శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని హోలెహోన్నూరు వద్ద ఘోర విషాదం జరిగింది. ఆదివారం సాయంత్రం భద్ర ఎడమ గట్టు కాలువలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు.
అరెబిలాచికి చెందిన నీలాబాయి(50), ఆమె కుమారుడు రవికుమార్(32), కుమార్తె శ్వేత(35), అల్లుడు పరశురాం(40) కాలువలో బట్టలు ఉతకడానికి వచ్చి, కొట్టుకుపోయారు. ఈ సమయంలో ఒకరిని రక్షించే ప్రయత్నంలో మిగిలిన వాళ్లు మునిగిపోయారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు. ఇటీవల భద్ర డ్యాం నుంచి నీటి విడుదలను పెంచడంతో కాలువల్లో ప్రవాహం ఎక్కువగా ఉంది.


