తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముగిశాయి.
వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రారంభమైన ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు.
సాంప్రదాయ పంచకట్టులో వైఎస్ జగన్ హాజరయ్యారు. పిడపర్తి భాస్కర సుబ్రమణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు.


