
వరస ఘటనలు బెంగళూరులో మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. తమకు భద్రత కరువైందని వాపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సహోద్యోగిణి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటనతో ఐటీ క్యాపిల్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కామపిశాచులకు అడ్డాగా మారుతోందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. అసలేం జరిగిందంటే..
బెంగళూరు: నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా సహోద్యోగిని టాయిలెట్‌లో రహస్యంగా వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఈ దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్‌లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే.. పక్కనున్న క్యూబికల్ ద్వారా ఏవో కదలికలు గమనించిన ఆమె అప్రమత్తమై గట్టిగా అరిచింది. దీంతో ఆమె కొలీగ్స్ అప్రమత్తమై అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తిని సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్న స్వప్నిల్ నాగేశ్ మాలి (28)గా గుర్తించారు.
ఈ ఘటనపై బాధితురాలు తొలుత హెచ్‌ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసింది. స్వప్నిల్ ఫోన్ పరిశీలించగా.. 30కి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు నమోదు అయిన నేపథ్యంలో.. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితుడిపై బీఎన్‌ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందించింది. సదరు ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపింది.
ఇటీవల బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డు మీద, మెట్రో రైళ్లలో జరిగిన ఉదంతాలు సీసీఫుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఆఫీసుల్లో.. అదీ ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ చోటు చేసుకోవడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
బెంగళూరులో ప్రధానంగా జరిగిన కొన్ని ఘటనలు..
- 2023 నవంబర్ 22 – మెట్రో స్టేషన్‌లో వేధింపులు
మెజెస్టిక్ మెట్రో స్టేషన్.. రద్దీ సమయంలో ఓ యువతిని వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి. బాధితురాలు సహాయం కోరినా ప్రయాణికులు స్పందించలేదు.
2024 జనవరి 27 – క్యాబ్‌లో వేధింపులు
కమ్మనహళ్లి వద్ద.. ఓ యువతి బుక్ చేసిన క్యాబ్‌లోకి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి వేధించారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు.
Woman molested in Bengaluru while she was out on a morning walk. The man fled the spot soon after and a case against him was registered. Efforts are on to nab him.#Bengaluru pic.twitter.com/k8xlSOvXK7
— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2024
కిందటి ఏడాది ఆగష్టులో.. మరో ఒంటరి మహిళపై చోటు చేసుకున్న వేధింపుల తాలుకా వీడియో ఇది.. Video Credits: Vani Mehrotra
- 2025 ఏప్రిల్ 4 – వీధిలో వేధింపులు (BTM లేఅవుట్)
సుద్దగుంటెపాళ్య, BTM లేఅవుట్ వద్ద తెల్లవారుజామున ఇద్దరు మహిళలు నడుస్తుండగా, ఓ వ్యక్తి వారిలో ఒకరిని వెనుక నుంచి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో రికార్డు, వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు నగరాల్లో సాధారణమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు, ఇది వేధింపులను ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు.
- 2025 మే 23న.. బెంగళూరు మెట్రో రైలులో మహిళలను అసభ్యరీతిలో రహస్యంగా చిత్రీకరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియా(ఇన్‌స్టా)లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు లభ్యం.
- 2025 జూన్ 22 మైలసంద్ర, బెంగళూరు శివారులో.. కిరాణా దుకాణానికి వెళ్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను రక్షించిన స్నేహితుడిపై కూడా దాడి జరిగింది.