రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్‌ కుమారుడు మృతి | Atiq Ahmads Youngest Son Abaan Ahmad Dies in Tragic Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్‌ కుమారుడు మృతి

Aug 6 2026 1:05 PM | Updated on Aug 6 2026 1:14 PM

Atiq Ahmads Youngest Son Abaan Ahmad Dies in Tragic Road Accident

ఝాన్సీ(ఉత్తరప్రదేశ్‌): గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత అతీక్ అహ్మద్‌ కుమారుడు అబాన్ అహ్మద్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఝాన్సీ జైలులో ఉన్న తన అన్నయ్య అలీ అహ్మద్‌ను కలిసేందుకు కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అబాన్ అహ్మద్‌ ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా అదుపుతప్పింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినింది. తీవ్ర గాయాలపాలైన అబాన్ అహ్మద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఉమేష్‌ పాల్‌ హత్య కేసులో అశ్రద్‌తో పాటు అతీక్ అహ్మద్‌ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే 2023 ఏప్రిల్‌లో హత్యకు గురయ్యారు. అంతకుముందు అతీక్ కుమారుడు అసద్‌ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఘటనలు జరిగి మూడేళ్లు దాటిన తర్వాత, ఇప్పుడు అతీక్ చిన్న కుమారుడు అబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా అతీక్ మరో కుమారుడు అలీ అహ్మద్‌ పలు క్రిమినల్ కేసుల్లో ప్రస్తుతం ఝాన్సీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఆయనను చూసేందుకు వెళ్తున్న సమయంలోనే అబాన్ రోడ్డు ప్రమాదానికి గురికావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్‌ కాదు.. సినిమా కానే కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement