రాపిడో రైడర్లకు బిగ్ షాక్: లైసెన్స్, ఆర్‌సీ రద్దు! | Bengaluru Transport Officials Seize 70 Bike Taxis, RC And DL Cancellation On Cards, More Details Inside | Sakshi
Sakshi News home page

రాపిడో రైడర్లకు బిగ్ షాక్: లైసెన్స్, ఆర్‌సీ రద్దు!

Aug 6 2026 11:57 AM | Updated on Aug 6 2026 12:24 PM

Bengaluru RTO Seizes Bike Taxis RC DL Cancelled

బెంగళూరు: రాజధానిలో బైక్‌ ట్యాక్సీ సేవలపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించి 70 బైకులను స్వా«దీనం చేసుకున్నారు. మొబైల్‌యాప్‌ల ద్వారా ట్రిప్పులు వేస్తున్న బైకిస్టులను అడ్డుకుని సీజ్‌ చేశారు. యలహంక సింగనాయకనహళ్లి ఆర్‌టీఓ పరిధిలో 40కి పైగా బైకులను జప్తు చేశారు. 

బైకిస్టుల మొబైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలించారు. బైక్‌ ట్యాక్సీలను నిషేధించాలని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళనలు చేయడంతో పాటు హైకోర్టులో కేసులు వేయడం తెలిసిందే. దీంతో మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో రవాణాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది.  

డీఎల్, ఆర్‌సీ రద్దు చేస్తాం  
అక్రమంగా బైకు ట్యాక్సీ నడుపుతున్న వారి డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల ఆర్‌సీ రద్దుచేస్తున్నామని అధికారులు తెలిపారు. రాజాజీనగరలో వాహనాలు జప్తుచేయడంతో ఆర్‌టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాపిడో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావాలనే బైక్‌ ట్యాక్సీలను బుక్‌చేసి అధికారులకు తెలిపి పట్టిస్తున్నారని కొందరు యువకులు ఆరోపించారు. వారంపాటు తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement