breaking news
song
-
శర్వానంద్ బైకర్ మూవీ.. మరో క్రేజీ సాంగ్ రిలీజ్
శర్వానంద్ హీరోగా వస్తోన్న రేసింగ్ చిత్రం బైకర్. ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, ఈపీఐక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ విడుదల కానుంది.ఇప్పటికే ఓ సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. జిద్దీ జిద్దీ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఈ పాటను కంపోజ్ చేసిన జిబ్రాన్ తానే ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. -
బ్యాండ్ మేళం: రామ్ మిరియాల పాడిన బ్రేకప్ సాంగ్ రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.బ్రేకప్ సాంగ్'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్ సాంగ్ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ చేకూర్చగా రామ్ మిరియాల ఆలపించాడు.సినిమాబ్యాండ్ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. 24 గంటల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. వ్యూస్ పరంగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లింది.తాజాగా రిలీజైన రైరై రారా అంటూ సాగే సాంగ్ సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 31 మిలియన్ల వ్యూస్, 5లక్షల 30వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. -
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది.తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.When grit finds its voice 🔥When grace finds its moves 🤩#Peddi Second Single #RaiRaiRaaRaa (Telugu) Out Now❤️🔥▶️https://t.co/yrdKeTtKJ9#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/dHIWPRp8hR— PEDDI (@PeddiMovieOffl) March 2, 2026 -
'వింటారా సరదాగా' ఓ మెలోడీ సాంగ్
ఈ ఏడాది సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు' సినిమాతో సక్సెస్ అందుకున్న సితార నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాదిలో పలు చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి 'వింటారా సరదాగా'. మహేశ్ మేనల్లుడు అశోక్ హీరో కాగా శ్రీ గౌరీప్రియ హీరోయిన్. పూర్తిగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'అనగాఅనగా అమెరికా' అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది వినసొంపుగా ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)ఉద్భవ్ అనే నటుడు.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమెరికాలో ఉంటున్న తెలుగు యువతీయువకుడు ప్రేమలో పడటం, తర్వాత జరిగే పరిస్థితులు నేపథ్యంగా మూవీ తీసినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు) -
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌ను మెప్పించాయి.తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ఈ మూవీకి షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
డెకాయిట్ నుంచి లవ్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కెమెరామెన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ యాక్షన్ లవ్‌స్టోరీ నుంచి తాజాగా రుబరూ.. అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.లవ్ సాంగ్మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని.. అంటున్నది మనసే.. కాసేపు నువ్వు,నేను కలిసి.. క్షణంలో లోకమంత తెలిసే.. అన్న లిరిక్స్‌తో పాట మొదలైంది. 'మోసం అంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే.. మోసం చేస్తావని తెలీదు కదా జూలియట్.. ఎందుకు నమ్మించినావే..' అంటూ హీరో లవ్‌స్టోరీని పాటలో చూపించారు. అలాగే చివర్లో బ్రేకప్ బాధను కూడా చూపించారు.సినిమాఇదివరకు రిలీజైన టీజర్లో యాక్షన్‌ను ఎక్కువ హైలైట్ చేయగా ఈ పాటలో మాత్రం లవ్ టచ్ ఎక్కువ జోడించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026 -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ జిందగీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజైంది. ఈ సందర్భంగా మృత్యుంజయ్ టీమ్‌కు రామ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అభినవ కవి, కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య అయ్యంగారు పాడారు. ఈ పాటను కాల భైరవ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to launch the first single of #Mrithyunjay - #EeZindagi ❤️🔥The trailer also looked intriguing..Looking forward to seeing @sreevishnuoffl in @hussainshakiran ‘s thriller. Wishing them all the very best for Mrithyunjay coming on March 6th! ❤️Check the song out now!… pic.twitter.com/uSjXSaPIfY— RAm POthineni (@ramsayz) February 25, 2026 -
వైరల్ అయిపోతున్న 'ఆయా షేర్' పాట రిలీజ్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. లెక్క ప్రకారం మార్చిలోనే థియేటర్లలోకి రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. నాని పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి తొలి పాట రిలీజ్ చేశారు. 'ఆయా షేర్' అంటూ సాగే ఈ గీతం.. ప్రోమోతోనే ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్తి పాట కూడా అలానే అదరగొడుతోంది.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'ప్యారడైజ్' సినిమా తీస్తున్నారు. ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్గా చేస్తోంది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. విడుదలకు ఇంకా చాలారోజులు ఉంది కానీ హైప్ అయితే ఈ మూవీపై మామూలుగా లేదు. -
బ్యాండ్ మేళం: తిప్పుకుంటాన్నవ్ పాట రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీరు బావామరదళ్లుగా నటిస్తున్నారు. ఇటీవలే వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో హీరో హీరోయిన్‌కు బ్రేకప్ అయినట్లు చూపించారు.సాంగ్ రిలీజ్తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వదిలారు. 'బెల్లం చుట్టూ ఈగలెక్క.. మంచం చుట్టూ దోమ లెక్క.. గుడి సుట్టూ భక్తుని లెక్క.. బారు సుట్టూ తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్' అంటూ ఈ పాట కొనసాగుతుంది. హుషారుగా సాగే ఈ సాంగ్‌లో శ్రీదేవి- రోషన్ ఎనర్జిటిక్ స్టెప్పులేశారు.సినిమాబిగ్బాస్ ఫేమ్ రాము రాథోడ్ ఈ పాట పాడటంతో పాటు రోషన్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు వెంకటేశ్ కాపు కొరియోగ్రఫీ అందించాడు. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చాడు. రాము రాథోడ్, అదితి భావరాజు ఆలపించారు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ బ్యాండ్‌మేళం మూవీ మార్చి 13న విడుదల కానుంది. చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: ఆర్.మాధవన్ -
మెగా కోడలి కొత్త సినిమా.. క్రేజీ లవ్ సాంగ్ వచ్చేసింది
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సతీ లీలావతి మూవీ క్రేజీ లవ్ సాంగ్ విడుదలైంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి మధురం అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, చారులత మణి ఆలపించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట ఆడియన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు. -
కొండా సురేఖ మనవడి పాటకు ప్రభాస్ వాయిస్ ఓవర్
బంజారాహిల్స్ : రెండున్నరేళ్ల వయసులో లింగాష్టకం పఠించి అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఆ చిన్నారి. ఈ వీడియోకు హీరో రెబల్‌స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రభాస్ స్వరం అధనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇంత చిన్న వయసులో భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మికతలో ప్రతిభను ప్రదర్శించిన బుడతడిని ప్రభాస్ ప్రశంసించారు. ఆ బుడతడే దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మనుమడు కొండా మురళీకృష్ణ పటేల్. చిన్నారి స్వచ్ఛమైన భక్తి, కుటుంబ విలువలు సమాజానికి మార్గదర్శకమని, ఇతర పిల్లలకు కూడా స్ఫూర్తి దాయకమని కొనియాడారు. కాగా చిన్నారి కొండా మురళీకృష్ణ పటేల్ తల్లిదండ్రులు సుషి్మతాపటేల్, అభిలాష ప్రభాస్ ప్రశంసల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
డ్యాన్స్‌తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి
లోకేష్ కనగరాజ్ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్ సాంగ్‌గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్ షాహిర్. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.ఈ నేపధ్యంలో మన టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ఆ పాట క్రేజ్‌కి చెక్ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్ లాంచ్‌తో వెల్లడైంది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ పెపే, దుసర విజయన్, కబీర్ సింగ్‌లతో పాటు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. ముఖ్యంగా సునీల్ స్టెప్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)'మజాకో మల్లికా'లో సునీల్ డ్యాన్స్‌లో ఈజ్‌ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్ పట్టుకుని స్మోక్ చేస్తూ ఒకే కాలితో సునీల్ వేసిన స్టెప్స్‌ని చూసి ఒక నెటిజన్.. 'నటుడు సునీల్ డ్యాన్స్ నెక్ట్స్ లెవల్' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్ డ్యాన్స్ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్ 2' కు వర్క్ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్ శ్రీరాజ్ భద్ర పాడారు, వినాయక్ శశికుమార్ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్ లాగే ఈ సినిమాలో కూడా సునీల్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్ సాంగ్.. మోనికా రేంజ్లో హిట్ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్ పాటల ట్రెండ్ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్ సినిమా మే నెలలో విడుదల కానుంది.(ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?) -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్ట షాకింగ్ విషయాలు
కోర్బా: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన జర్నలిస్ట్ సల్మా సుల్తానా హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో ప్రత్యక్ష సాక్షి కోమల్ సింగ్ రాజ్‌పుత్ చెప్పిన నిజాలతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న ఆ దారుణాన్ని ఆమె కోర్టులో వివరించారు.పాట పాడుతూ..2018లో తన లివ్-ఇన్ భాగస్వామిని గొంతు నులిమి చంపిన తర్వాత నిందితుడు మధుర్ సాహులో ఎలాంటి భయం, పశ్చాత్తాపం కనిపించలేదు.. సల్మాను హత్య చేసిన సమయంలో మధుర్ చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. అతను మృతదేహం పక్కనే కూర్చుని సిగరెట్ తాగుతూ, సల్మాకు ఇష్టమైన "తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై.’’ అనే పాటను పాడినట్లు కోర్టుకు కోమల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు.ఆ రోజు ఏం జరిగింది?మధుర్ సాహు జిమ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే కోమల్ సింగ్.. ఘటన జరిగిన రోజున శారదా విహార్‌లోని సల్మా ఇంటికి తనను పిలిచారని చెప్పాడు. దంపతుల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం.. కాసేపటికే హింసాత్మకంగా మారిందన్నారు. వాగ్వాదం జరుగుతుండగానే మధుర్ మొదట సల్మా గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని.. ఘర్షణ తీవ్రం కావడంతో ఆమెను మంచంపైకి నెట్టి గొంతు గట్టిగా నొక్కినట్లు తెలిపారు. సల్మా అరవకుండా ఉండేందుకు మరో నిందితుడు కౌశల్ శ్రీవాస్ ఆమె నోటిపై దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. కోమల్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. నోరు మూసుకుని ఉండు.. లేదంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది" అంటూ నిందితులు ఆమెను బెదిరించారు.నమ్మించేలా ప్లాన్..హత్య తర్వాత, సల్మా ఫోన్ నుండి ఆమె కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపాలని మధుర్ తనను, ఇంట్లో పనిచేసే సవితను బలవంతం చేసినట్లు కోమల్ తెలిపింది. ‘‘నేను వెళ్లిపోతున్నాను.. నన్ను వెతకకండి అంటూ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆమె తనంతట తానుగా వెళ్ళిపోయిందని నమ్మించేలా ప్లాన్ చేశారు. నిందితుడు తన కంప్యూటర్లో పలువురు మహిళలకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను దాచిపెట్టి, వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని కూడా కోర్టుకు కోమల్ సింగ్ తెలిపారు. తాను ఈ విషయం గురించి పోలీసులకు మరియు సల్మా బంధువులకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, ఆ విషయం నిందితుడికి తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు.రోడ్డుకింద ఆస్థి పంజరం..హత్య అనంతరం సల్మా మృతదేహాన్ని భవానీ దబ్రీ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి కింద పాతిపెట్టారు. ఐదేళ్లపాటు ఆ రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి.. కానీ దాని కింద ఒక జర్నలిస్ట్ శవం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. 2023లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించిన పోలీసులు రహదారిని తవ్వి అస్థిపంజరాన్ని వెలికితీశారు. డీఎన్ఏ పరీక్షలో అది సల్మాదేనని తేలింది.తుది దశలో విచారణప్రభుత్వ న్యాయవాది సునీల్ సోన్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 41 మంది సాక్షులను విచారించారు. మరో 10 మంది మిగిలి ఉన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, హత్య తర్వాత నిందితుడు పాట పాడాడనే కోమల్ సింగ్ రాజ్‌పుత్ సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారింది. -
మా వాడు మాట్లాడింది రెండు, మూడు బూతులే..! కానీ మీరు చేస్తుందేంటి...
-
పూజా హెగ్డే మోనికా సాంగ్.. ఐదేళ్ల బుడ్డోడు అదుర్స్..!
గతేడాది సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ మూవీలో పూజా హెగ్డే ఓ ప్రత్యేక సాంగ్కో మెరిసింది. మోనికా అంటూ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతలా ఈ సాంగ్ సినీ ప్రియులను మెప్పించింది. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్స్‌తో మెప్పించాడు.అయితే తాజాగా ఈ పాటకు ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మూవీ ఈవెంట్లో మోనికా సాంగ్‌కు చిచ్చరపిడుగులా అదరగొట్టేశాడు. ఈ బుడ్డోడి స్టెప్పులు చూసిన నెటిజన్స్ పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్ను మించిపోయేలా చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అబ్బాయి ఎనర్జీ చూసి ఫిదా అయిపోతున్నారు.కాగా.. రజినీకాంత్ నటించిన కూలీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. Yaara nee 🤯🔥 pic.twitter.com/YH1heMRynH— OTT Trackers (@OTT_Trackers) February 8, 2026 -
యాటిట్యూడ్ స్టార్‌కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్‌పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్‌ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
జగనన్న పాటకు డ్యాన్స్ లు వేసిన జనం
-
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్‌లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026 -
సినిమా ప్రమోషనా.. బూతు కచేరీనా?.. ఇంత బరి తెగించాలా?
ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకమున్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. అందుకే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్స్‌తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్‌ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్‌తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి.అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్‌ను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ఈనెల 6వ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ నటించారు. రిలీజ్‌కు దగ్గరవుతున్న వేళ సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.అంతా బాగానే ఉన్నా.. ఈవెంట్లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూతు పాట పాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు.. నెటిజన్స్ సైతం తీవ్రస్తాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డిపెడుతున్నారు. అసలు ఆ బూతు పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Attitude Star Chandrahas Singing Performance 🤯pic.twitter.com/C24OQSnpEG— cinee worldd (@Cinee_Worldd) February 2, 2026 -
'బెల్లా బెల్లా.. రసగుల్లా' వీడియో సాంగ్ వచ్చేసింది
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒకటి! మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్వకత్వం వహించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. వీడియో సాంగ్ రిలీజ్ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ జనవరి 13న విడుదలవగా మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'బెల్లా బెల్లా.. ఈసబెల్లా.. బాగున్నావే రసగుల్లా' వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, ఆషికా హుషారుగా స్టెప్పులేశారు. సురేశ్ గంగుల లిరిక్స్ సమకూర్చిన ఈ పాటను నకాశ్ అజీజ్, రోహిని ఆలపించారు. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ -
దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియో
ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, జీవితంలో వర్తమాన క్షణాలను ఆస్వాదించడానికి వయసుతో పనేముంది. సమయం, సందర్భం కలిసి వస్తే మనసు నాట్యమయూరే అవుతుంది. ఇక నాట్యంలో ఆరితేరిన వారైతే.. ఇక చెప్పేదేముంది ఉరిమే ఉత్సాహంతో ఉర్రూతలూగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నా ఈ వీడియోను చూస్తే ఎంతటివరైనా కాలు కదపాల్సిందే.. పక్కా.! ఆ సోషల్ మీడియా సెన్సేషన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్. వయసు 70 ఏళ్లు అయితేనేం అందమైన డ్యాన్స్‌తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తన కరియర్లో ఐకానిక్ సాంగ్ ‘రంభా హో హో హో’ పాటకు అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. తాజాగా ఈ పాటను దురంధర్‌లో వాడుకోవడంతో మరింత ఇంట్రస్టింగ్మారింది. దురంధర్ సినిమా అటు కలెక్షన్లనుంచి ఇటు వివాదాల కారనంగా అనేక కారణాలతో వార్తల్లో నిలిచింది. ఐకానిక్ రెట్రో పాట 'రంభ హో' వాడుకోవడం వాటిలో ఒకటి.1981లో వచ్చిన 'అర్మాన్' చిత్రంలో ఈ పాటలో నటించిన సీనియర్ నటి కల్పనా అయ్యర్, దాదాపు 40 ఏళ్ల తరువాత ఆ మ్యాజిక్‌ను పునఃసృష్టించారు. దీంతొ అభిమానులు నాస్టాల్జియాతో పులకరించారు. స్వయంగా కల్పనా తన ఇన్‌స్టాఖాతాలో శుక్రవారం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా అన్నారు. “ఒక స్నేహితురాలు నాకు ఈ క్లిప్‌ను పంపింది, ఇది నిన్న రాత్రిది, ఇలా చేశానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. చాలా కాలంగా డ్యాన్స్ చేయలేదు. ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. సిద్ధాంత్ పెళ్లి.” అని ఆమె పేర్కొన్నారు. నలుపు-బంగారు బ్లౌజ్ ఊదా రంగు పట్టు చీరలో ఆమె స్టెప్పులుకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కల్పనా అయ్యర్‌పై ప్రశంసల జల్లుకురుస్తోంది ఎవరీ కల్పనా అయ్యర్బాలీవుడ్లో విలన్ పాత్రలకు, ముఖ్యంగా 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రంలో తన నటనకు బాగా గుర్తుండిపోయే కల్పనా అయ్యర్, మిస్ ఇండియా 1978 పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్ 1978లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఎక్కువగా బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రలను పోషించారు. 1980 నాటి 'ప్యారా దుష్మన్' చిత్రంలోని "హరి ఓం హరి", ఆ తర్వాత 1981లో 'అర్మాన్' చిత్రంలోని "రంభ హో" వంటి జనాదరణ పొందిన డ్యాన్స్ నంబర్లతో డ్యాన్సింగ్ క్వీన్‌గా పాపులర్ అయ్యారు. View this post on Instagram A post shared by striloka (@strilokaa) -
ఫంకీలో రామ్ మిర్యాల పాడిన జోష్ సాంగ్.. విన్నారా?
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ధీరే.. ధీరే సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ సాంగ్‌ను వదిలారు. 'ఒప్పేసుకుంట పిల్ల తప్పు అంత నాదేనంటు రట్టాటటావ్.. తప్పించుకోను పిల్ల సారీ నీకు చెప్పుకుంట రట్టాటటావ్.. అరెరె కుక్క పిల్లలాగా తిప్పుకోకే పిల్లా..' అంటూ పాట మొదలవుతుంది. అంటూ సాగే ఈ పాట ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ జోష్‌తో కొనసాగింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు దేవ్ పవార్ లిరిక్స్ సమకూర్చాడు. రామ్ మిర్యాల ఆలపించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం ఫిబ్రవరి 13న విడుదలవుతోంది. చదవండి: నవీన్ పొలిశెట్టి ఆంధ్ర టూ తెలంగాణ సాంగ్ రిలీజ్ -
'వామ్మో.. వాయ్యో..' ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి
రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
డ్యాన్స్ అదరగొట్టిన మీనాక్షి.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' కూడా ఒకటి. నవీన్ పొలిశెట్టి.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన మూవీ ఇది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇకపోతే ఇందులో ఇద్దరూ కలిసి భీమవరం బల్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ పాట పూర్తి వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మీనాక్షి డ్యాన్స్ అదరగొట్టేసింది.ఈసారి పండగకు రిలీజైన వాటిలో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' లీడ్ తీసుకోగా.. నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఉన్నంతలో బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. కథ పరంగా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కామెడీ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు బాగానే చూశారు. నిర్మాణ సంస్థ అయితే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు. రిలీజై దాదాపు రెండు వారాలుపైనే అయిపోయింది. అయినా సరే హీరో నవీన్ పొలిశెట్టి.. అమెరికా వెళ్లి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నాడు. -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆంథమ్ రిలీజ్
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఆంథమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది .ప్రకాశ్ చెరుకూరి అందించిన మ్యూజిక్ సాంగ్‌కు ప్రాణం పోసింది.బాబా సెహగల్ వాయిస్ యూత్‌ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. -
సల్మాన్ దేశభక్తి సినిమా.. మాతృభూమి సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్సెస్ రేసులో చాలా వెనకబడిపోయాడు. ప్రస్తుతం 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో ఓ దేశభక్తి సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీ నుంచి 'మాతృభూమి' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ఇందులో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మానే స్వయంగా నిర్మిస్తుండగా.. గతంలో రామ్ చరణ్‌తో 'జంజీర్(తుఫాన్)' లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన అపూర్వ లఖియా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి ట్రెండ్ నడుస్తోంది. మరి దాన్ని సల్మాన్ సినిమా అందుకుని హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ) -
నిధితో ప్రభాస్ రొమాంటిక్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్
డార్లింగ్ ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి సహన సహనా అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా సహనా సహనా ఫుల్ వీడియో సాంగ్ వదిలారు. 'సహనా సహనా నా సఖి సహనా.. కలలో నిన్నే చూశానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. తమన్ అందించిన ఈ ట్యూన్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. సింగర్ విశాల్ మిశ్రా ఆలపించాడు. ఈ పాటలో ప్రభాస్.. నిధి అగర్వాల్‌తో రొమాంటిక్ స్టెప్పులేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే జనవరి 9న విడుదలైన రాజాసాబ్ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. మారుతి దర్శకత్వం వహించిన చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్.. నయన్‌తో చిరు స్టెప్పులు
మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న విడుదల కాగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా మన శంకరవరప్రసాద్‌గారు సినిమా నుంచి శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.అప్పుడేమో ట్రోల్స్..ఈ పాట విడుదలైన కొత్తలో ఇదేం పాట? అని ట్రోల్స్ వచ్చాయి. కానీ తర్వాత అదే హిట్టు సాంగ్‌గా మారిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన పాటలో నయనతారతో కలిసి హుషారుగా స్టెప్పులేశాడు చిరంజీవి. అది చూసిన అభిమానులు బాస్ గ్రేస్ చూస్తుంటే మరోసారి సినిమా చూడాలనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. భీమ్స్‌తో పాటు మధుప్రియ ఆలపించింది. -
'పదే పదే కంగారుగుంటది'.. అదితి-విజయ్ సేతుపతి మెలోడి సాంగ్..!
విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం గాంధీ టాక్స్. ఈ సినిమాకు కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే క్రేజీ మెలోడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.పదే పదే కంగారుగుంటది.. అంటూ సాగే ఈ మెలోడి లవ్ సాంగ్ విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. నయన్సీ శర్మ, శిబి శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 30న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. -
కీరవాణి నోట మరో అద్భుతమైన పాట.. 'వెళ్లేదారిలో..’ విన్నారా?
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన విలేజ్ డ్రామా ‘శ్రీ చిదంబరం’. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి అభినందనలతో.. ఆయన సినిమాకు బెస్ట్ విషెస్ చెబుతూ పాటను విడుదల చేశారు. చందు రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యాన్ని సమాకూర్చారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా కీరవాణి గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ'' కీరవాణి గారు ఈ పాటలను ఆలపించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన గాత్రంతో ఆ పాట ఎంతో గొప్పగా మారింది. సినిమా విషయానికొస్తేఇదొక ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాలో పూర్తి కొత్తదనం నిండి ఉంటుంది. ప్రతి పాత్ర, ప్రతి విజువల్ ఎంతో సహజంగా ఉంటుంది.ఇక ఇందులో హీరోకి ఉన్న అసలు పేరు కాకుండా.. ఊరంతా కూడా చిదంబరం అని ఎందుకు పిలుస్తుంటారు.. మరి అలా ఎందుకు పిలుస్తారు? అసలు హీరో ఎప్పుడూ కూడా కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అలా చేయడానికి గల కారణం ఏంటి? అనే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. కొత్తదనంతో నిండిన సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా చిత్రం నచ్చుతుంది' అన్నారు. -
ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్‌గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన 8 రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించిన సంగతి తెలిసిందే. Watching my little niece #Naira sing the #FlyingHigh song from my film #ManaShankaraVaraPrasadGaru filled my heart with indescribable joy ❤️https://t.co/Ghbnf7gQtXThis is just the beginning, my dear. May your path always be bright, joyful, and filled with endless… pic.twitter.com/hxcaTwLiWw— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2026 -
మనశంకర వరప్రసాద్‌గారు..ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే..!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమాలో 'ఫ్లై.. హై' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పాట పాడింది స్వయానా చిరంజీవి మేనకోడలు నైరా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. మెగాస్టార్ సోదరి మాధవి గారి కుమార్తె అని వెల్లడించారు. మనశంకర వరప్రసాద్‌గారు సినిమాలోని ఈ పాటను అద్భుతంగా పాడిందని కొనియాడారు. ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Naira is the niece of our Megastar @KChiruTweets garu ( Daughter of his Sister Madhavi garu )🤗She has wonderfully sung the #FlyingHigh song from #ManaShankaraVaraPrasadGaru 👏🏻👏🏻👏🏻With a long journey ahead of her, this is just a beautiful beginning… https://t.co/PZEPN1t3ox— Anil Ravipudi (@AnilRavipudi) January 20, 2026 -
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్.. రవితేజ మాస్ డ్యాన్స్
ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. ఆరనీకుమా ఈ దీపం సాంగ్ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్‌ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్ప్రైజ్ అయ్యారు. స్క్రీన్‌పై రవితేజ మాస్ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. పబ్‌లో హీరోయిన్ ఆషికా రంగనాథ్‌తో మాస్ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..సినిమాసినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ -
'గిర గిర గింగిరాగిరే.. తుర్రు తుర్రు తోకపిట్టవే'.. ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ఛాంపియన్. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణలోని బైరాన్ పల్లి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్‌లో తన నటనతో రోషన్ మంచి మార్కులు కొట్టేశారు.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో ఓ సాంగ్ సినీ అభిమానులను ఊపేసింది. గిర గిర గింగిరాగిరే అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. రామ్ మిరియాల ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాలో ఊపేసింది. తాజాగా ఈ సూపర్ హిట్ ఫుల్ వీడియో సాంగ్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రోషన్- అనస్వర రాజన్ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.కాగా.. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజైన మూడురోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
'ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా!' సాంగ్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ 'ది రాజాసాబ్', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. మూడో సాంగ్ రిలీజ్తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్. 'నాలోన సోకులున్నయ్, సొంపులున్నయ్ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్ సీపన, సమీరా భరద్వాజ్ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ శాన్వి మేఘన నవీన్ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: బాస్ చింపేశాడు.. మెగాస్టార్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు -
కృష్ణానగర్ కష్టాలపై..ఫోక్ సాంగ్
బంజారాహిల్స్ : కృష్ణానగర్ అంటేనే సినిమా కష్టాలకు, కొత్తగా వేషాల కోసం తిరిగే నటులు, డైరెక్టర్లు, యువ సింగర్లకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కృష్ణానగర్ కష్టాలపై ప్రస్తుతం ఓ ఫోక్ సాంగ్ సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. వేలల్లో వ్యూస్ పొందుతోంది. అదే ‘దొండకాయ–బెండకాయ’ అంటూ సాగే పాట. అన్నమయ్య జిల్లా వీరబల్లి గ్రామానికి చెందిన నవసందీప్ కృష్ణానగర్ సినిమా కష్టాలపై పాడిన ఫోక్ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తిరుపతిలోని ఎస్వీ మ్యూజిక్ కళాశాలలో సంగీతం కోర్సు చేసి 2018లో సినిమా అవకాశాలు దక్కించుకుని వెండి తెరపై వెలిగిపోవాలని హైదరాబాద్ బాట పట్టాడు. పాటలు పాడడానికి గొంతుంది. రాయడానికి కలం ఉంది.. అయినా అవకాశాలు మాత్రం రాకపోవడంతో తిరిగి వెళ్లిపోదామనుకున్న సమయంలో ఓ హీరోయిన్ తనను ఇటువైపు పురికొలి్పందంటూ చెప్పుకొచ్చాడు. తన అభిమాన హీరోయిన్ల పేర్లను పాటలో జత చేసి కూరగాయలు, చీరలతో పోలి్చన విధానం, పాట పాడిన పద్ధతి శ్రోతలకు వినోదాన్ని పంచుతోంది. -
ఇన్నావా బంగారం.. 'లెనిన్' తొలిసాంగ్ రిలీజ్
'ఏజెంట్' మూవీ ఫ్లాప్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయిన అఖిల్.. చాలా సైలెంట్‌గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తొలుత హీరోయిన్గా శ్రీలీల అనుకున్నారు. ఆ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత ఈమె ప్లేసులోకి భాగ్యశ్రీ వచ్చింది. ఈ మధ్య వదిలిన పోస్టర్‌తో ఈ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సినిమా నుంచి తొలి గీతాన్ని వదిలారు. అలానే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ)తమన్ సంగీతమందించిన 'వారెవ్వా' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ వినడానికి బాగుంది. అఖిల్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది.ఇప్పటివరకు అఖిల్ ఐదు సినిమాలు చేస్తే.. వాటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓకే అనిపించుకుంది. మిగిలినవన్నీ బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా అఖిల్ హిట్ కొట్టాలి. మరి 'లెనిన్'తో ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: అన్వేష్, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?) -
'బాయిలోనే బల్లి పలికే' మంగ్లీ కాపీ కొట్టిందా.. క్లారిటీ ఇదే
‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. జానపద ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) పాడిన ఈ కొత్త పాట యూట్యూబ్‌లో ఇప్పటికీ టాప్-3లో కొనసాగుతుంది. అయితే, సోషల్‌మీడియాలో మంగ్లీపై విమర్శలు వస్తున్నాయి. మరాఠీ నుంచి ఈ సాంగ్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, అసలు విషయం మరోలా ఉంది. మరాఠీకి చెందిన సింగర్స్ యతిన్ వధన్, కాజల్ రావత్యనే మంగ్లీ సాంగ్‌ను కాపీ కొట్టారు. ఇదే విషయాన్ని వారు చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆపై వారు విడుదల చేసిన యూట్యూబ్ ఛానల్లో కూడా మంగ్లీ అనుమతితో ఈ సాంగ్‌ను తీసుకున్నట్లు క్రెడిట్ కూడా ఇచ్చారు. అయితే, అసలు విషయం తెలియని కొందరు సింగర్ మంగ్లీపై విమర్శలు చేయడం విశేషం.‘బాయిలోనే బల్లిపలికే’ పాటను రాసింది జగిత్యాల జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమల్ ఇస్లావత్.. ఆయన సొంత గ్రామం మల్లాపూర్ మండలం వీవీరావుపేట.. 2009లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కమల్ ఇస్లావత్.. పోలీస్ కళాబృందంలో ప్రజలను చైతన్య పరిచేందుకు చాలా ప్రదర్శనలు ఇచ్చారు. సుమారు వెయ్యికిపైగా కళా ప్రదర్శనలు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు సుమారు 80 పాటలకుపైగానే లిరిక్స్ అందించారు. -
ప్రభాస్ ది రాజా సాబ్.. ఫుల్ గ్లామరస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండడంతో మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నచ్చేనచ్చే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఫుల్ సాంగ్‌ను జనవరి 5న రిలీజ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో మీరు కూడా చూసేయండి. Gear up for the MOST GROOVING MADNESS in theatres this Sankranthi 💥💥💥#NacheNache song promo is out now ❤️🔥❤️🔥❤️🔥Full song from Jan 5th 😎🙌🏼A @MusicThaman Musical Vibe 🎧 #TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas pic.twitter.com/WgwCLbXaF9— People Media Factory (@peoplemediafcy) January 3, 2026 -
'త్రికాల' నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట రిలీజ్
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ... మైథలాజికల్ జానర్లో తీస్తున్న 'త్రికాల' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక శ్రీనివాస్ నిర్మాత. తాజాగా 'యాలో ఈ గుబులే ఎలో' పాటని రిలీజ్ చేశారు.ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్..!
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి వచ్చేశారు. గతేడాది హిట్ రాకపోవడంతో ఈ సారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వామ్మో..వాయో అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్ ఈ పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సాంగ్రకు దేవ్ పావేర్ లిరిక్స్ అందించగా.. స్వాతిరెడ్డి ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
రాజాసాబ్: 'రాజే.. యువరాజే' సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాతో 2026కి స్వాగతం పలుకుతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌తో సోషల్‌మీడియాలో మంచి హైప్ వచ్చింది. కొత్త ఏడాది సందర్భంగా ది రాజాసాబ్ నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. రాజే యువరాజే సాంగ్'రాజే యువరాజే' పాటను రిలీజ్ చేశారు. ఎటువంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియో సాంగ్ మాత్రమే బయటకు వదిలారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఒకేరోజు రెండు సర్ప్రైజ్లుకాగా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అందులో డార్లింగ్ ప్రభాస్ ఒంటి నిండా గాయాలు, కట్లతో కనిపించాడు. అయితే ప్రభాస్‌ను ముందువైపు నుంచి చూపించకుండా బ్యాక్‌సైడ్ ఫోటో మాత్రమే వదిలారు. దెబ్బలతో ఉన్న ప్రభాస్ ఓపక్క సిగరెట్, మరోపక్క మందు తాగుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
'భూతం ప్రేతం' నుంచి 'చికెన్ పార్టీ' సాంగ్ రిలీజ్
సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్లపై బి.వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భూతం ప్రేతం'. యాదమ్మ రాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగుంది.ఇప్పుడు న్యూఇయర్ సందర్భంగా పార్టీ సాంగ్ రిలీజ్ చేశారు. 'చికెన్ పార్టీ' అంటూ సాగే ఈ పాటని రాజేష్ ధృవ రాయగా.. అనిరుధ్ శాస్త్రి పాడారు. గిరీష్ హోతుర్ ఇచ్చిన బాణీ.. పార్టీ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ సినిమాకు యోగేష్ గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ చంద్ర ఎడిటర్, దేవి ప్రకాష్.ఎస్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. -
'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం. 'దళపతి కచేరీ' అంటూ సాగిన తొలి పాటలోని ఓ పోర్షన్ని విజయ్ గాత్రమందించాడు. ఈ పాట మాత్రం మొత్తంగా విజయ్ ఆలపించాడు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ సినిమా.. తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పాట చూస్తే అదే అనిపించింది. ఒరిజినల్ మూవీలోనూ హీరో బాలకృష్ణ-పాప శ్రీలీల మధ్య ఓ సాంగ్ ఉంటుంది. అది ఇది ఒకటేలా అనిపిస్తున్నాయి. తెలుగులోనూ ఈ మూవీ 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.విజయ్.. తనకు ఇది చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించాడు. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇతడి పార్టీ పోటీపడనుంది. అందులో విజయ్ ఏ మేరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి? ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. మమిత బైజు కూడా కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
'అనగనగా ఒక రాజు' నుంచి పెళ్లి సాంగ్ రిలీజ్
ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. మారి అనే దర్శకుడు.. ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సాంగ్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)పెళ్లి నేపథ్యంగా తీసిన ఈ పాట కూడా ట్రెండింగ్ పదాలతో ఉంది. బీట్ కూడా బాగుంది. నవీన్-మీనాక్షి డ్యాన్స్ కూడా కలర్ఫుల్గా కనిపించింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లు కాస్త నెమ్మదించడంతో.. మూవీ వాయిదా పడే అవకాశముందని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పాట రిలీజ్ చేసి అలాంటివే లేవని క్లారిటీ ఇచ్చినట్లయింది. నిర్మాత నాగవంశీ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈసారి వాయిదా ఉండదని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్) -
వైఎస్ జగన్ పై అద్భుతమైన పాట పాడిన వీరాభిమాని
-
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన హీరోగా వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారి దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా రిలీజైన రాజు గారి పెళ్లిరో అంటూ సాగే పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
'శంబాల' నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సినిమా 'శంబాల'. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం.. రాబోయే శుక్రవారం (డిసెంబరు 25) థియేటర్లలోకి రానుంది. యగంధర్ ముని దర్శకత్వం వహించగా.. అర్చన అయ్యర్, స్వసిక తదితరులు కీలక పాత్రలు చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఓ ఎమోషనల్ పాటని విడుదల చేశారు.'శంబాల' స్టోరీని కాస్త రివీల్ చేసేలా హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం వివరించేలా ఇది సాగుతోంది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో అందరినీ అలరిస్తోంది. ఇప్పటికే 'శంబాల' మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కుల్ని అమ్మేశారు కూడా. -
ప్రభాస్ ది రాజాసాబ్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సహనా సహనా అంటూ సాంగే రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన ఈ పాట ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజనీ ఆలపించారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు. -
బ్యాడ్ గాళ్స్.. ఫుల్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లేలో అంటూ సాంగే ఫుల్ రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా.. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్ అని దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి అన్నారు. -
నిధి అగర్వాల్‌తో 'రాజాసాబ్' డ్యాన్స్.. ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్ సాబ్ పాట రిలీజైంది. రెబల్ స్టార్ పేరుపై వచ్చిన సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సెకండ్ సాంగ్ ప్రోమోతాజాగా రాజాసాబ్ నుంచి సెకండ్ సాంగ్ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్.. నిధితో స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్ జానర్లో ప్రభాస్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది. It all begins with the #SahanaSahana PROMO setting the mood in pure soothing vibes ❤️🔥❤️🔥Video Song arrives on Dec 17th at 6:35 PM 💥💥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @AgerwalNidhhi @peoplemediafcy pic.twitter.com/mM4hiaj8QX— Director Maruthi (@DirectorMaruthi) December 14, 2025 -
'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్
పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ 'గబ్బర్ సింగ్' చేశారు. అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు. ఇప్పటికే పవన్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత)'దేఖ్ లేంగ్ సాలా' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశారు. బీట్ బాగానే ఉంది కానీ ఎక్కడో విన్నామే ఇది అనిపించేలా మ్యూజిక్ ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.ఈ సినిమా విషయానికొస్తే.. తమిళ హీరో విజయ్ 'తెరి'కి ఇది రీమేక్ అని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం కొత్త స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైతే తప్ప కంటెంట్ ఏంటనేది క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. రీమేక్ అనే రూమర్స్ దీనికి కారణం. అలానే దర్శకుడు హరీశ్ శంకర్ గత కొన్ని చిత్రాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్) -
యూట్యూబ్‌లో అలరిస్తున్న 'మెన్షన్ హౌస్ మల్లేష్' సాంగ్
హిట్, యానిమల్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి. ఇతడి హీరోగా చేసిన సినిమా 'మెన్షన్ హౌస్ మల్లేష్'. కొన్నాళ్ల క్రితం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చాయి. థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమాలోని పాట యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.'బంగారి బంగారి' అంటూ సాగే పాట కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేయగా శ్రోతల్ని అలరిస్తూ ఇప్పుడు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో గాయత్రి రమణ హీరోయిన్గా చేస్తోంది. బాల సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతమందించారు. రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. -
బ్యాడ్ గర్ల్స్ మూవీ.. చంద్రబోస్ రాసిన ఫుల్ వీడియో సాంగ్
30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్.. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. బ్యాడ్ గర్ల్స్ ఆంథమ్ పేరుతో ఈ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా..వాగ్దేవి ఆలపించారు. ఈ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశానని డైరెక్టర్ మున్నా గతంలో చెప్పారు. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలనదే కాన్సెప్ట్ అని అన్నారు. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్‌కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ రవితేజ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. -
ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ పాడిన ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగా తాలూకా(Andhra King Taluka Movie). ఈ మూవీకి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కింగ్డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పప్పీ షేమ్ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రామ్ ఆలపించడం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. వివేక్- మెర్విన్ సంగీతం అందించారు. కాగా.. ఈ చిత్రంలో కన్నడ హీరో కీలక పాత్రలో నటించారు. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ సాంగ్
తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్‌లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్‌గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. -
ద్రౌపది-2 సాంగ్.. చిన్మయికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..!
రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి నెలరాజె అంటూ సాగే పాటను విడుదల చేశారు.అయితే ఈ పాటను తమిళంలో ఏం కోనే అంటూ సాగే ఈ పాటను చిన్మయి ఆలపించారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఈ పాటను పాడినందుకు క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి తనకు తెలియకపోవటం వల్ల పాడానని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుంచే నేను ఇందులో భాగం అయ్యేదాన్ని కాదని వెల్లడించారు. దీనికి కారణం డైరెక్టర్ మోహన్ అంటూ పోస్ట్ చేసింది.డైరెక్టర్ రియాక్షన్..చిన్మయి క్షమాపణ చెబుతూ ట్వీట్ చేయడంపై చిత్ర దర్శకుడు మోహన్ జి స్పందించారు. ఈ పాటను పాడటానికి తాను పర్సనల్‌గా చిన్మయి అయితేనే బాగుంటుందని పాడించానని పేర్నొన్నారు. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించానని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. తనతో కానీ, సంగీత దర్శకుడితో కానీ మాట్లాడకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగించిదన్నారు. దీనిపై చిన్నయి వివరణ ఇవ్వాలని లేదంటే ట్వీట్‌ను తొలగించాలని కోరారు.ఈ సందర్భంగా ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కాకుండా తనను విమర్శించాలని డైరెక్టర్ అన్నారు. ఈ సినిమా మేకింగ్‌లో భాగమైన ఇతరులను విమర్శించటం పిరికితనమని దర్శకుడు మోహన్ పేర్కొన్నారు. చిన్మయి తన మెసేజ్‌లో పేర్కొన్న వ్యతిరేక భావజాలం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిన్మయి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేస్తోందన్నారు. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయన వెల్లడించారు. At the outset, my heartfelt apologies for Emkoney.Ghibran is a composer I have known for 18 years since my jingle singing days. When his office called for this song, I just went & sang as I usually do. If I remember right, Ghibran wasn't present during this session - I was…— Chinmayi Sripaada (@Chinmayi) December 1, 2025 Don't target any Technicians, Actors, actresses and who ever work with me in #Draupathi2.. Whatever my movie speaks it's my own creation and idealogy. Your target is me.. Don't target those associated Directly or indirectly with me and my projects.. It's a kind of cowardness..— Mohan G Kshatriyan (@mohandreamer) December 1, 2025 -
బాలయ్య అఖండ-2.. హైందవం సాంగ్ వచ్చేసింది
బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి హైందవం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. నాగ గురునాథ శర్మ లిరిక్స్ రాసిన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్‌గా గుర్తింపు పొందిన సింగర్స్ శ్రేయ, రాజ్యలక్ష్మి పాడారు. ఈ పాట బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సాంగ్‌కు తమన్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
భారీ బడ్జెట్ మూవీగా ద్రౌపది-2.. సాంగ్ రిలీజ్!
రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇటీవలే ద్రౌపది పాత్రలోని రక్షణ చంద్రచూడన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రీసెంట్‌గానే విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అమ్మాయి కాబోయే వరుడిని మనసులో ఊహించుకుంటూ పాడే పాట ఇది. ఈ పాటక జిబ్రాన్ సంగీత అందించారు. ఈ సాంగ్‌ను సామ్రాట్ రాయగా.. పద్మలత పాడారు. ఈ సాంగ్ హృదయానికి హత్తుకునేలా ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ చిత్రంలో నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, వై గీ మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
తెలంగాణ గ్రామీణ ప్రేమకథా చిత్రం.. లవ్ సాంగ్ వచ్చేసింది..!
రవికృష్ణ, మనికా చిక్కాల జంటగా నటిస్తోన్న చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ ప్రేమికులను తెగ అలరిస్తోంది. ఈ పాటకు పూర్ణచారి లిరిక్స్ అందించగా.. ఆదితి భవరాజు, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిన్ని చిన్ని అంటూ సాగే ఫస్ట్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. హరిణి ఇవటూరి, పవన్ కల్యాణ్ పాడారు. ఈ సాంగ్‌కు వంశీకాంత్ రేఖన సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అతడిపై పోలీస్ కేసు.. ఏడుస్తూ సింగర్ మంగ్లీకి క్షమాపణ
ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ, అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలానే ట్రెండింగ్ కూడా అవుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ బాగానే కనిపిస్తున్నాయి. అయితే మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లిఖార్జున్ అనే వ్యక్తి మాత్రం ఈ పాటని, మంగ్లీని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశాడు. దీంతో మంగ్లీ.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ క్రమంలో గురువారం ఉదయం నిందితుడు మల్లిఖార్జున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ ఇతడు ఇలానే అసభ్య కంటెంట్‌తో వీడియోలు చేశాడని గుర్తించారు. మరి స్టేషన్లో ఏం జరిగిందో ఏమో గానీ సదరు మేడిపల్లి స్టార్.. ఏడుస్తూ ఇప్పుడు మంగ్లీకి క్షమాపణ చెబుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'పాట ట్రెండింగ్ ఉంది కదక్క.. కామెంట్ పెట్టిన వాడిని తిట్టాను, మిమ్మల్ని కాదు అక్క. నేను ఎవరినీ తిట్టను అక్క. క్షమించక్క. ఏ మహిళని తిట్టను అక్క, ఎవరిపై కామెంట్ చేయను అక్క. ప్లీజ్ అక్క, క్షమించు అక్క' అని మల్లిఖార్జున్ చెబుతున్న వీడియో ఇప్పుడు కనిపిస్తుంది. మంగ్లీ పెట్టిన ఈ కేసుని.. సోషల్ మీడియాలో వీడియోలు ప్రతిఒక్కరూ గమనించాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు కచ్చితంగా ఆలోచించి మాట్లాడితే బెటర్. లేదంటే పోలీస్ స్టేషన్లో చిక్కులు గ్యారంటీ.(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?) -
సింగర్‌గా నవీన్ పొలిశెట్టి.. హుషారెత్తించే పాట రిలీజ్
'జాతిరత్నాలు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మరో హిట్ అందుకున్నాడు. దీని తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే చిత్రం చేస్తున్నాడు. రాబోయే సంక్రాంతికి దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఇప్పటికే దసరా, దీపావళికి ప్రమోషనల్ వీడియోలు వదిలిన నవీన్.. ఇప్పుడు తొలి పాటని రిలీజ్ చేశారు. 'భీమవరం బల్మా' అంటూ సాగే ఈ గీతాన్ని.. భీమవరంలోనే ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లోనే గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. పాట కలర్ఫుల్గా ఉంది. నవీన్-మీనాక్షి కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి మారి దర్శకుడు.(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?) -
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘బిగ్‌బాస్’ ఫేం నిఖిల్ పాట
యూట్యూబ్‌లో ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలో ఓ మెలోడీ గీతాన్ని వదిలి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘తేనెల వానలా’ అంటూ సాగే తెలుగు రొమాంటిక్ మెలోడీ గీతాన్ని నవంబర్ 20న వదిలారు. ప్రాచి, నిఖిల్ కలిసి ఈ మెలోడీ గీతాన్ని వీక్షకులకు నచ్చేలా, మెచ్చేలా మలిచారు. ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉండటమే కాకుండా వినసొంపుగానూ ఉండి శ్రోతల్ని మెప్పిస్తోంది.కార్వార్, గోవాలోని అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ, జలపాతాలు, పచ్చని తీరప్రాంతాల్లోని విజువల్స్‌ను చూపిస్తూ కట్టి పడేశారు. ఈ పాటలో ప్రాచి తెహ్లాన్ ఎంతో అందంగా కనిపించారు. నిఖిల్ లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకు వచ్చినట్టు అయింది.‘తేనెల వానలా’ పాటను జీ మ్యూజిక్ నిర్మించింది. ఆ సంస్థ యూట్యూబ్ ఛానెల్లోనే ఈ పాట ప్రసారం అవుతోంది. వీహ అద్భుతమైన గానం, హృదయాన్ని హత్తుకునేలా చరణ్ అర్జున్ ఇచ్చి బాణీ, సాహిత్యం ఈ పాటను అందరికీ మరింత చేరువ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. -
బ్లూ, ఎల్లో కలిస్తే గ్రీన్ ఒస్తాది.. సాంగ్ విన్నారా?
టాలీవుడ్ నటుడు, నందు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ (Psych Siddhartha Movie). పేరుకు తగ్గట్లే సినిమాలో బూతులకు కొదవే లేదు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యామిని భాస్కర్ హీరోయిన్. ఇటీవల రిలీజైన టీజర్ మొత్తం బూతులతోనే నిండిపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బ్లూ ఎల్లో కలిపితే రెడ్ అవుతాది అంటూ సాగే ఈ పాట వెరైటీగా ఆకట్టుకుంటోంది.వదిలేసి వెళ్లిపోయిందిసిగరెట్స్ లంగ్స్‌కు అస్సలు మంచిది కాదు.. అయినా అందరూ ఇంటర్వెల్లో కాలుస్తారు. ఆల్కహాల్.. లివర్‌కు అస్సలు మంచిది కాదు. అయినా అందరూ బేబీ సినిమా చూసొచ్చి తాగుతారు. అట్లనే లవ్.. హార్ట్‌కు అస్సలు మంచిది కాదు. అయితే మీరందరు లవ్ చేసిర్రని తెలుసు.. నేను కూడా అట్లనే చేశిన.. కానీ, ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయిందిరా అంటూ ఏడుపందుకున్నాడు నందు. ఆ తర్వాత అసలు పాట మొదలైంది.కలర్స్ సాంగ్'బ్లూ, ఎల్లో కలిసినాయంటే గ్రీన్ ఒస్తాది.. రెడ్, ఎల్లో కలిసినాయంటే ఆరెంజ్ ఒస్తాది.. బ్లాక్.. నలుపాయే జిందగీ నువ్వెళ్లిపోతే చెలి' అంటూ పాట సాగింది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు. పాట వెరైటీగా భలే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: దండం పెడ్తా.. పంపించు బిగ్‌బాస్: అడుక్కున్న సోహైల్ -
శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా.. మెలోడీ సాంగ్ రిలీజ్
నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్.. బాలనటుడిగా కాస్త పరిచయమే. 'రుద్రమదేవి' మూవీలో అలా నటించాడు. కాస్త పెద్దోడు అయిన తర్వాత 'నిర్మల కాన్వెంట్' చిత్రంతో హీరో అయ్యాడు. 2021లో 'పెళ్లి సందD' అనే సినిమా చేశాడు. దీనితోనే శ్రీలీల.. హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీ తర్వాత శ్రీలీల వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ అయిపోయింది. రోషన్ మాత్రం మరో మూవీ చేయలేకపోయాడు. ఇన్నాళ్లకు ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అదే 'ఛాంపియన్'.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)డిసెంబరు 25న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకుడు కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. ఈమెకు ఇదే తొలి తెలుగు మూవీ. విడుదలకు మరో నెల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలి పాటని రిలీజ్ చేశారు. 'గిర గిర గింగిరిగిరే' అంటూ సాగే రామ్ మిర్యాల పాడిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా) -
శ్రీలీల- శివకార్తికేయన్ పరాశక్తి.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రత్నమాల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
పెళ్లిలో జగనన్న పాట.. వద్దన్న పోలీసులపై ప్రజల ఆగ్రహం
అనంతపురం జిల్లా: పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట రావడంతో కూడేరు పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని ఊరేగింపును అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పాటను పెట్టరాదంటూ హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. ఈ ఘటన కూడేరు మండలం కలగళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... కలగళ్లలో వడ్డే శ్రీకాంత్, రూప వివాహం ఆదివారం జరిగింది. అదే రోజు రాత్రి ఊరేగింపులో కుటుంబసభ్యులు డీజే ఏర్పాటు చేసి బంధు మిత్రులతో కలసి సరదాగా డ్యాన్స్ చూస్తూ సందడి చేయసాగారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రూపొందించిన పాట ప్లే కావడంతో పిల్లలు, యువత రెట్టింపు ఉత్సాహంతో ఈలలు వేస్తూ స్టెప్పులు వేశారు.ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు. అయితే వైఎస్ జగన్ పాటలు పెట్టరాదని పోలీసులు చెప్పడంతో పోలీసుల తీరుపై పెళ్లి వారితో పాటు పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. ఇదే గ్రామంలో టీడీపీ వారు పెళ్లి ఊరేగింపులో డీజే పెట్టి టీడీపీ పాటలు పెట్టి సంబరాలు జరుపుకున్నారని, ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలు తిరగబడడంతో పోలీసులు మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రభాస్ 'ది రాజా సాబ్'.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas)- మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్సాబ్ పేరుతో ఈ ఫుల్ సాంగ్‌ను(The Raja Saab First Single) విడుదల చేశారు. ఈ పాట రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఊపేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. -
బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాజికాయ.. జాజికాయ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు తమన్ సంగీతమందించారు.ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. #ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025 -
చంద్రబోస్ రిలీజ్ చేసిన 'వసుదేవసుతం' మెలోడీ సాంగ్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమా 'వసుదేవసుతం'. వైకుంఠ్ బోను దర్శకుడు కాగా ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యాయి. రీసెంట్గా ఈ మూవీ నుంచి ఓ మెలోడీ పాటని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.మణిశర్మ సంగీతమందించిన 'ఏమైపోతుందో' అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. పవన్, శృతిక పాడారు. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ అందంగా చూపించారు. పాట రిలీజ్ చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ.. 'వసుదేవసుతం'లోని 'ఏమైపోతుందో' పాట చాలా బాగుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది. -
'అఖండ 2' నుంచి తాండవం పాట రిలీజ్
బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తీస్తున్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2'. డిసెంబరు 5న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'ద తాండవం' అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. తొలి పార్ట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 2021లో విడుదల చేశారు. ఈసారి పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ: నటుడు చిన్నా)ఇందులో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ ఎప్పటిలానే చెవులు దద్దరిల్లే సంగీతమందించాడు. విజువల్స్ చూస్తుంటే బోయపాటి మార్క్ స్పష్టం కనిపిస్తుంది. డిసెంబరు 5న ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరి ఈసారి అఖండ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: పాస్‌పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి: మహేశ్) -
కనకం కన్నే కొడితే...
మెట్రో శిరీష్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా ‘నాన్ వయొలెన్స్’. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఏకే పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి తమిళ ‘కనగ’ పాట లిరికల్ వీడియోతో పాటు తెలుగు వెర్షన్ ‘కనకం’ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కనకం కన్నే కొడితే కసా పిసా అయిపోతారు... అందమే ఆరబోస్తే కొంప గూడు వదిలేస్తారు...’ అనే లిరిక్స్‌తో ‘కనకం’ పాట సాగుతుంది. ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం అందించగా, తేజస్వినితో కలిసి ఈ చిత్రసంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పాడారు. ఈ పాటలో ‘మెట్రో’ శిరీష్, శ్రియ శరణ్‌ల ఎనర్జిటిక్ మూవ్స్ కనిపిస్తాయి. బాబీ సింహా, యోగిబాబు, అదితి బాలన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శర్వానంద్ బైకర్.. రిలీజ్‌కు ముందే ఫుల్ వీడియో సాంగ్
చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బైకర్ మూవీ ఫస్ట్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రెట్టి బేబీ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు.కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను జిబ్రాన్, యాజిన్ నైజర్, సుభ్లాషిణి ఆలపించారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ శర్వా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
విజయ్ కచేరి సాంగ్.. ఫేక్ వ్యూస్‌పై స్పందించిన యూట్యూబ్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ'జన నాయగణ్'. పొలిటిక్స్‌లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ కెరీర్లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'దళపతి కచేరీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో ఏకంగా 44 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రిలీజైన గంటలోనే ఏకంగా 3 మిలియన్స్ వ్యూస్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు వ్యూస్ పెంచుకునేందుకు బాట్స్ ఉపయోగపడ్డాయా అంటూ ట్రోల్ చేశారు.కచేరీ సాంగ్‌పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ కూడా స్పందించింది. ఇలాంటి వాటిని గుర్తించడానికి(లైక్‌లు, వ్యూస్) తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని యూట్యూబ్ తెలిపింది. అవీ ఒరిజినల్ లేదా ఫేక్ అని ధృవీకరించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందని పేర్కొంది. కాగా.. దళపతి కచేరి' పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించగా.. అనిరుధ్, అరివు, విజయ్ ఆలపించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. To maintain a fair & positive experience across YouTube, we have systems that verify if views are valid & should be counted! more on that here: https://t.co/7ia2e2f2VE— TeamYouTube (@TeamYouTube) November 12, 2025 -
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'అన్నకు మేమే ఫ్యాన్స్.. ఇప్పుడేస్తాం డ్యాన్స్'.. మాస్ సాంగ్ రిలీజ్
మాస్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్ రామ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు దినేశ్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. వివేక్ అండ్ మెర్విన్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
ఇన్నిరోజులు అసలు సినిమా తీస్తున్న విషయమే బయటకు రానీయకుండా జాగ్రత్తపడిన రాజమౌళి.. ఇప్పుడు మాత్రం అన్ని సడన్ సర్ప్రైజులు ఇస్తున్నాడు. ఈనెల 15న హైదరాబాద్‌లో మహేశ్ బాబు 'SSMB29' మూవీకి సంబంధించి భారీ ఈవెంట్ జరగనుంది. దీన్ని హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మహేశ్, ప్రియాంక చోప్రా వీడియో బైస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు.అలానే కొన్నిరోజుల క్రితం ఇదే సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కుంభ పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీల్ ఛైర్లో ఉన్న పృథ్వీరాజ్ లుక్‌పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా 'గ్లోబ్ ట్రాటర్' అనే పాటని రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రుతి హాసన్ దీన్ని పాడటం విశేషం.'సంచారి.. సంచారి' అని సాగే లిరిక్స్.. హీరో గురించి చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. ఈ పాటని సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే ఈ వారం జరగబోయే ఈవెంట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. శ్రుతి హాసన్ పాడింది అంటే కచ్చితంగా మూవీలో ఉంటుందనే అనుకోవచ్చేమో? View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో తన చివరిదైన 'జన నాయగణ్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన తొలి పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'తళపతి కచేరీ' అంటూ సాగే మూవీలోని తొలి పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)అనిరుధ్ ఎప్పటిలానే మరో మాస్ బీట్తో అలరించాడు. దానికి విజయ్, జనాలతో కలిసి వేసిన సింపుల్ స్టెప్పులు.. ఆయన అభిమానులకు కనువిందు చేసేలా ఉన్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సింగారాల సీతాకోకవే అంటూ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్, ఢీ, సీ రోల్డాన్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజికల్ లవర్స్‌ను తెగ అలరిస్తోంది. ఇందులో రవిమోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. -
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ఎమోషనల్ సాంగ్ ఫుల్ వీడియో!
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. బాగుండు పో.. అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ సాంగ్‌కు రాజజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజీత్ హెగ్డే, సాయి అభ్యంకర్ ఆలపించారు. ఈ పాటను సాయి అభ్యంకర్ కంపోజ్ చేశారు. కాగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. -
సింగారాల సీతాకోక.. సాంగ్ ప్రోమో రిలీజ్
శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో పరాశక్తిపై ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది. సినిమా టైటిల్ కూడా ఇందుకు ఒక కారణం. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2026 జనవరిలో సంక్రాంతి సందర్బంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. మంగళవారం నాడు ఈ సినిమా నుంచి సింగారాల సీతాకోక.. పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్, శ్రీలీల స్టెప్పులేశారు. ఫుల్ సాంగ్ నేడు (నవంబర్ 6న) విడుదల కానుంది. -
రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్‌ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. -
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్‌కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్‌ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_) -
హైదరాబాద్‌కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం.. నెటిజన్స్ ఫిదా!
టాలీవుడ్ సినిమాకు ఉన్న క్రేజే వేరు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ వరల్డ్ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే రాజమౌళి బాహుహలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఆస్కార్ వేదికపై తెలుగోడి సత్తా చాటాడు. అందుకే మన తెలుగు సినిమాలంటే ఫారినర్స్ కూడా పడి చచ్చిపోతారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే పుష్ప మేనరిజంతో అలరిస్తాడు. తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో నితిన్ రాబిన్‌హుడ్ మూవీలో కెమియో పాత్రలో సందడి చేశాడు.అంతలా తెలుగు సినిమాలకు ఫారినర్స్ ఫిదా అవుతున్నారు. డేవిడ్ వార్నర్ లాగే ఎప్పటి నుంచో స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ దంపతులు మన చిత్రాలకు డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. కొత్త సినిమాలో ఏ హిట్ సాంగ్ వచ్చినా వీరిద్దరు కలిసి రీల్ చేయాల్సిందే. అలా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టు సాంగ్ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అంతేకాకుండా పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు తమదైన స్టెప్పులతో అదరగొట్టేశారు.తాజాగా మరో టాలీవుడ్ సాంగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా అంటూ సాగే పాటతో అలరించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం మూవీలో ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇటీవల రిలీజైన కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్ స్టైల్లో అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. కర్ల్ స్వాన్బెర్గ్ తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్.. మీరిద్దరు హైదరాబాద్‌కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మా ఇండియన్స్ కంటే మీ వీడియోలే బాగుంటాయని మరికొందరు కొనియాడుతున్నారు. మీ ఇద్దరికి ఆధార్, పాన్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత నాది అంటూ మరో నెటిజన్స్ భరోసానిస్తూ కామెంట్ చేశాడు. ఏది ఏమైనా మన తెలుగు సినిమాకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
రామ్-భాగ్యశ్రీ నుంచి మరో మెలోడీ సాంగ్
రామ్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ఆంధ్రా కింగ్ తాలుకా'. నవంబర్ 28న మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రాగా అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్యలో తీసిన మరో మెలోడీ గీతాన్ని తాజాగా రిలీజ్ చేశారు. 'చిన్ని గుండెలోనా..' అంటూ సాగే ఈ గీతం వినసొంపుగా ఉంటూ శ్రోతల్ని అలరిస్తోంది.(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ రామ్‌కి హిట్స్ దక్కట్లేదు. ఈ క్రమంలోనే 'ఆంధ్రా కింగ్ తాలుకా'పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఓ ఫ్యాన్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్‌తో మూవీ తీస్తున్నారు. సినిమా హీరోలు, వాళ్ల ఫ్యాన్స్ మధ్య ఉండే ఎమోషన్స్ తదితర అంశాల్ని చూపిస్తూనే మరోవైపు ప్రేమకథని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్) -
దుల్కర్ సల్మాన్ కాంత.. మరో సాంగ్ వచ్చేసింది
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సో జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత. ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన సాంగ్ దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరిస్తోంది. ఇంగ్లిష్ లిరిక్స్‌తోపాటు తమిళం, తెలుగు ర్యాప్‌తో కూడిన ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ఈ సాంగ్‌కు జాను చంతర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. -
రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కురిసే వాన తడిపేయాలన్ని భూమే ఏదో.. అంటూ సాగే మూడో లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్‌కు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రొమాంటిక్ లిరికల్ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. కాగా.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. -
టాలీవుడ్ స్పై డ్రామాగా 'చైనా పీస్'.. జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. -
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. సింగారి ఫుల్ వీడియో వచ్చేసింది
డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటేస్ట్ మూవీ డ్యూడ్. ఈ దీపావళికి థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో డ్రాగన్ హీరో హ్యాట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సింగారి అనే సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 17న రిలీజైన ఈ చిత్రంలో శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. #Singari video song from #Dude out now 🤩🤩Tamil ▶️ https://t.co/W6GmIS2HeDTelugu▶️https://t.co/pU5RQH4swgVibe to this beautiful composition ❤️A @SaiAbhyankkar musical 🎼⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and directed by @Keerthiswaran_Produced by… pic.twitter.com/hf6XMeMwE3— Mythri Movie Makers (@MythriOfficial) October 29, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. క్రేజీ సాంగ్ ఫుల్ వీడియో
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా చిత్రం కె-ర్యాంప్. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. జైన్స్ నాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీని రాజేశ్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఓనమ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కిరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించింది. ఇంకెందుకు ఆలస్యం ఓనమ్ ఫుల్ సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. -
'సంతాన ప్రాప్తిరస్తు' నుంచి 'తెలుసా నీ కోసమే' సాంగ్ లాంచ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం సినిమాలోని ఓ పాట లాంచ్ చేశారు. తెలుసా నీ కోసమే అంటూ సాగే లిరికల్ గీతాన్ని అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్' లాంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.. ఈ గీతాన్ని కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు. -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్‌కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్‌లో చిరు వేసే స్టెప్పులు సింపుల్‌గా కనిపిస్తూనే చాలా స్టైలిష్‌గా ఉంటాయి. లిరికల్ సాంగ్‌కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్‌గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్‌తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
ట్రెండింగ్‌లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె ర్యాంప్ మూవీ (K Ramp Movie) హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రారంభంలో హీరో.. ఇదేమిటమ్మా మాయా మాయా.. అంటూ రాజశేఖర్ సాంగ్‌ను రీక్రియేట్ చేశాడు. మాస్ స్టెప్పులతో ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. సినిమాకు మంచి ఎనర్జీనిచ్చిన ఈ సాంగ్ వీడియోను గురువారం నాడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఒరిజినల్ సాంగ్ రిలీజ్దీంతో అది టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇదేమిటమ్మా మాయా... ఒరిజినల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఆయుధం సినిమాలోనిది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా చిన్ని చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ సాను, నిష్మా ఆలపించారు. ఈ సాంగ్‌లో రాజశేఖర్, గుర్లీన్ చోప్రా (Gurleen Chopra) జంటగా స్టెప్పులేశారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌తో స్టెప్పేసిన బ్యూటీ ఎవరు?చండీగఢ్‌కు చెందిన గుర్లీన్ చోప్రా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఒక పెళ్లాం ముద్దు- రెండో పెళ్లాం వద్దు, నేను సైతం, ఖాకీ, పాండవులు పాండవులు తుమ్మెద, శివ కేశవ్ చిత్రాలు చేసింది. హిందీ, కన్నడ, తమిళ, పంజాబి, మరాఠి భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2020 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంది. నటుడు డేవిందర్ రాంధ్వాను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కౌన్సెలింగ్ విత్ జీసీ పేరిట ఓ వెబ్సైట్ నడిపిస్తోంది. ఇందులో ఆమె పోషకాహార నిపుణురాలిగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by ACTRESS GURLEEN CHOPRA (@igurleenchopra)చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా? -
రవితేజ- శ్రీలీల 'సూపర్ డూపర్ హిట్టు సాంగ్'.. చూశారా?
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ధమాకా' మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. మూడేళ్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర (Mass Jathara Song). ధమాకాకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు సాంగ్ వచ్చాయి. తూ మేరా లవ్వరు, ఓలే ఓలే.., హుడియో హుడియో.. సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో పాట రిలీజ్ చేశారు.సూపర్ డూపర్ హిట్టు సాంగ్అదే సూపర్ డూపర్ హిట్టు సాంగ్! ఈ పాటకు రిథమ్ లేదు.. కదం లేదు, పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్టని లిరిక్స్లోనే చెప్తున్నారు. రోహిణి, భీమ్స్ సిసిరోలియో ఆలపించిన ఈ పాట సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ జాతర విషయానికి వస్తే.. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చదవండి: నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది? -
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. గాడ్ మోడ్..త్వరలోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండగ సందర్భంగా సాంగ్ గాడ్ మోడ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేశారు. నల్లని దుస్తులు, చేతిలో కత్తితో సూర్య నటించిన ఊరమాస్ ట్యూన్స్‌తో రూపొందిన ఈ పాట ఇప్పుడు అబిమానులను విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలను సైతం పెంచేస్తోంది. ఇకపోతే సూర్య ఈ చిత్రంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంనూలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
మీసాల పిల్ల సాంగ్ క్రేజ్.. యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ మరో బ్లాక్ బస్టర్ కోసం రెడీ అయిపోయాడు.ఇటీవలే ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు.కాగా.. ఈ రొమాంటిక్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. There’s no stopping the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 🔥🔥🔥#MeesaalaPilla is trending #1 on YouTube with 30M+ Views, 30K+ Reels on insta, 300M+ Reel Views and 50M+ Plays across all music platforms 💥💥💥AN UNANIMOUS MUSICAL SENSATION IN INDIA ❤️🔥❤️🔥❤️🔥--… pic.twitter.com/6rqiuAUop5— Shine Screens (@Shine_Screens) October 21, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
రివాల్వర్ రీటా.. హ్యాపీ బర్త్‌డే సాంగ్ రిలీజ్
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ (Keerthy Suresh)కు 2024 పెద్దగా కలిసి రాలేదు. వృత్తిపరంగా వరుస అపజయాలను చవి చూసిన ఆమె వ్యక్తిగతంగా మాత్రం మధురమైన ఘట్టానికి చేరుకున్నారు. తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లి చేరుకున్నారు. అయితే సినిమాలకు మాత్రం కాస్త దూరం అయ్యారనే చెప్పాలి. ఈమె నటించిన రఘు తాత, హిందీ చిత్రం మేరీజాన్ చిత్రాలు నిరాశపరిచాయి. ఉప్పు కప్పరంబు అనే వెబ్‌సీరీస్‌లో నటించినా, అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదించారు.సినిమాఇప్పుడు కీర్తి సురేశ్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పటికే తెలుగులో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వాటిలో ఒకటి రివాల్వర్ రీటా (Revolver Rita Movie). ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి చంద్రు దర్శకుడు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు నిర్వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 17) కీర్తిసురేష్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రివాల్వర్ రీటా చిత్ర యూనిట్ ఒక సాంగ్ విడుదల చేసింది. -
విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తోన్న తాజా చిత్రం బైసన్(Bison Kaalamaadan). ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఈ రోజు రిలీజ్ అయింది. వచ్చేవారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే బైసన్ మూవీ నుంచి ఓ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి మనసు అంటూ సాగే పాటను విడుదల చేశారు. మారి సెల్వరాజ్ రాసిన ఈ సాంగ్‌ను తెలుగులోకి యనమండ్ర రామకృష్ణ ట్రాన్స్‌లేట్ చేశారు. ఈ పాటను మనువర్ధన్, గాయత్రీ సురేశ్ ఆలపించారు. -
పల్సర్ బైక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే?
సినిమా పాటల్ని సైతం వెనక్కు నెడుతూ జానపద పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రాను బొంబాయికి రాను, సొమ్మసిల్లిపోతున్నవే.., ఆడనెమలి.., సీమదసర సిన్నోడు.. ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్‌లో మోత మోగిస్తున్నాయి. పల్సర్ బైక్ (Pulsar Bike Song) కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ పాట రిలీజైన కొత్తలో.. ఏ ఫంక్షన్లో చూసినా ఈ సాంగే మోగేది. 2018లో ఇండస్ట్రీకి..ఇక ఈ ఒక్క పాటతోనే ఫుల్ సెన్సేషన్ అయ్యాడు సింగర్ రమణ (Singer Ramana). ఈ సాంగ్‌ను రవితేజ ధమాకా సినిమాలో పెట్టడంతో మరింత పాపులారిటీ వచ్చింది. తాజాగా ఈ పాట గురించి రమణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 'నేను 2018లో ఈ ఇండస్ట్రీకి వచ్చాను. 2022లో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. జీవితంలో ఊహించనంత పాపులారిటీ వచ్చింది. ఆ రోజుల్లో ఒక ఆడియో సాంగ్ చేయాలంటే రూ.15-20 వేలల్లో అయిపోయేది.పల్సర్ బైక్‌కు ఎంతొచ్చిందంటే?కానీ, ఆ రూ.20 వేలు కూడబెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈవెంట్‌కు వెళ్తే రూ.2-3 వేలు మిగిలేవంతే! ఎక్కువ డబ్బు వచ్చేది కాదు. పల్సర్ బైక్ ఆడియో సాంగ్ రూ.5-10 వేలల్లో అయిపోయింది. వీడియో సాంగ్ కూడా కలుపుకుంటే రూ.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. కానీ ఈ పాట మేము ఊహించని స్థాయిలో రూ.40-50 లక్షల డబ్బు తెచ్చిపెట్టింది' అని రమణ చెప్పుకొచ్చాడు.చదవండి: అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా -
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌తో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్‌తో వచ్చిన ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A symphony of faith, a celebration of devotion 🔱🔥#Brahmakalasha Video Song from #KantaraChapter1 out now 🎵▶️ https://t.co/wzi1h7ek5l#BlockbusterKantara in cinemas now!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/VKVnnqXmrq— Hombale Films (@hombalefilms) October 8, 2025 -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్‌కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయమది: రష్మిక పోస్ట్ వైరల్
టాలీవుడ్లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరలవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. వీరిద్దరిపై ఎప్పటి నుంచో డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ అదే జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి థామా.. మరొకటి ది గర్ల్‌ఫ్రెండ్. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. లేటేస్ట్‌గా రిలీజైన థామా సాంగ్ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు. ఆ సాంగ్ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇదంతా దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రష్మిక తన అందంతో డ్యాన్స్‌తో అభిమానులను అలరించింది. తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.రష్మిక తన పోస్ట్‌లో రాస్తూ.. 'మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ చేశాం. అయితే షూట్ చివరి రోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు. ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే పాటను పూర్తి చేశాం. మేము ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ సాంగ్ స్టిల్స్‌ను షేర్ చేశారు. కాగా.. ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజ్య ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్‌కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్‌లో ఉన్న పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్‌కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ఏఆర్ రెహ్మాన్‌ను సైతం ఆకట్టుకున్న ఫాతిమా ఫ్యామిలీ
తిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. View this post on Instagram A post shared by Fathima Shadha (@fathimashadhav) కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు -
డబుల్ సెలబ్రేషన్స్
ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్‌తో ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్. ఇంతకీ ఈ జోష్‌కి కారణం ఏంటంటే... స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్ ఆఫ్ 80స్’ అంటూ 1980స్కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్ ఉంటుంది. ఈసారి రీ యూనియన్‌కి చెన్నై వేదికైంది.ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్ శనివారం హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్ సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.‘‘చిరంజీవి, వెంకటేశ్గార్లను కలిసి సెట్స్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇటు రీ యూనియన్ సెలబ్రేషన్స్ అటు సెట్స్‌లో సెలబ్రేషన్ సాంగ్... ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్‌కు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. -
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ.. భయపెట్టేలా సాంగ్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జటాధర. ఈ మూవీలో పాన్ ఇండియా మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో పాటను విడుదల చేశారు.జటాధర మూవీలోని ధన పిశాచి అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా..సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటకు సమీర్ కొప్పికర్ సంగీతమందించారు. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. -
Pre Wedding Show: ఆకట్టుకుంటున్న‘వయ్యారి వయ్యారి’ సాంగ్
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కె. సోమ శేఖర్, ఎడిటర్‌గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రజ్ఞయ్ కొణిగారి పని చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
ఓం నమః శివాయ.. జటాధర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్‌లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో. చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ -
వాషి యో వాషి.. పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజీ (They Call Him OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా యాక్ట్ చేశాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.సాంగ్ రిలీజ్సెప్టెంబర్ 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దానికంటే ముందు ఓ సర్ప్రైజ్ వదిలారు. పవన్ పాడిన 'వాషియో వాషి' పాటను రిలీజ్ చేశారు. ఇది జపనీస్ భాషలో సాగుతుంది. అయితే ఇదంతా పవన్ ఏదో డైలాగులు చెప్తున్నట్లు ఉందే తప్ప అసలు పాటలానే లేదు.డబ్బులు దండుకునే పనిఇక ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను భారీగా పెంచారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అంటూ డైలాగులు చెప్పే పవన్.. తన సినిమావంతు వచ్చేసరికి మాత్రం ప్రజల జేబులో డబ్బులు దండుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. కాగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్‌డే.. కీరవాణి స్పెషల్ సాంగ్
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పలు భాషల్లో రూపొందించిన ఈ పాటకు తెలుగులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతమందించారు. మోదీ పుట్టిన రోజున విడుదలైన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.నమో నమో ఆర్త బాంధవుడా.. అంటూ సాగే ఈ పాటను ఎం ఎం కీరవాణి, షగున్ సోధి, ఐరా ఉడిపి ఆలపించారు. మోదీ జీ @75 పేరుతో ఈ పాటను టీ సిరీస్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో మోదీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను ప్రస్తావించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ సాంగ్‌ను చూసేయండి.On the 75th birthday of Shri Narendra Modi Ji, we celebrate his spirit of service and vision for New India with “Modi Ji@75”. 🙏🇮🇳https://t.co/CGQ4AJtH9l#HappyBirthdayModiji @narendramodi@mmkeeravaani #ShagunSodhi #AiraaUdupi #Nadaan #Tseries pic.twitter.com/XimgRvVpR1— T-Series (@TSeries) September 17, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓమీ అనే సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఓమీ సాంగ్‌లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు.తాజాగా ఈ చిత్రం నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే పాటను విడుదల చేశారు. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
కాంతార ప్రీక్వెల్... రంగంలోకి నేషనల్ అవార్డ్ సింగర్!
కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు.ఈ సాంగ్‌ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసాంజ్, హోంబలే ఫిల్మ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. Excited to join hands with @diljitdosanjh for the Kantara album 🙏✨By Shiva’s grace, everything fell into place. Much love, Paji ❤️🔥Another Shiva bhakt meets Kantara.#KantaraChapter1 #KantaraChapter1onOct2 pic.twitter.com/44ya4cyL8S— Rishab Shetty (@shetty_rishab) September 12, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
రజినీకాంత్ కూలీ.. పూజా హెగ్డే మోనికా వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. పూజాహెగ్డే తన డ్యాన్స్‌తో మెప్పించిన మోనికా ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో సౌబిన్ షాహిర్ ఆడియన్స్‌ను మెప్పించారు.కాగా.. పాటను తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్స్ కూడా విడుదల చేశారు. గతంలో కుర్రకారును ఓ రేంజ్లో ఊపేసిన మోనికా ఫుల్ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. మరోవైపు ఈ సూపర్ హిట్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. Finally, Our Monica Bellucci erangi vandhachi 💃🏻 #Monica video song is out now! 💘Tamil ▶️ https://t.co/HqBfqY7AdbTelugu ▶️ https://t.co/tnMJvrUCZBHindi ▶️ https://t.co/SDtC7RjCdyKannada ▶️ https://t.co/BrwN1rAbV7Malayalam ▶️ https://t.co/viT48NIpOR@rajinikanth… pic.twitter.com/Qoy1Y3rhdc— Sun Pictures (@sunpictures) September 11, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
సింగర్‌గా రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే.. రామ్‌కు జంటగా నటిస్తోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని పప్పీ షేమ్ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌ను రామ్‌నే ఆలపించడం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించహా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. -
'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'లిటిల్ హార్ట్స్' హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఈ మూవీలో మిగతా పాటలేమో గానీ సెకండాఫ్‌లో వచ్చే 'కాత్యాయని' పాట అయితే వేరే లెవల్ ఉంటుంది. సంగీతంలో ఉండే రూల్స్ లాంటివి ఏం అందులో పాటించరు కానీ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయిదే ఇది రీమేక్. దీనికి ఒరిజినల్ ఇప్పటికే ఉంది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)'కాత్యాయని' అంటూ సినిమాలో ఉన్న పాటకు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్‌లో రిలీజైన ఓ సాంగ్ మూలం. శరత్ గౌడ్ అనే కుర్రాడు 'కమాన్ బేబీ' పేరుతో ఓ గీతాన్ని పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పట్లో పెద్ద వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజైన తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పాటని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్ ఓసారి వినేయండి.'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో పెద్ద కథేం ఉండదు. ఫన్నీ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తున్నాయి. నాలుగు రోజుల్లో కలెక్షన్ కూడా చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: హిందీ వెబ్ సిరీస్‌లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్) -
మాస్ డ్యాన్స్?
మాస్ డ్యాన్స్ చేస్తారా? రొమాంటిక్ సాంగ్ పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్ షూట్ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్‌లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ‘‘భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు.చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్ తెలియజేసింది. అయితే... ఇది మాస్ నంబరా? రొమాంటిక్ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
'నువ్వే చెప్పు చిరుగాలి' పాట లాంచ్ చేసిన మంచు మనోజ్
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ చెలియా'. రూపాశ్రీ కొపురు నిర్మించగా ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద 'ఓ చెలియా' నుంచి తొలి పాటని రిలీజ్ చేశారు.'నువ్వే చెప్పు చిరుగాలి' అని సాగే ఈ పాటని మంచు మనోజ్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ గీతాన్ని సాయి చరణ్ ఆలపించగా, ఎంఎం కుమార్ బాణీని అందించారు. సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించబోతోన్నారు. -
మంగ్లీ నుంచి డిఫరెంట్ సాంగ్.. వినాయకుడి పాట
మంగ్లీ పేరు చెప్పగానే తెలంగాణ ఫోక్ సాంగ్ ఎక్కువగా గుర్తొస్తుంటాయి. పల్లె గీతాలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాల్లోనూ అడపాదడపా కమర్షియల్ పాటలు పాడుతూనే ఉంది. అయితే మంగ్లీ అంటే ఒకేలాంటి పాటలు పాడుతుంది అనే అభిప్రాయం చాలామందికి ఉంది. అలాంటిది ఇప్పుడు ఓ డిఫరెంట్ సాంగ్‌తో వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని స్తూతిస్తూ ఈ పాట పాడింది.(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్) కర్ణాటిక్ మ్యూజిక్ కూడా గతంలోనే నేర్చుకున్న మంగ్లీ.. ఇప్పుడు వినాయకుడి గీతాన్ని ఆ జానర్లోనే పాడింది. 'శ్రీ గణపతిని' అంటూ సాగే ఈ గీతం రెండు రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేసింది. రెస్పాన్స్ కూడా బాగానే వస్తోంది. మీరు కూడా ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
టాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తోన్న తాజా యూత్ ఫుల్ లవ్ స్టోరీ బ్యూటీ. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్వీ సుబ్రహ్మణ్యం అందించగా.. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్లపై విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రెట్టీ ప్రెట్టీ అంటూ రొమాంటిక్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ తాజా లవ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు విజయ బుల్గానిన్ సంగీతమందించగా.. సనారే లిరిక్స్ రాశారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను పీవీఎన్ఎస్ రోహిత్ పాడారు. ఈ సినిమాను సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో నటించారు. -
దేవర సాంగ్.. ఆ క్రెడిట్ అంతా మీకేనా.. మాకు ఇవ్వరా?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న రిలీజై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ విజయంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అంతే రేంజ్లో ఆ సాంగ్ కూడా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎక్కడా చూసిన ఆ పాటే వినిపించేది. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుంది.'చుట్టమల్లే చుట్టేస్తావే' అంటూ వచ్చిన దేవర సాంగ్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ రొమాంటిక్ సాంగ్ జూనియర్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. ఇందులో తారక్, జాన్వీ కపూర్ల కెమిస్ట్రీ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.తాజాగా ఇలాంటి పాటలకు వచ్చే క్రెడిట్ తమకు ఇవ్వడం లేదని దేవర సాంగ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్ల పేర్లను పూర్తిగా విస్మరించడం సరికాదంటున్నారు. సాంగ్ పూర్తయ్యాక కొరియోగ్రాఫర్లను మరిచిపోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇక్కడ నాకు క్రెడిట్ ఇవ్వలేదని కాదు.. నేను కాకుండా మరో బ్రాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ అయితే కచ్చితంగా వారి పేర్లు వేసేవాళ్లన్నారు. పాటలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ల బ్రాండ్‌ను దెబ్బ తీయవద్దని మేకర్స్‌ను కోరారు.బోస్కో మాట్లాడుతూ.. 'పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్‌ను మరచిపోతారు. మా కష్టాన్ని ఇతరులకు క్రెడిట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కూడా పాట విడుదలైనప్పుడు కొన్నిసార్లు కొరియోగ్రాఫర్ పేర్లను కూడా చూస్తున్నాం. కానీ కొందరు మాత్రం కొరియోగ్రాఫర్ పేరును ఎప్పుడూ ఉంచరు. వారు ఎల్లప్పుడూ ఆ మూవీ స్టార్ పేరునే ఉంచుతారు. ఒక స్టార్‌కు ఎంత గొప్పగా పేరు వస్తే.. కొరియోగ్రాఫర్‌కు కూడా అంతే గొప్పగా రావాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడికి ఎంత పేరు వస్తుందో.. సింగర్‌కు కూడా అంతే క్రెడిట్ దక్కాలి. నాకు రాకపోయినా.. నా తర్వాత వచ్చే కొత్తతరానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. దేవర సినిమా ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. -
రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. మెలోడీ సాంగ్ రిలీజ్
ఓవైపు స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రష్మిక.. మరోవైపు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. అదే 'గర్ల్ ఫ్రెండ్'. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ స్టోరీతో తీస్తున్నారు. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మిక సరసన నటిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం తొలి పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో గీతాన్ని వదిలారు.చిన్మయి పాడిన ఈ పాట.. మంచి మెలోడీయస్‌గా ఉంటూనే హీరోహీరోయిన్ మధ్య లవ్ ఎలా ఉండబోతుందనేది చూపించింది. ఒకే కాలేజీలో చదువుకునే ప్రధాన పాత్రధారుల మధ్య ప్రేమని చూపించే సీన్స్ అన్నీ ఈ పాటలో కనిపించాయి. చూస్తుంటే రష్మిక.. మరి హిట్ కొట్టేలా కనిపిస్తుంది. లెక్క ప్రకారం ఈ మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. కానీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ఉతుకు పిండు ఆరేయ్’ సాంగ్
విశాఖపట్నం: ఇటీవల విడుదలైన ‘ఉతుకు పిండు, ఆరేయ్’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, విశేష ఆదరణ పొందుతోంది. మాస్ స్టైల్లో సందేశాత్మక లిరిక్స్ ఉండటంతో ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువతను లక్ష్యంగా చేసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ పాట సందేశం ఇస్తోంది. నగరానికి చెందిన 300 మంది కళాకారులతో ఈ పాటను విశాఖ పర్యాటక ప్రాంతాల్లో చిత్రీకరించారు.ఒకేసారి ఇంతమంది కళాకారులతో చిత్రీకరణ జరపడం ద్వారా ఈ పాట తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. పూర్ణామార్కెట్‌కు చెందిన యాదకుమార్ ఈ పాటకు దర్శకత్వం వహించగా, ధనుంజయ్, నిహారిక ఇందులో నటించారు. పల్సర్ బైక్ రమణ ఈ పాటను ఆలపించగా, నిస్సీ జెస్టిన్ సంగీతం, సందీప్ మిరియాల సాహిత్యం అందించారు. పాటకు లభించిన అనూహ్య స్పందన నేపథ్యంలో, వినాయక చవితి సందర్భంగా బుధవారం దీనికి సంబంధించిన డీజే మిక్సింగ్ పాటను విడుదల చేయనున్నట్లు దర్శకుడు యాదకుమార్ తెలిపారు. -
రజినీకాంత్ కూలీ.. మాస్ సాంగ్ వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్‌ను కూలీ అధిగమించింది. కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందితాజాగా ఈ మూవీ నుంచి కొక్కి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను అమోగ్ బాలాజీ పాడగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ మాస్ రజినీకాంత్‌ను ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు.Electrifying & Addictive #Kokki lyric video is out now!🖤🔥 #Coolie▶️ https://t.co/XC6UiW0qcZ #Coolie ruling in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/Sxn6Xu4Xe7— Sun Pictures (@sunpictures) August 22, 2025 -
అనుష్క శెట్టి పాన్ ఇండియా మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
అనుష్కశెట్టి లీడ్ రోల్లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి దస్సోరా అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ సాంగ్‌కు సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా.. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
పవన్ కల్యాణ్ మూవీలో సాంగ్.. ఆ కారణంతో చేయనని చెప్పా: ఉదయభాను
టాలీవుడ్లో యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. నటిగానూ రాణించింది. పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్‌లోనూ మెప్పించిన ఉదయభాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బార్బరిక్ త్రిబాణధారి మూవీతో మరోసారి అభిమానులను పలకరించేందుకు వస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉదయభాను కొన్ని సినిమాల్లో పాటలు చేయడానికి నో చెప్పానని తెలిపింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో పార్టీ సాంగ్‌కు నో చెప్పేశానని వెల్లడించింది. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే డైరెక్టర్‌తోనే నేరుగా వేరేవాళ్లను తీసుకోమని చెప్పానన్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీలోనూ సాంగ్ చేయనని చెప్పానని ఉదయభాను తెలిపారు. అయితే ఆ సాంగ్ చేసేందుకు భయపడ్డానని.. అంత పెద్ద స్టార్స్ మధ్య పార్టీ సాంగ్ కావడంతో చేసేందుకు వెనకడుగు వేశానని ఉదయభాను పేర్కొంది.కాగా.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2013లో రిలీజైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. మాస్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రగిలే అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విజయ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. -
ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ థ్రిల్లర్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమకాు కృష్ణ సౌరభ్ సంగీతమందిస్తున్నారు. -
‘అడుగు అడుగునా..’ ఆకట్టుకుంది: సీపీ సీవీ ఆనంద్
రోహిత్ సాహిని, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టీరియస్’. తాజాగా ఈ సినిమాలోని ‘అడుగు అడుగునా’ పాటని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ఈ పాటను ఆలపించిన సింగర్ కార్తికేయన్‌ను అభినందించాడు. అంకితభావంతో పని చేసే పోలీసు అధికారిపై చిత్రీకరించిన ఈ పాటను అద్భుతంగా ఆలపించాడంటూ ప్రశంసులు కురిపించాడు. ఈ పాటను లిరిక్స్‌తో పాటు సంగీతం అందించిన ఎమ్ఎల్ రాజాకి అభినందనలు తెలియజేశాడు. జయ్ వల్లందాస్ నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. ‘ఎంతో బిజీ గా ఉండి కూడా మా సినిమా లిరికల్ సాంగ్ ని విడుదల చేసినందుకు కమీషనర్ CV ఆనంద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేశాం. దయచేసి అందరూ మా చిత్రాన్ని చూసి మమల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమం లో హీరో రోహిత్ సాహిని, గౌతమ్, దర్శకులు మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహా నిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్)తదితరులు పాల్గొన్నారు. -
'సతీ లీలావతి'గా మెగా కోడలు.. పెళ్లి పాట చూశారా?
వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ మూవీలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లో నాగ మోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చిత్తూరు పిల్లా అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!)పెళ్లి వేడుకలో వచ్చే ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పెళ్లిపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. నూతన్ మోహన్, కృష్ణ తేజస్వీ, రితేష్ జి రావు పాడారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ ఈ సంగీతమందిచారు. ఈ చిత్రంలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. The sound of love, joy, and celebration 💃🕺#ChittoorPilla lyrical video from #SathiLeelavathi is OUT NOW! 🎶- https://t.co/abxPxwEmbxA @MickeyJMeyer Musical 🎶Sung by 🎤 : @Nutana_Mohan, @krishnatejasvi_ & #RiteshGRaoLyrics by ✍: #Vanamali@ActorDevMohan @SatyaTatineni… pic.twitter.com/VM1IrkU1eh— Lavanya konidela tripathi (@Itslavanya) August 12, 2025 -
దుల్కర్ 'కాంత' తొలి సాంగ్ రిలీజ్
విభిన్న చిత్రాలు చేస్తూ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం 'కాంత' అనే మూవీ చేస్తున్నాడు. రానా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్.. కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వచ్చే నెల 12న మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అలా తొలి పాటని విడుదల చేశారు.(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)'పసి మనసే' అంటూ సాగే పాటని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్-భాగ్యశ్రీ డ్యాన్స్.. పాత సినిమాల్లో పాటల్ని గుర్తుచేస్తోంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ కథతో తీసిన ఈ సినిమాలో దుల్కర్ హీరో పాత్ర పోషిస్తుండగా, సముద్రఖని దర్శకుడిగా కనిపించబోతున్నారు. ఓ మూవీ తేసే విషయమై వీళ్లిద్దరి మధ్య ఎలాంటి ఈగోలు చోటుచేసుకున్నాయి. చివరకు ఏమైందనే కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు) -
K Ramp: కలర్ఫుల్గా ఓనం సాంగ్
'క' సినిమాతో అసలు సిసలైన హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) దిల్రూబా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాడు. ప్రస్తుతం ఇతడు కె- ర్యాంప్ సినిమా చేస్తున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు.ఓనం సాంగ్..నేడు (ఆగస్టు 9) రాఖీ పండగను పురస్కరించుకుని కె- ర్యాంప్ (K - Ramp Movie) నుంచి ఓనమ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 'ఇన్‌స్టా ఆపేశానే.. ట్విటర్ మానేశానే.. నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్ల..' అన్న లిరిక్స్‌తో పాట మొదలైంది. చేతన్ భరద్వాజ్, సాహితి చాగంటి ఈ పాట ఆలపించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. సురేంద్ర కృష్ణ లిరిక్స్ సమకూర్చాడు. పాట కలర్ఫుల్గా ఉంది. కిరణ్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశాడు. కె ర్యాంప్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. చదవండి: 'చిట్టి' గుండెల కోసం మహేశ్ బాబు.. -
'పరమ్ సుందరి'గా జాన్వీ కపూర్.. వర్షంలో రొమాంటిక్ సాంగ్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'పరమ్ సుందరి'. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.బీగీ శారీ అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో సిద్ధార్థ్- జాన్వీల కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షంలో చేసిన ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ అద్భుతమైన సాంగ్‌ను శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, సచిన్ జిగర్ ఆలపించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. సచిన్ జిగర్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
టాలీవుడ్ లవ్ స్టోరీ.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ప్రేమిస్తున్నా. ఈ సినిమాకు భాను దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు కనకదుర్గారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఎవరే నువ్వు అంటూ సాగే సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ సూపర్ హిట్ కావాలని విజయ్ సేతుపతి అన్నారు. ఈ పాటను పూర్ణ చంద్ర రచించగా.. సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు.దర్శకుడు భాను మాట్లాడుతూ...' మా ప్రేమిస్తున్నా సినిమా సెకండ్ సాంగ్‌ను హీరో విజయ్ సేతుపతి విడుదల చెయ్యడం మా చిత్ర యూనిట్‌కు దక్కిన అదృష్టం. మా సినిమా కథను తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యడం విశేషం. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ సినిమా' అని తెలిపారు. ఈ సినిమాకు భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
'ఉండిపోవే నా తోనే బంగారం'.. అలరిస్తోన్న కిష్కింధపురి సాంగ్!
బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కిష్కింధపురి. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ ఏడాది భైరవం తర్వాత బెల్లంకొండ నటిస్తోన్న చిత్రం కావడంతో భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఉండిపోవే నాతోనే బంగారం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ బెల్లంకొండ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. జావెద్ అలీ ఆలపించారు. ఈ సాంగ్‌ను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. -
మేఘం వర్షించదా.. లవ్ సాంగ్ రిలీజ్
విజయ రామరాజు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakravarthy Movie). విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో 1.5 మిలియన్ల వ్యూస్ దాటింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మేఘం వర్షించదా' రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ కంపోజ్ చేసిన ఈ పాటకు విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ పాడారు. ఇక ఈ సినిమాలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ చక్రవర్తి ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..! -
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్‌తో ఉన్న బిల్‌బోర్డ్‌ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్‌బోర్డ్‌ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్‌లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
అనుపమ పరదా మూవీ.. బ్యూటీఫుల్ సాంగ్ వచ్చేసింది!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పరదా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే యత్ర నార్యస్తు పూజ్యంతే అనే పాటను విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎగరేయి నీ రెక్కలే అంటూ సాగే బ్యూటీఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు.ఈపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. రితేశ్ జీ రావు ఆలపించారు. ఈ సాంగ్‌ను గోపి సుందర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల థియేటర్లో సందడి చేయనుంది.Let the music take you deep within🎶3rd single from #Paradha is here!#YegareyiNeeRekkale #AkaleEeNeermutthukal Lyrical Video OUT NOWTelugu: https://t.co/7EUihYEyKQMalayalam: https://t.co/wQ31mwufieIn cinemas AUG 22@anupamahere @darshanarajend @sangithakrish @GopiSundarOffl pic.twitter.com/OA2EveLA4D— Paradha Movie (@Paradhamovie) August 5, 2025


