బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ రోజుల్లో యువత, పెళ్లి అనే కాన్సెప్ట్పై మాట్లాడింది. ముంబయిలో జరిగిన 'వీ ది ఉమెన్' అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె నేటి యువతరం, పెళ్లి అనే విషయాలపై స్పందించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెళ్లి అనేది ముగిసిన అధ్యాయంలా కనిపిస్తోందని తెలిపింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోమని తాను మాత్రం యువతకు సలహాలు ఇవ్వనని జయా బచ్చన్ వెల్లడించింది. తన మనవరాలు నవ్య నవేలి నందా వివాహం చేసుకోవాలని చెప్పనని పేర్కొంది.
జయా బచ్చన్ మాట్లాడుతూ..'నా మనవరాలు నవ్య కూడా వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకోమని నేను సలహా కూడా ఇవ్వను. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి అనేది ముగిసిన అధ్యాయం. నవ్య మరికొన్ని రోజుల్లో 28 ఏళ్లు నిండుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచాలో యువతులకు సలహాలు ఇచ్చే పెద్దదాన్ని కాదు. ఎందుకంటే నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ తరం చిన్న పిల్లలు చాలా తెలివైనవారు. వారు మిమ్మల్ని మించిపోతారు. ఈ రోజుల్లో వివాహం, చట్టబద్ధత అనే రిలేషన్ నిర్వచించాల్సిన అవసరం లేదు.
ఇక జయా బచ్చన్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీలో వామికా గబ్బి, సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రల్లో నటించారు.


