న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనానికి మార్గం సుగమమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి శ్రేయస్ అయ్యర్‌కు క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించింది.
అంతా సజావుగా సాగితే.. శ్రేయస్ (Shreyas Iyer) న్యూజిలాండ్‌తో మూడు వన్డేలకు అందుబాటులో ఉంటాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 25న సిడ్నీలో ఆసీస్ (Ind vs Aus)తో మూడో వన్డే సందర్భంగా క్యాచ్ పట్టబోయి అదుపు తప్పి కిందపడిపోయిన శ్రేయస్ పక్కటెములకు తీవ్ర గాయమైంది.
అంతర్గత రక్తస్రావం
దీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో చాన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉన్న శ్రేయస్.. క్రమంగా కోలుకున్నాడు. అయితే, ఆటకు మాత్రం దాదాపు రెండు నెలలు దూరంగా ఉన్నాడు.
రీఎంట్రీ ధనాధన్
ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ఫిట్‌నెస్ ఆధారంగానే అతడు అందుబాటులో ఉండే విషయం తేలుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌తో ముంబై కెప్టెన్‌గా శ్రేయస్.. కాంపిటేటివ్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.
వచ్చీరాగానే ధనాధన్ దంచికొట్టి 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. అంతేకాదు కెప్టెన్‌గానూ రాణించి.. ముంబై క్వార్టర్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సీఓఈ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది స్వదేశంలో కివీస్‌తో వన్డే (జనవరి 11, 14, 18)లకు సిద్ధమయ్యాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు


