breaking news
Student
-
స్టూడెంట్స్ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐకూ కొత్తగా జె11 పేరిట 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 31,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో, 6.83 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ క్రియేషన్, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టం, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్‌ఛార్జ్, 50 ఎంపీ సోనీ కెమెరా మొదలైన ఫీచర్లు ఉంటాయి.దీనితో పాటు ఐకూ బడ్స్ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని గరిష్ట ప్లేబ్యాక్ సమయం 50 గంటల వరకు ఉంటుంది. ధర రూ. 1,699 నుంచి ప్రారంభం అవుతుంది. జెడ్11 ఫోన్ల అమ్మకాలు ఆగస్టు 25 నుంచి, బడ్స్ విక్రయాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. -
దిమాగీ నక్సల్ అంటే మాకు మెదడు ఉన్నట్టే కదా!
ప్రశ్న: ముందుగా, ఇటీవలి కాలంలోని అత్యంత విజయవంత మైన, దేశానికి కొత్త ఆశను కల్పించిన ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు అభినందనలు. గత రెండు దశాబ్దాలుగా సమాజాన్ని ఆవరించిన భయోత్పాత వాతావరణాన్ని ఈ ఉద్యమం కొంతవరకు తొలగించగలిగింది. అందుకు మరిన్ని అభినందనలు. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్త పర్యటన ఎందుకు?ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం. జార్ఖండ్‌లో విద్యార్థులు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అందుకే రాంచీ వెళ్లాం. కోల్‌కతాలో ఐఎస్ఐ విద్యార్థులు తమ విద్యాసంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాం. తర్వాత జైపూర్ వెళ్లాం. రాజస్థాన్ పేపర్ లీక్‌లకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ కోచింగ్ మాఫియా అక్కడ పెద్ద సమస్య. విద్యా వ్యవస్థ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఏబీవీపీ హింసకు వ్యతి రేకంగా కొంతమంది విద్యార్థులు పోరాడుతున్నారు. సీజేఐని కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తే తమను బార్లో నమోదు చేయబోమని బెదిరించే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము వారితో కలిసి పోరాడుతున్నాం.జంతర్ మంతర్ ఉద్యమం ఎలాంటి పాఠాలు నేర్పింది?ఆ ఉద్యమం విజయం సాధించడానికి ప్రధాన కారణం మేము సంఘటితంగా ఉండటం. అందుకే ఎక్కడ విద్యార్థులు పోరాడు తున్నా వారు కూడా సంఘటితం కావాలి. అధికార ధోరణులను, నిరంకుశ శక్తులను నిజంగా ఎదుర్కోవాలంటే కలిసి రావాలి, తమను తాము చైతన్యపరుచుకోవాలి.మీ తక్షణ లక్ష్యం ఏమిటి?ప్రత్యేకంగా ఏమీ లేదు. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులను సంఘటితం చేయడం, రాజకీయాల్లోకి తీసుకుని రావడం, నిజమైన శక్తి ఐక్యతలోనే ఉందని అర్థమయ్యేలా చేయడం– ఇవే మా లక్ష్యాలు. నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడాలి.జంతర్ మంతర్‌లో మూడు భిన్నమైన స్రవంతులు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇక భవిష్యత్తు?మేమంతా కలిసి కొత్త సంస్థ ఏర్పాటు చేయబోవడం లేదు. నేను ఏఐఎస్‌ఏలో భాగం. అదే నా సంస్థ. అభిజీత్ దీప్కే సీజేపీలో భాగం. అదే ఆయన సంస్థ. సోనమ్ వాంగ్‌చుక్ స్వతంత్ర వ్యక్తి. ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఉమ్మడి సమస్యలు ఉంటే విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం మేము ఒక ఐక్య వేదిక ద్వారా కలిసి పోరాడవచ్చు.మీరు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారా?మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలపై నా అవగాహన భిన్నంగా ఉంటుంది. నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చాను. ప్రధాన స్రవంతి రాజకీయాలను ఆదర్శ రాజకీయాలుగా మేము చూడం. కాబట్టి నేను ఆ రాజకీయాల్లో చేరను. నేను రాజకీయాల్లోనే ఉన్నాను – నాకు సాధ్యమైనంత లోతుగా. నా భావజాలాన్ని కొనసాగిస్తాను. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించవచ్చు.మోదీ అంటించిన ‘దిమాగీ నక్సల్’ లేబుల్‌పై మీ స్పందన?అది ఏమాత్రం ప్రభావం లేని పదం. ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించడానికి, వారిని నిరుత్సాహపరచడానికి, వారి మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ‘దిమాగీ నక్సల్’ అనేది ఒక జోక్ మాత్రమే. అందరూ నరేంద్ర మోదీని ఉద్దేశించి రకరకాల వ్యంగ్య నినాదాలు ఇస్తున్నారు. ఆయన కూడా ‘నేనూ ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి’ అనుకుని ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని తీసుకొచ్చినట్టుంది. కానీ ఇందులో మరో విషయం ఉంది. ‘దిమాగీ నక్సల్’ అంటే మనందరికీ మెదడు ఉంది. మనకు ఆలోచించే శక్తి ఉంది. మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పడానికి టెలీప్రాంప్టర్ అవసరం లేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడే ఇన్స్టాగ్రామ్ ప్రపంచం కూడా మనకు అవసరం లేదు. ప్రజలతో స్నేహంగా ఉండాల్సింది పోయి, వారి నుంచి పూర్తిగా దూరమయ్యే భాష మనకు అవసరం లేదు. కాబట్టి ‘దిమాగీ నక్సల్స్’ అని పిలిస్తే పిలవనివ్వండి!– డానీ, సమాజ విశ్లేషకులు -
యూకేజీ విద్యార్థిని కొట్టి చంపిన టీచర్
విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ తేజ అనే చిన్నారిని స్కూల్ టీచర్ కొట్టింది. దీంతో ప్రణయ తేజ మృతి చెందాడు. కేజీహెచ్ వద్ద ఆ బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. వారితో పోలీసులు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రణయ తేజ వన్ టౌన్ లిటిల్ గార్డెన్ స్కూల్లో యూకేజీ విద్యార్థి. గురువారం ఉదయం 11.20 గంటలకు స్కూల్లో విషాద ఘటన జరిగింది. హోం వర్క్ చెయ్యలేదని టీచర్ కొడుతుంటే అతడు బాగా భయపడిపోయి, కుప్పకూలాడు. స్కూల్లో బాలుడు పడిపోయిన వెంటనే సీపీఆర్ చేశారు మరో టీచర్. ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి బాలుడిని తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు బాలుడిని టీచర్లు కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. కేజీహెచ్‌కు తీసుకొచ్చిన వెంటనే ఈసీజీ సహా పలు టెస్టులు చేసి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. విశాఖలో ఈ విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్ వద్ద కూడా ఆ చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసి, కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు. -
చదువుతూనే రోజుకు రూ.1,200 సంపాదన
ఉన్నత చదువులు చదువుకుంటూనే సొంత కాళ్లపై నిలబడాలనే నిశ్చయంతో ముందుకు సాగుతున్న నేటి యువతకు బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ విద్యార్థి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కళాశాల సెలవుల సమయాన్ని వృథా చేయకుండా బైక్ టాక్సీ అగ్రిగేటర్ సంస్థ రాపిడోలో క్యాప్టెన్గా చేరి రోజుకు సగటున రూ.1,200 వరకు ఆర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి ఇటీవల తెలిపాడు.తన మూడు నెలల పని అనుభవాన్ని పంచుకుంటూ రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (సుమారు 8.5 గంటలు) రాపిడో క్యాప్టెన్గా సేవలు అందించినట్లు పేర్కొన్నాడు. నిలకడైన ప్రణాళిక, కష్టపడే తత్వంతో పని చేస్తే సెలవుల్లోనే కాకుండా చదువుతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించాడు. బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఉద్యోగ సాధన, గిగ్ ఎకానమీ కల్పిస్తున్న అవకాశాలపై నేటి తరం ఆలోచనా విధానానికి ఈ ఘటన అద్దం పడుతోంది.సమయ పాలన, ఆర్థిక స్వాలంబన పట్ల ఈ విద్యార్థి చూపిన చొరవ సోషల్ మీడియాలోనూ, ఇతర యువతలోనూ విశేష ఆదరణ పొందుతోంది. కేవలం చదువుకే పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగిస్తూ గిగ్ వర్కర్‌గా మారడం ద్వారా ఒకవైపు పాకెట్ మనీ సంపాదిస్తాన్నాడు. మరోవైపు సమాజంలో రవాణా సేవలు అందించడంలో భాగస్వామి కావడం గమనార్హం.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం! -
హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతి గృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్ (11) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విద్యార్థి చనిపోయిన ముందు రోజు నుంచి హాస్టల్లో కనిపించడం లేదు, విద్యార్థి బంధువు ఒకరు వచ్చి చెప్పేంత వరకు హాస్టల్ వార్డెన్కూ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ముందు రోజు వసతి గృహంలో అదృశ్యమైన విద్యార్థి మరుసటి రోజు వసతి గృహానికి ఆనుకుని ఉన్న చెరువులో మృతదేహంగా కనిపించడం గమనార్హం. కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం గ్రామానికి చెందిన ముద్దాడ జయరాం, ఆమె భార్య భవానీ హైదరాబాద్‌లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.వీరి పెద్ద కుమారుడే దుర్గాప్రసాద్. ఆదివారం సాయంత్రం దుర్గాప్రసాద్ వసతి గృహం నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం సరియాపల్లి గ్రామానికి చెందిన కూరాకుల దశరథ అనే వ్యక్తి హాస్టల్‌కు వచ్చి తమ గ్రామానికి చెందిన విద్యార్థులతో మాట్లాడాడు. మాటల సందర్భంలో దుర్గా ప్రసాద్ గురించి అడగ్గా.. అతడు ఇంటికి వెళ్లాడని తోటి విద్యార్థులు చెప్పారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.కానీ విద్యార్థి కమలనాభపురం, సరియాపల్లిలోని తాతయ్య ఇంటికి కూడా వెళ్లకపోవడంతో అనుమానం వచ్చి తాతయ్య సింహాచలం, అమ్మమ్మ అప్పలమ్మ తదితరులు హాస్టల్‌కు వచ్చి తమ మనవడి కోసం సిబ్బందిని అడిగారు. దీంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులకు విషయం తెలియడంతో వెతుకులాడారు. హాస్టల్ సమీపంలో ఉన్న చెరువులో విద్యార్థి చెప్పులు కనిపించడంతో గాలించగా మృతదేహం దొరికింది. ఘటనపై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
ప్రహరీ కూలి పదో తరగతి విద్యార్థి మృతి
సాలూరు రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోవడంతో అదే పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పెద్దవీధికి చెందిన తుపాకుల అరుణ్ తేజ్ (15) దుర్మరణం చెందాడు. మరో విద్యార్థి సుమన్ అశ్విన్ స్వల్పంగా గాయపడ్డాడు. సోమవారం మధ్యాహ్న భోజనానంతరం కాలకృత్యాలు తీర్చుకోవడానికి తోటి విద్యార్థులతో కలిసి అరుణ్‌తేజ్, అశ్విన్‌లు పాఠశాల వెనుక ఉన్న ప్రహరీ పక్కకు వెళ్లారు.గోడ పూర్తిగా నానిపోయి ఉండడంతో అది కూలిపోయింది. అరుణ్తేజ్పై ప్రహరీ పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సుమన్, అశ్విని కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం వల్లే ఆరుబయటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, మంత్రి సంధ్యారాణి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు అందజేస్తామని ప్రకటించారు. -
పార్వతీపురం మన్యం: గోడకూలి విద్యార్థి మృతి
సాక్షి,పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల గోడకూలి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయలయ్యాయి. దీంతో గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే గోడ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అపశ్రుతిప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతిమరో విద్యార్థికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/musG9tMW79— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026 -
నేనూ ఇక్కడే చనిపోతా..
సింగరాయకొండ: ‘నా కుమారుడు తౌషిక్ (11) ఇక్కడే మరణించాడు. నేనూ ఇక్కడే మరణిస్తా. నా కుమారుడు చనిపోయి ఆరు నెలలవుతున్నా ఇంత వరకు దోషులపై ఎటువంటి చర్యలు లేవు. కోర్టును ఆశ్రయించినా లాయర్ నాకు అన్యాయం చేశాడు. చివరకు నాకు మరణమే శరణ్యం. నేను ఇంటి దగ్గర ఉంటే నా బిడ్డ పదేపదే గుర్తుకు వస్తున్నాడు. ఇక నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. నా శవమే ఇక్కడ నుంచి కదులుతుంది’ అని తల్లి మౌలాభి గుండెలవిసేలా విలపించారు. ప్రకాశం జిల్లా మూలగుంటపాడు పంచాయతీలోని శ్రీ చైతన్య నవోదయ స్కూలు వద్ద ఆదివారం ఆమె నిరసనకు దిగారు.‘ఈ స్కూలు వాళ్లు నా కుమారుడి గొంతులో పెన్నుతో పొడిచి చంపేశారు. ఆత్మహత్య అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘మేమంతా ఓట్లు వేసి గెలిపించుకున్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరశింహారెడ్డి.. ఈ సమస్యను ఎవరూ తన వద్దకు తీసుకుని రావద్దని మా కులస్తుల సమావేశంలో తెగేసి చెప్పారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపనని, తాను ఇక్కడే చనిపోతానని ఆమె తేల్చి చెప్పారు. కాగా రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. -
ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): ఎంబీబీఎస్ విద్యార్థి ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చట్ల తిమ్మాయిపల్లికి చెందిన కోల్కూరి భరద్వాజ్ (18) ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతు న్నాడు. రామంతాపూర్ పీఎస్ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. భరద్వాజ్ సోద రి వారేణ్య కూడా ఎంబీబీఎస్ చదువుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు ఇద్దరు కలిసి చదు వుకున్నారు. సోదరి ఆదివారం తెల్లవారు జా మున 3.30 గంటల సమయంలో చూసే సరికి భరద్వాజ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులను సంప్రది స్తూ వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూ కీ ల భించలేదు. ఉదయం 7.25 గంటలకు వారేణ్య ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని యువకు డు ఎన్ఎస్ఎల్ భవనంపై నుంచి పడి ఉన్నా డన్న సమాచారం డయల్ 100కు అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకు న్నా రు. ఇదే సమాచారాన్ని భరద్వాజ్ కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వచ్చి చనిపో యినది భరద్వా జ్ అని ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం నుంచి పరీక్షలు ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా డన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. -
ఎనిమిదో తరగతి విద్యార్థిపై సీనియర్ల దాడి
తాండూరు రూరల్: ఓ విద్యార్థికి సీనియర్ విద్యార్థులు చపాతి కర్రతో వాతలు పెట్టారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులోని పెద్దేముల్ టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్) పాఠశాల, కళాశాలలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. ఎనిమిదో తరగతి విద్యార్థి బాలాజీ ఉదయం హాస్టల్ విద్యార్థులతో కలిసి చపాతీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో సీనియర్ విద్యార్థులు బాలాజీకి చపాతి కర్రతో కాళ్లకు వాతలు పెట్టారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. గేటు తెరవకపోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్ఐ సుమాన్ అలీ సిబ్బందితో హాస్టల్‌కు చేరుకున్నారు. పోలీసులు వచ్చిన విçషయం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌కు ఫోన్లో చెప్పి గేటు తెరిచారు. అయితే హాస్టల్లో జరిగిన ఘటనపై రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తాండూరు టౌన్ సీఐపరమేశ్వర్గౌడ్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో ఎస్ఐ సుమాన్ అలీ సిబ్బందితో వెళ్లి హాస్టల్ వద్ద భద్రతా చర్యలు చేపట్టారన్నారు. -
చిట్టి గుండె ఆగింది
నిజామాబాద్ రూరల్ : పంద్రాగస్టు రోజు ఉదయాన్నే లేచి జెండా పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశాపూర్‌కు చెందిన సుంకె మౌనిక కూతురు సుంకే సాత్విక(11) సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. చిన్నారి గుండెకు గతంలో శస్త్రచికిత్స జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం సాతి్వకకు గుండెలో నొప్పి రావడంతో ప్రిన్సిపల్ నళిని తల్లికి సమాచారం అందించారు. దీంతో మౌనిక తన కూతురిని నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా గతంలో గుండె ఆపరేషన్ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం పరిస్థితి విషమించి సాతి్వక ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో కేశాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మౌనిక భర్త గతంలోనే మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కూతురు మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది. -
చాక్లెట్లు, బిస్కెట్ల ఎర.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు!
తిరువొత్తియూరు: చెన్నైలోని శాలిగ్రామంలో బుద్ధిమాంధ్యంతో బాధపడే విద్యార్థికి చాక్లెట్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిన కిరాణా దుకాణం ఉద్యోగిని విరుగంబక్కం మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై శాలిగ్రామానికి చెందిన విద్యార్థిని ఆ ప్రాంతంలోని ఒక ప్రత్యేక పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా పాఠశాలకు వచ్చేటప్పుడు తన తోటి స్నేహితురాళ్లకు చాక్లెట్లు, బిస్కెట్లు వంటి తినుబండారాలను భారీగా తెచ్చి ఇస్తూ ఉండేది. ఇది గమనింన పాఠశాల టీచర్‌కు అనుమానం వచ్చింది. అలాగే విద్యారి్థని ప్రవర్తనలోనూ కొన్ని మార్పులు రావడం టీచర్ కనిపెట్టారు. దీంతో విద్యార్థినిని విచారించగా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను పాఠశాలకు వచ్చే దారిలో ఉన్న ఒక కిరాణా దుకాణంలోని వ్యక్తి, ప్రతిరోజూ తనను షాపులోకి పిలి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి తప్పుగా ప్రవర్తించేవాడని ఆ విద్యార్థిని తెలిపింది. దీంతో టీచర్ వెంటనే ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యారి్థనిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు పళనిస్వామి (35)ని అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం ఎదుట కన్నీళ్లు.. లంచం ఆరోపణలు.. అసలు ట్విస్ట్ ఇచ్చిన గోల్డ్ మెడలిస్ట్!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో 12వ తరగతి చదువుతున్న ఒక క్రీడాకారిణి అంతర్జాతీయ తైక్వాండో టోర్నమెంట్‌కు వెళ్లలేకపోయిన ఉదంతం రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ విద్యార్థిని వద్ద రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించగా, ఆ తర్వాత సదరు విద్యార్థిని మరో వీడియో విడుదల చేసి అసలు వాస్తవాలను వెల్లడించింది.డెహ్రాడూన్‌లోని సీఎన్ఐ గర్ల్స్ స్కూల్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని శైరా, ఆగస్టు 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిర్వహించిన ‘ముఖ్యమంత్రి యువ విద్యార్థి మంథన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యానని, అయితే రూ. 1.5 లక్షలు సమకూర్చుకోలేక ఆ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని సీఎం ఎదుట భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. దీంతో సీఎం ధామి ఆమెను ఓదార్చి, విద్యార్థిని వివరాలు సేకరించి తగిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.లంచం ఆరోపణలతో కాంగ్రెస్ విమర్శలుఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థిని నుంచి రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచిన ప్రతిభావంతురాలైన విద్యార్థినిని బీజేపీ అవినీతి పాలన వల్ల అంతర్జాతీయ వేదికకు దూరం చేశారని ధ్వజమెత్తింది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది.उत्तराखंड में एक बहादुर बेटी ने CM पुष्कर सिंह धामी के सामने खड़े होकर BJP सरकार के भ्रष्टाचार की पोल खोल दी।बच्ची ने बताया 👇मैंने ताईक्वांडो में नेशनल लेवल पर गोल्ड मेडल जीता था, लेकिन मैं इंटरनेशनल खेलने नहीं जा सकी, क्योंकि मुझसे 1.5 लाख रुपए की घूस मांगी गई।CM धामी ने… pic.twitter.com/D9kKJiyOm9— Congress (@INCIndia) August 12, 2026 అసలు వాస్తవం చెప్పిన విద్యార్థినిఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో శైరా మరో వీడియోను విడుదల చేసి పూర్తి వివరణ ఇచ్చింది. సీఎం కార్యక్రమంలో సమయం లేక పూర్తి విషయాన్ని చెప్పలేకపోయానని తెలిపింది. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన తర్వాత రొమేనియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఎంపికైనట్లు పేర్కొంది. ఆ పర్యటనకు అయ్యే మొత్తం ఖర్చులో సంబంధిత క్రీడా సంస్థ సుమారు రూ. 1.70 లక్షలు భరించేందుకు అంగీకరించిందని, మిగిలిన రూ. 1.5 లక్షల ఖర్చును తానే స్వయంగా భరించాల్సి వచ్చిందని వివరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన మిగతా మొత్తాన్ని సమకూర్చుకోవడంలో సహాయం కోరాలని తన పాఠశాలకు గానీ, ఇతరులకు గానీ ముందుగా సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఈ రూ. 1.5 లక్షలు ఎవరూ అడిగిన లంచం కాదని, టోర్నమెంట్ ఖర్చుల్లో తాను చెల్లించాల్సిన వాటా మాత్రమేనని, ప్రభుత్వ అధికారులెవరూ తన వద్ద లంచం డిమాండ్ చేయలేదని శైరా స్పష్టం చేసింది. -
పిల్లల కథలో అడల్డ్ కంటెంట్.. ‘కేంబ్రిడ్జ్’ హెచ్చరిక!
లండన్: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రముఖ పిల్లల కథ ‘లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్’పై వివాదాస్పద హెచ్చరికను జారీ చేసింది. హ్యూమానిటీస్ విద్యార్థుల కోసం నిర్వహించిన ఒక ఆన్లైన్ వెబ్‌నార్ సందర్భంగా, ఈ పిల్లల కథలో ‘పెద్దల కంటెంట్’, ‘హింసాత్మక అంశాలు’ ఉన్నాయని పేర్కొంటూ ఈ హెచ్చరికను జతచేశారు.క్లేర్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత ఆన్లైన్ కోర్సు ద్వారా ఏ-లెవల్, జీసీఎస్ఈ విద్యార్థులు విశ్వవిద్యాలయ విద్యకు సన్నద్ధమవుతారు. ఈ కోర్సులో భాగంగా చిన్ననాటి కథలను క్షుణ్ణంగా పరిశీలించాలని, కథల అంతరార్థాలను అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అయితే, దీనికి సంబంధించిన అధికారిక నోట్లలో ‘కంటెంట్ హెచ్చరిక: అద్భుత కథల ప్రస్తావనతో పాటు హింసాత్మక అంశాలు వంటి కొన్ని పెద్దల కంటెంట్‌పై ఈ సెషన్లో చర్చ ఉంటుంది’ అని పేర్కొన్నారు.1697లో తొలిసారి ప్రచురితమైనప్పటి నుంచి ‘రెడ్ రైడింగ్ హుడ్’ కథలో అనేక మార్పులు జరిగాయి. అసలు కథలో తోడేలు.. బామ్మను, రెడ్ రైడింగ్ హుడ్ను కూడా చంపుతుంది. 19వ శతాబ్దంలో గ్రిమ్ సోదరులు దీనికి భిన్నమైన వెర్షన్‌ను తీసుకువచ్చారు. ఇందులో తోడేలు ఆ బాలికను, ఆమె బామ్మను మింగేస్తుంది. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఒక వేటగాడు నిద్రపోతున్న తోడేలు కడుపు కోసి ఇద్దరినీ సజీవంగా బయటకు తీసుకువస్తాడు. అనంతరం దాని కడుపులో రాళ్లతో నింపడంతో తోడేలు నీటిలో మునిగి చనిపోతుంది.ఈ ట్రిగ్గర్ హెచ్చరికపై ఫ్రీ స్పీచ్ యూనియన్‌కు చెందిన లార్డ్ టోబీ యంగ్ స్పందిస్తూ ‘అద్భుత కథలపై ఇలాంటి హెచ్చరికలు పెట్టడం కేంబ్రిడ్జ్ లాంటి సంస్థకు కూడా చిన్నపిల్లల చేష్టల్లా అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2017లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ క్లాసికల్ గ్రంథాలపై, షేక్స్పియర్ నాటకాలపై ఇలాంటి హెచ్చరికల చిహ్నాలను ఉంచింది. ఇది కూడా చదవండి: జింబాబ్వే: పడవ బోల్తా పడి 15 మంది జలసమాధి! -
రాంచీలో ఉద్రిక్తత: రాష్ట్రవ్యాప్త బంద్‌లో ఏబీవీపీ ఆందోళనలు
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల అవకతవకలపై జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లోని లోపాలను సవరించాలని, సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన విధానసభ ముట్టడి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయువు, వాటర్ కేనాన్లను ప్రయోగించారు. ఈ పోలీసు చర్యను ఖండిస్తూ, ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌లోనూ నిరసనకారులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 🚨 Ranchi, Jharkhand: Thousands of students marching towards the Assembly were reportedly subjected to lathi-charge, tear gas and water cannons as police attempted to stop them. Students have been protesting for 17 days. pic.twitter.com/z0ts09LB5I— indiainlast24hr (@indiain24hr) August 10, 2026బంద్ ప్రభావం రాజధాని రాంచీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించి, టైర్లు కాల్చి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బంద్‌ను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలను కూడా మూసివేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పరిస్థితిని అదుపు చేయడానికి రాంచీలో దాదాపు రెండు వేల మంది పోలీసులను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దించారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొడర్మా, దుమ్కా, గఢ్వా తదితర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దుకాణాలను బంద్ చేయించారు. రాంచీలోని కిశోర్‌గంజ్ చౌక్, హర్ము చౌక్, భారత్ మాతా చౌక్ వద్ద ఆందోళనకారులు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక నిఘా ఉంచింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)ఆధ్వర్యంలో రాంచీలో పాత అసెంబ్లీ నుంచి కొత్త అసెంబ్లీ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు, ఉద్యోగార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యాన్సన్లను ప్రయోగించిన మరుసటి రోజే ఏబీవీపీ ఈ మార్చ్‌ను చేపట్టడం గమనార్హం. -
అట్టుడుకుతున్న జార్ఖండ్ వెనక్కి తగ్గేదే లే!
-
జార్ఖండ్: అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్లు..
రాంచీ: ఝార్ఖండ్‌లో నియామక పరీక్షల అక్రమాలను నిరసిస్తూ సోమవారం వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర శాసనసభ ముట్టడికి యత్నించారు. పురాతన అసెంబ్లీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను జగన్నాథ ఆలయం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. నిరసనకారులను నియంత్రించడానికి భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం దిగివచ్చి, 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో పాటు 2023, 2025లో నిర్వహించిన బ్యాక్లాగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. అయితే, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌పై విద్యార్థులు పట్టువీడలేదు.ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై జరుగుతున్న నిరసనల నడుమ సోమవారం రాంచీలో హైడ్రామా చోటుచేసుకుంది. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఆదిత్య సాహు, బాబూలాల్ మరాండీతో సహా పలువురు ప్రముఖ బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆందోళనకారులు శాంతియుతంగా అసెంబ్లీని ముట్టడించేందుకు (ఘెరావ్) అసెంబ్లీ వైపు మార్చ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి జార్ఖండ్ అసెంబ్లీ వైపు సాగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా, రాజ్యాద్ధబద్ధంగా ఈ మార్చ్ కొనసాగుతుందని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జార్ఖండ్ పోలీసులు నిషేధాజ్ఞలు (ప్రొహిబిటరీ ఆర్డర్లు) జారీ చేయడంతో పాటు, నగరవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళనలో పాల్గొనే విద్యార్థులు ఎలాంటి హింసాత్మక ప్రదర్శనలకు పాల్పడవద్దని రాంచీ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. #WATCH | Ranchi, Jharkhand: BJP leaders, protesting outside the CM residence, detained by the Police. They are protesting over JPSC-JSSC alleged irregularities. pic.twitter.com/ziejwSNz4z— ANI (@ANI) August 10, 2026జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, సోమవారం రాంచీలో రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని, ఈ పరిణామాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరీక్ష జరిగినందున సీబీఐ విచారణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. VIDEO | Ranchi, Jharkhand: Protesters leave Jaipal Singh Munda Stadium to march towards the 'Vidhan Sabha'.'Vidhan Sabha March' has been called by students who have been protesting for over two weeks against alleged irregularities in recruitment examinations in the state.… pic.twitter.com/gl3vyXt6Uf— Press Trust of India (@PTI_News) August 10, 2026విద్యాద్ధుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యార్థులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నిరసనల్లో భాగంగా ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహ్తో, సోమవారం నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.మరోవైపు, ఈ నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) సభ్యులు అజీతా భట్టాచార్య, అనిమా హన్సా, జమాల్ అహ్మద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఆరోపణలపై సీఐడీ వీరిని విచారణకు పిలవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసెంబ్లీ పరిసరాల్లో 750 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు, రాంచీ వ్యాప్తంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య పట్టువీడని ధోరణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
విద్యార్థి పోరుపై థరూర్ ఆత్మపరిశీలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి పోరుపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను సొంత పార్టీ నాయకత్వాన్ని విమర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ‘ఐఐఎంయూఎన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విపక్షాలు సరిగ్గా స్పందించలేకపోయాయని, యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే మార్గాలను పార్టీలు తెరవాలని తాను కోరినట్లు తెలిపారు.రాహుల్ గాంధీ చేపట్టిన 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమం పేపర్ లీక్ అంశాలను ముందే లేవనెత్తిందని, అయితే యువత ఆకాంక్షలకు తగినట్లుగా మన విధానాలు ఎందుకు ప్రతిధ్వనించలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని థరూర్ పేర్కొన్నారు. కొందరు మీడియా ప్రతినిధులు తన మాటలను అసందర్భంగా వక్రీకరించి, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు తన పూర్తి ప్రసంగ వీడియోను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేస్తూ, రాజకీయాల్లో యువత కేవలం ప్రేక్షకులుగా కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకు ఇవ్వాలని, రాజకీయ పార్టీలు తమ తలుపులను కొత్త తరానికి తెరవాలని శశిథరూర్ పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్! -
రాంచీలో AISA ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
-
చదవలేక.. తండ్రికి చెప్పలేక తనువు చాలించాడు
మధురానగర్(విజయవాడసెంట్రల్): చదువు ఒంటబట్టక.. ఈ విషయం తండ్రికి చెప్పలేక అర్ధంతరంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువుచాలించాడు. విషాద ఘటన శుక్రవారం విజయవాడ మధురానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన సమ్మెట దుర్గాప్రసాద్ ఎల్రక్టీషియన్. ఆయన భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమారుడు సమ్మెట తరుణ్ రాజ్ (13) సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూలాగే శుక్రవారం ఉదయం 9.15కి స్కూల్‌కి వెళ్తున్నాను అని చెప్పి సైకిల్ మీద వెళ్లాడు. తర్వాత సుమారు 10 గంటల ప్రాంతంలో బయట నంబర్ నుంచి తండ్రికి ఫోన్ చేసి స్కూల్‌కు వెళ్లే సరికి గేటు వేసి ఉందని.. తాను ఇంటికి వచ్చేస్తున్నానని చెపాడు. దీంతో తండ్రి సరే వచ్చేసేయ్ అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. పని ముగించుకుని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల వేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా తరుణ్‌రాజ్ చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ చుట్టుపక్కల బంధువులను పిలిచి గుణదల పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెడ్రూంలోని ఒక పుస్తకంలో ‘నాన్నా నువ్వు చదువు .. చదువు అని ఎప్పుడూ అంటూ ఉంటావు. నాకు చదవడం అంతగా రావడం లేదు అందుకే చనిపోతున్నాను’ అని రాసి ఉంది. ఇప్పటికే +భార్యను కోల్పోయిన దుర్గాప్రసాద్ ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. -
తాగుబోతుల అరాచకం.. మూడు సార్లు
-
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం తాగిన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) శుక్రవారం మృతిచెందింది. ఈ నెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్లో సినిమాకి వెళ్లి బైక్‌పై బయటకు వస్తుండగా.. మద్యం తాగిన ఇద్దరు యువకులు తమ కారుతో ఆ బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ఉన్న స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఎంబీబీఎస్‌లో మెరిట్ స్టూడెంట్ కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఎక్లాస్‌పురానికి వలస వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రియాంక. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె మెరిట్ స్టూడెంట్‌గా ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ డెర్మటాలజీలో చేరింది. ప్రియాంక మృతి వార్తతో ఎక్లాస్పురంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఎక్లాస్‌పురానికి తీసుకెళ్లి, శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ వైద్య విద్యార్థిని వెళుతున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్‌లను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో సూరారపు ధస్వంత్ సున్నపుబట్టీల వ్యాపారికాగా ఆండ్రు జోసెఫ్ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నారు.వారిద్దరు ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి కారులో కూర్చుని కొంతసేపు తాగారు. తర్వాత మరో ప్రాంతంలో కూర్చుని తాగి, అనంతరం ప్రసాదిత్య మాల్‌కు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కారుని అతివేగంగా లోపలికి పోనివ్వడం, మాల్ సిబ్బంది వారిని అడ్డుకోవడం, వారు అదే వేగంతో బయటకు వెళుతూ ప్రియాంక కూర్చున్న బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
ఫీజుల ఒత్తిడి తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు జె.రామారావుపేట సమ్మెట వారి వీధికి చెందిన విద్యార్థి (16) స్థానిక శాంతినగర్లోనిఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్ ఫీజు గడువు ముగిసింది. అయితే, శుక్రవారం విద్యార్థి తన తండ్రితో కలిసి ఫీజు చెల్లించేందుకు వెళ్లాడు. కళాశాల యాజమాన్యం, ఆలస్యం అయిందని కట్టించుకునేందుకు ప్రధాన కార్యాలయ అనుమతి కావాలని, రేపు రావాలని చెప్పారు. దీంతో ఇద్దరు ఇంటికి బయల్దేరారు. మార్గ మధ్యంలో తండ్రి తాను పనిచేస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వెళతానని, ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని కుమారుడిని పంపేశాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థి, ఇంట్లో ఫ్యానుకు తన తల్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి అతడి అన్నయ్య గమనించి కాకినాడ జీజీహెచ్‌కు తరలించాడు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు, ఫీజు ఒత్తిడి వల్లే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫీజుల కోసం విద్యార్థిని పొట్టనబెట్టుకున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆత్మహత్య ఘటనపై కాకినాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన బాలికోన్నత పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందింది. మండలంలోని చిట్టంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పాఠశాలకు ఆనుకుని ఉన్న మరో భవనంలో ఆరబెట్టిన దుస్తులు తీసుకునేందుకు వెళ్లింది. దుస్తులు అందకపోవడంతో అక్కడున్న ఇనుప స్టాండ్‌పై ఎక్కి ఇనుప కిటికీని పట్టుకుంది. ఆ కిటికీకి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్‌కు గురై కేకలు వేసింది. మరో విద్యార్థిని దీపిక ఆమెను చున్నీతో లాగింది. వెంటనే ఆమెను వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీపార్వతి మృతికి హాస్టల్ వార్డెన్, హెచ్ఎం కారణమంటూ తల్లిదండ్రులు కెచ్చెల అమల, సుధాకర్‌రెడ్డి, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మోసుకుని ఆశ్రమ పాఠశాల గేటు వద్దకు తీసుకెళ్లి బైఠాయించారు. -
USAలో హైకింగ్‌కు వెళ్లిన భారతీయ సంతతి విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలో హైకింగ్‌కు వెళ్లి అదృశ్యమైన భారత సంతతికి చెందిన పీహెచ్డీ విద్యార్థి విక్రమ్ ముబాయి దురదృష్టవశాత్తు మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని ఇన్యో నేషనల్ ఫారెస్ట్ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా (UCSB)లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నాడు.వివారాల్లోకి వెళితే... విక్రమ్ ముబాయి ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని బిగ్ పైన్ లేక్స్ ప్రాంతంలో ఒంటరిగా హైకింగ్‌కు వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8:30 గంటలకు తన కుటుంబ సభ్యులకు చివరిసారిగా సంప్రదించి, తాను ఉన్న ప్రదేశానికి సంబంధించిన GPS కోఆర్డినేట్స్ పంపించాడు.ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో, నిర్ణయించిన సమయానికి కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదని అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇన్యో కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందంతో పాటు కాలిఫోర్నియా హైవే పట్రోల్ సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. చివరకు అతని మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.అయితే విక్రమ్ ముబాయి ఎలా మరణించాడనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం వరకు హత్య లేదా ఇతర అనుమానాస్పద అంశాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
నీట్ కోచింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పెనమలూరు: విజయవాడ సమీపంలోని కానూరులో ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన కంతేటి వైష్ణవి (19) కానూరులోని శ్రీభారతి ఇనిస్టిట్యూట్‌లో నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరింది. కానూరులో ఉండటం ఇష్టం లేకపోవటంతో తండ్రి అరవింద్ ప్రశాంత్ రెండు వారాల క్రితం వైష్ణవిని ఇంటికి తీసుకెళ్లి నచ్చజెప్పి తిరిగి కానూరు కాలేజీ హాస్టల్‌కు తీసుకొచ్చారు. తనను ఇంటికి తీసుకు వెళ్లాలని.. ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, వైష్ణవి మళ్లీ తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. -
గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్‌తో 27 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారికి స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించారు. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారికి ఏఎన్ఎం మాత్రలు అందించగా తగ్గాయని చెబుతున్నారు.సోమవారం ఉదయం విద్యార్థినులు కిచిడి తిన్నాక కొంతసేపటికి 27 మంది అస్వస్థతకు గురవడంతో వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స అందించారు. సమాచారం అందుకున్న జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణరెడ్డి, తహసీల్దార్ విజయసాగర్ ఆస్పత్రిని సందర్శించి విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరాతీశారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లి మిగతా విద్యార్థినుల పరిస్థితిని పరిశీలించారు. కాగా, అన్నంలో పురుగులు వస్తున్నాయని, భోజనం బాగుండడం లేదని విద్యార్థినులు వాపోయారు.వార్డెన్ షేక్ యాకూబ్ సమయపాలన లేకుండా విధులకు హాజరవుతారని తెలిసింది. విద్యార్థినుల ఆరోగ్యంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విరీన్ మాట్లాడుతూ విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వచ్చారని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. -
నీట్ ఫలితాలు.. కుటుంబం ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి!
ఆంధ్రప్రదేశ్, కోడుమూరు రూరల్: నీట్ పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాల్‌కు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు.బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్ కావాలనుకోవడంతో ఇంటర్ బైపీసీ ఇప్పించగా 965మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల క్యాన్సిల్ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో తనకు 487మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాల్‌కు చెప్పసాగింది.అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్ చేయగా నీట్ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకు బయటకు రాకపోవడం, పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చిన వేణుగోపల్ భార్య భాగ్యమ్మ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులను పగులగొట్టి చూడగా అప్పటికే పుష్పావతి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఉరి నుంచి తప్పించి చూడగా అప్పటికే మృతి చెందింది.పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి నీట్లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం
ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపలేదు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మను నిలదీశారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా ఏదో చిన్న గీత పడిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
విద్యార్థులతో మసాజ్,కాళ్లు పట్టించుకుంటున్న టీచర్
-
లెక్చరర్ చేయి చేసుకున్నాడని ఇంటర్ విద్యార్ధి సూసైడ్
-
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థికి పాము కాటు!
పార్వతీపురంరూరల్/జియ్యమ్మవలస రూరల్ : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ–రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పత్తిక అభి సోమవారం రాత్రి పాము కాటుకు గురయ్యాడు. ఛాతీపై మూడు చోట్ల గాట్లు కనిపించడం, అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది, భయాందోళనకు గురయ్యారు. విద్యార్థిని తొలుత రామభద్రపురం పీహెచ్‌సీకి, అనంతరం కురుపాం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థికి విష విరుగుడు మొదటి డోసు ఇచ్చారు. మరో ఎనిమిది గంటల తర్వాత రెండవ డోసు ఇస్తామని వైద్యులు తెలిపారు. విద్యార్థిని 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. కాగా, ఈ పాఠశాల హాస్టల్ పక్కనే అడవిని తలపించేలా చెట్లు పెరిగి.. పాములు, విష కీటకాలు తరచూ పాఠశాలలోకి ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రాణం తీసిన అవమానం!
గద్వాల క్రైం: అతనో నిరుపేద విద్యార్థి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూనే ఫస్టియర్‌లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో ర్యాంకర్‌గా నిలిచాడు. అయితే ఓ లెక్చరర్ మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ హేళన చేయడం.. చెంపపై కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో కుంగుబాటుకు లోనై బలవన్మరణానికి పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం, సూసైడ్ నోట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మూడు పేజీల సూసైడ్ నోట్ కొత్తపల్లికి చెందిన నేతి»ొట్టు తెలుగు బుచ్చన్న, రేణమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరి రెండో కుమారుడు తరుణ్ (17) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత శనివారం కళాశాలలో ఓ మహిళా లెక్చరర్ ఫస్టియర్‌లో మరో విద్యార్థికి వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ తరుణ్‌ను హేళన చేసింది. దీంతో అతను ఇలా నిరుత్సాహపర్చడం సబబు కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. విచక్షణ కోల్పోయిన సదరు లెక్చరర్.. ‘నీవేమైనా మంత్రి కుమారుడివా.. అంతకన్నా గొప్పవాడివా’అంటూ అతన్ని చెంపపై కొట్టింది. దీంతో తరుణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రెండురోజుల పాటు కలత చెందాడు. చివరకు తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతగానో కుంగిపోయా.. వాస్తవానికి తరుణ్ సోమవారం ఉదయం విషయం కళాశాల ప్రిన్సిపల్ వీరన్న దృష్టికి తీసుకెళ్లగా ఆయన సర్ది చెప్పారు. అయినప్పటికీ తరుణ్ తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఒక విద్యార్థిని అతిగా పొగిడి.. మరో విద్యార్థిని నిరుత్సాహపర్చడం నా దృష్టిలో సరైంది కాదు.. లెక్చరర్ చర్యల వల్ల నేను ఎంతగానో కుంగిపోయా. నేను బాధపడిన విషయం ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. ఓ లెక్చరర్‌గా విద్యార్థులను ‘ప్రోత్సహించకపోయినా పర్వాలేదు.. నిరుత్సాహ పర్చకండి. నా చావుకు కారణమైన ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకుని, అలాంటి ప్రవర్తనకు ఆమెను బాధ్యురాలిని చేసినప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది..’అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. చదువులో చురుకైన విద్యార్థి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ విషయమై రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌ను సంప్రదించగా.. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పా.. ‘తరగతి గదిలో శనివారం జరిగిన సంఘటనపై వాకబు చేశాం. తరుణ్ కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థిని ఎంఎల్టీ లెక్చరర్‌తో తనకు వచ్చిన మార్కులు గురించి వివరించింది. ఈ క్రమంలో ఆ మహిళా లెక్చరర్ తరగతి గదికి వెళ్లి అందరి ముందు ఉత్సాహపరించింది. దీంతో స్పందించిన తరుణ్..‘ప్రోత్సహించడంలో వ్యత్యాసం చూపకండి.. అయినా మీరు మా క్లాస్‌కు సంబంధించిన లెక్చరర్ కాదు కదా’అని అనడంతో వివాదం చోటుచేసుకుంది. ఆ విద్యార్థికి సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పా. లెక్చరర్‌ను కూడా మందలించాం. ఇంతలోనే అతను బలవన్మరణానికి పాల్పడటం తీవ్రంగా కలచివేసింది..’అని ప్రిన్సిపల్ వీరన్న చెప్పారు. -
పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనపై పోలీసులు జరిపిన హింసాత్మక చర్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కిరాతక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జూలై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లుతో పాటు పెల్లెట్ గన్లను ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా 19 ఏళ్ల సాహిల్ లోచబ్ అనే విద్యార్థి పెల్లెట్ గాయాల కారణంగా తన కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.ఈ లేఖలో రాహుల్ హోంమంత్రి అమిత్ షాకు ప్రధానంగా రెండు ప్రశ్నలు సంధించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్ల వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతిచ్చింది ఎవరు? పోలీసులతో కలిసి సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులు పోలీసులా లేదా వాలంటీర్లా? వారిని ఎవరి ఆదేశాల మేరకు రంగంలోకి దించారు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ -
సెల్ఫీ తీస్తుండగా ఉగ్ర అల.. విద్యార్థిని మృతి, యువకుడు గల్లంతు
సాక్షి, చెన్నై : రీల్స్, సెల్పీల వ్యామోహంతో సముద్రంలో దిగి మరీ వీడియో చిత్రీకరించుకుంటూ వచ్చిన విద్యార్థుల బృందాన్ని భారీ అల తాకింది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులను జాలర్లు రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. మరొకరు మరణించారు. శనివారం చెన్నై ఎన్నూర్ బీచ్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై సూరపట్టులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న కృతిక (19), ఆకాష్ (21), పవిత్ర, తరుణ్, శివాని అనే ఐదుగురు విద్యార్థుల బృందం ఎన్నూర్ రామకృష్ణా నగర్ సముద్ర తీరానికి విహారయాత్రకు వచ్చారు. సముద్రం మధ్యలో ఉండే రాళ్లపై నిలబడి సెల్ఫీ, వీడియోలు తీసుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా వచ్చిన ఉగ్ర అలల తాకిడికి వారంతా సముద్రంలో పడిపోయారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో అక్కడున్నవారు ఇద్దరు విద్యార్థులను అతికష్టంపై రక్షించారు. సముద్రంలో మునిగి పోయి కొన ఊపిరితో ఉన్న కృతికను రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలల్లో కొట్టుకుపోయిన మరో విద్యార్థి ఆకాష్ కోసం అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, మత్స్యకారులు తీరం వెంబడి తీవ్రంగా గాలింపు చేపట్టారు. బతికి ఉండేందుకు ఛాన్స్ లేని దృష్ట్యా, చెన్నై తీరంలో మృతదేహం ఏదైనా ఒడ్డుకు కొట్టుకువచ్చిందా? అని ఆరా తీస్తున్నారు. కాగా, మృతి చెందిన కృత్రిక పుదుచ్చేరికి చెందిన విద్యార్థి కాగా, ఆకాశ్ చెన్నై తిరునగర్ కు చెందిన వైదీశ్వరన్ కుమారుడిగా గుర్తించారు. -
ఆకాశంలో వెలుగులు.. ఫోటోలు
-
ఢిల్లీ నిరసనల్లో పెల్లెట్ గాయాల భయానక నిజాలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా వ్యవస్థ సంస్కరణలను కోరుతూ ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో పలువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గురుగ్రామ్‌లో ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరి, ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సాహిల్ లోచ్బ్ (20) తదితరులు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యారు.జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా పెల్లెట్ గన్ తో కాల్పులు జరిపినట్లు బాధితుల స్నేహితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఇర్షాద్ ముఖం, మెడ భాగంలో వందలాది చిన్న సీసపు గుళికలు (పెల్లెట్లు) దూసుకెళ్లాయి.ప్రాణాపాయం ఉన్నందున మెడలోని ప్రధాన రక్తనాళం దగ్గరున్న ఒక పెల్లెట్‌ను వైద్యులు తొలగించలేకపోయారు. దీంతో అతను జీవితాంతం ఆ లోహపు గుళికతోనే జీవించాల్సి ఉంటుంది. అలాగే సాహిల్ లోచ్బ్ తన కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే తమ బలగాలు పెల్లెట్ గన్లను ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఖండించగా, సీఆర్పీఎఫ్ మాత్రం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. -
‘జంతర్ మంతర్’ ఎఫెక్ట్: మందుబాబులకు షాక్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వారాంతపు రోజుల్లో మద్యం దుకాణాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని మద్యం దుకాణాలను వారాంతం వరకు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ దుకాణాలు, భద్రతా కారణాల రీత్యా ముందుగానే మూతపడనున్నాయి.పోలీసుల నుంచి అందిన భద్రతా సమాచారం ప్రకారం నిఘా వర్గాల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గురువారం నాడు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసు ఇవ్వకుండానే దుకాణాలు అకస్మాత్తుగా ముందుగానే మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారాంతం ముగిసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనల కారణంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మద్యం దుకాణాల సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో వారాంతంలో మద్యం ప్రియులకు నిరాశ ఎదురుకానుంది.ఇది కూడా చదవండి: గుండెకు సొంత ‘మెదడు’.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి! -
TG: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
రంగారెడ్డి: మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న మానస అనే విద్యార్థిని ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే, మణికొండలో అపార్ట్మెంట్ 10వ అంతస్తునుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలో జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జేపీ మోర్గాన్ చేజ్ అనే ఐటీ సంస్థలో మబ్బు విష్ణువర్దన్‌రెడ్డి(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఏఎస్బీఎల్ స్పెక్ట్రా అపార్ట్మెంట్ 10వ అంతస్తులోని తన ఫ్లాట్‌కు వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బాయ్‌ఫ్రెండ్‌ని కట్టేసి, నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ ప్రాంతంలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ (NEET) విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. దిగ్భ్రాంతి రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో ఉంటూ నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతోంది. ఆమె కొద్ది రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చింది. ఆమె సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 17 ఏళ్ల మైనర్ ఫ్రెండ్‌ను కలవడానికి చిత్రకూట్‌కు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు బైక్‌పై దేవాంగన లోయ వద్ద ఉన్న గుట్టపైకి వెళ్లారు. ఇది గమనించిన కొంతమంది దుండగులు నకిలీ అధికారులు అవతారం ఎత్తారు. వీరిద్దరూ సోషల్ మీడియా రీల్స్ చేసుకుంటుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. తాము అటవీ శాఖ అధికారులమని చెప్పి బెదిరించారు. అబ్బాయిపై బెల్టుతో తీవ్రంగా కొట్టి, అతడి చేతులు, కాళ్లను బంధించారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా సమీపంలో ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అరిస్తే గుట్టపై నుంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడినుంచి ఉడాయించారు. చివరికి అబ్బాయి ఎలాగో తప్పించుకొని పోలీసు అత్యవసర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు.ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్షసంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయపడిన అబ్బాయికి ప్రాథమిక చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సిసిటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగాఅనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రయాగ్‌రాజ్ జోన్ అడిషనల్ డీజీ జ్యోతి నారాయణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు.ఇదీ చదవండి: 150 పిజ్జాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
MBBSలో రిజర్వేషన్లు.. కోర్టుకు 71 ఏళ్ల నీట్ అభ్యర్థి
లక్నో: నీట్ పరీక్షలో వృద్ధులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ లక్నోకు చెందిన అభ్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. 71 ఏళ్ల వయసులో నీట్ యూజీ పరీక్ష రాసిన అత్యంత వృద్ధ అభ్యర్థి అశోక్ బహార్, మెడికల్ సీట్ల భర్తీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా 1శాతం రిజర్వేషన్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన అశోక్ బహార్ అనే 71 ఏళ్ల వృద్ధుడు ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. చదువుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తూ, తన డాక్టర్ కలని నెరవేర్చుకునేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు. అయితే, కేవలం పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తే సరిపోదని, వృద్ధులకు కూడా వైద్య కళాశాలల్లో సీట్లు దక్కేలా 1శాతం ప్రత్యేక కోటా కేటాయించాలని కోరుతూ ఆయన అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్,సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీట్ పరీక్ష రాయడానికి గరిష్ట వయోపరిమితి లేదు. వయసు అడ్డుకాదన్నప్పుడు, సీట్ల భర్తీలోనూ సీనియర్ సిటిజన్లకు న్యాయం జరగాలని ఆయన వాదించారు. నీట్ ప్రవేశాల్లో వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు లేదా ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు, సీనియర్ సిటిజన్లను ఎందుకు విస్మరిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు.ఈ విషయమై అంతకుముందే మే, జూన్ నెలల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. అయితే అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో సరికొత్త చర్చదేశంలో వైద్య విద్యకు విపరీతమైన పోటీ ఉన్న తరుణంలో ఈ డిమాండ్ జాతీయ స్థాయిలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సాధారణంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైద్య సీట్లను కేటాయిస్తారు. అయితే, వృద్ధాప్యంలో కూడా చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నవారికి సమాన అవకాశాలు కల్పించాలా వద్దా అనే చట్టపరమైన ప్రశ్న ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్‌పై జూలై 21న విచారణ జరపనుంది. -
రంగు తక్కువ వ్యాఖ్యలు.. విద్యార్థి ఆత్మహత్య
ధోల్పూర్: రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని తక్రౌలీ గ్రామానికి చెందిన రాహుల్ అనే విద్యార్థి, చదువు నిమిత్తం ధోల్పూర్లోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. గురువారం పాఠశాలలో ఒక తోటి విద్యార్థినితో రాహుల్‌కు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సదరు విద్యార్థిని రాహుల్ చర్మపు రంగును ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరుకున్న రాహుల్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మరుసటి రోజు కూడా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీ లోంచి చూడగా, రాహుల్ ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: జాతీయ అవార్డుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం! -
తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీ
లక్నో: లక్నోలోని గోమతి నగర్‌కు చెందిన డిగ్దిగా గ్రామానికి చెందిన నీలు సకాలంలో వైద్య చికిత్స అందించే స్థోమత లేకపోవడంతో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది..అత్యంత బాధాకరమైన ఆ క్షణమే ఆమె జీవితానికి కొత్త లక్ష్యాన్ని చూపించింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ఉత్తీర్ణత సాధించి తన సాకారం వైపుగా తొలి అడుగు వేసింది.నీలు 8వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మరణించడంతో వారి కుటుంబ ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు పడింది. అయితే, ఈ కష్టాలు, నష్టాలు ఆమెను ఆమెను కృంగ దీయలేదు. వైద్యం అందక పేదరికం వల్ల ఎవరూ తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే లక్ష్యంతో డాక్టర్ కావాలని ఆమె నిశ్చయించుకుంది. మరోవైపు కుటుంబానికి ఏకైక సంపాదనపరురాలైన ఆమె తల్లి, ఆసుపత్రి లోనూ, ఇటు గృహ సహాకురాలిగా పనిచేస్తుంది. కూతుళ్ల చదువును మాన్పించి, వారికి పెళ్లిళ్లు చేయమని బంధువులు, ఇతరులుఎంత ఒత్తిడి చేసినా బిడ్డల్ని చదివించేందుకు నిర్ణయించుకుంది.తండ్రి మరణంతో సంకల్పంఆర్థిక ఇబ్బందుల కారణంగా తన తండ్రికి సరైన వైద్యం అందించలేకపోయామని, చివరికి అనారోగ్యంతో కన్నుమూశారని నీలు చెప్పింది. పేదరికంతో సరైన చికిత్స అందించలేక నాన్నను కోల్పోయాను. అందుకే పేదరికం వల్ల మరే కుటుంబం కూడా ఇలాంటి నష్టాన్ని అనుభవించకూడదని ఆ రోజే తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను అని నీలు తెలిపింది. అట్టడుగు వర్గాల బాలికల కోసం స్టడీ హాల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (SHEF) నడుపుతున్న ప్రేరణ బాలికల పాఠశాలలో నీలు తన విద్యను ప్రారంభించి, ఆ తర్వాత 11, 12 తరగతుల కోసం స్టడీ హాల్ పాఠశాలలో స్కాలర్షిప్ సంపాదించింది. కష్టపడి చదివి నీట్లో ఉత్తీర్ణత సాధించి తన కల వైపు మొదటి పెద్ద అడుగు వేసింది. పట్టుదలతో చదివి నీట్ పరీక్షను విజయవంతంగా క్లియర్ చేసింది. ఈ ఏడాది సిబిఎస్ఇ క్లాస్ 12 బోర్డు పరీక్షల్లో నీలు 94 శాతం మార్కులు సాధించింది. . ప్రస్తుతం ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించేందుకు సిద్ధ మవుతోంది. భవిష్యత్తులో కార్డియాలజీ (గుండె జబ్బుల విభాగం) లో స్పెషలైజేషన్ చేసి, ఆర్థికంగా వెనుకబడిన రోగులకు సరసమైన ధరకే వైద్యం అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.నీలు అకడమిక్ ప్రతిభను గుర్తించి ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'వహానీ స్కాలర్షిప్' లభించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 50 మంది మాత్రమే ఎంపికైన తుది జాబితాలో నీలు చోటు దక్కించుకుంది. ఈ స్కాలర్షిప్ ఆమె వైద్య విద్యకు అయ్యే ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను భరిస్తుంది.స్ఫూర్తిగా నిలిచిన నీలుస్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఊర్వశి సాహ్ని మాట్లాడుతూ... సరైన అవకాశాలు, సాయం లభిస్తే విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చెప్పడానికి నీలు విజయమే నిదర్శనమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ మీనాక్షి బహదూర్ కూడా నీలును ఎంతో కష్టపడే, పట్టుదల గల విద్యార్థిగా అభివర్ణిస్తూ, ఆమె విజయం ఎంతో మంది యువతులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
నల్గొండ ప్రేమజంట మృతి కేసులో సంచలన ట్విస్ట్
-
ఆన్సర్ కీ చూసుకొని మనస్థాపంతో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
ఫరీదాబాద్‌లో నీట్ (NEET) పరీక్ష ఫలితాల ఆందోళనతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఆన్సర్ కీ ఆధారంగా తన మార్కులను అంచనా వేసుకుంది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష (NEET-UG) లో తాను ఆశించిన స్థాయి కంటే మార్కులు తక్కువగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై, 16వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసుల ప్రకారం, మరణించిన విద్యార్థినిని ధన్వితగా గుర్తించారు. ఫరీదాబాద్, సెక్టార్ 87లోని రాయల్ హిల్స్ సొసైటీలో దాన్విత తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో తాను నివసిస్తున్న టవర్ A1 నుంచి పక్కనే ఉన్న టవర్ A2 పైకప్పు (Roof) పైకి వెళ్లి అక్కడ నుండి కిందకు దూకేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.తన అంచనాల కంటే చాలా తక్కువగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. భవనం పైనుండి దూకడానికి ముందు చెప్పులు విప్పి, మొబైల్ ఫోన్, చేతి బ్రాస్లెట్ , కళ్లజోడును అక్కడున్న గోడపై భద్రంగా ఉంచి ఈ నిర్ణయం తీసుకుందని సొసైటీ నివాసితులు ఆవేదన వ్యక్తంచేశారు.ఇదీ చదవండి: తొలి హైడ్రోజన్ రైలు : దీని ప్రత్యేకతలివే!కాగా ధన్విత కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందినది. వీరు కొంతకాలంగా ఈ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు విద్యార్థి తల్లి విజయవాడలో ఉండగా, ఆమె తండ్రి కోటేశ్వర్, ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్ విరాళాల గోల్మాల్ గుట్టు -
సైదాబాద్ హోం వర్క్ వివాదం.. NHRC నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ అంశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని అభిప్రాయపడిన ఎన్హెచ్ఆర్సీ రెండు వారాల్లోగా ఈ ఫిర్యాదు పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పంపాలని ఆదేశించింది.ఏం జరిగింది..సమచారం ప్రకారం సైదాబాద్ సక్సెస్ స్కూల్లో హిందూ మతానికి చెందిన బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. కాగా తరగతి గదిలో పాఠాలు చెప్పే సమయంలో సదరు క్లాస్ టీచర్.. ఆ బాలుడికి ఇస్లామిక్ పవిత్ర సూక్తులైన కల్మా, సూరహ్ ఫాతిహాలను చదవడం నేర్చుకోవాలని హోమ్‌వర్క్ ఇచ్చింది. అలాగే, స్కూల్ డైరీలో సైతం.. కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలి అని స్పష్టంగా రాసింది. బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు అతని హోమ్‌వర్క్ పుస్తకాలు, డైరీని పరిశీలించగా ఈ విషయం బయటపడింది. దీంతో ఈ అంశం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై గురువారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు బీజేపీ నేతలు, హిందు సంఘాలు.. స్కూల్ వద్ద ఆందోళనలు, నిరసనలకు దిగారు. దీంతో, స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ విషయంపై పలువురు NHRCకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. తాజాగా వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. -
రికార్డు సృష్టించిన విద్యార్థి .. ఏకంగా రూ.3 కోట్ల స్కాలర్షిప్
పాట్నా: బీహార్‌కు చెందిన శ్రేయా కౌశిక్ అనే 18 ఏళ్ల విద్యార్థి రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన రూ. 3 కోట్ల విలువైన "లింకన్ స్కాలర్షిప్"కు అర్హత సాధించారు. అమెరికాకు చెందిన ఈ పూర్తి ఉచిత విద్యా కార్యక్రమానికి ఈ ఏడాది ఎంపికైన ఏకైక భారతీయురాలిగా నిలిచారు.ఈ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ సాధించడం ద్వారా అంతర్జాతీయ విద్యా రంగంలో భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు.లింకన్ స్కాలర్షిప్ అంటే ?అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్మారకార్థం ఈ అంతర్జాతీయ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మందికి మాత్రమే దీనిని అందజేస్తారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉంటుంది. అసాధారణ విద్యా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు,సమాజ సేవ పట్ల ఉన్న నిబద్ధత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ప్రస్తుతం సివాన్, బీహార్‌కు చెందిన భారతీయ విద్యార్థిని శ్రేయా కౌశిక్ (18 సంవత్సరాలు) ఈ స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యారు. ఈ స్కాలర్షిప్ ద్వారా రూ. 3 కోట్ల విలువైన ఈ స్కాలర్షిప్ అమెరికాలో నాలుగేళ్ల విద్యకు అయ్యే పూర్తి ఖర్చులను భరిస్తుంది. పూర్తి ట్యూషన్ ఫీజు , వసతి, భోజన ఖర్చులు, పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్స్ ఇతర ఆమోదించబడిన వ్యక్తిగత ఖర్చులు ఉంటాయి. ప్రస్తుతం సెంటర్ కాలేజ్ , కెంటుకీ, అమెరికా విద్యాసంస్థలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ఆమె చదవబోతున్నారు.శ్రేయా కౌశిక్ విద్యా ప్రస్థానంబీహార్లోని సివాన్‌లో జన్మించిన శ్రేయ, ఆ తర్వాత ఢిల్లీలోని 'సర్వోదయ కన్యా విద్యాలయ' (అయా నగర్) లో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆమెకు 13 ఏళ్ల వయసులో విద్యార్థులకు నాయకత్వ శిక్షణ, విద్యా అవకాశాలు కల్పించే 'డెక్స్టెరిటీ గ్లోబల్ అనే సంస్థలో చేరారు. ఈ సంస్థ ద్వారా ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో, లీడర్షిప్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ సాధించడంలో ఈ అనుభవం కీలక పాత్ర పోషించింది. -
వేడి ఒత్తిడితో చదువు చిత్తు!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశంలోని చాలా ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యాసం, ఆరోగ్యం, శ్రేయస్సును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఓ తాజా సర్వే చెబుతోంది. గత ఏడాది వేసవి కన్నా ఈ ఏడాది వేసవి ఎక్కువ వేడి ఒత్తిడిని కలిగించిందని స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్‌వై (క్రైౖ ) నిర్వహించిన ‘ఫీలింగ్ ద హీట్’అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణ సహా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3,096 మంది 10–17 ఏళ్ల బడి పిల్లలు ఎదుర్కొన్న వేడి ఒత్తిడి బాధలపై ‘క్రై’సర్వే చేసింది. ఎల్‌నినో పరిస్థితులు ప్రపంచ ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏపీలో అత్యధికంగా 88 శాతందేశంలో గత వేసవిలో వేడి సంబంధిత ఇబ్బందుల కారణంగా దాదాపు పది మందిలో ఏడుగురు పిల్లలు పాఠశాలలకు లేదా పాఠాలకు దూరమయ్యారు. అధిక వేడి తమ ఏకాగ్రతను దెబ్బతీసిందని 76 శాతం మంది చెప్పారు. డీహైడ్రేషన్, తలనొప్పి, తీవ్రమైన అలసట, కళ్లు తిరగటం, నిద్ర పట్టటంలో ఇబ్బంది వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రోజువారీ కూలి పనులు లేదా శారీరక శ్రమ చేసే పేద కుటుంబాల్లో బడి పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా అధిక వేడి బాధల బారిన పడుతున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 68 శాతం మంది పాఠశాలకు లేదా సాధారణ కార్యకలాపాలకు హాజరు కాలేకపోయారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 88 శాతం మంది హాజరు కాలేదు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ కాగా పశ్చిమ బెంగాల్లో వీరి సంఖ్య దాదాపు 72 శాతంగా ఉంది.76% మందిలో ఏకాగ్రత తగ్గింది తెలంగాణలో 65–70% మంది పాఠశాల విద్యార్థులు ఎండ తీవ్రత భరించలేక స్కూళ్లకు సెలవు పెట్టారు లేదా క్లాసులకు వెళ్లలేదు. విపరీతమైన ఉక్కపోత వల్ల పాఠాలపై 76% మంది విద్యార్థులు ఏకాగ్రతతో దృష్టి పెట్టలేకపోయారు. తగినంత నీరు అందక శారీరకంగా నీరసించటం, తలనొప్పితో ఇబ్బంది పడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల ఇళ్లలో రాత్రి పూట విద్యుత్ కోతలు, ఉక్కపోత వల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోలేకపోయారు. దీనివల్ల మరుసటి రోజు బడిలో వారు చురుగ్గా ఉండలేకపోయారు. సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి ఉష్ణోగ్రత రికార్డులు వేడి ఎంత పెరుగుతోందో మనకు స్పష్టం చేస్తుండగా, ఆ వేడి స్కూలు పిల్లల జీవితాలను దెబ్బతీస్తోందో వారే మనకు చెబుతున్నారని ‘క్రై’ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా మర్వాహా అన్నారు. వేడి నివారణ కార్యాచరణ ప్రణాళికలు, వాతావరణ మార్పును ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించేటప్పుడు విధాన రూపకర్తలు ఈ అధ్యయన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. -
తల్లికి వందనంలో భారీ కోతలు
సాక్షి,అమరావతి: రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15,000 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారు. ఈ ఏడాది కూడా తల్లుల ఖాతాల్లో కేవలం రూ.13,000 మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్ నిర్వహణ (మెయింటెనెన్స్ ఫండ్) పేరుతో ప్రతి విద్యార్థి డబ్బుల నుండి రూ.2,000 ముందస్తు కోత విధించింది. గతేడాదికూడా ఇలాగే రూ.2,000 కోత పెట్టి, ఆ నిధులను స్కూళ్లకు కేటాయించని ప్రభుత్వం.. ఈ ఏడాది మళ్లీ అదే దారిలో పయనిస్తూ రూ.2,000 కోత పెట్టడం గమనార్హం. ఇలా మొత్తంగా మూడేళ్ల కాలంలో ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.19,000 లబ్ధిని ప్రభుత్వం ఎగనామం పెట్టింది.ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. కానీ, ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఏకంగా 14 రకాల కఠినమైన షరతులు, నిబంధనలను తెరపైకి తెచ్చారు. ఈ కొరడా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.ఈ ఆంక్షలన్నింటినీ దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా కేవలం 67,47,190 మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తేలడంతో, ఆ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థిని కరిచిన పాము
అనంతపురం జిల్లా: వజ్రకరూరు మండలం రాగులపాడు బాలుర గిరిజన గురుకుల పాఠశాల (Tribal Welfare Residential School) లో తొమ్మిదో తరగతి చదువుతున్న తులసీ నాయక్ అనే విద్యార్థి, రాత్రి సమయంలో హాస్టల్ గదిలో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. గదిలో కింద పడుకున్న సమయంలో పాము కరవడంతో విద్యార్థి గట్టిగా కేకలు వేశాడు. తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై చూసేసరికి అక్కడ పాము కనిపించింది.పాముకాటు వేసిన వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో బాలుడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని అనంతపురం సర్వజనాస్పత్రి (GGH Anantapur) కి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చేర్చి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. -
భారత మెడికో మృతి.. గాయాల గుర్తులతో మిస్టరీగా మరణం!
తిరువనంతపురం: కేరళకు చెందిన విద్యార్థిని ఉజ్బెకిస్థాన్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, తమ కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, మత మార్పిడికి ఒత్తిడి చేయడం కూడా ఘటనకు కారణమై ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో భారత అధికారులు, ఉజ్బెకిస్థాన్ దర్యాప్తు సంస్థలు కలిసి కేసును పరిశీలిస్తున్నాయి. దీంతో, ఆమె మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన సవారియా బసంత్ (22) ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు సమాచారం. ఆమె అక్కడ తన వైద్య విద్య కొనసాగిస్తుండగా ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె మృతదేహం స్వదేశానికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అనుమానాలు వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, సవారియాను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక వ్యక్తి ఆమెపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. అందుకు ఆమె నిరాకరించడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఇది సాధారణ మరణం కాదని కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కోణంతో పాటు కుటుంబం చేసిన ఇతర ఆరోపణలను కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌కు చెందినది కావడంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు.. ఉజ్బెకిస్థాన్‌లోని స్థానిక అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. అసలు విద్యార్థిని ఎలా మృతి చెందింది, దానికి కారణాలు ఏమిటి, కుటుంబం చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది.కాగా, ఈ ఘటన విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ విద్యార్థులు వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ వారి భద్రత, స్థానిక చట్టాలపై అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే వ్యవస్థలపై మరింత దృష్టి అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి..!
కొల్లాపూర్ (నాగర్ కర్నూలు జిల్లా): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే సమాజం తలదించుకునే పనిచేశాడు. స్వలింగ సంపర్కానికి బానిసై కళాశాలలోని విద్యార్థులను టార్గెట్ చేసుకున్నాడు. ఆర్థికంగా, చదువులో వెనుకబడిన అబ్బాయిలపై నిఘా ఉంచి వారిని తన పైశాచికత్వానికి వాడుకొని సమాజానికి తలవంపులు తెచ్చేలా చేశాడు కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్. మంగళవారం రాత్రి ఆధారాలతో సహా అతడి విశృంఖలత్వం వెలుగులోకి వచ్చింది అయినా.. అతడిని విధుల నుంచి తప్పించే విషయంలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విచారకరం. A shocking incident came to light where a principal of the PG College in Kollapur town of Nagarkurnool district, in Telangana, allegedly attempted to sexually assault a student who had come to collect his transfer certificate, and in the process, the student bit the man’s… pic.twitter.com/B8i7ZnEUdb— Hate Detector 🔍 (@HateDetectors) July 9, 2026ఇదీ విషయం.. కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధుల నిర్వహిస్తున్న మార్క్ పోలోనియస్ సిబ్బందితో పాటు విద్యార్థులపై కూడా ఎప్పుడూ కఠిన వైఖరితో ఉండేవాడు. అవివాహితుడైన ఆయన పట్టణంలోని బండాయిగుట్ట సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థిని లోబర్చుకొని గతంలో రెండు పర్యాయాలు అతడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 2025లో పీజీ పూర్తి చేసుకున్న సదరు విద్యార్థి టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం రెండు రోజుల క్రితం మళ్లీ కళాశాలకు వచ్చాడు. తనతో గడిపితేనే సర్టిఫికెట్లు ఇస్తానని బెదిరించడంతో.. గత్యంతరం లేక సదరు విద్యార్థి ప్రిన్సిపల్ రూముకు మంగళవారం రాత్రి 7 గంటలకు వెళ్లి వచ్చాడు. రాత్రి 10 గంటలకు మళ్లీ రావాలని చెప్పడంతో ప్రిన్సిపాల్ లైంగిక హింసను తట్టుకోలేక ఆ విద్యార్థి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో చెప్పుకొని రోదించాడు. ప్రిన్సిపల్ అఘాయిత్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ రూమ్ వద్దకు వెళ్లారు. జగిత్యాల విద్యార్థి రూములోకి వెళ్లిన వెంటనే అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆ విద్యార్థి ప్రిన్సిపల్ ప్రైవేటు పార్ట్‌ని నోటితో కొరికి గట్టిగా కేకలు వేశాడు. తన మిత్రులను లోపలికి రావాలని పిలిచాడు. ఈ ఘటనతో భయపడిన ప్రిన్సిపల్ తన గదిలోని బాత్రూంలో దాక్కొని గడియపెట్టుకున్నాడు. అప్పటికే ప్రిన్సిపల్ కీచక పర్వాన్ని ఫోన్లో రికార్డు చేసి దాన్ని తీసుకొని విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో ప్రిన్సిపల్ లైంగిక దాడి ఘటన తర్వాత ఇంటినుంచి పరారైన ప్రిన్సిపల్ మార్క్‌పోలోనియస్ కొల్లాపూర్‌లోని బొంగరాలమిట్ట ప్రాంతంలో గల ఓ ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకొని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. రిజిస్ట్రార్ ప్రకటనపై విస్మయం విద్యార్థిపై లైంగిక దాడి, ప్రజా సంఘాల నాయకుల ఆందోళనతో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబు, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి కొల్లాపూర్ పీజీ సెంటర్ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆందోళన చేపట్టిన వారితో మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. లైంగికదాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు. రిజిస్ట్రార్ ప్రకటనపై విద్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రిన్సిపల్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కనీసం సస్పెండ్ కూడా చేయకుండా, విచారణ పేరుతో కాలయాపన చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలకలం.. విద్యార్థిపై ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు
కొల్లాపూర్:నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మార్క్ పోలోనియస్ ఓ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ కీచక ప్రిన్సిపాల్ బారి నుంచి తప్పించుకునే క్రమంలో సదరు విద్యార్థి సాహసోపేతంగా ప్రతిఘటించి, ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్టును బలంగా కొరకడంతో సదరు ప్రిన్సిపాల్ నగ్నంగానే అక్కడి నుంచి పారిపోయాడు. వివరాల ప్రకారం.. సదరు విద్యార్థి 2025లో తన పీజీ పూర్తి చేసుకున్నాడు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా, రాత్రి తన ఇంటికి వస్తేనే టీసీ ఇస్తానని కండిషన్ పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థి, తన స్నేహితుడిని వెంటబెట్టుకుని రాత్రి 10 గంటల సమయంలో ప్రిన్సిపాల్ నివాసానికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన విద్యార్థిపై ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్ ఒక్కసారిగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో, ప్రాణరక్షణ కోసం విద్యార్థి తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్టును బలంగా కొరికేశాడు. విద్యార్థి గట్టిగా కొరకడంతో తీవ్ర నొప్పితో విలవిలలాడిన ప్రిన్సిపాల్, భయంతో నగ్నంగానే ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ ఘోర అవమానం నుంచి బయటపడిన బాధిత విద్యార్థి రాత్రికి రాత్రే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి కీచక ప్రిన్సిపాల్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గుప్పుమనడంతో తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, అతనిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు- రెండు పారాగ్రాఫ్‌లు వచ్చేలా చూండి -
పిల్లలు ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు!
కొందరికి చిన్న విషయమైనా సరే ‘నేర్చుకోవడం’ చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ ఫెయిన్‌మెన్ ఒక టెక్నిక్‌ను రూపొందించాడు. ఇది ‘ఫెయిన్‌మెన్ టెక్నిక్’గా ప్రసిద్ధి పొందింది.కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ నుంచి బ్లాక్‌చైయిన్ వరకు ఏదైనా సులభంగా నేర్చుకోవడానికి ‘ఫెయిన్‌మెన్ టెక్నిక్’ ఉపయోగపడుతుంది.నాలుగు దశల ప్రక్రియ అయిన ‘ఫెయిన్‌మెన్ టెక్నిక్’ కంఠస్థం చేసే పద్ధతిని తిరస్కరిస్తుంది. పరిశోధన, రాయడం, వివరించడం, మెరుగుపరచడం ద్వారా నిజమైన అవగాహనను ప్రోత్సహిస్తుంది.‘నేర్చుకోవడంలో మొదటి సూత్రం... మిమ్మల్ని మీరు మోసం చేసుకోకపోవడం. సబ్జెక్ట్ అర్థం కాకపోయినా అర్థమైంది అనుకోవడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అవుతుంది అంటారు ఫెయిన్ మెన్.ఇలా చేయండి...నేర్చుకోవడానికి ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోండి.ఆ సబ్జెక్‌కు సంబంధించిన కీలక అంశాలను ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇలా రాసుకోవడం అనేది ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో పెడుతుంది. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయాలను రాసుకున్నప్పుడు మెదడులో ముఖ్యమైన విషయాలు స్పష్టంగా రూçపుదిద్దుకోవడం మొదలవుతుంది. ‘రాయడం అనేది సమాచార సేకరణ కాదు... సమాచారంతో మమేకం కావడం’రాసుకున్న విషయాలను మీకు మీరే చెప్పుకోండి. లేదా ఇతరులకు చెప్పండి.సబ్జెక్ట్‌లో ఏదైనా అర్థం కాకపోతే సమాచార మూలాన్ని (సోర్స్ మెటీరియల్) మరోసారి చదువుకోండి, వినండి. ఉదా: పుస్తకం, లెక్చర్ నోట్స్, పాడ్‌కాస్ట్... మొదలైనవి.మరింత అర్థమయ్యేలా నోట్‌బుక్‌లో రాసుకోండి. తేలికపాటి ఉదాహణలను తీసుకోండి.సాంకేతిక పదాలు, సంక్లిష్ట పదాలు, అస్పష్టమైన పరిభాష లేకుండా చూసుకోవాలి.టాపిక్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని చదువుకోవాలి.చిన్నపిల్లవాడికి చెబుతున్నట్లుగా ఊహించుకొని, మీరు చదివిన సబ్జెక్ట్‌ను మీకు మీరే చెప్పుకోండి. -
దుప్పటి కప్పి.. పెన్ క్యాప్ మింగించి..
కాగజ్‌నగర్ టౌన్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఎన్జీవోస్ కాలనీ సమీపంలోని జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థినిపై కొందరు విద్యార్థినులు దుప్పటి కప్పి బలవంతంగా పెన్ను క్యాప్ మింగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలానికి చెందిన ఓ విద్యార్థిని ఎంజేపీ గురుకుల పాఠశాల, కళాశాలలో పదో తరగతి చదువుతోంది.శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత స్టడీ అవర్ సమయంలో చదు వుకునేందుకు హాల్లోకి వెళ్తుండగా.. బాలికను గదిలో నే కొందరు విద్యార్థినులు అడ్డుకున్నారు. తమను గు ర్తు పట్టకుండా ముఖంపై దుప్పటి కప్పి నోట్లో పెన్ను క్యాప్ వేసి బలవంతంగా నీళ్లు తాగించారు. దీంతో క్యాప్ కడుపులోకి వెళ్లింది. వెంటనే సదరు విద్యార్థిని ఎస్వోకు సమాచారం అందించడంతో హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం క్యాప్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవడడిగాడు నిన్ను ఫ్రీ బస్సు... దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా
-
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అనిరుధ్.. కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుతున్నాడు. తాను ఉంటున్న బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకిన అనిరుధ్.. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. -
ఆత్మహత్య వ్యక్తిగత వైఫల్యమా?
దేశంలో ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం దాదాపు ఒకే విధమైన చర్చ కొనసాగుతుంది. పరీక్షల్లో విఫలమయ్యాడా? చదువు ఒత్తిడిని తట్టుకోలేకపోయాడా? మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా? అంటే సమస్యను పూర్తిగా వ్యక్తి చుట్టూనే కేంద్రీకరిస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక ఈ దృక్పథాన్ని సవాలు చేస్తోంది. విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత కార ణాల ఫలితంగా చూడటం వాస్తవాన్ని అసంపూర్ణంగా అర్థం చేసుకోవడమే నని ఇది స్పష్టం చేస్తోంది.ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు 2025లో ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్(ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక విద్యార్థుల ‘ఆత్మహత్యలు అసలు సమస్య కాదు; అవి విద్యార్థి సంక్షో భానికి కనిపించే చివరి సూచన మాత్రమే’ అని పేర్కొంది. ఈ నివేదికలో అత్యంత ఆందోళనకరమైన గణాంకాల్లో ఒకటి, సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు తమను క్యాంపస్‌లో ‘బయటి వ్యక్తులు’గా భావిస్తున్నట్లు వెల్లడైంది. భాషా సమస్యలు, సామాజిక–ఆర్థిక అసమానతలు, కుల/వర్గ వివక్ష ఈ దూరాన్ని మరింత పెంచుతున్నాయి.మరోవైపు కేవలం 56 శాతం మంది మాత్రమే తమ విద్యాసంస్థ... సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్క రిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ గణాంకాలు విద్యార్థి సంక్షోభం వ్యక్తిగతం మాత్రమే కాక, సంస్థాగత స్వభావం కూడా కలిగి ఉందని సూచిస్తున్నాయి. ఎన్టీఎఫ్ క్షేత్రస్థాయి అధ్యయనాలు కూడా ఇదే స్పష్టం చేశాయి. అందువల్ల ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం ‘అతను ఎందుకు తట్టుకోలేకపోయాడు?’ అనే ప్రశ్నతో పాటు ‘అతను సంక్షోభంలో ఉన్న ప్పుడు వ్యవస్థ ఏ విధంగా స్పందించింది?’ అనే ప్రశ్నను కూడా పరిశీలించాలి.ఎన్టీఎఫ్ ప్రకారం... విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా, విద్యాసంస్థల జవాబుదారీతనం, క్యాంపస్ సంస్కృతి, మద్దతు వ్యవస్థల నాణ్యతకు సంబంధించిన అంశంగా కూడా చూడాలి. విద్యార్థి మనసులో ‘నేను ఒంటరిని’ అనే భావన కన్నా ‘ఇక్కడ నాకో మద్దతు ఉంది’ అనే విశ్వాసాన్ని పెంపొందించగలిగితేనే ఈ విషాద ఘటనల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నిల బెట్టడమే నేటి విద్యావ్యవస్థ మొదటి ధర్మం. – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
AP EAPCET ఫలితాలు విడుదల
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర విద్యశాఖ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలతో పాటు అభ్యర్థుల ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో 1,82,317 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు. ఏపీ ఎప్‌సెట్ పలితాలను జేఎన్టీయూ వీసీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో 71.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌లో తొలి ర్యాంక్ గుంటూరుకు చెందిన రోషన్ మణి దీప్ రెడ్డి( 95.69),శ్రీ కాకుకుళానికి చెందిన శ్రావ్య (95.59)కు రెండో ర్యాంక్ దక్కింది. ఇంజనీరింగ్‌లో టాప్ 10 మందిలో 9 మంది అబ్బాయిలే ఉన్నాయి.అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ విజయనగరానికి చెందిన జశ్వంత్ నాయుడు(92.53),రెండో ర్యాంక్ హైదరాబాద్ కి చెందిన వెంకట్ రెడ్డి(91.84) ఉన్నారు. టాప్ 10లో ఐదుగురు అమ్మాయిలు,ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. అగ్రికల్చర్ లో 89.59 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జేఎన్టీయూ వీసీ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేటాఫ్‌బర్త్ , క్యాప్చా కోడ్ నమోదు చేసి చూసుకోవచ్చు. స్కోర్కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు, కేటగిరీ, సబ్జెక్టులవారీగా మార్కులు, మొత్తం మార్కులు వంటి సమాచారం ఉంటుంది. స్కోర్కార్డులో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే APSCHE అధికారులను సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ ఈ ఏడాది ఏపీఎప్‌సెట్ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు మే 12 నుంచి మే 20, 2026 వరకు వివిధ కేంద్రాల్లో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. -
చంద్రబాబు సభలో ఘోరం.. తండ్రిని ఈడ్చుకెళ్లిన పోలీసులు!
సాక్షి,నెల్లూరు: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న ప్రజావేదిక సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాలలో తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తన కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం సభ వద్దకు చేరుకోవడంతో ఈ కలకలం రేగింది. చంద్రబాబుకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన బాధిత తండ్రి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.నెల్లూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తౌశిక్ అనే విద్యార్థి మరణించాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం,అనుమానాస్పద పరిస్థితులే తన కుమారుడి మృతికి కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అతని తండ్రి కోరుతున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు తన గోడును వెళ్లబోసుకుని, వినతిపత్రం సమర్పిస్తే న్యాయం జరుగుతుందనే ఆశతో ఆయన సభా ప్రాంగణానికి వచ్చారు.సీఎం చంద్రబాబుకు కేవలం వినతిపత్రం మాత్రమే ఇస్తానని, దయచేసి అనుమతించాలని బాధిత తండ్రి అక్కడున్న పోలీసులను వేడుకున్నారు. అయితే, భద్రతా కారణాల నెపంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో అక్కడి నుండి తరలించారు.కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై సభకు వచ్చిన పార్టీ కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
పట్టుకోండి చూద్దాం!(ఫోటోలు)
-
మా బడిలో ఏం జరిగిందంటే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం విద్యార్థిగా మారిపోయారు. మాస్టార్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్)ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ ఎకనామిక్స్ పాఠ్యాంశం టీచర్ బోధిస్తుండగా.. కలెక్టర్ తరగతిగదిలోకి వెళ్లి విద్యార్థినులతో కలిసి పాఠ్యాంశ బోధనను పరిశీలించారు. బోధన పూర్తయ్యాక పాఠ్యాంశంపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం డైనింగ్‌హాల్‌కు వెళ్లి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. మాస్టారూ.. మాలాగే..గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెం యూపీఎస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు డాక్టర్ గోపీనాథ్ తనదైన శైలిలో గ్రామ విద్యార్థులు ఆ ఊరి పాఠశాలలోనే చదువుకునేలా చేపట్టిన ప్రయత్నాలు అభినందనలు అందుకుంటున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందు ఇంటింటి ప్రచారం, ఆ తరువాత డప్పు కొడుతూ బడిబాటలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ పాఠశాలలో చదివే పిల్లలతో తానూ సమానమంటూ స్కూల్ యూనిఫాం ధరించి గ్రామంలో నడుచుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు. స్కూల్ యూనిఫాం వేసుకొని పిల్లలతో సమానంగా కూర్చున్నారు. వారి మధ్యలో కూర్చుని పాఠాలు చెబితే పిల్లలకు సులభంగా అర్థమవుతుందని, అందుకే తాను ఈ ఆలోచన చేసినట్లు తెలిపారు. ఈయన పనితీరును గుర్తించిన హెచ్ఎం సుమలతతో పాటు గ్రామస్తులు ప్రశంసించారు. -
250 మందికి ఒకటే బాత్రూమ్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఇంటర్వెల్ సమయంలో బాలికలు ఇలా క్యూ కడుతున్నారు. బాలురు కాంపౌండ్ వాల్ దాటి ఆరుబయటకు వెళ్తున్నారు. ‘మన ఊరు – మన బడి’కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ బిల్లులు రాకపోవడం కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
శ్రీహరి కొడుకు కొత్త సినిమా.. టీజర్ రిలీజ్
దివంగత శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా చేస్తున్న సినిమా 'స్టూడెంట్'. విజేత పరీక్ హీరోయిన్. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. దీనిబట్టి చూస్తే.. ఓ స్టూడెంట్ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి).. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరపున పాలిటిక్స్‌లోకి రావడం, అందులో ఉండే ప్రమాదాలను, ఎత్తులు పై ఎత్తులను త్వరగా అర్థం చేసుకోవడం లాంటివి చూపించారు. స్టూడెంట్, రాజకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడు అనేది సినిమాలో చూపించబోతున్నారు. (ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం) -
లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
లండన్/కామారెడ్డి: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మరుసటి రోజే అతను శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మృతుడు కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25)గా గుర్తించారు. లీసెస్టర్‌లో ఎమ్మెస్ చదువుతున్న శ్రీనాథ్, ఈనెల 22 రాత్రి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు తన గదిలో శవమై కనిపించాడు. ఈ హఠాన్మరణంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా, ఘటనపై దర్యాప్తు జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
ఆన్లైన్ గేమ్స్.. డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: ‘ఫ్రీ ఫైర్’.. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్లైన్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు చితికిపోతున్నారు. వారితో పాటు కుటుంబీకులూ ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న కొన్ని ఫిర్యాదులు పైకి కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వెనుక ఈ వ్యసనం ఉంటోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే దీనికి ప్రధాన కారణమని నగర కొత్వాల్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు.హ్యాకింగ్ కాదు ‘సన్’ స్ట్రోక్...తన మొబైల్‌కు వరుసగా నగదు డెబిట్ మెసేజ్‌లు రావడంతో కొందరు బాధితులు ఇటీవల సైబర్ క్రైమ్ ఠాణాకు క్యూ కట్టారు. తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో వెలుగులోకి వచి్చన నిజాలు తల్లిదండ్రులను షాక్‌కు గురిచేశాయి. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, వారి పిల్లలు ఆన్లైన్ గేమింగ్‌లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి తల్లిదండ్రుల డెబిట్ కార్డు వివరాలు వాడారని తేలింది. ప్రధానంగా తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా రూ. వేల లావాదేవీలు చేసేశారు.గేమ్ పరిచయంతో అక్కడకు పయనమై...‘ఫ్రీ ఫైర్’ గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు ఆపై సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. అలా ఆన్లైన్ మాయలో పడిపోయి, కేవలం ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలారు. పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు పయనం కాగా... ఫిర్యాదు అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇలా రికార్డుల్లోకి ఎక్కకుండా కుటుంబాల మధ్యే ఉండిపోతున్న ‘గేమింగ్ ఉదంతాలు’ ఎన్నో ఉంటున్నాయి.అదో స్టేటస్ సింబల్‌గా మారడంతో...ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు క్లాస్‌రూమ్స్ కంటే ఫ్రీ ఫైర్, మ్యాక్స్ వంటి గేమింగ్ వర్చువల్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆ ఆటల్లో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, ఎలైట్ పాస్‌లు ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు వాటి కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరుతో చేతికి వచి్చన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీ ఫైర్’ గేమ్‌ను నిషేధించింది. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వీపీఎన్ ద్వారా ఆడుతున్నారు. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల్లో లభిస్తోంది. కళ్లు తెరవండి.. పిల్లల్ని కాపాడుకోండి..పిల్లలు వాడే ఫోన్లలో సేవ్ అయి ఉన్న బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించాలి. ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ‘పేరెంటల్ కంట్రోల్స్’, ‘పర్చేజ్ అప్రూవల్స్’ ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, అలా చేయమని పెద్దలకు చెప్పాలి. పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులే ఇవ్వాలి. ఆన్లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే. అదీ పరిమితితోనే ఆడాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారులను పర్యవేక్షించాలి. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ -
కూటమి ప్రభుత్వ డొల్లతనానికి ఈ చిత్రమే నిదర్శనం!
ఈ చిత్రం చూశారా... తలపై పుస్తకాలు, చేతిలో క్యారేజీ పట్టుకుని వెళ్తున్నది పార్వతీపురం మండలం గోచక్క ప్రాథమిక పాటశాల విద్యార్థిని. ఈ ఏడాది విద్యామిత్ర కిట్టు అందజేయకపోవడంతో బడికి పుస్తకాలు తీసుకెళ్లేందుకు బ్యాగు కరువైంది. తలపై పుస్తకాలు పడిపోకుండా ఓ చేత్తో అదిమిపట్టుకుని చిన్నారి వేస్తున్న అడుగులు కూటమి పాలకుల హామీలను వెక్కిరిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే విద్యారంగాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అక్షరాలతో పేదకుటుంబాల చిన్నారుల భవితను మార్చేందుకు కృషిచేయాల్సిన సర్కారు.. పుస్తకాల బరువును పిల్లలకు శిక్షలా మార్చడం పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. – పార్వతీపురం రూరల్ -
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు హీరోగా ‘స్టూడెంట్’.. లుక్ అదిరింది
దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘స్టూడెంట్’. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ రోజు ‘స్టూడెంట్’ సినిమా నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. జామెట్రీ బాక్స్ లోని డివైడర్ ను క్లాస్ లో కాకుండా ఫైట్స్ కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయడం..ఇలా స్టూడెంట్ లో లైఫ్ లో భాగమైనవన్నీ ఈ పోస్టర్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాయి. 'ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు' అని రాసిన కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుండగా.. 'ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను..' అని రాసిన మాటలు ఈ స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో ఉన్న పవర్ ఫుల్ లవ్ స్టోరీని చూపిస్తున్నాయి.‘స్టూడెంట్’ సినిమా మేఘాంశ్ శ్రీహరి కెరీర్ కు ల్యాండ్ మార్క్ మూవీగా రాబోతుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
షాక్ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్ కాదు' అనుకుంది!
ఆమెకు 95.2 శాతం మార్కులు వచ్చాయి. చాలా మంది విద్యార్థులకు అది కలల ఫలితమే. కుటుంబ సభ్యులు కూడా సంతోషించారు. కానీ ఆ విద్యార్థిని మాత్రం సంతృప్తి చెందలేదు. తన సమాధాన పత్రాల్లో ఎక్కడో పొరపాటు జరిగిందనే నమ్మకంతో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసింది. ఆ తర్వాత వచ్చిన ఫలితం చూసి ఆమె మాత్రమే కాదు.. విద్యా వర్గాలే ఆశ్చర్యపోయాయి. ఏకంగా 24 మార్కులు పెరిగి.. దేశ టాపర్ల సరసన నిలిచింది. ఈ అద్భుత ఘనత సాధించింది ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన అవనీ కేజ్రీవాల్. డీపీఎస్ సేల్ టౌన్షిప్ స్కూల్లో కామర్స్ విద్యార్థినిగా చదివిన ఆమె, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో తొలుత 95.2 శాతం మార్కులు సాధించింది. ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ తన ప్రదర్శనకు వచ్చిన మార్కులు సరిపోవని భావించిన అవనీ, సమాధాన పత్రాల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసింది. అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. రీవాల్యుయేషన్ అనంతరం ఆమె మార్కులు ఏకంగా 24 పెరిగాయి. దీంతో ఇంగ్లీష్ కోర్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించి 500కి 500 స్కోర్‌తో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అదనపు సబ్జెక్ట్‌గా తీసుకున్న గ్రాఫిక్స్‌లో కూడా 99 మార్కులు సాధించింది.ఫలితాలు ప్రకటించిన రోజే తనకు పూర్తి సంతృప్తి కలగలేదని అవనీ చెబుతోంది. ఏడాది పొడవునా తాను పడిన కష్టానికి తగిన ఫలితం రాలేదని భావించానని, అందుకే రీవాల్యుయేషన్‌కు వెళ్లానని తెలిపింది. తన సమాధానాలపై, తన శ్రమపై ఉన్న నమ్మకమే ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పింది.అవనీ విజయ రహస్యం కూడా ఆసక్తికరంగానే ఉంది. రోజుకు ఎన్ని గంటలు చదివానన్నది కాదు.. ఎన్ని లక్ష్యాలు పూర్తి చేశానన్నదే ముఖ్యమని ఆమె చెబుతోంది. ప్రతిరోజూ రెండు లేదా మూడు టాపిక్‌లు పూర్తి చేయాలని నిర్ణయించుకుని, అవి పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో చదివేదాన్నని తెలిపింది. సోషల్ మీడియా విషయంలోనూ విద్యార్థులకు ఆమె ఒక సందేశం ఇచ్చింది. దాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని, కానీ చదువుకు ఆటంకం కలిగించకుండా పరిమితంగా ఉపయోగించాలని సూచించింది.వ్యాపారవేత్త మితేష్ కేజ్రీవాల్, గృహిణి పూనమ్ కేజ్రీవాల్ దంపతుల కుమార్తె అయిన అవనీ.. భవిష్యత్తులో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సీయూఈటీ-యూజీ 2026 పరీక్ష కూడా రాసింది. భవిష్యత్తులో సొంత వ్యాపారాన్ని స్థాపించి విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని కలలు కంటోంది.అవనీ సాధించిన ఈ ఘనతపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఆమె విజయం వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయా చౌహాన్ పేర్కొన్నారు.ఒక రీవాల్యుయేషన్ అభ్యర్థన.. 24 అదనపు మార్కులు.. 95.2 శాతం నుంచి పర్ఫెక్ట్ 100 శాతం. అవనీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక సందేశంగా మారింది. ఫలితంపై సందేహం ఉంటే వదిలేయకుండా.. తమ కృషిపై నమ్మకంతో ముందడుగు వేయాలని ఆమె విజయం చెబుతోంది. -
అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
మరో తెలుగు విద్యార్థి డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. -
ఇంజినీరింగ్.. వెయిటింగ్
ఇంజినీరింగ్ విద్యనభ్యసించి.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఆశతో ఉన్నస్టూడెంట్స్కు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదల్లో అంతులేని జాప్యం చేస్తూ.. నీలినీడలు కమ్ముకునేలా సర్కార్ వ్యవహరిస్తోంది. ఏటా రిజల్ట్స్ ఈ పాటికే విడుదలై.. షెడ్యూల్ ఖరారై.. కౌన్సెలింగ్ కోసం ఎదురుచూసేవారు. అయితే ఈ దఫా వ్యవహారం దీనికి భిన్నంగా సాగుతోంది. ఫలితంగా పక్క రాష్ట్రాల్లో చదువైతేనే బెటర్ అనే భావనకు అధిక శాతం మంది వచ్చేశారు. ఇప్పటికే ఏటా అడ్మిషన్లు తగ్గిపోతూ.. కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలోనూ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు (టౌన్): రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యపై విద్యార్థుల్లో నీలి నీడలు కమ్ముకున్నాయి. పక్క స్టేట్స్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ప్రారంభమైనా, ఇక్కడ మాత్రం ఏపీఈఏపీ సెట్ ఫలితాలే విడుదల కాలేదు. రిజల్ట్స్‌ను ఎప్పుడు వెల్లడిస్తారో.. కౌన్సెలింగ్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై నేటికీ స్పష్టత లేదు. ఫలితంగా ఇంటర్ పూర్తి చేసి ఈ పరీక్ష రాసిన స్టూడెంట్స్ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 13 ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ బ్రాంచీల్లో తొమ్మిది వేలకుపైగా సీట్లున్నాయి. ప్రధానంగా సీఎస్ఈవైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందులో కొద్ది సీట్లే ఉండటంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైన్స్, ఏఐఎమ్మెల్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూర్టీ తదితర బ్రాంచీలను ఆయా కాలేజీల యాజమాన్యాలు తెరపైకి తీసుకొచ్చాయి. సీఎస్ఈ తర్వాత ఈసీఈ, మెకానికల్, సివిల్ తదితర గ్రూపులకు డిమాండ్ ఉంది. అక్కడలా.. ఇక్కడిలా..! తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 19 నుంచి నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలు.. ఇక్కడికి మధ్య పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు ఉపక్రమిస్తున్నారు. భారం తగ్గించుకోవాలనేనా..? ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తే, ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు తీసుకుంటారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందనే భావనలో సర్కార్ పెద్దలున్నారనే టాక్ నడుస్తోంది. కనీ్వనర్ కోటా కింద ఆయా కాలేజీల్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గవర్నమెంట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారనే వాదనా లేకపోలేదు. నైరాశ్యంలో యాజమాన్యాలు ఉమ్మడి జిల్లాలో గతంలో 24 ఇంజినీరింగ్ కళాశాలలుండేవి. ఆ తర్వాత ఆశించిన మేర ప్రవేశాల్లేకపోవడంతో ఒక్కొక్కటికీ తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 13కు చేరుకుంది. కౌన్సెలింగ్ ఆలస్యమైతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో నెలకొంది. అధిక శాతం మంది పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందితే కాలేజీలను ఎలా నడపాలనే మీమాంసలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సైతం సకాలంలో విడుదల చే యకుండా పెండింగ్‌లో ఉంచుతున్న తరుణంలో, కనీ స స్థాయిలో ప్రవేశాల్లేకపోతే కాలేజీలను నడిపే అవకాశమే లేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.అంతా గందరగోళం ఈ పర్యావసానాల క్రమంలో ఏపీలో చేరాలా లేక పక్క రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ పొందాలో అర్థంకాని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ సీటు రాకపోతే.. పక్క రాష్ట్రాల్లోనైనా లభిస్తాయాననే ఆందోళన సైతం వీరిలో నెలకొంది. ఫలితంగా సమీప స్టేట్స్కు వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ప్రతి నెలా ఏదో మల్టీ నేషనల్ కంపెనీల్లో వందల సంఖ్యలో జాబ్స్‌ను తొలగిస్తున్న పరిస్థితీ నెలకొంటోంది.కళ్లు కాయలుకాసేలా.. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించి ఫలితాలను ఏప్రిల్ 16న విడుదల చేశారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ సైతం వెలువడ్డాయి. అయితే ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ఫలితాల విడుదల తేదీని నేటికి ప్రకటించలేదు. ఇవి ఎప్పుడొస్తాయా నేటికీ తెలియని అయోమయం నెలకొంది. ఒకవేళ వీటిని విడుదల చేశాక, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటిస్తారా.. లేదా పక్క రాష్ట్రాల్లో ముగిశాక తెలియజేస్తే తమ పరిస్థితి ఏమిటనే సందిగ్థంలో వీరున్నారు.జిల్లాలో ఇలా.. కళాశాలలు 13 సీట్లు 9 వేలకుపైగా..షెడ్యూల్‌ను త్వరగా ప్రకటించాలి ఏపీఈఏపీ సెట్ ఫలితాలను వెంటనే విడుదల చేసి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించాలి. దీని కోసం వందలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో షెడ్యూల్‌ను ప్రకటించారు. అక్కడ రూ.లక్షలు వెచ్చించి సీట్లు కొనాల్సి వస్తోంది. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ -
కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!
స్టేషన్‌ఘన్‌పూర్: మరో మూడు రోజుల్లో ఆ యువకుడి జన్మదినం ఉంది. అంతలోనే అనంతలోకాకు చేరాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లి బావిలో నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన చింత రమేశ్, అమల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వరుణ్‌తేజ్(16) ఉన్నారు.ఇటీవల వరుణ్‌తేజ్ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష రాసి రాంపూర్‌లోని వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సీటు పొందాడు. కాగా, శనివారం కళాశాలలో దింపి వస్తానని తండ్రి చెప్పగా ‘డాడీ మూడు రోజుల్లో బర్త్‌డే ఉందిగా, బర్త్‌డే తర్వాత కళాశాలకు వెళ్తా’ అని చెప్పి ఇంటి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో స్నేహితులు చింత ప్రభాస్, కరుణ్తేజ్, గోనెల అభిరాం, అరవింద్, ధీరజ్‌తో కలిసి మొత్తం ఆరుగురు స్థానిక వైకుంఠధామం సమీపాన ఉన్న గుడిసెబావిలోకి ఈతకెళ్లారు. సరిగా ఈతరాని వరుణ్‌తేజ్ మెళ్లగా బావి ధరి పట్టుకున్నాడు. అనంతరం ఈత కొట్టేందుకు యత్నిస్తున్న క్రమంలో స్నేహితులంతా చూస్తుండగానే అరుస్తూ నీటిలో మునిగిపోయాడు.వెంటనే వారు భయంతో బావి నుంచి బయటకొచ్చి సమీపాన ఉన్న స్థానికులు, వరుణ్‌తేజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై వినయ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీమ్‌తో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా గల్లంతైన విద్యార్థి మృతదేహం దొరకలేదు. బావి దాదాపు 100 ఫీట్లకు పైగా లోతు ఉండడం, నీరు చాలా ఉండడంతో మోటార్లతో నీటిని బయటకు తోడే చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు రాత్రి పదిగంటల సమయంలో బావిలో నీరు పూర్తిగా తోడేసి వరుణ్‌తేజ్ మృతదేహాన్ని వెలికితీశారు.కాలేజీకెళ్లినా బతుకుదువు బిడ్డా..కాగా, ఘటనా స్థలిలో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాలేజీకి వెళ్లినా బతికేటోడివి బిడ్డా అంటూ రోదిస్తుండగా ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. వరుణ్‌తేజ్ మృతితో కుటుంబంతోపాటు పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. -
ఒత్తిడితో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్ (హైదరాబాద్): నీట్ రీ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థిని చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మియాపూర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వివరాలు తెలిపారు. వైఎస్ఆర్కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్సనా నీట్ ఎగ్జామ్‌కు సిద్ధం అవుతోంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉంటుండగా, పది రోజుల కిందట షేక్ సనా తల్లి అబ్బునిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లో ఉంది.శనివారం చదువుకునేందుకు షేక్ సనా తన గదిలోకి వెళ్లి సాయంత్రం అయినా బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది.‘తల్లిదండ్రులను మెప్పించలేకపోతున్నా.. భయం, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పో యి బాధపడుతున్నాను. చదువులో కుటుంబ అంచనాలను అందుకోలేకపోతున్నా. గత పరీక్షల్లో వైఫల్యం కారణంగా బాధపడుతున్నా. నా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు’అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!
భువనేశ్వర్: నీట్-యూజీ (NEET-UG) రీటెస్ట్ రాయబోతున్న ఒక ఒడిశా విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. జూన్ 21న పరీక్ష జరగనుండగా, కేవలం ఒక్క రోజు ముందు ఆమెకు దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్‌కు చెందిన డెహ్రాడూన్‌లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. మొదట భువనేశ్వర్‌లో సెంటర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడు రీటెస్ట్ అడ్మిట్ కార్డ్‌లో డెహ్రాడూన్ అని మార్చడంతో ఆ విద్యార్థిని, ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ గందరగోళం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, విద్యార్థిని భవిష్యత్తును కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.భువనేశ్వర్ టు డెహ్రాడూన్ఈ తప్పిదాన్ని ‘వెటరన్స్ క్లబ్ ఒడిశా’ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు విద్యార్థిని మొదట రాసిన నీట్ పరీక్షకు భువనేశ్వరే కేంద్రంగా ఉంది. కానీ, రీటెస్ట్ కోసం జారీ చేసిన కొత్త అడ్మిట్ కార్డ్‌ను చూసి ఆ కుటుంబం నిర్ఘాంతపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో అంత దూరం ప్రయాణించడం ఆర్థికంగా, ప్రాక్టికల్‌గా అసాధ్యమని, దీనివల్ల విద్యార్థిని పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.న్యాయం కోసం మాజీ సైనికుడి పోరాటంబాధిత విద్యార్థిని తండ్రి, మాజీ సైనికుడు సంజయ్ బిస్వాల్ ఈ తప్పిదంపై ఇండియన్ ఎక్స్-సర్వీసెస్ లీగ్ ఒడిశా విభాగంతో పాటు ఇతర ఉన్నతాధికారులకు అత్యవసర అప్పీళ్లు సమర్పించారు. తన కుమార్తెకు స్వరాష్ట్రంలోనే లేదా ఇంటికి దగ్గరగా ఎక్కడైనా పరీక్షా కేంద్రాన్ని మార్చాలని ఆయన అభ్యర్థించారు. పరీక్ష సమయం ముంచుకొస్తున్న తరుణంలో, ఈ ఆకస్మిక మార్పు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది.ఒకవైపు ఉచిత రవాణా.. మరోవైపు అందని స్పందనమరోవైపు, ఒడిశా ప్రభుత్వం నీట్ రీటెస్ట్ రాసే అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యాలను ప్రకటించింది. ఖుర్దా జిల్లాలోనే 26 కేంద్రాలకు గానూ 108 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా సాయం అందిస్తున్నా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన ఈ పొరపాటు కారణంగా ఒక విద్యార్థిని ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
‘ఒక్క ఎగ్జామ్‌తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్ మెసేజ్!
ముంబై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం(జూన్ 21) జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఉపేంద్ర చౌహాన్ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు ‘టైమ్స్ నౌ డిజిటల్’ ద్వారా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధిస్తే మంచిదేనని, ఒకవేళ విఫలమైనా అది జీవితాంతం కాదని చెబుతూ, మానసిక ఒత్తిడిలో ఉన్న అభ్యర్థులకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.‘జీవితంలోనూ లెక్కలేనన్ని అపజయాలు’తాను కూడా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులను, లెక్కలేనన్ని తిరస్కరణలను ఎదుర్కొన్నానని ఉపేంద్ర చౌహాన్ గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో తన కలలు చేజారిపోతున్నాయని, జీవితంలో ఇంకేమీ మిగల్లేదని తీవ్ర నిరాశకు గురైన క్షణాలను ఆయన పంచుకున్నారు. అయితే ఆ కష్ట కాలమే తనను ఈ రోజు ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దిందని, జీవితాన్ని చూసే సరైన మార్గాన్ని నేర్పిందని వివరించారు. జీవితం అనే పెద్ద ప్రయాణంలో ఇలాంటి కఠినమైన పరీక్షలు చాలా చిన్నవని, అపజయాలే మనిషి ఎదుగుదలకు, పరిమితులను దాటి ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు యాక్టర్తన సొంత జీవిత ప్రయాణాన్ని ఉదాహరణగా చూపుతూ ఉపేంద్ర విద్యార్థులకు కీలక విషయాలను వివరించారు. తాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, మొదట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ, ఆ తర్వాత అనుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఏడేళ్లపాటు విజయవంతంగా బిజినెస్ రన్ చేశానని చెప్పారు. ఆ సమయంలో తనకు నటుడిని అవుతానని అస్సలు తెలియదని, జీవితంలో తన అసలైన లక్ష్యం చాలా ఆలస్యంగా గుర్తించానని అన్నారు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.‘పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే.. జీవితాన్ని దాని దారిన సాగనివ్వండి. జీవితం చాలా అందమైనది, దానిని ప్రేమించండి’ అంటూ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.ఇది కూడా చదవండి: అగ్రహీరో బ్యానర్లో ద్రౌపది ముర్ము బయోపిక్ -
ఏఐకి సిలబస్ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!
‘డియర్ చాట్ జిపిటి..... ఈ క్వశ్చన్ పరీక్షలో రాదు కదా?’ స్టూడెంట్ అడిగితే ఏఐ ‘రాదు’ అని ఊరుకుంటుంది. టీచర్ ‘పరీక్షలో రాకపోయినా జీవితంలో పనికొస్తుంది’ అంటుంది. ఏఐకి సిలబస్ తెలుసు. టీచర్‌కి నువ్వు తెలుసు. నీ సిల్లీ డౌట్లు, నీ కళ్లలో భయం, నీ గుండెల్లో ఆశ. ఏఐ ఆన్సర్ చెప్తే టీచర్ ఆలోచన నేర్పుతుంది. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.ఇంట్లో పిల్లలు హోంవర్క్ మొదలుపెట్టగానే మొదట అడిగే మాట ‘ఏఐలో కొట్టనా?’. కొట్టాక క్షణాల్లో ఆన్సర్ దొరుకుతుందటే బుర్రకు ఇక పని లేదు. తల్లిదండ్రులు కూడాప్రాజెక్ట్ కోసం ‘ఏఐని అడుగు’ అని ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఒక అనుమానం వస్తోంది. ఏఐ అన్నీ చెప్పేస్తుంటే ఇక స్కూల్, టీచర్ ఎందుకు అని. నిజమే, ఏఐ వేగంగా సమాచారం ఇస్తుంది. అర్ధరాత్రి అడిగినా విసుక్కోదు. కానీ చదువులో తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఆ రెండింటి మధ్య గ్యాప్‌ను పూడ్చేది టీచర్ మాత్రమే. ఏఐ యుగంలో టీచర్ పోలేదు. టీచర్ పాత్ర మారింది.టీచర్ కలిగించే స్పృహ‘ఆకు పచ్చగా ఎందుకు ఉంది?’ అని పిల్లాడు అడిగితే ఏఐ మూస పద్ధతి జవాబు చెప్తుంది. టీచర్ మాత్రం ‘నువ్వు అన్నం తింటే బలం వచ్చినట్టు, చెట్టు ఎండ తింటే ఆకు పచ్చగా అవుతుందిరా’ అంటారు. దీన్నే ‘కాన్సెప్టువల్ క్లారిటీ’ అంటారు. ఏఐ డేటా ఇస్తుంది. ఆ డేటాను జీవితానికి అన్వయించే వివేకం, విలువ, దృక్పథం టీచర్ మాత్రమే ఇవ్వగలరు. ఇది యంత్రానికి రాని మానవ స్పందన.టీచర్‌కు ‘క్లాస్రూమ్’ తెలుసుమంచి టీచర్ పాఠం చెప్తూనే పిల్లల ముఖాలు చదువుతారు. ఎవరి కళ్లలో కన్ఫ్యూజన్ ఉందో, ఎవరు అర్థం కాకపోయినా తల ఊపుతున్నారో పసిగడతారు. వెంటనే పాఠం ఆపి, ఉదాహరణ మార్చి, అవసరమైతే మాతృభాషలోకి దిగి చె΄్తారు. పిల్లాడి కంట్లో నీళ్లు చూస్తే సిలబస్ పక్కనబెట్టి ముందు ధైర్యం చె΄్తారు. ఏఐకి ఈ శక్తి లేదు. దానికి ఎమోషన్ తెలియదు. ఒక పద్ధతి ఫెయిల్ అయినా అందరికీ అదే పద్ధతి చూపిస్తుంది. కొత్త బ్యాచ్ వచ్చిన ప్రతిసారీ టీచర్‌కు మరింత అనుభవం పెరిగి ఉంటుంది. ఆ హృదయం, ఆ పరిశీలన ఏఐకి రాదు.‘పాస్’... ‘పర్సన్’చదువులో ముఖ్యమైనది మోటివేషన్. పిల్లలు సబ్జెక్ట్‌తో కాదు, సబ్జెక్ట్ చెప్పే మనిషితో కనెక్ట్ అవుతారు. ‘నువ్వు చేయగలవు’ అని ఏఐ చెప్పదు. టీచర్ చె΄్తారు. ఆ మాటే పిల్లాడిని ఫెయిల్యూర్ నుంచి లేపుతుంది. ఏఐ ఆన్సర్ ఇస్తుంది. టీచర్ ప్రశ్న అడిగే ధైర్యం ఇస్తారు. ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. టీచర్ విలువలు నేర్పుతారు. క్యూరియాసిటీ వెలిగించడం, తప్పుచేస్తే సరిదిద్దడం, ఒత్తిడిలో ఉన్న పిల్లాడిని గుర్తించి దగ్గర తీసుకోవడం మనిషికే సాధ్యం. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.మనిషి గుర్తుఅసలు ప్రశ్న ‘టీచర్లు అవసరమా’ అని కాదు. ‘టీచింగ్‌లో మానవీయ స్పర్శ కాపాడుకుంటున్నామా’ అని. ఏఐ వచ్చింది కాబట్టి టీచర్ పని తగ్గలేదు. బాధ్యత పెరిగింది. ఇకపై టీచర్ క్యూరియాసిటీ వెలిగించే కాగడా. డేటా యుగంలో దారి చూపే దిక్సూచి. మీ పిల్లాడి ఫో¯Œ లో ఏఐ ఉండొచ్చు. కానీ వాడి లైఫ్‌లో ‘నా మేడం, నా సార్’ అనే ఒక మనిషి ఉండాలి. ఆ మనిషిని రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇంకా పుట్టలేదు. బడిగంట మోగింది. ఇక టీచర్ అసలు పాఠం మొదలు. కేస్ స్టడీ 1హైదరాబాద్‌లో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థి సైన్స్ప్రాజెక్ట్ కోసం ఏఐని.‘గ్లోబల్ వార్మింగ్ కారణాలు’ అడిగాడు. టైప్ చేయగానే ఐదు పాయింట్లు వచ్చాయి. యథాతథంగా చార్ట్ మీద రాసి తీసుకెళ్లాడు. క్లాస్‌లో టీచర్ ‘మన వీధిలో చెట్లు నరికితే ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?’ అని అడిగారు. పిల్లాడు మౌనం వహించాడు. ఏఐ ఇచ్చిన డేటాను తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అన్వయించలేక పోయాడు. ఆరోజు టీచర్ క్లాస్ మొత్తాన్ని బయటకు తీసుకెళ్లి ఎండలో సిమెంట్ రోడ్డు వేడి, చెట్టు నీడ చల్లదనం తెలిపి ఉష్ణోగ్రత తేడా ఫీల్ చేయించారు. ఏఐ ‘ఏంటి’ చెప్పింది. టీచర్ ‘ఎందుకు’ అనుభవంలోకి తెచ్చారు.కేస్ స్టడీ 2ఓ ఇంటర్ విద్యార్థిని లెక్కల్లో బలహీనం. ట్యూషన్ చేరి అడిగితే ‘సిల్లీ డౌట్’ అని కోప్పడతారేమోనని భయం. దాంతో ఏఐతోప్రాక్టీస్ మొదలుపెట్టింది. సమాధానాలు వచ్చాయి. కానీ పరీక్షలో అదే మోడల్ మార్చి ఇస్తే తడబడింది. కారణం ఏఐ ఆమె భయాన్ని గుర్తించలేదు. కాలేజీలో లెక్కల మేడం ఆమె ముఖం చూసి విషయం కనిపెట్టారు. ‘నీకు కాన్సెప్ట్ రావాలి’ అని ధైర్యం చెప్పి బోర్డు మీద కాకుండా ఆమె నోట్‌బుక్‌లోనే తప్పును సరిదిద్దారు. మూడు నెలల్లో ఆ అమ్మాయి పాస్ అయింది. ఏఐ సాధన ఇచ్చింది. టీచర్ నమ్మకం ఇచ్చారు. -
మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు సంబంధించి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె 23 ఏళ్ల రియా కుమారి థాపా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇంటర్లో 97 శాతం, విషాదంజూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్ష (re-examination) కోసం రియా సిద్ధపడుతోంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం రాసే NEET-UG పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయితే ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో అనే ఒత్తిడి మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో హిందీలో "ఐ లవ్ యూ, మమ్మీ, పాపా. ఇందులో ఎవరి తప్పూ లేదు" అని పేర్కొనడంతో తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. రియా గతంలో 12వ తరగతిలో 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలవడం గమనార్హం. ఇదీ చదవండి: షాకింగ్ : ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..! రాత్రంతా చదువుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం రియాకు అలవాటు. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి తల్లి ఆమె గది తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో, తండ్రి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా రియా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే, చదువుల్లో ఆశించిన విజయం సాధించలేకపోతున్నాననే తీవ్ర నిరాశ, తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రాథమిక కారణాలని సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ కండారీ తెలిపారు.ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్నోట్ : చదువుల ఒత్తిడి, పరీక్షల భయం వల్ల ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు నిపుణుల లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి -
పోలీసు ఉద్యోగం కోసం వచ్చి పోలీసులపైనే రాళ్లదాడి!
పట్నా: బీహార్ రాజధాని పట్నాలోని పాట్లీపుత్ర రైల్వే స్టేషన్ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థుల ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ప్రయాణ వసతులు సరిపోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు రైళ్లను అడ్డుకుని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు, బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.రణరంగంగా మారిన స్టేషన్బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్ష కోసం వేలాది మంది విద్యార్థులు పాటలీపుత్ర స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పరిమిత సంఖ్యలో ఉన్న రైళ్లు, విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది అభ్యర్థులు రైళ్లు ఎక్కలేకపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు నిరసనకారులు రైళ్ల ఎమర్జెన్సీ చైన్లు లాగి, రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆపై రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ స్టేషన్‌ను రణరంగంగా మార్చారు. ప్రత్యక్ష సాక్షి సంజయ్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, అభ్యర్థులు వేలాదిగా ఉండటం, రైళ్లు తక్కువగా ఉండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. Patna, Bihar: A clash broke out at Patliputra Railway Station in Patna during the Bihar Police Prohibition Department exam, as candidates protested against inadequate train arrangements. The unrest escalated into vandalism of an exam special train, prompting police to intervene… pic.twitter.com/e85cGOibrp— IANS (@ians_india) June 13, 2026పోలీసుల లాఠీఛార్జ్, కాల్పులుపరిస్థితి తీవ్రతరం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపైకి భారీగా రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో ఐజీ జితేంద్ర రాణాతో పాటు పలువురు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప బలప్రయోగానికి దిగాల్సి వచ్చింది. బాష్పవాయువు గోళాలు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపి గుంపును విచ్ఛిన్నం చేశారు.పరిపాలనాధికారుల వివరణఈ ఘటనపై పట్నా జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) డాక్టర్ త్యాగరాజన్ స్పందిస్తూ, అభ్యర్థుల సౌకర్యార్థం ఇప్పటికే రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళ కొందరు అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించి, పరీక్షకు వెళ్లే ఇతర విద్యార్థులను కూడా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. శాంతిభద్రతలను కాపాడేందుకే స్వల్ప బలప్రయోగం చేశామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, పరీక్షల రైళ్లు సురక్షితంగా బయలుదేరాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఇది కూడా చదవండి: 6 నెలలకే రూ. 4 లక్షలైతే.. రేపు చదువుల సంగతి ఏంటి? -
కాచిగూడాలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్య
సాక్షి,ఒంగోలు: కాచిగూడా రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 27న రాహుల్ తన కుటుంబ సభ్యులకు టూర్‌కు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడాలో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలించినా ఎటువంటి సమాచారం లభించలేదు.తాజాగా ఒంగోలు సమీపంలోని సింగరాయికొండ వద్ద ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ అదృశ్యం, ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
సరస్వతీ నిలయంలో చీడ పురుగులు
కర్ణాటక: చదువుల తల్లి నిలయంలో చీడ పురుగులు విద్యార్థినులను కాటేస్తున్నాయి. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, అదే విభాగం పీహెచ్డీ విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన సంఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చదువులు చెప్పాల్సిన గురువు.. తన కూతురు వయసున్న అమ్మాయిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని అనేకమంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఏఎం ఖాన్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ప్రొఫెసర్ల ఇలాంటి నడవడికతో తలెత్తిన విమర్శలపై సదరు బాధ్యుడైన ప్రొఫెసర్ దేవరాజ్ తంగదొరై నుంచి వివరణ తీసుకున్నారు. అలానే పీహెచ్డీ విద్యార్థినిపై కూడా తొలి దశ విచారణను ఇప్పటికే పూర్తి చేశారు. ఆధారాల సమర్పణ ప్రొఫెసర్ విద్యార్థినితో గడిపిన వీడియోలు, ఆడియోలను కూడా ఫిర్యాదుదారుడైన విద్యార్థి వేదవ్యాస్ చౌహాన్ వర్సిటీ కమిటీకి అప్పగించారు. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత చర్యలను చేపడతామని వీసీ తెలిపారు. తంగదొరై ఆమెతోనే కాదని, అనేకమంది పీహెచ్డీ, పీజీ విద్యార్థులను ప్రేమపేరుతో మభ్యపెట్టి షికార్లు చేసేవాడని విద్యార్థులు ఆరోపించారు. దీనికి సంబంధించి అనేక ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అనేది చర్చనీయాంశమైంది. చదువుకునే వాతావరణం కావాలి ఈ ఘటనలపై చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను తంగదొరై వద్దే పీహెచ్డీ చేసేవాడినని, ఆయన అనుచిత డిమాండ్లను తీర్చలేక ఆయన గుట్టును బయట పెట్టినట్లు తెలిపారు. వర్సిటీలోని విద్యార్థి సంఘాల నేతలు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. విద్యార్థులు క్షేమంగా చదువుకోవడానికి తగిన వాతావరణం ఉండాలని, విద్యాబోధకులకు నైతిక నియమావళిని ఏర్పరచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను బోధకులు బెదిరించడం, లైంగిక దోపిడీకి పాల్పడడం క్షమించరాని నేరమని, అటువంటి దుష్కృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.విద్యార్థిని ప్రొఫెసర్ ప్రేమాయణం -
11 రోజులుగా విద్యార్థి అదృశ్యం.. పోలీసులు విచారణలో
సాక్షి, హైదరాబాద్: జగిత్యాలకు చెందిన రాహుల్ అనే బీటెక్ విద్యార్థి కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. రాహుల్ చదువుతున్న కాలేజీలో ఎంక్వైరీ చేశారు. సదరు అబ్బాయికి ఒక అమ్మాయితో గొడవ జరిగినట్లు సమాచారం. కాగా ఆయన చివరిసారిగా కాచిగూడలోని రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలు స్టేషన్ సీసీటీవీ చిత్రాలలో నమోదయ్యాయి.కాగా ప్రస్తుతం సదరు విద్యార్థి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న రాహుల్ సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్టల్లో నివాసం ఉంటున్నాడు. మే 27నుంచి విద్యార్థి కనిపించడం లేదు. విద్యార్థి మిస్సింగ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
విద్యార్థినితో ప్రొఫెసర్ ప్రేమాయణం
హుబ్లీ: విద్యాను బోధించే గురువు స్థానం అత్యున్నతమైనదని భారత సంప్రదాయాలు చాటి చెబుతున్నాయి. అయితే విద్యా బోధన చేసే గురువే విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన ఘటన కర్ణాటక విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇక్కడి శాస్యశాస్త్రం విభాగం ఫ్రొఫెసర్ దేవరాజ సంగుదొరై విజయపురకు చెందిన అదే వి«భాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిపారు. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. వీరిద్దరి ప్రేమ గొడవ తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె పీహెచ్‌డీని సంగంలోనే ఆపేసి ఇంటికి తిరిగి తీసుకెళ్లి పోయారు. కొన్ని రోజుల తర్వాత విజయపురకు చెందిన విద్యార్థి తన వద్దకు పీహెచ్డీ చేయడానికి రాగా గతంలో మధ్యలోనే పీహెచ్‌డీని ఆపేసి వెళ్లిన విద్యార్థినిని తిరిగి కళాశాలకు తీసుకొని వస్తేనే పీహెచ్డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తానని ఆంక్షలు పెట్టారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
హాట్‌టాపిక్‌గా ఆ విద్యార్థి లేవనెత్తిన ప్రశ్న..!
ఓ యువ విద్యార్థి లేవనెత్తిన సందేహం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జార్ఖండ్‌కు చెందిన పదిహేడేళ్ల సార్థక్ సిద్ధాంత్ 12 వ తరగతి చదువుతున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష మూల్యాంకనానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. కాస్త లోతుగా విశ్లేషించాలని సీబీఎస్ఈ విడుదల చేసిన డాక్యుమెంట్లు, పాత టెండర్లను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించి చూశాడు సార్థక్. నిబంధనల మార్పు జరిగిందని, కొన్ని క్లాజులను సడలించారని, మరిన్ని లోపాలు కూడా ఉన్నాయని తన బ్లాగ్‌లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ఆన్లైన్లో వైరల్‌గా మారింది. అధికారులు అప్రమత్తమయ్యారు. సార్థక్ ఆరోపించిన అంశాలను సవివరంగా తెలుసుకోదలచి అతడినే సీబీఎస్ఈ పార్లమెంటరీ ప్యానల్‌కి ఆహ్వానించారు. కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్థక్ ఇచ్చిన ప్రజెంటేషన్‌లో తాను గుర్తించిన పలు లోపాలను వారికి వివరించాడు. మొత్తానికి జార్ఖండ్ విద్యార్థి లేవెనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థ పరీక్షగా మారింది.(చదవండి: ‘గ్రాండ్‌ఫేర్‌వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!) -
కోటా: ‘నీట్’ సీటు వేటలో అనంత లోకాలకు..
కోటా: రాజస్థాన్‌లోని కోచింగ్ హబ్ ‘కోటా’లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో 17 ఏళ్ల విద్యార్థి హాస్టల్ గదిలో విగతజీవిగా వేలాడుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. జవాహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ విషాదం స్థానికంగా తీవ్ర ఆందోళనలకు గురిచేయగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థిమరణించిన విద్యార్థిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్రిపాశంకర్ కుమారుడు ఆర్యన్ ఓఝాగా పోలీసులు గుర్తించారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం కోటాకు వచ్చిన ఆర్యన్, ఇక్కడి ఒక హాస్టల్ గదిలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆర్యన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటివారు వెంటనే అతడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.పోలీసుల దర్యాప్తు.. కారణాలు అస్పష్టంవిద్యార్థి బలవన్మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని, విద్యార్థి బస చేసిన గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ప్రారంభించారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు వెల్లడవుతాయని ఉన్నతాధికారులు తెలిపారు.మళ్లీ తెరపైకి మానసిక ఒత్తిడి ప్రశ్నలుప్రతి ఏటా ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల కోచింగ్ కోసం దేశం నలుమూలల నుండి వేలాది మంది విద్యార్థులు కోటా నగరానికి తరలివస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోని తీవ్ర ఒత్తిడి వాతావరణాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వారిపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ తాజా ఘటన మరోసారి పెను ప్రశ్నలను లేవనెత్తింది. -
డ్రెస్ చూసి ‘క్యారెక్టర్‌లెస్’ అంటారా?
మోరల్ పోలీసింగ్ అంశం దేశంలో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల వేసుకునే దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు, ప్రవర్తనపై అనవసర వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు వంటి ఘటనలు తరచూ పెద్ద డిబేట్‌కు దారి తీస్తున్నాయి. “వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది?.. సమాజం పేరు మీద నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు ప్రతి సారి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఓ విద్యార్థిని, ఓ మహిళ మధ్య దుస్తులపై జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అస్సాంలో ఓ చిన్న వీడియో ఇప్పుడు పెద్ద సామాజిక చర్చకు దారి తీసింది. పనికోసం బయటకు వెళ్లిన ఓ విద్యార్థినిపై ఓ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీ బట్టలే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాయి” అంటూ జరిగిన ఆ వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “మోరల్ పోలీసింగ్” మళ్లీ హాట్ టాపిక్‌గా మారిందితేజ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అనుష్క శర్మ తన ప్రాక్టికల్ పరీక్ష కోసం అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు స్కూటర్‌పై బయటకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై ఓ వృద్ధ మహిళ ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజం చెడిపోతుంది. ఏం చేద్దామని ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చావ్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వేడెక్కించాయి. అంతేకాదు, “క్యారెక్టర్‌లెస్” వంటి పదాలు ఉపయోగించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.రికార్డింగ్‌తో బయటపడ్డ వివాదంఈ ఘటనను అనుష్క స్వయంగా తన మొబైల్లో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె తన దుస్తులపై ఎందుకు ఇంత విమర్శ వస్తోందని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వృద్ధ మహిళ కూడా ఆమెను చిత్రీకరిస్తూ తన అభిప్రాయాన్ని కొనసాగించింది. వీడియోలో అనుష్క నలుపు రంగు ట్యాంక్ టాప్, ట్రౌజర్స్ ధరించి కనిపించింది. దుస్తులపై విమర్శలు పెరుగుతుండగా, ఆమె ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది.హాట్ డిబేట్వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది యువతులు, మహిళా హక్కుల సంఘాలు అనుష్కకు మద్దతు తెలుపుతూ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు వేస్తున్నాయి. “ఎవరికి ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికుంది?” అనే కామెంట్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన “మోరల్ పోలీసింగ్ vs వ్యక్తిగత స్వేచ్ఛ” అనే పెద్ద చర్చగా మారింది.A viral video from Tezpur has triggered a huge debate online. A student was allegedly shamed publicly over her clothes, but she chose to speak up instead of staying silent.#Assam #Tezpur #ViralVideo #WomenRights pic.twitter.com/wNq8TDmVbz— Kaushiki Dey (@De7845Dey) June 2, 2026 -
కలెక్టర్ మేడం.. దండం పెడుతున్నా..
‘నా పేరు మీస వరుణ్ వర్మ. నేను మానకొండూర్‌లో 7వ తరగతి చదువుతున్న. కరీంనగర్– వరంగల్ జాతీయ రహదారి పూర్తవుతుండగా మా గ్రామ స్టేజీ వద్ద కెనాల్ ఉండటంతో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఎడమ పక్కన సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. మాకే కాదు ప్రజలందరికీ తీవ్ర ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ మేడమ్.. మీకు దండం పెడుతున్నా సర్వీస్ రోడ్డుతో పాటు బస్టాప్ ఏర్పాటు చేస్తేనే మా చదువులు సాగుతాయి.. లేకుంటే అంతే’కరీంనగర్ అర్బన్/మానకొండూర్: సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల పూర్తిగా గ్రామానికే రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డు లతో సోమవారం కలెక్టరేట్‌కు భారీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. తమ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి వెలిబుచ్చిన కష్టం అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. -
‘స్కూల్ గ్యాంగ్ వార్’.. విద్యార్థి తలలోకి దిగిన బుల్లెట్!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఒక ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితురాలితో కలిసి ఆహారం తింటుండగా, గుర్తుతెలియని వ్యక్తులు అతడి తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలుడి మెదడులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు.చిన్నపాటి ఘర్షణతో మొదలై..ఆహారం తీసుకుంటున్న విద్యార్థిని పక్కనే ఉన్న మరో బృందం ఉద్దేశపూర్వకంగా తాకడంతో వివాదం మొదలైంది. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆ బృందం అక్కడి నుండి వెళ్లిపోయింది. అనంతరం తిరిగి వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో కలకలం చెలరేగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపి, అక్కడి నుండి పరారయ్యారు.చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలింపుకాల్పుల అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడిని వెంటనే మూల్‌చంద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు మృత్యువుతో పోరాడుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులు కూడా విద్యార్థులేనని, ప్రేమ వ్యవహారమే ఈ ఘర్షణకు అసలు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.పోలీసుల గాలింపు ముమ్మరంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎస్హెచ్ఓ, ఏసీపీ బృందాలు ఆధారాల కోసం గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు పరారీలో ఉండటంతో, వారి కోసం నగరం అంతటా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు మహిళ తరలింపు -
టాయిలెట్లో బిడ్డను కని.. వెంటిలేటర్ నుంచి విసిరేసి..
హరిపాడు: కేరళలోని అలప్పుజ జిల్లా, హరిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కడుపునొప్పిగా ఉందని చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని, టాయిలెట్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆ నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్ వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసింది.ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తతతో..తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో విద్యార్థిని టాయిలెట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే, బయట నుంచి పసికందు ఏడుపు వినిపించడాన్ని డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గమనించారు. డాక్టర్లు తిష, డాక్టర్ ఆల్ఫీ, నర్సింగ్ ఆఫీసర్ జిషా, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో గాలించారు. ఆస్పత్రి భవనం వెలుపల పడి ఉన్న శిశువును గుర్తించి రక్షించారు.ప్రాణాపాయం నుంచి..ఆ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల, చిన్నారికి ప్రమాదం పొంచి ఉండేది. కానీ, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, వేగంగా స్పందించడం వల్ల శిశువు ప్రాణాలతో దక్కింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, పసికందు సురక్షితంగా ఉంది. ప్రస్తుతం చిన్నారి, ఆమె తల్లి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తల్లికి, బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరినీ ఆలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు! -
ముంబై ఇండియన్స్ పై పంచ్.. నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
-
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కొమ్మాది (విశాఖ): గ్రేటర్ విశాఖలోని 4వ వార్డు కాపులుప్పాడలో ఉన్నఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా హౌసింగ్ బోర్డ్ (వుడా) కాలనీకి చెందిన నడుమూరు జ్యోత్స్న (17) ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఆమె 450కి పైగా మార్కులు సాధించి, ప్రస్తుతం బెటర్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతోంది.శనివారం తోటి విద్యార్థినులతో సరదాగానే గడిపిన జ్యోత్స్న, రాత్రి వేరే గదిలోకి వెళ్లి బెడ్షిట్తో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఆదివారం ఉదయం తోటి విద్యార్థినులు గమనించి యాజమాన్యానికి తెలపడంతో, ఆమెను మారికవలసలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థిని తండ్రి జగన్మోహన్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గాంధీలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. గాంధీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ కోర్సు చదువుతున్న పల్లవిగౌడ్ (19) అనే విద్యార్థిని శస్త్రచికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో గాంధీ మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన పల్లవి గౌడ్ కుడిఛాతీపై వాపు (గడ్డ) రావడంతో ఈనెల 16న గాంధీ ఆస్పత్రికి వచి్చంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో 18న అడ్మిట్ కాగా..19న సర్జరీ చేశారు. మరుసటి రోజు వైద్యులు పరీక్షించి మరోసారి సర్జరీ (రీఎక్స్ప్లొరేషన్) చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.ఇదిలా ఉండగా.. సీనియర్ వైద్యులతో కాకుండా జూనియర్లతో సర్జరీ చేయించి తమ కుమార్తె ప్రాణాలపై ప్రయోగాలు చేశారని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి వెంకటే‹Ùగౌడ్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క బాధితులను పరామర్శించి, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ పల్లవి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. పల్లవికి సర్జరీ అనంతరం రక్తపుగడ్డలను తొలగించామని తెలిపారు. ఆ తర్వాత బీపీ పడిపోవడం, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి అత్యుత్తమ వైద్యం అందించామని.. అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. -
మొబైల్ మాస్టారు
గోడల మధ్య బంధించిన చదువు, ఇప్పుడు స్క్రీన్ ల వెలుగుల్లో విహరిస్తోంది. చాక్‌పీస్ రాతలతో నిండిన బ్లాక్‌బోర్డ్ స్థానంలో, వేలి స్పర్శకే తెరుచుకునే డిజిటల్ నోట్స్ నిలుస్తోంది. స్కూల్ బస్ హారన్ లతో మొదలయ్యే విద్యార్థుల ఉదయాలు, నేడు మొబైల్ నోటిఫికేషన్స్‌తో స్టార్ట్ అవుతున్నాయి. ‘హోంవర్క్ చేశావా?’ అని గట్టిగా అడిగే టీచర్ స్వరం, ‘నెట్ వస్తుందా? లేదా?’ అనే ఆందోళనతో పెద్దదైపోతోంది. ఇప్పుడు చదువుకోవాలంటే, ఫీజులతో కొనాల్సిన అవసరం లేదు. ఒక చేతిలో మొబైల్, మరో చేతిలో చార్జర్, మనసులో తపన ఉంటే సరిపోతుంది. అప్పుడు, ఐఐటీ సార్ కూడా మీ చిన్న స్క్రీన్ పై ‘గుడ్‌మార్నింగ్ స్టూడెంట్స్’ అంటూ చిరునవ్వు చిందిస్తారు. ఈ స్క్రీన్ స్కూల్లో పుస్తకాల బరువు తగ్గిపోయింది. కానీ కలల ఎత్తు పెరిగిపోయింది. చిన్న డేటా ప్యాక్ దూరంలోనే నిలుస్తున్న ఈ డిగ్రీలు నిజంగా లాభామా? నష్టమా?ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్య ఇప్పుడు రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2024 నాటికి దేశంలో 88.6 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. పట్టణాల్లో అయితే పరిస్థితి హై లెవెల్! ప్రతి 100 మందికి 116 కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఒక మనిషికి రెండు సిమ్‌లు, మూడు ఓటీపీలు, నాలుగు వైఫై పాస్వర్డులు కామన్ అయిపోయాయి! కానీ గ్రామాల్లో అది 47.6 శాతం మాత్రమే. అయినా మొత్తం యూజర్లలో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉంటున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే, 86 శాతం ఇళ్లలో ఇంటర్నెట్ ఉంది, కానీ కంప్యూటర్లు మాత్రం 10 శాతం కూడా లేవు! అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్‌కి ల్యాప్టాప్స్ కాదు, చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్సే అసలైన కాలేజ్, క్లాస్రూమ్, లైబ్రరీ, ఎగ్జామ్ హాల్ అన్నీ మొబైలే అయిపోయింది! అందుకే, ఆడుతూ, పాడుతూ విద్యార్థులు చదువు సాగించేలా డిజిటల్ స్కూల్ కూడా గేమ్ బేస్డ్ లర్నింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాయి.డిజిటల్ గురువులుటీచర్ చెప్పింది అర్థం కాకపోతే, అడిగే ధైర్యం లేనివారందరూ, డౌట్‌ను కూడా నోట్‌బుక్‌లో మడిచేసుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. మరికొంతమంది తోటి విద్యార్థి సాయంతో తీర్చుకునేవారు. ఇప్పుడు, పరిస్థితి పూర్తిగా రివర్స్! అర్థం కాలేదా? వీడియోని పాజ్ చేసి, రివైండ్ చేసి ఇంకోసారి చూడొచ్చు? ఇంకా క్లియర్‌గా కావాలంటే, 0.5 స్పీడ్‌లో స్లో మోషన్ లో కూడా చూడొచ్చు. చదువు యూట్యూబ్ వీడియోలాగే చాలా ఈజీగా మారిపోయింది. ఇలా యాప్‌లో కనిపించే ప్రతి వీడియో, ప్రతి యానిమేషన్ , ప్రతి నోటిఫికేషన్ కూడా ఒక చిన్న డిజిటల్ గురువుగా మారిపోయింది.గేమ్‌లో గెలుపు, చదువు కోసమే!ఒకప్పుడు ‘మొబైల్ గేమ్స్ ఆడొద్దు, చదువు పాడవుతుంది!’ అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు, అదే గేమ్స్ పిల్లలకు మ్యాథ్స్, కోడింగ్, సైన్స్ కూడా నేర్పిస్తున్నాయి! అంటూ మొబైల్స్ చేతికి ఇస్తున్నారు. అవును చదువు ఇప్పుడు బోరింగ్ బ్లాక్‌బోర్డ్ నుంచి బయటికి వచ్చి, ‘నెక్ట్స్ లెవెల్ అన్ లాక్’ చేసే గేమ్‌లా మారిపోయింది. ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెబితే పాయింట్లు, మరో లెసన్ పూర్తి చేస్తే బ్యాడ్జీలు, రోజూ లాగిన్ అయితే స్టికర్స్ ఇలా చదువు కూడా ఇప్పుడు వీడియో గేమ్ ఫీల్ ఇస్తోంది. అందుకే పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటూ గేమ్ ఆడినట్టే, ఇప్పుడు ‘ఇంకో క్విజ్’ అంటూ చదువులో కూడా మునిగిపోతున్నారు! ముఖ్యంగా మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు ఇప్పుడు భయం కాదు, మొబైల్లో ఫన్ చాలెంజెస్లా మారిపోయాయి. ఒకప్పుడు మార్కుల కోసం చదివిన పిల్లలు, ఇప్పుడు లీడర్‌బోర్డ్‌లో టాప్ రావడానికి చదువుతున్నారు!ఫ్రీగా ఇంత చదువా?ఒక్క మొబైల్లో డేటా ఆన్ చేస్తే చాలు– ఇంజినీరింగ్ నుంచి మెడిసి న్ వరకు, కోడింగ్ నుంచి విదేశీ భాషల వరకు, మాక్ టెస్టుల నుంచి మాస్టర్ క్లాస్‌ల వరకు అన్నీ స్క్రీన్ పై క్యూలో నిల్చుంటున్నాయి. అంతేకాదు, ఐఐటీ ప్రొఫెసర్ కూడా ‘సబ్‌స్క్రైబ్’ బటన్ దూరంలోనే ఉంటున్నారు. ‘ఇంత ఖరీదైన నాలెడ్జ్‌ని నిజంగానే ఫ్రీగా ఇస్తారా?!’ అని స్టూడెంట్స్ షాక్ అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన చాలా విద్యాసంస్థలు, ఇదే విధానాన్ని ఫాలో అయ్యి, క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక్కడే మోసాలు కూడా మొదలయ్యాయి.క్లిక్ చేస్తే క్లాస్.. తర్వాత షాక్ !ప్రతి ‘బై నౌ’ బటన్ వెనుక నిజంగా నాలెడ్జ్ ఉంటుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. కొన్నిసార్లు ‘లైవ్ క్లాసులు’ అని చెప్పి పాత వీడియోలు చూపిస్తారు. ‘ఫ్రీ ట్రయల్’ అంటూ మొదలై, తర్వాత సైలెంట్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇలా చదువు పేరుతో స్క్రీన్ వెనుక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సిలబస్ చదవడం కంటే, ముందు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ‘క్లిక్’ను జాగ్రత్తగా చదవాల్సిన పరిస్థితి.ప్రభుత్వ డిజిటల్ దిగ్గజాల దూకుడు! ⇒ ప్రైవేట్ సంస్థలకంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ విద్యా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు మరింత ఉపయోగకరంగా దూసుకు పోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా..దీక్ష: ఇప్పటికే 2 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. 36 భారతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉండటం దీని అతిపెద్ద బలం.స్వయం: 4,400కిపైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 5.8 కోట్లకు పైగా ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. అలాగే, 52 లక్షల మందికి పైగా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేశారు.ఎన్ పీటీఈఎల్: ఐఐటీలు, ఐఐఎంల కోర్సులు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ పైనే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఇందులో 3.79 కోట్లకు పైగా కోర్స్ ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. చాలామంది దీన్ని ‘ఎడ్యుకేషన్ నెట్‌ఫ్లిక్స్’గా కూడా చూస్తున్నారు.స్వయం ప్రభ: ఇంటర్నెట్ లేకున్నా చదువు ఆగకూడదనే ఉద్దేశంతో, 48 ప్రత్యేక టీవీ చానెల్స్ ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఇక్కడ టీవీ కూడా టీచర్ అయ్యింది.డిజిటల్ స్కూల్ vs రియాల్టీ స్కూల్.. డిజిటల్ స్కూల్, రియాల్టీ స్కూల్ అనే ఈ రెండు ప్రపంచాల్లో స్టూడెంట్స్‌కి అసలు ఏది బెస్ట్? ఏది ఈజీ? ఏది నిజంగా ప్రభావం చూపుతోంది? అసలు ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ చూద్దాం.. స్క్రీన్ క్లాస్రూమ్⇒ వీడియోలను పాజ్, రివైండ్, స్లో మోషన్ లో కూడా చూడొచ్చు.⇒ ఇంట్లో నుంచే ఐఐటీ, టాప్ ఫ్యాకల్టీ క్లాసులు అటెండ్ కావచ్చు.⇒ టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.⇒ ప్రెజెంటేషన్స్ , క్విజ్లు, డిజిటల్ నోట్స్ ఈజీగా అందుబాటులో ఉంటాయి.⇒ సిగ్గు పడే స్టూడెంట్స్ కూడా చాట్‌బాక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటారు.⇒ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చిన్న యూనివర్సిటీలా మారిపోయింది.⇒ ఈజీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, ఆన్లైన్ మోసాలకు బలయ్యే అవకాశాలు ఎక్కువ.⇒ క్లాస్‌తో పాటు రీల్స్, నోటిఫికేషన్స్ కూడా పోటీ పడుతుంటాయి.⇒ ‘మైక్ ఆఫ్.. కెమెరా ఆఫ్.. అటెన్షన్ కూడా ఆఫ్!’ అనే సీన్ కామన్ .నిజమైన క్లాస్రూమ్⇒ టీచర్‌తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది.⇒ డౌట్స్ వెంటనే క్లియర్ చేసుకోవచ్చు.⇒ కాన్సెప్ట్‌లు మరింత బాగా అర్థమవుతాయి.⇒ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి.⇒ ఫిజికల్ యాక్టివిటీ, ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్ , గ్రూప్ లెర్నింగ్ ఎక్కువ.⇒ టీచర్లు స్టూడెంట్స్ అటెన్షన్ ను సులభంగా గమనించగలరు.⇒ చదువుతో పాటు క్లాస్రూమ్ మెమరీస్ కూడా క్రియేట్ అవుతాయి.⇒ బెంచ్ ఫ్రెండ్స్, చిన్న నవ్వులు, హోంవర్క్ టెన్షన్స్ ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తాయి.⇒ టైమ్, ట్రావెల్, ఫీజుల ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు.ఎగ్జామ్‌కి డెమో వెర్షన్ !పోటీ పరీక్షలు అంటే ఒకప్పుడు టెన్షన్ , భయం, రాత్రంతా నిద్రలేని ప్రిపరేషన్ . కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది! అసలు పరీక్షకు వెళ్లే ముందే, స్టూడెంట్స్‌కి ‘ట్రైలర్ షో’ చూసే చాన్స్ వచ్చేసింది. ఫ్రీ మాక్ టెస్టులు, ప్రాక్టీస్ పేపర్లు, టైమ్బేస్డ్ ఎగ్జామ్‌లు అన్నీ ఇప్పుడు ఒక క్లిక్ దూరంలోనే ఉన్నాయి. అంటే అసలు పరీక్ష హాల్లో కూర్చోకముందే, ‘ఎగ్జామ్ ఎలా ఉంటుంది?’ అన్న ఫీలింగ్‌ను ముందుగానే అనుభవించొచ్చు. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్‌కి టెన్షన్ కంటే, ‘ర్యాంక్ స్క్రీన్ షాట్‌ను స్టేటస్‌లో ఎప్పుడు పెట్టాలి?’ అన్న ఆసక్తే ఎక్కువైపోతోంది!బిలియన్ డాలర్ల బిజినెస్!గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ మార్కెట్⇒ ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది.⇒ ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా.ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ మార్కెట్ ఇప్పుడు భారీ బిజినెస్‌గా మారిపోయింది. మార్కెట్ రిపోర్టుల ప్రకారం, మొత్తం ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా. అంటే, ఒక్కో యూజర్ నుంచి సగటున 69 డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు చదువులో ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, చౌకైన డేటా అందుబాటులోకి రావడం, ప్రభుత్వ డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కంపెనీలు భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి.చదువు కూడా కన్జ్యూమర్ ప్రొడక్టే! చదువు ‘కొనడం’ కూడా ఇప్పుడు ఒక అధికారిక కొనుగోలు! అంటే మీరు డిజిటల్ లెర్నింగ్ యాప్, ఎగ్జామ్ సబ్స్క్రిప్షన్ , కోడింగ్ కోర్స్ లేదా ఆన్ లైన్ క్లాస్ కోసం డబ్బులు చెల్లిస్తే, ఆ ప్లాట్‌ఫారమ్‌లు కూడా వినియోగదారుల చట్టాల పరిధిలోకి వస్తాయి. భారతదేశంలోని వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా జవాబుదారులే. అందుకే సీసీపీఏ (సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) ఎడ్టెక్ కంపెనీలపై ప్రత్యేక గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. అంతేకాదు, స్టూడెంట్స్‌కి కూడా కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయి.డిజిటల్ మోసాలకు చెక్ పెట్టే స్మార్ట్ స్టెప్స్!డిజిటల్ ప్రపంచంలో బటన్ నొక్కే ముందు ఒక్కసారి బ్రెయిన్ ను కూడా రిఫ్రెష్ చేయాలి. ఆన్ లైన్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండేందుకు ఈ చిన్న సర్వైవల్ గైడ్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకవేళ మోసపోతే, అందులో నుంచి ఇలా బయటపడోచ్చు.కస్టమర్ కేర్‌కు కాల్ చేయండిముందుగా యాప్, వెబ్సైట్ లేదా కోచింగ్ సంస్థకు సమస్యను క్లియర్‌గా చెప్పండి. ఆర్డర్ నంబర్, ఇన్వాయిస్ పంపండి. చాలాసార్లు ఒక స్ట్రాంగ్ మెయిల్‌కే రీఫండ్ వచ్చేస్తుంది!ముందుగా ప్రూఫ్ సేవ్ చేయండిడిజిటల్ ప్రపంచంలో స్క్రీన్ షాట్ కూడా ఒక ఆయుధమే! బిల్లులు, మెయిల్స్, చాట్లు, స్క్రీన్ షాట్లు అన్నీ వెంటనే సేవ్ చేసుకోండి. ‘ప్రూఫ్’ ఉంటేనే మీ ఫిర్యాదుకు పవర్ వస్తుంది.ట్రయల్ ట్రాప్‌ను చెక్ చేయండి‘ఫ్రీ’ అని మొదలై, తర్వాత సైలెంట్‌గా డబ్బులు కట్ అవ్వడం కామన్ ! ఆటో రెన్యూవల్ ఆన్ లో ఉందో లేదో ముందే చూసుకోండి.టైమర్ చూసి టెన్షన్ పడకండి‘ఇంకా 2 సీట్లు మాత్రమే!’, ‘ఆఫర్ ఇంకో 5 నిమిషాలే!’ ఇవి చాలాసార్లు మార్కెటింగ్ డ్రామాలే! వెంటనే క్లిక్ చేయకుండా, రెండు నిమిషాలు ఆలోచించండి.చిన్న అక్షరాలు కూడా చదవండిషరతులు వర్తిస్తాయి అని కనిపించనంత చిన్నగా చివర్లో రాసిన వాటిని కూడా క్షుణ్ణంగా చూడాలి. లేకుంటే, రూ.99 అని కనిపించే కోర్స్, చివరికి రూ.499 బిల్లుగా మారొచ్చు! ట్యాక్స్‌లు, ప్లాట్‌ఫామ్ ఫీజులు ముందే చెక్ చేయండి.స్పందన లేకపోతే.. 1915కంపెనీ స్పందించకపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ 1915కు ఫిర్యాదు చేయండి. డిజిటల్ మోసాల్లో ఇది మీ బ్యాకప్ బటన్ లాంటిది!మారుతున్న కాలంతో పాటు మనం మారడంలో తప్పు లేదు. కాని, అతిగా అందుబాటులో ఉందని ‘రేపటి నుంచి చదువుతా’ అనే అలసత్వాన్ని మాత్రం ఆఫ్ చేయాలి! అప్పుడు చదువు ఎలా చదివినా చదువే అవుతోంది. స్క్రీన్ ఇప్పుడు గురువు అయినప్పటికీ, చదవాలా? స్క్రోల్ చేయాలా? అన్న నిర్ణయం మాత్రం ఇంకా విద్యార్థి చేతిలోనే ఉంది.కొండి దీపిక -
కనీసం.. సారీ చెప్పాలని అనిపించలేదా?
నీట్–యూజీ అనేది ఐదో తరగతి లేదా పదో తరగతి వంటి సాధారణ పరీక్ష కానేకాదు. ఉన్నత చదువుల భవితవ్యాన్ని నిర్దేశించే అత్యంత కీలక ప్రవేశ పరీక్ష. దాని కోసం లక్షలాది మంది విద్యార్థులు నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివి సంసిద్ధమవుతారు. శాయశక్తులా కృషిచేసి పరీక్షరాశాక వారం పది రోజులకే అది రద్దయిందని ప్రకటిస్తే అన్ని రోజులు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే. అలా పన్నీరుగా మారుతున్న పరీక్షార్థుల శ్రమ నుంచే ఆగ్రహాగ్ని పుట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండిపోయిన ఈ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నిస్తూ నీట్–యూజీ అభ్యర్థిని ఆద్రికా బాజ్పేయీ ఎన్టీఏకు ఒక లేఖ రాశారు. ఇప్పుడా లేఖ ఆన్లైన్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ లేఖ పూర్తిపాఠం ఇదీ.. ‘‘నాకు 18 ఏళ్లు. ఈఏడాది నీట్–యూజీ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాశా. 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే దీని కోసం ప్రిపరేషన్ మొదలెట్టా. సోషల్‌మీడియా ఖాతాల జోలికి పోలేదు. స్నేహితులతో కబుర్లు కట్టిపెట్టా. బంధువుల పార్టీలకు వెళ్లడం మానేశా. నీట్పరీక్షపైనే పూర్తిగా దృష్టిపెట్టి తోబుట్టువులతోనూ పెద్దగా మాట్లాడటం మానేశా. ఇన్ని త్యాగాలు ఎందుకు చేశానో తెలుసా. డాక్టర్ కావడం నా కల. వైద్యవృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నా. పరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ నాలో ఆందోళన ఎగసింది. పరీక్షకు పది రోజుల ముందు ఎన్టీఏ ఒక హెచ్చరిక చేసింది. ఇది స్కూల్ పరీక్షవంటి ఆషామాషీ పరీక్షకాదు జాతీయస్థాయిలో అభ్యర్థులను వడబోసే భారీ క్రతువు అని ప్రకటించింది. నీట్–యూజీ అనేది స్కూల్పరీక్ష కాదు. కనీసం స్కూల్లో ప్రశ్నపత్రం లీకేజీ అనేది ఎక్కడా వినలేదు చూడలేదు. మాకు మాత్రం మీరు సుద్దులు చెబుతారు. అంకితభావంలో మేం మీకంటే 10 రెట్లు ఎక్కువ అని బీరాలు పలికారు. ఇది నిజంగా మీరు సిగ్గుపడాల్సిన విషయం. పరీక్షకేంద్రంలోకి అడుగుపెట్టేముందు మమ్మల్ని పలు రకాలుగా చెక్చేస్తారు. ఆ డ్రెస్ రకం అనుమతిలేదు ఈ షూ వేసుకోవద్దు ఈ హెయిర్‌బ్యాండ్, స్మార్ట్‌వాచ్ పెట్టుకోవద్దు అని సవాలక్ష షరతులు పెడతారు. జుట్టు ముడివేసుకుని అంతా విప్పేసి వేళ్లు దూర్చి మరీ చెక్‌చేశారు. టీ–షర్ట్ బటన్లనూ కత్తిరించారు, ప్యాంట్లకున్న జేబులనూ కత్తిరించారు. ఇక పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సంగతి చెప్పనక్కర్లేదు. ఎగ్జామ్‌హాల్‌లోకి కనీసం ట్రాన్స్పరెంట్గా ఉండే నీళ్లసీసాను కూడా అనుమతించలేదు. మేమేమైనా పేపర్ లీక్ చేసే ముఠా సభ్యులమా? మా కలలను సాకారం చేసుకునేందుకు మీరు పెట్టే ఇలాంటి ఎన్నో కండీషన్లనూ మేం భరించాం. అయినా ఇంతటి తనిఖీలుచూశాక ఇక పేపర్ లీక్ కాదు అనే భరోసాతో పరీక్ష హాల్లోకి వెళ్లా. ఇంతాచేసి అక్కడికెళ్లాక మేం ఎగ్జామ్‌లో ప్రశ్నలతో కంటే బయటి వ్యవస్థతోనే అతిపెద్ద యుద్ధం చేయాల్సి వస్తోంది. వ్యవస్థలో ఒకరిద్దరు తప్పుచేసినా మొత్తం ఎగ్జామినేషన్ వ్యవస్థ అభాసుపాలవుతోంది. ఇక్కడితో ఇది ఆగట్లేదు. ఎన్టీఏను ట్విట్టర్ ఖాతాలో లక్షలాది మంది విద్యార్థులు అడిగే సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తోంది. అయినాసరే కనీసం ఈసారి అయినా ఇలా జరగదేమోననే ఆశతో పరీక్షరాశా. మళ్లీ మా నమ్మకాన్ని ఎన్టీఏ వమ్ముచేసింది. జాగ్రత్తలో మాకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నామని చెప్పే ఎన్టీఏ ఇప్పుడు మమ్మల్ని నిరాశ లోయలో నెట్టేసి చేతులు దులిపేసుకుంటోంది. అయినాసరే వీటన్నింటినీ భరిస్తూ మేం మరోసారి పుస్తకాల పురుగులుగా మారేందుకు సిద్ధపడతాం. మా కలల సాకారం కోసం కష్టపడక తప్పదు. కానీ తప్పుచేసిన మీకు కనీసం సారీ అయినా చెప్పాలని అనిపించలేదా? ఇంత జరిగాక కూడా అభ్యర్థులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలనే స్పృహ మీకు ఎప్పుడొస్తుంది? జాతీయస్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి పరీక్షపేపర్ లీక్ అయితే బాధ్యతాయుత స్థాయిలో ఉన్న మీ నుంచి మేం సారీ ఆశించకూడదా?. మాకెన్ని కలలున్నాయో మీరు కనీసం ఒక్కసారైనా ఊహించారా? పరీక్ష పూర్తయ్యాక తోబుట్టువులతో హాయిగా ఉండొచ్చని సంబరపడ్డాం. రెండ్రోజుల్లోనే ఆకాశం విరిగిపడినట్లు దుర్వార్త మోసుకొచ్చారు. మళ్లీ పరీక్ష పెడతారని తెల్సిన క్షణాన వరదలో ఇల్లు మొత్తం కొట్టుకుపోయినంత విషాదం మాలో అలుముకుంది. మా డాక్టర్ కలల సౌధాన్ని కూల్చేశారు. అప్పుడు 11 ఏళ్ల నా చెల్లి నాతో ఒకమాట చెప్పింది. ‘‘అక్కా అతిగా ఆశలుపెట్టుకోకు. దేశంలో మన భవిష్యత్తు గురించి ఎవరికీ పట్టదు’’అన్న మాటలు నా మనసుని మెలిపెట్టాయి. చెల్లి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. ఇంత జరిగినా వ్యవస్థ మనతోనే ఉంది అని చెల్లికి ఎలా భరోసా ఇవ్వాలి? ఇలాంటి వ్యవస్థలో మేం బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా? అభద్రతాభావం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. భారత్‌లో ఉన్నత విద్యనభ్యసించడం తమకు ఇష్టంలేదు అని తోబుట్టువులు చెప్పారు. ఇలాంటి తరుణంలో ‘ఈ దేశంలో ఉన్నందుకు మేమెంతో గర్విస్తున్నాం’అని ఎలా చెప్పగలను? ఒకవేళ సరిహద్దు కంచెలు లేకపోయినాసరే నేను ఈ దేశంలోనే ఉండిపోతా అని చెప్పగలనా?. చెప్పలేనేమో. ఎందుకంటే నిబంధనలు అనేవి కాగితం పులులుగా మారిపోయాయి. మీపట్ల మా నమ్మకం ప్రతిసారీ వమ్ము అవుతోంది. కష్టపడి చదివిన చదువుకు, ప్రిపరేషన్‌కు విలువ ఉన్న చోటే ఉండాలనుకుంటున్నాను. ఇట్లు, ఎంతో అసంతృప్తి చెందిన మీ పరీక్షార్థి’’.–సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ బిడ్డను బడికి పంపే వరకు ఇక్కడే ఉంటా
తిరుపతి జిల్లా: మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే ఉంటానని ఎంఈఓ రవీంద్రనాథ్ విద్యార్థుల తల్లిదండ్రుల తెలిపారు. మండలంలోని పల్లమాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి ప్రత్యేక తరగతుల జరుగుతున్నాయి. 32 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా ఐదుగురు మాత్రమే సప్లమెంటరీ తరగతులకు హాజరవుతున్నారు. ఇది తెలుసుకున్న ఎంఈఓ రవీంద్రనాథ్ శుక్రవారం పల్లమాల, పార్లపల్లి, పచ్ఛాలమ్మ కాలనీలో పదో తరగతి ఫెయిల్ విద్యార్థులను సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు పంపించాలని ఇళ్లకు వెళ్లారు. విద్యార్థులను సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు పంపాలని ఇళ్లకు వెళ్లిన ఎంఈఓ తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. మా బిడ్డను మేము తీసుకుని వస్తాం మీరు వెళ్లండి సార్ అని తల్లిదండ్రులు తెలిపారు. ఎంఈఓ మీ బిడ్డను బడికి పంపే వరకు మీ ఇంటి వద్దనే కుర్చి వేసుకుని కూర్చుంటానన్నారు. ఇంటి వద్ద నుంచి ఎంఈఓ కదలకపోవడంతో చివరకు తల్లిదండ్రులకు బడికి పంపారు. 12 మంది విద్యార్థులను ఎంఈఓ పాఠశాలకు తీసుకొచ్చారు. అయితే ప్రధానోపాధ్యాయురాలు చేయాల్సిన పనిని ఎంఈఓ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు విధులకు రావడం లేదని, ఆమె పట్టించుకోక పోవడంతోనే విద్యార్థులకు సప్లమెంటరీ ప్రత్యేక తరగతులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
విద్యార్థి దశలో భక్తి కూడా ప్రధానమే..!
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
ఐఐటీ భువనేశ్వర్‌లో ఏపీ విద్యార్థి మృతి
భువనేశ్వర్: ఐఐటీ భువనేశ్వర్ క్యాంపస్‌లో ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి జారి పడి పీహెచ్డీ విద్యార్థి మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్యాంపస్‌లో విషాదం అలముకుంది. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన తనికొండ నిశాంత్ కుమార్‌గా గుర్తించారు. ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు ప్రాంతానికి చెందిన వాడు. నిశాంత్ హాస్టల్ బ్రహ్మపుత్ర హాల్ ఏ బ్లాక్ 6వ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి అధికారులకు తెలియజేయడంతో తక్షణమే క్యాంపస్‌లోని సంజీవన్ ఆస్పత్రికి తరలించారు.అత్యవసర వైద్యం చేసి ఉన్నత చికిత్స కోసం ఐఐటీ అంబులెన్స్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం పరీక్షించి విద్యార్థి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించింది. క్యాంపస్ అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు జట్నీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పంచనామా ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. -
పెళ్లి భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!
అనంతపురం జిల్లా: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
ధర లేకుండా టెండర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్, హాస్టల్ విద్యార్థులకు విద్యా సంవత్సరంలో అవసరమయ్యే వస్తువులను కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ (డీపీసీ)ల ద్వారా టెండర్లు ఖరారు చేయగా.. ఈసారి రాష్ట్రస్థాయిలో ఒకే గొడుగు కింద కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నాణ్యత, సమయపాలన, సులభతర పర్యవేక్షణలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఈ టెండర్ల ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేస్తూ ఎస్సీ గురుకుల సొసైటీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.అయితే ఎలాంటి ధరను ప్రకటించకుండా టెండర్లు పిలిచిన అధికారులు..గత నెల 17వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. ఇప్పటికే సాంకేతిక బిడ్లను పరిశీలించి అర్హత పొందిన కాంట్రాక్టర్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఆర్థిక బిడ్‌లో కాంట్రాక్టర్లు పేర్కొన్న ధరలను ప్రస్తుతం పీఎంయూ సమీక్షిస్తోంది. సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంయూ సభ్యులైన సంక్షేమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, విద్యాశాఖ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ కసరత్తు కొనసాగుతోంది. అతిత్వరలో టెండర్లు ఖరారు చేసి, న్యాయశాఖ అనుమతి తీసుకున్న తర్వాత కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ధర ప్రకటించకుడా టెండర్లు పిలవడం చర్చనీయాంశమయ్యింది. ఏయే విద్యాసంస్థలు.. కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో దాదాపు పది రకాల విద్యాసంస్థలున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎంఆర్ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఆర్‌ఈఐఎస్), కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు వీటిలో ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 9,24,107 మంది విద్యార్థులున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏయే వస్తువులు... కామన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, సాక్స్, బ్యాగ్, నోటు పుస్తకాలు, ట్రంకు పెట్టెలు, రగ్గులు, దుప్పట్లు, మ్యాట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్, ట్రాలీబ్యాగ్స్, ఐడీ కార్డు, స్టేషనరీ కిట్ తదితర 22 రకాల వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. ధర ఏది మరి? ఆయా వస్తువుల నాణ్యత, పరిమాణం తదితర పూర్తి వివరాలు, పక్కా కొలతలతో కూడిన డిమాండ్‌ను టెండర్లో పొందుపర్చారు. కానీ ఆయా వస్తువులకు సంబంధించి కనీస ధరను మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. సాధారణంగా టెండర్లో ఒక ధరను నిర్దేశించి అందుకు అనుగుణంగా బిడ్లు స్వీకరిస్తారు. తర్వాత అందులో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు. కానీ అధికారులు భారీఎత్తున వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. టెండర్ పత్రాల్లో ఎక్కడా ప్రాథమిక ధరలు స్పష్టం చేయలేదు. దీన్ని ఆసరా చేసుకున్న కాంట్రాక్టర్లు ఏకమై ఇష్టమొచి్చన ధరలతో బిడ్లు సమర్పించారనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక కాంట్రాక్టర్లకు చెక్ గతంలో డీపీసీల కాంట్రాక్టర్లను ఎంపిక చేసినప్పుడు దళితులు, గిరిజనులకు 25 శాతం కోటా ఉండేది. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు ఇది ఒక మంచి అవకాశంగా ఉండేది. కానీ ప్రస్తుత విధానంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకించి రిజర్వేషన్లను ప్రస్తావించలేదు. కానీ టెండరు ప్రక్రియలో పాల్గొనే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సరి్టఫికెట్ (ఆర్థిక బలనిరూపణ) సమరి్పంచాలనే నిబంధన విధించారు. నోట్‌బుక్స్ టెండర్లో పాల్గొనే కాంట్రాక్టర్ రూ.40 కోట్ల, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ల కాంట్రాక్టర్ రూ.25 కోట్ల మేర, స్కూల్‌బ్యాగ్, షూ, సాక్స్, టై, బెల్ట్ పంపిణీ చేసే కాంట్రాక్టర్ రూ.50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ సమరి్పంచాలి. అలాగే ఐడీకార్డ్ హోల్డర్, స్టేషనరీ కిట్ కాంట్రాక్టులో రూ.20 కోట్ల మేర, ట్రాలీ బ్యాగ్ కాంట్రాక్టుకు సంబంధించి రూ.2 కోట్లు, ట్రంక్‌బాక్స్ కాంట్రాక్టుకు సంబంధించి రూ.10 కోట్ల మేర, యూనిఫామ్ క్లాత్ కాంట్రాక్టులో రూ.25 కోట్ల సాల్వెన్సీ సరి్టఫికెట్ సమరి్పంచాలి. ఇలా ప్రతి కేటగిరీలోనూ కోట్ల రూపాయలమేర కమర్షియల్ బ్యాంకుల నుంచి సాల్వెన్సీ సరి్టఫికెట్లు సమర్పించడం ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు సాధ్యమయ్యే విషయం కాదు. మరోవైపు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈలకు సైతం అత్యంత కష్టసాధ్యం కావడంతో వీరంతా ఈ కామన్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టుకు దూరంగా ఉండిపోయారు. వస్తువుల ధరలకు సంబంధించి వివరణ కోరేందుకు పీఎంయూలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ సెక్రెటరీని సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
మచిలీపట్నం: బాలుడి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో 9వ తరగతి విద్యార్ధి కిడ్నాప్ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. విద్యార్ధి కిడ్నాప్ వ్యవహారమంతా డ్రామాగా పోలీసులు తేల్చేశారు. చదువుపై ఆసక్తి లేక... ఇంట్లో చెప్పలేక.. భయంతో ఇంటి నుంచి విద్యార్థి వచ్చేశాడు. సైకిల్‌పై ట్యూషన్‌కు బయలుదేరి సైకిల్‌ను మచిలీపట్నం బస్టాండ్‌లో పెట్టిన ఆ బాలుడు.. బస్ ఎక్కి పెడన వెళ్లాడు. అక్కడ నుంచి రైలులో విజయవాడకు వచ్చాడు.విజయవాడ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురైన బాలుడు.. నిజం చెబితే ఏం తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో బాలుడు కిడ్నాప్ కథ అల్లాడు. ట్యూషన్‌కు వెళ్తుంటే తనను బైక్‌పై ఇద్దరు కిడ్నాప్ చేశారంటూ ఆ బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఆ బాలుడు ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు.బంధువుల సాయంతో తల్లిదండ్రులు.. బాలుడిని మచిలీపట్నం తీసుకొచ్చారు. ఏం జరిగిందో ప్రశ్నించడంతో పోలీసుల ఎదుట బాలుడు నిజం ఒప్పుకున్నాడు. బాలుడు, తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. పిల్లలను నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని పోలీసులు సూచించారు. -
NEET 2026: ఈ తప్పులు అస్సలు చేయకండి!
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2026) పరీక్ష మే మూడవ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల లోపు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకొని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. అందుకే ఎలాంటి ఆలస్యం చేయకూడదు. అడ్మిట్ కార్డు లేకుండా ఎవరినీ పరీక్షకు అనుమతించరు. అడ్మిట్ కార్డుతో పాటు పాన్ లేదా ఓటర్ ఐడి లాంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును ఖచ్చితంగా వెంట తీసుకురావాలి.డ్రెస్ కోడ్ రూల్స్నీట్ అభ్యర్థులు సరైన డ్రెస్ కోడ్ పాటించడం తప్పనిసరి. అబ్బాయిలు ప్యాంట్లు, ట్రౌజర్లు లేదా జీన్స్ మాత్రమే ధరించాలి. బూట్లకు బదులుగా చెప్పులు వేసుకోవడం మంచిది. టోపీలు, మఫ్లర్లు, తలను కప్పే వస్త్రాలు ధరించకూడదు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే, వారు సింపుల్ లెగ్గింగ్స్ లేదా ట్రౌజర్లు వేసుకోవాలి. వీరు కూడా సాధారణ శాండల్స్ వేసుకోవాలి. చేతులకు మెహందీ పెట్టుకోకూడదు. పరీక్షా కేంద్రం లోపలికి హ్యాండ్‌బ్యాగులు, పర్సులు తీసుకురాకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, పరీక్షకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందిపరీక్షా కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, పేజర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. నిషేధిత వస్తువులను భద్రపరచడానికి పరీక్షా కేంద్రంలో ఎలాంటి లాకర్ సౌకర్యం ఉండదు. ఎవరైనా ఇటువంటివి తెస్తే, వాటిని తమ సొంత రిస్క్ మీద బయట దాచుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం విద్యార్థులు నీట్ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించి, తాజా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: షాక్ మీద షాక్: ఫలితాలను తిరగతోడిన సట్టా బజార్ -
87కు బదులు 47 మార్కులు
బెంగళూరు: పగలూ రాత్రీ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న ఒక పేద విద్యార్థిని కలలపై మూల్యాంకనం పొరపాటు నీళ్లు చల్లింది. చిక్కనాయకనహళ్లి తాలూకా, మేలనహళ్లిలోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కె.అంకిత మూల్యాంకనంలో మాస్టార్ల పొరపాటు వల్ల అన్యాయానికి గురైంది. అంకిత తండ్రి గతంలో మరణించాడు, తల్లి గార్మెంట్స్‌లో పనిచేస్తూ చదివిస్తోంది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్ఎల్సీ ఫలితాలలో అంకితకు కన్నడలో 47 మార్కులు వచ్చాయి. అనుమానంతో తనిఖీ చేయగా ఆమె కన్నడలో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యార్థిని, పరీక్ష కూడా బాగా రాసింది. దీంతో అనుమానం వచ్చి ఆమె పాఠశాల ఉపాధ్యాయులు, మార్కుల షీటును పరిశీలించారు. అందులో తేడా కనిపించింది. అన్ని సమాధానాలకు వచ్చిన మార్కులను కలిపితే, మొత్తం 87 మార్కులు ఉన్నాయి, కానీ మూల్యాంకనం చేసిన మాస్టారు ఎవరో కానీ 47 అని నమోదు చేశారు. ఈ పొరపాటు వల్ల తన కూతురికి అన్యాయం జరిగిందని, సరిచేయాలని తల్లి లలితమ్మ కోరింది. తప్పు చేసినవారికి శిక్ష పడాలని డిమాండ్ చేసింది. -
విద్యార్థుల జీవితాలకు స్పాట్
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): అనంతపురంలో హనీట్రాప్ వ్యవహారం సంచలనం సృష్టించగా, గుంటూరులో ఒక స్పా సెంటర్ అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. బాధితులు సాక్షికి తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాలోని ఒక యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి హాస్టల్ ఫీజు కోసం తల్లిదండ్రుల నుంచి రూ.28 వేల నగదు తీసుకున్నాడు. అయితే ఆ విద్యార్థి ఫోన్‌తో ‘పేమెంట్ సంబంధిత’ కనెక్షన్ ఉన్న అతని తల్లి ఫోన్‌కు ఈనెల 24న మూడు మెసేజ్‌లు వచ్చాయి. ఒక స్పా సెంటర్లో మూడు దఫాల్లో రూ.28 వేలు చెల్లించినట్లు సూచిస్తున్న ఈ మెసేజ్‌ల గురించి తల్లి, కుటుంబ సభ్యులు విద్యార్థిని ప్రశ్నించగా, గుంటూరు బ్రాడీపేటలోని 4వ లైన్లో ఉన్న స్పా సెంటర్లో మసాజ్ కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లిన తన నుంచి ఈ డబ్బు వసూలు చేసినట్లు చెప్పాడు. దీంతో ఈ వ్యవహారం గుట్టురట్టు చేయడానికి విద్యార్థి మేనమామ, విశ్రాంత ఆర్మీ జవాన్ రంగంలోకి దిగి ‘స్టింగ్ ఆపరేషన్’కు శ్రీకారం చుట్టారు. కస్టమర్ అవతారం ఎత్తి విద్యార్థి పేర్కొన్న స్పా సెంటర్‌కు వెళ్లారు. మసాజ్‌కు వారు చెప్పిన రూ.3 వేలు చెల్లించాడు. లోపలగదిలోకి వెళ్ళడంతో ఓ అమ్మాయి మరో రూ.7 వేలు చెల్లించమని అడగింది. జవాన్ చెల్లించగానే ఆ యువతి తన శరీరంపై ఉన్న దుస్తులు తీయడం ప్రారంభించింది. దీంతో బయటకు వచ్చిన జవాన్, ఇక్కడ జరుగుతోంది ఏమిటంటూ... రిసెప్షన్లో ఉన్న స్పా సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించారు. దీంతో తప్పయిపోయింది.. క్షమించమని నిర్వాహకుడు వేడుకున్నాడు. ఈ సందర్భంలో జవాను స్పా సెంటర్ ఉచ్చులోకి దిగిన ముగ్గురు విద్యార్థుల సంగతీ ప్రస్తావించారు. దీంతో తప్పయిదంటూ.. సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద వేచివుండాలని, తాము తీసుకున్న డబ్బు అంతా తిరిగి ఇచ్చేస్తానని నిర్వాహకుడు చెప్పాడు.దీంతో కారులో బయలుదేరి వెళుతున్న ఆర్మీ జవాన్‌ను ఇద్దరు పోలీసులు, స్పా సెంటర్ నిర్వాహకుడు వెంబడిస్తూ వచ్చారు. స్పా సెంటర్ నిర్వాహకుడి ఫోన్ నుంచి జవాన్‌కు వీడియో కాల్ చేసి ‘మేము సైబర్ పోలీసులం. బ్రాడిపేటలోని స్పా సెంటర్లో వీడియోలు తీశారని ఓ యువతి మీపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అరండల్ పేటకు పంపుతున్నాం. అక్కడికి వెళ్లండి’ అని చెప్పారు. దీనికి స్పందించిన జవాన్, ‘అరండల్ పేట సీఐ అనుమతితోనే తాము ఈ పని చేస్తున్నట్లు స్పా నిర్వాహకుడు చెబుతున్నాడు. అలాంటప్పుడు అరండల్‌పేట వెళ్లేది లేదు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం’ అని సమాధానం చెప్పారు. కాగా ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సాక్షికి తెలిపారు. -
విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నం
రాజానగరం: ప్రేమ పేరుతో వెంటబడి విద్యార్థినిని తీవ్ర వేధింపులకు గురి చేసిన యువకుడు.. చివరకు ఆ యువతిని హత్య చేసేందుకు యత్నించిన తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో చోటు చేసుకుంది. రాజానగరం గైట్ కళాశాలలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోలక్ష పోశాడు. ఆపై నిప్పంటించేందుకు యత్నించే క్రమంలో తోటి విద్యార్థినులు అడ్డుకుని కేకలు వేయడంతో అక్కడ నుంచి యువకుడు పరార్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ప్రేమను నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు సదరు యువకుడు. ఆ యువకుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
‘నెతన్యాహు.. మా క్యాంపస్‌పై బాంబులేయండి’
తమ క్యాంపస్‌పై బాంబులు వేయాలంటూ అమెరికాకు చెందిన విద్యార్థిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వాట్సాప్ ద్వారా సందేశం పంపడం సంచలనం కలిగించింది. అయితే ఆ మెసేజ్‌ను తాను జోక్‌గా పంపినట్లు తెలిపినప్పటికీ పోలీసులు దానిని సీరియస్‌గా పరిగణించి అరెస్టు చేశారు.విషయంలోకి వెళితే.. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సీటీ (ఎఫ్ఐయూ)కి చెందిన 23 ఏళ్ల గాబ్రియేలా సల్దానా యూనివర్సిటీకి చెందిన వాట్సాప్ గ్రూపులో నెతన్యాహకు సందేశాన్ని పంపింది. ‘నెతన్యాహు, మా మాటలు మీకు వినిపిస్తే.. ఓషన్ బ్యాంక్ కాన్వకేషన్ సెంటర్లోని మా కాప్‌స్టోన్ విద్యార్థులపై కొన్ని బొన్బొన్స్ (బాంబులు) వేయండి’ అంటూ సందేశాన్ని పంపింది. అయితే గాబ్రియేలా పంపిన సందేశాన్ని పోలీసులు బాంబు బెదిరింపుగా భావించారు. దీంతో పోలీసులు బెదిరింపు చర్యల చట్టం కింద గాబ్రియేలాపై కేసు నమోదు చేశారు. అయితే జోక్‌గా నెతన్యాహుకు సందేశాన్ని పంపినట్లు గాబ్రియేలా పేర్కొన్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. గాబ్రియేలాను అరెస్ట్ చేసి మియామిలోని టర్నర్ గిల్ఫోర్డ్ నైట్ కరెక్షనల్ సెంటర్‌కు తరలించారు. ఆమెను జడ్జి మిండీ ఎస్ గ్లేజర్ ముందు ప్రవేశపెట్టగా, బెయిల్ కోసం ఉన్నపళంగా 5వేల డాలర్లు చెల్లించాలని జడ్జీ తీర్పునిచ్చారు. అయితే ఫ్లోరిడా శాసనాల ప్రకారం ఒక వ్యక్తి చంపేయడం లేదా హాని కలిగిస్తామని లిఖితపూర్వకంగా బెదిరించినట్లు అభియోగాలు ఎదుర్కొన్న గాబ్రియేలా సల్దానాకు గరిష్టంగా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.A Florida student was arrested and is now facing up to 15 years in jail for making a joke about Israeli Prime Minister Benjamin Netanyahu.The student allegedly wrote, “Netanyahu, if you can hear me, drop some bonbons for us Capstone students in the Ocean Bank Convocation… pic.twitter.com/j7r8Lu5nsq— Shadow of Ezra (@ShadowofEzra) April 20, 2026 -
Hyd: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
హైదరాబాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐడీఎల్ చెరువులో దూకేసింది ఓ డిప్లొమో విద్యార్థిని. వ్యక్తిగత కారణాల వల్ల మనస్తాపానికి గురై ఆమె చెరువులో దూకినట్లు సమాచారం. కేపీహెచ్‌బీ ప్రాంతంలో హాస్టల్లో ఉంటోంది 20 ఏళ్ల విద్యార్థిని. అయితే వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఆమె.. ఐడీఎల్లో చెరువులో దూకేసింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించడంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చెరువు మధ్యలో లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లిపోయిన ఆ విద్యార్థిని చాకచక్యంగా కాపాడారు పోలీసులు. యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. -
ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం.. వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
ఊహించని విషాదం.. పేలని బాంబును తన్నడంతో..
సింగ పెరుమాళ్: తమిళనాడులోని సింగపెరుమాళ్ కోయిల్ సమీపంలో రక్షణ రంగ నిషేధిత ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ఉన్న ఒక పేలని షెల్‌ను కదిలించడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన విద్యార్థిని బెంగళూరుకు చెందిన హిమాన్షు యాదవ్ (21)గా గుర్తించారు. ఈ విద్యార్థి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి రమేష్ సింగ్ బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్‌లో ఉద్యోగి.ఏప్రిల్ 13న (సోమవారం) సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఆరుగురు విద్యార్థుల బృందం అనుమతి లేకుండా హనుమంతపురం ఫైరింగ్ రేంజ్ సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొండపైకి చేరుకున్నాక వారికి ఒక లోహపు వస్తువు కనిపించింది. అది పేలని బాంబు అని తెలియక ఒక విద్యార్థి దానిని తన్నడంతో అది రాయికి తగిలి ఒక్కసారిగా పేలిపోయింది.దీంతో హిమాన్షు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను వెంటనే పోతేరిలోని ఎస్ఆర్ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాయని.. ఆ సమయంలో పేలని షెల్ ఏదైనా అక్కడ ఉండిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సింగపెరుమాళ్ కోయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పేలుడు పదార్థం అక్కడ ఎలా ఉండిపోయిందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. -
‘నేను చేసిన పాపం ఏంటి?’.. వడోదర విద్యార్థిని కన్నీరు
వడోదర: కళాశాల వేదికపై ఒక విద్యార్థిని చేసిన డ్యాన్స్ వివాదానికి దారితీసింది. బాలీవుడ్ పాట‘ధక్ ధక్ కర్నే లగా’ పాటకు చీరకట్టులో ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూనివర్సిటీలోని సీసీ మెహతా ఆడిటోరియంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ‘సంస్కార్ సంగమం’ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో ఓ విద్యార్థిని బాలీవుడ్ పాటకు చీరకట్టులో డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియోను విడుదల చేసిన ఆ విద్యార్థిని తాను కేవలం వేదికపై డ్యాన్స్ మాత్రమే చేశానని, అందులో ఎలాంటి అసభ్యత లేదని తెలిపింది. అయితే పాట ఎంపిక తన పొరపాటే కావొచ్చని అంగీకరిస్తూ, అందరికీ క్షమాపణలు తెలియజేసింది. ఈ వివాదం తన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయింది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతోందని ఆరోపించింది.నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సభ్యులే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను వైరల్ చేశారని, తన వాదన వినిపించిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేయించారని ఆమె విమర్శించింది. వడోదర సంస్కృతికి తాను ఎలాంటి భంగం కలిగించలేదని, అసలైన సమస్యలను గాలికి వదిలేసి, తనలాంటి ఓ సాధారణ విద్యార్థినిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది.ఈ క్యాంపస్ డ్యాన్స్ వివాదం కాస్తా ఏబీవీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చగా మారింది. విద్యార్థిని అనుమతి లేకుండా ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వీడియోను సర్క్యులేట్ చేసినందుకు కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏబీవీపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవాన్ష్ బ్రహ్మభట్ డిమాండ్ చేశారు. దీనిపై గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధి నిశాంత్ రావల్ స్పందిస్తూ.. ఏబీవీపీ నిర్వహించిన కార్యక్రమంలోనే ఈ డ్యాన్స్ జరిగినప్పుడు, పాట సరికాదని భావిస్తే వారు అప్పుడే ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: విజయ్ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి -
భారత్ విద్యార్థిని.. ఆమె కోసం ఆరేళ్లుగా అమెరికా ఎందుకు వెతుకుతోంది?
వాషింగ్టన్: అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) . ఇప్పుడీ ఎఫ్‌బీఐకి భారతీయ విద్యార్థిని మయూషీ భగత్ కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తుంది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రజల సాయం కోరుతూ ట్వీట్ చేసింది. మయూషీ భగత్ ఆచూకీ తెలపాలని, అందుకు బహుమానంగా 10వేల డాలర్లు బహుమతి ఇస్తామని ట్వీట్ చేసింది.అంతేకాదు, ఆమె ఆచూకీ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతున్న వారిని గుర్తించి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. గుజారాత్ వడోదరాకు చెందిన ఆయూషీ ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 స్టూడెంట్ వీసా ద్వారా 2016లో అమెరికాకు వెళ్లింది. న్యూ హాంప్‌షైర్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆ సమయంలో నూజెర్సీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.ఈ క్రమంలో ఏప్రిల్ 29,2019న ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. ఆ తర్వాత ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో మయూషీ తండ్రి వాట్సప్ నెంబర్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో మే 3వరకు ఇంటికి రాదని,ఆమె సురక్షితంగా ఉన్నారనేది ఆ మెసేజ్ సారాంశం. నాటి నుంచి మయూషి భగత్ ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికీ మయూషీ జాడ కోసం జల్లెడ పడుతూనే ఉంది. The #FBI offers a reward of up to $10,000 for info leading to the location or recovery of Mayushi Bhagat, and the identification, arrest, and conviction of those responsible. She was last seen in the evening hours of April 29, 2019, leaving her Jersey City, NJ apartment:… pic.twitter.com/CDt1WJjLhM— FBI (@FBI) April 13, 2026 -
మూడు ఆపరేషన్లు : అయినా దక్కని ప్రాణం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెంది విద్యార్థిని 23 ఏళ్ల నవ్య నీలకుడిటి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. గతేడాది మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఆమె అమెరికా వెళ్లారు. జీవితం స్థిరపడుతుందని ఆశపడుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.మిచిగాన్‌లో ఒక ఇంటర్వ్యూ ముగించుకుని తిరిగి వస్తుండగా పిట్స్‌బర్గ్‌లో నవ్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన నవ్యను పిట్స్‌బర్గ్‌లోని UPMC ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మూడు ప్రధాన శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న ఆమె మరణించారు.నవ్య భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఆసుపత్రి ఖర్చుల కోసం టెక్సాస్‌లో నివస్తున్న ఆమె సమీప బంధువు శిరీష నీలకుడిటి నిధుల సేకరణ (Fundraising) చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 85వేల డాలర్లు పైగా సాయం అందింది. నవ్య తల్లిదండ్రులు సాధారణ రైతులు. కుమార్తె ఉన్నత చదువుకోసం తమ దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశారు. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశపడిన ఆమె కలలు ఆవిరై పోవడంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.కాగా ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల అకాల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో విషాదకర సంఘటనలో, 26 ఏళ్ల సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ అనే యువకుడు మిస్సౌరీలో మరణించారు. ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్న హరికృష్ణ, ఏప్రిల్ 11న తన పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. చదువుకుని ఉన్నత స్థితికి చేరుతారనుకున్న బిడ్డలు ఇలా విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే! -
‘అనుక్షణం అవమానమే’.. బీడీఎస్ విద్యార్థి ఆఖరి ఆడియో
కన్నూర్: తమ కుమారుడు చక్కగా చదువుకుని, డాక్టర్ అవుతాడని ఆశపడిన ఆ పేద తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఓ విద్యార్థి పాలిట శాపంగా మారారు. కేరళలోని కన్నూర్ డెంటల్ కాలేజీలో మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్న తిరువనంతపురానికి చెందిన నితిన్ రాజ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.కుల వివక్ష, అధ్యాపకుల వేధింపులే తన కొడుకును బలి తీసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, ప్రాణాలు తీసుకునే ముందు నితిన్ రికార్డ్ చేసినట్టుగా భావిస్తున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కంటతడి పెట్టిస్తోంది. నితిన్ తండ్రి వైఎల్ రాజన్ పెయింటింగ్ కార్మికుడు. ఎన్నో కష్టాలకోర్చి కొడుకును డెంటల్ కాలేజీలో చదివిస్తున్నాడు. అయితే క్యాంపస్ లోపల, బయట నితిన్ తీవ్రమైన కులపరమైన వివక్షను ఎదుర్కొన్నాడని, సీనియర్ల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కాలేజ్ లైబ్రరీ భవనం పైనుంచి కింద పడి నితిన్ రక్తపు మడుగులో కనిపించాడు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. రామ్, డాక్టర్ సంగీతలను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించింది. తాజాగా లీకైన ఆడియోలో నితిన్ చెప్పిన విషయాలు కలవర పెట్టేలా ఉన్నాయి.‘క్లాసులో అందరి ముందూ నన్ను ఇడియట్ అని అవమానించారు. ఇటీవల సర్జరీ అయిన మా అమ్మను కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మూడు మార్కులు కట్ చేసి.. ‘వెళ్లి మీ అమ్మానాన్నలకు ఈ సర్ ప్రైజ్ ఇవ్వు’ అని హేళన చేశారు. ఎంత భరించాలో అంతా భరించాను, చివరికి కోపంతో ఎదురుతిరిగాను’ అని నితిన్ ఆ ఆడియోలో వాపోయాడు. క్యాంపస్ గేటు దాటితే కాళ్లు, చేతులు నరికేస్తామని టీచర్లు బెదిరించారని, డాక్టర్ సంగీత లాంటి వారు ఇదంతా చూస్తూ నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి -
స్టూడెంట్ డెత్ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి..
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ నిర్మాణ స్థలంలోని నీటి గుంతలో పడి 23 ఏళ్ల హర్షిత్ భట్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు మరో మలుపు తిరిగింది. తన కొడుకును స్నేహితులే పథకం ప్రకారం చంపేశారని తల్లి ఆరోపణలు చేయడంతో, ఆ ముగ్గురు స్నేహితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హర్షిత్ ఇందిరాపురంలో ఉంటూ సెక్టార్ 125లోని అమిటీ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు. బుధవారం (ఏప్రిల్ 8న) తన ఆరవ సెమిస్టర్ చివరి పరీక్ష రాసిన అనంతరం.. స్నేహితులు వ్యాస్, క్రిష్, హిమాన్షులతో కలిసి సెక్టార్ 94లోని సూపర్ నోవా భవనం వెనుక వైపు ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆగిపోయిన ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ స్థలంలో బేస్మెంట్ కోసం తవ్విన భారీ గుంతలో నీరు నిలిచి ఉంది. ప్రహరీ గోడ గుండా వారు లోపలికి ప్రవేశించారు.పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో వీరంతా ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పరీక్షకు ముందు, ఆ తర్వాత కూడా వీరు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. గుంత దగ్గర బీర్ క్యాన్లు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో ఉన్న వీరు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆ నీటి గుంతలోకి దిగారు.మొదట హర్షిత్ నీటిలోకి దిగాడని, ఈదుకుంటూ బురద ఎక్కువగా ఉన్న మధ్య భాగంలోకి వెళ్లి ఇరుక్కుపోయాడని స్నేహితులు చెబుతున్నారు. కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి 10 మీటర్ల లోతు నుంచి హర్షిత్ ను బయటకు తీసుకువచ్చి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతన్ని ఆ ముగ్గురే ఉద్దేశపూర్వకంగా చంపేశారని తల్లి దీప్ మాల సెక్టార్ 126 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: మథుర విషాదం: చలించిపోయిన హేమమాలిని -
తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
హయత్‌నగర్: సహచర విద్యార్థి సోషల్ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుంట్లూర్‌లో ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : వైఎస్సార్ జిల్లాలో కీర్తన అనే విద్యార్థిని ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసం హత్య చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైంది. వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు మాటలే తప్ప కఠిన చర్యలు శూన్యం. పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణం. దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్.కాగా, వైఎస్సార్ జిల్లాలోని ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్‌కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది..వాన్ని ఉరితీయండి తండ్రి ఆవేదన
-
ఫీజు చెల్లించలేదని విద్యార్థినితో బాత్రూంలు కడిగించిన యాజమాన్యం
-
నర్సింగ్ కాలేజీలో దారుణం
తిరుపతి రూరల్: ఫీజు కట్టడం ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థినిని తీవ్రంగా అవమానించింది. మరుగుదొడ్లు కడిగించింది. తరగతి గదుల్లో చెత్త ఊడ్పించింది. విద్యార్థులు తిన్న ప్లేట్లు కడిగించింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలోని శ్రీ వికాస్ నర్సింగ్ కాలేజీలో జరిగింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రేణుమాకులపల్లికి చెందిన పి.రవికుమార్, శ్రీదేవిల కుమార్తె పి.నినిత ఈ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ((యాజమాన్య కోటా సీటు )) రెండోసంవత్సరం చదువుతోంది. రెండో సంవత్సరం ఫీజు రూ.1.4 లక్షలు కట్టడంలో ఆలస్యం చేస్తున్నారని కాలేజీ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించింది. ఆ విద్యార్థినితో మరుగుదొడ్లు కడిగించడం, తరగతి గదుల్ని ఊడ్పించి తుడిపించడం, విద్యార్థులు తిన్న ప్లేట్లు కడిగించడం వంటి పనులు చేయించి తీవ్ర అవమానాలకు గురిచేసింది. ఈ అవమానాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థిని ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు కాలేజీకి వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థిసంఘాల నేతలకు మొరపెట్టుకున్నారు. బాధిత విద్యార్థిని, ఆమె బంధువులు, విద్యార్థిసంఘాల నేతలు బుధవారం సాయంత్రం కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆ విద్యార్థినితో అలా పనులు చేయించలేదని బుకాయించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. దీంతో విద్యార్థిసంఘాల నేతలు రాత్రి 10 గంటల వరకు కాలేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కాలేజీ యాజమాన్యం మెట్టుదిగకపోగా.. విద్యార్థిసంఘాల నేతలు అక్కడ నుంచి వెళ్లబోమని తేల్చిచెప్పారు. రాత్రి 10 గంటల వరకు ఆ ప్రాంతం నినాదాలతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఇతర విద్యార్థినులను రెచ్చగొట్టి వీరికి వ్యతిరేకంగా కాలేజీ ప్రాంగణంలో ధర్నాకు కూర్చోబెట్టింది. దీంతో బాధిత విద్యార్థిని, విద్యార్థిసంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాత్రి 10.30 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. -
5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణలో లోపాలకు సంబంధించిన మరో సంఘటన కలకలం రేపుతోంది. పూణేలోని ఒక మెరైన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్‌బాల్ బోర్డు ఫ్రేమ్ మీద పడి 20 ఏళ్ల క్యాడెట్ తీవ్ర గాయాలపాలై మరణించాడు.ఘటన వివరాలుపూణేలోని టోలానీ మెరైన్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్ చదువుతున్న విశాల్ వర్మ, ఆదివారం ఉదయం వ్యాయామం కోసం క్యాంపస్‌లోని బాస్కెట్‌బాల్ కోర్టుకు వెళ్లాడు. బాస్కెట్‌బాల్ హూప్‌ను పట్టుకుని పుల్-అప్స్ (Pull-ups) తీస్తుండగా, ఒక్కసారిగా ఆ ఇనుప ఫ్రేమ్ మొత్తం అతనిపై కుప్ప కూలిపోయింది.ఈ ప్రమాదంలో విశాల్ తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు మరియు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ భారీగా రక్తస్రావం కావడంతో,అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.విశాల్ ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందినవాడు. 2024లో ఈ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అతని బి.టెక్ కోర్సు 2028లో పూర్తి కావాల్సి ఉంది.ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీత్ కనుంగో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అసలు ఆ ఫ్రేమ్ ఎలా కూలిపోయింది అనే దానిపై మేము విచారణ జరుపుతాము" అని ఆయన తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇనుప ఫ్రేమ్ తుప్పు పట్టిపోయిందా? లేదా అమర్చడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో ఇన్స్పెక్టర్ సంతోష్ పాటిల్ విచారణ జరుపుతున్నారు.ఇదీ చదవండి : 20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్‌నకు భారీ షాక్నిర్వహణలో లోపాలు యువ క్రీడాకారుల ప్రాణాలను బలి అవుతున్నారు. గత ఐదు నెలల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం ఇది మూడవసారి. ఇటీవల హర్యానాలోని రోహ్తక్లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు హార్దిక్ రాఠీ కూడా ఇలాగే బాస్కెట్‌బాల్ పోల్ మీద పడటంతో మరణించాడు. అలాగే హర్యానాలోని బహదూర్గఢ్ జిల్లాలో 15 ఏళ్ల బాలుడు కూడా ఇటువంటి ప్రమాదానికే బలైపోయిన సంగతి విదితమే. విషాదంగా మారుతున్న వరుస ప్రమాదాలు దేశంలోని విద్యాసంస్థలు మరియు క్రీడా ప్రాంగణాల్లోని పరికరాల భద్రత ,నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇదీ చదవండి: ఇరాన్ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం? -
వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలెల్కెరె పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై జరిగిన పుకార్ల ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆయుర్వేద వైద్య విద్యార్థిని (BAMS) ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:23 ఏళ్ల లిఖిత, మల్లాడిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చదువుతోంది. హోలెల్కెరె పట్టణంలోని బసవ లేఅవుట్లో ఉన్న తన ఇంట్లో మంగళవారం ఆమె విగతజీవిగా కనిపించడం విషాదాన్ని నింపింది. లిఖితకు ఆమె కాలేజీలోని ఒక ప్రొఫెసర్‌తో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా కళాశాలలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వల్ల తన పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో లిఖిత సంచలన విషయాలు పేర్కొంది.తన మరణానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, అతని భార్య, మరి కొందరు తోటి విద్యార్థినులు కారణమని ఆరోపించింది. వేధించి, తనపై తప్పుడు ప్రచారం చేసి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వాపోయింది.మరోవైపు స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కొందరు క్లాస్మేట్స్ తమ కుమార్తెను కావాలనేవేధించారని, లెక్చరర్‌తో అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారిద్దిరీ కేవలం గురువుకు, శిష్యురాలికి మధ్య ఉండే గౌరవ ప్రద సంబంధం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం వేధించడం, సూటిపోటి మాటలతో అవమానించడం వల్లే తన కూతురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న సహవిద్యార్థులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాని ఆయన డిమాండ్ చేశారు. ఈఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
ప్రేయర్ లో కామెడీ.. ఈ బుల్డోడు చేసిన పనికి నవ్వాగదు..
-
క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్
బెంగళూరు శివార్లలోని ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన దిగ్భ్రాంతి రేపుతోంది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లవ్ ప్రపోజల్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నెలమంగళ సమీపంలోని టి. బేగూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అసలేం జరిగింది?క్లాస్ జరుగుతుండగా మొహమ్మద్ అనే ప్రొఫెసర్ ఉన్నట్టుండి మైక్ పట్టుకుని విద్యార్థులందరి ముందు ఒక విద్యార్థినికి తన ప్రేమ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆమె తనకు లవ్ ప్రపోజ్ చేసిందనీ, దీంతో తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని ఆయన క్లాసులో అందరి ముందు ప్రకటించారు. అందరికీ చాక్లెట్లు పంచాడు. దీన్ని సదరు విద్యార్థిని వ్యతిరేకించడంతో వాగ్వాదం జరిగింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా? ఐ లవ్ యూ అని చెప్పావు కదా అని ప్రొఫెసర్ అడిగాడు. ‘నేను ఎప్పుడు ప్రపోజ్ చేశాను? ఆధారాలు చూపించండి’ అంటూ ఆమె గట్టిగా వ్యతిరేకించింది. సీసీటీవీ ఫుటేజీ ఉంది, కావాలంటే చూసుకోండి అని ప్రొఫెసర్ కొంచెం గట్టిగా వాదించాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె ‘ప్రిన్సిపాల్ దగ్గర తేల్చుకుందాం పద, క్లాస్ అంతా వస్తారు’ అనడంతో రేపు మాట్లాడుకుందాం అంటూ అక్కడినుంచి జారుకోవడానికి ప్రయత్నించాడు సదరు ప్రొఫెసర్ .అడ్డుకున్న విద్యార్థులు ప్రొఫెసర్ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు ప్రొఫెసర్‌ను నిలదీశారు. ఇతర విద్యార్థులు కూడా ఆమెకు తోడుగా నిలిచారు. ఈ క్రమంలో గొడవ పెరిగి, ప్రొఫెసర్‌ను ఆమె చెప్పుతో కొట్టింది. దీంతో క్యాంపస్‌లో గందరగోళం నెలకొంది. Movie type proposal in #Bengaluru!A professor proposes to a student in the classroom of a medical college at T Begur in Nelamangala. The girl takes objection.A few moments later: The girl & fellow students thrash the professor. @timesofindia pic.twitter.com/ohsFTxUj5J— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 26, 2026ఇదీ చదవండి: హోర్మూజ్ తరువాత : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ఇది పోలీసుల దాకా చేరింది. నెలమంగళ రూరల్ పోలీసులు కాలేజీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాల నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు.అటు ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రకటించలేదు. మెడికల్ కాలేజీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రొఫెసర్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు -
సంస్కృతం పేపర్లో 500 నోట్లు.. పాస్ చేయాలంటూ..
పలాము: పరీక్షల్లో పాస్ కావడానికి కొందరు విద్యార్థులు రకరకాల అడ్డదారులు తొక్కుతుంటారు. కొందరు కాపీ కొడితే, మరికొందరు ఇన్విజిలేటర్లను బతిమాలుకుంటారు. అయితే జార్ఖండ్‌లో ఒక విద్యార్థి ఏకంగా తన ఆన్సర్ షీట్లో నగదు పెట్టి టీచర్‌కు ‘ఆఫర్’ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.అసలేం జరిగిందంటే?జార్ఖండ్ బోర్డు పరీక్షలు ముగియడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. పలాము జిల్లాలోని ఒక సెంటర్లో ఉపాధ్యాయులు సంస్కృతం పేపర్లను దిద్దుతుండగా ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. ఒక విద్యార్థి పేపర్ లోపల రెండు 500 రూపాయల నోట్లను (మొత్తం రూ. 1000) ఉంచాడు. తనను ఎలాగైనా పాస్ చేయాలని ఆ విద్యార్థి అందులో కోరినట్లు సమాచారం.టీచర్ రియాక్షన్ అదిరిపోయిందిడబ్బులు చూసి ఆ ఉపాధ్యాయుడు ఏమాత్రం ప్రలోభానికి లోనుకాకుండా, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించారు. ఆన్సర్ షీట్లో సమాధానాలు లేకపోవడంతో ఆ ప్రశ్నకు సున్నా మార్కులు వేశారు. కేవలం రాసిన సమాధానాలకు మాత్రమే మార్కులు వేస్తామని, ఇలాంటి ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ నగదుతో కూడిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.విద్యానిపుణుల హెచ్చరికఇలాంటి అడ్డదారులు తొక్కడం వల్ల విద్యార్థుల విద్యా రికార్డులు పాడవడమే కాకుండా, వారి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పరీక్షల కోసం కష్టపడి చదవాలే తప్ప, ఇలాంటి పనుల వల్ల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని వారు అభిప్రాయపడుతున్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షార్ట్‌కట్ పద్ధతులు కాకుండా, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ మాత్రమే విద్యార్థులకు మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్ -
పెంపుడు పిల్లి కోసం MBBS విద్యార్థిని ఆత్మహత్య
-
పెంపుడు పిల్లి కోసం ప్రాణం తీసుకుంది
అల్వాల్: పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రిసాలా బజార్ పరిధిలోని శివ్‌మన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23) ఎంబీబీఎస్ చదువుతోంది.కాగా ఇంట్లో పెంపుడు పిల్లి విషయమై తల్లి, కుమార్తెల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేష్ట చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచా రం అందించగా.. శ్రేష్ట అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్వాల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పరీక్ష రోజే తండ్రి మరణం.. శోకాన్ని దిగమింగుతూ
సాక్షి, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి పరీక్ష రోజే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. దీంతో పుట్డెడు దుఃఖాన్ని దిగమింగుతూ. అంతటి శోకంలోనూ ఆ పిల్లాడు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు.. ఈ ఘటన పలువురిని కంటతడికి గురిచేసింది. శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో ఈ రోజు ( శనివారం) అర్ధరాత్రి శివాoపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా నేడు అతని అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే అంతటి దుఃఖంలోనూ అతని కుమారుడు కుమ్మరి ధనుష్ తన బాధను దిగమింగుకుంటూ తూప్రాన్ లోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు అతను ఇప్పుడు భౌతికంగా తమవద్ద లేకపోయినటప్పటికీ నాన్న కష్టం వృధా కాకూడదని పరీక్షలకు హాజరవుతున్నానని విలపించాడు. ఈ ఘటన అక్కడి స్థానికులను ఎంతగానో కలిచివేసింది. -
విద్యార్థిపై 10 మంది దాడి.. మనస్థాపంతో సూసైడ్ నోట్
సాక్షి, కోనసీమ: ద్రాక్షరామ గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిల్లీపాల్ అనే విద్యార్థిపై తోటి 10 మంది విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన బిల్లీపాల్ సూసైడ్ నోట్ రాసి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థి క్షేమంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యకు విశ్వ ‘భారతం’
సాక్షి, స్పెషల్ డెస్క్: మన దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాసియా నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు భారత్‌కు వస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కూడా డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వంటి విధాన సంస్కరణలే ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు, గుర్తింపు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. 2025లో వివిధ దేశాలకు చెందిన 58,000 మంది విద్యార్థులు భారత్‌లో చదువుతున్నట్టు అంచనా. మన దేశంలోని విద్యా సంస్థల్లో చేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య 2030 వరకు ఏటా సుమారు 8% పెరుగుతుందని అంతర్జాతీయంగా ఉన్నత విద్య సమాచారం, ర్యాంకింగ్స్‌ను అందించే లండన్‌కు చెందిన క్యూఎస్ తన ‘క్యూఎస్ గ్లోబల్ స్టూడెంట్ ఫ్లోస్: ఇండియా 2026’నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాలలో ఒకటిగా భారత్ నిలుస్తుందని వెల్లడించింది. భారత్‌కు కొత్త అవకాశాలు.. పదేళ్లలో భారత్‌కు వచ్చే అంతర్జాతీయ వి ద్యార్థుల సంఖ్య పెరగడానికి దేశీయంగా ప్ర భుత్వ విధాన సంస్కరణలు, దక్షిణాసియా –ఆఫ్రికా నుంచి పెరుగుతున్న డిమాండ్, సంప్రదాయ విదేశీ విద్యా గమ్యస్థానాలలో విపరీతంగా పెరుగుతున్న ఖర్చులు ప్రధాన కారణం. భారత్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2047 నాటికి 5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తెలి సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమై న విద్య కోసం అధికం అవుతున్న డిమాండ్ భారత్‌కు కొత్త అవకాశాలను కలి్పస్తోంది. వీసా నిబంధనలతో.. ఆంగ్లం మాట్లాడే విద్యా గమ్యస్థానాలైన అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అక్కడ ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచ విద్యా రంగంలో మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యా ర్థులు తక్కువ ఖర్చుతో కూడిన, సులభంగా ప్రవేశం లభించే విద్యా కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో విద్యా వ్యయం తక్కువగా ఉండడం, విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ విదేశీ విద్యార్థులకు ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి.. ⇒ పెరుగుతున్న ఆదరణ: దక్షిణాసియా తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి ప్రధానంగా సబ్–సహారన్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ⇒ వృద్ధి రేటు: విద్యార్థుల రాక ఏటా 6% వృద్ధి చెందుతుందని అంచనా. ఈ దేశాల్లో యువత ఎక్కువ. ఉన్నత విద్యకు పరిమితమైన అవకాశాలు. ⇒ జింబాబ్వే: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. 2024లో భారత్‌కు విద్యార్థులను పంపిన దేశాల్లో 7వ స్థానం. 2030 నాటికి 6వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా.. ⇒ స్థిరమైన సహకారం: ఈప్రాంతం నుంచి విద్యార్థుల రాక స్థిరంగా కొనసాగుతోంది. ⇒ యూఏఈ: 2030 నాటికి భారత్‌లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 5% వరకు ఉండే అవకాశం.ఆకర్షణీయమైన అంశాలు..⇒ భౌగోళిక సామీప్యత: పొరుగు దేశాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రయా ణ సౌలభ్యం మెరుగ్గా ఉండటం. ⇒ సాంస్కృతిక సారూప్యత: ఆహారం, జీవనశైలి, భాషాపరంగా ఉన్న దగ్గరి సంబంధాలు విద్యార్థులకు సౌకర్యవంతంగా అనిపించడం. ⇒ తక్కువ ఖర్చు: ఇతర దేశాలతో పోలిస్తే విద్యా, జీవన వ్యయాలు చాలా తక్కువగా ఉండటం. ⇒ ప్రధాన సమస్య: భారతీయ విద్యా సంస్థల విషయంలో కంపెనీల దృష్టిలో గుర్తింపు, విద్యాపరమైన గుర్తింపు మధ్య పెద్ద వ్యత్యాసం. ⇒ మెరుగుపడిన ఎంప్లాయర్ ర్యాంకింగ్: గత దశాబ్దంలో భారతీయ గ్రాడ్యుయేట్లపై కంపెనీలకు ఉన్న నమ్మకం, గుర్తింపు గణనీయంగా పెరిగింది. ⇒ స్థిరంగా ఉన్న అకడమిక్ సూచీలు: విద్యా నాణ్యత, పరిశోధనలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరంగా ఉండే గుర్తింపులో మాత్రం పెద్దగా మార్పు లేదు.భారత్‌లో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దక్షిణాసియా దేశాలు దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే విద్యార్థులు మొత్తం ప్రవేశాలలో 30% కంటే ఎక్కువ. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతం నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నేపాల్ కొనసాగుతుందని అంచనా. -
ఇది సొసైటీ... నడబడిక!
స్కూళ్లలో గంజాయి, స్కూళ్లలో వీడియోగేమ్స్, స్కూళ్లలో చెడ్డ మాటలు, స్కూళ్లలో రౌడీయిజం చదువుకునే పిల్లల మధ్య కలుపుమొక్కలు. చివరకు క్లాస్‌రూమ్‌లో టీచర్ మీద చెయ్యెత్తే వరకూ వచ్చారు. ఇందులో ఎవరి మీద నెపం నెడదాం? ఈ విద్యా భారతాన్ని ఎలా చూద్దాం?బడి అంటే ఉత్తి భవనం కాదు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలయం. చదువు చెప్పే ప్రతి గురువు దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాతి స్థానం మన పెద్దలు గురువుకే ఇచ్చారు. విద్యార్థుల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ, వారి బతుకును తీర్చిదిద్దే దిక్సూచులుగా మారి వారిని గమ్యానికి చేర్చే బాధ్యత ఉపాధ్యాయులది. కానీ.. పరిస్థితి తారుమారైంది. చదువు చెప్పే గురువులకు మర్యాద కరువైంది. విద్య నేర్పే ఒజ్జలకు విలువనిచ్చే సంస్కృతి కనుమరుగవుతోంది. తప్పు చేస్తే విద్యార్థులను ఉపాధ్యాయులను దండించే కాలం పోయి, విద్యార్థులే ఉపాధ్యాయులను దండించే కాలం వచ్చింది. ఇది కాలరీతి అనుకోవాలా లేక సమాజంలో దిగజారిపోతున్న విలువలకు తార్కాణంగా భావించాలా తెలియని పరిస్థితి. ఇటీవలి ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ ఉన్నతపాఠశాలలో జరిగిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతున్న ముగ్గురు విద్యార్థులను గమనించి ల్యాబ్ అసిస్టెంట్ మందలించారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపైనా దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. బడిలో మద్యం, గంజాయి తాగడం, అమ్మాయిలను ఏడిపించడం, గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం తరచూ కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. వీటిని కట్టడి చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. గట్టిగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నా స్థానిక రాజకీయాలు, ఒత్తిడి వారి ఆ పని చేయనీయకుండా చేస్తోంది. దీంతో మిన్నకుండిపోతున్నారు.సినిమాలు... సోషల్ మీడియా ప్రభావంస్కూల్ పిల్లలు చెడ్డదారిలో పడటానికి సినిమాలు, సోషల్ మీడియా ప్రధాన కారణంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. సినిమాల్లో విద్యార్థులు తమ లెక్చరర్లను ఏడిపించడం, వారి మీద జోకులేయడం వంటి సన్నివేశాలు చూసి తామూ అలా చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు, బూతులు, అశ్లీల వీడియోలు సైతం వారి మనసుల మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం వల్ల చాలా సులభంగా వీటిని చూస్తూ ఆ ప్రభావానికి లోనవుతున్నారని అంటున్నారు.తల్లిదండ్రుల మాటలనూ లెక్కచేయక...విద్యార్థులు బడిలోనే ఇలా ఉంటున్నారనుకుంటే ΄÷రపాటే. కొందరు తమ ఇళ్లల్లోనూ ఇదే రీతిలో ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా, వారి మాటలకు ఎదురుచెప్తూ, వారి మీదే దాడికి పాల్పడుతున్నవారూ ఉన్నారు. అతిగారాబం, అడిగినవన్నీ అందించడం, అందరిలోనూ గొప్పగా ఉండాలని కోరుకోవడం వంటి కారణాలతో తల్లిదండ్రులే పిల్లల్ని ఇటువంటి ప్రవర్తనకు పురిగొల్పుతున్నారని మానసిక వైద్యులు అంటున్నారు. చివరకు సొంత అమ్మానాన్నల మాట కూడా వినని స్థితికి చేరుకున్నాక ఏమీ చేయలేక కుమిలిపోతున్నారని అంటున్నారు.ఇలా చేస్తే మేలు...⇒ పిల్లలను అతిగారాబం చేయకూడదు. వారి అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టు అందించాలి తప్ప వారి అడిగిన ప్రతి వస్తువూ కొనివ్వకూడదు. ⇒ పెద్దల్ని గౌరవించడం, ఆడవారితో మర్యాదగా ఉండటం, తోటివారితో స్నేహంగా మెలగడం వంటివి చిన్ననాటి నుంచే నేర్పించాలి. ⇒ పిల్లలు వారి ఫోన్ లో ఏమేం చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి. చూడకూడదని మొండికేస్తే ఆ ఫోన్ వారి నుంచి తీసుకోవాలి. ⇒ పిల్లల స్నేహితులు ఎవరు, వారి అలవాట్లు ఏమిటి, వారి పద్ధతి ఎలా ఉంది అనేది గమనించాలి. ఎక్కడైనా తప్పుడు స్నేహాల బారిన పడుతున్నట్లు అనిపిస్తే వెంటనే హెచ్చరించాలి. ⇒ కనీసం నెలకోసారైనా బడికి వెళ్లి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయాలి. కేవలం మార్కుల గురించే కాకుండా నడవడిక గురించి కనుక్కోవాలి. ⇒ రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం, రోజంతా ఫోన్ లోనే గడపడం, అందరిపట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి గమనిస్తే వెంటనే పిల్లల్ని మందలించాలి. అయినా మారకపోతే కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించక తప్పదు. -
నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి
మంగళగిరి టౌన్: నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణాయపాలేంకు చెందిన కంతేటి ప్రకాష్, విమల దంపతుల కుమారుడు ప్రజ్వల సంతోష్ (15) పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో పెనుమాకలోని ట్యూషన్‌కు ఆదివారం వెళ్లాడు. ట్యూషన్ అనంతరం ఇంటికి వచ్చే మార్గంలో నీటిగుంతలో ఈతకు దిగి మునిగిపోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చేలోపే సంతోష్ మృతిచెందాడు. కాగా, రాజధాని రోడ్డు నిర్మాణ పనుల కోసం తవి్వన నీటిగుంతలోనే బాలుడు మృతిచెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన నీటిగుంత వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని పలువురు స్థానిక దళితనాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించారు. పోలీసులు సుమోటాగా తీసుకుని దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
వాడు పాస్ అవ్వడు… ఎందుకు పరీక్ష రాయడం?
చెన్నై: ‘పాస్ అవ్వడు’ అంటూ 10వ తరగతి విద్యారి్థకి పబ్లిక్ పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆ ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన కలకలం రేపింది.ç బజనై కోవిల్ వీధికి చెందిన రాధికా అనే మహిళ తన భర్తతో విడిపోయి జీవిస్తోంది. ఆమెకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు కాగలూరు ప్రాంతంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యారి్థకి చర్మవ్యాధి ఉండటంతో అప్పుడప్పుడు సెలవులు తీసుకుని చికిత్స పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. ఈ పరిస్థితిలో సెలవులు ఎక్కువగా తీసుకున్నాడనే కారణంతో అతనికి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయకూడదని, రాసినా పాస్ అవడని చెప్పి పాఠశాల అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదని తెలుస్తోంది. దీనిపై విద్యార్థి తల్లి రాధికా తిరువళ్లూర్ జిల్లా ప్రధాన విద్యా అధికారికి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు విచారణ చేసి, ఆ విద్యార్థికి పబ్లిక్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాధికా మాట్లాడుతూ, ‘ఇప్పటికే మూడు సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో చదివిన నా కుమార్తె 10వ తరగతి పరీక్షలో ఓ సబ్జక్ట్ లో ఫెయిల్ అయ్యిందని తర్వాత మళ్లీ పరీక్ష రాసి పాస్ అయ్యిందన్నారు. అయినా ఆమెను 11వ తరగతిలో చేర్చడానికి పాఠశాల వారు ఆసక్తి చూపలేదని అందువల్ల ఆమె చదువు కొనసాగించలేదు. ఇప్పుడు నా కుమారుడి పరిస్థితి కూడా అలాగే అవ్వకూడదని నేను ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. -
ఒక పశువులాగా.. క్లాస్ రూమ్ లోనే..! న్యూడ్ వీడియోలు తీసి..!
-
చిన్న వయసులో ఏ కష్టం వచ్చిందో..
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని నడింపల్లె ఎస్సీహాస్టల్‌లో చదువుకుంటున్న తలారి నరసింహులు (16) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి ఓబులేసు, గంగాదేవి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు. ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఉంటున్న గంగాదేవి సోదరి నాగలక్ష్మికి పిల్లలు లేరు. దీంతో ఆమె మూడేళ్ల వయసు నుంచి నరసింహులును పోషించుకుంటోంది. అతను 6వ తరగతి నుంచి ప్రొద్దుటూరులోని నడింపల్లె హాస్టల్లలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. నరసింహులు ప్రస్తుతం పదోతరగతి చదువుకుంటున్నాడు. ప్రతి ఆదివారం పోట్లదుర్తిలో ఉంటున్న తమ పెద్దమ్మ వద్దకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఈ ఆదివారం కూడా అతను పోట్లదుర్తికి వెళ్లాడు. రాత్రి ఇక్కడే ఉండమని పెద్దమ్మ చెప్పినా వినలేదు. స్టడీ క్లాస్ ఉందని చెప్పి సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చాడు. రాత్రి పడుకున్నాడు.. ఉదయం శవమై కనిపించాడురాత్రి అందరితో పాటు నరసింహులు చదువుకున్నాడు. భోజనం చేసి తోటి పిల్లలతో సరదాగా కొంతసేపు ఆడుకున్నాడు. అయితే అదరూ 10 గంటలకు పడుకున్నా అతను మాత్రం రాత్రి 11 గంటల వరకు పడుకోకుండా దిగాలుగా కూర్చొని ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. పడుకుందాం రారా అని పిలిచినా అతను రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విద్యార్థులు బయటికి రాగా హాస్టల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని నరసింహులు వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్ బ్రహ్మయ్య దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణం ఉంటుందేమోనని అందరూ కలిసి చెట్టుకు వేలాడుతున్న నరసింహాలును కిందికి దించారు. అయితే అప్పటికే అతను చనిపోయాడు. తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసింహులు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. విద్యార్థులను దిక్కులేని వారిగా వదిలేశారని, రాత్రి ఒక్కరు కూడా పిల్లలను చూసువడానికి హాస్టల్లో ఉండలేదని వాపోయారు. ఏ ఒక్కరు రాత్రి హాస్టల్లో ఉన్నా నరసింహులు ప్రాణాలతో ఉండేవాడని తెలిపారు. టూ టౌన్ సీఐ వంశీనాథ్, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకెళ్లేందుకు విద్యార్థి బంధువులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తాంవిద్యార్థి నరసింహులు ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభ పేర్కొన్నారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. కాగా విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా తమ కుమారుడి మరణానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. -
వాడో కామాందుడు.. క్లాస్ రూమ్‌లోనే నన్ను..
మెదక్ జిల్లా: ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన విద్యార్థి లైంగిక దాడి చేశాడు. అంతేకాక పూర్వవిద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. సోమవారం ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపిన మేరకు.. బాచుపల్లి వీఎన్ఆర్ కాలేజీలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్‌కు చెందిన విద్యార్థిని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే ఈ కాలేజీలోనే చదువుతున్న ఆశిష్ బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. 2024 నుంచి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అంతేకాక గత సంవత్సరం కాలేజీలోనే మత్తు చాక్లెట్ ఇచ్చి లైంగిక దాడిచేశాడు. ఇలా పలుపర్యాయాలు దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఇదే కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థి ప్రవీణ్‌ను ఆశిష్ పరిచయం చేశాడు. అతను కూడా బాధితురాలిని లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యం లైంగిక దాడి విషయం తెలుసుకుని అప్పట్లోనే ఆశిష్ తల్లిదండ్రులను పిలిపించి డిక్లరేషన్ రాయించుకున్నట్లు తెలిసింది. -
10th పేపర్ లీక్.. 80 గ్రాముల బంగారం టోకరా
బెంగళూరు: కర్ణాటకలో ఓ టీచర్ పరీక్ష పేపర్ లీక్ చేస్తానని విద్యార్థికి ఆశ చూపి 80 గ్రాముల బంగారం కాజేసింది. ఈ వివరాలు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ స్టూడెంట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ధార్వాడ్‌లోని విద్యారణ్య పాఠశాలలో SSLV ( 10 వతరగతి) పరీక్ష పత్రాన్ని లీక్ చేస్తానని ఆ విద్యార్థికి, టీచర్ ఆశచూపింది. దీనికి గాను మెుదటగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే విద్యార్థి దగ్గర డబ్బు లేవని చెప్పడంతో ఇంట్లో ఉన్న బంగారం తేవాలని చెప్పింది. దానికి విద్యార్థి తొలుత భయపడ్డాడు. అయితే తను ఆ నగలు తిరిగి ఇచ్చేస్తానని భయపడాల్సిన అవసరం ఏమి లేదని విద్యార్థికి నచ్చజెప్పింది.దీంతో ఆ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణున్ని అయితాననే ఆశతో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారం దాదాపు రూ. 12 లక్షలు విలువ తీసుకొచ్చి ఆ టీచర్‌కు ఇచ్చాడు. కొద్దిరోజులకు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆ టీచర్ అతనిని తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించింది. అయితే ఇంతలోనే బంగారం పోయిన సంగతి ఆ ఇంట్లో వారు గమనించారు. దీంతో ఆ పిల్లాడిని నిలదీయగా అతన అసలు విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలియడంతో ఆ విద్యార్థి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్నపోలీసులు ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా మరేవరైనా విద్యార్థుల వద్ద నగదు కాజేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
USAలో విద్యార్థిని అక్రమ అరెస్ట్?
అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై ఎంత కఠిన వైఖరి అవలంభిస్తోందో తెలిసిన విషయమే. తాజాగా పాలస్తీనాకు మద్ధతుగా నిరసన జరిపిందంటూ ఒక విదేశీ విద్యార్థిని USA సర్కార్ అరెస్టు చేసింది. అయితే దీనిపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ జోక్యంతో స్టూడెంట్ను రిలీజ్ చేసింది.గురువారం ఉదయం ( USA)ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక అపార్టుమెంటులోకి అకస్మాత్తుగా ప్రవేశించారు. ఒక పాపకోసం వచ్చామంటూ అందులోని అక్కడ ఉన్న నివాసితులకు నమ్మబలికారు. అలా సోదాలు జరిపి కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న ఎల్లీ అఘయేవా అనే విద్యార్థిని అరెస్టు చేశారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. తనను DHS ప్రతినిధులు అక్రమంగా అరెస్టు చేశారని తనను కాపాడాలని ఇన్‌స్టాలో మెసేజ్ చేసింది.ఆమె అరెస్టు వార్త విని కొలంబియా వర్సిటీలో నిరనసలు చెలరేగాయి. దీంతో న్యూయార్క్ మేయర్ జోహ్రానీ మామ్దానీ ట్రంప్‌తో భేటీ జరిపి ఆ విద్యార్థిని విడుదల చేయాలని కోరడంతో ట్రంప్ వెంటనే ఓకే అన్నారు. దీంతో ఆమె రిలీజైంది. అయితే తనను అరెస్టు చేయడం ఎంతో షాక్‌కు గురిచేసిందని ఆ విద్యార్థిని తెలిపింది. అయితే ఎల్లీ అఘవేయా అజర్బైజాన్ దేశానికి చెందిన విద్యార్థిని. అయితే మామ్దానీ, ట్రంప్ ఒకే పార్టీకి చెందిన నేతలు కాదు. ఎన్నికల సమయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన నిర్ణయాన్నిగౌరవించడం మేయర్ మాటకు గౌరవమిచ్చి ఆ విద్యార్థిని విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. -
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర త్రిబుల్ ఐటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రక్రియను అధికారులు గోప్యంగా నిర్వహించడం గమనార్హం. వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా ? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. -
విద్యార్థినిని జుట్టు పట్టుకుని కొట్టిన ప్రిన్సిపల్
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిని ప్రిన్సిపాల్ జుట్టు పట్టుకొని ఈడ్చికొట్టడంతో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకొంది. జరిగిన అవమానాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో బంధువులు, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి. వివరాలు.. ఏనుగుల బజారుకు చెందిన బాలిక ప్రకాష్‌నగర్‌లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.పాఠశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ శంకరరెడ్డి జుట్టు పట్టుకుని వీపుపై తీవ్రంగా కొట్టడంతో పాటు మోకాళ్లపై నిల్చోబెట్టి వేధించాడని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని డైరెక్టర్ శంకరరెడ్డితో వాగ్వాదానికి దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుని బాలిక తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఐ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణ అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గాయాలైన బాలికను వైద్యశాలకు చికిత్స నిమిత్తం పంపారు. -
ఏయూలో మరోసారి ఉద్రిక్తత
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీలో రెండు రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ అడ్డుకోవడంతో మొదలైన వివాదం.. శనివారం ఏబీవీపీ నిరసనతో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. తమపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు ఈస్ట్ ఏసీపీ పరిధిలో సెక్షన్ 30 యాక్ట్‌ను అమలు చేశారు. అయినప్పటికీ శనివారం ఉదయమే ఏబీవీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఏయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని భారీ నిరసన చేపట్టారు.తమ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ లోపలకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వర్సిటీ గేట్లను మూసివేసి, కేవలం ఐడీ కార్డులు ఉన్న విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఏబీవీపీ నేతల ఆందోళనకు మద్దతుగా బీజేపీ నేతలు కూడా రావడంతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి వెంటనే అక్కడకు చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరు తప్పు చేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఏబీవీపీ సంఘం నేతలు కాస్త మెత్తబడ్డారు. అనంతరం ఏయూ రిజి్రస్టార్, ఇతర అధికారులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. క్యాంపస్‌లో విద్యా వాతావరణాన్ని దెబ్బతీయవద్దని, రాజకీయ లేదా మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. వివాదాల పరిష్కారానికి పీస్ కమిటీ ఏర్పాటు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సమక్షంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, ఆర్డీఓ సుధా సాగర్, ఏసీపీ లక్ష్మణమూర్తి విద్యార్థి సంఘాలతో శనివారం సమావేశం అయ్యారు. వివాదానికి సంబంధించిన వీడియోలు, సాక్ష్యాధారాలను సోమవారం మధ్యాహ్నంలోగా రిజిస్ట్రార్‌కు అందించాలని రెండు వర్గాలకు సూచించారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ నాయకుల నుంచి వినతులు, అభ్యంతరాలు, వాదనలను పీస్ కమిటీ సభ్యులు సుమారు రెండు గంటల పాటు సావధానంగా విన్నారు. అలాగే మార్చి 2న పీస్ కమిటీ మరోసారి సమావేశమై తుది నిర్ణయం వెలువరిస్తుందని, అందుకు రెండు సంఘాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.ఏయూ ప్రధాన గేటు వద్ద నిరసన తెలుపుతున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు -
యువతి వీడియోలు తీసి.. మంగళగిరిలో దారుణం
-
నీరు తాగరు.. మూత్ర విసర్జనకు వెళ్లరు
సాక్షి, సిద్దిపేట : తగినంత నీరు తాగక.. మూత్ర విసర్జన చేయక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. విద్యార్థుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టారు. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి.. యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోవద్దని, మూత్రశాలల్లోనూ జాగ్రత్తలు తీసుకోకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడక తప్పదని ఆ అధ్యయనంలో తేలింది. 7 గంటలు.. 600 మిల్లీలీటర్లే.. పాఠశాలలో తరగతులు కొనసాగే 7 గంటల్లో విద్యార్థులు కేవలం 600 మిల్లీలీటర్ల నీటిని మాత్రమే తీసుకుంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ నేతృత్వంలో మూడు సెక్షన్లలో 15 ప్రశ్నలను రూపొందించారు. సిద్దిపేట జిల్లాలోని పలు పాఠశాలల్లో 6 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న 450 మంది విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు 3 నుంచి 4 గ్లాసుల నీళ్లు 75 శాతం, 5 నుంచి 6 గ్లాసులు 8 శాతం, 7కంటే ఎక్కువ 7 శాతం, 0 నుంచి 2 గ్లాస్‌ల నీళ్లు 10 శాతం మంది విద్యార్థులు తాగుతున్నారు. క్లాస్ జరుగుతుండగా వాటర్ తాగేవారు అప్పుడప్పుడు 66 శాతం, ఎప్పటికి తాగనివారు 8 శాతం, క్లాస్ టైమ్‌లో తాగనివారు 26 శాతం, ఇంటి నుంచి వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్న వారు 79 శాతం, తీసుకురాని వారు 21 శాతం మంది ఉన్నారు. స్కూల్లో యూరిన్‌కు వెళ్లేవారు రెండు సార్ల వరకు 29 శాతం, 3 నుంచి 4 సార్లు 54 శాతం, ఏడు సార్ల వరకు 17 శాతం మాత్రమే ఉన్నారు. క్లాస్ జరుగుతుండగా యూరిన్ వస్తే ఆపుకుంటున్నవారు 87 శాతం, పరి్మషన్ తీసుకుని వెళతాం అని 13 శాతం మంది విద్యార్థులు చెప్పారు. 56 మందిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు యూరిన్ పోస్తున్నప్పుడు నొప్పిగా ఉంటుందని 25 శాతం, ఎప్పుటికీ యూరిన్ వస్తుందని అనిపిస్తున్నట్టు 25 శాతం, కడుపు నొప్పితో జ్వరం వస్తున్న వారు 20 శాతం, యూరిన్ వాసన వస్తుందని 12 శాతం, యూరిన్‌లో బ్లడ్ అప్పుడప్పుడు వస్తుందని 4 శాతం మంది విద్యార్థులు చెప్పారు. దీంతో దాదాపు 56 మందికి మూత్రం ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 24 మంది నుంచి మూత్రం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌లో టెస్ట్ చేయించగా, వారిలో 16 మందికి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. చేతులు శుభ్రం చేసుకోవాలి యూరిన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. 70 శాతం మాత్రమే శుభ్రం చేసుకుంటుండగా, మిగతా 30 శాతం మంది అలాగే తరగతి గదికి వెళుతున్నారని తేలింది. మూత్రశాలకు వెళ్లగానే ముందుగా వాటర్ పోయాలి.. మూత్రం పోసిన తర్వాత మళ్లీ వాటర్ పోయాలి. అప్పుడే మూత్రశాలలో ఉన్న బ్యాక్టీరియాలను నియంత్రించొచ్చు. భయానికి నీళ్లు తాగడం లేదు నీరు ఎక్కువగా తాగితే మాటిమాటికి ఉపాధ్యాయులు మూత్ర విసర్జనకు అనుమతించరని చాలామంది విద్యార్థులు నీరు తాగడమే లేదు. దీంతోపాటు పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేకపోవడం, ఉన్నవి నిర్వహణ లేక దుర్గంధం వస్తుండటం కూడా విద్యార్థులు తాగునీటికి దూరంగా ఉంటున్నారు. దీంతో విద్యార్థులకు యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి.యూరిన్ వస్తే ఆపుకోవద్దు విద్యార్థులకు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. దీంతో మా కళాశాల విద్యార్థులచే అధ్యయనం చేపట్టాం. విద్యార్థులకు అందుబాటులో తాగేందుకు నీటిని ఉంచాలి. యూరిన్‌ను ఆపుకోవద్దు. విద్యార్థులందరికీ ఒకసారే ఇంటర్వెల్ ఇవ్వడంతో అందరూ వెళ్లేందుకు సమయం సరిపోవడం లేదు. రెండు క్లాస్‌లకు ఒకసారి విడతల వారీగా ఇంటర్వెల్ ఇవ్వాలి. విద్యార్థులు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు నీళ్లు తాగాలి. విద్యార్థులు రోజుకు 2 నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. అప్పుడే యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. – డాక్టర్ మదన్మోహన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగాధిపతి, సిద్దిపేట అవగాహన కల్పించేందుకే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకే ఈ అధ్యయనం చేపట్టాం. కొన్ని పాఠశాలల వారు సర్వేకు అనుమతి ఇచ్చారు. మరికొందరు ఇవ్వలేదు. మూత్రంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్న వాటిని ప్రత్యేక ల్యాబ్‌కు పంపించి టెస్ట్‌లు చేయిస్తున్నాం. –వినాయక్, హరిణిలత, సుషి్మత, గాయత్రి, వేదవాసిని, మమత మైక్రో బయోటెక్నాలజీ విద్యార్థులు -
ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: కామాంధుడి వికృతానికి రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో వంచించిన సీనియర్ విద్యార్థి అఘాయిత్యాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఉసురు తీసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పిల్లల్ని చదివించుకునేందుకు ఊరొదిలి తాడేపల్లి సమీపంలోని ఓ ఊరుకు వచ్చింది. భార్యాభర్తలు కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కుమారుడు విజయవాడలో చదువుతుండగా కుమార్తెను మంగళగిరిలోని ఓ డిగ్రీ కళాశాలలో చేర్చారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థినిని అదే కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యర్రబాలేనికి చెందిన రహీమ్ ప్రేమ పేరుతో లొంగదీసుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో విద్యార్థినికి తెలియకుండా వీడియోలు తీశాడు. రహీమ్ ప్రవర్తనలో మార్పురావడంతో ఆ విద్యార్థిని అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్‌చేసింది. ఈ నేపథ్యంలో రహీమ్ తాను, ఆ విద్యార్థిని కలసి ఉన్న వీడియోను ఆమెకు వాట్సాప్ చేశాడు. ఈ పరిణామంతో దిక్కుతోచని ఆమె గతరాత్రి ఇంట్లో మౌనంగా ఉంది. ఏంజరిగిందని తండ్రి, అన్న అడగటంతో.. తాను ఒకరిని ప్రేమించానని, అతడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. దీంతో కాలేజీకి వెళ్లవద్దంటూ మందలించిన తల్లి కుమార్తె వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుంది. విద్యార్థిని వద్ద నుంచి స్పందన లేకపోవడంతో రహీమ్ కొన్ని వీడియోలను పలువురు విద్యార్థులకు పంపించాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన సీనియర్ విద్యార్థికి ఈ వీడియోలు పంపించినట్లు తెలియడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. అవమానాన్ని తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో సీలింగ్‌ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని మృతిచెందింది. పనికి వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా ఉరికి వేళ్లాడుతున్న కుమార్తె కనిపించింది. దీంతో గుండెలు పగిలేలా రోదిస్తూ భర్తకు, కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన తండ్రి ‘ఒకసారి నేనుమాట్లాడతాను. నువ్వు ఏమీ చేసుకోవద్దు. నిన్ను వేరే కాలేజీలో చేర్పిస్తాను’ అని చెప్పినా ఇలా చేసుకున్నావేంటమ్మా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. కాలేజీలు, చదువులు బాగుంటాయని సొంత ఊరునుంచి ఇక్కడికి వచ్చి కూతుర్ని బలిచేసుకున్నానంటూ రోదిస్తున్నాడు. జరిగిన విషయాన్ని తాడేపల్లి ఎస్ఐ వెంకటసాయికుమార్కు వివరించాడు. నెలరోజులుగా బ్లాక్మెయిల్ ఆ విద్యార్థినిని రహీమ్ నెలరోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. తోటి విద్యార్థుల వద్ద అది నా దగ్గరకు ఎందుకురాదు? నా కోరిక ఎందుకు తీర్చదో చూస్తాను.. అంటూ పలుమార్లు అశ్లీలంగా మాట్లాడాడని సమాచారం. గురువారం సాయంత్రం కూడా.. రేపు నాతో మాట్లాడుతుంది.. అంటూ తోటి విద్యార్థులతో చాలెంజ్ చేసిన రహీమ్ ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ విద్యార్థినికి పంపించినట్లు తెలిసింది. నాలుగు రోజులుగా వీడియోలను కాలేజీ విద్యార్థులు పలువురికి పంపించినట్లు తెలిసింది. కొందరు విద్యార్థుల ద్వారా అధ్యాపకులకు కూడా ఈ వీడియోలు షేర్ అయినట్లు సమాచారం. కనీసం అప్పుడైనా కాలేజీ యాజమాన్యం స్పందించి ఉంటే ఈ విద్యార్థిని ప్రాణాలు దక్కేవని భావిస్తున్నారు. -
విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
చివ్వెంల(సూర్యాపేట): తనను దూరం పెడుతోందనే అక్కసుతో లా విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిపై ప్రేమెన్మాది సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిండ్ల మహేశ్, సమీప గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఆ యువతి హైదరాబాద్‌లో లా నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఆమె స్వగ్రామానికి వచ్చింది. అక్కడ నుంచి చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని స్నేహనగర్‌లో అద్దెకు ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చి ఉంటోంది. తాను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని ఆమెపై మహేశ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మహేశ్ సూర్యాపేట పట్టణంలోని ఓ షాపులో సుత్తి కొనుగోలు చేసి గురువారం ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. యువతి అక్క, బావ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో తనతో తెచ్చుకున్న సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె కేకలు వేయడంతో ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు వచ్చి మహేశ్‌ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మహేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ స్కూలులో శనివారం రాత్రి ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాలు.. కనిగిరికి చెందిన సయ్యద్ ఆలీ, భార్య మౌలాబికి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు తౌషిక్(11) మూలగుంటపాడులోని శ్రీచైతన్య నవోదయలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల వార్డెన్ బాబ్జి తరుచూ తౌషిక్‌ను కొడుతుండటంతో.. కరస్పాండెంట్ రమణారెడ్డికి విద్యార్థి తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వార్డెన్ బాబ్జి సెల్‌ఫోన్ నుంచి తౌషిక్ తన తల్లి మౌలాబితో ఆనందంగా మాట్లాడాడు. ఆ తర్వాత అరగంటకే పాఠశాల నిర్వాహకుల నుంచి తౌషిక్ తల్లిదండ్రులకు ఫోన్ వచి్చంది.మీ కుమారుడు బాత్రూంలో టవల్‌తో ఉరేసుకున్నాడని.. కందుకూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేసి వెళ్లిపోయారంటూ తౌషిక్ తల్లిదండ్రులు విలపించారు. తన సెల్‌ఫోన్‌ను ఉపయోగించినందుకు వార్డెన్ బాబ్జి కొట్టడంతో తౌషిక్ స్పృహ తప్పి పడిపోయాడని సహ విద్యార్థులు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల నిర్వాహకులు మాత్రం తౌషిక్ బాత్రూంలోని హ్యాంగర్‌కు ఉరేసుకొని చనిపోయాడంటున్నారని వాపోయారు.ఆ హ్యాంగర్ పిల్లల చేతికి అందే ఎత్తులో ఉందని.. దానికెలా ఉరేసుకొని చనిపోతాడంటూ వారు ప్రశి్నంచారు. గొంతుపై గాట్లు ఎందుకున్నాయని నిలదీశారు. తమ కుమారుడిని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ఆలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం తౌషిక్ మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద ధర్నా చేశారు. కరస్పాండెంట్ రమణారెడ్డి, ఆయన కుమారులిద్దరూ పరారయ్యారని తెలియడంతో.. పాఠశాలపై దాడి చేసి పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఎస్సై బి.మహేంద్ర పాఠశాల వద్దకు చేరుకొని.. వారికి నచ్చజెప్పి పంపించేశారు. -
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. -
రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్‌ఎమ్‌ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్‌రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. -
నాగార్జున వర్శిటీ విద్యార్థిపై విజ్ఞాన్ వర్శిటీ విద్యార్థుల దాడి
-
తరగతి గదిలో కాల్పుల కలకలం
చంఢీగడ్: లా కాలేజీ తరగదిలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తరగతి గదికి గన్‌తో వచ్చిన ఓ విద్యార్థి.. తోటి విద్యార్థినిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం, తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో తరన్ తారన్ జిల్లాలో చోటు చేసుకుందిపోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన పంజాబ్ ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్‌గా, మరణించిన విద్యార్థినిని నౌషెహ్రా పన్నువాన్‌కు చెందిన సందీప్ కౌర్‌గా గుర్తించారు. కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ప్రిన్స్ రాజ్ కాలేజీ బ్యాగ్‌తో తరగతి గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ప్రిన్స్ రాజ్ వారిద్దరి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. కొద్దిసేపటికి ముగ్గురూ వెనుక సీట్లలో కూర్చున్నారు. అయితే కొన్ని క్షణాల తర్వాత ప్రిన్స్ రాజ్ అకస్మాత్తుగా లేచి, బ్యాగ్‌లోని తుపాకీని బయటకు తీసి, సందీప్ కౌర్‌పై నేరుగా కాల్పులు జరిపాడు. కౌర్ నేలపై కుప్పకూలగా, మరో క్లాస్మేట్ షాక్‌తో వెనక్కి తగ్గింది. వెంటనే ప్రిన్స్ రాజ్ తనపై తానే కాల్పులు జరిపి నేలకొరిగాడు.కాల్పులు జరిగిన వెంటనే తరగతి గదిలోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. తరగతులు ప్రారంభం కానున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత కలకలం రేపింది. సందీప్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని సందీప్ కౌర్ తల్లి కాల్పుల ఘటనపై స్పందించారు. ప్రిన్స్ రాజ్ తుపాకీతో కళాశాలలోకి ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 🚨 First-year law college student allegedly shot a fellow student inside a classroom in Punjab’s Tarn Taran district Accused identified as Prince Raj opened fire on Sandeep Kaur, he died on the spot. Prince later shot himself with the same weapon and was taken to hospital in… pic.twitter.com/sDghCJiYr0— Nabila Jamal (@nabilajamal_) February 9, 2026 -
క్లాస్ రూమ్ లో యువతిని కాల్చి.. పంజాబ్ లో దారుణం


