
బాపట్ల టౌన్: పాఠశాలలో ప్రిన్సిపల్ మందలించారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాపట్లలోని వెంగళ్‌విహార్‌కు చెందిన ఓ విద్యార్థిని సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని, తోటి స్నేహితుల ముందు విద్యారి్థనిపై ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్తాపానికి గురైన విద్యార్థిని 2 రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు.
ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి.. ప్రిన్సిపాల్‌తో నాన్న మాట్లాడి వచ్చారని, శనివారం నుంచి స్కూల్‌కు వెళ్లాలని చెప్పింది. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని శుక్రవారం సాయంత్రం బాపట్ల–గుంటూరు ప్‌లై ఓవర్ బ్రిడ్జి క్రింద రైలు పట్టాలపైకి చేరుకుంది. రైలు వెళ్తున్న సమయంలో రెండు కాళ్లు రైల్వేట్రాక్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు తెగిపోయాయి. ఆమెను స్థానికులు స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా..అక్కడ విద్యారి్థని కాళ్లకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.