రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇటీవలే ద్రౌపది పాత్రలోని రక్షణ చంద్రచూడన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రీసెంట్‌గానే విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అమ్మాయి కాబోయే వరుడిని మనసులో ఊహించుకుంటూ పాడే పాట ఇది. ఈ పాటక జిబ్రాన్ సంగీత అందించారు. ఈ సాంగ్‌ను సామ్రాట్ రాయగా.. పద్మలత పాడారు. ఈ సాంగ్ హృదయానికి హత్తుకునేలా ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ చిత్రంలో నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, వై గీ మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


