breaking news
AM rathnam
-
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్థరాత్రే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అలాగే ఓవర్సీల్‌లోనూ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. హరిహర వీరమల్లు కథేంటి..? పవన్ కల్యాణ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.Stay strong thatha @AMRathnamOfl 🥲#HariHaraVeeeraMallu#DisasterHHVM pic.twitter.com/nlE8HfUCPP— Chintu Reddy (@CHINTUUU24) July 23, 2025 23 euros petti ocha, andar dengestunnar nen okkadne ee arachakam chudala? 😐lekapothe nen kuda dengestey money bokka ani baadapadala ardamkavatled #DisasterHHVM #HariHaraVeeeraMallu pic.twitter.com/o9FTUKVvk7— Single Groot (@aigroot0001) July 23, 2025 Horse Scenes Ee laptop Lone edit Chesaru Anukunta 🤣🤣Jyothi Krisna Em Direct Chesinav..Worst vfx in second half #hariharaveeramallu pic.twitter.com/SyOypIQTPh— News Telugu (@neduru_thiru) July 23, 2025 హరిహర వీరమల్లు చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. సినిమాలోని వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. పవన్ గుర్రపు స్వారీ సన్నివేశాలపై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అభిమానుల సైతం ఆట్టుకునేలా సినిమా లేదని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఉన్నంతలో కాస్త ఫస్టాఫ్ చూడవచ్చని చెబుతున్నారు. సెకండాఫ్ మొత్తం చెడగొట్టారని, క్రిష్ ఎందుకు బయటకు వచ్చాడు ఇప్పుడు అర్థమైందని పలువురు నెటిజన్స్ సెటైరికల్ ట్వీట్స్ పెడుతున్నారు.#HariHaraVeeraMallu is a lackluster period action drama, weighed down by an outdated and incoherent screenplay, further hampered by subpar technical quality! The first half is somewhat tolerable and includes a few well-executed sequences, such as the introductory block and the…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 హరిహర వీరమల్లు ఒక పేలవమైన పిరియాడికల్ యాక్షన్ డ్రామా. రొటీన్ స్క్రీన్‌ప్లే, టెక్నికల్‌గా చాలా పూర్‌గా ఉందంటూ ఓ నెటిజన్ కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. జౌరంగజేబు, వీరమల్లు పేరుతో చరిత్రను వక్రీకరించి తీశారని కొందరు అంటున్నారు. వీరిద్దరి మధ్య చరిత్రలో కనీసం ఒక్క పేజీ కూడా ఉండదు. కానీ, ఇలా ఏకంగా సినిమా తీసి ప్రజలను తప్పుదారి పట్టించడమే కదా అంటూ తెలుపుతున్నారు.Nenu fan ne but aa graphics kosam aa ra 5y teesukunnaru hatsoff to krish🙏🙏Andhariki ante best ichindhi ante kreemdifferences endhuku vachayo ardham ayindhi.Story complete ga change chesi Padesaru 2nd half...1st half ayyaka movie hit ayipoyindhi anukunna #HariHaraVeeraMallu— loki (@loki88255310283) July 23, 2025 నేను పవన్ కల్యాణ్ అభిమానినే.కానీ ఆ గ్రాఫిక్స్ కోసం 5 ఏళ్లు తీసుకున్నారంటేనే బాధగా ఉంది. క్రిష్‌కి హ్యాట్సాఫ్. అందరి కంటే ఆయనే బెస్ట్ ఇచ్చాడు. ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థం అయింది. సెకండాఫ్ కథ మొత్తం మార్చిపడేశారు. ఫస్టాఫ్ అయ్యాక మూవీ హిట్ అనుకున్నా.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Very good first half Second half first 40 mins avrg Last 40 mins are good !! Keeravani’s score is the heart of the film 🔥🔥🔥🔥 Kusthi fight & pre climax fights stand out ,Songs are good Vfx is below par !! Overall a good film with bad vfx #HariHaraVeeraMallureview pic.twitter.com/OirpOZznM7— HHVM Vinny 🦅🔥 (@Vinny_tweetz) July 23, 2025 ఫస్టాఫ్ కాస్త పర్వాలేదనిపించినా.. సెకండాఫ్‌లో మన సహనానికి పరీక్ష పెట్టినట్లు ఉంది. అయితే, చివరి 30 నిమిషాలు ఫ్యాన్స్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారనిపించింది. కుస్తీ ఫైట్, ప్రీక్లైమాక్స్ యాక్షన్ సీన్ బాగుంది. పాటలు బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ పని తీరు దారుణంగా ఉంది. ఓవరాల్‌గా ఇది పేలవమైన వీఎఫ్ఎక్స్ ఉన్న మంచి సినిమా అంటూ మరో నెటిజన్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.#HariHaraVeeraMallu Strictly Mediocre 1st Half! Apart from PKs presence, a few blocks came out well mainly the intro block from the title cards to PKs introduction sequence. Keervanis bgm is the lifeline so far. However, the screenplay has an outdated feel to it in many places.…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 ఫస్టాఫ్ మాములుగానే ఉంది. పవన్ పాత్రతో పాటు, కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి, ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ నుండి పీకే పరిచయ సన్నివేశం వరకు బాగుంది. అయితే, స్క్రీన్‌ప్లే చాలా చోట్ల పాత అనుభూతిని కలిగిస్తుంది. వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉంది. చాలా పాత్రలకు సరైన లిప్ సింక్ లేదు. పవన్ పాత్ర డబ్బింగ్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.VFX and CG are worst to the core 😤🤮🤣Ela ra asala ila, mari intha darunam ah 🫢🫣#HariHaraVeeraMalluPremiers #HHVM #hariharaveeramallu— Chay Reviews (@chay_reviews) July 23, 2025 -
నిర్మాత 'ఏఎం రత్నం'పై ఫిర్యాదు.. పాత బాకీలు చెల్లించండి
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు జులై 24న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక నోట్ విడుదలైంది. నిర్మాత ఏఎం రత్నం మీద రెండు వేర్వేరు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఫిర్యాదుల చేశాయి. ఈ మేరకు టీఎఫ్‌సీసీ ఒక నోట్ విడుదల చేసింది.ఏఎం రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమాకి సంబంధించి రూ. 2.6 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఏషియన్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. ఆపై ముద్దుల కొడుకు, బంగారం చిత్రాలకు సంబంధించి కూడా రూ.90 లక్షలు ఇవ్వాల్సి ఉందని మహాలక్ష్మీ ఫిల్మ్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే, నిర్మాతగా ఏఎం రత్నం నిర్మించిన సినిమా ‘హరి హర వీరమల్లు’ రిలీజ్‌కు ముందే తమ బాకీలు క్లియర్ చేయాలని ఆ సంస్థలు అభ్యర్థించాయి. ఈ విషంయలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు (నైజాం) సహకరించాలని కోరారు.#HHVM ఆక్సిజన్ సినిమా బకాయిల మీదఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ pic.twitter.com/FRN9ulQEJ6— devipriya (@sairaaj44) July 20, 2025 -
‘వీరమల్లు’కి బాలీవుడ్లో ప్రమోషన్సే లేవు.. కారణం పవన్ కల్యాణే!
పాన్ ఇండియా సినిమా అంటే..రిలీజ్‌కి రెండు మూడు నెలల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. దేశం మొత్తం తిరిగి ప్రచారం చేస్తారు. హీరోహీరోయిన్లతో కలిసి పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహిస్తారు. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కానీ పవన్ కల్యాణ్(pawan kalyan) తాజాగా సినిమా హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) విషయంలో మాత్రం అవేవి కనిపించడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నా.. ఆ స్థాయిలో మాత్రం ప్రమోషన్స్ లేవు. మరో ఐదు రోజుల్లో(జులై 24) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్‌లో వేగం పెరగలేదు. బాలీవుడ్లో ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. టాలీవుడ్లో తప్ప వేరే చోట ఈ సినిమా ప్రెస్ మీట్స్ కనిపించడం లేదు. ఇక హీరో గురించి అందరికి తెలిసిందే. ఆయన ప్రచార కార్యక్రమాల్లో మొత్తానికే పాల్గొనడం లేదు.హీరో ప్రమోషన్స్‌లో పాల్గొంటేనే ఆ సినిమా త్వరగా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సినిమా విడుదలకి ముందు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంత బిజీగా ఉన్నా సరే రిలీజ్ అయ్యే సినిమాకు కాస్త సమయం కేటాయిస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. స్టార్ హీరో, అందులోనూ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి.. నిర్మాత కూడా ఆయనను అడిగే సాహసం చేయడం లేదు. ఆయన ప్రమోషన్స్‌కి రాకపోవడం నష్టం అని తెలిసినా కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు.బాలీవుడ్లో ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం కూడా పవన్ కల్యాణే. ఆయన సమయం కేటాయించకపోవడం వల్లే బాలీవుడ్లో ప్రమోషన్స్ చేయడం లేదట. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా చిత్ర నిర్మాతనే చెప్పారు. ‘బాలీవుడ్లో ఈవెంట్ పెట్టి సినిమాను ప్రమోట్ చేయాలని మాకూ ఉంది. కానీ కుదరడం లేదు. పవన్ కల్యాణ్ బాగా బిజీ అయిపోయారు. ఆయన వచ్చి ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమే. హీరో లేకుండా అక్కడ ఏ ఈవెంట్ చేసినా.. పెద్దగా ఉపయోగం ఉండదు. నేను ఒక్కడినే వెళ్తే అక్కడకు ఎవరు వస్తారు? అందుకే బాలీవుడ్లో ప్రమోషన్స్ చేయడం లేదు. నేనే వెళ్లి అక్కడ(ముంబై) ఒక ప్రెస్ మీట్ పెట్టి వద్దాం అనుకుంటున్నాను’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. ‘నిర్మాత చెప్పింది కూడా నిజమే. సినిమా హీరో హీరోయిన్లు లేకుండా ఈవెంట్ నిర్వహిస్తే..అది జనాల్లోకి వెళ్లడం కష్టమే. పవన్ కల్యాణ్ ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడం సినిమాకు ఎంతో కొంత నష్టమే’ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
'హరిహర వీరమల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రకటన
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను వేకర్స్ ఫైనల్ చేశారు. జులై 24న పాన్ ఇండియా రేంజ్‌లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.గతంలో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు. అప్పుడు సినిమా వాయిదా పడటంతో ఈ కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా విశాఖను ఎంచుకున్నారు. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. -
'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ఎట్టకేలకు విడుదల
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'వీరమల్లు' ఎట్టకేలకు వచ్చేశాడు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో జులై 24న విడుదల కానుంది. -
యానిమల్ ఎఫెక్ట్..'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ పాత్ర ఎలా ఉండబోతుందంటే..
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 3న ట్రైలర్ ఆవిష్కరణ జరగనుంది.'హరి హర వీరమల్లు' చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అలాగే పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇక 'యానిమల్' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. 'హరి హర వీరమల్లు'లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, 'యానిమల్'లో బాబీ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు'లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు.బాబీ డియోల్ గురించి జ్యోతి కృష్ణ ఇలా అన్నారు.. "యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని జ్యోతి కృష్ణ తెలిపారు. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాబీ డియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం.. ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.యానిమల్ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్డమ్ చూశారు. ఆ స్టార్డమ్ కి న్యాయం చేయడానికి మరియు ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. "నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు, బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం" అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
'హరిహర వీరమల్లు' బడ్జెట్ ఎంతో చెప్పిన నిర్మాత
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu) వాయిదా పడటం ఇక లాంఛనమే అని చెప్పవచ్చు. ఈ మూవీ జూన్ 12న విడుదల కావాల్సి ఉండగ పలు కారణాల వల్ల విడుదలకు బ్రేకులు పడ్డాయి. త్వరలో అధికారికంగా కొత్త రిలీజ్ తేదీతో ప్రకటన రావచ్చని సమాచారం. సుమారు 5 ఏళ్లకు పైగా ఈ మూవీ కోసం నిర్మాత ఏఎం రత్నం పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే వడ్డీల వల్ల బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు.విడుదల వాయిదాకు కారణం ఏంటి..?హరిహర వీరమల్లు విడుదలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇండస్ట్రీలో ఉన్న మాట. ముంబైకి చెందిన ప్రముఖ ఫైనాన్స్ సంస్థలకు చెల్లించాల్సిన డబ్బు క్లియరన్స్ చేస్తే తప్ప సినిమా విడుదల కాదనేది చిత్ర పరిశ్రమలోని వారికి తెలిసిన వాస్తవం. ఇప్పటికిప్పుడు అంత డబ్బు క్లియర్ చేయాలంటే సినిమా థియేటర్ హక్కులు మొదట విక్రయించాలి. కానీ, హరిహర వీరమల్లును కొనేవారు ఎవరూ లేరు. అందుకు ప్రధాన కారణం నిర్మాత ఏఎం రత్నం చెబుతున్న రేటు పట్ల ఎగ్జిబీటర్స్, బయ్యర్లు ఆమోదయోగ్యంగా లేరని టాక్. తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్ల వరకు థియేటర్ రైట్స్ నుంచి రావచ్చు. కానీ, నిర్మాత క్లియర్ చేయాల్సిన ఫైనాన్స్ ఎంత అనేది చెప్పలేం. ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో ఓటీటీ నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఇప్పటికే వారు ముందు కుదుర్చుకున్న ఢీల్లో రూ. 5 కోట్లకు పైగానే కోత పెట్టారని సమాచారం. ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నీ సెటిల్ కావాలంటే పవన్ కల్యాణ్ దిగిరావాల్సి ఉంటుంది. సినిమా పంపిణీ చేయడంలో ప్రముఖంగా వినిపించే పేర్లు దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రీ మూవీస్, సితార వంటి వారితో ఆయన లేదా తన తరఫు వారు ఎవరైనా చర్చలు జరిపితే హరిహర వీరమల్లుకు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ వుంది. లేదంటే ఆ ఫైనాన్స్ సంస్థలకు పూర్తిగా డబ్బు అయినా చెల్లించాల్సి ఉంటుంది.'వీరమల్లు' బడ్జెట్హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంత బడ్జెట్ పెట్టారని నిర్మాత ఏఎం రత్నంను మీడియా వారు ప్రశ్నంచగా ఆయన ఇలా చెప్పారు. ' ఈ సినిమా కోసం నా కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ పెట్టాను. మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో వడ్డీలు కూడా బాగా పెరిగాయి. అందరూ రూ. 200 కోట్ల బడ్జెట్ సినిమా అనుకుంటున్నారు. కానీ, అంతకు మించే ఈ మూవీ కోసం ఖర్చు చేశాం. సినిమా మీద నమ్మకంతోనే బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు.' అని నిర్మాత అన్నారు. బడ్జెట్ అంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ కావడంతో ఈ మూవీకి సంబంధించి తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటున్నారని తెలుస్తోంది. -
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ కోసం వేదిక ఫైనల్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక ఫైనల్ అయిపోయింది. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానున్నడంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక కోసం సిద్ధమవుతోంది. జూన్ 8న ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈమేరకు తాజాగా స్వీ యూనివర్సిటీ రిజిస్టార్కు మెగా సూర్య ప్రొడక్షన్ లేఖ రాసింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే హరిహర వీరమల్లు ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెన్సారు కోసం కాపీ కూడా రెడీ అయిపోయింది. తిరుపతిలో హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8న తారకరామా స్టేడియంలో నిర్వహించడానికి అనుమతులు కోసం దరఖాస్తు. ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టార్ కు లేఖ రాసిన మెగా సూర్య ప్రొడక్షన్. అభిమానులు భారీగా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయనున్న మూవీ టీమ్. చాలా కాలం తరువాత పవన్… pic.twitter.com/4g8fxrX64F— ChotaNews App (@ChotaNewsApp) June 3, 2025 -
తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించిన ఏఎం రత్నం
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపంథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఆశ్రయించారు. పవన్ కల్యాణ్ సినిమాకు ఎపీలో టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతి ఇవ్వాలంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు ఆయన వినతి పత్రం అందించారు. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి త్వరలో సంప్రదించనుంది. ఆ సమయంలో 'హరిహర వీరమల్లు' సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అదనపు షోలు రన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరనుంది. 'హరిహర వీరమల్లు'కు టికెట్ల రేట్ల పెంపు కోసం పవన్ కల్యాణ్ కొత్త స్కెచ్ వేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా నిర్మాత ఏఎమ్ రత్నం ద్వారా తన సినిమా కోసం టికెట్ ధరలు పెంపు, అదనపు షోల అనుమతి కోసం ప్లాన్ అమలు చేశారు. పవన్ సూచన మేరకే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏఎమ్ రత్నం కలిశారని అర్థం అవుతుంది. డైరెక్ట్‌గా తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటే విమర్శలొస్తాయని ఫిల్మ్ చాంబర్ ద్వారా పవన్ ఇలా స్కెచ్ వేశారని చెప్పవచ్చు. నేడో, రేపో ఫిల్మ్ చాంబర్ నుంచి కొందరు ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్నారు. పవన్ తన సినిమా కోసం థియేటర్స్పై తనిఖీలు చేయించారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాకు ఇలా లబ్ధి పొందే ప్లాన్‌ను ఆయన అమలు చేశారు. -
అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా.. ఎట్టకేలకు మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు పాటలు రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా త్వరలో టీమ్ అంతా మీడియా ముందుకొస్తుంది. మూవీ కోసం అభిమానులు కూడా మరీ కాకపోయినా కొంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతలోనే చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే మాటలు వినిపించాయి. దీనిపై ఆయన టీమ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)దాదాపు రెండు దశాబ్దాలుగా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ఏఎమ్ రత్నం.. పవన్‌తో 'హరిహర వీరమల్లు' తీశారు. దాదాపు ఐదేళ్లుగా సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం.. ఇబ్బందులు దాటుకుని ఈ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం.. శుక్రవారం ఉదయం బీపీ ఎక్కువ కావడంతో కళ్లు తిరిగి కింద పడ్డారని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని తొలుత కొన్ని వార్తలొచ్చాయి. దీంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చేర్పించారని, ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారని వినిపించింది.అయితే ఇవన్నీ కూడా కేవలం పుకార్లేనని, ఏఎమ్ రత్నం ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. మరో నిర్మాత ఏ.దయాకర్ కూడా ఈ విషయమై ట్వీట్ చేశారు. అన్నయ్య ఏఎమ్ రత్నం అనారోగ్యం గురించి వస్తున్న రూమర్స్ నిజం కాదని, ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లని వ్యాపింపజేయొద్దని ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: NIA అదుపులో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్) -
నా చిత్రాల్లో నటించాకే వారందరూ రాజకీయాల్లోకి ఎంట్రీ: ఏఎం.రత్నం
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్‌లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు. నటుడు శరత్‌కుమార్, విజయ్‌కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్‌కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్‌కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు. -
'హరి హర వీరమల్లు' అసుర హననం సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా నుంచి 'అసుర హననం' పాటను తాజాగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన నుంచి విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏఎమ్ రత్నం నిర్మించారు. సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు.ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సుమారు 5 ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ పనులు కొనసాగాయి. -
'హరి హర వీరమల్లు' విడుదలలో మార్పులు.. ప్రకటించిన మేకర్స్
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ సింగిల్ హీరోగా నటించిన చిత్రం విడుదల కాక చాలారోజులు అయింది. దీంతో ఆయన నటించిన కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.పవన్ అభిమానులలు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌పై ప్రకటన విడుదలైంది. ఒక పోస్టర్‌తో పాటుగా మే 9న ఈ చిత్రం విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్ వీడియోను కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేశారు. గణేష్ మాస్టర్స్ కొరియోగ్రఫీ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. 2023లో విడుదలైన ‘బ్రో’ తర్వాత దాదాపు రెండేళ్లకు ‘హరి హర వీరమల్లు’తో పవన్ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయని నిర్మాత ఏఎం రత్నం అన్నారు.పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ మూవీని క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 మాత్రం మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా ఆ సమయంలో విడుదల చేశారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం జరిగింది. దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటించారు. -
అంచనాలకు ఏమాత్రం తగ్గదు: ఏఎం రత్నం
‘‘హరి హర వీరమల్లు’ సినిమా అద్భుతంగా వస్తోంది. పవన్ కల్యాణ్ అభిమాఠ్నం అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది.కాగా ఫిబ్రవరి 4న ఏఎం రత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్, నా కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి, బంగారం’ సినిమాలు హిట్‌గా నిలిచాయి. మూడో సినిమాగా ‘హరి హర వీరమల్లు’ రూపొందుతోంది. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా మాదే. 2023లో విడుదలైన ‘బ్రో’ తర్వాత దాదాపు రెండేళ్లకు ‘హరి హర వీరమల్లు’తో పవన్ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది’’ అని తెలిపారు. -
'హరి హర వీరమల్లు' విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ మళ్లీ పట్టాలెక్కింది. ఈ క్రమంలోనే విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుమారు నాలుగేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయవాడలో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్‌ను మేకర్స్ వేశారు. దీంతో నేటి నుంచి 'హరి హర వీరమల్లు' కొత్త షెడ్యూల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్‌ను క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 మాత్రం వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్,నోరాహి ఫతేహి, నిధి అగర్వాల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలక పాత్రలలో నటించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
-
‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పేలా..
రవి వర్మ, సంజనా సింగ్, అలోక్ జైన్, మనీషా దేవ్, జీవ ముఖ్య పాత్రల్లో చౌడప్ప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్’. సోమిశెట్టి హరికృష్ణ సమర్పణలో ఎంసీ రావు, జి. గోపాల్, ఎమ్.వి మల్లికార్జునరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, మణి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలకానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత ఏయం రత్నం విడుదల చేశారు. చౌడప్ప మాట్లాడుతూ– ‘‘దేశానికి పట్టిన చీడ పురుగులను ఏరేసే ప్రయత్నంలో బుద్ధుడు కూడా రుద్రుడౌతాడు. ‘బుద్ధం శరణం గచ్చామి’ కాదు.. ‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పే సినిమా ఇది. రవి వర్మ కొత్తవాడైనా బాగా చేశాడు’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. ప్రేక్షకుల ఆదరణ కావాలి’’ అన్నారు రవి వర్మ. -
పవన్ 27: ప్రీలుక్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మరో సర్ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా పవన్ 27వ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. పవన్ కల్యాణ్- క్రిష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ చేతికి బంగారు రంగులో ఉన్న కడియంతో పాటు రెండు వేళ్లకు ఉంగరాలు కూడా ఉన్నాయి. అలాగే నడుముకు ఎర్ర కండువా కట్టుకున్నారు. దానికి గరుత్మంతుడి బొమ్మకూడా ఉంది. ఈ వేషధారణ చూస్తుంటే ఇదేదో రాబిన్‌హుడ్ పాత్రలా అనిపిస్తోంది. (ఆ వార్త నా మనసును కలిచివేసింది: పవన్) ఈ చిత్రం గురించి క్రిష్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్" అని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కానీ లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. సినిమా కథ విషయానికొస్తే మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకోనుందని భోగట్టా. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్ చిత్రంలో రామ్‌చరణ్?) -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని
‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ప్రెసిడెంట్‌గా ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారునిగా నిర్మాత ఏ.యమ్ రత్నం, వైస్ ప్రెసిడెంట్‌గా నిర్మాత గురురాజ్, రంగా రవీంద్ర గుప్తా, అలీ భాయ్, సెక్రెటరీలుగా కె.వి. రమణా రెడ్డి, కె .సత్యనారాయణ , ఆర్గనైజయింగ్ సెక్రెటరీలుగా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్ సెక్రెటరీలుగా సతీష్, నాగరాజు గౌడ్, జి. శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా ఈసీ మెంబర్స్‌గా వి. కృష్ణ రావు, హెచ్. కృష్ణ రెడ్డి, అలెక్స్, ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి. రాజేష్, ఎమ్. వెంకటేష్, ముఖావర్ వలి, మహాలక్ష్మి, బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రెసిడెంట్ పి.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల కోసం స్థలం కేటాయిస్తాం. కల్చరల్ సెంటర్ కోసం స్థల కేటాయింపుతో పాటు 24 శాఖల్లోని వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని తీర్మానించుకున్నాం’’ అన్నారు. -
బాగున్నా బాగా లేదనడం న్యాయం కాదు
‘‘ సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయింది. సినిమా షో కంప్లీట్ అయ్యే లోపే సినిమా రిజల్ట్‌ను తేల్చేస్తున్నారు. పాత రోజుల్లో సినిమా రివ్యూలను వారం లేదా పది రోజుల తర్వాత రాసేవారు. ఇప్పుడు షో తర్వాతే రేటింగ్‌లు ఇచ్చేస్తున్నారు. బాగాలేని సినిమాని బాగుందని రాయమని అడగం. కానీ, బాగున్న సినిమాని బాగాలేదని రాయడం న్యాయం కాదు. ఇది నా సొంత అభిప్రాయం’’ అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎస్. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. గురువారం విడుదల అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏ.ఎం. రత్నం విలేకర్లతో చెప్పిన విశేషాలు... ► కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఉన్న సినిమా ‘ఆక్సిజన్’. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మౌత్ టాక్ బాగుంది. కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ప్రజెంట్ డేస్‌లో సందేశాత్మక చిత్రాలకు ప్రేక్షకాదరణ తగ్గింది. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు ఎంటర్టైన్ చేస్తూనే ప్రేక్షకులకు మంచి మేసేజ్ ఇచ్చాయి. సినిమాలు చూసి ప్రజలు సడన్‌గా మారతారని అనుకోను. వారు ఆలోచిస్తే చాలు అన్నదే మా ప్రయత్నం. అప్పట్లో ‘కర్తవ్యం’ సినిమా చాలామంది మహిళలను ఇన్స్పైర్ చేసింది. ► ‘ఆక్సిజన్’ ఏ లాంగ్వేజ్‌లో అయినా బాగుంటుంది. ‘హిందీలో తీద్దాం. అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు చూపిద్దాం’ అని నా ఫ్రెండ్ అన్నాడు. సినిమా రిలీజ్ కాకముందు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌కు చూపిద్దామనుకున్నా. తమిళ రీమేక్ ఆలోచన ఉంది. పవన్ కల్యాణ్‌తో ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్ అంటే.. అది ఆయనే డిసైడ్ చేస్తారు. ఇకపై తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నాను. -
థమన్ తొలిసారి..!
నటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత సంగీత దర్శకుడు మంచి విజయాలు సాధిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. అతి తక్కువ కాలంలో 50కి పైగా సినిమాలకు సంగీతం అందించిన తమన్ దాదాపు ఈ జనరేషన్ స్టార్ హీరోలందరితో కలిసి పనిచేశాడు. అయితే పవర్ స్టార్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ మాత్రం ఈ యువ సంగీత దర్శకుడికి రాలేదు. అయితే త్వరలోనే థమన్‌కు ఆ కోరిక కూడా తీరనుంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్. ఈ సినిమా తరువాత ఏఎమ్ రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీత అందించనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు థమన్. పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించటం చాలా ఆనందంగా ఉందన్నాడు థమన్.Hello guys Very Very happy to announce my next film with our power star @PawanKalyan gaaru dir by dear #neason Produced by Rathnam Sir— thaman ss (@MusicThaman) 7 November 2016 -
మరో తమిళ దర్శకుడితో పవన్
సర్థార్ గబ్బర్‌సింగ్ రిజల్ట్‌తో ఆలోచనలో పడ్డ పవన్ కళ్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన ఫార్ములాను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు తమిళ దర్శకులతోనే కలిసి పనిచేశాడు. అంతేకాదు పవన్‌కు పవర్ స్టార్ ఇమేజ్ను కట్టబెట్టిన ఖుషి లాంటి సినిమాలు రీమేక్‌గా తెరకెక్కినవి. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా విషయంలో ఈ రెండు ఫార్ములాలను ఉపయోగిస్తున్నాడు పవన్. తన ప్రతి సినిమాకు గ్యాప్ తీసుకునే పవన్, ఈ సారి మాత్రం అలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. అయితే ఈ సినిమా అజిత్ హీరోగా తమిళ్లో ఘనవిజయం సాధించిన వీరం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ లుక్స్, స్టైల్ కూడా ఈ టాక్‌కు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ సినిమా తరువాత కూడా పవన్ మరో తమిళ దర్శకుడితో రీమేక్ సినిమాకే అంగీకరించాడట. అజిత్ హీరోగా తెరకెక్కిన వేదలం సినిమాను జిల్లా ఫేం నేశన్ దర్శకత్వంలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయినా.., పవన్ హీరోగా వేదలం రీమేక్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు నేశన్. -
పవన్ హీరోగా వేదలం రీమేక్
సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో వార్తలు ఊపందుకున్నాయి. ఎస్ జె సూర్య డైరెక్షన్ లో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపించినా, పవన్ ఆ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడని అర్థమై పోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అజిత్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు యాక్షన్, హీరోయిజం పుష్కలంగా ఉన్నాయి. అందుకే తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన ఎ ఎమ్ రత్నం తెలుగులోనూ పవన్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్‌తో రభస సినిమాను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడంటూ వచ్చిన వార్తలను రత్నం ఖడించాడు. పవన్ కళ్యాణ్‌తో వేదలం రీమేక్ చేస్తున్న మాట నిజమే కాని, ఆ సినిమాకు సాంకేతిక నిపుణులను, నటీనటులను ఇంత వరకు ఫైనల్ చేయలేదని తేల్చేశాడు. దీంతో ఈ సినిమా ఎవరి డైరెక్షన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!
‘‘నాన్నగారు రూపొందించిన సినిమాలకు ఏయమ్ రత్నంగారు పనిచేశారు. అప్పటినుంచి ఆయన పరిచయం. కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో మంచి విజయవంతమైన చిత్రాలు తీశారు. అజిత్‌తో ఇది మూడో సినిమా. తమిళంలో లాగే తెలుగులో కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎన్నై అరిందాల్’ను ‘ఎంతవాడు గానీ...’ పేరుతో ఎ.ఎమ్.రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకుడు. ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, హీరో గోపీచంద్‌కు అందజేశారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ -‘‘ఏయమ్ రత్నంగారు నిర్మించిన ‘జెంటిల్‌మ్యాన్’ చూసి ఆయనకు అభిమానిగా మారాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయన తెలుగులో మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఏయం రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు.