టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ కానుంది. కివీస్‌తో తొలుత మూడు వన్డేలు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించాయి.
ఇక జనవరి 11, 14, 18 తేదీల్లో భారత్-కివీస్ మధ్య జరిగే వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమవుతున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తూ శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే!
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. తాజా వీడియోలో రోహిత్ మరింత బక్కచిక్కినట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘బ్రో.. కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే! అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. సూపర్ భాయ్’’ అంటూ రోహిత్ శర్మను ఉద్దేశించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Rohit Sharma in the nets. pic.twitter.com/OsFnlwkg40
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2026
కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!
మరోవైపు.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కివీస్‌తో తొలి వన్డే కోసం వడోదరలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కింగ్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం.. అతడికి తీవ్ర అసౌకర్యం కలిగించారు. అతికష్టమ్మీద అతడు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లాడు.
#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India's ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy
— ANI (@ANI) January 7, 2026
ఇద్దరూ సూపర్ ఫామ్‌లో
ఇటీవల సౌతాఫ్రికాతో సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అదరగొట్టారు. కోహ్లి అయితే వరుస సెంచరీలతో వింటేజ్ కింగ్‌ను గుర్తు చేశాడు.
ఆ తర్వాత రో-కో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సొంత జట్ల తరఫున బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్, ఢిల్లీ తరఫున కోహ్లి శతక్కొట్టారు. ఇలా స్టార్లు ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉండటం కివీస్‌తో వన్డేలకు ముందు టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది.
చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త


