబై రైలు పేలుళ్ల నేపథ్యంలో నిషికాంత్ కామత్ రూపొందించిన ‘ముంబై మేరీ జాన్’ చిత్రం, ఆ ఘోర విపత్తు తర్వాత నగర ప్రజలు ప్రదర్శించిన ఐక్యతను, వారి జీవన పోరాటాన్ని అద్భుతంగా చూపించింది. మరోవైపు, శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’ చిత్రం, 2008 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం దేశభక్తితో పాటు విపత్కర పరిస్థితుల్లో ముంబై నగరం చూపిన గుండె నిబ్బరాన్ని ప్రతిబింబించింది.మురికివాడల వాస్తవికత.. మానవ హక్కుల పోరాటంమీరా నాయర్ క్లాసిక్ చిత్రం ‘సలామ్ బాంబే’.. ముంబై వీధుల్లోని అట్టడుగు వర్గాల, ముఖ్యంగా వీధి బాలల కఠిన జీవితాలను ప్రపంచానికి పరిచయం చేసింది. పేదరికం, ఆకలి, మనుగడ కోసం వారు చేసే పోరాటం ఇందులో అత్యంత వాస్తవికంగా ఉంటుంది. అలాగే హన్సల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన బయోపిక్ ‘షాహిద్’, ముంబైలో 2010లో హత్యకు గురైన మానవ హక్కుల న్యాయవాది షాహిద్ అజ్మీ జీవితాన్ని ఆవిష్కరించింది. ముంబైలోని న్యాయ వ్యవస్థ సంక్లిష్టతలను, అన్యాయంగా నిందపడిన వారి కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటాన్ని ఈ సినిమా చూపించింది. కిరణ్ రావు చిత్రం ‘ధోబీ ఘాట్’ కూడా నగరంలోని సాంస్కృతిక, ఆర్థిక వైవిధ్యాన్ని నలుగురు వ్యక్తుల కోణంలో ఆసక్తికరంగా చూపించింది.‘పేజ్ 3’ సంస్కృతి.. క్రైమ్ అండర్ వరల్డ్మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పేజ్ 3’ సినిమా ముంబై హై-సొసైటీ, సెలబ్రిటీల విలాసవంతమైన జీవితాలు, మీడియా ప్రపంచం వెనుక ఉన్న చేదు నిజాలను నిలదీసింది. దీనికి భిన్నంగా, రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘షోర్ ఇన్ ది సిటీ’ ముంబైలోని నేర ప్రపంచం, సామాన్యుల ఆశయాలు, మనుగడ కోసం పడే ఆరాటాన్ని గ్రిప్పింగ్‌గా చూపించింది. మరో ముఖ్యమైన చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, 1970ల నాటి ముంబై అండర్ వరల్డ్ తీరుతెన్నులను, గ్యాంగ్స్టర్ల మధ్య నడిచిన ఆధిపత్య పోరాటాన్ని చూపించింది.యువత కలలు.. కీలక ఎన్కౌంటర్లుఅయాన్ ముఖర్జీ రూపొందించిన ‘వేక్ అప్ సిద్’ చిత్రంలో ముంబై నగరం ఒక అందమైన కలల ప్రపంచంలా కనిపిస్తుంది. మెరైన్ డ్రైవ్, ముంబై వర్షాలు, కెరీర్ కోసం నగరానికి వచ్చే యువత ఆలోచనలను ఈ సినిమా ఎంతో ఆహ్లాదకరంగా చూపించింది. ముఖ్యంగా ముంబై నగరాన్ని చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా అపూర్వ లాఖియా తెరకెక్కించిన ‘షూటౌట్ ఎట్ లోఖండ్వాలా’ చిత్రం 1991లో ముంబై పోలీసులకు, మాయా డోలాస్ గ్యాంగ్‌కు మధ్య లోఖండ్వాలా కాంప్లెక్స్‌లో జరిగిన ఎన్కౌంటర్ ఆధారంగా రూపొందింది. ఇది ముంబైలోని క్రైమ్ హిస్టరీని కళ్లకు కడుతుంది.ఇది కూడా చదవండి: తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు! -
పుంజుకున్న నైరుతి
ముంబై/ఈటానగర్/బిలాస్పూర్/కోల్‌కతా/తిరువనంతపురం: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు భారత్‌పై కరుణ చూపడం మొదలుపెట్టాయి. కేరళ, మహారాష్ట్ర, పశి్చమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రానున్న ఒకట్రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. పలుచోట్ల నదులు పొంగిపొర్లుతుండగా వరద ముప్పును తట్టుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నదీ పరీవాహక ప్రాంతాలు, డ్యామ్‌ల వద్ద నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్ మొత్తానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.ముంబైతోపాటు మహారాష్ట్రలో భారీ వర్షాలను సూచిస్తూ అధికారులు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. థానే, పాల్ఘర్ జిల్లాల్లోనూ శనివారం భారీ వర్షాలు కురిశాయి.థానేలో ఐదు గంటల్లోనే 65.79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పాల్ఘర్లో ఇది 97.7 మిల్లీమీటర్లుగా ఉంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. థానే జిల్లాలో 35 ఏళ్ల మహిళ విద్యుత్ షాక్‌తో మరణించింది. కాల్వా ప్రాంతంలో చెట్టు మీదపడటంతో ఇద్దరు గాయపడ్డారు. పాల్ఘర్ ప్రాంతంలోని తండ్లువాడీ కోటలో దట్టమైన మంచు కారణంగా దారితప్పిన ఆరుగురు పర్యాటకులను రక్షించినట్లు పాల్ఘర్ ఎస్పీ యతీశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. వీరంతా పాల్ఘర్లోని దండేకర్ కాలేజీ విద్యార్థులని చెప్పారు.ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంఐ–172 హెలికాప్టర్‌ను రంగంలోకి దించింది. ఆహారం, వైద్యసామగ్రిని సరఫరా చేస్తోంది. లోయర్ సియాంగ్ జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు మూసుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అకాజన్–లికాబాలి–బమే రహదారిపై శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లా కర్యాల్ గ్రామంలో భారీ వర్షాలకు భూమి కుంగిపోతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పగుళ్లు, నేల జారిపోవడంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
ముంబైలో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
ముంబైలో వర్ష బీభత్సం..‘రెడ్ అలర్ట్’ జారీ!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రంలో భారీ అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ, ఈ వారం ప్రారంభం నుండి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఐలాండ్ సిటీలో సగటున 99 మి.మీ, తూర్పు శివారు ప్రాంతాలలో 98 మి.మీ, పశ్చిమ శివారు ప్రాంతాలలో 94 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
లాకప్ డెత్ కేసులో కోర్టు సంచలన తీర్పు
ముంబై: సుదీర్ఘ కాలం పాటు సాగిన ఒక కస్టోడియల్ డెత్ కేసులో మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడి లాకప్ డెత్‌కు కారణమైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా తొమ్మిది మంది పోలీసులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.2011, మే 10వ తేదీ అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో పార్ధి సామాజిక వర్గానికి చెందిన బేగ్యా పవార్ (23) అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు వారి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పవార్ పోలీస్ కస్టడీలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.పోలీస్ స్టేషన్లో పవార్‌ను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్య పరీక్షలలో కూడా పవార్ శరీరంపై అనేక చోట్ల ఎముకలు విరిగినట్లు తేలడంతో, కస్టడీలో జరిగిన హింస నిజమేనని స్పష్టమైంది. ఘటన జరిగిన అనంతరం పవార్ తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పైనే ఆరోపణలు ఉండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు.దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, పార్ధి సామాజిక వర్గ ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి నిస్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.బాధితుల ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును రాష్ట్ర సీఐడీకి అప్పగించింది. సీఐడీ దర్యాప్తు అధికారి లోతుగా విచారణ జరిపి, కస్టడీలో యువకుడిని తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని నిర్ధారిస్తూ కోర్టులో నివేదిక (చార్జ్‌షీట్) దాఖలు చేశారు.గత 15 ఏళ్లుగా సాగిన ఈ కేసు విచారణ చివరకు ముగిసింది. నాటి రిసోడ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మహాదేవ్ మాణిక్ ధాండేతో పాటు మరో ఎనిమిది మంది పోలీసులను కోర్టు దోషులుగా తేల్చింది. నిందితుల్లో ఇన్ఛార్జ్ ధాండేతో సహా ఇద్దరు పోలీసులు ఇప్పటికే సర్వీస్ నుండి రిటైర్ అయ్యారు. కాగా, కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే దోషులైన తొమ్మిది మందిని వాషిమ్ జైలుకు తరలించారు. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వారిని అమరావతి జైలుకు తరలించనున్నారు.కోర్టు తీర్పుపై పవార్ వృద్ధ తల్లిదండ్రులు స్పందిస్తూ..15 ఏళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది అని ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ.. తన కొడుకు ఎలాంటి నేరం చేయలేదని, కేవలం ప్రశ్నించడానికే తీసుకెళ్లి చంపేశారని పవార్ తల్లి కన్నీరు మున్నీరైంది. నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన కోర్టుకు, ప్రాసిక్యూషన్‌కు, సీఐడీ దర్యాప్తు బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడి..
ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వర్షం మధ్య తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంధేరి-సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్‌కోపర్‌తో కలిపే ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అతడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు సమాచారం.ఘటనాస్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల వల్ల మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉంచారు. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్టు చెప్పారు.ఈ ఘటనకు 2 రోజుల ముందే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం బయటపడటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ అధికారిని సస్పెండ్ చేసింది.ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలుగురువారం కూడా ముంబైలో భారీ వర్షం కొనసాగింది. దాదర్, పరేల్, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరి సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.గురువారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో తూర్పు శివారు ప్రాంతాల్లో సగటున 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతాల్లో 172 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ముంబై జీవనాడిగా భావించే లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పట్టాలపై నీరు చేరడంతో ఉదయం రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని ప్రయాణికులు తెలిపారు. అయితే రైల్వే అధికారులు మాత్రం రైలు సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణంగానే నడుస్తున్నాయని వెల్లడించారు. -
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
-
చిన్నారి ప్రాణం తీసిన చెట్టు.. మంత్రి షాకింగ్ కామెంట్
ముంబైలో రోడ్డుపక్కన ఉన్న చెట్టు స్కూల్ బస్సుపై కూలి ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ షిర్సాట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చెట్లు కూలడం సహజమే అంటూ చాలా సింపుల్‌గా తీసిపారేశారు. "నిన్న జరిగిన ఘటన గురించి అందరికీ తెలుసు. ఈ విషయంపై ప్రభుత్వం ఈరోజు సభలో ప్రకటన చేస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌కు కూడా ఆదేశాలు ఇచ్చాం" అని ఆయన బుధవారం చెప్పారు. సంజయ్ షిర్సాట్ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి మంత్రిగా ఉన్నారు.జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న కొద్దీ ఆయన సమాధానాలు కాస్త మారుతూ వచ్చాయి. "ఒకటి-రెండు చెట్లు కూలడం, పిడుగు పడడం మనిషి చేతిలో ఉండదు. ఏ చెట్టు ఇప్పుడు కూలబోతోందో ముందే తెలిసిపోదు" అని అన్నారు.ఇదీ చదవండీ: స్కూల్ బస్సుపై పడ్డ చెట్టుమంగళవారం మధ్యాహ్నం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సుమారు 70 ఏళ్ల చెట్టు వేర్లతో పాటు కూలి, యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న మేక్ ఫోర్స్ సంస్థ స్కూల్ బస్సుపై పడింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ మృతి చెందాడు. బయటకు తీసిన పిల్లల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చెట్ల తనిఖీ చేయడం కూడా బాధ్యతే కదా? అని సంజయ్‌ను మీడియా ప్రశ్నించింది. "తనిఖీలు చేస్తూనే ఉంటాం" అని మంత్రి చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చెబుతున్నారని మీడియా మళ్లీ ప్రశ్నించింది.దీనికి సంజయ్ స్పందిస్తూ... "అలా కాదు. పనులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చెట్లు కూలడం సహజం. కొన్నిసార్లు గాలి బలంగా వీచితే అవి కూలిపోతాయి" అని అన్నారు. అయితే ఈ ప్రమాదం బాధాకరమని మంత్రి స్పష్టం చేశారు.మంత్రి సంజయ్ వ్యాఖ్యలను "సిగ్గుచేటు"గా శరద్ పవార్ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో అభివర్ణించారు. "ఇది పూర్తిగా సిగ్గుచేటైన వ్యాఖ్య. ఒక చిన్నారి ప్రాణం పోయింది. అలాంటి సమయంలో చెట్టు కూలడం సహజ ప్రక్రియ అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. ఇది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చదివాను. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ల శాఖపై నింద వేస్తోంది. ప్రతి వర్షాకాలానికి ముందు చెట్ల తనిఖీ తప్పనిసరిగా జరగాలి" అని కాస్ట్రో అన్నారు.కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే ఈ ప్రమాదాన్ని హైకోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "ఈ అంశంపై సభలో ప్రభుత్వ నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను దోచుకుంది. అలాంటి ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశించగలం" అని నానా పటోలే అన్నారు.ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మహారాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు."ఈ ఘటన దురదృష్టకరం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూస్తాం. ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం" అని కదమ్ చెప్పారు.భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్ ఈ ఘటనను "అత్యంత దురదృష్టకరం"గా పేర్కొంటూ సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. "చెంబూర్‌లో రావిచెట్టు స్కూల్ వాహనంపై కూలి చిన్నారి మృతి చెందిన ఘటన అత్యంత దురదృష్టకరం. వర్షాకాలంలో చెట్ల కొమ్మలను సమయానికి కత్తిరించడం చాలా అవసరం. నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. చెట్లను సంరక్షించాలి. అదే సమయంలో మానవ ప్రాణాలు కూడా అమూల్యం. నిన్న జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. మున్సిపల్ పరిపాలన చెట్ల కొమ్మలను కత్తిరించాలి. బలహీనంగా ఉన్న చెట్లను తొలగించాలి" అని చెప్పారు. -
‘శాశ్వతం’గా బెంగళూరుకు షిఫ్ట్ అయిన హార్దిక్ పాండ్యా!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నుంచి అతడు మకాం మార్చేశాడు. ‘శాశ్వతం’గా బెంగళూరులో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.వెన్నునొప్పి కారణంగా..కాగా అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ కారణాల దృష్ట్యా.. చాన్నాళ్ల క్రితమే టెస్టు ఫార్మాట్‌ను వదిలేశాడు. వన్డే, టీ20లలో టీమిండియా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న ఈ బరోడా ఆటగాడిని తరచూ గాయాలు వేధిస్తున్నాయి. ఒకానొక దశలో వెన్నునొప్పి కారణంగా ఏళ్ల పాటు జట్టుకు దూరమైన అతడు.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.భారత్ టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్-2026లో పలు మ్యాచ్‌లకు దూరమైన ఈ ఆల్‌రౌండర్.. తాజాగా తొడ కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు.శాశ్వత శిక్షణా శిబిరం అక్కడే!ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE- Centre of Excellence)లో హార్దిక్ పాండ్యా పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో CoEనే తన శాశ్వత శిక్షణా శిబిరంగా మార్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ ఇప్పటికే శాశ్వతంగా బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాడు. సిటీ శివార్లలో ఓ ప్రాపర్టీని అద్దెకు తీసుకున్నాడు. CoEకి అది అతి దగ్గరగా ఉంటుంది. CoEనే శాశ్వత ట్రెయినింగ్ సెంటర్‌గా మార్చుకున్న తొలి భారత క్రికెటర్ ఇతడేనేమో!అందుకే ముంబై నుంచి బెంగళూరుకు షిఫ్ట్తన కెరీర్ చరమాంకం వరకు అతడు ఇక్కడే శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ముంబైలో తన ఇంటి నుంచి.. ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లడం హార్దిక్‌కు చాలా కష్టంగా మారింది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న క్రికెటర్‌గా CoEలో అతడికి అన్ని సౌకర్యాలూ లభిస్తాయి.గాయం నుంచి కోలుకోవడం నుంచి.. నైపుణ్యాలు మెరుగుపెట్టుకోవడం సహా ప్రతీ విషయంలోనూ అతడికి బీసీసీఐ నుంచి సహకారం ఉంటుంది. అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్, దేశీ టోర్నీలు, టీమిండియా తరఫున విధుల్లో ఉన్నపుడు మాత్రం అతడు CoEకి దూరంగా జట్టుతో కలిసి ఉంటాడు.మరో ఐదు నుంచి ఆరేళ్ల పాటు హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ కెరీర్ సజావుగా కొనసాగించాలనుకుంటున్నాడు. అందుకోసం తనను తాను మెరుగుపరచుకోవడం అత్యవసరం’’ అని పేర్కొన్నాయి. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వ్యక్తిగత సెలవులో ఉన్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకునే క్రమంలో త్వరలోనే CoEకి అతడు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తిప్పికొట్టిన శ్రేయస్ -
ముంబైలో భారీ వర్షాలు.. అంధేరి సబ్వే బంద్
ముంబై : భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అంధేరి సబ్వేలో నీరు భారీగా నిలిచిపోవడంతో అధికారులు రవాణాను నిలిపివేసి, ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రోడ్లు దిగ్బంధనమయ్యాయి. డీఎన్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక భారీ వృక్షం బస్సుపై కూలగా, ఈస్టర్న్ ఫ్రీవేపై తక్కువ విజిబిలిటీ (కనిపించే సామర్థ్యం) కారణంగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సాధారణంగానే నడుస్తున్నప్పటికీ, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తీవ్రంగా నెమ్మదించింది. #WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai as monsoon intensifies across Maharashtra; visuals from the Eastern Freeway pic.twitter.com/c9fwaUNI70— ANI (@ANI) June 30, 2026ఈ వాన బీభత్సంలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. చేంబూరు రోడ్ నంబర్ 11 వద్ద యూనివర్సల్ హైస్కూల్, తిలక్ నగర్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై భారీ చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి మరణించాడు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం స్థానిక జెన్, జైన్ ఆసుపత్రులకు తరలించారు. కాగా, నగరంలో పాఠశాలలు, కళాశాలల సెలవులపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లేదా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి అప్డేట్స్ తెలుసుకోవాలని సూచించారు.వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంత కోంకణ్ రీజియన్, పూణే ఘాట్ ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాల సూచనతో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, పూణే సిటీకి ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని, బలహీనమైన నిర్మాణాలు, చెట్ల కింద ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం 12:35 గంటలకు 4.16 మీటర్ల ఎత్తులో సముద్రపు పోటు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. -
స్కూల్ బస్సుపై పడ్డ చెట్టు.. ఓ విద్యార్థి మృతి, 10 మందికి గాయాలు
ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు వస్తున్నాయి. అందుకే చెట్టు కూలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం చెంబూర్‌లోని రోడ్ నం.11లో జరిగింది. ఆ సమయంలో ఆ స్కూల్ వ్యాన్‌లో మొత్తం 13 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన విద్యార్థుల్లో కొందరిని జైన్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని బయటకు తీసేందుకు అత్యవసర సహాయ బృందాలు కూలిపోయిన చెట్టును కోస్తున్నాయి.ఆ ప్రాంత ప్రజలు, చెట్ల కొమ్మలను కత్తిరించాలని లేదా తొలగించాలని కోరుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుసార్లు లేఖలు రాశామని చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిపారు. పలుసార్లు హెచ్చరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు.ఇదిలా ఉండగా, ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. -
హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు
ముంబయిలో మరోసారి హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. గిర్గావ్ ప్రాంతంలోని ఒక హోటల్లో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసి, ఇద్దరు నటీమణులను రక్షించారు. ఈ వ్యవహారంలో పింప్ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం, రక్షించిన వారిలో ఒకరు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రధాన నటి కాగా, మరొకరు బెంగాలీ చిత్రాల్లో నటించడంతో పాటు బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రలు (కామియో రోల్స్) పోషించారు. బాధితుల ప్రైవసీచ భద్రత దృష్ట్యా వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. వారిని నిందితులుగా కాకుండా బాధితులుగానే పరిగణించి రక్షించినట్టు తెలిపారు.మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నట్లు చెబుతున్న నిందితుడిని పోలీసులు రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతనికి సినీ పరిశ్రమలోని పలువురితో ఉన్న సంబంధాలు, పరిచయాలతోనే ఈ గలీజు దందాకు తెరతీశాడు. అయితే ఈ ముఠా ద్వారా మరికొంతమంది మహిళలను వేధించారు అనే కోణంలో పోలీసులు అతని కాంటాక్ట్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ నటీమణులు ఆ హోటల్‌కు ఎలా వచ్చారు? వారిని ఎవరైనా బెదిరించారా లేదా ఆర్థికంగా వాడుకున్నారా? అనే విషయాలపై విచారణ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!దీనికి కొద్ది రోజుల ముందే థానేలోని కల్యాణ్ ప్రాంతంలో కూడా ఒక హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. అక్కడ ఒక మహిళా అడ్వకేట్ (న్యాయవాది) ఈ ముఠాను నడుపుతున్నట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆమె ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు సాధారణ దుస్తుల్లో కస్టమర్లలా వెళ్లి నిఘా పెట్టి, ఇద్దరు మహిళలను రక్షించారు. ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించిన ఫోన్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తూ, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్ -
24,000 కిందికి నిఫ్టీ..
ముంబై: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ అరశాతం నష్టంతో ముగిసింది. ఐటీ, ఆటో, చమురు రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు కీలక షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 76,728 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 24,000 స్థాయి దిగువన 23,946 వద్ద నిలిచింది. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ 50 రీబ్యాలెన్సింగ్, బీఎస్ఈ సెన్సెక్స్ నెలవారీ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. నేడు నిఫ్టీ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీలతో పాటు బ్యాంక్ నిఫ్టీ నెలవారీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 478 పాయింట్లు పతనమై 76,622 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి 23,925 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా 1.14%, జపాన్ 0.15%, హాంకాంగ్ 1.5%, తైవాన్ 0.9% పెరిగాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశా యి. అమెరికా సూచీ లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.ఇండెక్సుల వారీగా: బీఎస్ఈలో ఆటో (–2.11%), ఆయిల్ అండ్ గ్యాస్ (–1.40%), సర్వీసెస్ (–1.21%), ఐటీ (–1.04%) రంగాలు పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.65%, 0.60 శాతం నష్టపోయాయి.పర్సిస్టెంట్ సిస్టమ్స్: జర్మనీకి చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈని కొనుగోలు చేసుకుంటామని ప్రకటించడంతో పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 11% నష్టపోయి రూ.4,298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11.63% కోల్పోయి రూ.4,277 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.కోటక్ మహీంద్రా బ్యాంక్: ఎండీ, సీఈవోగా అశోక్ వాస్వానీ తమ పునర్నియామకాన్ని కోరడం లేదని స్పష్టం చేయడంతో కోటక్ బ్యాంకు షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3.2% నష్టపోయి రూ.396 వద్ద ముగిసింది. ఒక దశలో 3.6% పతనమై రూ.394 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.13,177 కోట్లు హరించుకుపోయి రూ. 3.93 లక్షల కోట్లకు దిగివచి్చంది.టర్టిల్‌మింట్ లిస్టింగ్.. ప్చ్ఇన్సూరెన్స్ కంపెనీ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.152)తో పోలిస్తే 10.39% డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 13% క్షీణించి రూ.132 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,987 కోట్లుగా నమోదైంది. -
ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా?
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోగల బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ కుట్ర వెలుగుచూసింది. ఒళ్లు నొప్పుల నివారణా మాత్రలంటూ (పెయిన్ కిల్లర్స్) అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందు కెమికల్ ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్‌ను పంపిణీ చేయడం కలకలంరేపింది. అప్రమత్తమైన ముంబై పోలీసులు ఈ పెను ప్రమాదాన్ని అడ్డుకోగలిగారు. అసలు ఇంతకీ జింక్ ఫాస్ఫైడ్ అంటే ఏమిటి? ఇది శరీరంలోకి వెళ్తే ప్రాణాలు ఎలా పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.చుంచులను చంపే మందు.. మనుషులకు మృత్యుపాశంజింక్ ఫాస్ఫైడ్ అనేది ముదురు బూడిద రంగులో ఉండే ఒక అకర్బన రసాయన సమ్మేళనం (Inorganic Chemical Compound). దీనిని సాధారణంగా పొలాలు, గోదాములు, ఇళ్లలో ఎలుకలు, ఇతర హానికరమైన జంతువులను (Rodents) నిర్మూలించడానికి 'రోడెంటిసైడ్' (ఎలుకల మందు) విరివిగా ఉపయోగిస్తారు. ఇది మానవుల ప్రాణాలకు క్షణాల్లో ముప్పు తెచ్చే గుణం కలిగి ఉన్నందున, దీని నిల్వ, బహిరంగ విక్రయాలపై చట్టపరంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ముంబైలో స్వాధీనం చేసుకున్న ప్రతి క్యాప్సూల్లోనూ దాదాపు ఒక గ్రాము చొప్పున ఈ ప్రాణాంతక జింక్ ఫాస్ఫైడ్‌ను నింపినట్లు నిర్ధారణ అయింది.పొట్టలోకి వెళ్తే పొగబెట్టే ‘ఫాస్ఫైన్ గ్యాస్’జింక్ ఫాస్ఫైడ్ ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే అది అత్యంత విషపూరితంగా మారుతుంది. ఈ రసాయనం మానవ జీర్ణాశయానికి చేరుకోగానే, అక్కడి జఠర రసం లేదా పొట్టలోని యాసిడ్లతో (Stomach Acid) రసాయన చర్య జరుపుతుంది. ఈ ప్రక్రియ వల్ల ‘ఫాస్ఫైన్ గ్యాస్’ (Phosphine Gas) విడుదలవుతుంది. ఈ గ్యాస్ మానవ శరీరానికి తీవ్రంగా హాని కలిగిస్తుంది. ఇది నేరుగా రక్తంలో కలిసి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), మెదడుపై తీవ్రమైన దాడి చేస్తుంది.ఆక్సిజన్‌ను ఆపేసి.. అవయవాలను నిర్జీవం చేసి.. ఈ విషవాయువు ప్రభావం వల్ల శరీరంలోని కణాలు ఆక్సిజన్‌ను గ్రహించే, ఉపయోగించుకునే ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (irregular heartbeat) ఏర్పడతాయి. రక్తపోటు (Blood Pressure) ఒక్కసారిగా పడిపోతుంది. ఊపిరి తీసుకోవడం అత్యంత కష్టంగా మారుతుంది. విషం తీవ్రత పెరిగేకొద్దీ, శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విఫలమయ్యే ‘మల్టీ-ఆర్గన్ ఫెయిల్యూర్’ (Multi-organ failure) పరిస్థితి ఏర్పడి మనిషి మరణిస్తాడు. ఇందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు.ప్రాథమిక లక్షణాలు ఇవే..ఈ విషపూరిత కెమికల్ శరీరంలోకి వెళ్లిన వెంటనే కొన్ని హెచ్చరిక లక్షణాలు కనిపిస్తాయి. బాధితుడికి తీవ్రమైన వికారం, వాంతులు అవుతాయి. పొట్టలో భరించలేనంత నొప్పి మొదలవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, బాధితుడి నోటి నుంచి లేదా వాంతుల నుంచి ‘వెల్లుల్లి’ వంటి ఘాటైన వాసన వస్తుంది. దీంతో పాటు తల తిరగడం, విపరీతమైన నీరసం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.అత్యవసర పరీక్షలుజింక్ ఫాస్ఫైడ్ పాయిజనింగ్ జరిగినట్లు అనుమానం వస్తే, వైద్యులు తక్షణమే రోగి ప్రాణాలను రక్షించేందుకు పలు రకాల అత్యవసర పరీక్షలు చేస్తారు. ఇందులో భాగంగా రోగి బ్లడ్ ప్రెజర్ (బిపి), గుండె పనితీరును గమనిస్తారు. గుండె కొట్టుకునే తీరును గమనించేందుకు ఈసీజీ తీస్తారు. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తనిఖీ చేస్తారు. వీటితో పాటు రసాయనం ఏ మేరకు ప్రభావం చూపిందో అంచనా వేయడానికి లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లతో పాటు ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తారు.విరుగుడు లేని విషంఈ విషానికి సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. జింక్ ఫాస్ఫైడ్ పాయిజనింగ్‌కు ఎలాంటి నిర్దిష్ట ‘యాంటీడోట్’ (విరుగుడు మందు) అందుబాటులో లేదని నిపుణులు చెబుతున్నారు. దీనిని సేవించిన వ్యక్తిని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తరలించడం ఒక్కటే మార్గం. రోగికి కృత్రిమ శ్వాస కోసం ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. గుండె, రక్తపోటును అదుపులో ఉంచడానికి వైద్యులు లక్షణాత్మక చికిత్స (Symptomatic Treatment) అందిస్తారు. శరీరంలో విషం మరింతగా వ్యాపించకుండా ప్రాథమిక చికిత్సలు అందించి, ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. బెంగాల్లో ‘యోగీ’ స్టయిల్ గుండా బిల్లు! -
బన్నీ-రష్మిక మరోసారి.. యాక్షన్ తో షురూ!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ అండ్ యాక్షన్ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీపికా పదుకొనె, మలయాళ నటి ఫెమినాజార్జ్ ఈ మూవీలో భాగమయ్యారు. జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ‘రాకా’లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ముంబైలో జూలైలో ప్రారంభం కాబోయే కొత్త షూటింగ్ షెడ్యూల్లో రష్మిక మందన్నా జాయిన్ అవుతారని, ఆమె పాత్రకు సంబంధించి తొలుత యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు అట్లీ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు.. రష్మిక క్యారెక్టరైజేషన్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సరికొత్త గెటప్‌లో ఆమె కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘రాకా’ సినిమా 2027లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘మైసా’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు రష్మిక. అలాగే విజయ్ దేవరకొండ సరసన ‘రణబాలి’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విషం మాత్రలతో 15,000 మంది హత్యకు కుట్ర
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా కనీసం 15,000 మందిని చంపేయడానికి కుట్ర పన్నిన ఫయాజ్ ప్రేమ్‌జీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ ఫాస్పైడ్ అనే రసాయనంతో వేలాదిగా విషపూరిత మాత్రలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొహర్రం ఊరేగింపులో పాల్గొనే జనానికి వీటిని పంచాలని ప్లాన్ చేశాడు. ఈ మాత్రలు నొప్పిని తగ్గిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నమ్మబలుకుతూ కొందరికి స్వయంగా పంపిణీ చేశాడు. అలాగే చాక్లెట్లు అని చెబుతూ జనంపైకి విసిరేశాడు. ఆ మాత్రలను మింగిన బాధితులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాత్రలను ఉచితంగా పంచడంపై అనుమానం వచ్చిన ఓ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు శనివారం నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీని అరెస్టు చేశారు. అతడి వద ్దనుంచి 15,000 విషపూరిత మాత్రలను స్వా«దీనం చేసుకున్నారు. ప్రేమ్‌జీ ఇచ్చిన మాత్రలను తీసుకున్నవారిలో 11 మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఫయాజ్ పుణేలోని విమాన్ నగర్లో జన్మించాడు. ఉన్నత విద్య అభ్యసించాడు. గొడవల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. పెయింటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాడు. 2019 నుంచి 2025 దాకా ఇరాన్, ఇరాక్‌లో పలుమార్లు పర్యటించి వచ్చాడు. అతడి తల్లి, సోదరి ఇరాన్లో నివసిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇరాన్, ఇరాక్‌లకు 19 సార్లు వెళ్లొచ్చాడు. అతడి ఆర్థిక లావాదేవీలు, మొబైల్ ఫోన్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. 15,000 మంది హత్య చేయాలన్న ఆలోచన అతడిదేనా? లేక ఉగ్రవాదుల హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫయాజ్ ఏకంగా 50 కిలోల జింక్ ఫాసై్పడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటిదాకా 15,000 క్యాప్సూల్స్‌లో ఒక్కో గ్రాము చొప్పున జింక్ ఫాసై్పడ్ను నింపాడు. మొత్తం 30,000 విషపు క్యాప్సూల్స్ తయారు చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. -
ఆర్పీఎల్ రెండో సీజన్ చాంపియన్ హైదరాబాద్ హీరోస్..
హైదరాబాద్ : హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ పవర్డ్ బై ఎవిడ్ రెండో సీజన్ టైటిల్‌ను హైదరాబాద్ హీరోస్ కైవసం చేసుకుంది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ 41-17 స్కోరు తేడాతో ముంబై డ్రీమర్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా టోర్నమెంట్ ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి, ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, ప్రముఖ నటి మిస్ మృణాళ్ ఠాకూర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ మిస్టర్ జి.బి.ఎస్. రాజు, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్, లీగ్ కమిషనర్ రాహుల్ బోస్ హాజరయ్యారు.ప్రపంచ స్థాయి రగ్బీ ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్ హీరోస్ జట్టు చాంపియన్‌షిప్ ట్రోఫీతో పాటు రూ. 45 లక్షల ప్రైజ్ మనీని దక్కించుకుంది. రన్నరప్‌గా నిలిచిన ముంబై డ్రీమర్స్ రూ. 25 లక్షల నగదు బహుమతిని పొందింది. అంతకుముందు జరిగిన మూడో స్థాన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై బుల్స్‌ను 22-19తో ఓడించిన బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుని రూ. 15 లక్షల ప్రైజ్ మనీని అందుకుంది. మహిళల పోటీల విజయవంతమైన ప్రారంభంతో లీగ్ ప్రస్థానంలో మరో మైలురాయి నమోదైంది.ఈ సందర్భంగా రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్ మాట్లాడుతూ, “హెచ్ఎస్బీసీ ఆర్పీఎల్ గత ఏడాది లీగ్ కంటే అన్ని విధాలా పెద్దదిగా, మెరుగ్గా సాగింది. భారీ సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులు, మరింత మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు, ఆర్పీఎల్ మహిళల లీగ్, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అభిమానుల భాగస్వామ్యం, ఎక్కువ స్పాన్సర్షిప్, బ్రాడ్‌కాస్ట్‌లో భారీ వ్యూయర్షిప్ లభించాయి. ఇంతకంటే ఏం కావాలి? ఈ అద్భుతమైన క్రీడపై ప్రేమను పెంచుకున్న ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు." అని అన్నారు.జీఎంఆర్ స్పోర్ట్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుజోయ్ గంగూలీ మాట్లాడుతూ"హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ పవర్డ్ బై ఎవిడ్ రెండో సీజన్ విజయవంతంగా ముగియడం ఇండియాలో కొత్త క్రీడా వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే మా సుదీర్ఘ దార్శనికతలో మరో ముఖ్యమైన అడుగు. ప్రపంచ స్థాయి లీగ్‌లు యువ ప్రతిభను ప్రేరేపించడం, క్షేత్రస్థాయి అభివృద్ధిని బలోపేతం చేయడం, అథ్లెట్లకు ఆకాంక్షాత్మక వేదికలను సృష్టించడం ద్వారా క్రీడా రంగాన్ని మార్చగలవని జీఎంఆర్ స్పోర్ట్స్‌లో మేము నమ్ముతున్నాము. ఈ సీజన్లో అభిమానుల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన, మహిళల పోటీల విజయవంతమైన ప్రారంభం.. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో ఒకటిగా మారడానికి రగ్బీకి అపారమైన సంభావ్యత ఉందనే మా నమ్మకాన్ని బలపరిచాయి." అని అన్నారు.ఫైనల్ మ్యాచ్ సాగిందిలా.. ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ క్లినికల్ ప్రదర్శనతో ముంబై డ్రీమర్స్‌ను 41-17తో అధిగమించింది. మ్యాచ్ ప్రారంభంలో ముంబై జట్టు బంతిపై ఎక్కువ నియంత్రణ సాధించినప్పటికీ, దానిని పాయింట్లుగా మార్చడంలో విఫలమైంది. హైదరాబాద్ కట్టు దిట్టమైన డిఫెన్స్‌తో ముంబై నుంచి బంతిని లాక్కొని ఎదురుదాడికి దిగింది. ఫ్రాన్సిస్కో కాస్కుల్లోలా బంతిని దక్కించుకుని తైతైఫోనో తావితాకు అందించగా అతను పాయింట్ సాధించాడు. ఆ తర్వాత మాన్యుయెల్ మోరెనో బంతిని పాస్ చేయగా శివమ్ శుక్లా సులువుగా ఫినిష్ చేశాడు. మారిస్ లాంగ్ బాటమ్ డ్రాప్ గోల్ కొట్టడంతో విరామ సమయానికే హైదరాబాద్ పూర్తి నియంత్రణ సాధించింది. విరామం తర్వాత కూడా హైదరాబాద్ హీరోస్ అదే వేగాన్ని కొనసాగించింది. తావితా లెఫ్ట్ సైడ్ కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకుని డీగో అర్డావో గోల్ కొట్టాడు. ముంబై ఆటగాడు ఇథన్ మెక్‌ఫార్లాండ్ వేగవంతమైన కదలికలతో ఒక గోల్ చేసి ముంబైకి బ్రేక్‌థ్రూ ఇచ్చాడు. అయినా హైదరాబాద్ తన దాడిని ఆపలేదు. అర్డావో తన రెండో గోల్ సాధించగా.. కెవిన్ వెకేసా అద్భుతమైన మూవ్‌తో మరో పాయింట్ కొట్టాడు. చివరి క్వార్టర్ ప్రారంభంలో టెరియో తమాని ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ముంబై జట్టులో జేమ్స్ టర్నర్ ఒక గోల్ తిప్పికొట్టడంతో పాటు చివర్లో సుకుమార్ హెంబ్రోమ్ గోల్ చేయడానికి అసిస్ట్ చేశాడు. అయినప్పటికీ హైదరాబాద్ క్లినికల్ ఫినిషింగ్, బలమైన డిఫెన్స్‌తో భారీ విజయాన్ని ఖరారు చేసుకుంది.మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్ సాగిందిలా మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో బుల్స్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. మరికా కొరోయిబెటె ఒక లూజ్ పాస్‌ను అడ్డుకుని, ముందుకు దూసుకెళ్లి, జుగల్ మాఝీ మొదటి ట్రై సాధించేలా బంతిని అందించాడు. అయితే బెంగళూరు జట్టు సంయమనంతో సమాధానమిచ్చింది. డిఫెన్స్‌లో దొరికిన ఖాళీని షిల్టన్ వైక్ ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ క్వార్టర్లో నిరంతర ఒత్తిడిని కొనసాగిస్తూ, జోనాస్ మికాల్సియస్ ఒక వింగ్ నుండి అలాగే గణేష్ మాఝీ మరో వింగ్ నుండి దాడి చేయడంతో బెంగళూరుకు మంచి ఆధిక్యం లభించింది.విరామం తర్వాత చెన్నై పుంజుకుంది. మార్కస్ కెర్షా స్వల్ప దూరం నుండి ట్రైని పూర్తి చేయగా, ఆ తర్వాత ఫిలిపే సౌతురాగా ప్రత్యర్థి త్రోను అడ్డుకుని బుల్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయినప్పటికీ, మ్యాచ్ ముగింపు దశలో బ్రేవ్‌హార్ట్స్ ఓపికగా బంతిని వైడ్‌గా పాస్ చేస్తూ ముందుకు సాగింది. అక్కడ అకుయిలా రొకోలిసోవా లైన్‌ను దాటి జట్టుకు ఒక నాటకీయ విజయాన్ని అందించాడు. -
కాల్ లిఫ్ట్ చేయలేదని కామపిశాచిగా డెలివరీ బాయ్..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్ ఒక మహిళను తీవ్రంగా వేధించిన ఘటన కలకలం రేపింది. జూన్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెలివరీ బాయ్ చేసిన ఫోన్ కాల్‌ను సదరు మహిళ ఎత్తకపోవడంతో, ఆ కాల్ వాయిస్మెయిల్కు డైవర్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఆ వాయిస్‌మెయిల్‌ను వినగా, అందులోని అత్యంత అసభ్యకర పదజాలంతో కూడిన సందేశం ఆమెను భయాందోళనలకు గురిచేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ముంబై పోలీసులకు, సదరు డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేసింది.వాయిస్మెయిల్లో దారుణంసదరు మహిళ ఇంట్లో లేని సమయంలో ‘షాడోఫాక్స్’ డెలివరీ ఏజెంట్ ఆమెకు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రికార్డ్ అయిన వాయిస్మెయిల్లో అతను అత్యంత దారుణ రీతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యంత అసభ్యకరమైన హిందీ పదజాలంతో బూతులు తిడుతూ ఆడియో మెసేజ్ పంపాడు. ఈ మాటలు విన్న సదరు మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ఈ భయానక అనుభవాన్ని నిషా బాలకృష్ణ అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. డెలివరీ ఏజెంట్‌కు తన ఇంటి చిరునామా పూర్తిగా తెలుసని, దీనివల్ల తనకు ప్రాణభయం పట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై పోలీసులను , షాడోఫాక్స్ సంస్థను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు.కఠిన చర్యలకు డిమాండ్ఈ వేధింపుల ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కామెంట్లలో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరికొందరు మహిళలు కూడా డెలివరీ బాయ్స్ నుండి తాము ఎదుర్కొన్న ఇలాంటి చేదు అనుభవాలను ఈ పోస్ట్ క్రింద పంచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రూ. 70 కోట్ల ఇల్లు ప్రశాంతతకు నిలయం, మరో స్పెషల్ ఎట్రాక్షన్
బాలీవుడ్ స్టార్ నటీనటులు అక్షయ్ కుమార్, రవీనా టాండన్ దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle). ఈ సినిమా జూన్ 26న విడుదలవుతున్న నేపథ్యంలో, ముంబైలో ఉన్న రవీనా టాండన్ లగ్జరీ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైలోని ఈ విలాసవంతమైన ఇంటి విలువ 2025 నాటికి సుమారు రూ. 70 కోట్లు. పదండి ఆ ఇంటి ప్రత్యేకలేంటో తెలుసుకుందాం.'నీలయ' - ప్రశాంతతకు నిలయంముంబైలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా (Bandra) ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా (Sea-facing) ఈ ఇల్లు ఉంది. 'నీలయ' అంటే సంస్కృతంలో 'ఆశ్రయం' అని అర్థం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పక్షుల కిలకిలరావాలు, పచ్చని చెట్లతో ఈ ఇల్లు ఒక ప్రశాంతమైన ప్రపంచంలా ఉంటుందని రవీనా ఒక సందర్భంలొ పేర్కొన్నారు. అలాగే ఇంట్లో దాదాపు అన్ని వస్తువులను రవీనా స్వయంగా సెలక్ట్ చేసుకొని కొనుక్కున్నారట. ఇంట్లో భర్త అనిల్ థడానీ, అత్తమామలు, తన ఇద్దరు పిల్లలు - కుమార్తె రాషా, కుమారుడు రణ్‌బీర్‌లతో కలిసి నివసిస్తున్నారు. ఈ ఇల్లు చక్కటి వాస్తు, కేరళ సంప్రదాయ శైలి, మొరాకన్ (Moroccan) ఆర్కిటెక్చర్ల అద్భుత కలయికగా ఉంటుంది. ఇల్లంతా ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్, శిల్పాలతో నిండి ఉంటుంది. ప్రసిద్ధ కళాకారులు పరేష్ మైతీ, తోట వైకుంఠం వంటి వారు సృష్టించిన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద వినాయకుడి శిల్పం స్వాగతం పలుకుతుంది.శివాలయం స్పెషల్ ఎట్రాక్షన్ ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన శివాలయం ఉండటం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ దీపావళి వంటి పండుగలకు కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేస్తారు. ఆలయం వెలుపల దక్షిణ భారతదేశం నుండి తెచ్చిన 50 ఏళ్ల నాటి నంది విగ్రహం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించేలా పార్వతీ దేవి విగ్రహాన్ని కూడా అమర్చారు.ఇదీ చదవండి: మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్లివింగ్ రూమ్‌లో మార్బుల్ ఫ్లోరింగ్, ఎర్రటి ఇటుకల గోడలు ఆధునికతను, విలాసాన్ని ప్రతిబింబిస్తాయి. డైనింగ్ రూమ్‌లో ఫారెస్ట్ గ్రీన్ కలర్ 3D ఉడెన్ ప్యానెల్ గోడ, అద్భుతమైన డిజైన్ గల టేకు టేబుల్, విలాసవంతమైన షాండ్లియర్ (ఝుమర్) ఉన్నాయి. నివేదికల ప్రకారం ఇక్కడ రూ. 10 లక్షల విలువైన బార్ కౌంటర్ కూడా ఉంది. ఇంటి వెనుక భాగంలో కేరళ సంప్రదాయ ఇళ్ల తరహాలో చెక్కబడిన స్తంభాలు, మొరాకన్ శైలి పోర్చ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇది పార్టీలు, గెట్-టుగెదర్లకు చక్కగా సరిపోతుంది.ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలుచాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, డైరెక్టర్ అహ్మద్‌లతో కలిసి పని చేయడం పాత స్నేహితులను మళ్లీ కలుసుకున్నట్లు ఉందని రవీనా ఆనందం వ్యక్తం చేశారు. అక్షయ్ కుమార్ గురించి చెబుతూ.. "అప్పట్లో మేమంతా యువకులం, నేర్చుకునే దశలో ఉన్నాం. కానీ ఇప్పుడు అక్షయ్ తన నటనలో పరిపూర్ణత సాధించాడు. సినిమా కోసం ఆయన పెట్టే శ్రమ ఇప్పుడు రెట్టింపు అయ్యింది" అని ఆమె కొనియాడారు.ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు! -
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం..
