బూతు పాట : సంజయ్‌ దత్‌, నోరాఫతేహి, టీమ్‌కు మరో షాక్‌ | KD The Devil NCW summons Nora Fatehi Sanjay Dutt and team | Sakshi
Sakshi News home page

బూతు పాట : సంజయ్‌ దత్‌, నోరాఫతేహి, టీమ్‌కు మరో షాక్‌

Mar 19 2026 2:58 PM | Updated on Mar 19 2026 3:28 PM

KD The Devil NCW summons Nora Fatehi Sanjay Dutt and team

సాక్షి, ఢిల్లీ:  'కేడీ: ది డెవిల్'(KD: The Devil) పాట వివాదంలో  మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  అశ్లీల సాహిత్యం అంటూ   రేగిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) మహిళా కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది.

ఎన్‌సీడబ్ల్యూ సమన్లు
ఈ పాటలో అశ్లీలత ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్‌సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ చిత్రం బృందంతోపాటు, బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్, నోరా ఫతేహికి  జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.ఈ పాటలో అభ్యంతరకరమైన ,అశ్లీల సాహిత్యం, అలాగే వీక్షకులను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అనుచితమైన అవాంఛనీయ చిత్రాలు ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన అనేక ఫిర్యాదుల  నేపథ్యంలో ఎన్‌సీడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. పాట రచయితలు, నిర్మాతల నుండి వివరణ కోరింది.

ఈ సాంగ్‌  విడుదల కాగానే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు  సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పాటలోని సాహిత్యం, కొరియోగ్రఫీ చాలా అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. అటు బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. అశ్లీలతలో బాలీవుడ్  అన్ని హద్దులు దాటేసిందని తీవ్రంగా మండిపడ్డారు.

మరోవైపు, చిత్ర దర్శకుడి భార్య రక్షిత ఈ పాటను సమర్థించారు. గతంలో కూడా ఇలాంటి మాస్ సాంగ్స్ వచ్చాయని, ఇది కేవలం సినిమా సృజనాత్మకతలో భాగమేనని  దీన్ని సమర్ధించుకున్నారు.

ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వినోద రంగంలో సృజనాత్మక స్వేచ్ఛ ,బాధ్యతల పరిమితులపై చర్చను రేకెత్తించింది.ఈ పాటలు భారతీయ సినిమాలో దీర్ఘకాలంగా ఉన్న ధోరణులలో భాగమని కొందరు వాదిస్తుండగా, హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్‌ను నిరోధించడానికి మరింత కఠినమైన నిబంధనలు అవసరమని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్‌సీడబ్ల్యూ (NCW) చర్య వల్ల వినోద రంగంలో కంటెంట్ నియంత్రణపై విస్తృత పరిణామాలు చోటుచేసుకోవచ్చని మరికొందరి అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement