
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది.

క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు.

పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో జులై 24న విడుదల కానుంది.














