సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్‌ వీళ్లే..! | Famous actresses Second Marriages List ahead of samantha wedding | Sakshi
Sakshi News home page

Second Marriage Heroins: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!

Dec 1 2025 5:20 PM | Updated on Dec 1 2025 5:20 PM

Famous actresses Second Marriages List ahead of samantha wedding

పెళ్లి అనేది జీవితంలో జరిగే అన్నిటికన్నా అతిపెద్ద శుభకార్యం. ఎవరి లైఫ్లోనైనా ఇదొక సువర్ణ అధ్యాయం. పెళ్లి అంటే మళ్లీ మళ్లీ చేసుకునేది కాదు. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. అలాంటిది మన జీవితంలో జరిగే అతిపెద్ద ముచ్చటే పెళ్లి. బంధువులు, మిత్రులు, సన్నిహితులు హాజరైన నూరేళ్ల పాటు కలిసుండాలని దీవించే అట్టహాసమైన వేడుకే పెళ్లి. ఒక్కసారి మూడు ముళ్లబంధంలోకి అడుగుపెడితే వందేళ్లు కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అలా అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఇంకేముంది. ఒక్క పెళ్లి బంధం కూడా విడిపోదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోతున్నాయి. కాలంతో పాటే వివాహ బంధాలు బీటలు వారిపోతున్నాయి. మనం ఒకటి తలిస్తే.. దేవుడు ఒకటి రాశాడని అంటారు. అలా చాలామంది పెళ్లిళ్లు వందేళ్లు సాగడం కాదు కదా.. పట్టుమని పదేళ్లు కలిసి ఉండడమే గగనమైపోయింది ఈ రోజుల్లో.

ఇక సినీతారల పెళ్లి విషయానికొస్తే ఇదొక హాట్ టాపిక్. వారి రిలేషన్ మొదలుకుని.. పెళ్లి, పిల్లలు అయ్యే వరకు ఒక సెన్సేషన్. డేటింగ్ నుంచి మొదలు పెడితే.. పెళ్లి, విడాకుల వరకు రూమర్స్కు కొదవేలేదు. అలా అవీ చూసి చూసి విసుగెత్తి స్పందించే వారు కొందరైతే.. వాటిని లైట్ తీసుకుని జీవితంలో ముందుకెళ్లేవారు మరికొందరు. సామాన్యులతో పోలిస్తే సెలబ్రిటీల లైఫ్పూర్తిగా విభిన్నం. ఏదైనా చిన్న హింట్ దొరికినా చాలు అదొక పెద్ద సంచలనంఅవుతుంది. డేటింగ్, పెళ్లి, విడాకులు, పిల్లలు అంటూ హెడ్లైన్స్కనిపిస్తాయి.

అయితే తాజాగా ఇవాళ స్టార్ హీరోయిన్సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఇది కాస్తా టాలీవుడ్మాత్రమే కాదు..దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. కారణం ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ కావడం.. అంతేకాకుండా టాలీవుడ్ హీరో నాగచైతన్య పెళ్లి చేసుకుని విడాకులివ్వడం. రోజు మీడియా చూసినా సమంత పెళ్లి గురించే చర్చ. అంటే సినీతారల రెండో పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇది చూస్తే చాలు అర్థమైపోతుంది. సమంత రెండో పెళ్లి వేళ.. అలా ఇప్పటి వరకు విడాకులు తీసుకుని రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోయిన్స్ఎవరెవరు ఉన్నారో లుక్కేద్దాం.

  • సమంత..

    టాలీవుడ్లో స్టార్హీరోయిన్గా ఎదిగిన సమంత మొదటి అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. 2017లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు నాలుగేళ్లకే విడిపోయారు. తర్వాత నాగ చైతన్య.. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్రాజ్నిడిమోరును సామ్ పెళ్లాడింది.

  • అమలా పాల్..

    కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ మొదట ఎల్ విజయ్ను వివాహమాడింది. కొన్నేళ్లకే అతనితో విడిపోయిన అమలాపాల్ సినిమాలతో బిజీ అయిపోయింది. మళ్లీ 2023లో జగత్ దేశాయ్ను రెండో పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం వీరికి కుమారుడు కూడా జన్మించారు.

  • సీనియర్ హీరోయిన్ రాధిక..

    దక్షిణాదిలో స్టార్హీరోయిన్గా ఎదిగిన రాధిక.. మొదట రిచర్డ్ హ్యాడీని పెళ్లాడింది. తర్వాత కొన్నేళ్ల విభేదాలు రావడంతో ప్రతాప్ బోథన్రెండో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా మనస్పర్థలు రావడంతో 2001లో నటుడు శరత్‌కుమార్ను మూడో పెళ్లి చేసుకుంది.

  • ఆదితి రావు హైదరీ..

    హీరోయిన్ ఆదితి రావు హైదరీ.. మొదట సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. తర్వాత విభేదాలు రావడంతో హీరో సిద్ధార్థ్తో డేటింగ్చేసింది. కొన్నేళ్ల తర్వాత సిద్ధార్థ్ను రెండో పెళ్లి చేసుకుంది.

  • సీనియర్ నటి జయమాల..

    ప్రముఖ సీనియర్ నటి జయమాల మొదట టైగర్ ప్రభాకర్ను పెళ్లాడింది. తర్వాత మనస్పర్థలు రావడంతో కొన్నేళ్లకే విడిపోయారు. ‍అనంతరం హెచ్ఎం రామచంద్రను మరో పెళ్లి చేసుకుంది.

  • నటి లక్ష్మి..

    పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన సీనియర్ నటి లక్ష్మి.. మొదట భాస్కర్ను పెళ్లాడింది. తర్వాత అతనితో విడిపోయిన ఆమె మోహన్ శర్మను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత శివచంద్రన్ను మూడో పెళ్లి చేసుకుందామె.

  • మలయాళ నటి కావ్య మాధవన్..

    ప్రముఖ మలయాళ నటి కావ్య మాధవన్ మొదట నిషాల్ చంద్రను వివాహమాడింది. కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నటుడు దిలీప్ను రెండో పెళ్లి చేసుకుంది.

  • వనితా విజయ్ కుమార్..

    కోలీవుడ్ హీరోయిన్, నటి వనితా విజయ్ కుమార్పేరు అందరికీ సుపరిచితమైన పేరు. ‍మొదట ఆకాశ్ను పెళ్లాడింది. తర్వాత కొన్నేళ్లకే విభేదాలు రావడంతో రాజన్ ఆనంద్ను పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఉండలేక విడిపోయి 2020లో పీటల్ పాల్ను మూడో పెళ్లి చేసుకుంది. చివరికీ పీటర్తో కూడా విడాకులు తీసుకుని సింగిల్గానే ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement