breaking news
bengaluru
-
ఐటీ జాబ్ వదిలి.. ఐదింతలు సంపాదన!
బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్‌లో స్థిరమైన ఉద్యోగం.. మంచి జీతం.. భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కెరీర్.. అయినా అతడికి మాత్రం ఆ పని సంతృప్తినివ్వలేదు. అందుకే మూడేళ్ల కార్పొరేట్ జీవితానికి స్వస్తి పలికాడు. ఆ తర్వాత ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కొత్త అవకాశాలను అన్వేషించాడు. చివరకు తనకు ఇష్టమైన పర్యాటక రంగంలో అడుగుపెట్టి సొంత వ్యాపారాన్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు గతంలో ఐటీ ఉద్యోగంలో సంపాదించిన వార్షిక ఆదాయానికి నాలుగైదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు కోల్‌కతాకు చెందిన సోహమ్ చక్రవర్తి. అయితే ఈ ప్రయాణంలో విజయం ఒక్కరోజులో రాలేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆయనకు దాదాపు రెండేళ్లు పట్టింది.నెలల తరబడి డెస్క్టాప్పై రాజీనామా లేఖకెమికల్ ఇంజినీరింగ్ చదివిన సోహమ్ చక్రవర్తి.. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి ఒరాకిల్‌లో చేరాడు. అయితే ఐటీ రంగంలో పనిచేస్తున్న కొద్దీ ఆ ఉద్యోగం తన అభిరుచులకు సరిపడదని గుర్తించాడు. బయటకు వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే రాజీనామా చేయలేదు. తన నిర్ణయంపై నెలల తరబడి ఆలోచించాడు. చివరకు 2016లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టాలన్న అతడి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తొలుత అంత సులభంగా అంగీకరించలేదు. ముఖ్యంగా ఆయన తల్లి చాలా ఆందోళన చెందింది. అయినప్పటికీ, తనకు అర్థవంతమైన జీవితాన్ని అందించే పనిని ఎంచుకోవాలనే ఆలోచనతో సోహమ్ ముందుకెళ్లాడు. తండ్రితో మాట్లాడుతూ.. అవసరమైతే వీధిలో అరటిపండ్లు అమ్ముకుంటానని, కానీ తనకు నచ్చని ఉద్యోగంలో కొనసాగలేనని చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నాడు. తండ్రి కూడా బాధ్యతలు మరింత పెరగకముందే కొత్త అవకాశాలను అన్వేషించాలంటూ ప్రోత్సహించాడు.ఉబెర్ డ్రైవింగ్ నుంచి కొత్త ఆలోచన2017లో తన స్వస్థలమైన కోల్‌కతాలోని శ్యామ్బజార్కు తిరిగొచ్చిన సోహమ్.. తర్వాత ఏం చేయాలనే విషయంపై స్పష్టత కోసం దాదాపు ఏడాది పాటు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేశాడు. గతంలో చూసిన కార్పొరేట్ జీవితానికి ఈ పని పూర్తిగా భిన్నం. ఆదాయం తక్కువగా ఉండటంతో పాటు శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉండేది. అయితే ఈ అనుభవం అతడికి నగరాన్ని కొత్త కోణంలో నపరిచయం చేసింది.క్యాబ్ నడుపుతున్న సమయంలో గతంలో పెద్దగా వెళ్లని ప్రాంతాలను సందర్శించాడు. స్థానికుల జీవనశైలి, చిన్నచిన్న తినుబండారాలు, పాత వీధులు, నగర సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాడు. కోల్‌కతాను పర్యాటకులకు కేవలం ప్రసిద్ధ సందర్శనీయ స్థలాలకే పరిమితం చేయకుండా, దాని అసలైన జీవనశైలిని పరిచయం చేయవచ్చనే ఆలోచనకు ఈ అనుభవం పునాది వేసింది.ఎయిర్‌బీఎన్‌బీ అతిథితో మొదలైన వ్యాపారంసోహమ్ తల్లిదండ్రులు కోల్‌కతాలో పర్యాటకులకు వసతి కల్పించే ఎయిర్‌బీఎన్‌బీ ఆస్తులను నిర్వహించేవారు. అక్కడికి వచ్చే అతిథులకు నగరాన్ని పరిచయం చేయడంలో సోహమ్ సాయపడేవాడు. ఒకసారి ఓ అతిథి తనతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలను చూపించాలని కోరడంతో అతడు అంగీకరించాడు. అలా మొదలైన సాధారణ నగర సందర్శన క్రమంగా చెల్లింపు ఆధారిత నడక పర్యటనగా మారింది.అతిథుల నుంచి మంచి స్పందన, సానుకూల సమీక్షలు రావడంతో ఈ సేవకు డిమాండ్ పెరిగింది. దీంతో సోహమ్ ‘కలకత్తా క్యాప్సూల్’ (Calcutta Capsule) పేరుతో హెరిటేజ్ వాకింగ్ టూర్ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. ఈ సంస్థ ద్వారా పర్యాటకులకు కోల్‌కతాలోని చారిత్రక ప్రాంతాలు, పాత వీధులు, స్థానిక సంస్కృతి, ఆహార విశేషాలను దగ్గరగా పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం నడక పర్యటనలతో పాటు వసతి సేవలను కూడా నిర్వహిస్తున్నాడు.రెండేళ్ల తర్వాతే ఆర్థిక స్వతంత్రతఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే సోహమ్ వ్యాపారం లాభాల బాట పట్టలేదు. తన పొదుపు ఎంతకాలం సరిపోతుంది? విద్యార్థి రుణాలు, రోజువారీ ఖర్చులను ఎలా భరించాలి? అనే అంశాలను ముందుగానే లెక్కగట్టి అడుగులు వేశాడు. తనకు దాదాపు రెండేళ్లపాటు జీవన ఖర్చులను భరించేందుకు అవసరమైన పొదుపు ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నాడు.ఆర్థికంగా తన పొదుపుపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిలదొక్కుకోవడానికి రెండేళ్లు పట్టిందని సోహమ్ వెల్లడించాడు. ఇప్పుడు తన పూర్వపు ఐటీ ఉద్యోగంలో పొందిన వార్షిక ఆదాయంతో పోలిస్తే నాలుగైదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు.ఐటీ అనుభవమే ఇప్పుడు పెట్టుబడిసోహమ్ తన వ్యాపార నిర్వహణలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు. పర్యటనలు నిర్వహించడంతో పాటు వీడియోల తయారీ, ఎడిటింగ్, వెబ్సైట్ నిర్వహణ, మార్కెటింగ్ వంటి పనులను కూడా స్వయంగా చూసుకుంటున్నాడు. ఐటీ రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలు ఇప్పుడు తన సృజనాత్మక ఆలోచనలను వ్యాపారంగా మార్చడానికి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. తాజా మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటివరకు 4,000 మందికి పైగా అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన సోహమ్.. వారిలో 2,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలిపాడు.ఇతరులకు ఆయన ఇచ్చే సందేశం ఒక్కటే.. ఉద్యోగంలో సంతృప్తి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం తప్పు కాదు. అయితే కేవలం అభిరుచి ఉందనే కారణంతో ఉద్యోగాన్ని వదిలేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయం. కొత్తగా చేపట్టే పనికి ఆదాయ అవకాశాలు ఉన్నాయా? ఆర్థిక అవసరాలను ఎలా తీర్చుకోవాలి? ఎంతకాలం ఆదాయం లేకుండా కొనసాగగలం? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. View this post on Instagram A post shared by Calcutta Capsule Walking Tours (@calcuttacapsule) -
సీఈసీ రాజీనామా చేయాల్సిందే!
బెంగళూరు: బీజేపీని వ్యతిరేకించే వారి ఓటు హక్కును రద్దు చేయడమే లక్ష్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను తీసుకొచ్చారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల సంఘం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఫ్రీడమ్ పార్కు వద్ద గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘పీపుల్స్ ట్రిబ్యూన్’పేరిట భారీ సభ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో అభిజీత్ దీప్కే, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, సీనియర్ సాహితీవేత్త దేవనూరు మహాదేవ, ప్రముఖ ఆర్థిక నిపుణులు పరకాల ప్రభాకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్‌గౌడ, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్లో విచ్చలవిడిగా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. సభకు మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ఎర్రర్ 404– నేమ్ నాట్ ఫౌండ్, అంతా అయిపోయింది బ్రో, రాజీనామా చేయండి సార్’అని రాసి ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. ‘మా పేర్లు తొలగించకండి, మా గొంతు వినండి’అని నినదించారు. నిరంకుశత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. బతికి ఉన్నామని నిరూపించుకోవడానికే.. ఓటర్ల జాబితా నుంచి ఇష్టారాజ్యంగా ప్రజల పేర్లు తొలగించారని, తాము బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఓట్లను తొలగించడం, దొంగిలించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారని ధ్వజమెత్తారు. మరణించినట్లు ఎన్నికల సంఘం చెబుతున్న వ్యక్తులు ఇక్కడ సజీవంగా నిలబడి ఉన్నారని, సంభవించిన మరణం వీరిది కాదని, అది ఈ దేశ ప్రజాస్వామ్య మరణం అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆదేశాల మేరకే ప్రజల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ‘నెక్ట్స్ వికెట్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్’ మహాత్మా గాం«దీని భారతదేశపు ‘ఆత్మ’గా, అంబేడ్కర్‌ను ‘వెన్నెముక’గా, జవహర్లాల్ నెహ్రూను ‘మేధస్సు’గా అభిజీత్ దీప్కే అభివరి్ణంచారు. ఈ ముగ్గురు నేతలు భారతదేశ పునాదిని నిర్మించారని కొనియాడారు. నెహ్రూతో మోదీకి ఎంతమాత్రం పోలిక లేదన్నారు. ఓట్లను తొలగించడం ద్వారా నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగాలని మోదీ భావిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఓటు హక్కు సహా ఎన్నో హక్కులను కల్పించిన నెహ్రూ మేధస్సు చాలా గొప్పది అని ప్రశంసించారు. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’అనే నినాదం వెనుక ‘ఒక దేశం, ఒక పార్టీ’అనే విధానం ఉందని పేర్కొన్నారు. దీన్ని జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ విధానంతో పోల్చారు. బీజేపీకి మద్దతు ఇవ్వని వారి ఓట్లను తొలగించే నిర్ణయం తీసుకున్నారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ‘ప్రజలు మాకు ఓటు వేయకపోతే, వారి ఓట్లనే తొలగిస్తాం’అనే ధోరణిని బీజేపీ అనుసరిస్తోందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ నాయకులను పూర్తిగా బలహీనపర్చడమే దీని వెను క ఉన్న అసలు వ్యూహమని మండిపడ్డారు. తమ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఇక తమ ‘నెక్ట్స్ వికెట్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్’అని దీప్కే తేల్చిచెప్పారు. పౌరుల గౌరవం, హక్కులపై దాడి: ప్రకాశ్ రాజ్ ఎస్ఐఆర్ అనేది ఓట్ల తొలగింపునకు సంబంధించినది మాత్రమే కాదని.. అది పౌరుల గౌరవం, హక్కులపై దాడి ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మోదీ, అమిత్ షాల ఆదేశాల మేరకే జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ పోరాటం కేవలం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం మాత్రమే కాదన్నారు. ఆయన వెళ్లిపోయినా మరో అజ్ఞానేశ్ కుమార్ రావొచ్చని చెప్పారు. కాబట్టి ఎస్ఐఆర్ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ముసుగులో గిరిజనులు, పేదలు, ముస్లింలు, ఇతర మైనారిటీల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని దుయ్యబట్టారు. ప్రజలు తమ ఓట్లను తిరిగి పొందడానికి పోరాడాల్సిన పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా ఓట్లను తొలగించడానికి వారెవరు?’అని ప్రశ్నించారు. ‘ఓటు చోర్, గద్దీ చోర్’అని ప్రకాశ్ రాజ్ నినదించారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి తప్పుకోవాలి: ధ్రువ్ రాఠీ ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సంఘం నుంచి పారదర్శకత, జవాబుదారీతనం ఏమాత్రం లేవని యూట్యూబర్ ధ్రువ్ రాఠీ విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఒక సాధారణ పౌరుడిగానే ఈ ఆందోళనలో పాల్గొన్నానని తెలిపారు. ప్రభుత్వ మార్పు కోసం తాను ఇక్కడికి రాలేదన్నారు. ఎలాన్ మస్క్ గానీ, జార్జ్ సోరోస్ గానీ తనకు నిధులు సమకూర్చలేదని వివరణ ఇచ్చారు. తన సొంత డబ్బుతోనే ఇక్కడికి వచ్చానని స్పష్టంచేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ‘ఓట్ల చోరీ’అనేది ప్రతి పౌరుడికి సంబంధించిన అంశమని ఉద్ఘాటించారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని భావిస్తే, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి తప్పుకోవాలని తేల్చిచెప్పారు. నిరసనలో పాల్గొన్న వారిని దేశభక్తులుగా ధ్రువ్ రాఠీ అభివరి్ణంచారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను సమర్థిస్తున్న వారు దేశద్రోహులేనని విమర్శించారు. -
జీవితఖైదీ భార్యతో డీఐజీ సరసాలు
యశవంతపుర (కర్ణాటక): బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అపహరణ, హత్య కేసులో జీవితఖైదు పడిన శంకర్ ఆర్ముగం అనే నేరగాడు నకిలీ సుప్రీంకోర్టు తీర్పు కాపీలు సృష్టించి విడుదలైన కేసులో జుగుప్సాకరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో జైళ్ల శాఖ డీఐజీ సోమశేఖర్‌ను పరప్పన అగ్రహార పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా గుట్టు రట్టయింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు.. శంకర్‌ను కలవడానికి అతని భార్య తరచుగా జైలుకు వచ్చేది. ఆ సమయంలో జైలు సూపరింటెండెంటుగా ఉన్న సోమశేఖర్ తన అధికారాన్ని ఉపయోగించుకుని ఆమెతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడు. తరచుగా నగ్న వీడియో కాల్స్ చేయించుకునేవాడు. ఇలా శంకర్‌తో కుమ్మక్కయిన అతడు విడుదలకు కుట్ర రూపొందించాడు. జైలులోని క్లర్కు శ్రీకాంత్ ద్వారా నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను సృష్టించి, వాటిని శంకర్ భార్యకు అందజేశాడు. ఆమె ద్వారా జైలుకు సమర్పించి, ఆమోదింపజేసి జీవితఖైదీని విడుదల చేయించాడు. శంకర్ రెండో పెళ్లితో.. తరువాతే వ్యవహారం మలుపు తిరిగింది. 2018 ఆఖరులో విడుదలైన శంకర్ భార్యను దూరం పెట్టి, మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన మొదటి భార్య జైళ్ల శాఖ చీఫ్‌కు నకిలీ సుప్రీంకోర్టు తీర్పు గురించి ఉత్తరం రాసింది. దీంతో వ్యవహారం గుట్టురట్టు కావడంతో శంకర్, క్లర్కు శ్రీకాంత్‌లను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. వారి విచారణలో సోమశేఖర్ పాత్ర బయటపడింది. ఇక న్యూడ్ కాల్స్ వీడియోలను పోలీసులు పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇదీ చదవండి: రెండు తలల పాము రూ.కోటి -
కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడిన యువతి.. విషాదం!
విహారయాత్రలు తీరని విషాదాన్ని పంచాయి. వరుస సెలవులు రావడంతో స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లినవారు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. చెన్నపట్టణ వద్ద ఓ యువతి దుర్మరణం చెందగా, జిగణి వద్ద క్వారీ నీటికుంటలో టెక్కీ గల్లంతయ్యాడు. ఇద్దరూ బెంగళూరువాసులే కావడం గమనార్హం.బెంగళూరు: స్నేహితులతో కలిసి వీకెండ్ ట్రిప్‌కు వెళ్లిన యువతి అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చెన్నపట్టణ తాలూకా సంకలగెరె వద్ద బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే పై చోటుచేసుకుంది. బెంగళూరులోని కుంబళగోడు సమీపంలోని రామోహళ్లి నివాసి భూమిక (22) మృతురాలు. వీకెండ్ కావడంతో భూమిక, స్నేహితులు కలిసి కారులో విహారయాత్రకు వెళ్లారు. శుక్రవారం రాత్రి 11:48 గంటల సమయంలో అందరూ కారు దిగారు. భూమిక అవతలకు వెళ్లడానికి రహదారి దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆమెను ఢీకొనింది. ఈ తాకిడికి భూమిక కొంతదూరం గాల్లోకి ఎగిరిపడడంతో తీవ్ర గాయాలై క్షణాల్లో మరణించింది. కళ్లముందు జరిగిన ఘోరంతో స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. చెన్నపట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు ఆమెను ఢీకొన్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. జాడ లేని టెక్కీదొడ్డబళ్లాపురం: బెంగళూరు శివారులోని జిగణి వద్ద ఉన్న యల్లమ్మ దొడ్డయ్య రాతి క్వారీలో నీటికుంటలో ఈతకొట్టడానికి దిగిన యువకుడు నీట మునిగి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన, బెంగళూరులోని హలసూరులో నివసిస్తున్న టెక్కీ వినయ్ (30) మృతుడు. వివరాలు.. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆఫీసుకు సెలవు ఉండడంతో 8 మంది స్నేహితులతో కలిసి విహారానికి వచ్చారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో క్వారీ గుంతలో వాననీరు నిండి ఉండడం చూసి ఈత కొట్టడానికి దిగాడు. అది చాలా లోతుగా ఉండడంతో ఈత కొట్టలేక మునిగిపోయాడు. దీంతో స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని గాలింపు చేపట్టారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు పరుగుపరుగున క్వారీ వద్దకు వచ్చారు. వినయ్ ఎక్కడున్నావు.., త్వరగా రా అని రోదించడం అందరినీ కలచివేసింది. -
నెలకు రూ.లక్ష సంపాదిస్తేనే బెంగళూరులో జీవితం
బెంగళూరు: నెలకు రూ.లక్ష వేతనం లేకుంటే బెంగళూరులో జీవించడం కష్టమంటూ ఐటీ ఉద్యోగి శివాంక్ గోయల్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బెంగళూరులో జీవనశైలి, ఖర్చులపై తన అనుభవాలను ఆ వీడియోలో పంచుకున్నారు. ‘నెలకు కనీసం రూ.లక్ష వేతనం ఉండాలి. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ బెంగళూరుకు రావాలనుకునేవారు ఈ విషయంపై ఒకసారి పరిశీలించుకోవాలి’ అని సూచించారు. ‘బెంగళూరులో ఇంటి అద్దెలు అధికం. రూ.2 లక్షల వరకు అడ్వాన్స్ ఇవ్వాలి. ట్రాఫిక్‌లో 5 కిలోమీటర్ల దూరం క్యాబ్‌లో వెళ్లాలంటే రూ.600 అవుతుంది’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Shivank Goel (@thezeroquotient) -
నెలకు రూ.70 వేల ఇంటి రెంట్.. రూ.4 లక్షల డిపాజిట్!
భారత ఐటీ హబ్ బెంగళూరులో గృహాల అద్దెలు చుక్కలనంటుతున్న వైనం మరొకసారి చర్చనీయాంశమైంది. ఒక సాధారణ 2బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ.70,000 అద్దెతో పాటు రూ.4 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్ చేయడం ఐటీ ఉద్యోగులు, అద్దెదారులను ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియా వేదిక ‘రెడ్డిట్’లో వెలుగుచూసిన ఈ కథనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వర్గాల్లో వేడిని రాజేసింది.ఆఫీసుకు సమీపంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో నెలకు రూ.70 వేలు చెల్లించేందుకు సిద్ధపడినప్పటికీ ఫ్లాట్ యజమానులు ఇచ్చే సదుపాయాలు మాత్రం దానికి తగినట్లుగా లేకపోవడం గమనార్హం. కేవలం కొన్ని సోఫాలు, చిన్న టీవీ ఉంచి దాన్ని ఫుల్లీ ఫర్నిష్డ్‌గా ప్రచారం చేయడం, కనీసం రెండో బెడ్రూమ్లో బెడ్ లేదా వర్క్ డెస్క్ పట్టేంత స్థలం కూడా లేకపోవడాన్ని సదరు అద్దెదారు ఎత్తిచూపారు. ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. రూ.65,000 అద్దె, 3 నెలల డిపాజిట్‌కు ప్రతిపాదన చేసినప్పటికీ ఓనర్ నిరాకరించడంతో ఆ డీల్‌ను వదులుకున్నట్లు ఆయన తెలిపారు.ఫ్రాన్స్ కంటే బెంగళూరులోనే ఎక్కువ!ఈ ఉదంతంపై స్పందించిన నెటిజన్లు బెంగళూరు రెంట్ మార్కెట్ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో అంతకంటే మెరుగైన జీవన ప్రమాణాలు, ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ అక్కడ ఇంటి అద్దెలు బెంగళూరు కంటే తక్కువగా ఉన్నాయని ఒక యూజర్ పోల్చి చెప్పారు.ఐటీ కంపెనీల జీతాలు ఎల్లప్పుడూ నిలకడగా ఉండవని, ఉద్యోగ భద్రత తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి అసంబద్ధమైన అద్దెలను డిమాండ్ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానికేతరుల అవసరాలను ఆసరాగా చేసుకుని యజమానులు ఇష్టారాజ్యంగా డిపాజిట్లు, అద్దెలు పెంచుతున్నారని, అద్దెదారులు కూడా విచక్షణ లేకుండా అడిగినంత చెల్లించడం మానుకోవాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: పరుగెత్తిన పసిడి ధర! -
సిగ్నల్ జంప్‌కు రూ.3 వేల జరిమానా?
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య, దానికి తోడు చలాన్లతో వాహనదారులు జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంతలో ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చేలా జరిమానాలు భారీగా పెంచే దిశలో ఉన్నారు. సిగ్నల్ జంప్, నో పార్కింగ్, ఫుట్‌పాత్ పార్కింగ్ తదితర తప్పిదాలకు మరింత చెల్లించుకోవాలి. బుధవారంనాడు రవాణాశాఖ, హోంశాఖల మధ్య ఈ చర్చలు జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500, తరువాత రూ.1000 జరిమానా కట్టాలి. తాజా సవరింపుల ప్రకారం మొదటిసారి ఉన్నంఘిస్తే రూ.3000, రెండోసారి ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానా కట్టాల్సి ఉంది. ఇలా ఏ తప్పిదానికైనా ఐదారు రెట్లు పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వచ్చే స్పందన చూసుకుని కాస్త అటూఇటుగా జరిమానాల మొత్తాన్ని నిర్ణయిస్తారు. -
ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..!
ఒక మహిళా టెకీ యువత ఎంతో ఇష్టపడే డ్రీమ్ జాబ్ అయిన ఐటీ ఉద్యోగాన్ని వద్దనుకుని మరి రాపిడో ఆటో నడుపుతోంది. కార్పొరేట్ ఉద్యోగాన్నే ఇష్టపడే ఈ రోజుల్లో ఆమె ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కాదు..ఇష్టపడితే ఏ పని చిన్నది కాదని అంటోంది. పైగా ఆటో డ్రైవర్‌గానే ఎక్కువ సంపాదిస్తున్నా అని చెబుతుండటం విశేషం. ఆ మహిళే బెంగళూరుకి చెందిన మాజీ ఐటీ ఉద్యోగిని. తన తండ్రి మరణంతోటే తాను కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు తెలిపింది. నైట్‌షిప్టులు చేస్తూనే తన తల్లికి అండగా ఉండటం కష్టంగా ఉండటంతోనే ఇలా చేసినట్లు తెలిపింది. పైగా ఆటో డ్రైవర్‌గా సమయంపై నియంత్రణ తోపాటు ఇంటికి దగ్గరగా ఉండేలా చూసుకోగలుగుతున్నట్లు వెల్లడించింది. ఇలా ఆటో డ్రైవర్‌గా మారాలనే ఆలోచనను తన కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిందని, అలాగే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభమేమి కాదని పేర్కొంది. అయితే ఆమె తన పరిస్థితులు దృష్ట్యా కుటుంబానికి ఏది ఉత్తమమో దానికే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. పైగా ఆమె ఆటోడ్రైవర్‌గానే ఎక్కువ సంపాదిస్తున్నట్లు తెలిపింది. కంటెంట్ క్రియేటర్ తన్వి సదరు మహిళతో సంభాషిస్తున్న వీడియోని నెట్టింట పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేగాదు ఆ మాజీ టెకీ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఆటో నడుపుతుండటం ఏంటని కస్టమర్లు తనను చూసి విస్తుపోతుంటారని నవ్వుతూ చెబుతోంది. "ఆమె ప్రజలు ఏమనుకుంటారు? అనే దాని గురించి పట్టించుకోకుండా స్వేచ్ఛను ఎంచుకుంది. తన జీవిత బాధ్యతను తానే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేగాదు తన జీవితానికి సమాజం అనుమతి అవసరం లేదని నిర్ణయించుకున్న బెంగళూరు అమ్మాయి. పైగా మహిళలు స్వయంగా వాహనం నడపడం (స్టీరింగ్ చేతిలోకి తీసుకోవడం) మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ధైర్యంగా ఉండటం అంటే ఎప్పుడూ ఏదో అసాధారణమైన పని చేయడం మాత్రమే కాదు. కొన్నిసార్లు, 'నాకు ఇదే కావాలి, దీన్నే నేను ఎంచుకుంటున్నాను' అని చెప్పే ధైర్యం కలిగి ఉండటమే నిజమైన ధైర్యం." అని కంటెంట్ క్రియేటర్ తన్వి ఆ మాజీ టెకీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆమెను చూస్తే గర్వంగా ఉంది. అలాగే తల్లిని రాత్రిపూట ఒంటరిగా వదిలిపెట్టకూడదన్న ఆమె ఆలోచన నిజంగా అభినందనీయం అని ప్రశంసిస్తూ పొస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Tanvi👑 (@the_tanvishetty) ఇదీ చదవండి: మరీ ఏడు నెలల గర్భంతోనా.. రిస్క్ కాదా?) -
పట్టపగలే.. ఆటో డ్రైవర్ యువతుల మధ్య ఫైట్
ఆటో ఛార్జీ విషయంలో మొదలైన వివాదం రోడ్డుపైనే కొట్టుకునే వరకు వెళ్లింది. ఇద్దరు యువతులు, ఆటో డ్రైవర్ పరస్పరం దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 3వ సెక్టార్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురూ ఒకరిపై ఒకరు చేతులు చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీడియో వైరల్ కావడంతో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. ఇద్దరు యువతులను సంప్రదించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే వారు వెంటనే రాకుండా ఒకటి రెండు రోజుల సమయం అడిగారు. మరోవైపు పోలీసులు ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడితోనూ మాట్లాడారు.డ్రైవర్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. యువతులు అతడి ఆటోను బుక్ చేసుకున్నారు. ప్రయాణం పూర్తయిన తర్వాత చెల్లింపు విషయంలో గొడవ మొదలైంది. యువతులు మద్యం మత్తులో ఉన్నారని, తనను దూషిస్తూ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించారని డ్రైవర్ ఆరోపించాడు. ముందుగా వారే తనపై దాడి చేశారని.. తాను తిరిగి కొట్టానని పోలీసులకు చెప్పాడు. అయితే యువతులు పోలీసులకు ఏం చెప్పారన్నది ఇంకా బయటకు రాలేదు.వీడియోతో వైరల్.. కేసు ఎప్పుడు?రోడ్డుపై జరిగిన గొడవను అక్కడున్న వారు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు. అయితే అందుబాటులో ఉన్న వీడియోలో గొడవకు ముందు ఏం జరిగిందన్నది తెలియడం లేదు. దీంతో మొదట ఎవరు దాడి చేశారన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.Kalesh b/w a Group of Girls and Auto Driver over Fare issues, HSR Layout Bengaluru pic.twitter.com/gNAxhfVs93— Ghar Ke Kalesh (@gharkekalesh) September 29, 2026ప్రస్తుతం మహిళలు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. వారు ఫిర్యాదు చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు తెలిపారు. దీంతో ఈ వైరల్ వీడియో వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఫిర్యాదుపైనే ఆధారపడి ఉన్నాయి.ఛార్జీ వివాదం.. మరోసారి చర్చఈ ఘటనతో బెంగళూరులో ఆటో ఛార్జీలపై మరోసారి చర్చ మొదలైంది. నగరంలో ఆటో ఛార్జీల విషయంలో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తు, ఇరువర్గాల ఫిర్యాదుల తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నీటి కోసం ఊరిని అమ్మేస్తారా? -
ఏనుగు ఎంత పని చేసిందీ..
కర్ణాటక: ఉద్యాననగరిలో అడవి ఏనుగు దాడి కలకలం రేపుతోంది. మైసూరు రోడ్డు అంచెపాళ్యలో నాగరాజు (60) అనే స్థానికుడు సోమవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా కెంగేరి సమీపంలోని ఆర్ఆర్ మెడికల్ కాలేజీ వద్ద భవనాల మధ్యలోనే ఏనుగు దాడి చేసి హతమార్చింది.గతంలో నిర్మాణ కార్మికునిగా పనిచేసి ఇప్పుడు ఊరికే ఉంటున్న నాగరాజు ఏనుగు దాడిలో చనిపోయాడని తెలిసి ఆయన భార్య, కూతుళ్లు పరుగు పరుగున వచ్చి రోదించారు. ఆస్పత్రిలో ఉంచిన మృతదేహాన్ని అటవీ మంత్రి రామలింగారెడ్డి పరిశీలించి కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.ఎలా వచ్చి వెళ్లిందంటే..ఏనుగు గుద్దడంతో ఒకటి రెండు ప్రహరీలు కూడా కూలిపోవడం చూస్తే దాని శక్తి అర్థమవుతుంది. ఈ ఏనుగు బన్నేరుఘట్ట అడవి నుంచి జనావాసాల గుండా బయల్దేరి బీఎం కావల్ అరణ్యంలోకి చేరి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.ఈ ప్రాంతంలో పొలాలు, గుట్టల మధ్యలో ఇళ్ల నిర్మాణం అధికమైంది. ఒకప్పుడు ఇది ఏనుగులు సంచరించే ప్రాంతంగా ఉండేదని చెప్పారు. ఓ కుర్ర ఏనుగు తెల్లవారుజామున 5:10 గంటల సమయంలో పరిగెడుతూ వెళ్లడం ఓ సీసీ కెమెరాలో రికార్డయింది. అటవీ సిబ్బంది ఏనుగు కోసం అన్వేషణ చేపట్టారు. స్థానికుల్లో గుబులు నెలకొంది.ఇదీ చదవండి: యువకుడిని ఇంట్లోకి పిలిపించి.. చున్నీ గొంతుకు బిగించి.. -
‘‘కనిపించకుండా దాక్కుంటూ ఫుడ్ డెలివరీ’’
బెంగళూరుకు చెందిన కౌశిక్ ఖార్వీ అనే యువకుడు ఒకప్పుడు జీవనోపాధి కోసం స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఈటరీ బిజినెస్, నిర్వహిస్తూనే సముద్ర ఆహారంపై సలహాలు అందించే మరో వ్యాపారాన్ని ప్రారంభించారు. దాదాపు 9 ఏళ్ల క్రితం డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.కంప్యూటర్ సైన్స్ చదివిన కౌశిక్ ఖార్వీ బెంగళూరులోని ఏసీఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చదువుకున్నట్లు ఆయన లింక్డ్ఇన్ ద్వారా తెలుస్తోంది. గత వారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో తన ప్రయాణాన్ని ఆయన వివరించారు. ఒకప్పుడు స్విగ్గీలో ఆహారం డెలివరీ చేస్తున్న విషయాన్ని స్నేహితులకు తెలియకుండా దాచేవాడినని చెప్పారు.“9 ఏళ్ల క్రితం స్విగ్గీ డెలివరీ చేస్తున్నప్పుడు నా స్నేహితులకు కనిపించకుండా దాక్కునేవాడిని” అని కౌశిక్ తెలిపారు. తాను డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినప్పటి ఫొటోలను పంచుకుంటూ.. “సరిగ్గా 9 ఏళ్ల క్రితం నేను స్విగ్గీలో పార్ట్‌టైమ్ డెలివరీ పార్ట్నర్గా చేరాను. కష్టపడి పనిచేయడం కంటే, నా స్నేహితులు నన్ను కేవలం డెలివరీ వ్యక్తిగానే చూస్తారేమోనన్న భయమే ఎక్కువగా ఉండేది” అని రాశారు.కెరీర్లో సక్సెస్ దాదాపు దశాబ్దం తర్వాత కౌశిక్ బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ‘మంగళూరు ఇన్ బెంగళూరు’ పేరుతో మంగళూరు శైలిలో సముద్ర ఆహారం అందించే ఆహార బండిని నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సముద్ర ఆహారంపై తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ‘కౌశిక్ సీఫుడ్స్’ను కూడా ప్రారంభించారు. ఇందులో సముద్ర ఆహారంపై వాస్తవ సమాచారం, ఆచరణాత్మక సూచనలు, ఆసక్తికర విషయాలు, తీర ప్రాంత అనుభవాలను సులభంగా అర్థమయ్యేలా పంచుకుంటానని ఆయన తెలిపారు.తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రముఖ సముద్ర ఆహార రెస్టారెంట్ల వద్ద ఆహారం తీసుకునేందుకు ఎదురుచూసిన స్థాయి నుంచి నగరంలోని ప్రజాదరణ పొందిన సముద్ర ఆహార కేంద్రాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నానని కౌశిక్ పేర్కొన్నారు. దీనికి వినియోగదారులు, భాగస్వాములు, తన బృందం అందించిన మద్దతే కారణమని చెప్పారు.తనకు అవకాశం ఇచ్చిన స్విగ్గీకి కూడా కౌశిక్ కృతజ్ఞతలు తెలిపారు. “ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. నా కష్టకాలంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు స్విగ్గీకి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఆయన కథకు ఇన్స్టాగ్రామ్ యూజర్ల నుంచి ప్రశంసలు వచ్చాయి. కష్టాలను అధిగమించి ముందుకు సాగిన ఉదాహరణగా ఆయనను పలువురు అభివర్ణించారు. ఏ పని చిన్నది కాదని, అన్ని వృత్తులను సమానంగా గౌరవించాలని మరికొందరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి View this post on Instagram A post shared by Koushik Kharvi (@koushh_lakshara) -
ఆమె అస్తమించీ.. ప్రాణం పోసింది
బెంగళూరు: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించడం ద్వారా 7 మందికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఈ సంఘటన ఆనేకల్ తాలూకా ద్యావసంద్రలో జరిగింది. వివరాలు.. గ్రామ నివాసి కుసుమ (39) ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేది. భర్త జయశంకర్, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఇంట్లో కుసుమ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను బొమ్మసంద్రలోని నారాయణ హెల్త్ సిటీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయ్యిందని చెప్పారు. ఇక ఆమె జీవించే మార్గం లేదని తెలిపారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి నిర్ణయించారు. కుసుమ కళ్లు, గుండె, లివర్, కిడ్నీ తదితర అవయవాలను సేకరించి, వివిధ జబ్బులతో బాధపడుతున్న 7 లేదా 8 మందికి అమర్చి ఆరోగ్యకర జీవితాన్నిచ్చారు. కుసుమ కుటుంబసభ్యుల త్యాగాన్ని అందరూ అభినందించారు. -
ఈ ఏఐ ఏంట్రా బాబూ.. ఇంత పనిచేసింది?
బెంగళూరు: ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ ఆధారిత కెమెరా ఓ గిటార్‌ను ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తిగా పొరబడింది. దీంతో హెల్మెట్ ధరించకుండా వెనుక వ్యక్తిని తీసుకెళ్లారంటూ వాహన యజమానికి జరిమానా విధించింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆటోమేటెడ్ ట్రాఫిక్ నిఘా వ్యవస్థలపై చర్చకు దారితీసింది.సౌవిక్ దత్తా తన భార్యకు చెందిన స్కూటర్‌పై హెబ్బాల్ నుంచి టిన్ ఫ్యాక్టరీ వైపు వెళ్తున్నారు. ఆయన వీపుకు గిటార్ కేసును తగిలించుకున్నారు. ఈ దృశ్యాన్ని ట్రాఫిక్ కెమెరా తప్పుగా అర్థం చేసుకుని, గిటార్ కేసును వెనుక కూర్చున్న వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ జరిమానా విధించింది. కెమెరా తీసిన ఫొటోతో కూడిన జరిమానా నోటీసు స్కూటర్ యజమాని అయిన ఆయన భార్యకు చేరింది.దీనిపై దత్తా బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ఫిర్యాదు చేశారు. ‘‘నేను బెంగళూరులో నా గిటార్‌ను వీపుపై తగిలించుకుని నా భార్యకు చెందిన ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్నాను. నా భార్యకు ‘వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదు’ అంటూ ట్రాఫిక్ జరిమానా వచ్చింది. నోటీసు నంబర్ 86202541. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘన గుర్తింపు ఇదేనా? దయచేసి జరిమానాను రద్దు చేయండి’’ అని పేర్కొన్నారు.దీనికి స్పందించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. ఉల్లంఘనను సరిచేసేందుకు ట్రాఫిక్ ఆటోమేషన్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనతో ఏఐ ఆధారిత ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థల కచ్చితత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. కొంతమంది వాహనదారులు సామాజిక మాధ్యమాల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. సిగ్నల్ దాటేటప్పుడు, గ్రీన్ సిగ్నల్ ఉన్న ఇతర వాహనాలకు దారి ఇచ్చేందుకు జీబ్రా క్రాసింగ్‌ను కొద్దిగా దాటినా సిగ్నల్ ఉల్లంఘనగా కెమెరాలు గుర్తిస్తున్నాయని కొందరు ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసు స్పందన ఈ ఘటనపై ఓ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి స్పందిస్తూ.. ఏఐ వ్యవస్థ పొరపాటుతో ఇది ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనగా నమోదైందని తెలిపారు. ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతాయని, కొన్నిసార్లు స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చున్న చిన్నారిని కూడా హెల్మెట్ లేని వెనుక ప్రయాణికుడిగా వ్యవస్థ గుర్తిస్తుందని చెప్పారు. ఇలాంటి జరిమానాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటిని పరిశీలించి సరిచేస్తామని తెలిపారు.‘‘నిరంతరం ఎక్కువ మొత్తంలో సమాచారం అందించడంతో ఏఐ వ్యవస్థ మరింత మెరుగవుతుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. ఇలాంటి తప్పుడు గుర్తింపులను పరిశీలించి సరిచేసేందుకు మా వద్ద ఇప్పటికే ప్రత్యేక బృందం ఉంది. ఇది కూడా అలాంటి పొరపాటే కావచ్చు. మేము దాన్ని సరిచేస్తాం’’ అని అధికారి తెలిపారు. ఏఐ ఆధారిత వ్యవస్థ ఇంకా 100 శాతం కచ్చితత్వాన్ని సాధించలేదని ఆయన అంగీకరించారు. -
భార్యను చంపేసి.. పరుపులో చుట్టేసి..
బెంగళూరు: భార్యను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని ఇంట్లో మూడురోజులపాటు దాచిపెట్టిన అనంతరం పరుపులో చుట్టి ఖాళీ స్థలంలో పడేసిన భర్త ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన అనసూయ(28), సాగర్‌చంద్ర రావత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ బెంగళూరుకు వలస వచ్చి హోటళ్లలో పనిచేసేవారు. సంపిగెహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండేవారు. ఈనెల 11న డబ్బు విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సాగర్ అనసూయను గొంతు నులిమి చంపేశాడు.అనంతరం మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లో ఉంచాడు. తర్వాత పరుపులో చుట్టి సంపిగెహళ్లి ఎంఎస్.నగర అగ్రహార లేఔట్‌లోని ఖాళీ స్థలంలో పడేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఖాళీ స్థలాన్ని కారి్మకులు శుభ్రం చేస్తుండగా కుళ్లిన స్థితిలో కుక్కలు పీక్కుతిన్న గుర్తుతెలియని మహిళ శవం లభ్యమైంది. సంపిగెహళ్లి పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతదేహంపై ఉన్న దుస్తులను పరిశీలించగా మాల్ట్యాగ్ లభించింది. దాని ఆధారంగా బిల్లు వివరాలను సేకరించి మృతురాలిని అనుసూయగా గుర్తించారు. గాలింపు చేపట్టి భర్త సాగర్‌చంద్ర రావత్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తానే అంతమొందించినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి -
బహిరంగ స్థలంలో ఎమ్మెల్యే మూత్ర విసర్జన
యశవంతపుర: బెంగళూరు ఆర్‌ఆర్‌నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న బహిరంగ స్థలంలో మూత్ర విసర్జన చేస్తుండగా ప్రశ్నించిన వ్యక్తిపై దౌర్జన్యం చేసినట్లు అరోపణలు వస్తున్నాయి. బెంగళూరు సదాశివనగరలోని ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తుండగా అక్కడికి వెళ్లి ఓ యువకుడు ప్రశ్నించారు. యువకుడిని ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు తిట్టారు. తన తల్లిని అవమానించేలా ఎలా మాట్లాడతావంటూ ఎమ్మెల్యేని నిలదీశారు. తిరగబడిన యువకుడిని కాలర్ పట్టుకుని ఎమ్మెల్యే బెదిరించినట్లు అరోపణలు వస్తున్నాయి. యువకుడు ఎమ్మెల్యేతో వాదులాడుతున్న సమయంలో అక్కడే ముగ్గురు పోలీసులు చూస్తూ ప్రేక్షకపాత్ర వహించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
కర్ణాటక సీఎం నోట సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అభ్యంతరం
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాష్ట్రంలో దాదాపు డజను మంది ఎమ్మెల్యేలకు రెండేసి పెళ్లిళ్లు జరిగాయని ఆయన అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే ఈ వ్యాఖ్యపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎవరెవరో పేర్లు కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.వర్షాభావ పరిస్థితులపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో శివకుమార్ బెంగళూరు నగరంపై పెరుగుతున్న జనాభా ఒత్తిడిని ప్రస్తావించారు. బెంగళూరును కెంపేగౌడ నిర్మించారని, విధానసౌధను కేంగల్ హనుమంతయ్య నిర్మించారని, ఎస్.ఎం. కృష్ణ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. నగరానికి వచ్చిన వారు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లడం లేదని చెప్పారు.ఈ క్రమంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బెంగళూరుకు వచ్చిన వారు కూడా ఇక్కడే ఉండిపోతున్నారని, “మీలోనూ చాలామందికి రెండు పెళ్లిళ్లు ఉన్నాయి. అలాంటివారు ఓ డజను మంది ఉన్నారు. వారి జాబితా ఇవ్వగలను” అని వ్యాఖ్యానించారు. ధార్వాడ్, దక్షిణ కన్నడ తదితర జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, అయితే వాటిని బయటపెట్టడం లేదని చెప్పారు."MLAs who come to Bengaluru don't leave, I know dozens who had second marriages and settled here" : Karnataka CM DK Shivakumar while talking about growing population & rapid urbanization in Bengaluru. pic.twitter.com/MA8Kg4Y45g— Deepak Bopanna (@dpkBopanna) September 25, 2026అనవసరమైన వ్యాఖ్య: బీజేపీముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ స్పందించారు. ఇది అనవసరమైన వ్యాఖ్య అని పేర్కొంటూ.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని సీఎం చెబుతున్న ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో బెంగళూరుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేపైనా అనుమానం ఏర్పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను మాత్రం బెంగళూరులోనే పుట్టి పెరిగానని స్పష్టం చేశారు.బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్.సురేశ్ కుమార్ కూడా శివకుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం సరదాగా చెప్పి ఉండొచ్చని, కానీ అసెంబ్లీ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ గౌరవాన్ని పెంచదని అన్నారు. తాను సభలో ఉండి ఉంటే అప్పుడే స్పందించేవాడినని పేర్కొన్నారు.పేర్లు చెప్పాలి లేదంటే..రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండు కుటుంబాలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరనే విషయాన్ని సీఎం స్పష్టం చేయాలని సురేశ్ కుమార్ డిమాండ్ చేశారు. పేర్లు వెల్లడించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన ఆసక్తి, సందేహాలు ఏర్పడతాయని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలందరినీ అనుమానంగా చూడటం లేదా ఎగతాళి చేసే పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు.బెంగళూరు డెవలప్మెంట్.. జనాభా ఒత్తిడిపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అసలు చర్చను పక్కకు నెట్టి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన ప్రస్తావించిన ఎమ్మెల్యేల పేర్లు మాత్రం ఇప్పటివరకు బహిర్గతం కాలేదు.ఇదీ చదవండి: రెబల్ ఎంపీలకు గడువు.. రెండు వారాలే! -
బెంగళూరులో యాక్సెంచర్ విస్తరణ
గ్లోబల్ ఐటీ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ యాక్సెంచర్ బెంగళూరులో తన కార్యాలయ విస్తరణను కొనసాగిస్తోంది. సంస్థ అదనంగా 1.26 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకోవడంతో నగరంలో దాని మొత్తం ఆఫీస్ ఫుట్‌ప్రింట్ 5.67 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు అందుబాటులో తెలుస్తుంది.లీజు ఒప్పందం, అద్దె వివరాలుకొన్ని మీడియా సంస్థల నివేదిక ప్రకారం, బెల్లందూర్‌లోని ప్రిటెక్ పార్క్ సెజ్‌లో యాక్సెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ విస్తరణ చేపట్టింది. 4.41 లక్షల చదరపు అడుగుల స్థలానికి లీజు పునరుద్ధరణతో పాటు మరో 1.26 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సంస్థ అదనంగా తీసుకుంది. ప్రాపర్టీ లావాదేవీ సమాచార సంస్థ ప్రాప్‌స్టాక్ వివరాల ఆధారంగా ఈ సమాచారం వెల్లడైంది.కొత్త ఒప్పందం ప్రకారం, మొత్తం 5,66,617 చదరపు అడుగుల ఛార్జబుల్ ఏరియా సంస్థ అధీనంలో ఉంటుంది. చదరపు అడుగుకు నెలవారీ అద్దె రూ.76.20గా నిర్ణయించినట్లు పత్రాల ఆధారంగా తెలుస్తుంది. దీంతో పెరిగిన నెలవారీ అద్దె వ్యయం సుమారు రూ.4.32 కోట్లకు చేరనుంది. ఐదేళ్ల లీజు కాలానికి మొత్తం అద్దె చెల్లింపులు దాదాపు రూ.269 కోట్లుగా అంచనా వేశారు. ఒప్పందంలో రూ.16.11 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్, ప్రతి మూడేళ్లకు 12 శాతం అద్దె పెంపు నిబంధన ఉన్నాయి.ఐటీ కార్యాలయ మార్కెట్‌పై ప్రభావంబెంగళూరులోని బెల్లందూర్ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ వెంట కీలక వాణిజ్య కార్యాలయ కేంద్రంగా కొనసాగుతోంది. భారీ కార్యాలయ లీజులు, ముఖ్యంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) నగర వాణిజ్య రియల్ ఎస్టేట్ డిమాండ్‌లో ప్రాధాన్యం పొందుతున్నాయి. అయితే, యాక్సెంచర్ తాజా లీజు విస్తరణకు సంబంధించి సంస్థ అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే.. -
ఎమ్మెల్యే నారాయణస్వామితో.. కేజీఎఫ్ ఎమ్మెల్యే రగడ
బెంగళూరు: శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కోలారు జిల్లాలోని బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి, కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. వివాదం ఎలా మొదలైందంటే.. ఎమ్మెల్యే నారాయణస్వామి, బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వెనుక సీటు నుంచి రూపా వచ్చి చేయి చూపిస్తూ నారాయణ స్వామితో కోపంగా మాట్లాడారు. ఈ ఘర్షణకు కచ్చితమైన కారణం ఏమిటని తెలియరాలేదు. తన గురించే ఏదో మాట్లాడుతున్నాడని ఆమె అనుమానించడమే కారణమై ఉంటుందని అనుకుంటున్నారు. రూపా టేబుల్‌పై చేత్తో కొడుతూ హెచ్చరికలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కనిపించింది. ఆ సమయంలో మంత్రి, ఆమె తండ్రి మునియప్ప కూడా సభలో ఉన్నారు. బీజేఎల్పీ నేత అశోక్ స్పందిస్తూ.. చూడండీ.. అక్కడొక గొడవ జరుగుతోంది, మౌనంగా ఉండమ్మా, వారిని కొట్టవద్దు అని వ్యంగ్యంగా అన్నారు. ఈ రభస అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏం జరిగిందో అని ఆసక్తిగా వీక్షించారు. ఒకే జిల్లా, ఒకే పార్టీ ఎమ్మెల్యేల రగడ తీవ్ర చర్చనీయాంశమంది. ఇదీ చదవండి: సీజేపీ నెక్స్ట్ మిషన్.. మరికాసేపట్లో బిగ్ అనౌన్స్మెంట్? -
ఆ నాలుగు రాష్ట్రాల వారికి ఇక ఉద్యోగాలు ఇవ్వం!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల ఎంపిక, అర్హతలు, నైతిక ప్రవర్తన ఆధారంగా జరుగుతుంటుంది. కానీ, ఒక ఉద్యోగి చేసిన పొరపాటుకు ఏకంగా నాలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులపై నిషేధం విధిస్తూ బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈఓ తీసుకున్న నిర్ణయం ఐటీ, స్టార్టప్ వర్గాల్లో దుమారం రేపుతోంది.‘ఏ1 స్పోర్ట్స్ వరల్డ్’ ఫౌండర్, సీఈఓ కార్తిక్ ఎస్జీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను తమ కంపెనీలోకి ఇకపై తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరాదికి చెందిన ఒక మాజీ ఉద్యోగి అక్కడి మహిళా సిబ్బంది పట్ల వేధింపులకు పాల్పడటం, హెచ్చరించినా వైఖరి మార్చుకోకపోవడంతో అతడిని తొలగించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ సంస్థలోని 14 మంది మహిళా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు.ప్రాంతీయ వివక్షా?ఈ నిర్ణయం నెట్టింట చర్చకు దారితీసింది. ఒకరి వ్యక్తిగత ప్రవర్తనకు ఒక ప్రాంతం లేదా రాష్ట్రం మొత్తాన్ని బాధ్యులను చేస్తూ నిషేధించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు, సమానత్వ హక్కులకు విరుద్ధమని నిపుణులు, నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. అర్హతలను పక్కనపెట్టి ప్రాంతీయ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కార్పొరేట్ సంస్కృతికే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.అయితే, ‘నా కంపెనీ– నా నిబంధనలు’ అని సమర్థించుకున్న సీఈఓ, తమ కంపెనీలో మొత్తం 32 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో ఇతర రాష్ట్రాల వారు, ముఖ్యంగా దక్షిణేతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా సురక్షితంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.Im sorry for this...But today we have made it very clear after lengthy discussion and quarrel...We will not hire any male candidates in our company who come from these 4 states in north india...1. Uttar Pradesh.2. Rajasthan.3. Bihar.4. Madhya Pradesh.We do have 1…— Karthik SG (@kkarthikkgs) September 22, 2026లీగల్, హెచ్ఆర్ వర్గాల ఆందోళనఈ పరిణామంపై కార్పొరేట్ న్యాయ నిపుణులు, హెచ్ఆర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనివేళల్లో మహిళల భద్రత కోసం గైడ్‌లైన్స్, చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు అభ్యర్థుల ప్రాంతీయ గుర్తింపును బట్టి నిషేధం విధించడం చట్టబద్ధంగా నిలవదని పేర్కొంటున్నారు. కార్పొరేట్ నిర్ణయాలు చట్టపరిమితులకు లోబడి ఉండాలే తప్ప వ్యక్తిగత ఆగ్రహంతో తీసుకునేవిగా ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే.. -
నన్ను జైల్లోనే చంపేస్తారు
బెంగళూరు: ‘నా బ్యారక్‌లో నైజీరియా మహిళా ఖైదీలు నన్ను హింసిస్తున్నారు. వారు నన్ను చంపేస్తామని చెబుతున్నారు’ అని నటి పవిత్రగౌడ జడ్జి ముందు విలపించింది. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో పరప్పన జైల్లో ఉన్న ఆమె బెయిలు కోసం బెంగళూరు 59 సీసీహెచ్ కోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. పవిత్రగౌడ విలపిస్తూ గోడును వెళ్లబోసుకుంది. తన బ్యారక్‌లో నైజీరియా మహిళా నిందితులు ఉన్నారని, గతంలో వేధిస్తున్నారని జైలు అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిసి మరింత సతాయిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని పవిత్ర రోదించింది. తనకు చనిపోవాలని ఉందని, విషం కావాలని విలపిస్తూ చెప్పిందని ఆమె న్యాయవాదులు తెలిపారు. హైకోర్టుకు దర్శన్ భార్య రేణుకాస్వామి హత్యకేసులో అప్రూవర్‌గా మారతానని ప్రకటించిన ప్రదోశ్‌కు వ్యతిరేకంగా రెండో నిందితుడు, నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతడు దర్శన్‌కు శత్రువని, స్వార్థం కోసం అప్రూవర్ అవుతున్నాడని, అనుమతించరాదని కోరారు. -
వయసు 15.. పెట్టుబడులు రూ.13 లక్షలు!
పెట్టుబడుల విషయంలో ఇప్పటికీ చాలామంది యువతలో ఎన్నెన్నో ఆలోచనలు, లెక్కలేనన్ని సందేహాలు ఉన్నాయి. అయితే.. 10వ తరగతి అమ్మాయి ఏకంగా రూ.13.9 లక్షల విలువైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది.బెంగళూరులోని స్వర్గరాణి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న.. 15 ఏళ్ల సించన సంతోష్ (Sinchana Santosh) చిన్న వయసులోనే డబ్బు విలువను తెలుసుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచే డబ్బు దాచుకోవడం అంటే చాలా ఇష్టం. పిగ్గీ బ్యాంక్‌లో డబ్బు దాచుకుంటూ 12 ఏళ్ల వయసులోనే దాదాపు రూ.10,000 పొదుపు చేసింది.డబ్బు విలువ ఆలా అర్థమైందిచిన్నప్పుడు టెలిస్కోప్ కొనాలని తన తండ్రిని అడిగినప్పుడు.. నేను మొత్తం డబ్బును ఇవ్వను, కొంత డబ్బును నువ్వే సంపాదించుకోవాలని సూచించారు. ఆ సమయంలో ఆమె తన బంధువుల ద్వారా రూ. 10,000 సమకూర్చుకుంది. మిగిలిన రూ.2,000ను ఆమె తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ సంఘటనతో ఆమెకు డబ్బు విలువ మరింత బాగా అర్థమైంది.తర్వాత ఆమె తల్లిదండ్రుల నుంచి పెట్టుబడుల గురించి నేర్చుకుంది. అలాగే యూట్యూబ్‌లో ఆర్థిక విషయాలకు సంబంధించిన వీడియోలు చూసి మరింత సమాచారం తెలుసుకుంది. అంకుర్ వారికూ, డేవ్ రామ్సే, పవర్ ఆఫ్ మనీ, మింట్ వెల్త్, సోనియా షెనాయ్ వంటి వారి వీడియోలను కూడా చూసింది. అంతేకాకుండా ఆమె రెండు NISM సర్టిఫికేషన్లు, ఒక SEBI సర్టిఫికేషన్ కూడా పొందింది.రూ.13.9 లక్షల పెట్టుబడులుప్రస్తుతం సించన దాదాపు రూ.13.9 లక్షల పెట్టుబడులను నిర్వహిస్తోంది. ఆమె పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు, భారతీయ-అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నాయి. అయితే.. ఆమె తన పెట్టుబడులను తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తోంది. భవిష్యత్తులో తన మాస్టర్స్ చదువులకు ఈ డబ్బును ఉపయోగించుకోవాలనేది ఆమె లక్ష్యం.మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడానికి సించన GDP అనే సులభమైన పద్ధతిని ఉపయోగిస్తుంది. జీడీపీ అంటే Growth, Direct, Passive. తనకు వెంటనే డబ్బు అవసరం లేకపోవడంతో గ్రోత్ ఫండ్స్ గురించి ఆలోచిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి డైరెక్ట్ ప్లాన్స్, మార్కెట్ సూచీలను అనుసరించే ప్యాసివ్ ఫండ్స్ అనుసరిస్తుంది.సొంతగా కార్డ్ గేమ్సించనకు చదువు పట్ల మాత్రమే కాకుండా.. ఆటల మీద కూడా ఎక్కువ ఆసక్తి. దీంతో తన 14 ఏళ్ల వయసులో NCERT సిలబస్ ఆధారంగా 'ఇతిహాస - ది రాయల్ గేమ్' అనే చరిత్ర ఆధారిత కార్డ్ గేమ్‌ను సృష్టించింది. ఈ గేమ్‌ను బెంగళూరులోని 36 ప్రభుత్వ పాఠశాలలకు అందించింది. ఆ ఆటను ఎలా ఉపయోగించాలో పాఠశాల ప్రిన్సిపాల్లకు శిక్షణ ఇచ్చింది.లక్ష్యం ఇదే..ఇప్పుడు ఆమె ఆర్థిక విషయాలపై మరో కార్డ్ గేమ్‌ను తయారు చేస్తోంది. ఇందులో పొదుపు, బ్యాంకింగ్, వడ్డీ, పెట్టుబడులు, బీమా, అప్పులు, మోసాల గురించి పిల్లలు సులభంగా నేర్చుకునేలా చేయాలని ఆమె ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో భారతదేశంలోని 10 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించాలనేది సిన్చన లక్ష్యం.ఇదీ చదవండి: సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సూత్రాలు! -
బెంగళూరులో ఇళ్లకు ఇదేం ఛార్జీ!! కొత్త రుసుముపై దుమారం
బెంగళూరులో ఇళ్లకు విధిస్తున్న కొత్త రుసుముపై దుమారం రేగుతోంది. ఆస్తి పన్ను చెల్లించే వారికి కొత్తగా ‘సాఫ్ట్వేర్ ఛార్జీ’ కనిపిస్తోంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలోని ఐదు నగర కార్పొరేషన్లు ఆస్తి పన్ను సంబంధిత ఆన్లైన్ సేవలకు ఈ అదనపు రుసుమును వసూలు చేస్తున్నాయి. నివాస ఆస్తులకు ఏడాదికి రూ.200, వాణిజ్య, వసతియేతర, మిశ్రమ వినియోగ ఆస్తులకు రూ.1,000 చొప్పున ఈ ఛార్జీని నిర్ణయించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ రుసుము ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్ను డిమాండ్‌లో కనిపించడం, దీనిపై ముందస్తు స్పష్టమైన ప్రజా ప్రకటన లేకపోవడం చర్చకు దారితీసింది.గ్రేటర్ బెంగళూరు అథారిటీ ప్రత్యేక కమిషనర్ (రెవెన్యూ, ఐటీ) మునీష్ మౌద్గిల్ మాత్రం ఈ ఛార్జీని సమర్థించారు. ఆస్తి పన్ను వసూళ్లు, ఈ-ఖాతా వంటి పౌర సేవలకు ఉపయోగిస్తున్న డిజిటల్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం, నిర్వహించడం, అప్‌గ్రేడ్ చేయడం, డేటా భద్రత వంటి వాటికి నిరంతరం ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీకి ఈ ఐటీ మౌలిక వసతుల కోసం ప్రత్యేక ఆదాయ వనరు లేకపోవడంతో ‘యూజర్ పేస్’ విధానంలో ఈ రుసుమును విధించినట్లు వివరణ ఇచ్చారు. ఆన్లైన్ సేవల ద్వారా సమయం, సౌలభ్యం లభిస్తున్న నేపథ్యంలో నివాస ఆస్తికి ఏడాదికి రూ.200 తక్కువ మొత్తమేనని అధికారులు పేర్కొన్నారు.అయితే, కొత్త ఛార్జీపై ప్రాపర్టీ యజమానులు, పౌర సంఘాలు, ప్రతిపక్ష నాయకుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఆస్తి పన్నులోనే పౌర సేవల నిర్వహణ ఖర్చులు భాగమై ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎందుకు వసూలు చేస్తున్నారనే ప్రశ్నతో పాటు, రూ.200, రూ.1,000 మొత్తాలను ఎలా నిర్ణయించారు? వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఏ చట్టపరమైన నిబంధన ఆధారంగా ఈ రుసుమును విధించారు? అనే అంశాలపై స్పష్టత కోరుతున్నారు.ఈ కొత్త ఫీజు నిర్మాణం ఆస్తి పన్నుకే పరిమితం కాలేదు. తాజా నివేదికల ప్రకారం ఈ-ఖాతా ఫైనల్ ప్రాసెసింగ్‌కు రూ.400, బీ-ఖాతా నుంచి ఏ-ఖాతాకు మార్పిడికి నివాస ఆస్తులకు రూ.2,000, వసతియేతర ఆస్తులకు రూ.10,000 వంటి సాఫ్ట్వేర్ సంబంధిత ఛార్జీలు కూడా ఉన్నాయి. లేఅవుట్ ఖాతా, కొత్త ఖాతా నమోదు, ఈ-ఖాతా పత్రాల పునర్ముద్రణ వంటి కొన్ని సేవలకు కూడా వేర్వేరు రుసుములు నిర్ణయించినట్లు సమాచారం.ఇదీ చదవండి: చిన్న నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు.. -
నాగర్‌కోయిల్–బెంగళూరు రైలుకు తప్పిన ప్రమాదం
సాక్షి, చెన్నై: నాగర్‌కోయిల్–బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలుకు ఆదివారం ఉదయం పెను ప్రమా దం తప్పింది. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ముత్తంపట్టి–శివాడి స్టేషన్ల మధ్య ఉన్న పర్వత మార్గంలో బెంగళూరుకు ప్రయాణిస్తుండగా కొండచరియల నుండి దొర్లుకుంటూ వచ్చిన ఒక బండరాయి ఇంజన్ భాగంలో రైలు చక్రాల వద్ద ఉన్న షాక్ అబ్జార్బర్‌ను బలంగా ఢీకొట్టింది. భారీ శబ్దం వచ్చిన వెంటనే డ్రైవర్ బ్రేక్ వేశాడు. రైలు వేగం తక్కువగా ఉండడం, డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. వేకువజామున కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి ట్రాక్‌పైకి బండ రాయి దొర్లుకొచ్చిందని సమాచారం. కాగా, దెబ్బతిన్న రైలును వెంటనే సమీపంలోని ధర్మపురి స్టేషన్‌కు తరలించారు. సాంకేతిక నిపుణులు దెబ్బతిన్న భాగాలకు మరమ్మతు చేయడంతో, రైలు అరగంట ఆలస్యంగా బెంగళూరుకు బయలుదేరింది. కొండల మధ్య ఉన్న ఈ రైల్వే లైన్లో వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడకుండా మూడు అంచెల వైర్ మెష్ (రక్షణ కంచె) నిర్మించే పనులు జరుగుతున్నాయి. రాయి పడిన ప్రాంతంలో కంచె లేకపోవడం ఘటనకు కారణం. ధర్మపురి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ కు YS జగన్
-
మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు)
-
మన దగ్గరా ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘మూడు కెమెరాలు, అప్‌గ్రేడ్ చేసిన అనేక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో పాటు షో ఆఫ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. పైగా యాపిల్ అనేది చాలా పెద్ద బ్రాండ్ కూడా. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీ–బుక్ చేసుకుంటే 18 ఉదయం 8.15 గం.కి మొదటి స్లాట్ దొరికింది. మొత్తానికి మొదటి ఫోన్ అందుకున్నా‘ అని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది. -
అందుకే నటనకు గుడ్ బై – అనంత్‌నాగ్
‘‘ఇకపై నేను సినిమాల్లో నటించను.. మళ్లీ నటించాలనే ఆలోచన కూడా నాకు లేదు’’ అని కన్నడ సీనియర్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అనంత్‌నాగ్ తెలిపారు. బెంగళూరులోని యశవంతపురలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. నాసిరకం కథలు వస్తున్నాయి. ఇటీవల కథల్లో నాణ్యత లోపించింది. కథ, కథనం కంటే బాక్సాఫీస్ కలెక్షన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను ఒప్పుకుని నటించిన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. ఆ క్షణం నుంచి ఇకపై సినిమాల్లో నటించరాదని నిర్ణయించుకున్నా. అంతేకానీ నటించకపోవటానికి ఆరోగ్య సమస్యలు ఏమాత్రం లేవు. ప్రస్తుత సమకాలీన దర్శకులతో పని చేయటం ఇష్టం లేదు. మంచి విషయం, ప్రేక్షకులను పట్టించుకోకుండా కేవలం వసూళ్ల కోసమే వెంపర్లాడుతున్న సంస్కృతి ఇండస్ట్రీలో ఉంది’’ అని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన అనంత్‌నాగ్ తాజా నిర్ణయం ఆయన అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఆయన మళ్లీ సినిమాల్లో నటించాలని పలువురు అభి్రపాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే... సినిమా రంగానికి అనంత్‌నాగ్ చేసిన విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. – ఆనంద రెడ్డి, సాక్షి, యశవంతపుర -
భార్యను లాడ్జికి తీసుకెళ్లి..
బెంగళూరు: భార్యను లాడ్జికి తీసికెళ్లిన భర్త ఆమెను గొంతు బిగించి హత్య చేసిన సంఘటన దొడ్డబళ్లాపురంలో జరిగింది. వివరాలు.. గౌరిబిదనూరు తాలూకా నగరగెరె గ్రామానికి చెందిన విద్య (23), నాలుగేళ్ల క్రితం ముదుగెరె నివాసి ఆనంద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. విద్య ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె బెంగళూరులో పీజీ హాస్టల్లో ఉంటోంది. ఇటీవల ఆనంద్ తన భార్య కనబడడం లేదని దొడ్డబళ్లాపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విద్యను తీసుకువచ్చిన పోలీసులు 20 రోజుల క్రితం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపించేశారు. బుధవారం రాత్రి విద్యను తీసుకుని ఆనంద్ దొడ్డలో ఓ లాడ్జిలో దిగాడు. ఆమె ఐడీ కార్డ్‌తోనే గొంతు బిగించి హత్య చేసి మొబైల్‌ను తీసుకుని అర్ధరాత్రి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ఆనంద్ కోసం గాలిస్తున్నారు. -
ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)
-
హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా
బెంగళూరు: హెల్మెట్ ధరించకపోతే ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే కారు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని రూ.500 జరిమానా విధించిన సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలో వెలుగు చూసింది. అథణి పట్టణ నివాసి సుభాష్ అనే వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు నోటీసులు పంపించడంతో ఆశ్చర్యపోయాడు. తరువాత హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తూ వీడియో తీసి తనకు వచ్చిన నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఏఐ కెమెరా పనితీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు -
మంచి కాఫీ లాంటి సక్సెస్ స్టోరీ..
పదహారేళ్ల వయసులో సకమ్మకు పెళ్లి జరిగింది. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించారు. ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టడానికి మహిళలు సంకోచించే కాలంలో, ఉద్యోగం చేయాలనే ఆలోచన ఊహకు కూడా రాని కాలంలో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టారు సకమ్మ. ‘నేను ఒంటరి కాదు. నా వెనక వేలాది సకమ్మలు ఉన్నారు’ అనుకొని వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. కాఫీతోటల యజమానురాలిగా, ప్రసిద్ధ ‘సకమ్మ కాఫీ వర్క్స్’ బ్రాండ్ సృష్టికర్తగా, సామాజిక సేవకురాలిగా చరిత్ర పుటల్లో నిలిచారు..బెంగళూరు సంస్కృతిలో కాఫీ విడదీయరాని భాగం. బెంగళూరు వాసుల కాఫీ ప్రేమకు పునాది వేసిన వారిలో ఒకరు... దొడ్డమనే సకమ్మ. ఆ పేరు చెబితే ఆమె ఎవరికీ తెలియదు కానీ ‘కాఫీ పొడి సకమ్మ’ అంటే వెంటనే గుర్తుపడతారు. సకమ్మ కాఫీతోటల యజమానురాలు మాత్రమే కాదు పరోపకారి కూడా. వ్యాపరరంగంలో మహిళలకు అవకాశాలు పరిమితంగా ఉన్న కాలంలో విజయవంతమైన కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించారు.వెనకడుగు వేయకుండా! కర్నాటక తుమకూరు జిల్లాలోని బిదరే గ్రామంలో 1880లో జన్మించారు సకమ్మ. చిన్న వయసులోనే చదువు ప్రాముఖ్యతను గుర్తించారు. మైసూరు సంస్థానంలో విద్యావంతులైన కొద్దిమంది యువతులలో ఆమె ఒకరు. పదహారేళ్ల వయసులో కూర్గు ప్రాంతానికి చెందిన కాఫీ తోటల యజమాని చిక్కబసప్ప శెట్టితో సకమ్మ వివాహం జరిగింది. అయితే, వివాహమైన కొద్దికాలానికే భర్త మరణించడంతో కుటుంబానికి చెందిన కాఫీ తోటలను నిర్వహించే భారీ బాధ్యత సకమ్మపై పడింది. ఆ కాలంలో మహిళలపై సామాజిక ఆంక్షలు ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. తన ఊరు నుంచి బెంగళూరు వెళ్లారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగులు వేశారు.సకమ్మ కాఫీ వర్క్స్... సూపర్ హిట్! బసవగుడిలోని బుల్‌టెంపుల్ సమీపంలో ‘కాఫీ క్యూరింగ్ అండ్ పౌడరింగ్ యూనిట్’ను స్థాపించారు సకమ్మ. ఆ సమయంలో కాఫీ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఎన్నో యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కాఫీ గింజలను వేయించడానికి, పౌడర్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి ఆనాటి ఆధునికత సాంకేతికత పరికరాలపై ఆధారపడ్డారు.కాఫీ ప్రాసెసింగ్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే సకమ్మ లక్ష్యం ఆమె వ్యాపార ప్రస్థానంలో మైలురాయిగా మారింది. సకమ్మ కాఫీ పొడి ‘సకమ్మ కాఫీ వర్క్స్ బ్రాండ్’తో మార్కెట్లోకి వచ్చింది. రుచి, నాణ్యత కారణంగా ‘సకమ్మ కాఫీ వర్క్స్’ ఇంటింటా సుపరిచితమైంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో అమ్మకపు కేంద్రాలను ప్రారంభించి, కాఫీ పొడిని వినియోగదారులకు మరింత అందుబాటులోకి తెచ్చారు. మాస్తి వెంకటేశ అయ్యంగార్, డి.వి.గుండప్పలాంటి ప్రఖ్యాత కన్నడ సాహితివేత్తల రచనలో సకమ్మ బ్రాండ్ కనిపించేది.లోకసేవ పరాయణే... ఆమె సాధించిన విజయాలు కాఫీ వ్యారానికే పరిమితం కాలేదు. సామాజిక సేవా రంగంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. మహిళా సంక్షేమం, విద్య, సామాజిక అభివృద్ధికి కృషి చేశారు. బసవగుడిలో ఒక వసతిగృహాన్ని, ప్రయాణికుల కోసం విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. సకమ్మ సాధించిన వ్యాపార విజయాలు, సామాజిక సేవకు గుర్తింపుగా మైసూర్ దర్బార్ ఆమెకు ‘లోకసేవ పరయణే’ అనే బిరుదును ప్రదానం చేసింది. మైసూర్ ప్రతినిధి సభలో సభ్యురాలిగా కూడా సకమ్మ పనిచేశారు. కూర్గ్‌లోని సోమవార్పేటలో ఉన్న సకమ్మ బంగ్లా, బెంగళూరులోని సకమ్మ గార్డెన్ ఆమె విజయగాథను మౌనంగా చెబుతుంటాయి. ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుంటాయి. (చదవండి: క్యాట్‌లో మంచి స్కోర్ చేసినా..సైన్యంలోకి! కానీ చివరికి..) -
చెన్నై-బెంగళూరు హైవేపై రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బెంగళూరు వాసులుగా తెలుస్తోంది. తిరుమల నుంచి వెళ్తుండగా బంగారుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్?
బనశంకరి: బెంగళూరులో నడిరోడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి -
మనశ్శాంతి కోసం జాబ్ మానేసి.. నెలకు రూ.కోటి టర్నోవర్!
సాధారణంగా బెంగళూరు నగరంలో.. యాక్సెంచర్ వంటి కంపెనీలో ఉద్యోగం వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ సుప్రీత్ కశ్యప్ మాత్రం ఇందుకు భిన్నంగా.. ఉద్యోగం వదిలి మనశ్శాంతి కోసం సొంత ఊరికి వెళ్ళిపోయాడు. నేడు నెలకు కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే స్థాయికి చేరాడు. ఇంతకీ కశ్యప్ ఏం చేసాడు?, ఎలా సంపాదిస్తున్నాడు?, అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.యాక్సెంచర్ ఉద్యోగం వదిలి..సుప్రీత్ కశ్యప్ మైసూరులో పుట్టి పెరిగాడు. తాను మైసూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. చదువు పూర్తయ్యాక, 2017లో యాక్సెంచర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం అతనికి మంచి కెరీర్ ఇచ్చినప్పటికీ.. బెంగళూరులో జీవనశైలి తనకు సరిపోవడం లేదని భావించాడు. నగరంలోని ట్రాఫిక్, రద్దీ, నిరంతర ఒత్తిడి కారణంగా ప్రశాంతత లోపించిందని అనిపించింది.వెల్బీ పేరుతో వ్యాపారం..అందుకే.. 2018లో యాక్సెంచర్‌లో ఉద్యోగాన్ని వదిలి మైసూరుకు వెళ్ళిపోయాడు. ప్రారంభంలో ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అయితే.. తనకు కేవలం ఉద్యోగం చేయడం కాకుండా, మైసూరు నుంచే ఒక సంస్థను నిర్మించి, ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన వచ్చింది.ఈ ఆలోచనతో కశ్యప్ వెల్బీ పేరుతో.. దుస్తుల వ్యాపారాన్ని 2021లో ప్రారంభించాడు. వెల్బీ అనేది ప్రధానంగా సౌకర్యవంతమైన, స్పోర్ట్స్, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే దుస్తులను తయారు చేస్తుంది. సస్టైనబుల్, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌కు కూడా సంస్థ ప్రాధాన్యత ఇస్తుంది.రూ.10 లక్షలు పెట్టుబడిసుప్రీత్ తన వ్యాపారం ద్వారా చాలామందికి ఉద్యోగాలు కూడా కల్పించాలని సంకల్పించాడు. దీంతో.. టైర్2, టైర్3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యోగావకాశాలను సృష్టించాలని భావించాడు. వెల్బీలో ఇప్పుడు 15 మందికి పైగా ఫుల్-టైమ్ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 40 మంది చేతివృత్తి కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు.వెల్బీని ప్రారంభించడానికి సుప్రీత్ మొదట కుటుంబ సభ్యుల సహాయంతో.. సుమారు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందడంతో మొత్తం పెట్టుబడి రూ.50 లక్షలకు చేరింది. తరువాత సంస్థకు ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి లభించింది.కోట్లలో టర్నోవర్కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మొదటి సంవత్సరంలో సుమారు రూ.11 లక్షల ఆదాయం వచ్చింది. తరువాతి సంవత్సరం అది రూ.70 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత రూ.2.4 కోట్లు, తదుపరి సంవత్సరం రూ.5.6 కోట్లు ఆదాయం సాధించింది. ఇప్పుడు సంస్థ ఏడాదికి సుమారు రూ.15-16 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణంలో వెల్బీ నెలకు సుమారు రూ.1 కోటి ఆదాయం సాధించే స్థాయికి చేరుకుంది. కేవలం రూ.10 లక్షలతో ప్రారంభమైన వ్యాపారం, ఇంత పెద్ద స్థాయికి ఎదగడం సుప్రీత్ వ్యాపార ప్రయాణంలో సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.సుప్రీత్ తనను తాను ఒక యాదృచ్ఛిక పారిశ్రామికవేత్తగా భావిస్తాడు. ఎందుకంటే అతడు అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అంతే కాకుండా.. తన కుటుంబానికి కూడా వ్యాపార నేపథ్యం లేదు. అందువల్ల వ్యాపారం ప్రారంభించినప్పుడు.. తనకు అనుభవం కూడా పెద్దగా లేదు. కానీ కాలక్రమంలో అనుభవంతో పాటు అనేక విషయాలు నేర్చుకున్నాడు.మైసూరు నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకిప్రారంభంలో.. మంచి ఫ్యాషన్ ఫొటోషూట్లు చేస్తే అమ్మకాలు పెరుగుతాయని ఆయన అనుకున్నాడు. కానీ.. తర్వాత అసలు విజయం మంచి ఫొటోలలో కాకుండా, మంచి ఉత్పత్తిని తయారు చేయడం, వినియోగదారులకు అది నిజంగా అవసరమా అని తెలుసుకోవడంలో ఉందని గ్రహించాడు.అలాగే ఉద్యోగులను నియమించడంలో కూడా ఆయనకు ఒక ముఖ్యమైన పాఠం తెలిసింది. మొదట ప్రతి పనికి ప్రత్యేక వ్యక్తులను నియమించడం వల్ల సంస్థలో అవసరానికి మించిన పెద్ద టీమ్ ఏర్పడింది. తరువాత ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగలిగే మల్టీ టాస్క్ ఉద్యోగులను నియమించడం ద్వారా చిన్న టీమ్‌తోనే సంస్థను సమర్థవంతంగా నడపవచ్చని తెలుసుకున్నాడు.మైసూరులో ప్రారంభమైన వెల్బీ.. ఇప్పుడు భారతదేశం దాటి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో అమెజాన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం! -
బ్యారక్ మార్చాలని పవిత్ర అర్జీ దాఖలు
కర్ణాటక: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్రగౌడ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో తనను మరో బ్యారక్‌లోకి బదిలీ చేయాలని 59వ సీసీహెచ్ కోర్టులో అర్జీ దాఖలు చేసింది. అక్రమంగా విలాసాలు కల్పించారని ఆరోపణలు రావడంతో ఆమెను 16 మంది నిందితులున్న బ్యారక్‌లోకి ఇటీవల బదిలీ చేశారు.అయితే అక్కడ 30 మంది వరకు ఖైదీలున్నారు, రెండే మరుగుదొడ్లు ఉండగా, ఒకదానికి మరమ్మతులు చేస్తున్నారు, ఆ బ్యారక్‌లో ఉండడం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. అలర్జీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా తెలిపింది.చదవండి: ఐశ్వర్య గౌడ బెయిల్ దరఖాస్తు కొట్టివేత -
ఊయలలోనే పసికందుల చితి పేర్చిన తల్లి
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరులో ఘోర విషాదం సంభవించింది. లేకలేక పుట్టిన కవల పిల్లలను తల్లే నీటి బకెట్లో ముంచి హతమార్చింది. తలఘట్టపురలో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉమాదేవి (42), రామలింగప్ప (50) దంపతులకు 2002లో వివాహమైంది. రామలింగప్ప వ్యాపారం చేస్తుండగా, ఉమాదేవి గృహిణి. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో అనేక ప్రయత్నాల తరువాత ఐవీఎఫ్ చికిత్స ద్వారా ఉమాదేవి గర్భం దాల్చింది. మే 5న ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే, పిల్లలు పుట్టాక ఉమాదేవి మానసిక అనారోగ్యం బారిన పడింది. పిల్లలను పోషించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శిశువులను నీళ్లున్న బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తరువాత వారిని ఊయలలో ఉంచింది. ఆపై ఆత్మహత్యాయత్నం చేస్తుండగా.. అదే సమయంలో ఇంటికొచ్చిన భర్త రామలింగప్ప ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించాడు. ప్రసవం తరువాత వచ్చే మానసిక వైకల్యానికి తన భార్య గురైందని, నిమ్హాన్స్ వైద్యులతో చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో భర్త రామలింగప్ప తెలిపారు. తాను పిల్లలను చూసుకోలేనని, అనాథాశ్రమంలో ఇచ్చేయాలని ఆమె గొడవ చేసేదని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. -
క్లౌడ్ కిచెన్‌తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!
ఏ వ్యాపారమైన మొదలుపెట్టగానే వెంటనే సక్సెస్ అందుకోలేం. పక్కా ప్లాన్‌తో వచ్చినవాళ్లు చిన్నగా పుంజుకోగలరేమో గానీ..చాలామంది మొదట్లో నష్టాలే చవిచూస్తారు. ఆ తర్వాత రానురాను అందులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ..మంచి విజయంతో నిలదొక్కుకుని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందన వాళ్లే ఈ బెంగుళూరు దంపతులు. వాళ్లు ఏ వ్యాపారంలో అయితే తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారే దానికే చిన్ని మార్పులు జోడించి ఏ రేంజ్లో లాభాలు అందుకున్నారో తెలిస్తే..ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ జంటే బెంగుళూరుకి చెందిన కుశాల్ రెడ్డి, చాహక్ జైన్లు. వాళ్ల వ్యాపారం ప్రయాణం చిన్న క్లౌడ్ కిచెన్‌తో ప్రారంభమైంది. అయితే దీని ప్రారంభ పెట్టుబడి రూ. 4 లక్షలతో మొదలైంది. అయితే ఈ వ్యాపారానికి తగినన్ని ఆర్డర్లు సంపాదించుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌లు వసూలు చేసే అధిక కమీషన్లు, ప్రకటనల ఖర్చులు, ప్రత్యక్ష ఆర్డర్ కొరత వంటివి సంస్థపై ఒత్తిడి పెంచాయి. దాంతో ఆ దంపతులు దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ జంట వెనక్కి తగ్గకుండా ఎక్కడైతే నష్టపోయామో అక్కడే తిరిగి సక్సెస్ సాధించి లాభం పొందాలని గట్టిగా అనుకుని ఈ సారి వంటగదిని, మార్కెటింగ్ చేసే విధానాన్నే మార్చారు. ఈసారి ఫుడ్ ట్రక్‌తో బెంగళూరులోని జేపీ నగర్లో ఎంట్రీ ఇచ్చారు. దానికి క్రీడ్ అనే ఫ్రైడ్ ఫుడ్ బ్రాండ్‌గా నామకరణం చేసి వ్యాపారం ప్రారంభించారు. అలాగే తాము మొదలుపెట్టబోయే ఫుడ్ ట్రక్ వ్యాపారం గురించి ముందుగానే సోషల్ మీడియాలో వెల్లడించి..దాని నమునా తాలుకా వీడియోని కూడా షేర్ చేశారు. దాంతో తమ వ్యాపారంలోని మొదటి బర్గర్ సేల్ అవ్వక మునుపే యూజర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అంటే ఆ జంట వ్యాపార క్రీడ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఏకంగా ఐదువేలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. అలా ఆ జంట ఆ వ్యాపారాన్ని సెప్టెంబర్ 2025లో ప్రారంభించారు. తొలిరోజే వందమందికి పైగా కస్టమర్లు వచ్చారట. ఈ వ్యాపారం మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా ముప్పై వేల అమ్మకాలు జరిగాయట. ఆ ఊపు ఇప్పటికీ అలానే కొనసాగుతూ రోజుకి సుమారు 350 నుంచి 450 మంది కస్టమర్లకు సేవలు అందిస్తూ..రోజుకి దాదాపు రూ. 1 లక్ష పైగానే ఆర్జిస్తున్నట్లు ఆ దంపతులే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. పైగా తమ మెనూలో ఫ్రైడ్ చికెన్, పనీర్ బర్గర్లతో పాటు, చికెన్ పాప్‌కార్న్, స్ట్రిప్స్, ఫ్రైస్ వంటి ఐటమ్స్‌ని కూడా అందిస్తున్నారు. అంతేగాదు ఆ దంపతులు విఫలమన క్లౌడ్ కిచెన్‌కు లాభలా బాటలో నడుస్తున్న క్రీడ్ వ్యాపారంల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతు ప్రథమ్ అనే యూజర్ ఎక్స్పోస్ట్లో వివరించారు. ఈ పోస్ట్ నెటిజన్లును అమితంగా ఆకర్షించింది. పైగా పోస్ట్ ప్రకారం..ఆ క్రీడ్ వ్యాపారం రూ. 4 లక్షల పెట్టుబడితో ప్రారంభిస్తే..కేవలం పది నెలల్లో సుమారు రూ. 2 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం విశేషం. ఇది చిన్న ఆహార వ్యాపారాలకు ఒక గొప్ప ఆర్థిక పాఠంగా మారింది. అంతేగాదు సోషల్ మీడియాను వ్యాపార ప్రచారానికి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేసింది కూడా. అంతేకాదండోయ్ ఈ దంపతులు రెడ్డి-జైన్లు తమ ఫుడ్ ట్రక్ మోడల్ నుంచి ఒక పెద్ద సెంట్రల్ కిచెన్, ఫాస్ట్-క్యాజువల్ రెస్టారెంట్ అవుట్‌లెట్‌గా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్‌లో ఉన్నారట. ఈ జంట కథ..ఓడిపోయిన చోటే గెలుపుని వెతుక్కోవాలే తప్ప వెనక్కి రాకూడదని చెబుతోంది. అలాగే ఓటమికి గల కారణాలను విశ్లేషించి..ఆ తప్పులకు తావివక్కుండా మంచి ప్రారంభంతో ముందుకు రావాలని చెబుతోంది కదూ..!.Meet Kushal Reddy & Chahak Jain.They invested ₹4 lakh into a cloud kitchen in Bengaluru.It failed.Zomato/Swiggy commissions, expensive ads and low direct orders killed the business.So they started again.They launched Kried, a fried-chicken burger food truck.Before… pic.twitter.com/e3jevufBVn— Pratham (@CapitalLens_) September 1, 2026 (చదవండి: Miss World 2026: సర్వాంగ సుందరీ మాత్రమేకాదు..అద్భుతమైన నటి..! మిస్ ఇండియా సైతం..) -
3, 4 తేదీల్లో చికెన్ దుకాణాలు బంద్?
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్డబ్ల్యూఎమ్ఎల్) వారు చికెన్ వ్యర్థాలపై విధిస్తున్న పన్నును వ్యతిరేకిస్తూ కర్ణాటక ఫౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 3, 4 తేదీల్లో బెంగళూరులో చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. సుమారు 7 వేల చికెన్ దుకాణదారులు రెండు రోజుల పాటు ఫ్రీడం పార్క్‌లో ఆందోళన చేపట్టనున్నారు. బెంగళూరులో రోజుకి 7 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. ఒక్కో దుకాణం నుంచి సుమారు రోజుకు 30 కేజీల వ్యర్థాలు వెలువడుతున్నాయి. బీఎస్డబ్ల్యూఎమ్ఎల్ వారు కేజీ వ్యర్థానికి రూ.5 పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.5 వేల వరకూ పన్ను చెల్లించాల్సి రావడంతో దుకాణదారులకు ఇబ్బందిగా మారిందని కర్ణాటక ఫౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఈ పన్ను తక్షణం రద్దు చేయాలని డిమాండు చేస్తూ రెండు రోజుల పాటు చికెన్ దుకాణాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. -
కమిట్ అయితే.. పిప్పి పిండి చేస్తారు!
కార్పొరేట్ ప్రపంచంలో పదోన్నతి, భారీ వేతన పెంపుల కోసం ఉద్యోగులు నిత్యం శ్రమిస్తుంటారు. ఏటా 10-15 శాతం వేతన పెంపు కోసమే కంపెనీలు మారే సంస్కృతి పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో బెంగళూరుకు చెందిన ఒక ఐటీ నిపుణుడు తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏడాదికి ఇప్పటికే రూ.45 లక్షల ప్యాకేజీ పొందుతున్న 31 ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ ఆఫర్ చేసిన మరో రూ.20 లక్షల అదనపు వేతన పెంపును (మొత్తం రూ.65 లక్షల ప్యాకేజీ) నిరాకరించాడు.‘యు-ఎబిలిటీ’(UAbility) వ్యవస్థాపకుడు రోహన్ ధావన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు టెకీకి లభించిన పదోన్నతితో బాధ్యతలు, పని ఒత్తిడి రెట్టింపు కానున్నాయి. వారంలో నాలుగు రోజులు రాత్రి వేళల్లో అమెరికా బృందాలతో సమావేశాలు, నిరంతర ప్రయాణాలు, ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు బృందాన్ని పర్యవేక్షించడం వంటి కఠినమైన షరతులు ఆ ఆఫర్లో ఉన్నాయి. చివరకు వారాంతపు సెలవుల్లో కూడా పని చేయాల్సి వస్తుంది.వచ్చే ఏడాది పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న ఆ నిపుణుడు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, కుటుంబ జీవితానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పాడు. వారానికి ఐదు రోజులు వ్యాయామం, తల్లిదండ్రులతో గడిపే సమయం ఈ ఒత్తిడి వల్ల కోల్పోవాల్సి వస్తుందని ఆఫర్‌ను తిరస్కరించాడు.ఈ నిర్ణయం అతడి తండ్రిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ‘రూ.20 లక్షల భారీ అదనపు ఆదాయాన్ని ఎవరు వదులుకుంటారు?’ అని ఆయన ప్రశ్నించారు. అయితే, సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మాత్రం ఈ నిర్ణయానికి విశేష మద్దతు లభించింది. ఒక పరిమితి దాటిన తర్వాత లభించే అదనపు ఆదాయం కంపెనీల జేబుల నుంచి కాదు, ఉద్యోగి వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం నుంచే వస్తుందనే నిజం ఈ ఘటనతో మరోసారి రుజువైందని కొందరు చెబుతున్నారు. ఆర్థిక ప్రయోజనాల కంటే జీవన నాణ్యత, మానసిక ఆరోగ్యానికే ఆధునిక యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ ఘటన చెబుతోంది.ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు! -
బీజేపీ నేత కిడ్నాప్.. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు
బెంగళూరు: ఏపీకి చెందిన మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. బెంగళూరు బీజేపీ నేత డా. రవిప్రకాష్ కిడ్నాప్‌కు గురైన అంశానికి సంబంధించి పుట్టా సుధాకర్‌పై బెంగళూరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. తన భర్తను టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కిడ్నాప్ చేయించారని ఫిర్యాదు చేశారు రవి ప్రకాశ్ భార్య. దాంతో పుట్టా సుధాకర్‌పై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. నాలుగు వాహనాల్లో వచ్చి తన భర్త రవిప్రకాశ్‌ను పుట్టా సుధాకర్ అనుచరులు కిడ్నాప్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగళూరు రాజరాజేశ్వరినగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రవిప్రకాష్ భార్య సబీనా. పుట్టా సుధాకర్‌తో పాటు ఆయన కుమారుడు రవి కుమార్‌పై కూడా ఆమె ఫిర్యాదు చేశారు. -
ట్రాఫిక్ కష్టాలు తెలియాలా? ఒక్కరోజు పోలీసు కండి!
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ జామ్ కలిగిన నగరంగా ఈ సిటీకి పేరు. ఈ నేపథ్యంలోనే నగర ట్రాఫిక్ సమస్యలను పౌరులకు తెలియజేయడాని అక్కడి ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎదురయ్యే సవాళ్లు తదితర సమస్యలు తెలుసుకోవడానికి ‘కాప్ ఫర్ ది డే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా నగరవాసులు ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి పనిచేస్తూ, నగరంలో ట్రాఫిక్ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల విధులు, బాధ్యతలను స్వయంగా అర్థం చేసుకోవడంతో పాటు, రహదారులను మరింత సురక్షితంగా, సాఫీగా మార్చేందుకు తమ సూచనలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల దృష్టికోణంలో బెంగళూరు ట్రాఫిక్‌ను అనుభవించాలని, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తమ అనుభవాలను, రహదారి భద్రతకు సంబంధించిన సూచనలను పోలీసులతో పంచుకోవచ్చని తెలిపారు.బెంగళూరు సిటీ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తిక్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని గతంలో విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం వంటి విధుల్లో ట్రాఫిక్ సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లను పౌరులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆయన కోరారు.ఎలా నమోదు చేసుకోవాలి ?ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా BTP ASTraM యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో కనిపించే “Traffic Cop for a Day” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అడిగిన వివరాలను నమోదు చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత, ఎంపికకు సంబంధించిన తదుపరి సమాచారాన్ని అనుసరించి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ పోలీసుల రోజువారీ విధులను దగ్గరగా తెలుసుకోవడంతో పాటు, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలపై పౌరులు తమ అభిప్రాయాలను నేరుగా పోలీసు విభాగంతో పంచుకునే అవకాశం లభించనుంది. -
బిర్యానీ టైమింగ్ మార్పు ఏదీ?
బనశంకరి: బెంగళూరు సమీపంలోని హొసకోటెలో తెల్లవారకుండానే వేడి వేడి దొన్నె దమ్ బిర్యానీ తినడం చాలామందికి ఇష్టం. ఇందుకోసం బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి బైక్‌లు, కార్లలో వేలాదిగా వస్తుంటారు. దీనివల్ల విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరిగి గొడవలు, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని పరిష్కారానికి తెల్లవారుజామున 4 గంటలకు బదులు ఉదయం 6 గంటలకు హోటళ్లు తెరవాలని పోలీసులు ఆదేశించినా పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్కింగ్ గొడవలు ఇటీవల మణి దమ్ బిర్యాలీ సెంటర్ వద్ద ఓ టీవీ నటి కారు పార్కింగ్ విషయంలో గొడవపడి దాడులకు దిగారు. పోలీసు స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. పైగా హోటళ్ల పరిసరాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. మద్యం తాగుతూ రభస చేయడం వల్ల స్థానిక మహిళలు, పిల్లలకు ఇబ్బందిగా ఉంటోందని ఆరోపణలున్నాయి. ఉదయం 6 నుంచి: సీఐ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐ గోవింద్, బిర్యానీ హోటల్స్‌కు నోటీసులు జారీ చేశారు. 6 గంటలకు రావడం ఇబ్బందిగా ఉంటోంది, కనీసం 5 గంటల నుంచి అనుమతించాలని బిర్యాని ప్రియులు కోరారు. -
ఏఐలో అద్వితీయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికా 6,900, చైనా 1600, భారత్ 710 ఏఐ స్టార్టప్‌లతో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న నేపథ్యంలో, దేశంలో బెంగళూరు తర్వాత రెండో అతిపెద్ద ఏఐ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు, టాలెంట్ పూల్, పెట్టుబడులతో నగరం గ్లోబల్ ఏఐ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 500కు పైగా ఏఐ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. 2015–25 మధ్య 160 స్టార్టప్‌లు 5 శాతం సంయుక్త వార్షిక వృద్ధిరేటుతో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 900కు పైగా ఏఐ కంపెనీలు, 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లు ఉన్నారు. టీ–డేటా ప్లాట్ఫామ్లో 2026 జూలై నాటికి 3,000 ఏఐ సంస్థలు నమోదయ్యాయి. ఉద్యోగాల వెబ్సైట్ నివేదిక 2025 ప్రకారం ఏఐ/ఎంఎల్ ఉద్యోగాల్లో హైదరాబాద్‌లో 54 శాతం వృద్ధి నమోదైంది. ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం తక్కువ, పాలసీలు బలంగా ఉండటంతో స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెబుతున్నారు.గూగుల్, టీహబ్ కలిసి ‘ఏఐ–ఫస్ట్ స్టార్టప్ యాక్సిలరేటర్’ ప్రారంభించాయి. ఏటా పదివేల మంది విద్యార్థులకు శిక్షణ, బూట్‌క్యాంప్‌లు నిర్వహిస్తారు. వచ్చే ఏడాదిలో 200 కొత్త స్టార్టప్‌లు, రూ.50 కోట్ల ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది.టీ – హబ్‌లో100 ఏఐ స్టార్టప్‌లు ఏకకాలంలో ఇంక్యుబేట్ అవుతున్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ–ఏఐఎం), ఏఐ సిటీ, గూగుల్ హబ్ వంటి ప్రాజెక్ట్‌లతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ భారత్‌కు ఏఐ రాజధానిగా, గ్లోబల్ టాప్ 20 డెస్టినేషన్‌గా అవతరించనుందని అంటున్నారు. -
చనిపోయిన భార్య కోసం ప్రతిరోజు పూలు
బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ తన భార్య చనిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఆమెను తలచుకుంటూ ఓ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటోను పూలతో అలంకరించి, భార్య ఫొటోను తన పక్కన ఉంచుకుంటున్నాడు.ఇన్స్టాగ్రామ్ యూజర్ సూరజ్ ఎస్ కురుప్ ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వృద్ధుడైన ఆటో డ్రైవర్‌ను చూసిన ఆయన, ఆటో ముందు భాగంలో చక్కగా అమర్చిన పూలను గమనించారు.వీడియోలో సూరజ్ తన కెమెరాను డ్రైవర్ వైపు తిప్పి, ఆ పూలు ఎవరి కోసం? అని అడిగారు. డ్రైవర్ నవ్వుతూ తన భార్య ఫొటో వైపు చూపించాడు. ఆమె ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయిందని వివరించాడు.తనకు ఓ కుమారుడు, కుమార్తె, ఆరుగురు మనవళ్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంట్లో ఉండకుండా ఇప్పటికీ ఆటో ఎందుకు నడుపుతున్నారని సూరజ్ అడిగారు. ఇంట్లో కూర్చుంటే ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ వివరించాడు.అందుకే ప్రతిరోజూ ఆటో నడుపుతూ, దారిలో ఎదురయ్యే వారితో మాట్లాడుతూ తనను తాను పనిలో నిమగ్నం చేసుకుంటున్నానని చెప్పాడు. పూలు, తన భార్య ఫొటో ఆయన రోజువారీ జీవితంలో భాగంగానే కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ఆమె ఉనికిని తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు.ఈ సాధారణ సంభాషణ వీడియోను చూసిన వారిని భావోద్వేగానికి గురిచేసింది. భార్య చనిపోయి అన్నేళ్లు గడిచినా ఆమె కోసం పూలు కొని, వాటిని అలంకరిస్తున్న దానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.కొంతమంది దీనిని ఎన్నటికీ చెక్కుచెదరని ప్రేమకు అందమైన ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు, మరణం తర్వాత కూడా ఇంతే బలంగా నిలిచే ప్రేమ తమ జీవితంలో కూడా ఉండాలని కోరుకునేలా ఈ కథ ఉందని పేర్కొన్నారు.తనకు సమీపంలోనే ఆ డ్రైవర్ నివసిస్తున్నారని ఓ యూజర్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఇదే విధంగా ఆయన తన ఆటోను శుభ్రం చేసి, ఆ తర్వాత పూలతో అలంకరించడం తాను చూశానని చెప్పారు. View this post on Instagram A post shared by asish matthew (@asishmatthew.exe) -
బెంగళూరులో వార్నర్ మ్యూజిక్ వరల్డ్-క్లాస్ టెక్ హబ్
న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ అంతర్జాతీయ సంగీత, ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘వార్నర్ మ్యూజిక్ గ్రూప్’(డబ్ల్యూఎంజీ) భారతీయ ఐటీ రాజధాని బెంగళూరులో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలోనే (సెప్టెంబర్) ప్రారంభం కానున్న ఈ హబ్ గ్లోబల్ మ్యూజిక్ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక డేటా ఇంజినీరింగ్‌తో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించనుంది.ఈ నూతన సెంటర్ కేవలం సపోర్ట్ ఆఫీస్‌గా కాకుండా డబ్ల్యూఎంజీ అంతర్జాతీయ సాంకేతిక వ్యవస్థకు వెన్నుముకగా నిలవనుంది. మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ (సంగీత పంపిణీ), కోర్ డేటా పైప్లైన్లు, ఆడియన్స్ అండ్ మార్కెటింగ్ డేటా ప్రాడక్ట్స్, ఏఐ/ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆధారిత ప్రాజెక్ట్‌లను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. మ్యూజిక్, ఏఐ కలయికలో అత్యంత సంక్లిష్టమైన సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రతిభను వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.దిగ్గజ నాయకత్వంలో ముందుకుగతంలో వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన మహేష్ రావు (డైరెక్టర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సైట్ లీడ్, ఇండియా) ఈ బెంగళూరు ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన టొరంటో కేంద్రంగా పనిచేసే డబ్ల్యూఎంజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లేహో నిగుల్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యూహాలు, బడ్జెట్, నియామకాలను పర్యవేక్షిస్తారు.పరిశ్రమ వర్గాల విశ్లేషణమ్యూజిక్ ఇండస్ట్రీలో పోటీ ఇప్పుడు కేవలం కంటెంట్ లేదా కళాకారులకే పరిమితం కాలేదు. డేటా అనలిటిక్స్, స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు, ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు ఉన్న సంస్థలే భవిష్యత్తును శాసిస్తాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో వరల్డ్-క్లాస్ టెక్ ఆర్గనైజేషన్ ఏర్పాటు ద్వారా భారత్‌లో ఉన్న అత్యుత్తమ సాఫ్ట్వేర్ టాలెంట్‌ను ఆకర్షించాలని డబ్ల్యూఎంజీ భావిస్తోంది. ఇది భారత సాంకేతిక రంగానికి, గ్లోబల్ మ్యూజిక్ ఎకోసిస్టమ్‌కు మధ్య సరికొత్త మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం! -
చదువుతూనే రోజుకు రూ.1,200 సంపాదన
ఉన్నత చదువులు చదువుకుంటూనే సొంత కాళ్లపై నిలబడాలనే నిశ్చయంతో ముందుకు సాగుతున్న నేటి యువతకు బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ విద్యార్థి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కళాశాల సెలవుల సమయాన్ని వృథా చేయకుండా బైక్ టాక్సీ అగ్రిగేటర్ సంస్థ రాపిడోలో క్యాప్టెన్గా చేరి రోజుకు సగటున రూ.1,200 వరకు ఆర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి ఇటీవల తెలిపాడు.తన మూడు నెలల పని అనుభవాన్ని పంచుకుంటూ రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (సుమారు 8.5 గంటలు) రాపిడో క్యాప్టెన్గా సేవలు అందించినట్లు పేర్కొన్నాడు. నిలకడైన ప్రణాళిక, కష్టపడే తత్వంతో పని చేస్తే సెలవుల్లోనే కాకుండా చదువుతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించాడు. బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఉద్యోగ సాధన, గిగ్ ఎకానమీ కల్పిస్తున్న అవకాశాలపై నేటి తరం ఆలోచనా విధానానికి ఈ ఘటన అద్దం పడుతోంది.సమయ పాలన, ఆర్థిక స్వాలంబన పట్ల ఈ విద్యార్థి చూపిన చొరవ సోషల్ మీడియాలోనూ, ఇతర యువతలోనూ విశేష ఆదరణ పొందుతోంది. కేవలం చదువుకే పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగిస్తూ గిగ్ వర్కర్‌గా మారడం ద్వారా ఒకవైపు పాకెట్ మనీ సంపాదిస్తాన్నాడు. మరోవైపు సమాజంలో రవాణా సేవలు అందించడంలో భాగస్వామి కావడం గమనార్హం.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం! -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. సాక్షిగా మారుతాడని కొడుకుని..?
-
భర్తను చంపేస్తే.. మనం హ్యాపీగా ఉండొచ్చు.!
కృష్ణరాజపురం: బెంగళూరులోని చిక్కబాణావరలో జరిగిన తండ్రీ, చిన్నారి కొడుకు హత్య కేసులో దారుణమైన విషయాలు బయటపడ్డాయి. భార్య, ఆమె ప్రియుడు కుట్ర చేసి హతమార్చారని తేలింది. సమాజంలో మాయమవుతున్న మానవత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. వివరాలు, హులియారుదుర్గ నివాసి అభినందన్ (33), కుమారుడు యదువీర్ (5), భార్య హరిణి కలిసి నివసిస్తున్నారు. అభినందన్‌కు కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలు ఉన్నాయి. భార్య హరిణి తరచూ భర్తతో గొడవపడేది. వీరు అదే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. రెండేళ్ల కిందట ఆమెకు సోషల్ మీడియా ద్వారా వినయ్ అనే యువకునితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిని తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. పైగా తన హత్యకు పథకం వేస్తున్నారని అతనిలో అనుమానం ఏర్పడి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ మామూలు ఇంటి గొడవ అని పోలీసులు పట్టించుకోలేదు. ప్లాన్ ఇలా అమలు భర్తను వదిలించుకుంటే ఆస్తి దక్కడంతో పాటు హ్యాపీగా ఉండవచ్చనుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకూ దంపతులు గొడవపడి వేర్వేరుగా నిద్రపోయారు. హరిణి అంతకుముందే వినయ్‌ను పిలిపించగా అతడు ఇంటి ఆవరణలో దాక్కున్నాడు. ఇద్దరూ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, అభినందన్‌ను గొంతు పిసికి చంపారు. బాలుడు యదువీర్ లేవగా అతన్ని అలాగే హత్య చేశారు. సోమవారం ఉదయం ఇద్దరూ నిద్రలోనే చనిపోయారని విలపించింది. పోలీసులు హరిణిని తమదైన శైలిలో విచారించగా గుట్టు విప్పింది. పరారీలో ఉన్న వినయ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. -
బెంగళూరు తీగల్లో స్పైడర్‌మ్యాన్ బందీ
బెంగళూరు: స్పైడర్‌మ్యాన్ శక్తి గురించి తెలిసిందే. కానీ బెంగళూరులో కేబుళ్ల ముందు అతడు బలాదూరే. సిలికాన్ సిటీలో రోడ్లు, మౌలిక వసతుల సమస్యలపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బయోకాన్ అధ్యక్షురాలు కిరణ్ మంజుదార్ షా ఇప్పుడు మరో సమస్యను ప్రస్తావించారు. బెంగళూరులోని వీధుల్లో పద్మవ్యూహాన్ని తలపించేలా ఉండే కేబుల్ వైర్లను ప్రస్తావించారు. స్పైడర్ మ్యాన్ వచ్చి ఆ తీగల్లో ఇరుక్కున్నట్లు గ్రాఫిక్ చిత్రాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. ‘స్పైడర్ మ్యాన్.. నీవు బెంగళూరుకు రావద్దు’ అని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఏ రోడ్డుపై చూసినా గజిబిజి సాలీడు గూళ్లలా పలు రకాల వైర్లు కనిపిస్తాయి. వీటి వల్ల ప్రమాదాలు జరిగి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మంజుదార్ షా చేసిన పోస్టు లక్ష మందికి పైగా వీక్షించారు. అయితే చాలామంది కన్నడలో రాసి ఉన్న ఫొటోలు పోస్టు చేయాలని సూచించారు. Spider-Man was warned not to come to Bengaluru! pic.twitter.com/3L5WFSHnDN— Kiran Mazumdar-Shaw (@kiranshaw) August 15, 2026 -
పోలీస్తో నడిరోడ్డుపై కలబడిన ఆ పార్టీ నేత
బెంగళూరు: విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్‌పై జేడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజునాథ్ అలియాస్ గొట్టిగెరె మంజన్న దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కర్ణాటకలోని హుళిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ అరుణ్ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాలు వెళ్లేందుకు వీలుగా మంజన్న వాహనాన్ని చేతి సైగతో ఆపారు.తన వాహనాన్ని ఆపడంపై మంజన్న అభ్యంతరం వ్యక్తం చేసి కానిస్టేబుల్‌ను ప్రశ్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మంజన్న అరుణ్ చొక్కా కాలర్ పట్టుకుని, మరో వ్యక్తి సహాయంతో అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ప్రకారం.. మంజన్న ఫోన్లో ఓ ఉన్నత స్థాయి పోలీసు అధికారితో మాట్లాడుతున్నట్లు, కానిస్టేబుల్‌ను కాలితో తన్నేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాగ్వాదం తర్వాత మంజన్న ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి తన వాహనాన్ని కానిస్టేబుల్ ఆపిన విషయంపై ఫిర్యాదు చేశారు. అనంతరం కానిస్టేబుల్‌ను మంజన్నకు క్షమాపణ చెప్పేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య దిగువ స్థాయి పోలీసు సిబ్బందికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.ప్రజలు, హుళిమావు ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన తర్వాతే ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని ఓ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం విచారణ కోసం అతడిని తిరిగి పిలిపించారు.ఈస్ట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ బనోత్ గతంలో మాట్లాడుతూ.. హుళిమావు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకునే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగానికి పాల్పడటానికి సంబంధించిన నిబంధనలతో పాటు వర్తించే ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంజన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.Janata Dal (Secular) leader Manjunath C., popularly known as Gottigere Manjanna, 65, was arrested for allegedly assaulting an on-duty traffic police constable at Gottigere Junction in Bengaluru.According to police, the incident occurred around 3 p.m. on Sunday, August 16,… https://t.co/Pbm8jwfMLZ pic.twitter.com/xCGTtAQxFg— Hate Detector 🔍 (@HateDetectors) August 17, 2026 -
20లో రూ.30 లక్షలే.. 26లో రూ.90 లక్షలు.. యువకుడి పశ్చాత్తాపం వైరల్!
బెంగళూరు: బెంగళూరు నగరంలో రియల్టీ రంగం ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి ఓ టెక్కీ ఉదంతం నిదర్శనంగా నిలిచింది. ఆరేళ్ల క్రితం తాను కొనుగోలు చేయలేకపోయిన ఓ చిన్న ఫ్లాట్ ధర ఇప్పుడు భారీగా పెరగడంతో ఓ వ్యక్తి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రెడ్ఇట్లో పంచుకున్న అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.2018 నుంచి 2020 మధ్యకాలంలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతానికి సమీపంలోని చూడసంద్ర ప్రాంతంలో సదరు వ్యక్తి నివసించారు. అప్పట్లో ఆ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండేవి. దీంతో ఆయన సహచరులు సైతం చూడసంద్ర పేరుతో ఎగతాళి చేసేవారు. అయితే తాను అద్దెకు ఉంటున్న 1బీహెచ్‌కే ఫ్లాట్ యజమాని బెంగళూరు వీడి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఆ ఇంటిని కేవలం రూ.30 లక్షల ధరకే విక్రయించడానికి ముందుకు వచ్చారు.ఆ సమయానికి తనకు 26 ఏళ్లు మాత్రమే కావడంతో, ఆ ఫ్లాట్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టి తాను సొంతంగా ఒక కారు కొనుగోలు చేసినట్లు అతను వెల్లడించారు. ఇటీవల అదే ప్రాంతంలో తన స్నేహితుడి గృహప్రవేశ వేడుకకు వెళ్లిన ఆయనకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయి ఎన్నో బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. స్థానిక సరస్సుకు వందల మీటర్ల నడక మార్గం కూడా ఏర్పాటయింది.ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ప్రస్తుత ఆస్తి ధరల గురించి ఆరా తీయగా.. తాను ఒకప్పుడు కొనాలనుకున్న అదే 1బీహెచ్‌కే ఫ్లాట్ ధర ప్రస్తుతం రూ.90 లక్షలకు చేరుకుందని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆస్తిపై వస్తున్న అద్దె ఆదాయం బాగుండటంతో పాటు భారీగా ధర పెరగడంతో ప్రస్తుత యజమానులు ఎవరూ ఆ ఫ్లాట్లను విక్రయించడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు. అప్పట్లో రియల్ ఎస్టేట్‌పై పెట్టిన పెట్టుబడి నిర్ణయాన్ని మార్చుకుని కారు కొనుగోలు చేయడం పెద్ద పొరపాటయిందని ఆయన వాపోయారు.ఇది కూడా చదవండి: ఉజ్జయినిలో తొక్కిసలాట.. 13 మందికి గాయాలు -
ఏఐతో గుంతల గుట్టు రట్టు.. కాంట్రాక్టర్లలో గుబులు!
బెంగుళూరు: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌరవ్ సేన్ రోడ్లపై ఉన్న గుంతలను గుర్తించి, వాటికి బాధ్యులైనవారి వివరాలను కేవలం 4 సెకన్లలో వెలికితీసే వినూత్న ఏఐ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. అస్తవ్యస్త రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు పడే ఇబ్బందులను గమనించిన ఆయన, ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నారు. ఈ నూతన వ్యవస్థలో భాగంగా ఆయన కార్లలో డాష్‌క్యామ్, జీపీఎస్, యాక్సిలరోమీటర్లను అమర్చారు. వాహనం కదులుతున్నప్పుడు ఓపెన్ఏఐ విజన్ మోడల్ సహాయంతో ఈ సిస్టమ్ వివిధ పరిమాణాల్లో ఉన్న గుంతలను గుర్తిస్తుంది. సాధారణ స్పీడ్ బ్రేకర్లకు, ప్రమాదకర గుంతలకు మధ్య తేడాను స్పష్టంగా అంచనా వేస్తుంది.గుంతలను గుర్తించిన తర్వాత, ఈ వ్యవస్థ దాదాపు 2,900 ప్రభుత్వ కాంట్రాక్టుల డేటాబేస్‌తో అనుసంధానం అవుతుంది. దీనివల్ల ఆ నిర్దిష్ట రోడ్డు నిర్మాణానికి బాధ్యత వహించిన కాంట్రాక్టర్, సంబంధిత అధికార పేరు ఇట్టే బయటపడతాయి. రోడ్డు గ్యారెంటీ కాలపరిమితిలో ఉంటే, ప్రభుత్వ ఖర్చు లేకుండా కాంట్రాక్టరే దానిని బాగుచేయాల్సి ఉంటుంది.కేవలం 4 సెకన్లలో గుంత ఫోటో, కచ్చితమైన లొకేషన్, టెండర్ నంబర్, అధికారుల వివరాలతో కూడిన పూర్తి నివేదికను ఈ యాప్ సిద్ధం చేస్తుంది. ఆఫీసుకు వెళ్లే దారిలో ఈ వ్యవస్థను పరీక్షించిన ఇంజనీర్, ప్రయాణంలో 12 గుంతలను గుర్తించి నివేదికను రూపొందించారు. కాంట్రాక్టర్ల బాధ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వ విభాగాలు ఈ సాంకేతికతను ఉపయోగించాలని ఆయన కోరుతున్నారు. -
పానీపూరీ ప్రియులకు హెచ్చరిక
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలోని ప్రతి వీధిలోనూ పానీపూరీ స్టాళ్లు కనిపిస్తుంటాయి అయితే అవి ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతున్నాయి. కర్ణాటక ఆహార భద్రత, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్డీఏ) అధికారులు ప్రధానంగా పెద్ద వాణిజ్య సంస్థలపై దృష్టి సారిస్తుండటంతో, చిన్న తరహా వీధి వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం వీధి వ్యాపారులు గ్లౌజులు, ఏప్రాన్లు ధరించడం తప్పనిసరి అయినప్పటికీ, చాలా మంది పాటించడం లేదు.పెద్ద హోటల్స్‌తో పోలిస్తే చిన్న వ్యాపారులు కూడా ఆహారాన్ని తాజాగానే తయారు చేస్తారు. మాంసం, కూరగాయల వంటి పాడైపోయే పదార్థాలను సమమానునుసాయం తీసుకురావడం వల్ల నిల్వ ఉంచే అవసరం తగ్గి, అపరిశుభ్రత ముప్పు కొంతవరకు తగ్గుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గాంధీ బజార్‌లోని ‘సుగుణ’ అనే చిన్న తినుబండారాల యజమాని మాట్లాడుతూ, ‘మేము ప్రతిరోజూ ఇంట్లోనే తాజా ఆహారాన్ని తయారు చేసి ఇక్కడ విక్రయిస్తాము. స్థలం లేని కారణంగా డిస్పోజబుల్ పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తాం’ అని తెలిపారు.రాజరాజేశ్వరి నగర్లో మాంసాహార స్టాల్ నడుపుతున్న నవీన్ మాట్లాడుతూ, చికెన్‌ను ఎక్కువ సేపు బయట ఉంచలేమని, అవసరమైతేనే వేడి చేస్తామని, వీకెండ్లలో సమీపంలోని హోటళ్లలో నిల్వ చేస్తామని చెప్పారు. పానీపూరీ విక్రేత సోమన్న మాట్లాడుతూ ‘గ్లౌజులు వేసుకుంటే పానీపూరీని కలపడం, అందించడం అసౌకర్యంగా ఉంటుంది. గోళ్లు కత్తిరించుకుని, ఏప్రాన్ ధరించి పరిశుభ్రతను పాటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. చుర్మురి విక్రేత శ్యాము మాట్లాడుతూ, ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేయడం వల్ల ఎలుకలు, బొద్దింకల వంటి సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. చెరకు రసం విక్రేతలు కూడా ఈగలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. వీధి ఆహార నాణ్యతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నా, వ్యాపారుల జీవనోపాధి, నిబంధనల మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంది.ఇది కూడా చదవండి: బెంగాల్లో దారుణం: కాంగ్రెస్ నేత, కుమారుని కిరాతక హత్య! -
నేను సీఎం కాదు కదా?
బెంగళూరు: నేను ఎక్కడ సైలెంట్‌గా ఉన్నాను? నేను సీఎంని కాదు, కాబట్టి బాధ్యత లేదు అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా నగరంలో మెజెస్టిక్ వద్ద గల సంగోళి రాయణ్ణ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. సిద్దరామయ్య సైలెంట్ అయ్యారు అని విలేకరులు ప్రస్తావించగా, నేను ఎక్కడ మౌనంగా ఉన్నాను? అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యా, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఎక్కువగా మాట్లాడటం లేదు, నేను సీఎం కాదు కదా? అని అన్నారు. త్వరలో ఓబీసీలతో అహింద చళవళి కార్యక్రమం జరుగుతుందని, తాను పాల్గొంటానని చెప్పారు. -
ఐదేళ్లుగా వింత ప్రయోగం.. దొంగతనం కాలేదన్న సీఈఓ!
భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ 'సిద్ధార్థ్ డయలాని' బెంగళూరులో చేసిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారట. ఎక్కడికి వెళ్లినా బైక్‌ను పార్క్ చేసినప్పుడు హెల్మెట్‌కు ఎలాంటి లాక్ వేయకుండా సీటుపైనో, సైడ్ మిర్రర్పైనో పెట్టి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.బెంగళూరులో ప్రజలు ఒకరినొకరు ఎంతవరకు నమ్మవచ్చో తెలుసుకోవడాని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సిద్ధార్థ్ డయలాని పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా.. హెల్మెట్ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో.. బెంగళూరు ఒక హై-ట్రస్ట్ సిటీ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే.. ఈ ప్రయోగానికి వారు ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో.. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే.. ఒక్క హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలపై తమ నమ్మకం పోయినట్లే అన్నమాట. ఈ విషయం కొంతమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.కొందరు సిద్ధార్థ్ డయలాని చేసిన పనిని మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ''హెల్మెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఖరీదైనది పెట్టి చూడండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది'' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బైక్, హెల్మెట్ రెండూ సురక్షితంగా ఉండకపోవచ్చని హెచ్చరించారు. దీంతో బెంగళూరు మొత్తం ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.Me and my wife have been running a social experiment in Bangalore. Whenever we park our two wheeler in any area, we don't lock our helmets. We just keep it on the side mirror or on the seat. It's a low cost experiment to know if Bangalore is a high trust city or not.It has…— Siddharth Dialani (@siddharth_iitm) August 13, 2026 -
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
ఇంటి ముందు సొంత కారును నిలిపే సౌకర్యం కూడా ఇకపై ఉచితం కాదు. అవును.. దేశంలోనే ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్ల దురాక్రమణను అరికట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖ ‘గ్రేటర్ బెంగళూరు అథారిటీ (పార్కింగ్) నిబంధనలు-2026’ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం నివాస ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తే రకాన్ని బట్టి ఏటా గరిష్ఠంగా రూ.25,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.వాహన రకాన్ని బట్టి వార్షిక రుసుములుప్రతిపాదిత డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం నివాస వీధుల్లో పార్కింగ్ చేయడానికి వార్షిక పర్మిట్ తప్పనిసరి. అందుకోసం హ్యాచ్‌బ్యాక్ / చిన్న కార్లకు ఏటా రూ.15,000, సెడాన్ కార్లకు ఏటా రూ.20,000, ఎస్‌యూవీలకు ఏటా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ కాలపరిమితి ఏడాది మాత్రమే. అయితే, భవన నిర్మాణ నిబంధనలకు లోబడి సొంత స్థలంలో నిర్ణీత పార్కింగ్ సదుపాయం ఉన్న నివాసాల వద్ద మాత్రమే పర్మిట్లు మంజూరు చేస్తారు. రహదారి వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండి ట్రాఫిక్‌కు ఆటంకం కలగని చోట్లే ఈ పర్మిట్ చెల్లుబాటు అవుతుంది.ఆన్-స్ట్రీట్, ఆఫ్-స్ట్రీట్ చార్జీలువాణిజ్య, ప్రధాన రహదారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించారు. ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌లో భాగంగా కార్లకు గంటకు రూ.40-రూ.80 వరకు, ద్విచక్ర వాహనాలకు రూ.20-రూ.40 వరకు వసూలు చేయనున్నారు. రెండు గంటలు దాటితే చార్జీలు మరింత పెరుగుతాయి. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ప్రోత్సహించేందుకు ఆఫ్-స్ట్రీట్ చార్జీలను తగ్గించారు. కార్లకు నెలకు రూ.2,000-రూ.4,000 కాగా రాత్రి వేళల్లో (రాత్రి 8-ఉదయం 8 వరకు) 50% రాయితీ ఇవ్వనున్నారు.అభ్యంతరాలకు 30 రోజుల గడువుప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సమర్పణకు ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. వాహనాల విచ్చలవిడి పార్కింగ్‌ను నియంత్రించాలని చూస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇది మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రుద్రవీణ నిర్ణిద్ర గానం
సితార్, వీణ గురించి తెలిసినంతగా చాలామందికి ‘రుద్రవీణ’ వాద్యం గురించి తెలియదు. నేర్చుకునేవారు చా...లా తక్కువగా ఉంటారు. ‘రుద్రవీణ’ నేర్చుకునే వారికి మంచి జరగదు’ అనే అపోహ, మూఢనమ్మకాలే దీనికి కారణం. ఆ అపోహల అడ్డుగోడలను కాలదన్ని ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరుకు చెందిన జ్యోతి హెగ్డే. గురుకులం ఏర్పాటు చేసి రుద్రవీణలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రుద్రవీణ కళాకారిణిగా సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్నారు...‘సంగీత నాటక అకాడమీ పురస్కారం వల్ల నాకు వ్యక్తిగత సంతోషం కంటే రుద్రవీణకు ఈ గుర్తింపు లభించింది అనే సంతోషమే ఎక్కువగా ఉంది’ అంటారు జ్యోతి హెగ్డే.సితార్, వీణలాంటి తంత్రి వాద్యాలతో పోలిస్తే ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన కళాకారులు చాలా తక్కువ. ఈ వాద్యంలో ప్రావీణ్యం సాధించిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి హెగ్డే. అయితే ఆ గుర్తింపును సున్నితంగా తిరస్కరిస్తారు హెగ్డే.హంపీ శిల్పాల్లో రుద్రవీణ‘అజంతా, ఎల్లోరా గుహలు, హంపీ శిల్పాలను చూసినప్పుడు మహిళల చేతుల్లో రుద్రవీణ కనిపిస్తుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా రుద్రవీణ వాయిస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు రుద్రవీణ వాయించిన మొదటి మహిళను నేను ఎలా అవుతాను... అనిపిస్తుంది. అయితే ఇప్పటికాలంలో రుద్రవీణను ఎంచుకున్న మొదటి మహిళను మాత్రం నేనే’ అంటారు హెగ్డే.ఆ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళంకాలేజీ రోజుల్లో జ్యోతి హెగ్డే సితార్ తీగల మీద సాధన చేస్తుండేవారు. ఈ క్రమంలో ‘సమ్‌థింగ్ స్పెషల్’ లాంటి సంగీత పరికరం ‘రుద్రవీణ’ పరిచయం అయింది. ఆ పరిచయం తనను వీనుల విందైన రుద్రవీణ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘రుద్రవీణ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళం ఉంది. తీగలను మీటుతూ స్వరాలను పలికిస్తున్నప్పుడు ఆ ధ్వని నాలో ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని, రాగాలను నాలో లీనం చేసుకుంటాను. నా అంతర్గత ఆధ్యాత్మిక స్థితిని తెలియజేయడానికి ఇది నాకు తోడ్పడుతుంది’ అంటారు హెగ్డే.అది మూఢనమ్మకం మాత్రమే...‘బరువైన రుద్రవీణ వాయిద్యాన్ని వాయించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది’ అనే అపోహ, మూఢనమ్మకం ఉండడం వల్ల ఆ వాద్యానికి దగ్గరైన వారి సంఖ్య తక్కువ. ‘ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ నేను రుద్రవీణ వైపు ఆకర్షితం కావడానికి కారణం... బహుశా ప్రశాంతత, ధ్యానం పట్ల ఇష్టం ఉండడం కావచ్చు. ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొందాను. మొదట్లో వారు, నువ్వు అమ్మాయివి కదా రుద్రవీణ వాయించడం కష్టం అన్నారు. రుద్రవీణను ఎత్తి, వాయించగల శారీరక బలం నాలో ఉంది అని వారితో చె΄్పాను. ఇతరులు మూడు గంటల సాధన చేస్తే నన్ను నేను నిరూపించుకోవడానికి పది గంటలు సాధన చేసేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు హెగ్డే. ‘రుద్రవీణ వాయించడానికి మహిళలు శారీరకంగా, మానసికంగా సరిపోతారు. కావాల్సిందల్లా నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం మాత్రమే’ అంటున్న హెగ్డే, తన గురుకులంలో అరవైమందికి పైగా విద్యార్థులకు రుద్రవీణలో శిక్షణ ఇస్తున్నారు.గురువు దగ్గరే పరిపూర్ణతకళాకారులను తయారుచేయడానికి, వారిని తీర్చిదిద్దడానికి ఆన్లైన్ తరగతులు, నెలకొకసారి జరిగే క్లాసులు సరిపోవని కోవిడ్ కాలంలో గ్రహించాను. శిష్యులు గురువుకు దగ్గరగా ఉన్నప్పుడే, నేర్చుకోవడంలో వారికి పరిపూర్ణత వస్తుంది. ఇది మాత్రమే కాకుండా గురువు జీవనశైలి, ఆలోచనా విధానం, అంకితభావం, కళాత్మక వ్యక్తిత్వాన్ని గ్రహించే అవకాశం లభిస్తుంది.– జ్యోతి హెగ్డే -
తమిళనాడు సరిహద్దు వరకు బెంగళూరు మెట్రో..
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాజాగా ‘నమ్మ మెట్రో’లోని ఎల్లో లైన్‌ను తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలె వరకు 10.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌గా పొడిగించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మార్గంలో తొమ్మిది కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదిక ప్రకారం, ఈ విస్తరణ యెల్లో లైన్ ప్రస్తుత టెర్మినల్ స్టేషన్ అయిన బొమ్మసంద్ర నుండి ప్రారంభమై అత్తిబెలె వరకు కొనసాగుతుంది.నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ వద్ద మొదటి స్టేషన్ ప్రతిపాదించారు. ఆ తర్వాత చందాపూర్ సర్కిల్, హాలే చందాపూర్, తిరుమగొండనహళ్లి, బలగారణహళ్లి, అత్తిబెలె ఇండస్ట్రియల్ ఏరియా, యాదవనహళ్లి, అత్తిబెలె మరియు అత్తిబెలె టెర్మినల్ స్టేషన్లు ఉంటాయి. హోసూరు వరకు మెట్రోను పొడిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నప్పటికీ, సాంకేతిక కారణాల దృష్ట్యా కర్ణాటక వెనుకడుగు వేసింది.ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ (750V DC థర్డ్ రైల్ vs 25kV AC ఓవర్ హెడ్), కోచ్‌ల సామర్థ్యం, భూసేకరణ, ఆదాయ పంపిణీ వంటి అంశాలలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీనివల్ల రెండు రాష్ట్రాలు తమ సరిహద్దుల వరకు మెట్రోను నిర్మించుకుని, అత్తిబెలె వద్ద 90 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జితో అనుసంధానించడమే ఉత్తమమని బీఎంఆర్సీఎల్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు టెండర్లు త్వరలోనే ఆహ్వానించనున్నట్లు సమాచారం.ఇది కూడా చదవండి: ఇంధన కొరత ఎఫెక్ట్: రాత్రి 8 గంటలకే మార్కెట్లు బంద్! -
ఉద్యోగంపోతే కంపెనీ ఇలా వ్యవహరిస్తుందా..?
కంపెనీలు ఉద్యోగులు పట్ల ఎలా వ్యవహరిస్తాయో చెప్పే సందేశాత్మక స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి కంపెనీ ఫార్మాల్టీలు పూర్తిచేయడానికి వెళ్తే తనకు ఎదురైన అనుభవం రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. తన కంపెనీలో చివరి వర్కింగ్ డే రోజు తనకు తగిన పాఠం నేర్పిందంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందంటూ మాట్లాడిన మాటలు అందరి మనసులను తాకాయి. అసలేం జరిగిందంటే..బెంగళూరు టెకీ రెడిట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. తను ఉద్యోగం పోవడంతో కంపెనీకి తిరిగి ల్యాప్‌టాప్ ఇచ్చేసి చివరి రోజు కంపెనీ ఫార్మాల్టీలు పూర్తి చేసేందుకు తన రెండేళ్ల కుమారుడితో ఆఫీస్‌కి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఎందుకంటే తన భార్య కూడా ఉద్యోగం చేయడంతో వేరే గత్యంతరం లేక తన కుమారుడిని తీసుకుని ఆఫీసుకు వచ్చానని చెప్పాడు. అలాగే కార్యాలయం నిబంధనలను బ్రేక్ చేసే ఉద్దేశ్యం తనకు లేదని, అలాగే ఇలా పిల్లలతో రావడాన్ని కంపెనీ అనుమతించదని తెలుసని కూడా రాశారు.చివరి రోజు కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్ వంటి కార్యాలయ సామాగ్రిని ఇచ్చేసి..ఫార్మాల్టీస్ పూర్తి చేయడానికే కదా అని తప్పనిపరిస్థితుల్లో ఇలా కుమారుడితో వచ్చినట్లు వెల్లడించారు. తను కూడా తన పరిస్థితి వివరించినా..సెక్యూరిటీ గార్డు అందుకు నిరాకరించాడు. రిక్వస్ట్ చేసినా..కంపెనీ నుంచి నో అనే సమాధానమే వచ్చింది. చివరికి చేసేది లేక తన సహోద్యోగికి ఫోన్ చేసి, తన పిల్లాడిని ఓ ఐదు నిమిషాలు చూసుకోమని చెప్పి..కంపెనీ ఫార్మాల్టీస్ పూర్తి చేసేందుకు వెళ్లానని చెప్పారు. కానీ ఆ పని ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది అనుకుంటే..అది కాస్తా 15 నిమిషాలు పైనే పట్టిందని నిజాయితీగా వివరించారు. కానీ చివరి రోజు తనకు ఎదురైన మొత్త అనుభవం తనకు చాలా బాధనే మిగిల్చిందన్నారు. అలాగే కనువిప్పు కలిగించే గొప్ప పాఠం కూడా నేర్పిందని చెప్పారు. తాను కంపెనీపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటనతో పనితో ఉన్న సంబంధం గురించి పునరాలోచించేలా చేసింది. కంపెనీ అనేది కంపెనీ మాత్రమే. దానికి నీ వ్యక్తిగత పరిస్థితులతో సంబంధం ఉండదు. ఏళ్ల తరబడి పనిచేసినా..కంపెనీకి మన జీవితంలో ఎంత వరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎందుకంటే అది చివరికి ఒక వ్యాపార సంబంధంగానే మిగిలిపోతుందనేది గుర్తురెగాలి. అందుకే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పనికి అతీతమైన జీవితాన్ని నిర్మించుకోవడం అనేది చాలా ముఖ్యం అని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. అయితే ఇక్కడ వర్క్ కూడా ముఖ్యమే కానీ కుటుంబ జీవితం కూడా అంతే ముఖ్యం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు కూడా కంపెనీ మీరు వెళ్లిపోగానే మరో ఉద్యోగిని తక్షణమే నియమిస్తుంది అదే మీ కుటుంబానికి మీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అందుకే ఏ కంపెనీ కూడా మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ప్రేమించే వ్యక్తులతో గడిపే సమయాన్ని త్యాగం చేసేంత విలువైనది కాదు అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..) -
జైల్లో CCB ఆకస్మిక తనిఖీలు..ఫోన్ తో అడ్డంగా దొరికిన మాజీ ఎంపీ
-
గూగుల్‌ని అడిగి.. కొండ మీద నుంచి ఆత్మహత్య?
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో నెలమంగల దగ్గర ప్రముఖ పుణ్యక్షేత్రం శివగంగ కొండపైకి ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. బెంగళూరు కాడుగోడి మైత్రి లేఔట్ నివాసి అద్వైత్ ఉపాధ్యాయ(31) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ 4 రోజుల క్రితం బుల్లెట్ బైక్‌పై శివగంగకు వెళ్లి పార్కింగ్ స్థలంలో బండిని నిలిపాడు. తరువాత కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అతని జాడ మాయమైంది. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 60 మంది పోలీసులు డ్రోన్ల సాయంతో కూంబింగ్ ప్రారంభించారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. కాగా, అద్వైత్ కొండపైకి చేరుకోగానే తాను నిశ్చితార్థం చేసుకున్న యువతికి ట్రెక్కింగ్ ఫోటోలు పంపించాడు. ఇంట్లో అతని ల్యాప్‌టాప్‌ను పోలీసులు పరిశీలించగా, ఎలా ఆత్మహత్య చేసుకోవాలో గూగుల్‌లో వెతికినట్లు రికార్డయింది. ముఖ్యంగా శివగంగ కొండ మీద శాంతలా డ్రాప్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చా అంటూ ఏఐ టూల్స్‌ని అడిగాడు. దీంతో అద్వైత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
5 నెలలు.. 36 ఇంటర్వ్యూలు.. రూ.30 లక్షల ఉద్యోగం!
చదువు పూర్తయ్యాక ఉద్యోగం తెచ్చుకోవడం కొంతమందికి సులభమే అయినప్పటికీ.. ఇంకొందరికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా పట్టు వదలకుండా ఉద్యోగం సాధించినవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ కథనంలో.. ఏకంగా 36 ఇంటర్వ్యూలకు హాజరైన తరువాత ఉద్యోగం తెచ్చుకున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జర్నీ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టువదలకుండా ప్రయత్నించి.. చివరకు హైదరాబాద్‌లో రూ.30 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. తన ఉద్యోగ వేట గురించి ఆయన రెడ్డిట్లోని వివరించారు. గతంలో ఒక కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.కొంతకాలం ఉద్యోగానికి దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టిన తర్వాత.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా.. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న GenAIపై దృష్టి పెట్టారు. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంతో పాటు, తనకు వ్యక్తిగతంగా కూడా GenAIపై ఆసక్తి ఉందని చెప్పారు.After 36 technical interviews, I finally bagged an offerby u/deathmachine1407 in developersIndiaదాదాపు ఐదు నెలల పాటు యాక్టివ్‌గా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూ.. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొత్తం 36 ఇంటర్వ్యూల తర్వాత చివరకు హైదరాబాద్‌లోని ఒక సంస్థలో ఉద్యోగం సాధించారు. కొత్త ఉద్యోగంలో భారీగా జీతం పెరగకపోయినా.. చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎందుకంటే దాదాపు ఏడు నెలల తర్వాత.. మళ్లీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం వచ్చిందని తెలిపారు.ఉద్యోగం అయితే వచ్చింది. కానీ.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లి పనిచేయాల్సి వస్తోంది. ఇది కొంత బాధ కలిగించే విషయమే అయినా.. కెరీర్లో ఇలాంటి మార్పులు తప్పవని ఆయన భావిస్తున్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న పలువురు టెక్కీలు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని కామెంట్లు చేశారు. కొందరు ఆయన ఇంటర్వ్యూ అనుభవాలను పంచుకోవాలని కోరగా, మరికొందరు రెజ్యూమ్‌ను షేర్ చేయగలరా అని అడిగారు. -
కళకాలం గుర్తులు
ప్రాచీన ఆలయ శిల్పాల నుంచి అమర చిత్ర కామిక్స్ వరకు సుప్రసిద్ధ భారతీయ శిల్ప, చిత్రకళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. బెంగళూరులోని ‘మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ’లో తాజాగా ఏర్పాటు చేసిన ‘ఎ మూవింగ్ లైన్: 1500 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ విజువల్ స్టోరీ టెలింగ్’ ఎగ్జిబిషన్ ద్వారా మన దేశ కళారంగం కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చిందో తెలుసుకోవచ్చు. ప్రఖ్యాత గ్రాఫిక్ రచయిత్రి అమృత పాటిల్ ఆధ్వర్యంలో ఈ చిత్రప్రదర్శన జరుగుతోంది... ప్రాచీన కళాసంప్రదాయాల నుంచి సమకాలీన డిజిటల్ స్టోరీ టెలింగ్ వరకు రకరకాల కళాకృతులు ‘ఏ మూవింగ్ లైన్’లో కనువిందు చేస్తాయి. ‘భారతదేశం అంటేనే కథకులు, కళాకారుల దేశం’ అంటారు అమృత పాటిల్.వెస్ట్రన్ సెటైర్ నుంచి స్ఫూర్తి పొందిన బెంగాలీ ఇల్యుస్ట్రేషన్లు, మన దేశంలోని రాజకీయ కార్టున్లు, చారిత్రాత్మక ప్రాధాన్యతను తెలియచేసే కార్టూన్లు, సామాజిక కట్టుబాట్లను సవాలు చేసే కార్టూన్లు, అసమ్మతి గళం విప్పిన శక్తిమంతమైన కార్టూన్లు, మహిళ కార్టూనిస్ట్ సుఖలత రావు గీసిన కార్టూన్లు, కామిక్స్‌పై బాలీవుడ్ ప్రభావాన్ని చూపించే చిత్రాలు (ఉదా: సామాజిక న్యాయం థీమ్‌తో క్రియేట్ చేసి బహుదూర్, సుప్రీమో పాత్రలు) ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి.1990ల చివరి నాటికి భారతీయ గ్రాఫిక్ కథనాలు సంప్రదాయ సూపర్ హీరో కథలను దాటి సంక్లిష్టమైన సామాజిక సమస్యల దగ్గరకు వెళ్లాయి. ఈ క్రమంలో మంజులా పద్మనాభన్లాంటి ఆర్టిస్ట్‌లు తెర మీదికి వచ్చారు. గ్రాఫిక్ నవలలను ప్రధాన స్రవంతి ప్రచురణ రంగంలోకి తీసుకు రావడంలో ప్రచురణకర్త వి.కె.కార్తీక ప్రధాన పాత్ర పోషించారు. చోళుల కాలం నాటి ప్రాచీన హలసూరు సోమేశ్వర ఆలయ కళను హైలైట్ చేసే చిత్రాలు, అత్యంత పురాతన దృశ్యకళారూపాలలో ఒకటైన ‘వీరగల్లు’... మొదలైన వాటికి సంబంధించిన చిత్రాలు ఈ ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి. బెంగళూరు తరువాత ‘ఎ మూవింగ్ లైన్’ ఎగ్జిబిషన్ ప్రఖ్యాత ఫ్రెంచ్ కామిక్ మ్యూజియం ‘సిటీ ఇంటర్నేషనల్ డి లా బాండే డిస్నీ’లో ఏర్పాటుకానుంది. పురాణకథలు ఆధునిక కోణంలో...గోవాలో పెరిగిన అమృత పాటిల్ ‘గోవా కాలేజ్ ఆఫ్ ఆర్ట్’ లో బీఎఫ్‌ఏలో డిగ్రీ, బోస్టన్లోని ‘స్కూల్ ఆఫ్ ది మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో మాస్టర్స్ చేశారు. తన తొలి గ్రాఫిక్ నవల ‘కరి’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నవలతో ఫస్ట్ ఫిమేల్ గ్రాఫిక్ నవలారచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కరి’ తరువాత వచ్చిన రెండు గ్రాఫిక్ నవలలు... ఆదిపర్వ, సౌప్తిక్కు కూడా మంచి స్పందన వచ్చింది. మహాభారతంలోని కథలను గంగ, అశ్వత్థామ దృక్కోణం నుంచి తిరిగి చెప్పే కథలు ఇవి. ఈ నవలల ద్వారా పురాణ కథలను వర్తమానానికి దగ్గరగా తీసుకువచ్చారు. అమృత రచనలు ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలలోకి అనువాదం అయ్యాయి. -
వీవీఎస్ లక్ష్మణ్‌తో సైకియా భేటీ.. కారణం ఇదే!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా.. హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఆదివారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హుటాహుటిన ఆయన బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. కాగా గత కొంతకాలంగా టీమిండియా గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.స్టార్ ఆటగాళ్లంతా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. అదే విధంగా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్.. బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయాల నుంచి కోలుకోలేదు.ఇక తొడకండరాల నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా పరిస్థితిలో ఏమాత్రం పురోగతి లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేవజిత్ సైకియా బెంగళూరుకు వెళ్లి లక్ష్మణ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ వర్గాలు తాజాగా పీటీఐకి వెల్లడించాయి.‘‘అవును.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బెంగళూరులో వీవీఎస్ లక్ష్మణ్‌తో భేటీ అవుతారు. ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆన్లైన్లో ఈ భేటీలో పాల్గొంటారనే సమాచారం ఉన్నా.. స్పష్టత మాత్రం లేదు.ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యల గురించి సైకియా- లక్ష్మణ్ చర్చిస్తారు. ఇద్దరూ కలిసి మీడియా ఎదుటకు వచ్చి అన్ని ప్రశ్నలకు బదులిస్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), టీమిండియా సెలక్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండానే.. వారిని రిలీజ్ చేయడం సరికాదని సెలక్టర్లు హితవు పలికినట్లు సమాచారం. ఇటీవల హర్షిత్ రాణా.. తాజాగా బుమ్రా, సాయి సుదర్శన్‌ల ఫిట్నెస్ గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వకలేదని తెలుస్తోంది.దీంతో వారిని తొలుత పలు సిరీస్‌లకు ఎంపిక చేసి.. ఆ తర్వాత వారి స్థానాలను వేరే వారితో భర్తీ చేయడంలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని CoE దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బుమ్రా, సుదర్శన్ రిలీజ్ చేయడం వల్ల జట్టు ఎంపిక సమయంలో క్లారిటీ లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
రీల్స్ మోజులో వంట చేయలేదని భార్యను.. కడతేర్చాడు!
బెంగళూరు: సమయానికి సక్రమంగా వంట వండకుండా ఇంట్లో రీల్స్‌తో కాలం గడుపుతున్న భార్యను హత్య చేసినట్లు పోలీసుల ముందు భర్త నోరువిప్పాడు. కుంబళగోడు పోలీస్‌స్టేషన్ పరిధిలో 12 రోజుల క్రితం బెడ్‌షీట్‌లో మహిళ శవం చుట్టిన కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు హత్యకు కారణాలను పోలీసులు సేకరించారు. బిహార్‌కు చెందిన ధీరజ్ కుమార్(24), రీమా కుమారి(20) ప్రేమించుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా బిహార్ నుంచి 10 నెలల క్రితం బెంగళూరుకు చేరుకుని ఇద్దరూ వివాహం చేసుకున్నారు. దంపతులు గేరుపాళ్యలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ సమీపంలోని పరిశ్రమలో పనికి వెళ్లేవారు. రీమా రీల్స్ చేయడానికి అలవాటు పడి ఇంట్లో సక్రమంగా వంట చేసేది కాదు. దీంతో కోపోద్రిక్తుడైన ధీరజ్‌కుమార్ భార్యతో గొడవ పడేవాడు. ప్రతినిత్యం ఇద్దరూ ఘర్షణ పడేవారు. రీమా ఇటీవల తాను బిహార్‌కు వెళ్లిపోతానని పట్టుబట్టింది. ఈక్రమంలో గత నెల 27న రాత్రి ధీరజ్‌కుమార్ విధులు ముగించుకుని ఇంటికి రాగా ఇంట్లో వంట వండలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి తీవ్ర స్థాయికి చేరడంతో చేతికి దొరికిన కర్రతో ధీరజ్‌కుమార్ రీమాపై దాడి చేశాడు. అనంతరం చున్నీతో రీమా గొంతు బిగించి చంపి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి బిహార్‌కు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుంబళగోడు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి బిహార్‌లో ఉన్న ధీరజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
ఏడాది తర్వాత అస్థిపంజరంగా..!
కట్టుకున్న తోడు లేదు.. కొడుకు కూడా దూరమయ్యాడు. కన్నకూతురుకి ఏమైందో తెలియదు?. ఒంటరి జీవితంతో పోరాడుతూ రోజులు గడిపిన ఆమెను చివరకు మృత్యువు కూడా నిశ్శబ్దంగానే తీసుకెళ్లింది. అయితే ఆమె మరణించిన విషయం చెప్పేందుకు, కన్నీరు పెట్టేందుకు కూడా ఎవరూ లేకపోయారు. చివరకు ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ విషాదం బయటపడింది. పోలీసులు వచ్చి తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.మెట్రో నగరం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ.. చివరకు తన ఇంట్లోనే కన్నుమూసింది. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తలుపులు తెరిచిన పోలీసులు చూసిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే ఆ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిపోయింది.బెంగళూరులోని బాగలగుంట ప్రాంతం హవనూర్ లేఅవుట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభించిన అస్థిపంజరం 52 ఏళ్ల దాక్షాయిణిదిగా గుర్తించారు. దాక్షాయిణి కొంతకాలంగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఉమేశ్ దాదాపు పదేళ్ల క్రితం మరణించగా.. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.భర్త, కొడుకు మరణాల తర్వాత ఆమెను పలకరించేవారు కూడా లేకుండా పోయారని తెలుస్తోంది. ఏడాది పాటు ఆమె ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కూతురు-అల్లుడు సహా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు రాకపోవడంతో విషాదం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాగలగుంట పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాక్షాయిణి మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జనాలతో కిటకిటలాడే మహానగరంలో.. పక్కింట్లోనే ఓ మనిషి ఏడాది పాటు కనిపించకపోవడం, ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకపోవడం ఒంటరి జీవితాలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. -
కారు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి..!
తిరుపతి జిల్లా: స్వగ్రామానికి వెళుతుండగా మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో అక్కాచెల్లెలు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జగవాండ్లపల్లె పంచాయితీ బోడిరెడ్డి గారిపల్లెకు చెందిన అనిల్ కుమార్ బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య మానస(35) మరదలు గౌతమి(32)తో కలిసి కారులో స్వగ్రామం బయలుదేరారు. బెంగళూరు కార్నర్‌లోని బట్టరహళ్లి వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో వి.కోట మండలం రామాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అనిల్ కుమార్ మరదలు గౌతమి(32) కారులో నుంచి బయట పడి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. లిప్ట్ అడిగి ప్రయాణిస్తున్న పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి క్షేమంగా బయటపడినట్టు సీఐ సోమశేఖర్‌రెడ్డి, ఎస్ఐ షేక్షావలీ తెలిపారు. అక్కాచెల్లెలు మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
రాపిడో రైడర్లకు బిగ్ షాక్: లైసెన్స్, ఆర్సీ రద్దు!
బెంగళూరు: రాజధానిలో బైక్ ట్యాక్సీ సేవలపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించి 70 బైకులను స్వా«దీనం చేసుకున్నారు. మొబైల్యాప్ల ద్వారా ట్రిప్పులు వేస్తున్న బైకిస్టులను అడ్డుకుని సీజ్ చేశారు. యలహంక సింగనాయకనహళ్లి ఆర్టీఓ పరిధిలో 40కి పైగా బైకులను జప్తు చేశారు. బైకిస్టుల మొబైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలించారు. బైక్ ట్యాక్సీలను నిషేధించాలని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు చేయడంతో పాటు హైకోర్టులో కేసులు వేయడం తెలిసిందే. దీంతో మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో రవాణాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. డీఎల్, ఆర్సీ రద్దు చేస్తాం అక్రమంగా బైకు ట్యాక్సీ నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ రద్దుచేస్తున్నామని అధికారులు తెలిపారు. రాజాజీనగరలో వాహనాలు జప్తుచేయడంతో ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాపిడో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావాలనే బైక్ ట్యాక్సీలను బుక్‌చేసి అధికారులకు తెలిపి పట్టిస్తున్నారని కొందరు యువకులు ఆరోపించారు. వారంపాటు తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు. -
సీఐఎల్ ల్యాబ్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి
బెంగళూరు: కర్ణాటక,కడేచూర్ సీఐఎల్ ల్యాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకై ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.మృతులు మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్ మరియు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా వాసిగా తెలుస్తోంది. ముగ్గురి వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం. ఈఘటన పారిశ్రామిక ప్లాంట్ లోపల తెల్లవారుజామున 1 గంట నుండి 2 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
అందుకే రూ.11 లక్షల ఉద్యోగానికి గుడ్‌బై!
మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అంటే పెద్ద సాహసమే. కానీ కొన్నిసార్లు ఉద్యోగం కంటే.. సొంత వ్యాపారమే ఎక్కువ సంతృప్తిని, మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అలాంటి ఓ యువకుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఎక్స్(X)లో అంకిత్ పాండే అనే వ్యక్తి తన స్నేహితుడి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఏడాదికి రూ.11 లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అతని స్నేహితుడు ప్రమోషన్స్, కార్పొరేట్ జీవితాన్ని పక్కనబెట్టి సొంత ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ తన సొంత స్థలంలోనే ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించాడు.ప్రారంభంలో చిన్న స్థాయిలోనే మొదలైనప్పటికీ.. ప్రస్తుతం అతని వ్యాపారం బాగా విస్తరించింది. ఇప్పుడు దాదాపు 300 ఇళ్లు, దుకాణాలకు ప్రతిరోజూ తాగునీటి క్యాన్లను సరఫరా చేస్తున్నాడు. రోజుకు సుమారు 300 క్యాన్లు విక్రయిస్తుండగా, ఒక్కో క్యాన్‌ను రూ.30కి అమ్ముతున్నాడు.దీంతో రోజుకు దాదాపు రూ.9 వేల ఆదాయం, అంటే నెలకు సుమారు రూ.2.7 లక్షల టర్నోవర్ వస్తోంది. సొంత స్థలం కావడంతో అద్దె భారం లేదు. నీటి శుద్ధి, విద్యుత్ ఖర్చులకు నెలకు సుమారు రూ.15 వేల, రవాణాకు మరో రూ.20 వేల ఖర్చవుతోంది. ఈ ఖర్చులన్నీ తీసేసిన తర్వాత కూడా ప్రతి నెల సుమారు రూ.2.35 లక్షల లాభం మిగులుతోందని అంకిత్ పాండే తెలిపారు. అంటే ఏడాదికి దాదాపు రూ.28.5 లక్షల ఆదాయం వస్తోంది. ఇది ఆయన గతంలో కార్పొరేట్ ఉద్యోగంలో పొందిన వార్షిక జీతం కంటే రెండింతలకు పైగానే ఉంది.My friend quit his ₹11 LPA 9-to-5 job in Bengaluru.Now he earns nearly ₹28 lakh a year from his home.Instead of chasing promotions, he went back home and started a simple water purification business.He installed a water purification plant on his own property and connected… pic.twitter.com/uY3mfTd0d3— Ankit Pandey (@iamankitpande) August 3, 2026ఈ కథను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అంకిత్ పాండే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. విజయమంటే పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయడమే కాదు. ప్రజలకు ప్రతిరోజూ అవసరమయ్యే సమస్యకు పరిష్కారం చూపే వ్యాపారం కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని అన్నారు. చివరగా ఎవరైనా.. ''రూ.11 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇలాంటి వ్యాపారం చేస్తారా?'' అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.ఈ పోస్టుపై చాలామంది స్పందించారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నందున, స్వచ్ఛమైన తాగునీటికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఈ కథ ఒక మంచి సందేశాన్ని ఇస్తోందని అన్నారు. ఉద్యోగ హోదా కంటే, ప్రజలకు అవసరమైన సేవను అందించే వ్యాపారం స్థిరమైన ఆదాయాన్ని అందించగలదని పేర్కొన్నారు. -
సిద్దరామయ్య గైర్హాజరు దేనికో?
సాక్షి, బెంగళూరు: మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్దరామయ్య గైర్హాజరు ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం పదవిని ఆయన అయిష్టంగా వదులుకోవడం తెలిసిందే. అలాగే మంత్రుల ఎంపిక గురించి ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఫలితంగా రాలేకపోయినట్లు సమాచారం. దీనిపై తలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరును మంత్రుల జాబితా నుంచి చివరి నిమిషంలో తొలగించడం సిద్దరామయ్యకు ఆగ్రహం తెప్పించింది. ఆమెకు కుర్చీ ఇవ్వాలని సిద్దరామయ్య ప్రయత్నాలు చేశారని, తీరా తొలగించేసరికి అలిగారని పార్టీ వర్గాల కథనం. siddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowdasiddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowdasiddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowda -
బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్‌జీ ఆనందం!
సొంతిల్లు ఎవరికైనా జీవిత కల. అదే ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటే బెంగళూరు లాంటి నగరంలో అయితే.. పాతికేళ్లు కూడా నిండకుండానే సాకారమైతే అంతకుమించిన విజయం ఇంకేముంది అంటే అతిశయోక్తి కాదు. 24 ఏళ్ల వయసులోనే రూ.1.8 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్న లీగల్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆకాశ్ నారాయణ్.. తన విజయాన్ని కేవలం వ్యక్తిగత ఘనతగా చూడటం లేదు. ఆర్థిక అనిశ్చితి, కుటుంబ సమస్యల నుంచి మొదలైన తన ప్రయాణంలో తల్లి, మెంటార్లు, స్నేహితులు, తొలి టీమ్ సభ్యుల సహకారమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతున్నారు.ఆకాశ్ నారాయణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కాసాగ్రాండ్ వివాసిటీలో ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా.. 2027 ఏప్రిల్ నాటికి ఫ్లాట్ స్వాధీనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆకాశ్ నారాయణ్ ప్రస్తుతం లీగలిట్ అనే లీగల్-టెక్ సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ వార్షిక స్థూల ఆదాయం సుమారు రూ.13 కోట్లని సమాచారం.‘ఇది నా విజయం మాత్రమే కాదు’తన తొలి ఇంటిని కొనుగోలు చేసిన సందర్భంగా సోషల్ మీడియాలో ఆకాశ్ నారాయణ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. 24 ఏళ్లకే మొదటి అపార్ట్మెంట్ కొనుగోలు చేశానని చెబుతూ.. ఈ మైలురాయి తనది మాత్రమే కాదని పేర్కొన్నారు. కుటుంబం, మెంటార్లు, టీమ్, స్నేహితులు తన ప్రయాణంలోని ప్రతి దశలో అండగా నిలిచారని తెలిపారు.ఒకప్పుడు సొంత ఇల్లు అనేది తనకు సాధ్యం కాని కలలా అనిపించేదని ఆకాశ్ చెప్పారు. ఇప్పుడు ఆ కల నిజమైనప్పటికీ, దాని వెనుక ఎంతో మంది సహకారం ఉందన్నారు. తన తల్లి ప్రోత్సాహంతోపాటు తనతో కలిసి పనిచేసిన టీమ్ సహకాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘ఇది ప్రారంభం మాత్రమే’తొలి ఇంటి కొనుగోలును ఆకాశ్ నారాయణ్ తన జీవితంలో ముగింపు గమ్యంగా కాకుండా మరో దశకు ఆరంభంగా చూస్తున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే’’ అంటూ తన సోషల్ మీడియా పోస్ట్‌ను ముగించారు. వ్యక్తిగతంగా సాధించిన విజయాన్ని కుటుంబం, టీమ్, మెంటార్లు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా.. విజయానికి వెనుక ఉండే సహకారం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Akash Narayan (@kshnryn) -
ఆపరేషన్ థియేటర్లో.. పులికి దంత సర్జరీ
కర్ణాటక, బొమ్మనహళ్లి: సాధారణంగా మనుషుల దంతాలకు సమస్య వస్తే రూట్ కెనాల్ చేయించుకుంటారు. పులికి సైతం దంతం పాడైపోవడంతో దానికి రూట్ కెనాల్ సర్జరీ చేశారు. బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్‌లో కొన్ని పులులు ఉన్నాయి.వీటిలో సించన అనే పులి కోర పంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. ఆ పులి బోను కడ్డీని కొరకడం వల్ల దాని కోర పన్ను దెబ్బతింది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకింది. నొప్పి ఎక్కువ కావడంతో సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు. దీని వల్ల పులి ఆరోగ్యం అంత బాగా లేదు. పులిని పరీక్షించిన పశువైద్యులు దాని పంటికి చికిత్స చేయాలని నిర్ణయించారు. మత్తు మందు ఇచ్చి 3 గంటలకు పైగా శ్రమించి రూట్ కెనాల్ చికిత్సను నిర్వహించారు. -
క్యాబ్ కోసం వేచి చూస్తుంటే.. మీ రేటు ఎంత..?
బెంగళూరు: మహిళను అసభ్యకరంగా మాట్లాడిన బైకిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరం కృష్ణరాజపురం పరిధిలోని రామమూర్తి నగర్లో ఒక మహిళ క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి ‘మీ రేటు ఎంత’ అని అడిగాడు. ఆ మహిళ ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ‘నేను క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా, స్కూటీపై ఉన్న ఒక వ్యక్తి నా రేటు ఎంత అని అడిగాడు. నా భద్రత కోసం నేను వీడియో తీస్తున్నాను. అది గమనించిన ఆ వ్యక్తి నన్ను తిట్టి పారిపోయాడు’ అని పేర్కొంది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని 42 ఏళ్ల విజయ్ రాఘవ్‌గా గుర్తించారు. అతను పండ్ల వ్యాపారి, హోరమావు నివాసి. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, స్కూటర్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు రామమూర్తి నగర్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అతను వేరొకరి స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడని తెలిపారు. A woman was waiting by the roadside for a cab in Bengaluru when a man on a scooty approached her.MAN: I’ll give you ₹10,000. Come with me to a hotel room.WOMAN: What? Why the f*uck are you asking me? I’ll file a police complaint.MAN: Why would you file a police complaint?… pic.twitter.com/bz26WFsDV4— Lakshay Mehta (@lakshaymehta08) July 28, 2026 -
కోడింగ్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన!
బెంగళూరు: అమెరికాలో ఉద్యోగ వేట విఫలమై, నెలల తరబడి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కక బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మోహిత్ ఆర్. గౌడ అనే యువకుడు తన అనుభవాలను లింక్డ్ఇన్ వేదికగా పంచుకున్నారు. కష్టపడి చదివి, ఎన్నో త్యాగాలు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన తనకు, అక్కడి వాస్తవ పరిస్థితులు తీవ్ర నిరాశను మిగిల్చాయని ఆయన పేర్కొన్నారు.వందలాది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ, కోడింగ్ పరీక్షలు, ఇంటర్వ్యూల కోసం రాత్రింబవళ్లు శ్రమించినా, చివరికి నిరాశే ఎదురైందని మోహిత్ తెలిపారు. స్వదేశానికి తిరిగి రావడం తన ప్రణాళికలో లేదని, ఈ నిర్ణయం ఎంతో వేదనను, అనిశ్చితిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో పొదుపు చేసుకున్న సొమ్మంతా క్రమంగా కగిపోవడం ఆర్థికంగా ఎంతో కుంగదీసిందని వాపోయారు. అయినప్పటికీ నిరాశను పక్కనపెట్టి, కృత్రిమ మేధస్సు , జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, తగిన అవకాశాలు ఉన్నవారు రిఫరల్స్ ద్వారా సహకరించాలని కోరారు.ఇది కూడా చదవండి: మోనాలీసాను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు -
నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే!
డబ్బు ఎక్కువగా ఉంటే.. జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తారు. కానీ.. మనసులో ఉండే భయం, చిన్నప్పటి అనుభవాలు, బాధ్యతలు కూడా మన సంతోషాన్ని ప్రభావితం చేస్తాయనేది నిజం. దీనికి బెంగళూరులో నివసిస్తున్న 26 ఏళ్ల టెకీ కథ మంచి ఉదాహరణ.రెడ్దిట్ పోస్టులో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. బెంగళూరులో నివసిస్తున్న యువకుడు ప్రస్తుతం నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. అతనికి ఎలాంటి అప్పులు లేవు. అయినప్పటికీ.. తాను ఇప్పటికీ పేదవాడిననే భావనతో జీవిస్తున్నానని తన మనసులో మాట చెప్పాడు.చిన్నప్పటి నుంచి అతని కుటుంబం చాలా పేదరికంలో జీవించింది. వారి కుటుంబ ఆదాయం నెలకు రూ.6,000 నుంచి రూ.7,000 మాత్రమే ఉండేది. ఒక చిన్న 10×10 గదిలో అందరూ ఉండేవారు. ఆ రోజుల్లో డబ్బు కోసం పడిన కష్టాలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే.. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబ జీవితాన్ని మార్చాలనే లక్ష్యంతో కష్టపడ్డాడు.2021లో ఉద్యోగం వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులను పని చేయనివ్వకుండా ఇంట్లోనే విశ్రాంతిగా ఉండేలా చేశాడు. వారికోసం స్వగ్రామంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసి ఇచ్చాడు. తాను ఉండటానికి బెంగళూరులో ఒక 2BHK అద్దెకు తీసుకున్నాడు. ప్రతి నెలా తల్లిదండ్రులకు రూ.15,000 నుంచి రూ.20,000 పంపిస్తున్నాడు.అతను సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాడు. ప్రతి నెలా రూ.30,000 మ్యూచువల్ ఫండ్స్‌లో, రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్లో, మరో రూ.10,000 బంగారం కోసం దాస్తున్నారు. ఇప్పటివరకు స్టాక్స్, FDలు, బంగారం, బ్యాంక్ పొదుపులతో మంచి మొత్తాన్ని కూడబెట్టాడు. స్కూటర్, మ్యాక్ బుక్, ఫోన్ వంటి అవసరమైనవి కొనుగోలు చేశాడు. తల్లిదండ్రుల ఇంటికి అవసరమైన ఫర్నిచర్, ఇతర పరికరాలను కూడా కొనిచ్చాడు.#Rant, Feeling poor: Earning ₹2l a month with ₹0 deptby u/Cautious-Table158 in FinancialAdviceIndiaఅయినా.. కూడా అతనికి తాను ధనవంతుడిననే భావన రాలేదు. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. పెళ్లికి కనీసం రూ.10 లక్షలు ఖర్చవుతాయని భావిస్తున్నాడు. అదనంగా ఒక కారు, స్వగ్రామంలో స్థలం, ఒక బైక్ కొనాలని కూడా ఉంది. కానీ ఒకటి ఎంచుకుంటే.. మరొకటి చేయలేనేమో అనే భయం అతనిని ఎప్పుడూ వెంటాడుతోంది.అతని బాధలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సొంత ఊరిలో ఆటో డ్రైవర్లు, కూలీలుగా పనిచేసే స్నేహితులు తనకంటే తక్కువ సంపాదించినా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వారు అప్పులు తీసుకుని తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ నేను మాత్రం రూ.750 కంటే ఎక్కువ ధర ఉన్న చొక్కా కొనాలన్నా చాలా సార్లు ఆలోచిస్తున్నానని చెప్పాడు. డబ్బు ఉన్నా ఖర్చు చేయడానికి భయపడటం అతని మనసులోని అసురక్షిత భావాన్ని చూపిస్తుంది.ఈ పోస్ట్ చూసిన చాలా మంది రెడ్దిట్ వినియోగదారులు అతనికి ధైర్యం చెప్పారు. చిన్నప్పుడు పేదరికంలో పెరిగిన వారికి, తర్వాత ఎంత డబ్బు వచ్చినా 'రేపు ఏమవుతుందో?' అనే భయం పోవడం కష్టం అని వివరించారు. అతను ఇప్పటివరకు సాధించిన విజయాలను గుర్తు చేసుకుని తనపై తాను గర్వపడాలని సూచించారు. అలాగే తొందరపడి పెద్ద రిస్క్‌లు తీసుకోవద్దని, ఓపికగా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఇంకా మంచి స్థితికి చేరుకుంటారని సలహా ఇచ్చారు. -
మహిళతో అసభ్య ప్రవర్తన.. బస్సులోనే దాడి
బనశంకరి: బెంగళూరు బీఎంటీసీ బస్సుల్లో గొడవలు కొత్త కాదు. ఇప్పుడో రగడ వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతితో పాటు బస్సు డ్రైవరు అతన్ని చితకబాదారు. సంపిగేహళ్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. వివరాలు.. ఈ నెల 24వ తేదీ మద్యాహ్నం 12:42 సమయంలో బీఎంటీసీ బస్సు మాన్యతా టెక్‌పార్కు వైపు వెళ్తోంది. ఓ యువతిని నిందితుడు కావాలనే తాకాడని ఆమె కోపంతో అతన్ని కేకలు వేసింది. తరువాత డ్రైవరుకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి అతన్ని బస్సులో మూలకు తోసి బట్టలు విప్పి చితకబాదారు. డ్రైవరు కాలితో ఎడాపెడా కొట్టాడు. చివరకు అతడు బస్సులో నుంచి దిగి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు వ్యక్తిని మతిస్థిమితం లేనివానిగా భావిస్తున్నారు. తరచూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తూ ఆకతాయిగా ప్రవర్తిస్తుంటాడని సమాచారం. యువతి ధైర్యంగా అతనికి గుణపాఠం చెప్పిందని కొందరు నెటిజన్లు అన్నారు. మరికొందరు అతన్ని అంత ఘోరంగా కొట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.A woman faced sexual harassment by a copassenger on a #BMTC bus near Manyata Tech Park in #Bengaluru.After she confronted the accused, the BMTC driver locked the bus doors to stop him from fleeing and assaulted him. A video of the incident has gone viral. #Karnataka pic.twitter.com/MhXMNMZs4e— Imran Khan (@KeypadGuerilla) July 25, 2026 -
24 గంటల్లో రూ.20 లక్షలు ఖాళీ!
భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే కార్యక్రమం మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు కలిసి జరుపుకునే పెద్ద వేడుక. మన దేశంలో వివాహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే.. చాలామంది తమ పెళ్లిని జీవితంలో గుర్తుండిపోయేలా ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరుకుంటారు. దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.ప్రస్తుతం భారతీయ పెళ్లిళ్ల విషయంలో రెండు రకాల ఆలోచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది పెళ్లిని ఎంతో వైభవంగా నిర్వహించాలని భావించి భారీగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. మరికొందరు మాత్రం అవసరానికి మించి ఖర్చు చేయకుండా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆచరణాత్మకంగా పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.ఇలాంటి పెళ్లి ఖర్చులపై.. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.20 లక్షల బడ్జెట్ ఎలా ఖర్చైపోతుందో ఆమె వివరించారు.మీనల్ గోయల్ లెక్కల ప్రకారం.. సాధారణంగా రూ.20 లక్షల బడ్జెట్ ఉన్న ఓ పెళ్లిలో ఎక్కువ మొత్తం ఆహారం, వేదిక, అలంకరణ వంటి వాటికే ఖర్చు అవుతోంది. సుమారు రూ.6 లక్షలు భోజనాల కోసం, రూ.5 లక్షలు పెళ్లి వేదిక కోసం, రూ.3 లక్షలు అలంకరణ కోసం ఖర్చవుతాయని తెలిపారు. ఇక ఫోటోగ్రఫీకి రూ.2 లక్షలు, వినోద కార్యక్రమాలు లేదా డీజే కోసం మరో రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని, మిగిలిన రూ.2 లక్షలు ఇతర చిన్నచిన్న ఖర్చులకు వెళ్తాయని వివరించారు.అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసినా ఆ వేడుకలు కొన్ని గంటలు మాత్రమే ఉంటాయని మీనల్ గోయల్ చెప్పారు. కేవలం 24 గంటల్లోనే రూ.20 లక్షలు ఖర్చైపోతాయని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.పెళ్లిళ్లు చేసుకోవద్దని లేదా వేడుకలను తగ్గించుకోవాలని మీనల్ గోయల్ ఉద్దేశ్యం కాదు. కానీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఖర్చు చేయాలని సూచించారు. పెళ్లి అనేది కేవలం ఒక రోజు జరిగే వేడుక మాత్రమే కాదని.. దాని తర్వాత ప్రారంభమయ్యే కొత్త జీవితానికి ఆర్థిక భద్రత కూడా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.పెళ్లిని ఘనంగా జరుపుకోవడం కంటే, పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగడం ముఖ్యం. ఒక రోజు జరిగే వేడుక కోసం అధికంగా ఖర్చు చేసి ఆర్థిక ఒత్తిడిని తెచ్చుకోవడం కంటే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. View this post on Instagram A post shared by Meenal Goel | Finance (@ca.meenalgoel) -
వెంటనే ఈ భవంతిని కూల్చేయండి
బనశంకరి: బెంగళూరులోని బొమ్మనహళ్లి నియోజకవర్గం కూడ్లు ప్రాంతంలో వాలిన రూ.200 కోట్ల విలువ చేసే భారీ భవంతిని తొలగించాలని గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) సూచించింది. 18 అంతస్తుల ఈ భారీ భవంతి బెంగళూరులోనే అతి ఎత్తయిన భవంతిగా పేరొందింది. అశాస్త్రీయంగా నిర్మించిన 49 ఫ్లాట్లు కలిగిన 18 అంతస్తుల భారీ భవంతి ఒక పక్కకు వాలిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భవనానికి స్ట్రక్చరల్ డ్యామేజీ ఎదురుకాగా.. భవిష్యత్‌లో కూలిపోవచ్చనే భయం ఏర్పడింది. దీంతో కట్టడంలో వాలిన భాగాన్ని తొలగించాలని జీబీఏ సూచించింది. సంబంధిత యజమానితో జీబీఏ కమిషనర్ సమావేశం నిర్వహించి కట్టడం తొలగింపునకు సూచించారు. వాలిన కట్టడం తొలగించడానికి యజమాని సమ్మతించారు. కట్టడం తొలగింపునకు ముందు ప్రజల భద్రతకు సంబంధించి జీబీఏ అనుమతి తీసుకున్నారు. వ్యర్థాల తొలగింపు వ్యయం భరించడానికి సంస్థ ముందుకు వచ్చింది. -
ఒక్క వీడియో కాల్‌తో కష్టాల్లో యువ క్రికెటర్..!
డేటింగ్యాప్లో పరిచయమైన మహారాష్ట్ర క్రికెట్ జట్టు యువక్రికెటర్‌ను ప్రేరేపించి అర్ధనగ్నంగా మార్చి వీడియో రికార్డు చేసిన యువతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసింది. యువక్రికెటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశాన్య విభాగ సెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 17వ తేదీన కణ్ణూరు వద్ద పంచతార హోటల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో యువక్రికెటర్ మహారాష్ట్ర నుంచి నగరానికి చేరుకుని హోటల్లో ఉన్నాడు. డేటింగ్ యాప్‌లో పేరు నమోదు చేసుకున్న క్రికెటర్‌కు 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌కాల్‌లో మాట్లాడాలని తెలిపి నెంబర్ షేర్ చేసింది. అనంతరం ఇద్దరు వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యువతి ఒంటిపై దుస్తులు తీసేసింది. క్రికెటర్ కూడా దుస్తులు తీసి అర్ధనగ్నంగా ఉండగా వీడియో రికార్డ్ చేసింది. కొద్దిసేపటి తరువాత క్రికెటర్‌కు ఫోన్ చేసి నగ్న వీడియో స్క్రీన్షాట్లు పంపించి డబ్బు ఇవ్వాలని బెదిరించింది. కంగారు పడిన క్రికెటర్ రూ.1,500 ఆన్లైన్లో షేర్ చేశారు. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్‌గా ఆ జంట ఆర్థిక సూత్రాలు..
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్, ఆఫర్ల పుణ్యమా అని..అవసరం ఉన్నా లేకపోయినా..కొనడం ఒక వ్యసనంగా మారిందని చెప్పాలి. దాంతో కొన్ని కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని సతమవుతున్నాయి కూడా. అయినా కూడా ఈ జాడ్యం వదిలించుకోలేరు. చూడగానే కంటికి నచ్చితే చాలు కొనేయాల్సిందే అన్న మనస్తత్వం ఉంటే ..ఆర్థిక కష్టాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ జంట మాత్రం ఆర్థికంగా బేషుగ్గా ఉండాలంటే ఈ విధానం ఫాలో అయితే చాలు అంటూ చెప్పిన ఆర్థిక సూత్రాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. వాళ్లు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారో చూస్తే విస్తుపోతాం కూడా. అంతా విలాసవంతమైన వాటి కోసం చూస్తే..వాళ్లు మాత్రం జీవితానికి కీలకమైన దానిపై పెట్టుబడులు పెడుతూ అందర్నీ ఆలోచింప చేశారు. ఇంతకీ ఆ దంపతులు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారంటే..డబ్బు విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికీ వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. కొందరు భవిష్యత్తు కోసం పొదుపు చేసి పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడితే, మరికొందరు తక్షణ ఆనందాల కోసం ఖర్చు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాంటే నచ్చిన వాటిపై ఖర్చు చేయాల్సందేనన్నది కొందరి వ్యక్తుల నమ్మకం. అయితే చాలామంది రేపటికోసం ప్రణాళిక తోపాటు ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించేలా సమతుల్యతకు పెద్దపీట వేస్తారు. అలానే చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నా మేఘ, శుభమ్‌లు. ఒక పసిబిడ్డ, ఒక పెంపుడు కుక్క, రెండు పూర్తికాల ఉద్యోగాలతో తమ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నారో ఇన్స్టాగ్రామ్ వీడియోతో పంచుకుంటూ అందర్నీ ఆకర్షించారు. ఆ దంపతులు అనుసరించే విధానం..అందరికీ నచ్చడం విశేషం. వాళ్లు తమ కుటుంబాన్ని నడిపించేందుకు ఫాలో అవుతున్న ఆర్థిక తత్వం గురించి మాట్లాడారు. తాము హోదాల కంటే సౌకర్యానికి, జీవన నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విలాసవంతమైన కార్లు, డిజైనర్ దుస్తులు లేదా ఖరీదైన ఆభరణాలు కొనడానికి బదులుగా, తమ కుమార్తెతో ఎక్కువ సమయం గడిపే నివాస సముదాయంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడతామని అన్నారు. ప్రతి వేసవిలో ఒక అంతర్జాతీయ విహారయాత్రను ప్లాన్ చేసుకోవడం, ఏడాదిలో అనేకసార్లు తమ ప్రాంతంలోని విహారయాత్రాలు చేయడం, ముఖ్యంగా పండుగల సమయంలో తల్లిదండ్రల ఇంటికి వెళ్లడం వంటివి ఒక నియమంగా పెట్టుకుంటామని చెప్పారు. ఇక ఆరోగ్యం, ఫిట్నెస్ అవసరమైన పెట్టుబడులుగా పరిగనిస్తామని అన్నారు. అందుకే ఆరోగ్యోకరమైన ఆహారం, జిమ్ సభ్యుత్వం, ఆరోగ్య సంరక్షణపై ఖర్చులు పెడతామని అన్నారు. ప్రతి ఏడాది పెట్టుబడులను పెంచుతూ..పెట్టుబడి ఫోర్టఫోలియో వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. చివరగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా సంపదను నిర్మించడంపై దృష్టి పెడతామని చెప్పారు. అలాగే తాము తమ ఖర్చుల, ఆర్థిక బాధ్యతలను పంచుకుంటామని అన్నారు. మేఘా అద్దె, యుటిలిటీ బిల్లులు, గృహ సిబ్బంది జీతాలు వంటి స్థిరమైన నెలవారీ ఖర్చులు చూసుకుంటుండగా, శుభం కిరాణా సామాగ్రి, ప్రయాణం, క్రెడిట్‌తో సహా మారే ఖర్చులను చూసుకుంటాడని అన్నారు. ఈ ఆర్థిక నియమాలు అందరికీ వర్తించేవని చెప్పడం లేదని కేవలం ఆర్థికంగా ధీమాగా ఉండేందుకు, ఒక చిన్న కుటుంబానికి అత్యంత అనుకులమైన ఒక విధానమని చెప్పారు. View this post on Instagram A post shared by Megha & Shubham | Couple | Fitness journey (@the12absproject) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
ప్రతి సెకను ఇక పక్కా..
ఆధునిక డిజిటల్ యుగంలో ప్రతి సెకను కూడా ఎంతో విలువైనది. మనం మొబైల్ ఫోన్ ద్వారా చేసే నగదు బదిలీలు, ఫోన్ కాల్స్, విద్యుత్ సరఫరా వ్యవస్థల పర్యవేక్షణ, ఉపగ్రహ సమాచార మార్పిడి వంటి రంగాలన్నింటికీ కచ్చితమైన సమయం అత్యంత ముఖ్యం. అయితే మన దేశంలో ఇలాంటి కీలక వ్యవస్థలన్నీ ఇప్పటివరకు అమెరికాకు చెందిన అంతరిక్ష ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించి భారతదేశానికి డిజిటల్ సార్వభౌమాధికారం, స్వయం ప్రతిపత్తిని చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ’ఒకే దేశం, ఒకే కాలం’ అనే అద్భుతమైన సంకల్పంతో సరికొత్త ’వైట్ రాబిట్’ సాంకేతిక ఆధారిత నెట్‌వర్క్‌ను బెంగళూరులోని ప్రాంతీయ ప్రమాణాల ప్రయోగశాలలో ప్రారంభించింది. ఏమిటీ వైట్ రాబిట్ సాంకేతికత..?గతంలో కంప్యూటర్లు, సర్వర్లలో సమయాన్ని సరి చేయడానికి సాధారణ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వాడేవారు. కానీ ఆయా ప్రోటోకాల్స్‌ను ఎంత పకడ్బందీగా పాటించినా వాటిలో మిల్లీసెకన్ల (సెకనులో వెయ్యో వంతు) తేడా వచ్చేది. వైట్ రాబిట్ సాంకేతికత ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుంది. యూరప్ అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు మొదటగా ఈ సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇది ఆప్టికల్ ఫైబర్ సహాయంతో నడిచే ఒక అత్యంత కచ్చితమైన నెట్వర్క్ ప్రోటోకాల్. దీని ద్వారా అనుసంధానించిన గడియారాలు ఒక నానో సెకను (సెకనులో వంద కోట్ల వంతు) కంటే తక్కువ తేడాతో కచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. సాధారణంగా సమాచార ప్రసారంలో నెట్వర్క్ ఆలస్యం కావడం వల్ల సమయం మారే అవకాశం ఉంటుంది. కానీ వైట్ రాబిట్ సాంకేతికత ఆ ఆలస్యాన్ని ఎప్పటికప్పుడు స్వయంచాలకంగా సరిచేస్తూ అన్ని ప్రాంతాల్లోని పరికరాలు ఒకే అత్యున్నత కచ్చితమైన సమయంతో నడిచేలా చూస్తుంది. సమష్టి కృషితో సాధించిన విజయం.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నేషనల్ ఫిజికల్ ల్యా»ొరేటరీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వంటి అగ్రగామి సంస్థలు సమష్టిగా కృషి చేసి ఈ స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. బెంగళూరు ప్రయోగశాల నుండి చెన్నైలోని జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ కేంద్రానికి ఈ సురక్షిత కాల ప్రసారాన్ని విజయవంతంగా పరీక్షించారు. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నమ్మకమైన ఇంటర్నెట్ ఎంత ముఖ్యమో సురక్షితమైన కాలపాలన అంతకంటే ముఖ్యం. అభివృద్ధి చెందిన భారతదేశ విజన్ దిశగా, డిజిటల్ మౌలిక సదుపాయాలలో స్వయం సమృద్ధిని సాధించడంలో ఈ ’వైట్ రాబిట్’ సాంకేతికత ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశంలోని అన్ని వ్యవస్థలు, కంప్యూటర్లు, ప్రభుత్వ రంగాలు ఒకే రకమైన కచ్చితమైన సమయాన్ని పాటించేలా చూసే అధికారిక విధానాన్నే కాలపాలన అంటారు. దేశీయ కాలమానానికి భద్రతా కవచం.. ప్రస్తుతం బ్యాంకింగ్, రక్షణ రంగాలు విదేశీ ఉపగ్రహ సంకేతాల ద్వారా సమయాన్ని పొందుతున్నాయి. వీటికి సైబర్ దాడులు జరగడం, సంకేతాలను తారుమారు చేయడం లేదా జామింగ్ వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. ఒకవేళ ఈ విదేశీ వ్యవస్థలు నిలిచిపోతే మన దేశ డిజిటల్ వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ వైట్ రాబిట్ ఆధారిత భూతల నెట్వర్క్ రూపుదిద్దుకుంది. ఇది భారతదేశ అధికారిక కాల పరిశోధన ప్రయోగశాలల నుండి నేరుగా భారతీయ ప్రమాణ కాలాన్ని సురక్షితంగా సరఫరా చేస్తుంది. దీనివల్ల బాహ్య శక్తులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.కచ్చితమైన కాలముద్రలు..సాధారణంగా ఒక డిజిటల్ నెట్‌వర్క్‌లో ఏదైనాఒక సంఘటన లేదా లావాదేవీ జరిగినప్పుడు అది జరిగిన రోజు, గంట, నిమిషం, సెకను, సెకనులో వంద కోటో వంతు (నానో సెకను) సమయాన్ని కూడా డిజిటల్‌గా రికార్డు చేయడాన్ని ’కచ్చితమైన కాలముద్ర’ అంటారు. లావాదేవీలకు ఆధారం: ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు, ఆ డబ్బు ఏ కచ్చితమైన సమయానికి ఖాతా నుండి కట్ అయింది, అవతలి వారికి చేరిందీ లేనిదీ ఈ కాలముద్ర ద్వారానే తెలుస్తుంది. ఒకవేళ లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి ఇది ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. సైబర్ మోసాల నిరోధం: ఒకే బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఒకే నిమిషంలో రెండు వేర్వేరు నగరాల్లో లావాదేవీలు జరిగితే, కాలముద్రల సహాయంతో భద్రతా వ్యవస్థలు ఆ మోసాన్ని వెంటనే గుర్తించి ఖాతాను నిలిపివేస్తాయి. స్టాక్ మార్కెట్ వ్యాపారం: స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు వేగంతో మారిపోతుంటాయి. ఒక షేరును ఎవరు ముందు కొన్నారనేది మైక్రోసెకన్లు, నానోసెకన్ల కాలముద్రల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇది ట్రేడింగ్‌లో పారదర్శకతను పెంచుతుంది. డిజిటల్ రికార్డుల భద్రత: కంపెనీలు, ప్రభుత్వాలు, బ్యాంకులు తమ డిజిటల్ ఫైళ్లలో ఎవరు, ఎప్పుడు, ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి ఈ కాలముద్రలు ఉపయోగపడతాయి. ఇది వ్యవస్థలో అవకతవకలు జరగకుండా చూస్తుంది. రక్షణ, కమ్యూనికేషన్ రంగాలు: ఉపగ్రహాలు, రక్షణ వ్యవస్థలు, మొబైల్ నెట్‌వర్క్‌లు (5జీ వంటివి) సరిగ్గా పనిచేయడానికి అన్ని పరికరాలు ఒకే కచ్చితమైన సమయాన్ని కలిగి ఉండాలి. చిన్న సమయ తేడా ఉన్నా సమాచార ప్రసారం నిలిచిపోయే ప్రమాదం ఉంది. – సాక్షి, హైదరాబాద్ -
ఏంటిది? కర్ణాటక పాస్‌పోర్ట్ కోసం భారీ క్యూలు..
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా చెక్-ఇన్ల కాలంలోనూ పాతకాలపు స్టాంపుల సేకరణకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఇండియా పోస్ట్ కర్ణాటక పోస్టల్ సర్కిల్ ప్రవేశపెట్టిన ‘ఫిలాటెలీ పాస్‌పోర్ట్’ ప్రస్తుతం ప్రయాణికులు, స్టాంప్ కలెక్టర్లలో కొత్త క్రేజ్‌గా మారింది. తాజా ఎడిషన్ విడుదల నేపథ్యంలో బెంగళూరులోని జనరల్ పోస్టాఫీసు ముందు వందలాది మంది తెల్లవారుజామునే క్యూలు కట్టడం ఈ ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ పాస్‌పోర్ట్ 2024 చివర్లో తొలిసారి అందుబాటులోకి రాగా, ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సుమారు 100 పర్యాటక, వారసత్వ ప్రాంతాలను కలుపుతూ నవీకరించిన ఎడిషన్‌ను విడుదల చేశారు. సుమారు 1,500 కాపీల తాజా బ్యాచ్‌కు కూడా భారీ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది.ఫిలాటెలీ పాస్‌పోర్ట్ అంటే?పేరు పాస్‌పోర్ట్ అయినప్పటికీ దీనికి విదేశీ ప్రయాణాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి ప్రత్యేక జ్ఞాపకంగా రూపొందించిన కలెక్టర్ బుక్లెట్. ఇందులో ప్రతి గమ్యస్థానానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆ ప్రాంతానికి సమీపంలోని గుర్తించిన పోస్టాఫీసుకు వెళ్లి పోస్టల్ స్టాంప్‌ను కొనుగోలు చేసి, అక్కడ మాత్రమే లభించే పర్మనెంట్ పిక్టోరియల్ క్యాన్సిలేషన్ (PPC) ముద్రను వేయించుకోవాలి. దేవాలయాలు, కోటలు, మ్యూజియంలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేక గుర్తులతో ఈ ముద్రలు అందుబాటులో ఉంటాయి.ట్రావెలింగ్‌కి కొత్త అర్థంప్రతి ముద్ర నిజంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన గుర్తుగా నిలుస్తుంది. అందుకే ఈ పాస్‌పోర్ట్‌ను చాలామంది ఒక ‘ట్రావెల్ ఛాలెంజ్’గా కూడా భావిస్తున్నారు. అన్ని గమ్యస్థానాలను సందర్శించి ముద్రలు సేకరించడం ద్వారా రాష్ట్రాన్ని విభిన్న కోణాల్లో అన్వేషించే అవకాశం లభిస్తుంది. సాధారణ సావనీర్లా కొనుక్కునే వస్తువు కాకుండా, స్వయంగా ప్రయాణించి సంపాదించాల్సిన జ్ఞాపకంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.సోషల్ మీడియాలో వైరల్ఫిలాటెలీ పాస్‌పోర్ట్‌కు సోషల్ మీడియా కూడా ఊపునిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టల్ ముద్రలు సేకరిస్తున్న వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో యువత కూడా దీనిపై ఆసక్తి చూపుతోంది. దీంతో స్టాంప్ కలెక్టర్లకే పరిమితమైన ఈ అభిరుచి ఇప్పుడు ట్రావెల్ లవర్స్, హెరిటేజ్ ప్రియులను కూడా ఆకర్షిస్తోంది.పాత అభిరుచికి కొత్త ఊపుఫిలాటెలీ అంటే స్టాంపుల సేకరణను ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ ఇప్పటికే ప్రత్యేక కవర్లు, స్మారక స్టాంపులు, ‘దీన్‌దయాళ్ స్పార్ష్’ వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఫిలాటెలీ పాస్‌పోర్ట్ ద్వారా ఆ అభిరుచిని ప్రయాణ అనుభవంతో మేళవించింది. డిజిటల్ యుగంలో ప్రతి ప్రయాణాన్ని భౌతిక గుర్తుగా నిలిపే ఈ వినూత్న ప్రయత్నం కర్ణాటకలో విశేష ఆదరణ పొందుతోంది. View this post on Instagram A post shared by Karnataka Postal Circle (@karnatakapostalcircle) -
కూతురిని ఆఫ్రికా వ్యభిచార గృహానికి అమ్మేశారు
బెంగళూరు: డబ్బు కోసం 20 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు ఆఫ్రికాలో వ్యభిచార గృహానికి అమ్మిన ఘటన చిక్కమగళూరులో వెలుగులోకి వచ్చింది. సంచారజాతికి చెందిన దంపతులు మూలికల కోసం ఆఫ్రికాలోని సెనగల్ దేశానికి వెళ్లారు. అక్కడ తమ కూతురిని రూ.7 లక్షలకు విక్రయించారు. బాధితురాలు ఎలాగో చిక్కమగళూరులో ఉంటున్న బ«ంధువులకు వీడియో కాల్ చేసి తన దుస్థితిని వివరించింది. సహాయం చేయాలని వేడుకొంది. అక్కడి భారత రాయబార సిబ్బంది, పోలీసులు ఆమెను కాపాడారు. ఈలోపు తల్లిదండ్రులు ఊరికి వచ్చేశారు. కామాంధుడు అరెస్ట్ = మహిళల లోదుస్తుల చోరీ కేసు దొడ్డబళ్లాపురం: మహిళల లోదుస్తులు చోరీ చేస్తున్న కామాంధుడిని బెంగళూరు ఇందిరా నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హొయ్సళ నగర్లో నివసిస్తున్న పలువురు మహిళలు ఉతికి ఆరేసిన తమ లోదుస్తులు కనబడకుండా పోతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిందితుడిని కనిపెట్టారు. అస్సాంకు చెందిన అబ్దుల్ హుసేన్ అరెస్ట్ మహిళలు ఉతికి ఆరేసిన లోదుస్తులను తస్కరించి వాటిని ధరించి కొన్ని రోజులకు మళ్లీ తెచ్చి అక్కడే పెట్టి వెళ్లిపోయేవాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడు అబ్దుల్ హుసేన్‌ను అరెస్ట్ చేశారు. -
ప్రియుడి సోదరుడి కక్ష.. అమాయక ప్రియురాలు బలి
ప్రేమ పేరుతో మొదలైన పరిచయం చివరకు విషాదాంతమైంది. ప్రేమపై యువతికి నమ్మకం దెబ్బతింది. చివరకు చోటుచేసుకున్న పరిణామాలు యువతి ప్రాణాలనే బలితీసుకున్నాయి. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.లా చదువుతున్న అమృత అనే విద్యార్థిని ధనుష్ అనే ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లి జరిగి, ఓ పిల్లాడు కూడా కూడా ఉన్నాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని తన ప్రియురాలు అమృతకు చెప్పలేదు.అమృత ఓ పిజ్జా దుకాణంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అమృతకు ధనుష్‌తో కుటుంబ పరిచయం ద్వారా మాటలు కలిశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ధనుష్‌కు ఇప్పటికే విడాకులు అయ్యాయన్న విషయం, ఓ బిడ్డ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని తెలుసుకున్న తర్వాత అమృత బ్రేకప్ చెప్పేసింది.ఆ యువతి బ్రేకప్ నిర్ణయం తీసుకున్నందుకు ధనుష్ సోదరుడు సూర్య అమృతను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. జులై 13న అమృతను ఇంటి సమీపంలో సూర్య అడ్డగించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సూర్య అమృత ఛాతీ, వీపుపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న అమృతను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది.దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యతో పాటు ధనుష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అమృత మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సులో కండక్టర్ బ్యాగ్ కొట్టేసిన మహిళ
కండక్టర్ క్యాష్ బ్యాగ్‌ను ప్రయాణికురాలు చోరీ చేసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. బీఎంటీసీలో ప్రయాణిస్తున్న మహిళ ..కండక్టర్ బ్యాగ్‌ను చాకచక్యంగా చోరీ చేసింది. దానిని తన వద్ద ఉన్న మరో బ్యాగులో వేసుకొని గప్‌చుప్‌గా బస్సు దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే చోరీ దృశ్యాలను వీడియో తీసిన ఒక ప్రయాణికుడు డ్రైవర్‌కి విషయం తెలియజేసి డోర్ మూసివేయించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకొని ఆరా తీశారు. తొలుత బుకాయించిన ఆ మహిళ చివరకు తన వద్ద ఉన్న సంచిలోనుంచి కండక్టర్‌కు చెందిన బ్యాగు తీసి ఇచ్చింది. అనంతరం ఆమెను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు.ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 🚨 బీఎంటీసీ బస్సులో కలకలం.. కండక్టర్ టికెట్ బ్యాగ్ మాయం!🔸 నగరంలోని బీఎంటీసీ బస్సు (KA-57 F 6331)లో కండక్టర్ టికెట్ బ్యాగ్ కనిపించకపోవడంతో బస్సును మధ్యలోనే నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.🔸 ప్రయాణికుల బ్యాగులు, సామాన్లను పోలీసులు తనిఖీ చేయగా టికెట్ బ్యాగ్ లభ్యమైంది.… pic.twitter.com/1FDA23U5sA— ముచ్చట్లు (@muchatlu_) July 15, 2026 -
ఉదయం 3:30 వరకు పబ్‌లు, రెస్టారెంట్లు ఓపెన్!
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల నేపథ్యంలో సిలికాన్ సిటీ బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్‌కు సంబంధించిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో (జులై 14, 15, 19 తేదీలు) నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లను రాత్రి 1 గంటకు బదులు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక పోలీస్ చట్టం పరిధిలో ఈ తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం ఆహార పదార్థాల (ఫుడ్) సరఫరాకేనా లేక మద్యం (లిక్కర్) విక్రయాలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై గందరగోళం నెలకొంది.నిర్ణయ నేపథ్యం ఏమిటి?ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) బెంగళూరు ప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కలిసి మ్యాచ్‌లు వీక్షించేందుకు వచ్చే కస్టమర్ల సౌకర్యార్థం నగరంలోని వ్యాపార వేళలను పొడిగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి క్రీడాభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.లిక్కర్ అనుమతిపై సందిగ్ధత!పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఆహార సేవలను తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, మద్యం సరఫరా, విక్రయాలపై ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదు. సాధారణ నిబంధనల ప్రకారం బెంగళూరులో రాత్రి 1 గంట తర్వాత మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. దీంతో పబ్‌లు, బార్ల యజమానులు ఈ ఉత్తర్వులపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేదా నిబంధనల సడలింపు వస్తేనే తెల్లవారుజాము వరకు మద్యం సరఫరా చేయడానికి వీలవుతుందని వాదిస్తున్నారు.శాంతిభద్రతలపై పోలీసుల నిఘామరోవైపు రాత్రి వేళల్లో సమయాన్ని పొడిగించడం వల్ల నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన నిబంధనలను విధించారు. లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఫుట్‌బాల్ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నైట్‌లైఫ్ సంస్కృతికి భంగం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదేమైనా ఈ నిర్ణయం బెంగళూరు నైట్‌లైఫ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేక లిక్కర్ సందిగ్ధత వల్ల నీరుగారిపోతుందా అనేది ఎక్సైజ్ శాఖ ఇచ్చే తదుపరి స్పష్టతపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
అమ్మా.. తప్పు చేశాను.. నన్ను క్షమించు
భర్త, ఆడపడుచు కట్న వేధింపులను భరించలేక నవవివాహిత ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్వేత (25) మృతురాలు. చిక్కమగళూరుకు చెందిన శ్వేతకు, స్థానికుడు మూర్తితో పెళ్లయింది. పెద్దమొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. హెగ్గేనహళ్లి క్రాస్‌లో అద్దె ఇంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు. శ్వేత ప్రైవేటు టీచరుగా పనిచేసేది. మరింత కట్నం తేవాలని భర్త, బంధువులు ఆమెను సతాయించేవారు. ఆదివారం ఉదయం రగడ జరగ్గా, శ్వేత తాను ఇక్కడ ఉండలేనని, పీజీ హాస్టల్లో ఉంటానని చెప్పి వెళ్లిపోయింది. ఆమె తల్లి ఫోన్ చేసి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 2:30కు ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి తన బాధను పేపరుపై రాసిపెట్టి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారిని వదలిపెట్టకండి తన చావుకు తన భర్త, అతడి అక్క కారణమని వారు నాకు చిత్రహింసలకు గురిచేశారని, వారి వల్ల విరక్తి చెందానని, నేను చనిపోయినా వారిని మాత్రం వదిలిపెట్టద్దు అమ్మ, నా వల్ల తప్పు జరిగింది, క్షమించు, ఇట్లు, ప్రేమతో, మీ కుమార్తె అని గుండెలోని ఆవేదనను డెత్‌నోట్‌లో రాసింది. 4 నెలల కిందటే ఘనంగా పెళ్లిచేశామని, తన కూతురిని చంపేశారని తల్లి రోదించింది. భర్త మూర్తి, సోదరి నరసమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్వేత (ఫైల్) బెంగళూరు: -
సరస్సులు మాయం, రిజర్వాయర్లు ఖాళీ
దేశంలోని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై వంటి ప్రధాన నగరాలు భారీ వర్షాలతో జలమయమై, వరదలతో అతలాకుతలమవుతుంటే, దేశ ఐటీ రాజధాని బెంగళూరు మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తీవ్రమైన వర్షపాత లేమి, కరవు కోరల్లో చిక్కుకున్న ఈ మెట్రో నగరం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక జలాశయాలు ఎండిపోవడంతో, కోట్లాది మంది జనాభా ఉన్న ఈ సిలికాన్ వ్యాలీ కేవలం ఒక్క కావేరి నదిపైనే ఆధారపడాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అసలు బెంగళూరును వేధిస్తున్న ఈ నీటి సంక్షోభం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.పడిపోతున్న వర్షపాతం.. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. జూన్ 1 నుండి జూలై 9 మధ్య కాలంలో బెంగళూరు నగరంలో ఏకంగా 35 శాతం వర్షపాత లోటు నమోదైంది. అలాగే కర్ణాటక దక్షిణ అంతర్గత ప్రాంతంలో కూడా 24 శాతం తక్కువ వర్షపాతం రికార్డయ్యింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు ముంచెత్తుతున్నా, బెంగళూరులో మాత్రం ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.మూడు నెలలకే నీళ్లు.. అధికారుల లెక్కలివేనగరంలో వర్షాలు లేకపోయినా, బెంగళూరు జలమండలి మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. ప్రస్తుతం నగరానికి రాబోయే మూడు నుండి నాలుగు నెలల వరకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, అంతర్గతంగా భూగర్భ జలాలు భారీగా పడిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో అప్పుడే తీవ్రమైన నీటి ఎద్దడి మొదలైన విషయాన్ని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.600 మీటర్ల లిఫ్టింగ్.. బెంగళూరు నగరానికి అసలు నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఒక పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం. నగరం సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉంది. కావేరి నది నుండి తోరకదానహళ్లి పంపింగ్ స్టేషన్ ద్వారా నీటిని సేకరించి, దాదాపు 500 నుండి 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి పైప్లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. ఇది దేశంలోనే అత్యంత ఎక్కువ విద్యుత్, వ్యయంతో కూడిన నీటి సరఫరా వ్యవస్థగా నిలిచింది.ప్రధాన సరస్సులు ఖాళీ.. ఒకప్పుడు బెంగళూరు దాహాన్ని తీర్చిన అర్కావతి నదిపై నిర్మించిన చారిత్రక హెసరఘట్ట సరస్సు, తిప్పగొండనహళ్లి జలాశయాలు ఇప్పుడు మూలనపడ్డాయి. విపరీతమైన పట్టణీకరణ, అక్రమ ఆక్రమణలు, కాలుష్యం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ జలాశయాలకు నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల స్థానిక వనరులు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి.సాగు నీటికే పరిమితమైన మంచనబేలె డ్యామ్బెంగళూరుకు సమీపంలో, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో అర్కావతి నదిపైనే ఉన్న మరొక రిజర్వాయర్ ‘మంచనబేలె’. అయితే, ఇది కేవలం నగరానికి ఒక అనుబంధ వనరుగా మాత్రమే ఉంది. దీనిలోని నీటిని తాగునీటి అవసరాల కంటే ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ సాగు అవసరాల కోసమే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. దీంతో తాగునీటి కోసం కావేరి వైపు చూడక తప్పడం లేదు.రోజుకు 1500 మిలియన్ లీటర్లుబెంగళూరు జలమండలి లెక్కల ప్రకారం.. నగరంలోని సుమారు 1.4 నుండి 1.5 కోట్ల మంది ప్రజల కోసం ప్రతిరోజూ 1,450 నుండి 1,500 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పంపిణీ నగరం మొత్తం సమానంగా లేదు. వారు నివసించే ప్రాంతాన్ని బట్టి నీటి లభ్యత మారుతోంది. ముంబై లాంటి నగరాలకు స్థానిక రిజర్వాయర్లు ఉన్నట్లు బెంగళూరుకు లేకపోవడమే ఇక్కడి అసలు సమస్య. కావేరి బేసిన్లో వర్షాలు పడితేనే ఐటీ రాజధాని గొంతు తడుస్తుంది.. లేదంటే ప్రమాద ఘంటికలు తప్పవు!ఇది కూడా చదవండి: 14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్! -
రౌడీషీటర్ బర్త్‌డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి
బెంగళూరు: తమిళనాడులోని బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ దాసా అలియాస్ ‘కింగ్ మేకర్ దాసా’ పుట్టినరోజు వేడుకల్లో యలహంక బీజేపీ శాసనసభ్యుడు ఎస్ఆర్ విశ్వనాథ్ పాల్గొనడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. నెలకుంట్ల పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఈ వీడియోలో రౌడీషీటర్ దాసా కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సంబరాల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ వేడుకల సమయంలో పోలీసులెవ్వరూ అక్కడ లేకపోవడం గమనార్హం.చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన దాసాపై యలహంక, నెలమంగళ, దాసరహళ్లి ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా దాసా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఒక బెంగళూరు పోలీసు ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది ప్రజాప్రతినిధి స్వయంగా రౌడీషీటర్ వేడుకల్లో పాల్గొనడంపై నెటిజన్లు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మాదానాయకనహళ్లి పోలీసులు స్పందిస్తూ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు! -
డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. మహిళ ఇంట్లోకి చొరబడి..
మెట్రో నగరాల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరులోని ఒక ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న మహిళా పట్ల డెలివరీ బాయ్ హేయంగా ప్రవర్తించాడు. తన ఇంట్లోకి బలవంతంగా చొరబడి.. తన ముందు అసభ్యంగా ప్రవర్తించాడని నగరానికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. ఈ పోస్ట్‌కు స్పందించిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.సదరు డెలివరీ బాయ్ ఒక పార్సిల్ డెలివరీ చేయడానికి తన ఇంటికి వచ్చాడని.. ఆ తర్వాత వాష్‌రూమ్ ఉపయోగించుకోవచ్చా అని అడిగాడని ఆ మహిళ పేర్కొంది. అయితే ఆమె నిరాకరించినప్పటికీ.. అతను బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడని, వాష్‌రూమ్ నుండి బయటకు వస్తూ తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది."నేను మర్యాదపూర్వకంగానే పలుమార్లు నిరాకరించాను. అపరిచితులను నా ఫ్లాట్‌లోకి రానివ్వనని స్పష్టంగా చెప్పాను. అత్యవసరం అయితే పక్కింటి పురుషులను అడగాలని కూడా సూచించాను. నేను ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినకుండా.. అతను తన చెప్పులు విప్పేసి.. నా అనుమతి లేకుండా బలవంతంగా నా ఇంట్లోకి చొరబడ్డాడని ఆమె తెలిపింది. ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ తీవ్రంగా స్పందించింది. కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే.. సదరు డెలివరీ బాయ్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని పేర్కొంది. -
రవాణా మంత్రినే బస్సు దింపేసిన కండక్టర్
బెంగళూరు నగర బస్సు ప్రయాణికులు నిత్యం ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో.. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఆయన మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిగా తనిఖీ నిర్వహించారు. అడిగినంత చిల్లర ఇవ్వలేకపోయినందుకు మంత్రిని బస్సు దిగిపోవాలంటూ బీఎంటీసీ బస్సు కండక్టర్ కోరడంతో ఆయన షాక్ అయ్యారు.బస్సుల్లో తనిఖీకి మంత్రి బైరతి సురేష్ బయలుదేరారు. హెబ్బాళ్ నుంచి నాగశెట్టిహళ్లికి వెళ్లే బీఎంటీసీ బస్సు ఆయన ఎక్కారు. మాస్క్ ధరించిన మంత్రి.. రాత్రి 7:10 గంటల నుండి 9:10 గంటల మధ్య జయమహల్, టీవీ టవర్, ఆర్టీ నగర్, సీబీఐ రోడ్, హెబ్బాల్, మాన్యతా టెక్ పార్క్, నాగవార, హెన్నూర్, హెన్నూర్ బండే, బైరతి బండే, గెద్దలహళ్లి రూట్లలో బస్సుల్లో ప్రయాణించి తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో రెండు టిక్కెట్లు కావాలని కోరుతూ మంత్రి రూ.100 నోటు ఇచ్చారు. మంత్రిని గుర్తించని కండక్టర్.. చిల్లర ఇవ్వాలని కోరాడు. తన వద్ద చిల్లర లేదని మంత్రి చెప్పగా.. తన వద్ద కూడా చిల్లర లేదని చెబుతూ కండక్టర్ తన బ్యాగ్ తెరిచి చూపించాడు. చిల్లర ఇవ్వలేకపోతే బస్సు దిగాల్సిందేనని కండక్టర్ పట్టుబట్టాడు. దీంతో మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండానే బస్సు దిగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ ప్రజల మాదిరిగా మంత్రి మారు వేషంతో తనిఖీకి వెళ్లడంపై సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్‌గా మారింది. మంత్రిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
బెంగళూరులో ‘టెక్కీ గణేశుడు’.. ఐటీ ఉద్యోగుల క్యూ!
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని కోరమంగళలో ఉన్న శ్రీ ప్రసన్న గణపతి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ ఆలయం ‘టెక్కీ గణేశుడు’ (Techie Ganesha)గా వైరల్ కావడంతో ఉద్యోగాలు, ప్రమోషన్లు, మంచి అప్రైజల్స్ కోసం ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.1979లో నిర్మించిన ఈ ఆలయం మొదట స్థానిక భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. అయితే బెంగళూరు ఐటీ హబ్‌గా ఎదిగిన తర్వాత కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, సర్జాపూర్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ పరిసరాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడికి అధిక సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఉద్యోగ మార్పు, జీతం పెంపు, ప్రమోషన్, కొత్త అవకాశాల కోసం గణపతిని దర్శించుకుంటే శుభఫలితాలు వస్తాయని చాలామంది విశ్వసిస్తుండటంతో ఈ ఆలయానికి ‘టెక్కీ గణేశుడు’ అనే పేరు ప్రాచుర్యం పొందింది.ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ స్థానిక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్‌తో ఈ ఆలయం మళ్లీ చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం సోషల్ మీడియా ప్రచారం వల్ల ఇప్పుడు నిరంతరం రద్దీగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. రీల్స్, వైరల్ పోస్టుల కారణంగా ఆలయ ప్రశాంతత దెబ్బతిందని, స్థానికులు ఎన్నాళ్లుగానో చూసిన వాతావరణం మారిపోయిందని పేర్కొన్నారు.అయితే నెటిజన్ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. "దేవాలయానికి ఎక్కువ మంది రావడం మంచి విషయమే", "ప్రజలకు నమ్మకం ఉంటే వెళ్లనివ్వాలి", "భక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు" అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు మాత్రం "సోషల్ మీడియా హైప్ వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ట్రెండ్‌లుగా మారుతున్నాయి" అని అభిప్రాయపడ్డారు. మరో వినియోగదారు హైదరాబాద్‌లోని ‘వీసా బాలాజీ’గా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రత్యేక కోరికల కోసం ప్రసిద్ధి చెందిన ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని గుర్తు చేశారు. View this post on Instagram A post shared by RoadXRumble (@roadxrumble) -
ఈ జీవితం చాలు.. ప్రియుడికి మెసేజ్ పంపి యువతి ఆత్మహత్య
బెంగళూరు: చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పాశానికి గురైన యువతి బతుకును చిదిమేసుకుంది. బెంగళూరు శాంకీ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిక్కబాణవార నివాసి పి.తేజస్విని రాజ్ (20) గా సదాశివనగర పోలీసులు గుర్తించారు. వివరాలు.. తేజస్విని చిక్కబాణవారలోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి శాంకీ చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రియునికి మెసేజ్ చేసింది. అతను తేజస్విని తల్లికి విషయం చెప్పాడు. ఆమె సదాశివనగర పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, కుటుంబసభ్యులు చెరువు వద్దకు వచ్చి అర్ధరాత్రి వరకు గాలించారు. మంగళవారం ఉదయం చెరువులో తేజస్విని మృతదేహం బయటపడింది. సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా సోమవారం సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు చెరువు ఆవరణలో తిరిగిన తేజస్విని రాత్రి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ జీవితం చాలు... తన ప్రియునికి.. తన జీవితం చాలు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పంపించి మొబైల్ స్విచ్చాఫ్ చేసినట్లు వెల్లడైంది. ప్రేమ గొడవే కారణమని దర్యాప్తులో వెలుగుచూసింది. ఆమె కాలేజీలో యువకున్ని ప్రేమించింది, తల్లిదండ్రులు.. నీది ఇంకా చిన్న వయసు, ప్రేమించడానికి సమయం ఉంది. మొదట చదువుకోవాలని మందలించారు. కొన్నాళ్లనుంచి ప్రేమికులు దూరంగా ఉన్నారు. ఈ ఆవేదనతోనే చెరువులోకి దూకి చనిపోయిందని తేలింది. -
పార్క్‌లో బామ్మ ఫుల్ స్వింగ్.. చూస్తున్న వాళ్లకు ఫుల్ షాక్..
బెంగళూరులోని ఓ పార్క్‌లో ఓ వృద్ధురాలు అవుట్డోర్ జిమ్ యంత్రాన్ని అత్యంత వేగంగా ఉపయోగిస్తున్న వీడియో వైరల్ అయింది. బెంగళూరుకు చెందిన ఎక్స్ వినియోగదారు సందీప్ పార్శ్వనాథ్ పంచుకున్నారు ఈ 10 సెకన్ల వీడియో. ఆ మహిళ ఎయిర్ స్వింగ్ యంత్రాన్ని చాలా వేగంగా ముందుకు, వెనక్కి ఊగిస్తూ ఉపయోగిస్తున్నట్టు కనిపించింది. అక్కడ ఉన్న పిల్లలతో పాటు మరికొందరు చూస్తూ కనిపించారు.పర్యవేక్షణ లేకుండా ఈ పరికరాన్ని ఉపయోగించడం సురక్షితమేనా అని తన పోస్టులోని శీర్షికలో పార్శ్వనాథ్ ప్రశ్నించారు. పార్కుల్లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాల పక్కన భద్రతా సూచనలు ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు."పర్యవేక్షణ లేకుండా ఇది ప్రమాదకరం కాదా? ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? పార్కుల్లో ఉన్న ప్రతి అవుట్డోర్ జిమ్ పరికరం పక్కన స్పష్టమైన వినియోగ మార్గదర్శకాలు, భద్రతా సూచనల బోర్డులు బీబీఎంపీ ఏర్పాటు చేయాలి" అని పేర్కొన్నారు.అవుట్డోర్ జిమ్ పరికరాల పక్కన స్పష్టమైన వినియోగ సూచనలు, భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలని పార్శ్వనాథ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికను కోరారు. ముఖ్యంగా వృద్ధులు పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. Is this not dangerous without supervision! Who will take responsibility if something happens. BBMP should install clear usage guidelines and safety instructions on boards next to each outdoor gym equipment in parks. pic.twitter.com/iUvFUI50tJ— Sandeep Parswanath (@sarpame) July 6, 2026 -
ట్రాఫిక్ కష్టాలపై క్రిస్ గోపాలకృష్ణన్ ఆవేదన
భారత సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ ఈ ట్రాఫిక్ నరకం వేధిస్తోంది. తాజాగా, ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ బెంగళూరు నగర ట్రాఫిక్ దుస్థితిపై చర్చకు దారితీసింది.కారణాలివే..క్రిస్ గోపాలకృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నగరం అంతా ఎదుర్కొంటున్న సమస్యను పంచుకున్నారు. ‘బెంగళూరు సిటీలో కేవలం 31 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి నాకు ఈ రోజు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీ, అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితి, డ్రైవర్లలో క్రమశిక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఐటీ రంగానికి చెందిన ప్రముఖుడి నుంచే ఇలాంటి స్పందన రావడంతో బెంగళూరు ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, పౌరులు తమ ఆవేదనను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ డిమాండ్గోపాలకృష్ణన్ పోస్ట్‌పై స్పందిస్తూ నెటిజన్లు తమ అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. ఒక నెటిజన్ తనకు ఇటీవల 28 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు మూడు గంటల సమయం పట్టిందని, బెంగళూరు ట్రాఫిక్ ప్రయాణం ఒక పీడకలగా మారిందని వాపోయారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయనే నమ్మకం లేదని, అందువల్ల ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.పరిష్కారాలు ఇవే..ఈ దీర్ఘకాలిక సమస్యకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని, ప్రయాణికులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు, పౌరులు కోరుతున్నారు. ఐటీ సంస్థలు తమ సిబ్బందిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా మెట్రో, బీఎంటీసీ బస్సు సర్వీసులను ఉపయోగించేలా ప్రోత్సహించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఏళ్ల తరబడి సాగుతున్న ఫ్లైఓవర్ పనులు, కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇవి పూర్తయితేనే కొంతవరకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి? -
అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా పోకిరీల హల్చల్
బెంగళూరు: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగితో వెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా పోకిరీలు ఆటంకం కలిగించారు. గురగుంటె పాళ్య నుంచి యశ్వంతపూర్ వరకూ బైక్‌లపై వీలింగ్ చేస్తూ.. పెద్దగా కేకలు వేస్తూ తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన వాహనదారులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. యశ్వంతపూర్ ట్రాఫిక్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని నిందితుల ఆచూకీ కోసం సీసీ టీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇలాంటి వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడంతోపాటు కఠిన శిక్ష విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. #Karnataka #Breaking Bengaluru Bikers Block Ambulance, Perform Wheelies#Bengaluru: A group of reckless bikers allegedly blocked the path of an #ambulance and performed wheelies on the road, preventing it from moving despite its siren being on. The incident reportedly took… pic.twitter.com/NhIuXJEjpB— Mahesh M Goudar (@IamMGoudar) July 6, 2026 -
ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!
బెంగళూరు: స్రత్పవర్తన ఆధారంగా రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి శనివారం 24 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. తొందరపాటు నిర్ణయంతో నేరాలకు పాల్పడిన వీరు 14 ఏళ్లపాటు జైలు గోడల మధ్య గడిపారు. స్రత్పవర్తన ఆధారంగా జైలు నుంచి విడుదలయ్యారు. తెలిసో తెలియక నేరాలు చేసి జైలు జీవితం గడిపామని, క్షణికావేశంలో ఎవరూ నేరాలు చేయరాదని విడుదలైన పలువురు ఖైదీలు పేర్కొన్నారు. చిక్కమగళూరు వాసి మణికంఠ మాట్లాడుతూ హత్య కేసులో జైలు పాలై 15 ఏళ్ల పాటు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాన్నారు. క్షణికావేశంలో ఎవరూ నేరపూరిత చర్యలలో పాల్గొనకూడదన్నారు. మూడు హత్య కేసుల్లో 37 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన జీవర్గికి చెందిన సైబన్న లింగప్ప నట్టికర్ అనే వృద్ధుడు కూడా జైలు నుంచి విడుదలయ్యాడు. ఇన్నాళ్లూ జైలు గొడల మధ్య గడిపిన వారు కారాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత సంతోషం వ్యక్తం చేశారు. జైలు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నారు. -
వైద్యవృత్తిని చేపట్టిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..!
చాలామందికి పలు అభిరుచులు ఉంటాయి. కానీ ఏదో ఒకరంగం ఎంచుకుని విజయవంతంగా కెరీర్ నిర్మించుకున్నాక..మరొక రంగంలోకి వెళ్లాంటే అంత ఈజీకాదు. పైగా ఆర్థిక బాధ్యతలు, మళ్లీ మెదటి నుంచా అనే భయంతో అంత సులభంగా సాహసం చేయలేరు. కానీ అలాంటి ధైర్యం చేసి అనుకున్నది సాధించడమే కాదు..నేర్చుకోవడానికి ఎప్పటికీ ఆలస్యం అనేది ఉండదని నిరూపించింది. ఏ వయసులోనైనా సరే నేర్చుకోవాలనే ఆసక్తి, తపన బలంగా ఉంటే అదేమంత కష్టం కాదని ప్రూవ్ చేసిందామె. ఎవరామె అంటే..ఆ మహిళే జాన్హవి అజిత్‌రావు. ఆమె కథను వికాస్ అల్విస్అ అనే యూజర్ నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అతడు పోస్ట్‌లో..మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పుట్టి పెరిగిన జాన్హవి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్ డియాగో నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా నుంచి మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆమె అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో పనిచేసిన తర్వాత, 2002లో తన భర్తతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ నుంచి బెంగళూరుకు మారిన తర్వాత, జాన్హవి రక్షణ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో తన సొంత కంపెనీని ప్రారంభించడానికి ముందు చాలా ఏళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అప్పటికే ఆమె ఒక అద్భుతమైన వృత్తి జీవితాన్ని నిర్మించుకున్నారు కూడా. అయితే ఊహించని ఆరోగ్య సమస్యలు ఆమె దృక్పథాన్ని మార్చేశాయి. 2003లో రావుకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె చికిత్స పొందుతున్న సమయంలో, రోగుల జీవితాలపై వైద్యులు చూపే ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసింది. దాంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్ కెరీర్‌ను సైతం వదులుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అలా జాన్హవి 40 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ చేయడానికి 2013లో బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్యా మెడికల్ కాలేజీలో చేరారు. దశాబ్దాల పాటు కార్పొరేట్ ప్రపంచంలో గడిపిన తర్వాత మళ్లీ స్టూడెంట్ లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు. Meet Janhavi Ajit Rao.After spending 18 years as a software engineer, she made a decision that very few people would dare to make.At the age of 40, she quit her successful engineering career and joined MBBS to become a doctor.She studied Electronics in California, worked at… pic.twitter.com/DioVAAnGDt— Vikas Alwys (@VikasAlwys) July 3, 2026 కానీ ఆమె ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతూ..ఆస్పత్రులలో శిక్షణ పొందడం మొదలుపెట్టింది. అలాగే తన సహా విద్యార్థులతో సమానంగా ముందుకు సాగింది. అయినప్పటికీ ఆమె లక్ష్యానికి కట్టుబడే ఉండటం విశేషం. ఏళ్ల తరబడి పట్టుదల తర్వాత ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తిచేసి..డాక్టర్ మారింది. చివరికి తిరిగి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఆమె ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్‌గా పనిచేస్తూనే ఎండీ(MD) చేస్తోందని రాసుకొచ్చారు పోస్ట్‌లో. ఇక్కడ జాన్హవి కథతో మనల్ని మంన ఆవిష్కరించుకోవడానికి జీవిత కలను సాకారం చేసుకోవడానికి ఎప్పటికీ ఆలస్యం కానే కాదని నిరూపితమైంది కదూ..!. (చదవండి: దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్లినిక్..! ఎక్కడంటే..) -
భార్యపై ఇంత ప్రేమా..!
ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు భార్యభర్తల మధ్య అనుబంధాలు ఎంత పాశవికంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అనేంతగా బంధాలు తయారయ్యాయి. ఆ తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా హృదయాన్ని తాకుతోంది. ఆ వీడియోలో ఒక ఆటో డ్రైవర్ తన ఆటో మొత్తాన్ని దివంగత భార్య ఫోటోలతో నింపేశాడు. కంటెంట్ క్రియేటర్ ఆశిష్ మాథ్యు ఈ వీడియోని షేర్ చేశారు. ఆ కంటెంట్ క్రియేటర్ ఆటోడ్రైవర్‌తో సంభాషిస్తూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు వీడియోలో. అతను ఫోటో వైపు చూపిస్తూ ఎవరని ప్రశ్నించగా..ఆ ఆటోడ్రైవర్ ఆమె తన భార్య అని చెబుతాడు. ఆమె చనిపోయి ఎనిమిదేళ్లు అవుతోందని, అయినప్పటికీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నానని బాధగా చెప్పాడు. అలాగే తనకు కొడుకు కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారని కూడా వెల్లడించాడు. తన కుమారుడు తనను ఇంట్లోనే ఉండమని చెబుతుంటాడని, అయితే ఇంట్లోనే ఉంటే ఆమె ఆలోచనలే వస్తాయని, తన మనసంతా ఆమె చుట్టూనే తిరుగుతందని తెలిపాడు. అందుకనే ప్రతిరోజూ ఆటో నడుపుతూ..కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ..మనసుని పనిపై నిమగ్నమయ్యేలా చేసుకుంటూ బాధను మర్చిపోతానని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ కంటెంట్ క్రియేటర్ ఆ వీడియోకి ‘అతడి ప్రేమ భాష’ అనేక్యాప్షన్ జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా మంచి సందేశాత్మకమైన వీడియోని షేర్ చేశాశ్ బ్రో అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by asish matthew (@asishmatthew.exe) (చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్..) -
వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టి..
బెంగళూరు: డేకేర్ సెంటర్ పిల్లల పాలిట నరకమైంది. బెంగళూరులో కార్పొరేట్ సంస్థలోని డేకేర్ సంరక్షణలో ఉన్న పిల్లలను అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దారుణంగా శిక్షించారు. ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ సమయంలో పిల్లల్ని ఈ డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు. అక్కడ పని చేసే ఐదుగురు సిబ్బంది పిల్లల అల్లరిని మాన్పించడానికి పైశాచిక పద్ధతులు అనుసరించారు. చిన్న పిల్లలనే మానవత్వం లేకుండా కర్కశంగా శిక్షించారు.పిల్లలు ఏడ్చినప్పుడు ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్లో ఉంచి తలుపు మూసేసి భయపెట్టారు. వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌పై కూర్చోబెట్టి, హై ప్రెజర్ జెట్‌తో నోట్లో నీళ్లు కొట్టడం, చీకటి బాత్రూమ్లో బంధించడం వంటివి చేశారు. ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ క్యాప్‌జెమిని బెంగళూరు క్యాంపస్‌లో నడుస్తున్న డేకేర్ నుంచి బయటికొచ్చి వీడియోలు పిల్లల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు మహిళలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారులు, డేకేర్ సిబ్బంది, ఇతర సాక్షుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. పోలీసులు ఫుటేజీని ధృవీకరించి, సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తున్నారు. ఆ డేకేర్ సెంటర్లో ఇలాంటి వేధింపులు చాలాకాలంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. -
దారుణాలు బయటపెడితే.. ఉద్యోగం నుంచి తీసేశారు!
బెంగళూరు: క్యాప్‌జెమినీ బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్లో చిన్నారులపై జరుగుతున్న అమానుష వేధింపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారులపై జరుగుతున్న హింసను గతంలోనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగినినే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తేలింది. జిల్లా బాలల సంరక్షణ అధికారి తిలకేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డేకేర్ సెంటర్లో మొత్తం 50 నుంచి 60 మంది చిన్నారులు నమోదు కాగా, ప్రతిరోజూ 15 నుంచి 20 మంది హాజరవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారనే కారణంతో వారిని వాషింగ్ మెషీన్లో కూర్చోబెట్టడం, బాత్రూమ్లో బంధించడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నీరు చల్లడం, భయపెట్టి మౌనం పాటించేలా చేయడం వంటి దారుణాలు చాలా కాలంగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అంతేకాదు.. గతంలో ఓ ఉద్యోగి ఈ దారుణాలపై ప్రశ్నించిందని చెప్పారు. ఈ విషయమై కేర్టేకర్ల మీద సూపర్వైజర్కు ఫిర్యాదు చేసి.. ఎంత జరుగుతుందో తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఫిర్యాదు చేసిన ఆ ఉద్యోగినినే విధుల్లోంచి తొలగించారని అధికారులు తెలిపారు.🚨 Bengaluru Daycare Horror: Five women booked after toddlers were allegedly forced into a washing machine and abused at a daycare. The accused have been taken in for questioning. Investigation is underway.#Bengaluru pic.twitter.com/wQrCdaNl4i— Smriti Sharmaa (@SmritiSharma_) July 1, 2026ఇటీవల ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐదుగురు కేర్‌టేకర్లపై కేసు నమోదు చేసి, వీడియోలను కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు పంపించారు.ఈ ఘటనపై స్పందించిన క్యాప్‌జెమినీ సంస్థ.. ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని, విచారణ పూర్తయ్యే వరకు బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటికే ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై బాలల సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు గతంలో మరెన్ని జరిగాయనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళా అధికారిణికి దర్యాప్తు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఇలాంటి కేర్ సెంటర్లలో పిల్లల భద్రతకు సంబంధించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. -
బెంగళూరు ఐటీ కారిడార్‌లో ఘోరం
ఐటీ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్లో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్లో రెండు నుంచి మూడేళ్ల వయసున్న పసిబిడ్డలను తీవ్రంగా వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంతో ఐటీ వర్గాలతో పాటు ప్రజల్లో చర్చకు దారితీసింది.బాత్రూమ్లో బంధించి..జిల్లా పిల్లల సంరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారి తిలకేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అంశాలు కీలక విషయాలు వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. పిల్లలు ఏడుస్తున్న సమయంలో సంరక్షకులు వారిని ఓదార్చాల్సింది పోయి శారీరకంగా బెదిరింపులకు గురిచేశారు. తల్లి పాలు కూడా మరువని పసిబిడ్డల నోటిలో బలవంతంగా నీరు పోశారు. వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్లపై పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టి బాత్రూమ్ లోపల వేసి తాళాలు పెట్టారు. వాట్సాప్‌లో హల్చల్ చేసిన వీడియోల ప్రకారం.. పిల్లలను భయపెట్టడానికి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లోపల కూడా ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై కేసు నమోదుఈ అమానుష ఘటనపై జూన్ 29న బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసు నమోదైంది. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహిళా సంరక్షకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.స్పందించిన క్యాప్జెమినిఈ ఉదంతంపై తీవ్ర దుమారం రేగడంతో క్యాప్‌జెమిని యాజమాన్యం తక్షణమే స్పందించింది. జులై 1న కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ బ్రూక్‌ఫీల్డ్ పరిధిలోని హెచ్ఏఎల్ క్యాంపస్‌లో ఉన్న ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘క్యాప్‌జెమిని సంస్థకు తన ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సే అత్యంత ప్రధానం. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మేము పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తక్షణమే తాత్కాలికంగా మూసివేస్తున్నాం’ అని కంపెనీ అధికారిక ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
సురభి మృతి వెనుక అసలు నిజం ఇదేనా?
బెంగళూరు: చిక్కబళ్లాపురం నగరం వద్ద నందిహిల్స్ దగ్గర ముద్దేనహళ్లిలో ఓ హోం స్టేలో 3 రోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందిన సురభి అనే యువతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. హోంస్టే గదిలో గంజాయి పీల్చడానికి ఉపయోగించే హుక్కా లభించింది. సురభి ప్రియుడు సంజిత్ అలీ రాసుకున్న డెత్ నోట్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. సురభిది, తనది వేర్వేరు మతాలు కావడం వల్ల తమ ప్రేమను ఈ సమాజం అంగీకరించడం లేదని, వేర్వేరు మతాల్లో పుట్టడమే తాము చేసిన తప్పా అని రాశాడని తెలిపారు. ఇంకా అనుమానాలు.. పైకి ఈ సంఘటన ప్రేమ విఫలం కావడం వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నా, గదిలో సురభి 10 అడుగుల ఎత్తుగల ఫ్యాన్‌కి ఉరి వేసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. సుజిత్ అలీ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటే పూర్తి వివరాలు రాబట్టవచ్చని పోలీసులు చెప్పారు. సురభి మృతదేహం ఉన్న గదిలో గంజాయి పీల్చే హుక్కా, మద్యం బాటిల్, కొన్ని మందులు లభించడంతో అనుమానాలు రేకెత్తాయి. వాటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. కేరళకు చెందిన వీరు బెంగళూరులో ఉండేవారు, అతడు క్యాబ్ డ్రైవర్‌గా, ఆమె ఫిజియోథెరపిస్టుగా పనిచేసేది. -
‘శాశ్వతం’గా బెంగళూరుకు షిఫ్ట్ అయిన హార్దిక్ పాండ్యా!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నుంచి అతడు మకాం మార్చేశాడు. ‘శాశ్వతం’గా బెంగళూరులో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.వెన్నునొప్పి కారణంగా..కాగా అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ కారణాల దృష్ట్యా.. చాన్నాళ్ల క్రితమే టెస్టు ఫార్మాట్‌ను వదిలేశాడు. వన్డే, టీ20లలో టీమిండియా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న ఈ బరోడా ఆటగాడిని తరచూ గాయాలు వేధిస్తున్నాయి. ఒకానొక దశలో వెన్నునొప్పి కారణంగా ఏళ్ల పాటు జట్టుకు దూరమైన అతడు.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.భారత్ టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్-2026లో పలు మ్యాచ్‌లకు దూరమైన ఈ ఆల్‌రౌండర్.. తాజాగా తొడ కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు.శాశ్వత శిక్షణా శిబిరం అక్కడే!ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE- Centre of Excellence)లో హార్దిక్ పాండ్యా పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో CoEనే తన శాశ్వత శిక్షణా శిబిరంగా మార్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ ఇప్పటికే శాశ్వతంగా బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాడు. సిటీ శివార్లలో ఓ ప్రాపర్టీని అద్దెకు తీసుకున్నాడు. CoEకి అది అతి దగ్గరగా ఉంటుంది. CoEనే శాశ్వత ట్రెయినింగ్ సెంటర్‌గా మార్చుకున్న తొలి భారత క్రికెటర్ ఇతడేనేమో!అందుకే ముంబై నుంచి బెంగళూరుకు షిఫ్ట్తన కెరీర్ చరమాంకం వరకు అతడు ఇక్కడే శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ముంబైలో తన ఇంటి నుంచి.. ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లడం హార్దిక్‌కు చాలా కష్టంగా మారింది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న క్రికెటర్‌గా CoEలో అతడికి అన్ని సౌకర్యాలూ లభిస్తాయి.గాయం నుంచి కోలుకోవడం నుంచి.. నైపుణ్యాలు మెరుగుపెట్టుకోవడం సహా ప్రతీ విషయంలోనూ అతడికి బీసీసీఐ నుంచి సహకారం ఉంటుంది. అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్, దేశీ టోర్నీలు, టీమిండియా తరఫున విధుల్లో ఉన్నపుడు మాత్రం అతడు CoEకి దూరంగా జట్టుతో కలిసి ఉంటాడు.మరో ఐదు నుంచి ఆరేళ్ల పాటు హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ కెరీర్ సజావుగా కొనసాగించాలనుకుంటున్నాడు. అందుకోసం తనను తాను మెరుగుపరచుకోవడం అత్యవసరం’’ అని పేర్కొన్నాయి. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వ్యక్తిగత సెలవులో ఉన్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకునే క్రమంలో త్వరలోనే CoEకి అతడు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తిప్పికొట్టిన శ్రేయస్ -
'చెవిలో పువ్వులు పెడుతున్నారా?.. అదంతా ప్రజల సొమ్మే!'
వీధి కుక్కల నియంత్రణ అంశంలో పలు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు తీవ్ర నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అది ఎలా ఉందో తెలియజేసే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి వచ్చిన అధికారుల వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడంపై ఆయన వాళ్లపై మండిపడ్డారు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం బెంగళూరులో కర్ణాటక మంత్రి రాష్ట్ర మంత్రి కృష్ణ బైరెగౌడ నేతృత్వంలో వీధికుక్కల నియంత్రణం అంశంపై సమీక్ష సమావేశం జరింది. దీనికి పశుసంవర్ధక శాఖకు చెందిన 19 మంది అధికారులు పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్ల ఖర్చు, ఎన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు, ప్రస్తుతం వీధికుక్కల సంఖ్య ఎంత వంటి ప్రాథమిక వివరాలు కూడా వారి వద్ద లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు."మీరు సమావేశానికి ఎందుకు వచ్చారు? కనీస డేటా కూడా లేకుండా ఎలా వచ్చారు? అదంతా ప్రజల డబ్బు కదా? ఎక్కడికి పోయింది? అలా ఎలా ఖర్చు పెట్టారు?" అంటూ కాస్త కఠినంగానే అధికారులను ప్రశ్నించారు. ఐదేళ్ల వ్యయ వివరాలు వెంటనే ఇవ్వాలని, డేటా లేకుండా సమావేశానికి రావడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.ఈ క్రమంలో అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆ ఇచ్చిన సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో మంత్రి మరింత అసహనం వ్యక్తం చేశారు. "నేను చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలేదు.. మీరు చెప్పిందల్లా వినడానికి" అంటూ కన్నడలోని ఒక సామెతను ఉపయోగిస్తూ.. తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. వీధికుక్కల సంఖ్య యథాతథంగా ఉండటంపై ఆయన తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.Bengaluru Development Minister @krishnabgowda on Tuesday pulled up Animal Husbandry Department officials during a review meeting over the stray dog sterilisation programme. Questioning how stray dog population had remained unchanged despite sterilisation being carried out for… https://t.co/a3bPBWvJcI pic.twitter.com/b3HQPZ5Ls9— ChristinMathewPhilip (@ChristinMP_) June 30, 2026ఈ సందర్భంగా సంబంధిత అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని సమావేశంలోనే ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, స్టెరిలైజేషన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని అధికారులను ఆదేశించారు.కృష్ణ బైరెగౌడ కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుకుని, అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న కృష్ణ బైరెగౌడ.. ప్రస్తుతం బెంగళూరు అభివృద్ధి శాఖ (Bengaluru Development) మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనలో పారదర్శకత, అధికారుల జవాబుదారీతనంపై రాజీ పడని నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కృష్ణ బైరెగౌడ అధికారుల పనితీరుపై కఠిన వైఖరికి పేరుగాంచారు. ఇటీవల కూడా నాసిరకం రోడ్డు నిర్మాణ పనులను గుర్తించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు కాంట్రాక్టర్‌కు జరిమానా విధించారు. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు.సుప్రీంకోర్టు కూడా సీరియస్..దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు, రేబీస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై భారత సుప్రీంకోర్టు కూడా పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, జంతు సంక్షేమ నిబంధనలను కూడా పాటించాలని స్పష్టం చేసింది. కేవలం స్టెరిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం కాకుండా.. వాటి ఫలితాలు ప్రజలకు కనిపించేలా ఉండాలని కోర్టు పరోక్షంగా సూచించింది. ఈ నేపథ్యంలో.. వీధికుక్కల నియంత్రణ కార్యక్రమంపై కర్ణాటక మంత్రి కృష్ణ బైరెగౌడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
ఇంట్లో మృతదేహం.. స్పందించిన హీరోయిన్
బిగ్‌బాస్(కన్నడ) ఫేం, నటి కృషి తపండ నివాసంలో ఆమె స్నేహితుడు, వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జూన్ 24న జరగగా.. అప్పటి నుంచి కృషి తపండపై నెట్టింట రకరకాల ప్రచారం జరుగుతోంది. వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆమే కారణం అన్నట్లుగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా కృషి తపండ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు అని.. అలాంటి సమయంలో కూడా వ్యక్తిగత గ్యోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.‘ఇలాంటి పోస్ట్ చేయాల్సి వస్తుందని అస్సలు ఊహించేలేదు. నాపై వస్తున్న వదంతులకు సమాధానం ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. కొన్ని రోజుల క్రితం నా జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. నా మనసుకు ఎంతో దగ్గరైన, నాకు అన్ని వేళలా అండగా ఉండే మిత్రుడిని కోల్పోయా. అతడి మరణం నాకు తీరని లోటు. ఈ బాధలో నేను ఉంటే.. అంతకంటే దారుణమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఓ వ్యక్తి మరణిస్తే.. దానిపై వదంతులు, ఊహాగానాలతో కొందరు తమకు నచ్చిన కథలు సృష్టిస్తున్నారు. నేను కన్పిస్తే చాలు.. ‘మీ స్పందన ఏంటీ?’ అంటూ అర్థం లేకుండా అడుగుతున్నారు. అలాంటి వాళ్లని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఒకరి నష్టాన్ని మీ హెడ్‌లైన్‌గా మార్చుకోకండి. మేమంతా ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ప్రవర్తించొద్దు. మీరు చేసే అసత్య ప్రచారాలు.. బాధలో ఉన్నవారికి మరింత నష్టం కలిగిస్తాయి. మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉండకపోయినా ఫర్వాలేదు.. కానీ ఇంకొకరి కన్నీళ్లకు మీరు కారణం కావొద్దు. నా మిత్రుడి ఆత్మకు శాంతి కలిగేలా ప్రవర్తిస్తారని కోరుకుంటున్నా. ఇకనైనా ఇలాంటి ప్రచారాలు ఆపాలని వేడుకుంటున్నా’అని కృషి తపండ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Krishi Thapanda (@krishithapanda) -
నెలకు రూ.71 వేల ఖర్చు.. వైరల్‌గా టెకీ అంజలి వీడియో
దేశంలోని ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం (Cost of Living) మరోసారి చర్చనీయాంశమైంది. ఓ ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. తాను మే నెలలో మొత్తం రూ.71 వేల వరకు ఖర్చు చేశానని, అయితే బెంగళూరు వంటి నగరంలో ఇది పెద్ద మొత్తం కాదని చెప్పడంతో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ మొదలైంది.వీడియోలో టెకీ అంజలి తన ఖర్చులను వివరించింది. తాను ఉంటున్న 1BHK ఫ్లాట్‌కు నెలకు రూ.28 వేల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిపింది. రోజువారీ ఆహారం కోసం సుమారు రూ.7 వేలు ఖర్చవుతాయని పేర్కొంది. వారాంతాల్లో షాపింగ్, బయట తిరగడం వంటి ఖర్చులకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.Bengaluru Techie Monthly Expenses Go Viral!A Bengaluru software engineer is spending ₹71,000 per month with rent alone at ₹28,000 for a 1BHK apartment!Anjali, who works as a Software Engineer at Atlassian, shared her detailed May expense breakdown on Instagram, sparking… pic.twitter.com/lswYRiwBBw— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) June 29, 2026 అంతేకాకుండా, ప్రయాణాలను ఇష్టపడే తాను టూర్ల కోసం నెలకు మరో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నానని చెప్పింది. ఈ ఖర్చులన్నీ కలిపి మే నెలలో తన మొత్తం వ్యయం రూ.71 వేలకు చేరిందని వివరించింది. అయితే, బెంగళూరులో ఉద్యోగం చేసే వారికి ఇలాంటి ఖర్చులు అసాధారణం కాదని, నగర జీవనశైలికి అనుగుణంగా ఇవి సహజమేనని అంజలి అభిప్రాయపడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు "బెంగళూరులో అద్దెలు, జీవన వ్యయం నిజంగానే ఎక్కువ" అంటూ ఆమె మాటలకు మద్దతు పలికారు. మరికొందరు మాత్రం "ఈమె కేవలం ఖర్చు పెట్టడానికే పుట్టింది", "ఇంత డబ్బు సేవ్ చేస్తే ఏడాదికి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది", "ఇది అవసరమైన ఖర్చా.. లేక లైఫ్‌స్టైల్ ఖర్చా?" అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.ఈ వీడియోతో మరోసారి బెంగళూరులో పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయం, యువ ఉద్యోగుల లైఫ్‌స్టైల్ ఖర్చులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. -
ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..
అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది. ఆ సంతోషాన్నే తన తల్లికి అందిచింది ఈ కూతురు. ఆమె ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు అమ్మే కారణం అంటూ తన విజయ ప్రస్థానాన్ని షేర్ చేసుకుంది.అనుస్మిత మహాపాత్ర అనే యువతి తన తల్లి చేసిన త్యాగం తన ఉద్యోగ కెరీర్‌కు దారితీసేలా స్ఫూర్తిని కలిగించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తన కాలేజ్ అడ్మిషన్ ఫీజు కోసం అమ్మ తన బంగారు గాజులున తాకట్టుపెట్టిందని. దాని వల్ల ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ పనిచేసే స్థాయికి రాగలిగానని అంటోంది. ఇది తనకు ఉద్యోగం కాదని అంతకు మించి అని భావోద్వేగంగా చెబుతోంది. తాను ఇవాళ ఉద్యోగానికి వెళ్తున్నానంటే అది ఆమె ఆనాడు చేసిన త్యాగం కారణంగానే అంటోంది. ఇది ఆమె చేసిన త్యాగానికి నిదర్శనమని భావోద్వేగంగా అంటోంది. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆమె మా కోసం అన్ని చేసిందంటూ తల్లి గురించి ఇలా రాసుకొచ్చింది. "తనతల్లి అమితా మహాపాత్ర అని. ఆమె ఒక ఉపాధ్యాయురాలని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడూ కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిలో చేరిందని. నెలకు కేవలం రూ. 3000 జీతం అందుకునేది. రెగ్యులర్ అయ్యేదాక ఆరేళ్లు కాంట్రాక్టుగానే పనిచేసింది. అది కూడా భువనేశ్వర్ నుంచి రైలులో దాదాపు 12 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఒడిశాలోని రాయగడ జిల్లాలో పనిచేయాల్సి ఉంది. అందుకోసం తనను తమ్ముడిని వదిలివెళ్ల లేక ఎంతలా ఏడ్చేదో..నాటి సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు తాను ఐదోతరగతి, తమ్ముడు మూడో తరగతి చదువుతుండే వాళ్లం. సెలవుల కోసం ఇంటికి వచ్చిన తన తల్లి తిరిగి తన ఉద్యోగ స్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లలేక ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగేవి. ఆరోజు పనికోసం ఎక్కడికో ఒక చోటుకి వెళ్లక తప్పదు కదా అని ఓదార్చిన సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేను. అంతేగాదు నిట్‌లో చేరేందుకు దాదాపు ₹1.25 లక్షలు అవసరమైతే ఏ మాత్రం ఆలోచించకుండా తన బంగారుపు గాజులను అమ్మేసింది. తాను ఇంటర్న్‌షిప్‌లు సంపాదించుకునేంత వరకు తన కాలేజ్ ఫీజులను ప్రతి సెమిస్టర్‌కు ఆమెనే చెల్లిస్తూ వచ్చారు. అలాగే తమ్ముడికి, నాకు రూ. 60 వేలు ఖరీదు చేసే చెరొక ల్యాప్‌టాప్ కొనిచ్చింది. తన సంపాదన అంత తక్కువే అయినా..మా కోసం అన్ని చేసింది. తన కోసం అంటూ ఏమి దాచుకోకుండా మొత్తం మాకే ఖర్చు చేసింది. అందుకు ఆమెకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ రోజు నేను చేస్తున్నదంతా ఆమె కోసమే. ఆమె మాకు ఇచ్చినదాంట్లో కనీసం కొంత భాగమైన తిరిగి ఇచ్చేలా ప్రయత్నిస్తున్నా. ఆమెకు తగిన జీవితాన్ని అందించడానికి నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉంటాను అంటూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్లు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడమ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anusmita (@anusmitaaa) (చదవండి: భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే..) -
గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా?
ఒకప్పుడు దేశ విదేశీయులను ఆకర్షించిన గార్డెన్ సిటీ (ఉద్యాన నగరం) బెంగళూరు.. ఇప్పుడు అస్తవ్యస్త ప్రణాళికలు, కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న వైనంతో తన ఉనికిని కోల్పోతోందా? బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్‌షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ఐటీ కారిడార్‌లో చర్చకు దారితీశాయి. బెంగళూరును ఆమె నేరుగా గార్బేజ్ సిటీ(చెత్త నగరం) అని సంబోధించడం, అక్కడి పట్టణ ప్రణాళిక వైఫల్యాలను ఎండగట్టడం ఐటీ నిపుణులు, సామాన్య ప్రజల్లో చర్చకు తెరలేపింది.గ్రాఫిక్ చిత్రం ఏం చెబుతోంది?నగర రోడ్ల దుస్థితిని వివరిస్తూ కిరణ్ ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేశారు. ‘మన గార్డెన్ సిటీని ప్రతిబింబించేలా మన రోడ్లను ఈ విధంగా రూపొందించాలి, ప్లాన్ చేయాలి. దురదృష్టవశాత్తు పచ్చదనం తగ్గుతూ చెత్త నగరంగా మారింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రాఫిక్ ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌కు సంబంధించిన రెండు విభిన్న వెర్షన్లను పోల్చి చూపించింది.మనం నిర్మించింది (What We Built): కాంక్రీట్ విస్తరణతో కూడిన ప్రస్తుత దుస్థితి. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను పూర్తిగా తొలగించడం, పాదచారుల ఫుట్‌పాత్‌లు, సర్వీస్ రోడ్లను తుడిచిపెట్టడం, ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా చేయడం ఇందులో కనిపించింది.మనం నిర్మించాల్సింది (What We Could Have Built): పర్యావరణ అనుకూల ప్రణాళిక. అదే కారిడార్‌లో పాత చెట్లను కాపాడుకుంటూనే సైక్లింగ్ ట్రాక్‌లు, విశాలమైన ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, బెంచీలు, చెత్త డబ్బాలు వంటి ఆధునిక పౌర సౌకర్యాలతో తిరిగి రూపకల్పన చేయవచ్చని ఆ చిత్రం చూపించింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, నగర పౌరుల నుంచి తీవ్ర స్పందన తీసుకొచ్చింది. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలకు పేలవమైన ప్రణాళిక, బలహీనమైన పాలన, అవినీతి, అధికారుల జవాబుదారీతనం లేకపోవడమే కారణమని నెటిజన్లు ఏకిపారేశారు. ‘ఈ నగరాన్ని దోచుకోవడానికి నిర్వాహకులు, రాజకీయ నాయకులు చేతులు కలిపారు. ఐరన్, సిమెంట్ మొదలైన వాటిలో ఎక్కువ కమీషన్లు దండుకోవచ్చు కాబట్టే కాంక్రీట్ రోడ్లపై ఆసక్తి కనబరుస్తారు. వారు నాటిన చెట్లలో కమీషన్లు రావు కదా!’ అని ఒక యూజర్ స్పందించారు.This is how we need to design & plan our roads that reflects our garden city image. Unfortunately it’s now a garbage city with shrinking greenery pic.twitter.com/EG29LPZd2j— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 27, 2026మరికొందరు నెటిజన్ల అభిప్రాయాలు ఇలా..భారతీయ నగరాలు ఏమాత్రం నిలకడగా లేవు. అంతర్జాతీయ నగరాల మాదిరిగా పన్నులు, ఖర్చులు వసూలు చేస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేక పేద దేశంగా జీవించాల్సి వస్తోంది. సిగ్గుచేటు.ఉన్నవాటిని సరిగ్గా నిర్వహించడం, చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. ప్రజలు సహనం కోల్పోయారు, ఎవరూ ఏ నియమాన్ని పాటించడం లేదు. గార్డెన్ సిటీ చెత్త నగరంగా మారుతున్న విషయం ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్‌కు తెలియదా?మొత్తం బడ్జెట్ నుంచి కమీషన్లు ఎలా పొందాలో ప్రభుత్వ ఉద్యోగులు, నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాధ్యత, జవాబుదారీతనం లేనంత వరకు ఏదీ మెరుగుపడదు. బెంగళూరు అభివృద్ధి కోసం ఎవరైనా నిజాయితీగా ప్లాన్ చేస్తారని ఆశించడం అత్యాశే. -
నూతన దంపతులను ఆశీర్వదించిన YS జగన్
-
నేను బాలికని, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు
బెంగళూరు: ‘నేను బాలికని, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. సహాయం చేయండి’ అని బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసిన ఒక బాలికను అధికారులు రక్షించారు. ఈ సంఘటన చామరాజనగర జిల్లా, గుండ్లుపేట తాలూకాలోని శివపుర గ్రామంలో జరిగింది. మలవల్లి గ్రామానికి చెందిన ఒక బాలికకు శివపుర గ్రామానికి చెందిన యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆ బాలికను ఏడు రోజులుగా ఆ యువకుని ఫామ్‌హౌస్‌లో ఉంచారు. ఈ సమయంలో బాలిక బాలల సహాయ కేంద్రానికి ఫోన్ చేసి, ‘నేను మైనర్ని, ఇక్కడ నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను‘ అని చెప్పింది. శివపుర గ్రామ పంచాయతీ పీడీఓ శిల్ప ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు స్థానిక అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్లి బాలికను రక్షించారు. తల్లిదండ్రుల వద్ద ఉంచితే ప్రమాదమని శిశుగృహానికి తరలించినట్లు తెలిపారు. -
మేడం నా క్యాబ్‌లో బీరు తాగొద్దు..
బెంగళూరు: క్యాబ్‌లో ప్రయాణికురాలు జ్యూస్ తాగుతుండగా, బీరు తాగుతున్నావంటూ డ్రైవరు ఆమెతో గొడవకు దిగాడు. ఈ ఘటన బెంగళూరు అశోక్‌నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 21న రాత్రి మహిళ కోరమంగళ రెస్టారెంట్ నుంచి తన ఇంటికి ఉబర్ కారును బుక్ చేసుకొంది. కారు ఎక్కగానే జ్యూస్ బాటిల్ తీసి తాగుతుండగా, కారులో బీరు తాగవద్దంటూ డ్రైవరు ఆమెను దబాయించాడు. ఇది బీరు కాదు, జ్యూస్ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. కారులో నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు వచ్చిన ఫిర్యాదులో తెలిపింది. డ్రైవర్ దౌర్జన్యంగా మాట్లాడటంతో మహిళ కారును, నిలిపి తన ట్రిప్‌ను రద్దు చేయాలని పదేపదే కోరింది. అయినా కారును నిలపకపోవడంతో అతికష్టం మీద డోర్‌ను తెరిచి కిందకు దూకేసింది. డ్రైవర్ కారుతో వెళ్లిపోయాడని తెలిపింది. పోలీసులు డ్రైవరు కోసం గాలింపు చేపట్టారు. -
రమ్య నాతో రాకపోతే చంపేస్తా..!
బెంగళూరు: ప్రియురాలిని కిడ్నాప్ చేసి.. కారులో తీసుకెళ్తున్న ప్రియుడు ఆమెను కత్తితో పొడిచి, తాను కారులోనే బాంబు పేల్చుకుని సజీవ దహనం చేసుకున్నాడు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపంలో జాతీయ రహదారి 48లో శనివారంనాడు జరిగింది. వివరాలు.. బెంగళూరులో నివసించే నాగేంద్ర (30), అక్కడే జయనగరలో నివసిస్తున్న ఉత్తరకన్నడ అంకోలా వాసి అయిన రమ్య (23)తో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఓటి టెక్నీషియన్‌గా పనిచేసేవారు. అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు. అతని ధోరణి నచ్చక ఆమె దూరంగా ఉంటోంది. శనివారం, తెల్లవారుజామున ఆస్పత్రిలోనే నాగేంద్ర రమ్యను కలిసి ‘వెళ్లి పెళ్లి చేసుకుందాం‘ అని చెబుతూ ఆమెతో గొడవకు దిగాడు. ఈ సమయంలో, రమ్య స్నేహితురాలు అతన్ని అడ్డుకుంది. నాతో రాకపోతే చంపేస్తానని రమ్యను బెదిరించి, ఒక ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసి, ఉదయం సుమారు 11 గంటలకు అంకోలా వైపు వెళ్లసాగాడు. డ్రైవర్‌కు పోలీసుల ఫోన్...రమ్య స్నేహితురాలు కిడ్నాప్ గురించి పోలీసులకు తెలియజేసింది. వారు క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్‌కు ఫోన్ చేసి, మీ కారులో ఒక యువతిని అపహరిస్తున్నారని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పారు. ఈ సమయంలో రమ్య, ‘అవును, నాగేంద్ర నన్ను చంపేస్తాడు, అతని దగ్గర బాంబు ఉంది, దాన్ని కారు పక్కన ఆపండి’ అని కేకలు వేసింది. ఇంతలోనే దుండగుడు ఆమె తల, చేతిపైన కత్తితో పొడిచాడు, రమ్య ప్రాణభయంతో కారు తలుపు తెరిచి కిందకు దూకింది. కారు డ్రైవర్ ప్రవీణ్ కారును ఆపి, ఆ యువతిని కాపాడటానికి వెళ్ళాడు. కారులో ఉన్న నాగేంద్ర, కారును లాక్ చేసుకుని తన వద్దనున్న పెట్రోల్, ఇతర పేలుడువస్తువులతో కూడిన బాంబును పేల్చడంతో మంటలు ఎగసిపడ్డాయి. కారుతో పాటు అతడు సజీవ దహనమయ్యారు. కళ్లంబెల్ల పోలీసులు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పు చేసి కారును కొని డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నానని, కళ్ల ముందే కాలిపోయిందని యజమాని ప్రవీణ్ విలపించాడు. -
హెల్మెట్ ఎంత అవసరమంటే.. వైరల్ వీడియో
బెంగళూరు: నగరంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్పై ఒక్కసారిగా విరిగిపడిన చెట్టు కొమ్మ అతడిని ప్రాణాపాయ స్థితికి నెట్టింది. తలపై తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన బాధితుడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రాజాజీనగర్ ప్రాంతంలోని రామ్ మందిర్ రోడ్డులో శనివారం జరిగిన ప్రమాదంలో 52 ఏళ్ల ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు సతీష్ తన ఆఫీస్‌కు వెళ్తుండగా ఒక్కసారిగా ఎండిపోయిన చెట్టు కొమ్మ విరిగి అతడి తలపై పడింది.సతీష్ హెల్మెట్ ధరించలేదు. చెట్టు కొమ్మ బలంగా తగలడంతో అతడు బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోవడం సీసీటీవీలో దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యశ్వంత్‌పూర్‌లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సతీష్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు.తలకు తీవ్ర గాయం కారణంగా ఆయన తొలుత కోమాలోకి వెళ్లినప్పటికీ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో నగరాల్లో పాత, ఎండిపోయిన చెట్ల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అలాగే ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసింది. -
బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు
టెక్నాలజీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో ఓ ఐటీ దంపతులు నిర్మించుకున్న ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష ఆకర్షణగా మారింది. అత్యాధునిక జీవనశైలికి అలవాటు పడిన ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దంపతులు, తమ పూర్వీకుల జ్ఞాపకాలను ఆధునిక అవసరాలతో మేళవిస్తూ నిర్మించిన ఈ నివాసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంటికి సంబంధించిన వీడియోను డిజైన్ సంస్థ ఆర్చ్ప్రో (ArchPro) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.అందులోని వివరాల ప్రకారం.. వేగవంతమైన కార్పొరేట్ జీవితానికి పూర్తి భిన్నంగా ప్రశాంతమైన, సంప్రదాయ విలువలతో కూడిన వాతావరణంలో జీవించాలని ఈ దంపతులు కోరుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ఎక్కువసేపు పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను కలిగించేలా, పాతకాలపు దక్షిణ భారత గృహ నిర్మాణ శైలిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఈ ఇంటి రూపకల్పనకు ప్రధాన ఆలోచనగా నిలిచిందని డిజైనర్లు తెలిపారు.సుమారు 4,382 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు 2025లో పూర్తైంది. ఇంటి ప్రధాన ఆకర్షణ మధ్యలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ ప్రాంగణం (కోర్ట్‌యార్డ్). అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం 130 ఏళ్ల నాటి చెక్క స్తంభాలు. ఈ స్తంభాలను దంపతుల పూర్వీకుల ఇంటి నుంచి జాగ్రత్తగా భద్రపరచి కొత్త ఇంటిలో వినియోగించారు. కొత్త మంగళూరు టైల్స్ పైకప్పునకు సరిపోయేలా ఈ పురాతన స్తంభాలను అమర్చడం డిజైన్ బృందానికి సవాలుగా మారినప్పటికీ, వాటి అసలు రూపానికి ఎలాంటి నష్టం కలగకుండా పనులు పూర్తి చేశారు.ఇంటి నిర్మాణంలో సహజమైన వస్తువుల వాడకానికి పెద్దపీట వేశారు. ఇటుకలు బయటకు కనిపించేలా గోడలు, మట్టి రంగు ఫ్లోరింగ్, చెక్కతో చేసిన తలుపులు, పెద్ద కిటికీలు, ఎత్తైన పైకప్పులు, సంప్రదాయ ఉయ్యాల వంటి అంశాలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. మధ్యలోని ప్రాంగణం ద్వారా సహజ కాంతి, గాలి సమృద్ధిగా ప్రవేశించేలా రూపకల్పన చేయడంతో ఇల్లంతా ప్రశాంత వాతావరణం పరచుకుంటుంది. బయట ప్రకృతి, లోపలి జీవనశైలి మధ్య సహజ అనుసంధానం కల్పించేలా వరండా, ప్రవేశ ద్వారాన్ని రూపొందించారు.బెంగళూరు వంటి నగరాల్లో ఇటీవలి కాలంలో సంప్రదాయ శైలిని ఆధునిక నిర్మాణంతో కలిపే "హెరిటేజ్-ఇన్స్పైర్డ్ హోమ్స్"పై ఆసక్తి పెరుగుతోంది. పాతకాలపు నిర్మాణ సామగ్రిని తిరిగి వినియోగించడం, సహజ కాంతి, గాలి, పర్యావరణహిత పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి ధోరణులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఇంటి రూపకల్పన కూడా అలాంటి మారుతున్న నిర్మాణ ధోరణులకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by ArchPro (@archpro.live) -
ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్..!
బెంగళూరు: కృష్ణరాజపురం పరిధిలో చోటు చేసుకున్న త్రిబుల్ మర్డర్ కేసులో కెన్నెత్‌ను గురువారం రాత్రి తమిళనాడు, బెంగళూరు పోలీసులు పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. ప్రియురాలితో కలిసి తల్లిదండ్రులు, చెల్లి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శ్వేత పట్టుబడింది. గురువారం నగర 47వ ఏసీజేఎం కోర్టులో శ్వేతను పోలీసులు హాజరుపరిచి మరింత సమాచారం కోసం 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మరోపక్క పరారీలో ఉన్న ప్రియుడు కెన్నెత్ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. త్రిబల్ మర్డర్ కేసులో శ్వేత, కెన్నెత్‌ల అరెస్ట్ కోసం 6 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో తీవ్రంగా గాలించి 23వ తేదీన పుదుచ్చేరి రైల్వేస్టేషన్లో శ్వేతను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరిలో పట్టివేత కానీ ప్రియుడు కెన్నెత్ పరారీలో ఉండగా గురువారం రాత్రి పుదుచ్చేరి అణ్ణాసలై ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒర్లియన్ పేట పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. కెన్నెత్ హత్య చేయలేదని శ్వేత తెలిపినప్పటికీ సోమసుందర్ చనిపోయే కొద్ది నిమిషాల ముందు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు కీలక మలుపు తిరిగింది. కెన్నెత్ తమపై దాడి చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. ఇదే ఆధారంగా కెన్నెత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇది చాలా కీలక కేసు కావడంతో సోషల్ మీడియా లేదా ఎలాంటి మీడియాలో తప్పుడు సమాచారం వైరల్ చేయరాదని దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు కారణాలు, పూర్తి సమాచారం మేం తెలియజేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. -
స్కూల్ వ్యాను వెళ్తుండగా రోడ్డుపై పడిపోయిన ఐదుగురు విద్యార్థులు
బెంగళూరులోని కేఆర్ పుర సమీపంలోని గాయత్రి లేఔట్ వద్ద శుక్రవారం ఉదయం ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ వెనుక తలుపు మధ్యలోనే తెరుచుకోవడంతో ఐదుగురు విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి.పిల్లలు వ్యాన్ వెనుక భాగంలో కూర్చున్నారు. ప్రయాణం సాగుతుండగా వెనుక తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో వారు రోడ్డుపై పడిపోయారు. అదృష్టవశాత్తూ వెనుక నుంచి ఏ వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.తర్వాత ట్రాఫిక్ పోలీసులు వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ బయలుదేరే ముందు వెనుక తలుపును సరిగా మూయకపోవడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై దర్యాప్తు సాగుతోంది.కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ల నుంచి పిల్లలు వ్యాన్లు, ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి కూర్చొని వెళ్తూ కనపడుతుంటారు. ఈ ఏడాది ఆరంభంలో ఝార్ఖండ్‌లోని హర్ము రోడ్డుపై 10 మందికిపైగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. అయితే ఏ చిన్నారికీ తీవ్రమైన గాయాలు కాలేదు.అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులను తరలించే తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. స్కూల్ రవాణా వాహనాలపై సరిపడా తనిఖీలు జరుగుతున్నాయా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు."భారత్‌లో 10 మంది పిల్లలు కూర్చునే సామర్థ్యం ఉన్న స్కూల్ వ్యాన్‌లో 20 మందిని ఎక్కిస్తున్నారు. ఇలా వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి వ్యాన్లపై పోలీసులు జరిమానా విధించడం నేను ఇప్పటివరకు చూడలేదు" అని ఓ వ్యక్తి ఎక్స్‌లో కామెంట్ చేశాడు. -
గోశాలలు కాసుల కురిపిస్తాయా?
బెంగళూరు: భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త విప్లవానికి గోశాలలు కేంద్రబిందువుగా మారగలవా? ఒకప్పుడు అమూల్ సహకార మోడల్ దేశంలోని కోట్లాది పాల రైతుల జీవితాలను మార్చినట్లే.. ఇప్పుడు గోశాలలను ఆధారంగా చేసుకుని కొత్త సహకార ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చనే ప్రతిపాదన ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.భారతదేశంలో ప్రస్తుతం సుమారు 7,676 నమోదిత గోశాలలు ఉండగా, అనధికారిక ఆశ్రయాలు, పింజరపోల్స్ కలిపితే వాటి సంఖ్య 15 వేల వరకు ఉండొచ్చని అంచనా. అయితే వీటిలో చాలా గోశాలలు పెరుగుతున్న పశుగ్రాస ఖర్చులు, వైద్య సంరక్షణ వ్యయాలు, మార్కెట్ సౌకర్యాల కొరత, నాణ్యత నియంత్రణలో లోపాలు, విభిన్నంగా పనిచేయడం వంటి కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా చాలా వరకు విరాళాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి.ఈ పరిస్థితిని మార్చేందుకు 'నేషనల్ గోశాల కోఆపరేటివ్ మోడల్' అనే కొత్త ఆలోచనను నిపుణులు ముందుకు తెస్తున్నారు. ఇందులో ప్రతి గోశాల విడివిడిగా పనిచేసే కేంద్రంగా కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద సహకార వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. గోశాలలు కేవలం పశు సంరక్షణ కేంద్రాలుగా కాకుండా, దేశీయ ఆవు ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేకరణ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ఈ ప్రతిపాదన ప్రకారం ప్రాంతీయ స్థాయిలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ, లాజిస్టిక్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు. వెటర్నరీ కళాశాలలు ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక చర్యలు, శాస్త్రీయ సహకారం అందించవచ్చు. అలాగే ఈ-కామర్స్ వేదికల ద్వారా గోశాలల్లో తయారయ్యే ఉత్పత్తులను నేరుగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.ఈ మోడల్లో కేవలం పాల ఉత్పత్తులకే పరిమితం కాకుండా గోమయం(పేడ), గోమూత్రం ఆధారిత ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్లు, సహజ వ్యవసాయ ఉత్పత్తులు, వెల్నెస్ ఉత్పత్తులు వంటి రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పాలు ఇవ్వని ఆవులను ఆర్థిక భారంగా భావిస్తున్న పరిస్థితిని మార్చి, వాటినీ గ్రామీణ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మార్చవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదనను జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ)కు చెందిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఆదర్శ గౌడ ముందుకు తెచ్చారు. గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త అవకాశాలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేయగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పశు సంక్షేమం, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ ఆదాయ వనరులు కూడా బలోపేతమవుతాయి. గోశాలలను వాణిజ్యీకరించడం లక్ష్యం కాదని, వాటిని ఆర్థికంగా స్వావలంబన చేయడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.మొత్తానికి, అమూల్ మాదిరిగా గోశాలల చుట్టూ కూడా ఒక సమగ్ర సహకార వ్యవస్థను నిర్మించగలిగితే.. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.:::డాక్టర్ ఆదర్శ గౌడ -
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్ లైన్. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్‌లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్‌ఫీల్డ్‌తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.Bengaluru Metro services disrupted on Purple Line after technical fault at Cubbon Park station @OfficialBMRCLhttps://t.co/Q5X1D3FHNn pic.twitter.com/j6PEjSFAo7— ChristinMathewPhilip (@ChristinMP_) June 23, 2026స్టేషన్లలో భారీ రద్దీమెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. క్యాబ్‌లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro BreakdownBengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలుఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.థర్డ్ వరల్డ్ గవర్నెన్స్..ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.First-world tech talent. Third-world governance.That is the story of Bengaluru.Metro disruptions have become alarmingly frequent. And every time the Metro fails, the entire city descends into chaos. Cabs disappear. Autos refuse rides. Citizens are stranded.Yesterday,… pic.twitter.com/0URP0FbtFK— Tejasvi Surya (@Tejasvi_Surya) June 24, 2026రాత్రంతా మరమ్మతులులోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్‌ఫీల్డ్ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్ లైన్లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి. -
భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!
ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్‌గా మారింది. భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది. ఈ సంఘటనతో ఆమె, ప్రియుడు కటకటాల్లో ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి వద్ద అనైతిక బంధం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, రిటైర్డు జవాన్ సందీప్ మంజరగి (46) ని సెలైన్‌లో విషం ఎక్కించి హతమార్చిన భార్య సుమ కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాలతో సమాజంలో పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సుమ తల్లి మహాదేవి (57) ఆత్మహత్య చేసుకుంది. కూతురి నిర్వాకం గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతుండడం చూసిన తల్లి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. తలెత్తుకోలేకపోతున్నామని కుంగిపోయింది. శనివారంనాడు హుక్కేరి తాలూకా ఘోడ గేరి గ్రామంలోని ఇంట్లో మహాదేవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -బెంగళూరు -
RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ!
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీలు (బెంగళూరులో) ప్రారభించింది. కేవలం వాహనాన్ని విక్రయించడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్పెషల్ సపోర్ట్ నెట్‌వర్క్‌ను కూడా సంస్థ ఏర్పాటు చేసింది.రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే ఉన్న షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో షాప్-ఇన్-షాప్ విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా ప్రత్యేకంగా కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయకుండా.. ఇప్పటికే ఉన్న డీలర్ నెట్వర్క్ ద్వారా ఫ్లయింగ్ ఫ్లీ బైకును విస్తరించనున్నారు. అంతే కాకుండా.. వినియోగదారులకు 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయాణ సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే సహాయం అందించేలా ఉంటుంది.ఫ్లయింగ్ ఫ్లీ C6 ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే.. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) స్కీమ్ ద్వారా ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాలి. దీని వల్ల ప్రారంభ పెట్టుబడి తగ్గి, మరింత మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని సులభంగా కొనుగోలు చేసే అవకాశం పొందుతారు.ఈ మోటార్‌సైకిల్‌లో 3.91 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 154 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఉన్న పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 15.4 కిలోవాట్ల పవర్, 60 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 0 నుంచి 60 కిమీ వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.ఫ్లయింగ్ ఫ్లీ C6 బరువు కేవలం 124 కిలోలు మాత్రమే ఉండటం వల్ల ఇది తేలికగా ఉంటుంది. అయితే 19 అంగుళాల పెద్ద చక్రాలు, సన్నని 90 సెక్షన్ టైర్లు నగర రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి.ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 3.5 అంగుళాల రౌండ్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐదు రైడింగ్ మోడ్లు, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి. ఇవి రైడింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి. -
గుండెపోటుతో ఒకటో తరగతి బాలుడు మృతి
బెంగళూరు: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఒకటో తరగతి చిన్నారి ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్‌లెట్‌కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు.ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది. -
ధర్మస్థలపై ప్రశ్నిస్తే తప్పా?.. చిన్నయ్యతో నాకేం సంబంధం??
బెంగళూరు: ధర్మస్థల వ్యవహారంలో తన పేరును లాగుతూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్లు అందుకున్నానంటూ ముసుగువ్యక్తిగా గుర్తింపు పొందిన చిన్నయ్య చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.‘‘చిన్నయ్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటివరకు ధర్మస్థలకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారిని కూడా కలవలేదు’’ అని వెల్లడించారు.బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్‌రాజ్.. తన సహచర కార్యకర్త గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్య ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. ‘‘ధర్మస్థల అంశంపై మాట్లాడాలని అతడు కోరాడు. అయితే ఇలాంటి విషయాలు నాతో కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు చెప్పాలని సూచించాను. అతని మాటలు అనుమానంగా అనిపించాయి. అందుకే ఆ సంభాషణను రికార్డు చేసి సిట్ చీఫ్‌కు కూడా పంపించాను’’ అని చెప్పారు.ధర్మస్థలలో వెలుగుచూసిన అనుమానాస్పద మరణాలు, బాధిత కుటుంబాలు వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలోనే తాను స్పందించానని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ‘‘సామాజిక బాధ్యతతోనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరాను. ఇందులో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవు’’ అని స్పష్టం చేశారు.చిన్నయ్య ఆరోపణలపై స్పందిస్తూ, ‘‘ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి రూ.200 కోట్లు తీసుకున్నాననే ఆరోపణలకు ఆధారాలేంటి?’’ అని ప్రశ్నించారు. తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొన్ని వర్గాల మీడియా చిన్నయ్య వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ధర్మస్థల ప్రతిష్ఠకు తాను మసి పూసేందుకు ప్రయత్నిస్తున్నానని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన. తాను దేవాలయాలకు వెళ్లనప్పటికీ తన భార్య భక్తురాలని, ఆమె విశ్వాసాలను ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ధర్మస్థలలో విద్యార్థిని సౌజన్య హత్య కేసులో నిజాలు బయటపడాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.విలేకరులతో మాట్లాడిన టైంలో.. ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అంటూ చేసిన ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. అయితే ప్రకాశ్‌రాజ్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ఆపై వివరణ ఇస్తూ.. ఆ వ్యాఖ్యలు మీడియా మొత్తాన్ని ఉద్దేశించి చేసినవి కావని, కొందరికి మాత్రమే వర్తిస్తాయని అన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు శాంతించడంతో.. ప్రెస్‌మీట్ కొనసాగింది.Prakash Raj called a press meet to clarify Chinnayya's claim that they had spoken during the alleged Dharmasthala hoax mass burial kconspiracy.He invited the "sold-out Godi Media."The media turned up.Then came the questions and a heated exchange. #Dharmasthala #Massburial pic.twitter.com/j8uVCMfba5— Harish Upadhya (@harishupadhya) June 17, 2026కర్ణాటకలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ధర్మస్థల వ్యవహారం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో 1995-2014 మధ్య కాలంలో పలువురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఆ మృతదేహాలను తానే ఖననం చేశానంటూ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య (ముసుగువ్యక్తి) సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే అనంతరం చిన్నయ్య తన వాంగ్మూలాన్ని మార్చుకుంటూ.. ధర్మస్థల ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి రూ.200 కోట్ల కుట్ర జరిగిందని, అందులో ప్రకాశ్‌రాజ్ సహా పలువురి పేర్లు ప్రస్తావించాడు. మరోవైపు 2012లో ధర్మస్థల సమీపంలో హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య కేసులో అసలు నిందితులు శిక్ష తప్పించుకున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మస్థల, సౌజన్య కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికితీయాలని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్ఐ
బెంగళూరు: రాష్ట్రంలో అవినీతి అనేది ఉండరాదని నూతన సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్ర పోలీసులు అందుకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. పరాయి రాష్ట్రంలో లంచం తీసుకుంటూ అక్కడి ఏసీబీకి దొరికిపోవడంతో రాష్ట్ర పోలీసుల పరువు ప్రశ్నార్థకమైంది. రూ.2 లక్షలు ఇవ్వాలని.. వరకట్నం వేధింపుల కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి రాజస్థాన్‌కు వెళ్లిన బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అనిత, హెడ్ కానిస్టేబుల్ ఉళవప్ప, కానిస్టేబుల్ యతీష్ అక్కడి ఏసీబీకి పట్టుబడ్డారు. హెచ్ఏఎల్ పీఎస్‌లో నమోదైన కట్నం వేధింపుల కేసులో నిందితుడు జైపూర్‌లో ఉన్నాడని తెలిసి అరెస్టు చేయడానికి వెళ్లారు. నిందితుని ఇంటికి వెళ్లి బేరసారాలు ప్రారంభించారు. తమకు రూ.2 లక్షల లంచం ఇస్తే, అరెస్టు చేయకుండా వెళ్లిపోతామని తెలిపారు. అంత మొత్తం ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పిన నిందితుడు, ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. ఓ లాడ్జిలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఏసీబీ అధికారులు అనిత, ఇతర పోలీసులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీరి బాగోతం బెంగళూరు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
కాక్రోచ్ పార్టీ ధర్నాలో ప్రకాష్ రాజ్ సంచలన ఎంట్రీ
బెంగళూరు: నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా రగులుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం జరగాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళనకు ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడమే కాకుండా స్వయంగా హాజరుకావడం సంచలనంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.‘ఎక్స్’ వేదికగా ప్రకాష్ రాజ్ పిలుపుగతంలో ఢిల్లీలో జరిగిన నిరసనకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన నటుడు ప్రకాష్ రాజ్, ఈసారి బెంగళూరు ధర్నాలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వం తన వైఫల్యాలకు బాధ్యత వహించేలా మనమంతా గొంతు ఎత్తాలని, ఈ శాంతియుత నిరసనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలను నిరంతరం విమర్శించే ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమంలో చేరడంతో జెన్ జెడ్ నేతృత్వంలోని ఈ విద్యార్థి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్లయింది.దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలుగత వారం రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని పలు నగరాల్లో వరుస ఆందోళనలతో హోరెత్తిస్తోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శనతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఆ తర్వాత పుణె, లక్నో, అమృత్సర్ నగరాలకు పాకింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగే నిరసనలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థ కుప్పకూలిందని, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూన్ 20న 'ఢిల్లీ చలో'.. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపబోమని, జూన్ 20న దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు అక్కడే తిష్ట వేస్తామని సీజేపీ ప్రతినిధి దిప్కే స్పష్టం చేశారు. పుణె నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీకి దేశంలోని ఒక కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా, లేక ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కాక్రోచ్ ముసుగులు ధరించి, చేతుల్లో పూలు పట్టుకుని వినూత్న రీతిలో చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
‘వందేభారత్’ను ప్యాసింజర్ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు!
బెంగళూరు: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ-హై-స్పీడ్ రైలు సర్వీసుగా పేరొందిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. బెంగళూరు - ఎర్నాకులం మార్గంలో నడిచే వందేభారత్ రైలు 2026 జూన్ నెలలో వరుసగా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఈ రైలు ఏకంగా తొమ్మిది గంటల ఆలస్యంతో గమ్యస్థానానికి చేరుకోవడంతో, ఆగ్రహించిన ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా నేరుగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను, నిరసనను వ్యక్తం చేస్తున్నారు.కారణం ఇదే: వైట్‌ఫీల్డ్ సెక్షన్లో పనులుఈ తీవ్ర ఆలస్యానికి గల కారణాలను రైల్వే అధికారులు వెల్లడించారు. బెంగళూరు డివిజన్ పరిధిలోని వైట్‌ఫీల్డ్ సెక్షన్లో ట్రాఫిక్ నియంత్రణలు, అత్యవసర రైల్వే మౌలిక వసతుల నిర్వహణ పనులు జరగడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. ఒకవైపు రైలు ఆలస్యం కావడంతో, అదే రేక్ (Rake) తిరుగు ప్రయాణానికి కూడా ఉపయోగించాల్సి రావడం వల్ల ‘క్యాస్కేడింగ్ ఎఫెక్ట్’తో అటు బెంగళూరు నుంచి, ఇటు ఎర్నాకులం నుంచి వచ్చే రెండు వైపుల సర్వీసులు గంటల తరబడి ఆలస్యమయ్యాయని వారు పేర్కొన్నారు. అయితే ప్రయాణికులకు ఈ ఆలస్యంపై ముందే సమాచారం ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.9 గంటల ఆలస్యం: నరకప్రాయమైన ప్రయాణంషెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులంలో బయలుదేరాల్సిన వందేభారత్ రైలు, సుమారు ఆరున్నర గంటల ఆలస్యంతో రాత్రి 9:07 గంటలకు బయలుదేరింది. అదే రోజు రాత్రి 11 గంటలకు బెంగళూరు చేరుకోవాల్సిన ఈ రైలు మరుసటి రోజు ఉదయం 7:51 గంటలకు చేరుకుంది. అంటే దాదాపు 9 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే బెంగళూరు నుంచి ఉదయం 5:10 గంటలకు బయలుదేరాల్సిన తిరుగు ప్రయాణ రైలు కూడా ఐదు గంటలకు పైగా ఆలస్యంగా నడిచింది.ప్రయాణికుల ఆందోళనకేరళ, బెంగళూరు మధ్య నిత్యం వేలాది మంది సాధారణ ప్రయాణికులు, ఐటీ నిపుణులు, విద్యార్థులు ఈ రైలుపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు. వందేభారత్ వంటి ప్రీమియం రైళ్లు కూడా ఇలా పదే పదే ఆలస్యం కావడం వల్ల తమ ఆఫీస్ విధులు, విద్యా షెడ్యూళ్లు, తదుపరి ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్షిప్ రైలు సర్వీసుల నమ్మకత్వాన్ని ఇలాంటి ఆలస్యాలు దెబ్బతీస్తున్నాయని, అత్యంత రద్దీగా ఉండే ఈ కారిడార్‌లో షెడ్యూల్ మేనేజ్మెంట్ను ఇండియన్ రైల్వేస్ వెంటనే మెరుగుపరచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్! -
లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన ఆహారం సురక్షితమేనా?
అసాధారణమైన ఘనీభవించిన డెజర్ట్‌ల తయారీ కోసం, అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ద్రవ నైట్రోజన్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో, ద్రవ నైట్రోజన్‌తో తయారుచేసిన ఆహారాలు, చూడటానికి ఆసక్తికలిగించే ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. సాధారణ ఫ్రీజింగ్ పద్ధతుల కంటే ద్రవ నైట్రోజన్ ఉష్ణోగ్రత ఆహారపదార్థాలను భిన్నంగా గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల వాటికి విభిన్నమైన చిక్కదనం, ఆకృతి రావడంతో పాటు, ఒక ప్రత్యేకమైన ఆవిరి కూడా వెలువడుతుంది. ఈ ఆవిరిని చెఫ్‌లు "డ్రాగన్ బ్రీత్" స్నాక్స్ కోసం ఉపయోగిస్తారు. ఎవరైనా డ్రాగన్ బ్రీత్ స్నాక్‌ను కొరికినప్పుడు, అది ఒక ఆవిరి మేఘాన్ని విడుదల చేస్తుంది. అంటే..ఇది వారి నోటి నుంచి పొగ వస్తున్నట్లుగా ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీన్ని డ్రాగన్ శ్వాస లేదా స్వర్గపు శ్వాస వంటి ట్రెండ్‌లుగా పిలుస్తారు. అలాంటి ఆహారాలకు కేరాఫ్ బెంగళూరులోని వివి పురం ఫుడ్ స్ట్రీట్. పాపం ఓ పెళ్లైన కొంత జంట అక్కడకువెళ్లి ఆ ట్రెండ్ ఫుడ్‌ని సరదాగా ట్రైం చేయడంతో ఏం జరిగిందో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు ఇలాంటి ఆహారం తినేటప్పుడు జాగురకతతో తినాలంటూ ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.అసలేం జరిగిందంటే..జస్ట్ పెళ్లై నాలుగురోజులైంది. ఆమె సరదాగా భర్తతో కలిసి ఈ స్మోకీ ట్రెండ్ ఫుడ్‌ని టేస్ట్ చేయాలని వి.వి.పురం ఫుడ్ స్ట్రీట్‌కు వెళ్లారు. అక్కడ ద్రవ నైట్రోజన్‌తో పూత పూసి.. పొగలు వెలువరించే బిస్కెట్లు తిన్నారు. అంతే ఆ నవవధువుకి నోటి నుంచి రక్తస్రావం, ఎండోస్కోపీలో అన్నవాహిక , జీర్ణాశయ శ్లేష్మ పొర గణనీయంగా క్షీణించినట్లు తేలింది. ఆ తర్వాత రెండు చేతులు, కాళ్లలో బలహీనత మొదలై..ఒక నెల వరకు మంచానికే పరిమితమైంది. వైద్య పరీక్షల్లో నరాల ప్రసరణ పరీక్షలలో అక్యూట్ మోటార్ ఆక్సోనల్ న్యూరోపతి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరదాగా తిన్న ఆహారం ఆటోఇమ్యూన్ న్యూరోపతికి దారితీసింది. తినేటప్పుడు తస్మాత్ జాగ్రత్త..ద్రవనైట్రోజన్తో కూడిన ఆహారాలు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. అవి పూర్తిగా ఆవిరైకపోక ముందే తింటే నోరు, అన్న వాహిక, కడుపుకి తీవ్రమైన క్రయోజెనిక్ కాలిన గాయలు ఏర్పడి, కోతలు, రక్తస్రావం, చిల్లులు పడటానికి దారితీస్తుందట. ఆ నేపథ్యంలోనే ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దీనిపై స్పష్టమైన హచ్చరికలు జారీ చేసింది. పైగా ఆహారాన్ని ప్లేట్లో వడ్డించేటప్పుడు లేదా కస్టమర్లకు నేరుగా అందించే ముందు ద్రవ నైట్రోజన్ ఉపయోగించడం పూర్తిగా నిషేధించింది. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో లేదా ఐస్క్రీంల తయారీలో మాత్రమే దీనిని శీతలీకరణ (cooling) ఏజెంట్‌గా ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఒకవేళ సరదాగా ఇలాంటి క్రయోజనిగ్ ఫుడ్‌ని ప్రయత్నించాలనుకుంటే..ఆ పొగ అంతా అయిపోయేదాక వెయిట్ చేసి అప్పుడు ఆరగించాలని అంటున్నారు. నేరుగా అలానే తింటే తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ ఏకంగా 19..) -
ప్రియుడి ఘరానా మోసం.. అప్పటికే కన్నతల్లి ఘాతుకం!
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్‌ను మళ్లీ కలిసింది.తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్‌పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్‌క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్‌తో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్‌ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్‌లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్‌లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
పాఠశాలల్లో చివరి బెంచీకి స్వస్తి?
బెంగళూరు: ప్రతి తరగతి గదిలో ఇకపై చివరి బెంచ్ ఉండదు. యూ ఆకారంలో లేదా వృత్తాకారంలో బెంచ్‌లు ఏర్పాటు చేస్తారు. కేరళలో ఇదే విధానం కొనసాగుతోంది. ఇదేవిధానాన్ని రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను వెనుకబెంచ్‌లో కూర్చొబెడతారనే అపవాదు ఉండేది. దీంతో చివరి బెంచ్‌లో కూర్చునే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదు. దీంతో ప్రతి ఒక్క విద్యార్థిపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టేలా వృత్తాకార, లేదా యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుందని, ఇన్నాళ్లూ తాము చివరి బెంచీకి పరిమితం అయ్యామనే వేదన వారిలో తొలగిపోతుందని భావిస్తున్నారు. సంప్రదాయ వరుస ఆసనాల వ్యవస్థకంటే కేరళ విధానంలో విద్యార్థులను కూర్చొబెట్టడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచినట్లు అవుతుందని విద్యానిపుణుల అభిప్రాయం. యూ ఆకార ఆసనాల వ్యవస్థలో ఉపాధ్యాయులు తరగతి కేంద్రభాగాల్లో నిల్చొని పాఠాలు చెబుతారు. దీంతో విద్యార్థులందరూ శ్రద్ధగా పాఠాలు వింటారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అంతేగాకుండా విద్యార్థులతో బృంద చర్చలు, పాఠ్యాంశాలలో సందేహాలు తీర్చుకునేందుకు ఈ విధానం అత్యుత్తమమైనదని నిపుణులు భావిస్తున్నారు. -
సీఎం ఇంటి దగ్గర క్షుద్ర పూజలు
బెంగళూరు: సీఎం డీ.కే.శివకుమార్ బెంగళూరు సదాశివనగరలోని నివాసం దగ్గరలో క్షుద్ర పూజలు జరగడం కలకలానికి కారణమైంది. ఆయన నివాసానికి వెనుకవైపు జీబీఏ మైదానం ముందున్న రోడ్డులో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు పెట్టి పూజలు చేశారు. ఆదివారం ఉదయం ఇది చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎంతోమంది వీఐపీలు నివసించే ప్రాంతంలో ఇలాంటిది జరిగింది.స్థానిక పోలీసులు చేరుకుని కోడి, ఇతర వస్తువులను తొలగించారు. సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసముండటంతో ఈ ప్రదేశంలో భారీ పోలీస్ భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఎలా క్షుద్రపూజలు జరిగాయి అనేది చర్చనీయాంశమైంది. పూజలు చేసినవారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
ఆరంకెల జీతమున్నా బైక్ రైడర్‌గా..
బెంగళూరు: గ్రామాల్లో వేలల్లో జీతాలొస్తే చాలు ఎంతో హాయిగా అన్ని సౌకర్యాలతో జీవిస్తారు. మరి బెంగళూరు వంటి మహానగరంలో ఆరంకెల జీతమొచ్చినా కొందరు కుటుంబ ఆర్థిక భద్రతపై బాగా ఆలోచిస్తారని ఒకతను నిరూపించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆరంకెల జీతమొస్తున్నాసరే వారాంతాల్లో ర్యాపిడో బైక్ ట్యాక్సీ రైడర్‌గా పనులు చేస్తుంటానని ఒకతను చెప్పిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల బెంగళూరులోని బన్నేరఘట్ట అనే ప్రాంతంలో షాబాజ్ అనే వ్యక్తి మరో చోటుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్‌చేశాడు. వెళ్తూ మార్గమధ్యంలో రైడర్‌తో మాట్లాడాడు. ఆ సంభాషణ తాలూకు వివరాలను షాబాజ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నాడు. ‘‘ రైడర్ నన్ను మీరేం చేస్తారు అని అడిగాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని గొప్పగా చెప్పా. నువ్వేం చేస్తావని 35 ఏళ్ల ఆ రైడర్‌ను అడిగా. అతను చెప్పిన సమాధానం విని ఆలోచనలో పడ్డా. తను కూడా సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఒక పెద్ద బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరంకెల జీతం వస్తోంది అతనికి. మరి రైడర్‌గా ఎందుకు చేస్తున్నావని అడిగా. వారాంతాల్లో మాత్రమే ఈ పని చేస్తాడట’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘నాకు పెళ్లయింది. మాకొక చిన్నారి. ముగ్గురం ఈ మహానగరంలో వాళ్లను ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతోనే అదనపు ఆదాయం కోసం ఈ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నా’’ అని చెప్పడంతో ఆలోచనలో పడ్డానని షాబాజ్ చెప్పాడు. ఈ పోస్ట్‌లు స్పందనలు వెల్లువెత్తాయి. భారత్‌లోని బెంగళూరు వంటి నగరాల్లో ఇంటి అద్దెలు, ద్రవ్యోల్బణం, పిల్లల ఫీజులతో వేతనజీవుల వెతలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ ఉదంతం తేటతెల్లంచేస్తోందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆరంకెల జీతమొచ్చే ఉద్యోగులు భిన్నమైన బైక్ రైడ్ వృత్తిని ఎంచుకోకుండా సాఫ్ట్వేర్ రంగంలోనే కొత్త కోర్సులు, మెళకువలు నేర్చుకుని ఆ రంగంలో మరింత పైకి ఎదిగి ఆదాయాన్ని రెట్టింపుచేసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. -
మంత్రి పదవికంటే విలువైనదా? ఆ శాఖ కోసం ఎందుకింత పోటీ?
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు లేదా శాఖల కేటాయింపు సమయంలో ఎప్పుడూ పదేపదే వినిపించే పేరు ‘బెంగళూరు నగరాభివృద్ధి శాఖ’. ఇప్పటివరకు ఈ శాఖను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే శివకుమార్ చూసుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ కేబినెట్లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అవును.. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రోజులైంది. శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కృష్ణభైరేగౌడకు డీకే శివకుమార్ అప్పగించారు. అయితే బెంగళూరు నగరాభివృద్ధి శాఖపై కొండంత ఆశతో ఉన్న రామలింగారెడ్డికి ఇది అసలు నచ్చలేదు.. తనకు ఆ శాఖ కేటాయించలేదనే కారణంతో అసంతృప్తికి లోనై మనస్తాపానికి గురై ఏకంగా మంత్రి పదవికే రామలింగారెడ్డి రాజీనామా చేశారు. అసలు ఆ బెంగళూరు నగరాభివృద్ధి శాఖలో ఏముంది ఇంతకీ? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.. ఎందుకింత పోటీ నెలకొంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆర్థిక ఇంజిన్‌గా బెంగళూరు బెంగళూరు అంటే కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు. ప్రపంచ స్థాయిలో ఐటీ హబ్‌గా పేరు గాంచింది. అధికారానికి అక్షయపాత్ర ఈ బెంగళూరు మహానగరం. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా బంగారు ఖనిజంగా చెప్పొచ్చు. కర్ణాటక రాష్ట్రం మొత్తానికి అత్యధిక రెవెన్యూ అందించే ఆర్థిక ఇంజిన్ ఈ బెంగళూరు నగరం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ స్థాయిలో బ్రాండ్ బెంగళూరు ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయి. ఈ శాఖ బాధ్యతలు నిర్వహించే నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత స్థానం దక్కినట్లుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు అధిక డిమాండ్ ఏర్పడింది. బడ్జెట్లో అధిక కేటాయింపులు బెంగళూరు కేవలం రాజధాని మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక శక్తి కేంద్రం. దేశంలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన ఈ మహానగరం నుంచి ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైతే ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు పొందవచ్చు. అత్యున్నత రాజకీయ గౌరవం, శక్తి లభిస్తుంది. అందుకే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తారు. అలాగే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు లభించే బడ్జెట్ కూడా సామాన్యమైనది కాదు. వేలాది కోట్ల రూపాయల మేర భారీ బడ్జెట్ కేటాయింపులు ఈ శాఖకు దక్కుతాయి. అనేకానేక పథకాలు, ప్రాజెక్టులు ఈ శాఖకు బడ్జెట్లో లభిస్తాయి. నమ్మ మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్లు, సొరంగ మార్గాలు, రాజ కాలువలు, చెరువుల అభివృద్ధి, నగర ట్రాఫిక్ నిర్వహణ తదితర కోట్లాది రూపాయల ప్రాజెక్టుల పరిశీలన, బాధ్యత నేరుగా సంబంధిత శాఖ మంత్రిపై ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యేలకే ప్రేమ ఎక్కువ.. వాస్తవానికి బెంగళూరు నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖపై కేవలం బెంగళూరు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కన్ను వేస్తుంటారు. ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక ఎమ్మెల్యేలు ఎవరూ ఈ శాఖను నిర్వహించేందుకు ఇష్టపడరు. ఈ శాఖ కేవలం బెంగళూరు నగరానికే పరిమితం కావడంతో వారు దీన్ని స్వీకరించేందుకు ముందుకు రారు. బెంగళూరు నగర ఎమ్మెల్యేలు ఎక్కువగా ఈ శాఖను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటివరకు ఈ శాఖకు మంత్రులుగా చేసిన వారు కూడా చాలా మంది బెంగళూరు వాసులే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం లేకపోవడం, సొంత నియోజకవర్గంలో ఉంటూ ఈ శాఖ బాధ్యతలు చూసుకునే వెసులుబాటు ఉండడంతో బెంగళూరు ఎమ్మెల్యేలు దీనికోసం పట్టుబడుతున్నారు. ఆఖరికి కొత్తగా ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కృష్ణబైరేగౌడ సైతం బెంగళూరు వాసి కావడం గమనార్హం.ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే.. బెంగళూరు అభివృద్ధిని, భవిష్యత్తును రూపొందించే, అత్యంత ప్రభావవంతమైన ప్రముఖ ప్రభుత్వ సంస్థలు కూడా ఈ శాఖ కిందకే వస్తాయి. బీడీఏ (బెంగళూరు అభివృద్ధి ప్రాధికార, బీడబ్ల్యూఎస్ఎస్బీ (బెంగళూరు జలమండలి), జీబీఏ (గ్రేటర్ బెంగళూరు అథారిటీ) తదితర ప్రభుత్వ రంగ పెద్ద సంస్థలు, వాటి కార్యాలయాలు బెంగళూరులోనే ఉంటాయి. ఆ సంస్థల నిర్ణయాలు, నియామకాలు మొత్తానికి పాలన పూర్తిగా బెంగళూరు నగరాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి. బెంగళూరులో మౌలిక వసతుల పెంపుదల కోసం ఏటికేడాది ప్రభుత్వాలు కేటాయింపులను పెంచుతూ పోతున్నాయి. దీనికితోడు బెంగళూరులో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ మహానగరం నిలుస్తోంది. -
రాజ్యసభకు మల్లికార్జున్ ఖర్గే నామినేషన్
బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక నుండి రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బెంగుళూరులోని విధానసౌధలో ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం డీ.కె. శివకుమార్, సిద్ధరామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే కొనసాగుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచే పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా మరోసారి అదే రాష్ట్రం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కన్నడలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం రీత్యా ఆయన రాజ్యసభ ఎంపిక దాదాపు లాంఛనమే. కాగా రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1 న నోటిఫికేషన్ విడుదలవగా జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. -
నిన్ను చంపేందుకు రూ.10 కోట్ల ఆఫర్ వచ్చింది
బొమ్మనహళ్ళి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని హుసూ్కరు వద్ద మాజీ ఎమ్మెల్సీని కొందరు దుండగులు అపహరించి, డబ్బు డిమాండ్ చేశారు. వివరాలు.. మాజీ ఎమ్మెల్సీ దయానంద్ రెడ్డి సోమవారం అర్ధరాత్రి గోల్డ్ కాయిన్ క్లబ్ నుంచి కారులో బయల్దేరారు. ఈ సమయంలో, బైక్‌పై వచ్చిన దుండగులు కారును అడ్డగించి, మీకు బహుమతి వచ్చిందని చెబుతూ ఆయనకు ఒక పెట్టెను చూపించారు. డోర్ లాక్ తెరుస్తుండగా, ఒక వ్యక్తి కారులోకి ప్రవేశించి, తుపాకీ గురిపెట్టి, తాను చెప్పిన చోటుకు వెళ్లాలని చెప్పాడు. ఆ తర్వాత, ఎర్ర కారులో మరో ఇద్దరు వ్యక్తులు వెంబడించారు. అత్తిబెలె కేహెచ్‌బీ బరంగాయ్ సమీపానికి తీసుకెళ్లి, నిన్ను హత్య చేయడానికి రూ.10 కోట్ల ఆఫర్ వచ్చిందని చెప్పారు. దీంతో భయపడిన దయానంద్ రెడ్డి ఆ డబ్బును తానే ఇస్తానని, తనను చంపవద్దని వేడుకున్నారు. చివరకు రూ.2 కోట్లు ఇవ్వడానికి కుదిరింది. అయితే ఇప్పుడు డబ్బులు లేవని, సోమవారం బ్యాంకు నుంచి తీసుకుని ఇస్తానని ఆయన చెప్పడంతో వదిలిపెట్టారు. వెంటనే ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు సాగిస్తున్నారు. -
బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్
-
ట్రాఫిక్ ఆపేశారని.. గవర్నర్ కాన్వాయ్ వస్తుంటే అడ్డుగా కూర్చొని..
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ వాహనదారులను ఎంతగా సమస్యలకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దానికి తోడు వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎవరూ అడ్డురాకుండా ట్రాఫిక్‌ను ఆపేస్తుంటారు. ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. ఇండియా ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో నిరసన తెలిపాడు. గర్భిణీ అయిన తన భార్యతో కారులో అతడు ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్.. మోటర్కేడ్ వెళ్లేందుకు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డును పోలీసులు ఖాళీ చేయించారు. ఆ సమయంలో మిగతా వైపుల ఉన్న రోడ్లపై వాహనాలను ముందుకు వెళ్లనివ్వలేదు. చాలా సేపు ఆలస్యం కావడంతో ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరసనగా అతడు రోడ్డుకు మధ్యలో కూర్చున్నాడు. ఎంత చెప్పినా అక్కడి నుంచి కదల్లేదు. సాధారణ పౌరుడి సమయం కూడా రాజకీయ నాయకుడి సమయంతో సమానంగా విలువైనదేనని వాదించాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో అతడు వాగ్వివాదానికి దిగాడు.వారి మధ్య జరిగిన సంభాషణనిరసన తెలిపిన వ్యక్తి: "నా భార్య గర్భిణీ. మాకూ పనులు ఉంటాయి కదా?"ట్రాఫిక్ పోలీసులు: "పక్కకు జరగండి. అక్కడ నిలబడండి"వ్యక్తి: "నా భార్య గర్భిణీ. సిగ్నల్ ఎందుకు ఆపేశారు? గవర్నర్ వీఐపీ అయినంత మాత్రాన మాకు విలువ లేదా?"ట్రాఫిక్ పోలీసులు: "మీరు కూడా వీఐపీనే. ఇప్పుడు లేచి పక్కకు వెళ్లండి. లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"ట్రాఫిక్ పోలీసులు: "లేస్తారా లేదా?"వ్యక్తి: "లేవను"కాన్వాయ్ చివరకు జనంతో నిండిన రహదారి పక్క నుంచి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ గొడవ ఎలా ముగిసింది, ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎలా వెళ్లిపోయాడు అన్న విషయం స్పష్టంగా తెలియలేదు.ఈ ఘటన "వీఐపీ సంస్కృతి"పై పెరుగుతున్న అసంతృప్తిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో స్పందించారు. అధికారిక విధివిధానాల్లో మంత్రులు, అధికారులు, వ్యయ నియంత్రణ పాటించాలని, అధికార ప్రదర్శన కంటే సాదాసీదా విధానం, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.Traffic stopped for 30 minutes in Bengaluru for Governor’s VVIP movement.A man carrying his pregnant wife to the hospital was stuck and sat in protest.99% of us do not even know who the Governor of Karnataka is but the city traffic is halted every-time he passes by.This…— Roshan Rai (@RoshanKrRaii) June 1, 2026 -
ప్రియునితో కలిసి వదిననే చంపిన మరదలు..!
బెంగళూరు: బంగారు నగల కోసం మానవులు రాక్షసులుగా మారుతున్న ఉదంతాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. అదే రీతిలో బంగారం కోసం ప్రియునితో కలిసి సొంత వదిననే గొంతు కోసి చంపిందో మరదలు. ఈ కిరాతక ఘటన చిక్కబళ్లాపురం నగరంలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. మే 28వ తేదీ అర్ధరాత్రి కందవార పేట సమీపంలోని బాపూజినగరలో మేస్త్రి నరసింహమూర్తి ఇంట్లో కోడలు పుష్పలతను దొంగలు పడి గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఆమె పక్కనే పడుకొన్న మరదలు భవ్య నోట్లో బట్టలు కుక్కి పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు భవ్య కుటుంబీకులకు, పోలీసులకు తెలిపింది. పుష్పలత తల్లిదండ్రులు మహేశ్, లక్ష్మి మాత్రం ఏదో జరిగిందని, భర్త తరఫు వారే తమ బిడ్డను బలిగొన్నారని విలపించారు. పోలీసులు మొదట్లో ఇది దోపిడీ అనుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న భవ్యను విచారించగా ఆమె మాటల్లో పొంతన కుదరలేదు. నివ్వెరపోయే నిజాలు.. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె దర్యాప్తులో అసలు నిజాన్ని గుర్తించారు. భవ్యకు హొసకోటకు చెందిన వ్యక్తితో పెళ్లి చేసి పంపారు. కానీ ఆమె భర్త మిత్రుడు, కార్ డ్రైవర్ లోహిత్కుమార్ లల్లుతో అక్రమ సంబంధం ఏర్పడి అతనితో పరారైంది. భర్త గొడవచేయడంతో పుట్టింటికి వచ్చేసింది. మరోవైపు లల్లు నీ ప్రైవేటు వీడియోలు బయట పెడతానని బెదిరించడంతో భవ్య రూ. 5 లక్షల వరకూ ఇచ్చుకుంది. మరింత డబ్బులు కావాలని బెదిరించగా, నా వదిన దగ్గర బంగారు నగలు ఉన్నాయి, ఆమెను హత్య చేసి తీసుకుపో అని చెప్పింది. 28వ తేదీ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్లాన్ ప్రకారం భవ్య వదిన పక్కన పడుకుంది. లల్లు రాగానే తలుపులు తీసింది. ఇద్దరూ కలిసి పుష్పలతను దిండుతో అదిమి, కత్తితో గొంతుకోసి చంపి ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. దొంగలు తనపై దాడి చేశారని భవ్య నాటకమాడింది. అదే రోజు ఇంటి సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఎక్కడా దొంగల ఆచూకీ లేదు. పోస్టుమార్టం రిపోర్టు ఇది సహజ మరణం కాదు అని తేలి్చంది. దీంతో భవ్యను తమదైన రీతిలో ప్రశ్నించగా, మొత్తం ఏకరువు పెట్టింది. లల్లును కూడా అరెస్టు చేశారు. అత్త మామల పాత్ర ఉంటే వదిలిపెట్టబోమని ఎస్పీ కుశాల్ తెలిపారు. -
అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్!
ఒకటి క్రికెట్ కప్.. మరొకటి ఫుట్‌బాల్ ట్రోఫీ. ఒకటి బెంగళూరు.. ఇంకొకటి పారిస్. క్రీడలు వేరు, దేశాలు వేరు. కానీ రెండు నగరాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయి. విజయోత్సవాలు ఎక్కడ, ఎలా ముగియాలి?. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా పీఎస్జీ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత పారిస్‌లో చెలరేగిన అల్లర్లు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ రెండు ఘటనలు కలిసి క్రీడా సంబరాలపై కొత్త హెచ్చరికగా మారాయి.యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్ను ఓడించి ప్యారిస్ సెయింట్ జర్మైన్ (PSG) మరోసారి యూరప్ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే పారిస్ వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. మొదట అది ఆనందోత్సవంలా కనిపించింది. ఐఫిల్ టవర్ క్లబ్ రంగులతో మెరిసింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కార్లకు నిప్పంటించడం, దుకాణాలపై దాడులు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీధుల్లో విధ్వంసం చోటుచేసుకున్నాయి.అధికారిక లెక్కల ప్రకారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 780 మందికిపైగా అరెస్టయ్యారు. 264కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. క్రీడా విజయాన్ని జరుపుకునేందుకు ప్రారంభమైన రాత్రి చివరకు చట్టవ్యవస్థకు సవాలుగా మారింది.ఈ దృశ్యాలు భారత అభిమానులకు గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాదాన్ని గుర్తు చేశాయియి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పుడు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జట్టు విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. కానీ భారీ జనసందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. క్రీడా చరిత్రలో నిలిచిపోవాల్సిన ఆనంద క్షణం విషాద అధ్యాయంగా మారిపోయింది.ఆ ఘటన కేవలం ఒక ప్రమాదంగా ముగియలేదు. క్రీడా విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, క్రీడా సంస్థల ఆలోచననే మార్చేసింది. అభిమానుల భావోద్వేగం ఎంత ముఖ్యమో, వారి భద్రత కూడా అంతే ముఖ్యమని అందరికీ అర్థమైంది.అందుకే.. ఈ ఏడాది ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, గతంలో లాగా భారీ ర్యాలీలు, నియంత్రణలేని బహిరంగ సంబరాలకు అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున గుమికూడే కార్యక్రమాలపై పరిమితులు విధించారు. భారీ జనసందోహాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయోత్సవాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు ఇచ్చింది. గత ఏడాది విషాదాన్ని గుర్తుచేస్తూ, వీధుల్లోకి పెద్ద ఎత్తున రావద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సోషల్ మీడియా వేదికగా బాధ్యతాయుతమైన సంబరాలు జరుపుకోవాలని సూచించింది. సాధారణంగా జట్లు అభిమానులను బయటకు రమ్మని పిలుస్తాయి. కానీ ఈసారి అభిమానులు సురక్షితంగా ఉండటమే పెద్ద సంబరమని ఆర్సీబీ భావించడం గమనార్హం.What a night. What a feeling. 🥹To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️As the celebrations begin, let’s be responsible. 🙌Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026వాస్తవానికి పారిస్ ఘటన, బెంగళూరు తొక్కిసలాట రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. క్రీడా విజయాలు ప్రజలను ఏకం చేయగలవు. కానీ అదే భావోద్వేగం అదుపు తప్పితే ప్రమాదకరంగా మారుతుంది. సంబరాలు అల్లర్లకు దారి తీసినా, జనసందోహం ప్రాణాలను బలిగొన్నా చివరకు నష్టపోయేది అభిమానులే.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నిర్వాహకులు ఒక కొత్త వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. విజయం ఎంత గొప్పదైనా, భద్రత దానికంటే గొప్పది. బెంగళూరు తొక్కిసలాట నేర్పిన పాఠాన్ని పారిస్ అల్లర్లు మరోసారి గుర్తు చేశాయి. కప్‌లు ప్రతి ఏడాది ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదనే బాధ్యత మాత్రం అందరిదీ. అందుకే ఈసారి ఆర్సీబీ సంబరాలకు బ్రేక్ పడింది. అది ఆనందంపై ఆంక్ష కాదు... గత విషాదం మళ్లీ పునరావృతం కాకూడదన్న ముందస్తు జాగ్రత్త. -
ఫ్యాన్స్‌కి షాక్.. వేడుకలకు పోలీసులు నో..?
బెంగళూరు: ఐపీఎల్- 19 విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను పబ్లిక్ రోడ్లపై వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. 2025లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్సీబీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలో అత్యధికంగా ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుగా ఆర్సీబీకీ మంచి రికార్డుంది. ఇక వారి స్వంత రాష్ట్రంలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు. భద్రతా కారణాల రీత్యా బెంగళూరు నగర వీధుల్లో బహిరంగ వేడుకలను పోలీసులు నిషేధించారు. గతేడాది జరిగిన ఘోర తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ "బెంగళూరు సిటీ పోలీస్ ప్రేక్షకులు, అభిమానులకు వీధుల్లో బహిరంగంగా వేడుకలు జరుపుకోవద్దని, ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అడ్వైజరీ జారీ చేసింది. మేము వాహనాలను తనిఖీ చేస్తున్నాము. బహిరంగ వేడుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించము. ఎవరైనా వేడుకలు జరుపుకోవాలనుకుంటే, వారు తమ ఇళ్ల లోపలే జరుపుకోవచ్చు," అని పేర్కొన్నారు. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో వేలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో సంబరాల కోసం గుమిగూడారు. అపరిమితంగా వచ్చిన ఈ జనసందోహం వల్ల ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. -
సిద్దు ఇంటికి ఎమ్మెల్యేల క్యూ
బెంగళూరు: సీఎం సిద్దరామయ్య బెంగళూరులో కావేరి నివాసంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో శనివారం రద్దీ ఏర్పడింది. బోర్డు, కార్పొరేషన్ల పదవుల కోసం నాయకులు సిద్దును కలవడానికి వస్తున్నారు. రాజీనామా తరువాత సిద్దరామయ్యకు హైకమాండ్ పలు వాగ్దానాలు చేసింది. రాబోయే మంత్రివర్గంలో ఆయన కోటాలో కొందరికి మంత్రి పదవులు లభిస్తాయి. సిద్దు ప్రభావం ఏమీ తగ్గబోదని తెలుస్తోంది. అనేకమంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్యను కలిసి పదవుల కోసం విన్నవించారు. ప్రజలు కూడా పెద్దసంఖ్యలో రాగా, సీఎం వారి నుంచి వినతులను స్వీకరించారు. -
‘సీఎం’ గొడవ అయిపోయింది.. ఇప్పుడు ‘డిప్యూటీ సీఎం’ కోసం..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవడంతో డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు నేతలు పోటీ పడుతున్నారు.ఉప ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి కేహెచ్ మునియప్పను నియమించాలని కోరుతూ దళిత వర్గ నేతలు శనివారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిరసన చేపట్టారు. మడార మహాసభ, పలు దళిత సంఘాల నేతలు పోస్టర్లు ప్రదర్శిస్తూ మునియప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. రాష్ట్రానికి చేరుకుంటున్న ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాకు వినతిపత్రం అందించేందుకు నిరసనకారులు అక్కడికి వెళ్లారు.విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద ఈ నిరసన కొన్ని గంటల పాటు కొనసాగింది. మడిగ వర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు వంటి కీలక పదవులు దక్కలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా తమ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని హెచ్చరించారు. తమ వర్గాన్ని పట్టించుకోకపోతే పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా నగరంలోని షాంగ్రి లా హోటల్‌కు చేరుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశంపై మునియప్ప మాట్లాడుతూ.. "కొంతమంది ప్రతిపాదిస్తున్నారు, మరికొందరు బలపరుస్తున్నారు. ఇదే విధానం. దీని కంటే ఎక్కువగా ఇప్పుడేమీ చెప్పలేం. అయితే ఈ ప్రక్రియ ఈ సాయంత్రానికే పూర్తవుతుంది" అని తెలిపారు.కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి లింగాయత్ వర్గం నుంచి కూడా వచ్చింది. సీనియర్ నేత ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గురు బసవ పట్టదేవరు, ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.గురు బసవ మీడియాతో మాట్లాడుతూ.. "ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో లింగాయత్ వర్గం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుంది" అని అన్నారు. కాగా, కర్ణాటకలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. -
అమ్మో లక్ష! బెంగళూరు ఇంటి అద్దె వైరల్
బెంగళూరు ఐటీ కారిడార్‌లో ఇండ్ల అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ఉద్యోగుల మాట దేవుడెరుగు... నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే టెక్కీలు సైతం ఇక్కడి అద్దెలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నగరంలో ఓ 3బీహెచ్‌కే (3BHK) ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నగరంలో నివాస వ్యయంపై మరోసారి తీవ్ర చర్చ నడుస్తోంది.రూ. 1.1 లక్షల అద్దె.. 4 లక్షల డిపాజిట్!నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ ‘ఎంబసీ గోల్ఫ్ లింక్స్ బిజినెస్ పార్క్’కు అత్యంత సమీపంలో, డోమ్లూర్ - ఇందిరానగర్ పరిసరాల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ అద్దెకు ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. సుమారు 1,800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ సెమీ-ఫర్నిష్డ్ కార్నర్ ఫ్లాట్ నెలవారీ అద్దె అక్షరాలా రూ. 1.1 లక్షలు. ఇది చాలదన్నట్టు దీనికి రూ. 4 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు, ప్రతి నెలా అదనంగా రూ. 6,000 మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెర్రస్, పూజా గది, మాడ్యులర్ కిచెన్, ఉచిత స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్టు వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఈ ఫ్లాట్‌లో ఉన్నాయట.వామ్మో అంటున్న నెటిజన్లుఈ అద్దె వివరాల స్క్రీన్షాట్లు నెట్టింట వైరల్ కావడంతో ఐటీ ఉద్యోగులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బెంగళూరులో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె రూ. 1.1 లక్షలా? నిజానికి ఇది ఒక సగటు ఉద్యోగి నెలవారీ జీతం" అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసులకు దగ్గరగా ఉండాలంటే జీతాన్నంతా అద్దెలకే తగలేయాలి, లేదా ట్రాఫిక్‌లో గంటల తరబడి నరకం చూడాలి.. ఐటీ నిపుణుల పరిస్థితి ‘ముందు నయ్యం.. వెనుక గొయ్యి’లా తయారైందని పలువురు వాపోతున్నారు.ఇటువంటి పిచ్చి అద్దెలను డిమాండ్ చేసినా చెల్లించేందుకు కొందరు సిద్ధపడటం వల్లే యజమానులు మరింతగా రెచ్చిపోతున్నారని, ఒకే ఫ్లాట్‌ను నలుగురైదుగురు కలిసి పంచుకోవడం వల్లే ఈ ధరలు అదుపు తప్పాయనే విమర్శలు వస్తున్నాయి.అయితే, ఈ స్థాయి అద్దె ధరలు మార్కెట్ పరంగా సమర్థనీయమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణ ముంబై లాంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పోల్చదగ్గ ఇందిరానగర్ వంటి లొకేషన్లలో ఈ మాత్రం రేట్లు ఉండటం సహజమేనని వాదిస్తున్నారు. ఇక్కడ నివసించే వారి వార్షిక ఆదాయాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల పైమాటేనని గుర్తు చేస్తున్నారు.మరోవైపు రియల్ ఎస్టేట్ సమీకరణాలను తెరపైకి తెస్తూ.. "ప్రస్తుతం ఈ ఫ్లాట్ మార్కెట్ విలువ రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే అద్దె, కనీసం బ్యాంక్ వడ్డీ రేటులో సగం కూడా ఉండదు. అలాంటప్పుడు యజమానులు అద్దెలు పెంచడంలో తప్పు లేదు" అని ఇన్వెస్టర్ల కోణాన్ని కొందరు విశ్లేషించారు.మొత్తానికి బెంగళూరుతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గృహాల కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఐటీ కారిడార్లలో అద్దెలు సామాన్యుల నియంత్రణ తప్పుతున్నాయనడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త పద్ధతి! -
బెంగళూరుకు తప్పిన ఎబోలా భయం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరాన్ని వణికించిన ఎబోలా భయం తొలిగిపోయింది. ఇటీవల ఉగాండా నుండి వచ్చిన ఒక 28 ఏళ్ల మహిళకు ఎబోలా సోకిందన్న అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే, పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆమెకు ఎబోలా లేదని స్పష్టమైంది. దేశంలో ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.సందేహాల నుంచి ఉపశమనం వైపు..ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరుకు చేరుకున్న సదరు మహిళకు ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపించడంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆమెను వెంటనే బెంగళూరులోని ఎపిడెమిక్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. రక్త నమూనాలను పుణెకు పంపగా, ఫలితాలు నెగటివ్‌గా రావడంతో ఆందోళన వీడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.ప్రభుత్వ అప్రమత్తత, ప్రజలకు విజ్ఞప్తిఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, భారత్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎబోలాపై ఎటువంటి వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. అనవసర భయాందోళనలకు లోనుకావద్దని హెచ్చరించింది.ప్రయాణాలపై ఆంక్షలుప్రపంచవ్యాప్తంగా ఎబోలాను 'గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ'గా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంతో, భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దని కేంద్రం ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పటిష్టం చేయడంతో పాటు, ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. -
బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు మహిళ తరలింపు
బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఎబోలా వైరస్ ఇప్పుడు బెంగళూరును కలవరపెడుతోంది. ఉగాండా నుంచి వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నగరంలో ఆరోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది.విమానాశ్రయంలో ఏం జరిగింది?మే 23న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఉగాండా మహిళలో అలసట, నీరసం వంటి లక్షణాలను ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ముందుజాగ్రత్తగా ఆమెను వెంటనే ఇందిరానగర్‌లోని ఎపిడెమిక్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, వైద్యులు ఆమెను పర్యవేక్షిస్తున్నారు.పుణె ల్యాబ్‌కు నమూనాలుబాధిత మహిళ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి (ఎన్ఐవీ)కి పంపారు. ఎబోలా నిర్ధారణ కోసం ప్రోటోకాల్ ప్రకారం రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆమె విమానాశ్రయం నుంచి నేరుగా ఒక హోటల్లో బస చేసినప్పటికీ, ఒళ్లు నొప్పులు రావడంతో వెంటనే క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం.హై అలర్ట్‌లో కర్ణాటకఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో, కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. ఇందుకోసం బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్, ఇందిరానగర్ ఆసుపత్రులతో పాటు మంగళూరులో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించారు. -
సినిమా స్టైల్లో జైలు నుంచి ఎగ్జిట్ ఇచ్చిన జీవితఖైదీ
బెంగళూరు: ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలంటూ నకిలీ ఉత్తర్వులను చూపి ఓ ఖైదీ దర్జాగా విడుదలయ్యాడు. 8 ఏళ్ల తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన జీవితఖైదీ శంకర్ ఆర్ముగం కథ ఇది. 2001లో బెంగళూరు వద్ద శంకర్ ఆర్ముగం ముఠా ఓ వ్యక్తిని కిడ్నాప్, హత్య చేసింది. ఈ కేసు సుదీర్ఘ విచారణ తరువాత బెంగళూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శంకర్ ఆర్ముగంకు యావజ్జీవిత శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. దీంతో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో నుంచి బయటకు రావడానికి ఓ పథకం వేశాడు. అనారోగ్య కారణాల వల్ల విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ముద్ర, సంతకం ఉన్న నకిలీ రికార్డులను సృష్టించాడు. 2018 నవంబరు 13న రూ.10 వేల చలానా కట్టి కుటుంబ సభ్యులు అధికారులకు చెల్లించి నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపించారు. అధికారులు నిజమే అనుకుని అతనిని విడుదల చేశారు. ఆకాశవాణి లేఖతో తెలిసింది ఇటీవల జైళ్ల శాఖ డీజీపీకి గుర్తుతెలియని లేఖ వచ్చింది. శంకర్ ఆర్ముగం నకిలీ రికార్డుల గురించి ప్రస్తావించారు. దీంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు నుంచి అలాంటి విడుదల ఆదేశాలు రాలేదని స్పష్టమైంది. దీంతో అతని మీద స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేయగా, గాలింపు చేపట్టారు. సుప్రీం ఉత్తర్వులు అనగానే ఖైదీని ఎలా విడుదల చేశారు, ఇందులో జైలు అధికారులు కుమ్మక్కయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని జైలుశాఖ అధికారులు తెలిపారు. -
జింకను అమాంతం మింగిన కొండచిలువ.. వీడియో వైరల్
బెంగళూరు: మాండ్య జిల్లాలోని మళవల్లి తాలూకాలోని నెట్కల్ సమీపంలో బెంగళూరు వాటర్ బోర్డ్ నీటి పైప్‌లైన్ పక్కన ఉన్న అడవిలో ఒక భారీ కొండచిలువ జింకను మింగేసింది. భుక్తాయాసంతో అది కదలకుండా అక్కడే ఉండిపోయింది. స్థానిక యువకులు మొబైల్ ఫోన్లలో కొండచిలువను చిత్రీకరించారు. -
ఏడాది జైలుశిక్ష.. ఒక్కరోజుతో సరి
బెంగళూరు: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందుకు కారకులు పరారవుతుంటారు. కానీ ఓ డ్రైవరు గాయపడినవారిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు, మరింత పరిహారం ఇస్తానన్నందుకు హైకోర్టు శిక్షను తగ్గించింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పక్షికెర నివాసి, డ్రైవరు రియాజ్ అహ్మద్ కారులో వెళ్తూ ఓ బైకిస్టును ఢీకొనడంతో గాయపడ్డాడు. అతనిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిïÙటు దాఖలు చేశారు. స్థానిక కోర్టు రియాజ్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. తరువాతి రోజుల్లో రియాజ్ గాయపడి, చేతికి రాడ్ వేయించుకున్నాడు. డ్రైవరు వృత్తి చేయలేక కూలిపనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శిక్షను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి జస్టిస్ వీ.శ్రీషానంద విచారించారు. నిందితుని పరిస్థితిని చూసి, బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇస్తే శిక్ష తగ్గిస్తానని తెలిపారు. రూ. లక్ష ఇవ్వడానికి నిందితుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఏడాది కారాగార శిక్షను ఒక్కరోజుకు జడ్జి తగ్గించారు. జూన్ 30లోగా పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే, సంవత్సరం శిక్ష తప్పదని జడ్జి హెచ్చరించారు. -
పెంట్‌హౌస్ కోసం రూ.45 కోట్లు: ఎవరు కొన్నారంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ చిన్న కుమారుడు తారిఖ్ ప్రేమ్‌జీ, సెంట్రల్ బెంగళూరులో ఒక పెంట్‌హౌస్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.45.71 కోట్లు.తారిఖ్ ప్రేమ్‌జీ పెంట్‌హౌస్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ జాప్కీ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ద్వారా తెలిసింది. కార్పెట్ ఏరియా 7,065 చదరపు అడుగులు, సూపర్ బిల్ట్-అప్ ఏరియా 10,602 చదరపు అడుగులుగా ఉంది. చదరపు అడుగుకు సుమారుగా రూ. 43,123 చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది బెంగళూరులో జరిగిన అతిపెద్ద లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని జాప్కీ సహ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి అన్నారు. నగరంలో రిచ్మండ్ టౌన్, ఇంద్రానగర్, కోరమంగళ వంటి ప్రాంతాలతో పాటు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న హై-ఎండ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతోంది.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!అజీమ్ ప్రేమ్‌జీ భారతదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరు మాత్రమే కాకుండా.. ప్రముఖ దాతృత్వవేత్త కూడా. ఈయన స్థాపించిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు అందిస్తున్నారు. వీరి కుటుంబం నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. తారిఖ్ కూడా కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉంటూ, వివిధ బోర్డు స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను విమాన చివరి భాగం(తోక) తగలడంతో ఒక్కసారిగా కలవరం మొదలంది. ఢిల్లీ నుంచి నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతుండగా ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 181 ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం AI2651లో ఇది చోటు చేసుకుంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ అస్థిరమైన ల్యాండింగ్ ప్రయత్నం తరువాత పైలట్ గో-అరౌండ్ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి మళ్లీ గాల్లోకి ఎగిరి, మరోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయడం) చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చేస్తున్నప్పుడు విమాన చివరి భాగం నేలను తాకింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పీటీఐకి తెలిపారు.


