టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే ఖరీదైన అపార్టుమెంట్ కొనుగోలు చేశారు. ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో రూ. 26.30 కోట్ల విలువ గల నివాస స్థలాన్ని ఆమె కొన్నారు. దీని విస్తీర్ణం 2760.40 చదరపు అడుగులు అని తెలుస్తోంది.
అదే విధంగా.. మూడు కార్లు పార్కింగ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉన్నట్లు సమాచారం. ‘స్క్వేర్ యార్డ్స్’ అందించిన వివరాల ప్రకారం.. ఈ అపార్డుమెంటు కొనుగోలు సమయంలో రితికా సజ్దే (Ritika Sajdeh).. రూ. 1.13 కోట్లు స్టాంపు డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ చార్జీలకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. గతేడాది డిసెంబరు 12న రిజిస్ట్రేషన్ పూర్తైంది.
స్పోర్ట్స్ మేనేజర్
అజింక్య డీవై పాటిల్, పూజా అజింక్య పాటిల్ నుంచి రితికా సజ్దే ఈ అపార్డుమెంటును కొనుగోలు చేశారు. కాగా భారత దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన రోహిత్ శర్మ.. రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తొలుత తన స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేసిన రితికాను జీవిత భాగస్వామి చేసుకున్నాడు.
నికర ఆస్తి విలువ ఎంతంటే?
ఇక టీమిండియా సంపన్న క్రికెటర్లలో ఒకడైన రోహిత్ శర్మ (Rohit Sharma) నికర ఆస్తుల విలువ 2025 నాటికి రూ. 230 కోట్లు అని సమాచారం. వర్లీలో అతడికి దాదాపు రూ. 30 కోట్ల విలువైన అపార్టుమెంట్ ఉంది. అతడి దగ్గర లంబోర్గిని ఉరుస్, బీఎండబ్ల్యూ ఎం5 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
ఓవైపు ఆటగాడిగా కొనసాగుతూనే క్రికెట్ అకాడమీ స్థాపించాడు రోహిత్ శర్మ. కాగా రోహిత్- రితికా దంపతులకు కుమార్తె సమైరా, కుమారుడు అహాన్ సంతానం. ఇదిలా ఉంటే.. మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ లభిస్తుందట. ఇక మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది.
చదవండి: అభిషేక్ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..
Rohit Sharma: కోహ్లి కంటే సన్నబడ్డాడే!.. కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!