-
మేయర్‌కు ఊహించని అనుభవం.. మ్యాన్‌హోల్‌లో పడ్డ కార్మికుడు
ముంబై మేయర్ రీతూ తావ్డేకు ఊహించని అనుభవం ఎదురైంది. ముంబైవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడానికి ఆమె నగర వీధులలో పర్యటించారు. అయితే అనూహ్యంగా ఆమె కళ్లెదుటే ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను రక్షించారు. ఇది చూసిన మేయర్ తీవ్ర అసహానంతో ఆగ్రహం చెందారు. నిన్న(మంగళవారం) ముంబైలో విపరీతంగా వర్షం కురిసింది. రాత్రంతా కురిసిన కుండపోత వర్షాల వల్ల నగరంలో రోడ్లు జలమయమవడమే కాకుండా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గోడలు కూలిపోవడం వంటి నష్టాలు కూడా జరిగాయి. దీంతో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి మేయర్ నగరంలో పర్యటించారు.బుధవారం ఉదయాన్నే దాదర్, హింద్మాతా, గాంధీ మార్కెట్ వంటి ప్రభావిత ప్రాంతాలకి వెళ్లారు. ఈ తనిఖీల సమయంలో ఒక పారిశుధ్య కార్మికుడు అక్కడే డ్రైనేజ్ తెరిచి ఉండడంతో అందులో పడిపోయాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న మేయర్ ఈ ఘటనపై స్పందించారు. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని, సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.అయితే ఈ ఘటన అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడారు. భారీవర్షాల కారణంగా పేరుకపోయిన వ్యర్థాలను తొలగించడం కోసమే ఆ మ్యాన్‌హోల్ పారిశుద్ధ్య కార్మికులు పక్కకు జరిపారని వివరించారు. ఆ సమయంలో అక్కడ అక్కడ ఏర్పాటు చేసిన 'అలర్ట్' (హెచ్చరిక) బోర్డులను, బారికేడ్లను ప్రజల గమనించాలని సూచించారు.అయితే ముంబై వర్షాలపై ప్రతిపక్ష శివసేన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆదిత్య థాకరే, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బీఎంసీ నిధులను పూర్తిగా ఖాళీ చేసిందని ఆరోపించారు. గతంలో థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సూచించినట్లుగా రెయిన్ వాటర్ ట్యాంకులను నిర్మించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందన్నారు.అయితే ఈ వ్యాఖ్యలకు మేయర్ కౌంటరిచ్చారు. "ఇంట్లో కూర్చుంటే పనులు కావు, క్షేత్రస్థాయిలోకి రావాలి" అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో ఆధిత్య థాకరే ఇంట్లోనే కూర్చుని పాలన సాగించారని ఆరోపించిన మేయర్, ప్రతిపక్షాలు ముందుగా రోడ్లపైకి వచ్చి చూడాలని హితవు పలికారు.पालिका कर्मचारी महापौर ऋतू तावडे यांच्यासमोर man hole मध्ये पडला…आज मुंबईत मुसळधार पाऊस झाला त्याची पाहणी महापौर करत असताना सदर घटना घडली pic.twitter.com/gJMDQYptEd— Seema Adhe (@AdheSeema) June 24, 2026 -
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)
-
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్.. 130 ఎకరాల్లో కోస్టల్ రోడ్ గార్డెన్స్
ముంబై నగరాన్ని పచ్చదనంతో నింపే బృహత్తర ప్రాజెక్ట్‌కు రిలయన్స్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ‘ముంబై కోస్టల్ రోడ్ గార్డెన్స్’ ప్రాజెక్ట్ పురోగతిని వెల్లడించారు. నగర తీరప్రాంతంలో 130 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ముంబై భవిష్యత్తుకు అంకితమైన దీర్ఘకాలిక పర్యావరణ పెట్టుబడిగా ఆమె అభివర్ణించారు.ఈ గార్డెన్స్‌లో 60,000కు పైగా చెట్లు, లక్షలాది పొదలను నాటే ప్రణాళిక ఉంది. ఇప్పటికే సుమారు 15,000 చెట్ల నాటే పనులు ప్రారంభమైనట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ముంబై కోస్టల్ రోడ్ వెంట విస్తరించే ఈ హరిత ప్రదేశం నగరానికి కొత్త ‘గ్రీన్ లంగ్’గా మారనుంది.ప్రాజెక్ట్‌లో నీడనిచ్చే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఓపెన్ పార్కులు, పబ్లిక్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, పికిల్‌బాల్ వంటి క్రీడలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై వాసులు పిల్లాపాపలతో గడిపేలా ‘ట్రీ మ్యూజియం’ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఉండనున్నాయి.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు కూడా ఇటీవల తొలగిపోయాయి. ముంబై కోస్టల్ రోడ్‌కు ఆనుకుని అభివృద్ధి చేయనున్న 130 ఎకరాల ప్రజా ప్రదేశాల రూపకల్పనకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. ఈ విస్తీర్ణంలో అధిక భాగం ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండే పార్కులు, ఉద్యానవనాలు, సైకిల్ ట్రాక్‌లు, ప్రొమెనేడ్లుగా అభివృద్ధి చేయనున్నారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పు..ప్రపంచ ప్రఖ్యాత నగరాలకు సెంట్రల్ పార్క్, హైడ్ పార్క్, బొటానిక్ గార్డెన్స్ ఎలా గుర్తింపుగా నిలిచాయో, అదే తరహాలో కోస్టల్ రోడ్ గార్డెన్స్ ముంబైకు కొత్త చిహ్నంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం, నగర జీవన నాణ్యతను మెరుగుపరచే ఈ ప్రాజెక్ట్ ముంబై అభివృద్ధి చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.A new green heart for the city of Mumbai. At the Reliance AGM, Mrs. Nita Ambani shared the vision and first glimpses of the upcoming Coastal Road Gardens. Spread over 130 acres with more than 60,000 trees, the Gardens will feature green walking trails, children's play areas,… pic.twitter.com/JvC8B35a1a— Reliance Foundation (@ril_foundation) June 22, 2026 -
ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!
ముంబై: ముంబై నగరవాసుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. గత కొంతకాలంగా మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. రాబోయే 48 గంటల్లో రుతుపవనాలు ముంబై సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నగరంలో కురిసిన వర్షాలు ముందస్తు రుతుపవన జల్లులేనని స్పష్టం చేసిన అధికారులు, రానున్న రెండు రోజుల్లో అధికారికంగా రుతుపవనాల రాకను ప్రకటించే అవకాశం ఉందని తెలపడంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి పెద్ద ఊరట లభించినట్లయింది.పుంజుకున్న రుతుపవనాలుఅరేబియా సముద్రం, బెంగాళాఖాతంలో బలహీనమైన వాతావరణ వ్యవస్థలు, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైంది. సాధారణంగా జూన్ 11 నాటికే ముంబైని తాకాల్సిన రుతుపవనాలు, గత వారం రోజులుగా మరింత మందగించాయి. అయితే, తాజా పరిణామాల ప్రకారం పశ్చిమ తీరం వెంబడి రుతుపవన వ్యవస్థ మళ్లీ బలాన్ని పుంజుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని, రాబోయే రెండు రోజుల్లో ఈ పురోగతి మరింత వేగవంతం కానుందని వాతావరణ శాఖ పేర్కొంది.వేగాన్ని నియంత్రిస్తున్న అల్పపీడనంరుతుపవనాలు మళ్లీ కదిలినప్పటికీ, వాటి ప్రయాణం సాధారణం కంటే నెమ్మదిగానే సాగుతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలను తీవ్రం చేసే బెంగాళాఖాతంలోని అల్పపీడన వ్యవస్థ ఇంకా ఏర్పడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ చివరి నాటికి మాత్రమే ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు రుతుపవనాల రాక మరింత ఆలస్యమై, జూలై మొదటి వారంలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటుప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాత లోటు ఆందోళనకరంగానే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణంగా కురవాల్సిన 106 మిమీ వర్షపాతానికి గానూ కేవలం 60.6 మిమీ మాత్రమే నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటు నెలకొంది. ఇందులో మధ్య భారతదేశం అత్యధికంగా 67 శాతం లోటుతో అతలాకుతలమవుతుండగా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 40 శాతం, దక్షిణ భారతదేశంలో 28 శాతం, వాయువ్య భారతదేశంలో 15 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది. రాబోయే 48 గంటల్లో ముంబైలోకి రుతుపవనాల ప్రవేశం దేశవ్యాప్త వర్షాలపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. -
22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి
-
ఉద్ధవ్ సేనలో కలకలం.. ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై?
ముంబై: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ‘ఆపరేషన్ టైగర్’పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తమ పార్టీ చెక్కుచెదరకుండా, ఐక్యంగా, బలంగా ఉందని స్పష్టం చేశారు.ఇటీవల ‘ఆపరేషన్ టైగర్’పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను తమవైపు లాగేందుకు ప్రయత్నిస్తోందనే ప్రచారాన్ని ప్రతిపక్షం "ఆపరేషన్ టైగర్"గా పేర్కొంటోంది. శివసేన పార్టీ ప్రచార చిహ్నం పులి (టైగర్) కావడంతో ఈ పేరును వాడుతున్నారు.ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం.. శివసేన (యూబీటీ)కి చెందిన కొందరు ఎంపీలు షిండే క్యాంప్‌లోని నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. శివసేన (యూబీటీ) నాయకులను షిండే వర్గంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలకు పెట్టిన రాజకీయ పేరే "ఆపరేషన్ టైగర్".9 మంది ఎంపీల్లో ఏడుగురు.. కొన్ని కథనాల ప్రకారం.. యూబీటీ శివసేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఏడుగురు షిండే శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారంతా ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తమ ఎంపీలతో సమావేశం నిర్వహించిన తర్వాత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఐక్యతను చాటేందుకు “ఆపరేషన్ వుల్ఫ్” ప్రారంభిస్తామని చెప్పారు.“మీరు ఏ ఆపరేషన్ టైగర్ గురించి అడుగుతున్నారు? మేమంతా పులులమే. మేము ఆపరేషన్ వుల్ఫ్ ప్రారంభించబోతున్నాం. మేము భయపడబోము. మా ఎంపీలంతా, పార్లమెంటరీ పార్టీ పూర్తిగా ఐక్యంగా, బలంగా ఉన్నాయి. అలాగే కొనసాగుతాయి” అని అన్నారు.అంతకుముందు రోజున శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆదివారం ముంబైలో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో శివసేన (యూబీటీ)కి చెందిన 9 మంది పార్లమెంట్ సభ్యులంతా పాల్గొన్నారని చెప్పారు. పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరతారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన రౌత్.. నలుగురు ఎంపీలు ప్రత్యక్షంగా హాజరయ్యారని, మరో ఐదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారని చెప్పారు. ఈ సమావేశం పార్టీ సాధారణ సంస్థాగత కార్యక్రమంలో భాగమని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ దినా పాటిల్, మాతోశ్రీలో జరిగిన శివసేన యూబీటీ ఎంపీల సమావేశానికి హాజరుకాలేదన్న ప్రచారాన్ని ఖండించారు.మరోవైపు, శివసేన జాతీయ ప్రతినిధి షైనా ఎన్సీ, సంజయ్ రౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “మునిగిపోతున్న ఓడ”లాంటి రాజకీయ పార్టీలో చేరితే రాజకీయంగా దిగజారడమే జరుగుతుందని అన్నారు. -
కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
రూ. 12 కోట్ల గంజాయి : అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ
పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్‌నుంచి 11 కిలోలకు పైగా హై క్వాలిటీ 'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ ఆమె ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా అసలు గట్టు రట్టైంది. ఇదీ చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?ఆమె ట్రాలీ బాగ్‌లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కిట్‌ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆమెను ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ! -
షాకింగ్.. శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14కోట్లు
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ 'స్క్వేర్ యార్డ్స్' ప్రకారం.. వర్లీ ప్రాంతంలో ఉన్న ఈ ఖరీదైన అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కోసం మూడేళ్ల కాలానికి గాను ఏకంగా రూ.7.14 కోట్లతో అయ్యర్ లీజు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ ఫ్లాట్ సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు అయ్యర్‌కు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. ఈ లీజ్ ఒప్పందం మొత్తం 36 నెలల కాలపరిమితికి కుదిరింది. ప్రతి సంవత్సరం అద్దె సుమారు 7 శాతం చొప్పున పెరుగుతుంది. దీనికి సంబంధించి జూన్ 10న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. ఈ ఒప్పందం కోసం రూ. 1.84 లక్షల స్టాంప్ డ్యూటీ అయ్యర్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.నెలవారీ అద్దె మొదటి సంవత్సరం- రూ.18.50 లక్షలురెండూ సంవత్సరం- రూ.19.79 లక్షలుమూడో సంవత్సరం-రూ.21.18 లక్షలునూతన సాథిగా అయ్యర్కాగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో అయ్యర్‌కు జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. అయ్యర్ ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి భారత కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు.చదవండి: IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా? -
హాట్ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
ఓటీటీలో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'మా బెహన్' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌తో పాటు మరో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ తృప్తి దిమ్రి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తన తాజా చిత్రంతో క్రేజ్ సంపాదించుకుకున్న ఈ నటి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్రాపర్టీ ఇపుడు నెట్టింట విశేష చర్చగా మారింది. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సుమారు రూ. 14 కోట్లతో ఒక బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.IndexTap.com ద్వారా అందించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ గ్రౌండ్-ప్లస్-టూ (G+2) అంతస్తుల ఇల్లు నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న కార్టర్ రోడ్ పరిసరాల్లో ఉంది.ప్రీమియం ఏరియాలోని ఈ ప్రాపర్టీ 2,226 చదరపు అడుగుల్లో , 2,194 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో ఈ బంగ్లా స్పెషల్‌గా ఉంటుంది. ఈ బంగ్లా కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. హంగూ ఆర్భాటాల కంటే సరళత, సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ ఇల్లును తీర్చిదిద్దుకుందిట. సాఫ్ట్ టోన్స్ (మృదువైన రంగులు), డెకర్ ఎలిమెంట్స్‌తో కూడిన 'మినిమలిస్ట్' లుక్‌తో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే లివింగ్ రూమ్ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా, చాలా ప్రశాంతంగా డిజైన్ చేశారు. మ్యూటెడ్ వాల్స్ (లైట్ కలర్ గోడలు) మధ్యలో ఉన్న ఒక 'పిస్తా గ్రీన్' కలర్ సోఫా గదికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఓవరాల్ కలర్ ప్యాలెట్ న్యూట్రల్‌గా ఉంటూ, ప్రతీ వస్తువు ప్రత్యేక ఆకర్షణీయంగా రూపొందించారు. గ్లాస్ ఎలిమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ ఇంట్లోకి సహజమైన వెలుతురు వచ్చేలా, ఇండోర్, అవుట్డోర్ ప్రదేశాలను కలుపుతూ విశాలంగా కనిపించేలా పెద్ద పెద్ద గ్లాస్ ప్యానెళ్లు, పార్టిషన్లను ఉపయోగించారు. పచ్చదనాన్ని జోడిస్తూ మొక్కలు, సాధారణ డెకర్ వస్తువులతో బాల్కనీని అలంకరించారు. ఇంకా 'డెకరేటివ్ షాడో ల్యాంప్స్' మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సాఫ్ట్ లైటింగ్ గదికి మరింత వెచ్చదనాన్ని, ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కాగా 'కాలా', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన తృప్తి దిమ్రి ఈ నెల ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తాజా చిత్రం 'మా బెహన్' నటనతో మంచి మార్కులు కొట్టేసింది. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
కాన్సెర్ట్‌లో ఘోరం: డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
ముంబై: మహానగరం ముంబై వర్లీలోని ప్రసిద్ధ ‘ఎన్ఎస్సీఐ డోమ్’లో జరిగిన ఓ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ ఊహించని విషాదంతో ముగిసింది. వేలాది మంది సంగీతాభిమానుల కోలాహలం మధ్య, ఓ 28 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ముంబైలోని మాహిమ్ ప్రాంతానికి చెందిన వృషభ్ మహేంద్ర గాంగుర్డే (28)గా పోలీసులు గుర్తించారు. తన స్నేహితులతో కలిసి ఈ కాన్సెర్ట్‌కు హాజరైన వృషభ్, వేలాది మంది గుమిగూడిన వేదిక వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం విపరీతమైన రద్దీ కారణంగా వృషభ్తో పాటు అతనితో ఉన్న ఒక యువతి కూడా తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. స్పృహతప్పిన వృషభ్ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తార్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వృషభ్ ఆరోగ్య పరిస్థితి విషమించడానికి ముందు అతను మద్యం సేవించి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నప్పటికీ, ఏదైనా ఇతర పదార్థాల ప్రభావం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.పోస్ట్‌మార్టం నివేదిక, ఇతర వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే యువకుని మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటన ముంబైలో భారీ స్థాయిలో జరిగే కాన్సెర్ట్‌ల భద్రతా ఏర్పాట్లపై చర్చకు తెరలేపింది. ఎన్ఎస్సీఐ క్లబ్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. అంత భారీ సంఖ్యలో జనం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, అక్కడి వాతావరణం అంతా గందరగోళంగా మారిందని ఆరోపించారు. -
జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఊహించని షాకిచ్చింది. కెప్టెన్సీ బాధ్యతలతో పాటు పూర్తిగా జట్టు నుంచి కూడా అతడిని తప్పించింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ట్రోఫీ అందించినప్పటికీ, వ్యక్తిగత ఫామ్ లేమి కారణంగా సూర్యకుమార్‌పై వేటు వేశారు.అతడి స్దానంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్ కోసం జట్టు ఎంపిక సందర్భంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పూర్తి స్ధాయిలో దేశవాళీ క్రికెట్లో ఆడాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోయేషన్‌కు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఆడాలనేది తన కల అని స్కై ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన కలను నెరవేర్చుకునే దిశగా సూర్య అడుగులు వేయనున్నాడు. తన ఫామ్‌ను తిరిగి సాధించడానికి, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి దేశవాళీ టోర్నమెంట్లు ఆడాలని మిస్టర్ 360 ఫిక్స్ అయ్యాడు.అతడు చివరగా డొమాస్టిక్ క్రికెట్లో ఈ ఏడాది జనవరిలో ముంబై తరపున విజయ్హాజరే ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. రెడ్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే గతేడాది జనవరిలో విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. సూర్యకుమార్ ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న దులీప్ ట్రోఫీ వెస్ట్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టు తరఫున రెడ్ బాల్ క్రికెట్లో మొత్తం 14 సెంచరీలు సాధించాడు. అతడు ప్రస్తుతం ముంబై టీ20 లీగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు.చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన! -
సారీ చెప్పి.. 15 వేలు ఫోన్‌పే చేశాడు!
డిజిటల్ చెల్లింపుల యుగంలో పొరపాట్లు జరగడం సహజం. అలాంటి పొరపాటుతో చాలా మంది నష్టపోతున్నారు కూడా. తక్షణ స్పందన.. ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి. అలా ఓ కంపెనీ సీఈవో ఏమరపాటులో డబ్బు పంపిస్తే.. ఓ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!. ముంబై మహానగరం. ఓ బిజీ సీఈవో(పేరు కావాలనే ప్రస్తావించలేదు) తన కారులో కాకుండా నిత్యం ఆటోలో ప్రయాణిస్తుంటాడు. అలా రైడ్ పూర్తయ్యాక డిజిటల్ పేమెంట్ ద్వారా ఛార్జీ చెల్లించే క్రమంలో పొరపాటు చేశాడు. ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ.15,682 ఆటో డ్రైవర్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆఫీస్‌లోకి వెళ్లాక చాలా సేపటికి ఆయన ఆ విషయం గుర్తించాడు. ఆటో డ్రైవర్‌ను సంప్రదించాలా? వద్దా? అని అనుకుంటూ ఉండిపోయాడాయన. ఈలోపు.. ఆయన ఊహించనిది జరిగింది. డబ్బు పొరపాటున జమైందని తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి మొత్తం డబ్బును తిరిగి ఫోన్‌పే ద్వారా పంపించాడు. సారీ సర్.. అంటూ మెసేజ్ కూడా పంపాడు. ఈ ఘటనను ఆ సీఈవో తన LinkedIn ఖాతాలో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అతడి పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది.ఈ కథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. "ఇలాంటి సంఘటనలే మనుషులపై విశ్వాసాన్ని నిలబెడతాయి" అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు డిజిటల్ చెల్లింపుల్లో పొరపాట్లు పెరుగుతున్నప్పటికీ, నిజాయితీ ఇంకా సమాజంలో బతికే ఉందని వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎక్కువగా వివాదాలు, ఘర్షణలు కనిపించే ఈ కాలంలో.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ చేసిన నిజాయితీ పని మాత్రం వేలాది మందిని ఆకట్టుకుంది. రూ.15 వేల కంటే విలువైనది మనిషి నమ్మకం, నిజాయితీ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. -
బనియన్, షార్ట్ తోనే గుడిలోకి.. అది గుడి అనుకున్నావా.. జిమ్ అనుకున్నావా! నెటిజన్స్ ఫైర్
-
ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్‌కు..!
చాలా సక్సెస్ స్టోరీలు మన కళ్ల ముందు..నుంచే వస్తుంటాయి. అప్పటి వరకు ఊహించం ఆ వ్యక్తి ఆ స్థాయి చేరుకుంటాడని. చాలా దయనీయ పరిస్థితిల్లో బతికి మనం చూస్తుండగానే ఆకాశమంత స్థాయికి ఎదిగి సక్సెస్‌ని ఒడిసిపట్టి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కథే ఈ టెకీ గాథ.ముంబైలో జన్మించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ యాదవ్ దాదాపు దాదాపు మూడు దశాబ్దాల పాటు మురికివాడలోనే నివశించాడు. అక్కడే అతడి చదువు, బాల్యం సాగింది. ఆ స్థాయి నుంచి జర్మనీలో కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్ స్థాయికి ఎలా చేరుకున్నాడో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆయన భార్యతో కలిసి ఉన్న సోషల్ మీడియా పోస్ట్‌ని షేర్ చేస్తూ..తన కథను పంచుకున్నారు. సంతోష్ యాదవ్ ప్రస్తుతం యాంగులర్ గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ (GDE), గిట్‌హబ్ స్టార్, ఓపెన్-సోర్స్ కంట్రిబ్యూటర్, అంతర్జాతీయ స్పీకర్‌గా పేరు తెచ్చుకున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన జీవితంలో ఎక్కువ భాగం ముంబై మురికివాడలోనే పెరిగానని చెప్పుకొచ్చారు. పాఠశాల చదువులో చాలా ఇబ్బందిపడ్డానని అన్నారు. క్రికెట్ అంటే మహాఇష్టం అందువల్లే చదువులో అంతమాత్రంగా ఉండేవాడినని అన్నారు. ఆ కారణంగానే ఇంటర్లో సైన్సు కోరులో చేరలేకపోయానని అన్నారు. అయితే తండ్రి స్నేహితుల్లో ఒకరు యాదృచ్ఛికంగా ఇచ్చిన సలహా వల్ల కంప్యూటర్ డిప్లోమా కోర్సులో చేరినట్లు తెలిపారు. అయితే ఇంగ్లీష్ తన మాతృభాష కాకపోవడంతో పాఠాలతో పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదన్నారు. I lived in slum in Mumbai for 29 years, decided to move after my daughter was born, next week we will be moving to multi storied apartment on rent, pic.twitter.com/QIgX3igafc— Santosh Yadav (@SantoshYadavDev) August 21, 2020 తన యాస కారణంగా తాను ఎలా ఎగతాళికి గురయ్యానో కూడా చెప్పారు. ఇక చదవలేను అని ఏడ్డిన సంగతి కూడా ఇంకా గుర్తు ఉందన్నారు. మళ్లీ యథావిధిగా పెయిల్ అవుతానేమోనని తెగ భయపడేవాడినని అన్నారు. బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో క్రికెట్ కూడా ఆడటం మానేసి, స్నేహితులకు దూరమై పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టానన్నారు. దాంతో తన గ్రేడ్లు మెరుగుపడటమే గాక సుమారు 60%కు పైగా మార్కులతో డిప్లోమాను పూర్తి చేశానని అన్నారు. అప్పుడు తెలిసిందే సాధించాలని గట్టిగా అనుకుంటే ఎలాగైనా.. సాధించగలరు, చేయగలరని, కేవంల పట్టుదలను వదులుకోకూడదని అన్నారు. తన క్లాస్మేట్ తన యాసను ఎగతాళి చేయడంతోనే సవాలుగా తీసుకుని తనను తాను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే ఆకస్మికంగా తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టాయన్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుదామంలే కాలేజ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి దాంతో ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో వాళ్లు కరాఖండీగా చెప్పారని తెలిపారు. దాంతో రాత్రంతా ఏడుస్తూ ఉన్న నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అయితే తన పరిస్థితిని చూసిన తల్లి తండ్రితో మాట్లాడి చదువుకు కొనసాగించేలా చేసిందన్నారు. తన మేనమామ సాయంతోనే చదువు కొనసాగించగలిగానని అన్నారు. సరిగ్గా కంప్యూటర్ సైన్సుతో డిగ్రీ పూర్తి చేసేనాటికి 2008 ఆర్థిక సంక్షోభం సంభవించి ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. దాంతో ఎంతో కష్టపడి నెలకు రూ. 5000 జీతంతో ఒక ఉద్యోగాన్ని సంపాదించానని నఅ్నారు. కోడింగ్ అంటే ఇష్టంతో C#లో మంచి పట్టు సాధించానన్నారు. నిరంతరం కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాభివృద్ధిని సంపాదించుకుని 2010 కల్లా నెలకు రూ. 12 వేల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సంపాదించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆగస్టులో 2011లో ఒక స్టార్టప్‌లో చేరి ఐదేళ్లపాటు అక్కడే పనిచేశానని అన్నారు. జీతం బాగుండేది, పైగా తాను చేరినప్పుడు 50% కంటే ఎక్కువ జీతం పెరిగిందన్నారు. అలా చివరకు కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్, పీఎఫ్ కూడా లభించాయన్నారు. అలా సరిగ్గా 2016లో భార్యతో కలిసి పూణేకు మారారు. అక్కడ బహుళజాతి కంపెనీలలో పనిచేస్తూ..టెక్నికల్ బ్లాగులు రాయడం, శిక్షణా తరగతులు నిర్వహించడం, డెవలపర్ కమ్యూనిటీకి తన వంతు సహకారం అందించడం ప్రారంభించానని అన్నారు. అయితే పనికోసం కుటుంబ జీవితాన్ని అస్సలు త్యాగం చేయొద్దని అన్నారు. ఎందుకంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేసినా అదనంగా వేతనం మాత్రం లభించదన్నారు. తన కెరీర్ 2019లో అనూహ్యమైన మలుపు తిరిగిందన్నారు. ఆ సమయంలో యాదవ్ Angular, NgRx వంటి ఓపెన్-సోర్స్ ప్రాజెక్టులకు తన వంతు సహకారం అందించడం ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే కమ్యూనిటీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అదే ఏడాది తన తొలి కాన్ఫెరెన్స్ ప్రసంగం ఇచ్చాడు. ఆ తర్వాత గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అందింది. అలాగే నవంబర్ 13, 2019న తన పుట్టి రోజున యాంగులర్ కోసం గూగుల్ డెవలపర్ ఎక్స్‌పర్ట్‌గా అధికారికంగా ప్రకటించబడ్డారు. ఆ తర్వాత 2020లో తన తోటి డెవలపర్లు నామినేట్ చేయడంతో భారతదేశపు తొలి గిట్‌హబ్ స్టార్ అయ్యాడు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫెల్ ప్రకారం..జనవరి 2026లో జర్మనీలోని కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్‌గా మారడానికి ముందు, అవోడాక్ ఏజీ సెలొనిస్ వంటి కంపెనీలతో పనిచేశారు. తన కెరీర్లో 17 ఏళ్లకు పైగా గడిచినా..యాదవ్ ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. 50కి పైగా అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లకు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉన్నారు.We celebrated our 17th wedding anniversary together in Hamburg, this is the first time we decided to spend it with Hiya, she will be 14 soon.This weekend was all about us 😅.Thank you for everything ❣️ and staying by my side, when we married I was not able to afford anything,… pic.twitter.com/EkmgWLKk7N— Santosh Yadav (@SantoshYadavDev) May 31, 2026 (చదవండి: రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..) -
ముంబయి వీధుల్లో అడుక్కుంటోన్న నటి.. అసలేమైంది?
సినీ రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగంలో క్రేజ్‌తో కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది. అయితే ఈ రంగం అందరికీ కలిసిరావడం అనేది చాలా తక్కువే. కొందరు తక్కువ టైమ్‌లో స్టార్‌గా ఎదిగితే.. మరికొందరికీ కొన్ని ఏళ్లు పడుతుంది. కానీ సినిమా వాళ్ల లైఫ్ కూడా పూలపాన్పు అనుకుంటే పొరపాటే అవుతుంది. సినిమా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కనుమరుగైన వారు కూడా ఉన్నారు. మరికొందరేతే దారుణ పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ముంబయిలో జరిగింది.ప్రముఖ భోజ్‌పురి నటి మితాలీ శర్మ.. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. నటిగా ఎదిగింది. కట్ చేస్తే.. ఆమె ప్రస్తుతం ముంబయి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో చేసేదేమి లేక జీవన పోరాటం మొదలెట్టింది. ముంబయిలోని లోఖండ్వాలా వీధుల్లో అత్యంత దీనస్థితిలో భిక్షాటన చేస్తూ మిథాలీ కనిపించింది.ఒకప్పుడు తెరపై మెప్పించిన నటిని వీధిలో అలాంటి స్థితిలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మితాలీకి తన కుటుంబంతో సంబంధాలు క్రమంగా తెగిపోయాయి. పనిలేకపోవడం, మరోవైపు కుటుంబ మద్దతు లేకపోవడంతో ఆమె ఒంటరితనానికి గురైంది. నిరంతర వైఫల్యాలు, తిరస్కరణలు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. అత్యంత దీనస్థితిలో ఉన్న మితాలీని గుర్తించిన పోలీసులు ఆమెను సంరక్షించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన తర్వాత మిథాలీకి ఆహారం అందించారు. ఆమెకు వెంటనే అవసరమైన వైద్య చికిత్స అందించారు. ఆమె మానసిక పరిస్థితి క్షీణించండ వల్ల.. ప్రస్తుతం ఆమెను ఒక మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిథాలీ చూస్తుంటే చిత్ర పరిశ్రమలో నటీనటుల పరిస్థితికి అద్దం పడుతోంది. గ్లామర్ ప్రపంచం అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు.. వెండితెర వెనక జీవితం కూడా చూడాలని అంటున్నారు. This is Bhojpuri actress Mitali Sharma.Now, she was found begging on the streets of Mumbai. She asked the police for food and was later admitted to a mental healthcare centre.Mitali had reportedly left her home and moved to Mumbai to follow her dream of becoming an actress.… pic.twitter.com/ZPkyVAfiEk— Nalini Unagar (@NalinisKitchen) May 31, 2026 -
వాహనదారులకు షాక్.. సీఎన్జీ ధరలు మళ్లీ పెంపు
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో వాహనదారులకు మరోసారి ఇంధన భారం పెరిగింది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) సీఎన్జీ ధరలను కిలోకు రూ.2 పెంచింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.84 నుంచి రూ.86కు చేరుకుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.పీఎన్జీ ధరలకూ పెరుగుదలసీఎన్జీతో పాటు గృహ వినియోగానికి ఉపయోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలను కూడా ఎంజీఎల్ పెంచింది. యూనిట్‌కు 50 పైసలు పెంచడంతో ప్రస్తుతం వినియోగదారులు యూనిట్‌కు రూ.52 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల 31 లక్షలకు పైగా కుటుంబాలపై ప్రభావం పడనుంది.పెరుగుతున్న గ్యాస్ సేకరణ ఖర్చులే కారణందేశీయ గ్యాస్ కేటాయింపులు తగ్గడం, అధిక ధరలతో గ్యాస్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో గ్యాస్ సేకరణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎంజీఎల్ వెల్లడించింది. అయినప్పటికీ ఖర్చులను తగ్గిస్తూ వినియోగదారులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ఇటీవలి కాలంలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత మే 14న కూడా ఎంజీఎల్ కిలోకు రూ.2 చొప్పున ధరలను పెంచింది. తాజా పెంపుతో ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, బస్సులు సహా సీఎన్జీ ఆధారిత రవాణా సేవల నిర్వహణ వ్యయాలు మరింత పెరగనున్నాయి.ముంబై, థానే, నవీ ముంబైతో పాటు ఎంఎంఆర్‌లోని ఇతర ప్రాంతాల్లో ఈ ధరల పెంపు అమలులోకి వచ్చింది. ఎంజీఎల్ గ్యాస్ సరఫరా నెట్వర్క్ కళ్యాణ్, రాయ్‌గఢ్, రత్నగిరి, లాతూర్, ఉస్మానాబాద్, చిత్రదుర్గ, దావణగెరె వంటి ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంది.పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇంకా చౌకేధరలు పెరిగినా కిలోమీటరుకు అయ్యే నిర్వహణ వ్యయ పరంగా సీఎన్జీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే చౌకైన ప్రత్యామ్నాయంగానే కొనసాగుతోంది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21గా, డీజిల్ ధర రూ.97.83గా నమోదైంది. దీంతో రవాణా రంగంపై ఇంధన వ్యయాల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్‌గా 94 ఏళ్ల వ్యాపారి కథ!
నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో నిజాయితీ, దయ, నిరాడంబరత అన్నవి అరుదైనవిగా మారిపోతున్నాయి. ఎంతసేపు పెద్ద అవకాశాలు, క్షణాల్లో విజయం, తక్షణ సంతృప్తి తదితరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. రోజువారీ జీవితంలో ఉండాల్సిన కరుణ, సహనం, వినయం, మానవ సంబధాలు ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారో లేక మర్చిపోతున్నారో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇంకా కొద్దరు ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఆచరిస్తూ అర్థవంతంగా, స్ఫూర్తిగా బతుకుతున్నవారు కూడా ఉన్నారు. ఈ 94 ఏళ్ల తాతగారు ఆ కోవకు చెందిన వ్యక్తే. అతడితో మాటలు కలిపితే మనసుకు హత్తుకునే ఎన్నో తియ్యటి జీవిత పాఠాలు తెలుసుకోవచ్చట. ఆ తాతగారితో కాసేపు సరదాగా సంభాషించిన వీడియోని కోల్‌కతాకు చెందిన డిజిటల్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న తాతగారి పేరు సాదిక్పాల్. ఆయన ముంబైలోని ఖార్ రైల్వే స్టేషన్ ఎదురుగా 80 ఏళ్లకు పైగా చెరుకురసం దుకాణాన్ని నడుపుతున్నారట. అది ఆయన తండ్రి ప్రారంభించిన దుకాణమట. ఆ తర్వాత ఆయన దాన్ని మరింతగా అభివృద్ధి చేశారట. ప్రస్తుతం ఆ తాత గారు , ఆయన కుమారుడు ఆ దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన ఆ దుకాణ్నా నడిపేటప్పటికీ రెండో తరగతి చదువుతున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ వ్యాపంలో తన అపార అనుభవాన్ని వివరిస్తూ.. ఎన్నో జీవిత సంఘటనల తోపాటు గొప్ప జీవిత పాఠాలను కూడా చెప్పుకొచ్చారట. ఆయన దృఢ సంకల్పంతో ఉండటం, ధైర్యంగా ఉండటం, కష్టపడి పనిచయడం వంటి ప్రాముఖ్యతలు గురించి నొక్కి చెప్పారు. అలాగే నిజాయితీగా, సద్గుణవంతుడిగా ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుకోగలమో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ఎవ్వరూ మిమ్మల్ని, మీ నిజాయితీని గుర్తించకపోయినా..మోసం చేసినా సరే..ఎవ్వరినీ వంచించొద్దు అని అమూల్యమైన సలహా ఇచ్చారు. నిజానికి ఆ క్షణంలో మన నిజాయితీ, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి గౌరవించకపోవచ్చేమో గానీ, ఎప్పటికీ మాత్రం కాదని అంటున్నాడు. మన లక్ష్యాలను సాధించడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒకే ఒక్క మార్గం కష్టపడటం అని, అందరూ మంచిగా కష్టపడి ప్రయోజకులుగా మారండని కోరుతూ తన సంభాషణను ముగించాడు వృద్ధుడు సాదికపాల్. ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే గాక, ఆయన సలహా అద్భతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఆయనకున్న అభిరుచి, విలువలు నిజంగా ప్రశంసనీయం అంటూ పొగడ్తల జల్లు కురిపించారు. (చదవండి: ఒకే ఒక్కడు' సాధించిన ఘనత! జస్ట్ ఒక్కరోజులో..) -
తొక్కలో బిజెనెస్‌తో క్లీన్ స్వీప్..!
ఆవిష్కరణలు యూనివర్శిటీ డిగ్రీల నుంచి కాకుండా... అవసరాల నుంచే ఎక్కువగావస్తాయి అని చెప్పడానికి తాజా ఉదాహరణ ముంబైకి చెందిన సోనియా వర్మ, ఫర్హీన్. సాధారణ గృహిణులు అయిన వీరు, వాడి పారేసిన నిమ్మకాయ తొక్కలతో ఎకో ఫ్రెండ్లీ క్లీనర్స్ తయారు చేస్తూ ‘ఊర్థి’ బ్రాండ్‌గా సక్సెస్ అయ్యారు...ఇంటిని శుభ్రపరిచే ద్రావణాలలో ఉండే కఠినమైన రసాయనాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎలర్జీకి కారణం అవుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సోనియా వర్మ, ఫర్హీన్ అలీల ఆవిష్కరణ సూపర్‌హిట్ అయింది. ‘ఊర్థి’ బ్రాండ్‌గా ఫేమ్ అయింది.ఇల్లే ప్రయోగశాలగా...సోనియ, ఫర్హీన్లు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని ఒక హోమ్‌స్కూల్ కమ్యూనిటీ ద్వారా స్నేహితులు అయ్యారు. ఇద్దరికీ ఒకే రకమైన ఆసక్తులు ఉన్నాయి.వివిధ విషయాలకు సంబంధించి ‘ఇలా కాకుండా అలా ఉంటే ఎలా ఉంటుంది!’ అని మాట్లాడుకునేవారు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు గృహిణులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఒకసారి మాట్లాడుకున్నారు.‘కఠినమైన రసాయనాలు లేని క్లీనర్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఊర్థి. వారి ఆలోచనలకు ఇల్లే ప్రయోగశాలగా మారింది.స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ చేసిన ఫర్హీన్ కుటుంబ బాధ్యతల వల్ల ఇంటికే పరిమితం అయింది. అయినప్పటికీ బయోఎంజైమ్లతో రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉండేది. తన కుటుంబ సభ్యులు నిర్వహించే కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం నుంచి తప్పుకొని ఇంటి బాధ్యతలకే పరిమితం అయింది సోనియా వర్మ. ఫర్హీన్ తో పరిచయం ఆమెను ప్రయోగాల దిశలోకి తీసుకెళ్లి ‘ఊర్థి’ రూపంలో స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాన్ని అందించేలా చేసింది. ‘మేము ప్రయోగాలు చేయడానికి డ్రమ్ములు, విశాలమైన స్థలం అవసరం. ఎలా? అని ఆలోచిస్తున్నప్పుడు తన ఇంటి టెర్రస్‌ను వాడుకోవచ్చు అని ఫర్హీన్ చెప్పింది. అలా టెర్రస్‌పై మా ప్రయోగాలు మొదలయ్యాయి’ అంటుంది సోనియ.రెండు డ్రమ్ములతో మొదలై...రెండు డ్రమ్ములతో మొదలైన ప్రయోగాలు సఫలం అయ్యాయి. ఆ తరువాత వేరే చోట స్థలం తీసుకొని డజన్ల కొద్దీ్ద డ్రమ్ములతో ఫెర్మెంటేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. స్థానికంగా జ్యూస్ అమ్మే వారి నుండి నిమ్మపండ్ల తొక్కలు సేకరిస్తారు. నిమ్మజాతి పండ్ల తొక్కలు, బెల్లం, నీటి మిశ్రమాన్ని సుమారు మూడు నెలలపాటు గాలి చొరబడని డబ్బాలలో ఉంచుతారు. అది పులిసిపోయి సహజమైన క్లీనర్‌గా మారేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.‘పులియబెట్టిన తరువాత బయటకు వచ్చే ద్రవంలో మంచి బ్యాక్టీరియా, ఎంజైములు ఉంటాయి. ఆ ఎంజైములు ఉత్ప్రేరకాలుగా పనిచేసి మురికిని తొలగిస్తాయి’ అంటుంది ఫర్హీన్.‘ఊర్థి’ అనేది ఇప్పుడు నలభైకి పైగా ఫెర్మెంటేషన్ యూనిట్లుగా విస్తరించింది. ఈ యూనిట్లలో రకరకాల నేచురల్ క్లీనింగ్ ప్రాడక్ట్స్‌ను తయారు చేస్తున్నారు.‘మేము తొలి అడుగులు వేసినప్పుడు మా దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్గానీ, బిజినెస్ ΄్లాన్గానీ లేదు. ఏది సరిౖయెనది అనిపించిందో అదే చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత వాటంతట అవే చక్కబడ్డాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సోనియా. ఎకోఫ్రెండ్లీ బయో ఎంజైమ్లుచాలా రసాయన క్లీనర్లు వాడిన తరువాత మురికి కాలువల్లోకి, నదుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి భిన్నంగా ‘ఊర్థి’ క్లీనర్స్ కాలువల్లోకి వెళ్లినప్పుడు అక్కడ కూడా సేంద్రియ వ్యర్థాలను (ఆర్గానిక్ వేస్ట్) విచ్ఛిన్నం చేస్తూనే ఉంటాయి. నీటి వ్యవస్థను కూడా శుభ్రం చేస్తాయి. అనేక రకాల మేలు చేసే సూక్ష్మజీవులను చంపే కఠినమైనక్రిమిసంహారకాల వలే కాకుండా ఊర్థిలోని బయో ఎంజైమ్‌లు పర్యావరణంలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు జీవించడానికి వీలు కల్పిస్తాయి.– సోనియ, ఫర్హీన్ -
సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్‌గా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించిన సూర్యకుమార్.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్-2026లో కూడా సూర్య తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.13 ఇన్నింగ్స్‌లలో అతడు కేవలం 270 పరుగులు సాధించాడు. ఇప్పుడు అతడు తన పేలవ ఫామ్ కారణంగా భారత టీ20 కెప్టెన్సీని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటన తర్వాత కెప్టెన్‌గా అతడి భవిత్యవం తేలిపోనుంది. ఈ సిరీస్‌లోనూ సూర్య విఫలమైతే భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ రావడం ఖాయం కానుంది. ఇక తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి సూర్యకుమార్‌కు మరో అద్భుత అవకాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ముంబై టీ20 లీగ్-2026లో ‘ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్’ ఫ్రాంచైజీ తరఫున సూర్య బరిలోకి దిగనున్నాడు.ఉగాండా పై ఆడనున్న సూర్యకాగా ఈ టోర్నీ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ ఉగాండాపై ఆడనున్నాడు. ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను ఉగాండా 4-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ముంబై లీగ్‌లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఉగాండా తమ తొలి మ్యాచ్‌లో మే 30న ‘ట్రయంఫ్ నైట్స్’ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్స్ తరపున సూర్య ఆడనున్నట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ ట్రయంఫ్ నైట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఉగాండాపై అతడు ఆడే అవకాశముంది. సూర్య ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు ఏ జట్టుపై ఆడినా, అది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని ఎంసీఎ కార్యదర్శి ఉన్మేష్ ఖాన్విల్కర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
నడవలేని స్థితిలో!.. మూత్ర విసర్జనపై నియంత్రణ లేక..
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆదివారం వాంఖడే స్టేడియానికి వచ్చాడు. ఐపీఎల్-2026లో భాగంగా లీగ్ దశలో ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.నడవలేని స్థితిలోనూ..ఇదిలా ఉంటే.. నడవలేని స్థితిలోనూ ముంబైకర్ వినోద్ కాంబ్లీ తనకెంతో ఇష్టమైన వాంఖడే స్టేడియానికి రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించిన విషయం విదితమే.Vinod Kambli is struggling through difficult times in his life, but despite that, his love for cricket is still alive. Even in this condition, he came to Wankhede Stadium today once again to watch the match.❤️ pic.twitter.com/hWkzfwKHBv— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 24, 2026మాజీ క్రికెటర్ల ఆర్థిక సాయంమూత్రనాళ ఇన్ఫెక్షన్తో పుణె ఆస్పత్రిలో చేరగా.. మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలబడ్డారు. వన్డే వరల్డ్‌కప్-1983 గెలిచిన భారత జట్టులోని సభ్యులు, మరో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ ఆర్థికంగా సాయం అందించారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స పొందిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం కాస్త కోలుకున్నాడు.యూరిన్ సమస్యఇదిలా ఉంటే.. తన దుస్థితికి తన చెడు అలవాట్లే కారణమని వినోద్ కాంబ్లీ గతంలో వెల్లడించాడు. మద్యం పూర్తిగా మానివేశానని తెలిపాడు. ఇటీవల విక్కీ లల్వాణీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను బాగున్నాను. నా భార్య ఆండ్రియా నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది. మూడు వేర్వేరు ఆస్పత్రులకు తీసుకువెళ్లి నాకు చికిత్స చేయించింది. నేను మళ్లీ ఫిట్‌గా మారాలని చెప్పింది.మూత్రం అస్సలు ఆగదుభారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా నన్ను చూసేందుకు రావడం ఎంతో సంతోషంగా అనిపించింది. నాకు యూరిన్ సమస్య ఉంది. మూత్రం అస్సలు ఆగదు. నా ప్రమేయం లేకుండానే పాస్ అయిపోయేది. అప్పుడు నా కుమారుడు జీసస్ క్రిస్టియానో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. పదేళ్ల నా కూతురు కూడా నాకు సాయం చేసేది.నెల రోజుల క్రితమే ఇది జరిగింది. నా తల తిరిగినట్లు అనిపించేది. అకస్మాత్తుగా కిందపడిపోయాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆస్పత్రిలో చేరమన్నారు’’ అని 52 ఏళ్ల వినోద్ కాంబ్లీ గుర్తు చేసుకున్నాడు.చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్‌కు దూరం! -
ముంబై రోడ్లపై భిక్షాటన చేస్తూ దొరికిన మెడికో
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థి 47 రోజుల పాటు అదృశ్యమై, చివరకు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ పోలీసుల కంటపడ్డాడు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడు, ఇన్ని రోజుల తరువాత తన కుటుంబానికి చేరువకావడంతో స్థానికలు కంట తడి పెట్టుకున్నారు.నాందేడ్ జిల్లాకు చెందిన అభయ్ సురేష్ బెల్కోని, హోమియోపతి మెడిసిన్ (బీహెచ్ఎంఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 4న జల్గావ్లోని తన కళాశాలకు బయలుదేరిన అభయ్, దారిలో తన బ్యాగ్, ఫోన్ ముఖ్యమైన పత్రాలను పోగొట్టుకున్నాడు. తరువాత ముంబైకి చేరుకున్న అతను, ఆకలి తట్టుకోలేక రోడ్ల మీద బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు. అభయ్ అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు ఏప్రిల్ 6 నుండే తీవ్ర ఆందోళన చెందుతూ, మే 16న తమ్సా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ముంబై పోలీసుల చొరవతో..ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన యాంటీ-బెగ్గింగ్ (బిచ్చగాళ్లపై) డ్రైవ్‌లో అభయ్ పోలీసులకు దొరికాడు. అతను శారీరకంగా చాలా బలహీనంగా ఉండటమే కాకుండా, మానసిక పరిస్థితి సరిగా లేక తన గురించి స్పష్టంగా చెప్పలేకపోయాడు. అయినప్పటికీ, పోలీసులు ఎంతో ఓపికగా ప్రయత్నించి, అతని పేరు, ఊరు వివరాలను సేకరించారు. ఆ వివరాలను నాందేడ్ పోలీసులకు తెలియపరచగా, అతను గల్లంతైన విద్యార్థి అని నిర్ధారణ అయ్యింది. అభయ్ దొరికిన విషయాన్ని పోలీసులు అతని తండ్రికి తెలియజేశారు. 47 రోజుల సుదీర్ఘ వేదన తర్వాత, తన కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
ఇద్దరు సిస్టర్స్ కృషి: 'యాత్రి'కుల కోసం..
వాన రాకడ, ప్రాణం పోకడ వరుసలో రైలు రాకడను కూడా చేర్చారు చమత్కారులు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాము ప్రయాణిస్తున్న ట్రైన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ముంబైకి చెందిన లఖీ సకరియ, రీవ సకరియ సిస్టర్స్ క్రియేట్ చేసిన ‘యాత్రి’ యాప్ మన దేశంలోని ప్రధాన నగరాలలో ప్రాచుర్యం పొందింది. ఈ యాత్రి యాప్ ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్ సిస్టమ్, సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేల అధికారిక యాప్‌గా ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్., ఎంబీఏ చేసింది లఖీ. బి2బి, బి2జీ రంగాలలో సాఫ్ట్వేర్ అప్లికేషన్లను డెవలప్ చేసింది. రీవ కొన్ని సంవత్సరాలు కన్సల్టింగ్ కంపెనీలో పనిచేసింది. యాప్ ప్రారంభానికి ముందు రైల్వే అధికారులతో మాట్లాడి ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది లఖీ. రాకపోకలను కచ్చితంగా ట్రాక్ చేయడానికి ప్రతి స్టేషన్ చుట్టూ వర్చువల్ జియో ఫెన్స్‌లను సృష్టించి, దానికి జీపీఎస్ పరికరంలోని మోషన్ సెన్సర్లను జోడించారు. లైవ్ లొకేషన్ అప్డేట్లలో జాప్యాన్ని తొలగించడానికి పదిహేను మంది సభ్యులతో నెలరోజుల పాటు ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణిస్తూ మాన్యువల్ పరీక్షలు నిర్వహించారు. యాప్ పరీక్షలో భాగంగా సిగ్నల్ అడ్డంకులను, టాంపరింగ్ సమస్యను తగ్గించడానికి జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పనితీరును పరీక్షించడానికి వివిధ రూట్ ప్యాచ్‌లలో సిగ్నల్ కనెక్టివిటీని విస్తృతంగా పరీక్షించారు. ‘యాత్రి’ ప్రధాన లక్ష్యం రియల్ టైమ్ లోకల్–ట్రైన్ ట్రాకింగ్. తమ సొంత జీపీఎస్ పరికరాల ద్వారా నేరుగా రైల్వే కంట్రోల్ బోర్డ్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది యాత్రి. క్రౌడ్ సోర్స్ చేయదు. ట్రైన్ లొకేషన్, ట్రైన్ ఆలస్యం కావడానికి సంబంధించిన సమాచారం, ఫ్లాట్‌ఫారమ్ మార్పు, నోటిఫికేషన్లు, అంతరాయాల అప్డేట్లు.. మొదలైన వాటిని ప్రయాణికులు ‘యాత్రి’ ద్వారా తెలుసుకోవచ్చు.ప్రత్యామ్నాయ మార్గాలుఒక ట్రైన్ దాని నిర్దేశిత వేగంలో మూడో వంతు వేగంతో వెళితే వెంటనే ఆలస్యం జరగదు. కానీ రద్దీ సమయాలలో దాని ప్రభావం మొత్తం లైన్‌పై పడుతుంది. వివిధ కారణాల వల్ల రైళ్ల రాకపోకలలో ఆలస్యం జరుగుతుందని, అందువల్ల వేలాది మంది ప్రయాణికులకు సమాచారం త్వరగా చేరాల్సిన అవసరం ఉంది’ అంటుంది లఖీ. ట్రైన్లు ఆలస్యంగా నడవడం అనే సమస్య కంటే ఆ ఆలస్య సమాచారం ప్రయాణికులకు చేరకపోవడమే అసలు సిసలు సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘యాత్రి’ రైల్వే కంట్రోల్ రూమ్‌ల నుండి నేరుగా డేటాను తీసుకుంటుంది. ‘మేము తప్పుడు సమాచారాన్ని అందించే యాప్‌గా ఉండాలనుకోవడం లేదు. ప్రయాణికులు యాత్రి యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే తాము ప్రయాణించే రైలుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోగలగాలి. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే అదే మార్గంలో ప్రత్యామ్నాయాలను చూడగలగాలి’ అంటుంది రీవ.అయిదు నగరాలలో...రియల్–టైమ్ ట్రాకింగ్‌తో పాటు ముంబై మహానగరంలోని మెట్రో, మోనోరైల్, బస్సులు, ఫెర్రీలతో సహా ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్ ఆధారిత సమాచారాన్ని ‘యాత్రి’ అందిస్తోంది. ప్రయాణికులు తమ ప్రారంభ స్థానం, గమ్యస్థానాన్ని నమోదుగా చేయగానే యాత్రి సమస్యలు లేని సరిౖయెన మార్గాన్ని మ్యాప్ చేస్తుంది. మెట్రో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా క్యూలో సమస్యలు లేకుండా చేస్తుంది. దాదాపు మూడు మిలియన్ల డౌన్లోడ్లతో ‘యాత్రి’ ఇప్పుడు ముంబైతో సహా. దిల్లీ, కొచ్చి, కాన్పూర్, పుణే నగరాల్లో అందుబాటులో ఉంది.నిరంతరంనగర జనాభాలో సగం మంది రైళ్లలో ప్రయాణిస్తారు. విద్యార్థుల నుంచి శ్రామికుల వరకు ఎన్నో వర్గాల ప్రయాణికులు ఉంటారు. అన్ని వర్గాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని యాప్‌కు సంబంధించిన యూఐని రూపొందించాం. తక్కువ డేటా కనెక్టివిటీ, వ్యక్తుల డిజిటల్ అక్షరాస్యతను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఎప్పటికప్పుడూ ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటూ యూఐనీ నిరంతరం మెరుగుపరుస్తున్నాం.– లఖీ సకరియ, రీవ సకరియ, యాత్రి–ఫౌండర్స్ -
'ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్' అవార్డు వేడుకలో గ్లామర్ మెరుపులు (ఫొటోలు)
-
పుచ్చకాయ కాదు... నలుగురి మృతికి కారణం అదే..!
-
రియల్‌ఎస్టేట్‌లోకి వెల్లువెత్తిన పెట్టుబడులు
దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి గత రెండేళ్లుగా భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2024 నుండి 2026 తొలి త్రైమాసికం వరకు 30.7 బిలియన్ డాలర్లు వచ్చాయి. డిమాండ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఇదే తీరు కొనసాగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రియల్టీ సేవల సంస్థ సీబీఆర్ఈ, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం రాబోయే రోజుల్లో భారత రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) మార్కెట్ మరింత విస్తరించనుంది. పెద్ద ఎత్తున రీట్స్ లిస్టింగ్‌కి రానుండటంతో డెవలపర్స్‌కి నిధుల లభ్యత పెరగనుంది. పరిశ్రమ రుణ రూపంలో సమకూర్చుకున్న నిధుల పరిమాణం 2024–2026 తొలి త్రైమాసికం మధ్య కాలంలో 146 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. ట్రస్టీ షిప్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతరత్రా సంస్థలు ఈ నిధులను సమకూర్చాయి.రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు..మొత్తం రుణాల్లో మూడు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు వాటా 60 శాతం పైగా ఉంది. ప్రథమ శ్రేణిలోకి రాని నిర్దిష్ట నగరాల వాటా 8 శాతంగా ఉంది. మెట్రోల పరిధి దాటి ఇతర ప్రాంతాలపైనా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి బ్యాంకు రుణాలు 2025 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగాయి. ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన రుణాలు 2025 సెప్టెంబర్ నాటికి అయిదేళ్ల గరిష్ట స్థాయి అయిన రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. రియల్ ఎస్టేట్ వ్యవస్తకు రీట్స్ కీలకంగా మారుతున్నాయి. దేశీయంగా పెట్టుబడులు స్థిరంగా వస్తుండటం, భౌగోళికరాజకీయ అనిశి్చతుల నడుమ గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండటంలాంటి అంశాలు పెట్టుబడుల రాకకు దోహదపడనున్నాయి. ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్స్ మొదలైన వాటిల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా అనిశి్చతిలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమ నిర్మాణాత్మకంగా పరివర్తన చెందుతుండటం, పారదర్శకత మెరుగుపడుతుండటం, వివిధ వనరుల ద్వారా నిధులు లభిస్తుండటంలాంటి అంశాల వల్ల పెట్టుబడులకు రియల్టీ రంగం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కొనసాగనుంది. -
అందుకే ముంబై ఫ్యామిలీ మృతి.. పుచ్చకాయేం చేయలేదని వెల్లడి
ముంబైలో గత నెల ఓ కుటుంబ సభ్యులు భోజనం చేసిన తర్వాత పుచ్చకాయ తిని మృతి చెందిన విషయం సంచలనం రేపింది. దీంతో పుచ్చకాయ తింటే మంచిది కాదంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఆ కుటుంబంలోని నలుగురు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు ఉందని ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడింది. ఎలుకల విషంలో సాధారణంగా వాడే జింక్ ఫాస్ఫైడ్‌ను ఆ పుచ్చకాయ శాంపిల్‌లో గుర్తించారు.ఇంట్లో మృతిచెందిన ఆ నలుగురు కుటుంబ సభ్యుల పుచ్చకాయ నమూనాలు, విసెరా నమూనాల్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం ముంబై పోలీసులకు సమర్పించారు.జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత పదార్థమని, ఆ నలుగురి మరణాలకు అదే కారణమై ఉంటుందని ఎఫ్ఎస్ఎల్ అధికారులు తెలిపారు. జింక్ ఫాస్ఫైడ్‌ను ఎలుకల వంటి వాటిని నియంత్రించేందుకు వాడతారు. పొలాలు, నిల్వ ధాన్యంలోనూ ఉపయోగిస్తారు.ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “ఇవాళ నివేదిక సమర్పించాం. రెండు నమూనాల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించింది. అవి పుచ్చకాయ, మృతిచెందిన నలుగురి విసెరా నమూనాలు. సాధారణంగా ఇది పొడి రూపంలో ఉంటుంది. ఎవరో పుచ్చకాయ కోసి, అందులో ఈ పొడి చల్లి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ తర్వాత దాన్ని తిన్నారు. అయితే అసలు ఏం జరిగిందో పోలీసులు తేలుస్తారు” అని అన్నారు.కాగా, గతనెల అబ్దుల్లా డోకాడియా (40), ఆయన భార్య నసీమ్ (35), వారి ఇద్దరు కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13) ఏప్రిల్ 26న దక్షిణ ముంబైలోని వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. బంధువులకు ఇంట్లో విందు ఇచ్చిన కొన్ని గంటల తరువాత ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి భోజనం చేసినప్పటికీ, అర్ధరాత్రి తర్వాత ఆ నలుగురు పుచ్చకాయ తిన్నారు.ముంబై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. నివేదిక అందిందని, పుచ్చకాయలో ఎలుకల విషం ఎవరు కలిపారో ఇప్పుడు దర్యాప్తు చేస్తామని తెలిపారు. “ఇది ఆత్మహత్య? లేక హత్య? లేక వ్యవసాయ పొలంలో కలుషితమై పొడి పుచ్చకాయలోకి చేరిందా? అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం” అని చెప్పారు. -
ది బార్కరీ బుక్ : పెట్స్ కోసం ఒక బేకరీ, ఒక పుస్తకం!
ఇంట్లో పెంచుకునే కుక్కలను చాలా మంది పెంపుడు జంతువుల్లాగ కాకుండా కుటుంబ సభ్యులతో సమానంగా ట్రీట్ చేస్తుంటారు. అయితే, వాటికి ఆహారం అందించే విషయంలో ఇప్పటికీ చాలా మంది యజమానులు గందరగోళానికి గురవుతుంటారు. మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన తినుబండారాలు మంచివో కాదో తెలియక ఆందోళన చెందుతుంటారు. అందుకే ఈ సమస్యకు ఓ అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు వ్యాపారవేత్త గార్గి ప్రేహర్. వాటికోసం ఒక బార్కరీ (బేకరీ)ని స్థాపించారు. అంతేకాదు వంటగదిలో లభించే పదార్థాలతో వాటికి సురక్షిత ఆహారం ఎలా అందించాలి అనే అంశాలపై ‘ది బార్కరీ’ (The BARKERY BOOK) అనే పేరుతో బుక్‌ను కూడా రాశారు. గార్గి ప్రేహర్ ( Gaargi Prehar) ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్తపారిస్లో ఎంబీఏ పూర్తిచేసింది. భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఆమె పలు దేశాల్లో ఉన్నతస్థాయిలో పనిచేసింది. అంతలోనే ఆమెకు వచ్చిన ఆలోచన ఆమె జీవితాన్నే మలుపు తిరిగేలా చేసింది. పెంపుడు జంతువుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్, గ్లూటెన్–ఫ్రీ కేకులు, తీపి పదార్థాలను తయారు చేయడం ప్రారంభించింది. ఇదీ చదవండి: పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?పప్–లార్డ్స్ బార్కరీ2019లో ముంబైలో పప్–లార్డ్స్ బార్కరీ అనే తన పాటిస్సేరీని ఆమె స్థాపించారు. ప్రతి వేడుకలోనూ మూగజీవాలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఆమె దీన్ని ప్రారంభించారు. ఇక్కడ పెంపుడు జంతువులకు సురక్షితమైనవి మాత్రమే కాకుండా, వాటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తయారు చేస్తారు. వాటిల్లో కేకులు, స్నాక్స్, బేక్ చేసిన కుక్కీలు, సేవరి జెర్కీలు అన్నీ లభిస్తాయి. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేయగల బీర్, వైన్, గ్లూటెన్–ఫ్రీ జైలిటోల్–ఫ్రీ వంటి ప్రత్యేకమైన వంటకాలు కూడా ఈ బేకరీలో తయారు చేస్తారు. ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఈ బేకరీ నుంచి కేకులను తీసుకువెళ్తుంటారు. ది బార్కరీ బుక్పెంపుడు జంతువులకు అందించే ఆహారం తయారీపై ఆమె ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదే ‘ది బార్కరీ బుక్’. వంటగదిలో ప్రతిరోజూ లభించే పదార్థాలతో పెంపుడు జంతువుల కోసం పోషకమైన ఆహారాన్ని ఎలా తయారు చేయాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. మనుషులు తినే ఏ ఆహార పదార్థాలు కుక్కలకు హాని చేస్తాయి? వాటికి ప్రత్యామ్నాయంగా ఏవి వాడాలి? అనే విషయాలను గార్గి ఇందులో స్పష్టంగా వివరించింది. భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారం కోసం రూ΄÷ందించిన మొదటి పుస్తకం ఈ ది బార్కరీ బుక్.ఇదీ చదవండి: రూ. 2 వేల నుంచి కోటి టర్నోవర్ దాకా : హోంమేకర్ సక్సెస్ స్టోరీభారతదేశపు మొదటి డాగ్ కుక్బుక్ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాగ్ లవర్స్‌కు పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ పుస్తకం ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. అలాగే విజయం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, సమాజంలో మనం తీసుకువచ్చే ఒక మార్పు. ఎవరినీ కించపరచకుండా, నొప్పించకుండా సున్నితంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. అదే నేను చేశాను. సాధించాను. అదే నా గెలుపు. – గార్గి ప్రేహర్ ఇదీ చదవండి : షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!
ముంబై కుటుంబం మృతి కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆ నలుగురు పాడైపోయిన పుచ్చకాయ తినడం ద్వారా చనిపోలేదని నిర్ధారణ అయ్యింది. అయితే వాళ్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ మాత్రం రంగు మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మిస్టరీ కేసు విచారణ మరో మలుపు తిరిగినట్లైంది. గత వారం ఆ కుటుంబం మటాన్ పులావ్ తిని.. ఆపై పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థకు లోనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక్కొక్కరుగా చనిపోయారు. అయితే వాళ్లలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయన్న వైద్యుల ప్రకటనతో కలకలం రేగింది. పులావ్ తిన్న మిగతా వాళ్లకు ఏం కాకపోవడంతో.. అందరి దృష్టి పుచ్చకాయ వైపునకు మళ్లింది. బహుశా.. కలుషితమైన పుచ్చకాయ తిని వాళ్లంతా మరణించి ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. సమ్మర్లో చాలా మంది తినే పుచ్చకాయ ఇంత పని చేసిందా? అనే చర్చ నడిచింది. వాటర్‌మిలన్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది మహారాష్ట్రలో పుచ్చకాయల సేల్ పడిపోవడానికి ఒక కారణం అయ్యింది కూడా. అయితే.. తాజాగా ఈ కేసు ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. అందులో పుచ్చకాయలో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని తేలింది. అలాగని ఇది సాధారణ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ నలుగురిలో గుండె, లివర్, బ్రెయిన్, పేగులు ఆకుపచ్చరంగులోకి మారిపోయి ఉన్నాయి. దీంతో వాళ్లపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అబ్దుల్లా శరీరంలో మోర్ఫిన్ అనే శక్తివంతమైన పెయిన్‌కిల్లర్ ఆనవాలు లభ్యమైంది. ఇది సాధారణంగా వైద్యులు చెబితేనే వాడాలి. దీంతో ఈ అంశంపైనా అధికారులు ఇప్పుడు దృష్టిసారించారు. పోస్ట్‌మార్టం అనంతరం.. ఆ అవయవాలను పరీక్షల(కెమికల్) కోసం పంపారు. ఫలితాలు వచ్చాకే ఏది అనేదానిపై ఓ క్లారిటీ రానుంది. మొబైల్ రిపేర్ షాప్ నడిపించే అబ్దుల్లా డొకాదియా.. అతని భార్య, ఇద్దరు పిల్లలు. గత శనివారం రాత్రి ఇంట్లో దావత్ చేశారు. మరో ఐదుగురు బంధువుల్ని పిలిచి మటావ్ పులావ్ పెట్టారు. వాళ్లు వెళ్లిపోయాక అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5గం. టైంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలో అంతా ప్రాణాలు కోల్పోయారు. పుచ్చకాయ ఆందోళనలపై.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ నాలుగు మరణాలకు పుచ్చకాయకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. అయితే పుచ్చకాయ కలుషితం కాకపోతే గనుక ఎవరైనా విషాన్ని ఇంజెక్ట్ చేసి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. ఇదీ చదవండి: పుచ్చకాయ.. ఆ టైంలో తింటేనే సూపర్! -
బిర్యానీ తిన్నాక, పుచ్చకాయ తినడం ప్రమాదకరమా ?
-
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్‌ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్‌కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
పుచ్చకాయ తిని నలుగురు మృతి.. అసలేం జరిగిందంటే..!
-
బిర్యానీ, పుచ్చకాయ తినే ఆ కుటుంబం చనిపోయిందా?
ముంబై: ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత. ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. శనివారం(ఏప్రిల్ 25వ తేదీ) ముంబైలోని పైధోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా ఫుడ్ పాయిజన్ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ రాత్రి గం. 10.30ని.లకు వీరంతా డిన్నర్లో బిర్యానీ తిన్నారు. అనంతరం ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వారు ఇళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో(తెల్లవారితే ఆదివారం) తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ నలుగురికి ఆదివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసిన తర్వాత వారిని జేజే ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వారి డాక్టర్ సూచించిన విధంగానే జేజే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య చికిత్స చేసినప్పటికీ, చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 గంటలకు మరణించింది. ఆ రాత్రి సుమారు 10:30 గంటలకు తండ్రి కన్నుమూశారు. అటు తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రెండు స్పల్ప వ్యవధిలో తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా.. ? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్‌మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు అబ్దుల్లా దొకాడియా(40), నస్రీన్ దొకాడియా(35), ఐషా(16), జైనబ్(13)లుగా పోలీసులు తెలిపారు. -
IPL 2026: ముంబై ఆటగాడికి ఊహించని అదృష్టం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ గాయాల సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో, చెన్నై యాజమాన్యం ముంబైకి చెందిన యువ ఆల్‌రౌండర్ ఆయుశ్ వర్తక్‌ను మిడ్-సీజన్ ట్రయల్స్‌కు పిలిచింది.ఈ సీజన్లో చెన్నై పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కెప్టెన్ రుతురాజ్ నాయకత్వంలో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలు చవిచూసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నప్పటికీ, గాయాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి.లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని కాల్ఫ్ స్ట్రెయిన్ కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఆయుశ్ మాత్రే, ఖలీల్ అహ్మద్ గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు.ఈ నేపథ్యంలో ముంబై, పార్సీ జింఖానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయుష్ వర్తక్‌ను చెన్నై ట్రయల్స్‌కు పిలిచింది. అతడు త్వరలోనే చెన్నై జట్టుతో కలవనున్నాడు.21 ఏళ్ల అయుష్ వర్తక్ దేశీయ క్రికెట్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. కుడిచేతి మీడియం పేసర్‌గా, దిగువ వరుసలో వేగంగా పరుగులు చేసే బ్యాటర్‌గా మంచి పేరు సంపాదించాడు.నవి ముంబై టీ20 లీగ్‌లో అతడు 264 పరుగులు చేసి, 191 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అదనంగా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఇప్పటికే ఆకాశ్ మధ్వాల్‌ను అయుష్ మాత్రే స్థానంలో జట్టులోకి తీసుకున్న చెన్నై, ఖలీల్ అహ్మద్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది. ఆ లోటును వర్తక్ భర్తీ చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం చెన్నై జట్టులో డెవాల్డ్ బ్రెవిస్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ప్రతి మ్యాచ్‌ను గెలవాల్సిందే. ఈ క్లిష్ట సమయంలో అయుష్ వర్తక్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
ఆస్తి అమ్మేసిన HDFC బ్యాంక్ మాజీ చీఫ్ ఫ్యామిలీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ ఎండీ ఆదిత్య పూరి కుటుంబ సభ్యులు ముంబైలోని తమ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను భారీ ధరకు విక్రయించారు. ఆదిత్య పూరి భార్య అనితా పూరి, కుమార్తె అమృతా పూరి కలిసి వర్లీ ప్రాంతంలోని తమ నివాసాన్ని రూ. 27 కోట్లకు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ బ్యాంకర్ ఆదిత్య పూరి కుటుంబం చేసిన భారీ ఆస్తి విక్రయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.లాభదాయకమైన విక్రయంఈ అపార్ట్‌మెంట్‌ను అనితా పూరి కుటుంబం మార్చి 2017లో రూ. 19.81 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన విక్రయం ద్వారా వారికి దాదాపు రూ. 7 కోట్లకు పైగా లాభం చేకూరింది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన 'ఓంకార్ 1973' భవనంలోని ఎత్తైన అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. దీనిని సురేమ్య నెవాటియా, అక్షడా నెవాటియాలు కొనుగోలు చేశారు.మార్చి 24, 2026న ఈ లావాదేవీ అధికారికంగా నమోదైంది. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు రూ. 1.62 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించారు. ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా కొనుగోలుదారులు పొందారు.అయితే, ఈ విక్రయంపై పూరి కుటుంబం గానీ, కొనుగోలుదారులు గానీ ఇంతవరకు స్పందించలేదు.ఓంకార్ 1973 ప్రత్యేకతముంబైలోని వర్లీలో ఉన్న 'ఓంకార్ 1973' ఒక ఐకానిక్ ఆకాశహర్మ్యం. ఓంకార్ రియల్టర్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, అరేబియా సముద్రం వ్యూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అల్ట్రా-ప్రీమియం జీవనశైలిని అందిస్తుంది. నగరంలోని అత్యంత ఖరీదైన చిరునామాలలో ఇది ఒకటి.అనితా పూరి, అమృతా పూరి గతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టారు. నవంబర్ 2020లో వారు ముంబైలోని మలబార్ హిల్స్‌లో రూ. 50 కోట్ల విలువైన మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. లోధా సీమాంట్ ప్రాజెక్టులోని 19వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్‌కు ఏడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అప్పట్లో ఆ లావాదేవీకి రూ. 1 కోటి స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు వార్తాలు వచ్చాయి.ఇదీ చదవండి: బెంగళూరులో ఇంటి ఓనర్స్ అయిపోయాం.. -
అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్ట్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను వేధించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం సైబర్ నేరాల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన కుటుంబంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని ప్రపంచానికి తెలిపారు.ఏం జరిగిందంటే..?13 ఏళ్ల తన కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గతంలో మీడియాతో ఆయన పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన ఇలా తెలిపారు. 'నా కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ధైర్యంగా వెళ్లి నా భార్యతో చెప్పింది. ' అని గుర్తుచేసుకున్నారు.అక్షయ్ కుమార్తె నిటారపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు లోనై చాలామంది పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు. తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోనని సంకోచిస్తారు. కానీ, అక్షయ్ కుమార్తె తను ఎదుర్కొన్న వేధింపుల గురించి తల్లితో పంచుకుని మంచిపని చేసిందని సోషల్‌మీడియాలో చాలామంది కొనియాడారు. ఆమె ధైర్యానికి ఫిదా అయ్యారు. -
దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!
ముంబైలోని జుహు తారా రోడ్డులో.. సముద్రానికి ఎదురుగా ఉన్న లీలా బంగ్లా రూ. 221 కోట్లకు అమ్ముడైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బంగ్లా ఆర్ట్ డెకో నిర్మాణం, గ్రేడ్ IIB వారసత్వ హోదాను కలిగి ఉంది. దీనిని అమ్మకానికి పెట్టిన తరువాత చాలామంది డెవలపర్లు, వ్యాపారవేత్తలను ఆకట్టుకుంది.నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన గౌతమ్ నానావతికి చెందిన లీలా బంగ్లాను నోటండాస్ జ్యువెలర్స్ గ్రూప్‌లో భాగమైన నోటండాస్ రియల్టీ రూ.221 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బుధవారం ఈ లావాదేవీ అధికారికంగా ఖరారైందని సమాచారం.నోటండాస్ రియల్టీ సంస్థకు చెందిన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని అనే తండ్రి-కొడుకు ఈ డీల్‌ను పూర్తి చేశారు. వీరు నోటండాస్ జ్యువెలర్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని 1983లో కిషిన్ జగ్వానీ స్థాపించారు. ఇది బాంద్రాలోని వాటర్‌ఫీల్డ్ రోడ్ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.చదరపు అడుగుకు రూ. 2,60,5921,355 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న లీలా బంగ్లా నిర్మాణ విస్తీర్ణం సుమారు 8,480 చదరపు అడుగులు. అదనంగా 2,500 చదరపు అడుగుల టెర్రస్.. 5,000 చదరపు అడుగుల తోట కూడా ఉన్నాయి. చదరపు అడుగుకు రూ. 2,60,592 ధర చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ బంగ్లాలో 1950ల కాలానికి చెందిన బర్మా టేకు చెక్కతో తయారైన తలుపుల ఫ్రేములు, మెట్ల నిర్మాణం, అలంకరణలు ఉన్నాయి. ఈ భవనం ఆర్ట్ డెకో శైలిని ప్రతిబింబిస్తూ పురాతన సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. సముద్రం వైపు ఉండే ఇలాంటి పెద్ద స్థలాలు జూహు ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఈ ఆస్తికి వ్యాపారవేత్తలు, డెవలపర్లు ఎంతో ఆసక్తి చూపారు.కేవలం మరమ్మతులు మాత్రమే..అయితే.. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా ఉండటం వల్ల ఈ భవనాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మించలేరు. కేవలం మరమ్మతులు, విస్తరణలు మాత్రమే చేయవచ్చు. అవి కూడా అసలు నిర్మాణ శైలిని కాపాడే విధంగా ఉండాలి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ఆస్తి ప్రాముఖ్యత తగ్గలేదు.ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఈ లావాదేవీని నిర్వహించిందని నివేదిక పేర్కొంది, అయితే ఈ విషయంపై సంప్రదించినప్పుడు ఆ సంస్థ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఈ బంగ్లాను మొదట 2022లో రూ. 210-220 కోట్ల అంచనా ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ధరను రూ. 250 కోట్లకు పెంచారు. చివరికి రూ.221 కోట్లకు అమ్ముడైంది.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!


