కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్‌ | Telangana Assembly Budget Session 2026 Live Updates And Highlights, Key Security And Conduct Guidelines Issued | Sakshi
Sakshi News home page

కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్‌

Mar 16 2026 10:36 AM | Updated on Mar 16 2026 1:17 PM

Telangana Assembly Budget Session 2026 Live Updates

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌..

అధికార పక్షంవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..

  • అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
  • ఇటీవల పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
  • బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని కాలే యాదయ్యను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
  • కాంగ్రెస్ వైపే కూర్చుంటానన్న కాలే యాదయ్య


అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం

  • అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం
  • BJLP చాంబర్ లోకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్
  • అదే సమయంలో బయటికి వెళ్తూ గమనించిన కేటీఆర్
  • సస్పెండ్ అయిన వ్యక్తి BJLPలోకి ఎలా అంటూ సెటైర్ వేసిన కేటీఆర్
  • BJLP నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్‌ను సరదాగా అన్న కేటీఆర్
  • మీరు కూడా BJLP చాంబర్‌లోకి రండి అంటూ ఆహ్వానించిన పాయల్ శంకర్
  • నేను వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన కేటీఆర్

 

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

  • తెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్.
  • వందేమాతరం గీతం అసెంబ్లీలో ప్రదర్శించినందుకు వాకౌట్

ముగిసిన గవర్నర్ ప్రసంగం.. 

  • తెలంగాణ శాసనసభలో ముగిసిన గవర్నర్ స్పీచ్.
  • గంట పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో సాగిన ప్రసంగం.

కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్‌

  • విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం.
  • రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది.
  • క్యూర్‌, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు.
  • రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం.
  • 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా.
  • జీహెచ్‌ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించాం.
  • హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం.
  • హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం.
  • హైడ్రా ద్వారా 60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.
  • కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది.
  • 23వ బయోఆసియా సదస్సు ద్వారా 1,700 కోట్ల పెట్టబడులు ఆకర్షించాం.
  • 1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉంది.
  • సేవారంగం 13.5 శాతం వృద్ధితో దోహదపడుతోంది.
  • జీసీసీలలో 20 శాతం ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్‌ గ్లోబల్ టెక్ హబ్‌గా మారింది.
  • ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్య స్థానంగా కొనసాగుతోంది.
  • ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
  • ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది.
  • వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్‌ నమూనా రూపొందించాం. 

 

  • శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ నిరసన.
  • జూట్ అంటూ నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.
  • ప్రసంగంలో పథకాల అమలు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జూట్ అంటూ నిరసన.
  • గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

 

  • ఉభయ సభలను ఉద్దేశించి మొదలైన గవర్నర్ ప్రసంగం
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. 

  • అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు.
  • అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

 

  • గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ, మండలి.
  • కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.
  • గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా విగ్రహావిష్కరణ.
  • మధ్యాహ్నం రెండు గంటలకు బీఏసీ సమావేశం.
  • పని దినాలు, అజెండాపై బీఏసీలో చర్చ. 

 

  • అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్‌ రెడ్డి. 

గన్‌పార్క్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు..

  • కేటీఆర్ ఆధ్వర్యంలో గన్ పార్క్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
  • అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
  • అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • రైతులకు వెన్నుపోటు.. రాహుల్‌కు వెయ్యి కోట్లు అంటూ నినాదులు
  • రాహుల్ బందు కాదు.. రైతుబందు కావాలి అంటూ నినాదులు
  • ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్
  • బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించాలని ప్లకార్డులతో నిరసన
  • కాంగ్రెస్‌ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు.

 

అసెంబ్లీలో మంత్రుల చాంబర్లు మార్పు..

  • తెలంగాణ శాసనసభలో మారిన పలువురు మంత్రుల చాంబర్లు.
  • లాబీలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు మంత్రుల చాంబర్లను షిఫ్ట్ చేసిన అధికారులు.
  • మంత్రులు తుమ్మల, దామోదర రాజనర్సింహ చాంబర్లను ఫస్ట్ ఫ్లోర్‌కు తరలింపు.
  • ఫస్ట్ ఫ్లోర్‌లో మంత్రి సీతక్క చాంబర్‌ మార్పు.
  • సీతక్క చాంబర్‌ను మంత్రి తుమ్మలకు కేటాయింపు.
  • సీతక్కకు సీపీఐ ఛాంబర్ పక్కన బ్యాక్ సైడ్ కేటాయింపు.
  • చాంబర్ల మార్పు స్పీకర్ నిర్ణయం అంటున్న అసెంబ్లీ అధికారులు.

 

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

  • తెలంగాణ శాసనసభ నిబంధనలపై బులిటెన్ విడుదల
  • ఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ప్రారంభం
  • ఎమ్మెల్యేలు గేట్ నెం.2, గేట్ నెం.4 ద్వారా ప్రవేశం
  • వాహనాలపై అసెంబ్లీ కార్ పాస్ తప్పనిసరి
  • గేట్ నెం.1, 2, 4 వద్ద వాహనాల సెక్యూరిటీ చెకింగ్
  • స్వయంగా నడిపే వాహనాలకు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతి
  • డ్రైవర్‌తో వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్‌లో పార్కింగ్
  • ఎమ్మెల్యేలు ఆయుధాలు తీసుకురావడం పూర్తిగా నిషేధం
  • అసెంబ్లీ లోపల మొబైల్‌తో ఫొటోలు, వీడియోలు నిషేధం
  • స్పీకర్ అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం నిషేధం
  • అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు, నిరసనలు పూర్తిగా నిషేధం
  • సమావేశం జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వినియోగం నిషేధం
  • టీ/లంచ్ బ్రేక్ సమయంలో మాత్రమే మీడియా పాయింట్ వినియోగం
  • అసెంబ్లీ లాబీల్లో అధికారిక ఫోటోగ్రాఫర్లకు మాత్రమే అనుమతి
  • మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు లోపల లాబీల్లో ప్రవేశం లేదు

మండలి చైర్మన్ కీలక ఆదేశాలు

  • తెలంగాణ శాసన మండలి సమావేశాల నేపథ్యంలో చైర్మన్ కీలక ఆదేశాలు
  • ఉదయం 11:45కి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 26వ సెషన్ ప్రారంభం
  • కౌన్సిల్ ప్రాంగణంలో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహణ నిషేధం
  • ఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు తీసుకురావడం నిషేధం
  • నినాదాలు, ప్రసంగాలు చేయడం నిషేధం
  • ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధం
  • ఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయరాదు
  • చైర్మన్ అనుమతి లేకుండా మొబైల్, ల్యాప్‌ టాప్‌లలో వీడియోలు లేదా ఫొటోలు చూపరాదు
  • కౌన్సిల్ ప్రాంగణంలో సభ్యులు సందర్శకులను తీసుకురావద్దని ఆదేశం
  • కౌన్సిల్ లోపలికి సభ్యుల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అనుమతి లేదు
  • సభ్యులు తమ సెక్యూరిటీ సిబ్బందిని బయటే ఉంచాలని సూచన
  • కార్ పాస్ తప్పనిసరిగా వాహనం ముందు ప్రదర్శించాలి
  • సభ్యుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్ ఏర్పాటు
  • సభ్యుల పీఏలు తమ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement