చిన్నారి ఘనత..శీర్షాసనంలో శివ తాండవ స్తోత్రం! | 8 year old Karnataka boy recites Shiv Tandav Stotram in Shirshasana | Sakshi
Sakshi News home page

శీర్షాసనంలో శివ తాండవ స్తోత్రం పఠించి ప్రపంచ రికార్డు!

May 14 2026 11:43 AM | Updated on May 14 2026 11:57 AM

8 year old Karnataka boy recites Shiv Tandav Stotram in Shirshasana

ఓ చిచ్చర పిడుగు అనితర సాధ్యమైన ఘనత సాధించాడు. గుక్కతిప్పుకోకుండా వేగవంతంగా పాడే శివతాండవ స్త్రోత్రాన్ని ఓ చిన్నారి యోగాసనంలో రాజుగా పిలిచే శీర్షాసనంలో పఠించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఉచ్ఛ్వాశ నిశ్వాసాలపై నియంత్రణ సాగిస్తూ..కష్టతరమైన ఈ స్త్రోత్రాన్ని పఠించడం విశేషం. ఎవరా చిచ్చరపిడుగు అంటే..

కర్ణాటకలోని సిర్సికి చెందిన ఎనిమిదేళ్ల ఓం ఈ రికార్డు నెలకొల్పాడు. సంస్కృత పదాలతో ఉండే శివతాండవ స్త్రోత్రాన్ని పఠించడానికి అపారమైన అంకితభావం, సాధన అవసరం. కానీ ఈ చిన్నారి ఓం గోడ ఆధారంగా చేసుకుని శీర్షాసనం వేసి చేతలు ఆధారం లేకుండా నమస్కరిస్తూ..అలవోకగా శివతాండవ స్త్రోత్రాన్ని పఠించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 

అంత చిన్న వయసులో అపారమైన ఏకాగ్రత, బ్యాలెన్సింగ్‌, క్రమశిక్షణపై ఉన్న పట్టు అందర్నీ అమితంగా ఆకర్షించింది. ప్రపంచ రికార్డు ప్రకారం.. చిన్నారి ఓం ఫిబ్రవరి 15న 3 నిమిషాల 47 సెకన్లలో ఈ ప్రదర్శనను పూర్తి చేశాడు. ఇక్కడ యోగాసనాల్లో అత్యంత కష్టమైన కఠినమైన ఆసనాన్ని కొనసాగిస్తూనే లయబద్ధంగా సంస్కృత పఠనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం అత్యంత సవాలు. 

కానీ ఈ రెండింటిని అలవోకగా బ్యాలెన్స్‌ చేయలంటే సదరు వ్యక్తికి శ్వాస నియంత్రణ, శారీరక స్థిరత్వం, మానసిక ఏకాగ్రత అపారంగా ఉండాల్సిందే. కానీ ఈ ఆ చిన్నారి ఓం అంత చిన్న వయసులోనే వాటన్నింటిపై పట్టు సాధించి ఆ సవాలుని తక్కువ సమయంలోనే దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం.

 

(చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే)

 

Advertisement
 
Advertisement
Advertisement