పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి.. నీ అసలైన నైజాన్ని బయటపెట్టుకుంటూ మరింత దిగజారుతూనే ఉంటావు.. కాస్తైనా సిగ్గుందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పే బదులు ‘అడుక్కుని తినవచ్చు కదా!’ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్వయంగా ఇందుకు సంబంధించి ప్రకటన చేశాడు.
ఎప్పటిలాగానే పాక్ యూటర్న్
అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో ఎప్పటిలాగానే పాక్ మాట మార్చింది. భారత్‌తో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. దీంతో తమకు యూటర్న్‌లు తీసుకోవడం మామూలేనని మరోసారి నిరూపించి నవ్వులపాలైంది. కానీ పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం కింద పడినా తమదే పైచేయి అన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
బీసీసీఐ పదే పదే అడిగితేనే..
ఇందులో భాగంగా మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తాను హోస్ట్‌గా ఉన్న ఓ న్యూస్ ఛానెల్‌లో ఓ ఫేక్ వీడియో ప్రదర్శించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడినట్లుగా ఓ వీడియో సృష్టించి.. అందులో ఆయన.. "బీసీసీఐ పదే పదే అభ్యర్థించడం వల్ల ఐసీసీ ప్రతినిధి పాకిస్తాన్‌ను టీమిండియాతో మ్యాచ్ ఆడేలా ఒప్పించారు.
Pakistani sports show Har Lamha Purjosh hosted by Shoaib Malik, is circulating fake AI video of BCCI VICE PRESIDENT RAJEEV SHUKLA for selling chooran to the Pakistani audience pic.twitter.com/BMLmmD9sUe
— Vishal (@Fanpointofviews) February 11, 2026
స్పందించిన రాజీవ్ శుక్లా
క్రికెట్ మనుగడకు ఇదే సరైన పరిష్కారం’’ అని అన్నట్లుగా AIతో మాయ చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టగా.. రాజీవ్ శుక్లా స్వయంగా స్పందించారు. "పాకిస్తాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్ గురించి నేను మాట్లాడినట్లుగా AIతో మాయ చేశారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
తప్పుదారి పట్టించే ఈ వీడియోను నమ్మవద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వీడియోలు మీ ఫీడ్‌లోకి వస్తే రిపోర్టు కొట్టేయండి’’ అని రాజీవ్ శుక్లా స్పష్టతనిచ్చారు. కాగా భారత్- పాక్ మ్యాచ్‌కు మార్గం సుగమమైన వేళ.. "ఐసీసీ చైర్మన్ పర్యవేక్షణలో ఐసీసీ ప్రతినిధి సరైన విధంగా స్పందించి లాహోర్‌లో పాకిస్తాన్ బోర్డుతో చర్చలు జరిపారు.
#WATCH | Delhi | On Pakistan to play against India at T20 cricket World Cup, BCCI Vice-President Rajeev Shukla says, "I am delighted to see the outcome of the deliberations initiated by ICC representative, supervised by the ICC Chairman and the representatives who had gone to… pic.twitter.com/3x9xSDyGMB
— ANI (@ANI) February 10, 2026
ఎందుకిలా?
బంగ్లాదేశ్ బోర్డుతోనూ మాట్లాడి మంచి పరిష్కారం కనుగొన్నారు. క్రికెట్ ప్రాధాన్యం, మనుగడకు ఇలాంటి నిర్ణయం సముచితమైనది’’ అని రాజీశ్ శుక్లా పేర్కొన్నారు. అయితే, షోయబ్ మాలిక్ మాత్రం తప్పుడు వీడియోను ప్రదర్శిస్తూ బీసీసీఐ అడుక్కునందు వల్లే పాక్ వారితో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకొందనే అర్థం వచ్చేలా దిగజారుడు వైఖరి ప్రదర్శించాడు. కాగా కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరుగనుంది.
కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సానియాతో ఉంటూనే నటి, వివాహిత సనా జావెద్‌తో మాలిక్ "బంధం’’ కొనసాగించాడు. ఈ క్రమంలో సానియా అతడికి విడాకులు ఇవ్వగా.. సనా సైతం భర్తకు విడాకులు ఇచ్చి మాలిక్‌ను పెళ్లి చేసుకుంది.
చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్


