ఓటీటీలో 'మన శంకరవరప్రసాద్ గారు'.. వీడియో విడుదల | Mana Shankara Vara Prasad Garu Movie ott streaming video | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'మన శంకరవరప్రసాద్ గారు'.. వీడియో విడుదల

Feb 3 2026 1:25 PM | Updated on Feb 3 2026 1:40 PM

Mana Shankara Vara Prasad Garu Movie ott streaming video

చిరంజీవి- అనిల్‌ రావిపూడి హిట్‌ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.  ఈమేరకు తాజాగా ఒక వీడియోతో ప్రముఖ ఓటీటీ సంస్థ పంచుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటన వచ్చేసింది.

మన శంకరవరప్రసాద్ గారు చిత్రం త్వరలో జీ5లో విడుదల కానున్నట్లు ఒక వీడియోను పంచుకున్నారు. అయితే ఓటీటీ వర్షన్‌లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్‌, మరాఠిలో విడుదల కానుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో చిరుకు ఫ్యాన్స్‌ ఉండటం వల్లే పలు భాషల్లో రిలీజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారికంగా స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరి 11న  ఓటీటీలోకి మన శంకరవరప్రసాద్ గారు రావచ్చని టాక్‌ ఉంది.

‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేశ్‌ ముఖ్య పాత్ర చేశారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement