అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్‌, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ | Drove Ola after his job, Now they run a multi crore startup | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్‌, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ

Aug 7 2026 2:42 PM | Updated on Aug 7 2026 3:00 PM

Drove Ola after his job, Now they run a multi crore startup

కొన్ని సక్సెస్‌లు అనూహ్యంగా రావచ్చు. కానీవిజయాలన్నీ ఎవ్వరూ ఊహించని కష్టాల నుండే సాధ్యమవుతాయి. ఆ విజయానికి కన్నీళ్లు, సవాళ్లే శక్తివంతమైన సోపానాలుగా మారతాయి. ప్రతీ ఎదురు దెబ్బ ఒక్కో మెట్టుగా అసాధారణ విజయానికి పునాది అవుతుంది. అలా కష్టాల నుంచి కోట్లతో వ్యాపార సామ్రాజ్యాన్ని  ష్టించిన  అభిషేక్ కుమార్ , మోహిత్ కుమార్ సక్సెస్‌ స్టోరీ గురించి తెలిస్తే ఈ మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి.


'వేల్‌స్టేస్' (ValeStays) వ్యవస్థాపకుల స్ఫూర్తిదాయక కథ ఇదీ. హిందూస్థాన్‌టైమ్స్.కామ్‌ కథనం ప్రకారం ఎన్నో కఠిన సవాళ్లనెదుర్కొని, అపజయాలను అధిగమించిన ఇద్దరు యువకులు 'వేల్‌స్టేస్' అనే మల్టీ-కోర్ల సర్వీస్డ్ అపార్ట్‌మెంట్ వ్యాపారాన్ని  విస్తరించారు అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్‌  ద్వయం.  వీరిద్దరుకో పౌండర్లుగా అవతరించకముందు  డబుల్ షిఫ్టులు చేశారు. ఎన్నో ఆర్థిక నష్టాలను తట్టుకున్నారు.

అభిషేక్ కుమార్: బిహార్‌లోని భాగల్పూర్ జిల్లా నౌగాచియాకు చెందిన అభిషేక్, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉదయం 7:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్పొరేట్ ఉద్యోగం.  రాత్రి వేళల్లో అర్ధరాత్రి వరకు  ఓలా క్యాబ్/బైక్ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఇలా రోజంతా కష్టపడినా వచ్చేది కేవలం  రూ. 400 నుంచి రూ. 1,100 మాత్రమే.  కొన్నిసార్లు పెట్రోల్ ఖర్చులు పోను ఏమీ మిగిలేది కాదట.

మోహిత్ కుమార్: ఉత్తరప్రదేశ్, మైన్‌పురికి చెందిన మోహిత్, 10వ తరగతి తర్వాత ఢిల్లీ వచ్చారు. 16-17 ఏళ్ల వయస్సులోనే (11వ తరగతి చదువుతున్నప్పటి నుంచి) నెలకు రూ. 1,000 ఫీజుతో   ఇంటింటికీ  హోం ట్యూషన్స్‌ చెప్పేవారు.వెళ్లి ట్యూషన్లు చెప్పేవారు. ఐదేళ్ల పాటు దాదాపు 60 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి, ఒక్కో రూపాయి కూడబెట్టి రూ. 20 లక్షల పొదుపు చేశారు. ఆ డబ్బుతో సొంతంగా రెడీమేడ్ దుస్తుల దుకాణం ప్రారంభించాడు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా ఆ వ్యాపారం ఘోరంగా దెబ్బతింది. సంపాదనంతా తుడిచిపెట్టుకుపోయింది.

వేల్‌స్టేస్ పుట్టుక ఎలా అంటే..
2022 నాటికి  అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్‌ ఇద్దరూ  షేర్డ్‌ ఇంట్లో  అద్దెకు ఉండేవారు.ఇద్దరూ ఆర్థికంగా దెబ్బతిని కష్టాల్లో ఉన్నారు.  దీంతో  తమ వద్ద ఉన్న కొద్దిపాటి వనరులతో ఏదైనా కొత్తది ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

తొలి అడుగు
ఎవరు తీసుకోని ఒక పాత ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. OLX లో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనుగోలు చేశారు.వాటిని స్వయంగా బాగుచేసి, శుభ్రం చేసి, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌గా మార్చారు. కొన్ని రోజుల్లోనే మొదటి బుకింగ్ వచ్చింది. అలాఒక ఫ్లాట్‌తో ప్రారంభమైన వీరి ప్రయాణం, ఏడాదికి 18 ఫ్లాట్లకు, నాలుగేళ్లలో ఢిల్లీ-NCR వ్యాప్తంగా 72 సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లకు విస్తరించింది. ప్రస్తుతం కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారంగా మారింది. ఈ వ్యాపార బాధ్యతల నిర్వహణలో అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్‌  బాద్యతలను పంచుకుని మరీ విజయవంతంగా  వ్యాపారాన్ని  ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత

గెస్ట్ మేనేజ్‌మెంట్, సేల్స్, వ్యాపార విస్తరణ బాధ్యతలను అభిషేక్‌ చూసుకుంటారు. ఇక హౌస్ కీపింగ్, వెండార్స్ మేనేజ్‌మెంట్, రోజువారీ క్షేత్రస్థాయి (Ground-level) పనుల పర్యవేక్షణ మోహిత్‌ పని.

సౌకర్యవంతమైన జీవితానికి అలవాటుపడితే సరికొత్తగా ఏదీ సాధించలేమని, ఒడిదొడుకులు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకూడదని అభిషేక్ తన లాంటివారికి సూచిస్తోంటే,  వ్యాపారంలో నమ్మకమైన భాగస్వామి దొరకడం అన్నింటికంటే గొప్ప ఆస్తి అని  మోహిత్‌ సంతోషం వ్యక్తం చేయడం విశేషం. 

ఇదీ చదవండి: పాపులర్‌ క్రైమ్‌ సిరీస్‌ ప్రేరణతో భార్య హత్య, రూ. 13 లక్షలతో పరార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement