‘బాబుకు రైతులంటే చిన్నచూపు.. మరోసారి తేలిపోయింది’ | Kurasala Kannababu Slams Chandrababu Naidu Govt Budget, Calls It Anti Farmer And Deceptive | Sakshi
Sakshi News home page

‘బాబుకు రైతులంటే చిన్నచూపు.. మరోసారి తేలిపోయింది’

Feb 14 2026 6:23 PM | Updated on Feb 14 2026 6:29 PM

Kurasala Kannababu Reaction To Chandrababu Govt Budget

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది రైతులను విస్మరించిన బడ్జెట్.. రైతు, రైతు కూలీల ప్రస్తావనే లేని వ్యవసాయ బడ్జెట్‌ని చూస్తున్నాం.. చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపని మరోసారి తేలిపోయిందని.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందన్నారు.

‘‘ఈ బడ్జెట్ చూశాక ప్రభుత్వం దృష్టిలో అసలు రైతులు లేరని తేలిపోయింది. బస్తా యూరియా కూడా అందించలేని ప్రభుత్వం ఇది. కిలో మంచి విత్తనాలు కూడా అందించలేని దగా ప్రభుత్వం ఇది. కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎలా చెప్పుకుంటున్నారు?. అన్నదాత సుఖీభవ కింద రూ.10,200 కోట్లు బడ్జెట్‌లో పెట్టాలి. కానీ రూ.6,600 కోట్లు మాత్రమే పెట్టటం ద్వారా రైతులను ఏం చేయదలచుకున్నారు?. ప్రభుత్వం దెబ్బకు రైతులంతా కూలీలుగా మారి పోతున్నారు.

..బడ్జెట్‌లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. రైతుల సంక్షేమం మీద ఈ ప్రభుత్వానికి ఒక వ్యూహం లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఏటా రూ.3 వేల కోట్లు బెట్టేవారు. గిట్టుబాటు ధరల్లేకపోతే ప్రభుత్వమే ఆదుకునేది. మరి కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో ఎందుకు కేటాయించలేదు?. జగన్ తెచ్చిన ఉచిత బీమా సౌకర్యాన్ని ఎత్తేసి రైతుల కడుపు కొట్టారు. చంద్రబాబు ఆక్వా రైతులనూ మోసం చేశారు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు నిలువునా ముంచారు

..వైఎస్సార్‌ హయాంలో హార్టికల్చర్ వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా తన ఘనత అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్రైవేటీకరణ మీద ప్రేమ.. చివరకు రైతు బజార్లను కూడా నిర్వహించలేక, ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌కు భజన చేయటంలో కూటమి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ప్రతిరోజూ సగటున ఒకరు, రైతు కూలీలు నలుగురు చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను అందుకునేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?.

..టీడీపీ ఎమ్మెల్యేనే పల్లె కన్నీరు పెడుతోందని వాపోయాడు. వీటన్నిటి డైవర్షన్ కోసం లడ్డూలో కల్తీ అంటూ కథలు అల్లుతారు. ఏ వర్గానికీ మేలు చేయలేక నిత్యం వైఎస్‌ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మూడో బడ్జెట్ పెట్టినా ఇంకా మోసాలే చేస్తారా?. ఈ బడ్జెట్ కేవలం అంకెల ఆర్భాటమే. అప్పులతోనే బండి నడుపుతామనే సంకేతం ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement