భారీ ఊరట : చైనాకు వెళ్లాల్సిన 7 రష్యా ట్యాంకర్లు భారత్‌వైపు | Russia Oil Tanker Bound For China Makes U Turn Heading To India | Sakshi
Sakshi News home page

భారీ ఊరట : చైనాకు వెళ్లాల్సిన 7 రష్యా ట్యాంకర్లు భారత్‌వైపు

Mar 18 2026 6:02 PM | Updated on Mar 18 2026 6:16 PM

Russia Oil Tanker Bound For China Makes U Turn Heading To India

చైనాకు వెళ్లాల్సిన 7 చమురు ట్యాంకర్లు  దక్షిణ చైనా సముద్రంలో యూ-టర్న్ తీసుకుని భారత్‌వైపు మళ్లడం  అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారింది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు.  మాస్కో నుండి దిగుమతులను న్యూఢిల్లీ రెట్టింపు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తూ, మొదట చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యన్ చమురు ట్యాంకర్లు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి   షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, 'ఆక్వా టైటాన్' అనే ఈ నౌక, జనవరి చివరలో బాల్టిక్ సముద్ర ఓడరేవు నుండి లోడ్ చేసుకున్న యురల్స్ కార్గో మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది. 

సూయజ్‌మాక్స్ జౌజౌ ఎన్. భారతదేశంలోని సిక్కాకు మార్చి 25న చేరుకుంటుందని అంచనా.రష్యా నుండి కొనుగోళ్లను తాత్కాలికంగా పెంచుకోవడానికి భారతదేశానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది రోజులకే, ఈ అఫ్రామాక్స్ నౌక మార్చి మధ్యలో చైనాలోని రిజావో ఓడరేవుకు  చేరాల్సి ఉంది. 

ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!

ఎందుకిలా?
రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత్ ఎటువంటి ఆంక్షల భయం లేకుండా రష్యా చమురును దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడంతో, ఇరాన్ ప్రతిచర్యగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా   ప్రపంచ వ్యాప్తం చమురు సంక్షోభం ఏర్పడింది.  ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగి, ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 120 డాలర్లకు  చేరుకుంది.

ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇంధన భద్రత కోసం భారత్ రష్యాపై మరింతగా ఆధారపడుతోంది.ఈ ఏడు ట్యాంకర్ల రాకతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని చైనాకు వెళ్లాల్సిన వనరులు ఇప్పుడు భారత అవసరాలకు ఉపయోగపడనున్నాయని అంచనా 

ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

Advertisement
 
Advertisement
Advertisement