అట్టుడుకుతున్న దుబాయ్‌ : విమానాశ్రయం వద్ద డ్రోన్‌ దాడి | Massive Fire Near Dubai Airport After Iranian Drone Strike | Sakshi
Sakshi News home page

అట్టుడుకుతున్న దుబాయ్‌ : విమానాశ్రయం వద్ద డ్రోన్‌ దాడి

Mar 16 2026 12:31 PM | Updated on Mar 16 2026 12:45 PM

Massive Fire Near Dubai Airport After Iranian Drone Strike

మధ్యప్రాచ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై 1,800కి పైగా క్షిపణులు, డ్రోన్‌లను ఇరాన్ ప్రయోగిచింది. ఇరానియన్ డ్రోన్ దాడి తర్వాత దుబాయ్ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పలు విమానాలు  రద్దయ్యాయి.  దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో జరిగిన  డ్రోన్‌ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టిన తర్వాత సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు చెలరేగాయి అత్యవసర బృందాలు వేగంగా స్పందించి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాయి. యుఎఇ అత్యంత లక్ష్య దేశంగా మారిందని అధికారులు తెలిపారు. 

దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందిని వెంటనే మంటలను అదుపు చేశారు. సమీపంలో భద్రతా చర్యలు చేపట్టడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈమేరకు  దుబాయ్‌ మీడియా  ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. దుబాయ్ విమానాశ్రయం దుబాయ్ విమానాశ్రయం నుండి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొన్ని విమానాలను మళ్లిస్తున్నట్లు కూడా ప్రకటించింది. విమానాశ్రయ రోడ్డు, విమానాశ్రయ సొరంగంను పోలీసులు మూసివేశారు.

విమానాలు తిరిగి ప్రారంభం
మరోవైపు ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత దుబాయ్ విమానాలను క్రమంగా తిరిగి ప్రారంభమైనాయి. ఇక్కడి నుండి కొన్ని విమానాలు క్రమంగా ఎంపిక చేసిన గమ్యస్థానాలకు తిరిగి ప్రారంభ మవుతున్నా యని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎక్స్‌ ద్వారా సమాచారం అందించింది. ప్రయాణీకులు తమ విమానాలకు సంబంధించిన  వివరాలకోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని పేర్కొంది.

విమానాశ్రయం సమీపంలో డ్రోన్  దాడి  ఇదే  మొదటిసారి కాదు.  వరుస దాడుల మధ్య  తమ సేనలు ఈ దాడులు తిప్పికొడుతున్న  తరుణంగా లేటెస్ట్‌ అప్‌డేటట్స్‌ను ఫాలో కావాలని అధికారులు  సూచించారు. ప్రస్తుత దాడులు ఈ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలను మరింత పెంచుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement