యూట్యూబర్, అంకుర్ వారికు ఆర్థిక నిర్వహణకు చెప్పిన ఇదే రూల్ సత్సంబంధాలకు వర్తిస్తుందన్నారు. అందరు భావోద్వేగ శక్తిని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించేస్తుంటారిని అన్నారు. మన సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇదే రూల్ పాటిస్తే..జీవితంలో మంచి రిలేషన్స్, అభ్యున్నతి రెండూ సునాయసంగా సాధించగలుగుతామని అన్నారు. మన ఎనర్జీని సరైన విధంగా వినయోగిస్తే..మంచి సంబంధాలను నెరపడమేగాక, అవి మన విజయానికి, ఎదుగదలకు ఉపకరిస్తాయని అన్నారు. మరి అదెలాగంటే..
భావోద్వేగ శక్తిని ఇలా హ్యండిల్ చేయండి అంటూ ఆర్థిక నిపుణుడు అంకుర్ వారికు 50-30-20 రూల్ గురించి వివరించారు. ఆర్థిక శాస్త్రంలో సరైన ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఈ రూల్ భావోద్వేగ ప్రాధాన్యతను కూడా ఎలా మార్గనిర్దేశితం చేస్తుందో వివరించారు. మన ఎనర్జీలో సగం పని, కుటుంబం, కచ్చితంగా కేటాయించాలి. ఇక 30% మనకు సురక్షితంగా అనిపించే బంధాల కోసం ఎనర్జీని ఖర్చు చేయాలి. మిగిలిన 20% వ్యక్తిగత ఎదుగుదల, అభిరుచులు, స్వీయ పరిశీలనపై దృష్టిపెట్టాలని అన్నారు.
ఈ విధంగా భావోద్వేగ శక్తిని విభజించడం ద్వారా అలసిపోకుండా బాధ్యతలు, అర్థవంతమైన సంబంధాలు, స్వీయ-సంరక్షణ తదితరాలను సమతుల్యం చేయడం సులభతరమవుతుంది. వ్యక్తిగతంగా ఎదుగుదల, బాధ్యతలను పోషిస్తూనే మానసిక, భావోద్వేగ స్థితిని బలోపేతం చేసుకోవడానికి ఈ రూల్ హెల్ప్ అవుతుంది. జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తిగతం 20% ఎనర్జీని ఖర్చు చేయడం అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. నెటిజన్లు కూడా అందుకు మద్దతిస్తూ..20% వ్యక్తిగత సంరక్షణకు అత్యవసరం అని..అందరూ దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారంటూ పోస్టులు పెట్టడం విశేషం.
(చదవండి: రెండేళ్లకే రెండు గిన్నిస్ రికార్డులు..!)


