మనసుతో చేసే ఆధ్యాత్మిక యాత్ర | Girnar Mountain a Spiritual Journey of Ten Thousand Steps | Sakshi
Sakshi News home page

మనసుతో చేసే ఆధ్యాత్మిక యాత్ర

Mar 16 2026 5:36 PM | Updated on Mar 16 2026 6:55 PM

Girnar Mountain a Spiritual Journey of Ten Thousand Steps

గిర్నార్‌ అనే పర్వత శ్రేణి గుజరాత్‌ రాష్ట్రంలో జూనాగఢ్‌ నగరం పక్కన ఆధ్యాత్మిక ప్రభతో నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ ఉదయం సమయంలో అడుగులు వేస్తూ కొండపైకి చేరుకుంటుంటే భక్తి, ప్రకృతి మధ్య జరిగే ఒక మౌన సంభాషణలా అనిపిస్తుంది.

అడుగడుగునా మంత్రాల ధ్వని
గిర్నార్‌కి చేరిన తరువాత కొండపైకి ట్రెక్కింగ్‌ చేయడానికి మెట్లు ఉంటాయి. ప్రతి అడుగు ఒక రిథమ్‌లో ముందుకు సాగుతుంది. కొన్ని ప్రదేశాల్లో ప్రశాంతంగా వినిపించే మంత్రాల ధ్వని గాలిలో కలుస్తుంది. చుట్టూ పర్వత వనాలు, పర్వతం పైకి చేరుకుంటున్న కొద్దీ భక్తులు దైవానికి మౌనంగా చేసే నమస్కారాలు.. ఇవన్నీ కలిసి ఒక పవిత్రమైన మార్గంగా, అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా మారితుంది.

గిర్నార్‌లోని అంబాజీ ఆలయం దగ్గర ఉదయం వేళలో దీపాల వెలుగు చాలా హృద్యంగా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్లిన తరువాత దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది. గిర్నార్‌ శిఖరం దగ్గర నిల్చొని చూస్తూ గుజరాత్‌ నేల అందం ఏంటో తెలుస్తుంది. అక్కడి నేల అందాల్ని చూస్తూ భక్తి, ప్రకృతి రెండూ కలిసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

పర్వతంపై సూర్యోదయం
శిఖరం అంచున నిల్చొని సూర్యోదయాన్ని వీక్షిస్తుంటే ఆకాశం బంగారు రంగులో మారడాన్ని గమనించవచ్చు. పర్వత రేఖలు కోమలంగా కనిపిస్తాయి. ఆ క్షణంలో ఈ ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అద్భుతంగా నిలుస్తుంది.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుండి అహ్మదాబాద్‌ వరకు ఫ్లైట్‌ లేదా రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. అహ్మదాబాద్‌ నుండి రైలు లేదా రోడ్‌ మార్గం ద్వారా జూనాగఢ్‌ చేరుకోవచ్చు. అక్కడి నుంచి గిర్నార్‌ వరకు రోడ్‌ ప్రయాణం ఉంటుంది. గిర్నార్‌ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక శారీరక యాత్ర మాత్రమే కాదు. మనసుతో చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. 

Advertisement
 
Advertisement
Advertisement