న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, లడఖ్‌ల ప్రయాణంలో ఆర్టికల్ 370 రద్దు ఒక ‘నిర్ణాయక నూతన అధ్యాయం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయన ఈ చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ను జాతీయ ప్రధాన స్రవంతిలో పూర్తిగా విలీనం చేసింది. ఈ ప్రత్యేక హోదా రద్దు ద్వారా దశాబ్దాలుగా ప్రాథమిక రాజ్యాంగ హక్కులకు దూరంగా ఉన్న మహిళలు, అట్టడుగు వర్గాలకు సాధికారత లభించిందని ప్రధాని పేర్కొన్నారు.
Seven years ago, on this day, Articles 370 and 35(A) became history, marking a decisive new chapter in the journey of Jammu and Kashmir as well as Ladakh.
Since then, the lives of the people of J&K and Ladakh have witnessed wide-ranging transformation. Infrastructure has…— Narendra Modi (@narendramodi) August 5, 2026
‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ఏడేళ్ల కిందట ఇదే రోజున ఆర్టికల్ 370, 35(ఏ) చరిత్రలో కలిసిపోయాయని, నాటి నుంచి జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. మౌలిక వసతులు విస్తరించడంతోపాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో, క్రీడల్లో నూతన అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. నేడు దేశం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఆగస్టు 5వ తేదీకి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్?


