టీచర్‌ ప్రాణం తీసిన మైనర్‌ డ్రైవింగ్‌ | road accident in Hyderabad | Sakshi
Sakshi News home page

టీచర్‌ ప్రాణం తీసిన మైనర్‌ డ్రైవింగ్‌

Aug 4 2026 1:30 AM | Updated on Aug 4 2026 1:40 AM

road accident in Hyderabad

కారు ఢీ కొనడంతో ఉపాధ్యాయురాలు మృతి

గౌలిపురా: నడుచుకుంటూ వెళ్తున్న టీచర్‌ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భవానీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.కరుణాకర్‌ తెలిపిన మేరకు...న్యూ నల్లకుంట తిలక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన స్వరూపరాణి (50) మొఘల్‌పురాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూ ఎంఎంటీఎస్‌లో కాచిగూడ నుంచి యాకుత్‌పురా వచ్చి..అక్కడినుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది.

అంతటితో ఆగకుండా కారు ఆటో, స్కూటీ, ఇతర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. స్వరూపరాణిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వరూపరాణి భర్త బాల్‌రాజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కారును ఓ మైనర్‌ బాలుడు (17) నడుపుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో బాలుడితోపాటు కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement