'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ కోసం వేదిక ఫైనల్‌ | Hari Hara Veera Mallu pre release Details Out Now | Sakshi
Sakshi News home page

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ వివరాలు ఇవే

Jun 3 2025 9:01 AM | Updated on Jun 3 2025 10:14 AM

Hari Hara Veera Mallu pre release Details Out Now

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక ఫైనల్‌ అయిపోయింది. జూన్‌ 12న ఈ చిత్రం విడుదల కానున్నడంతో ఇప్పటికే ప్రమోషన్స్‌ కార్యక్రమాలు స్పీడ్‌ అందుకున్నాయి. చెన్నైలో ఇటీవల సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించిన టీమ్‌ ఇప్పుడు ప్రీ రిలీజ్‌ వేడుక కోసం సిద్ధమవుతోంది. జూన్‌ 8న ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈమేరకు తాజాగా స్వీ యూనివర్సిటీ రిజిస్టార్‌కు మెగా సూర్య ప్రొడక్షన్ లేఖ రాసింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్‌, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు  క్రిష్‌ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే హరిహర వీరమల్లు ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెన్సారు కోసం కాపీ కూడా రెడీ అయిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement