తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..! | Rajinikanth Gifts To chennai Muncipal Working women Goes Viral | Sakshi
Sakshi News home page

Rajinikanth: తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!

Feb 3 2026 4:31 PM | Updated on Feb 3 2026 4:42 PM

Rajinikanth Gifts To chennai Muncipal Working women Goes Viral

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు.  చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు.  ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.

అసలేం జరిగిందంటే..

చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు.  ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ‌ ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్‌గా  అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.

అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్ బ్యాంక్‌ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది.  పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement