ది ప్యారడైజ్ రిలీజ్‌పై క్లారిటీ..పెద్ది ఇంకా సస్పెన్స్‌లోనే! | Paradise Movie Release Date Clarity Ram Charan Peddi Date in Suspence | Sakshi
Sakshi News home page

ది ప్యారడైజ్ రిలీజ్‌పై క్లారిటీ..పెద్ది ఇంకా సస్పెన్స్‌లోనే!

Feb 2 2026 11:03 PM | Updated on Jun 18 2026 3:13 PM

Paradise Movie Release Date Clarity Ram Charan Peddi Date in Suspence

నాని, రామ్‌ చరణ్‌ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్‌లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్‌నే తీసుకుంటున్నారు.  

మరోవైపు రామ్‌ చరణ్‌ "పెద్ది" సినిమా రిలీజ్‌ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్‌తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్‌ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement