బెంగళూరు: కర్ణాటకలో ఓ టీచర్ పరీక్ష పేపర్ లీక్ చేస్తానని విద్యార్థికి ఆశ చూపి 80 గ్రాముల బంగారం కాజేసింది. ఈ వివరాలు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ స్టూడెంట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ధార్వాడ్‌లోని విద్యారణ్య పాఠశాలలో SSLV ( 10 వతరగతి) పరీక్ష పత్రాన్ని లీక్ చేస్తానని ఆ విద్యార్థికి, టీచర్ ఆశచూపింది. దీనికి గాను మెుదటగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే విద్యార్థి దగ్గర డబ్బు లేవని చెప్పడంతో ఇంట్లో ఉన్న బంగారం తేవాలని చెప్పింది. దానికి విద్యార్థి తొలుత భయపడ్డాడు. అయితే తను ఆ నగలు తిరిగి ఇచ్చేస్తానని భయపడాల్సిన అవసరం ఏమి లేదని విద్యార్థికి నచ్చజెప్పింది.
దీంతో ఆ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణున్ని అయితాననే ఆశతో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారం దాదాపు రూ. 12 లక్షలు విలువ తీసుకొచ్చి ఆ టీచర్‌కు ఇచ్చాడు. కొద్దిరోజులకు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆ టీచర్ అతనిని తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించింది. అయితే ఇంతలోనే బంగారం పోయిన సంగతి ఆ ఇంట్లో వారు గమనించారు. దీంతో ఆ పిల్లాడిని నిలదీయగా అతన అసలు విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలియడంతో ఆ విద్యార్థి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్నపోలీసులు ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా మరేవరైనా విద్యార్థుల వద్ద నగదు కాజేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


