టాలీవుడ్‌లో నాని నటించిన ‘దసరా’ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్‌లోనే మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఇదే మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానితో రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ ముందుగా అనుకున్నదాని కంటే బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఇండస్ట్రీలో ప్రతి నటుడికి ఒక మార్కెట్ ఉంటుంది. దానిని బట్టే వారికి రెమ్యునరేషన్ ఉంటుందని తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద నాని సినిమాల మార్కెట్ రూ. 100 కోట్లకు పైగానే ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఓటీటీ, టెలివిజన్ మార్కెట్‌లో నానికి మంచి డిమాండ్ ఉండటంతో ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రూ. 75 కోట్ల వరకు ఢీల్ సెట్ అయినట్లు టాక్ ఉంది. ఎటుచూసినా సరే నాని సినిమాలకు ఫైనల్ మార్కెట్ విలువ రూ. 200 కోట్ల మేరకు ఉంటుంది. అది కూడా సినిమా భారీ హిట్ అందుకుంటేనే.. ఒకవేళ సినిమాపై ఏమాత్రం టాక్ మారిందా ఈ నంబర్స్ అన్నీ తారుమారు అయిపోతాయి.
టైర్- 2 హీరోల్లో చాలా ఎక్కువ
ది ప్యారడైజ్ సినిమాకు మొదట బడ్జెట్ రూ.150 కోట్లు అనుకుంటే.. ఇప్పుడు రూ.200 కోట్లు దాటేసిందట. టైర్- 2 హీరోల్లో ఈ బడ్జెట్ చాలా ఎక్కువని ఇండస్ట్రీ సూచిస్తుంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ సినిమా దసరా భారీ హిట్ కావడంతో ది ప్యారడైజ్‌పై నిర్మాత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారట. ఆపై సినిమా కూడా చాలా బలంగా ఉండటంతో ఖర్చ ఎంతైనా సరే అనేంత రేంజ్‌లో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ గురించి వచ్చిన పుకార్లు నిజమైతే.., ఈ సినిమా సురక్షితమైన స్థానంలో ఉండాలంటే అనూహ్యమైన భారీ విజయాన్ని అందుకోవాల్సిందే.. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవని ముందే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే, నాని తన కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉంది, కానీ నిర్మాణ జాప్యాల కారణంగా వాయిదా పడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో జడల్ అనే పవర్‌ఫుల్ రా రస్టిక్ పాత్రలో నాని కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.
నిర్మాత చెరుకూరి సుధాకర్ గురించి
చెరుకూరి సుధాకర్ సినిమాల పట్ల ఆసక్తితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి 2016లో రన్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, విరాట పర్వం, వంటి సినిమాలను నిర్మించారు. 2023లో విడుదలైన దసరా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న ఆయన రీసెంట్‌గా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మంచి లాభాలు అందుకున్నారు. అయితే, నిర్మాతగా రంగబలి, రామారావు ఆన్‌డ్యూటీ వంటి డిజాస్టర్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. ది ప్యారడైజ్ మూవీ తరవఆ మెగాస్టార్ 157వ సినిమాను ఆయన నిర్మించనున్నారు. అయితే, ది ప్యారడైజ్ మూవీ విషయంలో నిర్మాత చెరుకూరి సుధాకర్ భారీ రిస్క్ చేస్తున్నారని


