డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే? | Nayanthara, Vignesh Shivan Buys Duplex Apartment in Chennai, Property Details | Sakshi
Sakshi News home page

చెన్నైలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొన్న నయన్‌ దంపతులు!

Mar 6 2026 2:47 PM | Updated on Mar 6 2026 3:00 PM

Nayanthara, Vignesh Shivan Buys Duplex Apartment in Chennai, Property Details

కోలీవుడ్‌ స్టార్‌ జంట నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌లో డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ హీరో ధనుష్‌ ఉన్న ఏరియాలోనే నయన్‌ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. 

 డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ 
తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్‌లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌కు 8 కార్‌ పార్కింగ్‌ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్‌ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. 

సినిమా
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్‌ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్‌ సహా నాలుగైదు మూవీస్‌ చేస్తోంది.

చదవండి: హీరోయిన్‌ను అవమానించిన యామీ గౌతమ్‌?

Advertisement
 
Advertisement
Advertisement