నీతా అంబానీ ధరించిన చానెల్‌ బ్లేజర్‌ ..అంత ఖరీదా!? | Nita Ambani swaps signature sarees for Rs 7 lakh Chanel blazer | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ ధరించిన చానెల్‌ బ్లేజర్‌ ..అంత ఖరీదా!?

Feb 9 2026 11:20 AM | Updated on Feb 9 2026 12:10 PM

Nita Ambani swaps signature sarees for Rs 7 lakh Chanel blazer

రిలయన్స్ ఫౌండేషన్  ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ లగ్జరీ దుసులకు, ఆభరణాలకు కేరాఫ్‌ ఆమె. నీతా ధరించి ప్రతి చీర ఓ అద్భుతం. కళ్లుచెదరిపోయే ఖరీదు చేసే ఆభరణాలతో తన ఫ్యాషన్‌ శైలిని చెబుతుంటారామె. భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ చేనేత చీరలు, అలానాటి రాజుల కాలం నాటి ఆభరణాలతో మన పూర్వవైభవాన్ని తెలుసుకునేలా లేదా గుర్తుచేసేలా అద్భుతమైన లుక్‌తో కనిపించే నీతా ఈసారి వెస్ట్రన్‌ వేర్‌లో అదుర్స్‌ అనిపించుకున్నారు. 

తను ఏది ధరించిన సెన్సెషన్‌గానే ఉంటుంది. ఎందుకంటే వాటి ధర, డిజైన్‌ కూడా ఊహకందనిది. ఇక నీతా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో భారత ప్రతినిధిగా మిలానో-కోర్టినా వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026కి ముందు 145వ IOC సెషన్‌కు హాజరయ్యారు. ఏ వేదికపై భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరలే ఎంచుకునే నీతా ఈసారి బాస్‌లా కనిపించే పవర్‌ బ్లేజర్‌, చిక్‌ కోట్‌తో ఎంటర్‌ అవ్వడం విశేషం. నీతా అంబానీ చానెల్ స్ప్రింగ్‌ సమ్మర్‌ 2026 ప్రీ కలెక్షన్‌ స్టైలిష్‌ నేవి బ్లూ బ్లేజర్‌ ధరించింది. 

పైగా ఈ బ్లేజర్‌కి డబుల్‌ కాలర్లు, ఫుల్‌ స్లీవ్స్‌, నాచ్‌ లాపెల్స్‌, రెండు సైడ్‌ పాకెట్స్‌ ఉన్నాయి. అధునాతన నేవీ బ్లూ రంగులో ఉన్న బ్లేజర్‌పై కుడివైపు కాలర్‌పై ఎరుపు పూల డైమండ్‌ బ్రూచ​ ఆ బ్లేజర్‌ని మరింత అద్భుతంగా కనిపించేలా చేసింది. దానికి నల్లటి ఫార్మల్‌ ప్యాంటుని జత చేసి..సింపుల్‌గా డైమండ్‌ ఆకారపు చెవిపోగులు ధరించి స్టైలిష్‌గా కనిపించారామె. ఇంతకీ ఈ బ్లేజర్‌ ఎంతో తెలిస్తే నోటమాటరాదు. ఇది అక్షరాలు రూ. 738,800/-.

 

(చదవండి: దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ)

 

Advertisement
 
Advertisement
Advertisement