ఓటీటీలో వరుణ్‌ సందేశ్‌ కొత్త వెబ్‌ సిరీస్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే? | Actor Varun Sandesh Nayanam Web Series OTT Release Date Out, Check Out Streaming Platform And Interesting Details | Sakshi
Sakshi News home page

Nayanam OTT Release: ఓటీటీలో వరుణ్‌ సందేశ్‌ ఎంట్రీ.. వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Dec 1 2025 1:42 PM | Updated on Dec 1 2025 2:00 PM

Varun Sandesh Nayanam Web Series OTT Release Date Out

కొత్తబంగారు లోకం హీరో వరుణ్‌ సందేశ్‌ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ‘న‌య‌నం’. ఈ సిరీస్‌ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించారు.

ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌
సోమవారంనాడు ఈ సిరీస్‌ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. డాక్ట‌ర్ న‌య‌న్ పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ కనిపించనున్నాడు. త‌న పాత్ర‌లోని డార్క్ యాంగిల్‌, సైక‌లాజిక‌ల్ సంక్లిష్ట‌త‌ను ఇందులో ఆవిష్క‌రించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి.

వెబ్‌సిరీస్‌లో వరుణ్‌
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వ‌రుణ్ సందేశ్ (Varun Sandesh) ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. నటుడిగా నాకు ఇది స‌రికొత్త ప్ర‌యాణం. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి విభిన్న‌మైన పాత్ర‌లో డాక్ట‌ర్ న‌య‌న్‌గా క‌నిపించ‌బోతున్నాను. పోస్ట‌ర్‌ గ‌మ‌నిస్తే నా పాత్ర‌లో ఇంటెన్సిటీ అర్థ‌మ‌వుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయ‌టం వ‌ల్ల‌ ఇలాంటి పాత్ర‌లో డెప్త్‌ను మ‌రింత‌గా ఎలివేట్ చేసిన‌ట్ల‌యింది అని పేర్కొన్నాడు.

 

 

చదవండి: ఆ కారణాల వల్లే దివ్య ఎలిమినేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement