సీఐఎల్‌ ల్యాబ్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి | Accident at CIL lab three dead in Karnataka | Sakshi
Sakshi News home page

సీఐఎల్‌ ల్యాబ్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి

Aug 5 2026 2:38 PM | Updated on Aug 5 2026 2:52 PM

Accident at CIL lab three dead in Karnataka

బెంగళూరు: కర్ణాటక,కడేచూర్‌ సీఐఎల్‌ ల్యాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకై ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మృతులు మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్ మరియు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా వాసిగా తెలుస్తోంది. ముగ్గురి వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం. ఈఘటన పారిశ్రామిక ప్లాంట్ లోపల తెల్లవారుజామున 1 గంట నుండి 2 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement