చర్మ సౌందర్యం కోసం ఎన్నో మాయిశ్చరైజన్లు రాసి విసిగిపోయి ఉంటారు. అలాంటి వాళ్లు సహజసిద్ధంగా ముఖానికి తేమను అందించి కోమలంగా ఉంచే ఈ టిప్స్‌ని ఫోలో అయితే సరి. పొడిబారటం తగ్గుతుంది..అలాగే మేను ప్రకాశవంతంగా మెరుస్తుంది కూడా. మరి అవేంటో చూద్దామా..
వేడినీటిలో కప్పు పాలను కలిపి స్నానం చేస్తే చర్మ లావణ్యం పెరుగుతుంది. చలికి పొడి బారిన చర్మానికి మాయిశ్చరైజింగ్ ట్రీట్‌మెంట్లు చేయడం సాధ్యం కానప్పుడు ఇలా చేయవచ్చు. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పనిచేస్తుంది.
పొడి చర్మానికి ఈ కాలంలో సబ్బు కూడా శత్రువుగా మారుతుంది కాబట్టి సున్నిపిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సున్నిపిండిలో పాలు పోసి పేస్టులా చేసుకుని ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కోల్పోదు. అంతేకాకుండా సహజమైన నూనె అందడం వల్ల మృదువుగా మారుతుంది.
తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు అప్లయ్ చేసి వలయాకారంగా మర్దన చేయాలి (కళ్ల చుట్టూ మినహాయించాలి). ఇది నాచురల్ స్క్రబ్. చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగాఈ ట్రీట్‌మెంట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


