breaking news
karnataka
-
Ranji Trophy: జైస్వాల్ డకౌట్.. కేఎల్ రాహుల్ ఫ్లాఫ్ షో
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 92వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమయ్యింది. తొలి రోజే వివిధ జట్ల మధ్యన 19 మ్యాచ్‌లు మొదలయ్యాయి. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగారు. కీలక టోర్నీకి ముందు వీరందరికీ మంచి ప్రాక్టీస్ లభించనుంది. కాగా టెస్టుల్లో భారత్‌కు కీలకమైన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తాజాగా తమ తొలి మ్యాచ్‌ల్లో పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఒకేసారి విఫలమవ్వడం ఆందోళన కలిగించే విషయం. అయితే కివీస్ టూర్‌కు ముందు ఇండియా-ఎ జట్టు తరఫున కూడా అనధికారిక టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరు పాల్గొనే అవకాశముంది. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లో వీరిద్దరు రాణిస్తారని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది.జైస్వాల్ డకౌట్..ముంబై తరఫున ఆడుతున్న జైస్వాల్.. ఎలైట్ గ్రూప్-డిలో చండీగఢ్‌తో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ సిద్దేశ్ లాడ్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. దీంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైస్వాల్ 13 బంతులాడి పరుగులేమి చేయకుండానే ఔటయ్యాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన జగ్జీత్సింగ్ బౌలింగ్‌లో పేలవ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.కష్టాల్లో కర్ణాటక..ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అజేయ సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్ రంజీల్లో కర్ణాటక తరఫున బరిలోకి దిగాడు. ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ కర్ణాటక ఓపెనర్ 4 పరుగులు మాత్రమే చేసి శశికాంత్ బౌలింగ్‌లో క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు.19 ఓవర్లు ముగిసేసరికి కర్ణాటక 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు చత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, సుందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడుతో రాజస్తాన్ మ్యాచ్ ఆడుతోంది.ఇదీ చదవండి: ఆసీస్‌తో మూడో వన్డే.. పాపం ప్రియాన్ష్ పరుగు తేడాతో!భారత్‌తో వన్డే సిరీస్.. రెండు జట్లు ప్రకటించిన న్యూజిలాండ్ -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. నాపై స్టింగ్ ఆపరేషన్: డీకే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తనపై, మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఉన్నది ఎవరో, ఆర్థిక వనరులు సమకూర్చింది ఎవరో తనకు బాగా తెలుసని అన్నారు. అయితే ఇప్పుడే అన్ని విషయాలు బయటపెట్టనని, సరైన సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.గురువారం ఢిల్లీలోని కర్ణాటక భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన సీఎం డీకే శివకుమార్.. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. స్టింగ్ ఆపరేషన్ కోసం కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని, అవసరమైతే వారి ఫొటోలను కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.స్టింగ్ ఆపరేషన్ చేసిన వారెవరో ప్రకటించాలని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన సవాలుపై డీకే ఘాటుగా స్పందించారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు, నైస్ ప్రాజెక్టు కుమారస్వామి చేసిన తప్పుల్లో ఒకటని ఆరోపిస్తూ, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సమయం వచ్చినప్పుడు అసెంబ్లీలో వెల్లడిస్తానని అన్నారు. కుమారస్వామి కుటుంబానికి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ప్రశ్నించారు.డీకే వ్యాఖ్యలకు కుమారస్వామి కౌంటర్సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఎదురుదాడికి దిగారు. నైస్ ప్రాజెక్టులో అక్రమాలపై ఆధారాలతో సహా ప్రశ్నలు లేవనెత్తడంతోనే సీఎం డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. నైస్ ప్రాజెక్టు అంశంపై చర్చ జరగకుండా ఉండేందుకే స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. సీఎంను కలిసేందుకు వచ్చే వారు ఫోన్లను బయటే వదిలి వెళ్లాలని సూచించిన కుమారస్వామి.. స్టింగ్ ఆపరేషన్ పేరుతో ట్రాప్ చేసినవారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. గతంలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి వ్యవహారంలో ఎవరు ఉన్నారో, మాజీ మంత్రి రాజణ్ణ ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు.ఇలా ఒకవైపు స్టింగ్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారో తనకు తెలుసంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం, మరోవైపు నైస్ ప్రాజెక్టు అక్రమాల అంశాన్ని కుమారస్వామి ప్రస్తావించడంతో కర్ణాటక రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అసలు స్టింగ్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారు? ఆర్థిక సహకారం అందించింది ఎవరు? డీకే చెబుతున్న ఆధారాలు ఎప్పుడు బయటకు వస్తాయి? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.ఇదీ చదవండి: అంబానీనే కాదు.. ఇంకో బాస్ కూడా ఉన్నాడా? -
ఒకడు నన్ను ఫాలో అయ్యాడు.. అందుకే ఇలా..
బెంగళూరులో తనను ఓ వ్యక్తి ఇంటి వరకు వెంబడించడంతో భయాందోళనకు గురైన ఓ మహిళ.. ఇప్పుడు ప్రయాణ సమయంలో భద్రత కోసం హెల్మెట్‌కు కెమెరా అమర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బెంగళూరు రహదారిపై ట్రాఫిక్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కంటెంట్ క్రియేటర్ లోకేశ్ సోలో రైడర్ ఆ మహిళను గమనించారు. ఆమె హెల్మెట్‌కు ప్రత్యేక పరికరం అమర్చి ఉండటాన్ని చూసి దాని గురించి అడిగారు. అది కెమెరా అని ఆమె చెప్పారు. దాని ధర సుమారు రూ.3,000 అని తెలిపారు. తనకు ఎదురైన అనుభవం కారణంగానే కెమెరాను ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఓ వ్యక్తి తనను అనుసరిస్తూ ఇంటి వరకు వచ్చాడని, ఆ ఘటన తర్వాత ప్రయాణ సమయంలో తన చుట్టూ జరిగే విషయాలను రికార్డు చేసుకునేందుకు ఈ కెమెరాను ఉపయోగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వీడియోలో ఆమె చెప్పిన అనుభవం మహిళల వ్యక్తిగత భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో పలువురు ఆమె తీసుకున్న ముందు జాగ్రత్తను ప్రశంసించారు. మహిళలు ప్రయాణించే సమయంలో ఎదురయ్యే వేధింపులు, వెంబడింపుల వంటి ఘటనలకు ఆధారాలను భద్రపరచుకోవడం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కెమెరా మోడల్ గురించి కూడా కొందరు ప్రశ్నించగా, అది ‘క్యూబో బైక్ డ్యాష్‌క్యామ్’గా కొందరు పేర్కొన్నారు.బెంగళూరులో గతంలోనూ మహిళలను వెంబడించడం, రహదారులపై వేధింపులకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2025లో ఓ మహిళను స్కూటర్‌పై కొంత దూరం వెంబడించిన ముగ్గురు వ్యక్తుల ఘటనపై పోలీసులు స్పందించి, వాహనం యజమానిని గుర్తించినట్లు కూడా వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం సాంకేతిక పరికరాలను ఉపయోగించుకోవడంపై ఈ ఘటన కొత్త చర్చకు తెరతీసింది. అయితే ఇలాంటి పరికరాలు భద్రతకు అదనపు సహాయంగా మాత్రమే ఉపయోగపడతాయని, ప్రమాదం ఎదురైనప్పుడు పోలీసులను సంప్రదించడం కీలకమని గుర్తుంచుకోవాలి. View this post on Instagram A post shared by Lokesh Solo Rider | Gear/Tech Reviews (@throttle_d390) -
ట్రాఫిక్‌కు భయపడ్డాడా.. లేక రోడ్డే నచ్చలేదా? ఫుట్‌పాత్‌పై రయ్ రయ్
బెంగళూరులో ఓ స్కూటర్ రైడర్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు స్థలం ఉన్నప్పటికీ ఫుట్‌పాత్‌పై వేగంగా ప్రయాణించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాదచారుల కోసం ఉద్దేశించిన మార్గాన్ని వాహనదారులు షార్ట్‌కట్‌గా ఉపయోగించడంపై ఈ వీడియో మరోసారి చర్చకు దారితీసింది.సనాతన అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి స్కూటర్‌పై వెళ్తున్న రైడర్‌ను చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. పక్కనే ఉన్న ప్రధాన రహదారి దాదాపు ఖాళీగా కనిపిస్తున్నప్పటికీ, స్కూటర్ రైడర్ ఫుట్‌పాత్‌పైనే ముందుకు సాగాడు. మార్గంలో ఉన్న మొక్కలు, ఇతర అడ్డంకుల మధ్య నుంచి అతడు స్కూటర్‌ను నడిపాడు.ఓ దశలో అతడు బస్‌స్టాప్ గుండా కూడా స్కూటర్‌ను నడుపుతూ కనిపించాడు. వేగాన్ని తగ్గించకుండానే ముందుకు వెళ్లాడు. పక్కనే ఖాళీగా ఉన్న రోడ్డుపైకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు కూడా వీడియోలో కనిపించలేదు. వీడియో తీస్తున్న వ్యక్తిని పట్టించుకోకుండా అతడు ప్రయాణం కొనసాగించాడు.బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ, రహదారి ఖాళీగా ఉన్నప్పటికీ వాహనదారులు ఫుట్‌పాత్‌లను ఎందుకు ఉపయోగిస్తున్నారని ఎక్స్‌లో ప్రశ్నించారు. పాదచారుల కోసం కేటాయించిన మార్గాల్లో వాహనాలు నడపడం వల్ల నడిచేవారికి ప్రమాదం ఏర్పడుతుందని, ఇది ప్రజా భద్రత, బాధ్యత, పౌరబాధ్యతకు సంబంధించిన అంశమని పోస్టులో పేర్కొన్నారు.ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శలు చేశారు. కొందరు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోని ధోరణిపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు డెలివరీ రైడర్లు ఫుట్‌పాత్‌లపై ప్రయాణించడం, రోడ్డుకు వ్యతిరేక దిశలో వెళ్లడం సాధారణంగా మారిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రశ్నించకుండా వదిలేస్తే అవి అలవాటుగా మారే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. Why the obsession with riding on the footpath even when the road is empty? Reckless riding on footpaths is dangerous and puts pedestrians at risk. This is about civic sense, responsibility and public safety. 📍 NGEF Signal KA03KY1913 Kindly take necessary action. @blrcitytraffic— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) October 5, 2026 -
విడాకుల తర్వాత పిల్లాడిని కలవడంపై హైకోర్టు కీలక ఆదేశాలు
బెంగళూరు: కస్టడీకి సంబంధించి న్యాయస్థానాల్లో ఉపయోగించే భాషపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కుటుంబ న్యాయస్థానాలు, సంరక్షకులు, వార్డుల చట్టానికి సంబంధించిన కేసులను విచారించే ఇతర న్యాయస్థానాలు పిల్లలను కలిసే తల్లిదండ్రుల సమయాన్ని సూచించేందుకు ‘విజిటేషన్’ అనే పదానికి బదులుగా ‘పేరెంటింగ్ టైమ్’ అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించింది. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల్లో ఎవరూ అతిథి కాదనే భావనను ప్రతిబింబించేలా ఈ మార్పు చేస్తున్నట్లు జస్టిస్ లలితా కన్నెగంటి నేతృత్వంలోని సింగిల్ బెంచ్ పేర్కొంది.ఓ బాలుడి కస్టడీకి సంబంధించిన కేసును విచారిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై దాఖలు చేసే పిటిషన్లలో కూడా ‘విజిటేషన్’కు బదులుగా ‘పేరెంటింగ్ టైమ్’ కోరాలని కుటుంబ న్యాయస్థానాలకు పరిపాలనా సూచనలు ఇవ్వాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వును అన్ని కుటుంబ న్యాయస్థానాలు, సంరక్షకులు, వార్డుల చట్టం కింద కేసులు విచారించే ఇతర న్యాయస్థానాలకు తెలియజేయాలని సూచించింది.ఈ కేసులో తల్లిదండ్రులు 2017 నుంచి విడిగా ఉంటున్నారు. బాలుడి వయసు 9 సంవత్సరాలు. అతడికి 3 నెలల వయసు ఉన్నప్పటి నుంచి తండ్రి అతడిని చూడలేదని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రుల మధ్య పలు న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ న్యాయస్థానం ఇప్పటికే విడాకులు మంజూరు చేయగా, తండ్రి దానిని సవాలు చేశారు.ట్రయల్ కోర్టు తండ్రికి ప్రతి శనివారం, ఆదివారం 3 నుంచి 4 గంటల పాటు బాలుడితో గడిపే అవకాశం కల్పించింది. సెలవుల్లో 50 శాతం కాలానికి మధ్యంతర కస్టడీని ఇచ్చింది. అలాగే తల్లికి ముందుగా సమాచారం ఇచ్చి, ఒక రోజు విడిచి మరో రోజు సుమారు 30 నిమిషాల పాటు వాట్సాప్ లేదా ఇతర సమాచార సాధనాల ద్వారా కుమారుడితో మాట్లాడే అవకాశం కల్పించింది.‘విజిటేషన్’ అనే పదం ఒక తల్లిదండ్రులు పిల్లల జీవితంలో భాగం కాగా, మరొకరు కేవలం వచ్చి వెళ్లే వ్యక్తి అనే భావన కలిగించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. “పేరెంటింగ్ టైమ్ అని పిలవడం ద్వారా పిల్లల జీవితంలో ఏ తల్లిదండ్రి కూడా సందర్శకుడు కాదనే సాధారణ సత్యాన్ని గుర్తిస్తున్నాం” అని పేర్కొంది. కస్టడీ నిర్ణయాలు ప్రతి కేసులోని వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగానే ఉండాలని, ఒకే విధమైన సూత్రాన్ని అన్ని కేసులకు వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.తండ్రి చెన్నైలో, తల్లి బెంగళూరులో ఉంటున్న నేపథ్యంలో బాలుడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత అందేలా చూడాల్సిన బాధ్యత కోర్టుదేనని తెలిపింది. బాలుడిని తల్లి ఇంటి నుంచి తండ్రి తీసుకెళ్లి తిరిగి అప్పగించేందుకు ‘పేరెంటింగ్ టైమ్’గా అనుమతించింది. తదుపరి విచారణ అక్టోబర్ 15న జరగనుంది. -
జూరాలకు నీటి విడుదలలో అనిశ్చితి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కర్ణాటక నుంచి తెలంగాణకు కృష్ణా నీటి విడుదలలో అనిశ్చితి నెలకొంది. ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఊగిసలాటల మధ్య జూరాల ఆయకట్టులో లక్ష ఎకరాల్లో ఖరీఫ్ సాగుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరులోని జూరాల ఆయకట్టు రైతులు సాగు నీటి కోసం ఆందోళనలకు దిగిన క్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి బృందం గత నెల 22న కర్ణాటకలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణకు 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అర్ద్ధాంతరంగా నీటి విడుదల ఆగిపోయింది. కర్ణాటకలో వ్యతిరేకత.. తెలంగాణకు సాగునీటిని విడుదల చేయడాన్ని కర్ణాటకలోని కృష్ణా బేసిన్ జిల్లాల్లోని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచే గెజిట్ నోటిఫికేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్న అంశాన్ని అక్కడి పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.మానవతా దృక్పథంతో పరిమితంగా నీటిని విడుదల చేయడానికి ఆ రాష్ట్ర మంత్రి ఒకరు మద్దతు తెలపగా.. రైతు సంఘాల నేతలు సాగునీటికి సరఫరా చేస్తే ప్రతిఘటిస్తామని చెప్పినట్టు తెలిసింది. కర్ణాటకలో ఇది వరకే వారబందీ పద్ధతిన సాగునీరు ఇస్తున్నారని, అలాంటప్పుడు తెలంగాణకు ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. మళ్లీ మొదటికి.. రైతుల బెంబేలు కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితుల్లో జూరాలకు నీటి విడుదలపై మీమాంస కొనసాగుతుండగా.. జూరాల ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరులోని పలు రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధికారిక రికార్డుల్లో పేర్కొన్న గణాంకాలే వారి నాటకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. గత నెల 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు నారాయణపూర్ నుంచి జూరాలకు 27,600 క్యూసెక్కుల నీరు విడుదలైనట్టు రికార్డుల్లో చూపిస్తున్నారని వివరించారు.నారాయణపూర్ గేట్లు ఎత్తనేలేదని.. ఎగువన రెండు, మూడు రోజులు వర్షాలు కురవడంతో జూరాలకు వరద వచ్చిందని చెబుతున్నారు. గత నెల 23న జూరాలలో నీటి మట్టం 9.214 టీంఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 8.51 టీఎంసీలు. గత నెల 24 నుంచి ఇప్పటివరకు జూరాల నుంచి ఔట్‌ఫ్లో 28,300. ఈ లెక్కన ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో దాదాపు సమానం.అలాంటప్పుడు నిల్వ ఉన్న నీటిమట్టంలో ఐదారు రోజుల్లోనే అంత తేడా ఎందుకు ఉంటుందని ప్రశి్నస్తున్నారు. కాగా, జూరాల ఆయకట్టులో పంటలు చేతికి రావాలంటే ఐదు నుంచి ఆరు టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో లైవ్ స్టోరేజీ 4.5 టీఎంసీలే. దీంతో కర్ణాటక నుంచి నీటి విడుదల అనివార్యం. కానీ కర్ణాటక నుంచి నీటి విడుదలపై ప్రస్తుతం డైలమా నెలకొనడం జూరాల ఆయకట్టు రైతులను బెంబేలెత్తిస్తోంది. -
‘గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదు.. రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్’
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో అథ్లెటిక్స్‌లో భారత్‌కు మంగళవారం స్వర్ణం అందించింది మహిళల రిలే జట్టు. కిరణ్ మహల్, ఎంఆర్ పూవమ్మ, ప్రాచీ ఛౌదరి, విత్య రామ్రాజ్ 4*400 మీటర్ల రిలే పరుగును 3 నిమిషాల 29.9 సెకన్లలో పూర్తి చేసి.. పసిడి పతకాన్ని ముద్దాడారు.మూడో లెగ్ ముగిసే సమయానికి భారత్ మూడో స్థానంలోనే ఉన్నా.. ఆఖరి లెగ్‌లో అద్భుతంగా పరిగెత్తి విత్య జట్టును అగ్రస్థానంలో నిలిపింది. ఏషియాడ్ అథ్లెటిక్స్ చరిత్రలో మహిళల 4*400 మీటర్ల రిలే పరుగులో భారత్‌కు ఇది ఏడో పసిడి పతకం.గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదు.. ఈ నేపథ్యంలో కిరణ్, పూవమ్మ, ప్రాచీ, విత్యలపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, వీరిలో 36 ఏళ్ల పూవమ్మకు గోల్డ్ గెలిచినా సొంత రాష్ట్రం నుంచి కనీసం అభినందించే వారు లేక చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. సీఎన్ఎన్-న్యూస్18తో మాట్లాడుతూ.. పూవమ్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్‘‘బంగారు పతకం గెలిచిన రెండు రోజుల తర్వాత మా ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర నాకు కాల్ చేసి.. మెడల్ సాధించినందుకు అభినందించారు. నన్ను ఎవరూ పట్టించుకోలేదని మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే వాళ్లు నాకు ఫోన్ చేశారు.అయితే, పతకాలు గెలిచిన అథ్లెట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని త్వరలోనే పెంచుతామని సీఎం నాతో చెప్పారు. నన్ను సత్కరిస్తామని కూడా అన్నారు’’ అని కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన పూవమ్మ తెలిపింది.చదవండి: త్వరలోనే టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా అతడు! View this post on Instagram A post shared by Indiantrackandfield (@indiantrackandfield) -
కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్.. కేఎల్ రాహుల్‌కు చోటు
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో తమ తొలి మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సన్‌రైజర్స్ ఆటగాడు, కర్ణాటక సూపర్ స్టార్ స్మరణ్ రవిచంద్రన్ ఎంపికయ్యాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికి సెలక్టర్లు మత్రం స్మరణ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. గత సీజన్లో రవిచంద్రన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు సెంచరీలతో సహా మొత్తం 950 పరుగులు లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడిని కెప్టెన్‌గా నియమించారు. కాగా ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణలకు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. ప్రసిద్ద్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నప్పటికి అక్టోబర్ 11న ఆంధ్రతో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు. కాగా ఆంధ్రతో మ్యాచ్‌తో మరో కర్ణాటక సూపర్ స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ మాత్రం అందుబాటులో లేడు. అతడు ఇండియా-ఎ జట్టులో భాగం కావడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.కర్ణాటక రంజీ ట్రోఫీ జట్టుస్మరణ్ రవిచంద్రన్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, అనీశ్వర్ గౌతమ్, కరుణ్ నాయర్, అనీష్ కెవి, శ్రేయాస్ గోపాల్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), శ్రీఖర్ శెట్టి, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాష్ శెట్టి, మన్వంత్ కుమార్, ఎల్ఆర్ కుమార్, రితేష్ భత్కల్, కెఎల్ శ్రీజిత్చదవండి: IND vs WI: 'అతడికి వన్డేలు సెట్ కావు.. టెస్టుల్లో ఆడించండి' -
పట్టపగలే.. ఆటో డ్రైవర్ యువతుల మధ్య ఫైట్
ఆటో ఛార్జీ విషయంలో మొదలైన వివాదం రోడ్డుపైనే కొట్టుకునే వరకు వెళ్లింది. ఇద్దరు యువతులు, ఆటో డ్రైవర్ పరస్పరం దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 3వ సెక్టార్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురూ ఒకరిపై ఒకరు చేతులు చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీడియో వైరల్ కావడంతో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. ఇద్దరు యువతులను సంప్రదించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే వారు వెంటనే రాకుండా ఒకటి రెండు రోజుల సమయం అడిగారు. మరోవైపు పోలీసులు ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడితోనూ మాట్లాడారు.డ్రైవర్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. యువతులు అతడి ఆటోను బుక్ చేసుకున్నారు. ప్రయాణం పూర్తయిన తర్వాత చెల్లింపు విషయంలో గొడవ మొదలైంది. యువతులు మద్యం మత్తులో ఉన్నారని, తనను దూషిస్తూ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించారని డ్రైవర్ ఆరోపించాడు. ముందుగా వారే తనపై దాడి చేశారని.. తాను తిరిగి కొట్టానని పోలీసులకు చెప్పాడు. అయితే యువతులు పోలీసులకు ఏం చెప్పారన్నది ఇంకా బయటకు రాలేదు.వీడియోతో వైరల్.. కేసు ఎప్పుడు?రోడ్డుపై జరిగిన గొడవను అక్కడున్న వారు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు. అయితే అందుబాటులో ఉన్న వీడియోలో గొడవకు ముందు ఏం జరిగిందన్నది తెలియడం లేదు. దీంతో మొదట ఎవరు దాడి చేశారన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.Kalesh b/w a Group of Girls and Auto Driver over Fare issues, HSR Layout Bengaluru pic.twitter.com/gNAxhfVs93— Ghar Ke Kalesh (@gharkekalesh) September 29, 2026ప్రస్తుతం మహిళలు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. వారు ఫిర్యాదు చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు తెలిపారు. దీంతో ఈ వైరల్ వీడియో వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఫిర్యాదుపైనే ఆధారపడి ఉన్నాయి.ఛార్జీ వివాదం.. మరోసారి చర్చఈ ఘటనతో బెంగళూరులో ఆటో ఛార్జీలపై మరోసారి చర్చ మొదలైంది. నగరంలో ఆటో ఛార్జీల విషయంలో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తు, ఇరువర్గాల ఫిర్యాదుల తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నీటి కోసం ఊరిని అమ్మేస్తారా? -
ప్రేమించాలని వేధింపులు.. విద్యార్థిని విషాదం!
కర్ణాటక: ప్రేమించాలని వేధించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. సూళగిరి తాలూకా ఏనుసోణ సమీపంలోని ఎం.దొడ్డి గ్రామానికి చెందిన వీరేంద్రన్ కూతురు పవిత్ర (17) సూళగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నితీష్ కుమార్, శ్రీధర్ బాలిక వెంటపడి ప్రేమించాలని ఒత్తిడి చేశారు.ఇటీవల పవిత్ర ఇంటి వద్దకు వెళ్లిన నితీష్ కుమార్.. రహస్యంగా మాట్లాడాలని ఒత్తిడి చేశాడు. విషయాన్ని పసిగట్టిన పవిత్ర తల్లి బయటకు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన పవిత్ర ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం సూళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది.గమనిక..మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: ఏనుగు ఎంత పని చేసిందీ.. -
పని ఒత్తిడి తట్టుకోలేక ఎవ్వరికీ చెప్పకుండా, ఎక్కడికో వెళ్లిపోయి..
బెంగళూరు: కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ పర్విజ్ ధార్వాడ్ అదృశ్యమయ్యారు. నిధుల కొరత, కాంట్రాక్టర్ల నుంచి చెల్లింపుల కోసం ఒత్తిడి ఎదురవుతోందని పేర్కొంటూ ఆయన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. లేఖలో తన వ్యక్తిగత జీవితం, మానసిక స్థితిపై ఈ పరిస్థితి ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.గదగ్ ఉపవిభాగంలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సహాయ కార్యనిర్వహణ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పర్విజ్ సెప్టెంబర్ 12న బెంగళూరులోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. గదగ్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉందని అందులో పేర్కొన్నారు. పూర్తయిన కొన్ని పనులకు కూడా నిధులు లేక చెల్లింపులు చేయలేకపోతున్నామని, బకాయిల కోసం కాంట్రాక్టర్లు, టీమ్ లీడర్ల నుంచి ఒత్తిడి వస్తోందని ఆయన లేఖలో వివరించారు.సెప్టెంబర్ 13న బెంగళూరులో సమావేశం ఉందని చెప్పి పర్విజ్ అక్కడికి బయలుదేరారు. అప్పటి నుంచి ఆయన కనిపించలేదు. సెప్టెంబర్ 16న గదగ్‌లోని బేటగేరి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైన వ్యక్తి కేసు నమోదైంది. ఆయన చివరి ఆచూకీ ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పర్విజ్ కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.రూ.6 కోట్ల నిధులు కోరినా విడుదల కాలేదు లేఖలో సుమారు రూ.6 కోట్ల నిధులు కోరినా అవి విడుదల కాలేదని పేర్కొన్నట్లు సమాచారం. కొన్ని పనులకు కేటాయించిన సుమారు రూ.2 కోట్ల నిధులు సంస్థ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని కూడా అందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చెల్లింపుల విషయంలో ప్రతిరోజూ వేధింపులు ఎదురవుతున్నాయని, కొందరు తన ఇంటికి వచ్చి మాట్లాడటంతో పాటు కార్యాలయంలోనూ తనపై అరుస్తున్నారని పర్విజ్ ఆరోపించారు.లేఖలో తన జీవితాన్ని ముగించుకోవాలనే ఉద్దేశాన్ని సూచించే వ్యాఖ్యలు ఉన్నాయని, కుటుంబ సభ్యులను క్షమించాలని కోరినట్లు కూడా సమాచారం. తన పరిస్థితికి ఎవరినీ బాధ్యులను చేయవద్దని పేర్కొన్నారు. గదగ్ ఉపవిభాగంలోని నిధుల సమస్యను పరిష్కరించి, మరో సహాయ కార్యనిర్వహణ ఇంజినీర్‌ను నియమించాలని ఆయన కోరినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులను వేధించవద్దని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.పర్విజ్ గతంలోనూ 2024లో ఇలాగే అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అప్పుడు 5 రోజుల తర్వాత గోవాలో ఆయన ఆచూకీ లభించింది. ప్రస్తుతం ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది. లేఖలో ఆత్మహత్యకు సంబంధించిన ప్రస్తావనలు ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆయన అదృశ్యానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితురాలు చెప్పిందని.. అప్పిచ్చిన వ్యక్తినే దారుణంగా..
కర్ణాటక: స్నేహితురాలిని లైంగికంగా వేధిస్తున్నాడనని ఆమె మిత్రుడు రుణదాతను హత్య చేశాడు. బెళగావి జిల్లా అథని తాలూకాలోని బల్లిగేరిలో ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీదేవి రాజపుత్ అనే మహిళను రణవీర్ రాజ్‌పుత్ లైంగిక వేధించేవాడు. అతడు ఆమెకు కొంత డబ్బు అప్పు ఇచ్చాడు. ఆ కారణంతో సతాయించసాగాడు. సెప్టెంబర్ 21న రాత్రి బైక్ స్టార్ట్ కావడం లేదని చెప్పి రణవీర్‌ను బైరు పవార్ అనే వ్యక్తి పిలిపించుకొన్నాడు. ఆ తరువాత గొంతుకు తాడు బిగించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య తరువాత బైరు, శ్రీదేవికి ఫోన్ చేసి చెప్పాడు. విచారణ చేపట్టిన అథణి పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఇద్దరినీ అరెస్ట్ చేశారు.ఇదీ చదవండి: పెళ్లైన 5 నెలలకే టెకీ ఆత్మహత్య -
ట్రావెల్.. కూర్గ్ కాఫీ ఒక్కసారి తాగితే.. సిటీ కాఫీ నచ్చదట!
సిటీ ట్రాఫిక్, ట్రాఫిక్, కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని రోజులు తప్పించుకుని, పచ్చని అడవుల మధ్య కాఫీ పూల వాసనలో కరిగిపోవాలని ఉందా? అయితే మీరు కూర్గుకు వెళ్లాల్సిందే. కూర్గ్ నే కాఫీ ప్యారడైజ్ అని ఎందుకంటారు అంటారు?కర్ణాటకలోని కొడగు జిల్లానే కూర్గ్. దీన్ని అందరూ భారతదేశపు స్కాట్లాండ్ అంటారు. కాఫీ లవర్స్ దీనిని కాఫీ కేపిటల్ అని కూడా అంటారు. భారతదేశంలో పండే మొత్తం కాఫీలో 60 శాతం ఒక్క కూర్గ్ లోనే పండుతుంది.ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మామూలు తోట కాదు. ఇది అడవి తోట. వంద అడుగుల ఎత్తు పెరిగే రోజ్ వుడ్, టేకు, సిల్వర్ ఓక్ చెట్ల నీడలో కాఫీ మొక్కలు పెరుగుతాయి. ఆ చెట్లకే నల్ల మిరియాల తీగలు, వనిల్లా తీగలు అల్లుకుని ఉంటాయి.ఈ తోటల మధ్యలోనే ఏనుగులు, చిరుతలు, హార్న్ బిల్ పక్షులు తిరుగుతాయి. ఎండలో కాకుండా నీడలో నెమ్మదిగా పెరగడం వల్ల కూర్గ్ కాఫీ గింజలో చేదు తక్కువ, పండ్ల తీపి, చాక్లెట్ సువాసన ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే బెస్ట్ షేడ్ గ్రోన్ కాఫీ అంటారు.ఎప్పుడు వెళ్లాలి?కూర్గ్ ను సంవత్సరం పొడవునా చూడవచ్చు, కానీ కాఫీని పూర్తిగా ఫీల్ అవ్వాలంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వెళ్లవచ్చు. ఇది హార్వెస్ట్ సీజన్ం ఇదే బెస్ట్ టైమ్. చలి కాలంలో, ఉదయాన్నే తోటలపై దట్టమైన మంచు, మధ్యాహ్నం వెచ్చని ఎండ. ఈ సమయంలోనే ఎర్రగా పండిన కాఫీ చెర్రీలను కోస్తారు. మీరు కూడా తోటలోకి వెళ్లి చెర్రీలు కోయవచ్చు.తరువాత మార్చి నుండి మే వరకు ఫ్లవరింగ్ సీజన్ లో వెళ్లవచ్చు. ఈ సమయంలో కాఫీ మొక్కలకు తెల్లని పూలు పూస్తాయి. లోయ మొత్తం తెల్లగా మారి, గాలి అంతా మల్లెపూల వాసన వస్తుంది. స్థానికులు దీన్ని కూర్గ్ స్నో అని పిలుస్తారు. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు అడవి మరింత పచ్చగా ఉంటుంది, కానీ వర్షం ఎక్కువగా ఉంటుంది. కాఫీ కోసం కాకుండా నేచర్ కోసం వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.హైదరాబాద్ నుండి ఎలా ప్లాన్ చేయాలి?హైదరాబాద్ నుండి కూర్గ్ సుమారు 700 కిలోమీటర్లు. 3 రోజుల ట్రిప్ కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇది. ఫాస్ట్ గా వెళ్లాలంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకు ఫ్లైట్ ఎక్కండి. కేవలం గంటా 15 నిమిషాల్లో బెంగుళూరు చేరిపోతారు.బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుండి మడికేరి వరకు క్యాబ్ లేదా కేఎస్ఆర్టీసి ఐరావత్ బస్సులో ఆరు గంటల్లో కూర్గ్ చేరుకోవచ్చు.బడ్జెట్ లో వెళ్లాలంటే..హైదరాబాద్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ నుండి మడికేరికి డైరెక్ట్ కేఎస్ఆర్టీసి, వీఆర్ఎల్, ఎస్సారెస్ బస్సులు ఉన్నాయి. రాత్రి 8 గంటలకు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కూర్గ్ లో ఉంటారు.రోడ్ ట్రిప్..సొంత కారులో అయితే హైదరాబాద్ – బెంగళూరు – మైసూర్ – కుశాల్ నగర్ – మడికేరి రూట్ చాలా బాగుంటుంది.ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి?హోటల్ లో కాకుండా కాఫీ ఎస్టేట్ హోమ్ స్టేలో ఉండండి. అప్పుడే అసలైన కూర్గ్ ఫీలింగ్‌ను సొంతం చేసుకోవచ్చు. టాటా కాఫీ ప్లాంటేషన్ ట్రైల్స్, మెర్కారా గోల్డ్ ఎస్టేట్, ది తమరా కూర్గ్ బెస్ట్ ఆప్షన్స్.ఉదయాన్నే ఎస్టేట్ ఓనర్ తో కలిసి ప్లాంటేషన్ వాక్ చేయండి. కాఫీ రోస్టింగ్, క్యూరింగ్ ఎలా చేస్తారో చూడండి. కొడవ స్పెషల్ కర్రీ, అక్కి రోటీ తినండి. అబ్బే ఫాల్స్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, నాగరహోళె టైగర్ రిజర్వ్ కూడా చూడండి.తిరిగి వచ్చేటప్పుడు ఎస్టేట్ నుండి ఫ్రెష్ గా రోస్ట్ చేసిన అరబికా గింజలు తీసుకురావడం మర్చిపోకండి. ఒక్కసారి కూర్గ్ అడవి కాఫీ తాగితే, మళ్ళీ సిటీ కాఫీ మీకు రుచించదు.ఇదీ చదవండి: బీచ్ ప్యారడైజ్.. 115 దీవుల సీషెల్స్ అసలు అందం ఇదే! -
కర్ణాటక సీఎం నోట సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అభ్యంతరం
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాష్ట్రంలో దాదాపు డజను మంది ఎమ్మెల్యేలకు రెండేసి పెళ్లిళ్లు జరిగాయని ఆయన అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే ఈ వ్యాఖ్యపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎవరెవరో పేర్లు కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.వర్షాభావ పరిస్థితులపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో శివకుమార్ బెంగళూరు నగరంపై పెరుగుతున్న జనాభా ఒత్తిడిని ప్రస్తావించారు. బెంగళూరును కెంపేగౌడ నిర్మించారని, విధానసౌధను కేంగల్ హనుమంతయ్య నిర్మించారని, ఎస్.ఎం. కృష్ణ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. నగరానికి వచ్చిన వారు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లడం లేదని చెప్పారు.ఈ క్రమంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బెంగళూరుకు వచ్చిన వారు కూడా ఇక్కడే ఉండిపోతున్నారని, “మీలోనూ చాలామందికి రెండు పెళ్లిళ్లు ఉన్నాయి. అలాంటివారు ఓ డజను మంది ఉన్నారు. వారి జాబితా ఇవ్వగలను” అని వ్యాఖ్యానించారు. ధార్వాడ్, దక్షిణ కన్నడ తదితర జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, అయితే వాటిని బయటపెట్టడం లేదని చెప్పారు."MLAs who come to Bengaluru don't leave, I know dozens who had second marriages and settled here" : Karnataka CM DK Shivakumar while talking about growing population & rapid urbanization in Bengaluru. pic.twitter.com/MA8Kg4Y45g— Deepak Bopanna (@dpkBopanna) September 25, 2026అనవసరమైన వ్యాఖ్య: బీజేపీముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ స్పందించారు. ఇది అనవసరమైన వ్యాఖ్య అని పేర్కొంటూ.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని సీఎం చెబుతున్న ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో బెంగళూరుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేపైనా అనుమానం ఏర్పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను మాత్రం బెంగళూరులోనే పుట్టి పెరిగానని స్పష్టం చేశారు.బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్.సురేశ్ కుమార్ కూడా శివకుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం సరదాగా చెప్పి ఉండొచ్చని, కానీ అసెంబ్లీ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ గౌరవాన్ని పెంచదని అన్నారు. తాను సభలో ఉండి ఉంటే అప్పుడే స్పందించేవాడినని పేర్కొన్నారు.పేర్లు చెప్పాలి లేదంటే..రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండు కుటుంబాలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరనే విషయాన్ని సీఎం స్పష్టం చేయాలని సురేశ్ కుమార్ డిమాండ్ చేశారు. పేర్లు వెల్లడించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన ఆసక్తి, సందేహాలు ఏర్పడతాయని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలందరినీ అనుమానంగా చూడటం లేదా ఎగతాళి చేసే పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు.బెంగళూరు డెవలప్మెంట్.. జనాభా ఒత్తిడిపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అసలు చర్చను పక్కకు నెట్టి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన ప్రస్తావించిన ఎమ్మెల్యేల పేర్లు మాత్రం ఇప్పటివరకు బహిర్గతం కాలేదు.ఇదీ చదవండి: రెబల్ ఎంపీలకు గడువు.. రెండు వారాలే! -
కస్తూరి రంగన్ నివేదికపై వ్యతిరేకత ఎందుకు?
సాక్షి బెంగళూరు: పశ్చిమ కనుమల పరిరక్షణకు కస్తూరి రంగన్ సమర్పించిన నివేదికపై కన్నడనాట జోరుగా చర్చ సాగుతోంది. ఈ నివేదిక అమలు చేయాలా వద్దా అనే విషయంపై విధానసభలో కూడా వాడీవేడి చర్చ జరిగింది. మలేనాడు, కరావళి ప్రాంత ప్రజలు ఈ నివేదికను అమలు చేయకూడదని చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే ప్రజల అభీష్టం మేరకు కస్తూరి రంగన్ నివేదిక అమలు ప్రస్తుతానికి అమలు చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రస్తుతం కస్తూరి రంగన్ నివేదిక తుది జాబితా సిఫారసులు యథాతథంగా అంగీకరించడం సాధ్యపడదని, ఈ అంశంపై విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఆ తర్వాత తమ అభిప్రాయాలను తెలియజేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ నివేదిక ఏంటి? ఎందుకు ప్రజలు వద్దనుకుంటున్నారో పరిశీలిద్దాం..2013లో కస్తూరి రంగన్ నివేదిక పశ్చిమ కనుమల్లో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు డాక్టర్ కె. కస్తూరి రంగన్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసింది. 2013లో ఈ కమిటీ పశ్చిమ ఘాట్ల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులు చేస్తూ ఒక నివేదికను కేంద్రానికి సమర్పించింది. తమ నివేదికలో పొందుపరిచిన సిఫారసులను అమలు చేస్తే పశ్చిమ ఘాట్ల పరిసరాలను కాపాడవచ్చునని, మనిషి మనుగడ సజావుగా సాగుతుందని కమిటీ అభిప్రాయపడింది. తక్షణమే పశ్చిమ ఘాట్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నివేదికలో ఇంకా ఏముంది? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పశ్చిమ ఘాట్లు కలిగి ఉన్నాయి. మొత్తం 1,64,280 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పశ్చిమ ఘాట్లు ఉన్నాయి. పశ్చిమ ఘాట్ల ప్రాంతంలో సుమారు 37 శాతం అంటే 56,825 చ.కి.మీ.లు పర్యావరణ సున్నిత ప్రాంతంగా కమిటీ సిఫారసులు చేసింది. కర్ణాటకలోని 44,448 చ.కి.మీ. మేర ప్రాంతం పశ్చిమ ఘాట్లు ఉంటే అందులో 20,668 చ.కి.మీ ప్రాంతాన్ని అతి సూక్ష్మ పర్యావరణ జోన్‌గా తీసుకురావాలని కమిటీ సూచించింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ సున్నిత జోన్ ప్రాంతంలో ఎలాంటి మైనింగ్, క్వారీ, చెట్ల తొలగింపు, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిని సంపూర్ణంగా నిషేధించాలని సూచించింది. దీనితోపాటు టౌన్‌షిప్‌లు, భారీ కట్టడ నిర్మాణాలు, ఉష్ణ, జల, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలు జరగకూడదని కూడా తేల్చి చెప్పింది. వాణిజ్య పర్యాటకాన్ని తగ్గించాలని సూచించింది. కర్ణాటకలో ఎందుకు వ్యతిరేకత..? కర్ణాటకలోని మొత్తం 10 జిల్లాల ప్రజలు ఈ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్నారు. ఈ 10 జిల్లాల్లో మొత్తంగా సుమారు 1500కు పైగా గ్రామాలు ఈ అతిసూక్ష్మ పర్యావరణ జోన్ పరిధిలోకి వెళతాలయి. ఈ కమిటీ నివేదిక సిఫారసులు అమల్లోకి వస్తే కరావళి, మలేనాడు ప్రాంతాల్లోని ముఖ్యంగా ఈ పది జిల్లాల ప్రజల జీవనానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. సూక్ష్మజోన్గా ఈ గ్రామాలను ప్రకటిస్తే మానవ జోక్యానికి, అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. కాలక్రమేణా వ్యవసాయం, ఉద్యాన కార్యకలాపాలు, ఇతరత్ర దైనందిన జీవనోపాధి పనులకు ఆటంకం కలుగుతుంది.ఇదీ చదవండి: దర్శన్‌కు వరుస ఎదురుదెబ్బలుఈ ప్రాంత ప్రజలకు ఎక్కువగా కాఫీ, రబ్బర్, నల్ల మిరియాలు ప్రధాన జీవనాధారం.. కమిటీ నివేదిక అమలు పరిస్తే ఈ పంటలకు అవసరమయ్యే ఎరువులు, కీటకనాశకద్రవ్యాల వినియోగంపై నిషేధం విధించాల్సి వస్తుంది. కొత్తగా ఉద్యాన తోటలను విస్తరించడం సాధ్యపడదు. అలాగే ఈ కమిటీ నివేదిక అమల్లోకి వస్తే తమ ఇళ్లను కూల్చేసి ఇక్కడి నుంచి తరిమేస్తారనే భయం వెంటాడుతోంది. అలాగే ఊర్ల కోసం రోడ్లు, వంతెనలు, విద్యుత్, ఆస్పత్రి, పాఠశాలలను నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ అనుమతులు కొంచెం కఠినతరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడి హోంస్టేలు పర్యావరణానికి బలమైన కోటగా మారాయి. హోంస్టేల వాణిజ్య కార్యకలాపాలకు అడ్డుగా మారవచ్చు. ప్రధానంగా తమ దైనందిన జీవితం దుర్బరంగా మారుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలోని ఏ జిల్లాలకు సమస్య..? బెళగావి, ఉత్తరకన్నడ, ఉడుపి, దక్షిణ కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన్, కొడగు, చామరాజనగర, మైసూరు -
దర్శన్‌కు వరుస ఎదురుదెబ్బలు
బెంగళూరు: కన్నడ అగ్ర నటుడు దర్శన్ తూగుదీపకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అభిమాని హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడిగా ఉన్న దర్శన్‌ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రదూష్ ఎస్. రావును ఈ నెల 28 నుంచి సాక్షిగా విచారించాలని ట్రయల్ కోర్టు నిర్ణయించింది. దీన్ని అడ్డుకునేందుకు దర్శన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రదూష్ అప్రూవర్‌గా మారటానికీ వీల్లేదంటూ దర్శన్ భార్య విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను రెండు రోజుల క్రితం కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ట్రయల్ కోర్టు అయిన బెంగళూరు 59వ సెషన్స్ న్యాయస్థానం ప్రదూష్ విచారణకు తాజాగా ఉత్తర్వులిచ్చింది.దర్శన్ లాయర్ల వినతులకు నోసాక్షిగా ప్రదూష్ విచారణను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని దర్శన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు సెషన్స్ కోర్టు జడ్జికి తెలిపారు. అప్పటివరకు ప్రదూష్ విచారణను వాయిదా వేయాలని మనవి చేశారు. వారి వినతులను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ నెల 28 నుంచి ప్రదూష్‌ను అప్రూవర్‌గా విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రదూష్ నోరు విప్పితే..అప్రూవర్‌గా మారిన ప్రదూష్ ఎస్. రావు సాక్ష్యం ఈ కేసులో కీలకం కానుంది. దర్శన్, పవిత్ర గౌడకు వ్యతిరేకంగా ఆయన సాక్ష్యం ఇస్తే వారికి మరిన్ని ఇబ్బందులు తప్పవు. దీంతో అతడు ఏమి చెబుతాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, రేణుకాస్వామి హత్య జరిగినప్పుడు తాను ఘటనా స్థలంలో ఉన్నట్టు ప్రదూష్ ఇప్పటికే వాంగూల్మం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.ఇదీ చదవండి: కులం కన్నా కారణం ముఖ్యంచిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ప్రధాన నిందితురాలు కాగా, దర్శన్ రెండో నిందితుడిగా ఉన్నారు. 2024, జూన్ 8న కామాక్షిపాళ్యంలో రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. పవిత్ర గౌడ ఆదేశాలకు మేరకు దర్శన్, అతడి అనుచరులు.. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా చంపినట్టు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ బెంగళూరు జైల్లో ఉన్నారు. ఇదీ చదవండి: కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్ -
ఫోజు కొడితే తాట తీస్తా..
బెంగళూరు: భూ వివాదానికి సంబంధించి జరిగిన గొడవలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులతో దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా మీడియా ముందు ఫోజు కొడితే తాట తీస్తా.. ఈడియట్స్ అంటూ చిందులు తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. దొడ్డ తాలూకా గజ్జగదహళ్లిలో భూ వివాదం నేపథ్యంలో గొడవ జరిగింది. బాధితులు న్యాయం కోసం దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో సీఐ నవీన్ కుమార్ బెదిరించడం వివాదాస్పందగా మారింది. -
పోకిరీ వేధింపులకు.. వివాహిత బలి
కర్ణాటక: మొబైల్‌ఫోన్ కొందరి చేతుల్లో వినాశకరంగా మారుతోంది. ఇట్టే నేరాలకు పాల్పడుతూ ఇతరుల కుటుంబాలను నాశనం చేస్తున్నారు. జిల్లాలోని హుణసూరు తాలూకాలోని లక్కనకొప్పలు గ్రామంలో ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంత, ఎం.ఆర్.సంధ్య భార్యాభర్తలు, కూలిపనులు చేసుకుంటూ జీవించేవారు. వికాస్ అనే గ్రామస్తుడు ఆమె ఫోటోలను సేకరించి అసభ్యంగా తయారుచేసి బ్లాక్మెయిల్ చేశాడని చెబుతున్నారు. మొబైల్ ద్వారా అశ్లీల సందేశాలను పంపేవాడు. అతని వేధింపులను భరించలేక సంధ్య పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు బిళికెరె పోలీసులు వికాస్, కుమార్, వసంత్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వికాస్ పరారు కావడంతో గాలిస్తున్నారు. నిందితున్ని అరెస్టు చేసేంతవరకు పోస్టుమార్టంకు ఒప్పుకునేది లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. -
కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్యే రాజీనామా
బెంగళూరు: కర్ణాటకలో అధికార పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసంతృప్తి కారణంగా ఎమ్మెల్యే యశ్వంత్ రాయగౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం, అసెంబ్లీ స్పీకర్ జీఎస్ పాటిల్‌కు తన రాజీనామా లేఖ పంపించారు. దీంతో, ఆయన రాజీనామా అంశంపై పొలిటికల్ చర్చ మొదలైంది.కాగా, విజయపుర జిల్లా ఇండీ నియోజకవర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఇండీ తాలూకా 2026-27 ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోందని పాటిల్ తన లేఖలో పేర్కొన్నారు. సీజన్ ప్రారంభంలో కొంత వర్షం పడటంతో రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలు సాగు చేశారని.. ఆ తర్వాత సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయని తెలిపారు. ప్రజలు, పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడిందని వివరించారు.ఇండీని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆగస్టు 28న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని పాటిల్ ఆరోపించారు. విజయపుర జిల్లాలో మొత్తం 13 తాలూకాల్లో 11 ఇప్పటికే కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా.. ఇండీ, చడచన్ మాత్రమే మిగిలిపోయాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 188 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.‘ఒత్తిడి తెచ్చేవారికే ప్రాధాన్యం’అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు తన డిమాండ్లను సంయమనంతోనే వినిపించానని పాటిల్ తెలిపారు. అయితే తన అభిప్రాయాలు, నియోజకవర్గ ప్రజల సమస్యలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రభావవంతమైన వ్యక్తులు, ఒత్తిడి తెచ్చేవారికే ప్రాధాన్యం లభిస్తోందని.. తనలాంటి సౌమ్యంగా వ్యవహరించే నేతల న్యాయమైన డిమాండ్లను కూడా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్నందునే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.రెండోసారి రాజీనామా.. ఇదిలా ఉండగా.. పాటిల్ రాజీనామా చేయడం ఇది రెండోసారి. ఆగస్టు 3న డీకే శివకుమార్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో అప్పట్లోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యంతో ఆ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. తాజాగా తన నియోజకవర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించకపోవడాన్ని కారణంగా చూపుతూ మరోసారి రాజీనామా చేయడం కర్ణాటక కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: యూపీని నాలుగు భాగాలుగా చేస్తాం.. -
షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. భార్య, కొడుకు మిస్సింగ్!
యూఏఈలో జరిగిన ఘోరం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా.. భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్గా అక్కడి అధికారులు నిర్దారించారు.ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్ .. గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఫోన్ చేశారు. అల్విన్ కాల్ ఎత్తకపోగా.. తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్ పంపారు. సాధారణంగా వాయిస్ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్ ఇలా టెక్స్ట్ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.అల్విన్ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి వాచ్‌మన్.. ఆయన భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్ఆర్ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించారు. అల్విన్ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.రెండు నెలల తర్వాత.. ఒమన్ వైపు వెళ్లే మార్గంలో పార్క్ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.భార్య, కుమారుడు ఎక్కడ?అల్విన్ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ.. దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఉడుపి పోలీసుల దృష్టికి..అల్విన్ సోదరుడు అనిల్, ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.విదేశాల్లో భారతీయుల విషాదం..ఉపాధి, మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు అనుకోని ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలతో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అల్విన్ కుందర్ విషయంలోనూ అసలు ఏం జరిగింది? ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? కుటుంబ సభ్యుల ఆందోళనలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? అనేది దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పేంత తప్పు ఆ ఎమ్మెల్యే కూతురు చేసిందా? -
దసరాపై మాతో మాట్లాడరా?
కర్ణాటక: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, మైసూరు రాజ కుటుంబానికి మధ్య యుద్ధం మొదలైంది. దసరా సంబరాల గురించి ప్రభుత్వం తమకేమీ చెప్పడం లేదని రాజ వంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్ ఆరోపించారు. ఆమె సోమవారం మైసూరు ప్యాలెస్ రాజభవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరువు పరిస్థితుల్లో కూడా మైసూరు దసరాను ఘనంగా నిర్వహించాలని, మంచి వర్షాలు కురుస్తాయని, దేశానికి మేలు జరుగుతుందని ఆశిస్తూ దసరాను జరుపుకుందామని అన్నారు. మంగళూరుకు చెందిన కంబళ పోటీలను మైసూరు ఉత్సవాలలో ప్రత్యేకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం సంప్రదించి ఉంటే, నేను నా అభిప్రాయాన్ని తెలియజేసేదాన్ని అని ఆమె అన్నారు. బంగారు గిడ్డంగి చోరీ కాలేదు రాజ కుటుంబం బంగారు గిడ్డంగిలో చోరీ జరిగిందన్నది అబద్ధం, బంగారు గిడ్డంగి సురక్షితంగా ఉంది అని ప్రమోదాదేవి తెలిపారు. బంగారు గిడ్డంగిని నేనే స్వయంగా మూసివేశానని, కొందరు వదంతులను వ్యాప్తి చేయడంతో తానే ఇలా చేశానని చెప్పారు. మైసూరు ప్యాలెస్‌లో ఘనంగా దసరా వేడుకలు జరుగుతాయన్నారు. అక్టోబర్ 5న రత్నఖచిత సింహాసన ప్రతిష్ఠాపన జరుగుతుందని వివరాలను తెలిపారు. చాముండి కొండపై భవనాలు పెరిగి ఆ కొండ ఒక పట్టణంలా మారుతోందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. -
‘లంచం ఇవ్వడం ధర్మమే’.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలతో సభలోనే రచ్చ!
బెంగళూరు: ప్రభుత్వ కార్యాలయంలో పని చేయించుకోవాలంటే అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిందేనా? విధులు నిర్వర్తించినందుకు ‘టిప్’ పేరుతో అధికారులకు నగదు ఇవ్వడం తప్పుకాదా? కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేఎం శివలింగే గౌడ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రశ్నలనే తెరపైకి తెచ్చాయి. అధికారులు సకాలంలో ప్రజల పనులు పూర్తి చేస్తే వారికి ‘టిప్’ లేదా ‘గౌరవ ధనం’ ఇవ్వడంలో తప్పేమీ లేదన్నట్లుగా మంత్రి మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. మంత్రి మాటలపై ప్రజలు కార్యక్రమంలోనే అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు వాగ్వాద వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హాసన్ జిల్లాలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో మంత్రి శివలింగే గౌడ అధికారుల పనితీరుపై మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేస్తే వారికి ‘టిప్’ ఇవ్వడంలో తప్పేమీ లేదన్న భావన వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ‘అధికారులు ప్రజల పని చేస్తే వారికి లంచం ఇవ్వడం ధర్మమే’ అన్నట్లుగా మంత్రి మాట్లాడినట్లు వీడియోలో వినిపిస్తోంది. మంత్రి వ్యాఖ్యలపై అక్కడే ఉన్న ఓ వ్యక్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు తమ విధులను నిర్వర్తించేందుకు ప్రజలు ఎందుకు లంచం ఇవ్వాలని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు లంచాలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరికొందరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రి తన వ్యాఖ్యలను వివరిస్తూ వివరణ ఇచ్చారు.అధికారులు ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదన్నదే తన ఉద్దేశమని మంత్రి చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారులను గౌరవించాలనే ఉద్దేశంతోనే ‘టిప్’ గురించి ప్రస్తావించానని, తాను లంచాలను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రతరం కాకుండా హాసన్ డిప్యూటీ కమిషనర్ కేఎస్ లతా కుమారి జోక్యం చేసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.“Giving money to officials respectfully is a duty” - Karnataka Minister K.M. Shivalinge Gowda’s remark on citizens paying bribes to government officials triggers public outrage.Congress ruled India for decades, during which corruption became deeply entrenched.#Congress_Exposed pic.twitter.com/xeEghu15eK— Sanatan Prabhat (Kannada) (@Sanatan_Prabhat) September 20, 2026బీజేపీకి రాజకీయ అస్త్రం..మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాల వ్యవహారం ఏ స్థాయిలో ఉందో మంత్రి మాటలే బయటపెట్టాయని ఆరోపించింది. సాధారణ ప్రజల జేబుల నుంచి డబ్బులు తీసుకోవడాన్ని సమర్థించే ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని విమర్శించింది. బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి కూడా మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. లంచంగా కనీసం రూ.10 అడిగినా తనకు ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అదే ప్రభుత్వానికి చెందిన మంత్రి ఇప్పుడు అధికారులకు ‘గౌరవంగా లంచం ఇవ్వండి’ అన్నట్లుగా మాట్లాడటం విరుద్ధంగా ఉంది. లంచం ఇవ్వడం లేదా తీసుకోవడం మీకు సహజంగా అనిపించవచ్చు.. కానీ కర్ణాటక ప్రజలకు కాదు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: సర్ పేరుతో 7.8 కోట్ల ఓట్ల గల్లంతు -
ఈ చాక్లెట్ తీసుకుని ఆమెకు ఇవ్వు.. భారీ ట్రాఫిక్‌లో వీడియో వైరల్
బెంగళూరులో రద్దీగా ఉన్న రహదారిపై ఓ మహిళా బైకర్ చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్‌లో ఆటో నడుపుతున్న మరో మహిళను గమనించిన బైకర్ అలీషా అన్సారీ.. ఆమెకు చాక్లెట్ పంపించి, ఆమె శ్రమను అభినందించారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలవచ్చని చెప్పేలా ఈ ఘటన నిలిచింది.అలీషా తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. భారీ ట్రాఫిక్ మధ్య బైక్‌పై వెళ్తున్న ఆమెకు సమీపంలో ఓ మహిళ ఆటో నడుపుతూ కనిపించారు. వెంటనే తన బైక్‌పై ఉన్న బ్యాగ్ నుంచి ఓ చాక్లెట్‌ను తీసుకున్నారు.ఆ చాక్లెట్‌ను నేరుగా ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనదారుడి సాయాన్ని అలీషా కోరారు. అతను చాక్లెట్‌ను తీసుకుని ఆటోలో ఉన్న మహిళకు అందించారు. తన చిన్న బహుమతి ఆమెకు చేరిందని నిర్ధారించుకున్న తర్వాత అలీషా బొటనవేలు పైకెత్తి అభినందనలు తెలిపారు.అనంతరం కెమెరా వైపు తిరిగిన అలీషా.. కష్టమైన పనులను ఎంచుకుని తమ పిల్లలు, కుటుంబాలు, తల్లిదండ్రుల కోసం శ్రమించే మహిళల గురించి మాట్లాడారు. ఈ వీడియోకు “మహిళలైనా, పురుషులైనా.. ప్రతి ఒక్కరి శ్రమ ప్రత్యేకమే” అన్నారు.సాధారణంగా బెంగళూరు ట్రాఫిక్ అంటే హారన్లు, తొందరపాటు, అసహనం కనిపించే పరిస్థితి. అలాంటి రద్దీలో ఇద్దరు అపరిచిత మహిళల మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన నెటిజన్లను ఆకట్టుకుంది. పెద్ద బహుమతి కాకపోయినా, ఎదుటివారి కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించడం ముఖ్యమని పలువురు స్పందించారు. ఈ వీడియోకు వచ్చిన స్పందనలు.. గజిబిజి జీవితంలో చిన్నపాటి దయ, పరస్పర ప్రోత్సాహం కూడా ఇతరులపై సానుకూల ప్రభావం చూపగలదనే విషయాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. View this post on Instagram A post shared by Alisha Ansari | Fitness & rider influencer | Bangalore (@dimple_with_dumbbell) -
ముగ్గురు పిల్లల తల్లి.. నాగరాజుతో అక్రమ సంబంధం!
అనైతిక బంధాలు, కాపురాల్లో కోపావేశాలకు విలువైన ప్రాణాలు బలవుతున్నాయి. దారితప్పి చివరకు రక్తపాతంతో ముగుస్తున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు కన్నీరే మిగులుతోంది. ఈ పెడపోకడలు సామాజిక సమస్యగా పరిణమించాయి.కర్ణాటక: ముగ్గురు పిల్లల తల్లిని ఆమె ప్రియుడే గొంతుకోసి హతమార్చిన సంఘటన దావణగెరె సిటీ శేఖరప్ప నగరలో జరిగింది. నాగరత్న(45)ను నాగరాజు (36) హత్య చేశాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగరాజుతో అక్రమ సంబంధం సాగుతోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడ్డ నాగరాజు కత్తితో హత్య చేశాడు. నాగరత్న ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని పరారవుతున్న నాగరాజును పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.ప్రియురాలి చేతిలో ప్రియుడు హతం దొడ్డబళ్లాపురం: ప్రియురాలి చేతిలో ప్రియుడు హత్యకు గురైన సంఘటన దావణగెరెలోని కేశవమూర్తి కాలనీలో జరిగింది. మంజప్ప (40)ను, ప్రేయసి షబీనా (38) చీరతో గొంతు బిగించి ప్రాణాలు తీసింది. మంజప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా విడాకులు తీసుకుని షబీనాతో జీవిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో ఆమె ఏకంగా హత్య చేసింది. పోలీసులు నిందితురాలిని నిర్బంధించారు.భార్యను కడతేర్చి.. తానూ ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పట్టణంలోని ఒక లాడ్జిలో భార్యను హత్య చేసి పరారైన కసాయి భర్త చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డ రూరల్ ఠాణా దగ్గర లాడ్జిలో భార్య విద్య (21)ను ఆమె ఐడెంటిటీ కార్డ్ ట్యాగ్‌తో గొంతు బిగించి హత్య చేసి పరారైన భర్త ఆనంద్ నాలుగు రోజుల నుంచి జాడ లేడు. సొంతూరైన గౌరిబిదనూరు తాలూకా ముదుగెరె చెరువు వద్ద మద్యం తాగి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. బైక్, 2 మొబైళ్లు తదితరాలు అక్కడ ఉన్నాయి. గౌరిబిదనూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసింది బనశంకరి: కుటుంబ కలహాలతో కోపోద్రిక్తురాలైన మహిళ ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసిన ఘటన మంగళూరు వద్ద ఉప్పినంగడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఒకరు మృతిచెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. సినాన్, నూరున్నీషా దంపతుల మధ్య ఫోన్‌కాల్ గురించి రగడ మొదలైంది. నూరున్నీషా కోపం పట్టలేక తన మూడేళ్ల కుమారుడు, భర్త చెల్లెలి మూడేళ్లు కొడుకుని తీసుకెళ్లి ఇంటి వద్దనున్న బావిలోకి పడేసింది. స్థానికులు చూసి పిల్లలను బయటకు తీశారు. భర్త చెల్లి కుమారుడు చనిపోగా, సొంత కొడుకు తీవ్ర అస్వస్థత పాలయ్యాడు. అతనిని మంగళూరు ఆస్పత్రిలో చేరి్పంచారు. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. -
తల్లిని చంపి.. మృతదేహంపై బిడ్డను వదిలేశారు
రాయచూరు రూరల్: కర్ణాటకలో అత్యంత హృదయ విదారకమైన ఘోరం వెలుగుచూసింది. పొలంలో ఓ వివాహిత హత్యకు గురికాగా మృతదేహంపై చిన్నారి విలపిస్తోంది. తన తల్లి ఎందుకు అలా పడి ఉందో తెలియక, పాల కోసం రోదిస్తూ ఉంది. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో ఆర్‌హెచ్ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని స్నేహ అమిత్ (26)గా గుర్తించారు. ఏడాదిన్నర కుమార్తె మేఘనను మృతదేహంపై పడుకోబెట్టి హంతకులు పరారయ్యారు. బాలిక ఏడుపుతో హత్య వెలుగులోకి వచ్చింది. స్నేహ తల, గొంతులో కత్తితో పొడిచి చంపినట్లు ఆనవాళ్లున్నాయి. సింధనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ వినాయక్, డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ ఘటనాస్థలిని పరిశీలించారు. స్నేహకు అమిత్ అనే యువకుడితో 3 ఏళ్ల కిందట పెళ్లయినట్లు తెలుస్తోంది. అమిత్‌తో పాటు ఆమె స్నేహితుడు శుభం అనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఉత్తరాది నుంచి కూలి పనుల కోసం వలస వచ్చారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
180 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు నోటీసులు
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్ జిల్లాలో 7వ తరగతి విద్యార్థుల ప్రాథమిక అభ్యసన స్థాయిపై నిర్వహించిన పరీక్షల్లో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. కొంతమంది విద్యార్థులకు సాధారణ కన్నడ అక్షరాలు రాయడం, కూడికలు, తీసివేతలు చేయడం కూడా కష్టంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో 180 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది 7వ తరగతి విద్యార్థులు సాధారణ గణిత సమస్యలను పరిష్కరించలేకపోవడం, కన్నడ అక్షరాలను రాయలేకపోవడం ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై సెప్టెంబర్ 4న విద్యాశాఖ అధికారులకు లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరారు.ఆ తర్వాత చిక్కబళ్లాపుర్ తాలూకాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో 7వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని విద్యా సమన్వయకర్తలు, బ్లాక్ రిసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ పరీక్షించారు. ఆశించిన కనీస అభ్యసన స్థాయికి చాలా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి పేర్లతో పాటు గత తరగతుల్లో వారికి బోధించిన ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖకు అందించారు.సెప్టెంబర్ 15న చిక్కబళ్లాపుర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఉపాధ్యాయులకు నోటీసులు జారీ అయ్యాయి. విద్యార్థులు ఆశించిన ప్రాథమిక అభ్యసన స్థాయిని ఎందుకు చేరుకోలేకపోయారో వివరణ ఇవ్వాలని అందులో కోరారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లో ఆధారాలతో కూడిన లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. సమాధానాలను పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వం విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, నిర్ణీత సమయంలో అవసరమైన విద్యను అందించడంలో విఫలమైతే ఆ కార్యక్రమాల లక్ష్యాలు దెబ్బతింటాయని విద్యాశాఖ నోటీసులో పేర్కొంది. ఉపాధ్యాయుల వివరణల పరిశీలన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. -
అమిత్ షాకు అస్వస్థత.. హోటల్లోనే చికిత్స!
బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అస్వస్థకు గురయ్యారు. ఈ రోజు ( శనివారం) ఉదయం ఆయన అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారు. అమిత్‌షా రాక కోసం ప్రజలంతా ఎదురుచూస్తుండగా ఆయన అస్వస్థకు గురయ్యారని కార్యక్రమానికి హాజరుకాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు.కర్ణాటక హుబ్లీలో కేఎల్ఈ ఆసుపత్రి, మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ని ఈ రోజు శనివారం అమిత్‌షా ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కర్ణాటకాకు అమిత్‌షా చేరుకుని హోటలలో బస చేశారు. అయితే ఈ రోజు 11 గంటలకు ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. దీంతో ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో పాటు కళాశాల సిబ్బంది ఆయన రాక కోసం వేచి చూశారు. ఈ నేపథ్యంతో ఆయన అస్వస్థకు గురయ్యారని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు.అస్వస్థతకు గురై హోటల్లోనే వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నాడని వర్గాలు తెలిపాయి. అమిత్‌షా అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ఎంపీలు బసవరాజ్ బొమ్మై, ఇరన్న కడాడి, మాజీ మంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యేలు సీసీ పాటిల్ తదితరులు ఆయనను పరామర్శించారు. -
వెంటాడి కొడవలి, యాసిడ్‌తో దాడి.. నర్సుపై ఘాతుకం
బెంగళూరులోని జేపీ నగర్ 3వ దశలో గురువారం ఉదయం 26 ఏళ్ల ఓ నర్సుపై ఆమె భర్త దాడికి పాల్పడ్డాడు. దంపతుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపారు. బాధితురాలిని మధుమితగా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఆమె గత ఏడాదిన్నరగా అక్కడి ఓ ప్రైవేటు క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 9.15 గంటల సమయంలో మధుమిత అల్పాహారం కోసం క్లినిక్ నుంచి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆమె భర్త వెంకటేశన్ ఆమెను వెంబడిస్తూ క్లినిక్ ఉన్న బహుళ అంతస్తుల భవనం దిగువ అంతస్తులోని పార్కింగ్ ప్రాంతానికి చేరుకున్నాడు. తమిళనాడుకు చెందిన వెంకటేశన్ ద్విచక్రవాహనంపై కత్తి, కొడవలి, యాసిడ్ తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.పార్కింగ్ ప్రాంతంలో మధుమితపై వెంకటేశన్ కొడవలితో దాడి చేసి, అనంతరం ఆమెపై యాసిడ్ పోశాడని పోలీసులు చెప్పారు. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో క్లినిక్ సిబ్బంది, స్థానికులు ఆమెను కాపాడేందుకు అక్కడికి చేరుకున్నారు. కొందరు వ్యక్తులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపైనా అతడు దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.ఇంతలో సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఘటనను గుర్తించారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వెంకటేశన్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మధుమిత ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఘటనపై జేపీ నగర్ పోలీసులు స్థలాన్ని పరిశీలించి వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అతడిని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. -
సిద్ధరామయ్యకు ఇంతటి అవమానమా?
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఘోర అవమానం.. అదీ ఉద్దేశపూర్వకంగానే జరిగిందా?. కన్నడ నాట ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కలబురగిలోని సిద్ధరామయ్య సర్కిల్లో ఉన్న విగ్రహ తొలగింపు.. ఆయన వర్గీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలబురగి పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆసక్తి రేపుతోంది.ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇవాళ కలబురగిలో పర్యటించాల్సి ఉంది. కల్యాణ కర్ణాటక ఉత్సవాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే.. ఈ ఉదయం అక్కడి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంస్య విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే సిద్దూ అభిమానుల నుంచి విమర్శలు రావడంతో.. డీకే పర్యటనకు, విగ్రహ తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టారని వివరణ ఇచ్చారు. అలాగే ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ట్విస్ట్‌ను బయటపెట్టారు.A Siddaramaiah statue has appeared overnight near High Court Cross in Kalaburagi, at a spot that had earlier been turned into a Siddaramaiah Circle.The installation was allegedly carried out without permission, though the district administration is yet to clarify what action,… pic.twitter.com/UeVQW2fV1M— Deccan Herald (@DeccanHerald) September 17, 2026మూడేళ్ల కిందట ఈ సర్కిల్‌కు కొందరు స్థానికులు సిద్ధరామయ్య అని పేరు పెట్టారు. అయితే అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు అంటున్నారు. అంతేకాదు.. తాము తొలగించిన విగ్రహం కూడా గత రాత్రే ఏర్పాటు చేశారని.. దానికి కూడా పర్మిషన్ లేదని చెబుతున్నారు. ‘‘దాదాపు ఏడేనిమిది మంది వ్యక్తులు అర్ధరాత్రివేళ విగ్రహాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. విగ్రహం చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లుగా ఉంది. వాళ్ల ఉద్దేశం ఏంటో మాకు తెలియదు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని పోలీసులను కోరాం’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాంక్రీట్ కూడా పూర్తిగా ఆరకముందే తమ సిబ్బంది అక్కడికి చేరుకుని వెంటనే విగ్రహాన్ని తొలగించినట్లు తెలిపారు.2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. చివరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున సీఎం పదవిని పంచుకుంటారనే చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఇరువురి మధ్య అధికార భాగస్వామ్యంపై చర్చలు జరిగినప్పటికీ.. అలాంటి ఒప్పందాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించలేదు. చివరకు.. తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. ఇదీ చదవండి: అధికారులపై కోపంతో ఏం చేశాడో చూడండి! -
వివాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలు.. ఏం జరిగిందంటే?
బెంగళూరు: ఓ వైపు ప్రభుత్వ అనుబంధ నమ్మ క్లినిక్‌లో డాక్టర్‌గా ఉద్యోగం.. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య! నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటూనే క్లినిక్ విధులకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు కర్ణాటకలో ఓ వైద్యురాలిని చిక్కుల్లోకి నెట్టాయి. పైగా ఆమె అధికార పార్టీకి చెందిన బాగల్కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మెటీకి మేనకోడలు కావడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టగా.. విచారణకు హాజరుకాకపోవడం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది.వివరాల ప్రకారం.. బాగల్‌కోట్‌లోని వాంబే కాలనీ నమ్మ క్లినిక్‌లో డాక్టర్ అంకిత యరగల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే మార్చి 3 నుంచి సెప్టెంబర్ వరకు ఆమె క్లినిక్‌లో విధులకు హాజరుకాలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఇంతకీ డాక్టర్ అంకిత ఎక్కడున్నారు? అనే ప్రశ్నకు అధికారుల దర్యాప్తులో.. ఆమె ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. అంటే ఒకవైపు నమ్మ క్లినిక్ మెడికల్ ఆఫీసర్‌గా జీతం.. మరోవైపు పీజీ మెడిసిన్.. ఈ రెండు బాధ్యతలను ఒకేసారి కొనసాగించారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.విచారణకు పిలిస్తే.. హాజరు కాలేదు!ఈ ఆరోపణలపై బాగల్కోట్ జిల్లా పరిషత్ సీఈవో గజానన్ బాలే విచారణ చేపట్టారు. అయితే డాక్టర్ అంకిత ఆ విచారణకు హాజరుకాలేదు. దీంతో అధికారులు సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని రూమ్ నంబర్ 11లో జరిగే ఈ విచారణకు తప్పనిసరిగా రావాలని ఆదేశించారు. ఈసారి కూడా హాజరుకాకపోతే.. ఆమె వివరణ లేకుండానే అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.కాలేజీ అనుమతి ఇచ్చినా.. క్లినిక్ సంగతేంటి?ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. డాక్టర్ అంకిత పీజీ చదువుకునేందుకు ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ అనుమతి ఉన్నప్పటికీ నమ్మ క్లినిక్‌లో తన విధులకు హాజరుకాలేదని ఆరోపిస్తున్నారు. అంటే పీజీ చదువుకునేందుకు అనుమతి ఉండటం వేరు.. అదే సమయంలో నమ్మ క్లినిక్‌లో విధులు నిర్వహించకపోయినా జీతం తీసుకోవడం వేరు అన్నది అధికారుల విచారణలో పరిశీలిస్తున్న అంశంగా కనిపిస్తోంది.రూ.70 వేల జీతం.. తిరిగి చెల్లించాల్సి వస్తుందా?అనుమతిలేని ద్వంద్వ బాధ్యతలు నిర్వహించినట్లు విచారణలో తేలితే.. ఆ కాలంలో ఆమెకు చెల్లించిన జీతం లేదా గౌరవ వేతనాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశం ఉందని అధికారులు నోటీసులో హెచ్చరించారు. అంతేకాదు.. వ్యవహారం ప్రొఫెషనల్ మిస్కండక్ట్గా తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కర్ణాటక మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కమిషన్‌కు కూడా విషయం పంపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇక జిల్లా ఆరోగ్య అధికారి రాజ్‌కుమార్ యరగల్ ఇప్పటికే డాక్టర్ అంకితను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం మొత్తం వ్యవహారం అధికారుల విచారణలో ఉంది. సెప్టెంబర్ 18న జరిగే విచారణలో డాక్టర్ అంకిత హాజరై తనపై వచ్చిన ఆరోపణలపై ఏం వివరణ ఇస్తారు? పీజీ చదువుతో పాటు నమ్మ క్లినిక్ ఉద్యోగానికి సంబంధించిన అనుమతులు, విధులు, జీతం చెల్లింపులపై ఆమె సమర్పించే వివరాలే ఇప్పుడు కీలకంగా మారాయి.ఇదీ చదవండి: బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్ తప్పదా? -
ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరమంతా గణేష్ చతుర్థి వేడుకలను జరుపు కుంటున్న వేళ బెళగావిలోని చవట్ గల్లీలోని ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడంతో సంభవించిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంగళవారం పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడు శబ్దాన్ని తొలుత అంతా దాన్ని బాణాసంచా పేలుడు అని భావించారు. రిఫ్రిజిరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం చావట్ గల్లీలోని ఒక నివాసంలో మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు వేగంగా ఇళ్లంతా వ్యాపించడంతో, అందులో ఉన్నవారు బయటకు రాలేక ఊపిరాడక, నలుగురు సజీవదహనమైపోయారు. ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నది. చనిపోయిన వారిని గజానన్ ధమోనే (65), రోషన్ ధమోనే (21), శారద ధమోనే (45), భారతి ధమోనే (50) లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ప్రియ ధమోనే (28), గంగ ధమోనే (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా అగ్ని ప్రమాదం వల్ల పేలుడు సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నమని. క పోలీసు అధికారి తెలిపారు.గణేష్ విగ్రహానికి విద్యుత్ దీపాలను కూడా అమర్చారు, కాబట్టి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నాన్నారు. తాము కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంటి యజమాని గజానన్ వడ్రంగిగా పనిచేసేవారు, మిగిలిన వారు ఇంటి పనులు లేదా వాణిజ్య సంస్థలలో పనిచేసేవారు.ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలు -
బెంగళూరుపై పెరుగుతున్న విమర్శలు.. డీకే సంచలన నిర్ణయం!
ఇటీవలి కాలంలో బెంగళూరు పేరు చెబితే ఐటీతో పాటు ట్రాఫిక్ కూడా గుర్తొస్తోంది. దేశ ఐటీ రాజధానిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం.. ఇప్పుడు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, ఖరీదైన ఇళ్లు, మౌలిక వసతులపై ఒత్తిడితో సతమతమవుతోంది. బెంగళూరు ఎంత వేగంగా ఎదిగిందో.. దాని సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇక నగరంపై మరింత భారం మోపితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండటంతో.. కర్ణాటక ప్రభుత్వం కొత్త దారిని ఎంచుకుంటోంది. బెంగళూరును మాత్రమే విస్తరించడం కాకుండా.. రాష్ట్రంలోని మరో ఆరు నగరాలను కూడా ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలకు కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం డీకే శివకుమార్ సర్కార్ భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది.కర్ణాటక అభివృద్ధి అంటే బెంగళూరు.. బెంగళూరు అంటే ఐటీ, స్టార్టప్‌లు, గ్లోబల్ కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలు. దశాబ్దాలుగా ఈ సమీకరణమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలిచింది. కానీ అదే విజయంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. సుమారు 1.25 కోట్ల జనాభా, 1.15 కోట్లకు పైగా వాహనాలు నగరం ఎదుర్కొంటున్న భారాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఉద్యోగాలు బెంగళూరులోనే కేంద్రీకృతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వలసలు పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్, నివాస వ్యయం, ప్రజా రవాణా, మౌలిక వసతులపై ఒత్తిడి మరింత తీవ్రమవుతోంది.ఈ సమస్యకు డీకేఎస్ ప్రభుత్వం చూపిస్తున్న పరిష్కారం.. బెంగళూరును తగ్గించడం కాదు.. బెంగళూరు వెలుపల అవకాశాలను పెంచడం. ఇటీవల 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా డీకే శివకుమార్ ఇదే దిశలో తన ఆలోచనను స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కథ కేవలం రాజధాని చుట్టూనే తిరగకూడదని పేర్కొంటూ.. ‘బియాండ్ బెంగళూరు’ వ్యూహానికి మరింత ఊపు ఇచ్చారు. ఈ ప్రణాళికలో మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి, తుమకూరు, కలబురగి, శివమొగ్గ కీలకంగా మారనున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఐటీ, తయారీ, ఏఐ, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి.. అక్కడే ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.మైసూరుపై భారీ ఆశలుబెంగళూరుకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరును కర్ణాటకలో రెండో ప్రధాన ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విద్య, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో ఉన్న బలాన్ని ఉపయోగించుకుని మరిన్ని కంపెనీలను ఆకర్షించాలన్నది ప్రణాళిక. 2030 నాటికి మైసూరు నుంచి 10 బిలియన్ డాలర్ల డిజిటల్ ఆదాయం, కనీసం 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.మంగళూరుకు మరో గుర్తింపుతీర ప్రాంతానికి కీలక నగరమైన మంగళూరుకు పోర్టు, విద్య, వైద్యం, బ్యాంకింగ్, మత్స్య పరిశ్రమ, పర్యాటకం వంటి రంగాల్లో ఇప్పటికే బలమైన పునాది ఉంది. దీనికి టెక్నాలజీ, డేటా సెంటర్లు, డిజిటల్ ఎకానమీని జోడించి కొత్త పెట్టుబడులను తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. అంటే తీర ప్రాంత యువత ఉద్యోగాల కోసం తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించాలన్నమాట.ఉత్తర కర్ణాటకకు టెక్నాలజీ బూస్ట్హుబ్బళ్లి-ధార్వాడ్-బెలగావి ప్రాంతాన్ని ఇంజినీరింగ్, తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ సంబంధిత రంగాలు, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న స్టార్టప్ వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి ఉత్తర కర్ణాటకలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించాలన్నది లక్ష్యం. తూమకూరు, దొడ్డబళ్లాపురంను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చూస్తుండగా.. చారిత్రకంగా వెనుకబడిన కల్యాణ కర్ణాటక ప్రాంతంలో టెక్నాలజీ, పరిశ్రమల పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెట్టారు. కలబురగి, బెలగావి, హుబ్బళ్లి-ధార్వాడ్, మంగళూరు, మైసూరులో ఐదు గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ల ప్రతిపాదన కూడా ఉంది.అయితే ఇక్కడే అసలు సవాల్ ఉంది. ప్రాజెక్టులకు ఆమోదం లభించడం ఒక ఎత్తయితే.. అవి వాస్తవంగా ఏర్పాటై ఉద్యోగాలు కల్పించడం మరో ఎత్తు. గత ‘బియాండ్ బెంగళూరు’ కార్యక్రమంలో 2021-22 నుంచి 2024-25 మధ్య మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్ క్లస్టర్లలో దాదాపు 5,600 ఉద్యోగాలే వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లక్ష్యాలు దీనితో పోలిస్తే చాలా పెద్దవి. బెంగళూరు కర్ణాటకకు కిరీటం అయితే.. ఆ కిరీటం భారాన్ని మోయడానికి మరిన్ని నగరాలను సిద్ధం చేయాలన్నదే డీకేఎస్ సర్కార్ కొత్త వ్యూహం.ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మాజీ సీఎం రాజీనామా -
ది టెంపుల్ గర్ల్
అమెజాన్, జె.పి. మోర్గాన్ వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీలలో అద్భుతమైన కార్పొరేట్ కెరీర్.. చేతినిండా జీతం, సమాజంలో ఉన్నతమైన హోదా. ఎవరికైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. కానీ ఆమెకు ఇవేవీ సంతృప్తినివ్వలేదు. కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన ఆలయాల చరిత్రను, ఆ కథలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. అయితే సమాజం, తన తోటి వారు హేళన చేసినా లెక్కచేయకుండా ముందుకు సాగారు. తక్కువ టైమ్‌లోనే ‘ది టెంపుల్ గర్ల్’గా పేరు తెచ్చుకున్నారు. అంతకుమించి లక్షలాది మంది మనసుదోచుకున్నారు. ఆమే నమ్రతా మోహన్.కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నమ్రతా మోహన్‌కు కార్పొరేట్ రంగంలో దాదాపు పద్నాలుగేళ్ల అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, వాల్ట్ డిస్నీ వంటి అగ్రశ్రేణి మల్టీ నేషనల్ కంపెనీలలో నమ్రత కీలక బాధ్యతలు నిర్వహించారు. అమెజాన్ సంస్థలో అత్యున్నత హోదాలో పనిచేశారు. అలా కెరీర్ పరంగా నమ్రత ఎంతో విజయవంతమైనప్పటికీ, తన మనసులో ఎక్కడో ఏదో వెలితి ఉండేది. దాంతో ఎంతోమంది కలలుగనే కొలువునుంచి బైటికి వచ్చారు. దేవాలయాలను సందర్శించినపుడు తనకు కలిగిన సంతృప్తి, పరిపూర్ణత ఆమెకు ఆనందాన్నిచ్చాయి. అలా పెళ్లయిన తర్వాత తన భర్తతో కలిసి చేసిన పవిత్ర చార్ ధామ్ యాత్ర నమ్రత జీవితాన్ని మలుపు తిప్పింది. 12 ఏళ్లుగా తన భర్త సహకారంతో భారతదేశంలోని వందలాది పురాతన ఆలయాలను సందర్శించారు. అయితే, ఆ ఆలయాల వెనుక ఉన్న అసలైన చరిత్ర, శిల్పకళా చాతుర్యం, ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత సాధారణ ప్రజలకు చేరడం లేదని ఆమె గ్రహించారు. దానివల్ల నేటి తరానికి ఆలయాలకు మధ్య దూరం పెరుగుతోందని భావించి.. ఆ గ్యాప్‌ని తగ్గించడమే ధ్యేయంగా గతేడాది మే నెలలో ఆమె చేస్తున్న అమెజాన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తిగా ఆలయాల చరిత్రను, కథలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు. -
జాతీయ టోర్నీలో సత్తా చాటిన నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన గణగామ నైశిక్ రెడ్డి సత్తా చాటాడు. డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ప్రబీర్ చావ్డాతో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ ఓగేష్ జయప్రకాశ్–సూరజ్ ప్రబోధ్ జోడీ చేతిలో 3–6, 0–6తో నైశిక్–ప్రబీర్ జోడీ ఓటమి పాలయ్యింది. అంతకముందు సెమీఫైనల్లోఈ జంట 6–2, 6–1తో ఆయుష్ శర్మ–ఆదిత్య మోర్ జోడీపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇక ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రబీర్ చావ్డా-నైశిక్‌రెడ్డి జోడీ 7–5, 6–2తో సోమ సుహాస్–కౌశిక్ అరుణ్‌కుమార్ జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.నైశిక్ రెడ్డి ప్రస్తుతం సురేష్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. మాజీ ఒలింపియన్, డేవిస్ కప్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ మార్గదర్శకత్వంలో తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. బెలగావి టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలవడం ద్వారా నైశిక్ మరోసారి తన సత్తాను చాటాడు.Read: 'అతడో క్రికెట్ పిచ్చోడు; ద్రవిడ్ యజమానిలా ఫీలవుతున్నాడు' -
‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’
బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ వంటివి) దాడులకు సిద్ధంగా ఉండాలని తమ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు. ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులను డీకే శివకుమార్ ‘‘లక్ష్యంగా చేసుకున్నవి’’, ‘‘రాజకీయ ప్రేరేపితమైనవి’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 100 శాతం అండగా ఉంటాయని చెప్పారు.సతీశ్ జార్కిహోళిపై దాడులు జరుగుతాయని ముందే ఊహించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయవచ్చని నా మంత్రులు, ఎమ్మెల్యేలను సిద్ధంగా ఉండాలని హెచ్చరించాను. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు జరుగుతాయని నేను భావిస్తున్నాను? దర్యాప్తునకు మేము భయపడము. అయితే తప్పుడు ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.బీజేపీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దాడులు చేయడం లేదని శివకుమార్ ప్రశ్నించారు. ‘‘భోవి డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం లేదా బీజేపీ నేతలు ప్రమేయం ఉన్న ఇతర కుంభకోణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.దృష్టి మళ్లించేందుకేసెప్టెంబర్ 10న తమ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఈ దాడులు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించేందుకే దాడులను స్పష్టంగా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించారు అని ఆయన అన్నారు.‘‘మా పార్టీ, ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి లక్ష్యంగా చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం సాధించిన విజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు జరిగాయి’’ అని ఆయన అన్నారు. సతీశ్ జార్కిహోళి కుటుంబ సభ్యులు, సహచరుల విషయంలో తాను హామీ ఇవ్వలేనని శివకుమార్ తెలిపారు. అయితే జార్కిహోళి నిజాయితీగల వ్యక్తి అని తనకు నమ్మకం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు ఆయన తనను తాను సమర్థించుకుంటారని చెప్పారు.‘‘ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. అవి విదేశాల్లో ఉన్నా కూడా అది చట్టవిరుద్ధం కాదు. ఆయన తగిన పత్రాలను సమర్పించి తనను తాను సమర్థించుకుంటారు’’ అని శివకుమార్ అన్నారు. -
'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
నకిలీ ఓట్లను, చొరబాటుదారులను ఏరివేసి పేరుతో భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR - ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర వివాదాలకు దారితీసింది. ఒక్కో రోజు ఒక్కో వింత సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారత రత్న గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు Chintamani Nagesa Ramachandra Rao (92)కు కర్ణాటక SIR నుంచి నోటీసు అందింది. ఓటర్ల జాబితాలో ఆయన పేరు వద్ద నమోదైన అక్షర దోషం (Spelling Discrepancy) కారణంగా ఈ నోటీసు జారీ కావడంపలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. "Self-name mismatch" (పేరు వ్యత్యాసం) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో (2002) వివరాలకు, ప్రస్తుత ఓటర్ల జాబితా వివరాలకు వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ నోటీసు జారీ చేస్తారు. పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు "Prof CNR Rao" అని ఉండగా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో "Prof" స్థానంలో అదనంగా ఒక 'f' చేరి "Proff CNR Rao"గా నమోదైంది. తన గురింపును నిరూపించుకోవడానికి బెంగళూరులోని మల్లేశ్వరం వద్ద జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు.ఇదీ చదవండి: రీల్స్‌తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి!ఎవరి ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు భారత అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' పొందిన మూడో శాస్త్రవేత్త. అంతేకాదు ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాలు కూడా అందుకున్నారు. సాలిడ్-స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీలో సీఎన్ఆర్ రావు విశేష పరిశోధనలు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) అధిపతిగా, జవాహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే రాజీవ్ గాంధీ, హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లాంటి మాజీ ప్రధాన మంత్రుల హయాంలో సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడిగా, సభ్యుడిగా దేశ సైన్స్ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్ -
1993లో పిటిషన్.. 1988లోనే మరణం! హైకోర్టులో వింత కేసు
కర్ణాటక హైకోర్టులో 33 ఏళ్ల క్రితం నమోదైన భూ వివాద కేసులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి అప్పటికే ఐదేళ్ల క్రితమే మృతి చెందినట్లు కోర్టు గుర్తించింది. 1993లో సి.మరియప్ప పేరుతో రిట్ పిటిషన్ దాఖలు కాగా.. 1988 ఆగస్టులోనే మరణించినట్లు విచారణలో వెల్లడైంది. వివరాలు ఇలా.. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా బెళవాడి గ్రామంలోని 4 ఎకరాల 21 గుంటల భూమికి సంబంధించిన వివాదం ఇది. 1981లో ల్యాండ్ ట్రిబ్యునల్ సి.నింగమ్మకు భూమిపై హక్కులు కల్పించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 1993లో మరియప్ప పేరుతో కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మరియప్పకు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి ద్వారా పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు రికార్డుల్లో ఉంది. 2001లో హైకోర్టు ఆ పిటిషన్‌ను అంగీకరించి, విషయాన్ని పునఃపరిశీలించేందుకు ల్యాండ్ ట్రిబ్యునల్‌కు తిరిగి పంపింది. అనంతరం ల్యాండ్ ట్రిబ్యునల్ 2023లో ఇచ్చిన ఆదేశాలను మరియప్ప చట్టబద్ధ వారసుడు హైకోర్టులో సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది కీలక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 1993లో పిటిషన్ దాఖలు చేసే సమయానికే మరియప్ప మరణించి ఉన్నారని తెలిపారు. దీనిపై పరిశీలన జరిపిన హైకోర్టు.. ఆ వాదనలో వాస్తవం ఉందని గుర్తించింది. మరియప్ప కుమార్తె సుమలమ్మ గతంలో ల్యాండ్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్లో కూడా తన తండ్రి చాలా ఏళ్ల క్రితమే మరణించినట్లు పేర్కొన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. అయితే ఆయన మరణించిన ఖచ్చితమైన తేదీని అఫిడవిట్లో వెల్లడించలేదని పేర్కొంది. మరణించిన వ్యక్తి పేరుతో 1993లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఎలా సాధ్యమైందన్న దానిపై పిటిషనర్ తరఫు న్యాయవాది నుంచి సమర్థవంతమైన వివరణ రాలేదని న్యాయమూర్తి ఈ.ఎస్.ఇందరేశ్ అభిప్రాయపడ్డారు. మరణించిన వ్యక్తి పేరుతో అనంతరం పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: మాట వినకపోతే కాల్చి పారేస్తా -
సీఎం వచ్చారు.. కానీ, సీఎంలా కాదు! హడావుడే లేదు..
బెంగళూరు: కర్ణాటకకు సీఎం అయినప్పటికీ సీఎంలా కాకుండా, ఏ హడావుడి లేకుండా ఓ సామాన్యుడిలా మార్కెట్ అంతా కలియతిరిగి చూశారు డీకే శివకుమార్. మార్కెట్లో స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు, కూలీలతో మాట్లాడారు. సామాన్యుడిలా కాకా హోటల్లో అల్పాహారం చేసి, కూలీలతో కలిసి చాయ్ తాగుతూ గడిపారు. సీఎం అయినప్పటికీ ఆయన ఏం మారలేదంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.డీకే శివకుమార్ మంగళవారం యశ్వంత్‌పూర్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్ ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఉల్లిగడ్డ రైతులు, వ్యాపారులు, మహిళా కార్మికులతో మాట్లాడారు. మార్కెట్లో కలియతిరిగిన సీఎం.. రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ముఖ్యంగా ఉల్లిగడ్డల వ్యాపారానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన పంటను తూకం వేసే సమయంలో ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా అని కూడా ప్రశ్నించారు.ఉల్లిగడ్డలను రవాణా చేసేందుకు పెరుగుతున్న ఖర్చులు తమ ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని రైతులు శివకుమార్‌కు తెలిపారు. తమ సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ మంత్రి మార్కెట్‌కు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదులను సీఎం శ్రద్ధగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్లో పనిచేస్తున్న మహిళా కార్మికులతోనూ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.ఇటీవల ఉల్లిగడ్డ ధరలు పెరుగుతున్న సమయంలో సీఎం మార్కెట్‌ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి మార్కెట్‌కు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ಯಶವಂತಪುರದ ಎಪಿಎಂಸಿ ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ ಶ್ರಮಜೀವಿಗಳೊಂದಿಗೆ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ @DKShivakumar ಅವರ ಆತ್ಮೀಯ ಮಾತುಕತೆ. ಬೆವರಿನ ಹನಿಯನ್ನೇ ಬಂಡವಾಳವಾಗಿಸಿಕೊಂಡು, ತಮ್ಮ ಪರಿಶ್ರಮದಿಂದ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳುವ ಈ ಶ್ರಮಜೀವಿಗಳೇ ನಾಡಿನ ನಿಜವಾದ ಶಕ್ತಿ. pic.twitter.com/dUNAPI6n1D— CM of Karnataka (@CMofKarnataka) September 8, 2026 -
ఘోర రోడ్డు ప్రమాదం.. గుండె గట్టిదైతే ఈ వీడియో చూడొచ్చు..
మాండ్యా: తావరెకెరె గేట్ సమీపంలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న పికప్ ట్రక్కు.. ఓ కారును వెనుక నుంచి ఢీకొనడంతో 58 ఏళ్ల మహిళ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతురాలిని సుధా జైన్‌గా గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ఆమె బెంగళూరులో నివసిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రావణబెళగొళ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో పికప్ ట్రక్కు వేగంగా వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా కారును ఢీ కొట్టడంతో సుధా జైన్ మృతి చెందింది. జాతీయ రహదారిపై అదే సమయంలో వెళ్తున్న మరో వాహనం డ్యాష్‌బోర్డ్ కెమెరాలో ఈ ప్రమాదం నమోదైంది.గాయపడ్డవారిని చికిత్స కోసం బీజీ నగర్‌లోని ఆదిచుంచనగిరి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదం నుంచి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం పికప్ ట్రక్కు డ్రైవర్ అక్కడే వాహనాన్ని వదిలి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బెల్లూరు పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.One Dead,Four Injured in Mandya Car CollisionMandya, KarnatakaA woman was killed and four others injured in a road accident near Bellur in #Mandya district on Sunday afternoon.According to Mandya SP Dr. Shobha Rani, a Swift car carrying four occupants ,Sudha Jain, her… pic.twitter.com/alDZTDT521— Yasir Mushtaq (@path2shah) September 7, 2026 -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్
-
రాముడు, సీతా దేవి పాత్రలపై సీఎం శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: మహిళల శక్తి, త్యాగాలను ప్రస్తావిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం రామాయణంలోని సీత పాత్రను ఉదహరించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించగలరని, గ్రామ పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు నాయకత్వ స్థానాల్లోకి మహిళలు రావాలని అన్నారు.ఉబుంటు కన్సార్టియం ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘టుగెదర్ వి గ్రో-ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డే’ 5వ సంచికను ప్రారంభించిన అనంతరం శివకుమార్ మాట్లాడారు. సవాళ్లను అధిగమిస్తూ వ్యాపారాలను నిర్మించిన మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.“రామాయణంలో సీత పాత్ర శ్రీరాముడి పాత్ర కంటే ఎంతో గొప్పది. ఆమె చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలు ఆదర్శప్రాయమైనవి. మహిళలు సృష్టికర్తలు. సవాళ్లను అధిగమిస్తూ వ్యాపార సంస్థలను నిర్మించిన మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు” అని శివకుమార్ అన్నారు.ప్రభుత్వ పాలనలో ప్రతి స్థాయిలో మహిళల నాయకత్వం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలను సాధికారత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మహిళలు చాలా కాలంగా సృష్టికర్తలు, సమస్యల పరిష్కర్తలు, నిర్ణయాలు తీసుకునేవారిగా ఉన్నారని అన్నారు. “వారి సృజనాత్మకత, సామర్థ్యం, పట్టుదలకు మూలధనం, సాంకేతికత, మార్కెట్లకు ప్రాప్యత లభిస్తే వారు నిర్మించగల దానికి పరిమితి ఉండదు. వారి సామర్థ్యం వికసించేలా ఒక వ్యవస్థను సృష్టించడం ప్రభుత్వ బాధ్యత” అని అన్నారు.మా పథకాలను మోదీ వ్యతిరేకించారు యువత, మహిళలపై తనకు విశ్వాసం ఉందని చెబుతూ శివకుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 5 హామీ పథకాలైన శక్తి, గృహ లక్ష్మి, గృహ జ్యోతి, అన్న భాగ్య, యువ నిధి గురించి ప్రస్తావించారు.“శక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసం, స్వావలంబనను పెంచింది. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ పథకాలను వ్యతిరేకించారు. గృహ లక్ష్మి కింద రాష్ట్రంలో 1.22 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,000 అందుతోంది. ఇది కుటుంబాలను నిర్వహించుకోవడంలో వారికి సహాయపడింది” అని అన్నారు.మహిళలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో 4% వడ్డీ రుణాలు, సబ్సిడీలు, స్త్రీ శక్తి పథకం ఉన్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం వైద్య విద్య పూర్తి చేస్తున్న వారిలో 40% మంది మహిళలు ఉంటున్నారని తెలిపారు. “భారతీయ సమాజంలో ఇప్పటికీ మొదటి సంతానం అబ్బాయి కావాలనే ఆలోచన ఉంది. మనం దీనికి దూరంగా జరగాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలకు విలువలు, క్రమశిక్షణ నేర్పాలి. నా కుమార్తె సాధికారత పొందిన మహిళ. ఆమె కుటుంబం, వ్యాపారాన్ని విజయవంతంగా సమతుల్యం చేసింది” అని అన్నారు. -
మాకే అడ్డొస్తావా? అంటూ హెల్మెట్ పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం బయట బీజేపీ నిర్వహించిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారుల మధ్యలో నుంచి స్కూటర్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ టెల్కూర్ అడ్డుకున్నారు. అనంతరం అతడి హెల్మెట్‌ను నేలపై కొట్టారు. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు కొట్టేంత పనిచేశారు. ఈ దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. నిరసన ప్రదేశంలో ద్విచక్ర వాహనాన్ని ఆపిన తర్వాత బీజేపీ కార్యకర్తలు దాని చుట్టూ గుమిగూడారు. నిరసన ప్రదేశం మధ్యలో నుంచి కాకుండా మరో మార్గంలో ఎందుకు వెళ్లలేదని నిరసనకారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. ఆ స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి భయపడిపోయాడు. టెల్కూర్ అక్కడికి వచ్చి జరిగిన వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలు మోటార్‌సైకిల్ టైర్లలోని గాలిని కూడా తీసినట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో పలువురు నిరసనకారులు వాహనం చుట్టూ చేరారు. మరికొందరు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. చివరకు ఈ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ మధ్యలో స్కూటర్‌పై ఉన్న వ్యక్తిని నిరసన ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్లారు. దీంతో అప్పటికప్పుడు నెలకొన్న ఉద్రిక్తత అదుపులోకి వచ్చింది.కలబురగిలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం కోసం బీజేపీ ఈ నిరసన నిర్వహించింది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని 101 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. వీటిలో 89 తాలూకాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా, 12 తాలూకాలను మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించారు. -
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్‌తో రాజకీయ కలకలం!
బెంగళూరు/మైదుకూరు: కర్ణాటకలో చోటుచేసుకున్న భూ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, బెంగళూరు బీజేపీ నేత రవిప్రకాష్ మధ్య కొనసాగుతున్న భూ వివాదం కేసులో మైదుకూరు పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, అరెస్ట్ ఘటన కలకలం రేపుతోంది.అయితే, బీజేపీ నేత రవిప్రకాష్‌ను కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య సబీనా బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు కార్లలో వచ్చి తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తనను కూడా కొట్టి, ఫోన్లను తీసుకున్నారని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్‌లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. తనపై రవిప్రకాష్ దాడి చేశారని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గీయుడు మురళీమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: వెలిగొండలోనూ క్రెడిట్ చోరీ ఈ ఘటనపై గత జూలైలోనే కేసు నమోదైనట్లు సమాచారం. ఆ కేసులో భాగంగానే మైదుకూరు పోలీసులు ఇప్పుడు బీజేపీ నేత రవిప్రకాష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు కిడ్నాప్ కేసు.. మరోవైపు దాడి కేసు.. మధ్యలో భూ వివాదం! టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేతల చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
ఏమిటీ రూ.89 కోట్ల వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం?
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి నిగమ్ నిధుల గోల్మాల్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. దాదాపు రూ. 89 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి బీ నాగేంద్ర పదవి చేపట్టిన కేవలం 25 రోజుల్లోనే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులు పక్కదారి పట్టడం, దీని వెనుక కీలక కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు ఇప్పుడు కన్నడ నాట రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.25 రోజులకే ముగిసిన మంత్రి పదవికర్ణాటక కేబినెట్లో ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీ నాగేంద్ర 25 రోజులు గడవక ముందే తన పదవిని వీడాల్సి వచ్చింది. ‘కర్ణాటక మహర్షి వాల్మీకి అనుసూచిత తెగల అభివృద్ధి నిగమ్’ (కేఎంవీఎస్టీడీసీ)లో జరిగిన రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. 2024లోనూ ఇదే వ్యవహారంలో మంత్రి పదవిని కోల్పోయి, ఈడీ అరెస్టు అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.రాజకీయ ప్రకంపనలు.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధంనాగేంద్ర రాజీనామాతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నాగేంద్ర నిర్దోషి అని, ఆయన తనపై వస్తున్న ఆరోపణలతో తీవ్రంగా మనస్తాపం చెందారని ప్రభుత్వం పేర్కొంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే ఆయన రెండోసారి మంత్రి పదవిని త్యాగం చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు నాగేంద్ర రాజీనామా తమ పోరాటానికి దక్కిన విజయమని బీజేపీ అభివర్ణించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇది తొలి వికెట్ పడటమేనని ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ వ్యాఖ్యానించగా, నాగేంద్ర కేవలం చిన్న చేప మాత్రమేనని, తెరవెనుక ఇంకా పెద్ద సూత్రధారులు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు.వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంకర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి నిగమ్‌లో చోటుచేసుకున్న భారీ ఆర్థిక అక్రమమే ఈ వాల్మీకి కుంభకోణం. కార్పొరేషన్‌కు చెందిన మొత్తం రూ.187 కోట్ల నిధులలో దాదాపు రూ.89.63 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి స్వాహా చేశారన్నది ప్రధాన ఆరోపణ. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఆదివాసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేటాయించిన ప్రజాధనాన్ని నకిలీ కంపెనీలు, ఐటీ సంస్థలు, ఒక కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఖాతాల్లోకి మళ్లించి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.వెలుగులోకి తెచ్చిన అధికారి ఆత్మహత్యఈ కుంభకోణం ఒక విషాదకర ఘటనతో బయటకు వచ్చింది. కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్, 52 ఏళ్ల చంద్రశేఖరన్ పీ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ భారీ మోసం వెలుగు చూసింది. ఆయన రాసిన సుసైడ్ నోట్లో.. ఉన్నతాధికారులు, బోర్డు యాజమాన్యం తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతులు లేకుండానే నిధులను అక్రమంగా బదిలీ చేయించారని వివరించారు. ఈ లేఖ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా అసలు బాగోతం బయటపడింది.600 ఖాతాలు.. హైదరాబాద్‌తో లింకులుదర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని కార్పొరేషన్ అధికారిక ఖాతా నుండి సుమారు రూ.88.62 కోట్లను నకిలీ చెక్కులు, ఆర్టీజీఎస్, ఆన్లైన్ విధానాల ద్వారా అక్రమంగా బదిలీ చేశారు. ఈ నిధులను దాదాపు 600 వేర్వేరు ఖాతాల్లోకి పంపించారు. వీటిలో హైదరాబాద్‌లోని ‘ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఖాతాలు కూడా ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఈ మొత్తాన్ని నగదు రూపంలో డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సొమ్మును ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించారనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.ఈడీ విచారణ.. ప్రధాన కుట్రదారుగా నాగేంద్రరాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీట్)తో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించింది. కార్పొరేషన్ బ్యాంకు ఖాతాను నిబంధనలకు విరుద్ధంగా బెంగళూరు ఎంజీ రోడ్డులోని ఒక నిర్దిష్ట బ్రాంచ్‌కు మార్చడంలో, తన వ్యక్తిగత సిబ్బంది, ప్రైవేట్ సంస్థల ద్వారా రూ.89.63 కోట్ల నిధులను లేయరింగ్, డైవర్షన్ చేయించడంలో నాగేంద్ర ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఇందులో దాదాపు రూ.20 కోట్ల నిధులను రాజకీయ అవసరాలకు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.ఇది కూడా చదవండి: కష్టాల ఊబిలోంచి.. దర్జీ కూతురి ‘సీఎస్’ విజయం -
కేజీఎఫ్ వీడియో క్లిప్.. వివాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంద్రాగస్టు నాడు ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ చేసిన ప్రసంగంలో 'దిమాగీ నక్సలైట్లు' అనే మాట వాడారు. మావోయిస్టు భావజాల మద్దతుదారులను ఆయన ఈ విధంగా వర్ణించారు. అంతేకాదు దిమాగీ నక్సలైట్లు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోయారని.. దేశంలో హింస, అరాచకాలను రెచ్చగొట్టే అవకాశాల కోసం కాపుకాచుకుని కూర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఒంటికాలిపై లేచాయి. దిమాగీ నక్సలైట్ల పేరుతో అసమ్మతిని అణచడానికి మోదీ సర్కారు కుటిలయత్నం చేస్తోందని మండిపడ్డాయి.తాజాగా కర్ణాటక బీజేపీ విభాగం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌పై వివాదం రాజుకుంది. దిమాగీ నక్సల్స్‌ను ఉపేక్షించబోమంటూ పెట్టిన పోస్ట్‌కు జత చేసిన వీడియోపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ''నెమ్మదించే సమస్యే లేదు.. సర్వశక్తులు ఒడ్డి దిమాగీ నక్సల్స్‌పై పోరాటం చేస్తామంటూ'' కర్ణాటక బీజేపీ అధికారిక ఎక్స్ పేజీలో ఈ నెల 27న ఒక పోస్ట్ పెట్టింది. దీనికి యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలోని వీడియో క్లిప్పింగ్ జతచేసింది. కొండపై నుంచి హీరో యశ్.. విలన్ సంజయ్‌దత్ గ్యాంగ్‌పై తుపాకులతో కాల్పులు జరుతున్న సన్నివేశంలోని క్లిప్ ఇది. ఇందులో ప్రతినాయకుల బృందాన్ని దిమాగీ నక్సల్స్‌గా పేర్కొంది.మీర్జాపూర్.. కేజీఎఫ్ఛత్తీస్గఢ్ బీజేపీ విభాగం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌కు స్పందనగా కర్ణాటక కమలం పార్టీ ఈ పోస్ట్ పెట్టింది. 'దిమాగీ నక్సల్‌గా ఉండడం కంటే దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని' పేర్కొంటూ.. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోని వీడియో క్లిప్‌ను జతచేసింది ఛత్తీస్‌గఢ్ కాషాయదళం. దీనికి ప్రతిస్పందనగా కర్ణాటక బీజేపీ, 'కేజీఎఫ్ 2' వీడియో క్లిప్ పెట్టింది. దీనిపై ప్రజాస్వామికవాదులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన మాట వినని వారిని ప్రభుత్వం తుపాకులతో భయపెడుతోందంటూ దుయ్యబడుతున్నారు.ఇదీ చదవండి: 'ఎదురు చెప్పను.. ప్రెస్‌మీట్ పెట్టను'మిమ్మల్ని ప్రశ్నించే వారిని నిర్మూలిస్తారా?భయం, అహంకారంతో ప్రభుత్వం నిరంకుశత్వానికి పాల్పడుతోందని ధ్వజమెత్తున్నారు. యువత మాట వినాల్సిన ప్రభుత్వం వారిని తూటాలతో బెదిరిస్తోందనిచ మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన అధికారిక హ్యాండిల్లో బెదిరింపులు, బలప్రయోగ హెచ్చరికలు చేయడాన్ని ఖండించారు. బీజేపీ రాష్ట్ర ఐటీ సెల్లు దాదాపు ప్రతి పోస్టులోనూ ఒకే రకమైన బెదిరింపు, అహంకారం, ధిక్కారంతో హింసను, ద్వేషాన్ని, గూండాగిరిని ఎందుకు ప్రదర్శిస్తూనే ఉన్నాయని ప్రశ్నించారు. బీజేపీ ఇంతలా దిగజారుతుందని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. 'మీ విధానాలు నచ్చని వారిని, మిమ్మల్ని ప్రశ్నించే వారిని నిర్మూలించాలని భావించడం సరికాదని' అన్నారు.No slowing down - taking on "Dimaagi Naxals" with full force! https://t.co/cYhIZmKJ6E pic.twitter.com/iqANzyrBRT— BJP Karnataka (@BJP4Karnataka) August 27, 2026 -
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ నుంచి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నేత బి.నాగేంద్ర ప్రకటించారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అవినీతి ఆరోపణలపై బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన డీకే శివకుమార్ నేతృత్వంలోని కర్ణాటక మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఇదే వివాదం కారణంగా రెండేళ్ల క్రితం కూడా ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆగస్టు మొదటి వారంలో నాగేంద్ర తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు.కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.89 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ లేవనెత్తుతోంది. 2024 మేలో ఆ సంస్థ ఖాతాల అధికారి చంద్రశేఖరన్ పి.ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనధికారికంగా నిధులు బదిలీ చేశారని ఆరోపిస్తూ ఆయన ఒక లేఖను వదిలి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో సంస్థ బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బు వివిధ ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తేలింది.సిద్ధరామయ్య మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నాగేంద్ర ప్రముఖ ఎస్టీ నేత. కాంగ్రెస్ పార్టీ శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించిన తర్వాత, ఈ వివాదం నేపథ్యంలో 2024 జూన్‌లో నాగేంద్ర రాజీనామా చేశారు. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టు 3న ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.శుక్రవారం నాగేంద్ర మాట్లాడుతూ, “నాకు రాజ్యాంగంపై నమ్మకం ఉంది... నాపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని బీజేపీని ఎన్నోసార్లు కోరాం. కానీ వారు రాలేదు” అని అన్నారు. బీజేపీ మనుస్మృతిని అమలు చేయాలని కోరుకుంటోందని, ఆ పార్టీకి గిరిజన వ్యతిరేక ఆలోచనా విధానం ఉందని ఆయన ఆరోపించారు.ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూర్ నుంచి బళ్లారి వరకు 10 రోజుల పాదయాత్ర నిర్వహించనున్నట్లు కర్ణాటక బీజేపీ ప్రకటించింది. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం ఈ 200 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రధాన అంశంగా మారుతుందని భావిస్తున్నారు. రైతుల ఇబ్బందులు, నిరుద్యోగం, నియామకాల్లో అవినీతి ఆరోపణలు కూడా ఇందులో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. VIDEO | Bengaluru: "I am submitting my resignation to CM today to ensure party does not face any embarrassment", says Karnataka Minister Nagendra. pic.twitter.com/3ysOZovm5v— Press Trust of India (@PTI_News) August 28, 2026 -
ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. కొండా కుటుంబంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది.తాజా పరిణామాల్లో భాగంగా నిన్న కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి.. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై కొండా కుటుంబం తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం మాత్రం కఠిన చర్యల దిశగానే అడుగులు వేస్తుందా? అన్న చర్చ మొదలైంది.ఇదిలా ఉంటే.. కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డితో భేటీ అనంతరం భట్టి విక్రమార్క నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఖర్గేతో భట్టి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కొండా కుటుంబం వ్యవహారంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను భట్టి ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సుస్మిత తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో నెలకొన్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఆ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానం వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కొండా కుటుంబంతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని భట్టి కోరినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణతో ముందుకు సాగాలంటే.. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతలపై చర్యలు తప్పవని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.ఇంకా బెంగళూరులోనే భట్టి..మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది. మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొండా ఫ్యామిలీపై కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. క్రమశిక్షణ కమిటీ సిఫారసులకు ఆమోదం లభిస్తుందా? కొండా కుటుంబంపై చర్యలు తప్పవా? చిన్నారెడ్డిపై కూడా వేటు పడుతుందా? లేక వివాదానికి మరోసారి సర్దుబాటు పరిష్కారం చూపుతారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.సీఎం, పీసీసీ అభిప్రాయాలపైనా చర్చఇదిలా ఉండగా.. కొండా కుటుంబం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అభిప్రాయాలపైనా భట్టి-ఖర్గే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే ముగించాలా? లేక అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ అంశాన్ని ఇకపై సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినట్లు సమాచారం.చదవండి: ‘రేవంత్‌పై కొండా సుస్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’ -
కర్ణాటకకు అన్నాడీఎంకే నేత వార్నింగ్.. ఆయన జైలుకే అంటూ..
చెన్నై: మేకేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక, తమిళనాడు నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై కర్ణాటక కాంగ్రెస్ నేతలపై అన్నాడీఎంకే నేత కోవై సత్యన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా కర్ణాటక నేతలు పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మేకేదాటు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించారు. దీంతో, రెండు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది.కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మంత్రి చెలువరాయస్వామి మేకేదాటు ప్రాజెక్టుపై చేసిన తాజా వ్యాఖ్యలపై సత్యన్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మేకేదాటుపై కాంగ్రెస్ నేతలు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఖండించదగినవి. రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదు అంటూ సత్యన్ విమర్శలు కురిపించారు. కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని, రాజకీయ నాయకులు చట్టాన్ని, కోర్టు ఆదేశాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ఏకపక్షంగా ముందుకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు.జైలుకు వెళ్తారా.. ఇదే సమయంలో కేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తూ సత్యన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తీర్పు తమిళనాడుకు అనుకూలంగా ఉంది. మీరు మేకేదాటులో ఒక్క రాయి కూడా కదపలేరు. ఇదే నిజం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేరని సవాల్ విసిరారు. మంత్రి చెలువరాయస్వామిపై మరింత ఘాటుగా స్పందించిన సత్యన్.. మేకేదాటు విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పరప్పన అగ్రహార జైలుకెళ్లాలా? తీహార్ జైలుకెళ్లాలా? ఎక్కడ ఉండాలో ఆయనే ఎంచుకోవచ్చు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కావేరీ వివాదం.. మేకేదాటు ప్రాజెక్టు అంశం మరోసారి తమిళనాడు-కర్ణాటక రాజకీయాల్లో వేడి పెంచుతోంది. కావేరీ నదిపై ప్రతిపాదించిన ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును కర్ణాటక ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా.. తమిళనాడు మాత్రం మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మేకేదాటు ప్రాజెక్టు అమలైతే తమిళనాడుకు దక్కాల్సిన కావేరీ జలాల వాటాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నది తమిళనాడు వాదన. దీంతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదానికి కేంద్రంగా ఉంది.చదవండి: బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు! -
సీఎం డీకే రూ.50 హెయిర్‌కట్ స్టోరీ.. బీజేపీ రూ.1,400 కోట్ల ట్విస్ట్!
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన ఓ చిన్న వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తన జీవనశైలి చాలా సాదాసీదాగా ఉంటుందని చెప్పేందుకు ఆయన రూ.50 హెయిర్‌కట్ ఉదాహరణగా చెప్పగా.. అదే వ్యాఖ్యను పట్టుకున్న బీజేపీ, శివకుమార్ ప్రకటించిన రూ.1,400 కోట్లకు పైగా ఆస్తులను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది.బుధవారం జరిగిన ఇండియా టుడే రౌండ్‌టేబుల్ కర్ణాటక కార్యక్రమంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివకుమార్ వ్యక్తిగత జీవనశైలికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటనను ప్రస్తావించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలోని తనకు ఇష్టమైన బార్బర్ దగ్గర హెయిర్‌కట్ చేయించుకోవాలని వెళ్లారని చెప్పారు.తనకు సింపుల్‌గా జీవించడం ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో తనకు ఇష్టమైన బార్బర్ దగ్గరే ఇప్పటికీ రూ.50 చెల్లించి హెయిర్‌కట్ చేయించుకున్నానని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రతా సిబ్బంది బార్బర్‌ను ఇంటికే పిలిపించాలని సూచించినా.. తానే స్వయంగా వెళ్లాలని పట్టుబట్టినట్లు తెలిపారు. తన వద్దకు వచ్చిన స్నేహితులు ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇస్తుంటారని శివకుమార్ చెప్పారు. లూయిస్ విట్టన్ మఫ్లర్ కూడా తనకు స్నేహితులు ఇచ్చిందేనని పేర్కొన్నారు. ‘‘ఎంత తింటాం? సింపుల్‌గా జీవించడం ప్రాథమిక మర్యాద’’ అంటూ తన జీవన విధానాన్ని వివరించారు.చదవండి: కర్ణాటకకు అన్నాడీఎంకే నేత వార్నింగ్.. ఆయన జైలుకే అంటూ..అయితే శివకుమార్ చెప్పిన ‘సింపుల్ లైఫ్’ వ్యాఖ్యకు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివకుమార్, ఆయన ఆధారితులు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.1,413.78 కోట్లు. ఎన్నికల అఫిడవిట్ డేటాను సంకలనం చేసే మైఎనెట్ ప్రకారం ఈ మొత్తం దాదాపు రూ.1,413.80 కోట్లు. ఇందులో సుమారు రూ.273.42 కోట్ల చరాస్తులు, రూ.1,140.38 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి. అంటే ఒకవైపు రూ.50కే హెయిర్‌కట్ చేయించుకుంటానని సీఎం చెబుతుండగా.. మరోవైపు ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,400 కోట్లకు పైగా ఉండటాన్ని బీజేపీ రాజకీయంగా అస్త్రంగా మార్చుకుంది. -
కర్ణాటక మంత్రి B . నాగేంద్ర రాజీనామా?
-
ఆ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో?
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. ఈనెల 3న జరిగిన మంత్రివర్గ విస్తరణపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గ విస్తరణ చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. 20 మంది అనుకుని, చివరి నిమిషంలో 19 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ బలం 33కు చేరింది. రాజ్యాంగం ప్రకారం కర్ణాటకలో 34 మంది మంత్రులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానంపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఆ ఒక్క పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. సీనియర్లకు మొండి చేయి.. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చాలా మంది సీనియర్లకు మొండిచేయి చూపారు. విజయనగర ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప, ఆయన కుమారుడు గోవిందరాజనగర ఎమ్మెల్యే ప్రియకృష్ణ, శిరా ఎమ్మెల్యే టీబీ జయచంద్ర తదితర నేతలంతా విమర్శలు గుప్పించారు. అలాగే తొలి జాబితాలో ఉన్న ఎమ్మెల్సీ గాయత్రీ శాంతేగౌడ పేరు మలి జాబితాలో కనిపించలేదు. లక్ష్మి హెబ్బాళ్కర్, ఖనీజ్ ఫాతిమా, నయనా మోటమ్మ, అన్నపూర్ణ తుకారాం తదితరులకూ నిరాశే మిగిలింది. ఆ ఒక్క మంత్రి పదవిని మహిళలకు కేటాయించాలనే డిమాండ్ ఉంది. ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీకి... అసెంబ్లీ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. కేబినెట్ మార్పులతో పాటు ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు, రాష్ట్రవ్యాప్తంగా 100 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపన తదితర విషయాలపై చర్చించేందుకు సీఎం డీకే ఢిల్లీ వెళుతున్నారు. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ జరిగితే ముగ్గురు నుంచి ఐదుగురు వరకు కొత్త మంత్రులకు ఉద్వాసన తప్పదని చర్చలు జరుగుతున్నాయి. తొలిగించిన నేతల స్థానంలో అసంతృప్తులకు చోటు కలి్పంచే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: కర్ణాటక కేబినెట్.. రాజీనామాకు మంత్రి నాగేంద్ర రెడీ! -
కర్ణాటక కేబినెట్.. రాజీనామాకు మంత్రి నాగేంద్ర రెడీ!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ మళ్లీ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి బి. నాగేంద్ర.. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎం డీకే శివకుమార్‌కు స్వయంగా చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ఈ వ్యవహారంలో రాజకీయంగా తీవ్ర విమర్శలు దారి తీస్తోంది. అధికార పార్టీ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ ఖాతాల నుంచి నకిలీ చెక్కులు, ఫోర్జరీ పత్రాలు, ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా రూ.89.63 కోట్లు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ డబ్బు వందలాది బ్యాంకు ఖాతాల ద్వారా తిప్పి నగదు, బంగారం, ఇతర ఆస్తులుగా మార్చినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. నాగేంద్ర గతంలో ఈ వ్యవహారం కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చారు. ఇప్పుడు మరోసారి రాజీనామా అంశం తెరపైకి రావడంతో.. కర్ణాటక కాంగ్రెస్‌లో ‘నాగేంద్ర ఎపిసోడ్’ ఎటు దారితీస్తుందన్నది ఉత్కంఠగా మారింది.చదవండి: ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్అయితే, తన వల్ల పార్టీకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యానని నాగేంద్ర చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో న్యాయపరమైన ప్రక్రియలో తాను క్లీన్చిట్ పొందుతానన్న నమ్మకం ఉందని.. ఆ తర్వాత మళ్లీ మంత్రివర్గంలోకి వస్తానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.బీజేపీ విమర్శలు.. వాల్మీకి కార్పొరేషన్ నిధుల మళ్లింపు వ్యవహారాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. నాగేంద్ర రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 రోజుల పాదయాత్రకు కూడా సిద్ధమైంది. ఇదే సమయంలో నాగేంద్ర రాజీనామాకు ముందుకు రావడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజీనామా తీసుకోవాలా? వద్దా? అన్నదానిపై సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
వీడు మామూలుడో కాదండి బాబు.. లగ్జరీ కారులో వచ్చి రోడ్లు ఊడ్చేస్తున్న కార్మికుడు
-
బిచ్చగత్తె ఇంట్లో నోట్ల కట్టలు.. చనిపోయాక బయటపడ్డ రహస్యం
-
ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..!
బెంగళూరు: మహిళా ఎస్ఐ, జైలులో ఖైదీతో అర్దనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడడం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం శాసనసభలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ఈ వీడియో ఏడాది కిందటిదని, ఆమెకు నోటీస్ ఇచ్చి బదిలీ చేశామన్నారు. ఆమె ఇలా చేయడాన్ని సమర్థించడం లేదన్నారు. పోలీసులే ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా?, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చారు అని వాపోయారు. ఓ మహిళా ఎస్ఐ.. బెళగావి సెంట్రల్ జైల్లోని ఖైదీతో ప్రేమలో పడింది. అతనికి యూనిఫారంలోనే వాట్సాప్ కాల్ చేసి అర్ధనగ్నంగా కనిపించింది. ఖైదీ ఆ వీడియోను ఇతరులకు పంపడంతో వైరల్ అయ్యింది. ఆ ఎస్ఐ దీనిపై వారం కిందట బెంగళూరు కబ్బన్‌పార్క్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ బాగోతం వైరల్ అయ్యింది. -
క్విక్ కామర్స్ సంస్థల ఫుడ్ లైసెన్సులు సస్పెండ్
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై విషపూరిత దతూర (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అనువైన ఆహార ఉత్పత్తులుగా విక్రయించినట్లు గుర్తించిన కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలనా విభాగం కీలక చర్యలు తీసుకుంది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.విషపూరిత ఉత్పత్తులను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో అధికారులు దతూర ఉత్పత్తుల విక్రయం, ఆన్లైన్ లిస్టింగ్‌లపై విచారణ చేపట్టారు. దర్యాప్తులో కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో దతూర పండ్లు, విత్తనాలు ఆహార ఉత్పత్తులుగా కనిపించడంతో పాటు వాటిపై FSSAI ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లను గిడ్డంగుల్లో నిల్వ ఉంచి ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడైంది.తింటే తీవ్ర ఆరోగ్య ముప్పుదతూరను సాధారణంగా ‘థోర్న్ యాపిల్’గా పిలుస్తారు. ఇందులో సహజంగా విషపూరిత ఆల్కలాయిడ్లు ఉండటంతో దీనిని తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అధికారులు ప్రత్యేకంగా శుద్ధి చేయని దతూరను వినియోగించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. తీవ్రమైన విషప్రభావం ఏర్పడితే కోమా వంటి పరిస్థితులు, అత్యంత తీవ్ర సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్యపరమైన హెచ్చరికలు ఉన్నాయి.కంపెనీల వివరణలపై అసంతృప్తిఈ వ్యవహారంపై సంబంధిత సంస్థల ప్రతినిధులు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉత్తర్వుల ప్రకారం, అమెజాన్ తన వివరణను సమర్పించలేదు. ఇన్‌స్టామార్ట్ తనవైపు తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు మరింత సమయం కోరింది. మరోవైపు బిగ్‌బాస్కెట్ దతూర పండ్ల ఆన్లైన్ విక్రయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులపై ‘మానవ వినియోగానికి కాదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించేలా లేబులింగ్‌ను సరిచేస్తామని పేర్కొంది. అయితే ఈ వివరణలు సంతృప్తికరంగా లేవని ఆహార భద్రతా విభాగం తేల్చింది.సెల్లర్లపైనా చర్యలుదతూరను ఆహారంగా నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న విక్రేతలు, సరఫరాదారుల ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే దతూర పండ్లు లేదా విత్తనాలను ఆహారం/మానవ వినియోగం కోసం అందిస్తున్న అన్ని ఆన్లైన్ లిస్టింగ్‌లు, ప్రకటనలను తొలగించాలని లేదా నిలిపివేయాలని సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ఆదేశించారు.ఇదీ చదవండి: ఈ జలుబు మందులు బ్యాన్.. నిషేధించిన కేంద్రం -
ఎస్ఐని కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. ఆ రోజు అసలేం జరిగింది?
బెంగళూరు: శ్రీరంగపట్నంలోని ఓ ఆలయంలో ఎస్ఐ-ఎమ్మెల్యే కుమార్తె మధ్య వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య.. హారతి ఉక్కడ ఆలయంలో ఎస్ఐ సవితా బి. పాటిల్‌తో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐశ్వర్య ఫోన్ కాల్ చేస్తున్నట్లు కూడా వీడియోలో రికార్డయ్యింది.ఇరువురు మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా.. ఆమె ఆ పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టింది. దాంతో ఆ అధికారి తిరిగి ఆమెను కొట్టారు. వారిని శాంతింపజేయడానికి భక్తులు కూడా ప్రయత్నించారు. ఆగస్టు 12న రాత్రి 8.15 గంటలకు భీమ అమావాస్య వేడుకల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం విషయమై ఈ వివాదం జరిగినట్లు సమాచారం.మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సవితా పాటిల్ ఈ ఘటనపై క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రతి ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఐశ్వర్యను వెంటనే లోపలికి అనుమతించకపోవడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పోలీసు అధికారిని దూషించి.. చెంపదెబ్బ కొట్టి, విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే సురేష్ గౌడ.. ఆ పోలీసు అధికారి కూడా తన కుమార్తెను దూషించారన్నారు.ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బుKarnataka: A lady cop was allegedly slapped by a Karnataka MLA’s daughter during a dispute over special darshan at a temple. The cop reportedly slapped her back in response. 😳 pic.twitter.com/3tlqk5HYdm— Ghar Ke Kalesh (@gharkekalesh) August 24, 2026"తన కుమార్తె.. ఆలయ గర్భగుడిని దర్శించుకోవాలని కోరిందని.. అందుకు పోలీసులు తన కుమార్తెను లోపలికి అనుమతించలేదన్నారు. లోపలికి అనుమతించాలని తన కుమార్తె మళ్లీ అభ్యర్థించిందని.. ఆ తర్వాత ఆ పోలీసు అధికారి తన కుమార్తెను దూషించినట్లు తెలుస్తోందన్నారు. ఆ తర్వాత గొడవ ప్రారంభమైంది. నా కుమార్తె ఆ అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియోను నేను చూడలేదు. నేను క్షమాపణలు కోరుతున్నానని'' ఎమ్మెల్యే గౌడ అన్నారు. -
బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నిజంగా ఈ ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. అత్యంత పేదరికంలో జీవిస్తూ, భిక్షాటనతో రూపాయి రూపాయి కూడబెట్టి, లక్షలు పోగు జేసింది. కానీ ఏ లాభం? ఆ లక్షలేవీ ఆమెకు అక్కరకు రాలేదు. ఆ ధనాన్ని అనుభవించ కుండానే ఆమె కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మాండ్యకు చెందిన 68 ఏళ్ల హూర్ (Hoor) అనే వృద్ధురాలు వయోభారంతో వచ్చిన అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఒక మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదుతో నిండిన సంచులు లభ్యమైన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.అనంతరం స్థానికులు ఆమె అద్దె ఇంటిని తనిఖీ చేయగా, దాదాపు 30కి పైగా గోనె సంచుల్లో నింపి ఉన్న వేలాది నాణేలు, రూ. 10,20,రూ 50 కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. స్థానికులు ఆ డబ్బును లెక్కించగా రూ.8,40,000 (ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు) నగదు చూసి అందరూ దిగ్భ్రాంతి పోయారు.At least 30 cash-filled sacks worth over ₹8 lakhs have been found at the house of a woman in Karnataka who spent all of her life begging. She died yesterday due to an age-related illness. The money was handed over to her brothers. One of the brothers took Rs 6 lakh while the… pic.twitter.com/Q0L89fM8d1— Piyush Rai (@Benarasiyaa) August 24, 2026ఇదీ చదవండి: రోజుకు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ హూర్ తన సోదరితో కలిసి ఆ అద్దె ఇంట్లో నివసించేవారు. ఇద్దరికీ వివాహం కాలేదు. రెండేళ్ల క్రితమే ఆమె సోదరి కూడా మరణించారు. దీంతో ఈ సొమ్మును హూర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు రూ. 6 లక్షలు తీసుకోగా, మరొక సోదరుడు తన వాటాకి వచ్చిన రూ. 2,40,000 లను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చారు.ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ -
రోజుకు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్
శ్రమను మించిన దైవం లేదని, చేసే వృత్తి ఏదైనా దానికి ఇచ్చే గౌరవం ఒక్కటేనని నిరూపించారు. ఒక సాధారణ పారిశుద్ధ్య కార్మికుడు. కష్టపడే మనస్తత్వం, శ్రమకు ఇచ్చే గౌరవం మనిషి హోదాను ఎలా పెంచుతుంది అనడానికి ఆయన జీవితమే గొప్ప ఉదాహరణ. ఎంత ఎదిగినా ఒదిగా ఉండే లక్షణం ఆయనకు ఆభరణం. లక్షల విలువైన ఫార్చ్యూనర్ (Fortuner) కారులో వచ్చి, రోడ్లను ఊడ్చి తాపీగా వెళ్లిపోతుంటారు. పదండి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, బిస్రోడికి చెందిన శేషప్ప (Sesappa) అనే పారిశుద్ధ్య కార్మికుడి స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుంది.ప్రతిరోజూ ఉదయం, శేషప్ప అందరి దృష్టిని ఆకర్షించే 'టయోటా ఫార్చ్యూనర్' వాహనంలో తన పనికి చేరుకుంటారు. కానీ అక్కడికి రాగానే, ఆయనలో ఎలాంటి హోదా లేదా ప్రత్యేక అధికారాల ప్రదర్శన ఉండదు. వాహనం దిగి, చీపురు పట్టుకుని రోడ్లను ఊడ్చడం ప్రారంభిస్తారు.మంగళూరు శివార్లలోని బంట్వాల్ తాలూకాలో ఉన్న నావూర్ గ్రామానికి చెందిన శేషప్ప జీవితం పూల పాన్పేమీ కాదు. ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు, మద్యం మత్తు,పరివర్తన ఇలా అనేక బాధల భావోద్వేగాల అవిశ్రాంత శ్రమల కలయిక.1996లో శేషప్ప ప్రభుత్వ సేవలో చేరారు. రోజుకు కేవలం రూ.50 జీతంతో శేషప్ప తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆర్థిక సమస్యలు, కష్టాల వల్ల ఒక దశలో మద్యపానానికి బానిసయ్యారు. 2005లో ఆయన జీవితంలో ఒక కీలక మలుపు వచ్చింది. అప్పటి బంట్వాళ్ సబ్-ఇన్స్పెక్టర్ బెల్లియప్ప మాటలు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి. దాంతో మద్యం పూర్తిగా మానేసి, క్రమశిక్షణతో జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు.తండ్రి అంత్యక్రియలకు డబ్బుల్లేకతండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా శేషప్ప వద్ద డబ్బులు లేవు. ఎవరూ సహాయం చేయకపోవడంతో, తండ్రి మృతదేహాన్ని నెత్రావతి నది ఒడ్డుకు తీసుకెళ్లి స్వయంగా దహన సంస్కారాలు చేశారు. ఈ ఘటనే ఆయనను ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా పట్టుదలను పెంచింది.ఆయన దృష్టిలో ఏ పనీ చిన్నది కాదు. అది నిజాయితీతో కూడిన పని అయితే చాలు, చేయడానికి ఆయన సిద్ధంగా ఉండేవారు.ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం వరకు వీధులు ఊడ్చడం, చెత్త తరలించే వాహనాన్ని నడపడం వంటి పనులు చేస్తారు. మధ్యాహ్నం తర్వాత వ్యవసాయం, పాడి పరిశ్రమ (డైరీ ఫార్మింగ్) , ఇతర కూలీ పనులు చేస్తూ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకున్నారు. ఇలా ఎక్కువ పనిగంటలు పనిచేయడం ద్వారా నెలకు మరో రూ.40వేలు ఆర్జించేవారు. తన కష్టార్జితంతో తొలుత ఆల్టో కారు కొన్నారు. పారిశుధ్య కార్మికుడికి కారా అని చాలామంది ఎగతాళి చేశారు. అయినా పట్టించుకోలేదు. ఆ తరువాత కొన్నాళ్లకు స్పార్పియో కొన్నారు. పాత కారును విక్రయించి మళ్లీ లోన్ తీసుకుని కొత్త కారు కొనడం అలవాటుగా మారింది. అలా ఎన్నో అవమానాలు, అవహేళనలు, క్రమం కఠోర శ్రమ తరువాత ఆయన ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసే స్థాయికి అతని జీవితం ఆర్థిక పరిణతిని సాధించింది.పనే దైవం (Work is Worship)ఎంతటి ఖరీదైన కారు ఉన్నప్పటికీ, శేషప్ప తన మూలాలను మర్చిపోలేదు. 'ఫార్చ్యూనర్' కారులో రాగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, అతను స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేయడానికే మొగ్గు చూపుతారు. రోజూ ఫార్చ్యూనర్ కారులో వచ్చి, తన చేతితో చీపురు పట్టి వీధులను శుభ్రం చేస్తూనే ఉన్నారు. అతను ఇప్పటికీ వీధులను ఊడ్చుతారు.అతను ఇప్పటికీ చెత్తను తరలించే వాహనాన్ని నడుపుతారు అంతేనా ఇప్పటికీ వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ పనుల్లో నిమగ్నమై ఉంటారు.ఇదీ చదవండి: బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే! -
పట్టిన దయ్యాన్ని వదిలిస్తా..!
బెంగళూరు: పట్టిన దయ్యాన్ని విడిపిస్తానంటూ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నకిలీ స్వామి ఉదంతమిది. చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా మేకనహుడ్లు గ్రామంలో సతీశ్ పత్రి అనే వ్యక్తి స్వామీజీ వేషమెత్తి దయ్యం, భూతం విడిపిస్తానని చెప్పుకుంటున్నాడు. దీంతో కొందరు అతనిని ఆశ్రయించగా, పూజల పేరుతో యువతితో కలిసి చిందులేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దయ్యం వీడాలంటే కోడిని కొరికి రక్తం తాగాలని ఆమెను ఒత్తిడి చేశాడు. ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. కొందరు గ్రామస్థులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అంతులేని.. భర్తల క్రూరత్వం
పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులు.. టెక్కీ ఆత్మహత్య. కేజీ బంగారం, రూ.కోటికి పైగా నగదు, వైభవంగా పెళ్లి చేశారు, వారం తిరక్కుండానే వధువు బలవన్మరణం.. ఇలాంటి విషాద ఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని చట్టం చెబుతున్నా ఎవరూ పాటించడం లేదు. పైగా మరింత డబ్బు, బంగారం కావాలని సతాయిస్తూ ఆడపిల్లల ఉసురుతీసే భర్తల అఘాయిత్యాలు పెరిగిపోయాయి.బెంగుళూరు: గత నాలుగేళ్లలో రాష్ట్రంలో బెంగళూరుతో సహా వివిధ జిల్లాల్లో 617 మంది మహిళలు వరకట్న భూతానికి బలయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ 2022 నుంచి 2026 జూన్ వరకు రాష్ట్రంలో మహిళలపై సంభవించిన నేరాల గురించి విడుదల చేసిన నివేదికలో ధనదాహపు భర్తలు, అత్తమామల హింసోన్మాదం పెల్లుబికింది. శిక్ష 7 మందికి మాత్రమే వరకట్న వేధింపులతో మహిళల మృతి, అత్యాచారం, లైంగిక దాడులు, మహిళలపై భర్తల హింస తదితరాలను నివేదికలో ప్రస్తావించారు. మెట్టినింట కట్న వేధింపులతో 617 మంది మరణించారు. కానీ ఇందులో 7 మందికి శిక్ష పడింది. 467 కేసులు ఇంకా కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. సుదీర్ఘమైన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ ప్రక్రియ, సాక్షులకు భద్రత కల్పించడం, న్యాయప్రక్రియ అంశాల వల్ల కేసుల విచారణ సవాళ్లు ఎదుర్కొంటోంది. లైంగిక వేధింపులు.. మహిళలపై లైంగిక వేధింపుల కేసులు 2022లో 5,857 నమోదుకాగా, 54 మందికి శిక్షలు పడ్డాయి. 559 నకిలీ ఆరోపణలని తెలిసింది. 2023లో 6,489 కేసులు నమోదుకాగా 651 నకిలీ కేసులుగా వెల్లడైంది. 2024లో 6335 కేసులు నమోదుకాగా ఇందులో 722 నకిలీ కేసులున్నాయి. 2025లో 5843 కేసులు నమోదు కాగా 610 నకిలీ కేసులు. నాలుగేళ్లలో 27,828 లైంగిక వేధింపుల ఘటనలు సంభవించాయి. అత్యాచారం కేసులు.... రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మొత్తం 2,527 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. 2022లో 537, 2023లో 600, 2024లో 623, 2025లో 550 కేసులు, 2026లో 262 కేసులు వచ్చాయి. అంతులేని.. భర్తల క్రూరత్వం భర్తల క్రూరత్వ ప్రవర్తనపై 2022లో 2,779 కేసులు నమోదు కాగా ఇందులో 2,467 కేసుల్లో నేరం రుజువైంది. 2023లో 2,946 దౌర్జన్యం కేసుల్లో 329 నకిలీవని తేలింది. 2,556 కేసుల్లో వేధింపులు నిజమేనని నిర్ధారణ అయ్యింది. 2024లో 2,894 కేసులు నమోదు కాగా, ఇందులో 2,566 కేసుల్లో భర్తల దాషీ్టకాలు రుజువయ్యాయి. 2025లో 2,744 కేసులు నమోదుకాగా 231 నకిలీ కేసులున్నాయి. 2026 జూన్ వరకు 1,534 దౌర్జన్యం కేసులు నమోదయ్యాయి. ఏటా 2 వేల కేసులువివాహం, ఆ తరువాత వరకట్న వేధింపుల నియంత్రణ చట్టం కింద 2022లో 2,245 కేసులు నమోదు కాగా, 2023లో 2,348 కేసులు, 2024లో 1,999 కేసులు, 2025లో 2,110, 2026 జూన్ వరకు 1,039 కేసులు నమోదయ్యాయి. తమ వద్ద నమోదైన కేసులను పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డా.నాగలక్ష్మీ చౌదరి తెలిపారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఆ అమ్మాయి డ్యాన్సు.. ఎమ్మెల్యేపై విమర్శలు
బెంగళూరు: కర్ణాటకలోని శ్రీరంగపట్నం, అరెకెరె గ్రామంలో ఎమ్మెల్యే రమేశ్ బండిసిద్దేగౌడ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుక కోసం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని వాడుకున్నట్లు తెలుస్తోంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నాటకంలో పాల్గొన్న కళాకారులకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేందుకు అనుమతి ఇచ్చారని గ్రామస్థులు ఆరోపించారు. కార్యక్రమానికి ముందు కళాకారులు అక్కడే సిద్ధమై, మేకప్ కూడా వేసుకున్నారని తెలిపారు.కళాకారులకు ఆసుపత్రిలోనే వసతి కల్పించారని, కార్యక్రమానికి ముందు అక్కడే ఏర్పాట్లు చేసుకున్నారని గ్రామస్థులు తెలిపారు. ప్రైవేట్ వేడుక కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఉపయోగించడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఓ కళాకారిణి ఆసుపత్రి లోపలే రీల్ చిత్రీకరించి, దానిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామస్థులు విమర్శలు గుప్పించారు.అనుమతి ఎవరిచ్చారంటూ ప్రశ్నలుప్రైవేట్ పార్టీలో పాల్గొన్న కళాకారులకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని ఉపయోగించుకునేందుకు ఎలా అనుమతి ఇచ్చారని గ్రామస్థులు ప్రశ్నించారు. ఆసుపత్రి వినియోగానికి అనుమతి ఇచ్చారా? ఇస్తే ఎవరు అనుమతించారు? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు, వీఐపీ హద్దు మీరారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.ఆసుపత్రిలో కళాకారుల ఉనికి రోగులు లేదా వైద్య సేవలపై ఏమైనా ప్రభావం చూపిందా? అని కూడా గ్రామస్థులు ప్రశ్నించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని వినియోగించారన్న ఆరోపణలపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? అనే విషయాలను అధికారులు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నివేదిక కోరతామని చెప్పిన ఆరోగ్య మంత్రిఆసుపత్రిలో రీల్స్ చిత్రీకరించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఈ విషయాన్ని పరిశీలిస్తామని కర్ణాటక ఆరోగ్య మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు. రమేశ్ బండిసిద్దేగౌడ, ఆయన కుటుంబ సభ్యులు ఆ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలిచారని, గ్రామంలోని అత్యుత్తమ కుటుంబాల్లో అది ఒకటని ఖాదర్ పేర్కొన్నారు. వైద్య రంగంలో ఆ కుటుంబం ఎంతోమందికి సహాయం చేసిందని, గ్రామ ప్రజల నుంచి ప్రశంసలు పొందిందని తెలిపారు.ఈ అంశంపై స్పందించిన ఖాదర్, ఎమ్మెల్యే తల్లిదండ్రుల పుట్టినరోజు వేడుకల కోసం ఒక గదిని ఉపయోగించారని చెప్పారు. కేవలం రీల్ ఆధారంగా ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని సూచించారు. రీల్స్‌లో కనిపించే ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లుగా పరిగణించాలా? అని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. -
తల్లినే ఎక్కువ ఇష్టపడుతున్నారని, ముక్కుపచ్చలారని చిన్నారులపై తండ్రి దారుణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను నీటి కాలువలోకి నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బుధవారం వారి మృతదేహాలను వెలికితీసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో తొమ్మిదేళ్ల బాలిక, రెండన్నరేళ్ల బాలుడు ఉన్నారు. ఈ జంట హత్యలకు కారణం తెలిసి పోలీసులు కూడా నివ్వుపోయాడరు.యాద్గిర్ ఎస్పీ పృథ్వీక్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శాంతప్పకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు (9,6) ఒక అబ్బాయి ( సుమారు మూడేళ్లు). తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుండి బయలుదేరి, మోటార్‌సైకిల్‌పై బిగుడి వద్ద ఉన్న కాలువకు వెళ్లాడు. తన ఆరేళ్ల కుమార్తెను మాత్రం వదిలి మిగిలిన ఇద్దర్నీ నిర్దాక్షిణ్యంగా కాలువలోకి నెట్టేశాడు. ఆ తరువాత ఆ చిన్నారని తనతో పాటు యాద్గిర్ పట్టణానికి తీసుకెళ్లాడు. అనంతరం బిగుడి (Bigudi) ప్రాంతంలోని తన ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి అక్కడికి రాగా, పోలీసులు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు తిరిగిచేపట్టారు. అదే సమయంలో కాలువలోకి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (KBJNL) అధికారులను కోరారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణుకకు దగ్గరగా ఉండేవారని, తనతో అంతగా కలిసి ఉండేవారు కాదని అందుకే చంపేశానని పోలీసులకు తెలిపారు. కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శాంతప్పను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని యాద్గిర్ ఎస్పీ వెల్లడించారు. -
కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
విజయ్ ఓ వర్గానికే సీఎం?.. నిలదీసిన బీజేపీ
బెంగళూరు: చామరాజనగర్ జిల్లాలో కర్ణాటక అటవీశాఖ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు అనుమానిత వేటగాళ్లు మృతి చెందిన ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ వైఖరిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రా లేక ఒక నిర్దిష్ట వర్గానికేనా అని ప్రశ్నించింది.హనూరు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనపై సీఎం డీకే శివకుమార్‌కు విజయ్ లేఖ రాయగా, ఆర్చ్‌బిషప్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, నష్టపరిహారం కోరారని కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. మృతులకు కులం, మతం రంగు పులమడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. బీజేపీ, జేడీ(ఎస్)లు మానవతా దృక్పథంతో అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. మరోవైపు, కర్ణాటక అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తమిళనాడు నేతలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు.కాగా ఆంథోనీ స్వామి, జాన్ రోస్ పీటర్, కుమార్ల మృతిని ముఖ్యమంత్రి విజయ్ ‘నరమేధం’గా అభివర్ణిస్తూ, ఎదురుకాల్పుల వివరాలను తిరస్కరించారు. ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలోనూ గందరగోళం చెలరేగింది. మరోవైపు వారి వద్ద ఆయుధాలు, జంతు మాంసం, నిత్యావసరాలు లభ్యమైనందున వారు వేటగాళ్లేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఘటనపై వాస్తవాలను నిర్ధారించేందుకు బీజేపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్. మహేష్, కార్యదర్శి లక్ష్మీ అశ్విన్ గౌడ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అనిల్ థామస్, మాజీ ఎమ్మెల్యే సి.ఎస్. నిరంజన్ కుమార్, హనూరు వెంకటేష్‌లతో కూడిన ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించనుంది.ఇది కూడా చదవండి: బాయ్‌ఫ్రెండ్ సాయంతో తాతను చంపించి.. బాలిక పైశాచికం! -
4 కిలోమీటర్లు.. 30 నిమిషాలు.. ఖాళీ కుర్చీలు!
బెంగళూరు: ఉదయం 10.15 గంటలు.. సాధారణంగా ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసిపోయే సమయం. కానీ ఓ ఆఫీసులో మాత్రం చాలా డెస్క్‌లు ఖాళీగా కనిపించాయి. ఉద్యోగులు పని చేయడానికి ఇష్టపడటం వల్ల కాదు.. ఆఫీసుకు చేరుకునేలోపే వారి శక్తి మొత్తం ట్రాఫిక్‌లో ఆవిరైపోతోందట! బెంగళూరు ట్రాఫిక్ ఉద్యోగుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఓ స్టార్టప్ ఫౌండర్ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.Applied AI Studio వ్యవస్థాపకుడు బాల పన్నీర్‌సెల్వం తన ఆఫీసులో ఖాళీగా ఉన్న డెస్క్‌ల ఫొటోను లింక్డ్ఇన్లో షేర్ చేశారు. “సమస్య మనుషుల్లో లేదు.. ఆఫీసుకు చేరుకోవడానికి పడుతున్న శ్రమలో ఉంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ఉద్యోగుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.4 కిలోమీటర్లకు అరగంట..బెంగళూరులో చిన్న దూరం ప్రయాణం కూడా పెద్ద సవాలుగా మారిందని బాల చెప్పారు. హెచ్ఎస్ఆర్ ప్రాంతంలో కేవలం 4 కిలోమీటర్లు వెళ్లేందుకు స్కూటర్‌పై సుమారు 20 నిమిషాలు, కారులో అయితే 30 నిమిషాల వరకు పడుతోందన్నారు. పీక్ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌లో వాహనాల మధ్య దారి వెతుక్కుంటూ.. సిగ్నల్స్ పట్టించుకోకుండా దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలను తప్పించుకుంటూ ప్రయాణించే సరికి ఆఫీసుకు చేరుకునే సమయానికే ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారని చెప్పారు.17 కిలోమీటర్లు.. 2 గంటలు!తనకెదురైన అనుభవాన్ని కూడా బాల పంచుకున్నారు. వర్షం లేకుండా, ఎలాంటి స్పష్టమైన అంతరాయం లేని రోజున సాయంత్రం 4 గంటలకు వైట్‌ఫీల్డ్ నుంచి హెచ్ఎస్ఆర్ వరకు 17 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా రెండు గంటలు పట్టిందని తెలిపారు. ఇక సాయంత్రం 6 తర్వాత ఆఫీసు నుంచి బయలుదేరితే ఇంటికి చేరుకునేందుకు మరింత సమయం పడుతోందన్నారు. 5 గంటలకే బయలుదేరిన ఉద్యోగులు కూడా ఇంటికి చేరేసరికి వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదించేంత శక్తి లేకుండా పోతున్నారని పేర్కొన్నారు.ట్రాఫిక్.. ప్రొడక్టివిటీకి విలన్?“ఇంత గందరగోళం మధ్య మనుషులు ఎప్పుడు ఆలోచిస్తారు? ఎప్పుడు కొత్తగా పని చేస్తారు?” అంటూ బాల ప్రశ్నించారు. బెంగళూరు ట్రాఫిక్ కేవలం రోడ్లపై సమయాన్ని వృథా చేయడం మాత్రమే కాదని.. మంచి పని చేసే సామర్థ్యాన్నే దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పోస్టుకు బెంగళూరు వాసుల నుంచి భారీ స్పందన వచ్చింది. చాలామంది తమ రోజువారీ ప్రయాణ కష్టాలను పంచుకున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో ప్రయాణించడం వల్ల ఆఫీసుకు వెళ్లే ముందే అలసిపోతున్నామని.. ఇంటికి వచ్చేసరికి పూర్తిగా నీరసించిపోతున్నామని పలువురు పేర్కొన్నారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరుకు ఇప్పుడు ట్రాఫిక్ మరో గుర్తింపుగా మారుతోందా? రోడ్లపై గడిచిపోతున్న గంటలు ఉద్యోగుల సమయాన్నే కాదు.. వారి శక్తిని, ఉత్పాదకతను, వ్యక్తిగత జీవితాన్నీ మింగేస్తున్నాయన్న చర్చ ఇప్పుడు మళ్లీ మొదలైంది. -
ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య
సాక్షి, బెంగళూరు: దుర్మార్గురాలైన ఒక భార్య చేతిలో భర్త, ఒక చిన్నారి బలైపోయిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను, నాలుగేళ్ల కుమారుడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులోని చిక్కబానావర ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ ఘటన. తండ్రీ కొడుకుల మరణంపై అభినందన్ మృతదేహంపై గాయాలుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం హరిణి అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్త, కుమారుడు స్పందించడం లేదంటూ హరిణే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అయితే ప్రేమికుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.తమ రహస్య బంధం తెలిసిందని హత్యకు ప్లాన్2021లో వీరు వివాహం చేసుకున్నారు. విబేధాల దాదాపు రెండేళ్లుగా వారు వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారు. అయితే 2024 డిసెంబరులో హరిణికి వినయ్ స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా పరిచయయ్యాడు. ఆ పరిచయం కాలక్రమంలో సన్నిహితంగా మారింది. తన భార్య మరో వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానం వచ్చింది అభినందన్‌కు. ఈ విషయంపై ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో హత్యలకు సుమారు 15 రోజుల ముందు, ఆమె కాల్ వివరాల రికార్డులను (CDR) కోరుతూ అతను పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడే వినయ్ సహాయంతో అతన్ని చంపాలని హరిణి నిర్ణయించుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.సమయంకోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్వల్ప విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో హరిణి గరిటెతో అభినందన్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఎవరి గదుల్లో వాళ్లు నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన ఆమె వినయ్‌ను ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలసి అభినందన్‌పై దాడి చేసి ఊపిరి ఆడకుండా చేసి చంసేశాడు. ఈ దాడి సమయంలో నిద్రలేచిన వారి కుమారుడు యదువీర్ను కూడా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి మట్టుబెట్టారు. హరిణిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ వివరాలు వెలుగు చూశాయి. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లోని రక్తం మరకలను శుభ్రం చేశారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వినయ్ ఇంటికి వచ్చిన సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆపివేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇదీ చదవండి: ‘‘మా శవాలను తీసుకెళ్లండి’’ : భార్యాబిడ్డల్ని హతమార్చి, నావికుడు సూసైడ్కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడు వినయ్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. వినయ్ ఆచూకీ లభ్యమైన తరువాత అతని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే! -
తేళ్లను తాకినా కుట్టవట..! కందుకూరులో తేళ్ల పంచమి వేడుకలు..
తెలంగాణ: దేశమంతా సోమవారం నాగుల పంచమి జరుపుకొంటే నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా గురుమిట్కల్ మండలం కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి ఘనంగా నిర్వహించారు. ఇక్కడ తేళ్లను దైవస్వరూపంగా భావిస్తూ ఏటా ప్రత్యేకంగా తేళ్ల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.కందుకూరు గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమవ్వ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని, అక్కడే ఉన్న తేళ్ల విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా.. వాటి కింద తేళ్లు కనిపించాయి. తేళ్లను చేతితో తాకినా.. పట్టుకున్నా..అవి కుట్టకపోవడం అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు.చిన్నారులు, యువత, మహి ళలు, పురుషులు అనే తేడా లేకుండా భక్తులు తేళ్లను చేతుల్లోకి తీసుకుని, చేతులు, పొట్ట, ముఖం తదితర శరీర భాగాలపై పెట్టుకుని జాతరలో సందడి చేశారు. గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వన మూలికల కారణంగా తేళ్లు కుట్టలేకపోతున్నాయని కొందరు విద్యావంతులు చెబుతున్నారు. -
తమిళనాడుకు కావేరి నీళ్లివ్వండి
సాక్షి బెంగళూరు: అసలే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న కర్ణాటకకు మరో షాక్ తగిలింది. తమిళనాడుకు నీటిని వదలాలని, ఈ మేరకు కావేరి నీటి నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను పాటించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి రోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక సమర్పించాలని కూడా సూచన చేసింది. కొంత సమయం పడుతుంది : కర్ణాటక కర్ణాటక నుంచి ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ సూచించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తమిళనాడు తీసుకొచి్చంది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను కర్ణాటక పూర్తిగా పాటించడం లేదని ఆరోపించింది. దీనిపై బిళిగుండ్లు వద్ద నీటి పరిమాణం బాగా తగ్గిపోయిందని, తమిళనాడు కోరుతున్నట్లు 12 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు కొంత సమయం పడుతుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కావేరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేక, రిజర్వాయర్లలో ఆశించిన మేర నీటి నిల్వలు లేవని పేర్కొంది. అయినా సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీడబ్ల్యూఆర్సీ ఆదేశాల మేరకు ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. -
పోలీస్తో నడిరోడ్డుపై కలబడిన ఆ పార్టీ నేత
బెంగళూరు: విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్‌పై జేడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజునాథ్ అలియాస్ గొట్టిగెరె మంజన్న దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కర్ణాటకలోని హుళిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ అరుణ్ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాలు వెళ్లేందుకు వీలుగా మంజన్న వాహనాన్ని చేతి సైగతో ఆపారు.తన వాహనాన్ని ఆపడంపై మంజన్న అభ్యంతరం వ్యక్తం చేసి కానిస్టేబుల్‌ను ప్రశ్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మంజన్న అరుణ్ చొక్కా కాలర్ పట్టుకుని, మరో వ్యక్తి సహాయంతో అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ప్రకారం.. మంజన్న ఫోన్లో ఓ ఉన్నత స్థాయి పోలీసు అధికారితో మాట్లాడుతున్నట్లు, కానిస్టేబుల్‌ను కాలితో తన్నేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాగ్వాదం తర్వాత మంజన్న ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి తన వాహనాన్ని కానిస్టేబుల్ ఆపిన విషయంపై ఫిర్యాదు చేశారు. అనంతరం కానిస్టేబుల్‌ను మంజన్నకు క్షమాపణ చెప్పేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య దిగువ స్థాయి పోలీసు సిబ్బందికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.ప్రజలు, హుళిమావు ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన తర్వాతే ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని ఓ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం విచారణ కోసం అతడిని తిరిగి పిలిపించారు.ఈస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ బనోత్ గతంలో మాట్లాడుతూ.. హుళిమావు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకునే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగానికి పాల్పడటానికి సంబంధించిన నిబంధనలతో పాటు వర్తించే ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంజన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.Janata Dal (Secular) leader Manjunath C., popularly known as Gottigere Manjanna, 65, was arrested for allegedly assaulting an on-duty traffic police constable at Gottigere Junction in Bengaluru.According to police, the incident occurred around 3 p.m. on Sunday, August 16,… https://t.co/Pbm8jwfMLZ pic.twitter.com/xCGTtAQxFg— Hate Detector 🔍 (@HateDetectors) August 17, 2026 -
కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్.. విజయ్‌కు గుడ్‌న్యూస్
ఢిల్లీ: కావేరి జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు 12 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినట్లు సమాచారం.కావేరి నీటి విడుదలపై కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నీటి లభ్యత, రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై కర్ణాటక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కావేరి అథారిటీ నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.అసలు కథ ఇదే.. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం ముదిరింది. సుప్రీంకోర్టు తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక అమలు చేయాలని స్పష్టం చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు కావేరి నీటి విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంతటి వివాదం ఎందుకు? ఈ నీటి పంచాయితీ ఎక్కడ మొదలైంది?..బ్రిటిష్ కాలం నుంచే వివాదం.. కావేరి నది కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో పుట్టి.. కర్ణాటక, తమిళనాడు మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కావేరి నీటి పంపకం రెండు రాష్ట్రాలకూ అత్యంత కీలకంగా మారింది. కావేరి నీటి పంపకంపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. బ్రిటిష్ కాలం నాటి 1892, 1924 ఒప్పందాల నుంచే నీటి వినియోగంపై విభేదాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న కర్ణాటకలో కొత్త ప్రాజెక్టులు, సాగు విస్తరణతో దిగువన ఉన్న తమిళనాడుకు నీటి లభ్యత తగ్గుతోందని ఆ రాష్ట్రం చాలాకాలంగా వాదిస్తోంది.1986లో తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వివాదం అధికారికంగా అంతర్రాష్ట్ర జల వివాదంగా ముందుకు వచ్చింది. 1990లో కావేరి జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటైంది. 2007లో ట్రైబ్యునల్ తుది తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కూడా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి మధ్య నీటి పంపకంపై న్యాయపోరాటం కొనసాగింది. 2018లో సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ అవార్డులో కొన్ని మార్పులు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. అనంతరం కేంద్రం కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, సంబంధిత వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కావేరి నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సంస్థలు కీలకంగా మారాయి.కర్ణాటక అభ్యంతరం.. అయితే కావేరి నీటి పంపకం వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో వర్షాలు తక్కువగా ఉండి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు తమిళనాడుకు నీటిని విడుదల చేయడం తమ రైతులకు ఇబ్బందిగా మారుతుందని కర్ణాటక చెబుతోంది. మరోవైపు కావేరి డెల్టాలో పంటలకు నీరు అవసరమని, తమకు కేటాయించిన వాటాను కర్ణాటక విడుదల చేయాల్సిందేనని తమిళనాడు వాదిస్తోంది. తాజా వివాదంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కావేరి వివాదం కేవలం నీటి పంపకానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. రెండు రాష్ట్రాల రైతుల జీవనాధారం, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయాలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటకలో నీరు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగితే.. తమిళనాడులో తమకు రావాల్సిన నీటిని కర్ణాటక అడ్డుకుంటోందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే ప్రతి ఏడాది వర్షాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, పంటల అవసరాలు మారినప్పుడల్లా కావేరి వివాదం మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నీటి పంచాయితీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. -
తమిళుల కాల్చివేతపై భగ్గుమన్న విజయ్ సర్కార్
సాక్షి, చెన్నై: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వేటగాళ్లనే అనుమానంతో అటవీ శాఖ అధికారులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే ఆ ముగ్గురు తమిళులు కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. వాళ్లు వేటగాళ్లు కాదని.. రైతులు అని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఘటనను తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటక అటవీ శాఖ వివరణపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఆగస్టు 15 తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆంటోనీ సామి, జాన్ రోజ్ పీటర్, కుమార్ అనే ముగ్గురు తమిళులు మృతి చెందారు. వీరు చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలోని గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. తమిళులపై జరిగిన ఈ ఘటనను ఖండించిన ఆయన.. కర్ణాటక అటవీ శాఖ చెబుతున్న వివరణ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర, ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్, డీకే శివకుమార్ సర్కార్‌ను కోరారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి నిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.స్టాలిన్ ఆగ్రహంఈ ఘటనపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు తమిళ రైతుల కాల్చివేత ఘటన దిగ్భ్రాంతికరమని పేర్కొన్న ఆయన.. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగకూడదు. కాల్పులకు బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి" అని స్టాలిన్ అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై స్పందించడంలో ఆలస్యం చేయకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు: కర్ణాటక అధికారులుమరోవైపు కర్ణాటక అటవీ అధికారులు మాత్రం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వన్యప్రాణుల వేట కోసం వచ్చారని తెలిపారు. అటవీ సిబ్బందిని ఎదుర్కొన్న సమయంలో వారు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరిపామని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, వేటకు ఉపయోగించిన వస్తువులు, అడవి జంతువుల మాంసంతో ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.‘వేట ఆరోపణల్లో నిజం లేదు’.. ప్రతిపక్షాల ఆగ్రహంఅయితే తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు కర్ణాటక అధికారుల వాదనలను ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులు నిజంగానే వేటకు పాల్పడ్డారా? కాల్పులు అనివార్యమా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పీఎంకే నేత అన్బుమణి రామదాస్ ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ నేతలు కూడా కాల్పుల్లో పాల్గొన్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పారు. కాల్పులు ఆత్మరక్షణలో భాగమా? లేదంటే ఉద్దేశపూర్వక చర్యా? అనేది విచారణలో తేలనుంది.కావేరీ జలాలు.. మేకెదాటు విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇవాళ సుప్రీం కోర్టులో తమిళనాడు వేసిన పిటిషన్(నీటి విడుదల కోసం..) విచారణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ముగ్గురు తమిళుల మృతితో ఇటు రాజకీయంగానూ ఘర్షణలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. -
‘మమ్మల్ని ఏపీలో కలిపేయండి’.. కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.వై. గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. తన నియోజకవర్గమైన మోళకల్మూరుకు ప్రభుత్వాలు వరుసగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఈ ప్రాంతాన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కలిపేయడం లేదా చల్లకెరె తాలూకాలో విలీనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.మోళకల్మూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గోపాలకృష్ణ..‘మోళకల్మూరు ఎవరికీ కనిపించడం లేదు. ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం లభిస్తున్నా ఈ పట్టణం ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా తిరిగి ఎన్నిక కావడం లేదు. ఈ పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా లేదా చల్లకెరె తాలూకాలో చేర్చినా బాగుంటుంది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది’ అంటూ ఆవేదనతో కామెంట్స్ చేశారు. కాగా, మోళకల్మూరు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.ఖండించిన ఎమ్మెల్యే..అయితే తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన కొద్ది గంటల్లోనే గోపాలకృష్ణ వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. మోళకల్మూరు తాలూకాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని, ముఖ్యంగా సాగునీటి సౌకర్యాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే తాను కోరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని తాను డిమాండ్ చేసినట్లు వచ్చిన ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని స్పష్టం చేశారు.పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగోపాలకృష్ణ తాజా వ్యాఖ్యలకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంపై ఆయన ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ, సీనియర్ నేతలను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము తీవ్రంగా బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 1997 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోపాలకృష్ణ, 2018 నుంచి 2023 వరకు బీజేపీలో ఉన్నారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆయన గతంలో పేర్కొన్నారు. -
12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
ఒక సాదాసీదా దోశ వ్యాపారాన్ని కోట్ల రూపాయల స్థాయికి చేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫుడ్ బిజినెస్‌లో కోట్ల రూపాయలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వడ్డించే వంటకాన్ని సరిగ్గా, పరిశుభ్రంగా అందిస్తే వ్యాపారం విజయవంతం కావచ్చని ముంబైలోని బెన్నె దోస రెస్టారెంట్ నిరూపించిందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా అంటున్నారు. బెన్నె దోశ లేదా వెన్న దోశ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తూ దాని సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.ముంబైలోని బాంద్రాలో కేవలం 12 సీట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ‘బెన్నె’ (Benne) దోశ కేఫ్, ప్రస్తుతం రూ. 350 కోట్ల విలువైన బ్రాండ్‌గా ఎదిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాను ఆకర్షించింది. ప్రముఖ దోశల చైన్ అయిన 'బెన్నె' ఇంత భారీ విజయం సాధించడానికి కారణమని తాను నమ్మే విషయాలను గోయెంకా విశ్లేషించారు. ఒక నిర్దిష్టమైన మెనూ, తెలివైన నిర్వహణ, అందుబాటు ధరలు, అన్నింటికన్నా ముఖ్యంగా, ఆ బ్రాండ్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్ లాంటి అంశాలను ఆయన పేర్కొన్నారు.దావణగెరె-శైలి బెన్నె (వెన్న) దోశ స్పెషల్ : చాలా మందికి అలవాటైన పెద్ద, పలుచని, కరకరలాడే దోశలలా కాకుండా, ఈ కర్ణాటక స్టైల్ దోశ విభిన్నంగా ఉంటుంది. చిన్నగా, లోపల మెత్తగా ఉండి, వెన్నతో నిండుగా ఉంటుంది. ఈ విలక్షణమైన శైలే బెన్నెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.Why has ‘Benne’ succeeded so spectacularly?- One hero product: Davangere-style butter dosa- Small menu, easy to perfect and replicate- Electronic self order + self service creates engagement - Affordable enough to become a habit- Long queues created social media buzz-… pic.twitter.com/VcpMCEX2lB— Harsh Goenka (@hvgoenka) August 9, 2026 అఖిల్ అయ్యర్, శ్రియా నారాయణ్ అనే భార్యాభర్తలు ప్రారంభించిన ఈ స్టార్టప్, దేశంలోని ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్లకు గట్టి పోటీనిస్తోంది. ముంబైలో అథెంటిక్ కర్ణాటక/బెంగళూరు శైలి దావణగెరె బెన్నె దోశ దొరకకపోవడంతో, ఈ రుచిని అందరికీ అందించాలనే ఆశయంతో ఈ జంట స్వయంగా కేఫ్ పెట్టాలనుకున్నారు. 2024 లో ముంబైలోని బాంద్రాలో కేవలం 12 మంది కూర్చునే చిన్న అవుట్లెట్తో ప్రయాణం మొదలైంది. సాంప్రదాయ దక్షిణ భారత శైలి హోటల్ అయిన దానికి వారు 'బటర్' అని పేరు పెట్టారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్ దీని విజయానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, వారు దావణగెరె శైలి వెన్న దోశను తమ కాన్సెప్ట్‌గా చేసుకోవడమే అంటారు హర్ష గోయెంకా. సాధారణ రెస్టారెంట్లలా వంద రకాల మెనూ కాకుండా, కేవలం 'దావణగెరె స్టైల్ బెన్నె దోశ'పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అంతేకాదు సరైన చట్నీ రుచి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు, సాంప్రదాయ రుచి కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుండి కాస్ట్ ఐరన్ పెనాలను తెప్పించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వ్యాపారం పెరిగేకొద్దీ అదే పద్ధతిని, రుచిని అందించేలా జాగ్రత్త వహించారు. క్విక్-సర్వీస్ రెస్టారెంట్‌కు, ఆ సరళత మరో పెద్ద ప్రయోజనం. ఫలితం ఈ కేఫ్ రోజుకు 800 పైగా దోసలు విక్రయిస్తూ, నెలకు రూ.1 కోటి రాబడిని అందుకుంటోంది.ఇక బెన్నే ఎలక్ట్రానిక్ సెల్ఫ్-ఆర్డరింగ్, సెల్ఫ్-సర్వీస్‌ను ఉపయోగిస్తుంది, దీనివల్ల విస్తృతమైన టేబుల్ సర్వీస్ అవసరం తగ్గడమే కాకుండా, కస్టమర్లను కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తుంది. తద్వారా క్యూలో నిల్చునే కష్టాలు లేకుండా, రెస్టారెంట్‌కు ప్రజలకు త్వరగా సేవ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అయినా ఈ రెస్టారెంట్ వద్ద ఆహార ప్రియులు బారులు తీరిన వైనం ఈ వెన్న దోశ క్రేజ్‌కు అద్దం పట్టాయి. అంతేనా దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ వంటి సెలబ్రిటీలు రెస్టారెంట్‌ను సందర్శించడం, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిని మరింత పెంచాయి. ఇపుడీ బెన్నె దోశ ఖ్యాతి ముంబైలో అనేక శాఖలతో పాటు, ఢిల్లీలోని బ్రాంచ్‌లో కూడా వెలుగొందుతోంది. -
కర్ణాటకలో కొత్త బిల్లు.. ఆరెస్సెస్‌కు చెక్ పెట్టేందుకేనా?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్-ఆరెస్సెస్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ భవనాలు, భూములు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు తదితర ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వినియోగించుకునే విధానాన్ని నియంత్రించేందుకు సిద్ధమైన కొత్త బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం ఆరెస్సెస్‌ను కట్టడి చేయడమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.‘కర్ణాటక రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెమైసెస్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ బిల్–2026’ పేరుతో తీసుకొస్తున్న ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆస్తుల వినియోగానికి స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాల కోసం ప్రభుత్వ స్థలాలను ఉపయోగించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసినా, వాటికి నష్టం కలిగించినా చర్యలు, జరిమానాలకు అవకాశం ఉండనుంది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాత్రం ఈ బిల్లు ఏ ఒక్క సంస్థను లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులను రక్షించడం, వాటి వినియోగంలో జవాబుదారీతనం తీసుకురావడమే ఉద్దేశమని చెప్పారు. ప్రత్యేకంగా ఆరెస్సెస్, ఏదైనా సంస్థ, క్లబ్, యూనియన్ లేదా ఎన్జీవోను అడ్డుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు.అయితే, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరెస్సెస్ ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2025లో ప్రభుత్వం ఇలాంటి వినియోగంపై నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, ఆ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టులో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు అదే అంశానికి చట్టబద్ధమైన రూపం ఇవ్వడానికి కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 2026 జూన్‌లో ప్రియాంక్ ఖర్గే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు బహిరంగ లేఖ రాయడం కూడా ఈ పరిణామానికి రాజకీయ నేపథ్యాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆరెస్సెస్ చట్టపరమైన నమోదు, ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాల్లో పారదర్శకత, పన్నుల నిబంధనలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తాజాగా కేబినెట్ ఆమోదించిన బిల్లుపై సహజంగానే ఆరెస్సెస్ పేరు చర్చకు వచ్చింది. కొన్ని రాజకీయ వర్గాలు ఇది ఆరెస్సెస్ కార్యకలాపాలపై నియంత్రణ పెంచే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం “నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి” అని చెబుతోంది.ఈ బిల్లు కేవలం ఆరెస్సెస్ కార్యక్రమాలకే పరిమితం కాదు. ప్రభుత్వ భూములు, భవనాలు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు వంటి ప్రజా ఆస్తులను ఉపయోగించే ప్రైవేటు సంస్థలు, సంఘాలు, అసోసియేషన్లు, సొసైటీలు అన్నింటికీ ఒకే విధమైన అనుమతి వ్యవస్థను తీసుకురావడం ప్రతిపాదనలో ఉంది. అనుమతి లేకుండా వినియోగించడం లేదా ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అంశాలపై కూడా చర్యలు ఉండనున్నాయి. అయితే అసలు రాజకీయ పరీక్ష ఇక ముందే ఉంది. కేబినెట్ ఆమోదించిన బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సి ఉంది. అక్కడ ప్రతిపక్షం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? ప్రభుత్వం నిబంధనలను ఎలా అమలు చేస్తుంది? ఆరెస్సెస్ సహా ఇతర సంస్థలు దీనిపై న్యాయపరంగా స్పందిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
వణికించిన భీమన అమావాస్య.. రాజ్‌కుమార్ కిడ్నాప్ జరిగిందిలా..
బెంగళూరు: నిన్న ఆగస్టు 12(బుధవారం) అమావాస్య. శ్రావణమాసంలో వచ్చే ఈ అమావాస్యను కన్నడనాట భీమన అమావాస్యగా పిలుస్తుంటారు. ఈ రోజు కన్నడనాట కలకలం చెలరేగే ఘటన చోటుచేసుకుంది... జూలై 30, 2000 వ సంవత్సరం.. రాష్ట్రమంతా భీమన అమావాస్య వేడుకల్లో నిమగ్నమై ఉన్న వేళ, కన్నడ చలనచిత్ర రత్నం, అభినవ భార్గవ డాక్టర్ రాజ్‌కుమార్ కిడ్నాప్ ఉదంతం కర్ణాటక చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. గజనూరులోని తన ఫామ్‌హౌస్‌లో బోరు బావి పనులు చూసుకునేందుకు వెళ్లిన రాజ్‌కుమార్‌ను అడవి గజదొంగ వీరప్పన్ బందీగా చేసుకున్నాడు. రాత్రి 9:30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు, రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు.అతని భార్య పార్వతమ్మకు ఒక ఆడియో క్యాసెట్‌ను అప్పగించి, ‘అయ్యా, పదండి’ అంటూ ఆయన్ని అడవుల్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కర్ణాటక ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకున్న పార్వతమ్మ, ఆ క్యాసెట్ అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆ తర్వాత మొదలైన 108 రోజుల కిడ్నాప్ ఉదంతం, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారింది. జర్నలిస్టు ఆర్ఆర్ గోపాల్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, అడవిలోకి పలుమార్లు వెళ్లి చర్చలు జరిపారు. రాజ్‌కుమార్ అపహరణతో కర్ణాటకలో వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. అభిమానులు రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు.అయితే అడవిలో బందీగా ఉన్న సమయంలో కూడా రాజ్‌కుమార్ చాలా ప్రశాంతంగా యోగా, ప్రాణాయామం చేసుకునేవారని, ఆయన నిబ్బరం వీరప్పన్‌ను సైతం ఆకట్టుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుదీర్ఘ చర్చలు, ఉత్కంఠభరిత పరిణామాల అనంతరం, 108 రోజుల తర్వాత నవంబర్ 15, 2000న రాజ్‌కుమార్ క్షేమంగా విడుదలయ్యారు. ఆయన రాకతో కర్ణాటక ప్రజల్లో ఆనందోత్సాహాలు నిండాయి. ఈ ఘటనపై 2013లో ‘అత్తహాస’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పటికీ భీమన అమావాస్య వచ్చిందంటే, ఆ 108 రోజుల ఆందోళన, ప్రజల ఆవేదన అందరికీ గుర్తుకు వస్తుంది. -
మొబైల్ గేమ్స్‌తో అప్పుల ఊబి.. వివాహిత ఆత్మహత్య
కర్ణాటక: ఆన్లైన్ గేమ్‌లు, జూదాలకు బానిసై అప్పులు చేసిన వివాహిత చివరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. రంజిత (28) మృతురాలు. స్థానికంగా ప్రైవేటు కంపెనీలో కారి్మకురాలైన రంజితకు, భర్త అరుణ్, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. గుల్బర్గాకు చెందిన వీరు 5ఏళ్ల క్రితం నెలమంగలకు వచ్చి స్థిరపడ్డారు. ఏడాది కాలంగా రంజిత మొబైల్లో ఆన్లైన్ గేమ్స్, జూదాలకు అలవాటుపడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. సుమారు రూ.15లక్షల వరకూ అప్పులు చేసింది. భర్త అరుణ్ ఎలాగో అప్పులన్నీ తీర్చాడు. అయినా రంజిత గేమ్స్ ఆడుతూ తిరిగి అప్పులు చేసింది. 2 రోజుల క్రితం భర్త పనిమీద గుల్బర్గాకు వెళ్లగా, రంజిత మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కుళ్ళిన మటన్, చెడిపోయిన పండ్లు, మాడిన నూనె : మంత్రి సంచలన ప్రకటన
సాక్షి,బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని బెంగళూరులో ఆహార భద్రతా అంశంలో ముమ్మర తనిఖీలు కఠిన, చర్యలు సాగుతున్నాయి. కర్ణాటక ఆహార భద్రత మరియు ఔషధ పరిపాలన సంస్థ (FSA) నగరంలోని ఫైవ్-స్టార్ హోటళ్లు, ప్రీమియం రెస్టారెంట్లు, పబ్‌లు, గిడ్డంగులు, జెప్టో (Zepto), జొమాటో (Zomato) వంటి క్విక్-కామర్స్ వేర్‌హౌస్‌ల వరపెద్ద ఆహార సరఫరా గొలుసుల వంటి ఆహార సేవా వ్యవస్థ అంతటా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ఇటీవల ఫైవ్-స్టార్ హోటళ్లలో జరిపిన తనిఖీలలో గడువు ముగిసిన పాలు, కుళ్ళిన మాంసం, బూజు పట్టిన కూరగాయలు, బొద్దింకలు వంటి విషయాలు బయటపడ్డాయి. అలాగే హోస్కోట్లోని జెప్టో గిడ్డంగిపై జరిపిన దాడిలో అపరిశుభ్రమైన పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయా హోటల్స్‌లో అపరిశుభ్రత, నిర్వహణ తీరుపై అధికారులు కనుగొన్న విషయాలు, దాడుల తర్వాత ఏమి జరుగుతుందనే విషయాలపై ఎన్డిటివితో ప్రత్యేకంగా మాట్లాడారు.షాకింగ్ విషయాలుబెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటళ్లు, ప్రీమియం రెస్టారెంట్లు, జెప్టో, జొమాటో లాంటి క్విక్-కామర్స్ వేర్‌హౌస్‌ల వరకు ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కుళ్ళిపోయిన మటన్, గడువు ముగిసిన చికెన్, పాలు, బూజు పట్టిన పండ్లు, పదేపదే వాడి, నల్లగా మారిపోయిన వంటనూనె లాంటి షాకింగ్ విషయాలను అధికారులు గుర్తించారు. ఒక పబ్‌లో మరుసటి రోజు తయారీ తేదీ వేసి ఉన్న చికెన్ ప్యాకెట్ కూడా దొరికింది.ఆరోగ్య మంత్రి ప్రకటనఒక హోటల్ పదేపదే వాడి, బాగా నల్లబడిన వంట నూనెను ఉపయోగిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఆ నూను ఎంత నల్లగా ఉందంటే, ఆ స్థితిలో ఉన్న నూనెను వీధి వ్యాపారులు కూడా వాడకపోవచ్చని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేవలం సంస్థలను శిక్షించడం తమ లక్ష్యం కాదని, వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించి, పరిశుభ్రత పాటించడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి వారు ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసేలా చూడటమే తమ పని అని మంత్రి యు.టి. ఖాదర్ చెప్పారు. ప్రజల ఆరోగ్య భద్రత, ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిశ్రమకు గట్టి సందేశం పంపడానికే ముందుగా పెద్ద హోటళ్ల నుంచే ఈ తనిఖీలు ప్రారంభించినట్లు చెప్పారు. తమ వద్ద అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పుకునే హోటళ్లు... వినియోగదారుల్లో నమ్మకం కలిగించేందుకు తమ వంటశాలలు (Kitchens), స్టోర్‌రూమ్‌లను బహిరంగంగా చూపించాలని లేదా స్క్రీన్ల ద్వారా ప్రదర్శించాలని మంత్రి సవాలు విసిరారు. ఇదీ చదవండి: జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...!ఇందిరా క్యాంటీన్లు, లక్ష్యాలుప్రభుత్వ పరిధిలోని 'ఇందిరా క్యాంటీన్ల'ను కూడా తనిఖీ చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో PGలు, హాస్టళ్లు, పెళ్లిళ్లకు ఆహారం అందించే కేటరింగ్ ఏజెన్సీలపై కూడా దాడులు ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు, మూసివేతలతోపాటు, లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా, ఆహార భద్రతా నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: నిబంధనలు గాలికి,అపరిశుభ్రత : జెప్టోకు భారీ షాక్ -
‘రాము.. ఇంటికి రా..!’ అర్ధరాత్రి ప్రియుడికి భార్య ఫోన్
కర్ణాటక: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపి అతని మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటనలో 6 నెలల తర్వాత సదరు నిందితురాలు పోలీసుల వలలో చిక్కింది. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కడక్లాట్లో ఈ దురంతం చోటు చేసుకుంది. వివరాలు.. రఘు గవాడే(40) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య బంగారి గవాడే, ప్రియుడు రాము రాణా నిందితులు. గత ఫిబ్రవరి 7న రాజు గవాడేను హత్య చేసి, భర్త పని కోసం వేరే ఊరికి వెళ్లాడని అందరినీ కిరాతక భార్య నమ్మించింది. బంగారి గవాడేకు రాము రాణాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యపై అనుమాన పడుతూ రఘు ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి మద్యం తాగి వచ్చి ఘర్షణ పడ్డాడు. దీంతో ఆక్రోశానికి గురైన భార్య ప్రియుడు రామును పిలిపించి గాఢ నిద్రలో ఉన్న రఘు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో పొలానికి శవాన్ని తరలించి దాచిన నిందితులు ఫిబ్రవరి 8న చెరకు చేనులో గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారని దర్యాప్తులో తేలింది. ఘటనపై కడక్లాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. -
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్‌గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్‌గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్‌కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. కాంగ్రెస్ నేత హత్య
బెంగళూరు: కర్ణాటకలోనియ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉడుపి జిల్లాలో కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు డేవిడ్ డిసౌజా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో డేవిడ్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి డిసౌజాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, డిసౌజా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో పాటు కాంట్రాక్టు పనులు చేసేవారు. గతంలో పంచాయతీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దీంతో ఆయన హత్య స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.అయితే, డేవిడ్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
ఏడాది తర్వాత అస్థిపంజరంగా..!
కట్టుకున్న తోడు లేదు.. కొడుకు కూడా దూరమయ్యాడు. కన్నకూతురుకి ఏమైందో తెలియదు?. ఒంటరి జీవితంతో పోరాడుతూ రోజులు గడిపిన ఆమెను చివరకు మృత్యువు కూడా నిశ్శబ్దంగానే తీసుకెళ్లింది. అయితే ఆమె మరణించిన విషయం చెప్పేందుకు, కన్నీరు పెట్టేందుకు కూడా ఎవరూ లేకపోయారు. చివరకు ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ విషాదం బయటపడింది. పోలీసులు వచ్చి తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.మెట్రో నగరం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ.. చివరకు తన ఇంట్లోనే కన్నుమూసింది. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తలుపులు తెరిచిన పోలీసులు చూసిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే ఆ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిపోయింది.బెంగళూరులోని బాగలగుంట ప్రాంతం హవనూర్ లేఅవుట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభించిన అస్థిపంజరం 52 ఏళ్ల దాక్షాయిణిదిగా గుర్తించారు. దాక్షాయిణి కొంతకాలంగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఉమేశ్ దాదాపు పదేళ్ల క్రితం మరణించగా.. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.భర్త, కొడుకు మరణాల తర్వాత ఆమెను పలకరించేవారు కూడా లేకుండా పోయారని తెలుస్తోంది. ఏడాది పాటు ఆమె ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కూతురు-అల్లుడు సహా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు రాకపోవడంతో విషాదం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాగలగుంట పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాక్షాయిణి మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జనాలతో కిటకిటలాడే మహానగరంలో.. పక్కింట్లోనే ఓ మనిషి ఏడాది పాటు కనిపించకపోవడం, ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకపోవడం ఒంటరి జీవితాలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. -
30 మంది రెబల్స్ భేటీ.. డీకేకు చెక్ పెట్టే వ్యూహం?
-
రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ కోర్టు ముందు నిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో.. ఈ పరిణామం దర్శన్‌కు కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందనే చర్చ మొదలైంది.రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితులుగా దర్శన్, పవిత్ర గౌడ పేర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఏ14 నిందితుడు ప్రదోష్ ప్రస్తుతం అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు చట్టపరంగా మాఫీ సాక్షిగా(approver) మారే అవకాశం కల్పించాలని కోరాడు.కేసులో కొత్త మలుపుప్రదోష్ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే.. రేణుకాస్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సాక్షిగా మారితే కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రదోష్ చెప్పే వివరాలను కోర్టు ఎలా పరిగణిస్తుంది? అతడి వాంగ్మూలం కేసులో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.కోర్టు ముందుకు ప్రదోష్ప్రదోష్ ఇవాళో, రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. కేసులోని ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.2024 జూన్‌లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌పై హత్య కుట్ర, కిడ్నాప్, దాడి వంటి అభియోగాలు నమోదు చేసి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దర్శన్‌ను తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే.. ఈ కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటూ తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జైల్లో దర్శన్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరగ్గా, కర్ణాటక డీజీపీ దానిని పుకారుగా కొట్టి పారేశారు. ప్రదోష్ వాంగ్మూలం కీలకమవుతుందా?తాజాగా ఈ కేసులో ఏ14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తి సాధారణంగా కేసుకు సంబంధించిన కీలకసమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు అతడి అభ్యర్థనను అంగీకరిస్తే.. కేసులోని మరిన్ని వివరాలు, నిందితుల పాత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
30 ఫ్లస్.. డీకేకు చెక్ పెట్టే వ్యూహమా?
కేబినెట్ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో మొదలైన అసంతృప్తి మరింత తీవ్రరూపం దాలుస్తోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నిరసనలు కొనసాగిస్తుండగా.. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహిస్తుండడం.. ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతల అనుచరులు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట నిరసనలు కూడా చేపట్టారు. ముఖ్యంగా తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నేతలు.. ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. కొన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదని, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా అసంతృప్త నేతలు చెబుతున్నారు.ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యే..మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందిన ఇండీ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదని అనుచరులు చెబుతున్నారు. మరో నేత బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ గుండు రావు, ఎం. కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, ఎం.సీ. సుధాకర్, ఆర్బీ తిమ్మాపూర్, రహీం ఖాన్ వంటి పలువురు నేతలు కేబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి పదవుల ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత పాటించలేదని, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు తమ అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టగా.. మరికొందరు పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా: డీకేఅసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కఠినంగా స్పందించారు. రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని, రాజీనామా లేఖలు వస్తే నిమిషాల్లో ఆమోదిస్తామని హెచ్చరించారు. “రాజకీయాల్లో రాజీనామాలు సాధారణం. పార్టీ అన్నింటికంటే ముఖ్యం. ఓపికగా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, సహనం పాటించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అసంతృప్త నేతలకు సూచించారు. ఈ తరుణంలో.. డీకే శివకుమార్‌తో చర్చల అనంతరం కొందరు నేతలు మెత్తబడినట్లు సమాచారం.నేడు ఏం తేలనుంది?మంత్రి పదవులు దక్కని నేతలు నేడు రహస్యంగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో.. తమ డిమాండ్లు, పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే మార్గాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీఎం డీకే వైఖరి కారణం.. అవసరమైతే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని కూడా వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల సమావేశం నేపథ్యంలో ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.అధిష్టానం రంగంలోకి..కర్ణాటక కాంగ్రెస్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపింది. ఇప్పటికే ఆయన సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. ఇవాళో, రేపో అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా హైకమాండ్ ప్రయత్నిస్తోంది.ప్రభుత్వానికి ముప్పు ఉందా?కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి 135 స్థానాలు గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్క్ కంటే 22 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.అందుకే ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పడిపోయేంత సంఖ్యాబలం సంక్షోభం లేదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటకు వెళితే తప్ప ప్రభుత్వానికి తక్షణ ముప్పు ఉండదన్న అంచనా ఉంది. అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. సీనియర్ నేతల అసంతృప్తి కొనసాగితే అది డీకే శివకుమార్ నాయకత్వానికి, పార్టీ అంతర్గత ఐక్యతకు రాజకీయ సవాల్‌గా మారే అవకాశం ఉంది.ఇప్పటి వరకు మంత్రి పదవుల కోసం జరిగిన అసంతృప్తి.. నేడు జరిగే ఎమ్మెల్యేల సమావేశంతో ఏ మలుపు తిరుగుతుందన్నదే కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానం వారిని బుజ్జగిస్తుందా? లేదంటే డీకే శివకుమార్ కఠిన వైఖరినే కొనసాగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. -
సీఐఎల్ ల్యాబ్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి
బెంగళూరు: కర్ణాటక,కడేచూర్ సీఐఎల్ ల్యాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకై ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.మృతులు మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్ మరియు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా వాసిగా తెలుస్తోంది. ముగ్గురి వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం. ఈఘటన పారిశ్రామిక ప్లాంట్ లోపల తెల్లవారుజామున 1 గంట నుండి 2 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. సీఎంకు షాకిచ్చిన మండలి చైర్మన్
కర్ణాటక రాజకీయాల్లో ‘రాజీనామా’ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సీఎం డీకేకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం కొంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం చేయాలన్న చర్చలు రాజకీయ దుమారం రేపగా, ఇప్పుడు అదే చర్చ శాసన మండలికి చేరింది. మండలి ఛైర్మన్ బసవరాజ్ హొరట్టికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరినట్లు హొరట్టి స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హొరట్టి వెంటనే స్పందిస్తూ..‘ఛైర్మన్‌ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించదు.. సభే ఎన్నుకుంటుంది. తొలగించాలంటే సభా నిబంధనల ప్రకారమే జరగాలి’ అని కౌంటర్ ఇచ్చారు. తన పదవీకాలం 2028 వరకు ఉందని, తనను తొలగించాలంటే సభలో అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిందేనని హొరట్టి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.తనను తొలగించాలంటే కనీసం 10 మంది సభ్యులు 14 రోజుల ముందుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత సభలో జరిగే ఓటింగ్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 1956 నుంచి ఏ చైర్మన్ కూడా ప్రభుత్వం మధ్యలో రాజీనామా చేయించలేదని, తనను తొలగించడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 75 సభ్యుల కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్‌కు 38 మంది సభ్యులతో మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో హొరట్టి కొనసాగింపుపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. దీంతో, ముఖ్యమంత్రి, మండలి చైర్మన్ మధ్య పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది.#WATCH | Bengaluru, Karnataka: On the removal and changes of names from the Karnataka Legislative Council Chairman's list, BJP leader Basavaraj Horatti says, “...Whatever decision is taken by the House, the House is supreme. I will go to the House. Whatever the House decides, I… pic.twitter.com/q9fnQJC0Ir— ANI (@ANI) August 3, 2026అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం శాసన మండలి చైర్మన్ పదవికి సలీం అహ్మద్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏఎస్ పొన్నన్న, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉమాశ్రీ పేర్లను కూడా కాంగ్రెస్ ఆమోదించింది. కాగా, పార్టీ ముందుగానే చైర్మన్ పేరును ప్రకటించడంపై హొరట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
అసంతృప్తి నేతలకు డీకే శివకుమార్ షాక్!
కర్ణాటక కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కేటాయింపు తర్వాత మొదలైన అసంతృప్తి చర్చలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెక్ పెట్టారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంపై ఆయన నేరుగా స్పందించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రాజీనామాలు సర్వసాధారణమని.. దాన్నొక టీ కప్పులో తుపానుగా చూపించే ప్రయత్నం చేశారు.మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. “రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంతరాయగౌడ వి. పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్.. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ధర్మ్సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని.. అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. “నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. నేను రాజీనామా చేయలేదు. జీ. పరమేశ్వర కూడా ఓపికగా ఎదురుచూశారు. పార్టీలో ఉంటేనే భవిష్యత్ ఉంటుంది” అని డీకే వ్యాఖ్యానించారు.మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి బయటపడటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య సమన్వయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి. పార్టీని వీడే నిర్ణయం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ.. రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది. -
డీకే శివకుమార్‌కు బిగ్ షాక్ 12 మంది కాంగ్రెస్ MLAల రాజీనామా?
-
19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ఆశావహులు ఎంతో ఆశతో ఎదురు చూసిన మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. బెంగళూరు లోక్‌భవన్‌లో సోమవారం సాయంత్రం 19 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. జూన్ 3వ తేదీన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో పడుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో కేబినెట్ విస్తరణకు మార్గం సుగమం అయింది. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు అదే రోజు మొత్తం 13 మంది నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 33కు చేరింది. సిద్ధరామయ్య మంత్రివర్గ సభ్యుల సంఖ్య 34 కావడం గమనార్హం. కాగా సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న దాదాపు 19 మంది డీకే మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. సీనియారిటీ, పలుకుబడికి జాబితాలో ప్రాధాన్యత లభించినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య, బీజేపీ, జేడీఎస్ నేతలు గైర్హాజరయ్యారు. చివరి క్షణంలోనూ మార్పులు.. చేర్పులు తాజామంత్రివర్గ విస్తరణ జాబితాలో తొలుత ఒక మహిళ పేరు ఉన్నప్పటికీ.. అటు తర్వాత వేరొకరితో ఆ స్థానాన్ని భర్తీ చేయడం గమనార్హం. దీనితో డీకే మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి నెలకొంది. చివరి మూడు గంటల్లోనే మూడు సార్లు మంత్రులు, స్పీకర్ అభ్యర్థుల జాబితా మారడం గమనార్హం. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్సీ గాయత్రీ శాంతేగౌడను చివరి నిమిషంలో తప్పించి తాజా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బోసురాజుకు అవకాశం ఇచ్చారు. అలాగే తొలి జాబితాలో మహంకాళు వైద్య పేరు ఉంటే, దీనిని తొలగించి తాజా మాజీ మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్‌తో భర్తీ చేశారు. తమకు తాజా విస్తరణలో చోటు లభించకపోవడంతో పలువురు సీనియర్లు, ఆశావహులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొందరు ఏకంగా శాసన సభ్యత్వానికే రాజీనామా సమరి్పస్తామని బెదిరించే వరకూ పరిస్థితి వెళ్లింది. అయితే అసమ్మతిని సహించబోమని అధిష్టానం స్పష్టం చేసింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 19 మంది మంత్రులు.. 1. డాక్టర్ అజయ్‌సింగ్, 2. హెచ్‌సీ బాలకృష్ణ, 3. కేఎస్ బసవంతప్ప, 4. బసవ రాజరాయరెడ్డి, 5. ఎన్.చలువరాయస్వామి, 6. లక్ష్మణ సవది, 7. సారెకొప్ప మధు బంగారప్ప, 8. ఎస్ఎస్.మల్లికార్జున్, 9. బి.నాగేంద్ర, 10. నరేంద్ర స్వామి, 11. పుట్టరంగశెట్టి, 12. టి.రఘుమూర్తి, 13. రిజ్వాన్ అర్హద్, 14. రుద్రప్ప లమాణి, 15. సంతోష్ ఎస్.లాడ్, 16. కేఎం శివలింగేగౌడ, 17. శివరాజ్ తంగడగి, 18. విజయానంద కాశప్పనవర్, 19. జమీర్ అహ్మద్‌ఖాన్ -
కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే!
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణ సోమవారం జరగనుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించిన 20 మంది కొత్త మంత్రుల జాబితా ఖరారైంది. లోక్‌భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 34 మంది సభ్యులున్న రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 20 మంత్రి స్థానాలను నేడు భర్తీ చేయనున్నారు.ఢిల్లీలో పార్టీ కేంద్ర పెద్దలతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌లు కాంగ్రెస్ హైకమాండ్‌తో ఈ భేటీలు నిర్వహించారు.మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకోనున్న 20 మంది నేతల జాబితా ఇదే..1. పీఎం నరేంద్రస్వామి2. శివరాజ్ తంగడగి3. రుద్రప్ప లామాಣಿ4. కేఎస్ బసవంత్రప్ప5. బీ నాగేంద్ర6. టీ రఘుమూర్తి7. బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్8. రిజ్వాన్ అర్షద్9. సంతోష్ లాడ్10. మధు బంగారప్ప11. పుట్టరంగశెట్టి12. మంకాల వైద్య13. అజయ్ సింగ్14. ఎన్ చలువరాయస్వామి15. కేఎం శివలింగే గౌడ16. హెచ్‌సీ బాలకృష్ణ17. గాయత్రి శాంతే గౌడ18. బసవరాజ్ రాయారెడ్డి19. విజయానంద్ కాశప్పనవర్20. లక్ష్మణ్ సవదిమాజీ స్పీకర్ యూటీ ఖాదర్ మంత్రివర్గంలోకి చేరడంతో, రోన్ ఎమ్మెల్యే జీఎస్ పాటిల్ కర్ణాటక శాసనసభ కొత్త స్పీకర్‌గా నియమితులవుతున్నారు. విరాజ్‌పేట ఎమ్మెల్యే ఏఎస్ పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే శాసనమండలిలో సీనియర్ సభ్యుడు సలీమ్ అహ్మద్ మండలి కొత్త చైర్మన్‌గా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఉమాశ్రీ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.ఇది కూడా చదవండి: పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా చివరి ఫొటో.. -
కావేరీ కత్తి.. విజయ్‌కు తొలి పరీక్ష!
తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి వేడి పుట్టిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి.. ఒకటి కర్ణాటకతో నీటి హక్కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? రెండోది.. రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?కావేరీ అంశం తమిళనాడులో కేవలం నీటి సమస్య మాత్రమే కాదు.. ఇది రైతుల జీవనాధారం, ప్రాంతీయ హక్కులు, రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడిన సున్నితమైన అంశం. అందుకే ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తుంటాయి.అఖిలపక్ష సమావేశం కోసం డీఎంకే ఒత్తిడికావేరీ వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.డీఎంకే వాదన ప్రకారం.. కావేరీ వంటి కీలక అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని డీఎంకే ప్రశ్నిస్తోంది.‘ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం’అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించడం లేదు. టీవీకే సీనియర్ నేత, మంత్రి సీటీఆర్ నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ.. కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని టీవీకే ఆరోపిస్తోంది.చర్చల నుంచి రాజకీయ విమర్శల దిశగా.. కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించిన విజయ్ ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు రాజకీయ దూకుడు కూడా కనిపిస్తోంది. విజయ్ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన కొద్ది రోజులకే.. మంత్రి ఆర్. నిర్మల్‌కుమార్ కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. డీకే శివకుమార్ కర్ణాటక ప్రయోజనాల కంటే డీఎంకే నాయకత్వం ప్రభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఆయన సొంత పార్టీ నేతగా కాకుండా డీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ విమర్శలు చేశారు.అయితే కావేరీ వంటి సున్నితమైన అంశంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.విజయ్ వ్యూహం వెనుక..అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు గతంలో కావేరీ వివాదం తీవ్రంగా మారిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలను ఆశ్రయించాయి. అయితే విజయ్ ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. సమస్యను నేరుగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కోసం బెంగళూరు వెళ్లాలని విజయ్ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే విజయ్‌కు అసలు పరీక్ష మొదలవుతుంది.రాజకీయ అనుభవం ఉన్న పార్టీల మాదిరిగా ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవాలా? లేక చర్చల ద్వారా పరిష్కారం సాధించే ప్రయత్నం చేయాలా? అనే విషయంలో ఆయన నిర్ణయం కీలకం కానుంది.కావేరీ నీటి వివాదం దశాబ్దాలుగా తమిళనాడు-కర్ణాటక మధ్య కొనసాగుతున్న సమస్య. ఇది మరీ ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ భావోద్వేగ అంశమే. డెల్టా ప్రాంత రైతులకు కావేరీ నీరు అత్యంత కీలకం. నీటి విడుదలలో ఆలస్యం జరిగిన ప్రతిసారి తమిళనాడులో రైతుల ఆందోళనలు, రాజకీయ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే ఈ అంశంలో ఏ ప్రభుత్వం బలహీనంగా కనిపించినా ప్రతిపక్షాలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది.డీఎంకే ఆందోళనతో మరింత వేడికావేరీ నీటి సమస్య, రైతుల అంశంపై టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ ఆందోళన ద్వారా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డీఎంకే భావిస్తోంది. మరోవైపు టీవీకే మాత్రం తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో రాజీ పడదని చెబుతోంది.విజయ్ ముందు రెండు మార్గాలుప్రస్తుతం కావేరీ వివాదం విజయ్ రాజకీయ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి.. మరోవైపు కర్ణాటకతో సున్నితమైన జల వివాదం.. ఇంకోవైపు రైతుల అంచనాలు.. ఈ మూడు అంశాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్‌కు ఎదురైంది. కావేరీ విషయంలో విజయ్ తీసుకునే నిర్ణయం కేవలం ఒక నీటి వివాదానికి పరిష్కారం చూపడమే కాదు.. ఆయన పరిపాలనా శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా మారనుంది. -
కేరళలో వర్ష బీభత్సం
తిరువనంతపురం: కేరళలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్రనష్టం మిగిల్చాయి. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 8 మంది చనిపోగా మరో 8 మంది గల్లంతయ్యారు. కనీసం 13 మంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మొత్తం 27 నివాసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 209 సహాయక శిబిరాల్లో వేల మంది ఆశ్రయం పొందుతున్నారని సీఎం సతీశన్ తెలిపారు. కర్ణాటకలో కుండపోత వానలు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొప్పాల్ జిల్లాలో కొండపక్కనున్న నివాసంపై మట్టి పెళ్లలు విరిగిపడి మూడేళ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా అగుంబెలో 24 గంటల వ్యవధిలో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కొడగు, ఉడుపి, చిక్కమగళూరు, సిర్సి, మంగళూరుల్లోనూ కుండపోతగా వాన కురిసింది. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లోనూ ఆదివారం విస్తారంగా వర్షాలు ముంచెత్తాయి. -
చిప్స్ ప్యాకెట్లో ప్లాస్టిక్ బొమ్మ బంతి.. బాలుడు మింగేయడంతో..
బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చిప్స్ ప్యాకెట్లో ఉన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మ బంతిని మింగడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన బాలుడిని ముకుంద్ మయూర్‌గా గుర్తించారు. అతడు మాజీ గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలు గౌరమ్మ, శంకర్ నాయక్‌ల మనవడు. సంతోష్, ఐశ్వర్య దంపతులకు ముకుంద్ ఒక్కగానొక్క కుమారుడు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముకుంద్ ఓ చిప్స్ ప్యాకెట్లో ఉన్న చిన్న ప్లాస్టిక్ గిఫ్ట్ బంతిని గుర్తించి ప్రమాదవశాత్తు మింగినట్లు తెలుస్తోంది. ఆ బొమ్మ అతడి గొంతులో ఇరుక్కుని ఊపిరాడకుండా చేసినట్లు అనుమానిస్తున్నారు. బాలుడిని వైద్య సహాయం కోసం తీసుకెళ్లినా అతడిని కాపాడలేకపోయారు.హున్సూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా స్నాక్స్ ప్యాకెట్లోకి ప్లాస్టిక్ బొమ్మ ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు పరిశీలించనున్నారు.మరో ఘటనఈ ఘటన జరిగిన ప్రాంతంలోనే కొన్ని నెలల క్రితం మరో ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో మైసూరు హున్సూర్లోని దొడ్డహెజ్జూర్ గ్రామంలో ఇంట్లో పూజ కోసం ఉంచిన ఎండిన మందార పువ్వు గొంతులో ఇరుక్కోవడంతో ఆరున్నర నెలల చిన్నారి చిన్మయ్ గౌడ మృతి చెందాడు. చిన్నారి తన అన్నతో ఆడుకుంటున్న సమయంలో ఇంటి తలుపు వద్ద ఉంచిన ఎండిన పువ్వును తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అన్న దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన సమయంలో చిన్నారి పొరపాటున దానిని మింగాడు.మొదట చిన్నారిని ప్రథమ చికిత్స కోసం హనగోడులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం మైసూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ చిన్నారి మృతి చెందాడు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
నా భార్యకు అక్రమ సంబంధం ఉంది.. అందుకే చంపేశా!
కర్ణాటక: కలహాలు కుటుంబాల ఊపిరి తీస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే హత్య, ఆత్మహత్య చేసుకుని పసిపిల్లలను అనాథలు చేయడం అధికమైంది. ఇదే మాదిరిగా భార్యకు అక్రమ సంబంధం ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పి, ఆమెను చంపి, తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెసగోడు గ్రామంలో జరిగింది. రఘు (41), భార్య గగన(38) మృతులు. వీరికి 13 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, 12, 6 ఏళ్ల వయసు గల పిల్లలు ఉన్నారు. చిక్కమగళూరులో బేకరి పెట్టుకొని జీవించేవారు. శుక్రవారం కారులో కెసగోడుకు వెళ్లారు. సాయంత్రం 6:30 గంటలకు రఘు బంధువులకు వీడియో కాల్ చేసి భార్యను హత్య చేస్తున్నట్లు చెప్పాడు. భార్యను కారులోనే గొంతు పిసికిచంపి, శవాన్ని పడేసి, ఊరికి సమీపంలో కారును నిలిపి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బంధువులు, పోలీసులు చేరుకుని గాలించగా, అతని శవం కనిపించింది, గగన జాడ లేదు, ఆమెను యగచి కాలువలో పడేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అరేహళ్లి పోలీసులు గాలింపు చేపట్టారు. -
చెత్త ఏరుకునే కుటుంబం నుంచి.. భారత క్రికెటర్‌గా
అతడిది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణ కోసం అతడి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటారు. పదమూడు మంది సంతానంలో అతడు ఒకడు. కడుపేద కుటుంబంలో దివ్యాంగుడిగా జన్మించిన అతడి కల మాత్రం పెద్దది.క్రికెటర్‌గా రాణించాలనే ఆశయంతో ఎన్నో సవాళ్లకు ఎదురునిలిచాడు. తన సంకల్ప బలంతో ఆటంకాలు అధిగమించి భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఓపెనర్ స్థాయికి ఎదిగాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఆగష్టు 5- 19 వరకు జరిగే టీ20 టోర్నమెంట్లో అతడు పాల్గొనబోతున్నాడు.ఇంతకీ అతడు ఎవరంటారా?.. రాజేశ్ కన్నూర్. కర్ణాటకకు చెందిన ఈ 27 ఏళ్ల క్రికెటర్.. మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత్ తరఫున తొలి సెంచరీ బాదిన దివ్యాంగ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. విజయాపురలోని మురికివాడలో జన్మించాడు రాజేశ్. అతడి కుటుంబం గుడిసెలో నివాసం ఉంటుంది. వారి గుడిసెకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు.అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో క్రికెటర్‌గా ఎదిగాడు రాజేశ్ కన్నూర్. అయితే, ఆటగాడిగా గుర్తింపు వచ్చినప్పటికీ అతడి ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. దివ్యాంగ భారత క్రికెట్ మండలి (DCCI) ఇప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో భాగం కాకపోవడమే ఇందుకు కారణం. డీసీసీఐని బీసీసీఐ ఇంతవరకు అనుబంధ సంస్థగా గుర్తించలేదని సమాచారం.కాబట్టి రాజేశ్ కన్నూర్ మ్యాచ్‌ల కోసం తన సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్నేహితులు, ఇతర దాతల సాయంతో అతడు కెరీర్‌ను నెట్టుకొస్తున్నాడు. ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..పదమూడు మంది సంతానంలో‘‘మా అమ్మానాన్న కాశీబాయి, చిన్నప్ప. విజయపురలో వాళ్లు చెత్తు ఏరుకుంటారు. మేము పదమూడు మందిమి సంతానం. ఏడుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు. పేదరికం కారణంగా నా చదువు పదో తరగతిలోనే ఆగిపోయింది.అయితే, చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న కోరిక నా మనసులో బలంగా నాటుకుపోయింది. కానీ దివ్యాంగుడినైందున నాతో ఎవరూ ఆడేవారు కాదు. గల్లీ క్రికెట్ ఆడుతున్న సమయంలో కొంతమంది స్నేహితులు దివ్యాంగులకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే సెంటర్ గురించి చెప్పారు.అదే నా కెరీర్లో టర్నింగ్ పాయింట్అది హుబ్బలిలో ఉంది. 2018లో నేను అక్కడ చేరాను. 2-3 ఏళ్ల పాటు అక్కడే ఆడాను. అయితే, కర్ణాటక దివ్యాంగ జట్టులో చేరిన తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది. కానీ ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ప్రయాణం చేసే సమయంలో నిధులు నేనే సమీకరించుకోవాల్సి వచ్చేది. నేను ఎప్పుడూ రైలులోనే ప్రయాణం చేసేవాడిని.అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం విమానంలో ప్రయాణిస్తా. ఇందుకు నా స్నేహితుడు విశ్వనాథ్ రాథోడ్ సాయం చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతాను కాబట్టి నాకు ఆదాయం వస్తుందని అంతా అనుకుంటారు. కానీ నేను ఇప్పటికీ సరైన క్రికెట్ కిట్ కొనుక్కోలేకపోయాను.సాధారణ క్రికెట్ మాదిరే ప్రజలు దివ్యాంగ క్రికెట్‌ను ఆదరించాలి. ప్రభుత్వం కూడా మాకు నిధులు కేటాయిస్తే బాగుంటుంది. కాగా రాజేశ్ కన్నూర్ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: మంచి సెలక్షన్.. వాషీ కంటే అతడే బెటర్ -
మళ్లీ కావేరీ వివాదం
ఎంతో సున్నితమైన నదీజలాల సమస్యను ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా వదిలేయటంవల్ల అది కాస్తా మరింత జటిలమవుతోంది. రాష్ట్రాలమధ్యా, రాష్ట్రాల్లో ప్రాంతాలమధ్యా తరచు తలెత్తుతున్న జలవివాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఎప్పటిలాగే కర్ణాటక, తమిళనాడుల మధ్య తాజాగా కావేరీ నదీజలాల పంపకం విషయంలో చిచ్చు రేగింది. రోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) కర్ణాటకకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు తాజా వివాదానికి మూలం. ఈ విషయంలో ఏం చేయాలన్న అంశంపై ఈ ఆదివారం కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ సమస్యపై అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించింది. కన్నడ సంఘాలు వచ్చే 13న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో చర్చించేందుకు తమ రాష్ట్రానికి సోమవారం రావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ను ‘ప్రస్తుత పరిస్థితుల రీత్యా’ వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభ్యర్థించారు.రాజ్యాంగంలోని 262వ అధికరణం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు రాజుకున్నప్పుడూ, ఫిర్యాదులొచ్చినప్పుడూ వాటి పరిష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చింది. దీని ఆధారంగానే కేంద్రం 1956లో నదీజలాల వివాదాల చట్టాన్ని, నదీజలాల బోర్డు చట్టాన్ని తీసుకొచ్చింది. బోర్డు అయితే ఏర్పాటు కాలేదుగానీ... నదీ వివాదాల చట్టంకింద అయిదు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. చిత్రమేమంటే ప్రజా ప్రభు త్వాలు లేని కాలంలోనే... అంటే బ్రిటిష్ వలసపాలకుల హయాంలోనే నదీజలాల ఒప్పందాలు కుదిరాయి. 1924లో అప్పటి మైసూర్ సంస్థానం, మద్రాస్ ప్రెసిడెన్సీలమధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మైసూర్ కృష్ణరాజ సాగర్ డ్యామ్‌నూ, మద్రాస్ మెట్టూర్ డ్యామ్‌నూ నిర్మించుకోవటానికి అవగాహన కుదిరింది. అప్పట్లో కావేరీ జలాల్లో దాదాపు 75 శాతం వాటా మద్రాస్ ప్రెసిడెన్సీకే కేటాయించారు. ఈ ఒప్పందం కాలపరిమితి యాభైయ్యేళ్ల అనంతరం 1974లో ముగిసిపోగా అప్పటికే కర్ణాటకలో నదీజలాల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే భావన బలంగా నాటుకుంది. ఎగువభాగంలో ఉండటం కారణంగా కర్ణాటక తమ నీటి అవసరాలకు తగ్గట్టు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టింది. వర్షాలు సమృద్ధిగా పడినంతకాలం నదీ జలాల వివాదాలు వచ్చే అవకాశం లేదు. రుతుపవనాలు విఫలమై వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, కరవు కాటేసినా ఘర్షణలు బయల్దేరతాయి. కావేరీ బేసిన్‌లోని ఆనకట్టలు నిండనప్పుడు తాము బెంగళూరు నగరానికీ, రైతులకూ అవసరమైన నీరు వినియోగించుకోవటంలో తప్పేమిటన్నది కర్ణాటక ప్రశ్న. ఇటు తమవైపు పంటలన్నీ ఎండిపోతున్నాయనీ, న్యాయంగా తమ వాటా నీరు విడుదల చేయాలనీ తమిళనాడు అంటున్నది. అసలే ఈ ఏడాది ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో వర్షాలు సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వివాదాలు తలెత్తుతాయి. పుదుచ్చేరి కూడా ఈ కావేరీ జలాల వివాదంలో ఉంటుంది. పడమటి కనుమల్లో పుట్టి గోవా దగ్గర అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి విషయంలోనూ కర్ణాటక, గోవాల మధ్య ఇలాంటి వివాదాలే తలెత్తుతుంటాయి. ప్రపంచ పునరుత్పాదక జలవనరుల్లో మన దేశం వాటా కేవలం 4 శాతం మాత్రమే. కనుక నీటి కోసం పోటీ తప్పదు. సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలిక పరిష్కారంతో ప్రయత్నించి, గండం గడించిందనుకోవటం తప్ప శాశ్వత పరిష్కార దిశగా ఎవరూ ఆలోచించటం లేదు. ఘర్షణ పడే రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దా మనుకోవటం లేదు. విపక్షాలనుంచి ఒత్తిళ్లు తప్పవు మరి. నదుల్లో నీరు నిండుకున్న ప్పుడు నీరందక పంటలు ఎండిపోతాయి. దృఢంగా పోరాడి ఆ నష్టాన్ని తగ్గించుకోవటంపైనే వివాదం తలెత్తిన రాష్ట్రాల రైతులు దృష్టి పెడతారు. కావేరీ వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారమయ్యే దిశగా రెండు రాష్ట్రాలూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఇప్పుడిప్పుడే వరుణుడు కరుణిస్తున్న దాఖలా కనబడుతోంది. కనుక ఈ వివాదం త్వరలో సమసిపోతుందని ఆశించాలి. -
నాకు ఈ బిడ్డ వద్దు.. నేను మా ఊరెళ్లిపోతాను!
కర్ణాటక, చిక్కబళ్లాపురం: ఆసుపత్రిలో ఓ అవివాహిత గర్భిణి బిడ్డకు జన్మనిచ్చి తనకు ఆ శిశువు వద్దని చెప్పడంతో వైద్యులు, అధికారులకు తెల్లమొహం వేశారు. విరాలు.. హావేరి జిల్లాకు చెందిన యువతి (21) కి ఇంకా పెళ్లి కాలేదు. గర్భం దాల్చి నెలలు నిండాయి.దేవనహళ్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మగబిడ్డ పుట్టాడు. శిశువు తక్కువ బరువు, ఊపిరి సమస్యతో ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి బిల్లులను ఆమె చెల్లించింది. తనకు బిడ్డ వద్దని, తాను ఊరికి వెళ్లిపోతానని వైద్యులకు చెప్పడంతో వారు కంగుతిన్నారు. వైద్యులు పోలీసులకు తెలుపగా వచ్చి ఆమె ఊరు పేరు వివరాలను విచారించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
మహిళలపై అత్యాచారం కాదు.. ఆ అస్థిపంజరాలు పురుషులవే!
కర్ణాటక, యశవంతపుర: ధర్మస్థలలో అపరిచిత అస్థిపంజరాల కేసులో ఓ మిస్టరీ వీడిపోయింది. గతంలో బంగ్ల గుడ్డలో సిట్ అధికారులు తవ్వకాలు జరిపి మూడు అస్థిపంజరాలను కనుగొన్నారు. వాటికి డీఎన్ఏ పరీక్షలను నిర్వహించగా, మూడు కుటుంబాల నమూనాలతో సరిపోలాయి. మృతుల్లో కొడగు జిల్లా విరాజపేట తాలూకా టి శెట్టిగేరి గ్రామవాసి యు.బి. అయ్యప్ప(70), తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా దాసరకల్లహళ్లికి చెందిన ఆదిశేష (27), కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా మీసగానహళ్లికి చెందిన కృష్ణప్పలుగా తేలింది. అందరూ పురుషులేనని, మహిళలపై అత్యాచారం చేసి హత్యలు చేసి పూడ్చిపెట్టారనే ఆరోపణలతో సంబంధం లేదని సిట్ అధికారులు తెలిపారు. ఈ నెల 15న బెళ్తంగడి కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నారు.ఇలా మిస్సింగ్2017, జూన్ 25న యుబీ అయ్యప్ప మైసూరు ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి ఇంక తిరిగి రాలేదు. గుబ్బికి చెందిన ఆదిశేష బెంగళూరులోని బార్లో పని చేసేవాడు, 2013 అక్టోబర్ 2న ఇంటికెళ్లి మొబైల్‌ను వదిలేసి ఎక్కడికి వెళ్లాడో తెలియదు. కృష్ణప్ప 2024 అక్టోబర్ 22న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు కేసుల్లోనూ కుటుంబీకులు మిస్సింగ్ కేసులు పెట్టారు. అలా వెళ్లినవారు బంగ్ల గుడ్డలో ఎలా శవాలయ్యారన్నది తేలాల్సి ఉంది. -
ఆపరేషన్ థియేటర్లో.. పులికి దంత సర్జరీ
కర్ణాటక, బొమ్మనహళ్లి: సాధారణంగా మనుషుల దంతాలకు సమస్య వస్తే రూట్ కెనాల్ చేయించుకుంటారు. పులికి సైతం దంతం పాడైపోవడంతో దానికి రూట్ కెనాల్ సర్జరీ చేశారు. బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్‌లో కొన్ని పులులు ఉన్నాయి.వీటిలో సించన అనే పులి కోర పంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. ఆ పులి బోను కడ్డీని కొరకడం వల్ల దాని కోర పన్ను దెబ్బతింది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకింది. నొప్పి ఎక్కువ కావడంతో సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు. దీని వల్ల పులి ఆరోగ్యం అంత బాగా లేదు. పులిని పరీక్షించిన పశువైద్యులు దాని పంటికి చికిత్స చేయాలని నిర్ణయించారు. మత్తు మందు ఇచ్చి 3 గంటలకు పైగా శ్రమించి రూట్ కెనాల్ చికిత్సను నిర్వహించారు. -
ఎలుక ఎంత పనిచేసింది.. 10 లక్షల వజ్రాల నగలు..
సాక్షి, బెంగళూరు: తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి. దీంతో నగల దుకాణం యజమాని గుండె ఆగినంత పనైంది. చివరకు సీసీటీవీ ఫుటేజీ చూస్తే అసలు దొంగను చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ 'మాస్టర్‌మైండ్' ఒక చిన్న ఎలుక!కర్ణాటకలోని తుమకూరు నగరంలోని కాల్టెక్స్ సర్కిల్లో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని, కౌంటర్‌పై ఉన్న 50 గ్రాములకు పైగా వజ్రాల నగలు, 10 ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు.ఎవరూ లోపలికి రాకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రాత్రి వేళ గోడలోని చిన్న రంధ్రం గుండా లోపలికి వచ్చిన ఓ ఎలుక, ఒక్కో నగను నోటితో లాక్కెళ్లి తన బొరియలో దాచిపెడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఎలుక జాడను అనుసరించి బొరియను తవ్వి చూడగా.. కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు సహా అన్ని వజ్రాల నగలు అక్కడే లభించాయి. దీంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. నగలన్నీ తిరిగి దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సినిమాల్లోనే కనిపించే సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🐀 Rat becomes 'gold thief' near Bengaluru, drags ₹10 lakh worth of jewellery into its burrow; all ornaments recovered! pic.twitter.com/QYZlFeM9zz— HOSUR UPDATES (@hosurupdates) July 30, 2026 -
రూ. 40 లక్షల ఎదురు కట్నం కావాలంటూ, కూతురిపైనే తండ్రి దాడి
కర్ణాటకలోని బెంగళూరులో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురిని అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది లక్ష్మీ దుర్గ. ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు.అంతేకాదు లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె మీద పగబట్టాడు. జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇదీ చదవండి: చిన్నప్పటి ఆసక్తే .. రూ. 96 లక్షల ప్రైజ్ తెచ్చిపెట్టింది!కుమార్తెను కలిసే నెపంతో కాలేజిలోని హెచ్ఓడి (HOD) ఛాంబర్లో ఉన్న లక్ష్మీ దుర్గ వద్దకు వెళ్లిన నాగేంద్ర, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపు, ఛాతీ, మెడలో తీవ్రంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడికి కుటుంబంలో దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా? -
షాకింగ్! 56 వేల మంది విద్యార్థులకు HIV.. బయటపడిన సంచలన నిజాలు!
-
విద్యార్థుల్లో హెచ్ఐవీ కలకలం.. ఇక కాలేజీల్లో ప్రత్యేక క్యాంపులు
కర్ణాటకలో హెచ్ఐవీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువతలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీల్లో హెచ్ఐవీ అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైన వారు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది.రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే వ్యక్తుల అనుమతి లేకుండా ఎలాంటి పరీక్షలు లేదా స్క్రీనింగ్ నిర్వహించబోమని అధికారులు స్పష్టం చేశారు. గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు.యువతలో పెరుగుతున్న కేసులుజాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) గణాంకాల ప్రకారం.. హెచ్ఐవీ బాధితుల సంఖ్యలో కర్ణాటక దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.60 లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. వీరిలో దాదాపు 2.05 లక్షల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మరో 54 వేల మందికి తమ హెచ్ఐవీ స్థితి గురించి తెలియకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో కేసులు వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో ఈ వయసు వర్గంలో హెచ్ఐవీ కేసులు 44,500గా ఉండగా.. 2025–26 నాటికి ఈ సంఖ్య 66,600కు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక 18 నుంచి 25 ఏళ్ల మధ్య .. అదీ విద్యార్థుల్లోనే 7,000 మందికి పైగా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.కాలేజీల్లో అవగాహన శిబిరాలుఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్ఐవీపై అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు వైరస్ వ్యాప్తి, నివారణ మార్గాలు, చికిత్స అవకాశాలపై సమాచారం అందించనున్నారు. విద్యార్థులు తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పెంచుకునేందుకు ప్రత్యేకంగా QR కోడ్ ఆధారిత సమాచార వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా సమీప కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు.లక్ష్యం.. భయాన్ని కాదు, అవగాహనను పెంచడంహెచ్ఐవీపై ఉన్న అపోహలు, వివక్షను తగ్గించడంతో పాటు.. బాధితులు సకాలంలో చికిత్స పొందేలా చూడడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. హెచ్ఐవీని ముందుగానే గుర్తిస్తే మెరుగైన జీవనం కొనసాగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు యువతలో ఆరోగ్య అవగాహన పెంచేందుకు కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యార్థుల గోప్యత, సమ్మతిని కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు సరఫరా బంద్!
తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తమిళనాడు నిర్ణయం దక్షిణ రాష్ట్రాల మధ్య మౌలిక వసతుల అభివృద్ధి, వనరుల వినియోగం, ప్రాంతీయ ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపే నిర్ణయంగా మారింది.అయితే, ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, రహదారులు, గృహ నిర్మాణాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా తమిళనాడులో నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పనిచేస్తున్న క్వారీల నుంచి లభిస్తున్న రాళ్లు, నిర్మాణ అగ్రిగేట్లు స్థానిక అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో సరఫరా తగ్గి, ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.ఈ నిషేధం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లే నిర్మాణ సామగ్రిపై వర్తించనుంది. అయితే.. పుదుచ్చేరి, కారైకాల్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నిషేధాన్ని అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్రమ మైనింగ్, ఖనిజ రవాణా చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ముఖ్యంగా కేరళలో నాణ్యమైన రాయి అగ్రిగేట్‌ల లభ్యత పరిమితంగా ఉండటంతో తమిళనాడులోని తిరునెల్వేలి, తెంకాసి, కన్యాకుమారి ప్రాంతాల నుంచి వచ్చే నిర్మాణ సామగ్రిపై అనేక ప్రాజెక్టులు ఆధారపడుతున్నాయి. జాతీయ రహదారులు, విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పనులకు సరఫరా అంతరాయం కలగవచ్చని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరింది.ఎందుకు ఈ నిర్ణయం?కాగా, తమిళనాడులో ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొత్త రహదారులు, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం రాళ్లు, ఇసుక, ఇతర అగ్రిగేట్‌ల అవసరం పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నిర్మాణ సామగ్రిలో కొంత భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో స్థానిక మార్కెట్లో సరఫరా తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ధరలు పెరిగి నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయని వాదిస్తోంది.తమిళనాడు నిర్ణయం సహజ వనరుల నిర్వహణ, రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ముందుకు తెస్తోంది. ఒక రాష్ట్రంలోని ఖనిజ వనరులు మరో రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలు-ప్రాంతీయ అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ అంశం కేవలం నిర్మాణ సామగ్రి రవాణా సమస్యగానే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల మధ్య వనరుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయానికి సంబంధించిన అంశంగా మారింది. మూడు నెలల నిషేధ కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా పరిస్థితులు, ప్రాజెక్టులపై ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా, సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చు. -
షాకింగ్ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో దిగ్భాంతి రేపే అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 23 ఏళ్ల భార్యను భార్యను ఉరివేసి హత్య చేశాడు. అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను రికార్డు చేసి, ఆ వీడియోను బంధువులకు, స్నేహితులకు పంపిన ఘోరాన్ని అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించిన కిరాకత ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మృతురాలిని భాగ్యశ్రీ జిగళూర్ (23)గా, నిందితుడైన ఆమె భర్తను ప్రవీణ్ జిగళూర్ (28)గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గొడవ జరిగిన సమయంలో ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై దుంగతో దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేశాడు. భాగ్యశ్రీ ఉరితాడుకు వేలాడుతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ప్రవీణ్ ఆ ఘోరాన్ని వీడియో రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటాన్ని వారికి చూపించాడు. అంతేకాదు ఆ వీడియోను పలువురికి షేర్ కూడా చేశాడు.ఈ ఘటన బాగల్కోట్ జిల్లా గలగలి గ్రామంలోని వారి నివాసంలో చోటుచేసుకుంది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో భాగ్యశ్రీ రెండు నెలల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉందామని, గొడవలు పడనని నమ్మబలికి ప్రవీణ్ ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, ఇంటికి తిరిగి వచ్చిన ఆ రోజే ఆమెను ఈ రకంగా దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదీ చదవండి: ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్యూ’ చెప్పాడు!ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
ఈ తొమ్మిది ప్రదేశాల్లో ప్రతి ఒక్క క్షణం ఓ అద్భుతం!
వర్షం అంటే కేవలం నేలంతా తడవడం మాత్రమే కాదు.. కొన్ని ప్రదేశాలు తమ అందాన్ని చూపించే కాలం కూడా. దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని పర్వతాలు, పట్టణాలు వర్షాకాలం వస్తే చాలు మరింత అందంగా మారిపోతాయి. ప్రతీ మలుపు ఒక కొత్త చిత్రంలా అనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాలకు చుట్టుపక్కనే ఉంటే కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉన్న పర్వత ప్రాంతాల్లో మాన్సూన్ ట్రిప్ అనేది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈ సీజన్ లో ఈ హిల్ టౌన్స్‌లో గాలి, మబ్బులు, పచ్చని అడవులు కలిసి ఒక మధురమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ తొమ్మిది ప్రదేశాల్లో ప్రతి ఒక్క ప్రాంతం చిరునవ్వుతో ప్రయాణికులను ఆహ్వానిస్తుంది.మబ్బుల్లో మధురమైన కూర్గ్, చిక్మగళూరుకర్ణాటకలో ఉన్న కూర్గ్, చిక్‌మగళూరు వర్షాకాలంలో కాఫీ సుగంధంతో మరింతగా అలరిస్తాయి. ప్రతీ ఉదయం మబ్బులు కాఫీ తోటల మధ్య నిలిచి ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న జలధారలు, అడవి మార్గాలు, కొండల మధ్య పడిన చినుకులు అన్నీ కలిసి ఒక సినిమా ఫ్రేమ్‌లా ఉంటాయి.ఇక్కడ నడిచే ప్రతీ అడుగు ప్రకృతితో మాట్లాడినట్టు ఉంటుంది. కాఫీ ఎస్టేట్స్ మధ్య వాకింగ్, చిన్న చిన్న జలపాతాల వద్ద సమయం గడపడం, స్థానిక గ్రామాల్లో ప్రజల జీవితాన్ని దగ్గరి నుంచి చూడటం అనేది ఈ ప్రయాణంలో సహజంగా కలిగే అనుభవాలుగా మిగిలిపోతాయి.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి బెంగుళూరు, కోచి, కోయంబత్తూరు, మదురై, విశాఖపట్టణం లాంటి నగరాలకు ఫ్లైట్స్, ట్రైన్లు, బస్సులు ఈజీగా దొరుకుతాయి. అక్కడి నుంచి కొండ రహాదారుల్లో ప్రయాణం మొదలవుతుంది.ప్లెయిన్స్ నుంచి మెల్లగా కొండల మధ్యకి చేరేటప్పుడు గాలి మారడం, టెంపరేచర్ తగ్గడం, మబ్బులు దగ్గరవడం అనేది ప్రయాణంలో ఒక అందమైన మార్పుగా కనిపిస్తుంది.విజయవాడ నుంచి విశాఖపట్టణం, బెంగళూరు, కోయంబత్తూరు, కోచికి చేరుకుని అక్కడి నుంచి ఈ హిల్ టౌన్స్కి చేరుకోవచ్చు. జర్నీలో ప్రతీ క్షణం ప్రకృతి తన కొత్త రూపాన్ని చూపిస్తుంది.ఎక్కడ ఉండాలి?ఈ మౌంటెయిన్ టౌన్స్‌లో బోటీక్ హోమ్ స్టేలు, ప్లాంటేషన్ కాటేజీలు, హెరిటేజ్ బంగ్లాలు, నేచర్ రిసార్ట్స్, సింపుల్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కిటికీ తెరవగానే టీ గార్డెన్స్ కనిపించే రూమ్ అయినా, కాఫీ ఎస్టేట్స్ మధ్య వెలిసిన కాటేజీలు అయినా, ఫారెస్ట్ ఎడ్జ్‌లో ఉన్న స్టేలు అయినా అకామిడేషన్ కూడా ప్రయాణంలో ఒక భాగంగా అనిపిస్తుంది.ఏం తినాలి?కూర్గ్‌లో పాండీ కర్రీ ఇష్టపడేవారికి ఫేమస్. కానీ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. చిక్‌మగళూరు ఫ్రెష్ కాఫీని ఒక్కసారి రుచి చూస్తే ఇక ఎప్పుడూ మర్చిపోలేరు. ఊటీ హోమ్మేడ్ చాకొలేట్స్, మున్నార్ టీ, వాయనాడ్ స్పైసెస్, అరకు ఆర్గానిక్ కాఫీ, కొడైకనాల్ హోమ్మేడ్ చాకొలేట్స్, లోకల్ బేకరీ ఐటమ్స్ ఇలా ప్రతీ ఐటమ్ ఆ ప్రదేశానికి బ్రాండ్ ఎంబాసెడర్లా పని చేస్తుంది.నీలగిరి అందాలు..తమిళనాడులో నీలగిరి పర్వతాల మధ్య ఉండే ఊటీ, కూనూరు ఎప్పుడూ అందంగా ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఈ అందాలు రెట్టింపు అవుతాయి. టీ గార్డెన్స్‌పై పడిన మబ్బులు, టాయ్ ట్రెయిన్ శబ్దం, యూకలిప్టస్ వాసన కలిసి ఒక నాస్టాల్జిక్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. ప్రతీ రోడ్డు మలుపు దగ్గర కొత్త లోయ కనిపిస్తుంది. చిన్న రైల్వే స్టేషన్స్, కాలనియల్ బిల్డింగ్స్, టీ ప్లాంటేషన్స్ మధ్య గడిపే సమయం ప్రయాణాన్ని స్లోగా ఆస్వాదించే అవకాశం ఇస్తుంది.ఆంధ్రప్రదేశ్ పర్వత శోభఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకులోయ వర్షాకాలంలో ఒక హరిత వస్త్రాన్ని ధరించినట్టు గ్రీనరీతో నిండి ఉంటుంది. విశాఖపట్టణం నుంచి మొదలయ్యే ట్రైన్ జర్నీలో టన్నెల్స్, బ్రిడ్జిలు, లోయలు కలిసి ఒక మరపురాని అనుభూతిని అందిస్తాయి. కాఫీ ప్లాంటేషన్స్, ట్రైబల్ కల్చర్ ఇవన్నీ అరకుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి.ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్కొడైకనాల్ని చాలా మంది ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. మాన్సూన్ లో ఆ పేరుకి తగ్గట్టే ఉంటుంది ఇక్కడి బ్యూటి. పైన్ ఫారెస్ట్ మధ్య చినుకులు పడుతుంటే, లేక్ పక్కనే గాలి మెల్లిగా వీస్తుంటే, సమయం కొంచెం మెల్లిగా సాగినట్టు, కొన్ని సార్లు క్షణం పాటు ఆగినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ మిస్ట్‌లో వాకింగ్, స్మాల్ కేఫేలో హాట్ కాఫీ తాగడం, సాయంత్రం లేక్ రిఫ్లెక్షన్స్ చూడటంం ఈ అనుభవాలు ప్రయాణాన్ని మరింతగా గుర్తుండేలా చేస్తాయి.సందర్శనీయ ప్రదేశాలుఈ తొమ్మిది హిల్ టౌన్స్‌లో ప్రతీ ప్రదేశం ఒక డిఫరెంట్ అనుభవాన్ని అందిస్తుంది. కూర్గ్ కాఫీ ఎస్టేట్స్, చిక్‌మగళూరు ముల్లాయనగిరి పరిసర ప్రాంతాలు, ఊటీ బొటానికల్ గార్డెన్, కూనూరు టీ తోటలు, మున్నార్ టీ ప్లాంటేషన్స్, వాయనాడ్ అడవులు, అరకు కాఫీ గార్డెన్స్, మేఘమలై రోలింగ్ హిల్స్, యెర్కాడ్ లేక్, కొడైకనాల్ పైన్ ఫారెస్ట్ అన్నీ కలిసి సౌత్ ఇండియా బ్యూటీని ప్రపంచానికి మరింత అందంగా చూపిస్తాయి. ప్రతీ ప్రదేశంలో ప్రకృతి ఒక కొత్త రంగును చూపిస్తుంది.ఏం చూడాలి?మార్నింగ్ మిస్ట్‌లో లోయలను, వర్షం తరువాత మెరుసే జలపాతాలు, టీ, కాఫీ ప్లాంటేషన్స్, చిన్న రైల్వే స్టేషన్స్, ట్రైబల్ కల్చర్, లేక్స్, అడవిలో సాగే ప్రయాణం, సూరస్తమయంలో రంగు రంగులతో సందడి చేసే వ్యూ పాయింట్స్ ఈ అనుభవాలు ఒక్కో హిల్ స్టేషన్ లో ఒక్కోలా ఉంటాయి.లోకల్ మార్కెట్లలో నడవడం, ప్లాంటేషన్ విజిట్స్, సీనిక్ ట్రైన్ జర్నీస్, బోటింగ్, ఫోటోగ్రఫీ, విలేజ్ వాక్స్ లాంటివి ఈ ప్రయాణంలో సహజంగా కనిపిస్తాయి.కేరళ పచ్చదనంకేరళ అందాలు చూడాలి అనుకుంటే మున్నార్ లేదా వయనాడ్ వెళ్తే చాలు. ఇందులో ఏ ప్రాంతానికి వెళ్లినా కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. మున్నార్ టీ గార్డెన్స్ వర్షంలో పచ్చని వెల్వెట్ బ్లాంకెట్లా కనిపిస్తాయి. వాయనాడ్ అడవుల్లో మబ్బులు దిగివచ్చి చెట్ల మధ్య ఆటలాడుతున్నట్టు ఉంటాయి.స్థానికుల జీవితం ఇక్కడ ప్రకృతి రిథమ్‌కి తగ్గట్టు ఉంటుంది. ప్లాంటేషన్ గ్రామాలు, చిన్న మార్కెట్లు, స్పైస్ ప్లాంటేషన్స్, వర్షంలో తడిసిన రహదారులు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.మేఘాల మధ్య మేఘమలై, యెర్కాడ్తమిళనాడులో మేఘమలై పేరు వినగానే మబ్బులు గుర్తొస్తాయి. పేరుకి తగ్గట్టే మబ్బులు ఇక్కడ కొండలకు దగ్గరగా చేరుకుంటాయి. యెర్కాడ్‌లో లేక్ పక్కనే వర్షం చినుకుల శబ్దం వినడం, నారింజ తోటల మధ్య నడవడం, ప్రశాంతతను ఆస్వాదించడం ఒక మెమొరబుల్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. టూరిస్టుల రష్ కన్నా నేచర్ సౌండ్స్ ఎక్కువగా వినిపించే ఈ ప్రదేశాలు స్లో ట్రావెల్ ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతాయి.ఆసక్తికరమైన విషయాలు - వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ హిల్ టౌన్స్ అత్యంత అందంగా ఉంటాయి.- ఈ డెస్టినేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలోనే ఉన్నాయి.- వర్షాకాలంలో ఈ ప్రదేశాలకు వెళ్తే చల్లని గాలితో పాటు, మబ్బులతో నిండిన ఆకాశం, పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు.- ఇందులో మీరు ఏ ప్రదేశానికి వెళ్లాలి అనుకున్నా 5 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు టీ లేదా కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో స్లో ట్రావెల్‌ను ఆస్వాదించవచ్చు.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల మాన్సూన్ హిల్ స్టేషన్ ట్రిప్ బడ్జెట్ రేంజ్ అనేది మీ ట్రావెల్ స్టైల్‌ను బట్టి మారుతుంది. బడ్జెట్ ట్రావెల్‌ను సుమారు రూ.18,000 నుంచి రూ.25,000 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ కాస్ట్ సుమారు రూ.28,000 నుంచి రూ.40,000 మధ్యలో ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.45,000 నుంచి రూ.70,000 వరకు బడ్జెట్ అవవచ్చు.స్టే విషయానికి వస్తే ప్రతీ రాత్రికి రూ.1,500 నుంచి రూ.8,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.1,500 మధ్య ఖర్చు అవుతుంది.హైదరాబాద్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది డెస్టినేషన్ ను బట్టి రూ.4,000 నుంచి రూ.15,000 మధ్య మారుతుంది. విజయవాడ నుంచి ట్రావెల్ కాస్ట్ కొంచెం తక్కువ లేదా దాదాపు సమానంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల్లో ప్లాంటేషన్ స్టే ΄్యాకేజీలు, హెరిటేజ్ స్టేస్, సీనిక్ ట్రైన్ ఎక్స్‌పీరియెన్స్ అన్నీ కలిపి ప్రయాణాన్ని మరింత స్పెషల్‌గా మార్చేస్తాయి.గమనిక: ఈ ట్రావెల్ గైడ్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారం, స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకుని, వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (79) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆదివారం ప్రకటించారు. వయసు పెరగడం, ఆరోగ్యం బలహీనపడటం, రాజకీయాల్లో అవినీతి పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు.ఎక్స్‌లో చేసిన పోస్టులో సిద్ధరామయ్య, ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని, కానీ ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. "రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయింది. అందుకే నేను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అయితే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజల కష్టసుఖాలకు గొంతుకగా నిలుస్తాను" అని పేర్కొన్నారు.తన వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని, కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తన నిర్ణయానికి కారణం వివరిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి తన వయసు 81 లేదా 82 ఏళ్లు ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు."ఇప్పుడు నా వయసు 79 ఏళ్లు. మా ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి నాకు 81-82 ఏళ్లు వస్తాయి. నా ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదు. ఇంతకుముందులా అదే ఉత్సాహంతో పని చేయడం ఇక సాధ్యం కాదు" అని అన్నారు.సిద్ధరామయ్య తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టానని, 2028తో ఆ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు."ఓటములు, విజయాలు రెండూ చూశాను. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. నా మనస్సాక్షిని ఎప్పుడూ మోసం చేయలేదు అన్న సంతృప్తి నాకు ఉంది" అని చెప్పారు. ఎన్నికల రాజకీయాల తీరు మారిపోయిందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు."ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయి. నిజాయితీ రాజకీయాలకు నిలదొక్కుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు ప్రకటించినా, ప్రజల కోసమే పని చేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. "50 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు నన్ను తమలో ఒకడిగా భావించి ప్రేమతో నడిపించారు. ఆ రుణం నా మీద ఉంది. అందుకే నా మిగిలిన జీవితం కూడా ప్రజాసేవకే అంకితం" అని పోస్టులో పేర్కొన్నారు. -
కర్ణాటకకు సీఎం విజయ్.. డీకేతో సమావేశం
సాక్షి, చెన్నై/బనశంకరి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆగస్టు 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమై కావేరి జలాల పంపిణీతో పాటు మేకెదాటు డ్యామ్ నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు.ఈ విషయాన్ని తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ కుంభకోణంలో శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటిని విడుదల చేయకపోవడంతో మెట్టూరు జలాశయం పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో వరి సాగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, కావేరి నదిపై మేకెదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని మంత్రి స్పష్టం చేశారు.కావేరి జల వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో నీటి విడుదల, రైతుల ప్రయోజనాలు, మేకెదాటు ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
ఒంటిపై చొక్కాలేదు.. కానీ రూ.100 కోట్ల సంపద!
ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న పాత షేర్ పెట్టుబడుల గురించి చెప్పడం నెటిజన్లలో ఆసక్తిని పెంచింది.వైరల్ వీడియోలో ఓ వ్లాగర్.. ఆ వృద్ధుడిని ఆయన పెట్టుబడుల గురించి అడుగుతాడు. అందుకు సమాధానంగా తన వద్ద లార్సన్ అండ్ టూబ్రో (L&T) కంపెనీకి చెందిన 27 వేల షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌కు చెందిన 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌కు చెందిన 4 వేల షేర్లు ఉన్నాయని చెబుతారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రతి సంవత్సరం తనకు సుమారు రూ.6.5 లక్షల వరకు డివిడెండ్ వస్తుందని, ఆ ఆదాయంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నానని తెలిపారు.ఈ వీడియోలో అందరినీ ఆకట్టుకున్న విషయం.. ఆయన పెట్టుబడుల కంటే ఆయన సరళమైన జీవనశైలి. సాధారణ దుస్తులు ధరించి, గ్రామీణ వాతావరణంలో ఎంతో సాదాసీదాగా కనిపించిన ఆ వ్యక్తి తన ఆర్థిక స్థితి గురించి చాలా సాధారణంగా మాట్లాడారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆడంబరం లేకుండా జీవించడం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.వీడియో వైరల్ అయిన తర్వాత, కొంతమంది ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఆయన షేర్ల విలువను అంచనా వేశారు. వారి లెక్కల ప్రకారం.. ఎల్ అండ్ టీ షేర్ల విలువ సుమారు రూ.80 కోట్లు, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ల విలువ దాదాపు రూ.21 కోట్లు, కర్ణాటక బ్యాంక్ షేర్ల విలువ సుమారు రూ.1 కోటి వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. దీంతో మొత్తం పెట్టుబడుల విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.అయితే.. ఇవి కేవలం సోషల్ మీడియా అంచనాలు మాత్రమే, షేర్ల విలువ ఎంత అనేది అధికారికంగా వెల్లడికాలేదు. నిజానికి ఈ వీడియో దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు చూపించింది. మంచి కంపెనీల్లో సరైన సమయంలో పెట్టుబడి పెట్టి, వాటిని కొన్నేళ్లు కొనసాగిస్తే సంపదను సృష్టించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంపద అనేది కేవలం ఖరీదైన కార్లు, పెద్ద ఇళ్లు, విలాసవంతమైన జీవనశైలిలో మాత్రమే కనిపించదని, సాధారణంగా జీవించే వ్యక్తుల వద్ద కూడా భారీ ఆస్తులు ఉండొచ్చని ఈ ఘటన గుర్తు చేస్తోంది.Never judge a book by its cover. An elderly man in a rural village, dressed in the most modest attire, No cars, No fancy houses.His portfolio is worth Rs 100 Crore :• Rs 80 Cr in L&T• Rs 1 Cr in Karnataka Bank • Rs 21 Cr in Ultratech Cement pic.twitter.com/0qGBaFhcmb— R (@AlphaWizarDD) July 23, 2026 -
6 మందిని లేపేసింది.. కానీ ఉరిశిక్ష తప్పించుకుంది..
-
భార్య, పిల్లలను కడతేర్చి ఆత్మహత్య
కర్ణాటక : జిల్లాలోని హుణసూరు పట్టణంలో హృదయ విదారక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలే కారణమని అనుమానాలున్నాయి. వివరాలు... పట్టణంలోని న్యూ మారుతి బరంగాయ్‌కు చెందిన హరీష్ (49), భార్య నిష్ఠ (36), పిల్లలు నిక్షా (12), రక్ష (8)తో నివసిస్తున్నాడు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే హరీష్ , మూడు రోజుల క్రితం తన తల్లిని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాడు. సోమవారం రాత్రి కింది అంతస్తులో తన భార్య, పిల్లల ముక్కులకు, నోళ్లకు ప్లాస్టర్ అతికించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మొదటి అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిందని అనుమానిస్తున్నారు. ఇరుగుపొరుగు అనుమానంతో.. మంగళవారం ఉదయం 9 గంటలైనా తలుపులు తెరవకపోవడతో ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూసి ఏదో జరిగిందని కనుగొన్నారు. పట్టణ పోలీసులకు తెలుపగా తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించారు. నలుగురి మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభించిన డెత్ నోట్‌ను స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫలానా ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరికి ఇవ్వాలో అందులో రాశాడు. పూర్తి లేఖ బయటకు రాలేదు. ఇరుకుటుంబాల బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. -
షాకింగ్ జిప్‌లైన్ రైడ్ ప్రమాదం, 40 అడుగుల ఎత్తునుంచి..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని దాండేలి (Dandeli) రిసార్ట్‌లో జరిగిన ఒక జిప్‌లైన్ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అడ్వెంచర్ రైడ్ కోసం వెళ్లిన ఒక పర్యాటకుడు, భద్రతా లోపాల కారణంగా దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అడ్వెంచర్ టూరిజం కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని కర్ణాటకలోని విజయపురకు చెందిన కుబేర్ సుర్పుర్ గా గుర్తించారు. కుబేర్ గాల్లో జిప్‌లైన్‌పై వెళ్తుండగా, దానికి సంబంధించిన సేఫ్టీ లాక్ (Safety Lock) ఊడిపోవడంతో ఆయన నేరుగా కిందపడిపోయారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి పడటంతో కుబేర్ చేతులు, కాళ్లు విరిగిపోయాయి. అలాగే నరాలు కూడా దెబ్బతిన్నాయి.రిసార్ట్ యాజమాన్యంపై ఆరోపణలుఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర ఆందోళన చెలరేగింది. రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైడ్‌కు ఉపయోగించిన పరికరాలు తుప్పు పట్టి పోయాయని, వాటిని సరిగ్గా నిర్వహించలేదని వారు పేర్కొన్నారు.ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్‌డే ప్రత్యేక పూజలు చేసిన నటి Why you always need to be cautious when it comes to this stuff.Poor guy, if he had just moved forward by a few feet he would have ended up on the grass which would have been better. Incident occurred at Starling River Resort, Dandeli.#accident #karnataka #adventuresports pic.twitter.com/uzNHR6BUH9— Sidharth Shukla (@sidhshuk) July 19, 2026మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడు కుబేర్‌ను మొదట దాండేలి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయపుర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన, నిపుణులైన వైద్యం కోసం ఆయనను మిరాజ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!నెటిజన్ల కామెంట్స్ఇది చాలా ఘోరమైన జిప్‌లైన్ డిజైన్. చేతులు వదిలేసినా కింద పడకుండా బెల్ట్స్ శరీరానికి గట్టిగా అమర్చాలి కదా. ఇలాంటి వాటికి అసలు అనుమతులు ఎలా ఇస్తారు?! అని ఒకరు తీవ్రంగా మండిపడ్డారు. యాజమాన్యానికి ఏదో కొద్దిపాటి జరిమానా విధిస్తారు, కొన్ని రోజులు రిసార్ట్ మూసివేసి మళ్లీ తెరుస్తారు. బాధితులకేమీన్యాయం జరగదు అంతా యథావిధిగా జరిగిపోతుంది అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు. -
ఏంటిది? కర్ణాటక పాస్‌పోర్ట్ కోసం భారీ క్యూలు..
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా చెక్-ఇన్ల కాలంలోనూ పాతకాలపు స్టాంపుల సేకరణకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఇండియా పోస్ట్ కర్ణాటక పోస్టల్ సర్కిల్ ప్రవేశపెట్టిన ‘ఫిలాటెలీ పాస్‌పోర్ట్’ ప్రస్తుతం ప్రయాణికులు, స్టాంప్ కలెక్టర్లలో కొత్త క్రేజ్‌గా మారింది. తాజా ఎడిషన్ విడుదల నేపథ్యంలో బెంగళూరులోని జనరల్ పోస్టాఫీసు ముందు వందలాది మంది తెల్లవారుజామునే క్యూలు కట్టడం ఈ ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ పాస్‌పోర్ట్ 2024 చివర్లో తొలిసారి అందుబాటులోకి రాగా, ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సుమారు 100 పర్యాటక, వారసత్వ ప్రాంతాలను కలుపుతూ నవీకరించిన ఎడిషన్‌ను విడుదల చేశారు. సుమారు 1,500 కాపీల తాజా బ్యాచ్‌కు కూడా భారీ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది.ఫిలాటెలీ పాస్‌పోర్ట్ అంటే?పేరు పాస్‌పోర్ట్ అయినప్పటికీ దీనికి విదేశీ ప్రయాణాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి ప్రత్యేక జ్ఞాపకంగా రూపొందించిన కలెక్టర్ బుక్లెట్. ఇందులో ప్రతి గమ్యస్థానానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆ ప్రాంతానికి సమీపంలోని గుర్తించిన పోస్టాఫీసుకు వెళ్లి పోస్టల్ స్టాంప్‌ను కొనుగోలు చేసి, అక్కడ మాత్రమే లభించే పర్మనెంట్ పిక్టోరియల్ క్యాన్సిలేషన్ (PPC) ముద్రను వేయించుకోవాలి. దేవాలయాలు, కోటలు, మ్యూజియంలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేక గుర్తులతో ఈ ముద్రలు అందుబాటులో ఉంటాయి.ట్రావెలింగ్‌కి కొత్త అర్థంప్రతి ముద్ర నిజంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన గుర్తుగా నిలుస్తుంది. అందుకే ఈ పాస్‌పోర్ట్‌ను చాలామంది ఒక ‘ట్రావెల్ ఛాలెంజ్’గా కూడా భావిస్తున్నారు. అన్ని గమ్యస్థానాలను సందర్శించి ముద్రలు సేకరించడం ద్వారా రాష్ట్రాన్ని విభిన్న కోణాల్లో అన్వేషించే అవకాశం లభిస్తుంది. సాధారణ సావనీర్లా కొనుక్కునే వస్తువు కాకుండా, స్వయంగా ప్రయాణించి సంపాదించాల్సిన జ్ఞాపకంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.సోషల్ మీడియాలో వైరల్ఫిలాటెలీ పాస్‌పోర్ట్‌కు సోషల్ మీడియా కూడా ఊపునిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టల్ ముద్రలు సేకరిస్తున్న వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో యువత కూడా దీనిపై ఆసక్తి చూపుతోంది. దీంతో స్టాంప్ కలెక్టర్లకే పరిమితమైన ఈ అభిరుచి ఇప్పుడు ట్రావెల్ లవర్స్, హెరిటేజ్ ప్రియులను కూడా ఆకర్షిస్తోంది.పాత అభిరుచికి కొత్త ఊపుఫిలాటెలీ అంటే స్టాంపుల సేకరణను ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ ఇప్పటికే ప్రత్యేక కవర్లు, స్మారక స్టాంపులు, ‘దీన్‌దయాళ్ స్పార్ష్’ వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఫిలాటెలీ పాస్‌పోర్ట్ ద్వారా ఆ అభిరుచిని ప్రయాణ అనుభవంతో మేళవించింది. డిజిటల్ యుగంలో ప్రతి ప్రయాణాన్ని భౌతిక గుర్తుగా నిలిపే ఈ వినూత్న ప్రయత్నం కర్ణాటకలో విశేష ఆదరణ పొందుతోంది. View this post on Instagram A post shared by Karnataka Postal Circle (@karnatakapostalcircle) -
భార్య వేధింపులు.. నవ వరుడు ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: పెళ్లి కాక ముందే ఓ యువకున్ని ప్రేమించింది. తల్లిదండ్రులు ఆమెకు మరొక వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ ప్రియునితో సంబంధం కొనసాగించడం చూసి విరక్తి చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దావణగెరె జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. న్యామతి తాలూకా కడదహట్టి గ్రామానికి చెందిన మణికంఠ (28)కు, 3 నెలల క్రితం రాణిబెన్నూరు తాలూకాకు చెందిన యువతితో పెళ్లయింది. కానీ ఆమె ప్రియునితో అక్రమ సంబంధం కొనసాగించేది. పాత సంబంధాలు వదులుకుని కొత్త జీవితం కొనసాగించాలని భర్త హితబోధ చేసినా, వినకుండా గొడవకు దిగేది. తీవ్ర మనోవేదనకు గరైన మణికంఠ డెత్‌నోట్ రాసి శుక్రవారం సాయంత్రం సమీపంలోని తుంగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలించి శనివారం మృతదేహాన్ని వెలకితీశారు. మృతుని కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను చంపి.. కొడుకుని కత్తితో పొడిచి పక్కనే రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్
-
బస్టాండ్‌లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
మంగుళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిపై ఓ వ్యక్తి మారణాయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, బంట్వాల్‌లోని కేఎస్ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. ఆమె కక్కేపదవు ప్రాంతానికి చెందిన యువతిగా, కళ్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. లావణ్య బస్సు కోసం వేచి ఉండగా నిందితుడు ఆమె వద్దకు వచ్చాడు. అనంతరం తన బ్యాగులో నుంచి పదునైన ఆయుధాన్ని తీసి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించినా, నిందితుడు వెంటాడి దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర గాయాలతో ఉన్న లావణ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.A rare scene that has happened in the Mangalore region. A 21-year-old, Lavanya, was brutally hacked to death by her ex, four years after their relationship had ended. The accused, 22-year-old Chetan, who is also a distant relative, attacked her in broad daylight at a bus stop… pic.twitter.com/3wo95zZUnD— Sharanya Shettyy (@Sharanyashettyy) July 16, 2026బంధువే నిందితుడా?ఈ ఘటనలో నిందితుడిగా చేతన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు మృతురాలికి దూరపు బంధువని, కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య తన ప్రేమను తిరస్కరించడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు.ఈ దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బంట్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక, బస్టాండ్ వంటి బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ హత్య స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. -
ప్రియుడి సోదరుడి కక్ష.. అమాయక ప్రియురాలు బలి
ప్రేమ పేరుతో మొదలైన పరిచయం చివరకు విషాదాంతమైంది. ప్రేమపై యువతికి నమ్మకం దెబ్బతింది. చివరకు చోటుచేసుకున్న పరిణామాలు యువతి ప్రాణాలనే బలితీసుకున్నాయి. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.లా చదువుతున్న అమృత అనే విద్యార్థిని ధనుష్ అనే ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లి జరిగి, ఓ పిల్లాడు కూడా కూడా ఉన్నాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని తన ప్రియురాలు అమృతకు చెప్పలేదు.అమృత ఓ పిజ్జా దుకాణంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అమృతకు ధనుష్‌తో కుటుంబ పరిచయం ద్వారా మాటలు కలిశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ధనుష్‌కు ఇప్పటికే విడాకులు అయ్యాయన్న విషయం, ఓ బిడ్డ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని తెలుసుకున్న తర్వాత అమృత బ్రేకప్ చెప్పేసింది.ఆ యువతి బ్రేకప్ నిర్ణయం తీసుకున్నందుకు ధనుష్ సోదరుడు సూర్య అమృతను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. జులై 13న అమృతను ఇంటి సమీపంలో సూర్య అడ్డగించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సూర్య అమృత ఛాతీ, వీపుపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న అమృతను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది.దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యతో పాటు ధనుష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అమృత మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు. -
భేతాళ ఆలయంలో మిస్టరీ.. అఘోరి అరెస్టు..!
కర్ణాటక: కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని సరిహద్దు ప్రాంతమైన కంగాండ్లహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని ఐవారహళ్లిలో ఉన్న బేతాళ మహాశక్తి పీఠ దేవాలయంలో చేతబడి వంటి క్షుద్రపూజలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో బుధవారం ఎస్పీ శివాంశు రాజ్‌పుత్ తనిఖీ చేశారు. ఆలయంలో ఉన్న ఎత్తైన అమ్మవారు, భేతాళ విగ్రహాలను వీక్షించారు. ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ దేవాలయంలో చేతబడి జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు అందాయని అందుకు నేడు పరిశీలన చేసి చేతబడి చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కర్ణాటక మూఢనమ్మకాల ప్రతిబంధక చట్టం కింద వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా మహిళలను అక్రమంగా ఉంచడం, వేధించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. డీఎస్పి లక్ష్మయ్య, బేతమంగల సీఐ జగదీష్, ఎస్ఐ సంగమేష్ ఉన్నారు. ఇక్కడ చేతబడి చేసేవారిని అడ్డుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. చేతబడి చేస్తున్నట్లు అనుమానిస్తున్న అఘోరి చంద్రనాథ్ తో పాటు 7 మందిని అరెస్టు చేసి వారిని కోర్టుకు తరలించారు. -
రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్లో బిజీగా భార్య!
కర్ణాటకలోని ధార్వాడ్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైద్యుడు ఇంట్లోనే హత్యకు గురి కాగా.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే.. ఈ కేసులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. భర్త శవం, కొడుకు రక్తపు మడుగులో ఉండగా.. ఆ భార్య మాత్రం ఏం జరగలేదన్నట్లు ఫోన్ చూస్తూ తాపీగా కనిపించింది. ధార్వాడ్‌లోని బారాకోట్రి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ (45) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో డాక్టర్ కిరణ్, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు. భద్రత ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు.ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో వెలుగులోకి..డాక్టర్ కిరణ్‌కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన భార్య ప్రియాంకను సంప్రదించగా.. ఆమె మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత డ్యూటీకి వెళ్లారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. మరో గదిలో తీవ్ర గాయాలతో బాలుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.Shocking, horrifying & ruthless. A woman allegedly killed her doctor husband & stabbed her 8yr old son inside their #Dharwad apartment. As the child lay in a pool of blood fighting for life, mother was scrolling through her phone. @compolhdc rescued the boy & shifted to hospital. pic.twitter.com/RL5GO9fzEV— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) July 16, 2026భార్యపై అనుమానాలు.. విచారణఘటన తర్వాత పోలీసులు డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆమె ఫోన్ చూస్తూ కనిపించిన దృశ్యాలు కూడా చర్చకు దారితీశాయి. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యల తర్వాత ఆమె ప్రవర్తించిన తీరుతో మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు దారితీసిన పరిస్థితులు, దాడి జరిగిన సమయం, ఆయుధం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రముఖ వైద్య కుటుంబంలో విషాదండాక్టర్ కిరణ్ స్థానికంగా పేరున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన భార్య ప్రియాంక కంటి వైద్యురాలు. ఇద్దరూ వైద్య వృత్తిలో ఉండగా.. ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, ఫోరెన్సిక్ నివేదికలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ధార్వాడ్‌లో ఘోరం.. ఇంట్లోనే డాక్టర్ దారుణ హత్య
కర్ణాటకలోని ధార్వాడ్‌లో బుధవారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాకోట్రి ప్రాంతంలో అనస్థీషియాలజిస్ట్ కిరణ్ హోనన్నవర్(45)ను గుర్తుతెలియని దుండగులు తన అపార్ట్మెంట్లోనే అత్యంత కిరాకతంగా హత్య చేశారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు సైతం తీవ్రమైన కత్తిపోట్లకు గురయ్యాడు.ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, ఆప్తమాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ ఘటన జరిగిన అపార్ట్మెంట్ అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉంది. మా ప్రాథమిక విచారణలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లభించలేదు. ఆ సమయంలో ఇంట్లో కేవలం డాక్టర్ కిరణ్, ఆయన భార్య ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు" అని పేర్కొన్నారు.ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెలుగులోకి..కాగా డాక్టర్ కిరణ్ బంధువులు ఆయనకు వరుసగా ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రియాంకకు ఫోన్ చేశారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి బంధువులు నేరుగా అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.అక్కడికి వచ్చి చూడగా ఒక గదిలో డాక్టర్ కిరణ్ మృతదేహం, మరో గదిలో గాయపడిన బాలుడు పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు. ఆమె పోలీసులకు కూడా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కిరణ్ కుటంబ సభ్యులు మాత్రం డాక్టర్ ప్రియాంకనే ఈ హత్యకు ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. -
సమిత్ ద్రవిడ్ ఆల్‌రౌండ్ షో
కేఎస్‌సీఏ టీ20 టోర్నీ (మహారాజా ట్రోఫీ-2026) ఫైనల్లో భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ లీగ్‌లో కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్‌కు ఆడే సమిత్.. శివమొగ్గ యోధాస్‌తో జరిగిన తుది పోరులో బంతితో, బ్యాట్‌తో రాణించినప్పటికీ, తన జట్టును విజేతగా నిలబెట్టలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సమిత్.. జట్టు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 37 పరుగులు చేశాడు.ఆ తర్వాత బౌలింగ్లోనూతనదైన ముద్ర వేశాడు. 3.4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన తర్వాత కూడా సమిత్ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. వారు నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని శివమొగ్గ యోధాస్ మరో రెండు బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) ఛేదించారు.కెప్టెన్ లవ్నిత్ సిసోడియా (87) అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించుకున్నాడు. అతనికి అనీశ్ (38), నవీన్ (24) సహకరించారు. సమిత్ 4 వికెట్లతో యోధాస్‌పై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో శివమొగ్గ యోధాస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
4 నెలలకే.. నవ దంపతుల విషాదం! అసలేం జరిగింది?
కర్ణాటక, తుమకూరు: పెళ్లయిన 4 నెలలకే నూతన జంట ఆత్మహత్య చేసుకుంది. వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలన్న పెద్దల దీవెనలు ఫలించలేదు. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని హనుమానహళ్లిలో శరణ్య (20), గిరీష్ (28) ప్రాణాలు తీసుకున్నారు. పొరుగూరు సిద్ధనహళ్లి గ్రామానికి చెందిన శరణ్య డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆమెకు తల్లి సోదరుని కుమారుడైన గిరీష్‌తో వివాహం చేశారు. కొత్త సంసారం సజావుగా సాగుతోంది. సోమవారం అత్తమామలు, భర్త పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లారు.సాయంత్రం భర్త ఇంటికి వచ్చి పిలిచాడు. స్పందన రాకపోవడంతో, కిటికీలో నుంచి చూడగా, శరణ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో గిరీష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తీవ్ర భయాందోళన చెంది పొలంలోని చెట్టుకు అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. పట్టణాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. -
కొడుకుపై కేసును తండ్రిపై ఎలా నమోదు చేస్తారు?
బెంగళూరు: కుమారుడిపై ఉన్న కేసునే తండ్రిపైనా ఎలా నమోదు చేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివరాలు.. మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ కుమారుడైన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో రేవణ్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి నిందితునిగా చేర్చారు. దీనిని రేవణ్ణ హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఒక సెక్షన్‌ను తొలగించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ‘ఇద్దరిపై భిన్నమైన ఆరోపణలున్నాయి. కానీ ఒకే కేసుగా భావించి.. కొడుకుపై ఉన్న కేసునే తండ్రిపై ఎలా నమోదు చేస్తారు. చట్టంలో ఈ అవకాశం ఉందా? దౌర్జన్యం కేసును రద్దు చేసి.. లైంగిక దాడి కేసుగా విచారించాలని ఆదేశించడం ఔచిత్యమేనా?’ అని కర్ణాటక హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడంలో చేసిన జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేసింది. -
కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో బీసీ నేతల కీలక భేటీ
దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతుల (బీసీ) హక్కుల సాధన కోసం మరో చారిత్రాత్మక పోరాటానికి బెంగళూరు నగరం వేదిక కాబోతోంది. వచ్చే నెల ఆగస్టు 7వ తేదీన బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో "11వ అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభ"ను నిర్వహించనున్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. బెంగళూరులోని కృష్ణా హౌస్‌లో కర్ణాటక పీసీసీ అధ్యక్షులు బికె హరి ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో పలు రాష్ట్రాలకు చెందిన 15 మంది కీలక ఓబీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాల తరపున చొరవ తీసుకోవాలని ఆయన సీఎంను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా గత పదేళ్లుగా ఢిల్లీ, ముంబై, నాగపూర్, హైదరాబాద్, అమృత్సర్, గోవా వంటి నగరాల్లో విజయవంతంగా మహాసభలు నిర్వహించి బీసీలను ఏకం చేశామని, అదే స్ఫూర్తితో ఈసారి 11వ మహాసభను బెంగళూరులో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నేనున్నా.. బీసీలకు సీఎం డీకే శివకుమార్ అభయంబీసీ నేతల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా బీసీల డిమాండ్లను పరిష్కరించేందుకు ఒక ముఖ్యమంత్రిగా, అలాగే కర్ణాటక ప్రభుత్వం తరపున తన వంతు సంపూర్ణ మద్దతు ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంతటి ప్రతిష్టాత్మక జాతీయ ఓబీసీ మహాసభ ఈ ఏడాది తమ రాష్ట్రంలో జరగడం అభినందనీయమని పేర్కొంటూ, ఈ సభకు తాను తప్పకుండా హాజరవుతానని భరోసా ఇచ్చారు. -
లెజెండరీ సింగర్ జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
గాన కోకిల ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరు సమీపంలోని కణియర హుండి గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ముగిసింది. బ్రాహ్మణ సంప్రదాయంలో జానకమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. జానకి అంత్యక్రియల్లో పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు పాల్గొన్నారు. అంతకుముందు లెజెండరీ సింగర్ చివరి చూపు కోసం అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూర్‌లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్‌కి పార్థీవదేహాన్ని తరలించారు.ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. సినీ ప్రస్థానం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత. లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్ జానకి. -
ఐఐటీ నేపథ్యం కాదు..కానీ యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం
ఐఐటీ వంటి ఉన్నత చదువులు ఉంటేనే అధిక జీతాలతో కూడిన ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం. కానీ సాధారణ నేపథ్యం, సాదాసీదా డిగ్రీతో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ కూడా ఉన్నత శిఖరాలను చేరొచ్చు అని నిరూపించాడు ఈ యువకుడు. పట్టుదల, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే ఇదేమంత కష్టం కాదని కర్ణాటకు చెందిన ఓ సాధారణ ఇంజనీర్ ప్రూవ్ చేశాడు. ఓ మారుమూల గ్రామం నుంచి ఏకంగా అమెరికాలో ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగం సంపాదించి..యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.అతడే కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలోని గ్రామానికి చెందిన పృథ్వీరాజ్. తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వివరిస్తూ షేర్ చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం..అతను బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తనకు ఎలాంటి ఐఐటీ డిగ్రీ, ఉన్నత నేపథ్యం లేవని వెల్లడించాడు. కానీ నిరంతర కృషి, ఇంటర్న్షిఫ్లు, వ్యక్తిగత ప్రాజెక్టులు, తరగతి గదికి మించిన నిరంతర అభ్యాసం ద్వారా తన నైపుణ్యాను పెంపొందించుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు. అతని అంకితభావం చివరికి ఎన్విడియాలో ఉద్యోగం సంపాదించడానికి సహాయపడిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను అమెరికాలో కాలిఫోర్నియాలోని ఎన్విడియా అనే ప్రతిష్టాత్మక టెక్నాలజీ కంపెనీలో ఏడాదికి సుమారు రూ.2.6 కోట్ల జీతం సంపాదిస్తున్నట్లు పోస్ట్ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలకు శక్తినిచ్చే అధునాతన చిప్‌లను అభివృద్ధి చేసే పనిలో తను భాగమైనట్లు తెలిపాడు. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలో కేవలం ప్రముఖ విద్యాసంస్థలు నుంచి పట్టభద్రులైన వారు మాత్రమే విజయవంతమైన కెరీర్లను నిర్మించుకోగలరనే భావనను అతడి కథ తిరగరాసింది. పైగా తమ లక్ష్యాలను చేరుకోవడానికి తపిస్తున్న యువ నిపుణులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!) -
రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్
బెంగళూరు నగర బస్సు ప్రయాణికులు నిత్యం ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో.. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఆయన మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిగా తనిఖీ నిర్వహించారు. అడిగినంత చిల్లర ఇవ్వలేకపోయినందుకు మంత్రిని బస్సు దిగిపోవాలంటూ బీఎంటీసీ బస్సు కండక్టర్ కోరడంతో ఆయన షాక్ అయ్యారు.బస్సుల్లో తనిఖీకి మంత్రి బైరతి సురేష్ బయలుదేరారు. హెబ్బాళ్ నుంచి నాగశెట్టిహళ్లికి వెళ్లే బీఎంటీసీ బస్సు ఆయన ఎక్కారు. మాస్క్ ధరించిన మంత్రి.. రాత్రి 7:10 గంటల నుండి 9:10 గంటల మధ్య జయమహల్, టీవీ టవర్, ఆర్టీ నగర్, సీబీఐ రోడ్, హెబ్బాల్, మాన్యతా టెక్ పార్క్, నాగవార, హెన్నూర్, హెన్నూర్ బండే, బైరతి బండే, గెద్దలహళ్లి రూట్లలో బస్సుల్లో ప్రయాణించి తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో రెండు టిక్కెట్లు కావాలని కోరుతూ మంత్రి రూ.100 నోటు ఇచ్చారు. మంత్రిని గుర్తించని కండక్టర్.. చిల్లర ఇవ్వాలని కోరాడు. తన వద్ద చిల్లర లేదని మంత్రి చెప్పగా.. తన వద్ద కూడా చిల్లర లేదని చెబుతూ కండక్టర్ తన బ్యాగ్ తెరిచి చూపించాడు. చిల్లర ఇవ్వలేకపోతే బస్సు దిగాల్సిందేనని కండక్టర్ పట్టుబట్టాడు. దీంతో మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండానే బస్సు దిగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ ప్రజల మాదిరిగా మంత్రి మారు వేషంతో తనిఖీకి వెళ్లడంపై సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్‌గా మారింది. మంత్రిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
డెలివరీ పేరుతో ఇంట్లోకి ఎంట్రీ.. వికృత చేష్టలతో ఖంగుతిన్న మహిళ
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళకు డెలివరీ ఏజెంట్ కారణంగా భయానక అనుభవం ఎదురైంది. పార్సిల్ డెలివరీ కోసం ఇంటికి వచ్చిన వ్యక్తి టాయిలెట్ ఉపయోగించుకోవాలని కోరగా, మహిళ అందుకు నిరాకరించింది. అయితే ఆమె మాటను పట్టించుకోకుండా అతడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. సాధారణ డెలివరీగా మొదలైన ఘటన చివరకు తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ వెళ్లే ముందు టాయిలెట్ ఉపయోగించుకోవాలని అడిగాడు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్నందున ఆమె అందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆమె వద్దని చెప్పినా పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడని మహిళ ఆరోపించింది. ఆ తర్వాత జరిగిన ఘటనతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. తన ఎదుట ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆమె ఎదుట తన దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె వెంటనే తలుపులు మూసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.एक महिला ना कहने पर भी एक लड़का उनका Washroom Use किया उनको उसका Private Part दिखाए 😡।एक Flipkart/Myntra का Delhivery Boy parcel लेेकर आता है एक लड़की के पास उसके बाद उन्होंने कहा कि आपका Washroom Use कर सकता हूं क्या ।लेकिन वो लेडीज अकेला रहता है इसलिए ना कहा लेकिन वो नहीं… pic.twitter.com/rJFaJVRUWT— Subhajit Das (@SantaniSubhajit) July 11, 2026ఈ ఘటన అనంతరం బాధితురాలు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో వెల్లడించింది. ఆమె పోస్టు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫిర్యాదు అందించాలని బాధితురాలిని కోరిన పోలీసులు, ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాగా, ఇటీవలి కాలంలో డెలివరీ సిబ్బందితో సంబంధం ఉన్న కొన్ని వివాదాస్పద ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితులకు ఇంట్లోకి ప్రవేశం కల్పించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. -
70 ఏళ్ల వృద్ధుడి ఇడ్లీ వ్యాపారం క్రేజ్‌కి మాటల్లేవ్ అంతే..!
అల్పాహారంలో తరాలు మారిన తరగని ఆదరణ ఒక్క ఇడ్లీకే ఉంది. అంతలా ప్రజాదరణ కలిగిన ఇడ్లీని ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. కానీ కొందరు లాభప్రేక్షతో సంబంధం లేకుండా కడుపు నిండా ఆహారం అందించడమే ధ్యేయంగా నడుపుతున్న వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఏ రేంజ్లో ఇడ్లీని విక్రయిస్తాయో తెలిసిందే. ఆఖరికి చిన్న చిన్న దుకాణాలు సైతం ఓ మోస్తారుగా రేటుని పెంచేశాయి. కానీ ఇప్పటికీ ఈ 70 ఏళ్ల వృద్ధుడు కేవలం రూ. 5లకే ఇడ్లీన అమ్ముతుండటం విశేషం. పైగా ఆ చుట్టపక్కల ఉండే ఏ రెస్టారెంట్ ఆయన ఇడ్లీ రుచికి పోటీ పడలేదంటే అతిశయోక్తి కాదేమో. అంత క్రేజ్ ఆ తాతగారి ఇడ్లీకి. ఆయనే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 70 ఏళ్ల రామచంద్ర. ఆయన తన తండ్రి వారసత్వాన్ని 56 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కట్టెల పొయ్యిపై దక్షిణ భారతదేశపు ప్రసిద్ధ అల్పహారమైన ఇడ్లీని తయరు చేసి అందిస్తుంటాడు. ఆయన ప్రతి రోజు సుమారు 1500 ఇడ్లీలదాక తయరు చేస్తాడట. అవన్నీ అమ్ముడైపోవడం విశేషం. కారం కలిగిన ఎర్ర చట్నీతో కేవలం రూ. 5లకే అందిస్తుంటాడు. బెంగళూరు రెండు గంటల దూరంలో కనకపుర నగరంలో ఉన్న అతడి చిన్న దుకాణం క్రేజ్ మాములుగా ఉండదు. అక్కడుండే ప్రసిద్ధ హోటళ్లు కూడా రామచంద్ర ఇడ్లీ రుచి ముందు సరితూగవట. తన తండ్రి శేషప్ప 1970లో ఈ 'కోటె మానే ఇడ్లీ' దుకాణాన్ని స్థాపించారని, అప్పట్లో పది ఇడ్లీలు ఒక్క రూపాయికే అమ్మేవారని వెల్లడించాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ..16వ ఏట ఈ దుకాణం బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. తాను ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నానని అన్నారు. రామచంద్ర దుకాణానికి వినియోగదారులను ఆకర్షించే ప్రధాన అంశం ఆయన తయారు చేసే ఇడ్లీల ప్రత్యేక రుచి. ఆయన రోజు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలవుతుంది. మొత్తం ఆరు గంటలు పొయ్యి ముందే ఉంటారు. అయినా గానీ అలసట అనిపించదని, కస్టమర్లు గుంపులు గుంపులగా రావడం చూడగానే ఆ కష్టమంతా ఆవిరి అయిపోతుందని అంటున్నాడు. ఈ పనిలో తన కుమారుడు అనంత్, కోడలు నిరోషా సహాయం అందిస్తారని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ఇడ్లీలు అంత రుచిగా ఉండటానికి ప్రధాన కారణం ఉడికించిన బియ్యం కలపడమేనని చెప్పారు. అలాగే తాను చట్నీని బైడగి మిరపకాయలు, తాజా పుదీనా, శనగపప్పులతో అందించడంతోనే తను అందించే టిఫిన్‌కి ఇంత గిరాకీ అని అంటున్నారు. మరి ఇంత తక్కువ ధరకు అమ్మితే లాభం వస్తుందా అంటే..అందుకు రామచంద్రా ప్రజలకు కడుపు నిండా ఆహారం అందించడంలోనే అసలైన ఆనందం ఉంటుందంటున్నారు. అలాగే తన తండ్రి జ్ఞాపకార్థం లాభంతో పనిలేకుండా ఈ సేవను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by 𝚂𝚊𝚐𝚊𝚛 (@sagar_._v) (చదవండి: లగ్జరీ లైఫ్ వదిలి.. భారత్‌లోని మారుమూల గ్రామంలో ఆమె!) -
తరచూ పుట్టింటికి వెళ్తోందని.. హెల్మెట్‌తో కొట్టి చంపిన భర్త..!
బెంగళూరు: ఓ భర్త తన భార్యను హెల్మెట్‌తో కొట్టి దారుణంగా కడతేర్చిన ఘటన హుబ్లీ సమీపంలోని తారిహళ గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. నాలుగున్నర నెలల క్రితమే వీరికి వివాహం కావడం గమనార్హం. మృతురాలిని నాగరత్న హొళెమని(24)గా గుర్తించారు. నిందితుడైన భర్తను తారిహాళ గ్రామ గణేష్ నగర్ నివాసి శివరాజ్ హొళెమని(28)గా గుర్తించారు. పెళ్లి అయ్యాక ఈ యువ దంపతుల మధ్య తరచు కలతలు, కలహాలు నెలకొనేవి. నాగరత్న పదే పదే పుట్టింటికి వెళుతుండేది. బుధవారం ఉదయమే నాగరత్న పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చింది. ఉదయం మాటామాటా పెంచుకొని పరిస్థితి ప్రకోపానికి దారి తీయడంతో ఆగ్రహానికి గురైన శివరాజ్ హెల్మెట్‌తో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరత్న స్థలంలోనే మృతి చెందిందని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా పరారీలో ఉన్న నిందితుడు శివరాజ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతానికి హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
నాగుపాము వేటకు బలైన మరో పాము..!
పామును నాగుపాము మింగిన ఘటన మైసూరులోని బోగాడిలోని భారతీ ఎన్‌క్లేవ్‌లో జరిగింది. ఒక నాగుపాము పామును వెంబడించింది. నాగుపాము బారి నుండి విడిపించుకోవడానికి పోరాడి విఫలమైంది. చివరికి నాగుపాము దానిని మింగేసింది. ఈ దృశ్యాన్ని స్థానికుడి మొబైల్ ఫోన్లో రికార్డ్ అవ్వగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాముల నిపుణుడు శ్యామ్ మాట్లాడుతూ ఆహారం దొరకనప్పుడు పాము మరో పామును మింగడం సాధారణమేనని అన్నారు. మైసూరు(కర్ణాటక) -
మొబైల్ టార్చ్ వెలుగులో బస్సు డ్రైవింగ్
దొడ్డబళ్లాపుర(కర్ణాటక): అన్నీ సక్రమంగా ఉంటేనే ప్రయాణం సవ్యంగా సాగేది. కానీ కేఎస్ ఆర్టీసీ బస్సు రాత్రి ప్రయాణంలో హెడ్లైట్లు పనిచేయకపోవడంతో డ్రైవరు నానా తిప్పలు పడ్డారు. మొబైల్‌ఫోన్ లైటు వేసుకుని డ్రైవింగ్ చేసిన ప్రమాదకర ఘటన కలబుర్గిలో వెలుగుచూసింది. శనివారం రాత్రి కలబుర్గి నుంచి చించోళికి వెళ్తున్న బస్సు హెడ్లైట్లు పనిచేయలేదు. చిమ్మ చీకటిలో కండక్టర్ మొబైల్‌తో టార్చ్ వేయగా ఆ వెలుగులో డ్రైవర్ బస్సు నడిపాడు. బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తతంగంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. లైట్లు పనిచేయకపోతే బస్సును నిలిపివేసి, ప్రయాణికులను మరో బస్సులో పంపించాలన్నారు. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్‌గా కాగా, డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. డిపోలలో మెకానిక్‌ల నిర్లక్ష్య ధోరణి వల్ల బస్సులలో యాంత్రిక లోపాలు వస్తున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. Kalaburagi–Chincholi 🚨⚠️ Looks like KKRTC bus driver overdriving mobile phone torch light at night? 🤷♂️@DriveSmart_IN @dabir @RCBengaluru @InfraEye @sumanthchandar @anil_lulla pic.twitter.com/aYPBds4YNF— Dave (Road Safety: City & Highways) (@motordave2) July 5, 2026 -
మేడం, మేడం అంటూ ఆకతాయిల అరాచకం
కర్ణాటక: ఇంజనీరింగ్ విద్యార్థిని నడుచుకొని ఇంటికి వెళుతుండగా ఆకతాయిలు వేధించగా ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఇంటికి వెళ్లాక దుండగులు వచ్చి కత్తితో దాడి చేసిన దురాగతం చింతామణి పట్టణంలోని అశ్రయ లేఔట్లో జరిగింది. వివరాలు.. మేఘన (20) ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె నృత్యకారిణి కావడంతో నూతన హైస్కూల్లో విద్యార్ధులకు శిక్షణనిచ్చి ఇంటికి వెళ్తోంది. కౌశిన్, వినయ్ అనే కీచకులు ఆమె వెంటపడుతూ మేడం, మేడం అని హేళన చేయసాగారు. మేఘన అడ్డుకోవడంతో ఆమెకు చెంపదెబ్బలు కొట్టారు. తరువాత 10 మంది గుంపుతో ఆమె ఇంటిలోకి చొరబడి చాకుతో దాడి చేశారు. మేఘన గాయపడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. పట్టణంలో పోకిరీల ఆగడాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
దారుణాలు బయటపెడితే.. ఉద్యోగం నుంచి తీసేశారు!
బెంగళూరు: క్యాప్‌జెమినీ బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్లో చిన్నారులపై జరుగుతున్న అమానుష వేధింపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారులపై జరుగుతున్న హింసను గతంలోనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగినినే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తేలింది. జిల్లా బాలల సంరక్షణ అధికారి తిలకేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డేకేర్ సెంటర్లో మొత్తం 50 నుంచి 60 మంది చిన్నారులు నమోదు కాగా, ప్రతిరోజూ 15 నుంచి 20 మంది హాజరవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారనే కారణంతో వారిని వాషింగ్ మెషీన్లో కూర్చోబెట్టడం, బాత్రూమ్లో బంధించడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నీరు చల్లడం, భయపెట్టి మౌనం పాటించేలా చేయడం వంటి దారుణాలు చాలా కాలంగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అంతేకాదు.. గతంలో ఓ ఉద్యోగి ఈ దారుణాలపై ప్రశ్నించిందని చెప్పారు. ఈ విషయమై కేర్టేకర్ల మీద సూపర్వైజర్కు ఫిర్యాదు చేసి.. ఎంత జరుగుతుందో తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఫిర్యాదు చేసిన ఆ ఉద్యోగినినే విధుల్లోంచి తొలగించారని అధికారులు తెలిపారు.🚨 Bengaluru Daycare Horror: Five women booked after toddlers were allegedly forced into a washing machine and abused at a daycare. The accused have been taken in for questioning. Investigation is underway.#Bengaluru pic.twitter.com/wQrCdaNl4i— Smriti Sharmaa (@SmritiSharma_) July 1, 2026ఇటీవల ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐదుగురు కేర్‌టేకర్లపై కేసు నమోదు చేసి, వీడియోలను కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు పంపించారు.ఈ ఘటనపై స్పందించిన క్యాప్‌జెమినీ సంస్థ.. ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని, విచారణ పూర్తయ్యే వరకు బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటికే ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై బాలల సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు గతంలో మరెన్ని జరిగాయనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళా అధికారిణికి దర్యాప్తు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఇలాంటి కేర్ సెంటర్లలో పిల్లల భద్రతకు సంబంధించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. -
కర్ణాటక క్వారీలో ఘోర ప్రమాదం.. స్పందించిన సీఎం డీకే
బెంగళూరు: బెంగళూరులో ఘోర ప్రమాద ఘటన వెలుగు చూసింది. క్వారీలో బండ రాయి మీద పడి తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డినట్టు సమాచారం. ఈ ఘటనలో మృతులను బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం డీకే శివకుమార్ సైతం స్పందించి.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.వివరాల మేరకు.. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడపట్టణ (Madapattana) సమీపంలోని ఓ స్టోన్ క్రషర్ క్వారీలో గురువారం ఉదయం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో కార్మికులు పనులు చేస్తున్న సమయంలో భారీ గ్రానైట్ బండరాయి ఒక్కసారిగా విరిగి కింద పడింది. కొండపై భాగంలో ట్రాక్టర్ సాయంతో బండరాయిని తరలిస్తున్న సమయంలో అది అదుపుతప్పి కింద పనిచేస్తున్న కార్మికులపై పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.వలస కార్మికులే బాధితులుమృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వలస కార్మికులేనని పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది బీహార్‌కు చెందినవారు కాగా, కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు స్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో భారీ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్వారీ పరిసరాలను పూర్తిగా మూసివేసి, ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు.ప్రమాదానికి కారణమేంటి?ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే బ్లాస్టింగ్ కారణంగా ఏర్పడిన కంపనాలు లేదా భారీ బండరాయిని తరలించే సమయంలో జరిగిన లోపం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. క్వారీలో భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.ముఖ్యమంత్రి ఆవేదనఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్వారీల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల అమలు, అనుమతులు, బ్లాస్టింగ్ విధానాలు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. -
బస్సులోంచి తెగిపడిన తల
రెప్పపాటులో ఒక కుర్రాడి జీవితం ఆగిపోయింది. ఇంకా ఎన్నో కలలు కంటూ, భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన 17 ఏళ్ల విద్యార్థి.. ఓ చిన్న నిర్లక్ష్య దారుణరీతిలో బలైపోయాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన కుర్రాడిని ఆ ఘోర స్థితిలో చూసి తోటి ప్రయాణికులు వణికిపోయారు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగల్చడమేకాదు.. వెన్నులో వణుకు పుట్టించింది. హుబ్బళి నుంచి లక్ష్మేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఫక్కీరేష్ అనే 17 ఏళ్ల విద్యార్థి, వెనుక సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్నాడు. కుందగోళ్ (Kundgol) స్టేజ్ దగ్గర్లో ఉండగా.. ఫక్కీరేష్ ఒక్కసారిగా కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. క్షణంలోనే వెనుక నుంచి వస్తున్న టిప్పర్ అతడిని బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో అతని తల తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయగా, బస్సులో విషాద వాతావరణం నెలకొంది. మృతుడు అతను ఐటీఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థిగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.కదులుతున్న వాహనాల్లో కిటికీల వద్ద జాగ్రత్తలు పాటించకపోతే చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
బిగ్ బాస్ బ్యూటీని అర్ధరాత్రి నడిరోడ్డుపై..
-
తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ‘చెత్త’ పంచాయితీ..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బీదర్, మల్గి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.వివరాల మేరకు.. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డు తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో చెత్తను అక్కడ పడేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త డంపింగ్ కారణంగా తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.మరోవైపు.. చెత్త వాహనాలను అడ్డుకున్న వారిని బీదర్ మున్సిపల్ అధికారుల బెదిరిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు బీదర్‌కి ఎలా వస్తారో చూస్తాం అంటూ మల్గి, బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్తను మున్సిపల్ అధికారులు పారబోసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. బీదర్, మల్గి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. -
'చెవిలో పువ్వులు పెడుతున్నారా?.. అదంతా ప్రజల సొమ్మే!'
వీధి కుక్కల నియంత్రణ అంశంలో పలు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు తీవ్ర నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అది ఎలా ఉందో తెలియజేసే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి వచ్చిన అధికారుల వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడంపై ఆయన వాళ్లపై మండిపడ్డారు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం బెంగళూరులో కర్ణాటక మంత్రి రాష్ట్ర మంత్రి కృష్ణ బైరెగౌడ నేతృత్వంలో వీధికుక్కల నియంత్రణం అంశంపై సమీక్ష సమావేశం జరింది. దీనికి పశుసంవర్ధక శాఖకు చెందిన 19 మంది అధికారులు పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్ల ఖర్చు, ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు, ప్రస్తుతం వీధికుక్కల సంఖ్య ఎంత వంటి ప్రాథమిక వివరాలు కూడా వారి వద్ద లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు."మీరు సమావేశానికి ఎందుకు వచ్చారు? కనీస డేటా కూడా లేకుండా ఎలా వచ్చారు? అదంతా ప్రజల డబ్బు కదా? ఎక్కడికి పోయింది? అలా ఎలా ఖర్చు పెట్టారు?" అంటూ కాస్త కఠినంగానే అధికారులను ప్రశ్నించారు. ఐదేళ్ల వ్యయ వివరాలు వెంటనే ఇవ్వాలని, డేటా లేకుండా సమావేశానికి రావడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.ఈ క్రమంలో అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆ ఇచ్చిన సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో మంత్రి మరింత అసహనం వ్యక్తం చేశారు. "నేను చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలేదు.. మీరు చెప్పిందల్లా వినడానికి" అంటూ కన్నడలోని ఒక సామెతను ఉపయోగిస్తూ.. తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. వీధికుక్కల సంఖ్య యథాతథంగా ఉండటంపై ఆయన తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.Bengaluru Development Minister @krishnabgowda on Tuesday pulled up Animal Husbandry Department officials during a review meeting over the stray dog sterilisation programme. Questioning how stray dog population had remained unchanged despite sterilisation being carried out for… https://t.co/a3bPBWvJcI pic.twitter.com/b3HQPZ5Ls9— ChristinMathewPhilip (@ChristinMP_) June 30, 2026ఈ సందర్భంగా సంబంధిత అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని సమావేశంలోనే ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, స్టెరిలైజేషన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులను ఆదేశించారు.కృష్ణ బైరెగౌడ కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుకుని, అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న కృష్ణ బైరెగౌడ.. ప్రస్తుతం బెంగళూరు అభివృద్ధి శాఖ (Bengaluru Development) మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనంపై రాజీ పడని నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కృష్ణ బైరెగౌడ అధికారుల పనితీరుపై కఠిన వైఖరికి పేరుగాంచారు. ఇటీవల కూడా నాసిరకం రోడ్డు నిర్మాణ పనులను గుర్తించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు కాంట్రాక్టర్‌కు జరిమానా విధించారు. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు.సుప్రీంకోర్టు కూడా సీరియస్..దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు, రేబీస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై భారత సుప్రీంకోర్టు కూడా పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, జంతు సంక్షేమ నిబంధనలను కూడా పాటించాలని స్పష్టం చేసింది. కేవలం స్టెరిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం కాకుండా.. వాటి ఫలితాలు ప్రజలకు కనిపించేలా ఉండాలని కోర్టు పరోక్షంగా సూచించింది. ఈ నేపథ్యంలో.. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై కర్ణాటక మంత్రి కృష్ణ బైరెగౌడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
రిసార్టులో ప్రియురాలి మృతి.. రక్తపు మడుగులో ప్రియుడు..!
రిసార్టులో ప్రియురాలు మరణించగా, ప్రియుడు చావుబతుకుల్లో పడి ఉండడం మిస్టరీగా మారింది. చిక్కబళ్లాపురం నగర శివార్లలో ప్రసిద్ధి చెందిన నంది హిల్స్ సమీపంలో ఉన్న ఓ హోమ్ స్టేలో యువతి అనుమానాస్పదంగా శవమై తేలింది. ఆమెను కేరళకు చెందిన సాయి సురభి (23)గా పోలీసులు గుర్తించారు. ఈమె ప్రియుడు, కేరళ కోజికోడ్‌కు చెందిన సంజిత్ అలీ (24) రక్త గాయాలతో పడి ఉన్నాడు. సురభిని హత్యచేసి తరువాత సంజీత్ ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూం ఖాళీ చేయకపోవడంతో వివరాలు.. సంజీత్ బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడని సమాచారం. గత శనివారం ముద్దేనహళ్లి సమీపంలోని హోం స్టేకు వీరిద్దరూ వచ్చారు. సోమవారం రూమ్ ఖాళీ చేస్తామని తెలిపారు. టైం దాటినా ఖాళీ చేయలేదు. దీంతో సిబ్బంది లోపలికి తొంగి చూడగా ఆమె చనిపోయి ఉంది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ కుశాల్ చౌక్సీ, నందిగిరి ధామ పోలీసులు చేరుకుని పరిశీలించారు. యువతి ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అలాగే కొన్ని మాత్రలు కూడా కనిపించాయి. ఒక డైరీ లభించింది. అపస్మారక స్థితిలో ఉన్న సంజీత్‌ని ఆస్పత్రికి తరలించారు. నా కూతుర్ని వేధించేవాడు.. సురభి తల్లి గీతా బోరున విలపిస్తూ ఘటనా స్థలికి చేరుకుంది. ఇదొక లవ్ జిహాద్ హత్య అని ఆమె ఆరోపించింది. బెంగళూరు దయానంద సాగర్ కాలేజీలో చదువుతున్న సమయంలో సంజీత్ అలి పరిచయం అయ్యాడని, ప్రేమ పేరిట వేధించేవాడని గీతా తెలిపింది. అతనినుంచి కాపాడుకునేందుకు కూతురును వేరే చోట ఉంచి చదివిస్తున్నట్లు తెలిపింది. తన కుమార్తెను అతడు పూర్తిగా నాశనం చేశాడని, డ్రగ్స్‌కు అలవాటు చేశాడని తెలిపింది. తాను కష్టపడి రెండు , మూడుచోట్ల ఆమెకు చికిత్స చేయించి బాగు చేసుకున్నానని చెప్పింది. ఇటీవలే ముద్దేనహళ్లిలో ఓ సెంటర్లో ఫిజియోథెరపిస్టుగా సురభి చేరిందని, శనివారం సత్సంగం ఉందని చెప్పి వెళ్లిందని వివరించింది. అయితే ఈ సంజీత్ ఆమెను నమ్మించి హోంస్టేకు తీసుకెళ్లి హత్య చేశాడని ఆరోపించింది. యువతి మామ శంకరనారాయణ పోలీసులపై మండిపడ్డారు. సంజీత్ అలీ వేధింపులపై గతంలో తాము ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోలేదని, అప్పుడే అతనిపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు సురభి బతికి ఉండేదని రోదించారు. మరోవైపు గతేడాది సురభి మిస్సింగ్‌పై బనశంకరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. అప్పుడు స్నేహితురాలి ఇంటిలో సురభిని గుర్తించి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కర్ణాటక: -
భార్య జీతమే కోర్టు తీర్పును మార్చేసింది..
బెంగళూరు: భరణం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంటే, కేవలం మహిళ అన్న కారణంతో ఆమె భరణం కోరడానికి వీల్లేదని తెలిపింది. భరణం మంజూరు చేసే విషయంలో లింగం ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దని, ఇరువురి ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.భర్తకు దూరంగా ఉంటున్న భార్యకు తాత్కాలిక భరణంగా నెలకు రూ.20,000 చొప్పున చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.వివాదం ఏమిటి?ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భర్త కర్ణాటక హైకోర్టులో సవాలు చేశాడు. తన భార్య నెలకు సుమారు రూ.లక్ష సంపాదిస్తోందని, తన నెల జీతం రూ.60,646 మాత్రమేనని వాదించాడు. భార్య పరిస్థితి ఆర్థికంగా బాగుందని, ఆమెకు భరణం అవసరం లేదని తెలిపాడు. దీనిపై భార్య స్పందిస్తూ పెళ్లి ఖర్చుల వల్ల చేసిన అప్పులు తీర్చడానికి ఆ మొత్తం అవసరమని వాదించింది. అయితే, పెండింగ్‌లో ఉన్న అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలవారీ ఈఎంఐల వివరాలను అఫిడవిట్లో ఆమె వెల్లడించలేదు.న్యాయస్థానం ఏమి చెప్పింది?న్యాయమూర్తి స్పందిస్తూ.. భర్త దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి, తాత్కాలిక భరణం ఉత్తర్వులను రద్దు చేశారు. భర్తలే ఎప్పుడూ భార్యలను పోషించాలనే భావనతో కుటుంబ న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది."భార్య ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు, ఆమె ఆదాయం భర్త ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, పిల్లల సంరక్షణ వంటి ఇతర బాధ్యతలు ఆమెపై లేనప్పుడు.. మహిళలను పురుషులే పోషించాలనే కారణంతోగానీ, భార్యను భర్తే పోషించాలనే కారణంతోగానీ భరణం మంజూరు చేసేలా న్యాయస్థానాలు మొగ్గు చూపకూడదు" అని న్యాయస్థానం తెలిపింది.భర్త జీవన ప్రమాణానికి సమానంగా తన జీవనాన్ని కొనసాగించడానికి భార్యకు సొంత ఆదాయం లేకపోతే మాత్రమే భరణం మంజూరు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. భార్య నెల ఆదాయం రూ.లక్ష అని, అది భర్త జీతం కంటే ఎక్కువ అని, ఆమె తనను తాను పోషించుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.ఈ తీర్పు ప్రస్తుతం సవాలు చేసిన ‘తాత్కాలిక భరణం’ ఉత్తర్వులకు మాత్రమే వర్తిస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక వివాదంపై తుది తీర్పుపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. భవిష్యత్తులో పరిస్థితులు మారితే భార్యకు మరోసారి భరణం కోరే హక్కు ఉంటుందని కూడా పేర్కొంది. -
ప్రియుడి మోజులో భర్త, పిల్లలను వదిలేసి..!
బెంగళూరు: దారి తప్పిన ప్రేమ విషాదాంతమైంది. వివాహిత మహిళతో ప్రేమాయణం నడిపి, ఆమెతో పరారైన వ్యక్తి.. చివరికి ఆమెను హతమార్చాడు. ఈ ఘోర సంఘటన బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకా జిగణిలో జరిగింది. బాగల్‌కోట జిల్లా ఇళకల్‌కు చెందిన అక్షత (30)ను ఆమె ప్రియుడు నానా సాహెబ్ బలిగొన్నాడు. ఈ నెల 20న జిగణి పటాలమ్మ లేఔట్‌లోని ఇంటిలో దుర్వాసన వచ్చింది. ఇంటి యజమాని కిటికిలోంచి చూడగా అక్షత శవం కనిపించగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు రిపోర్టులో తెలిపారు. బాడుగ ఇల్లు తీసుకుని.. 2014లో అక్షత, కృష్ణ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు, కొడుకు ఉన్నారు. భర్త కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఆమెకు చేనేత కార్మికుడు నానా సాహెబ్‌తో పరిచయమై అనైతిక సంబంధం ఏర్పడింది. ఇతడు అవివాహితుడు అని సమాచారం. అతని మోజులో పడిన అక్షత భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఇటీవల ప్రియునితో కలిసి ఇళకల్ నుంచి బెంగళూరుకు వచ్చేసింది. తామిద్దం భార్యాభర్తలమని చెప్పి బాడుగ ఇంటిలో చేరారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నానాసాహెబ్ ఆమెను చంపి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయాడు. హంతకుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆమెను చంపాలని ప్లాన్ : కారులోనే కాలిపోయాడు
కర్ణాటకలో ఒక వింత ఘటన కాదు కాదు దారుణ ఘటన చోటు చేసుకుంది. తుమకూరు జిల్లాలో శనివారం ఒక కారు పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో 30 ఏళ్ల వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అసలు ఆ కారు ఎందుకు పేలింది. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఈ విషయాలు తెలిస్తే విస్తుపోవడం మీ వంతు అవుతుంది. ఏమైంది అంటే...కారు పేలిన ఘటనలో చనిపోయిన వ్యక్తిని నాగేంద్ర (30)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నాగేంద్ర బెంగళూరులో ఒక కారును బుక్ చేసుకున్నాడు.రమ్య ఉల్లాస్ (23)తో కలిసి ఈ కారులో ప్రయాణం మొదలు పెట్టాడు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక స్టేట్మెంట్ ప్రకారం, వీరిద్దరూ బెంగళూరులో కారు ఎక్కి అంకోలా వైపు బయలుదేరారు. కారు తుమకూరు సమీప ప్రాంతానికి చేరుకోగానే వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం మొదలైంది.ఈ గొడవ జరుగుతుండగా, నాగేంద్ర కత్తితో రమ్యపై దాడి చేసి పొడిచాడు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన రమ్య.. నాగేంద్ర వద్ద బాంబు ఉందని గట్టిగా అరుస్తూ డ్రైవర్‌ను హెచ్చరించింది. గాయాలపాలైనప్పటికీ, ఆమె ఎలాగోలా కారులోంచి బయటకు దూకేసింది.అది గమనించిన డ్రైవర్ ప్రవీణ్ వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి, తాను కూడా బయటకు పరుగులు తీశాడు.ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్రమ్య, డ్రైవర్ ఇద్దరూ బయటకు దూకేసిన తర్వాత..నాగేంద్ర కారు డోర్లను లోపలి నుండి లాక్ చేసుకుని, తనతో పాటు తెచ్చుకున్న నాటు బాంబును పేల్చేసుకున్నాడు. ఈ పేలుడు తీవ్రతకు కారు పూర్తిగా తగలబడిపోయింది, నాగేంద్ర లోపలే సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్‌కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన యువతి రమ్య ఉత్తర కన్నడ జిల్లా నివాసి.బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ దాడిలో గాడయపడిన రమ్య,ప్రస్తుతం తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.పోలీసుల దర్యాప్తుస్థానికుల సమాచారం మేరకు తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? నాగేంద్ర అంతటి ఘాతుకానికి ఒడిగట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది? అతను వాడిన పేలుడు పదార్థం ఎలాంటిది? అనే విషయాలను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: 30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు -
హెల్మెట్ ఎంత అవసరమంటే.. వైరల్ వీడియో
బెంగళూరు: నగరంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్పై ఒక్కసారిగా విరిగిపడిన చెట్టు కొమ్మ అతడిని ప్రాణాపాయ స్థితికి నెట్టింది. తలపై తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన బాధితుడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రాజాజీనగర్ ప్రాంతంలోని రామ్ మందిర్ రోడ్డులో శనివారం జరిగిన ప్రమాదంలో 52 ఏళ్ల ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు సతీష్ తన ఆఫీస్‌కు వెళ్తుండగా ఒక్కసారిగా ఎండిపోయిన చెట్టు కొమ్మ విరిగి అతడి తలపై పడింది.సతీష్ హెల్మెట్ ధరించలేదు. చెట్టు కొమ్మ బలంగా తగలడంతో అతడు బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోవడం సీసీటీవీలో దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యశ్వంత్‌పూర్‌లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సతీష్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు.తలకు తీవ్ర గాయం కారణంగా ఆయన తొలుత కోమాలోకి వెళ్లినప్పటికీ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో నగరాల్లో పాత, ఎండిపోయిన చెట్ల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అలాగే ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసింది. -
బైక్ పై వెళ్తుండగా తలపై పడ్డ చెట్టు కొమ్మ.. కోమాలోకి వెళ్లిన వ్యక్తి..!
-
స్కూల్ వ్యాను వెళ్తుండగా రోడ్డుపై పడిపోయిన ఐదుగురు విద్యార్థులు
బెంగళూరులోని కేఆర్ పుర సమీపంలోని గాయత్రి లేఔట్ వద్ద శుక్రవారం ఉదయం ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ వెనుక తలుపు మధ్యలోనే తెరుచుకోవడంతో ఐదుగురు విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి.పిల్లలు వ్యాన్ వెనుక భాగంలో కూర్చున్నారు. ప్రయాణం సాగుతుండగా వెనుక తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో వారు రోడ్డుపై పడిపోయారు. అదృష్టవశాత్తూ వెనుక నుంచి ఏ వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.తర్వాత ట్రాఫిక్ పోలీసులు వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ బయలుదేరే ముందు వెనుక తలుపును సరిగా మూయకపోవడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై దర్యాప్తు సాగుతోంది.కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ల నుంచి పిల్లలు వ్యాన్లు, ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి కూర్చొని వెళ్తూ కనపడుతుంటారు. ఈ ఏడాది ఆరంభంలో ఝార్ఖండ్‌లోని హర్ము రోడ్డుపై 10 మందికిపైగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. అయితే ఏ చిన్నారికీ తీవ్రమైన గాయాలు కాలేదు.అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులను తరలించే తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. స్కూల్ రవాణా వాహనాలపై సరిపడా తనిఖీలు జరుగుతున్నాయా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు."భారత్‌లో 10 మంది పిల్లలు కూర్చునే సామర్థ్యం ఉన్న స్కూల్ వ్యాన్‌లో 20 మందిని ఎక్కిస్తున్నారు. ఇలా వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి వ్యాన్లపై పోలీసులు జరిమానా విధించడం నేను ఇప్పటివరకు చూడలేదు" అని ఓ వ్యక్తి ఎక్స్‌లో కామెంట్ చేశాడు. -
గోశాలలు కాసుల కురిపిస్తాయా?
బెంగళూరు: భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త విప్లవానికి గోశాలలు కేంద్రబిందువుగా మారగలవా? ఒకప్పుడు అమూల్ సహకార మోడల్ దేశంలోని కోట్లాది పాల రైతుల జీవితాలను మార్చినట్లే.. ఇప్పుడు గోశాలలను ఆధారంగా చేసుకుని కొత్త సహకార ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చనే ప్రతిపాదన ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.భారతదేశంలో ప్రస్తుతం సుమారు 7,676 నమోదిత గోశాలలు ఉండగా, అనధికారిక ఆశ్రయాలు, పింజరపోల్స్ కలిపితే వాటి సంఖ్య 15 వేల వరకు ఉండొచ్చని అంచనా. అయితే వీటిలో చాలా గోశాలలు పెరుగుతున్న పశుగ్రాస ఖర్చులు, వైద్య సంరక్షణ వ్యయాలు, మార్కెట్ సౌకర్యాల కొరత, నాణ్యత నియంత్రణలో లోపాలు, విభిన్నంగా పనిచేయడం వంటి కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా చాలా వరకు విరాళాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి.ఈ పరిస్థితిని మార్చేందుకు 'నేషనల్ గోశాల కోఆపరేటివ్ మోడల్' అనే కొత్త ఆలోచనను నిపుణులు ముందుకు తెస్తున్నారు. ఇందులో ప్రతి గోశాల విడివిడిగా పనిచేసే కేంద్రంగా కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద సహకార వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. గోశాలలు కేవలం పశు సంరక్షణ కేంద్రాలుగా కాకుండా, దేశీయ ఆవు ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేకరణ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ఈ ప్రతిపాదన ప్రకారం ప్రాంతీయ స్థాయిలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ, లాజిస్టిక్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు. వెటర్నరీ కళాశాలలు ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక చర్యలు, శాస్త్రీయ సహకారం అందించవచ్చు. అలాగే ఈ-కామర్స్ వేదికల ద్వారా గోశాలల్లో తయారయ్యే ఉత్పత్తులను నేరుగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.ఈ మోడల్లో కేవలం పాల ఉత్పత్తులకే పరిమితం కాకుండా గోమయం(పేడ), గోమూత్రం ఆధారిత ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్లు, సహజ వ్యవసాయ ఉత్పత్తులు, వెల్నెస్ ఉత్పత్తులు వంటి రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పాలు ఇవ్వని ఆవులను ఆర్థిక భారంగా భావిస్తున్న పరిస్థితిని మార్చి, వాటినీ గ్రామీణ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మార్చవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదనను జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ)కు చెందిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఆదర్శ గౌడ ముందుకు తెచ్చారు. గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త అవకాశాలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేయగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పశు సంక్షేమం, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ ఆదాయ వనరులు కూడా బలోపేతమవుతాయి. గోశాలలను వాణిజ్యీకరించడం లక్ష్యం కాదని, వాటిని ఆర్థికంగా స్వావలంబన చేయడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.మొత్తానికి, అమూల్ మాదిరిగా గోశాలల చుట్టూ కూడా ఒక సమగ్ర సహకార వ్యవస్థను నిర్మించగలిగితే.. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.:::డాక్టర్ ఆదర్శ గౌడ


