Budget
-
కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా
-
భట్టి బడ్జెట్.. అంతా బోగస్: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్,ప్యూర్,రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్ అంతా బోగస్ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బడ్జెట్ అంతా డొల్లే కాంగ్రెస్ పై BRS ఎమ్మెల్యేల ఫైర్
-
బడ్జెట్ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు. -
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్.. హైలైట్స్ ఇవే
👉తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ఆరు గ్యారెంటీలకు రూ.50713 కోట్లు కేటాయింపుసంక్షేమం - అభివృద్ధికి రూ.145592 కోట్లుఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా – ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల కవరేజ్విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభంఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొత్తగా అమలుయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభందివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీజీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ – 3 కార్పొరేషన్లుహైదరాబాద్కు “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మాణంCURE–PURE–RARE మోడల్ ద్వారా రాష్ట్ర అభివృద్ధిరైతులకు సోలార్ పంపు సెట్లు – 100 శాతం సబ్సిడీభూ భారతి చట్టం–2025 అమలుAI ఆధారిత ‘భూ మిత్ర’ చాట్‌బాట్ ప్రవేశపెట్టడంప్రజావాణి కార్యక్రమం – నేరుగా ఫిర్యాదుల స్వీకరణప్రజాపాలన-ప్రగతి 99 రోజుల ప్రోగ్రాంసీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులు -ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్సమగ్ర ప్రమాద బీమా పథకం ప్రభుత్వ ఉద్యోగులకుమహిళా ఎస్‌హెచ్‌జీలకు బస్సులు, పెట్రోల్ బంకులు274 మొబైల్ అంగన్వాడీలు ఏర్పాటు - 500 అంగన్వాడీ-కమ్-క్రెచ్ సెంటర్లుగోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు (రూ.500 కోట్లు)మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ - మెట్రో ఫేజ్-II, III విస్తరణఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం, ఛార్జింగ్ స్టేషన్లుడ్రగ్స్ నియంత్రణకు EAGLE ప్రత్యేక దళం ఏర్పాటు👉ఉద్యోగులకు నగదు రహిత వైద్యంనగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వంప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటనప్రభుత్వాస్పత్రులతో పాటు 421 ఎంపానల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్న ప్రభుత్వంరాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనంఈ పథకం కింద మొత్తం 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని పేర్కొన్న ప్రభుత్వం👉తెలంగాణ వార్షిక బడ్జెట్.. కేటాయింపులు ఇలా.. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం రూ. 47,267 కోట్లుజూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకంవ్యవసాయం-రూ.23,179 కోట్లువిద్యుత్శాఖ-రూ. 21,285 కోట్లువిద్యాశాఖ-రూ.26,674 కోట్లుమహిళ, శిశు సంక్షేమం-రూ.3143 కోట్లుపశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లుసివిల్ సప్లై-రూ.7,366 కోట్లువైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లురాజీవ్ యువవికాసం- రూ. 6000 కోట్లుఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లుఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లుమైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లుఇరిగేషన్ -రూ.22615 కోట్లుమున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లుగృహ నిర్మాణం- రూ.7430 కోట్లుఐటీ- రూ.875 కోట్లుచేనేత- రూ.258 కోట్లుపరిశ్రమలు- రూ. 3490 కోట్లుపంచాయతీ రాజ్- రూ.33688 కోట్లుఆర్అండ్బీ - రూ.12789 కోట్లున్యాయ శాఖ- రూ.2367 కోట్లుహోంశాఖ- రూ. 121907 కోట్లుటూరిజం- రూ. 1224 కోట్లుగోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలు(అప్పుల రుపం లో)-80 వేల కోట్లుకొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లుద్రవ్య లోటు- 58458కోట్లుప్రాథమిక లోటు -37154ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే 43 వేల కోట్ల అదనపు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వంఅప్పుల చెల్లింపు -23024భూముల అమ్మకం ,ఇతర మార్గాలు -35730వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు 2500 కోట్లుఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం 350 కోట్లుపంచాయతీ రాజ్ రోడ్లకు 2622 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు,చేయుత పెన్షన్లకు రూ.14,861 కోట్లుకొత్తగా 2 లక్షల మంది అర్హులకు చేయుత పింఛన్లు మంజూరుపంచాయతీ రాజ్ హమ్ రోడ్లకు రూ.1372 కోట్లుకనస్ట్రషన్ అఫ్ రూరల్ రోడ్లుకు రూ.750 కోట్లుమెయిటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ రూ.500 కోట్లుకేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలు CSS పథకాల ద్వారా భారీగా నిధుల సమీకరణప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,072 కోట్లు సాధన2021-22లో రూ.4,826 కోట్లు పొందిన రాష్ట్రంనిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ పెరుగుదలబడ్జెట్లో విద్యకు 8.22 శాతం కేటాయింపుప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీంఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకంవెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లుఉస్మానియా యూనివర్సిటీ కి 1000 కోట్లు2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులుచాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లుఅడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీ లకి నెలకు 2000 స్కాలర్ షి👉ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931తెలంగాణ వృద్ధి రేటు 10.2 శాతందేశ తలసరి ఆదాయం రూ. 2,19,575దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.9 రెట్లు ఎక్కువప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యం: భట్టి2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్ధడమే లక్ష్యం 👉ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..ATCలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్ షిప్..👉తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం👉ముగిసిన కేబినెట్ సమావేశంరాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపిన కేబినెట్👉అసెంబ్లీలో పాము కలకలం..అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పాము ను పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..పాము ను ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన ట్రాఫిక్ పోలిస్..👉బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కభట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులునల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భట్టి విక్రమార్క👉మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్కమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్రూ.3.35 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం👉బడ్జెట్ ముందు ఉదయం ప్రజాభవన్‌లోని పోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు👉ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకోనున్న భట్టి..👉మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తారు.👉అనంతరం బినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు.👉అదే సమయంలో శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు. 👉ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.35 లక్షల కోట్ల వరకు అంచనాలతో ప్రతిపాదనలను శుక్రవారం అసెంబ్లీ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖరారు చేసినట్టు సమాచారం.👉స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా ఆరు పథకాలను ప్రతిపాదిస్తూ, 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి. -
రూ.3.35 లక్షల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.35 లక్షల కోట్ల వరకు అంచనాలతో ప్రతిపాదనలను శుక్రవారం అసెంబ్లీ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖరారు చేసినట్టు సమాచారం. స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా ఆరు పథకాలను ప్రతిపాదిస్తూ, 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి. ఈసారి దూకుడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే గత రెండు బడ్జెట్లలోనూ ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. అనేక అంచనాలు, ఆశలతో ఈసారి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, 2025–26లో 5 శాతం పెంచి రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అదే ఒరవడి కొనసాగితే 2026–27కు రూ.3.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముంది. కానీ ఏకంగా 10 శాతం పెంపుతో బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సొంత పన్నుల ఆదాయంపై నమ్మకంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధుల సమీకరణ పెరిగే అవకశాముందనే అంచనాలు, భూముల అమ్మకాలు, భూముల విలువల సవరణల ద్వారా మరిన్ని నిధులు సమకూరతాయనే ఆలోచనతో రూ.3.35 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అప్పుల పద్దూ భారీగానే..! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 64,539 కోట్లు సేకరించాలని నిర్ణయించగా, ఈసారి దాన్ని రూ.80 వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత రెండు బడ్జెట్లలో భూముల అమ్మకాల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదనలు లేవు. కానీ ఈసారి అనివార్యమవుతోందని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ద్వారా రూ.3 వేల కోట్ల వరకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రతిపాదన కూడా చేయనున్నట్టు సమాచారం. రూ.50 వేల కోట్ల మూలధన వ్యయ ప్రతిపాదనలు విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అదే విధంగా మూలధన వ్యయాన్ని కూడా పెంచనున్నారు. 2025–26లో రూ.36 వేల కోట్ల మూల ధన వ్యయం అంచనా వేసినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది రూ.50 వేల కోట్లను చేరింది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతిపాదనలే రూ.50 వేల కోట్లకు చేరనున్నట్టు సమాచారం. 2025–26లో రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్‌కు గాను రూ.2.90 లక్షల కోట్ల వరకు సవరించిన అంచనాలుంటాయని భావిస్తూ ఈ మొత్తానికి మరో రూ.45 వేల కోట్లు కలిపి ఈసారి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు సమాచారం. అభిజిత్ లగ్నం..రేవతి నక్షత్రం విజయ ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశలో ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రేవతి నక్షత్ర అభిజిత్ లగ్నం సమయంలో అసెంబ్లీ ముందుంచనున్నారు. దీనికి ముందు ఉదయం ప్రజాభవన్‌లోని పోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకోనున్న భట్టి.. మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తారు. 9:30 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అదే సమయంలో శాసనమండలిలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి సాయం పెంపుఈసారి బడ్జెట్లో ఎప్పటిలాగే సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు యంగ్ ఇండియా స్కూల్స్ వరకు అన్నిటి బడ్జెట్ రూ.లక్ష కోట్లు దాటనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, సన్న బియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అన్ని పథకాలను కొనసాగించేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నారు. అదే సమయంలో చేయూత పింఛన్లు రూ.500 చొప్పున పెంపు, కల్యాణలక్ష్మికి రూ.50 వేల అదనపు లబ్ధి ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. వీటికి తోడు మరో ఆరు కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారని సమాచారం. రాష్ట్రంలోని దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రకటిస్తారని, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, యంగ్ ఇండియా కిట్స్, పారా అథ్లెట్లకు ఇళ్ల స్థలాలు, వృద్ధ అర్చకులకు పింఛన్లకు తోడు ఎన్నికల హామీలో భాగంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్లు అందించే కార్యక్రమానికి కూడా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. -
ప్రణాళికా లక్ష్యం లేని మన బడ్జెట్లు
కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లు ప్రతి ఏడాదీ అంతకు ముందు ఏడాది కన్నా 10, 15 శాతం పెంపుదల చేసినట్లు చూపుతూ ప్రకటిస్తు న్నారు. 2026 జనవరి 28న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఇందుకు తాజా ఉదాహరణ. 2025–26కు రూ. 50 లక్షల కోట్లు ఉండగా, 2026–27కు రూ.53 లక్షల కోట్లకు బడ్జెట్‌ను పెంచారు. గత 2 దశా బ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతున్నది. 2014 ఆగస్టు 17న మోదీ ప్రభుత్వం ప్రణాళికా బోర్డును రద్దుచేసి ‘నీతి ఆయోగ్’ ఏర్పాటు చేసింది. 13వ పంచవర్ష ప్రణాళికా రచనకు విముఖత చూపింది. 1995 నుండి సరళీకృత ఆర్థిక విధానాల అమలు చేయడం వల్ల అనివార్యంగా డబ్ల్యూటీఓ ఆంక్షలకు అనుగుణంగా మన లక్ష్యాలను మరచి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మామూలయ్యింది.అందువల్ల, 2000 సంవత్సరం నుండి వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తుల్లో ఆశించిన పెరుగుదల లేదు. వ్యవసాయ పరిశోధనలను తగ్గించి వేశారు. విత్తన టెక్నాలజీని ఇతర దేశాల నుండి (మోన్శాంటో, డూపాయింట్, సింజెంటా, బేయర్) దిగుమతి చేసుకొని మన వ్యవసాయ పరిశోధనలకు నష్టం కలిగిస్తున్నారు. ఒక దశలో ఆహార ధాన్యాలు (బియ్యం, గోధుమలు), మాంసం, పాలు, పత్తి, పంచదార, పంటలు ఎగుమతి చేసిన దశ నుండి నేడు దిగుమతి చేసుకున్న దశకు చేరుకున్నాం. అయినా, పాలక వర్గాలు బడ్జెట్లలో తమ లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం లేదు. అందువల్ల, ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా కేంద్రంలోను, రాష్ట్రంలోను ఆర్థిక, సాంఘిక, సామాజిక పెరుగుదలకు అవకాశాలు లేకుండా పోయాయి. ఎప్పుడూ లోటు బడ్జెటే!2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా ఆమోదిస్తున్న బడ్జెట్లలో 20–25 శాతం వరకు ఆదాయ లోటు కనిపిస్తోంది. ఫలితంగా దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ, స్త్రీ–శిశు సంక్షేమం, స్థానిక సంస్థలకు కేటాయింపులలో కోతలు పెడుతున్నారు. ఆదాయాన్ని పెంచి చూపడానికి ‘పన్నేతర ఆదాయం’ (నాన్ ట్యాక్స్ రెవెన్యూ),‘గ్రాంటు’ (కేంద్ర, విదేశీ ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంటు)లను కలిపి వాస్తవ ఆదాయానికి మించి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 2025–26లో గడిచిన 10 మాసాలలో (ఏప్రిల్ 2025 జన వరి 2026 వరకు) నాన్ ట్యాక్స్ రెవెన్యూ... బడ్జెట్లో రూ. 31,618.77 కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 7,864.18 మాత్రమే! గ్రాంట్లుగా బడ్జెట్లో రూ. 22,782.50 కోట్లు చూపగా... వచ్చిన ఆదాయం రూ.4,213.29 కోట్లు మాత్రమే! పై గణాంకాలు అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక లోనివి. 2026 మార్చి 16 నుండి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నది. ప్రస్తుత బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు కాగా దాన్ని 10–15 శాతం తగ్గించి, 2026–27 బడ్జెట్‌ను 15–20 శాతం పెంపు దల చూపుతారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక–సామాజిక అభివృద్ధిలో ఎలాంటి మార్పూ ఉండదు. ప్రతి బడ్జెట్లో 25 శాతం వడ్డీల కింద చెల్లిస్తున్నట్లు చూపిస్తున్నారు. మిగిలిన నిధులతో ప్రయోజనాత్మకంగా బడ్జెట్‌ను రూపకల్పన చేయాలి. విద్య, వైద్యం, మౌలిక సదుపా యాల కల్పన, చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథ కాలకు తగిన నిధులు కేటాయించి అసలైన అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడు మాత్రమే సరైన ఫలితాలు ప్రజలకు అందుతాయి.– సారంపల్లి మల్లారెడ్డి ‘ అఖిల భారత కిసాన్ సభ పూర్వ ఉపాధ్యక్షుడు -
'లెక్క'లేక చిక్కులు!
సాక్షి, అమరావతి : తన పాలనలో రాష్ట్రం వృద్ధిలో దూసుకుపోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న గణాంకాలన్నీ మిథ్యేనని తేలిపోయింది. బాబు తొలి బడ్జెట్ అంకెల గారడీతో మోసం చేయడమే తప్ప కేటాయింపులకు తగినట్లు వ్యయం లేదని స్పష్టమైంది. 2024–25లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే రెవెన్యూ రాబడులు ఏకంగా 3.51 శాతం తగ్గిపోయాయని తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య అకౌంట్స్‌పై కాగ్ నివేదికలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో ఆదాయ వసూళ్లలో 3.51 శాతం తగ్గుదల ఉందని వెల్లడించింది. ఇదే రీతిలో రాష్ట్ర పన్నేతర ఆదాయం 19.64 శాతం తగ్గిపోయిందని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే ఏకంగా 41.82 శాతం తగ్గిపోయిందని ఎత్తి చూపింది. 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2,69,928 కోట్లుగా పేర్కొనగా, వాస్తవంగా రూ.2,49,191 కోట్లే వచ్చాయని కాగ్ పేర్కొంది. అంటే రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.20 వేల కోట్ల మేర తగ్గిపోయాయి. మూల ధన వ్యయం బాగా తక్కువ బడ్జెట్లో కేటాయింపుల మేరకు మూల ధన వ్యయం చేయలేదని.. ఇరిగేషన్, గృహ నిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు వ్యయం చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. 40 రంగాల్లో.. 10 రంగాలకు చేసిన గ్రాంట్లలో 50 శాతం కన్నా తక్కువ వ్యయం చేసినట్లు ఎత్తి చూపింది. మరో పక్క గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతోపాటు ఇతర సంస్థలకు గ్రాంట్లు కూడా అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో ఏకంగా రూ.10,620 కోట్లు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2024–25లో మూల ధన వ్యయం కింద రూ.45,382 కోట్ల వ్యయం చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా రూ.16,141 కోట్లే వ్యయం చేశారని తెలిపింది. ఇది జీఎస్డీపీలో కేవలం ఒక శాతం మాత్రమేనని ఎత్తి చూపింది. అదే 2023–24 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం రూ.23,330 కోట్లు అని పేర్కొంది. -
ఆచరణ సాధ్యం కాని బడ్జెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై మేధావులు పెదవివిరుస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న ఈ బడ్జెట్ వల్ల ఆకాంక్షలు తప్ప ఆచరణ సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. ఆ కోవలోనే సీనియర్ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం రూ.2.34 లక్షల కోట్లు అని ప్రభుత్వం అంచనా వేసింది గానీ, ఆ మేరకు కచ్చితంగా ఆదాయం రాదని ఆయన స్పష్టంచేశారు. 2025–26లో వచ్చింది రూ.1.96 లక్షల కోట్లు అయితే, అంతకుముందు ఏడాది కూడా రూ.1.67 లక్షల కోట్లే వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఎంత ఎక్కువ లెక్కేసుకున్నా రూ.2.15 లక్షల కోట్లకు మించదన్నారు. ఈ లెక్కన రూ.20 వేల కోట్లు ఇక్కడే తగ్గిపోతుంటే, దానిని కూడా ఆదాయంగా భావించి పథకాలు రూపొందించడం వల్ల వాటి అమలుపై ప్రభావం పడుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇలా రాని ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పడం వల్ల బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఐవైఆర్ వివరించారు. మసిపూసి మారేడు..రెవెన్యూ లోటు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఊహాజనితంగా మాట్లాడుతోందని ఐవైఆర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ నాటికే రూ.60 వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని తెలిపారు. అలాంటిది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది మొత్తానికి గాను రూ.41 వేల కోట్ల దగ్గర రెవెన్యూ లోటును నియంత్రిస్తామని ప్రభుత్వం ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ లోటు ప్రభుత్వం చెబుతున్న దానికి రెట్టింపు అయ్యి రూ.80 వేల కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని, లేదంటే బడ్జెట్‌కు ఉన్న విశ్వసనీయత తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.మూలధన వ్యయం 2024–25లో రూ.16 వేల కోట్లు ఉంటే, 2025–26లో బడ్జెట్లో రూ.40 వేల కోట్లుగా చూపించి, సవరించిన పద్దుల్లో రూ.33 వేల కోట్లు ఉంటుందని చెప్పారన్నారు. అంచనాలకే బడ్జెట్ పరిమితమయ్యే అవకాశం ఉందా... ఆచరణ సాధ్యం కాదా... అంటే సాధ్యం కాదనే అనిపిస్తోందని ఐవైఆర్ తన విశ్లేషణలో స్పష్టంచేశారు. అప్పులు తీర్చడానికి బడ్జెట్లో ఎంత పోతుంది? పెండింగ్ బిల్లులకు ఎంత వెళుతుందనేది చెప్పాలి. ఈ బడ్జెట్‌ను చూస్తే మసిపూసి మారేడు చేసినట్లుగా ఉందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. -
సూపర్ సిక్స్ హామీలకు మంగళం.. మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా
సాక్షి, అమరావతి: ⇒ నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3 వేలు..⇒ 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా ఏడాదికి రూ.18 వేలు..⇒ 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్..⇒ సున్నా వడ్డీతో మహిళా పొదుపు సంఘానికి రూ.10 లక్షలు, ఒక్కో రైతుకు రూ.3 లక్షలు చొప్పున రుణాలు..⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్.. మెరుగైన పీఆర్సీ..!!⇒ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీలివీ! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి మరీ వంచించడం.. మూడు బడ్జెట్లలోనూ సూపర్ సిక్స్‌ల ఊసే లేకపోవడం.. ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలకే దిక్కులేకుండా పోవడంపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల హామీలను అమలు చేస్తామని ప్రతి ఇంటికీ గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. ఇదో క్లాసిక్ కేస్ స్టడీ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రధాన పాత్ర పోషించాయని కూటమి నేతలు కూడా పలు సందర్భాల్లో అంగీకరించారు. అలాంటిది.. కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి దారితీసిన ఆ హామీలను అమలు చేయకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, రాజకీయాల్లో నైతికతకు తిలోదకాలు ఇవ్వడమేనని స్పష్టం చేస్తున్నారు.మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారనేందుకు చంద్రబాబు సర్కార్ అత్యుత్తమ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోను ‘మోసఫెస్టో’గా మార్చేసి ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు అపహాస్యం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చంద్రబాబు నేతృత్వంలో 2024–25, 2025–26, తాజాగా ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లోనూ సూపర్ సిక్స్ హామీల అమలుకు కేటాయింపులు చేయలేదు. దీన్ని బట్టి ఆ హామీలకు ఇక మంగళం పాడేశామని మూడో బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు సర్కార్ తేల్చి చెప్పినట్లైందని పేర్కొంటున్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు సామూహికంగా వెన్నుపోటు పొడిచారన్నది స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా అడ్డగోలుగా హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంపై ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాలని కోరుతున్నారు. హామీలకు గ్యారంటీ ఇస్తూ ఇంటింటికీ బాబు బాండ్లు..సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్.. సెవెన్.. అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. వాటి ద్వారా ఆ కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం కూడా చేశారు. మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్ వెబ్సైట్లో నమోదు చేశారు. కుటుంబ యజమాని ఫోన్ నెంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నెంబరును వెబ్సైట్లో నమోదు చేసుకుని సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనంపై ప్రచారం చేశారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు వెబ్‌సైట్‌కు మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నెంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. వాటిని కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో తేల్చి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో నమ్మబలికారు. బాండ్లు ఇచ్చి మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి...టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి 20 నెలలు పూర్తయింది. మూడు బడ్జెట్లను ఇప్పటికే ప్రవేశపెట్టారు. వాటిలో సూపర్ సిక్స్ ప్రధాన హామీల అమలు ప్రస్తావనే లేదు. అంటే.. ఆ హామీలను అమలు చేయబోమని చంద్రబాబు సర్కార్ తెగేసి చెప్పిందన్నమాట! హామీల అమలుకు ఇంటింటా గ్యారంటీ బాండ్లు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేయడం దేశంలో ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రెండో మూడో అమలు చేయకపోవడం సాధారణం. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సింహభాగం తుంగలో తొక్కడం ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంటున్నారు.సామూహికంగా వెన్నుపోటు..సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ప్రతి ఇంటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో సర్వత్రా మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లను పరిశీలించి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ఆ బాండు ప్రకారం తమ ఇంటికి ఏడాదిలో రావాల్సిన మొత్తాన్ని లెక్కించి.. వడ్డీతో సహా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టింది రూ.21,600 కోట్లుసూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగ భృతి మాటే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా హామీ ప్రకారం ఏడాదికి మొత్తం రూ.7,200 కోట్లు చెల్లించాలి. మూడు బడ్జెట్లలోనూ పైసా ఇవ్వకుండా నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు మొత్తం రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు.ఆడబిడ్డలకు రూ.97,200 కోట్ల ఎగనామం!సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధాన హామీ ఆడబిడ్డ నిధి పథకం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఏటా రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లలోనూ ఒక్క పైసా కేటాయించలేదు. 2026–27 బడ్జెట్లోనూ కనీసం ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు చంద్రబాబు ఇప్పటికే రూ.97,200 కోట్లు ఎగ్గొట్టారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు బురిడీ!50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఈ పథకానికి ఒక్క పైసా ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చంద్రబాబు రూ.28,800 కోట్ల మేర ఎగ్గొట్టారు.సున్నా వడ్డీకి సున్నా.. సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఒక్కో సంఘానికి రూ.పది లక్షలు.. ఒక్కో రైతుకైతే రూ.3 లక్షలు చొప్పున రుణాలు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు గతంలో ఏటా సున్నా వడ్డీ కింద లబ్ధి పొందారు. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింప చేయాలంటే ఏడాదికి రూ.5 వేల కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించాలి. మూడు బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా మహిళలకు చంద్రబాబు రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక సున్నా వడ్డీ కింద ఒక్కో రైతుకు రూ.3 లక్షల రుణాన్ని ఇవ్వాలంటే ఏడాదికి కనీసం రూ.వెయ్యి కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిధులు కేటాయించకుండా రైతులకు రూ.3 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు. మొత్తంగా సున్నా వడ్డీ పథకానికి సున్నా చుట్టి మహిళలు, రైతులకు రూ.18 వేల కోట్ల మేర చంద్రబాబు ఎగనామం పెట్టారు!ఉద్యోగుల బకాయిలు రూ.40 వేల కోట్లు!తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతవరకూ ఐఆర్ ప్రకటించకపోగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్‌ను రద్దు చేశారు. కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.తల్లులకు బాబు వంచన..తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!రైతులకు వెన్నుపోటు..పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్లోనూ (2026–27) అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు మొత్తంగా మూడేళ్లలో దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.బడ్జెట్ సాక్షిగా సూపర్ సిక్స్‌లు ఔట్..!ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, పొదుపు మహిళలు, రైతులకు సున్నా వడ్డీ పథకాలకు పైసా కూడా కేటాయింపులు చేయకుండా బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టారు. ఎన్నికల హామీ మేరకు ఈ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు రూ.1.62 లక్షల కోట్లకుపైగా మహిళలు, నిరుద్యోగులు, రైతులకు ఎగ్గొట్టారు. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, ఉచిత బస్సు పథకాలకు అరకొరగా విదిలించి, తగినన్ని నిధులు ఇవ్వకుండా దాదాపు మరో రూ.60 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు. ఇలా ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా మూడేళ్లలో సుమారు రూ.2.22 లక్షల కోట్ల మేర అన్ని వర్గాలకు చంద్రబాబు ఎగ్గొట్టారు. -
ఇది మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ప్రజలకు నిరాశ, నిస్పృహ కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు లేవు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు...నాడు-నేడు స్కీమ్‌ను సమాధి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైఎస్సార్, జగన్‌కు పేరొస్తుందని భయం. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో లక్ష కోట్లు అప్పులు చేస్తామని చెబుతున్నారు...బడ్జెట్లో మహిళా సాధికారత వెతికినా కనిపించదు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి హామీలిచ్చారు. ఆడబిడ్డ నిధి అన్నారు ఏమైంది?. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు ఏమైంది?. జాబ్ క్యాలండర్ ఇస్తామన్నారు ఏమైపోయింది?. ప్రజలను మభ్యపెట్టి బడ్జెట్ రూపొందించారు. గత బడ్జెట్లో కేటాయింపులెంత?. ఎంత ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వివిధ రంగాలకు చేయూతనివ్వాల్సింది పోయి దుబారా ఖర్చులు చేస్తున్నారు. హెలీకాప్టర్లకు, లూద్రా వంటి లాయర్లకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. -
చంద్రబాబు మోసాలకు అద్దంపట్టే బడ్జెట్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్లు ప్రజా ఆమోదయోగ్యమైనవని.. కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం సంక్షేమం ఎక్కడా ఆగలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణంగా ఉందని.. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కేటాయింపు లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయింపులు జరిపారన్నారు.‘‘అన్నదాత సుఖీభవ పథకానికి 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్‌లో వున్నాయి. రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్. ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్‌గా చూడాలి. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. -
జండర్ బడ్జెట్ తుస్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం జండర్ (లింగ ఆధారిత) బడ్జెట్ కేటాయింపుల్లోనూ దగా చేసింది. మహిళల సాధికారతకు దోహదం చేసే పటిష్టమైన పథకాలు, కార్యక్రమాల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. ప్రధానంగా ఎన్నికల హామీల అమలులో చిత్తశుద్ధి కొరవడిందని జండర్ బడ్జెట్‌తో తేలిపోయింది. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టకుండానే అంకెల్లో గారడీ చేసి మభ్యపెట్టారు. నూరు శాతం మహిళలు, బాలికలు లబ్ధి పొందే పథకాలకు (పార్ట్ – ఏ) రూ.19,496.47 కోట్లు కేటాయించగా, 30 నుంచి 99 శాతం వరకు మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.71,363.07 కోట్లు కేటాయించారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ల పంపిణీని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అమలును మాత్రం పట్టించుకోలేదు. బాలికల విద్య, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, పోషణ పథకాలు, గర్భిణులకు ఆర్థిక సహాయం వంటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడి కేటాయింపులు జరపడం గమనార్హం. డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ, గ్రామీణ మహిళల స్వయం ఉపాధి ప్రోత్సాహం, మహిళా రైతులకు ప్రత్యేక పథకాలు, స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులు సైతం నామమాత్రమే. మహిళల సాధికారత, లింగ సమానత్వం, భద్రత, ఆరోగ్యం, ఉపాధి లక్ష్యాలుగా జండర్ బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్టు గొప్పలు చెప్పుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు అనుగుణంగా లేదన్నది స్పష్టమవుతోంది. నామమాత్రంగానే పిల్లల బడ్జెట్.. రాష్ట్రంలో బాలల కేంద్రీకృత విధానాలు, వారి భరోసా కోసం ఉద్దేశించిన పథకాలకు (ఛైల్డ్) బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. నూరు శాతం పిల్లలే లబ్దిదారులుగా అమలు చేసే కార్యక్రమాలకు రూ.16,168.33 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోల్చితే కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే అధికం. మరోవైపు 30 నుంచి 99 శాతం వరకు పిల్లలే లబ్ధి పొందే కార్యక్రమాలకు ఈ ఏడాది రూ.8,517.34 కోట్లు కేటాయించారు. వీటిలోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులపైనే ఆధారపడడం గమనార్హం. బాలల్లో పోషకాహార లోపం, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, స్కూల్ డ్రాపౌట్స్, బాల్య వివాహాలు, లింగ వివక్ష నిర్మూలనకు చైల్డ్ బడ్జెట్లో దృష్టి సారించలేదు. జండర్ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ జగన్‌దే వాస్తవానికి జండర్ బడ్జెట్‌ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2021 – 22 నుంచి ప్రారంభించింది. ప్రత్యేకంగా మహిళల కోసం జండర్ బడ్జెట్ పెట్టి వారిని ఆర్థిక, రాజకీయ, సామాజికంగా సాధికారతవైపు నడిపిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకుని మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌కు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపుల తరహాలో మహిళలు, బాలికల (జండర్ బేస్డ్) బడ్జెట్‌కు ప్రత్యేకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. మహిళలు, బాలికల ఆరోగ్యం, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ, సామాజిక భద్రత వంటి కీలక రంగాల్లో ప్రాధాన్యమిచ్చేలా జండర్ బడ్జెట్ రూపొందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ దార్శనికతతో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 90 శాతం మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయి. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరోక్ష లబ్ధి (నాన్ డీబీటీ) పద్ధతిలో రాష్ట్రంలోని దాదాపు 31 పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన వైఎస్ జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమని వారు గుర్తు చేసుకుంటున్నారు. -
విద్యుత్ వెలుగుల్లేవు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగానికి మరోసారి మొండిచేయి చూపించింది. అధికారంలోకి వచి్చన తరువాత 18 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపి వసూలు చేస్తున్న చంద్రబాబు ఇంధన రంగానికి బడ్జెట్లో కేవలం రూ.13,934 కోట్లు మాత్రమే కేటాయించారు. అదికూడా వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్, వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీల కోసం. కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా బడ్జెట్లో ఇవ్వలేకపోయారు. ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారమని, ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రతని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, విద్య, ఆరోగ్యం ఇలా ప్రతి రంగం అభివృద్ధి విద్యుత్‌పై ఆధారపడి ఉందని చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విద్యుత్ రంగం అప్పులు తీర్చడానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో విదల్చలేదు. గత ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) అస్తవ్యస్తంగా రద్దుచేయడం వల్ల అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని కేశవ్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ట్రూ–అప్ చార్జీల రూపంలో ప్రజలపై భారం పడిందని మంత్రి అంగీకరించారు. నిజానికి గత టీడీపీ పాలనతో జరిగిన అనవసర, అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల కారణంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రూ.2,600 కోట్లు తక్కువే.. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా రూ.11 వేలకోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చామని, అలాగే ఆక్వాటారిఫ్ సబ్సిడీగా రూ.890 కోట్లు విడుదల చేసి 48,500 మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చామని, బీపీఎల్ వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్‌లు కొనసాగిస్తున్నామని ఆర్థికమంత్రి చెప్పారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,600 కోట్లు కేటాయించారు. కానీ మంత్రి చెప్పినదాని ప్రకారం చూస్తే రూ.2,600 కోట్లు తక్కువే వెచ్చించారు. అంటే ఆ మేరకు అర్హులకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను దూరం చేశారు. ఇక సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద 2024 జూన్ నుంచి రూ.2.88 లక్షలకోట్ల విలువైన 55 ప్రాజెక్టులను మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ఇందులో 15.56 గిగావాట్ల సౌరశక్తి, 4.86 గిగావాట్ల వాయుశక్తి, 17.7 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, 1 ఎంఎంఏటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులున్నాయని తెలిపారు. అడిగింది ఎంత.. ఇచ్చింది ఎంత? వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలకు, ఆర్థికమంత్రి చెప్పిన లెక్కలకు పొంతన లేదు. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 31 నాటికి ఈ పథకానికి రూ.13,241.17 కోట్ల సబ్సిడీ వ్యయం జరిగిందని చెప్పారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేలకోట్లు ఖర్చుచేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ ఇద్దరు మంత్రులు చెప్పినదాని ప్రకారం చూస్తే ఆ మేరకు నిధులు ఖర్చు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే 2026–27లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అవసరాలకే రూ.13,722 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి వెల్లడించారు. కానీ ప్రభుత్వం మొత్తం ఇంధన రంగానికి బడ్జెట్లో రూ.13,934 కోట్లు కేటాయించింది. -
నీటిపై రాతలు.. నీటి మూటలు!
సాక్షి, అమరావతి : సాగు నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కార్ చెబుతున్న మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనే ఉండదన్నది మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాదే వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల తొలి దశ, వంశధార స్టేజ్–2 ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని.. హంద్రీ–నీవా ఆయకట్టులో ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ముందే అంటే 2027 జూన్ నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించడాన్ని మాత్రం విస్మరించారు. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చంద్రబాబు సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖకు 2024–25 బడ్జెట్లో 16,705.32 కోట్లు కేటాయించి.. రూ.11,197.17 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. తొలి ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే రూ.5,508.15 కోట్లను తక్కువగా ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్లో రూ.18,019.66 కోట్లు కేటాయించి, తర్వాత రూ.14,751.67 కోట్లకు సవరించారు. అంటే.. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో రూ.3,267.99 కోట్లను కోత వేసినట్లు స్పష్టమవుతోంది. సవరించిన కేటాయింపుల్లో ఏమాత్రం ఖర్చు చేశారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత (2026–27) బడ్జెట్లో జల వనరుల శాఖకు రూ.18,223.67 కోట్లు కేటాయించారు.ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.17,352.91 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.870.76 కోట్లు కేటాయించారు. 2024–25, 2025–26 బడ్జెట్లలో కేటాయింపులు, చేసిన వ్యయాన్ని బట్టి చూస్తే.. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన మేరకు సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అంతా అంకెల గారడీయే.. చిత్తశుద్ధి ఏదీ? » పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ.. 2024–25లో కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,052.71 కోట్లను సది్వనియోగం చేసుకుని పోలవరం పనులను పరుగులెత్తించడంలో సర్కార్ విఫలమైంది. ఆ నిధులకు సంబంధించిన యూసీలను పంపక పోవడంతో 2025–26 బడ్జెట్లో పోలవరానికి కేటాయించిన రూ.5,936 కోట్లలో కేంద్రం కోత వేసి రూ.3,017.20 కోట్లను మాత్రమే కేటాయిస్తూ సవరించింది. » ఆ నిధులను ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజుల సమయం మాత్రమే మిగిలింది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.3,745.95 కోట్లను ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. » 2026–27 బడ్జెట్లో పోలవరానికి కేంద్రం రూ.3,320.39 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వాటిని రూ.5,139.35 కోట్లుగా చూపడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పోలవరానికి నిధుల కేటాయింపులో అంకెల గారడీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ ప్రాజెక్టులో గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల (194.6 టీఎంసీల నిల్వ)తో కాకుండా 41.15 మీటర్ల (119.4 టీఎంసీలు) ఎత్తుతోనే నిల్వ చేసేలా పూర్తి చేస్తామని కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే.. దాన్ని చంద్రబాబు సర్కార్ ఆమోదించడం గమనార్హం. » తద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేయడమే కాదు.. ఆ ప్రాజెక్టును కేంద్రం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించక పోవడంపై సాగు నీటి రంగ నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రపై శీత కన్ను » వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు సర్కార్ యధా ప్రకారం శీత కన్ను వేసింది. వంశధార స్టేజ్–2 ప్రాజెక్టే కాదు.. మహేంద్ర తనయ, తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిధులను కేటాయించలేదు. తోటపల్లి ప్రాజెక్టు, మడ్డువలస, జంఝావతి ప్రాజెక్టుల కింద మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించడానికి అవసరమైన పనులు చేపట్టేందుకు సరిపడా నిధులు కేటాయించలేదు. వాటికి కేటాయించిన అరకొర నిధులు కూడా కాడ్వామ్, స్పర్శ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తాయని చెప్పి చేతులు దులిపేసుకుంది. » ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.605.75 కోట్లు కేటాయించి, వాటిని రూ.99.66 కోట్లకు సవరించింది. కానీ.. ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఈ బడ్జెట్లోనూ గత బడ్జెట్లో కేటాయించినట్లే రూ.605.75 కోట్లే ఆ ప్రాజెక్టుకు కేటాయించడం గమనార్హం. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టుకు ఈ ఏడాదీ నిధులను ఖర్చు చేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. కాగితాల్లోనే ప్రాధాన్యత» ప్రాధాన్యత క్రమంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని.. ఈ ఏడాది వెలిగొండ, చింతలపూడి తొలి దశ, వంశధార స్టేజ్–2, హంద్రీ–నీవాను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. » వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.992 కోట్లు, ఫీడర్ ఛానల్ లైనింగ్ పనులకు రూ.456 కోట్లు (మొత్తం రూ.1,448) అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు కేవలం రూ.492.90 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. » తద్వారా ఈ ఏడాది జూన్‌లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు నీటి విడుదల జరగదని స్పష్టమవుతోంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన టన్నెళ్ల పనులను 2023 నాటికే వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేసింది. 2024 జూన్‌లోగా నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2024 ఆగస్టులో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టు ద్వారా దుర్భిక్ష ప్రాంతాలకు అందించడానికి ప్రణాళిక రూపొందించింది. కానీ.. వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితో ఆ ప్రణాళికను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కి, వెలిగొండ ఆయకట్టు రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని సాగు నీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. » ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. కానీ.. 2016లో ఎలాంటి పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోకుండానే ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచి.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా చంద్రబాబు సర్కార్ పనులు చేపట్టింది. పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన చింతలపూడి పనులను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రూ.73.63 కోట్లు జరిమానా విధించింది. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో పర్యావరణ అనుమతి తీసుకుని చింతలపూడి పనులు ప్రారంభించవచ్చు. కానీ.. ఇప్పటిదాకా పర్యావరణ అనుమతిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించకపోవడం గమనార్హం. ఈ ఎత్తిపోతలకు కేటాయించిన రూ.430 కోట్లు తొలి దశ పనులు పూర్తి చేయడానికి ఏమూలకు సరిపోవు. పర్యావరణ అనుమతి వచ్చేదెన్నడు.. ఎత్తిపోతల పూర్తయ్యేదెన్నడు?.. తొలి దశ కింద రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేదెన్నడు? అని రైతాంగం ప్రశ్నిస్తోంది. » వంశధార స్టేజ్–2 పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. వెనుకబడి ఉత్తరాంధ్రలో 2.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులు పూర్తయ్యాయి. కాట్రగడ్డ సైడ్ వియర్‌తో ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందవు. వంశధార ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ ససేమిరా అంటోంది. ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉండటంతో వంశధార ట్రిబ్యునల్ అవార్డును కేంద్రం ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి హీరమండలం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసి.. వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేలా హీర మండలం ఎత్తిపోతలను 2023లో వైఎస్ జగన్ చేపట్టారు. అప్పట్లోనే సింహభాగం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ 20 నెలలుగా విఫలమైంది. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182.52 కోట్లు కేటాయించి.. ఆ తర్వాత రూ.వంద కోట్లకు సవరించింది. వాటిని కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత బడ్జెట్లో 182.14 కోట్లు కేటాయించింది. వాటిని ఏమాత్రం ఖర్చు చేస్తుందన్నది వేచి చూడాల్సిందే. » హంద్రీ–నీవాకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2,621.70 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు విద్యుత్ చార్జీలకు కేటాయించారు. అంటే.. పనులు, భూ సేకరణకు కేటాయించింది రూ.1,721.7 కోట్లే. హంద్రీ–నీవాలో అంతర్భాగంగా జీడిపల్లి–భైరవానితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు నీటిని తరలించేలా ఎత్తిపోతలకు ఎన్ని నిధులు ఇస్తారు.. 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువలు) పనులకు ఏమాత్రం నిధులు కేటాయిస్తారు.. అన్నది స్పష్టంగా లేదు. దీన్ని బట్టి, ఆయకట్టుకు నీళ్లందించడంపై ఈ సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది. రాయలసీమను హార్టి కల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.300 కోట్ల విదేశీ రుణంతో ప్రాజెక్టులను చేపడతామని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. అయితే ఆ రుణం ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి తెస్తుందన్నది స్పష్టత లేదు. -
గుట్టుగా గ్యారెంటీ అప్పులు!
సాక్షి, అమరావతి: అప్పులపై వాస్తవాలను చంద్రబాబు సర్కారు మరోసారి కప్పిపుచ్చింది. కూటమి సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో చూపకుండా దాచేసింది. ఇలా అసంపూర్తి లెక్కలతో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఇవ్వడం చంద్రబాబు సర్కారుకు ఇది రెండోసారి కావడం గమనార్హం. గత బడ్జెట్లోనూ ఐదేళ్ల అప్పుల వివరాలు ఇవ్వకుండా ఎగరగొట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో కేవలం బడ్జెట్ అప్పులను మాత్రమే చంద్రబాబు సర్కారు పేర్కొంది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. ఓపెన్ మార్కెట్, కేంద్రం ఇచ్చినవి, చిన్న మొత్తాలతో పాటు ప్రభుత్వ గ్యారెంటీ అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో వెల్లడించడం సర్వ సాధారణం. అయితే చంద్రబాబు సర్కారు గ్యారెంటీ అప్పులు, చిన్న మొత్తాలు తదితరాల అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో చూపకుండా దాచి పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం.. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడమే. బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో రంగాల వారీగా ఆదాయ వివరాలు, వ్యయాలను చూపిస్తారు. ఈసారి వాటిని కూడా కూటమి సర్కారు ఎగరగొట్టింది. దాని స్థానంలో ప్రజా రుణం జీఎస్డీపీలో శాతం పేరుతో గ్రాఫిక్స్‌తో సరిపుచ్చింది. అప్పుల లెక్కలపై వాస్తవాలు బయట పడతాయనే భయంతోనే ఇలా చేసినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అప్పులపై కూడా తప్పుడు గణాంకాలతో చంద్రబాబు సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3వతేదీ నాటికే బడ్జెట్ అప్పులు రూ.97,456 కోట్లు కాగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2025–26 అప్పులు రూ.79,456 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. మరో పక్క బడ్జెట్‌ను పూర్తిగా అమలు చేయలేక చంద్రబాబు సర్కారు చతికిల పడింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్ సవరించిన అంచనాల్లో భారీగా కోత పెట్టారు. 2025–26 బడ్జెట్‌ను రూ.3,22,359 కోట్లుగా ప్రతిపాదించగా ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.3,00,534 కోట్లకు కుదించారు. అంటే ఏకంగా రూ.21,825 కోట్లు కోత విధించారు. » ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.14,182 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.13,081 కోట్లకు తగ్గించారు. గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.18,890 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.15,244 కోట్లకు కుదించారు. సాధారణ విద్యకు రూ.34,825 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.32,694 కోట్లకు తగ్గించారు. ఆరోగ్య రంగానికి రూ.19,264 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.17,637 కోట్లకు తగ్గించారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్లో రూ.13,862 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.11,252 కోట్లకు తగ్గించారు. ఇలా తగ్గించిన గణాంకాలతో, 2026–27లో అధికంగా కేటాయింపులు చేశామంటూ బాబు సర్కారు జబ్బలు చరుచుకోవడం గమనార్హం. » మూలధన వ్యయంపై కూడా తప్పుడు గణాంకాలతో సవరణ అంచనాలను ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2025–26లో మూలధన వ్యయం రూ.40,635 కోట్లు ఉండగా సవరించిన అంచనాల్లో రూ.33,134 కోట్లుగా పేర్కొన్నారు. అయితే కాగ్ గణాంకాల మేరకు వాస్తవ మూలధన వ్యయం డిసెంబర్ నాటికి కేవలం రూ.19,224 కోట్లే. మూడు నెలల్లో ఏకంగా మరో రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తామనడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. » కూటమి సర్కారు పాలనలో జీఎస్డీపీలో బడ్జెట్ అప్పులు 35 నుంచి 36 శాతానికి పెరిగాయి. జీఎస్డీపీలో అప్పులు 2023–24లో 35 శాతం ఉండగా చంద్రబాబు ప్రభుత్వం వచి్చన నాటి నుంచి మూడు బడ్జెట్లలో జీఎస్డీపీలో అప్పులు 36 శాతానికి ఎగబాకాయి. » 2023–24 నాటికి బడ్జెట్ అప్పులు రూ.4.91 లక్షల కోట్లు ఉండగా 2026–27 మార్చి నాటికి ఏకంగా రూ.7.11 లక్షల కోట్లకు పెరగనున్నాయి. అంటే వచ్చే మార్చి నాటికి కూటమి సర్కారు బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.2.20 లక్షల కోట్లు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. » ఇక బడ్జెట్ బయట అప్పులకు కూటమి సర్కారు భారీగా గ్యారెంటీలు ఇచ్చింది. బడ్జెట్ డాక్యుమెంట్ వాల్యూమ్ 5 ప్రకారం వివిధ సంస్థల ద్వారా 2025 డిసెంబర్ నాటికి రూ.3.11 లక్షల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో పౌరసరఫరాల సంస్థ, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జెన్కో తదితర సంస్థలున్నాయి. బడ్జెట్ బయట అప్పులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆధారపడుతోందని దీన్నిబట్టి స్పష్టం అవుతోంది. -
ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిల ఊసేది?
సాక్షి, అమరావతి: మాయమాటలతో ఊరడించడం తప్ప ఉద్యోగులకు వాస్తవంలో చేసేదేమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల సమస్యల ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి వారి ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఎన్నికల్లో తమకు ఇచ్చి న హామీల్లో ఒక్కదానినైనా నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు నిత్యం చేస్తున్న విజ్ఞాపనలను సైతం ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరిపోయినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో అందిన 11 డీఏలు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 11 డీఏలు ఇవ్వగా, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులను చిన్నచూపు చూస్తారనడానికి ఇదే ఉదాహరణని చెబుతున్నారు. మరోవైపు ‘జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ’ అనే కారణంతో గ్రామ స్థాయిలో తలలో నాలుకలా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు హీనాతిహీనంగా చూస్తూ బానిసలుగా మార్చివేయడం వారిని కలచివేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా అసలు ఉద్యోగులను భయపెట్టి, బెదిరించేలా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గారడీ ప్రకటనలు.. » గత సంక్రాంతికి ఒక డీఏ ఇచ్చినట్లు ప్రకటించినా, అందులోనూ ప్రభుత్వం గారడీ చేసింది. వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.1,100 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా అందరు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. » ఏడాది క్రితం పోలీసులకు ఇస్తానన్న రెండు సరెండర్ లీవులను విడతల వారీగా ఇస్తామన్నా, అది కూడా సరిగా ఇవ్వలేదు. » ఎన్నికల్లో చెప్పిన మేరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడానికి కూటమి ముందుకు రావడం లేదు. » డీఏ ఇచ్చేందుకు నిరాకరించడం, 12వ పీఆర్సీ నియమించేందుకే ముందుకు రాకపోవడాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి తమను పట్టించుకునే ఆలోచన లేదని వారు వాపోతున్నారు. » తాజా బడ్జెట్‌ను చూస్తే ఉద్యోగులకు ఈ ఏడాది కూడా ఇచ్చేది ఏమీ ఉండదని తేలింది. -
తల్లికి 'వంచన'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల తల్లులను చంద్రబాబు సర్కారు మరోసారి మోసం చేసింది. బడ్జెట్లో ‘తల్లికి వందనం’ అంటూనే వారిని వంచన చేస్తూ అంకెల గారడీని ప్రదర్శించింది. ఎన్నికల్లో అధికారం కోసం అడ్డగోలుగా అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు ఇలా ఏటా బడ్జెట్లో మోసాన్ని పునరావృతం చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతుంటే కేవలం 67.27 లక్షల మందికి మాత్రమే ‘తల్లికి వందనం’ అమలుచేసి నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారు. మరోవైపు శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలోనూ ‘తల్లికి వంచన’ ప్రస్ఫుటంగా బయటపడింది. 2026–27 బడ్జెట్లోనూ ఎంతమంది పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారో చెప్పకుండా రూ.9,668 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే.. మంత్రి ప్రకటనకు, బడ్జెట్లో కేటాయింపులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి రూ.9,668 కోట్లు పలికితే.. బడ్జెట్ ప్రతుల్లో రూ.8,457.07 కోట్లని పేర్కొన్నారు. మళ్లీ కొందరికే ‘వందనం’.. తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కారు కాకిలెక్కలు చెబుతోంది. ఎన్నికలప్పుడు అధికారమే పరమావధిగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచి్చన తొలి ఏడాది ముఖం చాటేశారు. 2024–25లో రూ.5,387 కోట్లు కేటాయిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ఇచ్చింది మాత్రం కేవలం రూ.6,377 కోట్లే. అంటే.. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు చొప్పున మాత్రమే ఇష్టానుసారం ఖాతాల్లో వేసి మమ అనిపించింది. ఈ అరకొర సొమ్మును కూడా దాదాపు 21 లక్షల మందికి ఎగ్గొట్టింది. ఇప్పుడు కూడా మళ్లీ పాత సీన్‌నే పునరావృతం చేస్తూ తాజా బడ్జెట్లో రూ.9,668 కోట్లను కేటాయించింది. వాస్తవ వ్యయానికి దూరంగా.. నిజానికి.. 87.41 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటే రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు సర్కారు ఎప్పటిలాగే అరకొరగా కేటాయించడం చూస్తుంటే ఈసారి కూడా తల్లులకు వంచన తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్‌ను ఉన్నది ఉన్నట్లు అమలుచేస్తే 65 లక్షల మంది పిల్లలకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన విద్యార్థులకు కోత ఖాయం. ఇప్పటికే చంద్రబాబు తొలి ఏడాది తల్లికి వందనం పథకం ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. రెండో ఏడాది అరకొరగా పంపిణీ చేశారు. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన మేరకు పూర్తిస్థాయిలో ఇచ్చినా రూ.3,444.82 కోట్లు ఎగ్గొట్టినట్లు అవుతుంది. మొత్తం మీద మూడేళ్లకు కలిపి రూ.24,504.39 కోట్లు తల్లికి వందనం రూపంలో తల్లులకు ఎగ్గొట్టారు. పాఠశాల విద్యకు వ్యయంలోనూ వెనకడుగే.. 2026–27 బడ్జెట్లో పాఠశాల విద్యా రంగానికి కూటమి ప్రభుత్వం రూ.32,308.31 కోట్లు కేటాయించింది. ఇవన్నీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతాయి. అయితే, 2025–26 బడ్జెట్లో రూ.31,805.65 కోట్లు ప్రతిపాదించగా... సవరించిన అంచనా తర్వాత ఖర్చు దగ్గరకు వచ్చేసరికి ఆ మొత్తం రూ.30,175.13 కోట్లకు తగ్గిపోయింది. అంటే.. పాఠశాల విద్యకు కేటాయింపులే తక్కువ అనుకుంటే ఈ ప్రభుత్వం అందులో చేస్తున్న ఖర్చు ఇంకా తక్కువగా ఉండటం విస్తుగొలుపుతోంది.‘మనబడి–మన భవిష్యత్తు’ గాలికి.. ‘నాడు–నేడు’ వంటి బృహత్తర కార్యక్రమంతో గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. రెండు విడతల్లో దాదాపు రూ.8 వేల కోట్ల బడ్జెట్‌తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను అత్యాధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. గత ప్రభుత్వంలోనే రూ.4 వేల కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తవ్వాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అక్కసుతో ఆ పథకం పేరును ‘మనబడి–మన భవిష్యత్తు’గా మార్చింది తప్ప పైసా ఖర్చు చేయలేదు. 2024–25 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది గానీ ఆ డబ్బులతో ఒక్క ఇటుక కూడా వేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లో రూ.1,500 కోట్లు చూపించినా ఆ తర్వాత దానిని రూ.772 కోట్లకు కుదించింది. ఇప్పుడు మళ్లీ రూ.1,500 కోట్లు కేటాయించినా దానితో పాఠశాలల రూపరేఖలు పెద్దగా మారే పరిస్థితిలేదు. మరోవైపు.. గతంలో పూర్తయిన పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులే సుమారు రూ.1,200 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక ప్రభుత్వ బడులకు ‘స్టార్ రేటింగ్’ పేరుతో చంద్రబాబు హడావుడి చేయడం తప్ప అక్కడ మౌలిక వసతులు క్షీణిస్తున్నాయి. చంద్రబాబు తీసుకొచి్చన స్టార్ నిబంధనల ప్రకారం పాఠశాలలు ఉండాలంటే సుమారు రూ.12 వేల కోట్ల బడ్జెట్ అవసరమని తెలుస్తోంది. బడ్జెట్ తగ్గిపోతోంది.. ఇదిలా ఉంటే.. గత మూడు బడ్జెట్లు చూస్తే చంద్రబాబు పాలనలో పాఠశాల విద్య కేటాయింపులు కుచించికుపోతున్నాయి. 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో ఉంటే.. ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15 శాతం) నిధులు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ.28,560.64 కోట్లే. అలాగే, 2025–26లో రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రకటించినా పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయించారు. ఇక 2026–27కి వచ్చేసరికి 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో పాఠశాల విద్య వాటా రూ.32,308.31 (9.75 శాతం) కోట్లకు పరిమితమైంది. -
బడ్జెట్‌కు సుస్తీ ఆరోగ్యానికి అంతంతే
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించింది. 2025–26 బడ్జెట్లో రూ.19,264 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్టు చూపిన టీడీపీ కూటమి సర్కారు.. ఖర్చుల్లో రూ.1,626 కోట్ల మేర కోత పెట్టింది. ఈ విషయాన్ని సవరించిన గత ఏడాది బడ్జెట్ స్పష్టం చేసింది. 2026–27 బడ్జెట్లో రూ.20 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు అవసరమని వైద్య శాఖ ప్రతిపాదించగా.. ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.19,306 కోట్లు కేటాయిస్తున్నట్టు చూపింది. గత ఏడాది కేటాయించిన మొత్తంలో రూ.1,626 కోట్లు కోత పెట్టిన దృష్ట్యా.. ఈ ఏడాది బడ్జెట్లో మరింత ఎక్కువ మొత్తం కోత పెడతారనే భయాందోళన వ్యక్తమవుతోంది. మందుల కొనుగోళ్లకు రూ.820 కోట్లకు పైగా అవసరమని.. సర్జికల్స్‌కు రూ.320 కోట్లు కావాలని ప్రతిపాదించగా.. మందుల బడ్జెట్లో రూ.220 కోట్లు, సర్జికల్స్‌కు రూ.100 కోట్ల పైగానే కోత విధించి అరకొర నిధులనే విదిల్చింది. ఆసరా సాయానికి ‘సున్నా’ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా సాయానికి ఈ బడ్జెట్లో కేటాయింపులే లేకుండా చేశారు. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు కోలుకునే సమయంలో ఆరి్థకంగా చేదోడుగా నిలిచేలా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెడతామని ప్రకటించారు. అప్పుడే ఆరోగ్య ఆసరాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2024 నుంచే ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు ఆసరా చెల్లింపులను నిలిపివేశారు. ఈ పథకానికి 2025–26 బడ్జెట్లో కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా కేటాయింపులే లేకుండా ఇకపై ఆసరా అమలు చేసే ఉద్దేశమే లేదని, తాను పేదల వ్యతిరేకినని మరోమారు చంద్రబాబు రుజువు చేసుకున్నారు. వాస్తవానికి ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పథకానికి ఉద్వాసన పలికి పేదలకు రెండేళ్లలో రూ.900 కోట్లకు పైగా సాయాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల చొప్పున ఆసరా సాయం అందించాల్సి ఉంది. ఇప్పుడు ఆసరాతో పాటు ఆరోగ్యశ్రీకి కూడా చంద్ర గ్రహణం పట్టుకుంది. గతంలో రోగి/బంధువు ఖాతాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో ఆసరా సాయాన్ని జమ చేసేవారు. ఇలా 2019–24 మధ్య వైఎస్ జగన్ పాలన ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1,465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. కానీ బీమా రాగం అందుకున్న బాబు నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. ఆరోగ్యశ్రీ చికిత్స అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పడింది. బకాయిలను చెల్లించేలా బడ్జెట్లో అదనపు నిధులను కేటాయించకపోవడం గమనార్హం. కొత్త వైద్య కళాశాలల ఊసేదీ..? 2026–27 బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలల ఊసే లేకుండా చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన 10 వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 4 కళాశాలలకు టెండర్లు పిలవగా సరైన స్పందన రాలేదు. కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న ప్రభుత్వ కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1,450 చొప్పున రెండేళ్లలో 2450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో 10 వైద్య కళాశాలల ప్రారంభంపై ఈ బడ్జెట్లోనైనా స్పష్టత వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. అయితే.. బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలల ప్రస్తావనే లేకుండాపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.8,480 కోట్ల అంచనాలతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2024 ఎన్నికల నాటికి వైద్య కళాశాలల్లో రూ.3 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అప్పటికే కొన్ని కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈవెంట్లు, మంత్రులు, సీఎం విలాసాలు, ఇతర కార్యక్రమాలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్న ప్రభుత్వం వైద్య కళాశాలలకు మాత్రం నిధులు లేవంటూ ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. పేదలను వంచించడమే.. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి నిధులు 10 శాతానికి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం నిధులు తగ్గిస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో కేవలం 5.8 శాతం నిధులు మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయించారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందనడానికి ఈ కేటాయింపులే నిదర్శనం. వైద్య రంగానికి నిధులు తగ్గించడం పేద ప్రజలను వంచించడమే. – డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడఆరోగ్యశ్రీ బకాయిల మాటేమిటి?ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలే రూ.3 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించడంపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఏపీ ఆశా) ఆందోళన వ్యక్తం చేసింది. తమ బకాయిలు చెల్లించడానికి ఎటువంటి నిర్దిష్ట, దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని శనివారం ఒక ప్రకటనలో మండిపడింది. దీనివల్ల రాష్ట్రంలోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని తెలిపింది. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఇటీవలే హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ప్రజలకు సేవలు అందించడం అసాధ్యమని పేర్కొంది. బకాయిలను దశల వారీగా, నిర్ణీత సమయంలో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
'భృతి' లేదు.. గతి లేదు
దేశానికి ఆయువుపట్టు యువశక్తి. ఏపీలో ఉండే యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తా. పరిశ్రమలు తెస్తా. ఉద్యోగాలు ఇస్తా. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏదీ? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదీ?.. – మే 28, 2023న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో చంద్రబాబు దగాకోరు మాటలుటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తోంది. ముచ్చటగా మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పరిశ్రమలూ తేలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ అడ్రస్సే లేదు. నోటిఫికేషన్లకు అసలే దిక్కులేదు. ‘‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.’’ – 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేశ్ బీరాలుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు మరోసారి నిరుద్యోగ యువతను నిండా ముంచేసింది. ముచ్చటగా మూడో బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. ఎన్నికల సమయంలో అధికార పీఠం కోసం నిరుద్యోగ యువతను నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు నయ వంచనకు గురి చేశారు. ఆయువుపట్టుపై దెబ్బకొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ‘సూపర్ సిక్స్‌లో.. బాబుమార్క్’ దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడు వార్షిక బడ్జెట్లలోనూ నిరుద్యోగుల ఊసే లేకుండా చేశారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని అటకెక్కించేశారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు ఒక్కో నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా 20 లక్షల మందికి చూస్తే దాదాపు రెండేళ్లలో రూ.14,400 కోట్లు బకాయిపడింది. ఈ ఏడాది బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో మరో రూ.7,200 కోట్ల చెల్లింపులకు ఎగనామం పెట్టింది. అంటే, చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది.ఇంకెంతకాలం ఈ మోసం బాబూ!2014 ఎన్నికల ముందు నిరుద్యోగులను బుట్టలో వేసుకుని రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకుపైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా.. పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను తొలుత 12 లక్షలు అని చెప్పి, చివరికి 2.10 లక్షల మందే అర్హులన్నారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, ఈ–కెవైసీ లింక్ పెట్టారు. చివరకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి బరితెగించి ఇవ్వను పొమ్మని నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. బాబు పాలనలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదుబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై వివాదాలు సృష్టించడం, వాటిని అడ్డంపెట్టుకుని భర్తీ నిలిపివేయడం పరిపాటి. ఈసారీ అదే సూత్రాన్ని సర్కారు పాటిస్తోంది. గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. దాదాపు 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2024 డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇచ్చిన నోటఫికేషన్లలో 19 నోటిఫికేషన్ల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇప్పటికే ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్లో పోస్టులు భర్తీ చేయకుండా, ఆయా శాఖల్లో కేడర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా 150 పోస్టులు, మరో 4,300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాల విప్లవం » వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల విప్లవం సృష్టించారు. » గ్రామ/వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు కొత్తగా కల్పించారు. 2.66 లక్షల వలంటీర్లను గత ప్రభుత్వంలో నియమించారు. » ఆప్కాస్ ద్వారా 96వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. » ఆర్టీసీ విలీనం ద్వారా 58వేల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశారు. » మొత్తం ఐదేళ్లలో 6,31,310 ఉద్యోగాలిచ్చారు. » చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారమే.. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్‌లో 1.02 లక్షల మందికి , ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. » గవర్నమెంట్, లార్డ్ అండ్ మెగా, ఎంఎంఎస్ఈ సెక్టార్లో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. -
పెట్టుబడి సాయం.. 'మాయాజాలం'!
ఇదీ హామీవైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 మాత్రమే ఇస్తోంది. ఇందులో రూ.6 వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తాం. – ఎన్నికల మేనిఫెస్టోలో, ఊరూరా చంద్రబాబు అండ్ కో ప్రచారంఆచరణలో వాస్తవంఅధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా రూ.20 వేలు ఎగ్గొట్టారు. రెండో ఏడాది కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకుని రూ.10 వేలు మాత్రమే అందించారు. అదీ కొంత మంది రైతులకే. కౌలు రైతులకైతే పైసా ఇవ్వలేదు. కానీ రైతులకు రూ.20 వేలు సాయం అందించామని బడ్జెట్ సాక్షిగా నిస్సిగ్గుగా ప్రచారం. మొత్తంగా రూ.30 వేలు బకాయి. సాక్షి, అమరావతి : తమకు అధికారం ఇస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి ఏడాది నుంచే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామంటూ ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు.. తీరా అందలం ఎక్కాక అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. తొలి ఏడాది నిస్సిగ్గుగా పెట్టుబడి సాయానికి పూర్తిగా ఎగనామం పెట్టిందేకాక, రెండో ఏడాది అరకొరగా విదిల్చారు. కనీసం 2026–27లో అయినా పూర్తిగా ఇస్తారనుకుంటే అదీ లేదు. ఈ బడ్జెట్లో కూడా ఈ పథకానికి అరకొర కేటాయింపులతోనే సరిపెట్టి అన్నదాత నోట్లో మట్టికొట్టారు. కౌలు రైతుల ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన 53,58,366 మంది రైతుల వరకు లెక్కలోకి తీసుకున్నా.. ఏటా రూ.20 వేల చొప్పున తొలి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈ లెక్కన రైతుల ఖాతాలకు రూ.21,433.46 కోట్లు జమ చేయాలి. తొలి ఏడాది (2024–25) బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించి, పైసా ఖర్చు చేయలేదు. నిస్సిగ్గుగా 53.58 లక్షల మందికి రూ.10,717 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది (2025–26) బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించి, రెండు విడతల్లో కలిపి రూ.10 వేల చొప్పున మాత్రమే 46,85,838 మంది రైతులకు రూ.4,685.54 కోట్లు జమ చేసి చేతులు దులుపుకున్నారు. అంటే దాదాపు 7 లక్షల మందికి ఎగనామం పెట్టారు. రూ.16,746 కోట్లు ఎగవేతపీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న సాయాన్ని తన ఖాతాలో వేసుకొని, రెండు విడతల్లో రూ.14 వేలు జమ చేశామని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అంటే రెండేళ్లలో రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూ.16,746 కోట్లు. పైగా అర్హుల్లోనే లక్షలాది మంది రైతులు ఇంకా తమకు జమ కాలేదంటూ అర్జీలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309.44 కోట్లు జమ చేసేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం విస్మయ పరుస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలోనైనా బకాయిలతో సహా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరుపుతారనుకుంటే ఈసారీ అరకొరగానే విదిల్చారు. సూపర్ సిక్స్ హామీ మేరకు చూస్తేæ వాస్తవానికి ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున 53.58 లక్షల మందికి ఏటా రూ.10,717 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.32,151 కోట్లు కేటాయింపులు జరపాలి. కానీ తొలి ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్లు, రెండో ఏడాది బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించగా.. రెండో ఏడాది జమ చేసిన రూ.4,685.84 కోట్లు మినహాయిస్తే అన్నదాతలకు చెల్లించాల్సిన పెట్టుబడి సాయం ఇంకా రూ.27,465 కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే.కౌలు రైతుల ఊసెత్తని ప్రభుత్వంరాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా భూ యజమానులతో పాటు ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చింది. అయితే 2024–25లో భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025–26లో రెండు విడతల్లో రూ.10 వేలు అదీ భూ యజమానులకు మాత్రమే జమ చేశారు. రెండో విడత సాయం ఇచ్చేటప్పుడు కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం అందిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాగానే నవంబర్‌లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా, ఒక్క విడత సాయం కూడా కౌలు రైతులకు జమ చేసిన పాపాన పోలేదు. జారీ చేసిన సీసీఆర్సీ కార్డుల ప్రకారం చూసుకున్నా 2024–25లో 9.13 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున.. మొత్తంగా రూ.40 వేలు పెట్టుబడి సాయం అందించాలి. అంటే రెండేళ్లలో కలిపి కౌలు రైతులకు రూ.3,474 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో చెల్లించాల్సింది కూడా కలుపుకుంటే రూ.6 వేల కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా మంత్రి అచ్చెన్నాయుడు కౌలు రైతుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. -
బాబువన్నీ 'గ్యాస్' కబుర్లే
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల వేళ ఊదరగొట్టిన చంద్రబాబు ఆ హామీనీ మెల్లగా అటకెక్కించేస్తున్నారు. మహిళలకు కుచ్చుటోపీ పెట్టేందుకు టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తూ బడ్జెట్లో తూతూమంత్రంగా నిధులు కేటాయించారు. ఎన్నికలప్పుడు అక్కచెల్లె్లమ్మల ఓట్ల కోసం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి... అధికారంలోకి వచ్చాక వాటికి అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. లబ్దిదారులను ఏరిపారేస్తున్నారు. వాస్తవానికి ఏపీలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే సుమారు రూ.4,083 కోట్లు అవసరం. కానీ, చంద్రబాబు 2026–27 బడ్జెట్లో మాత్రం దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్‌కు కేటాయించింది కేవలం రూ.2601 కోట్లు మాత్రమే!. ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి 98 లక్షల సిలిండర్లు మాత్రమే ఉచితంగా అందించడానికి వీలుంటుంది. మిగిలిన 60 లక్షల కనెక్షన్లకు ఉచిత గ్యాస్ సిలిండర్లు లేనట్టే. గడిచిన ఏడాదిన్నర కాలంలో దీపం 2.0 పథకం కొందరి ఇళ్లకే పరిమితమై ‘గుడ్డి దీపం’గా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.6,183 కోట్లకు చంద్రబాబు ఎగనామం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్‌లో దీపం 2.0ను చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తొలి ఏడాది ఒక్కో సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చారు. ఇందుకు రూ.865 కోట్లు విడుదల చేశారు. మిగిలిన రెండు సిలిండర్లకు రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఆ తర్వాత ఏడాది (2025–26) మూడు సిలిండర్లకు రూ.2601 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక్కడ కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ రూ.2601 కోట్లు కేటాయించడంతో వచ్చే ఆర్థి క సంవత్సరానికి కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రూ.6183 కోట్లు ఎగ్గొట్టి మహిళలకు టోకరా పెట్టారు. ప్రభుత్వ కేటాయింపులు సుమారు 90 లక్షల లబ్ధిదారులకే సరిపోగా... 60 లక్షలకుపైగా లబ్దిదారులకు మొండి చేయి చూపుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది లబ్దిదారులు సబ్సిడీ కోసం గ్యాస్ ఏజెన్సీలు, గ్రామ–వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. -
‘గ్రామీణాభివృద్ధి’ అంతంతమాత్రం
సాక్షి, అమరావతి: బడ్జెట్ రోజున కేటాయింపులు ఘనంగా ఉన్నా అమలుకు వచ్చేసరికి అథమం అన్నట్టు ఉంది ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిస్థితి. 2026–27 బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.21,624 కోట్లు కేటాయింపులు చేసినా.. అవి కార్యరూపం దాల్చుతాయా లేదా అనేదానిపై అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పెట్టిన రోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.18,890 కోట్లు కేటాయింపులు చేసినట్టు ప్రకటించి.. వెంటనే రూ.15,244 కోట్లకు పరిమితం చేస్తూ రివైజ్డు కేటాయింపులను ప్రకటించడం ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. రివైజ్డు బడ్జెట్లో భారీ కోత గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతో పాటు ఇంటింటికీ కొళాయిల ఏర్పాటుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ కార్యక్రమానికి 2025–26 బడ్జెట్లో మొదట ఘనంగా రూ.2,800 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి, తీరా రివైజ్డ్ బడ్జెట్లో ఆ కేటాయింపులు రూ.524.41 కోట్లకు పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే బడ్జెట్‌కూ, రివైజ్డు బడ్జెట్‌కూ మధ్యనే భారీ కోతలు పెట్టిన ఆ జలజీవన్ మిషన్ పథకానికే 2026–27 బడ్జెట్లో ఏకంగా రూ.4,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ రోడ్లకు గతం కన్నా తక్కువే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి గత 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.2,239 కోట్లు కేటాయించి.. రివైజ్డ్ బడ్జెట్లో ఆ మొత్తాలను రూ.2,076 కోట్లకు పరిమితం చేశారు. మరోవైపు 2026–27 బడ్జెట్లో ఆయా కార్యక్రమాల ద్వారా రోడ్ల నిర్మాణానికి కేవలం రూ.1,883.57 కోట్లే కేటాయించారు. కొత్త ‘ఉపాధి’ పథకానికీ రూ.8,365 కోట్లే ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచి్చన వీబీ జీ రామ్‌జీ పథకానికి 2026–27 బడ్జెట్లో రూ.8,365 కోట్లు కేటాయింపులు చేశారు. అయితే ఈ పథకంలో పని చేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన అడ్మిన్ కేటగిరికి గత బడ్జెట్లో రూ.372 కోట్లు పెట్టి, రివైజ్డు బడ్జెట్లో రూ.357 కోట్లకు సవరించగా.. 2026–27 బడ్జెట్లో ఆ కేటాయింపుల మొత్తం రూ.100 కోట్లకే పరిమితం చేయడం గమనార్హం. -
శాంతిభద్రతలపై శీతకన్ను
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ అమలుకు పోలీసువ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి–భద్రతలపై శీతకన్ను వేసింది. మహిళల భద్రత, పోలీసుశాఖ ఆధునికీకరణ, డ్రగ్స్ మాఫియా కట్టడి వంటి అంశాలను గాలికివదిలేసింది. 2026–27 వార్షిక బడ్జెట్లోహోంశాఖకు కేవలం రూ.9,165 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో సింహభాగం పోలీసుశాఖ జీతభత్యాలు, సాధారణ నిర్వహణ ఖర్చులకే సరిపోనుంది. కేటాయింపుల్లో ప్రధానమైనవి ఇలా.. మహిళాభద్రత కోసం గత బడ్జెట్లో రూ.10.01 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.3.20 కోట్లే వెచ్చించింది. ఈ ఏడాది కేటాయింపు కేవలం రూ.3.20కోట్లు కావడం గమనార్హం. n రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ దందాను కట్టడి చేయడంపై ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. నార్కోటిక్స్ ఆపరేషన్లకు అవసరమైన వ్యవస్థ బలోపేతం కోసం గత బడ్జెట్లో రూ.61 కోట్లు కేటాయించి కేవలం రూ.22కోట్లే ఖర్చు చేసింది. » ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులే రూ.30 కోట్లకు పరిమితం చేసింది. » కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్రం కేటాయించాల్సిన నిధులపై ముఖం చాటేసింది. ఫోరెన్సిక్ విభాగానికి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు కేటాయించలేదు. బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ చోరీ మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం విస్మయపరిచింది. రాష్ట్రంలో 5,757మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించింది. అప్పట్లో టీడీపీ ఆ నియామక ప్రక్రియకు వ్యతిరేకంగా తమ సానుభూతిపరులతో కోర్టుల్లో కేసులు వేయించింది. టీడీపీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను ఉపసంహరించారు. దాంతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. అవి కూడా తామే భర్తీ చేసినట్టు పయ్యావుల కేశవ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. » శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా 4 ఏపీఎస్పీ బెటాలియన్ల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ఘనత కూడా చంద్రబాబు ప్రభుత్వానిదేనని పయ్యావుల కేశవ్ క్రెడిట్ చోరీకి యతి్నంచారు. -
‘సూపర్ సిక్స్’లు ఔట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.80 లక్షల మంది మహిళలకు చంద్రబాబు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ ఏటా రూ.18 వేలు చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇచ్చింది మాత్రం సున్నా. 20 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. నెలకు రూ.3 వేలు చొప్పున మూడేళ్లలో నిరుద్యోగ యువతకు రూ.21,600 కోట్లు ఇవ్వాలి. కానీ.. ఇచ్చింది గుండు సున్నా. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మందికి పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో రూ.28,800 కోట్లు ఎగనామం పెట్టారు.సున్నా వడ్డీ పథకానికి తూట్లు పొడిచి దాదాపు కోటి మంది పొదుపు మహిళలతోపాటు రైతులనూ దగా చేశారు. సూపర్ సిక్స్, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మూడు కోట్ల మందికిపైగా మహిళలు, రైతులు, యువతకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మూడో బడ్జెట్లోనూ వాటి ప్రస్తావనే లేకుండా చేసి ఇక ఆ పథకాలను అమలు చేయబోమని విస్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్లైంది. తల్లికి వందనం పథకానికి రూ.13,112 కోట్లు కావాల్సి ఉంటే ఈ బడ్జెట్లో ఇచ్చింది రూ.8,457 కోట్లే! మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది కోతలతో సరిపుచ్చారు. అన్నదాతా సుఖీభవ కింద పాత బకాయిలతో కలిపి రూ.27,455 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో చేసిన కేటాయింపులు రూ.6,600 కోట్లు మాత్రమే. దీపం పథకం అమలుకు ఏటా రూ.4,200 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో ప్రతిపాదించింది కేవలం రూ.2,601 కోట్లే! ‘దీపం’ పథకం కింద బకాయిలతో కలిపి రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు హామీని తొలి ఏడాది నెరవేర్చకుండా రూ.3,200 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఎప్పుడు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తూ రూ.3.32 లక్షల కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్‌ను టీడీపీ కూటమి సర్కారు బడ్జెట్‌ను శనివారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా లేకపోగా ప్రభుత్వ గ్యారెంటీ రుణాలను దాచి పెట్టింది. భారీ అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. పది సూత్రాల సూక్తులు మినహా కార్యాచరణ బడ్జెట్లో కానరాలేదు. పేదల ఇళ్లపై కక్ష..పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు సర్కారు కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. కాగితాలపై కేటాయింపులు మినహా ఖర్చు చేయడం లేదు. గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు, వాస్తవ వ్యయం తీరే దీనికి నిదర్శనం. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.4,012 కోట్లు కేటాయించగా రూ.1,611 కోట్లు మాత్రమే వెచ్చించారు. 2025–26లో రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా పేర్కొన్నారు. ఈసారి రూ.6,357 కోట్లు కేటాయించినట్లు చూపిస్తున్నా ఈ ప్రభుత్వానికి వ్యయం చేసే ఉద్దేశం లేదని గత రెండు బడ్జెట్ల ద్వారా స్పష్టమవుతోంది.అదనంగా రూ.27,820 కోట్ల పన్నుల భారం ఒకవైపు ప్రైవేట్‌కు సంపద సృష్టిస్తూ వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కారు మరోవైపు పన్నేతర, పన్ను ఆదాయాల ద్వారా రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపింది. పన్నుల ఆదాయం అదనంగా రూ.27,820 కోట్లు వస్తుందని అంచనా వేయడం గమనార్హం. అంటే పన్నుల రూపంలో ప్రజలపై భారీగా వడ్డించనున్నట్లు స్పష్టమవుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ద్వారా ప్రజలపై భారం మోపనున్నారు. పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలని ప్రతిపాదించినా సూపర్ సిక్స్ హామీలకు మాత్రం పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. 2025–26లో సవరించిన రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.98,025 కోట్లు కాగా, 2026–27లో సొంత పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లుగా అంచనా వేశారు. ఇక పన్నేతర ఆదాయంపై బాబు సర్కారు తిమ్మిని బమ్మిని చేసింది. 2025–26 బడ్జెట్ అంచనాల్లో పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో రూ.14,324 కోట్లకు తగ్గించారు. అయితే వాస్తవంగా కాగ్ డిసెంబర్ వరకు విడుదల చేసిన గణాంకాల మేరకు పన్నేతర ఆదాయం కేవలం రూ.4,142 కోట్లు వచ్చింది. ఇక 2026–27 బడ్జెట్లో పన్నేతర ఆదాయం రూ.11,473 కోట్లుగా అంచనా వేశారు. అంటే పన్నేతర రూపంలో కూడా ప్రజలపై బాదనున్నారు. సంపద సృష్టి శూన్యం.. ప్రైవేట్‌కు ఫండింగ్సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. పీపీపీలో విధానంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు బడా సంస్ధలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద బడ్జెట్లో ఏకంగా రూ.1,500 కోట్లు కేటాయింపులు చేశారు. మరో రూ.లక్ష కోట్ల అప్పులు..వచ్చే ఏడాది మరో రూ.లక్ష కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో చంద్రబాబు సర్కారు వెల్లడించింది. ప్రజా రుణం పేరుతో రూ.98,065 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.78,182 కోట్లు, కేంద్రం నుంచి రూ.19,133.41 కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. జనంపై బాదుడు.. భారీ అప్పులే లక్ష్యం..పన్నుల రూపంలో ప్రజలపై భారీగా బాదుడు, భారీ అప్పులే లక్ష్యంగా రూ.3.32 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2.56 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.48,697 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.11 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.75,868 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 3.84 శాతంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తగ్గుతున్నట్లు అంకెల గారడీతో మోసపుచ్చేందుకు బడ్జెట్లో బాబు సర్కారు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.తల్లులకు బాబు వంచన..తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. ఇలా రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!రైతులకు వెన్నుపోటు..పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్లోనూ అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.తుస్సుమన్న గ్యాస్..దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. గత బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. దీపం పథకం కింద రెండేళ్లలో మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. బకాయిలతో కలిపి తాజాగా రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు.మహిళలకు మరో మోసం..రాష్ట్రమంతటా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. -
ఎనిమిది లక్షల పింఛన్లకు కోత?
సాక్షి, అమరావతి: బాబు సర్కార్ బడ్జెట్ ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల పింఛన్లకు కోత పడే పరిస్థితి నెలకొంది. గత 20 నెలలుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పింఛన్ల పథకానికీ ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం దీనికి కారణం. 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు రూ.2,632.04 కోట్లు (రూ. 2,724.09 కోట్లు పంపిణీ చేస్తామని ముందు ప్రకటించింది) పంపిణీ చేసింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 31,584 కోట్లు నిధుల అవసరం ఉంటుంది. తాజా బడ్జెట్లో కేవలం 27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరానికన్నా 4 వేల కోట్లు తక్కువ. దీంతో ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇకపై 8 లక్షలు తగ్గితేనే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 50 ఏళ్లకే పింఛన్.. ‘హామీకే సరి’ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన ‘50 ఏళ్లకే పింఛన్’ హామీ.. కేవలం ప్రకటనలకే పరిమితమని బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. అయితే చంద్రబాబు ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అన్న హమీని ప్రకటించారు. తాజా కేటాయింపులు చూస్తే ఈ హామీ అమలు లేనట్లేనని తేలిపోయింది. కొత్త పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ నిలిపివేత» చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 20 నెలల్లో 60 ఏళ్లు నిండిన నిరుపేదలకు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు కాకపోగా, కనీసం పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోయింది.» కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిలిచిపోయింది. » గత జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. » ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆ సేవలు నిలిచిపోయాయి. సచివాలయాల్లో గానీ, మండల కార్యాలయాల్లో గానీ నేరుగా దరఖాస్తు అందజేయాలన్నా వీలుకాని పరిస్థితి. » 2024 జనవరి ఆరంభంలోనూ అప్పటి ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. » ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వరకు సైతం ఆన్లైన్ వెబ్‌పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల మంజూరు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. » అప్పట్లో ప్రభుత్వానికి అందిన రెండున్నర లక్షల మంది పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్లు కోతవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిలో ఇప్పటికే ఐదున్నర లక్షలకు పైగా కోతవేసింది. జగన్ ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛన్ పొందారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఈ సంఖ్య ప్రతి నెలా తగ్గుతూనే ఉంది. ఈ ఫిబ్రవరిలో పంపిణీ జరిగిన 60.19 లక్షలు చూస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఐదున్నర లక్షల దాకా పింఛన్ల సంఖ్య తగ్గిపోయినట్టు అర్థమవుతోంది. లక్ష వరకు దివ్యాంగుల పింఛన్లు కోత పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘రీ వెరిఫికేషన్’ నిర్వహిస్తోందన్న విమర్శలున్నాయి. -
రూ.53వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రీ టెక్, ఫుడ్‌ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచ సూత్రాల అమలుతో వ్యవసాయ రంగానికి ఊపిరి పోస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. శనివారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.53,752.12 కోట్లతో ప్రతిపాదించిన వ్యవసాయ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.62 లక్షల కోట్లుగా నమోదు కాగా, అందులో వ్యవసాయ రంగం వాటా 33.2 శాతం (రూ.5.39 లక్షల కోట్లు)గా ఉందన్నారు. దేశ వ్యవసాయ రంగం వృద్ధిరేటు 0.80 శాతం కాగా, ఏపీలో 7.83 శాతంగా నమోదైందన్నారు. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ఏపీ వాటా 10 శాతంగా ఉందన్నారు. ఈ రంగం వృద్ధిరేటు పరంగా 3.91 శాతంగా నమోదైందని, 15 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించే లక్ష్యంతో 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించామన్నారు. ‘అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు, విత్తన రాయితీకి రూ.240 కోట్లు, ప్రకృతి సాగుకు రూ.208 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.139.65 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.250 కోట్లు, స్వచ్ఛంద పంటల బీమాకు రూ.250 కోట్లు, ఎన్ఎంఈఓ–ఓపీ(ఆయిల్‌పామ్)కు రూ.204 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, ఎన్పీడీడీ (డెయిరీ డెవలప్మెంట్)కి రూ.202.62 కోట్లు, వేట నిషేధ భృతికి రూ.260 కోట్లు, పీఎంఎంఎస్‌వైకి రూ.398 కోట్లు, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం కోసం రూ.500 కోట్లు, వ్యవసాయ.. ఉద్యాన, పశువైద్య, మత్స్య వర్సిటీలకు రూ.804.31 కోట్లు కేటాయించాం’అని తెలిపారు. రంగాల వారీగా తీసుకుంటే వ్యవసాయ రంగానికి రూ.12,152.32 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.1,123.86 కోట్లు, పట్టు పరిశ్రమ రంగానికి రూ.95.87 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.515.39 కోట్లు, సహకార శాఖకు రూ.209.30 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,121.26 కోట్లు, మత్స్య శాఖకు రూ.523.52 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.13,722 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.14,276.89 కోట్లు కేటాయించామని వెల్లడించారు. -
అప్పులే ఆధారమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 2026 –27 బడ్జెట్లో రెవెన్యూ – వ్యయం మధ్య అధిక వ్యత్యాసం, మూలధన కల్పన తక్కువగా ఉండటం; ఆరోగ్యం, సామాజిక సేవలకు వనరుల కేటా యింపు తక్కువగా ఉండటం; రుణాలు, కేంద్ర సహాయంపై అధి కంగా ఆధారపడటం; సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమయిన చర్యలు లోపించడం కారణంగా సంతులనం లోపించింది. రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలో వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, మరోవైపు రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు కారణంగా ప్రాధాన్యతా రంగా లపై పెట్టుబడి తగ్గుతుంది. తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి క్షీణించడంతో పాటు ప్రభుత్వానికి రుణ భారం పెరిగి అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయం తగ్గుతుంది. కొరవడిన ఆర్థిక క్రమశిక్షణ2024 జూన్ తర్వాతి కాలంలో ప్రభుత్వం రుణాలపై అధికంగా ఆధార పడటం, రెవెన్యూ సమీకరణలో నిర్మాణా త్మక బలహీనతలు, వ్యయ యాజమాన్యంలో విఫలమవ డాన్ని సూచిస్తున్నది. పన్నేతర రాబడిలో తగ్గుదల, మూలధన వ్యయం తగ్గుదల, కమిటెడ్ వ్యయం (వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు)లో పెరుగుదలను ఇటీవలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టపరుస్తున్నది. కాగ్ గణాంకాల ప్రకారం, 2025 –26 ఆర్థిక సంవత్సరంలో 2025 నవంబర్ నాటికి రెవెన్యూ లోటు రూ. 54,355 కోట్లకు చేరు కుంది. 2026–27 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ. 3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం 77.1 శాతం కాగా, మూలధన వ్యయం 16.2 శాతం. మూలధన వ్యయాన్ని 2025–26 బడ్జెట్లో రూ. 40,636 కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుత 2026–27 బడ్జె ట్లో రూ. 53,915 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా రుణా లపై ఆధారపడినట్లయితే భవిష్యత్తు బడ్జెట్లలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులపై వెచ్చించవలసి ఉంటుంది. తద్వారా నూతన మూలధన ప్రాజెక్టులు, సంక్షేమంపై వ్యయం తగ్గుతుంది. రాష్ట్ర మొత్తం రుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 మధ్య కాలంలో రూ. 2,61,302 కోట్ల నుండి రూ. 4,85,491 కోట్లకు చేరు కోగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల కాలం నాటికి (మార్చి 2025) ఈ మొత్తం రూ. 6,62,557 కోట్లకు చేరుకుందని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు పార్ల మెంటులో ప్రస్తావనకు రావడం జరిగింది. 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సగటున రూ. 31,000 కోట్లను మూల ధన వ్యయానికి కేటాయించింది. కోవిడ్–19 సమయంలో రెవెన్యూ రాబడి తగ్గినప్పటికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కొని ఒకవైపు సంక్షేమంపై వ్యయాన్ని పెంచుతూ మరోవైపు దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మూలధన పెట్టు బడులను పెంచగలిగి, ఆర్థిక క్రమశిక్షణను పాటించడాన్ని గమనించాలి. మానవాభివృద్ధి, రైతుల సంక్షేమం, హౌసింగ్, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాలకు 2019–24లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో జీఎస్ డీపీ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది.మరోవైపు రుణాలవృద్ధిలోనూ తగ్గుదలను గమనించవచ్చు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతల క్రమంలో పేదరిక స్థాయి 2015–16లో 11.77 శాతం నుండి 2023 నాటికి 4.2 శాతానికి తగ్గింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంతో పోల్చినప్పుడు 2026 –27లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటులో తగ్గుదలను ప్రతిపాదించినప్పటికీ రెవెన్యూ రాబడిలో తగ్గుదల కారణంగా తిరిగి బడ్జెట్ లోటులు పెరిగే అవకాశం ఉంది. రుణాలపై, కేంద్ర గ్రాంట్లపై అధికంగా ఆధారపడటం వలన స్వయం నిరంతర ఆదాయ వృద్ధి ప్రశార్థకంగా కన్పిస్తున్నది.ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, వివిధ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ, ‘ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం’ నియమావళిని పాటిస్తూ, పన్నేతర రాబడిని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాల అమలు లక్ష్యాన్ని సాధించడం, తప్పనిసరి వ్యయానికి సంబంధించి కాలానుగుణంగా సమీక్ష, అధిక వడ్డీతో కూడిన స్వల్పకాల రుణాల తగ్గింపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు కృషి చేయాలి.-వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్‌ఛార్జి), ఇక్ఫాయ్ -ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
‘బాబుకు రైతులంటే చిన్నచూపు.. మరోసారి తేలిపోయింది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది రైతులను విస్మరించిన బడ్జెట్.. రైతు, రైతు కూలీల ప్రస్తావనే లేని వ్యవసాయ బడ్జెట్‌ని చూస్తున్నాం.. చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపని మరోసారి తేలిపోయిందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందన్నారు.‘‘ఈ బడ్జెట్ చూశాక ప్రభుత్వం దృష్టిలో అసలు రైతులు లేరని తేలిపోయింది. బస్తా యూరియా కూడా అందించలేని ప్రభుత్వం ఇది. కిలో మంచి విత్తనాలు కూడా అందించలేని దగా ప్రభుత్వం ఇది. కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎలా చెప్పుకుంటున్నారు?. అన్నదాత సుఖీభవ కింద రూ.10,200 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ రూ.6,600 కోట్లు మాత్రమే పెట్టటం ద్వారా రైతులను ఏం చేయదలచుకున్నారు?. ప్రభుత్వం దెబ్బకు రైతులంతా కూలీలుగా మారి పోతున్నారు...బడ్జెట్లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. రైతుల సంక్షేమం మీద ఈ ప్రభుత్వానికి ఒక వ్యూహం లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.3 వేల కోట్లు బెట్టేవారు. గిట్టుబాటు ధరల్లేకపోతే ప్రభుత్వమే ఆదుకునేది. మరి కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో ఎందుకు కేటాయించలేదు?. జగన్ తెచ్చిన ఉచిత బీమా సౌకర్యాన్ని ఎత్తేసి రైతుల కడుపు కొట్టారు. చంద్రబాబు ఆక్వా రైతులనూ మోసం చేశారు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు నిలువునా ముంచారు..వైఎస్సార్ హయాంలో హార్టికల్చర్ వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా తన ఘనత అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్రైవేటీకరణ మీద ప్రేమ.. చివరకు రైతు బజార్లను కూడా నిర్వహించలేక, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌కు భజన చేయటంలో కూటమి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ప్రతిరోజూ సగటున ఒకరు, రైతు కూలీలు నలుగురు చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను అందుకునేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?...టీడీపీ ఎమ్మెల్యేనే పల్లె కన్నీరు పెడుతోందని వాపోయాడు. వీటన్నిటి డైవర్షన్ కోసం లడ్డూలో కల్తీ అంటూ కథలు అల్లుతారు. ఏ వర్గానికీ మేలు చేయలేక నిత్యం వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మూడో బడ్జెట్ పెట్టినా ఇంకా మోసాలే చేస్తారా?. ఈ బడ్జెట్ కేవలం అంకెల ఆర్భాటమే. అప్పులతోనే బండి నడుపుతామనే సంకేతం ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు. -
కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ పచ్చి అబద్ధాలు, కాకిలెక్కలు, ఊహాజనిత సిద్ధాంతాలతో నిండి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల ఆదాయ, వ్యయాల విశ్లేషణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి బడ్జెట్ రూపొందించలేదంటూ తూర్పారబట్టారు. అధికారంలోకి రాకముందు రూ.10 లక్షల కోట్ల అప్పు అని మట్కా నంబర్లు చెప్పిన వారు, ఇప్పుడు వాస్తవాలు రాస్తే తమ బండారం బయటపడుతుందని అసలు అప్పు ఎంతో బడ్జెట్లో పేర్కొనలేదంటూ దెప్పిపొడిచారు. ప్రభుత్వ ఆదాయ లెక్కలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అవార్డులు ఇవ్వాలని బుగ్గన ఎద్దేవా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ.67,459 కోట్ల ఆదాయం వస్తే, మిగిలిన మూడు నెలల్లో ఏకంగా రూ.44,407 కోట్లు వస్తుందని చూపడం నమ్మశక్యమా? అంటూ నిలదీశారు. వాస్తవానికి ఆదాయ వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే ఉన్నా.. వచ్చే ఏడాదికి 45 శాతం పెరుగుదల చూపడం ప్రజలను మోసం చేయడమే అని తేల్చిచెప్పారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా తొమ్మిది శాతం వృద్ధి రేటు సాధించామని గుర్తు చేశారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని బుగ్గన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలివ్వడం, 10 వేల విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం విధ్వంసమా? అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా ద్వారా పేదలకు నేరుగా నగదు అందించడం మీకు గాయాలు కలిగించిందా?‘ అని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన గణాంకాలతో సహా నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ఇసుక, భూములే కాకుండా చివరకు కోడి వ్యర్థాల నుంచి కూడా అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని బుగ్గన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్ తప్ప.. పెర్ఫార్మెన్స్ మాత్రం పూర్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధపు లెక్కలు మానేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీది ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. మీ ఇంటెలిజెన్సే ఆరి్టఫిషియల్ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. బాధ్యత లేని బడ్జెట్ కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో రెవెన్యూ రశీదులు రూ.2,34,140 కోట్లు కాగా అప్పు రూ.98,065 కోట్లు, రెండూ కలిపి రూ.3,32,205 కోట్లుగా ఉంది. ఖర్చూ అంతే ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉన్న అత్యంత బాధ్యత బడ్జెట్ రూపకల్పన. కానీ ఏపీ బడ్జెట్ చూస్తే గతేడాది ఏం ఉందో ఇప్పుడూ అదే ఉంది. అన్నీ బొమ్మలు, సూత్రాలు, ఆలోచనలు, దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నామన్న ఊహాజనిత థియరీ తప్ప.. విశ్లేషణాత్మక వాస్తవాలెక్కడా ఈ బడ్జెట్లో కనిపించలేదు. చివరకు అప్పు ఎంత ఉందన్నదీ ఎక్కడా చెప్పలేదు. కారణం అధికారంలోకి రాకముందు నుంచే రూ.12 లక్షలు, రూ.11 లక్షలు, రూ.10 లక్షల కోట్లు అప్పు అని మట్కా నంబర్లు మాదిరిగా పదే, పదే చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాస్తవాలు రాస్తే తాము చెప్పింది తప్పు అవుతుంది కాబట్టి అప్పు ఎంత ఉందన్నది కూడా చెప్పలేదు. మూలధన వ్యయంపైనా అసత్యాలే 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పులు తీసుకుంటే రూ.81,597 కోట్లు. ఇంకా మూడు నెలలు మిగిలి ఉంది. కానీ మీరు మాత్రం రూ.80,500 కోట్లు అప్పులు చూపిస్తున్నారు. రెండేళ్లలో మీరు చేసిన మొత్తం అప్పు రూ.3.20 లక్షల కోట్లు. చేసిన ఆ అప్పు కూడా చూపించడం లేదు. 2025–26లో మూలధన వ్యయం కింద బడ్జెట్లో పెట్టిన అమౌంట్ రూ. 40,635 కోట్లు కాగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.33,134 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఇంతవరకు తొమ్మిది నెలలుగా మీరు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రూ.19,224 కోట్లు మాత్రమే. అంటే బ్యాలెన్స్ దాదాపు రూ.14 వేల కోట్లు. ఇప్పుడు కేవలం మూడు నెలల్లో ఖర్చుపెట్టడం సాధ్యమవుతుందా? పైగా రూ.48,075 కోట్లు రానున్న ఏడాది ఖర్చుపెట్టబోతున్నామని చెబుతున్నారు. ఎక్కడ రూ.19వేల కోట్లు, ఎక్కడ రూ.48 వేల కోట్లు ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? 2024 జూన్ నుంచి నేటి వరకూ విధ్వంసం నుంచి వికాసం దిశగా.. అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన అప్పులు రూ.3,20,450 కోట్లు. 2024–25లో రూ.81,622 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఆర్బీఐ ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి వరకు రూ.12,300 కోట్లు అప్పు చేశారు. పౌరసరఫరాల కింద రూ.7,000 కోట్లు, మార్క్‌ఫెడ్ కింద రూ.19,900 కోట్లు అప్పు చేసి.. రైతుల వద్ద నుంచి ఏ పంటలూ కొనలేదు. ఏపీఎండీసీ రూ.9వేల కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.9,600 కోట్లు, డిస్కమ్స్ రూ.12,110 కోట్లు, ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ సంస్థ ద్వారా రూ.1,000 కోట్లు తెచ్చారు, జలజీవన్ మిషన్ కింద రూ.10 వేల కోట్లు అప్పు చేసి.. అవి దేనికి వాడారో తెలియదు. కేంద్ర బడ్జెట్లో గతేడాది దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.10 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? ఎక్కడ ఈ డబ్బులు వాడారు? ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. దీనిపై మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏపీఐఐసీ రూ.8,500 కోట్లు, టిడ్కో రూ.4451 కోట్లు, అమరావతి కోసం రూ.47,900 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా జీఎస్డీపీ లెక్కలు చూస్తే.. మీరు 11.7 శాతం పెరిగిందని చెబుతుంటే కేంద్రం మాత్రం 10 శాతం లోపే అని చెబుతారు. అలాంటప్పుడు కేంద్రానికి తొమ్మిది శాతం ఆదాయం వస్తుంటే మీకు మాత్రం రెండు శాతం కూడా రావడం లేదు. ఇదెక్కడి లెక్క? అవినీతి, కక్ష, మోసం, రెడ్‌బుక్ సహా మీది పది సూత్రాల ప్రణాళిక తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పుడూ కూర్చోలేనని తెలిసినా మొక్కలు నాటారంటూ ఆర్థికమంత్రి సీఎం గురించి చెబుతున్నది నిజమే. చంద్రబాబు ఎప్పుడూ వేరొకరు నాటిన చెట్ల నీడనే కూర్చొంటారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు నియంత పాలన సాగించారు. అవినీతి, పక్షపాతం, కక్ష, అబద్ధాలు, మోసం, పారదర్శకత లేకపోవడం, శాంతిభద్రతలు విఫలం, రెడ్ బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్, క్రెడిట్ చోరీ అనే ఈ పది సూత్రాల ప్రాతిపదికన దుర్మార్గ పాలన సాగిస్తున్నారు. కూటమి పాలనలో ఉద్యోగులకూ టోకరా ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. 2024 జూలై నుంచి నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్ ఊసే ఎత్తలేదు. 2024 జూన్ నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ 2024 నుంచి లేదు. పోలీసులకు 2024 నుంచి 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ పెండింగ్‌లో ఉన్నాయి. 16 నెలల నుంచి టీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అటకెక్కింది. ఒకటో తారీఖున జీతాలు లేవు. ఇష్టమొచ్చినట్లు బకాయిలు పెట్టారు. 30–07–2024న ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అని చెప్పారు. ఏ ఒక్క ఇంటికీ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన 3 లక్షల ఇళ్లు తప్ప ఒక్కటీ లేదు. ఇవన్నీ అడిగితే మీకు కోపం వస్తుంది. ప్రజల తరఫున మేం ప్రశి్నస్తాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్న పెద్ద మనిషి కనిపించడు, పార్టీ పెట్టి ఆయనకు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తీ కనిపించడు.20 నెలల్లో 60 విజయాలంటూ తప్పుడు ప్రచారం 20 నెలల్లో 60 విజయాలు సాధించామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లాంటి ఓ ఆరేడు కూడా సాధించలేదు. 20 లక్షల మంది నిరుద్యోగులకు 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలిపి రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద అక్కచెల్లెమ్మలకు రూ.97,200 కోట్లు బాకీ ఉన్నారు. 20 లక్షల మంది 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు పింఛన్ బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20.865 కోట్లు ఎగ్గొట్టారు. సుమారు 6 లక్షలపైచిలుకు ఉన్న కౌలు రైతులకు అన్నదాతా సుఖీభవ ఎగ్గొట్టారు. దీపం పథకం కింద రూ.6,183 కోట్లు ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం కింద 24,504.39 కోట్లు ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.8వేల కోట్లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు.అప్పులపై మీరిచ్చిన వాస్తవాలివిగో.. మా ప్రభుత్వ హయాం పూర్తయ్యేసరికి రూ.9.74 లక్షల కోట్లు అప్పు మిగిల్చామని అబద్ధాలు చెబుతున్నారు. సీఏజీ రిపోర్టు, ఆర్బీఐ లెక్కలు, లెజిస్లేచర్ లెక్కలు అన్నీ తప్పు చెబుతాయి, మీరు చెప్పింది మాత్రమే నిజమని నమ్మించే యత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రశ్నకు బదులిచ్చినదాని ప్రకారం మీరు 02–06–2014 నాడు పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు రూ.1,07,852 కోట్లు, మీ ప్రభుత్వం దిగిపోయి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పు రూ.3,06,952 కోట్లకు చేరింది. మరలా 2024లో మా ప్రభుత్వం దిగిపోయినప్పటికీ మీరిచ్చిన లెక్కల ప్రకారమే రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే మా హయాంలో కేవలం రూ.3.39 లక్షల కోట్లు అప్పు మాత్రమే జరిగింది. మీ హయాంలో 2014–19 వరకు 22 శాతం అప్పు పెంచితే మా హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు పెరిగింది. -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: బొత్స
సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. సున్నావడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని.. 1 నుంచి 8 పేజీల వరకూ వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందంటూ దుయ్యబట్టారు.ఈ బడ్జెట్లో ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారెడీ అంటూ బొత్స నిలదీశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు ఠంఛన్‌గా అందించాం.. ఈ ప్రభుత్వంలో వాటి ఊసే లేదు.. కేటాయింపులు లేవు. పనికి ఆహార పథకాన్ని నీరుగార్చే విధంగా కేటాయింపులు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెప్పాం. కానీ ఇప్పుడు 9 లక్షల కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేశామని చెబుతున్నారు...బడ్జెట్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్‌ల పొగడ్తలే సరిపోయాయి. ఈ 20 నెలల కాలంలో 20 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఒక్క కౌలు రైతులకు అయినా నష్టపరిహారం ఇచ్చారా?. ఈ బడ్జెట్ వల్ల సమాజంలో ఏ ఒక్క వర్గానికి ఉపయోగం లేదు.. రాబోయే రోజుల్లో వీటి మీద పోరాడతాం. కచ్చితంగా మండలిలో చొక్కా పట్టుకొని నిలదీస్తాం. సమాధానాలు రాబడతాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
సాక్షి,అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో టోకరా పెట్టింది. పీఆర్సీ, ఐఆర్‌పై ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో సీపీఎస్ రద్దుపైనా ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించ లేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు బడ్జెట్ లవుతున్నా ఐఆర్ ఇవ్వకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు. -
తేలుస్తారా.. ముంచేస్తారా!
సాక్షి, అమరావతి : సూపర్ సిక్స్ లోని ప్రధాన హామీలను గత రెండు బడ్జెట్లలో అమలు చేయకుండా మోసానికి గురిచేసిన కూటమి సర్కారు.. ఈ బడ్జెట్లోనైనా తమకిచ్చిన హామీలను అమలు చేస్తుందనే గంపెడాశలతో యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. సూపర్ సిక్స్‌లో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పన ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే ఉద్యోగం కల్పించే వరకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అయితే 2024–25 వార్షిక బడ్జెట్లో ఈ రెండు పథకాలకు పైసా కేటాయింపులు చేయలేదు. అలాగే 2025–26 వార్షిక బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కేటాయించ లేదు. ఈ నేపథ్యంలో 2026–27 వార్షిక బడ్జెట్‌ను చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించనుంది. కూటమి ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్. ఉదయం 11.15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మండలిలో హోం మంత్రి అనిత వార్షిక బడ్జెట్‌ను, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చదువుతారు. ఈ బడ్జెట్లో ఏం చేస్తారో! » ఆడబిడ్డ నిధిని పీ–4తో, నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేసి అమలు చేసేశామని, ఎవరైనా వీటి గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగ యువత, ఆడబిడ్డ నిధి కోసం మహిళలు రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. » ఈ బడ్జెట్లోనైనా ఆడబిడ్డ నిధికి, నిరుద్యోగ భృతికి కేటాయింపులు చేసి అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, గత రెండు బడ్జెట్లలో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి చంద్రబాబు సర్కారు రూ.1,43,000 కోట్లు ఎగనామం పెట్టింది. ఈ బడ్జెట్లోనైనా ఆ మేరకు నిధులను అదనంగా కేటాయిస్తారని హామీలు పొందిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. » చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ హామీల అమలు బాధ్యత తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, హామీల అమలు గురించి పవన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. » సూపర్ సిక్స్‌తో పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. కానీ సూపర్ సిక్స్‌కే తొలి రెండు బడ్జెట్లలో దిక్కు లేకుండా చేశారు. ఇప్పుడు మూడో బడ్జెట్లో ఏమేరకు చేస్తారో నేడు తేలిపోనుంది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.3.22 లక్షల కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2026–27 వార్షిక బడ్జెట్‌ను దాదాపు పది శాతం మేర పెంచి రూ.3.46 లక్షల కోట్లకు పైగా ప్రవేశ పెడతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
సభ్యుల మధ్య లోపిస్తున్న సమాచారం
లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను అడ్డుకున్న వ్యవహారం సద్దుమణగింది. కానీ, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాపై ప్రతిపక్షాలు అవి శ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో పాలక, ప్రతిపక్షాల మధ్య మరో ఘర్షణాయుత అంకానికి తెర లేచింది. సభా వ్యవహారాలలో తమకు తగినంత సమయం ఇవ్వలేదని ప్రస్తుత సమావేశాల పొడవునా ప్రతిపక్షాలు స్పీకర్ బిర్లాపై ఆగ్రహంగా ఉన్నాయి. మాజీ ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలను చర్చకు పెట్టాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రచురణకు ఇంకా ఆమోదం తెలుపవలసి ఉంది. ప్రచురణకర్తలు అనుమతి కోరుతూ పుస్తక ప్రతిని రక్షణ శాఖకు పంపినట్లు జనరల్ నరవణె వెల్లడించారు. రాహుల్ ఆ పుస్తకం హార్డ్ కాపీని పార్లమెంట్ ఆవరణలో చూపించారు. పుస్తకం సాఫ్ట్ కాపీలు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవు తున్నాయి. ప్రచురణకు ఆమోద ముద్ర కోసం ఎదురు చూస్తున్న పుస్తకం ఇంటర్నెట్లో ఎలా అందుబాటులోకి వచ్చిందంటూ దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎంతవరకు రాయొచ్చు?ప్రచురణకు అనుమతి పొందని పుస్తకంలోని అంశాలను ఎలా లేవనెత్తుతారన్న వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. అది సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ, 2020లో తూర్పు లద్దాఖ్‌లో భారత–చైనా సైనికుల మధ్య ఘర్షణలకు సంబంధించి నరవణె ఏం రాసిఉంటారో ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వం పెదవి విప్పక పోవడం వల్ల ఈ అంశంపై దాని అభిప్రాయం ఏమిటో తెలుసు కోకుండానే, సర్క్యులేషన్లో ఉన్న అంశాలను ఆధారం చేసుకుని చాలా మంది ఒక నిర్ధారణకు వచ్చేసే ప్రమాదం ఉంది. జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చేటపుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. సీనియర్ పదవులను నిర్వహించిన సైనిక, పౌర అధికారులు రహస్య విషయాలను బయటకు పొక్కించే ఉబలా టాన్ని వదులుకోవడం మంచిది. తాము సర్వీసులో ఉన్నపుడు రాజ కీయ నాయకత్వంతో జరిపిన మాటామంతీ నమ్మకం పునాదిగా సాగి ఉంటుందనే సంగతిని వారు గుర్తెరగాలి. దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని భావించినపుడు ఆ చర్చల వివరాలను రాయకపోవడం వారికి గౌరవ ప్రదమే కాదు, పాటించవలసిన విధి కూడా. సర్వీసులో ఉన్నపుడు, రిటైరైన తర్వాత కూడా ఏది ఎంత వరకు చెప్పాలో అంతవరకు చెప్పడమే విధాయకం. నాయకులు పొరపాటు చేశారని లేదా తమ నమ్మకాన్ని వమ్ము చేశారని ఈ అధి కారులు భావించినా, ఆ నమ్మకానికి గండి కొట్టే విధంగా వ్యవహరించే లగ్జరీ లేదా స్వేచ్ఛ (రిటైరైన తర్వాత కూడా) వారికి ఉండదు. సీనియర్ సైనిక, పౌర అధికారులు తమకు అప్పగించిన పను లకు తమ బాధ్యతల పరిధి లోపలే వారు భాష్యం చెప్పాల్సిఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని తమ విచక్షణకు విడిచిపెట్టినపుడు తమ సైనిక బాధ్యతలకు పరిమితమై మాత్రమే వారు వాటికి భాష్యం చెప్పాలి తప్ప, వాటిని దౌత్య, రాజకీయపరమైన పరిధి వరకు తీసుకెళ్ళకూడదు. రాజకీయ నాయకత్వం దేశ ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని, దౌత్య, రాజకీయ పరమైన అంశాలను పరి గణనలోకి తీసుకుని, అటువంటి సందర్భాలలో తమకు ఆ విచక్ష ణాధి కారాలు కల్పించిందని సైనిక నాయకులు గ్రహించాలి. కొరవడిన సంభాషణభిన్న రాజకీయ పార్టీల మధ్య తగినంత కమ్యూనికేషన్ లోపించిన వెలితిని లోక్ సభలో ఇటీవలి ప్రతిష్టంభన, తదనంతరం ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెల్లడిస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై పాలక, ప్రతిపక్ష నాయకులు ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునే వారని మాజీ సివిల్ సర్వెంట్ల అనుభవాలను చదివితే తెలుస్తుంది. దౌత్యపరంగా ఏదైనా ఒక పెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్న పుడు లేదా దేశం హఠాత్తుగా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్పుడు ప్రభుత్వ నేతలు ప్రతిపక్ష నాయకులకు పరిస్థితిని వివరించిన సందర్భాలు దౌత్యవేత్తగా గడిపిన వృత్తి జీవితంలో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతమాత్రాన ఆ యా అంశాలపై ఆ యా పార్టీల వైఖ రులు కానీ, రాజకీయ గతులు కానీ మారిపోవు. కానీ, ఆ యాఅంశాలపై ఎదురవుతున్న సవాళ్ళు, అవకాశాలకు సంబంధించి రాజకీయంలోని అన్ని వర్గాలవారికి ఒక అవగాహన కల్పించినట్లు అయ్యేది. భిన్న స్రవంతులకు చెందిననాయకులు కొన్ని సందర్భా లలో నేరుగా మాట్లాడుకునేవారు. ఒక్కోసారి వారు నమ్మినబంట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు.నేడు పాలక, ప్రతిపక్ష నాయకులు వైషమ్యాలు, కోపతాపాలు, దూషణలతో కూడిన దాడులకు దిగడం చూస్తూంటే, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ నెరపుకునే ఆ సంప్రదాయం లోపించిందని లేదాఉండవలసినంతగా లేదని తేటతెల్లమవుతోంది. గోప్యంగా వివరించొచ్చు!నరవణె పుస్తకంలోని అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించి నపుడు, ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకున్న ఎటువంటి చర్చకు తాము అనుమతించలేమని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఆ పుస్తక ప్రచు రణకు అనుమతించకపోవడానికి గల కారణాలను తాము విడిగా వివరించగలమని తెలిపి ఉండాల్సింది. పుస్తకంలో ఉన్నదని చెబు తున్న ఉదంతంతో సహా, తూర్పు లద్దాఖ్ ఘటనల పూర్వాపరాల గురించి గోప్యంగా వివరించి ఉండవచ్చు. రాజకీయ నాయకులందరూ దేశ ప్రయోజనాలకు అంకితమై ఉన్నవారేనన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పవలసి వస్తోంది. వేటిని వెల్లడించవచ్చు వేటిని రహస్యంగా ఉంచాలనే వివేచన వారందరికీ ఉండి ఉంటుంది. మాజీ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ హయాంలో విదేశీ వ్యవహారాలపై స్థాయీ సంఘం సమావేశంలో జరిగిన ఓ ఘటనను చెబుతాను. వేటిపై చర్చించవచ్చునో, వేటిని చర్చించకూడదో రాజకీయ తర గతికి తెలుసునని ఆ సంఘటన నిరూపించింది.అఫ్గానిస్తాన్‌లో ‘నార్తర్న్ అలయన్స్’కు భారత్ చేస్తున్న సాయం గురించి అప్పటి విదేశాంగ కార్యదర్శి కె. రఘునాథ్‌ను లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన సూటిగా జవాబివ్వకుండా అరకొర మాటలతో దాట వేస్తు న్నారు. సభ్యులు అసహనానికి లోనవడంతో, గుజ్రాల్ జోక్యం చేసు కుని, విదేశాంగ శాఖ ఏం చేస్తున్నదీ తనకు తెలుసునని, చర్చనుఅంతటితో ముగించారు. ఏ సభ్యుడూ ఇక నిరసన తెలుపలేదు. -వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-వివేక్ కాట్జూ -
పోలవరంపై రాజీపడొద్దు.. ఏపీని అప్పుల కుప్పగా మార్చొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. 2026–27 బడ్జెట్‌పై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా ఎండగట్టారు. తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరి్థకమంత్రిని అభినందిస్తూ.. 2026–27 మూలధన వ్యయాన్ని రూ.12.21 లక్షలకోట్లకు పెంచడాన్ని స్వాగతించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.5 శాతం పెరుగుదల అని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. పోలవరాన్ని 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉండగా, బడ్జెట్ ప్రసంగంలో దీన్ని 41.15 మీటర్లకే పరిమితం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల వద్ద కేవలం 75 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలమని, దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని చెప్పారు. తద్వారా లక్షలాదిమంది రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55 వేలకోట్లు కాగా, సవరించిన వ్యయం రూ.30,436 కోట్లకు కుదించడం రాష్ట్ర రైతులకు చేసే ద్రోహమేనని మండిపడ్డారు. ఆఫ్ బడ్జెట్ అప్పులతో రాష్ట్రం ఎటు పోతోంది? ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో మొత్తం అప్పులు రూ.3.32 లక్షలకోట్లు ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3.20 లక్షలకోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేలకోట్లు, ఏపీఎస్సీఎల్ ద్వారా వేలకోట్లు అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని చెప్పారు. ఏపీఎండీసీ నిధులను ప్రైవేట్ వ్యక్తులు నేరుగా వాడుకునేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇలాంటి ఆఫ్ బడ్జెట్ అప్పుల వల్ల భవిష్యత్తులో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తుచేశారు. లక్షలకోట్లు అప్పులు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేలకోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోతోందని ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన వైద్యవిద్యను ప్రైవేట్‌పరం చేయడం వెనుక మర్మమేమిటని నిలదీశారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు, సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక డిమాండ్లు రాష్ట్రానికి సంబంధించి ఆయన పలు డిమాండ్లు చేశారు. అవి.. » విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపేసి, దానికి ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి. » విభజన హామీ అయిన కడప స్టీల్‌ప్లాంట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. » కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులను 100 శాతం కేంద్ర నిధులతో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. » ఉపాధిహామీ పథకం స్థానంలో వచ్చిన వీబీజీ రామ్ పథకంలో రాష్ట్ర వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచడం వల్ల ఏపీ వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి కూడా 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి. » రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎగువ పెన్నార్ అనుమతులు రద్దయ్యాయి. కేంద్రం చొరవ తీసుకుని ఆ అనుమతులను పునరుద్ధరించాలి. -
అప్పుల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అంతులేని అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు నెల నెలా దిగజార్చేస్తున్నారు! రుణభారం, రెవెన్యూ లోటుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. 18 నెలల్లో రూ.3.27 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పులు దేశంలోనే అత్యధికంగా రూ.85,269 కోట్లుగా ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. బిహార్‌ను మించిపోయి టీడీపీ కూటమి సర్కారు అప్పులు చేయడం గమనార్హం. ఈమేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు బడ్జెట్ కీలక సూచికలను కాగ్ విడుదల చేసింది. రెవెన్యూ లోటు రెట్టింపు.. ఆంధ్రప్రదేశ్ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న అప్పులను ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే దాటేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది మొత్తానికి బడ్జెట్ అంచనాల అప్పు రూ.79,952 కోట్లు కాగా ఇప్పటికే గీత దాటి రూ.85,269 కోట్లు అప్పులు చేసింది. ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి అదనంగా రూ.10 వేల కోట్లకు పైగా అప్పులు చేయడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర సొంత పన్నుల రాబడి డిసెంబర్ నాటికి రూ.74,163 కోట్లు కాగా అప్పు ఏకంగా రూ.85,269 కోట్లకు ఎగబాకింది. మరోపక్క బడ్జెట్లో మొత్తం రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా పేర్కొనగా డిసెంబర్ నాటికే రెట్టింపు స్థాయిలో రూ.60,480 కోట్ల రెవెన్యూ లోటులోకి రాష్ట్రం వెళ్లిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి నిధులు తగ్గిపోయాయి. 2023–24 డిసెంబర్‌తో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు కేంద్ర గ్రాంట్ల రూపంలో నిధులు ఏకంగా రూ.15,247 కోట్లు తగ్గిపోవడం గమనార్హం.సంక్షేమానికి తూట్లు..చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి నెలా అమ్మకం పన్ను రాబడి తగ్గడమే గానీ పెరగడం లేదని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర పన్నులు, డ్యూటీ రూపంలో రావాల్సిన రాబడి కూడా తగ్గడమే గానీ వృద్ధి అనేదే లేదు. 2023–24 డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రావాల్సిన రాబడి రూ.1,583 కోట్లు తగ్గిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు పోల్చితే.. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి అమ్మకం పన్ను రాబడి ఏకంగా రూ.6,22 కోట్లు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో నిలిచింది. చిట్ట చివరి నుంచి ఏపీ రెండో స్థానంలో ఉంది. అమ్మకం పన్ను రాబడి క్షీణించడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని స్పష్టం అవుతోంది. ఇక 2023–24 డిసెంబర్ వరకు పోల్చి చూస్తే సామాజిక రంగ వ్యయం 2025–26 డిసెంబర్ నాటికి రూ.5,874 కోట్లు తగ్గిపోయింది. -
బ్రేకవుట్‌కు చాన్సుందా?
సార్వత్రిక బడ్జెట్‌సహా.. యూఎస్‌తో ట్రేడ్ డీల్ తదితర అంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నికరంగా బలపడ్డాయి. బడ్జెట్లో ఎస్టీటీ పెంపుతో ఆదివారం అమ్మకాలు పోటెత్తగా.. యూఎస్ డీల్ వార్తలతో ఒక్కసారిగా పరుగందుకున్నాయి. వెరసి సాంకేతిక విశ్లేషణల ప్రకారం సమీప భవిష్యత్‌లో బ్రేకవుట్‌కు చాన్సున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ వారాంతాన ప్రస్తుత ఏడాది(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం ఈ వారం అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో ఈ వారం ఫలితాల ఆధారంగా ఆయా స్టాక్‌లపై అమ్మకాల, కొనుగోళ్ల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. నేడు(9న) ఎస్బీఐ కౌంటర్ యాక్టివ్‌గా ట్రేడ్‌కానున్నట్లు పేర్కొన్నారు. ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో ఆటో దిగ్గజాలు ఎంఅండ్ఎం, అశోక్ లేలాండ్, పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ, టైటన్ కంపెనీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అరబిందో, బాటా, గ్లాక్సో, ఫైజర్, ఎస్కార్ట్స్, కర్ణాటక బ్యాంక్, మదర్సన్ తదితరాలున్నాయి. ద్రవ్యోల్బణంపై దృష్టి 2026 జనవరి వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) విడుదలకానున్నాయి. 2025 డిసెంబర్లో సీపీఐ 1.33 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.71 శాతంకాగా.. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో ఆర్బీఐ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.25 శాతంవద్ద కొనసాగుతోంది. ఈ బాటలో 13న గత నెల టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2025 డిసెంబర్లో డబ్ల్యూపీఐ 0.32 శాతం నుంచి 0.83 శాతానికి ఎగసింది. ఈ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రేడ్ డీల్ జోష్ యూఎస్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి మార్గదర్శకాలు(ఫ్రేమ్‌వర్క్) సిద్ధమైనట్లు వారాంతాన ప్రభుత్వం ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించడంతో 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేస్తున్నట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎగుమతి ఆధారిత రంగాలు, కంపెనీలకు జోష్‌నివ్వనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే యూరోపియన్ దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎగుమతి రంగాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు వెల్లడించారు. అయితే విస్తరిస్తున్న ఏఐ టూల్స్ ప్రభావంతో దేశీ ఐటీ రంగంలో అలజడి తలెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత వారం ఐటీ దిగ్గజాల కౌంటర్లు భారీ అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం ప్రాథమికస్థాయి ఐటీ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళనలు తలెత్తాయి. యూఎస్ ధరలు.. జనవరి నెలకు బుధవారం(11న), శుక్రవారం(13న) చైనా విభిన్న ద్రవ్యోల్బణ గణాంకాలు, హౌసింగ్ డేటా విడుదల చేయనుంది. ఈ బాటలో 2025 డిసెంబర్ నెలకు యూఎస్ రిటైల్ అమ్మకాలు 10న వెల్లడికానుండగా.. 11న వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 12న జనవరి గృహ విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు 13న విడుదలకానున్నాయి. ఈ అంశాలకు సైతం మార్కెట్లలో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కారణంగా తక్కువ సుంకాలతో అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తులు, వైన్, లిక్కర్, ప్రాసెస్డ్ పండ్లు తదితరాలు దిగుమతికానున్నాయి.ఆటుపోట్లు తప్పవా?ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లు కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై తగినరీతిలో స్పందించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజాగా యూఎస్ ట్రేడ్ డీల్ తొలి దశ ఒప్పందం ఖరారుకావడంతో ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొనసాగుతున్న రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, కరెన్సీ బలహీనతలు, కమోడిటీలలో అమ్మకాలు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు వీడి కొనుగోళ్లకు దిగడం సానుకూల అంశమని ప్రస్తావించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్ కావచ్చని తదుపరి బ్రేకవుట్‌కు వీలున్నదని అంచనా వేశారు. సాంకేతిక అంశాల ప్రకారం చూస్తే.. → ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలిగా 25,500–25, 450 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇంతకంటే దిగువన 25,100 వద్ద సపోర్ట్‌కు అవకాశముంది. ఒకవేళ బలపడితే 26,300– 26,400 పాయింట్లకు చేరే వీలుంది. వీటిని అధిగమిస్తే 26,800ను తాకవచ్చు. → బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే తొలుత 82,800–82,300 పాయింట్ల వద్ద మద్దతు కనిపించే వీలుంది. తదుపరి 81,200 వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఏస్థాయిల నుంచైనా జోరందుకుంటే 85,800–86,000 పాయింట్లకు చేరే అవకాశముంది.గత వారం అప్ గత వారం(1–6) నికరంగా సెన్సెక్స్ 1,311 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 83,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 373 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 25,694 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లలో అమ్మకాలతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 0.1–0.4 శాతం మధ్య నీరసించాయి. బడ్జెట్ రోజును మినహాయించి చూస్తే సెన్సెక్స్ 2,857 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు(3.5 శాతం) చొప్పున జంప్‌చేశాయి. ఎఫ్‌పీఐల యూటర్న్ రూ. 8,100 కోట్ల పెట్టుబడులు దేశీ స్టాక్ మార్కెట్లలో 2025 కేలండర్ ఏడాదిసహా జనవరిలోనూ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో తాజాగా కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. వెరసి ఈ నెల 6వరకూ రూ. 8,129 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. 2026 జనవరిలో రూ. 35,692 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. 2025లో రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
-
పరిశోధనలు ప్రైవేటు పరమా?
సాధారణంగా అందరూ అనుకునేట్టు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కేవలం పన్నులు, ఆదాయం, ఆ యారంగాలకు కేటాయింపులు మాత్రమే కాదు. కీలక రంగాల విషయంలో ప్రభుత్వ ఆలోచనలు, విధానపరమైన మార్పులు ఇందులోనే వ్యక్తమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానరంగం ఉరకలేస్తున్న తరుణంలో అంతర్జా తీయ రాజకీయ పరిణామాలనూ దృష్టిలో ఉంచుకుంటే ఈ ఏడాది బడ్జెట్ సరికొత్త సవాళ్లకు సమాధానాలు తెలిపేదిగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఈ దిశలో బడ్జెట్ నిరాశ పరిచిందనే చెప్పాలి. ప్రభుత్వం ప్రకటించుకున్నట్టు ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ కాదు. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల విషయంలో ఇది యథాతథ స్థితిని కొనసాగించే సాధారణ బడ్జెట్. మార్పునకు సూచికలేనా?ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. కొత్త టెలిస్కో పులు, వేధశాలల ఏర్పాటును ప్రస్తావించారు. అరుదైన మూలకా లకు సంబంధించిన కారిడార్ల గురించి, సెమీ కండక్టర్ మిషన్ రెండో అధ్యాయం ప్రారంభం, బయోఫార్మా తయారీ వ్యూహాలూ ప్రసంగంలో ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సిన పనులే. అయితే ఏవీ ఓ గొప్ప మార్పునకు సూచికలైతే కావు. ‘ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ (ఐఐఏ) 15 ఏళ్లుగా నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోపు తయారీ కోసం శ్రమిస్తోంది; ఐదేళ్లుగా నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు నిర్మాణ ప్రయత్నాల్లోనూ ఉంది. ఆర్థిక మంత్రి వీటి గురించే బడ్జెట్లో ప్రస్తావించారు. వీటి డిజైనింగ్, స్థలంఎంపిక, పరిశోధన వేదిక పునాదులు, సిబ్బంది వంటి కీలకమైన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. స్థలం ఎంపిక కోసం ఆర్థిక మంత్రి స్వయంగా లద్దాఖ్‌ను సందర్శించారు కూడా.సూర్యుడిపై పరిశోధనల విషయంలో భారత్ సామర్థ్యం గట్టిదే. ప్రతిపాదిత టెలిస్కోపు కూడా ఆదిత్య ఎల్, ఉదయ్‌పూర్‌లోని మల్టీ అప్లికేషన్ సోలార్ టెలిస్కోపుల ద్వారా అందుతున్న సమాచారానికి సాయంగా నిలుస్తుంది. కొత్త టెలిస్కోపు నిర్మాణ వ్యయం దాదాపు రూ.3,500 కోట్లుగా లెక్కగట్టారు. అయితే ఐఐఏకు అదనపు బడ్జెట్ కేటాయింపులేవీ జరగలేదు. ఐఐఏ సహా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్్సకు అనుబంధంగా ఉన్న 25 అటానమస్ సంస్థలకు ఈ ఏడాది బడ్జెట్లో దక్కింది రూ.1,623 కోట్లు మాత్రమే.సాధారణ ప్రక్రియలో భాగమే!రానున్న ఐదేళ్లలో రూ.10,000 కోట్లతో బయోఫార్మా ‘శక్తి’ కార్యక్రమాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బయలాజిక్స్, బయో సిమిలర్స్ తయారీ చేపడతారు. అయితే మంత్రి ప్రకటించిన మొత్తం... మూడు కొత్త ‘నేషనల్‌ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ (నైపర్)ల నిర్మాణానికీ, వీటికి అనుబంధంగా ఉన్న వెయ్యి అక్రిడి టెడ్ క్లినికల్ ట్రయల్స్‌కూ ఖర్చు చేస్తారు. ఈ రెండూ సాధారణ ప్రక్రి యల్లో భాగమే కానీ, బయోఫార్మాకు ప్రత్యేకమైనవి ఏమీ కాదు.‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ను బలోపేతం చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ఇది అవసరమే కానీ బయో ఫార్మా వ్యూహంలో దీన్ని భాగం చేయడం ఆశ్చర్యకరం. శక్తి కార్యక్ర మంలో భాగంగా కేటాయించిన పదివేల కోట్ల రూపాయల్లో నైపర్ లకు ఎంత, మిగిలిన వాటికి ఎంతెంత అన్న స్పష్టత లేదు. వాస్తవా నికి, శక్తి కార్యక్రమం 2017లో వరల్డ్ బ్యాంక్ సాయంతో నేషనల్ బయోఫార్మా మిషన్‌లో భాగంగా 25 కోట్ల డాలర్లతో చేపట్టారు. దీని ద్వారా టీకాలు, బయోసిమిలర్లు, వైద్య పరికరాల తయారీ, పరిశో ధనలు చేయాలన్నది లక్ష్యం. హాట్ టాపికే కానీ...బడ్జెట్ ప్రసంగంలో సెమీ కండక్టర్లు, రేర్ఎర్త్ మినరల్స్, ఏఐ వంటి వాటి ప్రస్తావన వచ్చినప్పటికీ ఏదీ గేమ్‌ఛేంజర్ స్థాయికి చేరలేదు. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ కేంద్రం ఒకదాన్ని గత ఏడాది నవంబరులో ప్రారంభించామని ప్రకటించిన మంత్రి... ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని తెలిపారు. గతేడాది ప్రకటించిన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌లో ఇవన్నీ భాగం కావడం గమనార్హం. కొన్నేళ్లుగా బడ్జెట్ ప్రసంగాల్లో తరచూ వినిపించిన ఇంకో ఆలోచన ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’. ఈసారి దీన్ని కేవలం ప్రస్తావనకు మాత్రమే పరిమితం చేశారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినా గతేడాది రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపులు కూడా అంతే మొత్తంలో ఉండటం గమనార్హం. గతేడాది ప్రకటించిన రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) స్కీమ్ ద్వారా ప్రైవేట్‌రంగ డీప్ టెక్ ప్రాజెక్టులకు వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లు అందాల్సి ఉండగా గతేడాది రూ.20,000 కోట్లు దక్కాయి. ఇందులో ఖర్చ య్యింది రూ. 3,000 కోట్లు మాత్రమే. కేంద్ర కేబినెట్ దీన్ని గత ఏడాది జూలైలో ఆమోదించడం ఇందుకు కారణం. నియమ నిబంధనలు కాస్తా నవంబరుకు కానీ పూర్తి కాలేదు.కేటాయింపులో ఖర్చు చేసిన మొత్తం తక్కువైనా... అమలు తీరులో ఎన్నో లోపాలున్నా ఆర్‌డీఐకి జరిపిన కేటాయింపులను బట్టి చూస్తే... ప్రభుత్వం పరిశోధనలను ప్రైవేట్‌పరం చేసేందుకు నిర్ణ యించినట్టుగా కనిపిస్తోంది. ‘అనుసంధాన్’కు కేవలం రూ. 2,000 కోట్లే దక్కాయి. ఆర్‌డీఐకి ఇంతకు పది రెట్లు ఎక్కువ కేటాయించారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలకు కేటాయింపులు తగ్గిపోగా... ప్రైవేట్ రంగానికి ఎక్కువయ్యాయి. ఇదేమంత మంచి పరిణామం కాదు.-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మ -
ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్లో పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు ఇచ్చే అభివృద్ధి సహాయాన్ని భారత్ భారీగా తగ్గించింది. గత ఏడాది బడ్జెట్లో బంగ్లాదేశ్‌కు రూ. 120 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని సగానికి అంటే రూ. 60 కోట్లకు కుదించింది. దీని వెనుకగల కారణం ఏమిటి? మిగిలిన పొరుగు దేశాల విషయంలో ఉదారత చూపిన భారత్ ‘బంగ్లా’ విషయంలో ఎందుకిలా చేసింది?భూటాన్‌కు అత్యధిక సాయంగత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య సఖ్యత కొరవడింది. ఢాకాలో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్ఢెట్ కేటాయింపుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పొరుగు దేశాలైన భూటాన్.. భారత్ నుంచి రూ.2,288 కోట్లతో అత్యధికంగా లబ్ధి పొందుతుండగా, నేపాల్‌కు రూ. 800 కోట్లు, మాల్దీవులు, మారిషస్‌లకు చెరో రూ. 550 కోట్లు కేటాయించారు.క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో సన్నిహితంగా ఉండటం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఇప్పటికే బంగ్లాదేశీయులకు టూరిస్ట్ వీసాలను పరిమితం చేయడమే కాకుండా, ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తమ దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయి, ఆ దేశంతో సంబంధాలను బలపరుచుకోవడం భారత్‌కు తీవ్ర అసంతృప్తి కలిగించింది.క్రీడారంగానికీ పాకిన వైరంఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా క్రీడారంగానికి కూడా పాకాయి. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించడంతో మొదలైన వివాదం మరింత ముదిరింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి తప్పుకుంది. మరోవైపు, పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఆతిథ్య దేశమైన భారత్‌తో తలపడకూడదని ఆంక్షలు విధించింది. దీనివల్ల ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ డైలమాలో పడింది.తాలిబాన్ ప్రభుత్వానికి సహకారం పెంపుఒకవైపు బంగ్లాదేశ్‌కు నిధులు తగ్గించినా, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపిన భారత్, ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని రూ. 150 కోట్లకు పెంచింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్లో మొత్తం రూ. 22,118 కోట్లు కేటాయించారు. మైనారిటీల రక్షణ విషయంలో బంగ్లాదేశ్‌ను నిలదీస్తూనే, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా తన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు రూ. 400 కోట్లు, మయన్మార్‌కు రూ. 300 కోట్లు కేటాయించి , ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసింది.ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు -
Bhatti Vikramarka: బడ్జెట్ ఇలా ఊహించలేదు
-
Jada Sravan: ఏపీకి కేంద్రం వరాల జల్లా..? ఫ్లైట్ ఎక్కడం... ఫ్లైట్ దిగడం...
-
ఇక యూట్యూబర్లకు పండుగే!
కేంద్రం యూట్యూబర్లకు పండుగలాంటి వార్త చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్లో దేశీయ క్రియేటివ్ రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలల్లో ప్రత్యేక కంటెంట్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ప్రారంభ దశలో 1,500 పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలలో శిక్షణ అందించనున్నారు.అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్షిప్లుఅంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ కంటెంట్ భారతీయ కంటెంట్ క్రియేటర్లను గ్లోబల్ సెలబ్రిటీలుగా మార్చేందుకు గూగుల్, యూట్యూబ్, మెటా, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజాలతో ఐఐసీటీ కీలక ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల క్రియేటర్లకు కేవలం వ్యూస్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్‌షిప్‌లు, స్కాలర్షిప్లు, మెంటర్షిప్ లభించనున్నాయి. దక్షిణ కొరియా మాదిరిగా భారత్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా వేవ్ఎక్స్ (WaveX) ఇన్క్యుబేటర్ ద్వారా స్టార్టప్‌లకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.సరికొత్త మౌలిక సదుపాయాలుసృజనాత్మక రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ప్రభుత్వం కొత్తగా ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్’ (ఎన్ఐడీ)ను ఏర్పాటు చేయనుంది. ఇది ‘ఛాలెంజ్ రూట్’ ద్వారా ఏర్పాటు కానుంది. దీనితో పాటు పారిశ్రామిక కారిడార్ల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఒకే చోట ఉండటం వల్ల క్రియేటివ్ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేసినట్లవుతుంది.పెరగనున్న ఉపాధి అవకాశాలుఈ బడ్జెట్ ప్రతిపాదనలతో యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లకు అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌లలో హై-ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత క్రియేటర్లకు కూడా ప్రొఫెషనల్ క్వాలిటీ కంటెంట్ రూపొందించే అవకాశం దక్కుతుంది. అలాగే టెక్ దిగ్గజాలతో కుదిరిన ఒప్పందాల వల్ల తమ ఛానల్స్‌ను మరింతగా మానిటైజ్ చేసుకోవడానికి, మెరుగైన అల్గారిథమ్ సపోర్ట్ పొందడానికి మార్గం సుగమం కానుంది.చిన్న పట్టణాల్లోని క్రియేటర్లకు వరంసాధారణంగా ఒక యూట్యూబర్ హై-క్వాలిటీ వీడియోలు చేయాలంటే లక్షల రూపాయల విలువైన ఎడిటింగ్ సిస్టమ్స్, కెమెరాలు, సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వేల కంటెంట్ ల్యాబ్‌లు ఈ సమస్యను పరిష్కరిస్తాయి. ఇక్కడ క్రియేటర్లకు ఏఐ టూల్స్, హై-ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న కంప్యూటర్లు, లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని క్రియేటర్లకు వరంగా మారనుంది.గౌరవప్రదమైన వృత్తిగా..గూగుల్, యూట్యూబ్, మెటా వంటి సంస్థలతో ఐఐసీటీ ఒప్పందం చేసుకోవడంతో వల్ల యూట్యూబర్లకు కేవలం ‘వ్యూస్’ ఎలా పెంచుకోవాలో మాత్రమే కాకుండా, యాడ్ రెవెన్యూను ఎలా పెంచుకోవాలి?, కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఎలా ఉండాలో నేరుగా ఆయా సంస్థల ప్రతినిధుల నుండే శిక్షణ అందనుంది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ చేసే గేమర్లకు కొత్త టెక్నాలజీపై మరింత అవగాహన పెరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ‘కంటెంట్ క్రియేషన్’ను ఒక గౌరవప్రదమైన వృత్తిగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నది. ఇది కూడా చదవండి: స్కూల్ నుంచి రిటైర్మెంట్ వరకూ.. ‘ముగ్గురు మిత్రులు’ -
చంద్రబాబు పరపతి తుస్సు!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏలో కీలకంగా ఉన్నానని, తనవల్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. పైకి ఆయనెన్ని కబుర్లు చెప్పినా కేంద్రం మాత్రం చంద్రబాబును లెక్కలోకి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్టే ఉదాహరణగా నిలుస్తోంది. 2024లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ఢిల్లీకొచ్చి కేంద్రానికి తాను చెప్పిందే వేదమన్నట్లుగా ప్రగల్భాలు పలికారు. తీరా ఈ బడ్జెట్ చూస్తే ఆయన మాటలన్నీ తుస్సే అన్నట్లుగా ఉంది. దీంతో ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోయారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ఎక్కడ చంద్రబాబూ? 2024లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. 2026 కల్లా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ పనులు పూర్తవుతాయన్నారు. తీరా 2026–27 బడ్జెట్లో ఏపీకి స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు వంటి వాటిల్లో దేనికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నం–చెన్నై, విశాఖపట్నం–బెంగళూరు వంటి నగరాలకు స్పీడ్ రైలు కారిడార్‌ను సాధించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుల కేటాయింపులు రూ.2,066.32 కోట్లు ఇక చంద్రబాబు ఢిల్లీకి వచి్చన ప్రతిసారీ అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూతనివ్వాలంటూ కోరుతున్నారు. కేంద్రం మాత్రం బడ్జెట్లో నిధులు కాకుండా అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులిచి్చంది. తాజా బడ్జెట్లో వివిధ అంతర్జాతీయ బ్యాంకుల అప్పుల ద్వారా కేటాయింపులు చేసింది. వీటిలో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు నుంచి రూ.432.09 కోట్ల అప్పు.. ఏపీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుకు జర్మనీ బ్యాంకు నుంచి రూ.155.32 కోట్లు.. ఏపీ రోడ్ అండ్ బ్రిడ్జెస్ రీ–కనస్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు ఎన్బీడీ నుంచి రూ.350 కోట్లు.. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.1,128.91 కోట్ల అప్పులకు కేంద్రం కేటాయింపులు చేసింది. అంటే.. 2026–27 బడ్జెట్లో కేంద్రం చంద్రబాబుకు రూ.2,066.32 కోట్ల అప్పులకు అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బడ్జెట్లో చంద్రబాబును కేంద్రం పట్టించుకోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో.. ఇక కేంద్ర బడ్జెట్లో తాము సాధించింది ఏమీ లేకపోయినప్పటికీ టీడీపీ కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం మీదుగా పక్క రాష్ట్రాలకు రైల్వే కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. ఇదేదో తాము సాధించిన గొప్పగా బిల్డప్ ఇస్తున్నారు. -
బడ్జెట్లో ఏపీకి మళ్లీ అన్యాయమే
సాక్షి, న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయమే జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కారిడార్లు తెచ్చుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. గతేడాది కంటే ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గడంపై మండిపడ్డారు. ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబూరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మాట్లాడారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నామని చెప్పుకొనే చంద్రబాబు సాధించిందేమిటని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 41.5 మీటర్లకే ఉంచుతూ నిధులు కేటాయించినట్లు తెలిపారు. 2026–27 బడ్జెట్లో పోలవరానికి రూ.3,320 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. విశాఖ–చెన్నై, విశాఖ–బెంగళూరుకు రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. ఈ విషయాల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ రెండు అంశాలపై తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. బడ్జెట్లో టూరిజానికి పెద్దపీట వేయడం, ఇందులో అరకు వ్యాలీ అభివృద్ధికి కేంద్రం చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. అప్పులు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినందునే చంద్రబాబు తలొగ్గుతున్నారు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పారు. పోలవరం, జలజీవన్, పీఎంజేఎస్వై పథకాలకు పూర్తిగా నిధులు తగ్గించారని మండిపడ్డారు. జీరాంజీ పథకానికి రూ.58 వేల కోట్లు కోత వేశారని చెప్పారు. ఈ స్కీంను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. రాష్ట్రాలు 40 శాతం భరించే పరిస్థితులు లేవని, కేంద్రం వాటా కుదిస్తే ఇది నిర్వీర్యం అవుతుందని ఆ రోజు బిల్లు పాస్ చేసినప్పుడు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీ పునరి్వభజన చట్టంలో... పోలవరాన్ని తాము నిర్మిస్తామని, ఇందుకు రూ.57 వేలకోట్లు గ్రాంటు ఇస్తున్నామని కేంద్రం పొందుపరిచిందని చెప్పారు. గత బడ్జెట్లో ఎత్తు తగ్గించి, నిధులు తగ్గించారన్నారు. దాదాపు రూ.27 వేల కోట్లు తగ్గించినా, ఎత్తు తగ్గించినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరానికి ఏటా ఇలా నిధులు తగ్గించుకుంటూపోతే ఆ స్వప్నం ఎప్పుడు సాకారమవుతుందని ప్రశ్నించారు. రూ.30 వేల కోట్లలో రూ.3,320 కోట్లే కేటాయించారన్నారు. కేంద్రం చంద్రబాబుకు అప్పులు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వబట్టే.. పోలవరం విషయంలో తలొగ్గుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరుతో రూ.15 వేల కోట్లు అప్పు చేయడమేగాక.. మళ్లీ కొత్త అప్పులు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు 21 నెలల్లో రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. గత పాలనలో వైఎస్ జగన్ ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక, సోమాలియా అవుతుందని వ్యాఖ్యలు చేసిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబుకు ఇంత అప్పు చేయడానికి సిగ్గులేదా అని నిలదీశారు. కొత్తగా ఏపీఎండీసీ పేరుతో రూ.5 వేలకోట్లు, బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రూ.11 వేలకోట్ల అప్పునకు పూనుకున్నారని చెప్పారు. ప్రైవేటు సంస్థ ఏదైనా ప్రభుత్వానికి అప్పు ఇస్తే.. ప్రభుత్వం కట్టని పరిస్థితుల్లో ఆ అప్పును డైరెక్ట్‌గా డ్రా చేసుకోవచ్చనే షరతును ప్రభుత్వం పెట్టడం దుర్మార్గమని చెప్పారు. ఇబ్బడిముబ్బడిగా అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం పూర్తికి మరో పదేళ్లు?ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధలేదని ఈ బడ్జెట్ ద్వారా మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు. ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాటలు వింటుంటే అక్కడ నీరు ఏరులై పారుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపులో కూడా చంద్రబాబు, ఆయన టీం నోరు మెదపలేదని విమర్శించారు. గతేడాది కంటే ఇప్పుడు మరింతగా నిధులు తగ్గించడం చూస్తుంటే ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని మరో పదేళ్ల వరకు తీసుకెళ్లేలా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా ఏపీకి ఏటా అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పులాంధ్రప్రదేశ్‌గా చేసిందన్నారు. రాష్ట్రాన్ని కార్పొరేట్ల చేతుల్లో ఎలా పెట్టాలి, సొంత లాభాలు ఎలా గడించాలి అనేవే చంద్రబాలు ఆలోచనలని ఆయన విమర్శించారు. -
అదే పిచ్.. కాస్త రిలీఫ్
సాక్షి, అమరావతి : ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ముఖ్యంగా టీడీఎస్, టీసీఎస్‌ల భారం తగ్గించడంతోపాటు వ్యక్తిగత ట్యాక్స్ రిటర్నులు ఏడాదంతా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. విదేశాల్లో ఉన్న ప్రకటించని ఆస్తులను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ప్రకటించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆదివారం నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలు... » ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్– 2025 చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఇచ్చే ట్యాక్స్ రిబేట్, రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పరిగణనలోకి తీసు కుంటే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. » వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్–1, ఐటీఆర్–2కింద రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ జూలై 31, అదే ఆడిట్ అవసరం లేని సంస్థలకు గడువు తేదీ ఆగస్టు 31. » దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేసుకోవడానికి ప్రస్తుతం డిసెంబర్ 31గా ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగించారు. » విదేశీ టూర్ ప్యాకేజీలపై ప్రస్తుతం విధిస్తున్న 5 శాతం , 20 శాతం టీసీఎస్‌ను రెండు శాతానికి తగ్గించారు. » మానవ వనరులు అందించే సంస్థలపై విధించే టీడీఎస్‌ను ఒకటి లేదా రెండు శాతానికి పరిమితం చేశారు.» విదేశీ ఆస్తులను ప్రకటించడానికి వన్‌టైమ్ డిస్క్లోజర్ స్కీంను ప్రవేశపెట్టారు» గత రిటర్నుల్లో విదేశీ ఆస్తులను ప్రకటించడంలో విఫలమైతే ఈ స్కీం కింద తక్కువ పెనాల్టీతో ప్రకటించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. » ఆస్తి విలువ రూ.20 లక్షల లోపు ఉంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు. అదే కోటి రూపాయల లోపు ఉంటే మార్కెట్ విలువలో 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది. » ప్రవాస భారతీయులు పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీం(పీఐఎస్) కింద పెయిడప్ క్యాపిటల్‌లో 10 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు.ఇప్పటిదాకా ఇది 5 శాతంగానే ఉండేది. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల్లో వీరు ఇక నుంచి 24 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది 10 శాతంగా ఉండేది.» కార్పొరేట్స్పై విధిస్తున్న మినిమమ్ఆల్టర్నేటివ్ ట్యాక్స్‌ను (మ్యాట్) 15 నుంచి 14 శాతానికి తగ్గించారు. » ఆర్బీఐ నుంచి నేరుగా సావరిన్‌గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారు... కాలపరిమితి ముగిసేంత వరకూ తమ వద్దఉంచుకుంటే, వాళ్లకు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవే బాండ్లను సెంకడరీ మార్కెట్ నుంచికొనుగోలు చేసిన వారు మాత్రం క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.మ్యాచ్ సమ్మరీపిచ్ మారలేదు. ఫీల్డ్ సెట్టింగ్ కూడా మునుపట్లానే. ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబులు యథాతథం. కాకపోతే అంపైర్ నుంచి అనుకోకుండా నోబాల్ వచ్చింది. అంటే... ఓ సింగిల్ రన్‌తో పాటు మరో బాల్ అదనమన్న మాట. టీడీఎస్, టీసీఎస్‌లను తగ్గించటం సింగిల్ రన్ అదనంగా లభించటమే. అదనపు బాల్, సింగిల్ రన్ కాంబినేషన్‌తో కొంతయినా రన్‌రేట్‌పై ఒత్తిడి తగ్గింది. ఎన్నారైలకైతే లూజ్ డెలివరీలు పడ్డాయి. విదేశీ ఆస్తులపై వన్‌టైమ్ సెటిల్మెంట్ ఫ్రీ హిట్లాగామారింది. బౌండరీలు లేవు, హిట్టింగ్ లేదు. కానీ వికెట్లు కాపాడుకుంటూ స్కోర్‌బోర్డు ముందుకు నడిపిన ఒక క్లాసిక్ కన్సాలిడేషన్ ఓవర్ ఇది. -
ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే భవిష్యత్తు ఇంధనాలుగా పిలిచే అరుదైన ఖనిజాలు ఆంధ్ర ప్రదేశ్‌కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ఈ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం ఖనిజ తవ్వకాలకే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు దోహదపడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. అరుదైన ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామని నిర్మల ప్రకటించారు.దీనికోసం బడ్జెట్లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద రూ.16,300 కోట్లను కేటాయించారు. ఈ ఖనిజాల ద్వారా తయారయ్యే పర్మనెంట్ మాగ్నెట్స్ ఉత్పత్తి కోసం గత ఏడాది ప్రకటించిన రూ.7,280 కోట్ల ఇన్సెంటివ్ స్కీమ్‌ను ఈ కారిడార్‌కు అనుసంధానం చేయనున్నారు.ఏపీలో విస్తారంగా రేర్ ఎర్త్ మినరల్స్..ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మోనజైట్ అనే ఖనిజం ద్వారా పలు అరుదైన మూలకాలు లభిస్తాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నంవంటి ప్రాంతాలు ఈ బీచ్ సాండ్ నిక్షేపాలకు ప్రధాన కేంద్రాలు. అనంతపురం జిల్లాలోని దంచెర్ల, పెద్దవడుగూరు ప్రాంతాల్లోనూ రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో గ్రాఫైట్, కోబాల్ట్, కాడ్మియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ కారిడార్ ద్వారా కేవలం తీర ప్రాంతమే కాకుండా ఖనిజ నిక్షేపాలున్న లోతట్టు ప్రాంతాలను రవాణా పరంగా అనుసంధానించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మన ఖనిజ సంపదను ముడి రూపంలో తక్కువ ధరకు విదేశాలకు పంపించి తిరిగి వాటితో తయారైన ఖరీదైన బ్యాటరీలను, అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సంస్కృతికి విడనాడాలని భావిస్తున్నారు. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే రిఫైనరీలు, ఖనిజాలను వేరు చేసే అత్యాధునిక ల్యాబ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఒకే తాటిమీదకు తెస్తారు. దీంతో ఖర్చు తగ్గి, స్థానికంగా ఉపాధి పెరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ కారిడార్ విజయవంతం కావాలంటే పర్యావరణ ప్రభావం, స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా చూడటం ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ఈసీఎంఎస్కు రూ.40 వేల కోట్లున్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీలో ఆత్మనిర్భరతే లక్ష్యంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ఆదివారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. చిప్‌ల తయారీరంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ పరిశ్రమల్లో ఉపకరణాల సేకరణ, ముడి సరకులు, దేశీయ డిజైన్లు, ఇతర ముడి సామగ్రి విషయంలో సముపార్జనే ధ్యేయంగా ముందుకెళ్లాలని నిర్ణయించామని నిర్మల చెప్పారు. పారిశ్రామికంగా పరిశోధన శిక్షణా కేంద్రాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టామని, ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) 2.0ను తీసుకొస్తామని నిర్మల వెల్లడించారు.‘‘ త్వరలో ఐఎస్ఎస్ 2.0ను తీసుకొచ్చి చిప్‌ల సంబంధ ఉపకరణాలు, మెటీరియల్స్, భారతీయ మేథోపర హక్కులున్న చిప్ డిజైన్, సరకు రవాణా గొలుసులను అభివృద్ధి చేస్తాం’’ అని నిర్మల వెల్లడించారు. ‘‘ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్)ను 2025 ఏప్రిల్‌లో రూ.22,919 కోట్లతో ఆరంభించాం. ఈ పథకానికి నిధుల కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచుతున్నాం’’ అని నిర్మల చెప్పారు. ‘‘మొత్తంగా రూ.54,567 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వద్దకు జనవరి నాటికి 46 దరఖాస్తులు చేరాయి. ఈ ప్రాజెక్టులు సాకారమైతే మరో 51,000 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని నిర్మల చెప్పారు. -
హైస్పీడ్‌గా రైల్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేని అత్యాధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైస్పీడ్ రైల్, రవాణా సామర్థ్యం పెంపు, భద్రత విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. అభివృద్ధి అనుసంధానకర్తగా భావించే ఈ కారిడార్లను ముంబై–పుణే, పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య ఏర్పాటుచేయాలని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2,77,830 కోట్లను కేటాయించారు. దీంతోపాటు అదనపు బడ్జెటరీ వనరుల నుంచి రూ.15 వేల కోట్లు సమకూరుతాయని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. ఈ నిధులతో కొత్తలైన్ల నిర్మాణ,ం లోకోమోటివ్స్, కోచ్‌లు, వేగన్ల కొనుగోలు, ఇతర పనులు చేపడతారు. 2025–26లో రైల్వేకి 2,52,000 కోట్లు కేటాయించగా, ఈసారి 10.25 శాతం ఎక్కువగా కేటాయించారు. ఇప్పటివరకు రైల్వేకి చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. రవాణా కారిడార్» సుస్థిర రవాణా కోసం డెడికేటెడ్ రవాణా కారిడార్ (డీఎఫ్సీ)ను డాంకునీ (పశ్చిమబెంగాల్) నుంచి సూరత్ (గుజరాత్) వరకు 2.052 కి.మీ. నిడివి తో ఏర్పాటుచేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని తూర్పు– పశ్చిమ డీఎఫ్ఏసీగా పేర్కొంటారు.» అధిక రద్దీ ఉండే 18 వేల కి.మీ. ట్రాక్ మార్గంలో భద్రతకు నిర్దేశించిన కవచ్, సీసీటీవీ కెమెరాలు, టెలికం కోసం రూ.7,500 కోట్లు కేటాయించారు. రైల్వే నెట్వర్క్ మొత్తానికి కవచ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని బడ్జెట్ లో పేర్కొన్నారు» దేశీయ కంటెయినర్ తయారీ కోసం కొత్త పథకం ప్రవేశపెడుతూ రూ.10వేల కోట్లు కేటాయించారు. » లోకోమోటివ్స్, వేగన్లు తదితరాల కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు కేటాయించారు. దీంతో మరిన్ని వందేభారత్ రైళ్లు, 24–కోచ్ స్లీపర్ రైళ్లను తీసుకుంటారు.» అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు. » కొత్త లైన్ల నిర్మాణానికి రూ.36,721.55 కోట్లు, రూ. గేజ్ మార్పిడికి రూ.4,600 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 37,750 కోట్లు కేటాయించారు.రూపురేఖలు మారిపోతాయిహైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణంతో దేశ రవాణారంగం రూపురేఖలు మారిపోతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఏడు కారిడార్లు మొత్తం 4000 కి.మీ. నిడివితో విస్తరించి ఉంటాయని తెలిపారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రూ.1.20 లక్షల కోట్లు ప్రయాణికులు, భద్రత కోసం వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. భద్రతపై రైల్వే ఎక్కువ ఫోకస్ పెట్టిందని, దీనివల్ల 95 శాతం రైలు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య తొలిసారి చేపట్టిన హైస్పీడ్ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. – రైల్వే మంత్రి3,547.32 కోట్ల మిగులురైల్వే శాఖకు వచ్చే సంవత్సరంలో రూ.3,85,733.33 కోట్ల ఆదాయం వస్తుందని, రూ. 3,82,186.01 కోట్లు వ్యయమవుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 3,547.32 కోట్లు మిగులుతుందని భావిస్తున్నారు. 2024–25లో రైల్వేకి రూ. 3,35,757.09 కోట్ల ఆదాయం సమకూరగా, రూ.3,32,440.64 కోట్లు వ్యయమైంది. రూ.3,316.45 కోట్లు మిగులు వచ్చింది. మ్యాచ్ సమ్మరీవందే భారత్‌తో రైల్వే శాఖ బౌలింగ్ స్పీడు పెరిగింది. ఆ స్పీడు మరింత పెంచేందుకు వీలుగా... ఎంత ఫాస్ట్ బౌలింగ్‌నైనా తట్టుకునేందుకు తగ్గ పిచ్‌లు తయారు చేయాలని మోదీ సర్కారు సంకల్పించింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే కొత్త రైళ్లు హైస్పీడ్ బంతుల్లా దూసుకెళతాయి. స్థిరమైన ఆటకు తగ్గ పిచ్‌లా సరకు రవాణాను గాడిలో పెట్టడానికి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అక్కరకొస్తుంది. కవచ్, సీసీటీవీలతో భద్రతపై పెట్టే వ్యయం... నోబాల్స్, వైడ్స్‌కు అడ్డుకట్ట వేస్తుంది. రూ.2.77 లక్షల కోట్ల భారీకేటాయింపుతో ఈ బడ్జెట్లో రైల్వే మామూలు ఓవర్ కాదు. దేశ రవాణాను వేగంగా నడిపించే పవర్ స్పెల్ వేసింది. -
సాగు.. ఫోకస్ మిస్!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించారు. 2025–26 సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే ఈసారి 7.12 శాతం మాత్రమే కేటాయింపులు పెంచారు. దీంతో వ్యవసాయ రంగంలో ఏ విభాగంపై కూడా పెద్దగా ఫోకస్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక మంత్రి పూర్తి నిర్లక్ష్యం చేశారని అఖిల భారత కిసాన్ సభ ఆరోపించింది. వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునరుజ్జీవనం పట్ల ఎటువంటి నిబద్ధతను చూపలేదని ఆక్షేపించారు. అయితే, వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ’సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే దార్శనికతను కనబరిచిందని ఆర్థిక మంత్రి నిర్మలచెప్పారు. సంప్రదాయసాగుపై ఆధారపడటాన్ని తగ్గించి గ్రామీ ణ జీవనోపాధిని వైవిధ్యపరిచేందుకు బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. కొత్త ఏఐ టూల్.. » కేంద్రం ‘భారత్–విస్తార్ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్)’ అనే పేరుతో బహుళ భాషా కృత్రిమ మేధ టూల్‌ను ప్రకటించింది. దీనికోసం రూ.150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతులకు సలహాలు అందించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ టూల్ అగ్రిస్టాక్ పోర్టల్‌లను, సాగు పద్ధతులపై ఐకార్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానం చేస్తుంది. » పండ్లు, కూరగాయల మిషన్‌ను క్రిష్నియోన్నతి యోజన కింద కలిపేసి రూ.700 కోట్లు కేటాయించారు. » మఖానా బోర్డు పేరును బిహార్, ఇతర రాష్ట్రాల్లో మఖానా అభివృద్ధి పథకంగా మార్చారు. దీనికి రూ.90 కోట్లు కేటాయించారు. » పీఎం–కిసాన్‌కు రూ.63,500 కోట్లు కేటాయించారు. » వ్యవసాయ విద్య, పరిశోధనకు 3 శాతం కోతవేసి రూ. 9,964 కోట్లు కేటాయించారు. » ఇన్లాండ్ ఫిషరీల కోసం 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను స్టార్టప్‌లు, మహిళా సంఘాలు, చేపల పెంపకందారుల ద్వారా పటిష్టం చేస్తారు. ప్రధానమంత్రి సంపద యోజనకు కేటాయింపులను రూ.1,500 కోట్ల నుంచి 2,500 కోట్లకు పెంచారు. » కోస్తా, కొండ ప్రాంతాల్లో అధిక వ్యయమయ్యే పంటలైన కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ సాగుకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు. » పేద, సన్నకారు రైతులకు వస్తున్న ఆదాయంలో దాదాపు 16 శాతం పశుసంపద నుంచి వస్తోందంటూ.. 20,000 కంటే ఎక్కువ పశువైద్య నిపుణుల లభ్యతను పెంచడానికి రుణ–సంబంధిత మూలధన సబ్సిడీ పథకాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ పథకం ప్రైవేట్ రంగంలో వెటర్నరీ, పారావెట్ (పారా–వెటర్నరీ) కళాశాలలు, వెటర్నరీ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, బ్రీడింగ్ సౌకర్యాల స్థాపనకు తోడ్పడుతుంది. » గత బడ్జెట్లో ప్రకటించిన కాటన్ టెక్నాలజీ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ హైబ్రిడ్ సీడ్స్‌కు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ పథకాలు ఇంకా ప్రారంభంకాలేదు. చరిత్రాత్మక బడ్జెట్..అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేసే చరిత్రాత్మక బడ్జెట్ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఇది రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. – వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్మ్యాచ్ సమ్మరీఈ ఇన్నింగ్స్‌లో వ్యవసాయ రంగానిది విచిత్రమైన పరిస్థితి. బంతి నేరుగా వ్యయసాయ రంగం చేతిలోకి వచ్చింది. కానీ కీపర్ చేతిలోకి రాకుండానే జారిపోయింది. అంటే... అన్నీ ఉన్నా కొంచెం ఫోకస్ మాత్రం మిస్సయింది. కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. పెద్ద షాట్లు వస్తాయని ఆశించిన చోట బంతి జారిపోయింది. అటు బ్యాట్స్‌మన్‌కూ అందలేదు. ఇటు కీపర్‌కూ దొరకలేదు. సాగు, అనుబంధ రంగాల కేటాయింపుల్లో స్కోర్‌బోర్డు ముందుకు కదిలినట్టే కనిపించినా, ఫీల్డ్‌లో మాత్రం ఫోకస్ తప్పిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఏఐ టూల్స్, పథకాలు ప్రకటించినా రైతులు ఎదురుచూస్తున్న అంశాలకు మాత్రం చోటు దొరకలేదు. వికెట్ పడలేదు. కానీ ఫోకస్ లేక వ్యవసాయానికి అవకాశం మిస్ అయింది. డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులుకేంద్ర ప్రభుత్వం అంచనా న్యూఢిల్లీ: డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల(రూ.18.33 లక్షల కోట్లు) పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం అణు ఇంధనంపై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 90 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కార్యరూపం దాలుస్తున్నాయని వివరించారు. భారత్‌లో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాలో డేటా సెంటర్లు సహా ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడతామని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిజిటల్ కనెక్షన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. డేటా సెంటర్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 2047 దాకా ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపాదిత ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో చిప్‌ల తయారీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితులపై కరుణ17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం రద్దుఅత్యాధునిక చికిత్సలు మరింత మందికి చేరువ సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు కేంద్రం భారీ ఆర్థిక ఊరట ఇచ్చింది. క్యాన్సర్ చికిత్సల్లో వినియోగించే 17 రకాల ప్రాణాధార ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ ఆధునిక ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. టార్గెట్, ఇమ్యునోథెరపీ లాంటి ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ మందులపై సాధారణంగా 10% కస్టమ్స్ సుంకం ఉంటుంది. తాజాగా దీన్ని మినహాయించనుండటంతో బాధి తులకు ఊరట లభించనుంది. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను మాత్రమే వెతికి పట్టుకుని నాశనం చేసే టార్గెటెడ్ థెరపీ, రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసి క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యునోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండటమే దీనికి కారణం. ఇక 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకునే ఔషధాలను కూడా సుంకాల మినహాయింపు జాబితాలో చేర్చారు. -
హెల్త్ 'హబ్'
న్యూఢిల్లీ : ఆరోగ్య రంగంలో సదుపాయాలను విస్తరించడం, వైద్య విద్య, ఫార్మా రంగాలకు ప్రోత్సాహం, హెల్త్‌కేర్‌లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడం లక్ష్యంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పది శాతం పెంపుతో రూ.1,06,530.42 కోట్లను ఆరోగ్యశాఖకు కేటాయించారు. ఆధునిక చికిత్సలతో బయో ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ‘బయో ఫార్మా శక్తి’ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేయనున్నారు. దేశం బయో ఫార్మా తయారీ హబ్‌గా ఎదిగి దిగుమతులపై ఆధార పడాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. కొత్తగా మూడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న 7 నైపర్లను ఆధునీకరిస్తారు. వెయ్యి అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు రూ.4,000 కోట్లు కేటాయించారు. నేషనల్ ఎయిడ్స్, లైంగిక సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి రూ.3,477 కోట్లు వ్యయం చేయనున్నారు. రాంచి, తేజ్‌పూర్‌లోని మానసిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ఉత్తరాదిలో ‘నిమ్హాన్స్’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య రంగంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు రూ.350 కోట్లు కేటాయించారు. ప్రమాదాల సమయంలో వేగంగా అత్యవసర వైద్య సదుపాయాలు అందేలా ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆరోగ్య, వైద్య విద్య రంగంలో సిబ్బంది, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, వైద్య విద్య సీట్ల అప్‌గ్రెడేషన్, నర్సింగ్ విద్య తదితరాల కోసం రూ.1,725 కోట్లు కేటాయించారు. దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా, జీవన శైలి జబ్బుల చికిత్స భారం, నైపుణ్యం కలిగిన హెల్త్‌కేర్ నిపుణులకు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ విద్య విస్తరణ, బలోపేతం కోసం మూడేళ్లలో రూ.980 కోట్లు వ్యయం చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. దీని ద్వారా 10 కీలక విభాగాల్లో హెల్త్ ప్రొఫెషనల్ అనుబంధ ఇన్స్టిట్యూట్లను నెలకొల్పి ఐదేళ్లలో లక్ష మంది నిపుణులైన ప్రొఫెషనల్స్‌ను సిద్ధం చేస్తారు. వృద్ధుల జనాభాకు అనుగుణంగా 1.5 లక్షల మంది కేర్ టేకర్స్‌ను సిద్ధం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. దేశంలో ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్‌ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆయుష్, ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆస్పత్రులు, అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, పునరావాసం, వైద్య విద్య , పరిశోధన సౌకర్యాలతో ఇవి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్రాలు 3 ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ప్రధాని స్వాస్థ సురక్ష యోజన రూ.11,307 కోట్లు ఎన్హెచ్ఎం రూ.39,390 కోట్లు పీఎం –జేఏవై రూ.9,500 కోట్లు పీఎం – ఏబీహెచ్ఐఎం రూ.4770 కోట్లు ఢిల్లీ ఎయిమ్స్ రూ.5500.92 కోట్లు సీజీహెచ్ఎస్ పెన్షనర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ పథకానికి రూ.8697.86 కోట్లు కేంద్ర ఆస్పత్రులకు రూ.4599.66 కోట్లు హెల్త్ రీసెర్చ్ విభాగానికి రూ.4,821.21 కోట్లు (డీహెచ్ఆర్) సురక్షితమైన రక్త మార్పిడి సేవలకు రూ.275 కోట్లు -
విలేజ్.. విన్నర్
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలాంటి గ్రామీణ భారతావనిపై మరింత దృష్టి సారించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం కీలక ఫ్లాగ్షిప్ పథకాలకు తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించింది. గత ఉపాధి హామీ పథకం స్థానంలో మరింత పటిష్టమైన వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రాష్ట్రాలను భాగస్వామ్యం చేసే ఈ కొత్త పథకానికి మునుపెన్నడూ లేని రీతిలో కేటాయింపులు చేయడం విశేషం. మొత్తంమీద గ్రామీణాభివృద్ధికి 2026–27 బడ్జెట్లో రూ.1,94,369 కోట్లు దక్కాయి. పాత ఉపాధి హామీ పథకానికి రూ.30,000 కోట్లు, వ్యవసాయ మౌలికసదుపాయాలు, అభివృద్ధి ఫండ్‌కు రూ.4,400 కోట్లను కలుపుకుంటే 21 శాతం మేర నిధులు ఎగబాకినట్లు లెక్క!గ్రామీణ ప్రజలకు పక్కాగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు అమల్లోకి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో మోదీ సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచి్చంది. దీనికి వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ).. సంక్షిప్తంగా వీబీ–జీ రామ్ జీ అని పేరు పెట్టారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఇకపై ఏటా 125 రోజుల పాటు (పాత చట్టంలో 100 రోజులు) ఉపాధి హామీ దక్కుతుంది. కీలక వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను నివారించేందుకు 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. దీని కింద ప్రధానంగా జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధిని కల్పించే పనులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులను చేపడతారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా, మెరుగైన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ గవర్నెన్స్ పెంపొందించడం, పల్లెవాసుల్లో ఆర్థిక సాధికారతను పెంచడం కొత్త చట్టం ప్రధానోద్దేశమని మోదీ ప్రభుత్వం చెబుతోంది. పాత ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలు 100 శాతం, మెటీరియల్ ఖర్చులో 75 శాతం కేంద్రమే భరించేది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న జీ–రామ్–జీ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు ఉపాధి వ్యయాన్ని 60:40 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది. తాజా బడ్జెట్ కేటాయింపులకు రాష్ట్రాల వాటా తోడైతే జీ–రామ్–జీ కోసం ఏకంగా రూ.1.51 లక్షల కోట్లు దక్కుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ‘చరిత్రాత్మకం, అపూర్వమైనది’గా ఆయన అభివర్ణించారు. కాగా, ముగిసిపోతున్న పాత పథకం కింద చేపట్టిన పనుల కోసం అదనంగా ఈ బడ్జెట్లో మరో రూ.30,000 కోట్లను కేటాయించడం ద్వారా ఉపాధి కల్పనకు గట్టిగానే నిధుల హామీ లభించింది.‘వికసిత్ భారత్ జీ–రామ్–జీ’తో ఉపాధికి మరింత గ్యారంటీ... 2026–27 కేటాయింపులు:రూ.95,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.86,000 కోట్లు (సవరించిన అంచనా రూ.88,000 కోట్లు)జోరుగా ఇళ్ల నిర్మాణం (పీఎంఏవై)గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లోనూ కేంద్రం నిధులను భారీగా కేటాయించింది. పీఎంఏవై 2.0 స్కీమ్ కింద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.18,625 కోట్లు దక్కాయి. గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబి్ధదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 2026–27లో రూ.3,000 కోట్లు జమ చేయనున్నారు. కాగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు 2026–27లో 6.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు. తద్వారా 30.75 లక్షల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,917 కోట్ల నిధులు అందనున్నాయి. గ్రామాల్లో 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026–27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలనేది బడ్జెట్ అంచనా.2026–27 కేటాయింపులు: రూ.73,542 కోట్లు2025–26 కేటాయింపులు:రూ.74,626 కోట్లు(సవరించిన అంచనా రూ.40,000 కోట్లు)మ్యాచ్ సమ్మరీఈ బడ్జెట్ మ్యాచ్‌లో గ్రామీణ భారతం క్రీజ్‌లో నిలబడి గెలిచింది. ఉపాధి, ఇళ్లు, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీతో పల్లెల ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఫ్లాగ్షిప్ పథకాలకు దండిగా నిధులు రావడంతో గ్రామీణ అభివృద్ధి స్ట్రైట్ బ్యాట్‌తో ఆడిన క్లియర్ విన్నర్‌గా మారింది. ఉపాధి హామీకి కొత్త రూపు, ఇళ్ల నిర్మాణానికి వేగం, గ్రామ రహదారులకు దిశ, ఇంటింటికీ నీరు, నెట్‌కి హైస్పీడ్‌తో గ్రామాలు ఈ బడ్జెట్లో చేతులెత్తి విజయాన్ని ప్రకటించాయి. ఇది వికసిత్ భారత్ లక్ష్యం దిశగా గ్రామీణ భారతం సమయం చూసుకుని కొట్టిన మ్యాచ్– విన్నింగ్ షాట్.రహదారులు.. రయ్ రయ్ (పీఎంజీఎస్‌వై) 2026–27 కేటాయింపులు:రూ.19,000 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.19,000 కోట్లు(సవరించిన అంచనా రూ.11,000 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణం, వాటిని సక్రమంగా నిర్వహించేందుకు అమలవుతున్న ఫ్లాగ్ షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన – పీఎంజీఎస్‌వై) ఇది. తాజా బడ్జెట్లోనూ మోదీ సర్కారు ఈ పథకంపై మరింత ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ స్కీమ్ నాలుగో దశ అమలవుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 26,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్ల నిర్మాణం లక్ష్యం. పర్యావరణ అనుకూల సాంకేతికతతో 12,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 4,200 గ్రామీణ ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానించాలని కేంద్రం సంకల్పించింది. ఈ పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్ నాటికి 7,87,809 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు అంచనా.స్వచ్ఛ భారత్.. రెండో దశ 2014లో ఆరంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) స్టేటస్ సాకారమైంది. దీన్ని కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ కోసం ఇప్పుడు రెండో దశ అమలవుతోంది. 2026–27లో 48,096 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణ పరిధిలోకి తీసుకురానున్నారు. 36,119 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. 1,352 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. 1,50,000 గ్రామాల్లో సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2026–27లో 50,000 వ్యక్తిగత టాయిలెట్లు, 5,000 కమ్యూనిటీ టాయిలెట్లు, 10,000 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నారు. 2026–27 కేటాయింపులు:రూ.9,692 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.12,192 కోట్లు (సవరించిన అంచనా రూ.8,000 కోట్లు)ఇంటింటికీ తాగునీరు (జల్‌జీవన్ మిషన్) జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ పథకం ద్వారా దేశంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది లక్ష్యం. దీన్ని సాకారం చేసేందుకు పథకాన్ని 2028 వరకు పొడిగించారు. తదనుగుణంగానే తాజా బడ్జెట్లో దండిగా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2026–27లో 1,70,000 గ్రామ పంచాయితీల్లో హర్‌ఘర్ జల్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. 80 శాతం గ్రామాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనేది తాజా బడ్జెట్ లక్ష్యం.2026–27 కేటాయింపులు:రూ.67,670 కోట్లు 2025–26 కేటాయింపులు:రూ.67,000 కోట్లు (సవరించిన అంచనా రూ.17,000 కోట్లు)భారత్ నెట్.. హైస్పీడ్దేశంలో గ్రామ పంచాయతీలన్నింటినీ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. ఇప్పటిదాకా 2,24,323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 7,72,676 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) వేశారు. 2025–26లో 10,000 జీపీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించారు. 80,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ నెట్వర్క్ వేశారు. 2026–27లో 42,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం లభించనుంది. 1,60,000 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్సీ వేయనున్నారు. 20,50,00 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.2026–27 కేటాయింపులు: రూ.24,000 కోట్లు2025–26 కేటాయింపులు: రూ.22,000 కోట్లు (సవరించిన అంచనా రూ.5,500 కోట్లు)ఇక చాంపియన్లుగా ఎంఎస్ఎంఈలుబడ్జెట్లో రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) చాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్‌ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చు కోవడానికి సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూడు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చుకోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు చాంపియన్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్‌కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి 2021లో ఏర్పాటుచేసిన ‘స్వయం సమృద్ధ భారత్ నిధి’కి రూ.2,000 కోట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రూ.7 లక్షల కోట్లకుపైగా విలువైన టీఆర్ఈడీఎస్లను ఎంఎస్ఎంఈలు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఆయా కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టీడీఎస్‌ను సులభతరం చేయడంతో ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందన్నారు. -
నిధుల సిక్సర్
న్యూఢిల్లీ : పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రతిపాదించింది. అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. ‘ఆపరేషన్ సిందూర్’చరిత్రాత్మక విజయం నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే తమ దృఢ సంకల్పానికి మూలధన సేకరణ సహా రక్షణ రంగ బడ్జెట్ పెంపు మరింత ఊతం ఇచి్చందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.5,53,668 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు రూ.1.80 లక్షల కోట్లతో పోల్చుకుంటే మూలధన వ్యయం రూ.39 వేల కోట్లు పెంచింది. అయితే 2025–26 సంవత్సరానికి సవరించిన మూలధన వ్యయాన్ని రూ.1,86,454 కోట్లుగా అంచనా వేశారు. తాజా మూలధన వ్యయంలో యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ.53,733 కోట్లు, నౌకాదళం కోసం రూ.25,023 కోట్లు కేటాయించారు. రూ.1,71,338 కోట్ల పింఛన్లతో కలిపి రెవెన్యూ వ్యయాన్ని రూ.5,53,668 కోట్లుగా చూపించారు. కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పౌర, శిక్షణ విమానాల తయారీకి అవసరమైన కాంపొనెంట్లు, విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగ పరిశ్రమలకు.. విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాలింగ్కు అవసరమైన విడిభాగాలపై బీసీడీ రద్దును ప్రతిపాదించారు. రక్షణ రంగ వైమానిక పరిశ్రమకు ఈ రెండు నిర్ణయాలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునికయుద్ధరీతులపై కేంద్రందృష్టి పెట్టింది.మాజీ సైనికుల సీహెచ్‌ఎస్‌కు రూ.12,100కోట్లు మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (సీహెచ్ఎస్) కోసం రూ.12,100 కోట్లు ప్రతిపాదించామని రాజ్‌నాథ్ చెప్పారు. భద్రత, అభివృద్ధి, స్వయం సమృద్ధి మధ్య సమతూకాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని అన్నారు. 2026–27 నాటికి అంచనా వేస్తున్న జీడీపీలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 2 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిలటరీ ఆధునీకరణతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, వనరుల సముచిత వినియోగానికి వీలుగా క్రమబద్ధమైన సేకరణపై రక్షణ బడ్జెట్ దృష్టి పెడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా సాయుధ దళాల బడ్జెట్‌పై దేశ రక్షణ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ఆధునీకరణ, బలోపేతానికి దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని రక్షణ బడ్జెట్ ప్రస్ఫుటం చేసిందని థాలేస్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ కనగ్లేకర్ అన్నారు. త్రివిధ దళాల ఆధునీకరణే లక్ష్యం: రక్షణ మంత్రి త్రివిధ దళాల ఆధునీకరణే ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశమనిరాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.85 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది సుమారు 24 శాతం అధికమని పేర్కొన్నారు. ఈ పెంపుదలతో దేశ మిలటరీ సామర్థ్యం మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రాధాన్యత ఇచి్చనట్లు తెలిపారు. మ్యాచ్ సమ్మరీమిగతా విషయాల్లో ఎంత ‘డిఫెన్స్’ ఆడినా... డిఫెన్స్ రంగం విషయానికి వచ్చేసరికి నో డిఫెన్స్. ఎందుకంటే భద్రతపై రాజీ ఉండకూడదన్నది ప్రభుత్వ పాలసీ. అందుకే... రక్షణ రంగం సేఫ్ ప్లేను వదిలి నిధుల సిక్సర్ కొట్టింది. రూ.7.84 లక్షల కోట్ల రికార్డు కేటాయింపుతో కేంద్రం బంతిని నేరుగా బౌండరీ దాటించింది. చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కొట్టిన ఈ షాట్ కేవలం స్కోర్ పెంచడానికి కాదు, మ్యాచ్‌ను కంట్రోల్లోకి తీసుకురావడానికి. మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆధునిక మిలటరీ హార్డ్‌వేర్‌తో దేశ రక్షణ విషయంలో ఎంత హిట్టింగ్‌కైనా సిద్ధమని మోదీ సర్కారు స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్ సిందూర్’ తర్వాత సన్నద్ధతకు మరింత పదునుపెట్టిన ఈ బడ్జెట్... డిఫెన్స్‌లో కాదు, అగ్రెసివ్ ఫీల్డ్ సెటప్‌తో ఆడుతున్న స్పష్టమైన సంకేతం. -
వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్
‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందడం లేదు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని కోరుకుంటున్నారు. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, అధిక వృద్ధిని సాధించడమే ధ్యేయంగా బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఇది భారతీయుల సమ్మిళిత సంకల్పం. విశ్వసనీయ ప్రజాస్వామ్య భాగస్వామిగా, విశ్వసనీయ నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాదారుగా భారత్ పాత్ర మరింత విస్తరిస్తుంది.యువతకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను రూపొందించారు. ఈ చరిత్రాత్మక బడ్జెట్ యువత ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మహిళల సాధికార స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. గ్రామాల సంక్షేమం, పేదలు, రైతుల అభివృద్ధి కోసం చక్కటి బడ్జెట్‌ను తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్, ఆమె బృందానికి నా అభినందనలు. వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉంది. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారి. వికసిత్ భారత్–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం.మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్‌గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలతో ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా మన ప్రయాణం వేగవంతమవుతుంది. ఏ దేశానికైనా ప్రజలే అతిపెద్ద బలం. అందుకే ప్రజల్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు పెంచడానికి కృషి చేస్తున్నాం. యువశక్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తాజా బడ్జెట్‌తో వేర్వేరు కీలక రంగాల్లో నాయకులు, నూతన ఆవిష్కరణలు తయారు కాబోతున్నారు. క్రీడా రంగంలో యువతకు నూతన అవకాశాలు దక్కబోతు న్నాయి.మన దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పన్ను మినహా యింపులు ప్రకటించాం. దేశంలో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల సారథ్యంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు దక్కుతుంది. ప్రతి జిల్లాలో బాలికల కోసం కొత్త హాస్టళ్లు రాబోతున్నాయి. దాంతో వారి విద్యాభ్యాసం మరింత మెరుగవుతుంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమలు ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలే. కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం రైతులకు బడ్జెట్లో ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించాం’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -
విమర్శలకు దీటైన జవాబు
న్యూఢిల్లీ: రైతులు, యువత, తయారీ దారులు, కుటుంబాల వ్యథలను పట్టించుకోకుండా బడ్జెట్‌ను తయారుచేశారని విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మల మీడియా భేటీలో తిప్పికొట్టారు. ‘‘ రాహుల్‌గాంధీ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, ప్రతికూల పరిస్థితుల ప్రభావం మన రంగాల మీదా పడుతోంది. అందుకే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలు వస్త్ర, తోలు పరిశ్రమల దాకా అన్నింట్లోనూ కొత్త పథకాలు తీసుకొచ్చాం. రైతులు, మహిళా వ్యవస్థాపకుల దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేశాం. ఇవన్నీ చూశాక కూడా మీరు(రాహుల్) రాజకీయంగా విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం.కానీ మీరు ఏ అంశాల మీదయితే విమర్శించాలనుకుంటున్నారో అవన్నీ నాకు చెప్తే నేను సావధానంగా వింటా. అందుకు తగ్గట్లు బదులిస్తా’’ అని నిర్మల అన్నారు. ‘‘ గత 12 ఏళ్లుగా భారతీయ ఆర్థికపథం స్థిరంగా ముందుకు సాగుతోంది. స్థిర అభివృద్ధిని సాధిస్తోంది. ద్రవ్యోల్బణం మధ్యస్తంగా ఉంది. అత్యధిక అనిశ్చితి, అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలకు జై కొట్టాం. ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించాం. ఆత్మనిర్భరతను మదిలో నిలుపుకుని దేశీయ తయారీరంగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేశాం. ఇంధన భద్రతకు పట్టంకట్టాం. దిగుమతులపై ఆధారపడే తత్వం నుంచి కాస్తంత దూరం జరిగాం’’ అని ఆమె అన్నారు. డెరివేటివ్ మార్కెట్లో ఎస్టీటీ పన్ను పెంపుఅత్యాశకు పోయి పెట్టుబడులను పోగొట్టుకొనే మదుపరులను అప్రమత్తంచేసే లక్ష్యంతో డెరివేటివ్ మార్కెట్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను(ఎస్టీటీ)ని కాస్తంత పెంచామని నిర్మల చెప్పారు. తాజా బడ్జెట్లో ఎస్టీటీని ప్రస్తుతమున్న 0.02 నుంచి 0.05 శాతానికి పెంచారు. ‘‘ నేనేం డెరివేటివ్ ట్రేడింగ్‌కు వ్యతిరేకం కాదు. చిన్న మదుపరులు పెట్టుబడులను నష్టపోవద్దనే సదుద్దేశంతోనే ఎఫ్ అండ్ ఓ మార్కెట్లో పన్నులను పెంచాం’’ అని నిర్మల పేర్కొన్నారు. -
వికసిత్ భారత్.. పెట్టుబడిదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: సామాన్యుడికి కొంత మోదం.. స్టాక్ మార్కెట్లకు, మదుపర్లకు ఖేదం.. స్టార్టప్‌లకు కాస్త నిరాశ.. పన్ను చెల్లింపుదారులకు అసంతృప్తి.. విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తయారీరంగం వారికి ఊరట.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బడ్జెట్ క్రికెట్ మ్యాచ్ చూశాక.. వివిధ వర్గాల అనుభూతులివి. 2026–27 సంవత్సరానికిగానూ రూ.53.47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను నిర్మల ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ, ప్రజాకర్షక హామీలకు దూరంగా బడ్జెట్‌ను రూపొందించారు. విత్త మంత్రి తన బడ్జెట్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు ప్రకటించారు.యువశక్తి బడ్జెట్మాఘ పౌర్ణమి శుభ పర్వదినాన, సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు రవిదాస్ జయంతి రోజున 2026–27 బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు నిర్మల తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ 12 ఏళ్లలో ఆర్థిక రంగానికి స్థిరత్వం వచ్చిందని, సుస్థిరాభివృద్ధి, ద్రవ్య క్రమశిక్షణ సాధ్యమయ్యాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజాకర్షక హామీలకంటే ప్రజల ప్రయోజనాలను నిరంతరం ఎంచుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. దీన్ని ‘యువ శక్తి నడిపిన బడ్జెట్’గా ఆమె అభివర్ణించారు.3 కర్తవ్యాలువిత్తమంత్రి తన ప్రసంగాన్ని మూడు ప్రధాన కర్తవ్యాలతో ప్రారంభించారు. అవి సమ్మిళిత వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందరితో కలసి–అందరి ప్రగతి. జీఎస్టీ సరళీకరణ, లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వంటి 350కిపైగా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మొదటి కర్తవ్యం కింద 6 రంగాల్లో చర్యలు ప్రతిపాదించారు. కీలక రంగాల్లో తయారీని భారీగా పెంచడం, ‘చాంపియన్ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈ)’ తయారుచేయడం, మౌలిక వసతుల రంగానికి ఊపునివ్వడం, ఇంధనరంగంలో సుస్థిరాభివృద్ధి – దీర్ఘకాలిక భద్రతకు చర్యలు, పట్టణ ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. కస్టమ్స్ పన్నుల్లో సరళీకరణ2026–27 బడ్జెట్లో కస్టమ్స్ విధానాన్ని సరళీకరించారు. అనవసర మినహాయింపులను తగ్గించారు. 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తేశారు. ప్రయాణికుల బ్యాగేజ్ నిబంధనలను సడలించి, వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి తగ్గించారు. ‘ఇంద్రధనుస్సు’ తయారీఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్, టెక్స్టైల్స్, క్రీడా పరికరాలు వంటి ఏడు రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఉద్యోగాల సృష్టి, సాంకేతికత ఆధారిత అభివృద్ధిపై దృష్టి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పర్యాటకం – చిరు వ్యాపారాలుహిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలో పర్యావరణ హిత పర్వత మార్గాల అభివృద్ధికి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 పురావస్తు కేంద్రాల అభివృద్ధికి కూడా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. డేటా సెంటర్లు, స్టాక్ మార్కెట్మనదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటుచేసే సంస్థలకు నిర్మలమ్మ పెద్ద శుభవార్తే చెప్పారు. భారతదేశం నుంచి గ్లోబల్ డేటా సెంటర్ సేవలు అందించే సంస్థలకు ఏకంగా 20 ఏళ్ల పాటు.. అంటే 2047 వరకు పన్ను మినహాయింపు ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22 శాతం పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధించారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచుతున్నట్టు ప్రకటించారు. విదేశీ టూర్లు – విదేశీ విద్యవిదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గించారు. విదేశీ విద్య, వైద్య ఖర్చులపై కూడా టీసీఎస్ తగ్గింపు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. విద్యార్థులు, యువ ఉద్యోగులు, టెక్ ఉద్యోగులు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎన్నారైలు వంటి చిన్న పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, 6 నెలల పాటు అమల్లో ఉండే విదేశీ ఆస్తుల వెల్లడింపు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్తఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు, విదేశాల నుంచి మరింత మూలధనాన్ని ఆకర్షించేందుకు నిర్మల మూడు కీలక అంశాలు ప్రకటించారు. కార్పొరేట్ బాండ్లకు మార్కెట్ – మేకింగ్ ఫ్రేమ్‌వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి వినూత్న మార్గం, లిస్టెడ్ కంపెనీల్లో అలాంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులు పెంచడం వంటి నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యంగా పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (పీఐఎస్) ద్వారా ఎన్ఆర్ఐలు ఇప్పుడు భారతీయ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మౌలిక వసతులుమౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా, తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కలిపే ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను ప్రారంభిస్తారు. తీర ప్రాంత సరుకు రవాణాను ప్రోత్సహించే పథకాన్ని కూడా అమలు చేస్తారు. సీప్లేన్ ల తయారీ దేశీయంగా జరిగేలా ప్రోత్సాహకాలు ఇస్తారు.క్లీన్ ఎనర్జీస్వచ్ఛ ఇంధన రంగంలో భాగంగా, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగించే కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ సాంకేతికతల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20,000 కోట్ల వ్యయం ప్రకటించారు. పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు, నగరాల మధ్య ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ‘వృద్ధి అనుసంధానాలుగా’ అభివృద్ధి చేయనున్నారు. లిథియం–అయాన్ బ్యాటరీలు, అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన దిగుమతులపై కూడా డ్యూటీ మినహాయింపు కొనసాగుతుందని ప్రకటించారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటుచేయనున్నారు.దివ్యాంగులకు వరాలుదివ్యాంగులకు చేయూతకోసం ‘దివ్యాంగజన్ కౌశల్ యోజన’, ‘దివ్యాంగ్ సహకార యోజన’ వంటి పథకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యావరణ ప్రజా రవాణా ప్రోత్సహించేందుకు 4వేల విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇంకా, 7 అరుదైన వ్యాధులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలను వ్యక్తిగత వినియోగం కోసం డ్యూటీ లేకుండా దిగుమతికి అనుమతి ఇచ్చారు.ప్రపంచ స్థాయికి ఉత్పాదక రంగందేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మల అనేక పథకాలు ప్రకటించారు. సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’, ఫార్మా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.10వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల విడి భాగాల తయారీ ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటా పెంచేందుకు రూ.10వేల కోట్లతో కంటైనర్ తయారీ పథకం ప్రకటించారు. సాగు – బ్యాంకింగ్ – క్రీడలువ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం వంటి చర్యలు ప్రకటించారు. బ్యాంకింగ్ రంగం మీద అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే పదేళ్లలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఖేలో ఇండియా మిషన్‌కు శ్రీకారం చుడుతున్నట్టు నిర్మల తెలిపారు. -
తెలంగాణకు మళ్లీ అన్యాయం
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల అమలులో కేంద్రం పుష్కరకాలంగా వివక్ష చూపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారు. బీజేపీ పెద్దలతో ‘‘బడే భాయ్–చోటే భాయ్’’అనుబంధం వల్ల రాష్ట్రానికి నిధుల వరద వస్తుందన్న భావన ఈ బడ్జెట్‌తో బూటకమన్న విషయం స్పష్టమైంది.తనపై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే సీఎం ఢిల్లీ పర్యటనలు చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కనీసం ప్రయత్నించలేదు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వే లైన్లు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐఐఎం, సిరిసిల్ల మెగా టెక్స్టైల్ పార్క్ వంటి కీలక డిమాండ్లపై పదేళ్లుగా విజ్ఞప్తులు చేసినా కేంద్రం ఏ ఒక్కదానికీ న్యాయం చేయలేదు. ఈ బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. -
బంగ్లాకు షాకిచ్చిన భారత్.. భారీగా నిధుల కోత
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి కేటాయించే నిధులను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుంగా మాల్దీవులు, మయన్మార్లకు భారత్ అందించే సహాయంలో భారీగా కోతలు విధించింది.ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగాయి. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు హెచ్చరించినా దాడులు ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారత్ ఆ దేశం పై ఆర్థిక కోత విధించింది. ప్రస్తుత బడ్జెట్లో రూ. 60 కోట్లు బంగ్లాకు కేటాయించింది. అదే గతేడాది ఈ ఇధి రూ.120 కోట్లుగా ఉంది. అదే విధంగా మాల్దీవులకు దాదాపు 8 శాతం సహాయం తగ్గించి రూ. 550 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు ఈ ఏడాది ఎటువంటి నిధులు కేటాయించలేదు.అయితే భూటాన్‌కు అందిస్తున్న సహాయాన్ని భారత్ ఈ సారి మరికొంతగా పెంచింది. దాదాపు ఆరు శాతం నిధులు పెంచి మెుత్తం రూ. 2,289 కోట్లకు పెంచింది. నేపాల్‌కు ఎనిమిది శాతం పెరిగి రూ. 800 కోట్లు చేసింది. శ్రీలంకకు సహాయం ఒక వంతు పెరిగి రూ. 400 కోట్లకు చేరుకుంది. మెుత్తంగా ఇతర దేశాలకు భారత్ చేసే ఆర్థిక సహాయం 4 శాతం పెరిగి రూ. 5,686 కోట్లకు చేరింది. . అదే గ తేడాది ఈ మెుత్తం రూ.5,483 కోట్లుగా ఉంది. 2026-27 సంవత్సరానికి భారత విదేశాంగ శాఖ బడ్జెట్ రూ.22,119 కోట్లుగా అంచనా వేయబడింది. -
తెలంగాణకు మేలు చేసే బడ్జెట్
హైదరాబాద్: తెలంగాణకు ఈ బడ్జెట్ చాలావిధాలుగా మేలు చేస్తుంది. 2025–26లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.29,280 కోట్లు రాగా, 2026–27 ఆర్థిక సంవత్సరానికి 13.5 శాతం వృద్ధితో రూ.33,180 కోట్లను కేటాయించారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్ నుంచే ప్రారంభం కానుండటం గర్వకారణం. బయోఫార్మా ‘శక్తి’కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ఫార్మా, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మరింత బలోపేతం కానుంది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వీబీ–జీ రామ్‌జీకి నిధులు పెంచారు.ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ.7 వేల కోట్లు కేటాయించి మొత్తం రూ.1.26 లక్షల కోట్లు మంజూరు చేశారు. ఇందులో సింహభాగం తెలంగాణకే దక్కనుంది. టెక్స్–ఇకో కార్యక్రమం.. వరంగల్‌లో ఏర్పాటు కానున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు కీలకంగా మారనుంది. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల రీమోడలింగ్తోపాటు భవిష్యత్‌లో మూడు హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. ఎంఎస్ఎంఈల కోసం రూ.10 వేల కోట్ల గ్రోత్ ఫండ్ కేంద్రం ప్రకటించింది. దీంతో తెలంగాణలోని 38 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరనుంది. – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి -
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.33,180 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన నిధుల కేటాయింపులు, పన్నుల వాటా వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాలో స్వల్ప పెరుగుదల కనిపించగా, మౌలిక వసతుల కల్పనలో భాగంగా హైదరాబాద్‌కు మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రతిపాదించడం గమనార్హం. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా కింద ఈసారి తెలంగాణకు 2.174 శాతం ఖరారైంది.దీని ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.33,180.78 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ పన్ను రూ.9,740.28 కోట్లు, ఆదాయపు పన్ను రూ.11,808.15 కోట్లు, కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.9,074.92 కోట్లు, కస్టమ్స్ సుంకం రూ.1,770.30 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.754.15 కోట్లు, ఇతర ట్యాక్స్‌లు రూ.32.98 కోట్లు ఉన్నాయి. కాగా గత బడ్జెట్లో కేంద్రం పన్నుల రూపంలో తెలంగాణకు రూ.29,899.77 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి వస్తున్న పన్నుల నిధులు రూ.3,281.01 కోట్లు అధికం. హైదరాబాద్‌కు మూడు ‘హైస్పీడ్’మార్గాలు దేశవ్యాప్తంగా నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్రం ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లలో మూడు కారిడార్లు హైదరాబాద్‌ను అనుసంధానించనున్నాయి. ఇది రాష్ట్ర రవాణా రంగానికి ఊతమిచ్చే అంశం. ఈ కారిడార్లలో పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నైలు ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల బదిలీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ‘ఎస్ఎన్ఏ స్పర్‡్ష’మాడ్యూల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు.. కేవలం ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అందులో తెలంగాణ చోటు దక్కించుకుంది. జీఎస్టీ పరిహారం లెక్కలు ఇవీ.. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు, గతంలో కేంద్రం ‘బ్యాక్ టు బ్యాక్ లోన్’పద్ధతిలో నిధులు విడుదల చేసింది. దీని కింద తెలంగాణకు 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి మొత్తం రూ.6,949.49 కోట్లు విడుదలైనట్టు తాజా బడ్జెట్ పత్రాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకు కేటాయింపులు ఇవే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజనలో భాగంగా తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ సహా ఇతర ఎయిమ్స్‌లు అన్నింటికి కలిపి రూ.2,005 కోట్లు కేంద్రం కేటాయించింది. హైదరాబాద్ ఐఐటీ (ఎక్సట్రనల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు)కు నిధుల కేటాయింపులో మొండి చేయి చూపించారు. కాగా తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయింపులు ప్రత్యేకంగా చేయలేదు. సింగరేణికి పెరిగిన నిధుల కేటాయింపు సింగరేణి కేలరీస్ సంస్థకు రూ.2,500 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.405.97 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి గత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించి, రూ.281.07 కోట్లకు సవరించారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో నిధుల కోత విధించి రూ.215 కోట్లు ఏడు నైపర్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.కాగా హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ.30 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.26 కోట్లు, హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డాక్)కు రూ.280 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.14.55 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు, నిజాం సంస్థాన విలీనం కోసం పోరాడిన యోధులకు (పెన్షన్లు) రూ.589.97 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు కేటాయింపుల్లో కోత విధించి రూ.908.78 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు.అయితే హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు కేటాయింపుల్లో కోత విధించారు. మూడేళ్ల క్రితం రూ.115 కోట్లు కేటాయించి, రెండేళ్ల క్రితం బడ్జెట్లో కేవలం రూ.10.84 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం....గత బడ్జెట్లో కేవలం నామమాత్రంగా రూ.0.01 కోట్లు కేటాయించింది. కాగా ప్రస్తుత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) సహా దేశంలోని 25 స్వయంప్రతిపత్తి కేంద్రాలన్నింటికీ కలిపి రూ.1,643.87 కోట్లు, సీడీఎఫ్‌డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయంప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ.1,002.13 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ.1,745.52 కోట్లు కేటాయించారు. -
బడ్జెట్ 2026: ఎవరు ఏమన్నారు?
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ వెలువడిన అనంతరం రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ప్రతిపక్ష నేతలు ఈ బడ్జెట్‌ను వాస్తవాలకు దూరం అని విమర్శించారు. నిరుద్యోగంతో పాటు సామాన్యుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.వాస్తవాలకు దూరం‘సమాజ్‌వాదీ’ నేత అఖిలేష్ యాదవ్ : ఈ బడ్జెట్ క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా దూరంగా ఉందని, ప్రజలకు ఇది ఎలాంటి ఆశను కల్పించలేకపోయిందని విమర్శించారు.నిరుద్యోగాన్ని విస్మరించారుశశి థరూర్ (కాంగ్రెస్): దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నిరుద్యోగమని, బడ్జెట్లోని వృద్ధి చర్యలు నిజంగా ఉద్యోగాలను సృష్టిస్తాయా అనే విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.వికసిత్ భారత్ వైపు అడుగులుప్రభుత్వ ప్రతినిధులు ఈ బడ్జెట్‌ను దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా అభివర్ణించారు.నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి): ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూనే మౌలిక సదుపాయాల కల్పన, ఏఐ-ఆధారిత పాలన ద్వారా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.పరిశ్రమలు - వ్యాపార వర్గాల స్పందనపారిశ్రామిక రంగానికి సంబంధించి బడ్జెట్ కొన్ని రంగాలకు ఊరటనిచ్చింది.బ్యాంకింగ్ రంగం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు తమ అంచనాలను కొంత తగ్గించుకున్నప్పటికీ, ఎంఎస్ఎంఈల కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలను సానుకూల అంశంగా గుర్తించాయి.ఎగుమతిదారులు - వ్యాపారులు: విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ (టీసీఎస్) తగ్గించడం, విద్యా సంబంధిత లావాదేవీలపై టీడీఎస్ (టీడీఎస్) సడలించడాన్ని ప్రశంసించారు. ఇది ఖర్చులను తగ్గించి వ్యాపారాలకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.టెక్ - ఏఐ స్టార్టప్‌లు: ‘ఇండియా ఏఐ’ మిషన్ విస్తరణను స్వాగతించినప్పటికీ, కంప్యూట్ వనరుల కేటాయింపులను రూ. 2,000 కోట్ల నుంచి ₹5,000 కోట్లకు పెంచి ఉంటే బాగుండేదని సూచించారు.ఆర్థికవేత్తలు - విశ్లేషకులుబడ్జెట్లోని లోతుపాతులను ఆర్థిక నిపుణులు ఈ విధంగా విశ్లేషించారు..సానుకూల అంశాలు: కొత్త పన్ను విధానంలో పన్ను రహిత పరిమితిని రూ.12–12.75 లక్షలకు పెంచడాన్ని మధ్యతరగతికి గొప్ప వరంగా పేర్కొన్నారు. అలాగే మౌలిక సదుపాయాలకు రూ. 12.2 లక్షల కోట్ల కేటాయింపులను ప్రశంసించారు.హెచ్చరిక: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. బడ్జెట్ లక్ష్యాలు యువతకు తగినన్ని ఉద్యోగాలను ఇస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకమని అభిప్రాయపడ్డారు. -
బడ్జెట్ భావుకత
ఏడు దశాబ్దాలకు పైగా మన బడ్జెట్ ప్రసంగాలు ఆర్థిక క్రమశిక్షణను మాత్రమే కాకుండా, మన దేశపు గొప్ప సాహిత్య వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి! వివేకానందుడి ధీరత్వం, తిరువళ్ళువర్ నైతికత, చాణక్యుడి వ్యూహం; గాలిబ్, ఇక్బాల్‌ల కవిత్వం.. ఇలా ఎందరో సాహితీవేత్తల ఉల్లేఖనాలు మన ఆర్థిక ప్రణాళికా ప్రసంగాలకు ఆత్మగా నిలిచాయి. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఆ ప్రసంగ పాఠాలలో, మహనీయుల మాట ఎలా ఒక దిక్సూచిలా మారిందో.. ఆర్థిక మంత్రులు తమ దార్శనికతను సాహిత్యం ద్వారా ఎలా ప్రజల హృదయాలకు చేరవేశారో వివరించే ‘బడ్జెట్ కావ్యం’ ఇది. ఆస్వాదించండి.సొగసైన వ్యక్తీకరణలుభారత కేంద్ర బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే, ఆర్థిక మంత్రులు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, సందర్భోచితమైన ‘గొప్ప మాటల’ ద్వారా ప్రభుత్వ దూరదృష్టిని, విజయాలను చాటిచెప్పడం ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు బలాన్ని చేకూర్చడానికి, దేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించడానికి వీరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోట్స్‌ను ‘దన్ను’గా ప్రయోగిస్తుంటారు. చారిత్రక వ్యక్తులు మొదలుకొని, ప్రసిద్ధ కవులు, రచయితల వరకు వైవిధ్య భరితమైన మూలాల నుండి ఆ కోట్లను స్వీకరిస్తారు. ప్రసంగంలోని తీవ్రతను బట్టి వాటి శైలి మారుతూ ఉంటుంది. అవి, దేశ ఆర్థిక గమనాన్ని సామాన్యులకు సైతం ప్రభావవంతంగా వివరించడానికి తోడ్పతాయి.కభీ ఖుషీ కభీ ఘమ్ఉదాహరణకు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసిద్ధ కవి ఇక్బాల్ కవిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. పి. చిదంబరం తన బడ్జెట్ ప్రతిపాదనలకు తిరువళ్ళువర్, థోరో వంటి గొప్ప వ్యక్తుల విజ్ఞానాన్ని జోడించేవారు. ప్రణబ్ ముఖర్జీ ప్రాచీన భారతీయ రాజనీతిజ్ఞుడైన కౌటిల్యుడి సూత్రాల నుండి మార్గదర్శకత్వాన్ని పొందేవారు. కేవలం షేక్స్పియర్ లేదా వివేకానందుడి వంటి వారే కాకుండా; అమర్త్యసేన్, ఇందిరా గాంధీ వంటి వారి ప్రస్తావనలు కూడా ఆర్థిక నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను బలోపేతం చేయడానికి బడ్జెట్ ప్రసంగాలకు ఉపయోగపడ్డాయి. ఇక 2002 నాటి ప్రసంగంలో యశ్వంత్ సిన్హా ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ (కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు విచారం), ‘ఫిల్హాల్’ (క్షణికమైన) వంటి బాలీవుడ్ చిత్రాల పేర్లను సైతం ఉదహరించారు!మొరార్జీ ఆశావాదం1960వ, 70వ దశాబ్దాలలో భారతదేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో కూడా, ఆర్థిక మంత్రులు ఈనాటికీ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా 1967–68 బడ్జెట్ ప్రసంగంలో, అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పేదరికంపై పోరాటం–మారుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య అత్యంత ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సరైన విధానాలను అనుసరిస్తే దేశ ఆర్థిక పురోగతికి ఒక మలుపు అవుతుందని ఆయన ఆశించారు. ‘‘రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నేను పూర్తి ఆశావాదంతో చూస్తున్నాను. నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే, ఈ ఏడాది.. ఆర్థిక పునరుజ్జీవనానికి నాంది అవుతుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’’ అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.మన్మోహన్ ఉర్దూ అద్దకం1990వ దశాబ్దంలో భారతదేశం ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేసింది. అప్పటి ఆర్థిక మంత్రి, భవిష్యత్ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. 18,650 పదాలతో నేటికీ అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచి ఉన్న తన 1991 నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ రాసిన భావగర్భితమైన కవితను ఆయన చదివారు.దాని భావం: ‘‘గ్రీకు, ఈజిప్షియన్, రోమన్ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని మన గుర్తింపు ఇంకా సజీవంగా ఉంది. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం ఇంకా నిలబడగలిగామంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండాలి.’’! అదే ప్రసంగంలో ఆయన విక్టర్ హ్యూగో రాసిన..‘‘సమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ భూమిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’’ అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. మరుసటి ఏడాది కూడా మన్మోహన్ మరో ఉర్దూ కవి ముజఫర్ రజ్మీ రాసిన మాటలను గుర్తుచేశారు. దాని అర్థం: ‘‘చరిత్రలో కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉన్నాయి, క్షణాల్లో జరిగిన పొరపాట్ల వల్ల శతాబ్దాల తరబడి శిక్షను అనుభవించాల్సి వచ్చింది.’’జస్వంత్.. తీరం, తుఫానుబీజేపీ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ బడ్జెట్ ప్రసంగాలు కూడా కవితాత్మను ప్రతిఫలించాయి. 1999 నుండి 2003 వరకు ఆర్థికమంత్రిగా సేవలందించిన యశ్వంత్ సిన్హా.. బడ్జెట్‌ను సంప్రదాయానికి భిన్నంగా సాయంత్రం పూట కాకుండా, మధ్యాహ్నం పూట ప్రవేశపెట్టిన మొదటి మంత్రిగా గుర్తింపు పొందారు. ఆర్థిక వ్యవస్థలో రెండవ తరం సంస్కరణలు, వృద్ధి, సమానత్వం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన ఒక కవితను పేర్కొన్నారు.దాని తాత్పర్యం: ‘‘సమయం మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతోంది. తీరం వెంబడి సురక్షితంగా ఎంతకాలం నడుస్తూ వెళ్తాం?’’ (సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం).అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో, యశ్వంత్ సిన్హా తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జస్వంత్ సింగ్, ప్రభుత్వ చివరి సంవత్సరాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలో సామాన్యుల అవసరాలకు పెద్దపీట వేస్తూ – ‘‘పేదవాడి కడుపులో ఆహారం, గృహిణి కొంగులో ధనం ఉండాలి..’’ అన్నారు. గాలి మేడలు.. పునాదులుకాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం తన బడ్జెట్ ప్రసంగాల్లో మేధావుల మాటలను జోడించడంలో సిద్ధహస్తులు. ముఖ్యంగా తమిళ తాత్విక కవి తిరువళ్ళువర్ పట్ల ఆయనకు ఉన్న భక్తి, గౌరవం ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ స్పష్టంగా కనిపిస్తాయి. తరచు ఆయన తిరువళ్ళువర్ రాసిన ప్రసిద్ధ ‘తిరుక్కురల్’ నుండి, ‘‘ఏది సరైనదో నీ విచక్షణకు స్పష్టంగా తెలిసినప్పుడు, దానిని పూర్తి దృఢ సంకల్పంతో, అలసత్వం లేకుండా సాధించాలి..’’ అనే మాటను ఉదహరించేవారు. 2006–07 మధ్యంతర బడ్జెట్ సమయంలో, భారతదేశ యువత కలలను, ఆకాంక్షలను ప్రతిఫలించేలా, ‘‘మీరు గాలిలో కోటలు కట్టినట్లయితే, మీ శ్రమ వృథా కాదు. అవి ఉండాల్సిన చోటు అదే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ కోటల కింద బలమైన పునాదులను నిర్మించడమే..’’ అని హెన్రీ డేవిడ్ థోరో చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్యాలను గుర్తు చేస్తూ, ‘‘మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. మన తలరాతను మనమే రాసుకుంటాము. గాలి అందరికీ సమానంగానే వీస్తుంది. ఎవరైతే తమ పడవ తెరచాపలను తెరిచి ఉంచుతారో వారు ముందుకు వెళ్తారు. తెరచాపలు మూసి ఉంచిన వారు వెనుకబడిపోతారు. అది గాలి తప్పా? కాదు... మన విధిని మనమే నిర్మించుకుంటాము..’’ అని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. అరుణ్ జైట్లీ.. పూలు–ముళ్లుజైట్లీ తన బడ్జెట్ ప్రసంగాల్లో సందర్భోచితమైన సూక్తులను, కవితలను ప్రయోగిస్తూ ఆర్థిక విధానాలను ఎంతో ఆసక్తికరంగా వివరించేవారు. 2017–18 బడ్జెట్ ప్రసంగంలో ఆయన, ‘‘నా లక్ష్యం సరైనదై, గమ్యం నా కళ్ల ముందు ఉన్నప్పుడు.. గాలులు నాకు అనుకూలిస్తాయి, నేను ఉన్నత శిఖరాలకు చేరుకుంటాను’’ అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. అలాగే 2016–17లో, ‘‘చాంపియన్లు అనేవారు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, ఒక కల, ఒక దార్శనికత నుండి ఉద్భవిస్తారు..’’ అని ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడారు. 2014–15 బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన, ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమం గవర్నెన్స్’ అనే పద ప్రయోగం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక ప్రతీకాత్మక నినాదంగా మారిపోయింది. ప్రధాని మోదీ ఘన విజయం తర్వాత అరుణ్ జైట్లీ తన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, దేశ పరిస్థితులపై ఓ కవితను చదివారు. దాని భావం: ‘‘మనం కొన్ని పూలను పూయించగలిగాము, మరికొన్ని వికసించాల్సి ఉంది. కాని, తోటలో ఇంకా కొన్ని పాత ముళ్లు మిగిలే ఉన్నాయి.’’ 2017లో, గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుండి దేశాన్ని గట్టెక్కించే క్రమంలో, జైట్లీ ఒక శక్తిమంతమైన ఉర్దూ కవితను స్మరించారు. ‘‘పడవను నడిపేవారు ఓటమిని అంగీకరించి చుక్కానిని మాకు అప్పగించినప్పుడు, ప్రతి అలపైనా మాకు తుఫానులు, సుడిగుండాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నదిని ఎలా దాటాలో మేము నిరూపించాము, భవిష్యత్తులోనూ నిరూపిస్తాము.’’. సీతారామన్.. వేకువ పక్షులుఆర్థిక మంత్రులందరిలో నిర్మలా సీతారామన్ తన ఆలోచనలను, ప్రణాళికలను ఎంతో స్పష్టంగా స్వేచ్ఛగా వ్యక్తపరచే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె తన ప్రసంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ దీనానాథ్ కౌల్, ప్రసిద్ధ మహిళా సాధ్వి అవ్వయ్యార్, కాళిదాసు, పిసిరాంతైయార్ వంటి వైవిధ్యభరితమైన మేధావుల నుండి తన బడ్జెట్ ప్రసంగానికి స్ఫూర్తిని అందుకొంటుంటారు. ఆమె ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్ ప్రసంగం ప్రధానంగా ‘‘ఆకాంక్షల భారతం, ఆర్థిక అభివృద్ధి, బాధ్యతాయుతమైన సమాజం’ అనే అంశాల చుట్టూ సాగింది. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని వివరిస్తూ, ఆమె ఉర్దూ రచయిత మంజూర్ హష్మీ రాసిన ఒక కవితను పఠించారు. ‘‘నీపై నీకు నమ్మకం ఉంటే, ఏదో ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. గాలి బలంగా వీస్తున్నప్పటికీ, ఆ గాలిని అడ్డుగా పెట్టుకుని కూడా దీపం వెలుగుతుంది..’’ అని ఆ కవిత భావం. నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో చాణక్య నీతి గురించి చెబుతూ, పట్టుదలతో కూడిన కృషి గురించి మాట్లాడారు. ‘‘మనుషులు దృఢ నిశ్చయంతో శ్రమిస్తే, అనుకున్న కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది’’ అని ఆ నీతి భావం. అలాగే, 2020 కేంద్ర బడ్జెట్ ప్రారంభోపన్యాసంలో.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత, భారతదేశ ఐక్యతను చాటి చెప్పడానికి కశ్మీరీ కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పండిట్ దీనానాథ్ కౌల్ రాసిన కవితను ఆమె చదివారు. ‘‘మన దేశం వికసించిన శాలిమార్ తోట వంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు వంటిది, యువత ఉడుకు రక్తంలా శక్తిమంతమైనది. నా దేశం, నీ దేశం, మన దేశం.. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన దేశం’’ అని ఆ కవిత భావం. ఇక 2021లో, కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన చీకటి నీడల నుండి దేశం కోలుకుంటున్న తరుణంలో, ఆశావాదాన్ని నింపడానికి ఆమె.. ‘‘తెల్లవారుజాములో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, వెలుగును ముందే పసిగట్టి పాట పాడే పక్షి వంటిదే నమ్మకం’’.. అనే రవీంద్రనాథ్ టాగోర్ కోట్‌ను జ్ఞప్తికి తెచ్చారు.చూడాలి, నేడు (1 ఫిబ్రవరి 2026) నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏ ప్రాచీన కవులు, రచయితలు, తత్త్వవేత్తలు, ఆమెతో పాటుగా ‘ప్రసంగిస్తారో’!మొత్తంమ్మీద ఇలా, బడ్జెట్ అంకెల్లో ఎన్నో అక్షర నక్షత్రాలు మెరిశాయి. భారతదేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్’ అంటే కేవలం ఆదాయ వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది దేశ ప్రజల ఆశలకూ, ఆకాంక్షలకు ప్రతిరూపం. లోక్‌సభ వేదికపై ఆర్థిక మంత్రులు ప్రసంగిస్తున్నప్పుడు, ఆ అంకెల ప్రవాహంలో అకస్మాత్తుగా ఒక ఉర్దూ శాయరీయో, సంస్కృత శ్లోకమో లేదా ఒక స్ఫూర్తిదాయక కవితో మెరిసి.. సభలోని వారినే కాదు, యావద్దేశాన్నే మంత్రముగ్ధులను చేస్తుంటాయి. జమాఖర్చుల ప్రసంగ పాఠానికి మనోరంజకమైన జీవిత సత్యాల కవితాత్మక జోడింపు ఇది. ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఉపయోగించిన కొన్ని సూక్తులుసమయం ఆసన్నమైన ఏ ఆలోచననైనా ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. – డాక్టర్ మన్మోహన్ సింగ్మన దేశం వికసించిన శాలిమార్ బాగ్ లాంటిది, దాల్ సరస్సులో విరిసిన తామర పువ్వు లాంటిది; ఇది యువత ఉడుకు రక్తం లాంటిది, నా దేశం, నీ దేశం, ప్రపంచం ప్రేమించే అత్యంత ప్రియమైన దేశం.– నిర్మలా సీతారామన్పరిస్థితులు మనల్ని తుఫానులతో పోరాడమని కోరుతున్నాయి. తీరం వెంబడి ఎంతకాలం నడుస్తూ వెళ్తాం? – యశ్వంత్ సిన్హాలక్ష్యం స్పష్టంగా ఉండి, గమ్యం కళ్లముందు ఉన్నప్పుడు.. గాలులు కూడా నాకు అనుకూలించి, నేను ఎత్తుకు ఎగురుతాను.; ‘‘ఛాంపియన్లు వారి అంతరాత్మలో ఉండే గాఢమైన కోరిక, కల.. ఇంకా వారి దార్శనికత నుండి పుడతారు.’’ – అరుణ్ జైట్లీ -
ఆర్థిక చరిత్రలోనే తొలిసారి ఇలా..! కానీ 1999లో మాత్రం..
భారతదేశ ఆర్థిక చరిత్రలో తొలిసారిగా, కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2026-27 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఇలా ఎప్పుడైనా వచ్చిందా అంటే..1999 బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి చివరి పనిదినాన బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. 1999లో, ఫిబ్రవరి 28 ఆదివారం వచ్చింది. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా దానిని ఒక రోజు ముందుగా ఫిబ్రవరి 27న, శనివారం ప్రవేశపెట్టారు. 1999 బడ్జెట్ కూడా చారిత్రాత్మకమైనదే. ఎందుకంటే అప్పటి వరకు, కేంద్ర బడ్జెట్లను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. పగటిపూట జరిగే ప్రకటనల సమయాన్ని ఉపయోగకరంగా మార్చేలా.. ఏళ్ల నాటి బ్రిటిష్ వలసవాద ఆచారానికి తెరపడిన రోజు అది. ఇలా సెలవురోజున ప్రవేశపెడితే ఏం జరుగుతుందంటే..పార్లమెంట్ షెడ్యూల్ ప్రకారం సమావేశమవుతుంది - సెలవు దినం అయినప్పటికీ, పార్లమెంటు సాధారణంగా బడ్జెట్ కోసం సమావేశమవుతుంది. ఆర్థిక మంత్రి షెడ్యూల్ చేసిన సమయంలో లోక్‌సభలో ప్రసంగిస్తారు.మార్కెట్లు ప్రత్యేక సమావేశాలను ప్రారంభించవచ్చు - BSE, NSE సాధారణంగా ఆదివారాల్లో మూసివేయబడినప్పటికీ, ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లను నిర్వహించవచ్చు, దీని వలన పెట్టుబడిదారులు బడ్జెట్ ప్రకటనలకు వెంటనే స్పందించవచ్చు.విశ్లేషణకు అదనపు సమయం. అలాగే ఆదివారం బడ్జెట్ పెట్టుబడిదారులకు, విశ్లేషకులకు పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక లక్ష్యాలు, రంగాల కేటాయింపులను అధ్యయనం చేయడానికి ఈ అదనపు సమయం ఉపయోగ పడుతుంది. పైగా మార్కెట్లు మార్పులలో పూర్తిగా ధర నిర్ణయించే ముందే ఈ అదనపు సమయంలో ఇవన్నీ జరిగే అవకాశం ఉడొచ్చు. అస్థిరత ఇప్పటికీ సాధ్యమే - అదనపు సమయం ఉంటుంది కాబట్టి.. బడ్జెట్లో ఆశ్చర్యకరమైనవి ఉంటే, ముఖ్యంగా సాధారణ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనప్పుడు మార్కెట్లు చాలా వేగంగా కదలడం ఊపందుకునే అవకాశం ఉంటుంది.(చదవండి: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు ఎందుకు..? ఎప్పటి నుంచి మొదలైందిలా) -
గ్రేటర్ నగరంపై నిర్మలమ్మ కరుణ చూపేనా?
గ్రేటర్ నగరానికి ఊతం.. పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.. సుస్థిర ఆర్థిక వృద్ధికి సాయం.. ఇలా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మహా నగరం ఎన్నో ఆశలు పెట్టుకుంది. బల్దియా పరిధిలో అభివృద్ధి పథకాలకు ఆసరా కలిగించేలా నిర్మలమ్మ కరుణ చూపుతారని అంతా ఆశిస్తున్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి, జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో మూసీ నది భాగస్వామ్యం, మెట్రో, ఎంఎంటీఎస్, హెచ్ఎండీఏ.. ఇలా వివిధ విభాగాల్లో ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేలా.. నిధులు భారీగా విదిలించేలా ‘ఆశల పద్దు’పై ఈ పొద్దు ఎంతో ఉత్కంఠగా గ్రేటర్ నగరం ఎదురు చూస్తోంది. బల్దియా విన్నపాలు వినవలె..గత ఆర్థిక సంవత్సరం కేంద్రంపై ఆశలతో రూ.10,500 కోట్ల నిధులివ్వాలని విజ్ఞాపనలు చేసిన జీహెచ్ఎంసీ ఓవైపు వాటి కోసం ఎదురు చూస్తూనే.. మరోవైపు, కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.719 కోట్లు రాగలవనే ఆశలు పెట్టుకుంది. ఆ ఆశతోనే జీహెచ్ఎంసీ కొత్త బడ్జెట్ (2026–27)లో కేటాయింపులు చేసింది. ఘనవ్యర్థాల నిర్వహణ కోసం రూ.279 కోట్లు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పనులకు రూ.140 కోట్లు, పేదల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు, ప్రత్యేక ఆర్థిక సహకారంగా రూ.200 కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తోంది.జలమండలికి కావాలి రూ.49,196 కోట్లు మహా నగర తాగునీటి అవసరాలు, మురుగునీటి పారుదల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జలమండలి కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద సుమారు రూ.49,196 కోట్ల విలువైన తొమ్మిది పథకాల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్లో అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాల కింద నిధులు మంజూరు కావాల్సి ఉంది.గ్రీన్‌ఫీల్డ్ రోడ్లకు నిధులిస్తారా? హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 10,050 చ.కి.మీ పరిధిలో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించారు. వివిధ చోట్ల 10 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.4,5000 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.ఈ మేరకు కేంద్రం నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మూసీ మురిసేనా..? జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో మూసీ నదిని భాగస్వామ్యం చేయాలని.. రూ.3,188 కోట్లు అందించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచింది. కేంద్రంపై పెట్టుకున్న ఆశలు ప్రస్తుత బడ్జెట్లో నెరవేరుతాయో లేదో చూడాలి. రెండో దశకు రెక్కలొచ్చేనా?మెట్రో రెండో దశలో ‘ఎ’, ‘బి’ విభాగాల కింద విస్తరించనున్న 8 కారిడార్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా 50 శాతం నిధులను అందజేయాల్సి ఉంది. రెండో దశలో చేపట్టనున్న 76.4 కి.మీ మొదటి 5 లేన్ల నిర్మాణం కోసం రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద మూడు మార్గాల్లో నిర్మించనున్న 86.1 కి.మీ కారిడార్లకు మరో రూ.19,759 కోట్లతో అంచనాలను రూపొందించారు. మెట్రో విస్తరణకు మాత్రం కేంద్రం నిధులను విడుదల చేయకపోవడమే కాకుండా సాంకేతిక కారణాల దృష్ట్యా రెండో దశ ప్రాజెక్టును పక్కన ఎంఎంటీఎస్, చర్లపల్లి టెరి్మనల్ కనెక్టివిటీలకు బ్రేక్.. కొత్త లైన్లతో పాటు 9 బోగీలతో కూడిన ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా పట్టాలెక్కలేదు. అలాగే.. చర్లపల్లి టెర్మినల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరభివృద్ధి చేసినప్పటికీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్, సిటీబస్ కనెక్టివిటీ అరకొరగానే ఉంది. గత ఏడాది బడ్జెట్లో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపునకు రూ.10 కోట్లు కేటాయించినా.. ఈ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. నిధులు, వనరులు, భూమి, మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. రైల్వేశాఖ రూ.60 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభించలేదు.తెలంగాణ సంపర్క్ క్రాంతి పట్టాలెక్కేనా?ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఈసారి కేంద్రం పచ్చజెండా ఊపనుందా...ఇప్పటికే రైల్వేబోర్డు ప్రతిపాదనల్లో ఉన్న ఈ ట్రైన్‌కు ఈ బడ్జెట్లో ఆమోదం లభించనుందా.. రైల్వేవర్గాలు అందుకు అవుననే చెబుతున్నాయి. -
తక్కువ వ్యయం.. లోటు లేని జీవితం
వచ్చిన ఆదాయంతో దేనికీ అంతగా ఇబ్బందులు పడకుండా, సుఖవంతమైన జీవితం గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి.. సరిగ్గా ఇలాంటివారికి అనువైన నగరాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఖర్చు తగ్గించుకుంటూనే.. నాణ్యమైన జీవితాన్ని గడపాలని ఆశించే వారికి ఇవి ఒక వరమని చెప్పుకోవచ్చు. సంస్కృతికి నిలయమైన జైపూర్ నుండి, ప్రకృతి ఒడిలో అలరారే డెహ్రాడూన్, ఉరుకుల పరుగుల కోల్‌కతా వరకు.. ఈ నగరాలు మీ జేబుకు చిల్లు పడకుండా సౌకర్యవంతమైన జీవనశైలిని అందిస్తాయి.ప్రశాంతతకు తిరువనంతపురం దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో జీవనం సాగించగల నగరాల్లో కేరళ రాజధాని తిరువనంతపురం అగ్రస్థానంలో ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం అని చెబుతుంటారు. ఇక్కడ నివాస ఖర్చులు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, ప్రముఖ ఐటీ హబ్‌గా ఈ ప్రాంతం ఎదగడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పశ్చిమ కనుమల మధ్య, అరేబియా సముద్ర తీరాన కొలువైన తిరువనంతపురం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ, తక్కువ ఖర్చుతో నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్నదని ‘టైమ్స్ ట్రావెల్’ తన కథనంలో పేర్కొంది.తక్కువ అద్దెలు, మెరుగైన వసతుల కోసం..తమిళనాడులోని కోయంబత్తూర్ నగరం తక్కువ అద్దెలు, మెరుగైన వసతులకు పెట్టింది పేరుగా నిలిచింది. గృహ నిర్వహణ వ్యయం పరంగా దేశంలోనే అత్యంత చౌకైన నగరాల్లో ఒకటిగా కోయంబత్తూర్ గుర్తింపు పొందింది. ఇక్కడి వస్త్ర, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఆర్థికంగా ఈ ప్రాంతానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా, భారీగా ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.ఇదే కోవలో డెహ్రాడూన్ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది. తక్కువ విద్యుత్ ఛార్జీలు, స్వల్ప నీటి ఛార్జీలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రవాణా వ్యవస్థ, ఆహార ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నగరంగా నిలుస్తోంది.పరిశుభ్రతలో టాప్ నగరంమధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం అసాధారణమైన పరిశుభ్రత, భద్రత, రుచికరమైన ఆహారాల లభ్యతకు పెట్టింది పేరు. దేశంలో నివసించడానికి అత్యంత పొదుపైన నగరంగా 2023లో ఇది నిలిచింది. ఇక్కడ రవాణా, గృహ వసతి చాలా తక్కువ ధరకే లభిస్తాయి.స్ట్రీట్ ఫుడ్ అంటే..సాంస్కృతిక రాజధాని కోల్‌కతా.. ఇక్కడ లభించే స్ట్రీట్ ఫుడ్ రుచితో పాటు చాలా చౌక ధరలకే లభ్యమవుతుంది. ఇదొక మెట్రో నగరమైనప్పటికీ, ఇక్కడ సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతోనే మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవచ్చు.చండీగఢ్, జైపూర్, నాగ్‌పూర్..పదవీ విరమణ తర్వాత స్థిరపడాలనుకునే వారికి చండీగఢ్ ఒక అద్భుతమైన నగరమని చెబుతుంటారు. కాలుష్యం తక్కువగా ఉండటం, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, తక్కువ అద్దెలు మొదలైనవి చండీగఢ్ సొంతమని అంటారు.రాజస్థాన్ రాజధాని జైపూర్ సైతం వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, సామాన్యులకు పొదుపుగా జీవించే మార్గాలను అందిస్తోంది. ఇక మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరం ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. తక్కువ రియల్ ఎస్టేట్ ధరలు, అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీ, అత్యుత్తమ వైద్య సదుపాయాలతో నాగ్‌పూర్ సామాన్యులు స్థిరపడేందుకు అనువైన నగరంగా మారింది.ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది? -
బడ్జెట్ క్వీన్ సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్‌తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను అందించారు. ⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు. ⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు. ⇒ అతితక్కువ బడ్జెట్ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా హీరూభాయ్ ముల్లిజ్భాయ్ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం ముగించారు. ⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది. -
ఆమెకు ఆర్థిక శక్తి!
‘బడ్జెట్ అనేది మన స్వేచ్ఛకు పరిమితులు విధించకూడదు. మరింత స్వేచ్ఛ ఇవ్వాలి’ అనేది పాత మాట. ‘ బడ్జెట్ అనేది స్వేచ్ఛ మాత్రమే కాదు మహిళా సాధికారతకు దారి చూపాలి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ ద్వారా కొత్త శక్తి ఇవ్వాలి’ అనేది కొత్త మాట. ‘బడ్జెట్–2026’ నుంచి మహిళలు ఆశిస్తున్నది ఏమిటి? బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్‌టెన్షనాలిటీ ప్రాధాన్యత ఏమిటి? ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కావాల్సింది ఏమిటి?... తెలుసుకుందాం...గత కాలాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్‌టెన్షనాలిటీ (జేఈ) కీలకంగా మారింది. ‘జేఈ’ అనేది మహిళల అవసరాలు, ఆకాంక్షలు, ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని చేసే డిజైనింగ్.‘గత బడ్జెట్ చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు కొత్త అవకాశాలను సృష్టించింది, పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను పెంచింది. క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు రెట్టింపు చేసింది. స్టార్టప్‌లు, ఎగుమతిదారులకు అధిక కాలపరిమితి గల రుణాలను అందించింది. రాబోయే అయిదేళ్లలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఉపశమనం లభించింది. పెద్ద సంస్థలను స్థాపించాలని, పారిశ్రామిక వృద్ధికి దోహదపడాలని, ఉద్యోగాలు సృష్టించాలని మహిళలు కోరుకుంటున్నారు’ అంటున్నారు భారతీయ యువశక్తి ట్రస్ట్(బివైఎస్టీ) మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటేశన్.జెండర్ బడ్జెటింగ్ అంటే...జెండర్ బడ్జెటింగ్‌ను జెండర్ సెన్సిటివ్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు. బడ్జెట్లో లింగ అసమానతలు లేకుండా చూసుకోవడమే జెండర్ బడ్జెటింగ్. ముఖ్యమైన అంశాలలో మహిళలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేయడం, పురుషులు, మహిళల మధ్య వనరుల పంపిణీలో సమానత్వం ఉండేలా చూడడం జెండర్ బడ్జెటింగ్ ప్రాథమిక లక్ష్యం.సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్2026 బడ్జెట్ నుండి ఆశిస్తున్న వాటిలో ముఖ్యమైనది...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి మహిళలకు తగినంత సహకారం అందించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, డీప్–టెక్‌లాంటి రంగాలలో మహిళల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని పీహెచ్‌డీసీసీఐ (పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) మహిళల ప్రతినిధి బృందం కోరుతోంది.ప్రోత్సాహకాలు, విధానపరమైన మద్దతు ద్వారా మహిళల నేతృత్వంలోని పరిశ్రమలు, సేవారంగాలకు ప్రోత్సాహం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించే మహిళలకు, ముఖ్యంగా ‘స్టెమ్’ విభాగాలకు సంబంధించిన మహిళలకు స్కాలర్షిప్లు అందించాలని, మార్కెట్ యాక్సెన్‌ను మెరుగుపరుచుకోవడానికి మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను అందించాలనీ కోరారు. ఆఫీసులలో మహిళా ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ నివారణలాంటి ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి ఆరోగ్య పథకాలను అందించాలని కోరారు.మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం..‘మహిళల నేతృత్వంలోని కంపెనీలకు అందుబాటులో ఉండే పథకాలను ప్రవేశపెట్టాలని, ముఖ్యంగా కొలేటరల్–ఫ్రీ క్రెడిట్, వడ్డీ రాయితీ...మొదలైన వాటి ద్వారా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. చిన్నా, పెద్ద పట్టణాలలో ఉన్న మహిళా వ్యాపారులలో ఎంతో సృజనాత్మకత ఉంది. గొప్ప ఆశయాలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు అయ్యేలా సహాయపడవచ్చు. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం అనేది కేవలం కలిసికట్టుగా ముందుకు సాగడం మాత్రమే కాదు భవిష్యత్తు కోసం మెరుగైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కూడా’ అంటున్నారు క్రిమినల్ లాయర్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ‘రూట్స్ కేఫ్’ ఫౌండర్ మీనాక్షి కుమార్. ‘మన దేశంలో రిటైల్ కాస్మెస్యూటికల్ పరిశ్రమ లో ఎంతో మార్పు వచ్చింది. దీనిలో మహిళా వినియోగదారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. స్వల్పకాలిక పరిష్కారాల కంటే దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్మెస్యూటికల్స్ను కేవలం అందాల విభాగంగా మాత్రమే చూడకుండా ఆరోగ్య సంరక్షణ–విశ్లేషణ వర్గంగా అధికారికంగా గుర్తించే అవకాశాన్ని కేంద్ర బడ్జెట్ 2026 ఇస్తుందని ఆశిస్తున్నాం. సమర్థవంతమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ రంగం మరింత అభివృద్ధి అయ్యేలా చేయవచ్చు. దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మన దేశంలోని బ్యూటీ–ఫార్మా పరిశ్రమ బలోపేతం అవుతుంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది’ అంటున్నారు బ్యూటీ–ఫార్మాకు చెందిన మహిళా ఎంటర్ప్రెన్యూర్లు.అసమానతలు లేకుండా...మా వాహక్, విట్ట సఖీగా మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి బీమా వాహక్లకు కేంద్ర బడ్టెట్‌లో ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది. ‘బడ్జెట్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే గత కొంతకాలంగా స్త్రీ సాధికారత దృష్ట్యా అది మరింత ఆసక్తికరంగా మారింది. జెండర్ బడ్జెటింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే ధోరణి పెరగడం సంతోషం కలిగిస్తోంది. బడ్జెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీదే వారి పురోగతి ఆధారపడి ఉంటుంది’ అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. -
క్షీణిస్తున్న రూపాయి విలువ
-
లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఈ కీలక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను రాయితీలు పెరుగుతాయా? నిత్యావసరాల ధరలు తగ్గుతాయా? గృహ రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందా? అన్నవి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.అయితే, కేంద్ర బడ్జెట్ కేవలం టీవీల్లో చూసే అంకెలు మాత్రమే కాదు; అది నేరుగా మీ ఇంట్లో, మీ పిల్లల చదువులపై, మీ పొదుపుపై ప్రభావం చూపే అంశం. అందుకే, ప్రభుత్వ బడ్జెట్‌తో పాటు మీ ‘ఇంటి బడ్జెట్’ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? పన్ను మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? అసలు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం? వంటి అంశాలతో కూడిన ప్రత్యేక కథనం ఇదిగో..పన్ను మార్పులు..ఈసారి కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మరిన్ని మార్పులు లేదా సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీ వార్షిక ఆదాయం ఏ పన్ను స్లాబ్‌లోకి వస్తుందో లెక్కించుకుని, దానికి అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి.ఖర్చుల అంచనాబడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం లేదా గృహోపకరణాల ధరల్లో మార్పులు ఉండవచ్చు. మీ ఇంట్లో కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితా ఉంటే బడ్జెట్ తర్వాత ధరల హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.పొదుపు మంత్రంబడ్జెట్లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలకు పెద్దపీట వేయడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రభావం ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం (పిల్లల చదువు, పెళ్లిళ్లు) ఎంత మేర కేటాయించాలో బడ్జెట్ ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాలి.‘ఇంటి బడ్జెట్’ ఎందుకు?ప్రభుత్వం దేశం కోసం ఎలాగైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుందో ప్రతి ఇంట్లో కూడా అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే..అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉంటుంది. బడ్జెట్ వేసుకుంటేనే మన దగ్గర ఎంత మిగులు ఉందో తెలుస్తుంది. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌లోని మళ్లించవచ్చు.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. బడ్జెట్ వల్ల అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, పిల్లల చదువులు సాగాలన్నా.. కచ్చితమైన ప్లానింగ్ అవసరం. నెలకు ఎంత పొదుపు చేస్తున్నామో తెలిస్తేనే లక్ష్యం చేరువవుతుంది.బడ్జెట్ కోసం సింపుల్ టిప్: 50-30-20 రూల్మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి. మొత్తం నెలవారీ రాబడిలో..50%: అవసరాలు (అద్దె, కిరాణా, ఫీజులు)30%: కోరికలు (సినిమాలు, విహారయాత్రలు, షాపింగ్)20%: పొదుపు, పెట్టుబడులుకేంద్ర బడ్జెట్ 2026 దేశానికి ఒక రోడ్ మ్యాప్ అయితే, మీరు వేసుకునే ఇంటి బడ్జెట్ మీ కుటుంబ ఆర్థిక భరోసాకు పునాది. ఫిబ్రవరి 1న వెలువడే అధికారిక ప్రకటనలను బట్టి మీ ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?
కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1860 ఏప్రిల్ 7న భారత్ బ్రిటిష్ పాలనలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్)ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు.బ్లాక్ బడ్జెట్ గురించిభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో తెలుసా..1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.రూ. 550 కోట్ల ఆర్థిక లోటు..దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా.. ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. -
దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడుకుంటున్న అంశం యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే చాలామందికి ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అనే విషయాలు తెలిసి ఉండవు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.1860లో మొదటి బడ్జెట్1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లే అన్నమాట. అయితే ఈ బడ్జెట్ వలస పాలకుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్లకు అప్పటి బడ్జెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది.స్వాతంత్య్రం వచ్చిన తరువాతభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాదు. 1948 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండటంతో, ఈ బడ్జెట్‌ను ఒక మధ్యంతర బడ్జెట్‌గా ప్రవేశపెట్టారు.వీటికే ప్రాధాన్యతతొలి బడ్జెట్లో అభివృద్ధి కంటే పరిపాలన, భద్రత, పునరావాసం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయంతొలి బడ్జెట్లో ఒక విశేష అంశం ఉంది. అదేమిటంటే.. భారత్, పాకిస్తాన్ రెండూ 1948 సెప్టెంబర్ వరకు ఒకే కరెన్సీని ఉపయోగిస్తాయి అని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. ఇండియా, పాక్ విభజన జరిగినప్పటికీ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా విడిపోలేదు. అయితే ఆర్థికంగా విడిపోవడం ఒక దశలవారీ ప్రక్రియగా కొనసాగిందన్నమాట.నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి.. -
రేపట్నుంచి బడ్జెట్ సన్నాహకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్– 2026 సమావేశాలు ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రస్తుతం శాఖలవారీగా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుకు సంబంధించి అంచనాలను ప్రాథమికంగా తయారు చేసింది. ఈ అంచనాలపై ఈనెల 24 నుంచి సచివాలయంలో రాష్ట్ర బడ్జెట్–2026 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు.సంబంధిత మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగుతాయి. ఇందుకు సంబంధించి భట్టి ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల వారీగా ఖరారు చేసిన సమీక్షల షె డ్యూల్‌ను ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోట్ జారీ చేశారు. ఈ ఆదేశాలను సంబంధిత మంత్రులు, ప్రభుత్వ శాఖలకు పంపించారు.పాత, కొత్త పథకాలపై చర్చ బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో ప్రభుత్వ శాఖలు రూపొందించిన అంచనాల ఆధారంగా చర్చిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, డిమాండ్‌కు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వం ఇచి్చన హామీలకు అనుగుణంగా కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపైనా చర్చించనున్నారు. పాత పథకాలకు బడ్జెట్ డిమాండ్‌తో పాటు కొత్త పథకాలకు బడ్జెట్ అవసరాలపై అంచనాకు రానున్నారు. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖతో పాటు సాధారణ పరిపాలన విభాగం, హోం, లా అండ్ ఆర్డర్, న్యాయ తదితర శాఖలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతుండటంతో ఆయా సమావేశాలకు సీఎం అధ్యక్షత వహిస్తారు. సమీక్షల అనంతరం కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పులు చేస్తారు. -
సంస్కరణలతోనే సత్వర వృద్ధి
ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోపక్క అమెరికా ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. ఈ కీలక ఘట్టంలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి ముందస్తు అంచనాలు కొన్ని శుభ వార్తలను మోసుకొచ్చాయి. స్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి రిజర్వ్‌బ్యాంక్ తొలుత అంచనా వేసినట్లు 6.5 శాతం కాక, 7.4 శాతం ఉండగలదనే అంచనాకు రావడం పరిస్థితులలో వచ్చిన మార్పును సూచిస్తోంది. సంస్కరణలు మార్పు తెచ్చాయనీ, వృద్ధి ఇదే స్థాయిలో నిలకడగా కొనసాగేందుకు వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనీ కూడా ఇది సూచిస్తోంది. వస్తువు – సేవల పన్ను (జీఎస్టీ)లో శ్లాబులను మార్చడం, చాలా వాటిపై పన్నుల శాతాలు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తేటపడింది. జీఎస్టీలోని నియంత్రణ సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ మార్పుచేర్పులు ఎప్పుడో చేసి ఉండ వలసింది.కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై!అలాగే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని చర్యలను ఇటీవలి కాలంలో తీసుకున్నారు. పార్లమెంట్ ఐదేళ్ళ క్రితమే ఆమోదించిన నాలుగు కార్మిక స్మృతులను అమలులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన దాదాపు 29 వేర్వేరు చట్టాల స్థానంలో ఆ స్మృతులు వచ్చి చేరాయి. వలస పాలన కాలంనాటి ఆ చట్టాలను కూడా ఎన్నడో మార్చి ఉండాల్సింది. చట్టాల సంఖ్య ఎక్కువ కావడంతో కార్మిక సమస్యలు ఏళ్ళ తరబడి చిక్కుముడులకు లోనవుతూ వచ్చాయి. ఫలితంగా, వ్యాపార సంస్థలు ఆ చట్టాలను అనుసరించడంలో గందరగోళం నెలకొంటూ వచ్చింది.కొత్త లేబర్ కోడ్స్ ఆర్థిక వృద్ధికి తక్షణం తోడ్పడగల సంస్కరణ కాకపోవచ్చు. కానీ, పెట్టుబడులు పెట్టదలచుకున్నవారికి తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్న అంశాల్లో అవి స్పష్టతను, సరళతను తెచ్చాయి. ఉదాహరణకు, ఇంటి నుంచి పని చేసే విషయంలో అవి మరింత వెసులుబాటుకు అవకాశం కల్పించాయి. పర్మనెంట్ ఉద్యోగాలకు బదులు స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్సర్ ఉద్యోగాలు పెరుగుతున్న ‘గిగ్’ ఆర్థిక వ్యవస్థలో వర్కర్లకు మరింత సామాజిక భద్రతను కల్పించేందుకు తోడ్పడనున్నాయి. ఆ స్మృతుల్లో ఇప్పటికీ లోపాలు ఉంటే ఉండవచ్చు; వాటిని భవిష్యత్తులో పరిష్కరించు కోవచ్చు. మొత్తానికి, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం వల్ల దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరం అయింది. వృద్ధి సానుకూలమే!ఇతర రంగాలలో కూడా సంస్కరణల అవసరం ఉంది. మొదటి ముందస్తు అంచనాలలో అన్నీ సానుకూలంగా ఏమీ లేకపోవడం ఆ వాస్తవాన్ని మరింత వెల్లడిస్తోంది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో వృద్ధి రేటు మందగించింది. మొదటి రెండు త్రైమాసికాలలో వరుసగా 7.8 శాతం, 8.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. తర్వాత, రెండు త్రైమాసి కాలలో ఇది 6.9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నారు. తిరిగి సానుకూలంగా ఉన్న అంశాల వైపు దృష్టి సారిద్దాం. వస్తూత్పత్తి 4.5 శాతం నుంచి 7.4 శాతానికి విజృంభించినట్లు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 2025–26 ఆర్థిక సంవ త్సరంలో అధిక వృద్ధి సాధించేందుకు ఊతం ఇచ్చింది. సగటున దాదాపు 8 శాతం చొప్పున, గత మూడేళ్లలో వృద్ధిలో కనిపించిన వేగం కూడా గణనీయమైన విషయమే. ఇప్పటికి కొద్ది ఏళ్ళ నుంచి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, మధ్య–ఆదాయ ట్రాప్ నుంచి తప్పించుకునేందుకూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకూ, ఇంకా వేగంగా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేటపుడు, ఆర్థిక మంత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. దృష్టి పెట్టాల్సినవి!అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల మారిపోతున్న ప్రపంచంలో వాణిజ్యమే పెద్ద అంశంగా కనిపిస్తోంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులు 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై మరికొంత సుంకాలు విధిస్తామని ఆయన బెదిరిస్తున్నారు. భారత –అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేక కారణాల రీత్యా, ముఖ్యంగా ట్రంప్ అహంకారం వల్ల, ఇప్పటికీ తుదిరూపు దిద్దు కోలేక పోతోంది. మన దేశానికి కొత్త అమెరికా రాయబారిగా వచ్చిన సెర్జియో గోర్ కనబరుస్తున్న సానుకూలత వల్ల, ఈ ఒప్పందం కుదరవచ్చని ఆశలు పొటమరిస్తున్నాయి. దానిమాటెలా ఉన్నా... ఎగుమతులపై ఆధార పడిన, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు బడ్జెట్ కొంత ఆసరా కల్పించవలసి ఉంది. రత్నాలు, ఆభరణాలు వంటి పరిశ్రమలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు అమెరికా సుంకాలతో బాగా దెబ్బతినిపోతాయని భయ పడిన మాట వాస్తవం. కానీ, అవి వేగంగా ఇతర మార్కెట్లకు విస్తరించడం వల్ల కనీసం తాత్కాలికంగానైనా ఆ ప్రభావాన్ని తట్టుకో గలుగుతున్నాయి. నవంబర్ (2025)కు సంబంధించిన డేటా, ఈ విభాగాల ఎగుమతుల్లో ఆశ్చర్యకరంగా పెరుగుదలను కనబరచింది. ఆ విభాగాల ఎగుమతులు 2025 నవంబర్‌లో దాదాపు 19 శాతం పెరిగాయి. ఎగుమతులలో వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల విభాగాలు ప్రధాన ఆలంబనగా నిలిచాయి. ఇంకా ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే, భారీ సుంకాల ప్రతిబంధకాలు ఉన్న ప్పటికీ, అమెరికాకు ఎగుమతులు 22 శాతం పెరిగాయి. మొబైల్ ఫోన్లు, ఎగుమతుల్లో ప్రధాన వస్తువుగా నిలుస్తున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే వాటి ఎగుమతులు మూడు రెట్ల పెరుగుదలను చవిచూశాయి. నిరుద్యోగిత రేటు మూడునెలల కాలంలో అత్యల్ప స్థాయికి అంటే 8.6 శాతానికి తగ్గిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ’ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం దానికి కారణంగా పేర్కొంది. అయితే, వ్యవసాయమే ఇప్పటికీ 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న వారిని తగినంతగా ఇముడ్చుకోగలిగినంతగా వస్తూత్పత్తి రంగం వ్యాకోచించలేదు. ఈ రంగం విషయంలోనే, భారత్, ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఇతర దేశాల్లో చిన్న, మధ్య తరహా వస్తూత్పత్తి సంస్థలు తగినంతగా విస్తరించగలిగాయి. వ్యాపార నిర్వహణ సులువుగా సాగే అవకాశాన్ని కల్పించే విధంగా బడ్జెట్ రూపొందాలి. అప్పుడే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవసరమైన స్థాయిల్లో వృద్ధి రేటును తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్సియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అఫీషియల్: ఆదివారమే కేంద్ర బడ్జెట్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA).. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కీలక తేదీలను ఆమోదించింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశ చరిత్రలో ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి కానుంది.బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. ఇది రెండోసారి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు.. 2025 బడ్జెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. గతంలో.. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫిబ్రవరి 28న శనివారం, 2016లో ఫిబ్రవరి 28న ఆదివారం కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. -
రాబడిని పెంచండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. గత కొన్నేళ్లుగా పన్నేతర ఆదాయంలో పెరుగుదల లేదని, ఇందుకు ప్రధాన కారణం పరిపాలన విభాగాలు క్రమానుగతంగా చార్జీలను సవరించకపోవడంతో పాటు పర్యవేక్షణ లేకపోవడమని తెలిపింది. పన్ను రాబడులు పెంచేందుకు సంబంధిత శాఖలు ప్రస్తుత పన్ను రేట్ల ఆధారంగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల సమర్పణకు సమగ్ర సూచనలు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.ఫిబ్రవరిలో 2026–27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అందులో తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలను నిధి ఆన్లైన్ పోర్టల్‌లో ఈనెల 9లోగా ఆన్ని శాఖలు ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడున్న దానికంటే పన్నేతర ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలూ నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి్సందిగా సూచించారు. వివిధ రకాల వడ్డీలు, డివిడెండ్లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలన విభాగాల్లో పటిష్టమైన పర్యవేక్షణతో లక్ష్యాలను సాధించాలని కోరింది. హెచ్ఓడీలు బకాయిల వసూళ్లపై డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వసూలయ్యే అవకాశమున్న బకాయిలను అంచనా వేయాలని.. రాబడుల్లో లీకేజీలను అరికట్టడానికి చర్యలు చేపట్టడంతోపాటు కఠినమైన నిఘాతో అన్ని స్థాయిల్లో ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చి సూచికలను అమలుచేయాలని తెలిపింది.కొత్తగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రతిపాదించొద్దు..ప్రస్తుతమున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సమీక్షించడం ద్వారా వారి సంఖ్య తగ్గించాలని, కొత్తగా ఎవరినీ ప్రతిపాదించొద్దని.. అలాగే ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన సిబ్బంది వేతనాలకు మంజూరైన ఉత్తర్వుల ఆధారంగా ఒప్పంద సేవలకు అవసరమైన నిధులు ప్రతిపాదించాలని ఆర్థిక శాఖ తెలిపింది. సంబంధిత శాఖల ఆమోదం తరువాతే కన్సల్టెంట్స్, రిటైర్డ్ ఉద్యోగుల పునర్నియామకాలకు వేతనాలను ప్రతిపాదించాలని పేర్కొంది. గత మూడేళ్ల వ్యయం ఆధారంగా నిర్వహణ వ్యయం ప్రతిపాదించాలంది. ప్రభుత్వ అనుమతిలేని ఎలాంటి అంశాలకూ కేటాయింపులు ప్రతిపాదించరాదని చెప్పింది. రాయితీలు, నిర్వహణ, సామాజిక పింఛన్లు మొదలైన తప్పనిసరి వ్యయాలకు పూర్తిగా కేటాయింపులు చేస్తామని.. అయితే, లబ్ధిదారుల సంఖ్యతో సహా బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలి. అప్పులతోనే మూలధన వ్యయం..ఇక మౌలిక సదుపాయాల మూలధన వ్యయానికి అప్పులపైనే ఆధారపడాలని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. కనెక్టివిటీ, గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యంతో పాటు పారిశ్రామీకరణ వంటి మూలధన వ్యయ వనరుల ప్రతిపాదనలను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ), ఈఏపీ, నాబార్డు, హడ్కోల నుంచి నిధులు రాబట్టేలా సంబంధిత ఇంజనీర్లు పూర్తి వివరాలను ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను సమీక్షించడంతో పాటు వాటి అవసరం, ప్రాధాన్యత, వ్యయాలు, ఫలితాలను పరిశీలించి కాలం చెల్లిన పథకాలను రద్దుచేయాలని చెప్పింది. వేతనాలేతర వ్యయంలో 20 శాతం పొదుపు చేయాలని కోరింది. సాధ్యంకాని, సరిపోని కేటాయింపుల ప్రతిపాదనలను చెయొ్యద్దని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది.పథకాల వ్యయం అంచనాలు ఇలా..‘పథకాల వ్యయానికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. మేనిఫెస్టో పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తి డేటాతో సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాకే ప్రతిపాదనలు పంపాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రతిపాదనలు కేంద్రానికి పంపే ముందు కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పథకాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత ఏడాది వాస్తవ నిధుల విడుదల ఆధారంగా ప్రతిపాదనలు ఉండాలి. ఊహాజనిత గణాంకాలతో ప్రతిపాదనలు చెయొ్యద్దు. ఉప ప్రణాళికలతో పాటు మహిళలు, పిల్లల బడ్జెట్‌ను ప్రతిపాదించాలి. బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు, ఉత్తర్వులను శాఖాధిపతులు, సచివాలయ శాఖలు సమర్పించాలి’ అని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
వారణాసి బడ్జెట్ అన్ని కోట్లా?.. ప్రియాంక చోప్రా క్రేజీ ఆన్సర్!
దర్శకధీరుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్‌బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ ప్రకటించేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. గ్లోబ్‌ట్రాటర్ పేరుతో ఈవెంట్‌ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. అయితే ఈ మూవీ బడ్జెట్‌పై ఇప్పటికే టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్‌పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్ స్పందిస్తూ.. అంటే బడ్జెట్లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Priyanka chopra about #Varanasi on Kapil Sharma show pic.twitter.com/6kgkusKaGf— Sunaina🦋 (@Sunaina_speaks) December 20, 2025 -
తిరుపతికి కొత్త రైలు..16వేల కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్
-
50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!
డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు.. కానీ పొదుపు చేయడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెరిగిపోతున్న ధరల వల్ల ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతోంది. అయితే 50/30/20 ఫార్ములాను అనుసరిస్తే ఎవరైనా.. డబ్బు పొదుపు చేయవచ్చు. ఈ ఫార్ములా గురించి ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఒక వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే?, ఖర్చులు ఆటోమాటిక్‌గా పెరిగిపోతాయి. ఈ ఖర్చుల కోసం.. సంపాదించిన మొత్తం వెచ్చిస్తే?, భవిష్యత్ కోసం ఏమీ మిగలదు. కాబట్టి పొదుపు అవసరం.ఏమిటీ 50/30/20 ఫార్ములా?50/30/20 ఫార్ములా.. మీ ఆదాయాన్ని మూడు ఖర్చు భాగాలుగా విభజిస్తుంది. 50 శాతం అవసరాలకు, 30 శాతం కోరికలు (సరదా ఖర్చులు), 20 శాతం పొదుపు. ఈ ఫార్ములాను యూఎస్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ తన పుస్తకం "ఆల్ యువర్ వర్త్: ది అల్టిమేట్ లైఫ్‌టైమ్ మనీ ప్లాన్''లో వెల్లడించారు.వివరంగా చెప్పాలంటే.. మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో 50 శాతం లేదా రూ. 50వేలు అవసరాలకు, అంటే రూమ్ రెంట్, కిరాణా సామాగ్రి, బీమా & ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. 30 శాతం లేదా రూ. 30వేలు సరదా ఖర్చులకు, అంటే.. హ్యాండ్‌బ్యాగులు, గడియారాలు, నగలు వంటివన్న మాట. 20 శాతం లేదా రూ. 20వేలు పొదుపు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి, మీ నైపుణ్యాన్ని బట్టి) చేయాలి. ఇలా విభజించుకుంటే.. మీరు తప్పకుండా పొదుపు చేయొచ్చు.ఇదీ చదవండి: నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములామీరు సంపాదించే డబ్బులో ఇంకా కొంత ఎక్కువ పొదుపు చేయాలంటే.. అనవసరమైనవి కొనుగోలు చేయడం లేదా ఖర్చు పెట్టడం మానేయాలి. ఆలా మిగిలిన డబ్బును కూడా మీరు సేవింగ్స్ చేసుకుంటూ పోతే.. పొదుపు తప్పకుండా పెరుగుతుంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే.. దాని గురించి తప్పకుండా కొంత సమాచారం తెలుసుకుండాలి, అనుభవం కూడా ఉండాలి. లేకుంటే నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. -
ద్రవ్యలోటు నియంత్రణలోనే..
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు (ఏప్రిల్–సెప్టెంబర్) రూ.5,73,123 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతంగా (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే మొత్తం లక్ష్యంలో ద్రవ్యలోటు 36.5 శాతానికి చేరినట్టు తెలుస్తోంది.సరిగ్గా క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 29 శాతంగానే ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రూ.12.29 లక్షల కోట్ల ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచి్చంది. రూ.4.66 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం కాగా, రూ.34,770 కోట్లు రుణేతర మూలధనం రూపంలో సమకూరింది. ఇందులో రూ.6.31 లక్షల కోట్లను రాష్ట్రాలకు (పన్నుల వాటా కింద) కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రూ.86,948 కోట్లు అధికంగా బదిలీ అయింది. మొత్తం వ్యయం రూ.23 లక్షల కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయాల్లో రూ.5.78 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకు ఖర్చు కాగా, రూ.2.02 లక్షల కోట్లు సబ్సిడీలపై వెచి్చంచింది. ప్రభుత్వ మూలధన వ్యయం 40% పెరగడాన్ని (రూ.5.7 లక్షల కోట్లు) ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ స్వాగతించారు.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు -
బాకీలు.. బడాయిలే!
సాక్షి, అమరావతి: అప్పుల వృద్ధిలో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. 15 నెలలుగా రాష్ట్ర సంపద పెరగకపోగా గత ప్రభుత్వంలో వచ్చిన సంపద కూడా రాకుండా పోతోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి అమ్మకం పన్ను తిరోగమనమే గానీ పెరగడం లేదు. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే. మరోవైపు సామాజిక రంగం, మూలధన వ్యయం భారీగా తగ్గిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల (2025–26 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) బడ్జెట్ కీలక సూచికలతో గణాంకాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించింది. అప్పులు చేయడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కాగ్ విడుదల చేసిన గణాంకాల మేరకు తొలి ఐదు నెలల్లోనే కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌ను మించి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులు చేసింది. సాధారణంగా రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం అంతకు ముందు సంవత్సరాలతో పోల్చితే పెరగాలి. అందుకు భిన్నంగా 2023–24 ఆగస్టు వరకు రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయంతో పోల్చితే 2025–26లో ఆగస్టు నాటికి బాబు పాలనలో రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం తగ్గిపోవడం గమనార్హం. రెవెన్యూ రాబడులు ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో రూ.8,752.11 కోట్లు తగ్గాయి. రాబడుల్లో 12.44 శాతం క్షీణత నెలకొంది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. అస్తవ్యస్త పాలనతో రెవెన్యూ రాబడులు క్షీణిస్తున్నాయి. 2023–24 తొలి ఐదు నెలల కంటే బడ్జెట్ వ్యయం ఈ ఆర్థిక ఏడాదిలో రూ.10,663.43 కోట్లు తగ్గిపోయింది. » టీడీపీ కూటమి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన గ్రాంట్లు కూడా తగ్గిపోయాయి. 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే కేంద్ర గ్రాంట్లు ఏకంగా రూ.16,055.44 కోట్లు తగ్గాయి. అంటే ఏకంగా 83.70 శాతం క్షీణించాయి. 2023–24లో వచి్చనవి కూడా ఇప్పుడు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతోంది. » 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది అమ్మకం పన్ను రాబడి రూ.460 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను రాబడి 5.88 శాతం క్షీణించింది. » 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఇప్పుడు సామాజిక రంగ వ్యయం రూ.10,953.60 కోట్లు తగ్గిపోయింది. అంటే ఏకంగా 16.11 శాతం తగ్గింది. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై చేసే వ్యయాన్ని సామాజిక రంగ వ్యయంగా పరిగణిస్తారు. మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తగ్గుదల..అప్పుల్లో మాత్రం చంద్రబాబు సర్కారు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ ఆరి్ధక ఏడాది తొలి ఐదు నెలల్లోనే బడ్జెట్లో ఏకంగా రూ.55,932.68 కోట్ల అప్పులు చేసింది. నెలకు సగటున రూ.పది వేల కోట్లకు పైగా అప్పులు తీసుకుంటుండగా మూలధన వ్యయం కేవలం రూ.9,663.70 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. అదే 2023–24 తొలి ఐదు నెలల్లో వైఎస్సార్సీపీ హయాంలో మూలధన వ్యయం రూ.15,883.94 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి సర్కారు మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తక్కువగా చేసినట్లు స్పష్టమవుతోంది. అది కూడా అటు ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా.. ఇటు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంపై అంతులేని రుణభారం మోపుతుండటంపై ఆర్థిక వేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఎగబాకిన లోటురెవెన్యూ లోటు ఐదు నెలల్లోనే అదుపు తప్పింది. ఈ ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.33,185.97 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా తొలి ఐదు నెలల్లోనే ఏకంగా రూ.41,635.63 కోట్లకు ఎగబాకింది. ఎడాపెడా అప్పులు చేస్తుండటంతో ద్రవ్యలోటు పెరిగిపోతోంది. రెవెన్యూ రాబడులు కోల్పోవడం, బడ్జెట్ వ్యయం కూడా తగ్గిపోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందనేందుకు సంకేతమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!
పెరుగుతున్న జీవన వ్యయాలు, మార్కెట్ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల పర్సనల్ ఫైనాన్స్ అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మీరు ఓ సంస్థలో ఉద్యోగిగా ఉన్నా, ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నా, చిన్న వ్యాపారం సాగిస్తున్నా, గృహిణిగా ఉన్నా.. ఆర్థిక స్వాతంత్ర్యం ఎంతో ముఖ్యం. ఎలాంటి వారైనా దీర్ఘకాలంలో స్థిరంగా డబ్బు సంపాదించేలా కొన్ని మార్గాలను పరిశీలిద్దాం. అయితే కింది అంశాలను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణతో వీటిని పాటించడం చాలాముఖ్యమని గమనించాలి.ఆదాయం.. ఖర్చుల ట్రాకింగ్..నెలకు కొందరు పెద్దమొత్తంలో సంపాదిస్తారు. ఇంకొందరు కాస్త తక్కువగానే ఆర్జిస్తారు. ఎంత ఆదాయం సమకూరుతున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకు బడ్జెట్ పాటించాలి. బ్యాంకు ఖాతాలో నుంచి వెళ్లే, అందులోకి వచ్చే ప్రతి రూపాయిని ట్రాక్ చేయాలి. అందుకు స్ప్రెడ్ షీట్లు, బడ్జెట్ యాప్‌లు వంటివి ఉన్నాయి. లేదా సాధారణ నోట్ బుక్‌లోనూ రికార్డు చేయవచ్చు. ఇందులో మీ ఖర్చులను స్పష్టమైన కేటగిరీలుగా విభజించాలి.నిత్యావసరాలు (అద్దె, కిరాణా సామాగ్రి, యుటిలిటీలు)డిసిక్రీషనరీ స్పెండింగ్ (షాపింగ్, డైనింగ్)పొదుపు, పెట్టుబడులుప్రతి కేటగిరీలో ఖర్చు పరిమితులను కేటాయించుకోవాలి.ఉదాహరణకు..కిరాణా సామాగ్రి: రూ.8,000ఎంటర్ టైన్మెంట్: రూ.3,000పొదుపు: రూ.5,000డిస్క్రీషనరీ స్పెండింగ్‌ను పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం లభిస్తుంది.ఎమర్జెన్సీ ఫండ్జీవితం అనూహ్యమైనది. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఉద్యోగ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి ఖర్చులు.. వంటి వాటితో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఎంత సరిపోతుంది?కనీసం 6 నెలల విలువైన నిత్యావసర ఖర్చులు.. ఇంటి అద్దె, ఆహారం, యుటిలిటీలు, ఈఎంఐలను చెల్లించేలా కార్పస్‌ను క్రియేట్ చేయాలి. ఈ నిధిని అధిక వడ్డీ పొదుపు ఖాతా, స్వల్పకాలిక స్థిర డిపాజిట్ లేదా మనీ మార్కెట్ ఫండ్ వంటి లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇది ఎందుకు ముఖ్యం?దీర్ఘకాలం లక్ష్యంతో చేసే పొదుపుపై ప్రభావం పడకుండా ఆపద సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ రక్షిస్తుంది. ఆర్థికంగా భారం కాకుండా, అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా భరోసా కల్పిస్తుంది.ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) నెలవారీ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. అవి రెండు ముఖ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాంపౌండింగ్.. మీ రాబడులపై మరింత ఆదాయాన్ని పెంచుతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే వైవిధ్యభరితమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్లతో మొదలు పెట్టవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే, ఈక్విటీ విలువ తగ్గుతుంటే బంగారం హెడ్జింగ్‌గా పని చేస్తుంది.అప్పుల నిర్వహణఅప్పు చేయడం తప్పు. తప్పని పరిస్థితుల్లో చేసిన అప్పును వెంటనే తీర్చేయాలి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తరచుగా 30% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. తిరిగి చెల్లించే క్రమంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లుల్లో "కనీస చెల్లింపు" ఉచ్చులో పడకూడదు. దీంతో తర్వాతి బిల్లు సైకిల్లో అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలను పే చేయాలి.ఇదీ చదవండి: తొమ్మిది ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌లు సరెండర్ -
అక్టోబర్ 9 నుంచి బడ్జెట్ కసరత్తు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ 2026–27 బడ్జెట్ రూపకల్పన కసరత్తును అక్టోబర్ 9 నుంచి ప్రారంభించనుంది. ఒకవైపు అమెరికా 50 శాతం టారిఫ్ రేటును అమలు చేస్తుండడం, అంతర్జాతీయ వాణిజ్య ధోరణుల్లో మార్పుల నేపథ్యంలో తీసుకురానున్న ఈ బడ్జెట్లో కేంద్రం ఏవైనా కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తుందేమో చూడాల్సి ఉంది. ముఖ్యంగా దేశీ డిమాండ్‌కు మరింత ఊతమివ్వడం, ఉపాధి కల్పనను విస్తృతం చేయడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత కేంద్రం ముందుంది.ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన బడ్జెట్ ముందస్తు సమావేశాలు అక్టోబర్ 9 నుంచి మొదలవుతాయంటూ ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ సర్క్యులర్‌లో పేర్కొంది. సమావేశాలు ముగిసిన అనంతరం 2026–27 బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ ఖరారు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
యూపీఐ సబ్సిడీ కేటాయింపులు పెంచే అవకాశం
ముంబై: యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీల ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకి మద్దతునిచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేటాయించిన రూ. 437 కోట్ల వార్షిక సబ్సిడీ మొత్తాన్ని మరింతగా పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి చెందిన ఎకానమిస్టులు ఒక నివేదికలో పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం ఈ వ్యవస్థ నిర్వహణ కోసం పరిశ్రమవర్గాలు రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు భారాన్ని మోస్తున్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,000 కోట్లుగా ఉన్న సబ్సిడీ మొత్తాన్ని ఈ బడ్జెట్లో భారీగా కోత పెట్టడంతో కొన్ని యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయని నివేదిక తెలిపింది. దీని ప్రకారం వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.30 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేటును (ఎండీఆర్) వసూలు చేసుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతిస్తోంది. అయితే, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి రూపే డెబిట్ కార్డు, భీమ్–యూపీఐ ద్వారా చెల్లింపులపై చార్జీలను తొలగించింది. మరోవైపు, చిన్న వర్తకులకు యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఉండదు. పైగా రూ. 2,000 వరకు లావాదేవీ మొత్తాలపై 0.15 శాతం వరకు ప్రోత్సాహకాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రోత్సాహకాన్ని వ్యాపారి బ్యాంకునకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్ని కస్టమర్ బ్యాంకుతో పాటు మిగతా వర్గాలన్నీ కలిసి పంచుకుంటాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో అమెరికన్ సంస్థలకు చెందిన ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యం నెలకొనడమనేది దేశీ ఫిన్‌టెక్ సంస్థలను తొక్కేసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. -
బడ్జెట్ కార్లపై రూ.80,000 వరకు రాయితీ?
ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ మందగించడంతో వాహన తయారీదారులు, డీలర్లు ఈ పండుగ సీజన్లో ఆఫర్ ప్రకటించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 లక్షలలోపు బడ్జెట్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్వెంటరీ పేరుకుపోతుండడంతో అమ్మకాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్ కార్లపై రూ.20,000 నుంచి రూ.80,000 వరకు డిస్కౌంట్లను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.భారతీయ ఆటో పరిశ్రమకు ఒకప్పుడు అమ్మకాల్లో భారీగా వాల్యూమ్ జనరేట్ చేసిన ఈ విభాగం ఈ మధ్య కాలంలో నిరంతరం మందగమనాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌యూవీలకు డిమాండ్ బలంగా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న డీప్ డిస్కౌంట్ల వల్ల తక్కువ మార్జిన్లతో సంస్థలు నెట్టుకొస్తున్నాయనే వాదనలున్నాయి. ‘భారీ డిస్కౌంట్లు డీలర్లకు నష్టం కలిగిస్తాయి. ఎంట్రీ లెవల్ కార్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య మునుపటి స్థాయికి రాలేదు’ అని ఓ ఆటోమొబైల్ డీలర్ తెలిపారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థపై ఫిర్యాదుల గుదిబండరూ.10 లక్షల లోపు కేటగిరీలోని బడ్జెట్ సెగ్మెంట్ వాహనాల అమ్మకాలపై ఒత్తిడి ఉన్నట్లు అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ అంగీకరించింది. ‘రూ.10 లక్షలలోపు కార్ల అమ్మకాల్లో ఒత్తిడి ఉంది. డిమాండ్ కూడా తగ్గింది. ఈ విభాగంలో సంవత్సరం ప్రాతిపదికన దాదాపు 15% క్షీణత నమోదైంది’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. -
నాకొచ్చే జీతానికి 50/30/20 బడ్జెట్ రూల్ సరిపోతుందా?
బడ్జెట్‌కు సంబంధించి 50/30/20 సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక ప్రణాళికకు దీన్ని అనుసరించడం మంచి మార్గమేనా? – కరుణాకరన్బడ్జెట్కు సంబంధించి బాగా ప్రాచుర్యంలో ఉన్నదే 50/30/20 నియమం. మీ నెలవారీ ఆదాయాన్ని మూడు భాగాలుగా వర్గీకరించడం ఇందులోని సూత్రం. ఇందులో 50 శాతాన్ని మీ అవసరాల కోసం కేటాయించుకోవాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, రుణ వాయిదా చెల్లింపులు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతంలోపే ఉండాలి. మరో 30 శాతం అన్నది కోరికల కోసం. అంటే రెస్టారెంట్లో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్ వంటివన్నీ 30 శాతం బడ్జెట్‌కు పరిమితం కావాలి.మిగిలిన 20 శాతాన్ని భవిష్యత్తు కోసం, దీర్ఘకాల లక్ష్యాల కోసం పొదుపు, మదుపు చేసుకోవాలి. ఇది ఒక సాధారణ సూత్రమే కానీ, అందరికీ వర్తించేది కాదు. మీ ఆదాయం ఎంత వస్తోంది? జీవన వ్యయాలు ఎంత? వ్యక్తిగత బాధ్యతలు ఏ మేరకు ఇలాంటి విషయాలన్ని బడ్జెట్‌ను నిర్ణయిస్తాయి.ఉదాహరణకు ఓ యువ ఉద్యోగి నెలవారీ రూ.40,000 ఆదాయం సంపాదిస్తున్నాడని అనుకుందాం. అతను ఉండేది మెట్రోలో. ఇంటి అద్దె, రవాణా వ్యయాలకే 50 శాతం ఖర్చవుతుంది. అప్పుడు ఇతర అవసరాలు, కోరికలు, పొదుపులకు మిగిలేది పెద్దగా ఉండదు. అదే రూ.2లక్షల వేతనం సంపాదించే వ్యక్తి కేవలం 30–35 శాతం బడ్జెట్లోనే అవసరాలను తీర్చుకోగలరు. అప్పుడు సదరు వ్యక్తి 30–40 శాతం ఆదా చేయగలరు. కనుక ఆదాయాన్ని బట్టి ఈ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది.50/30/20 అన్నది బడ్జెట్ మొదలు పెట్టడానికి అనుసరించొచ్చు. ముఖ్యంగా మీ జీవన వ్యయాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆదాయంలో 20 శాతాన్ని తప్పకుండా ఆదా చేసుకోవాలి. కోరికలకు సంబంధించిన బడ్జెట్లో రాజీ పడినా ఫర్వాలేదు. పొదుపు విషయంలో రాజీ పడకూడదు. ఈక్విటీ మార్కెట్లలో తరచుగా కనిపించే అస్థిరతలను ఎలా అధిగమించాలి? – శ్యామలఈక్విటీల్లో అస్థిరతలన్నవి సర్వసాధారణం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లు చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలాగో తెలిసి ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాలి.ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం.అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు అదనపు పెట్టుబడుల అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు.మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, ప్రతికూల సమయాల్లో చాలా మంది భయంతో పెట్టుబడులకు వెనుకాడుతుంటారు. కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది.సమాధానాలు :: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రూ.10 లక్షల ఖర్చు దాటితే.. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అ«దీనంలోని దేవాలయాల వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయాల బడ్జెట్ ప్రతిపాదనలన్నీ కచి్చతంగా ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సిందేనని తాజాగా ఆదేశించింది. ఇక దేవాలయాల్లో రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయాల్సిన ప్రతి పనికి ప్రభు త్వ ఆమోదం కూడా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకాలం డిప్యూటీ కమిషనర్లు, రీజినల్ జాయింట్ కమిషనర్లు, కమిషనర్ స్థాయిలో బడ్జెట్లను ఆమోదిస్తున్నా రు. అయితే, కొందరు అధికారులు బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయాలంటే ఆలయ కార్యనిర్వహణాధికారులను కమీషన్ల కోసం వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి డబ్బులివ్వకుంటే బడ్జెట్ ప్రతిపాదనలను పెండింగులో ఉంచుతున్నారని కొన్ని ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఆరోపిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు చేస్తే వేధిస్తారన్న భయంతో ఎక్కడా లిఖితపూర్వక ఫిర్యాదులు చేయట్లేదు. దీన్ని ఆసరా చేసుకుని అలాంటి అధికారులు మరింత చెలరేగిపోతున్నారు. అవినీతి అధికారుల వల్ల దేవాదాయశాఖకు చెడ్డపేరు వస్తోంది. ఈ తీరుపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వివరాలు ఆరాతీసి చర్యలకు ఉపక్రమించారు. శాఖను అప్రదిష్టపాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా పరిగణించారు. వెంటనే తీరు మారాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి రాకుండా ఆలయాల బడ్జెట్లను అధికారులే మంజూరు చేయటం కూడా సరికాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈమేరకు తాజాగా దేవాదాయ శాఖ ప్రత్యేక సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆమోదిస్తేనే నిధులు.. ప్రస్తుతం దేవాదాయ శాఖలో 6ఏ, 6బీ, 6 సీలుగా దేవాలయాలను వాటి ఆదాయం ప్రకారం విభజించారు. ఇందులో తక్కువ ఆదాయం ఉన్నవాటిని 6సీలో ఉంచారు. ఆదాయం ఎక్కువ ఉండే దేవాలయాల్లో 6బీ కేటగిరీలోని దేవాలయాల బడ్జెట్లను డిప్యూటీ కమిషనర్లు ఆమోదిస్తున్నారు. 6ఏ కేట గిరీ దేవాలయాల్లో రూ.25 లక్షల వరకు ఉండే బడ్జెట్లను రీజినల్ జాయింట్ కమిషనర్ ఆమోదిస్తున్నారు. అంతకంటే ఎక్కువుండే జాయింట్ కమిషనర్ స్థాయి దేవాలయాల బడ్జెట్లను కమిషనర్ ఆమోదిస్తున్నారు. ఇకపై అన్ని దేవాలయా ల బడ్జెట్లను తొలుత నేరుగా ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం ఆమోదిస్తేనే అధికారులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసే అంశాలను తిరిగి మార్చాల్సి ఉంటుంది. దీంతో అధికారుల ఇష్టారాజ్యానికి కళ్లెం వేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అలాగే రూ.10 లక్షలను మించి ఖర్చయ్యే ప్రతి పనికి ఇక ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. -
పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతయిందని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ 'కన్నప్ప' ఎక్కువని పేర్కొన్నడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ 'ఓజీ' కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు.. తన ఆఫీస్‌కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు.. గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న 'కన్నప్ప'.. విష్ణు కెరీర్‌ని ఎలా మారుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
‘నేతన్నకు భరోసా’కు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఈ నెల 2న మార్గదర్శకాలను జారీ చేసినట్లు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందుకోసం రూ.48 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా.. జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న వారికి వేతన ప్రోత్సాహకం కింద.. గరిష్టంగా ఏటా నేత కార్మికులకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 అందించనున్నట్లు తెలిపారు. ఇందువల్ల దాదాపు 40,000 మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని వివరించారు.చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ లోగోను జత చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులైన.. డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ తదితర అనుబంధ పనులు చేసే కార్మికులు, వార్షికాదాయంలో చేనేత వృత్తి ద్వారా కనీసం 50 శాతం ఆర్జిస్తున్న వారు అర్హులని పేర్కొన్నారు.ఈ పథకం కింద జియో ట్యాగ్ చేసిన మగ్గాల ద్వారా కనీసం 50 శాతం కంటే ఎక్కువ వార్పులు పూర్తి చేసిన వారికి నేరుగా వేతన ప్రోత్సాహకం కింద.. ఏటా రెండు విడతలుగా (ఏప్రిల్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ నుండి మార్చి) బ్యాంకు ఖాతాలోకి నేత కార్మికునికి రూ.9,000, అనుబంధ కార్మికునికి రూ.3,000 జమ చేయనున్నట్లు వివరించారు. కాగా, మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహకాన్ని.. సంవత్సరాంతంలో చేనేత, అనుబంధ కార్మికులకు అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. -
ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం.. పాక్ బడ్జెట్‌పై గందరగోళం!
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో పాకిస్థాన్ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్ బడ్జెట్‌ను జూన్ 10కి వాయిదా వేశారు.పాక్ ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్ డాలర్ల అప్పును ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు ఆమోదించిన విషయం తెలిసిందే.బడ్జెట్ వాయిదారక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో విభేదాలు తలెత్తడంతో జూన్ 2న విడుదల కావాల్సిన బడ్జెట్‌ను పాకిస్థాన్ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు తెలిపింది.అభివృద్ధి కార్యక్రమాలకు కోతలుపాకిస్థాన్ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (పీఎస్‌డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలగతంలో కంటే బడ్జెట్లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి). -
రక్షణకు మరో రూ.50 వేల కోట్లు!
న్యూఢిల్లీ: అటు ఉగ్రవాదం, ఇటు దాయాది దుస్సాహసాల నేపథ్యంలో రక్షణ కేటాయింపులను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రక్షణ రంగానికి రూ.50 వేల కోట్లు అదనంగా కేటాయించనున్నట్టు సమాచారం. అనుబంధ బడ్జెట్ ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇందుకు ఆమోదముద్ర పడనుందని తెలుస్తోంది. సైనిక బలగాల తక్షణా వసరాలను తీర్చడంతో పాటు పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 9.5 శాతం అదనం. గత పదేళ్లలో రక్షణ బడ్జెట్ దాదాపు మూడింతలైంది. -
దళితులు, గిరిజనుల కోసం సబ్ ప్లాన్ తెచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ: దళితులు, గిరిజనుల కోసం గత యూపీఏ ప్రభుత్వం సబ్ ప్లాన్ తీసుకొచ్చిందని, దీని వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా వర్గాలకు తగిన ప్రయోజనాలు లభిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం దళిత, గిరిజనుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రముఖులను కలిసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్ ) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారితో కలిసిన చిత్రాన్ని రాహుల్ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇటీవల నేను దళిత, గిరిజన వర్గాలకు చెందిన పరిశోధకులు, సామాజిక కార్యకర్తలను కలిశాను. కేంద్ర బడ్జెట్లో కొంత భాగాన్ని దళితులు, గిరిజనులకు అందించేలా జాతీయ చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి చట్టం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలులో ఉంది. ఈ వర్గాలకు అక్కడ నిర్దిష్ట ప్రయోజనాలు లభించాయి. యూపీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దళితులు, ఆదివాసీల కోసం ‘సబ్ ప్లాన్‘తీసుకొచి్చంది. కానీ మోదీ ప్రభుత్వ హయాంలో ఇది బలహీనపడింది. బడ్జెట్లో చాలా తక్కువ భాగం ఈ వర్గాలకు చేరుతోంది. వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అనే అంశంపై ఇప్పుడు మనం ఆలోచించాలి. దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పథకాలకు బడ్జెట్లో న్యాయమైన వాటాను నిర్ధారించే జాతీయ చట్టం మనకు అవసరం’అని రాహుల్ పేర్కొన్నారు. -
లక్ష్యంలో 86 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఫిబ్రవరి చివరికి ద్రవ్యలోటు రూ.13,46,852 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న మొత్తం ద్రవ్యలోటు లక్ష్యంలో 11 నెలల్లో 85.8 శాతానికి చేరుకుంది. వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ.15.69 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్ అంచనా. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి చివరికి నికర పన్నుల ఆదాయం రూ.20 లక్షల కోట్లుగా ఉంది. 2024–25 సవరించిన అంచనాల్లో ఇది 78.8 శాతానికి సమానం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 79.6 శాతంగా ఉండడం గమనార్హం. మొత్తం వ్యయాలు రూ.38.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 82.5 శాతానికి సమానం. జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతంగా 2024–25 బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి దీన్ని 4.4 శాతంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. మొత్తం రెవెన్యూ వ్యయాల్లో 9.52 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులు కాగా, 3.63 లక్షల కోట్లు సబ్సిడీలకు ఖర్చు అయింది. 11.80 లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసినట్టు సీజీఏ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలి్చతే రాష్ట్రాలకు బదిలీ చేసిన మొత్తం రూ.1.47 లక్షల కోట్ల మేర పెరిగింది. -
రూ.5,258.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల సంరక్షణ, సది్వనియోగం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడతామన్నారు. స్వామివారి ఆస్తులపై కోర్టు కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి సద్వినియోగంలోకి తెచ్చేందుకు చూస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, భూ కేటాయింపులను అనుసరించి కార్యాచరణ వేగిరం చేస్తామని వివరించారు.సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఈవో జె.శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024–25లో 5,179.85 కోట్ల బడ్జెట్ అంచనా కాగా.. ఈసారి రూ.78.83 కోట్లు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ద్వారా రూ.1,253 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. వచ్చే ఏడాది మరో రూ.57 కోట్లు పెరిగి రూ.1,310 కోట్లు వస్తాయని పేర్కొంది.శ్రీవారి హుండీ ద్వారా రూ.1,729 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.1,671 కోట్లుగా ఉంది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పంద సేవ సిబ్బంది జీతాలకు రూ.1,773.75 కోట్లు వెచ్చిచనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.768 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.350 కోట్లుగా అంచనా వేశారు. కార్పస్, ఇతర పెట్టుబడులకు రూ.800 కోట్లు వ్యయం చేయనున్నారు. ముఖ్యాంశాలు ఇలా.. ⇒ హిందూ ధర్మప్రచారానికి రూ.121.50 కోట్లు. ⇒ తెల్లవారుజామున 5.30కు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పునకు పరిశీలన. ⇒ ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్‌కు భూ కేటాయింపుల రద్దు. కొత్త ఆగమ సలహామండలి ఏర్పాటుకు ఆమోదం.⇒ సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపింది.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
ఆర్టీసీ నెత్తిన ‘రాయితీ’ బండ
సాక్షి, హైదరాబాద్: రాయితీ బస్‌పాస్.. విద్యార్థులు, నాన్ గెజిటెట్ ఉద్యోగులు, వికలాంగులు, పాత్రికేయులు వంటి వారికి ఆర్టీసీ తక్కువ మొత్తానికి జారీచేసే కార్డు. కొంతమందికి ఉచితంగా కూడా ఇస్తోంది. ఈ బస్‌పాస్‌లు ఇకపై ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఈ పాస్‌ల ద్వారా ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం వదిలించుకున్నట్టు కనిపిస్తోంది.ఫలితంగా దాన్ని ఆర్టీసీ మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద భారమే కాబోతోంది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.4,305.48 కోట్లు కేటాయించింది. ఇందులో నేరుగా రూ.3,082.53 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచి రూ.852.09 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.370.86 కోట్లు ప్రతిపాదించింది. రాయితీ బస్‌పాస్‌లకు తిరిగి చెల్లించే (రీయింబర్స్మెంట్) మొత్తంపై ప్రస్తావనే లేదు. అన్నింటికీ మహాలక్ష్మి నిధులే.. రీయింబర్స్మెంట్ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ వద్ద వాకబు చేస్తే, మహాలక్ష్మి పథకానికి కేటాయించిన నిధుల నుంచే వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని బట్టి నెలకు రూ.358 కోట్లు ఆర్టీసీకి అందుతున్నట్లు లెక్క. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయం సగటున నెలకు రూ.350 కోట్లు ఉంటోంది.అంటే ప్రభుత్వం ఇచ్చే మొత్తం దానికే సరిపోతుంది. కానీ, రాయితీ బస్‌పాస్‌ల ద్వారా ఏటా ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయం దాదాపు రూ.400 కోట్లు. గతంలో ఈ మొత్తం రూ.680 కోట్ల వరకు ఉండేది. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక వారికి బస్‌పాస్‌లు అవసరం లేకుండా పోయాయి. దీంతో ఆమేర తగ్గింది. గతంలో బస్‌పాస్‌ల రాయితీ మొత్తంతోపాటు కొత్త బస్సుల కొనుగోలుకు కొద్దిగా గ్రాంటు కూడా బడ్జెట్లో కేటాయించే పద్ధతి ఉండేది. ఇప్పుడు ఆ గ్రాంటు కూడా మాయమైంది. నిధులు పెరిగినా కష్టాలే..గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన నిధులతో పోలిస్తే ప్రస్తుతం మూడు రెట్లు పెరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తన చివరి రెండు బడ్జెట్లలో రూ.1,500 కోట్ల చొప్పున కేటాయించింది. ఇప్పుడు నిధులు భారీగా పెరిగినా.. అదనంగా ఉపయోగపడే వీలు లేకుండా పోయింది. గతంలో ఆర్టీసీ 15 లక్షల వరకు రాయితీ బస్‌పాస్‌లు జారీ చేసేది. మహాలక్ష్మి పథకంతో వాటి సంఖ్య 10 లక్షలకు తగ్గినట్టు అంచనా. పాస్‌లు కొనేవారు బస్‌పాస్ ధరలో 40% చెల్లిస్తుండగా, ఆర్టీసీ 60 శాతం భరిస్తోంది.ఇప్పుడు ఆ 60 శాతం ప్రభుత్వం నుంచి రాకపోతే ఆర్టీసీనే భరించాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.400 కోట్లు ఆర్టీసీకి అదనపు భారంగా మారబోతోంది. దీన్ని తప్పించుకోవాలంటే సంస్థ రాయితీ వాటాను తగ్గించటమో, క్రమంగా బస్‌పాస్‌లను ఉపసంహరించటమో చేయాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఇలా భారం మోపటం సరికాదని, బస్‌పాస్ రాయితీ ప్రభుత్వ మే భరించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. -
పది పద్దులు... రెండు బిల్లులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఎనిమిదోరోజు సోమవారం 2025–26 వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగనుంది. పురపాలక, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. ఈ పద్దులపై చర్చతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన రెండు బిల్లుల్లో సవరణలను ప్రతిపాదించనుంది. దీంతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలుస్తోంది. మరో 25 ఏళ్ల వరకు పాత పద్ధతినే కొనసాగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడతారని, దీనిపై చర్చ అనంతరం ఆమోదించి కేంద్రానికి పంపుతామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
బడ్జెట్ పై 'సభ'భగలు
⇒ ఆర్థిక మాంద్యం కాదు.. మీ బుద్ధి మాంద్యం: మాజీ మంత్రి హరీశ్‌రావు ⇒ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం⇒ అంతా తనకే తెలుసనుకునే సీఎం ⇒అజ్ఞానంతో ఆదాయం దిగజారింది⇒పాలన చేతకాక నెగెటివ్ రిజల్ట్.. బడ్జెట్ అంకెలు, లెక్కలన్నీ ఉత్తవే ⇒ఆరు గ్యారంటీలకు దిక్కులేదు గానీ.. అందాల పోటీలా? ⇒అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే.. సీఎం రేవంత్‌రెడ్డికే వస్తుందిసాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఇది పాలకుల బుద్ధి మాంద్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘ఇచ్చిన హామీలను అమలు చేసే దిక్కులేదు, వాటికి సరిపడా ఆదాయం లేదని ప్రభుత్వమే చెప్తోంది. ఆదాయం ఎందుకు లేదంటే ఆర్థిక మాంద్యం అంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉంటుంది? ఇది ఆర్థిక మాంద్యం కాదు..పాలకుల బుద్ధిమాంద్యం. అంతా తనకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం దిగజారింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం మాటెత్తుకున్నారు..’’అని పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా శుక్రవారం ఆయన బీఆర్ఎస్ పక్షాన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. వివరాలు హరీశ్‌రావు మాటల్లోనే... ఇది దిగజారుడు రాజకీయం రాష్ట్ర ఆదాయం తగ్గిపోవటంతో భూములను తెగనమ్మి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని భూములమ్మితేనే గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రూ.50 వేల కోట్లు లక్ష్యంగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇది దిగజారుడు రాజకీయం కాదా? పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రైజింగ్ తెలంగాణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు నిర్వహిస్తారట. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల విధ్వంసం.. రాష్ట్రంలో వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద, మధ్య తరగతి జనం గుండె ఆగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన తిండి లేక హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా హయాంలో గురుకులాల సంఖ్యను 289 నుంచి 1,020కి పెంచి బలోపేతం చేస్తే.. ఇప్పుడు వాటి లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చారు. దీనితో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అన్ని వర్గాలను మోసం చేశారు గతేడాది రూ.2,91,159 కోట్లుగా గొప్పగా చెప్పుకున్న బడ్జెట్ వాస్తవిక బడ్జెట్ కాదని నేను అప్పుడే చెప్పాను. రివైజ్డ్ బడ్జెట్ అంకెల్లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపటం ద్వారా అదే నిజమని తేలింది. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు పేదల రక్తమాంసాలు పిండి ఎల్ఆర్ఎస్ వసూలుకు సిద్ధమయ్యారు. ఫార్మాసిటీకి మేం భూములు సేకరిస్తుంటే తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ పేరుతో అదనంగా మరో 14 వేల ఎకరాలు లాక్కుంటున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. సభకు క్షమాపణ చెప్పండి.. గత బడ్జెజ్లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి ఈ 16 నెలల్లో నాలుగు ఇళ్లు కూడా నిర్మించలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష అదనంగా ఇస్తామని.. ఇప్పుడు ఆ మాటే ఎత్తలేదు. ఇది దళిత, గిరిజనులను మోసం చేయడం కాదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ కేలండర్ అమలుచేస్తామని చెప్పి జాబ్‌లెస్ కేలండర్‌గా మార్చారు. దాని సంగతేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తే అశోక్‌నగర్‌లో వారి వీపులు పగలగొడుతున్నారు. తుదిదశలో ఉన్న ఆరు సాగునీటి ప్రాజెక్టులని బడ్జెట్లో ప్రస్తావించారు కదా.. ఆ ప్రాజెక్టుల పేర్లేమిటో చెప్పండి.లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న మొదటి సంవత్సరంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఎన్నికల ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని ప్రకటనలు చేసి.. ఇప్పుడు మేమిచ్చి న నోటిఫికేషన్‌కు 5 వేల పోస్టులు మాత్రమే పెంచి దగా డీఎస్సీ చేశారు. ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు.. కేసీఆర్ ముల్కీ రూల్స్ నుంచి 610 జీవో కోసం పోరాడి స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసి.. తొమ్మిదిన్నరేళ్లలో 1.62 లక్షల ఉద్యోగాలిచ్చారు. మా హయాంలో ఇచ్చి న నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు పంచటం తప్ప కొత్త ఉ ద్యోగాల కల్పన ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 57 వేల ఉద్యోగాల్లో 50 వేలు మా హయాంలోనివే. ఈ ప్రభుత్వం ఆరు వేలు కూడా భర్తీ చేయలేదు. రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమ దుకాణం) అంటుంటే.. రేవంత్ మాత్రం నఫ్రత్ కా మాకాన్ (విద్వేషాల ఇల్లు) అంటున్నారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. వాటిని వడ్డీలేని రుణాలుగా పరిగణిస్తారా? ‘‘ఐదేళ్లలో వడ్డీ లేని రుణాల కింద రూ.లక్ష కోట్లు అందజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉంటే ఆ ఉత్తర్వులు సభ ముందుంచాలి. లేని పక్షంలో సభను తప్పుదోవ పట్టించినందుకు సభకు క్షమాపణ చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామంటున్నారు. వాటిని వడ్డీ లేని రుణాలుగా పరిగణిస్తారా చెప్పాలి?’’ పాలనా వైఫల్యాలతో దెబ్బతిన్న పురోగతి‘‘జీఎస్టీ వృద్ధిరేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఆదాయం తగ్గడం, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల.. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గింది. కేసీఆర్ హయాంలో దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా, దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గాయి. ఫార్మా సిటీ రద్దు, ఎయిర్ పోర్టుకు మెట్రో రద్దు, హైæడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ, మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా, ఆర్ఆర్ టాక్స్‌లు, సంక్షేమ పథకాల అమలు సరిగా లేక గ్రామాలకు ద్రవ్య ప్రవాహం తగ్గడం, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం.. ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి, వృద్ధి రేటు మందగించింది. పరిస్థితి ఇలా ఉంటే, బడ్జెట్లో మాత్రం ఘనమైన అంకెలు చూపి ప్రజలను మోసం చేస్తున్నారు.ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేది?: భట్టి విక్రమార్క⇒ బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ ⇒ ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే... మీరు చేసిన అప్పులు తీర్చలేక చస్తున్నాం ⇒ పదేళ్లు ఎంతో అవమానించారు.. మౌనంగా భరించాం ⇒ అన్నీ అనుభవించే ఇక్కడకొచ్చాం.. మీరెన్ని మాట్లాడినా బాధపడంసాక్షి, హైదరాబాద్: ‘‘గత పదేళ్ల పాలనలో రూ.16.70 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏం సాధించారు? నాగార్జునసాగర్ నిర్మించారా? ఎస్సారెస్పీ, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు వంటివేమైనా నిర్మించారా? హైటెక్ సిటీ కట్టారా? ఏం చేశారయ్యా అంటే కాళేశ్వరం అంటారు. ఆ కాళేశ్వరం ఏమైందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇక మీరు చెప్పడానికేముంది? సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం చేసి, వ్యవస్థలను నాశనం చేసిన మీరు.. వాస్తవిక బడ్జెట్‌ను పెట్టిన మమ్మల్ని విమర్శిస్తారా?’’ అని బీఆర్ఎస్పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు శుక్రవారం రాత్రి శాసనసభలో, శాసన మండలిలో భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలు చేసిన విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. భట్టి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చూపినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. 2016–17లో రూ.8వేల కోట్లు, 2018–19లో రూ.40 వేల కోట్లు, 2021–22లో రూ.48 వేల కోట్లు, 2022–23లో రూ.52 వేల కోట్లకుపైగా, 2023–24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదు.మేం మీలాగా బడ్జెట్‌ను ప్రతీసారి 20 శాతానికిపైగా పెంచుకుంటూ పోలేదు. అలా పెంచితే ఈసారి బడ్జెట్ రూ.4 లక్షల 18 వేల కోట్లు అయ్యేది. మేం అలా చేయకుండా.. వాస్తవాల మీద బడ్జెట్ పెట్టాం. మీరు ఆదాయం ఉన్నా, లేకున్నా పెంచుతూ పోయారు. ఔటర్ రింగ్‌రోడ్డును రూ.7 వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేశాం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అమ్మకాల ద్వారా రోజుకు కోటిన్నర ఆదాయం వచ్చేది. 30 వేల టన్నులు అమ్మేవారు. ఆరేడు నెలలుగా సీరియస్‌గా దృష్టి పెట్టాం. ఇసుక మాఫియాను కట్టడి చేశాం. రోజుకు 70 వేల టన్నులు అమ్ముతున్నాం. ఆదాయం రోజుకు రూ.3 కోట్లకు పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా ఏటా రూ.600 కోట్ల ఆదాయం కోల్పోయాం. పదేళ్లలో రూ.6 వేల కోట్ల ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయిందో బీఆర్ఎస్ వాళ్లే చెప్పాలి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మాఫియాలను కట్టడి చేస్తాం. ఆదాయం పెంచుతాం. అవమానాలను పదేళ్లు మౌనంగా భరించాం రైతు రుణమాఫీ కింద పదేళ్లలో మీరు రూ.28,053 కోట్లు ఇస్తే.. మేం నాలుగు నెలల్లోనే రూ.20,617 కోట్లు ఇచ్చాం. మీరు జాప్యం చేయడంతో రైతు రుణమాఫీ కంటే వడ్డీల కింద రూ.13 వేల కోట్లు జమ చేసుకున్నారు. నిర్బంధం, స్వేచ్ఛ, నిరంకుశత్వం గురించి మీరా మాట్లాడేది? ఏ ఒక్కరోజైనా సభను ప్రజాస్వామికంగా నడిపారా? నేను పదేళ్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, సీఎల్పీ నేతగా అక్కడ కూర్చుని ఉంటే ఎంత అవమానించారో తెలియదా?తలవంచుకుని భరిస్తూ, మీకు సహకరించామే తప్ప అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడలేదు. సభాపతి, సభా నాయకుడు, ప్రభుత్వం గురించి తూలనాడలేదు. మేం పడిన అనుమానాలు ఈ సభలో ఎవరూ పడి ఉండరు. అయినా సభ ఔన్నత్యాన్ని కాపాడాం. అన్నీ చూసే ఇక్కడికి వచ్చాం.. మీరెన్ని మాట్లాడినా, రన్నింగ్ కామెంట్రీలు చేసినా బాధపడేది లేదు. అవన్నీ చూసి చూసి, అనుభవించి ఇక్కడకు వచ్చాం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలందరికీ లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు బరాబర్ ఇస్తాం. రాష్ట్రంలోని మహిళలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేట్టు చేయాలన్నదే మా ప్రభుత్వం. సీఎం ఆలోచన. మేం ఉద్యోగాలు రాని పిల్లలకు రాజీవ్ యువ వికాసంతో రూ.6 వేల కోట్లు ఇవ్వబోతున్నాం. బ్రాహ్మణ పరిషత్‌కు రూ.50 కోట్లు ఉండే.. ఇంకో 50 కోట్లు కలిపి ఇచ్చాం. వైశ్యులు కార్పొరేషన్ కావాలని అడిగితే మీరు ఇవ్వలేదు. మేం రాగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25 కోట్లు ఇచ్చాం..’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్నీ ఉత్త మాటలే.. పదేళ్లలో కృష్ణానది, గోదావరి నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లందించారా? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు. పదేళ్లలో దళితుల అభివృద్ధి కోసం రూ.1,81,877 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు చేయలేదు. దళితబంధు గురించి బడ్జెట్లో రూ.17,700 కోట్లు పెట్టి ఒక్క రూపా యి అయినా విడుదల చేశారా? అమాయకులైన గిరిజనులను ఆడవాళ్లని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టించారు. మేం సబ్‌ప్లాన్ నిధులను తు.చ. తప్పకుండా ఖర్చు చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు.మీ అప్పులే కడుతున్నాం స్వామీ.. కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. ఈ ఏడాది రూ.1,58,041 కోట్ల అప్పులు తెచ్చి .. రూ.1,53,359 కోట్ల మేర గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కింద చెల్లించాం. మీరు చేసిన అప్పులు తీర్చలేక, తప్పులు సరిదిద్దలేక, నిద్రలేక చస్తున్నాం. మీ అప్పులే కడుతున్నాం స్వామీ. తెచ్చి న అప్పుల్లో కట్టిన అప్పులు పోను ఈ సంవత్సరానికి మా ప్రభుత్వం అవసరాల కోసం వాడుకున్నది రూ.4,682 కోట్లు మాత్రమే. మీలాగా నాలుగు గోడల మధ్య బంధించుకుని ఎవరికీ ఏమీ చెప్పకుండా, ఎవరినీ కలవకుండా మూసేసి పాలన చేయదల్చుకోలేదు. మా ప్రభుత్వం 24/7 తలుపులు తెరిచి ఉంటాయి. -
బడ్జెట్ పై వాడి వేడి చర్చ
-
చేయూత పింఛన్లు 42,51,341
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చేయూత సామాజిక పింఛన్ల కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారులకు మొత్తం రూ.10,514.32 కోట్లు (మార్చిలో చెల్లించాల్సిన రూ.982.20 కోట్లు కలిపి) అందజేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే 2024–25లో ప్రభుత్వం తెలిపింది. 2024–25 బడ్జెట్లో ఈ పింఛన్ల కోసం 14,628.91 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 2025–26 వార్షిక బడ్జెట్లో పింఛన్లకు రూ.14,861 కోట్లు కేటాయించింది. మొత్తం 11 కేటగిరీల్లో 42,51,341 మందికి పింఛన్లు అందిస్తున్నారు. వీరిలో దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున, వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీలవారికి రూ.2,016 చొప్పున ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం వృద్ధులు ఇతర కేటగిరీల పింఛన్లను రూ.2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంపుదల ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనేదానిపై స్పష్టత కొరవడింది. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.23 వేల కోట్ల వరకు బడ్జెట్ పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. -
‘చేతి’లో ఉన్నంత కాలం.. పాలన పరుగు!. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 3లక్షల4వేల965 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి
-
‘చదివింపులు’ పెరగాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యకు కేటాయింపులు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ రూ.3లక్షల కోట్లు దాటుతోంది. ఇందులో విద్యారంగానికి కనీసం 15 శాతం కేటాయింపులు ఉండాలన్నది ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణుల డిమాండ్. రాష్ట్ర అవతరణ నుంచి కేటాయింపులు గరిష్టంగా 7 శాతం దాటడం లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, కొత్త టీచర్ల నియామకా లు చేపట్టాలన్నా, నిధుల కొరత అడ్డంకిగా మారుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. విద్యారంగానికి నిధులు పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫా ర్సు చేసింది. నిధులు పెంచి విద్యారంగ సంస్కరణలు చేప ట్టాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా అభిప్రాయపడింది. ఎక్కువ భాగం వేతనాలకే చెల్లు రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కేటాయింపుల్లో సింహభాగం టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలకే ఖర్చవుతోంది. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం వెనుకబడి ఉందని కేంద్ర విద్యాశాఖ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటికే పేద విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు సకాలంలో పంపిణీ చేయడానికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లనూ తీర్చిదిద్దుతామని చెప్పి మన ఊరు–మనబడి కార్యక్రమం చేపట్టినా తొలి దశలోనే నిధుల కొరత ఎదురైంది. తగ్గుతున్న ప్రవేశాలు కోవిడ్ కాలంలో మినహా ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు ఏటా పడిపోతున్నాయి. రాష్ట్రంలో 11,067 గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్లున్నాయి. చిన్న స్కూళ్లలో ఫీజులు రూ.30 నుంచి రూ.40 వేల మధ్య ఉంటున్నాయి. కార్పొరేట్ స్కూళ్లల్లో రూ.లక్షల్లో ఉంటున్నాయి. అయినా మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించడానికి కారణం.. ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యత కొరవడటమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి సర్కారీ స్కూళ్లల్లో నాణ్యమైన బోధకులే ఉన్నారు. కానీ బోధన విధానం సరైన రీతిలో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే విద్యారంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరముంది. టీచర్లు ఏరి.. సదుపాయాలెక్కడ ? ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్లే లేరు. 602 మండలాల్లో కేవలం 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. 6 వేల పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. విద్యావలంటీర్ల నియామకంపైనా పాఠశాల విద్యా శాఖ దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా బోధన అరకొరగా ఉంటోందన్న ప్రచారం.. విద్యార్థులను ప్రైవేట్ బాట పట్టిస్తోంది. నిధులు పెంచాలి పాఠశాల విద్యకు నిధులు పెంచాలి. మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీపడే శక్తి సామర్థ్యాలున్నా, అవసరమైన వసతులు లేకపోవడమే సమస్యగా మారింది. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 15 శాతం నిధులైనా ఇవ్వాలి విద్యకు కేవలం 7 శాతం నిధులే ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 13 శాతం నిధులిస్తున్నారు. 90 శాతం బడుగు,బలహీన వర్గాల విద్యార్థులున్న తెలంగాణలో విద్యారంగానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తోంది. – మాచర్ల రాంబాబు,ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కేటాయింపులతో సంస్కరణలు పాఠశాల విద్యలో సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని స్వాగతిస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అవసరాలు ఏంటి? ఏమేం సమకూర్చాలనే దానిపై ఫోకస్ పెట్టాలి. ఇది జరగాలంటే నిధులు పెంచాలి. – రాజగంగారెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘వాయిస్ ఆఫ్ అమెరికా’పై ట్రంప్ వేటు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సిబ్బంది కోతలపర్వాన్ని కొనసాగిస్తోంది. ఇందులోభాగంగా తాజాగా ‘వాయిస్ ఆఫ్ అమెరికా’బ్రాడ్‌కాస్టర్ మీడియా సంస్థలోని మొత్తం సిబ్బందిని ప్రభుత్వం సెలవుపై పంపించింది. వాయిస్ ఆఫ్ అమెరికా అనేది ప్రభుత్వ నిధులతో పనిచేసే బహుళజాతి మీడియా సంస్థ. ఇది 40 భాషల్లో రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్, సోషల్‌మీడియాల్లో అమెరికా సంబంధ సమాచార, సాంస్కృతి కార్యక్రమాలను ప్రసారంచేస్తోంది. ఈ సంస్థలో మొత్తం 1,300 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లందరినీ సెలవుపై పంపుతున్నట్లు ఈ బ్రాడ్‌కాస్టర్ మీడియా ఏజెన్సీ సీనియర్ మహిళా సలహాదారు కరీ లేక్ చెప్పారు. ‘‘యూఎస్ ఏజెన్సీ ఫర్ గ్లోబల్ మీడియా(యూఎస్‌ఏజీఎం) నిధులతో నడిచే వాయిస్ ఆఫ్ అమెరికా, ఆఫీస్ ఆఫ్ క్యూబా బ్రాడ్కాస్టింగ్లలో మీరు పనిచేస్తుంటేగనక వెంటనే మీ ఈ–మెయిల్‌ను చెక్ చేసుకోండి’’అని కరీలేక్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. శుక్రవారం ‘ప్రభుత్వ రంగ సిబ్బంది తగ్గింపు కొనసాగింపు’కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశాక ‘వాయిస్ ఆఫ్ అమెరికా’పై ప్రభుత్వం కన్నేసింది. దీంతో 83 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ‘వాయిస్ ఆఫ్ అమెరికా’మూగబోయిందని సంస్థ డైరెక్టర్ మైఖేల్ అబ్రమోవిట్జ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
అప్పు... ఆర్థిక భద్రతకు ముప్పు!
ఇప్పుడు ఆర్థికవేత్తల చర్చల్లో కీలకాంశం.. భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ), దానితో పోల్చితే భారత్ రుణ నిష్పత్తి. ఒక కుటుంబానికి తీర్చగలిగిన స్థాయిలోనే అప్పు ఎలా ఉండాలో.. ఒక దేశానికి తన ఆర్థిక వ్యవస్థ స్థాయికి తగినట్లుగానే రుణం ఉండాలి. ఒక కుటుంబం ఆదాయం– అప్పు ఎలా బేరీజు వేసుకోవాలో దేశం కూడా తన జీడీపీని, అందులో రుణ నిష్పత్తిని తూకం వేసుకోవాలి. ఒక దేశం ఆర్థిక ‘ఆరోగ్యానికి’ చక్కటి సూచిక జీడీపీ–రుణ నిష్పత్తి.విస్తృత స్థాయిలో ఆమోదం పొందిన ఈ సూచీని అదుపులో పెడతామని కేంద్రం ఇస్తున్న హామీ ఇప్పుడు ఆర్థిక వర్గాలకు ఊరటనిస్తోంది. అయితే ఇది అంత తేలిక్కాదని వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ అప్పు (సెంట్రల్ గవర్నమెంట్ డెట్) కొంత అదుపులో ఉన్నా.. రాష్ట్రాలను కూడా కలుపుకుంటే (జనరల్ గవర్నమెంట్ డెట్) ఆందోళన కలిగిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. ఆయా అంశాలపై చర్చించిందే ఈ కథనం. – సాక్షి, బిజినెస్ డెస్క్కేం ద్రానికి రుణ–జీడీపీ నిష్పత్తి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 57.1 శాతం. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రానున్న 2025–26లో 56.1 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించుకుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం– ద్రవ్యలోటును తగ్గించుకోవడం... ఆర్థికాభివృద్ధి ద్వారా జీడీపీలో రుణ నిష్పత్తిని గణనీయంగా తగ్గించుకోవాలన్న సంకల్పాన్ని బడ్జెట్ ఉద్ఘాటించింది. తద్వారా ఈ నిష్పత్తిని 2031 మార్చి 31 నాటికి ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి చేర్చాలని ప్రణాళికలను వెల్లడించింది.అంటే జీడీపీలో రుణ నిష్పత్తిని 2031 నాటికి ఏడాదికి ఒక శాతం చొప్పున తగ్గించుకుంటూ వెళ్లాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందుకు రెండు ప్రధానదారులు ఒకటి ద్రవ్యలోటు కట్టడికాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరొకటి. 2024–25లో ద్రవ్యలోటు 4.9 శాతం ఉండాలని బడ్జెట్ నిర్ధేశించుకున్నప్పటికీ, ఇది సవరించిన అంచనాల ప్రకారం మరింత మెరుగ్గా 4.8 శాతానికి తగ్గించుకోగలిగింది.రానున్న ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఈ రేటును 4.4 శాతానికి తగ్గించుకోవాలని కూడా తాజా బడ్జెట్ నిర్దేశించుకుంది. లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తూ, జీడీపీ– రుణ నిష్పత్తిని లక్ష్యాల మేరకు తగ్గించుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇది బాండ్ మార్కెట్, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణ వడ్డీరేట్లు స్థిరత్వానికి తద్వారా దేశ ఎకానమీ పురోగతికి దోహదపడే అంశమనడంలో సందేహాలే అక్కర్లేదు. ⇒ తొమ్మిదేళ్లలో రూ.93.26 లక్షల కోట్ల ⇒ నుంచి రూ.200.16 లక్షల కోట్లులోక్సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన 2018–19లో కేంద్ర ప్రభుత్వ రుణం 93.26 లక్షల కోట్లు. నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే ఇది 49.3 శాతమే. మహమ్మారి కోవిడ్ ప్రభావిత ఆర్థిక సంవత్సరం 2020–21లో రుణ భారం ఏకంగా 121.86 లక్షల కోట్లకు ఎగసింది. జీడీపీలో ఇది 61.4 శాతానికి చేరింది. కరోనా పరిస్థితుల్లో దేశ ఎకానమీ తీవ్రంగా దెబ్బతినడం దీనికి నేపథ్యం. అయితే అటు తర్వాత ఆర్థిక సంవత్సరాలు చూస్తే, (2021–22 నుంచి ఇటీవల బడ్జెట్ 2025–26) జీడీపీలో రుణ నిష్పత్తులు వరుసగా తీవ్ర స్థాయిల్లో (వరుసగా 58.8 శాతం, 57.9 శాతం, 58.1 శాతం, 7.1%, 56.1 శాతం)నే కొనసాగాయి తప్ప, తిరిగి 2018–19 నాటి స్థితికి (49.3 %) చేరుతుందన్న ఆశలు మాత్రం కల్పించలేదు.రూపాయిల్లో చూస్తే, గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రుణ పరిమాణం 93.26 లక్షల కోట్ల నుంచి రెట్టింపుకన్నా అధికంగా 200.16 లక్షల కోట్లకు చేరింది. అయితే తిరిగి వచ్చే ఆరేళ్లలో జీడీపీలో ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి రుణ నిష్పత్తిని తీసుకువెళతామని తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఎకానమీ పరంగా కొంత ఊరటనిచ్చే అంశం.లక్ష్య సాధన తేలిక్కాదుబడ్జెట్లో నిర్దేశించుకున్నట్లు 2031 నాటికి జీడీపీలో రుణ నిష్పత్తిని నిజంగానే తిరిగి 50 శాతానికి చేర్చడం సాధ్యమేనా అన్నది ఇక్కడ బిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు భారత్ ఎకానమీకి ప్రస్తుతం తీవ్ర ప్రతికూలంగా ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ సమస్యలతో తీవ్ర అనిశి్చతిలో ఉన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ట్రంప్ తాజా పాలనా కాలంలో మరింత క్షీణించాయి.టారిఫ్‌ల యుద్ధం కూడా దాదాపు ప్రారంభమైంది. ఒకపక్క అమెరికా టారిఫ్‌ల యు ద్ధం, మరోపక్క చైనాకి విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం వంటి అంశాలు భారత్ ఎకానమీపై తీవ్ర ఇప్పుడు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి లక్ష కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడులు భారత్ నుంచి వెనక్కు మ ళ్లాయి. వీటిలో అధిక భాగం చైనా ఆకర్షించడం గమనార్హం. బలహీనమైన ప్రపంచ డిమాండ్. ఉ త్పాదక రంగంపై ఒత్తిళ్లు, డాలర్ మారకంలో రూ పాయి మారకపు విలువలో తీవ్ర అనిశి్చతి, భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లను విసురుతున్నాయి.అ యితే పటిష్ట దేశీయ డిమాండ్, ప్రైవేటు వినియో గం, ద్రవ్యలోటు వంటి అంశాల్లో క్రమశిక్షణ, పటిష్ట విదేశీ మారకద్రవ్యాలు, సేవల రంగంలో మిగులు, చక్కటి రెమిటెన్సుల (ఎన్ఆర్ఐలు దేశానికి పంపే విదేశీ డబ్బు) వృద్ధి భారత్ ఎకానమీకి మూలస్తంభాలని, ఈ దన్నుతో ఎకానమీ పురోగతి సాధ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశ పౌరునిగా అంతా మంచే జరగాలని మనమూ కోరుకుందాం. రుణ భారం ఎక్కువైతే...⇒ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, విద్య వంటి ముఖ్యమైన రంగాలకు కేటాయింపుల కంటే వడ్డీ చెల్లింపులపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ⇒ భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడుల నుండి ప్రభుత్వం దూరంగా జరిగి.. వడ్డీ వ్యయాలకు అధిక మొత్తాన్ని కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ⇒ తీసుకున్న రుణం ఎక్కడికి వెళుతోందన్న అంశమూ కీలకం. ఇది వృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల వ్యయాల్లో భాగం కావాలి. అసమానత, పేదరికం, నిరుద్యోగం సమస్యల పరిష్కారానికి దోహదపడే వ్యయాలు ఎకానమీ పురోగతికి బాటలు వేస్తాయి. విదేశీ రుణ భారం.. ఊరట అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 2.5 శాతంగా ఉన్న భారత్ ప్రభుత్వ రుణ భారం (రూ.4.74 లక్షల కోట్లు), 2025–26కు సంబంధించి ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లోనూ 2.5 శాతంగా (రూ.8.92 లక్షల కోట్లు) యథాతథంగా కొనసాగడం కొంత ఊరటనిచ్చే అంశం. విదేశీ రుణ భారాలను స్థిరంగా ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలనూ కలుపుకుంటే.. కలవరమే!భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం ఇప్పటికే తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పుతో పాటు రాష్ట్రాల రుణ భారం కలుపుకొని చూస్తే, పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా మారుతోంది. దీనిని ‘జనరల్ గవర్నమెంట్ డెట్’ (జీజీడీ) అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 80 శాతానికి పైగా స్థిరంగా కొనసాగుతుండటం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ వర్గాలు 2030–31 నాటికి ఈ నిష్పత్తిని 70 శాతం లోపుకు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నా, ఇది అంత తేలికైన విషయం కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు (వ్యయాలు – ఆదాయాల మధ్య వ్యత్యాసం) జీడీపీలో 5 శాతానికి దిగువన కొనసాగుతుందనే అంచనా ఉంది. అయితే రాష్ట్రాల అప్పును కలుపుకుంటే ఈ నిష్పత్తి 7 శాతం పైగా పెరిగే అవకాశం ఉంది, ఇది ఆర్థిక స్థిరత్వానికి హానికరమైన అంశం. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సహా పలు ఆర్థిక సంస్థలు భారత సాధారణ ప్రభుత్వ అప్పు జీడీపీకి 100 శాతానికి మించిపోవచ్చని ఇప్పటికే హెచ్చరించాయి.ఈ పరిణామాలు భారత సావరిన్ రేటింగ్‌లపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మూడీస్, ఎస్అండ్పీ, ఫిచ్ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత్‌కు ఇస్తున్న సావరిన్ రేటింగ్.. ‘జంక్’ స్థాయి కన్నా కేవలం ఒక అంచె ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇది విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపి, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును దెబ్బతీస్తోంది. అమెరికాకు 123 శాతం ఉంటే.. భారత్‌కు 56 శాతం.. భయమెందుకు! జీడీపీలో అమెరికాసహా కొన్ని అగ్ర దేశాల రుణ నిష్పత్తులు 100 శాతం దాటిపోతే భారత్‌ది 56 శాతమేగా భయమెందుకు? అన్న సందేహాలు కొందరికి కలగవచ్చు. ఇక్కడ ఒక్కటే సమాధానం. కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఎంత డబ్బు అయినా అప్పు తీసుకోవచ్చు. అది ఆ వ్యక్తి తేలిగ్గా తీర్చేయగలడు.ధనికుడు అప్పు అడగడంతోనే ఇచ్చేవాడూ వెనకాముందూ చూడకుండా ఇచ్చేస్తాడు. మరి పేదవాడు అప్పుచేస్తే అది ఎంత ఎక్కువుంటే.. అతనికి అంత కష్టం. ఇదీ అంతే. అమెరికా, జపాన్ వంటివి అగ్ర దేశాలు. వాటి ఎకానమీలు స్వల్పకాలంలో ఆటుపోట్లకు గురైనా.. అవి అత్యంత శక్తివంతమైనవి. అయితే ఆయా దేశాల అప్పులనూ అంత తేలిగ్గా తీసిపారేయవద్దని, ఇది అవి మునగడంతోపాటు, ప్రపంచ దేశాలనూ ముంచే వ్యవహారమనీ.. విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ముందుచూపు అవసరం భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే రాజకీయ పార్టీలు పొదుపు విధానాలను అలవర్చుకోవడంతో పాటు, అప్పులను సమర్థంగా నిర్వహించాలి. వృద్ధిని పెంచే సంస్కరణలను ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వ వ్యయాలను సద్వినియోగం అయ్యేల చూడ్డం అత్యవసరం. ఇకపై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భద్రతను నిర్దేశించనున్నాయి! -
డిజిటల్ జోరు..!
కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్ సంస్థలు తమ బడ్జెట్లో దాదాపు సగభాగాన్ని డిజిటల్కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అడ్వర్టైజింగ్ పరిశ్రమలో డిజిటల్ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్‌పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది. 2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్ ఆడియన్స్‌ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్‌కి సానుకూలాంశంగా ఉంటోంది. టెలికం అత్యధిక కేటాయింపులు.. టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్‌కి కేటాయిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, స్టార్టప్‌లు మొదలైనవి ఎక్కువగా ఆన్లైన్ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్ వీడియోలు, సోషల్ కామర్స్‌లపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా హవా...డిజిటల్ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్లైన్ వీడియోలు 29%, పెయిడ్ సెర్చ్ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్లైన్ వీడియో, సోషల్ మీడియా, పెయిడ్ సెర్చ్‌లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్ మీడియాకు కేటాయిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అకౌంట్ డైరెక్టర్ సాయి సిద్ధార్థ్ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్ అడ్వర్టైజింగ్ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జగన్ రాసింది చరిత్ర.. బాబు చేస్తోంది దగా
చదువుకునే బిడ్డలకు గట్టి చేయూతనిచ్చారు.. ఆడబిడ్డలకు గూడు కట్టించారు.. రాజకీయాల్లో నాయకురాళ్లుగా నలుగురినీ నడిపించేందుకు పదవులిచ్చి పెద్దపీట వేశారు.. సమాజంలో మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలిచారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అందించారు. నవరత్న కాంతుల్లో మహిళా లోకం నవశకం నాంది పలికింది. ఆయన పాలనలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలతో మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ముందుకుసాగారు. మహిళాభివృద్ధి ద్వారానే కుటుంబ అభివృద్ధి జరుగుతుందనే గట్టి విశ్వాసంతో వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలైన అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచారు. – సాక్షి, అమరావతిసాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీలను కురిపించి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మహిళలను దగా చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ అమలుచేసిన మహిళా సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించిన చంద్రబాబు కనీసం తాను ఇచ్చిన హామీలనూ పట్టించుకోవడం లేదు. సూపర్ సిక్స్ అమలుకే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరమైతే గత నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రూ.7,282 కోట్లే ఇచ్చి రూ.865 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది (2025–26) బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు రూ.17,179 కోట్లు మాత్రమే కేటాయించగా ఎంత ఖర్చు చేస్తారనేది అనుమానమే. ప్రధానంగా తల్లికి వందనం, ఉచిత బస్సు, ఆడబిడ్డ సంక్షేమ నిధి వంటి అనేక పథకాల అమలులో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రధాన హామీల అమలులో వైఫల్యం ఇలా..ఆడబిడ్డ నిధి దగా: 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున (ఏడాదికి రూ.18వేలు) ఇస్తామన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని 1.80 కోట్ల మందికి రూ.32,400 కోట్లు కేటాయించాలి. రెండేళ్లకు రూ.64,800 కోట్లు కావాలి. కానీ, గత ఏడాది, ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఆడబిడ్డలను దగా చేశారు.ఉచిత బస్సు.. తుస్సు: మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,500 కోట్లవుతుంది. నిరుడు, ఈ ఏడాది కలిపి బడ్జెట్లో రూ.7 వేల కోట్లు ఎగరగొట్టడంతో ఉచిత బస్సు తుస్సు అనిపించారు.తల్లికి వందనంలోనూ వంచనే: పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. గత బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి రూ.5,386 కోట్లు కేటాయింపులు చేసినా రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్లో బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో ఆ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించినట్లు చూపారు. బడ్జెట్ డాక్యుమెంట్లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌లో మాత్రం రూ.8278 కోట్లు కేటాయించినట్లు మాత్రమే ఉంది. 1 నుంచి 12వ తరగతి రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. వారికి రూ.15 వేల చొప్పున ఆ పథకానికి రూ.13,112 కోట్లు కేటాయించాలి. విద్యా దీవెనను భ్రష్టు పట్టించేలా: విద్యా దీవెన పథకానికి రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, చంద్రబాబు గత ఏడాది రూ.700 కోట్లే కేటాయించారు. విద్యా దీవెన, వసతి దీవెనకు ఈ ఏడాది మరో రూ.3,900 కోట్లు కావాలి. ఇచ్చింది రూ.2,600 కోట్లు మాత్రమే.దీపం సాయం..అంతా గ్యాస్: రాష్ట్రంలోని 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు కోసం రూ.4 వేల కోట్లు అవుతుంది. నిరుడు కేవలం రూ.865 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.2,439 కోట్లే కేటాయించింది.సున్నా వడ్డీ రుణాలు సున్నానేనా: డ్వాక్రా సంఘాలకు రూ.పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. దీనికోసం గత బడ్జెట్లో రూ.950 కోట్లు కేటాయించినా రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రూ.వంద కోట్లే కేటాయించారు.50ఏళ్లకే పెన్షన్.. ఒట్టిదే: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చారు. మరో 20 లక్షల మందికి నెలకు రూ.4 వేల చొప్పున అందించాలంటే ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. రెండు బడ్జెట్లలోనూ కేటాయింపులు చేయకపోవడంతో 50 ఏళ్లకే పెన్షన్ ఒట్టిదేనా? అని మహిళలు మండిపడుతున్నారు. ఇవే కాకుండా నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలకు మొండిచేయే. ఇక పింఛన్ల కోత సరేసరి. -
కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి. పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు. 7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట! సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు. స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి. స్త్రీ నిధి నిబంధనలు గాలికి.. సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి. పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. నిధులు మళ్లిస్తే ఊరుకోం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలుస్త్రీ నిధిని మళ్లించడం దారుణం టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఊరుకునేది లేదు.. కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.నిధులు కేటాయించకపోవడం దారుణం కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా -
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
-
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 22 వేల కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్దిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల హామీల అమలుకు నిధుల కేటాయింపులు చేయలేక చతికిలపడింది.
-
Kakani Govardhan: ఇది మోసం, వంచన బడ్జెట్
-
కూటమి నేతలు హామీలను విస్మరించారు
-
Allu Arjun: అట్లీ సినిమా అప్డేట్
-
సౌత్, నార్త్ లో డబుల్ రిస్క్ చేస్తున్న మైత్రి మూవీస్..
-
ప్రాధాన్య ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులకు రానున్న బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులతోపాటు మెట్రో రైలు విస్తరణకు అధిక నిధులు కేటాయించే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందే ఆర్థిక సాయం, వివిధ సంస్థల నుంచి తెచ్చుకొనే రుణాలు కాకుండా దాదాపు రూ. 20 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించొచ్చని చెబుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని.. కేంద్ర ఆర్థిక సాయం కోసం ఆయా ప్రాజెక్టుల (డీపీఆర్) సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ‘మూసీ’కి రూ. 2 వేల కోట్లు! హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా 2030 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ. 2 వేల కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 4,100 కోట్లను ప్రపంచ బ్యాంకు ద్వారా రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికితోడు కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిస్తుందని, మిగిలిన నిధు లను ప్రైవేటు రంగం ద్వారా పెట్టుబడుల రూపంలో తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూ ర్తయ్యే సమయానికి రూ. లక్షన్న ర కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులో ఎక్కువగా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రాజెక్టు తొలివిడతలో భాగంగా ఇబ్బందిలేని ప్రాంతాల్లో ఈ ఏడాది మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు కేటాయించొచ్చని తెలుస్తోంది. మెట్రో విస్తరణకు రూ. 7 వేల కోట్లపైనే? రూ. 24,369 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులో 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ మేరకు రూ. 7,200 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మరో రూ. 4 వేల కోట్లకుపైగా కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇవి పోను రూ. 12 వేల కోట్లలో రూ. 1,000 కోట్లను పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాలనుకుంటోంది. మిగతా నిధులను జైకా, ఏడీబీ, ఎన్డీబీ లాంటి సంస్థల ద్వారా రుణాల రూపంలో తీసుకోనుంది. అదేవిధంగా హైదరాబాద్ శివార్లలో దాదాపు 800 చదరపు కిలోమీటర్లకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీ భూసేకరణ కోసం తొలిదశలో భాగంగా రూ. 10 వేల కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నట్లు సమాచారం. -
2025–26లో పథకాల వారీగా రాష్ట్రానికి వచ్చే నిధులపై ఆర్థిక శాఖ అంచనా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉప పథకాలకు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన గ్రాంట్లు కలిపి రాష్ట్రానికి రూ.38,788 కోట్లు నిధులు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల్లో కేవలం నాలుగు శాఖలకే 81శాతం మేర వస్తాయని తేల్చారు. కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయా పథకాలకు కేటాయించిన నిధుల ఆధారంగా మన రాష్ట్రానికి ఎంత వస్తాయనేది అంచనా వేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆయా పథకాల కోసం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చేసిన కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ఈ అంచనాలు రూపొందించినట్లు పేర్కొంది. కేంద్ర బడ్జెట్లో వివిధ పథకాలకు రూ.5,20,61 కోట్లు కేటాయించగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.38,788 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,750 కోట్లకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. అయితే గత రెండేళ్ల కేటాయింపులను పరిశీలిస్తే రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనల్లో సగం కన్నా తక్కువగా రూ.6,078 కోట్ల వరకు రావొచ్చని అధికారులు అంచనా వేశారు. -
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ! -
‘సగానికి’ భాగమిదేనా?
ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది.. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా భావిస్తున్న ఈ ప్రభుత్వం జెండర్ బడ్జెట్లో ఆ దిశగా కేటాయింపులనూ పెంచామంటోంది. ఇక్కడొక మాట.. జెండర్ బడ్జెట్ అనేది మహిళల కోసం ప్రత్యేకమైంది కాదు. కానీ వార్షిక బడ్జెట్లోనే లింగసమానత్వం, మహిళా ప్రగతికి ప్రత్యేక నిధులు ఇస్తుంది వివిధ శాఖలు, విభాగాలలో బాలికలు, మహిళలకున్న సంక్షేమ పథకాలకు పూర్తిగా లేదా పాక్షిక కేటాయింపులతో! ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కింద రూ. 4.49 లక్షల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. మొత్తం బడ్జెట్లో ఇది 8.86 శాతం. కిందటేడుతో పోలిస్తే 37 శాతం పెరిగింది. అంకెల్లో ఇది పెరిగినట్టు కనిపించినా దాన్ని శాఖలు, విభాగాల వారీగా విశ్లేషించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.అన్ని మంత్రత్వ శాఖలు, విభాగాల కేటాయింపుల్లో స్త్రీ పక్షపాతమే చూపించామని... ఏకపక్షంగా నిధులు ఇచ్చామని... మహిళల ప్రగతి విషయంలో తమ దృక్పథంలో మార్పేమీ లేదు..అంటున్న ప్రభుత్వం మరి తగ్గించిన కేటాయింపులు, అసలు కేటాయింపులే చేయని వాటికి సమాధానమేం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. జెండర్ బడ్జెట్ కేటాయింపుల మీద తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదుజెండర్ బడ్జెట్ అంటే ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం, చదువు, ఉపాధి, రక్షణ, ఆంట్రప్రెన్యూర్షిప్కి సంబంధించి ఉండాలి. స్త్రీ, పురుష అసమానతలను తొలగించే దిశగా కేటాయింపులు చేయాలి. ఉదాహరణకు పదేళ్ల నుంచి జెండర్ బడ్జెట్‌ను పెడుతూ వస్తున్నారు. ఈ పదేళ్ల జెండర్ బడ్జెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లెక్క ఎక్కడా లేదు. డిపార్ట్మెంట్ల వారీగా డిపార్ట్మెంట్ల డబ్బులను దామాషా పద్ధతిలో పంచి చూపిస్తుందే తప్ప మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు లేవు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ప్రత్యేక పనివిధానం కోసం కేటాయించి.. ఆ లక్ష్య సాధనకే ఖర్చు చేసినప్పుడే అది జెండర్ బడ్జెట్ అవుతుంది. ఇది అయితే కాదు. – మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం! గర్భిణులు, తల్లుల కోసం పెట్టిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఊసే లేకుండా పోయింది. అన్నిటికన్నా ముఖ్యం అయినది.. మహిళల భద్రత, రక్షణ! ఇటీవలి కోల్‌కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో యువ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మహిళల భద్రత, రక్షణను యుద్ధ్రపాతిపదికన తీసుకుంటాయని, కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని బడ్జెట్లో కేటాయింపుల రూపంలో చూపిస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడు నిర్భయ ఫండ్ కింద కేటాయించింది కేవలం రూ. 30 కోట్లే! ఇది పెట్టిన తొలినాళ్లలో దీనికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వాలు.. అంతకంతకు పెరుగుతున్న నేరాల దృష్ట్యా ఈ నిధులను పెంచాల్సింది పోయి రెండంకెలకు కుదించడం మహిళల భద్రత, రక్షణ పట్ల వాటికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.ఇంకొంత కసరత్తుఈ ఏడు జెండర్ బడ్జెట్‌కు కేటాయింపులు పెరిగాయి. మహిళలు, బాలికల ప్రయోజనార్థం పలు పథకాల అమలుకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కింద రూ.3,150 కోట్లకు పెంచారు. బేటీ బచావో – బేటీ పఢావో, వన్‌స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్‌లు, మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ. 628 కోట్లు కేటాయించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మహిళల భద్రత– రక్షణ కోసం, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపే దిశగా బడ్జెట్ పరంగా ఇంకొంత కసరత్తు జరగాల్సింది. – మల్లవరపు బాల లత, మాజీ డిప్యూటీ డైరెక్టర్, రక్షణ మంత్రిత్వశాఖనిజాయితీతో కూడిన మద్దతు అవసరంమహిళలకు వంద శాతం నిధులు కేటాయించవలసిన ’కేటగిరీ–ఎ’లో 23.5 శాతం మంది మాత్రమే లబ్ధిదారులున్నారు. మెజారిటీ కేటాయింపులు మహిళా లబ్ధిదారులు తక్కువ ఉండే ఇతర పథకాలకు తరలుతున్నాయి. తక్షణ ఫలితాలనిచ్చే బాలికల విద్య, ఉన్నతికి కేటాయించిన నిధులు ఆయుష్మాన్ భారత్ వంటి దీర్ఘకాలిక పథకాలకు తరలిస్తున్న సందర్భాలున్నాయి. సిసలైన మహిళా సాధికారతకు, అభివృద్ధికి రాజకీయ ఉపన్యాసాలకన్నా నిజాయితీతో కూడిన రాజకీయ మద్దతు చాలా అవసరం.– డా. సమున్నత, వైస్ ప్రిన్సిపల్కామర్స్ కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీపెద్దగా మార్పు కనపడలేదు2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్.. అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని లక్ష్యం. అదీ మహిళల నేతృత్వంలోనే జరగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి మహిళా ఆంట్రప్రెన్యూర్స్ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది శుభపరిణామం. మొత్తంమీద మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా ప్రత్యేకించి మహిళల కోసమే ఉన్న కేటాయింపుల్లో పెద్దగా మార్పు కనపడలేదు. అంటే జెండర్ ఈక్వాలిటీ, మహిళల అభివృద్ధికి చేపట్టిన పథకాల మీద కేటాయింపులను పెంచలేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. – ప్రియ గజ్దార్, చైర్పర్సన్, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్శ్వేతపత్రం విడుదల చేయాలిస్త్రీ పక్షపాతినని చెప్పుకుంటున్న ప్రభుత్వం జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలి కదా! అసలు ఆ మాటకొస్తే పదిహేనేళ్లుగా జనాభా లెక్కలే లేవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీలకు కేటాయించింది ఎంత? అందులో ఖర్చు పెట్టింది ఎంత? ఇంకెంత బాకీ ఉంది? అన్న దాని మీద శ్వేతపత్రం విడుదలచేయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి! – ఝాన్సీ గడ్డం, నేషనల్ కన్వీనర్, దళిత్ స్త్రీ శక్తి – సరస్వతి రమ -
ఆర్థిక మంత్రి చెప్పకముందే.. బడ్జెట్ బయటికొచ్చేసిన వేళ..
బడ్జెట్ అంటే కేవలం ఆదాయం, వ్యయం లెక్కలే కాదు.. వేటి ధరలు తగ్గబోతున్నాయి? ఏవి పెరగబోతున్నాయి? పన్నులేమైనా తగ్గిస్తారా, పెంచుతారా? కొత్తగా వచ్చే ప్రయోజనాలేంటన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా ఇవన్నీ రహస్యమే. ఎందుకంటే ముందే బడ్జెట్ ప్రతిపాదనలు బయటికి తెలిస్తే... చాలా తేడాలు వచ్చేస్తాయి. ధరలు పెరిగిపోయేవి ముందే కొని దాచేసుకోవడం, తగ్గిపోయేవాటిని మార్కెట్లోకి వదిలేయడం, స్టాక్ మార్కెట్లలో కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు.. ఇలా మరెన్నో. కొన్నిసార్లు మోసాలకూ, అవకతవకలకూ చాన్స్ ఉంటుంది. ఇలా మన దేశ బడ్జెట్ ఓసారి ముందే లీకై, కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామాకు దారి తీయడంతోపాటు... బడ్జెట్‌కు రూపకల్పన చేసే ప్రక్రియనే మార్చేసింది తెలుసా?అది 1950వ సంవత్సరం.. జాన్ మథాయ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూర్చుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన పూర్తిచేశారు. ప్రింట్ చేసి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడమే తరువాయి. అప్పట్లో రాష్ట్రపతిభవన్‌లోని ప్రెస్‌లో బడ్జెట్ ప్రతులను ముద్రించేవారు. ఇప్పుడున్నంత కఠినంగా సెక్యూరిటీ ఉండేది కాదు. దీనితో బడ్జెట్ పత్రాలు లీకయ్యాయి. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన కొందరు జర్నలిస్టుల చేతికి చిక్కాయి. జాన్ మథాయి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేలోపే జనానికి అందులోని అంశాలు తెలిసిపోయాయి. ధనికులు, పెద్దలకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ ఉందన్న విమర్శలు చెలరేగాయి. ఈ దెబ్బకు బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌ను ఢిల్లీలోని మింటో రోడ్లో ఉన్న ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980లో కేంద్ర సెక్రటేరియట్ ఉన్న నార్త్ బ్లాక్ భవనంలోని బేస్మెంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రింటింగ్‌లో ముద్రించడం ప్రారంభించారు. ఇప్పుడు బడ్జెట్ పత్రాల రూపకల్పన, ప్రింటింగ్ అంటే... అధికారులు, సిబ్బంది క్వారంటైన్లో ఉన్నట్టే. ఎవరూ వారం పాటు కాలు బయటపెట్టడానికి వీల్లేదు, ఫోన్లు వాడటానికి అస్సలు వీల్లేదు. -
ఇవి జియో బడ్జెట్ రీచార్జ్ ప్లాన్లు..
టారిఫ్ పెంపు తర్వాత జియో రీఛార్జ్ ప్లాన్లతో సంతృప్తి చెందని వారిలో మీరు కూడా ఉన్నట్లయితే వ్యాలిడిటీ, డేటా పరంగా అత్యధిక ప్రయోజనాలను అందించే మూడు ప్లాన్లను అందిస్తోంది. ఇవి అంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు కానప్పటికీ అపరిమిత 5జీ వంటి సేవలను అందిస్తాయి.రూ. 349 ప్లాన్ఇది 28 రోజుల చెల్లుబాటు అందిస్తుంది అపరిమిత 5G డేటా, రోజువారీ 2 GB పరిమితితో 4G డేటా లభిస్తాయి. ఈ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ సెల్యులార్ డేటాను ఎక్కువగా వినియోగించే వారికి ఇది ఉత్తమ నెలవారీ రీఛార్జ్ ఎంపిక.రూ. 749 ప్లాన్ఈ ప్లాన్ రోజుకు 2 GB 4G డేటాతో పాటు అపరిమిత 5G, కాలింగ్‌తో 72 రోజులు అంటే రెండున్నర నెలలకుపైగా వ్యాలిడిటీని అందిస్తుంది. అదనంగా ఇది మొత్తం చెల్లుబాటు వ్యవధికి అదనంగా 20 GB 4G డేటా వస్తుంది. ఇది 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఉపయోగకరమైన యాడ్-ఆన్.రూ. 3,599 ప్లాన్ఇది వార్షిక రీఛార్జ్ ప్లాన్. అపరిమిత 5G డేటా, 2.5 GB రోజువారీ 4G డేటాతో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. నెలకు కేవలం రూ. 276 ఖర్చుతో ఏడాది పొడవునా వ్యాలిడిటీ డేటా పరిమితుల గురించి చింతించకుండా ఒకేసారి రీఛార్జ్ చేయడానికి ఇష్టపడే వారికి ఈ ప్లాన్ అనువైనది. -
టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాలు వేరు అనేది స్పష్టమైందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బడ్జెట్ సందర్భంగా గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌తో బీహార్ ప్రయోజనం పొందిందని తెలిపారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది అంటూ ఆవేదన వ్యకం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో కేటాయిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. మహాకవి గురజాడ పేరును తలుచుకోవడం మనందరికీ గర్వకారణం. గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశ, నిస్పృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనమేమీ రాష్ట్రానికి కనిపించలేదు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది.కేంద్రంలో 12 మంది నితీష్ కుమార్ ఎంపీలు, 16 మంది టీడీపీ ఎంపీల సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. బడ్జెట్‌తో బీహార్ రాష్ట్రం ప్రయోజనం పొందింది. ఏపీకి ఎటువంటి ప్రయోజనం పొందలేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాల వేరు అనేది స్పష్టమైంది. 45.72 మీటర్లు నుంచి 41.15 మీటర్ల ఎత్తుకు కుదిస్తూ నిధులు కేటాయించడం బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది.మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము. పోలవరం ఎత్తు తగ్గించడం తీవ్ర అభ్యంతరకరం. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీని చంద్రబాబు తీసుకున్నారు. నేడు అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉండకూడదు. కూటమి పాలనలో కంటే వైఎస్ జగన్ పాలనలో జీడీపీ, వృద్ధిరేటు అభివృద్ధి ఎక్కువగా జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసు అన్నారు. ఎన్నికల తర్వాత డబ్బు సంపాదించడం ఎలాగో నా చెవిలో చెప్పాలని చంద్రబాబు చెప్పడం ధర్మమా.?స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోయారు. ప్లాంట్‌పై బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు. రైతుభరోసా, అమ్మఒడి ఇవ్వలేదు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కాదని ముందే వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. వైఎస్ జగన్ పాలనలో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అనేక సార్లు సంప్రదింపులు జరిపాము. వైఎస్ జగన్ వలనే ప్రైవేటీకరణ అగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి స్వయంగా చెప్పారు అని గుర్తు చేశారు. -
Union Budget 2025: కొత్త టెక్నాలజీలకు రాచబాట
కొత్త పరిశోధనలు, అభివృద్ధి కోసం శాస్త్ర–సాంకేతిక శాఖకు రూ.20 వేల కోట్లు భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా ‘డీప్ టెక్’ ఫండ్ ఆఫ్ ఫండ్స్న్యూఢిల్లీ: దేశంలో సరికొత్త టెక్నాలజీలకు రాచబాట వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రైవేటు రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలను ప్రకటించారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా శాస్త్ర, సాంకేతిక రంగానికి సంబంధించి వివిధ విభాగాలకు మొత్తంగా రూ. 55,679 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రోత్సాహం దేశంలో ప్రైవేటు రంగంలో భారీ ఎత్తున పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీప్ టెక్, సోలార్, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం తొలి విడతగా తాజా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా రూ.10 వేల కోట్లతో ‘డీప్ టెక్’ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పా టు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలతో ఆర్థిక వ్యవస్థ అనుసంధానాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ‘భారత్ ట్రేడ్ నెట్’ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన విభాగాలకు గణనీయంగా కేటాయింపులు.. ⇒ కార్పస్ ఫండ్‌కు ఉద్దేశించిన నిధులు సహా తాజా బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.28,508 కోట్లు కేటాయించారు. ⇒ బయోటెక్నాలజీ విభాగానికి ఈసారి రూ.3,446 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులు రూ.2,275 కోట్లతో పోలిస్తే.. రూ.1,171 కోట్లు అదనం. ఇక పారిశ్రామిక పరిశోధనల విభాగానికి రూ.6,657 కోట్లు ఇచ్చారు. ⇒ అణుశక్తి విభాగానికి గతంలో (రూ.24,968 కోట్లు) కన్నాస్వల్పంగా తగ్గించి రూ.24,049 కోట్లు కేటాయించారు. ⇒ అంతరిక్ష పరిశోధనల విభాగానికి రూ.13,416 కోట్లు కేటాయించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ సెంటర్లలో కొనసాగుతున్న స్పేస్ ఫ్లైట్, లాంచ్ వెహికల్, శాటిలైట్ ప్రాజెక్టుల కోసం రూ.10,230 కోట్లను కేటాయించారు. -
మెట్రో రెండో దశ.. నిరాశ!
పార్లమెంటులో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో నగరానికి ప్రాధాన్యం కాసింతే దక్కింది. హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశపై కేంద్రం ఊరించి ఉస్సూరుమనిపించింది. మెట్రోపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. మూసీ ఊసే లేదు. కాగా.. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభించింది. గిగ్‌వర్కర్స్‌కు ఆరోగ్య బీమా కల్పనతో గ్రేటర్లో 3 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర బడ్జెట్లో ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్‌తో హైదరాబాద్ నగరంలో చేపట్టే పనులకు ప్రయోజనం కలిగే అవకాశాలుండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలపై జీవిత కాల పన్ను మినహాయింపుతో గ్రేటర్లో ఈ– వాహనాల దూకుడు పెరగనుంది. అమృత్– 2.0 కింద హైదరాబాద్ సీవరేజీ ఎస్టీపీ ప్రాజెక్టులకు స్థానం దక్కినట్లు తెలుస్తోంది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశపై కేంద్రం ఊరించి ఉస్సూరుమనిపించింది. శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండో దశ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గత బడ్జెట్లో చెన్నై మెట్రో విస్తరణకు నిధులు కేటాయించారు. ఈసారి అదే తరహాలో హైదరాబాద్‌కు నిధుల కేటాయింపుతో పాటు అనుమతులు కూడా లభించవచ్చని నగరవాసులు ఆశించారు. కానీ.. కనీసం మెట్రోపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు మెట్రోరైల్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం 74.6 కిలోమీటర్ల కారిడార్లతో డీపీఆర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. అనంతరం ఫోర్త్త్సిటీ, నార్త్‌సిటీ ప్రాజెక్టులను కూడా రెండో దశలో భాగంగా చేర్చి సుమారు 161.4 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. మొదటి ఐదు కారిడార్లకు సుమారు రూ.24 వేల కోట్లకు పైగా అంచనాలు సిద్ధం చేశారు.కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం సావరిన్ గ్యారంటీతో పాటు రూ. 4230 కోట్లు తన వాటాగా కేటాయించవలసి ఉంది. కానీ రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. నిధులు కూడా కేటాయించలేదు.కేంద్రం వైఖరి పట్ల కాంగ్రెస్ వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చెన్నైకు అడగకుండానే నిధులు కేటాంచిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో తీవ్రమైన వివక్షను చూపుతుందని పేర్కొంటున్నాయి.బడ్జెట్లోనే ప్రస్తావించాల్సిన అవసరం లేదు... మరోవైపు మెట్రోపైన బడ్జెట్లోనే ప్రస్తావించాల్సిన అవసరం లేదని, కేంద్రం విడిగా కూడా ప్రకటన చేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే నిధులు సైతం ఆటోమేటిక్‌గా విడుదలవుతాయని పేర్కొంటున్నారు. మెట్రో రెండోదశకు నిధుల కొరత ఎట్టిపరిస్థితుల్లోనూ సమస్య కాదని, సావరిన్ గ్యారంటీ లభించడమే ప్రధానమని మెట్రోరైల్ అధికారి ఒకరు చెప్పారు. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లపై ఆశలు కేంద్ర బడ్జెట్లో సుమారు 50 వేల ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింగరింగ్ ల్యాబ్ (ఏటీఎల్)లను ఏర్పాటు ప్రకటన ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 40 పాఠశాలలో టింకరింగ్ ల్యాబ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ల్యాబ్‌ల మంజూరుతో మహా నగర పరిధిలో మరో 50 వరకు వచ్చే అవకాశాలున్నట్లు విద్యాశాఖ అంచనా వేస్తోంది గిగ్‌వర్కర్స్‌కు ఆరోగ్య బీమా గ్రేటర్లో 3 లక్షల మందికి పైగా ప్రయోజనం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే గిగ్‌వర్కర్స్‌కు కేంద్రం తాజా బడ్జెట్లో ఆరోగ్యబీమా సదుపాయాన్ని కలి్పంచింది. పీఎం జన్ ఆరోగ్యయోజన పథకంలో భాగంగా ఈ సదుపాయం లభించనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ యాప్ ఆధారిత సేవలను అందజేస్తున్న సుమారు 3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఓలా, ఉబెర్, రాపిడో వంటి క్యాబ్‌లు నడిపే డ్రైవర్లతో పాటు స్విగ్గి, జొమోటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్ర వంటి పలు యాప్ ఆధారిత డెలివరీబాయ్స్‌కు ఈ పథకం వర్తించనుంది. ఆరోగ్యబీమా పథకం కోసం తాము చేపట్టిన ఉద్యమానికి కేంద్రం నుంచి స్పందన లభించిందని ఫోర్స్వీలర్డ్రైవర్స్, గిగ్రవర్కర్స్ యూనియన్ ప్రతినిధి సలావుద్దీన్ తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊతం కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభించింది. ఎంఎస్ఎంఈలకు రుణాలు రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు, స్టార్టప్‌లకు రుణాలను రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల పెంపు పట్ల ఆశలు చిగిరిస్తున్నాయి. మహా నగర పరిధిలో సుమారు 55 వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ప్రధానంగా నగర పరిధిలో సనత్‌నగర్, ఆజామాబాద్, చందూలాల్ బారాదరి పారిశ్రామిక వాడలు ఉండగా, శివార్లలో ఉప్పల్, మౌలాలి, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, గాం«దీనగర్, బాలానగర్, పటాన్చెరు, వనస్థలిపురం తదితర పారిశ్రామిక వాడల్లో పెద్దసంఖ్యలో స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు విస్తరించి ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు మూడు లక్షల మంది వరకు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రుణ పరిమితి పెంపు హర్షణీయమే: జహంగీర్, బాలానగర్ స్మాల్ స్కేల్ ఇండ్రస్టీస్, బాలానగర్ రుణాల పరిమితి పెంపు హర్షణీయం. ఇది చిన్నతరహా పరిశ్రమలకు ఎంతో ఊతం ఇస్తోంది. కానీ.. ఎలాంటి చిక్కులు లేకుండా రుణ పరిమితి పెంపు అమలు చేయాల్సి అవసరం ఉంది. గతంలో పరిశ్రమరంగ సంక్షోభ సమయంలో సవాలక్ష కొర్రీలతో మొక్కుబడిగా రుణాలు అందించి చేతులు దులుపుకొన్నారు. అలాంటి ఘనలు పునరావృత్తం కాకుండా రుణ పరిమితి పెంపు అమలు చేయాలి.18 లక్షల మంది వేతన జీవులకు ఊరట కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్ మహా నగరంలో సుమారు 18 లక్షల మంది వేతన జీవులకు లబ్ధి చేకూర నుంది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ రూ.12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి పన్ను నుంచి మినహాయింపు లభించింది. ఆపై ఆదాయం ఉంటే మాత్రం రూ.0 నుంచి రూ.4 లక్షలు ఆదాయం ఉంటే రూపాయి కట్టనక్కర్లేదు. రూ.4–రూ.8 లక్షల ఆదాయం మీద 5 శాతం, రూ.8–రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.12–రూ.16 లక్షల ఇన్‌కమ్‌పై 15 శాతం, రూ.16 నుంచి రూ.20 లక్షల ఇన్కమ్ మీద 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల ఆదాయంపై 25 శాతం.. రూ.24 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన వారికి 30 శాతం ట్యాక్స్ విధిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రిబేట్ రూపంలో పలు శ్లాబ్‌ల వారికి డబ్బులు రిటర్న్ వస్తాయి. అయితే.. ప్రభుత్వ ఉద్యోగుల మాత్రం దీనిపై పెదవి విరిస్తున్నారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా ఆదాయ పన్ను శ్లాబ్ ఉందని హైదరాబాద్ టీజీఓ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ అన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి భారీ ఊరట అనడం తగదన్నారు. -
నిధుల్లో మేజర్
న్యూఢిల్లీ :గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.ఆధునీకరణ కోసం.. మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్‌యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లుదేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.డీఆర్డీవోకు రూ.26,817 కోట్లు..కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)’కు ఈ బడ్జెట్లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ⇒ మొత్తం బడ్జెట్లో 13.45%⇒ మన దేశ జీడీపీలో 1.91%⇒ ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు⇒ వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు) -
బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన ఇదే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ప్రముఖులు వివిధ మాధ్యమాల్లో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో మద్దతు ఇవ్వడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తే, సామాన్యులకు బడ్జెట్లో పన్ను శ్లాబ్‌లను సవరించి మేలు చేశారని, తద్వారా వారి ఆదాయాలు పెంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు బడ్జెట్‌పై ఎలా స్పందిస్తున్నారో కింద తెలుసుకుందాం.ఆదాయంలో పెరుగుదల -ఆశిష్‌కుమార్ చౌహాన్, ఎండీ అండ్ సీఈఓ ఎన్ఎస్ఈబలమైన అభివృద్ధి చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, తగ్గిన పన్ను భారంతో భారతదేశ వృద్ధి ఊపందుకుంటుంది. ఆదాయంలో పెరుగుదలను, వినియోగ వృద్ధిని పెంచుతుంది. భారతీయ కుటుంబాలకు మరింత సంపద సృష్టి అవకాశాలను అందిస్తుంది. ప్రస్తుతం 11 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారుల సమూహంలో మరింత ఎక్కువ మంది చేరుతారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో వాటాదారులు అవుతారు. తద్వారా ఆర్థిక వృద్ధి, మూలధన నిర్మాణానికి కృషి చేస్తారు.వినియోగదారుల చేతిలో మరింత ఆదాయం- డాక్టర్ అనీష్ షా, మహీంద్రా గ్రూప్ ఎండీ.పన్ను నిర్మాణంలో మార్పుల ద్వారా 2025 బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నాం. భారతీయ వినియోగదారుల చేతిలో మరింత ఆదాయాన్ని ఉంచడం మంచి విషయం. ఇది ప్రైవేట్ సెక్టార్ మూలధన వ్యయం సానుకూల దిశలో పయనించడానికి ప్రోత్సహిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. భారతదేశం తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. వృద్ధికి తక్షణ ఉద్దీపన అందించడంతో పాటు, బడ్జెట్ గణనీయమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధితో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. పునాదులు వేస్తోంది.వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి- ప్రశాంత్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, యస్ బ్యాంక్మెరుగైన ఆర్థిక వ్యవస్థకు వేదికగా బడ్జెట్‌ను మార్చారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పాదరక్షలు, తోలు, బొమ్మలు, ఆహార ప్రాసెసింగ్ వంటి విభాగాలకు బడ్జెట్లో ప్రోత్సాహం అందించారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపరిచే మార్గాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా తగిన అవకాశాలను అందించినట్లయింది. మరింత స్థిరమైన పన్నుల విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడానికి, తద్వారా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.బడ్జెట్ బూస్టర్- కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓకేంద్ర బడ్జెట్ 2025-26 స్వయం సమృద్ధి, వికసిత్ భారత్‌కు సరైన బూస్టర్‌ను అందిస్తుంది. మధ్యతరగతికి గణనీయమైన పన్ను ఉపశమనం, క్రమబద్ధీకరించిన టీడీఎస్ నిబంధనలు, స్థానిక తయారీకి బలమైన ప్రోత్సాహంతో ఈ బడ్జెట్ వినియోగదారుల చేతుల్లో ఎక్కువ ఆదాయాన్ని ఉంచుతుంది. వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అధికం చేస్తుంది. ఎంఎస్ఎంఈల వృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల స్థానిక వ్యాపారాలు బలోపేతం కావడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్థానిక తయారీని మెరుగుపరచడానికి, దేశం అంతటా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, సాంకేతికతను ఉపయోగించడానికి బడ్జెట్ తోడ్పడుతుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్అదనంగా 75 వేల వైద్య సీట్లు- డా.మల్లికార్జున, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీకేంద్రబడ్జెట్ 2025లో ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాల కోసం ఎక్కువ కేటాయింపులు జరపడం సంతోషంగా ఉంది. 75 వేల వైద్య సీట్లను అదనంగా జోడించడంతో ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. చాలా వరకు ఇతర దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే విధానాన్ని కొంత కట్టడి చేసినట్లవుతుంది. చాలా క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మేలు జరుగుతుంది. అంగన్వాడీలకు మూలధన వ్యయాన్ని పెంచారు. -
డిప్యూటి సీఎం పవనన్ను ఉద్దేశించి రోజా ట్వీట్
-
బడ్జెట్లో వ్యవసాయానికి ఊతం రైతులకు శుభవార్త
-
పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చట్టాలలో కీలక మార్పులు
-
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి: Nirmala Sitharaman
-
బడ్జెట్ వేళ.. పద్మశ్రీ గ్రహీత ఇచ్చిన చీరలో నిర్మలమ్మ
-
భారత్‌పై అన్ని దేశాల కన్ను
-
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
బడ్జెట్‌పై ఏపీ భారీ ఆశలు
-
బడ్జెట్ లో ఏపీకి ఊరట దక్కనుందా?
-
బడ్జెట్ రెడీ.. ఊరటనిస్తారా? ఉసూరుమనిపిస్తారా? (చిత్రాలు)
-
ఎనిమిది బడ్జెట్లు: ఎనిమిది రంగుల చీరలు
-
సొంత ఆదాయంలో రాష్ట్రం టాప్!
సాక్షి, హైదరాబాద్: సొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణ దూసుకుపోతోందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25 వెల్లడించింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో వసూలవుతున్న పన్నుల్లో సగం కంటే ఎక్కువ మొత్తం సొంత పన్నుల( Own Tax Revenue) ద్వారానే వస్తోందని.. అందులో అత్యధికంగా తెలంగాణలో సొంత పన్నుల రాబడి 88శాతంగా ఉందని తెలిపింది. కర్ణాటక, హరియాణా రాష్ట్రాలు 86 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.శుక్రవారం ప్రారంభమైన లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సర్వే ప్రకారం.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా అంశాల్లో ముందంజలో ఉందని వెల్లడైంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ హబ్‌గా మారిందని.. కర్ణాటక, మహారాష్ట్రలతో పోటీగా ఇక్కడ రియల్ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందుతోందని ఈ సర్వే తెలిపింది.రాష్ట్రంలో 100శాతం గ్రామాలకు రక్షిత మంచినీరు అందుతోందని, 86 శాతం సాగుయోగ్యమైన భూములకు నీటి సౌకర్యం ఉందని పేర్కొంది. సామాజిక, ఆర్థిక సర్వే (2024–25)లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విశేషాలివీ.. ⇒ ఎగుమతుల పెంపు కోణంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ–కామర్స్ మార్కెట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక విధానం ఈ–కామర్స్ వ్యా ప్తికి ఇతోధికంగా దోహదపడనుంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్‌లో అమ్మకపు సంస్థల ప్రాతినిధ్యాన్ని పెంచేదిగా ఉంది. ⇒ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు దేశంలోని 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు (17శాతం) మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 2024 నవంబర్ 26 నాటికి ఈ పథకం కింద మరో 12.06 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతోంది. ప్రస్తుతం దేశంలోని 79.1 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు చేరుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు 100 శాతం గ్రామీణ కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ఒకటి. ⇒ ఇస్రో చేపట్టిన అనేక భౌగోళిక వేదికల ద్వారా గ్రామీణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, న్యాయ, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా రంగాల్లో సామర్థ్యం పెరగడంతోపాటు ఆయా రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తోన్న పురోగతిని తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో భువన్ వేదిక ద్వారా వెబ్‌జీఐఎస్ పోర్టల్‌తో ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా నిర్వహణ సాధ్యమవుతోంది. ⇒ ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్ ఉత్పత్తి అత్యధికంగా జరుగుతోంది మన దేశంలోనే. మన దేశంలోని రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే 87 శాతం సిమెంట్ పరిశ్రమలున్నాయి. ⇒ రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో సేవల రంగం గణనీయ పాత్ర పోషిస్తోంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటకల్లోని సేవల రంగం వాటా దేశంలోని అన్ని రాష్ట్రాల వాటాలో 25 శాతాన్ని మించుతోంది. తెలంగాణలో స్థూల ఉత్పత్తిలో సేవల రంగం వాటా 6 శాతంగా నమోదైంది. దేశంలో ఈ రంగంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. ⇒ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవల రంగాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, తమిళనాడు ముందంజలో ఉన్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై నగరాల్లో ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. ఆయా నగరాల్లో ఐటీ, ఫిన్‌టెక్ సేవల విస్తృతి కారణంగా ఆఫీసు, నివాస స్థలాల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ⇒ కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు సర్విసుల రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. పారిశ్రామిక అభివృద్ధిలో ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కేంద్రంగా ముందుకెళుతుండటమే ఇందుకు కారణం. ⇒ సామూహిక అభ్యాస కార్యక్రమాల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ మోడల్ విద్య కొనసాగుతోంది. తద్వారా తక్కు వ సంఖ్యలో ఉండే సమూహాలు అభ్యసనం, బో ధన తదితర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి.కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ సర్విసుల విస్తృతి గణనీయంగా ఉంది. వాణిజ్య సేవల రంగమైన ఐటీ రంగమే తెలంగాణ తలసరి ఆదాయ వాటాలోనూ సింహభాగం నమోదు చేస్తోంది.మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ హబ్‌గా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఇందుకు దీర్ఘకాలికంగా దోహదపడనుంది. దేశంలోనే మహిళా పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ రాష్ట్రంగా తెలంగాణ రూపొందింది.2016–21 మధ్య దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం బాగా పెరిగింది. పంజాబ్ (98శాతం), హరియాణా (94), తెలంగాణ (86), ఉత్తరప్రదేశ్ (84శాతం)లలో సాగుయోగ్యమైన భూములకు ఎక్కువగా నీటి సౌకర్యం అందుతోంది. -
ప్రాజెక్టులకు మధ్యంతర నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులతో ప్రమేయం లేకుండా, పనుల వేగాన్ని బేరీజు వేసుకుంటూ కేంద్రం అప్పటికప్పుడు నిధులు కేటాయిస్తోంది. ఈసారి కూడా అదే పంథాను అవలంబించే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్లో కొత్త రైళ్ల ప్రకటనపై అంతగా దృష్టి సారించని కేంద్రం, కొత్త లైన్లను పూర్తి చేయడానికే ప్రాధాన్యమిస్తోంది. కొత్త రైళ్లను మాత్రం వీలు చిక్కినప్పుడు ప్రారంభిస్తోంది. గత బడ్జెట్లో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను ఆ తర్వాత ఉన్న ఫళంగా పెంచింది. దీంతో ఆ ప్రాజెక్టుల్లో పనులు వేగంగా జరిగేందుకు అవకాశం చిక్కింది. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా, ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టుల నిధులను పెంచింది. అలా జోన్‌కు అదనంగా రూ.1350.26 కోట్ల మేర నిధులు అందాయి. ముఖ్యంగా, అతి కీలక మూడో లైన్ నిర్మాణ పనులకు కేటాయింపులు పెంచింది. కాజీపేట–బల్లార్షా పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కాజీపేట–విజయవాడ మూడోలైన్ పనుల్లో దాదాపు 100 కి.మీ. పనులు చేయాల్సి ఉంది.వీటి వేగం పెంచటం ద్వారా, ఆ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు దానికి రూ.190 కోట్లను అదనంగా కేటాయించింది. బడ్జెట్లో రూ.310 కోట్లు ప్రతిపాదించగా, ఆ తర్వాత దాన్ని రూ.500 కోట్లకు పెంచింది. ఫలితంగా ఈ ఏడాది కాలంలో ఏకంగా 60 కి.మీ. మేర మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. ఇందులో 40 కి.మీ.కు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ పూర్తి చేసి పచ్చజెండా ఊపటంతో అంతమేర ట్రాక్‌పై రైళ్లను కూడా తిప్పుతున్నారు. మిగతా 20 కి.మీ. పనులకు సంబంధించి సేఫ్టీ కమిషనర్ తనిఖీ జరగాల్సి ఉంది. ఈసారి కేటాయింపులు వేటికి? డోన్–అకోలా డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మన రాష్ట్రంలో నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తికాగా, మిగతా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. గత బడ్జెట్లో ఈ పనులకు రూ.220 కోట్లు ప్రతిపాదించగా, తర్వాత దాన్ని ఏకంగా రూ.550 కోట్లకు పెంచారు. దీంతో గత ఏడాది కాలంలో 45 కి.మీ. డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో వికారాబాద్–కృష్ణా లైన్‌పై విన్నపాలు వచ్చాయి. దీనికి ఈసారి కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. రామగుండం–మణుగూరు, సికింద్రాబాద్–వాడీ మూడు, నాలుగు లైన్లకు నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. -
బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే
2020: కొత్త ట్యాక్స్ స్లాబులతో పన్ను రేట్లలో మార్పులు జరిగినా, పరిశ్రమ వర్గాలకు అనువైన నిర్ణయాలేవీ బడ్జెట్ లో లేకపోవడం సెంటిమెంట్ ను దెబ్బతీసి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది.2021: ఇది పూర్తిగా విభిన్న బడ్జెట్. కోవిడ్ తొలిదశ ప్రభావంతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీస్థాయిలో మౌలిక రంగ కేటాయింపులు జరిగాయి. స్టార్ట్ అప్ లకు ట్యాక్స్ హాలిడేలు వంటి వృద్ధి ప్రేరక చర్యలతో మార్కెట్ ఆనందానికి అవధులు లేవు. దీంతో సెన్సెక్స్ బడ్జెట్ రోజున ఏకంగా 2314 పాయింట్లు పెరిగింది. గత రెండు దశాబ్దాల స్టాక్ మార్కెట్ బడ్జెట్ డే చరిత్రలో ఇది అత్యుత్తమంగా నిలిచిపోయింది.2022: ఇది కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో సెన్సెక్స్ 849 పాయింట్లు పెరిగింది. 2023: ఈ బడ్జెట్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా ఆరోజు సెన్సెక్స్ ఒకదశలో 1100 పాయింట్లు పెరిగినా చివరకు 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.2024: మూలధన లాభాలపై అధిక పన్ను విధించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1 శాతం పడిపోయింది.బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఇలా చేయండి⇒ బడ్జెట్ రోజున మార్కెట్లో హెచ్చుతగ్గులు భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటుతో వ్యవహరించకండి.⇒ట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయండి. సాధ్యమైనంత వరకు ఒకట్రెండు రోజులు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మంచిది.⇒బడ్జెట్ అనంతరం నిపుణుల/విశ్లేషకుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్కెట్లో కదలికలు సాగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏం చెబుతున్నారో ఆలకించండి.⇒ బడ్జెట్ రోజు ట్రెండ్ ను అంచనా వేయడం చాలా కష్టం. పెరుగుతున్నాయి అనుకునే లోపే సూచీలు పడిపోతాయి. పడిపోతున్నాయి అనుకునే లోపే పైకి ఎగసిపోతాయి. మీకు మార్కెట్లో అనుభవం లేకపోతే బడ్జెట్ రోజు ట్రేడింగ్ చేయకండి. లాభాల మాట అటుంచి భారీ నష్టాలు కళ్లచూడాల్సి వస్తుంది.⇒ బడ్జెట్ లో ఏయే రంగాలకు ఏమేరకు కేటాయింపులు జరిగాయో సమగ్రంగా గ్రహించండి. తదనుగుణంగా సంబంధిత రంగాలకు చెందిన షేర్లపై దృష్టి పెట్టండి.⇒అనాలోచిత నిర్ణయాలతో, గుడ్డిగా షేర్లు కొనేయకండి.-బెహరా శ్రీనివాస రావు మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
బడ్జెట్: మార్కెట్లకు జోష్ ఇస్తేనే...!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే మరో బడ్జెట్ వెలుగు చూసేది రేపే. ఈ బడ్జెట్ పై ఇప్పటికే గణనీయమైన అంచనాలున్నాయి. ఇదొక విప్లవాత్మకమైన బడ్జెట్ అవుతుందనే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 13 నెలలుగా ఎడతెరిపి లేకుండా షేర్లను అమ్ముకుంటూ మన మార్కెట్ కు చుక్కలు చూపిస్తున్న విదేశీ మదుపర్లు.. ఈసారి బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. గత జనవరి నుంచి చూస్తే ఈ జనవరి చివరికి వీళ్ళు దాదాపు రూ. 3.80 లక్షల కోట్ల షేర్లను విక్రయించి మన మార్కెట్ కు గట్టి నష్టాన్నే కలిగించారు.వీళ్ళ పయనం ఇదేమాదిరి కొనసాగకూడదంటే ఆర్ధిక మంత్రి మార్కెట్ ఫోకస్ తో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను వెలువరించాల్సి ఉంటుంది. 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.3-6.8% నమోదుకావొచ్చని అంచనా. ప్రపంచ అస్థిర, అనిశ్చిత వాతావరణంతో మన ఆర్ధిక వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతోంది. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వం ఒత్తిడిలో ఉందన్న విషయం ఇది చెప్పకనే చెబుతోంది.ఈనేపథ్యలో స్టాక్ మార్కెట్ విశ్వాసాన్ని పెంచే, ఇన్వెస్టర్ల మనసు చూరగొనే అంశాలపై ఈసారి బడ్జెట్ లో దృష్టి సారించాల్సిందే. గత నాలుగు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ నడుస్తోంది. దానికి తోడు శుక్రవారం వెలువడ్డ ఆర్ధిక సర్వే మార్కెట్ కు ఉత్సాహాన్నే ఇచ్చింది. దీన్ని నిజం చేస్తూ బడ్జెట్ సాగాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ సెంటిమెంట్ ను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందా... నివ్వెరపరుస్తుందా? అన్నది రేపు ఎటూ తేలిపోతుంది.⇒ పన్నుల విధానంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మార్కెట్ వర్గాలు గట్టిగానే పట్టుబడుతున్నాయి.⇒ దీర్ఘ కాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో సమూల మార్పులు తీసుకు రావాలని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక లాభాలు అనేవి మూడేళ్లకు పైబడితేనే పన్నురహితంగా ఉంటున్నాయి. అలాగే డివిడెండ్లను కూడా మామూలు ఆదాయంగానే పరిగణించి పన్ను విధిస్తున్నారు. ఇలా చేయడం రెండుసార్లు పన్ను విధించడమే అవుతుందని, డివిడెండ్ ఆదాయాన్ని పన్నులనుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.⇒ షేర్ల లావాదేవీలపై విధించే పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ లావాదేవీల పన్నును ప్రస్తుతమున్న 0.625% నుంచి తగ్గిస్తే డెరివేటివ్స్ లావాదేవీలు ఊపందుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరే మార్గాల్లో ఇదొకటి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎంతవరకు పాజిటివ్ గా స్పందిస్తుంది అన్నది సందేహమే.⇒ ఈ రెండూ జరిగితే మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో లిక్విడిటీ పెరిగి రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులతో ముందుకొస్తారు.⇒ మరోపక్క మౌలిక రంగానికి కేటాయించే నిధులు మార్కెట్ కు ఉత్సాహాన్ని ఇస్తాయి. రోడ్లు, రైల్వేలు , రక్షణ రంగాలకు కేటాయింపులు పెంచితే సదరు నిధులు వినియోగాన్ని విస్తృతం చేస్తుంది. ముఖ్యంగా సిమెంట్, నిర్మాణ రంగాల్లో వినియోగం పెరగడం ద్వారా ఆయా రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతుంది.⇒ ఇక తయారీ, వ్యవసాయం, విద్యుత్ వాహనాలు వంటి రంగాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడం, పాలసీ పరంగా సంస్కరణలు తీసుకురావడం ప్రధానం. విధానపరమైన నిర్ణయాలు సంబంధిత రంగాల షేర్లపై మదుపరులకు మక్కువ పెంచుతాయి. తద్వారా తయారీ రంగంలో సెంటిమెంట్ పెరుగుతుంది.⇒ సబ్సిడీలు లేదా సంస్కరణలు వ్యవసాయ, అగ్రి బిజినెస్ రంగంలో కొత్త మార్పులను తీసుకొచ్చి ఆ రంగాల్లో డిమాండ్ పెంచుతాయి. దీర్ఘ కాలిక వృద్ధికి ప్రోత్సాహమిచ్చే ఇటువంటి చర్యలకు మార్కెట్లు ఆటోమేటిక్ గానే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి.భారత ఆర్ధిక రంగానికి సంబంధించినంతవరకు బడ్జెట్ అనేది ఒక ప్రధాన సంఘటన. పన్ను సంస్కరణలు, రాబడులు, వ్యయాలు, ఆయా రంగాలకు కేటాయింపులు, విధానపరమైన నిర్ణయాలు, అనుకూల/ప్రతికూల అంశాలు.. ఇత్యాది అంశాల సమాహారమే బడ్జెట్. మార్కెట్ వర్గాలకు బడ్జెట్ రుచించకపోతే భారీగా పడగొట్టేస్తారు. నచ్చిందా నెత్తిన పెట్టుకుంటారు. ప్రస్తుతం గత రెండు, మూడు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ కనిపిస్తోంది. తాజా బడ్జెట్ అంచనాలను చేరుకోకపోతే మాత్రం దాని పరిణామాలు మామూలుగా ఉండవు.ఇప్పటికే నిక్కు నీలుగుతున్న మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం. దూరమవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఎంత చేటు చేయాలో అంతా చేసేస్తారు. అదే సమయంలో చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రాలేని పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా పడిపోయే మార్కెట్లు దేశ ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తాయి. ఆర్ధిక మంత్రికి ఈవిషయాలన్నీ తెలియనివి ఏమీ కావు. అందరినీ మెప్పించే నిర్ణయాలతోనే ముందుకెళ్తారని ఆశిద్దాం. కొద్ది గంటలు ఓపిక పట్టి చూద్దాం... ఏం జరుగుతుందో... -
బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.ఇదీ చదవండి: బడ్జెట్లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. -
టీమ్ సీతారామన్... బడ్జెట్ మే ‘సవాల్’!
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.4 శాతానికి తగ్గుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే చెబుతున్నాయి. ప్రజల వినిమయం తగ్గిపోవడం, ప్రైవేటు పెట్టుబడుల్లో స్తబ్దత, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు మోదీ సర్కారుకు కత్తిమీద సాముగా మారాయి. రూపాయి పాతాళానికి నిచ్చెనేసినట్లు జారిపోతోంది. తాజాగా డాలర్‌తో దేశీ కరెన్సీ మారకం విలువ 86.7 జీవిత కాల కనిష్టానికి క్రాష్ అయ్యింది. మరోపక్క, అమెరికా ఆధ్యక్ష పీఠమెక్కిన ట్రంప్... చాలా దేశాలతో పాటు మన మెడపైనా సుంకాల కత్తి పెట్టడంతో టారిఫ్ వార్ 2.0కు తెరలేచింది. దీంతో మన ఎగుమతులకు గడ్డుకాలం తప్పేలా లేదు. ఇంటాబయటా ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.50 లక్షల కోట్లకు మించిన బడ్జెట్‌ను రెడీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండానే ప్రగతిని పట్టాలెక్కించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఈ నేపథ్యంలో 140 కోట్లకు పైగా దేశ ప్రజల కోసం సీతారామన్ అండ్ టీమ్ తయారు చేసిన ఈ బడ్జెట్ నలభీమ పాకాన్ని అలుపెరగకుండా వండివార్చిన ఉద్ధండ అధికారుల సంగతేంటో చూద్దాం...ఎం. నాగరాజుఆర్థిక సేవల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి ఆయన. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితుల పెంపు వంటి సంస్కరణలకు రోడ్‌మ్యాప్ రూపొందించడం, అంతకంతకూ పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడం, బ్యాంకింగ్ రంగానికి మరింత ఆర్థిక జవసత్వాలను అందించడంపై బడ్జెట్లో ఫోకస్ చేశారు.తుహిన్ కాంత పాండే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ అధికారి. ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019లో దీపమ్ (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి దేశ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దీపమ్ సెక్రటరీగా ఎయిరిండియా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల డివిడెండ్ పాలసీ వంటి కీలక చర్యలు చేపట్టి దమ్మున్న అధికారిగా పేరు దక్కించుకున్నారు. దీపమ్ సెక్రటరీగా రాకముందు ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో పని చేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్ఐడీఓ) ప్రాంతీయ కార్యాలయంలో కూడా సేవలందించారు. వి. అనంత నాగేశ్వరన్2022లో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమితులయ్యారు. మోదీ 3.0లోనూ కొనసాగుతుండటం ఆయన దీక్షాదక్షతలకు నిదర్శనం. 2025–26 కేంద్ర బడ్జెట్‌కు ముందు వరుసగా మూడోసారి ఆర్థిక సర్వేను రూపొందించారు. ఆర్థికాంశాల బోధనతో పాటు క్రెడిట్ సూసే గ్రూప్ ఏజీ, జూలియస్ బేయర్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా గతంలో పనిచేశారు. నేడు పార్లమెంట్‌కు సమరి్పంచనున్న ఆర్థిక సర్వేలో నాగేశ్వరన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను కళ్లకు కట్టడంతో పాటు 2047 నాటికి వికశిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలిపేందుకు అవసరమైన కీలక సూచనలను కూడా పొందుపరిచడానికి తీవ్రంగా శ్రమించారు. అజయ్ సేథ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. 2021 నుంచి నాలుగు దఫాలుగా బడ్జెట్ రూపకల్పన జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖలో రెండో సీనియర్ అధికారిగా ఆయన నేతృత్వంలోనే వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ మొత్తం బడ్జెట్ ప్రక్రియకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆయన సారథ్యంలో బడ్జెట్ విభాగం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, రుణ సమీకరణ మధ్య సమతూకంతో బ్యాలెన్స్ షీట్‌కు తుదిమెరుగులు దిద్దింది. భారతదేశంలో తొలి సార్వ¿ౌమ గ్రీన్ బాండ్స్ జారీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ఏర్పాటు వంటి సాహసోపేతమైన చర్యల అమలు ఘనత సేథ్ సొంతం. ద్రవ్యలోటును ప్రభుత్వ లక్ష్యమైన 4.5 శాతం దిగువన కట్టడి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయడంతో పాటు జీడీపీతో పోలిస్తే ప్రభుత్వ రుణ నిష్పత్తి విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడం రానున్న బడ్జెట్లో ఆయన ప్రధాన అజెండాగా మారింది.మనోజ్ గోవిల్1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన గోవిల్... మోదీ 3.0లో 2024 ఆగస్టులో కేంద్ర వ్యయ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మొదటిసారి భాగస్వామ్యం వహిస్తున్నారు. రూపాయి ఘోరంగా పడిపోతున్న తరుణంలో బడ్జెట్లో సబ్సిడీలకు సంబంధించి అంచనాలు, కేటాయింపుల వంటి కఠిన వ్యవహరాలపై కఠోరంగా శ్రమించారు.అరుణీశ్ చావ్లా దీపమ్, ప్రభత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) కార్యదర్శిగా 2024 డిసెంబర్లో చార్జ్ తీసుకున్నారు. 1992 బ్యాచ్ బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన చావ్లా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పొందిన చావ్లాకు 2014 నుంచి వ్యయాల విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, పీఎస్‌యూలకు చెందిన నిరుపయోగ ఆస్తుల విక్రయం, పీఎస్‌యూల కార్యకపాలాలను గాడిలో పెట్టి, మరింత బలోపేతం చేయడం వంటి వాటిపై బడ్జెట్లో ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. -
మము బ్రోవమని...
సామాన్యుడు.. ఏంటో ఎన్ని బడ్జెట్లు వచ్చినా.. దేశంలో వీడు మాత్రం ఎప్పుడూ సామాన్యుడిగానే మిగిలిపోతున్నాడు.. ఆకాశాన్నంటే ధరలతో.. వాటితో ఏ మాత్రం పొంతన కుదరని వేతనాలతో కుటుంబ బడ్జెట్‌ను కంట్రోల్ చేయలేక.. కిందా మీదా పడుతూనే ఉన్నాడు. మళ్లా బడ్జెట్ వస్తోంది. పరిశ్రమలకు చెందిన పెద్ద పెద్దోళ్లంతా అవి కావాలి.. ఇవి కావాలి అని అడుగుతున్నారు. సామాన్యుడూ వినతుల చిట్టాను విప్పాడు.నను బ్రోవమంటున్నాడు.. ‘సీత’మ్మ తల్లీ.. తన మొర వింటావా మరి..1. ధరలకు కళ్లెం వేయాలి..కూరగాయలు, నూనెలు, పప్పులు, పాలు.. ఇలా నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కిపోయాయి. దీంతో జేబుకు మరింత చిల్లు పడుతోంది. ముందు ముందు మరింతగా ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు కూడా చెబుతున్నాయి. పామాయిల్ ధర పెరగడం వల్ల బిస్కట్లు లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ రేట్లూ పెరిగాయి. ఈ క్రమంలో ధరా భారం నుంచి ఉపశమనం కల్పించాలి. నూనెలపై దిగుమతి పన్ను తగ్గించడంతోపాటు ఇతర నిత్యావసరాల ధరల కట్టడికి చర్యలు ప్రకటించాలి. – సాక్షి సెంట్రల్ డెస్క్2. వేతనాల్లో వేగం పెంచాలి..ధరలు అలా ఉంటే.. జీతాల పెరుగుదల నత్తనడకను తలపిస్తోంది. జూనియర్ల నుంచి మధ్యస్థాయి ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగంలోని కార్మికుల వేతనాల పరిస్థితీ ఇలాగే ఉంది. ఫిక్కీ, స్టాఫ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ గణాంకాల ప్రకారం... గత 12 నెలల్లో అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు కేవలం 3.4 శాతం, ఉద్యోగుల జీతాలు 6.5 శాతం పెరిగాయి. ఇంజనీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రా ఉద్యోగుల వేతనాలు 0.8శాతమే పెరిగాయి. ఈ క్రమంలో వేతనాల పెరుగుదలకు తోడ్పడేలా బడ్జెట్లో చర్యలు ఉండాలి.3.ఉద్యోగ అవకాశాలు పెరగాలికరోనా సమయంలో పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి.. చాలా మంది వ్యవసాయం వైపు మళ్లినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. కానీ అక్కడా సరైన ఆదాయం లేక, తిరిగి ఉద్యోగం చేయడానికి సిద్ధమైనా... అవకాశాలు లభించని పరిస్థితి ఉంది. అదే సమయంలో చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు మరెందరో ఉన్నా రు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంతోపాటు ప్రైవేటు రంగంలో పెట్టుబ డులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది. 4.పన్నుల మోత తగ్గించాలితక్కువ, మధ్యస్థాయి ఆదాయ వర్గాలపై పన్నుల భారం ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా వంట నూనెలపై పన్నుల తగ్గింపు, పెట్రోల్, డీజిల్‌ల ధరల నుంచి ఉపశమనం కల్పించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినవస్తోంది. అదే సమయంలో వ్యక్తిగత ఆదాయ పన్నులో మినహాయింపులు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ చర్యలతో మా జీవన ప్రమాణాలు పెరిగేందుకు వీలవుతుంది.ఆర్థిక వ్యవస్థ మందగమనంతో..2024–25లో దేశ ఆర్థికవృద్ధి 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఓ) అంచనా వేసింది. కరోనా తర్వాతి కాలంలో ఇదే అతి తక్కువ వృద్ధి కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గడమూ దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందగమనంతో మార్కెట్లో అన్ని రంగాల్లో డిమాండ్ తగ్గిపోయిందని అంటున్నారు. ప్రభుత్వ వ్యయం పెరిగితే.. క్షేత్రస్థాయిలో ఆర్థిక వృద్ధికి, మార్కెట్లో డిమాండ్ పెరగడానికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ దిశగా అడుగులు పడితే... మాకు మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దిశగా మీరు ఆలోచించాలి. -
ఆరోగ్య సేవలకు టానిక్ ఇస్తారా..?
ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది. అంచనాలు–డిమాండ్లు.. → 2024–25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. → ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. → వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్‌లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలి. → గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్‌కు మద్దతు లభించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్లోనూ హెల్త్ యాప్‌లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్ టూల్స్ తదితర డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. → ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం. → ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. → పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థలకు (సీఆర్వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణ విస్తృతి అవసరం→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి. → ఎఎస్ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్ ప్రొఫైలింగ్‌తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు. → తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నిధులకు నిరీక్ష.. కూటమికి పరీక్ష
కేంద్రం రేపు పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ‘ఉపాధి’, వ్యవసాయం, రైల్వేకు కేటాయింపులపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా గరిష్టంగా 150 పని దినాలు కల్పిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రకటన చేయాలని, పథకం అమలుకు సరిపడినన్ని నిధులను ముందుగానే కేటాయించాలని కోరుతున్నారు. ఏటా కేటాయింపులు తక్కువగా ఉండటంతో సరైన సమయానికి నిధులు విడుదల కాక రాష్ట్రాల్లో పేదలకు పనుల కల్పన తగ్గిపోతోందని చెబుతున్నారు. మన రాష్ట్రంలో గత ఏడాది సగటున ఒక్కో కుటుంబానికి 55 రోజుల చొప్పున పనులు కల్పించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 47కు తగ్గిపోయిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో 68 శాతం జనాభా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న తరుణంలో గతేడాది బడ్జెట్లో కేవలం రూ.1.52 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో ఇది 3.1 శాతం మాత్రమేనని చెబుతున్నారు. ఇతర రంగాలకు జరిపే కేటాయింపులతో పోల్చి చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిపే కేటాయింపులు కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో రైల్వే గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదని ఆ రంగ ఉద్యోగులే వాపోతున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఆధునికీకరణపై ఈసారైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. – సాక్షి, అమరావతికనీసం 150 పని దినాలు కల్పించాలిఉపాధి హామీ పథకం అమలుకు ఆర్థిక ఏడాది చివరిలో నిధుల కొరత తలెత్తకుండా కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget)లోనైనా నిధులు కేటాయించాలని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) జాబ్‌కార్డుదారులు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతుంది. చట్టం నిబంధన ప్రకారం పని అడిగిన ప్రతి కూలీ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అయితే, కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో డిమాండ్‌కు తగ్గట్టుగా కేంద్రం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. దీంతో ప్రతి ఏటా ఆర్థిక ఏడాది చివరిలో జనవరి–మార్చి నెలల మధ్య పని చేసిన కూలీలకు వేతనాల చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీనికి తోడు మ్యాచింగ్‌గా మెటీరియల్ కేటగిరిలో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆలస్యంగా విడుదల చేస్తున్న కారణంగా అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత 2024–25 వార్షిక బడ్జెట్లో దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్రం రూ.86 వేల కోట్లు కేటాయించింది. అయితే, జనవరి 26వ తేదీ (సోమవారం) నాటికే అన్ని రాష్ట్రాల్లో జరిగిన పనులకు రూ.87,865 కోట్లు ఖర్చయింది. ఈ లెక్కన ఈ ఆర్థిక ఏడాదిలో ఇంకా మిగిలి ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలల్లో పని చేసే కూలీలకు వేతనాలు చెల్లించడానికి అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు కూలీల వేతనం ఏటా పెరుగుతున్నా, ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పని దినాల సంఖ్య 100 నుంచి 150కి పెంచాలని పేదలు, వివిధ ఎన్జీవో సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తోంది. పెద్దపీటతోనే ‘సాగు’ క్షేమంవ్యవసాయ రంగానికి ఈ దఫా కేటాయింపులు భారీగా పెంచాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దేశ జీడీపీలో 15 శాతానికి పైగా ఈ రంగం నుంచే వస్తోంది. ఏటా ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ వంటి పథకాలకు 2023–24తో పోలిస్తే 2024–25లో భారీగా కోత విధించారు. ఈసారి మొత్తం బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కనీసం 5–10 శాతానికి తక్కువ కాకుండా కేటాయింపులు జరపాలనే డిమాండ్ విన్పిస్తోంది. పీఎం కిసాన్ ద్వారా ఇచ్చే సాయం రెట్టింపు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులు పెంచడమే కాదు.. ప్రీమియం చెల్లింపు భారం రైతులపై మోపకుండా పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేలా మార్పులు తీసుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను, జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్‌గా వీటిని ప్రోత్సహించేందుకు ఎఫ్‌పీవోలు, ఎస్హెచ్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఆయిల్ పామ్ మరింతగా విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూరగాయల ఉత్పత్తి, సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయడం, వీటి నిల్వ కోసం గ్రామ స్థాయిలో స్టోరేజ్, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనకు చేయూతనివ్వాలి. బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. యంత్ర పరికరాలతో పాటు డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఉద్యాన, మత్స్య, పాడి రంగాల్లో కూడా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించాలి. అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పరిశోధన కేంద్రాలకు నిధులు పెంచాలి.పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులురాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కోటలు దాటినా నిధుల కేటాయింపు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఖజానా దాటడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 2025–26 వార్షిక బడ్జెట్లో అయినా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు తగినన్ని నిధులు రాబట్టడంలో సఫలమవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 2014లోనే రైల్వేశాఖ ఆమోదించినట్లు ప్రకటించింది. ఆ ఐదేళ్లలో కనీసం సర్వే కూడా పూర్తిచేయలేదు. ఇప్పుడు మరోసారి అమరావతి రైల్వే లైన్‌పై మాటల గారడి చేస్తున్నాయి. రైల్వేకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. » కాకినాడ–పిఠాపురం (21.51 కి.మీ.), మాచర్ల–నల్గొండ (92 కి.మీ.), కంభం–ప్రొద్దుటూరు (142కి.మీ.), గూడూ రు–దుగ్గరా జుపట్నం (41.55 కి.మీ.) రైల్వేలైన్ల నిర్మాణాన్ని పట్టాలెక్కించాలి. కొండపల్లి– కొత్తగూడెం (125 కి.మీ.), భద్రాచలం–కొవ్వూరు (151 కి.మీ.) లైన్ల నిర్మాణం సంగతి తేల్చాలి.» కడప–బెంగళూరు (255 కి.మీ), కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. » నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా, విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ–నాగ్‌పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు వెంటనే పూర్తి చేసేలా నిధులు మంజూరు చేయాలి.» కర్నూలు జిల్లాలో రూ.440 కోట్లతో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పనులు సకాలంలో పూర్తి చేయాలి.» తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ను ఏర్పాటుచేయాలి. జయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మించాలి. కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్చాలి. ఇప్పటికే ఆమోదించిన మచిలీపట్నం–రేపల్లె రైల్వేలైన్‌ను బాపట్ల వరకు పొడిగించాలి.» ఓబులవారిపల్లి–కృష్ణపట్నం రైలు మార్గంలో పాసింజర్ రైలును నడపాలి. నందలూరు రన్నింగ్ స్టాఫ్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేయాలి. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒంటిమిట్టలో హాల్టింగ్ కల్పించాలి. -
ఉపాధికి హామీ పెరగాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త బడ్జెట్‌పై రాష్ట్రంలోని ‘ఉపాధి’కూలీలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించేందుకు అమలుచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) వచ్చే బడ్జెట్లో నిధులు భారీగా పెంచాలని కోరుతున్నారు. వ్యవసాయ పనులు లేని కాలంలో కూలీలను ఆదుకుంటున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరింత ప్రధాన్యం ఇవ్వాలని మేధావులు, ప్రజాసంఘాల నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి దూరంగా నిధుల కేటాయింపు దేశంలోని కోట్ల మంది పేద కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగటంలేదనే అభిప్రాయాలున్నాయి. దేశంలోని అర్హులైన కూలీలందరికి (యాక్టివ్ హౌస్‌హోల్డ్స్) పథకంలో పొందుపరిచినట్లుగా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు ఉపాధి కల్పించాలంటే దాదాపు రూ.3 లక్షల కోట్లు అవసరమని అంచనా. కానీ, కేంద్రం 2024–25 వార్షిక బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.86,000 కోట్లు మాత్రమే. 2023–24లో మరీ తక్కువగా రూ.60 కోట్లే కేటాయించింది. తర్వాత దానిని రూ.86 వేల కోట్లకు సవరించింది. అయితే, ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అయిన మొత్తం వ్యయం రూ.1,05,000 కోట్లుగా తేలింది. బడ్జెట్ కేటాయింపులు తగ్గటంతో ఈ పథకం అమలు పలు రాష్ట్రాల్లో తీవ్రంగా ప్రభావితమైంది. కూలీలందరికి నిర్దేశిత 100 రోజుల పని కల్పించటం సాధ్యం కాలేదు. అయితే తెలంగాణలో మాత్రం లక్ష్యానికి మించి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే దాదాపు రెండుకోట్ల పనిదినాలు అదనంగా చేశారు. ఈ అధిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు పెంచాలని కోరుతున్నారు.నిధులు డబుల్ చేయాలి ఉపాధి పథకంలో రాష్ట్రానికి కేంద్రం రూ.4,416 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం ఇక్కడున్న పని డిమాండ్‌కు ఏమాత్రం సరిపోదు. చురుకుగా పనిచేస్తున్న కూలీలందరికీ పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలంటే రూ.9,800 కోట్లు అవసరం. జాతీయ స్థాయిలోని యాక్టివ్ హౌస్ హోల్డ్స్కు పూర్తిస్థాయిలో పని కల్పించాలంటే బడ్జెట్లో రూ.3 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల 2025–26 కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి భారీగా కేటాయించాలి. తెలంగాణకు నిధులు రెండింతలు చేయాలి. – చక్రధర్ బుద్దా, డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా.పని ప్రదేశంలో వసతులు కల్పించాలిఉపాధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌గా పనులు కల్పించాలి. పనికి దరఖాస్తులు తీసుకోవాలి. కూలీల సంఖ్యకు తగ్గట్టుగా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ క్రియేట్ చేయాలి. పని వద్ద హక్కుగా నీరు, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి. పనిముట్లు పంపిణీ చేయాలి. వేసవి అలవెన్సు, తాగునీటి చార్జీలను గతంలో మాదిరిగా చెల్లించాలి. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను మళ్లీ నియమించాలి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖæ మంత్రి ప్రతి నెలా ఈ పథకం అమలు తీరును సమీక్షించాలి. – పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి. -
ఇంటి కలకు భరోసా!
గత బడ్జెట్లో అందించిన పలు ప్రోత్సాహక చర్యలకు కొనసాగింపుగా, 2025 బడ్జెట్లోనూ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పలు కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ద్వితీయ భాగంలో ఇళ్ల అమ్మకాలు బలహీనడపడ్డాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో (అఫర్డబుల్ హౌసింగ్) ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పన్నుల ఉపశమనంతోపాటు, రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని, అనుమతులకు సింగిల్ విండో విధానం తీసుకురావాలని ఈ రంగం కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన విస్తరణ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి చర్యలకు గత బడ్జెట్లో చోటు కల్పించడం గమనార్హం. పరిశ్రమ వినతులు → మౌలిక రంగం హోదా కల్పించాలి. దీనివల్ల డెవలపర్లకు తక్కువ రేట్లకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. కొనుగోలు దారులకు ఈ మేరకు ధరల్లో ఉపశమనం లభిస్తుంది. → రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు పలు రకాల అనుమతులు పొందేందుకు ఎంతో కాలం వృధా అవుతోంది. అన్ని రకాల అనుమతులకు సింగిల్ విండో (ఏకీకృత విభాగం) తీసుకురావాలి. → గతేడాది ఇళ్ల అమ్మకాలు క్షీణించడాన్ని రియల్టీ రంగం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందుబాటు ధరల విభాగం (రూ.45 లక్షల్లోపు/60–90 చ.మీ కార్పెట్ ఏరియా)లో 2017 నుంచి అమ్మకాల్లో స్తబ్దత నెలకొంది. గత నాలుగేళ్లలో ధరలు పెరిగినందున ఈ విభాగం ధరల పరిమితిని సవరించాలి. → ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని మరింత పెంచాలి. కొత్త విధానంలోనూ వెసులుబాటు ఇవ్వాలి. → మరింత మంది డెవలపర్లు ఆఫీస్ స్పేస్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు వీలుగా అద్దె ఆదాయంపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి. → దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రాపర్టీ లీజులకు జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం అందించాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
జమ... ఖర్చుల్లో... ఆమె ఎక్కడ?
ఎక్కడైనా జమ, ఖర్చులదే లెక్క! దాన్ని బట్టే ఇంటికైనా.. దేశానికైనా జరుగుబాటు!అప్పు, ఆదా సమంగానే పంచినా బలహీనుల పట్ల ఆపేక్ష సహజం!అయితే ఆ బలహీనత అర్థమే మారిపోతోంది ఇంటి బడ్జెట్లో అయినా.. దేశ బడ్జెట్లో అయినా!చిత్రంగా ఆ వర్గంలో ఎక్కడా స్త్రీ కనిపించదు! అమ్మాయి నుంచి ఆంట్రప్రెన్యూర్ వరకు ఎవరికీ కేటాయింపులు ఉండవు! ఇల్లాలి సేవలకైతే గుర్తింపే కరవు!మహిళలకు బడ్జెట్లో స్థానం కల్పించాలని ‘జెండర్ బడ్జెటింగ్’ పేరుతో ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రపంచానికి వినిపించేలా గళమెత్తింది. ఆప్రాధాన్యాన్ని గ్రహించిన దేశాలు భారత్ సహా జెండర్ బడ్జెట్ మీద దృష్టిపెట్టాయి!కానీ కొన్నేళ్లుగా మన దగ్గర ఆ పదం వినిపించకుండా పోవడమే కాదు... బడ్జెట్లో మహిళలు కనిపించడమూ తగ్గుతోంది. ఫిబ్రవరి 1న కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ‘జెండర్ బడ్జెటింగ్’ మీద పలు రంగాల్లోని మహిళా నిపుణుల అభిప్రాయాలు ...సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికి రావుపదిహేనేళ్లుగా జెండర్ బడ్జెటింగ్‌ను మరచిపోయారు. మహిళలకు ఇస్తున్న పెన్షన్లు, గృహలక్ష్మి, ఉచిత రవాణా సౌకర్యాలు వంటివన్నిటినీ విమెన్ బడ్జెట్ కింద చూపిస్తున్నారు. అధికార పార్టీల సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికెలా వస్తాయి? మహిళలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, శాఖలన్నిటి కేటాయింపుల్లో మహిళలకుఇస్తున్న వాటా, స్త్రీ చదువు, జీవనోపాధి, ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి, మొత్తం స్ట్రక్చర్‌ను విమెన్ ఫ్రెండ్లీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపడానికి తీసుకుంటున్న చర్యలు విమెన్ బడ్జెట్ కిందికి వస్తాయి. కేరళలో గ్రామ పంచాయతీ బడ్జెట్లో కూడా 30 శాతం మహిళలకు కేటాయిస్తారు. సాధారణ బడ్జెట్లోనూప్రాధాన్యం ఇస్తారు. దాన్ని కేంద్రప్రభుత్వమూ అనుసరించాలి. కిందటేడు కేంద్ర బడ్జెట్లో నరేగా(మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎం΄్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్)కు రూ.35 వేల కోట్లు తగ్గించారు. సవరించిన బడ్జెట్లో 120కోట్లకు గాను 95వేల కోట్లను కేటాయించి, కేవలం రూ. 60 వేల కోట్లతో సరిపెట్టారు. ఈ కోతలు గ్రామీణ ఉపాధిరంగంలోని స్త్రీల మీద తీవ్రప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయరంగంలో 58 శాతం మహిళలున్నారు. వాళ్లు ఎక్కువగా కౌలు చేస్తారు. వాళ్ల పేరుమీద పొలాలుండవు. భర్త పేరుమీదో.. ఉమ్మడి కుటుంబ ఆస్తిగానో ఉంటాయి. లేదంటే పిల్లల పేరుమీద ఉంటాయి. ఈ లెక్కన వాళ్లకు ఆర్థిక భద్రత ఏది? పట్టణ ఉపాధి రంగంలో 23 శాతమున్న మహిళల పరిస్థితీ అంతే! నరేగా లాంటివి అక్కడ అప్లయ్ చేయరు. ఇక భద్రత, రక్షణ విషయాలకు వస్తే.. నిర్భయ ఫండ్‌కి గత మూడేళ్లుగా కేటాయింపుల్లేవు. మొదట్లో వెయ్యి కోట్లేమో కేటాయించారు. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. ఎవరూ దరఖాస్తు చేసుకోవట్లేదని ఇప్పుడు దానికి బడ్జెట్టే లేకుండా చేశారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అప్లయ్ చేసుకోవచ్చో రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వలేదు. స్త్రీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటేనే అది జెండర్ బడ్జెట్. అది అత్యంత అవసరం! – దేవి, యాక్టివిస్ట్‘అవగాహన’కు ఖర్చు చేయాలి ఎమ్మెస్సెమ్మీలో 20 వేల కోట్ల రూపాయల మిగులు నిధులున్నట్లుగా డేటా చూపిస్తోంది. దాని అర్థం ఆ స్కీమ్స్ ప్రజలకు చేరట్లేదని! ఆ మిగులును చూసి కేటాయింపులు తగ్గిస్తారు లేదంటే రివర్స్ చేస్తారు తప్ప.. దాన్ని మహిళా సాధికారత మీద అవగాహన కలిగించే కార్యక్రమాలకో, ఆడపిల్లల చదువుకో మళ్లించరు! ఎమ్మెస్సెమ్మీ స్కీమ్స్ గురించి కాలేజీల్లో అవేర్నెస్ క్యాంప్‌లు పెట్టండని ప్రభుత్వాన్ని పోరుతున్నాం. కాలేజీస్థాయిలోనే అవగాహన వస్తే చదువైపోయాక ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టుకుంటారు. దీనివల్ల ప్రభుత్వాల మీదా ఒత్తిడి తగ్గుతుంది. యువతలో ఆంట్రప్రెన్యూర్షిప్ పెరుగుతుంది. ఓరియంటల్ మహిళా వికాసం, ముద్ర లోన్స్, స్త్రీ శక్తి యోజన.. సిం«ద్ మహిళాశక్తి యోజనలాంటి వాటితో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్‌బీ) లాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. బీఎమ్బీలో రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్స్ «తీసుకోవచ్చు. ధరావత్తు అవసరం లేదు. అయితే వీటి గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఈ కోవలోనిదే స్టార్టప్ ఇండియా స్కీమ్. దీన్ని ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం డిజైన్ చేశారు. ఇంకా గ్రూప్ లోన్స్ ఉన్నాయి. అయిదుగురు మహిళలు కలిసి ఓ సంస్థను పెట్టుకోవచ్చు. ఈరోజున ఒక ఆంట్రప్రెన్యూర్ మహిళ నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తోంది. గ్రామీణ, పట్టణ, దళిత మహిళలందరినీ ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు నడిపించాలంటే.. వారికోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలకు బడ్జెట్లో కేటాయింపులు సమృద్ధిగా ఉండాలి. ఆ కార్యక్రమాలతో ఇల్లిల్లూ తిరిగి చైతన్యం కలిగించాలి. కేక్ తయారీ నుంచి చేపల పెంపకం దాకా అన్నిటికీ ఎమ్మెస్సెమ్మీలో శిక్షణ ఉంది. అవగాహన కల్పించాలంతే! – బి.ఎన్. రత్న, ప్రెసిడెంట్, దలీప్ (దళిత్ ఆదివాసీ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్)ప్రత్యేక కేటాయింపులు కావాలిఆంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్‌ని డెవలప్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కి సరిపోయేంత బడ్జెట్ ఉండట్లేదు. దానికోసం ప్రత్యేక కేటాయింపులు కావాలి. పెట్టుబడి కోసం కూడా మహిళల దగ్గర డబ్బు ఉండదు. అందుకే పది, పదిహేను శాతం సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కూడా ఉంటే బాగుంటుంది. – అరుణ దాసరి, ప్రెసిడెంట్ డిక్కీ, తెలంగాణవాళ్లూ జాతీయోత్పత్తిలో భాగస్వాములే!వ్యవసాయం లాంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు క్షేత్రస్థాయిలో ఈ రోజుకీ ఎలాంటి వసతులు లేవు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్, బేబీ కేర్ సెంటర్స్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా అది మహిళల మీద అదనపు భారాన్నే మోపుతోంది. వీరి ఈ శ్రమను ఇంటిపనిగానే చూస్తున్నారు తప్ప ఉత్పత్తిలో భాగంగా చూడట్లేదు. ఎలాంటి కూలీ చెల్లించట్లేదు. మహిళా రైతుల ఆత్మహత్యలను లెక్కలోకి తీసుకోవట్లేదు. వాళ్లను అసలు రైతులుగానే గుర్తించట్లేదు. ఒంటరి మహిళలకు అందాల్సిన పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నిర్వాసిత ప్రాజెక్ట్ నిర్మాణాల వల్ల) మహిళలైతే అనేకరకాల అభద్రతలకు లోనవుతున్నారు. వీళ్లంతా జాతీయోత్పత్తిలో భాగస్వాములే! వీళ్లందరి అభివృద్ధి, భద్రత, రక్షణలకు బడ్జెట్లో స్థానం ఉంటోందా? నిజాయితీగా సమీక్షించుకోవాలి. నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలి. అప్పుడే బడ్జెట్లో స్త్రీకి సముచితస్థానం లభిస్తుంది. – పద్మ వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్కేర్ ఎకానమీకీ స్థానం ఉండాలిస్త్రీ, పురుష ఆర్థిక సమానత్వ సాధనలో జెండర్ బడ్జెటింగ్ అనేది కీలకం. ఆర్థిక వనరులను నేరుగా ప్రభావితం చేసే రంగాల్లో స్త్రీలకు ఎంతమేర కేటాయింపులుంటున్నాయి, వాటినెలా ఉపయోగిస్తున్నారు, మహిళల భద్రత కోసం ఎంత కేటాయిస్తున్నారు లాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. కేర్ ఎకానమీ అంటే ఇంట్లో స్త్రీల సేవలు.. ఇంటి పని, వంటపని దగ్గర్నుంచి భర్తకు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్, పిల్లలు.. పెద్దవాళ్ల బాగోగుల దాకా మహిళలు చేసేదంతా జీతం లేని శ్రమ. మరుగునపడిన వీరి సేవలను, శ్రమను ఆదాయ పట్టీలోకి చేర్చాలి. భార్య అన్నిరకాలుగా సహకరిస్తేనే భర్త బయటకు వెళ్లి పనిచేయగలుగుతున్నాడు. అలా ఆమె కూడా ఉత్పత్తిలో భాగమవుతూ, జాతీయ ఆదాయానికి ఊతమవుతోందని గ్రహించాలి. ఈ కేర్ ఎకానమీకీ బడ్జెట్లో స్థానం ఉండాలి. స్థూల విధానాలు జెండర్ ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, మిలీనియల్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉండాలి. మహిళలు, జెండర్ మైనారిటీల చదువు, ఆరోగ్యం, భద్రత, ఉపాధి, జీవన నైపుణ్యాలు పెంపొందించడం వంటివన్నీ బడ్జెట్లో భాగం కావాలి. ఆ కేటాయింపులన్నీ సక్రమంగా ఖర్చవ్వాలి. కానీ అవన్నీ వేరేచోటికి మళ్లుతున్నాయి. జెండర్ ఈక్వాలిటీ మీద ఒకరకమైన ఉపేక్ష కనబడుతోంది. – అపర్ణ తోట, జెండర్ కన్సల్టెంట్ ట్రైనర్, ద పర్పుల్ వరండా– సరస్వతి రమ -
ఈసారీ..భారీగానే..
సాక్షి, హైదరాబాద్: పరిమిత ప్రాజెక్టులు.. మొత్తం కేటాయింపుల్లో వాటికే సింహభాగం నిధులు.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తున్న విధానం. ఈ ప్రయోగం ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది.దీనివల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో మూడు కీలక ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే దిశగా రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో రైలు సేవలు బాగా మెరుగుపడబోతున్నాయి. బల్లార్షా–కాజీపేట–విజయవాడఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే కీలక మార్గం ఇది. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పిలుస్తారు. ఈ మార్గంలో నిత్యం 460 వరకు రైళ్లు పరుగు పెడుతుంటాయి. ప్రస్తుతం దాని ట్రాఫిక్ సాంద్రత ఏకంగా 160 శాతంగా ఉంది. ఈ మార్గంలో కనీసం మరో 250 ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను నడపాల్సి ఉన్నా, సాంద్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కావటం లేదు. దీంతో మూడో లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.కాజీపేట– విజయవాడ మధ్య మూడో లైన్ 2012–13లో మంజూరు కాగా, కాజీపేట–బల్లార్షా లైన్ 2015–16లో మంజూరైంది. కానీ పనులు వెంటనే మొదలు కాలేదు. గత మూడేళ్లుగా వీటికి భారీగా నిధులు కేటాయిస్తుండటంతో ఇప్పుడు పనులు కొలిక్కి వచ్చాయి. ఈ మార్గంలో వంతెనల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతా పనులు వేగం పుంజుకున్నాయి. దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు. కాజీపేట–బల్లార్షా మధ్య 202 కి.మీ. నిర్మాణాన్ని రూ.2,063 కోట్ల అంచనాతో ప్రారంభించారు. రాఘవాపురం–కొలనూరు, కొలనూరు–పోత్కపల్లి, విరూరు–మాణిక్‌ఘర్, బిజిగిర్ షరీఫ్– ఉప్పల్, విరూరు–మాకుడి, పోత్కపల్లి–బిజిగిర్ షరీఫ్, మాకుడి–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఇప్పటికే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈసారి కొంత సవరించే అవకాశం ఉంది. భారీగా నిధులు ఇవ్వటంతో హసన్‌పర్తి రోడ్డు–ఉప్పల్, ఆసిఫాబాద్–రేచినిరోడ్, హసన్‌పర్తి–కాజీపేట పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 173.27 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. 28 కి.మీ. పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బల్లార్షా– మాణిక్‌ఘర్, రేచిని రోడ్–బెల్లంపల్లి– మందమర్రి, ఆసిఫాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య పూర్తి కావాల్సి ఉంది. కాజీపేట–విజయవాడ మూడో లైను ఈ లైన్ పూర్తి నిడివి 220 కి.మీ. గత బడ్జెట్లో దీనికి రూ.310 కోట్లు కేటాయించగా, తర్వాత కొన్ని నెలలకే ఆ మొత్తాన్ని రూ.500కు పెంచారు. దీంతో ఒక్కసారిగా పనుల్లో వేగం పెరిగింది. 104 కి.మీ. నిడివిలో మూడో లైన్ పనులు పూర్తి చేయటంతోపాటు, అన్ని వంతెనలను సిద్ధం చేశారు. మిగతా పనులు మూడొంతులు పూర్తి కాగా, తుదిదశ పనులు మాత్రమే మిగిలాయి. విజయవాడ–కొండపల్లి, కొండపల్లి–చెరువు మాధవరం, చెరువు మాధవరం–గంగినేని–ఎర్రుపాలెం, నెక్కొండ–చింతలపల్లి, చింతలపల్లి–వరంగల్ మధ్య ఇప్పటికే మూడో లైన్ వినియోగంలోకి రాగా, పందిళ్లపల్లి–బోనకల్, ఎర్రుపాలెం–మధిర, విజయవాడ–బెజవాడ క్యాబిన్ మధ్య గత ఏడాది కాలంలో పూర్తయ్యాయి. బోనకల్–మధిర, నెక్కొండ–పందిళ్లపల్లి మధ్య పనులు జరగాల్సి ఉంది. మరో ఏడాదిలో పనులు దాదాపు పూర్తి కానున్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి సిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే 151 కి.మీ. కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా వేగంగా జరుగుతున్నాయి. గత బడ్జెట్లో దీనికి రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ఫార్మేషన్, కటింగ్, లింకింగ్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రెయిల్స్ పరవనున్నారు. ఈ సెక్షన్లో దాదాపు 60 వరకు మైనర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. నాలుగు ఆర్ఓబీల నిర్మాణం పూర్తి కావచ్చింది. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో సిరిసిల్ల వరకు రైలు నడిపేందుకు వీలు కలగనుంది. మరికొన్ని మార్గాల్లో..» సిరిసిల్ల–కరీంనగర్ మధ్య 40 కి.మీ. మార్గానికి భూ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవటంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అక్కడ పనులు జరగటం లేదు. భూ పరిహారం రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూమిని రైల్వేకు అప్పగించి ఉంటే ఈపాటికి చాలా పని జరిగి ఉండేది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. » నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని రెండు వరుసలకు విస్తరించే ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించారు. 248 కి.మీ. ఈ మార్గంలో కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పూర్తయింది. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. మిగతా చోట్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. » 2023–24లో బడ్జెట్లో మంజూరు చేసిన ముద్ఖేడ్–డోన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను సవరించి మధ్యలో రూ.550 కోట్లు మంజూరు చేశారు. » 2023–24లో మంజూరు చేసిన భద్రాచలం–డోర్నకల్, మోటమర్రి–విష్ణుపురం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు మొదలయ్యాయి. గత బడ్జెట్లో వీటికి రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. » గత బడ్జెట్లో మంజూరు చేసిన పాండురంగాపురం–మల్కాజిగిరి కొత్త లైన్, ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.


