ఆ ముగ్గురి వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నా: బ్రహ్మనందం | Brahmanandam comments on birthday celebrations | Sakshi
Sakshi News home page

Brahmanandam: ఆ ముగ్గురి వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నా: బ్రహ్మనందం

Feb 2 2026 8:55 PM | Updated on Feb 2 2026 8:58 PM

Brahmanandam comments on birthday celebrations

టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం తన 70వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనదైన కామెడీతో సినీ ప్రియులను దశాబ్దాలుగా అలరించిన బ్రహ్మనందం 42 ఏళ్లుగా వెండితెరపై అలరిస్తున్నారు. తాజాగా తన 70వ బర్త్ డే వేడుకలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.

ఇన్నేళ్లుగా తాను నటుడిగా కొనసాగుతున్నానంటే అదంతా ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలే కారణమని అన్నారు. నా సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నందుకు తెలుగు కళామతల్లికి శిరస్సు వంచి పాదాభినందనాలు చేస్తున్నానన్నారు. ఇన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు గొప్పతనం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని బ్రహ్మనందం తెలిపారు.

నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కీర్తిశేషులు జంధ్యాల గారు, చిరంజీవి, రామానాయుడే కారణమని బ్రహ్మనందం అన్నారు. నాలో టాలెంట్‌ను గుర్తించి చంటబ్బాయి సినిమాలో నన్ను చిరంజీవి పరిచయం చేశారు. ఆ తర్వాత జంధ్యాల నాకు ఆహా నా పెళ్లంట మూవీలో అవకాశమిచ్చారని తెలిపారు. ఇన్ని వందల సినిమాలు చేయడంలో నా గొప్పతనం ఏమీ లేదన్నారు. మీ అందరి ఆదరణ, ప్రేమ వల్లే ఈ బ్రహ్మనందం ఇక్కడ ఉన్నారని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement