బంగ్లాకు షాకిచ్చిన భారత్.. భారీగా నిధుల కోత | India has drastically cut funding to Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాకు షాకిచ్చిన భారత్.. భారీగా నిధుల కోత

Feb 2 2026 1:59 AM | Updated on Feb 2 2026 3:09 AM

India has drastically cut funding to Bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి కేటాయించే నిధులను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుంగా మాల్దీవులు, మయన్మార్‌లకు భారత్ అందించే సహాయంలో భారీగా కోతలు విధించింది.

ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగాయి. దీనిపై  బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు హెచ్చరించినా దాడులు ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో  భారత్ ఆ దేశం పై ఆర్థిక కోత విధించింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 60 కోట్లు బంగ్లాకు కేటాయించింది. అదే గతేడాది ఈ ఇధి రూ.120 కోట్లుగా ఉంది. అదే విధంగా మాల్దీవులకు దాదాపు 8 శాతం సహాయం తగ్గించి రూ. 550 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు ఈ ఏడాది ఎటువంటి నిధులు కేటాయించలేదు.

అయితే భూటాన్‌కు అందిస్తున్న సహాయాన్ని భారత్ ఈ సారి మరికొంతగా పెంచింది. దాదాపు ఆరు శాతం నిధులు పెంచి మెుత్తం రూ. 2,289 కోట్లకు పెంచింది. నేపాల్‌కు ఎనిమిది శాతం పెరిగి రూ. 800 కోట్లు చేసింది. శ్రీలంకకు సహాయం ఒక వంతు పెరిగి రూ. 400 కోట్లకు చేరుకుంది. మెుత్తంగా ఇతర దేశాలకు భారత్ చేసే ఆర్థిక సహాయం 4 శాతం పెరిగి రూ. 5,686 కోట్లకు చేరింది. . అదే గ తేడాది ఈ మెుత్తం రూ.5,483 కోట్లుగా ఉంది. 2026-27 సంవత్సరానికి భారత విదేశాంగ శాఖ బడ్జెట్ రూ.22,119 కోట్లుగా అంచనా వేయబడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement