కృతీని అవమానించిందా? చిల్లర పనులు చేయనన్న హీరోయిన్‌ | Yami Gautam Clarity about Liking Reel tha Criticizing Kriti Sanon | Sakshi
Sakshi News home page

కృతీ సనన్‌ను అవమానించిన హీరోయిన్‌? స్పందించిన యామీ గౌతమ్‌

Mar 6 2026 1:13 PM | Updated on Mar 6 2026 1:20 PM

Yami Gautam Clarity about Liking Reel tha Criticizing Kriti Sanon

హీరోయిన్‌ కృతిసనన్‌పై యామీ గౌతమ్‌ అసూయతో రగిలిపోతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్‌ ఈవెంట్‌లో కృతి సనన్‌ 'తేరే ఇష్క్ మే' సినిమాకుగానూ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అయితే ఈ విజయాన్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. 

లైక్‌ కొట్టడంతో వివాదం
కృతీ సనన్‌కు బదులుగా హక్‌ సినిమాకుగానూ యామీ గౌతమ్‌కు ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని ఓ వీడియో క్రియేట్‌ చేశారు. అయినా అవార్డు గెలిస్తే మాత్రమే ఉత్తమ నటి అన్న అభిప్రాయాన్ని తాను ఏకీభవించను. ఈ అవార్డులను పట్టించుకోను అంటూ యామీ గతంలో అన్న మాటల్ని ఆ వీడియోలో పొందుపరిచారు. కృతిని విమర్శిస్తున్న ఆ పోస్టుకు యామీ లైక్‌ కొట్టడంతో వివాదం మొదలైంది. 

అవమానించను
తాజాగా ఈ వ్యవహారంపై యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ఒక నటిని అవమానించేలా ఉన్న వీడియోను నేను లైక్‌ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజు ఎంతోమంది మమ్మల్ని ట్యాగ్‌ చేస్తూ ఉంటారు. అలా వాటిని చూసే క్రమంలో పొరపాటున లైక్‌ పడి ఉండవచ్చు. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా నేను లైక్‌ చేయలేదు.

క్లారిటీ
నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్లు చేయలేదు. నా పనేంటో నేను చూసుకుని ముందుకు కదిలాను. క్లిక్‌బైట్‌ వార్తల కోసం ఇలాంటి చిన్న విషయాల్ని పెద్దది చేయకండి. నాకంటూ మంచి పేరు, గౌరవం ఉందని ఆశిస్తున్నాను. నాకెటువంటి పీఆర్‌ టీమ్‌ లేదు. అలాగే అవార్డులపై నా అభిప్రాయాన్ని గతంలోనే వెల్లడించాను. నేను కేవలం నా పనిపైనే దృష్టి పెడతాను అని యామీ గౌతమ్‌ చెప్పుకొచ్చింది.

 

చదవండి: క్యూటీ.. నీవల్లే ఇదంతా: అల్లు అర్జున్‌ పోస్ట​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement