గర్ల్‌ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్‌ : లవర్‌ చేసిన పని ఇదే! | To buy Rs 6 lakh engagement ring for girlfriend Man works as food delivery driver after job | Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్‌ : లవర్‌ చేసిన పని ఇదే!

Aug 8 2026 3:08 PM | Updated on Aug 8 2026 3:18 PM

To buy Rs 6 lakh engagement ring for girlfriend Man works as food delivery driver after job

నచ్చిన నెచ్చెలి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ప్రేమికులు. తాజాగా తమ నిశ్చితార్థ కలను నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఎంతటి కష్టానికైనా వెనుకాడడని నిరూపించాడు అమెరికాకు చెందిన బ్రాడ్లీ చో (Bradley Cho). తన ప్రియురాలికి విలువైన డైమండ్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ గిప్ట్‌గా ఇవ్వాలనే  కోరికతో  చాలానే  కష్టపడ్డాడు.  ఒకపక్క పగలు కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క రాత్రుళ్లు  ఫుడ్ డెలివరీ బాయ్‌గా అదనపు పనిచేశాడు.  చివరికి..

బ్రాడ్లీ చో ఇటీవల తన ప్రియురాలితో కలిసి ఒక కాండో (ఇల్లు) కొనుగోలు చేశాడు. దీంతో  అతని వద్ద ఉన్న సేవింగ్స్‌ అన్నీ ఖర్చైపోయాయి. ఇక నిశ్చితార్థపు ఉంగరం కొనడానికి డబ్బులు లేకుండా పోయాయి. ఎలాగైనా ఆమెకు  లగ్జరీ డైమండ్‌ రింగ్‌ కానుకగా ఇవ్వాని నిర్ణయించుకున్నాడు. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్‌డాష్ (DoorDash) ద్వారా  డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు.  

రోజూ పగటిపూట రెగ్యులర్ కార్పొరేట్ ఉద్యోగం ముగించుకుని, రాత్రి 2 గంటల వరకు డెలివరీలు చేసేవాడు. మళ్లీ ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఆఫీస్‌కు వెళ్లేవాడు. ఇలా రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతూ ఇలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 8 నెలల పాటు  కష్టపడ్డాడు. ఈ క్రమంలో రెండు వారాల పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల వల్ల  తన కార్పొరేట్‌ ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అయినా పట్టువీడలేదు.

 

చివరికి 8 నెలల కష్టం తర్వాత 6,500 డాలర్లు (దాదాపు రూ. 6 లక్షలు) విలువైన డబ్బును సమకూర్చుకున్నాడు. దీంతో ల్యాబ్-గ్రోన్ డైమండ్‌తో (Lab-grown diamond) పాటు వారిద్దరి 'బర్త్ స్టోన్స్' (జన్మ రాశి రత్నాలు) అమర్చిన ప్రత్యేకమైన నిశ్చితార్థపు ఉంగరాన్ని తయారు చేయించాడు.

 

 

ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్‌, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ 

నెటిజన్ల స్పందన
"డే 89.. మై గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ కొనేవరకు" అంటూ రోజూ తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసిన బ్రాడ్లీకి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభించింది. లక్షలాది మంది ఆయన పట్టుదలను, ప్రేమికురాలి పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు అందించడం విశేషం.

ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్‌ యూట్యూబర్‌ వరల్డ్‌ రికార్డ్‌, ఎన్నేళ్ల కష్టమో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement